రాజకీయ ప్రయోజనం కోసమే విభజన
Published Fri, Dec 27 2013 1:53 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
కాకినాడ, న్యూస్‌లైన్ : ముగింపు దశలో ఉన్న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధా న్య మిచ్చి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుం దని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న సమైక్య శంఖారావం ప్రచార పోస్టర్ ను గురువారం కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకే జగన్ మోహన్‌రెడ్డి యాత్ర నిర్వహిస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారం మూడింట రెండు వంతుల మెజార్టీతోనే ఇటువంటి నిర్ణయాలు జరిగేలా చట్ట సవరణలు జరగాలన్నది తమ డిమాండ్ అన్నారు.
వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టేందుకు జగన్‌మోహన్‌రెడ్డి అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారన్నారు. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకా రం రూ. 40 వేల కోట్ల వార్షిక ఆదాయం మాత్రమే ఉంటుందని, ఈ సొమ్ము జీతాలకు కూడా చాలని పరిస్థితుల్లో రాష్ట్రం ఎలా మనుగడ సాధించగలదని ప్రశ్నించారు. జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే నీటి సమస్యలతో పాటు రైతులు, ప్రజలు, ఇతర వర్గాలు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రజల కు వివరించేందుకే జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చేపట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, నగర యువజన విభాగం కన్వీనర్ కిశోర్ పాల్గొన్నారు.
ఎస్‌ఈజెడ్‌కు భూములు
కేటాయించింది చంద్రబాబే : రావూరి
పిఠాపురం, న్యూస్‌లైన్ : కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్)కు భూములు కేటాయించింది టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరావు అన్నారు. పిఠాపురంలో పార్టీ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2002లో ఎస్‌ఈజెడ్‌కు 10 వేల ఎకరాల భూములు కేటాయించిన సంగతి టీడీపీ నేతలు మరచి వైఎస్సార్ కేటాయించారనడం విడ్డూరంగా ఉందన్నారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేత వైఎస్సార్ ఏలేరు ఆధునికీకరణకు నిధులు కేటాయిం చాలని అసెంబ్లీలో నిలదీశారన్నారు. అనంతరం 2009లో మఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ఏలేరు ఆధునికీకరణకు శంకుస్థాపన చేశారన్నారు.
జగన్‌ను విమర్శించే అర్హత యనమలకు లేదు : పీకేరావు
అంబాజీపేట, న్యూస్‌లైన్ : రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు అన్నారు. అంబాజీపేటలో గురువారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యనమల తీరును దుయ్యబట్టారు. న్యాయబద్ధంగా జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చినప్పటికీ యనమల మాట్లాడుతున్న తీరు న్యాయ వ్యవస్థనే కించపరిచే విధంగా ఉందన్నారు. రామచంద్రపురం ఉప ఎన్నికల్లో యనమల కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావును వెన్నుపోటు పొడిచారన్నారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పి.గన్నవరం మండల యూత్ కన్వీనర్ దొమ్మేటి దుర్గారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement