బెంగళూరు: ప్రజల్లో తిరుగే ప్రజాప్రతినిధులు ఏది మాట్లాడినా కొన్ని నిమిషాల్లో జనాల్లోకి వెళ్లిపోతుంది. అలాంటి వ్యక్తులు దేశంలోని కీలక వ్యక్తులు గురించి మాట్లాడేటప్పడు ఎంతో జాగ్రత్త వహించాలి. అయితే, తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు కాదని ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.
వివరాల ప్రకారం.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ భారత్‌కు తొలి ప్రధాని కాదని ఆయన అన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ కాదు, మన తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. బ్రిటిషర్లలో సుభాష్ చంద్రబోస్ భయం రేకెత్తించడంతోనే వారు భారత్‌ను విడిచిపెట్టి వెళ్లారని అన్నారు.
అలాగే, మనం నిరాహార దీక్షలతో స్వాతంత్ర్యం పొందలేదని, ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపడం ద్వారా స్వాతంత్య్రం సిద్ధించలేదన్నారు. బ్రిటిష్ వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భయం కలిగించడం వల్లే మనకు స్వాతంత్ర్యం లభించిందని బాబాసాహెబ్ ఓ పుస్తకంలో రాశారని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దేశంలో కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర ప్రకటన చేసిన సమయంలో స్వతంత్ర భారత్‌కు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకొచ్చారు.
ఇదే సయమంలో మాజీ కేంద్ర రైల్వే, టెక్స్‌టైల్స్ మంత్రి పాటిల్ మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు దేశం విడిచివెళ్లారని ఆయన కామెంట్స్ చేశారు. ఇక, వీరి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
'Not Nehru, but Subhas Chandra Bose is the first PM of the country': Karnataka BJP MLA Basangouda Patil Yatnal pic.twitter.com/N8Ck6uZTcW
— The Jaipur Dialogues (@JaipurDialogues) September 28, 2023
ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా ఆయన.. కర్నాటకలో పాలక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరేడు నెలల్లో కూలిపోతుందని ఆయన ఇటీవల జోస్యం చెప్పారు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని బీజేపీ లేవనెత్తుతుందని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: తమిళనాడులో రసవత్తర రాజకీయం..
Comments
Please login to add a commentAdd a comment