Jawaharlal Nehru
-
ఆ లేఖల్లో ఏముంది?
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకెక్కాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన లేఖలు అనంతర కాలంలో ఎంతగానో ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురు ఇందిరకు రాసిన లేఖలైతే సంకలనాలుగా వెలువడి ఎంతో ఆదరణ కూడా పొందాయి. జయప్రకాశ్ నారాయణ్ వంటి రాజకీయ ఉద్ధండులు మొదలుకుని భౌతికశాస్త్ర దిగ్గజం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ దాకా ప్రముఖులెందరితోనో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లోకప్రసిద్ధం. చక్కని రచనా శైలికే గాక అద్భుతమైన అభివ్యక్తికి వాటిని నిలువెత్తు నిదర్శనంగా చెబుతుంటారు. నెహ్రూ తదనంతరం ఆయన లేఖలన్నింటినీ ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీ (పీఎంఎంఎల్)లో భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో 2008లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ వాటన్నింటినీ తన నివాసానికి తరలించిన వైనం ఇప్పుడు రాజకీయ రగడకు దారితీస్తోంది. నెహ్రూ లేఖలతో కూడిన ఏకంగా 51 పెట్టెలను తన సోనియా తరలించుకుని వెళ్లారని బీజేపీ ఆరోపిస్తోంది. వాటన్నింటినీ తిరిగివ్వాల్సిందిగా పీఎంఎంఎల్ తాజాగా సోనియాను కోరింది. కనీసం జిరాక్సులో, పీడీఎఫ్‌లో అయినా అందజేస్తే భద్రపరుస్తామంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో, ‘‘అసలు నెహ్రూ లేఖలను సోనియా పనిగట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచి్చంది? అందుకెవరు అనుమతించారు? 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు తిరిగివ్వడం లేదు? అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖల్లో ఏమున్నాయి?’’ వంటి అనేకానేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సమాధానంగా అన్ని వేళ్లూ నెహ్రూ–ఎడ్వినా లేఖలవైపే చూపిస్తుండటం విశేషం. ఎడ్వినా నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ భార్య. ఆమెకు, నెహ్రూకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉందంటారు. ‘‘నిజానికిది బహిరంగ రహస్యమే. అప్పట్లో రాజకీయ వర్గాల్లో నిత్యం అందరి నోళ్లలోనూ నానిన అంశం కూడా’’ అని చరిత్రకారులు కూడా చెబుతారు. ‘‘నెహ్రూ, ఎడ్వినా సాన్నిహిత్యానికి వారి నడుమ సాగిన లేఖలు అద్దం పట్టాయి. దాంతో అవి వెలుగు చూడకూడదని సోనియా భావించారు. అందుకే వాటితో పాటు అన్ని లేఖలనూ పీఎంఎంఎల్ నుంచి తరలించుకుపోయారు’’ అని బీజేపీ ఆరోపిస్తోంది. ‘గాం«దీ–నెహ్రూ కుటుంబం’ అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల రగడ ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా తరలించుకుపోయిన నెహ్రూ లేఖలన్నింటినీ తిరిగి ఇప్పించాలంటూ ఆమె కుమారుడు, విపక్ష నేత రాహుల్‌గాం«దీకి పీఎంఎంల్ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్ కాద్రీ డిసెంబర్ 10న లేఖ రాశారు. ‘‘అవన్నీ ఎడ్వినా, ఐన్‌స్టీన్, జేపీ, పద్మజా నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబూ జగ్జీవన్‌రాం, జేబీ పంత్ తదితరులకు నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు. 1971లో ఇందిర వాటిని పీఎంఎంల్ (అప్పట్లో నెహ్రూ మ్యూజియం)కు అప్పగించారు. అవి పీఎంఎంల్లో ఉంటే స్కాలర్లకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. దాంతో నెహ్రూతో ఎడ్వినా సాన్నిహిత్యం ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. మిగతా లేఖల సంగతి ఎలా ఉన్నా గత చరిత్ర, బీజేపీ ఆరోపణల పుణ్యమా అని నెహ్రూ–ఎడ్వినా లేఖలపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ‘‘వాటిలో అంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ఎందుకు వాటిని సోనియా తన ఇంట్లో దాచిపెట్టుకున్నారు? ఆమె బదులిచ్చి తీరాలి’’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ డిమాండ్ చేయడం విశేషం. పార్టీ మరో అధికార ప్రతినిధి సంబిత పాత్ర కూడా సోమవారం ఏకంగా లోక్‌సభలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులివ్వడం విశేషం. అనంతరం పాత్ర మీడియాతో కూడా దీనిపై మాట్లాడారు. ‘‘నెహ్రూ లేఖలు గాంధీ కుటుంబపు వ్యక్తిగత ఆస్తి కాదు. దేశ సంపద. వాటిని బయట పెట్టడానికి గాంధీ కుటుంబం వెనకాడుతుండటం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. సరిగ్గా పీఎంఎంల్లోని లేఖల డిజిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టే ముందే నెహ్రూ లేఖలను సోనియా తీసుకెళ్లారు. వాళ్లేం దాస్తున్నారో తెలుసుకోవాలని దేశం భావిస్తోంది’’ అన్నారు. ‘గాఢమైన’ బంధం నెహ్రూ, ఎడ్వినా మధ్య నడిచిన లేఖలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అయితే ఎడ్వినా కూతురు పమేలా హిక్స్ తదితరులు వాటికి సంబంధించిన పలు విశేషాలను గతంలో పంచుకున్నారు. నెహ్రూ, ఎడ్వినా మధ్య ‘అత్యంత గాఢమైన’ బంధం కొనసాగిందని పమేలా తన పుస్తకంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం! ‘‘నా తల్లి, నెహ్రూ పరస్పరం ఎంతగానో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవాభిమానాలుండేవి. దీన్ని నేను ఎన్నోసార్లు గమనించాను. మా అమ్మ తానెంతగానో తపించిన ఆదర్శ సాహచర్యాన్ని పండిట్జీ (నెహ్రూ) రూపంలో పొందింది. అయితే వారిద్దరి మధ్య శారీరక బంధానికి అంతగా అవకాశం లేకపోయింది. నిత్యం తమను చుట్టుముట్టి ఉండే సిబ్బంది తదితరుల వల్ల ఏకాంతం దొరకడం గగనంగా ఉండేది. ఎడ్విన్ భారత్ వీడేముందు నెహ్రూకు ఓ ఉంగరమివ్వాలని భావించారు. తీసుకుంటారో లేదోనని చివరికి ఆయన కుమార్తె ఇందిరకు ఇచ్చి వెళ్లారు’’ అని పమేలా చెప్పుకొచ్చారు. నెహ్రూ తన వీడ్కోలు ప్రసంగంలోనూ ఎడ్వినాను ఆకాశానికెత్తిన వైనాన్నీ ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలుగువారి జీవధారకు 69 వసంతాలు
విజయపురిసౌత్: నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రేపటితో 69 ఏళ్లు నిండుతాయి. ఆనాడు నెహ్రూ కన్న కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అన్నపూర్ణగా ఆధునిక దేవాలయంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. 1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనాడు నాగార్జున సాగరానికి నేనిక్కడ జరిపే శంకుస్థాపనను పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికి జరుగుతున్న శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయాలకు ఇది చిహ్నం’ అని అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ప్రాజెక్టు నాగార్జునసాగర్. సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడికాలువను జవహర్ కాలువగా, ఎడమకాలువను లాల్‌బహదూర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ రిజర్వాయర్ నుంచి ఆనకట్టకు కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్ 10న ప్రారంభించారు. దక్షిణ విజయపురి (రైట్‌బ్యాంకు) వద్ద ఈ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల 74వేల 874 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే కాలువకే లాల్‌బహదూర్ కెనాల్ అని పేరు. ఈ కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ కాలువ నిర్మాణాన్ని ఆనాటి గవర్నర్ భీమ్సేన్ సచార్ 1959లో ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349కిలోమీటర్లు. ఈ కాలువ కింద 10 లక్షల 37వేల 796 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడికాలువలాగే ఈ కాలువకు కూడా నీటిని విడుదల చేయవచ్చు. సాగర్ ప్రాజెక్టు ఒకసారి నిండితే ప్రభుత్వానికి 20 వేల కోట్ల రూపాయలకు పైచిలుకు ఆదాయం వస్తుందని అంచనా. 1967 ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు. సాగర్ జలాశయం విస్తీర్ణం,110 చదరపు మైళ్లుగరిష్ట నీటిమట్టం 590 అడుగులుడెడ్ స్టోరేజి లెవల్ 490 అడుగులునీటి నిల్వ 408.24 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 312.0. టీఎంసీలు)డెడ్స్టోరేజినీరు 179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు)నీటివిడుదలకు కనీస నీటిమట్టం 510 అడుగులు -
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ.. ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీక్
సాక్షి,అనకాపల్లి : జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీకయ్యాయి. ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీకవ్వడంతో ఎనిమిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. -
నెహ్రూకు నివాళులర్పించిన మోదీ
-
రేపటి భావి భారత ఆశా దీపాలు వీళ్లే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి పిల్లలే రేపటి భావి భారత ఆశా దీపాలు అంటూ తన ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన. బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా.. బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2024 పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి ఏదైనా ఉందంటే.. అది చదువు మాత్రమే.కేవలం పిల్లల చదువు మాత్రమే పేదల తలరాతను మార్చగలదని బలంగా నమ్మి.. గత ఐదేళ్లు ఆ దిశగా అడుగులు వేసిన @ysjagan గారుపిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.#ChildrensDay#YSJaganForQualityEducation pic.twitter.com/xS9e0J0nmh— YSR Congress Party (@YSRCParty) November 14, 2024 -
Nehru Birthday: ఆ హత్యాయత్నాల నుంచి నెహ్రూ తప్పించుకున్నారిలా..
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1889, నవంబరు 14న జన్మించారు. నెహ్రూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ పలుమార్లు జైలుకు వెళ్లారు. నెహ్రూ ప్రధానిగా ఉండగా ఆయనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటినుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.జవహర్లాల్ నెహ్రూపై మొదటి హత్యాయత్నం 1947లో జరిగింది. ఆ సమయంలో నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షునిగా ఉన్నారు. నెహ్రూ నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో కారులో ప్రయాణిస్తుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ ప్రాంతం నేటి పాకిస్థాన్‌లో ఉంది. 1948 జూలైలో నెహ్రూపై రెండవసారి హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వచ్చాయి. నెహ్రూను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వెళ్తున్న ముగ్గురిని బీహార్‌లోని ధర్మశాలలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు పిస్టల్స్, రెండు రివాల్వర్లు, రైఫిల్, కంట్రీ మేడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరి కుట్ర బయటపడింది.1953లో కూడా నెహ్రూపై హత్యాయత్నం జరిగింది. నాటి నివేదికల ప్రకారం నెహ్రూ ప్రయాణిస్తున్న బొంబాయి-అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలును పేల్చివేసేందుకు కొందరు కుట్ర పన్నారు. అయితే కళ్యాణ్‌లోని రైల్వే పట్టాల దగ్గర కూర్చున్న ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ కుట్ర విఫలమైంది.1955లో నెహ్రూపై ఒక రిక్షా పుల్లర్ కత్తితో దాడి చేశాడు. నాటి వార్తాపత్రికల నివేదికల ప్రకారం 32 ఏళ్ల రిక్షా పుల్లర్ నుంచి పోలీసులు ఆరు అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి నెహ్రూ కారుపైకి దూకాడు. దీనిని గమనించిన నెహ్రూ అతనిని కిందకు నెట్టివేశారు. 1955లో నెహ్రూ ముంబైలోని ఒక వేదికపై ప్రసంగిస్తుండగా వందలాది మంది రాళ్లతో దాడికి ప్లాన్ చేశారని నాడు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: 15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య -
Children's Day 2024: బాలల నేస్తం.. చాచా నెహ్రూ..
నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి జాతి సంపదలు.. విరిసివిరియని కుసుమాలు.. సరైన విద్యతో మాత్ర మే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు. సుసంపన్నమైన దేశం కోసం.. సిద్ధమవుతున్న నేటి ఆణిముత్యాలే రేపటి మన జాతి రత్నాలు. తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు.. భావి భారత పౌరులు. పాలబుగ్గల నవ్వులు, అపురూపమైన క్షణాలు.. మరపురాని జ్ఞాపకాలు.. బాల్యం ఒక వరం. పిల్లలు భగవంతు ని స్వరూపాలు.. కలా్లకపటం ఎరుగని కరుణామయులు.. రివ్వున ఎగిరే గువ్వలు.. వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పుదాం.నవంబర్ 14 వచ్చింది.. బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయనను ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. అందుకే 1889 నవంబర్ 14న నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన బర్త్‌డేను ‘చిల్ర్డన్స్ డే’ నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపుతారు.కరీంనగర్ అర్బన్/సిరిసిల్ల టౌన్: పిల్లలకు పౌష్టికాహారం అందితేనే ఆరోగ్యంగా ఉంటారు.. నాణ్యమైన విద్యనందిస్తే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు.. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి.. నార్మల్ డెలివరీ అయితే భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.. విద్యార్థినులకు రక్షణ ఉండాలి.. పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలి.. ఇవన్నీ గుర్తెరిగిన కరీంనగర్, రాజన్నసిరిసిల్ల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్‌కుమార్ ఝా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఒకరు శుక్రవారం సభ పేరిట అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చూస్తుంటే.. మరొకరు పాఠశాలలు, కళాశాలల్లో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. జిల్లాలో శుక్రవారం సభ పేరిట అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. ఏఎన్ఎంల ద్వారా గర్భిణులకు వైద్య సేవలు, అంగన్వాడీ సూపర్వైజర్ల ద్వారా చిన్నారుల ఎత్తు, వయసుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. గర్భిణులకు నార్మల్ డెలివరీ అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇక, తన పుట్టినరోజుతోపాటు వివిధ సందర్భాల్లో కలిసేవారు పుష్పగుచ్ఛాలు కాకుండా పెన్నులు, పుస్తకాలు, నోట్‌బుక్కులు తీసుకురావాలని సూచించగా కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. అలాగే, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే సినిమాలు చూపిస్తూ వాటిపై సమీక్షలు రాయిస్తున్నారు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలపై ఆరా తీస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. సైన్స్ మ్యూజియాన్ని తెరిపించి, సైన్స్ చర్చలు, సదస్సులు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పదోతరగతిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి బాలల విద్యాభ్యాసంపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ టీచర్ల పనితీరును పరిశీలిస్తున్నారు. ఆయనే స్వయంగా పాఠాలు బోధిస్తూ.. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. గురుతర బాధ్యతలు విస్మరించే ఉపాధ్యాయులకు సింహస్వప్నంగా ఉంటున్నారు. స్కూళ్లను సందర్శించిన సమయంలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఆడపిల్లల రక్షణకు, వారి సమస్యల పరిష్కారం కోసం గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యా ప్రమాణాల వృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
పట్టనట్లు నెహ్రూ... పంతంతో పటేల్!
కొన్ని చారిత్రక సంఘటనలు దశాబ్దాలు దాటినా కూడా చర్చనీయాంశాలుగా కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అంశమే 1948లో జరిగిన హైదరాబాద్ యాక్షన్. ‘ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్’ ద్వారా భారత ఉపఖండాన్ని భారత్, పాక్‌లుగా విభజిస్తున్నట్టు అప్పటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ ఆట్లీ 1948 జూన్ 3న ప్రకటించి ఉపఖండంలోని 562 రాచ రిక రాజ్యాలు ఇక నుండి ఏదో ఒక దేశంలో విలీనం అవొచ్చు లేదా, స్వతంత్రంగా ఉండొచ్చు అని తేల్చి చెప్పారు. దీనికి హైదరాబాదు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జూన్ 11న స్పందిస్తూ, హైదరాబాదు సంస్థానం స్వతంత్ర ఇస్లామిక్ దక్కన్ రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించారు. వెంటనే ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా, ‘‘నిజాం ప్రతిపాద నకు బేషరతుగా పాకిస్తాన్ మద్దతుంటుంది’’ అని తెలిపారు. దాంతో 82,688 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, 85 శాతం హిందూ, 13 శాతం ముస్లిం జనాభాతో ఉన్న హైదరాబాదు మున్ముందు ప్రజా స్వామ్య, లౌకిక, స్వతంత్ర భారతదేశానికి కొరకరాని కొయ్యగా మారుతుందని అప్పటి రాజకీయ నేతలు ఊహించారు.ఆ క్రమంలో రాచరిక రాష్ట్రాల రాజులు ‘ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్’ కూటమిగా ఏర్పాటై, 1947 ఆగస్టు తర్వాత తమ తమ ‘ఇలాఖా’లను భారతదేశంలో విలీనం చేశారు. కశ్మీరు, జునాఘఢ్, హైదరాబాదు రాష్ట్రాలు మాత్రం దీనికి ససేమిరా అన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాదును భారత్‌లో కలపడానికి వీల్లేదని ప్రకటించిన ‘మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్–ముస్లిమీన్’ నేత ఖాసీం రిజ్వీ 1948 ఫిబ్రవరి నుండి రెండు వేల మంది ముస్లిం రాడికల్ యువకులను గ్రామీణ ప్రాంతాల్లో హిందువులపై అరాచకాలకు, స్త్రీలపై అనేక అమానుష చర్యలకు పురిగొలిపాడు. ఇదేమి పట్టనట్టుగా ఉండి పోయాడు మీర్ ఉస్మాన్ అలీ. హైదరాబాదులో హిందువులపై జరుగుతున్న హత్యాచారాలను భారత ప్రభుత్వం అరికట్టాలని ఉపప్రధాని సర్దార్ పటేల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగులో గళ మెత్తారు. అయినా ప్రధాని నెహ్రూ, ఆయన విధేయులు నోరు మెదప లేదు!భారత్‌పై మిలిటరీ దాడికి 1948 జూన్ నుండే నిజాం ప్రభుత్వం ఐరోపా నుండి మెషీన్ గన్స్, గ్రెనేడ్లు, ఫైటర్ విమానాలను కరాచీ (పాకిస్తాన్)కి, అటునుండి సముద్రం ద్వారా పోర్చుగీసు ఆధీనంలోని గోవాకు తరలించి, ఆ తర్వాత హైదరాబాదుకు చేరవేయటం ఆరంభించింది. ఇక సమయం ‘బర్బాద్’ చేస్తే నష్టమే అనుకుని, తన సన్నిహి తులు వి.పి.మీనన్, హెచ్.వి. అయ్యంగార్, డిఫెన్స్ సెక్రటరీ హెచ్.ఎం. పటేల్ పర్యవేక్షణతో ‘ఆపరేషన్ పోలో’ అనే సీక్రెట్ కోడ్‌తో హైదరాబాదుపై విరుచుకుపడటం కోసం పథకం వేశారు వేశారు ‘ఉక్కు మనిషి’ పటేల్. ఆర్మీ జనరల్ జయంతో నాథ్ చౌధురీ ఇన్చార్జిగా పుణె కంటోన్మెంటులో సరిపడా యుద్ధ సామగ్రి, గోర్ఖా రైఫిల్స్, బర్మా బెటాలి యన్ ఫౌజీలను ఆగస్టు నెలలోనే సిద్ధం చేశారు. ఆపరేషన్‌కు ముందు సెప్టెంబర్ 8న కేబినెట్ మీటింగులో, ‘‘పరిస్థితి చేయి దాటక ముందే హైదరాబాదును ముట్టడించాలి. దేశం నడి బొడ్డులోని ఈ పుండును ఇలా వదిలేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం’’ అని తేల్చేసిన పటేల్‌పై చిందులు తొక్కారు నెహ్రూ! ఆయనతో వాదించదలచు కోలేదు సర్దార్. 1948 సెప్టెంబర్ 12న షోలాపూర్ దగ్గర గంగాపూర్ రైల్వే స్టేష న్లో కొందరు హిందువులను రజాకార్లు, భారత భూభాగంలో చొరబడి హత మార్చారు. ఈ వార్త ఢిల్లీ చేరటమే తడవు, ఆపరేషన్ పోలోకు గ్రీన్ సిగ్నల్ పంపారు.మరుసటి రోజు, సెప్టెంబర్ 13న ఉదయం 4 గంటల నుండి భారత బల గాలు బళ్లారి, షోలాపూర్, అహ్మద్‌నగర్, విజయవాడ మీదుగా నైజాం స్టేట్ నలు వైపులా సరిహద్దులను దాటుతూ హైదరాబాదు నగరం వైపు కదిలాయి. ఈ ఆకస్మిక ఆక్ర మణకు నీరుగారి పోయాడు నిజాం ఆర్మీ చీఫ్ మహమ్మద్ ఇద్రూస్. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ సామగ్రిని వాడే శిక్షణ లేక పోవటంతో వారి తుప్పుపట్టిన తుపాకులు, జీపులు భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పోయాయి. సెప్టెంబరు 17 మధ్యాహ్నం సికింద్రాబాదు కంటోన్మెంట్‌కు 5 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది ఇండియన్ ఆర్మీ. పరిస్థితి క్షీణించటంతో ఉస్మాన్ అలీ ఖాన్, ఆర్మీ చీఫ్ ఇద్రుస్ ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాళ్ల బేరానికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ రేడియో ప్రసంగం ద్వారా తన ప్రభుత్వాన్ని రద్దుచేసి, భారత సైనిక బలగాలకు లొంగిపోయినట్టు ప్రకటించారు.జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత అధికారి, ముంబై(2023లో విడుదలైన జాన్ జుబ్రిచ్చికి ‘డీథ్రోన్డ్: పటేల్, మేనన్అండ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ ఇండియా’ ఆధారంగా.) -
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్‌లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాక్‌తో బీజింగ సహకారంపై జై శంకర్ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.చైనా పాకిస్తాన్ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్‌కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు. -
'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు
ఢిల్లీ: కొత్త ఏడాది 2024లోనూ ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొనడానికి భారత్ రాజకీయంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉందని చెప్పారు. తాను రాసిన నూతన పుస్తకం 'Why Bharath Matters' ఆవిష్కరణ సందర్భంగా ఈ మేరకు మాట్లాడారు. దేశ స్వాంతంత్య్రం తొలినాళ్లలో మాజీ ప్రధాని నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాలను జైశంకర్ విమర్శించారు. భారత ప్రయోజనాలకే నెహ్రూ అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉంటే చైనాతో బంధంపై ఆశలు పెంచుకునేవాళ్లం కాదని జై శంకర్ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, పండిట్ నెహ్రూకు మధ్య చైనా అంశంపై జరిగిన లేఖల మార్పిడి ఇందుకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. చైనా అంశంలో నెహ్రూకు, పటేల్‌కు మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని జైశంకర్ తెలిపారు. భద్రతా మండలిలో చైనాకు చోటు దక్కేలా నెహ్రూ వ్యవహరించారని జైశంకర్ అన్నారు. ‘‘భద్రతా మండలిలో ముందుగా చైనా చోటు దక్కించుకోనివ్వండి’’ అని ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖ కూడా ఉందని పేర్కొన్నారు. చైనాతో యుద్ధం విషయంలో అమెరికా సహాయాన్ని నెహ్రూ నిరాకరించారని గుర్తుచేశారు. పటేల్‌కు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉందని జై శంకర్ అన్నారు. "మనం అమెరికాపై ఎందుకు అపనమ్మకంతో ఉన్నాం.. మన ప్రయోజనాల దృష్టిలోనే చూడాలి. చైనా-అమెరికా బంధం కోణంలో కాదు." అని పటేల్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..? -
యుద్ధాన్ని ఎందుకు విరమించారు?
ఈ నెల 6న పార్లమెంట్లో ఆమోదం పొందిన రెండు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలోకేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ‘జమ్మూ–కశ్మీర్ శాసనసభలో పీఓకేకు 24 స్థానాలూ, కశ్మీరీ నిర్వాసితులకు 2, పీఓకే నిర్వాసి తులకు ఒకటి కేటాయించాం. తొలి ప్రధాని నెహ్రూ తప్పులు కశ్మీర్ ఉగ్ర–వేర్పాటువాదా లకూ, పీఓకే పుట్టుకకూ కారణం. మన సైన్యం పాక్ సేనను తరుముతూ 3 రోజుల్లో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోనుండగా యుద్ధం విరమించారు. అనవసరంగా, హడావిడిగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చేర్చారు. 70 ఏళ్ళుగా హక్కులు పోయి అన్యాయానికి గురైన కశ్మీరీలకు న్యాయం చేకూర్చడమే ఈ బిల్లుల ఉద్దేశం’ అన్నారు. దీంతో అనుపమ్ ఖేర్ లాంటి వలస కశ్మీరీ పండితులు, వైదికవాదులు కశ్మీరీ ప్రజాప్రతినిధులు కాగలరు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రయోజనమూ నెరవేరగలదు. అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఒక్కటీ నిజం కాదు. నిజానికి నెహ్రూ వల్లనే కశ్మీర్ఇండియాలో కలిసింది. దాన్ని ఇండియాలో కలి పేందుకు షేక్ అబ్దుల్లాను ఒప్పించారు. నెహ్రూ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం హోం మంత్రి పటేల్ విన్నపానికి 566 సంస్థానాల్లో 563 ఇండియాలో కలిశాయి. జమ్ము–కశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ మిగిలాయి. పాక్ సరిహద్దు జమ్మూ– కశ్మీర్, సముద్ర సరిహద్దులోని జునాగఢ్‌లను పాక్‌కు ఇచ్చి, దేశం మధ్యలోనున్న హైదరాబాద్‌ను ఇండియాలో కలపాలని పటేల్ ప్రతిపా దించారు. తన చిరకాల వాంఛకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను నెహ్రూ ఆమోదించలేదు. కశ్మీర్ యుద్ధ విరమణ సమయంలో మన సైన్యం పూంఛ్, రాజౌరీ ప్రాంతాలను రక్షిస్తూ ఉంది. విరమణ ప్రకటించకుంటే ఈ ప్రాంతాలు పాక్ అధీనమయ్యేవి.పఠాన్ లష్కర్ల గిరిజన చొరబాటు పేరుతో పాక్ సైన్యానికి భారత సేనకు మధ్య యుద్ధం జరిగింది. పాక్ ముందుగానే పాత రోడ్లను బాగు చేసి, కొత్త రోడ్లను నిర్మించి సైన్యాల తరలింపు నకు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల వేలాది సైని కులు కశ్మీర్లోకి ప్రవేశించారు. భారతీయ సైన్యం చేరడానికి సరైన రవాణా మార్గం లేక తక్కువ సైనికులే చేరారు. నానాటికీ పెరిగిన పాక్ సైన్యం మొత్తం కశ్మీర్‌ను ఆక్రమించే పరిస్థితి దాపురించింది. ఈలోపు ఇండియాను ప్రతివాదిని చేస్తూ పాక్ ఐరాసకు పోవచ్చు. 1947 డిసెంబర్ 8న నెహ్రూ చాకచక్యంగా ఈ అవకాశాన్ని కాల్పుల విరమణ ప్రకటించి అడ్డుకున్నారు. ఆ తర్వాత ఐరాసకు కశ్మీర్ సమ స్యను తీసుకెళ్లారు. నెహ్రూ అనుమానించినట్లే అమెరికా పక్షపాతి అయిన ఐరాస భారత్‌కు న్యాయం చేయలేదు. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
నెహ్రూ వల్లే కశ్మీర్లో కుంపట్లు
జమ్మూ కశ్మీర్ ఏడు దశాబ్దాలుగా అనుభవిస్తున్న కష్టనష్టాలన్నింటికీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన భారీ తప్పిదాలే ఏకైక కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ఆరోపించారు. అవే అక్కడ ఉగ్రవాదానికి, వేర్పాటువాద కుంపట్లకు, పాక్ ఆక్రమిత కశ్మీర్ పుట్టుకకు కారణమయ్యాయని దుయ్యబట్టారు. ‘‘మన సైన్యం పాక్ దళాలను తరిమికొడుతున్న వేళ కశ్మీర్‌ను పూర్తిగా తిరిగి స్వా«దీనం చేసుకోక ముందే నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు. అంతటితో ఆగకుండా కశ్మీర్ అంశాన్ని హడావుడిగా, అనవసరంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చేసిన ఈ రెండు ఘోర తప్పిదాలే కశ్మీర్లో ఆరని కుంపట్లకు కారణమయ్యాయి. నెహ్రూది నిజంగా చారిత్రక తప్పిదం!’’ అని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్, విపక్షాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చాయి. బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. షా వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశాయి. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, నెహ్రూయే గనక అప్పట్లో సరైన చర్యలు తీసుకుని ఉంటే కశ్మీర్లో చాలా భాగాన్ని పాక్‌కు కోల్పోయే వాళ్లమే కాదని పునరుద్ఘాటించారు. అంతేగాక పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పుడో తిరిగి భారత్‌లో అంతర్భాగంగా మారేదని అభిప్రాయపడ్డారు. ‘‘అప్పటికి మన సైన్యం పంజాబ్ దాటి కశ్మీర్‌కేసి దూసుకుపోతోంది. నెహ్రూ కాల్పుల విరమణను కనీసం మూడు రోజులు ఆలస్యం చేసినా పీఓకే ఇప్పుడు భారత్‌లో అంతర్భాగంగా ఉండేది’’ అని ఆక్షేపించారు. అంతా అయిపోయాక, కాల్పుల విరమణ పొరపాటు నిర్ణయమని నెహ్రూ తీరిగ్గా అంగీకరించారని విమర్శించారు. ఆయన చేసిన సరిదిద్దుకోలేని తప్పిదం వల్ల భారీ భూభాగాన్ని దేశం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. 1962లో చైనాతో భారత యుద్ధానికి దారి తీసిన నెహ్రూ ‘భారీ తప్పిదం’ గురించి కూడా మాట్లాడాలని బిజూ జనతాదళ్ సభ్యుడు భర్తృహరి మహతబ్ కోరగా అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. ‘‘నెహ్రూ తప్పిదాల్లో రెండింటిని ప్రస్తావిస్తేనే విపక్షాలు అలిగి వాకౌట్ చేశాయి. ఇక భారీ తప్పిదం గురించి మాట్లాడితే ఏకంగా రాజీనామా చేసేవేమో!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎవరినీ అవమానించడానికి కాదని, జరిగిన వాస్తవాలను దేశం ముందుంచే ప్రయత్నం మాత్ర మేనని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇక 370 ఆరి్టకల్‌ను రద్దు చేసే దమ్ము గత కాంగ్రెస్ సర్కారుకు లేకపోయిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. -
పిల్లల కోసం ఎంతో చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే ప్రపంచస్థాయి విద్యకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఎక్స్ ద్వారా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులూ అర్పించారు. ‘‘మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ.. ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం’’ అని సందేశంలో సీఎం జగన తెలియజేశారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపిన సీఎం జగన్.. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2023 -
భారత తొలి ప్రధాని నెహ్రు కాదు.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
బెంగళూరు: ప్రజల్లో తిరుగే ప్రజాప్రతినిధులు ఏది మాట్లాడినా కొన్ని నిమిషాల్లో జనాల్లోకి వెళ్లిపోతుంది. అలాంటి వ్యక్తులు దేశంలోని కీలక వ్యక్తులు గురించి మాట్లాడేటప్పడు ఎంతో జాగ్రత్త వహించాలి. అయితే, తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు కాదని ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. వివరాల ప్రకారం.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ భారత్‌కు తొలి ప్రధాని కాదని ఆయన అన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ కాదు, మన తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. బ్రిటిషర్లలో సుభాష్ చంద్రబోస్ భయం రేకెత్తించడంతోనే వారు భారత్‌ను విడిచిపెట్టి వెళ్లారని అన్నారు. అలాగే, మనం నిరాహార దీక్షలతో స్వాతంత్ర్యం పొందలేదని, ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపడం ద్వారా స్వాతంత్య్రం సిద్ధించలేదన్నారు. బ్రిటిష్ వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భయం కలిగించడం వల్లే మనకు స్వాతంత్ర్యం లభించిందని బాబాసాహెబ్ ఓ పుస్తకంలో రాశారని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దేశంలో కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర ప్రకటన చేసిన సమయంలో స్వతంత్ర భారత్‌కు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకొచ్చారు. ఇదే సయమంలో మాజీ కేంద్ర రైల్వే, టెక్స్టైల్స్ మంత్రి పాటిల్ మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు దేశం విడిచివెళ్లారని ఆయన కామెంట్స్ చేశారు. ఇక, వీరి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 'Not Nehru, but Subhas Chandra Bose is the first PM of the country': Karnataka BJP MLA Basangouda Patil Yatnal pic.twitter.com/N8Ck6uZTcW — The Jaipur Dialogues (@JaipurDialogues) September 28, 2023 ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా ఆయన.. కర్నాటకలో పాలక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరేడు నెలల్లో కూలిపోతుందని ఆయన ఇటీవల జోస్యం చెప్పారు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని బీజేపీ లేవనెత్తుతుందని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తమిళనాడులో రసవత్తర రాజకీయం.. -
నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే!
బ్యూటీమీద ఎక్కువ దృష్టిపెట్టేవారికి 'లాక్మే' (Lakme) బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల సౌందర్య సాధనాలు, అలంకరణలను సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి. నేడు కాస్మొటిక్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ నిర్మించడం వెనుక భారతదేశ మొదటి ప్రధాని 'జవహర్ లాల్ నెహ్రూ' ఉన్నట్లు చాలామందికి తెలియకపోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జెఆర్‌డీ టాటాతో చర్చ.. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే మహిళలు సౌందర్య సాధనాలు ఉపయోగించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అవసరమని భావించిన నెహ్రూ ప్రముఖ పారిశ్రామిక వేత్త జెఆర్‌డీ టాటాతో చర్చించారు. దీనికి ఏకీభవించిన టాటా 1952లో లాక్మేను టాటా ఆయిల్ మిల్స్ అనుబంధ సంస్థగా స్థాపించారు. లాక్మే అనేది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ కాస్మొటిక్ కంపెనీ. మహిళలు విదేశీ వస్తువులను అధికంగా వినియోగిస్తున్న కారణంగా జవహర్ లాల్ నెహ్రూ దీని ఏర్పాటుకి కారకుడయ్యాడు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండాలంటే స్వదేశీ కంపెనీ అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇక ఆ జియో రీఛార్జ్ ప్లాన్ లేదు.. కొత్త ప్లాన్ ఏంటంటే? లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో.. నిజానికి జెఆర్‌డీ టాటా ఈ కంపెనీ ప్రారంభించిన సమయంలో సంస్థకు ఏ పేరు పెట్టాలని తీవ్రంగా ఆలోచించాడు. అప్పట్లో సామాన్యులకు కూడా నచ్చే విధంగా ఉండాలని కొంతమంది ప్రతినిధులతో చర్చించి 'లాక్మే' అని నామకరణం చేశారు. లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో 'లక్ష్మీదేవి' అని అర్థం. పురాణాల్లో లక్ష్మీదేవి అందానికి ప్రతిరూపంగా భావించేవారు కావున ఈ పేరునే స్థిరంగా ఉంచేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! ప్రారంభంలో లాక్మే ముంబైలోని ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన అతి తక్కువ సమయంలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీ ప్రారంభించిన తరువాత దాదాపు విదేశీ వస్తువుల దిగుమతి భారతదేశంలో ఆగిపోయింది. 1961లో నావల్ టాటా భార్య సిమోన్ టాటా ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంస్థ అభివృద్ధికి ఈమె ఎంతగానో కృషి చేసింది. -
అవిశ్వాస తీర్మానం.. నెహ్రూ నుంచి మోదీ వరకు.. నెగ్గింది, ఓడింది వీరే!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. మణిపూర్ హింసపై అధికార, విపక్షాల మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై వాడివేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించనున్నారు. మోదీ ఇంటి పేరు కేసులో శిక్ష కారణంగా నాలుగు నెలల తర్వాత పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రాహుల్.. అవిశ్వాస తీర్మానంపై చేయనున్న తొలి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. రేపు, ఎల్లుండి కూడా అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? దాన్ని ఎలా, ఎప్పుడు ప్రవేశపెడతారు? ఇప్పటి వరకు స్వతంత్ర భారత దేశంలో ఎన్నిసార్లు ప్రతిపాదించారు? ఎవరూ నెగ్గారు? ఎవరూ ఓడిపోయారు? ఎవరిపై ఎక్కువసార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.. చదవండి: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగం.. ఏం మాట్లాడనున్నారు? గత ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలు అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రజలకు, దేశానికి జవాబుదారీగా ఉంచడానికి ఉపయోగించబడింది. ప్రత్యేకించి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన సమయంలో వాటిని పడగొట్టడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ►దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి 2018లో నరేంద్ర మోదీ వరకు అనేకమంది నేతలు ఈ అవిశ్వాన్ని ఎదుర్కొన్నారు. మొదటిసారిగా 1963లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై విపక్ష నేత ఆచార్య జేబీ కృపలానీ ప్రవేశ పెట్టారు. 1962లో చైనాతో జరిగిన యుద్దంలో భారత్ ఓడిపోవడంతో ఆగస్టులో నెహ్రూపై ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. తర్వాత చదవండి: ‘బిల్కిస్ బానో’ కేసులో దోషులను వదలొద్దు ►మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాసాలను ఎదుర్కొన్నారు. అయితే అన్నింట్లోనూ ఆమె విజయం సాధించారు. ► లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు (మూడు చొప్పున), మొరార్జీ దేశాయ్ (రెండు), జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ఒకొక్కసారి ఎదురుకున్నారు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్‌తోపాటు 1999లో వాజ్‌పేయి ఒక ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. ► దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు 27 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. తాజాగా మోదీ ఎదుర్కొంటున్నది 28వ తీర్మానం. ►చివరి సారి 2018లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోగా.. 199 ఓట్లతో విజయం సాధించింది. ప్రస్తుతం మరోసారి మోదీ ప్రతిపక్షాల నుంచి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. దీంట్లోనూ బీజేపీ సర్కార్ తప్పక విజయం సాధించే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం అంటే.. అవిశ్వాస తీర్మానం అనేది కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని తెలియజేసేందుకు ప్రతిపక్షాలు ఉపయోగించే పార్లమెంటరీ సాధనం. దీనిని స్పీకర్ ఆమోదీస్తే విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అధికార పక్షం లోక్‌సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం వెంటనే పడిపోతుంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నంత వరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రతిపక్షాల ఆయుధం ప్రతిపక్షాలు తరచుగా ఓ వ్యూహాత్మక సాధనంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగిస్తూ ఉంటాయి. దీని ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, వారి వైఫల్యాలను ఎత్తిచూపడానికి, వీటన్నింటినీ సభలో చర్చించడానికి ఉపయోగపడుతోంది. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కూడా ఈ తీర్మానం కీలక పాత్ర పోషిస్తోంది. అదే సభలో తీర్మానం ఆమోదం పొందితే ప్రధానితో సహా మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయాలి. లోక్‌సభ ప్రత్యేక హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం కేంద్ర కేబినెట్ సమిష్టిగా లోక్‌సభకు జవాబుదారీగా ఉంటుంది. అవిశ్వాస ప్రతిపాదనను కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ప్రవేశపెట్టగలవు. అలాగే లోక్‌సభలో మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. రాజ్యసభలో ప్రతిపాదించేందుకు అనుమతి లేదు. పార్లమెంటులో సభ్యత్వం కలిగిన ఏ పార్టీ అయినా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే అధికారంలో కొనసాగడానికి ప్రభుత్వం తప్పక తన మెజారిటీని నిరూపించుకోవాలి. చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం ఎలా ప్రవేశపెడతారు.. లోక్‌సభ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. లోక్‌సభ నియమాలు 198(1), 198(5) ప్రకారం స్పీకర్ చెప్పిన తర్వాత మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభకు తీసుకురావాల్సిన సమాచారాన్ని ఉదయం 10 గంటలలోపు సెక్రటరీ జనరల్‌కు ఆయన కార్యాలయంలో లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సభలో అదే సమయంలో కనీసం 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. తీర్మానం ఆమోదం పొందితే.. చర్చకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. దీనిపై అధికార పార్టీతో సహా, ప్రతిపక్షాలు చర్చిస్తాయి. అంతేగాక రాష్ట్రపతి సైతం తమ మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని కోరవచ్చు. ప్రభుత్వం నిరూపించుకోలేకపోతే మంత్రివర్గం రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ స్వయంగా ప్రకటిస్తారు. మరోవైపు మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని విపక్ష కూటమి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మూడు నెలలుగా మణిపూర్ హింస రుగులుతున్నా పరిస్థితులను అదుపు చేయడంలో, శాంతి భద్రతలు పునర్నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి(జూలై20) దీనిపై ప్రభుత్వం చర్చించాలని విపక్షాల మొండిపట్టుతో సభలు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. -
సుప్రీం కోర్ట్ తీర్పును వెంటనే అమలుపర్చాలిని ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
నెహ్రూ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోండి.. సీఎం కేసీఆర్‌కు భట్టి సూచన
సాక్షి, హైదరాబాద్: ‘గుండు సూది కూడా తయారు చేసే స్థితిలో లేని తరుణంలో మన దేశానికి నెహ్రూ మొదటి ప్రధాని అయ్యారు. పంచవర్ష ప్రణాళికలు, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరుచుకుంటూ దేశా న్ని ప్రగతి బాటలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అందరం కలిసి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, ఈ రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ నెహ్రూ స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలి’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 17.39 లక్షల కోట్ల బడ్జెట్‌ను పెట్టుకున్నా ప్రజల ఆశలు, ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆదివారం అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత తొలి సీఎంగా కేసీఆర్‌పై ఉందన్నారు. వారుంటే దేశం గతి ఏమయ్యేదో.. తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాంతంలో ఆశించిన లక్ష్యాలు నెరవేరవని.. ఉవ్వెత్తున సాగిన రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని చూసి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేందుకు చొరవ చూపిన విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రం అన్నాక ప్రతిపక్షాలుంటాయని, వాటిపై కక్ష సాధింపు ధోరణితో కాకుండా కలుపుకొని పోవాలన్న నెహ్రూ తరహాలో ఇక్కడ పాలన సాగాల్సి ఉందన్నారు. ఆ రోజు తొలి ప్రధానిగా నెహ్రూ కాకుండా ప్రస్తుత పాలకులలాంటి వారు ప్రధాని అయి ఉంటే దేశం గతి ఏమై ఉండేదోనని తల్చుకుంటేనే ఆందోళన కలుగుతోందని భట్టి వ్యాఖ్యానించారు. దేశంలో శాస్త్రీయమైన పరిపాలన జరగడం లేదనటానికి, కరోనా వస్తే దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండిలాంటి సూచనలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయానికి కేటాయించిన నిధులు సరిపోవని, వాటిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పోడు భూముల పంపిణీ తేదీలను ముఖ్యమంత్రి ప్రకటించాలని కోరారు. పోడు భూముల సాగును అడ్డుకునే క్రమంలో గిరిజనులను బలవంతంగా అడవుల నుంచి తరిమేసేందుకు వారు తాగే నీళ్లను కలుషితం చేసే వికృత చేష్టలకు పాల్పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసమస్యలన్నీ చర్చకు రాలేదు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 28 రోజుల పాటు జరపాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం కోరితే ప్రభుత్వం కేవలం 7 రోజుల్లో ఈ సమావేశాలను ముగించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రజలెదుర్కొంటున్న సమస్యలన్నీ చర్చకు రాలేదని విమర్శించారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన అనంతరం ఆదివారం సాయంత్రం మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ద్రవ్యవినిమయ బిల్లు సందర్భంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మాజీ ప్రధాని నెహ్రూ వేసిన పునాదులే దేశాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంత తక్కువ రోజులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం దేశంలోనే ఇదే మొదటిసారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ, మండలిపై బీఆర్ఎస్కు గౌరవం లేదని, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఆమోదంపై చర్చ జరిగిందో, కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరిగిందో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకే కేంద్రంపై నెపం నెట్టారని, కేసీఆర్ చిన్నబుద్ధి బయటపడిందని చెప్పారు. బడ్జెట్ కేటాయింపుల్లో సగం నిధులు కూడా ఖర్చు చేస్తారన్న నమ్మకం తమకు లేదని జీవన్‌రెడ్డి అన్నారు. చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్ -
ఆధునిక దేశ నిర్మాత
ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసినవాడు జవహర్లాల్ నెహ్రూ. వలసవాద వ్యతి రేకిగా, లౌకికవాదిగా, మానవతావాదిగా, ప్రజా స్వామ్యవాదిగా, స్వాతంత్య్ర ఉద్యమ నేతగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి నెహ్రూ... భారతదేశ సమగ్రాభివృద్ధికి దాదాపు 17 ఏళ్లు ప్రధానమంత్రిగా కృషి చేశారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఆ రోజుల్లో 1936లో ఆటో బయోగ్రఫీ, 1946లో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రచించి, ఆనాటి రాజకీయ, సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రముఖ రాజ నీతిజ్ఞునిగా ప్రసిద్ధి కెక్కారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ కుమా రుని విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సైన్స్‌లో డిగ్రీ చదివించారు. లండన్‌లోని ‘ఇన్నర్ టెంపుల్ ఇన్’లో న్యాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసి లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించారు నెహ్రూ. 1912 నుండి అఖిల భారత కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. 1920లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ జీతో పాటు పాల్గొన్నారు. 1946లో ఏర్పడిన ప్రొవి జనల్ ప్రభుత్వంలో ప్రధానిగా ఎన్నికయ్యారు. నెహ్రూ భారతదేశం లౌకిక తత్వంతో సోష లిస్టు భావజాలంతో ముందుకు వెళ్లడానికి తోడ్ప డ్డారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు సమీక రించడం కష్టమవుతున్న నాటి పరిస్థితులలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన ధీశాలి నెహ్రూ. బహుళార్థ సాధక భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, రైల్వేల అభివృద్ధి, రోడ్డు మార్గాలు, విమానాశ్ర యాలు, ఇనుము, ఉక్కుకర్మాగారాలు, శాస్త్ర పరి శోధన సంస్థలను ప్రభుత్వ రంగంలోనే ప్రారం భించిన దార్శనికుడాయన. ప్రముఖ ఆర్థిక వేత్త మహలనోబిస్ నేతృత్వంలో పంచవర్ష ప్రణాళి కలకు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి నెహ్రూ. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తటస్థ వైఖరి అవలంబించి, అలీన ఉద్యమానికి నేతృత్వం వహించారు. ప్రతిరోజు భారత ప్రజలు వివిధ సమస్యలపై దాదాపు రెండు వేలకు పైగా ఉత్తరాలు రాసేవారు. ప్రతి రాత్రి అదనంగా నాలుగు లేదా ఐదు గంటలు పని చేసి, ఆ ఉత్తరాలను అధ్యయనం చేసి సమాధానాలను రాయడం ఆయన నిరంతర కృషికి నిదర్శనం. 12 శాతం అక్షరాస్యతతో ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న దేశంగా ఉన్న భారత దేశాన్ని నెహ్రూ తన రాజకీయ పరిజ్ఞా నంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా నిలబెట్టారు. ఇంతటి గొప్ప దార్శనికుడు నెహ్రూజీకి బాలల పట్ల అమితమైన ప్రేమ, వాత్సల్యం ఉండేవి. అందుకనే పిల్ల లందరూ చాచా నెహ్రూగా పిలిచేవారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. నిజా నికి 1956 నుంచి అంతర్జాతీయ బాలల దినో త్సవం జరిగే రోజునే ఇండియాలోనూ బాలల దినోత్సవాన్ని జరిపేవారు. అయితే 1964 మే 27న పిల్లల్ని ఎంతగానో ఇష్టపడే నెహ్రూజీ తుదిశ్వాస విడిచిన తర్వాత... ఆయన పుట్టిన రోజును భారత ప్రభు త్వం బాలల దినోత్సవంగా జరపాలని నిర్ణ యించింది. ఈ తరుణంలో ఆ మహనీయుని స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం అవసరం. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు, జన చైతన్య వేదిక మొబైల్: 99499 30670 -
నెహ్రూ ఆత్మకథకు పొంగిపోయిన రవీంద్రుడు
జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రో ద్యమంలో పాల్గొని జైలు జీవితం గడుపుతున్న దశలో 1934–35 మధ్య కాలంలో తన ఆత్మకథ (టువార్డ్ ఫ్రీడమ్) రాసుకున్నారు. బానిస సంకెళ్లు తెంచుకుని, దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న దశలో తన అనుభవాల్ని నమోదు చేసుకున్నారు. నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య కమలా నెహ్రూ అనారోగ్యంతో మంచానపడి ఉన్నారు. కూతురు ఇందిర చిన్నపిల్ల. ఆమె ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకపోవడం వల్ల, తరచూ రవీంద్రుడి శాంతినికేతన్‌కు పంపు తుండేవారు. అందరినీ, అన్నింటినీ ప్రేమగా చూసే లక్షణం ఆ బాలికలో ఉందని గ్రహించి రవీంద్రనాథ్ టాగూర్ ఆమెను ‘ప్రియదర్శిని’ అన్నారు. అప్పటి నుండి ఆమె ఇందిరా ప్రియ దర్శిని అయ్యింది. పండిట్ నెహ్రూకు సాహిత్యం, కళల పట్ల ఉన్న అవ్యా జమైన ప్రేమ జగద్విదితం. ఆయన ఆత్మకథను చదివి ‘విశ్వ కవి’ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరం రాశారు. 1936 మే 31న శాంతినికేతన్ నుండి రవీంద్రుడు రాసిన ఉత్తరం ఇలా ఉంది: ‘‘ప్రియమైన జవహర్లాల్! మీ పుస్తకం చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం. చదువుతూ ఎంతో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకుని గర్వపడుతున్నాను. అన్నింటినీ మించి అట్టడుగున ప్రవహించే లోతైన మీ మానవత్వపు దృక్కోణం, సంక్లిష్టమైన చిక్కుముడులనన్నింటినీ విప్పుతూ ఉంది. వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకూ సాధించిన విజయాలకు మించిన మహో న్నతమైన వ్యక్తిత్వం మీది – అనే విషయం తెలిసిపోతూ ఉంది. సమకాలీన స్థితిగతుల నుంచి నిజాయతీ అయిన ఒక నిఖార్స యిన మీ వ్యక్తిత్వం గోచరిస్తూ ఉంది.’’ సాహిత్యకారుడు అయిన నెహ్రూకు, అమృతా షేర్గిల్, సరోజినీ నాయుడు, ఫ్రెంచ్ సాహిత్యకారుడు రోమా రోలా వంటి దిగ్గజాల నుండి ఉత్తరాలు వస్తుండేవి. ఆ రోజుల్లో లేఖలు రాయడం కూడా ఒక కళగా పరిగణింపబడుతూ ఉండేది. జైలు నుండి నెహ్రూజీ తన కూతురికి రాసిన ఉత్తరాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఆ ఉత్తరాల్లో సాహిత్య, సామాజిక, చారి త్రక, స్వాతంత్య్రోద్యమ అంశాలు; దేశ, కాల పరిస్థితుల గురించి చర్చించారు. తరువాత కాలంలో ఆ లేఖలన్నీ పుస్తక రూపంలో వెలువడ్డాయి. పిల్లల పట్ల ఆయనకు గల ప్రత్యే కమైన శ్రద్ధ, ప్రేమల వల్ల ఎన్నో సంస్థలకు, ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చాచా నెహ్రూగా శాశ్వతత్వం పొందారు. అందుకే ఆయన పుట్టినరోజు 14 నవంబర్‌ను పిల్లల దినంగా జరుపుకొంటున్నాం. జాతీయ సంస్థల్ని ప్రారంభించి నిలబెట్టింది నెహ్రూజీ అయితే, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది మోదీజీ. తొలి ప్రధాని నుండి ఇటీవలి కాలం వరకు ఏ ప్రధానీ చేయని ‘ఘన’మైన పనులు ఇప్పటి ప్రధాని చేశారు. పటేల్ విగ్రహం నెలకొల్పారు. దాన్ని ఐక్యతా విగ్రహం అన్నారు. బావుంది. ప్రారంభోత్సవ సభలో నేటి హోంమంత్రి కనబడలేదు. విగ్రహం తొలి హోంమంత్రిది కదా? పైగా వేల సంఖ్యలో మత గురువుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అసలది మతానికేం సంబంధం? ఏమీ మాట్లాడలేక వారసత్వ పాలనకు నెహ్రూయే కారణమని నిందిస్తారు. ఆయన మరణానంతరం జరిగిన సంఘటనలకు నెహ్రూ ఎలా బాధ్యులవుతారు? ఆ రోజుల్లో ఆసేతు హిమాచలం స్వాతంత్య్ర సమర యోధులు లక్షలమంది ఉండి ఉంటారు. వారందరిలోకి నాయ కత్వ లక్షణాలు, చురుకుదనం, విశాల భావాలు, అభ్యుదయ ధోరణి, విదేశాంగ విధానాల మీద పట్టు, చదువు, సంస్కారం అన్నీ పుణికిపుచ్చుకుని ఉన్నారు గనుక నెహ్రూ తొలి ప్రధాని కాగలిగారు. సుదీర్ఘ కాలం ఆ పదవిలో మనగలిగారు. మనిషిలో ఎంతో సంయమనం ఉంటేగానీ అలా నిలబడలేరు. ధనం, స్థాయి, స్థోమత ఏమీ లేనివాడు త్యాగం చేయడానికి ఏముం టుంది? కానీ, నెహ్రూజీకి ఇవన్నీ ఉండి కూడా అన్నింటినీ త్యజించి, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం గొప్ప. పైగా కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడై ఉండి, నిరీశ్వరవాది కావడం అంతకన్నా గొప్ప! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త రచయిత, సామాజికాంశాల వ్యాఖ్యాత -
మనం అన్నది నెహ్రూనే కదా.. గాంధీని కాదుగా!
మనం అన్నది నెహ్రూనే కదా..గాంధీని కాదుగా! -
Gaurav Yatra: నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య
జంజార్కా/ఉనాయ్(గుజరాత్): కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆయన గురువారం అహ్మదాబాద్ జిల్లా జంజర్కా, ఉనాయ్లలో బీజేపీ ‘గౌరవ్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా పైవ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ను రాజ్యాంగంలో చేర్చుతూ నెహ్రూ చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కాలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370ను తొలగించాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో 370ను రద్దు చేసి, కశ్మీర్‌ను దేశంతో విలీనం చేశారు’అని అమిత్ షా చెప్పారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కానీ, మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది’అని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. గతంలో యూపీఏ హయాంలో పాక్ ఆర్మీ మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మన ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని చూసింది. కానీ, ఇది మౌని బాబా (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది’అని అమిత్ షా అన్నారు. ‘గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 200 రోజులు కర్ఫ్యూయే అమలయ్యేది. కానీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు’అని చెప్పారు. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేవని విమర్శించారు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రే వర్గానికి భారీ ఊరట -
ఎన్నయినా అనొచ్చు! కాదని వచ్చి వాదించలేరుగా!!
ఎన్నయినా అనొచ్చు! కాదని వచ్చి వాదించలేరుగా!! -
నెహ్రు తర్వాత బలమైన ప్రధాని మోదీనే.. ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు బలమైన ప్రధాని వద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరాలంటే దేశంలో బలహీన ప్రధాని అవసరం అన్నారు. ఈసారి బలహీనులకు లబ్ధి చేకూర్చే బలహీన ప్రధాని దేశానికి అవసరమని తాను భావిస్తున్నానని సెటైరికల్ కామెంట్స్ చేశారు. బలహీన ప్రధాని పగ్గాలు చేపడితే బలహీనవర్గాలు లాభపడతాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. బలమైన ప్రధాని కేవలం ధనవంతులకు(సంపన్న వర్గాలకే) సాయపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మనం బలమైన ప్రధానిని చూశాము.. ఇక వచ్చే ఎన్నికల్లో పేదలకే మేలు చేసే ప్రధానిని ఎన్నుకోవాలన్నారు. కాగా, 2024 ఎన్నికల్లో తాము ఈ దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి 306 మంది ఎంపీలున్నా.. వ్యవస్థను నిందిస్తున్నారని అన్నారు. పేదలు, రైతులు, యువతకు మేలు చేసేందుకు ఆయనకు ఇంకా ఏం అధికారాలు కావాలని ప్రశ్నించారు. దేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యంత శక్తివంతమైన ప్రధాని అయిన నరేంద్ర మోదీ.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చైనా చొరబాటు, కార్పొరేట్ ట్యాక్స్ రద్దు వంటి ప్రశ్నలు ఎదురైతే ప్రధాని వ్యవస్ధను నిందిస్తుంటారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగానే ఒవైసీ.. ఆమ్ ఆద్మీ పార్టీపైన సైతం విమర్శలు గుప్పించారు. గుజరాత్లో జరిగిన బిల్కిన్ బానో కేసు విషయంలో ఖైదీల విడుదలపై అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు స్పందించలేదన్నారు. ఆప్ కూడా బీజేపీ వంటిదేనని.. రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. When we speak of development of minority communities & justice for them, nonsense is spoken against us. This is hypocrisy in a way that those posing as experts of secularism today will decide who's secular & who's communal.The country is watching them: AIMIM chief Asauddin Owaisi pic.twitter.com/gNFrieqoeQ — ANI (@ANI) September 10, 2022 -
మోదీ@20 పుస్తకావిష్కరణ... ఒక ప్రధాని ఉండేవారంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ యూపీ సీఎం
వారణాసి: యూపీలోని వారణాసిలో రుద్రాక్ష్ కన్వెక్షన్ సెంటర్లో మోదీ@20 అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ... ఒకప్పుడూ ఒక ప్రధాని ఉండేవారంటూ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు చెప్పకుండానే ఆయనతో మోదీని పోల్చారు. ఆయనకు భిన్నంగా ప్రస్తుత ప్రధాని వారసత్వం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే భారత్‌ని ఏక్ భారత్, శ్రేష్ట భారత్‌గా మార్చాలనే సంకల్పంతో ఉన్న మోదీ భారత్‌కి లభించారంటూ ప్రశంసించారు. అంతేకాదు భారత్ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి తెలియజేసేలా ఆదర్శంగా నిలించిందన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాద మూలాలను శాశ్వతంగా అంతం చేయడంలో ప్రధాని వెనుకాడడం లేదని కొనియాడారు. ఇదే మోదీ నాయకత్వ సామర్థ్యం అని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు సోమ్‌నాథ్ పునరుద్ధరణ కోసం రాష్ట్రపతిని పంపని ఒక ప్రధానిని చూశాం, అలాగే భవ్య శ్రీరామ నిర్మాణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధానిని కూడా చూశాం అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులలో మన ప్రధాని ఒకరు కావడం మనకు గర్వకారణమని అన్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, దాదాపు వందల ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన బ్రిటన్‌ని వెనక్కినెట్టి మరీ ఈ స్థానానికి చేరుకుందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అన్నారు. (చదవండి: గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం) -
చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?
ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా కాలంలో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై జరిగే చర్చకంటే... కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వంకరటింకర చేయడం, అలాగే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేయడంపైననే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. భారతదేశ చరిత్ర సమున్నతమైనది. అందులో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ప్రధాన మైనది. అలాగే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు–దేశ విభజన, మత ఘర్షణలు; నెహ్రూ పాలనలో అనుసరించిన ఆర్థిక, సామాజికాభివృద్ధి, విదేశీ విధానాలు తదితర అంశాలు చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. అయితే, పాక్షిక దృష్టితోనో లేక కాంగ్రెస్, వామపక్ష భావజాలాల దృక్కోణం నుంచో సంఘటనలను చరిత్రకారులు చెప్పారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. చరిత్రకు సైద్ధాంతిక ఏకీభావం ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర పరిశీలించినా అనేక అంశాలలో భిన్నమైన వాదనలు, వ్యక్తీ కరణలు, అభిప్రాయాలు కనిపిస్తాయి. అయితే, భారత్‌కు సంబంధించినంత వరకు జాతీయవాదం తమ గుత్తసొత్తుగా భావించే బీజేపీ ఇపుడు చరిత్రను సరిచేసే నెపంతో గత చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నప్పుడు స్వయంగా మోదీ చరిత్ర మసిపూసే పనికి తగిన సహకారం, ప్రోద్బలం అందిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి, స్వాతంత్య్రం లభించినాక దేశానికి 17 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేసి... ప్రపంచంలో భారత్‌కు ఓ విశిష్ట స్థానం కల్పించిన పండిట్ నెహ్రూ పాత్రను కుదించే పనిలో నేడు బీజేపీ తలమునకలై ఉంది. దేశ విభజన, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, చైనాతో యుద్ధం వంటి అంశాలలో ప్రధానమంత్రిగా నెహ్రూ పోషించిన పాత్ర, తీసుకొన్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కేవలం ఆయన విజయాలను విస్మరించి వైఫల్యాలను సాకుగా చూపి దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను తక్కువ చేయడం; పూర్తిగా విస్మరించాలనుకోవడం ఆశ్చర్యకరం. దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి సోషలిస్ట్ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఘనత నెహ్రూది. ఆయన ఏర్పరిచిన ‘ప్లానింగ్ కమిషన్’ అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రాలకూ అనేక దశాబ్దాలపాటు దిక్సూచిగా నిలిచింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు సంబం ధించిన పాఠ్యాంశాలలో నెహ్రూపై ఉన్న అధ్యాయాలను ఇటీవల తొలగించారు. కర్ణాటక ప్రభుత్వమైతే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి, నెహ్రూ బొమ్మ లేకుండా చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీలోని ఒకప్పటి నెహ్రూ అధికార నివాసమైన తీన్‌మూర్తి భవన్లో నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలకు ప్రాధాన్యం తగ్గించి, అందులో భారత ప్రధానుల జీవితాలను తెలియజెప్పే కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానులందరినీ సముచితంగా గౌరవించడంలో తప్పులేదు. కానీ, నెహ్రూ మ్యూజియంను అక్కడి నుండి తొలగించాల్సిన అవసరం ఉందా? ఇక, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన సంఘటన అయిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంపై నేషనల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోనూ నెహ్రూ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రధాని మోదీ తనకు నెహ్రూపై గల వ్యతిరేకతను బహిర్గత పర్చడానికి ఏమాత్రం సంకోచించరు. పార్లమెంట్‌లోనే ఓ సందర్భంలో ‘భారతదేశానికి స్వాతంత్య్రం నెహ్రూ ఒక్కడి వల్లనే రాలేదు’ అని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందని ఎవరన్నారు? నెహ్రూ పాలనలో జరిగిన వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం; ఏర్పాటైన వివిధ అత్యున్నత విద్యా సంస్థలు, రష్యా సాంకేతిక సహకారంతో నెలకొల్పిన పబ్లిక్ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, విదేశాలతో ఏర్పరచుకొన్న సత్సంబంధాలు, అనుసరించిన అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు; విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి; అనుసరించిన లౌకికవాదం (సెక్యులరిజం), భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు... ఇలాంటివెన్నో పండిట్ నెహ్రూను నవభారత శిల్పిగా నిలిపాయి. ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికీ, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఆయన విమర్శకులు సైతం ఈ విషయాలను ఒప్పుకోక తప్పదు. (క్లిక్: ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!) నెహ్రూ విమర్శలకు అతీతుడేమీ కాదు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపవచ్చు. అదే సమయంలో చరిత్రలో ఆయన స్థానం ఆయనకు ఇవ్వాల్సిందే. ఆయనను తక్కువ చేసి చూపడం వల్లా, విస్మరించడం వల్లా బీజేపీకి ఒరిగే లాభం ఏమిటి? (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
ఎదలో పూసిన ఎర్ర గులాబీ!
చందమామ లేని వెన్నెల కాయించే మాంత్రికులు రాబో తున్నారు. ఆకాశం లేని ఇంద్రధనుసును పూయించే చమత్కా రులు కూడా రాబోతు న్నారు. పండిత నెహ్రూ ప్రస్తావన లేకుండానే స్వతంత్ర భారత ప్రస్థా నాన్ని వినిపించగల హరి కథకులు ఇప్పటికే వేంచేసి ఉన్నారు. ఇక ముందు ఇలాంటి అనేక వింతల్ని చూడ వలసి ఉన్నది. అనేక విషాదాలను కూడా తట్టుకోవలసి ఉన్నది. ‘క్లైమేట్ ఛేంజ్’ పర్యవసానంగా శిరమెత్తిన నడిమంత్రపు తుపాను గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. ఇది రాజకీయ వాతావరణ శాస్త్రవేత్తల తుది హెచ్చరిక. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై అయిదేళ్లు నిండిన సందర్భాన్ని అమృతోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు పిలుపునిచ్చింది. ప్రజలు అద్భుతంగా స్పందించారు. పొలం పనులకు వెళ్లిన కూలి జనం కూడా ముందుగా గట్ల మీద మువ్వన్నెల జెండాలను ఎగుర వేశారు. ‘జనగణమన’ పాడారు. జైహిందంటూ జెండాలకు వందనం చేసిన తర్వాతే పనుల్లోకి దిగారు. దండకారణ్య మారుమూల ప్రాంతాల్లో ఒంటి మీద సరిగా గుడ్డల్లేని గిరిజన బిడ్డలు కూడా జెండా పండుగలు చేసుకున్నారు. దేశభక్తి ఏ ఒక్కడి అబ్బ సొత్తు కాదని ఢంకా భజాయించి చెప్పారు. ఈ నేల మీద మొలకెత్తిన గడ్డిపోచకు కూడా దేశభక్తిపై పేటెంట్ ఉన్నదని ఘంటాపథంగా చాటి చెప్పారు. భావజాల వాతావరణ మార్పుల ప్రభావం ఈ ఉత్సవాల్లో అక్కడక్కడా కనిపించింది. నవభారత నిర్మాతగా పేరున్న పండిత జవహర్లాల్ నెహ్రూ ప్రతిష్ఠ మీద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ప్రభుత్వాలు, పాలక పార్టీలు కూడా పాల్గొన్నాయి. ‘దేశవిభజనకు నెహ్రూయే కారకు’డంటూ భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన వీడియో ఆరోపించింది. కర్ణాటకలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని పత్రికా ప్రకటనల్ని విడుదల చేసింది. అందులో నెహ్రూను మినహాయించి మిగిలిన జాతీయ నాయకుల ఫొటోలు వేశారు. కావాలనే నెహ్రూ ఫొటోను వెయ్యలేదని ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి ఒకరు ప్రక టించారు. అంబేడ్కర్ బొమ్మను కూడా అట్టడుగున మొక్కు బడిగా వేశారనీ, బ్రిటిష్ వారిని క్షమాభిక్ష వేడిన సావర్కర్ ఫొటో మాత్రం ప్రముఖంగా వేశారనీ విమర్శలు కూడా వచ్చాయి. నెహ్రూ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలు పథకం ప్రకారమే ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది. ‘‘ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా నువ్వు – ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకం’’ – అట్లాంటి నిన్ను ఈ దేశం ఎలా మరవగలుగుతుందని నెహ్రూ చనిపోయినప్పుడు రాసిన కవితలో తిలక్ ప్రశ్నిస్తాడు. అది అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని కొంతమంది వీరతిలకాలు దిద్దుకొని మరీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు కనిపిస్తున్నది. ఎందుకు ఈ ప్రయత్నాలు? నెహ్రూను తెరమరుగు చేసి ఏం సాధించగలరు? నెహ్రూపై కత్తి దూయడం వెనుక ఉన్నది భావజాల సంఘర్షణ కావచ్చు. దూసిన కత్తికి రెండో వైపున కూడా పదునుందని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పేదవర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం అమలు చేసే పథకాలను ‘ఉచిత పథకాల’ పేరుతో ఈసడించుకునే క్యాంపెయిన్ ఈ మధ్యనే ప్రారంభమైంది. దాదాపు ఇదే సమయంలో నెహ్రూ భావ జాలాన్ని తెరమరుగు చేసే ప్రయత్నాలు యుద్ధప్రాతిపదికపై మొదలయ్యాయి. ఈ రెంటికీ మధ్యన ఉన్న సంబంధమేమిటి? అసలు నెహ్రూ భావజాలమేమిటి? ఆయన చేసిందేమిటి? 1929 డిసెంబర్లో జరిగిన ‘లాహోర్ కాంగ్రెస్ సభ’లో మొదటిసారిగా దేశానికి ‘పూర్ణ స్వరాజ్’ కావాలనే డిమాండ్ ముందుకొచ్చింది. అప్పటి వరకూ డొమినియన్ హోదా ఇస్తే చాలన్న పార్టీ పంథాలో ఈ విప్లవాత్మక మార్పునకు కారకుడు ఆ సభలో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్య్రం ప్రకటించే ముందు లార్డ్ మౌంట్ బాటెన్ ఒక ప్లాన్‌ను ముందుకు తెచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారం ప్రావిన్స్‌ల (రాష్ట్రాల) వారీగా స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తారు. భారత రాజ్యాంగ సభలో చేరడం, చేరకపోవడమనేది వారి ఇష్టం. ఈ ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించి దేశం డజన్ ముక్కలు కాకుండా కాపాడిన వారిలో ప్రథముడు జవహర్లాల్ నెహ్రూ. స్వతంత్రం లభించిన తర్వాత దేశంలో ప్రజాస్వామిక విలువలు వేళ్లూనుకోవడానికీ, లౌకిక వ్యవస్థ పటిష్ఠమవడానికీ, సామాజిక న్యాయం – సామ్యవాద భావాలు వికసించడానికీ అహరహం కృషి చేసిన వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. భారత్‌తో పాటు ఆ కాలంలో వలస సంకెళ్లు తెంచుకున్న అనేక దేశాలు ప్రజాస్వామిక వ్యవస్థలతో ప్రారంభమై, అచిర కాలంలోనే నియంతృత్వంలోకి జారుకున్నాయి. ఆ దేశాల జాతీయ నాయకులు అభ్యుదయ భావాలు కలిగినవారే. అయినా పతనాన్ని నిరోధించలేక పోయారు. ఇండోనేషియా, పాకిస్థాన్, పలు ఆఫ్రికా దేశాలు ఇందుకు ఉదాహరణలు. ఆ రోజుల్లో ఒక్క జూలియస్ నైరేరే (టాంజానియా) మాత్రమే పండిత నెహ్రూ మాదిరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిలబెట్టగలిగారు. డచ్ వలస పాలన నుంచి ఇండోనేషియాకు విముక్తి సాధించడంలో సుకర్ణో కీలకపాత్ర పోషించారు. ఆయన నెహ్రూతో సమానంగా అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. అలీనోద్యమంలో నెహ్రూకు కుడి భుజంగా వ్యవహరించాడు. నియంతృత్వ పోకడలు పొడసూపి, పది లక్షల మంది ఊచకోతకు కారకుడై చివరకు పదవీచ్యుతుడయ్యాడు. ‘నూరు పువ్వులు వికసించాలి, వెయ్యి భావాలు పోటీపడాల’ని ప్రజాస్వామిక నినాదాలిచ్చిన మావో జెడాంగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆయన ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం జనం మెదళ్లపై కూడా నిఘా వేసి లక్షలాది మందిని హతమార్చింది. పండిత నెహ్రూ ఇందుకు భిన్నంగా ప్రజాస్వామిక సంప్రదాయాలకు పాదు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా లోపభూయిష్ఠంగా వ్యవహరించి ఉండవచ్చు. కానీ ఆ కాలపు తరుణ స్వతంత్ర దేశాధినేతల్లో ఒకరికి ‘అత్యుత్తమ ప్రజాస్వామ్యవాది’ టైటిల్ ఇవ్వాల్సి వస్తే నెహ్రూతో పోటీపడగలిగే వారెవరూ లేరు. ఇన్నాళ్లుగా ప్రజాస్వామ్యం, లౌకిక విధానాలు ఈ దేశంలో నిలబడి ఉండటానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని అందరూ అంగీకరిస్తారు. ప్రతిపక్ష నేతలలో కూడా నెహ్రూ సౌహార్దంగానే వ్యవహరించారని చెప్పేందుకు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నెహ్రూ విధానాలకు సోషలిస్టు నాయకుడు రామ్మనోహర్ లోహియా బద్ధవ్యతిరేకి. తీవ్రంగా విమర్శించేవాడు. ఒకసారి ఏదో ధర్నా చేసి ఆయన జైలుకు వెళ్లాడు. జైల్లో ఉన్న లోహియాకు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఒక బుట్ట నిండా మామిడిపళ్లను పంపించారట. ఈ చర్య పట్ల అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘జనసంఘ్’ టిక్కెట్‌పై లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన అటల్ బిహారి వాజ్‌పేయ్ తన విధానాలను విమర్శిస్తూ చేసే ప్రసంగాలకు నెహ్రూ ముగ్ధుడయ్యేవారట. ఒకసారి ఓ విదేశీ దౌత్యవేత్తకు వాజ్‌పేయ్‌ని పరిచయం చేస్తూ ‘ఈ యువకుడు భవిష్యత్తులో దేశానికి ప్రధాని అవుతాడ’ని నెహ్రూ చెప్పారట. నెహ్రూ విధానాలను తీవ్రంగా విమర్శించే వాజ్‌పేయి వ్యక్తి గతంగా మాత్రం ఆయనను అభిమానించేవారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలై, జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రయ్యారు. తన ఛాంబర్లోకి వచ్చి చూసిన తర్వాత అక్కడ గతంలో ఉన్న నెహ్రూ ఫొటోను ఇప్పుడు తీసేశారని గుర్తించారు. ‘పండిత్‌జీ ఫొటోను తెచ్చి ఎక్కడుందో అక్కడ మళ్లీ పెట్టండ’ని ఆదేశించారట! స్వాతంత్య్ర ప్రకటనకు కొన్ని గంటల ముందు ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ పేరుతో నెహ్రూ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఈ ప్రసంగంలో రేఖామాత్రంగా చెప్పిన అంశాలే ఆయన భావజాలానికి తార్కిక పునాది. ‘కొన్నేళ్ల కిందట (ఉద్యమ కాలంలో) మనం విధికి ఒక ఒక మాట ఇచ్చాం. ఆ మాటను ఇప్పుడు నెరవేర్చాలి. దారిద్య్రాన్ని, అసమానతలను, అజ్ఞా నాన్ని పారద్రోలాలి. ప్రతి ఒక్క కంటిలోని ప్రతి కన్నీటి చుక్కనూ తుడిచేయాలి. భారతదేశం కోసం, ప్రపంచ మానవాళి కోసం మనం కన్న కలల్ని నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయా’లంటూ ఉత్తేజపూరితమైన ఉపన్యాసం చేశారు. అంబే డ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగంలో ఈ అభిప్రాయాలు ప్రతిఫలించాయి. తొలి రోజుల్లో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్న దేశం హరిత విప్లవాన్ని సాధించడం వెనుక అవసరమైన భూమికను నెహ్రూ సిద్ధం చేశారు. భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ వంటి భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టులను ప్రారంభించి వాటిని ‘ఆధునిక దేవాలయాలు’గా పిలిచారు. ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థలకు సీఈఓలుగా భారతీయులు పనిచేస్తున్నారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వారందరికీ విద్యాబుద్ధులు నేర్పిన ఐఐటీలు, ఐఐఎమ్‌లూ, వాటితోపాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎయిమ్స్’లాంటి విద్యా సంస్థల్ని నెహ్రూ స్థాపించారు. హోమీ జె.బాబా, విక్రమ్ సారాబాయ్, సీడీ దేశ్‌ముఖ్, భట్నాగర్, వర్గీస్ కురియన్ వంటి మేధావులను ప్రోత్సహించి, వారి కృషితో దేశానికి అభివృద్ధి బాటలు పరిచిన దార్శనికుడు నెహ్రూ. అంతరిక్ష రంగంలో దేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చిన ‘ఇస్రో’ను, అణ్వస్త్ర దేశంగా నిలబెట్టిన ‘బార్క్’ను కూడా నెహ్రూ కాలంలోనే స్థాపించారు. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన పరిశోధనా సంస్థల్లో సింహభాగం ఆయన కాలంలోనే ఏర్ప డ్డాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక సుదీర్ఘమైన జాబితా తయారవుతుంది. నెహ్రూ రూపొందించిన పంచవర్ష ప్రణాళికలు అభివృద్ధిని క్రమబద్ధం చేసి దేశాన్ని నిలబెట్టాయి. పబ్లిక్ రంగ పరిశ్రమలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు రూపుదిద్ది అసమానతలు, అంతరాలు అడ్డగోలుగా పెరగకుండా నియంత్రించగలిగాయి. స్వాతంత్య్రా నికి ముందు బ్రిటీష్ దోపిడీ యథేచ్ఛగా సాగిన రోజుల్లో దేశ జనాభాలోని ఒక్క శాతం అగ్రగామి శ్రీమంతుల చేతుల్లో 21 శాతం జాతి సంపద ఉండేది. నెహ్రూ విధానాల ఫలితంగా 1980 నాటికి ఒక్క శాతం జనాభా చేతిలో ఉండే జాతి సంపద 6 శాతానికి తగ్గింది. మళ్లీ ఇప్పుడు 22 శాతానికి ఎగబాకింది. ‘బ్రిటీష్‌రాజ్’ నుంచి ‘స్వరాజ్’ వైపు దేశాన్ని మళ్లించడానికి నెహ్రూ తదితర జాతీయోద్యమ నేతలు ప్రయత్నించారు. ఇప్పటి ఆధునిక నేతలు దాన్ని ‘బిలియనీర్ల రాజ్’ వైపు పరుగె త్తిస్తున్న వైనం మన కళ్ల ముందు కనిపిస్తున్నది. ‘బ్రిటీష్ రాజ్ టు బిలియనీర్ రాజ్’ పేరుతో వెలువడిన ఒక పరిశోధనా పత్రం లోని ఈ వివరాలను ఇటీవల ‘ది హిందూ’ పత్రికలో ప్రకటించారు. నెహ్రూ సర్వజ్ఞుడనీ, లోపరహితుడనీ చెప్పలేము. ఆయన పాలనా కాలంలో చాలా పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ముఖ్యంగా చైనాను అంచనా వేయడంలో ఆయన తప్పటడుగు వేశారు. తరుణ స్వతంత్ర దేశాలన్నీ సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. చైనాతో ‘పంచశీల’ ఒడంబడిక కుదుర్చు కున్నారు. మావో జెడాంగ్ ఎంత కమ్యూనిస్టో అంతే కరుడు గట్టిన నేషనలిస్టు అనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. టిబెట్‌పై దురాక్రమణ చేస్తుంటే నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ పరిణామానికి వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ దేశాలను నెహ్రూ కూడగట్టి ఉన్నట్లయితే ప్రస్తుత ప్రపంచ ముఖచిత్రం మరో రకంగా ఉండేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చైనాతో యుద్ధం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ బెంగే ఆయన మరణానికి కూడా కారణమైంది. పదిహేడేళ్ల సుదీర్ఘ పాలనలో దేశీయంగా కూడా నెహ్రూ కొన్ని తప్పటడుగులు వేసి ఉండొచ్చు. కానీ స్థూలంగా చెప్పాలంటే ఆయన ఆధునిక భారత నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ నెంబర్ వన్. దేశాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కించినవాడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవకుండా కాపాడినవాడు. లౌకిక భావాలను సమాజం గుండెల నిండా నింపినవాడు. సమతాభావాలకు జైకొట్టినవాడు. మనిషిని ప్రేమించినవాడు. ఈ దేశపు మట్టిని ప్రేమించినవాడు. ఆయన పటేల్ విగ్రహ మంత పెద్ద విగ్రహాన్ని పెట్టకపోవచ్చు కానీ ప్రపంచ కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్న మేధావులను తయారు చేసిన ప్రతిష్ఠాత్మక విద్యాలయాలను స్థాపించారు. ఆయన రామ మందిరాన్ని నిర్మించకపోవచ్చు కానీ ఆధునిక దేవాలయాల నిర్మాణానికి ఆద్యుడు. ఛాందస భావాలకు బద్ధవిరోధి. శాస్త్రీయ ఆలోచనా రీతులకూ, సైంటిఫిక్ టెంపర్కూ కేరాఫ్ అడ్రస్ – పండిత నెహ్రూ. ఇప్పుడా చిరునామాను చెరిపేస్తారట! కోటు మీద అలంకరించుకున్న గులాబీ పువ్వును పీకి పారేయొచ్చు. కానీ ఎద ఎదలో పూసిన ఎర్రగులాబీలను పీకేయడం ఎలా సాధ్యం? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
డీపీల మార్పుకై మోదీ పిలుపు.. తమదైన శైలిలో స్పందించిన కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ: జాతీయజెండాను సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లుగా మార్చుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తమదైన శైలిలో స్పందించారు. పార్టీ అధికార వెబ్‌సైట్‌తోపాటు అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా సహా పలువురు తమ ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాల్లో దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయ జెండాను చేతబూనిన ఫొటోను బుధవారం తమ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకున్నారు. నెహ్రూ జాతీయ జెండా వైపు చూస్తున్నట్లుగా ఉన్న బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ఫొటోషాప్ సాంకేతికతతో కలర్లోకి మార్చారు. ‘తిరంగా దేశానికి గర్వకారణం. తిరంగా ప్రతి భారతీయుడి గుండెలోనూ ఉంటుంది’అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘52 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ పుణెలోని తన ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదు. ప్రధాని పిలుపుతోనైనా తిరంగా ఆ సంస్థ ప్రొఫైల్ పిక్చర్ మారుతుందా?’అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు ఆ అవకాశం ఇవ్వండి: రాహుల్‌పై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో త్రివర్ణ పతాకంతో ఉన్న తమ ఫొటోలు పెట్టుకునే అవకాశం నేతలకు ఇవ్వాలని రాహుల్ గాంధీని బీజేపీ ఎద్దేవా చేసింది. తిరంగా విషయంలోనైనా తమ కుటుంబం పరిధి దాటి ఆయన ఆలోచించాలని హితవు పలికింది. -
చైతన్య భారతి: గృహిణి, ఉద్యమకారిణి.. కమలా నెహ్రూ
కమలా నెహ్రూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సతీమణి. ఇంటి పట్టునే ఉండే కమలా నెహ్రూ 1921లో సహాయ నిరాకరణోద్యమంలో మహిళల బందానికి నాయకత్వం వహించి విదేశీ వస్తువులు, దుస్తులు, మద్యం అమ్మకాలు తగవనే నినాదంతో ముందుకు సాగారు. రెండుసార్లు అరెస్ట్ అయ్యారు. కమల పాత ఢిల్లీ లోని కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో 1899 ఆగస్టు 1 రాజ్‌పతి, జవహర్‌మల్ కౌల్ దంపతులకు జన్మించారు. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు. చాంద్ బహదూర్ కౌల్ , కైలాష్ నాథ్ కౌల్; ఒక చెల్లెలు స్వరూప్ కఠ్జు. కమలకు 1916 ఫిబ్రవరి 8న జవహర్ లాల్ నెహ్రూ తో వివాహం జరిగింది. కమలా నెహ్రూ మామగారు మోతీలాల్ నెహ్రూ. అత్తగారు శ్రీమతి స్వరూప రాణి. ఉద్యమాలు తెలియకుండా పెరిగి వచ్చిన కోడలు సహాయ నిరాకరణకు నడుము బిగించడంతో అత్తమామలు సంతోషించారని అంటారు. ఆమె మామగారు మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్తినంతా ధారపోసింది. చివరకు తమ ఇంటిని సైతం కొంత భాగం హాస్పిటల్‌గా మార్చి స్వాతంత్య్ర పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించారు. 1917 నవంబరు 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూలకు ఏకైక సంతానంగా అలహాబాద్ లో ఇందిర జన్మించారు. 1924 లో కమలా నెహ్రూ ఒక బాబును కన్నారు. పూర్తిగా పరిణతి చెందక ముందే జన్మించడం వలన రెండు రోజులలో బాబు చనిపోయాడు. 1934లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు అయి కలకత్తా, డెహ్రాడూన్ లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో నెహ్రూ ఆరోగ్యం దెబ్బతినింది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ కూడా దిగులుతో అనారోగ్యానికి గురయ్యారు.. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లి 1936లో టి.బి. జబ్బు మూలాన 36 ఏళ్ల వయసుకే మరణించారు. కమలా నెహ్రూ చనిపోయిన తరువాత ఆమె పేరుతో కాలేజీలు, పార్కులు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు వెలశాయి. కమలా నెహ్రూ తండ్రి జవహర్‌మల్ కౌల్ప్రసిద్ధ వ్యాపారి. జవహర్ లాల్ నెహ్రూకు సరైనజోడి కమలా నెహ్రూ అని భావించి, వారి వివాహం జరిపించాడు. వివాహం తరువాత కమలా కౌల్ కమలా నెహ్రూగా మారారు. -
శతమానం భారతి: లక్ష్యం 2047 నెహ్రూ వారసత్వం
మన దేశ నిర్మాణం, ఘనమైన ప్రజాస్వామ్య విధానాల్లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాత్ర ఎనలేనిది. ప్రపంచం మొత్తంమీద భారత్ వాణికి ఒక విలువ ఉందంటే అది నెహ్రూ వల్లనే. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోని సంక్లిష్ట, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులతో కూడిన వ్యవహారాలను నెహ్రూ దార్శనికతతో చక్కబెట్టడమే కాదు, తన నాయకత్వ లక్షణాలు, స్వతంత్ర వ్యవహారశైలితో భారత భూభాగాన్ని కాపాడగలిగారు. విదేశీ, దౌత్య వ్యవహారాల్లోనూ నెహ్రూ చెరగని ముద్ర వేశారు. అంతర్జాతీయ స్థాయిలో పాలనను సూచించే ‘వన్ వరల్డ్’ అన్న అంశంపై నెహ్రూ అప్పట్లోనే విస్తృతంగా రాశారు. ఆయన దార్శనికత వల్లే దేశంలో అణు, అంతరిక్ష కార్యక్రమాలు మొదలయ్యాయి. అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా ఐఐటీలు ఎదిగేందుకు, శాస్త్ర పరిశోధనల నెట్ వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఏర్పాటు, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలూ నెహ్రూ ఆలోచనల ఫలాలే. భారతీయులు శాస్త్రీయ ధోరణిని కలిగి ఉండాలని బోధించినదీ ఈయనే. నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’.. భారత చరిత్ర పట్లా, తరతరాలుగా దేశ ప్రాపంచిక దృక్పథాన్ని తీర్చిదిద్దిన తాత్విక, మేధా ప్రవాహాల పట్లా, భారతీయులను ఒక్కటిగా ఉంచుతున్న ఘనమైన సాంస్కృతిక వారసత్వం పట్లా ఆయనకు ఉన్న లోతైన అవగాహనకు సాక్ష్యం. భారతదేశ గొప్ప వైవిధ్యాన్నీ, దాని బహుముఖ సాంస్కృతిక మూర్తిమత్వాన్నీ నెహ్రూ శోభావంతం చేశారు. ఈ అమృతోత్సవాల వేళ నెహ్రూ మిగిల్చివెళ్లిన రాజనీతిజ్ఞ వారసత్వాన్ని తప్పక గుర్తు చేసుకోవాలి. ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. -
స్వతంత్ర భారతి 1964/2022
సరిహద్దు వివాదాలను చైనా బహిరంగ యుద్ధాలుగా మార్చిన సమయం అది. సామ్రాజ్యవాద బాధితులుగా మనం ఐకమత్యంగా ఉండాలని భావించి, ‘హిందీ–చీనీ భాయి భాయి అంటూ.. నెహ్రూ తరచు తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండేవారు. నెహ్రూ తన స్వభావం కొద్దీ ఒక సామ్యవాద దేశం మరొక సామ్యవాద దేశంపై దాడి చెయ్యదని నమ్మారు. అలాగే భారతదేశం అన్నది ఎవరూ చొరబడలేని మంచు గోడలైన హిమాలయాల వెనుక సురక్షితమని భావించారు. అయితే చైనా ఉద్దేశాలు, సైనిక సామర్ధ్యాల ముందు రెండూ కూడా తప్పని తేలాయి. భారత్‌పై చైనా యుద్ధానికి దిగిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారతదేశంలోని అస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్యం బలహీనతను బహిర్గత పరచింది. నెహ్రూ అంతిమయాత్ర భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నెహ్రూ తీవ్ర విమర్శలు ఎదుర్కొని రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్‌ను తొలగించి, యు.ఎస్. సైనిక సహాయాన్ని అర్థించవలసి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా నెహ్రూ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఆరోగ్య సమస్యకు కారణం చైనా దండయాత్ర వలన ఆయన పొందిన అవమానం, చైనా విశ్వాస ఘాతుకంగా అని భావిస్తారు. కశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండెపోటుకు చికిత్స పొందుతూ 1964 మే 27 వేకువ జామున మరణించారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున ఉన్న శాంతివనంలో నెహ్రూ అంత్యక్రియలు నిర్వహించారు. -
స్వతంత్ర భారతి: భారత్-చైనా యుద్ధం
హిందీ చీనీ భాయ్ భాయ్. 1950ల మధ్యలో చైనాతో భారతదేశం చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ నినాదం భారతదేశమంతటా మార్మోగింది. అయితే 1962లో సరిహద్దులో తలెత్తిన ఘర్షణ భారతదేశ ఘోర పరాజయంతో ముగియడంతో ఆ నినాదం హాస్యాస్పదంగా తయారైంది. యుద్ధంలో చైనాతో సంప్రాప్తించిన ఓటమి , అజేయుడని జవహర్లాల్ నెహ్రూకు ఉన్న పేరుకు మచ్చ తెచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకే ఆయన కన్నుమూశారు. సాయుధ దళాలు, అలీన విధానంపై భారతదేశం విధానంలో కూడా అది మార్పును తెచ్చింది. అణ్వాయుధాల కార్యక్రమాన్ని వేగిరపర్చడంతో పాటు, పటిష్టమైన సైన్య నిర్మాణానికి ప్రభుత్వం దండిగా నిధులు సమకూర్చడం ప్రారంభమైంది. అప్పటికీ ఇప్పటికీ అరవై ఏళ్లు గడిచిపోయినా, సరిహద్దు వివాదం ఇంకా భారత–చైనాల మధ్య ఆరని చిచ్చుగానే ఉండిపోయింది. యుద్ధకాలం నాటి ‘టైమ్’ పత్రిక ముఖచిత్రంగా భారత ప్రధాని నెహ్రూ, చైనా నాయకుడు మావో జెడాంగ్ -
చైతన్య భారతి: శక్తివంతమైన నాయకుడు! అతని తర్వాత ఎవరు?
జవహర్లాల్ నెహ్రూ 1889–1964: నెహ్రూ మరణించడానికి ఏడాది ముందు ఒక ప్రముఖ అమెరికన్ పాత్రికేయుడు ‘ఆఫ్టర్ నెహ్రూ, హూ?’ అనే పుస్తకం రాశారు. నిజానికి ఆయన తరువాత పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ప్రపంచమంతటికీ వచ్చిందే. ఆయన మరణించిన దాదాపు నాలుగు దశాబ్దాలకు గానీ, నెహ్రూ భావజాలం దేశంలో చెక్కు చెదరనంత శక్తిమంతమైన నాయకత్వం నెహ్రూది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదటి పదిహేడేళ్లు నెహ్రూయే భారతదేశం, భిన్న ధ్రువాల విచిత్ర సంగమం ఆయన. సదుపాయాల భోగంలో పెరిగిన కులీన కుటుంబీకుడు కష్టజీవుల నిత్య వేదనకు సానుభూతితో స్పందించడం ఆయనలో ఒక చిత్రం. భావోద్వేగాలతో స్పందించే ఆదర్శవాద మేధావి, ఉదాత్తమైన సమతా వాద భావాలకు పట్టం కట్టిన నెహ్రూ... హారో, కేంబ్రిడ్జ్లలో ఆంగ్లోపాసన చేసిన విద్యావేత్త. బ్రిటిష్ జైళ్లలో పదేళ్లకు పైగా కాలం గడిపిన వ్యక్తి కూడా. మహాత్మా గాంధీ నుంచి అనూహ్యంగా ప్రత్యేక ప్రోత్సాహం పొందిన నాయకుడు. భారతదేశానికి నెహ్రూ అందించిన వారసత్వానికి నాలుగు మూల స్తంభాలు : ప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాణం లౌకికవాదం, స్వదేశంలో సమతా వాద ఆర్థిక వ్యవస్థ, విదేశీ విధానంలో అలీన మార్గం. భారతదేశ నైతిక, నాగరిక చరిత్ర మీద ఆధారపడి, ప్రపంచంలో భారతదేశానికి ఒక పాత్రను నెహ్రూ నిర్దేశించారు. దళితులకు, దగా పడిన వారికి గళం కల్పించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఆయన తెచ్చిన ప్రతిష్ట కొన్ని ఏళ్ల పాటు పనికొచ్చింది. కానీ, 1962లో చైనాతో తలెత్తిన యుద్ధం కారణంగా కలిగిన అవమానం అటువంటì ప్రతిష్టకు గల పరిమితులను చాటింది. అధికారంలో సమున్నత స్థాయిలో ఉన్న రోజుల్లో ఆయన ఒక వ్యాసం రాసి, తన పేరు లేకుండా ప్రజల్లోకి వదిలారు. నియంత కావాలనే ప్రేరణలు తనలో కలుగకుండా అడ్డు కట్ట వేయాలని దానిలో ప్రబోధించారు. ‘‘ఆయనను హద్దుల్లో ఉంచాలి. మనం సీజర్లను కోరుకోవడం లేదు’’ అని నెహ్రూ తన గురించి తానే దానిలో రాశారు. తన లోటుపాట్ల వల్ల కానీ, అనుచరుల లోటు పాట్ల వల్ల కానీ ప్రజలలో తన స్థాయి ఏమాత్రం దెబ్బతినని అరుదైన నాయకుడు నెహ్రూ. భారతదేశానికి ఎలాంటి వారసత్వాన్ని అందించాలని మీరు ఆశిస్తున్నారని అమెరికన్ సంపాదకుడు నార్మన్ కజిన్స్ ఒకసారి నెహ్రూను ప్రశ్నించారు. ‘‘నలభై కోట్ల మంది ప్రజలు తమను తాము పరిపాలించుకునే సామర్థ్యం.. ’’ అని నెహ్రూ సమాధానం ఇచ్చారు. – శశి థరూర్ పుస్తకం ‘నెహ్రూ : ది ఇన్వెషన్ ఆఫ్ ఇండియా’ నుంచి (చదవండి: ఘట్టాలు: టాటా గ్రూపు ఆవిర్భావం) -
నెహ్రూ ఫొటో లేకుండా అమృత్ ఉత్సవాలా?
సాక్షి, హైదరాబాద్: చదువురాని ప్రధాని నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను వక్రీకరిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫొటో లేకుండా ఆజాదీకా అమృత్ ఉత్సవాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దేశంకోసం త్యాగాలు చేసిన మహనీయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడ్డా రు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ నెహ్రూ స్థానంలో సావర్కర్ బొమ్మ పెట్టినంత మాత్రాన చరిత్ర మారదన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో నెహ్రూ ఫొటో పెట్టాలని అడగడానికి వెళ్లిన యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు చెందిన 12 మంది నాయకులను పోలీసులు నిర్బంధించడం, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్ష జరిగే రోజే ఉన్న టెట్ పరీక్షను వాయిదా వేయాలని విద్యామంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన మరో 21 మంది ఎన్ఎస్యూఐ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి, యువజన నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు భట్టి తెలిపారు. సామాజిక మార్పునకు కృషి చేసిన మహానేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. -
జిప్మర్లో హిందీ రగడ
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చి)లో పాలనా వ్యవహారాలన్నీ హిందీలోనే జరగాలన్న ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ హిందీ, సంస్కృత భాషలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిప్మర్ ఇచ్చిన హిందీ ఉత్తర్వులపై తమిళాభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా హిందీని రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని డీఎంకే ఎంపీ కనిమొళి హెచ్చరించారు. పుదుచ్చేరిలో బీజేపీ– ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. -
సాక్షి కార్టూన్ 19-02-2022
బయటివాళ్లు మా విషయాల్లో జోక్యం చేసుకుంటే.. ఖబర్దార్! -
నెహ్రూస్ ఇండియా, ఎంపీల నేరచరిత్రపై వ్యాఖ్యలు చేసిన సింగపూర్ పీఎం... తప్పుబట్టిన భారత్!
India has slammed the Singapore Prime Minister's comments: సింగపూర్ పార్లమెంట్లో సిటీ-స్టేట్‌లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించారు. నెహ్రూస్ భారత్‌లో లోక్‌సభలో దాదాపు సగం మంది ఎంపీలపై అత్యాచారం హత్య ఆరోపణలతో సహా క్రిమినల్ అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు వీటిలో చాలా మటుకు రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయని లీ అన్నారు. ఈ వ్యాఖ్యలను సింగపూర్ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఎలా పని చేయాలనే అంశంపై జరిగిన ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా లీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా దేశాలు ఉన్నతమైన ఆదర్శాలు. గొప్ప విలువల ఆధారంగా ఏర్పడినవే కానీ ఆ తర్వాత రానురానూ రాజీకీయ ఆకృతి మారుతోంది. చాలా రాకీయ పార్టీలు తమ వ్యవస్థాపక నాయకులను విస్మరిస్తోంది." అని లీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ ప్రసంగంలో ప్రధాని లీ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో సహా వివిధ ప్రధాన మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..." చాలా దేశాలు మొదట చాలా ఉద్వేగభరితంగా ఏర్పడ్డాయి. డేవిడ్ బెన్-గురియన్లు, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించిన గొప్ప నాయకులు. గొప్ప ధైర్యం అపారమైన సంస్కృతి, అద్భుతమైన సామర్థ్యం కలిగిన అసాధారణ వ్యక్తులు. అంతేకాదు వారు అపారమైన వ్యక్తిగత ప్రతిష్టతో, ధైర్యవంతమైన కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి, దేశంలోని ప్రజల కొత్త భవిష్యత్తును రూపొందించడంలోనూ ప్రజల అంచనాలను అందుకోవడానికి సదా ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రారంభ ఉత్సాహాన్ని తరువాత తరాలకు కొనసాగించడం లేదా నడిపించడంలో విఫలమవ్వడం లేదా కష్టమవుతోంది. అలాగే బెన్-గురియన్స్ ఇజ్రాయెల్ రెండేళ్లలో నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ, కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతోనే సరిపోయిందని, సీనియర్ రాజకీయ నాయకులు అధికారులు నేరారోపణలను ఎదుర్కొన్నారు". అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సింగపూర్‌లో ప్రజాస్వామ్యం ఎలా ? ఉండాలి, ఆ మార్గంలో పయనించకుండా ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మనమేమి గొప్ప తెలివైనవాళ్లం, ధర్మాత్ములం కాదు కాబట్టి తరం వెంబడి తరం వ్యవస్థను పర్యవేక్షించి దాని నిర్మాణాన్ని కొనసాగిస్తే సాధ్యమవుతుందని లీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్ సింగపూర్ ప్రధాని లీ నెహ్రూస్ ఇండియా పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిడమే కాక అనవసరమైన వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. అంతేకాదు విదేశాంగ మంత్రిత్వ శాఖ సింగపూర్ హైకమిషనర్‌ను పిలిపించి తమ అభ్యంతరాన్ని తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్) -
ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీడియా సందేశంలో ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేయాలని కోరారు. ప్రతి సమస్యకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీ పై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందంటూ ఆక్రోసించారు. అంతేకాదు ఆ వీడియోలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నడూ దేశాన్ని విభజించలేదని మోదీకి కౌంటరిచ్చారు. దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యతో ప్రజలు సతమతమవుతుంటే గత ఏడున్నరేళ్లుగా అధికారంలో ఉన ప్రస్తుతం ప్రభుత్వం తమ తప్పులన ఒప్పుకోకుండా ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రూనే కారణమంటూ ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు మీరు మీ స్వంత లోపాలను తగ్గించే క్రమంలో చరిత్రను నిందించలేరంటూ వక్కాణించారు. ప్రపంచం ముందు దేశ ప్రతిష్టను పోగొట్టుకోనివ్వను, అలాగే భారతదేశ గర్వాన్ని నేనెప్పుడూ కించపరచలేదంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తనపై తప్పడు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆ పార్టీకి సంబంధించిన బీ అండ్ సీ టీమ్‌లు గురించి దేశం ముందు బహిర్గతం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. (చదవండి: సర్జికల్ స్ట్రైక్స్, అయోధ్య విషయంలో వారు సంతోషంగా లేరు! ప్రధాని ఆగ్రహం) -
ఆధునిక దేవాలయం: ఆ అపురూప ఘట్టానికి నేటికి 66 ఏళ్లు
Nagarjunasagar Project Marks the 66th Anniversary of The Foundation Stone: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేటితో 66 ఏళ్లు నిండాయి. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్‌లో శంకుస్థాపన చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడి కాలువను జవహర్ కాలువగా, ఎడమ కాలువను లాల్‌బహుదూర్ శాస్త్రి కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ ఆనకట్ట కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను 10 అక్టోబర్ 1956న అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. ఇది దక్షిణ విజయపురి (రైట్ బ్యాంకు) వద్ద సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల 74వేల 874 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. రిజర్వాయర్ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే లాల్‌బహుదూర్ శాస్త్రి కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగమార్గం ద్వారా ప్రయాణిస్తుంది. దీని నిర్మాణాన్ని 1959లో ఆనాటి గవర్నర్ భీమ్సేన్ సచార్ ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349 కిలోమీటర్లు. దీని కింద 10లక్షల 37వేల 796 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. రెండు కాలువలకు 132 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు ఈ రెండు కాలువలకు నీటిని విడుదల చేయవచ్చు. 4 ఆగస్టు 1967న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు మొట్టమొదటిసారి నీటిని వదిలారు. లక్ష్యానికి దూరంగా.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. సిమెంట్‌తో నిర్మించిన కాలువలు కాలక్రమేణా దెబ్బతినడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రపంచ బ్యాంకు రుణంతో చిట్టచివరి ఎకరం వరకు నీరందాలనే ఉద్ధేశంతో సాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. అయినా ఇప్పటికీ చివరి భూములకు నీరందని కాల్వలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడికతో రెండు పంటలకు అందని నీరు.. నాగార్జునసాగర్ జలాశయంతో పాటు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయంలో పూడిక చేరడంతో ఒకసారి నిండితే రెండు పంటలకు నీరు సరిపోవడం లేదు. అంతేకాకుండా ప్రాజెక్టు నిండిన సమయంలో అధికారులు సరైన ప్రణాళికలు తయారుచేయకపోవడంతో నీటి విడుదల ఆలస్యమై దుబారా అధికమవుతుంది. ఇప్పటికీ ఏ తూము ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు సాగవుతుందనే సమాచారం అధికారుల వద్ద లేదు. ఆయా తూముల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదు. జలాశయంలోకి పూడిక చేరకుండా చూసి కాలువల స్థానంలో పైపులైన్లు అమర్చితే మరికొన్ని భూములకు సాగునీరందే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. తూములన్నింటికీ షట్టర్లు బిగించాలి.. ప్రధాన కాల్వకు ఉన్న మేజర్ల దగ్గరి నుంచి ప్రతి పంట కాల్వకు షట్టర్లు బిగించాలి. పంటల అవసరాన్ని బట్టి రైతులు నీటిని వినియోగించుకునేలా తూములు డిజైన్ చేయాలని రైతులు కోరుతున్నారు. మేజర్ల దగ్గరి నుంచి పంట కాల్వల వరకు ఏ తూముకు ఏ నెలలో ఎంత నీటిని విడుదల చేస్తే ఎంత భూమి సాగవుతుందనే విషయాన్ని బోర్డుల ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు. సాగర్ జలాశయం విస్తీర్ణం– 110 చదరపు మైళ్లు గరిష్ట నీటిమట్టం – 590 అడుగులు డెడ్ స్టోరేజీ లెవల్ – 490 అడుగులు నీటి నిల్వ సామర్ధ్యం – 408.24 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 312 టీఎంసీలు) నీటి నిల్వ డెడ్ స్టోరేజీ – 179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు) నీటి విడుదలకు ఉండాల్సిన కనీస నీటిమట్టం 510 అడుగులు -
ఆ వారసత్వం నేటికీ రేపటికీ అవసరమే!
స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఒక సంక్లిష్టమైన, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులతో కూడిన దేశ వ్యవహారాలను నెహ్రూ దార్శనికతతో చక్కబెట్టారు. విదేశీ వ్యవహారాలు, దౌత్యాల విషయంలోనూ నెహ్రూ చెరగని ముద్ర వేశారు. దేశాన్ని ఆధునికీకరణ బాట పట్టించడంలో నెహ్రూదే ప్రధాన పాత్ర. భారతదేశ గొప్ప వైవిధ్యాన్నీ, దాని బహుముఖ సాంస్కృతిక మూర్తిమత్వాన్నీ నెహ్రూ శోభావంతం చేశారు. జాతీయ ఐక్యత కోణంలో విభిన్న అస్తిత్వాల మధ్య ఉండాల్సిన సయోధ్య అవసరాన్ని గుర్తించారు. సమాజ ఉపరితలంలో పాతుకుపోయి ఉన్న ఒంటెద్దుపోకడలు, ఛాందసవాదుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించడంలో లౌకికవాదం ప్రాధాన్యాన్ని నెహ్రూ అర్థం చేసుకున్నారు. ఆ స్ఫూర్తిని చివరిదాకా కొనసాగించారు. ఈ దేశ నిర్మాణం, ఘనమైన ప్రజాస్వామ్య విధానాల్లో ఆయన పాత్ర ఎనలేనిది. ప్రపంచంలో భారత వాణికి ఒక విలువ ఉందంటే అది నెహ్రూ పుణ్యమే! ఈ వారసత్వాన్ని స్మరించుకోవడం, స్ఫూర్తిని పెంపొందించుకోవడం ఈ తరానికే కాదు... భవిష్యత్ తరాలకూ చాలా అవసరం. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 132వ జయంతిని ఈ నెల 14న ‘పాటించాం’. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే నెహ్రూ జయంతి ఉత్సవాలేవీ జరగలేదు. ఈ దేశ నిర్మాణం, ఘనమైన ప్రజాస్వామ్య విధానాల్లో ఆయన పాత్ర ఎనలేనిది. ప్రపంచం మొత్తంమీద భారత్ వాణికి ఒక విలువ ఉందంటే అది నెహ్రూ పుణ్యమే. ఈ వారసత్వాన్ని సదా స్మరించుకోవడం, స్ఫూర్తిని పెంపొం దించుకోవడం ఈ తరానికే కాదు.. భవిష్యత్తు తరాలకు కూడా చాలా అవసరం. నెహ్రూ నాయకత్వంలో లోపాలు లేవా? కచ్చితంగా ఉన్నాయి. ఆ లోటుపాట్ల తాలూకూ పరిణామాలు చాలాకాలంపాటు పీడించాయి కూడా. కశ్మీర్ అంశాన్ని నెహ్రూ సక్రమంగా చేపట్టలేదని, 1962 చైనా చొరబాట్లలోనూ ఆయన వైఫల్యం ఉందని నేను తప్పు పట్టగలను. అయితే ఈ అంశాలన్నింటినీ హ్రస్వదృష్టితో చూడటం కంటే.. ఆ కాలపు సమయం, సందర్భం, పరిస్థితి వంటి అన్ని అంశాలనూ విశ్లేషించి మరీ చూడటం ముఖ్యం. స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశం ఎంతటి విచిత్ర పరిస్థితుల్లో ఉండిందో మనం అర్థం చేసుకోలేం. మత ప్రాతిపదికన దేశ విభజన, ఆ తరువాత చెలరేగిన అమానవీయ ఘర్షణలు, కొత్తగా గీసుకున్న సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో ప్రజల రాకపోకలు... 500 రాజాస్థానాలను ఒక్క ఛత్రం కిందకు తేవాల్సిన అవసరం.. వెరసి గందరగోళం! ఇదంతా సమసిపోతోందని అనుకునేలోపే జమ్మూ కశ్మీర్ వైపు నుంచి పాకిస్తాన్‌తో యుద్ధం ఒకటి ముంచుకొచ్చింది. ఆ తరువాతైనా పరిస్థితులు చక్కబడ్డాయా? అంటే సైద్ధాంతిక విభేదాలున్న రెండు ప్రబల శక్తుల మధ్య రణం అణు ముప్పు ఛాయల్లో కొనసాగుతూనే వచ్చింది. తిరుగులేని దార్శనికుడు... ఈ సంక్లిష్ట, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులతో కూడిన వ్యవహారాలను నెహ్రూ దార్శనికతతో చక్కబెట్టడమే కాదు, తన నాయకత్వ లక్షణాలు, స్వతంత్య్ర వ్యవహారశైలితో భారత భూభాగాన్ని కాపాడగలిగారు. విదేశీ, దౌత్య వ్యవహారాల్లోనూ నెహ్రూ చెరగని ముద్ర వేశారు. నెహ్రూది జాతీయవాది మాత్రమే కాదు.. అంతర్జాతీయవాది, మానవతావాది కూడా. తన సమకాలీనులందరికంటే ఎంతో ముందుచూపు, విషయ అవగాహన ఆయన సొంతం. అణ్వస్త్ర ప్రమాదం సరిహద్దులను అప్రస్తుతంగా మార్చగలదన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. దేశాంతర, ఖండాంతర ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రయత్నాలే మేలని, దేశాల మధ్య బహుముఖ సహకారం అవసరమనీ నెహ్రూ ఎప్పుడో గుర్తించారు. అంతర్జాతీయ స్థాయిలో పాలనను సూచించే ‘వన్ వరల్డ్’ అన్న అంశంపై నెహ్రూ అప్పట్లోనే విస్తృతంగా రాశారు. దేశ, ప్రాంత సరిహద్దులను దాటిపోయి మరీ వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ అంతర్జాతీయ స్థాయి పాలనకు ప్రత్యామ్నాయం లేదని ఆయన వాదించేవారు. టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నెహ్రూ ఆలోచనలు ఎంతైనా ఆచరణ సాధ్యమైనవనడంలో సందేహం లేదు. దేశాన్ని ఆధునికీకరణ బాట పట్టించడంలో నెహ్రూదే ప్రధాన పాత్ర. ఆయన దార్శనికత వల్లే దేశంలో అణు. అంతరిక్ష కార్యక్రమాలు మొదలయ్యాయి. అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా ఐఐటీలు ఎదిగేందుకు , శాస్త్ర పరిశోధనల నెట్ వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఏర్పాటు, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలూ నెహ్రూ ఆలోచనల ఫలాలే. భారతీయులు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని బోధించినదీ ఈయనే. అయితే ప్రాథమిక, సెకండరీ విద్యా వ్యవస్థల్లో లోటుపాట్ల ఫలితంగా ఆధునికీకరణ వైపు మన ప్రయాణానికి ప్రతిబంధకంగా మారాయి. అసలైన భారతీయుడు నెహ్రూను ఎక్కువ ఆంగ్లేయుడు, తక్కువ భారతీయుడు అనుకుం టారు. అయినప్పటికీ ఆయన రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’... భారత చరిత్ర పట్లా, తరతరాలుగా దేశ ప్రాపంచిక దృక్పథాన్ని తీర్చిదిద్దిన తాత్విక, మేధా ప్రవాహాల పట్లా, భారతీయులను ఒక్కటిగా ఉంచుతున్న ఘనమైన సాంస్కృతిక వారసత్వం పట్లా ఆయనకు ఉన్న లోతైన అవగాహనకు సాక్ష్యం. కళలు, హస్తకళల్లో భారతదేశ ఘనమైన వారసత్వం... వాటికి సంబంధించి జనాల్లో ఉన్న సౌందర్య సున్నితత్వం ఆయన్ని ముగ్ధుడిని చేయడంతో వాటి పునరుద్ధరణకు కృషి చేశారు. భారతదేశ గొప్ప వైవిధ్యాన్నీ, దాని బహుముఖ సాంస్కృతిక మూర్తిమత్వాన్నీ నెహ్రూ శోభావంతం చేశారు. అదే సమయంలో జాతీయ ఐక్యత కోణంలో విభిన్న అస్తిత్వాల మధ్య ఉండాల్సిన సయోధ్య అవసరాన్ని గుర్తించారు. అందువల్లే భారతీయులు ఆదరించే విభిన్న అస్తిత్వాలను భారత రాజ్యాంగం అణిచివేయాలని చూడదు. కానీ వాటిని ప్రతి వ్యక్తికీ హక్కులు, స్వేచ్ఛ ఉండేలా భాగస్వామ్యపూరిత, సమాన పౌరసత్వంలోకి అధిగమించమని కోరుతుంది. మతపరమైన ఆచారాలు, అలవాట్లతో సంబంధాన్ని ప్రభుత్వం ఉంచుకోకూడదనే లౌకికవాద భావనకు ఇది పునాది వంటిది. బహుళ సాంస్కృతిక, బహుళ మత ప్రాతిపదిక కలిగిన దేశం లౌకిక రాజ్యంగా తప్ప మరేవిధంగానూ ఉండదు. సమాన పౌరసత్వ సూత్రాన్ని ఎత్తిపట్టాలంటే ఇది తప్పనిసరి. సమాజ ఉపరితలంలో పాతుకుపోయి ఉన్న ఒంటెద్దుపోకడలు, మతోన్మాదుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించడంలో లౌకికవాదం ప్రాధాన్యాన్ని నెహ్రూ అర్థం చేసుకోవడమే కాకుండా ఆ స్ఫూర్తిని కలిగి వుంటూనే ఆచరించారు. లౌకిక విధానం నుంచి రాజ్యం వేరుపడితే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో మనం చూస్తూ ఉన్నాం. హిందూ–ముస్లిం విభజనపై జాతీయ ఐక్యతను సాధించలేం. భారతీయ గతం నుంచి ఈ గుణపాఠాన్ని మర్చిపోవడం ప్రమాదహేతువు. నెహ్రూ ఒక ఆధునిక నేత. కానీ భారతీయ నాగరికతా వారసత్వంతో ఆయన పూర్తిగా మమేకమయ్యారు. తన డిస్కవరీ ఆఫ్ ఇండియా రచనలో తన ప్రియమైన దేశం గురించి ఘనంగా ప్రశంసించారు. అదే సమయంలో దాని నాగరికతా గుణాలపట్ల చక్కటి అవగాహనను కూడా ప్రదర్శించారు. ‘‘భారతదేశం తన దారిద్య్రం, అథఃపతనాలతోపాటు, మహోన్నత గుణాన్ని కలిగి ఉంది. ప్రాచీన సంప్రదాయాలకు, విపత్కర స్థితికి సంబంధించిన అధిక బరువును మోస్తూనే భారత మాత నేత్రాలు అలిసిపోయి కనబడుతున్నాయి. కణం కణంగా పోగు చేసుకున్న తన రక్తమాంసాలతో, వినూత్న ఆలోచనలతో, అద్భుతమైన స్వప్నాలతో, దివ్యమైన ఆనురక్తులతో ఒక నిసర్గసౌందర్యంతో భారత్ అలరారుతోంది. బయటా లోపలా దాడులతో భారత మాత శరీరం చీలికలైపోయినప్పటికీ, దాని మహోన్నతమైన ఆత్మిక సౌందర్యాన్ని మనం చూడవచ్చు. యుగాలుగా దేశం ప్రయాణం సాగించి ఆ మార్గంలో ఎంతో విజ్ఞానాన్ని పోగు చేసుకున్న క్రమంలో ఎంతోమంది విదేశీయులను ఆహ్వానించి తన పెద్ద కుటుంబంలో కలుపుకుంది. ఈ క్రమంలో అనేక ఉజ్వలమైన క్షణాలను, మహా పతనానికి కూడా సాక్షీభూతమై నిలిచింది. అనేక అవమానాలకు గురైంది. అంతులేని విషాదాల బారినపడింది. తన సుదీర్ఘ ప్రయాణంలో మర్చిపోలేని సంస్కృతిని అంటిపెట్టుకుంటూనే, దాన్నుంచి శక్తిని కూడగట్టుకుని ఇతర భూభాగాలతో పంచుకుంది కూడా.’’ భారతదేశ ఆత్మను నిజంగా అర్థం చేసుకుని, తన జీవిత పర్యంతం దానికి సేవ చేస్తూ వచ్చిన మరో భారతీయ నేత నా ఆలోచనల్లో కూడా లేడు. ఈ రోజు మనం చూస్తున్న అల్పబుద్ధుల, నీచమైన దురభిమానం కాకుండా... ప్రజల నిజమైన జాతీయవాదాన్ని తీర్చిదిద్దిన భారతీయ విస్తృతాత్మ ఇది మాత్రమే. – శ్యామ్ శరణ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి -
అవమానించడం కాదు! అనుసరిద్దాం!!
జీవిత కాలమంతా బాలలు, యువకుల పట్ల పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ఆసక్తీ, అభిరుచీ ఉండేవి. వారి సంక్షేమానికి, విద్యావ్యాప్తికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి, చేపట్టిన విధానాల గుర్తింపుగా ఆయన జన్మదినమైన నవం బర్ 14ను బాలల దినోత్సవంగా జరుపు కుంటున్నాము. దేశాభివృద్ధికి, భావి తరాల బాగుకు నెహ్రూ ప్రదర్శించిన దార్శనికత, రాజనీతిజ్ఞతలను ఈ తరం విద్యార్థులు, యువకులు తెలుసుకోవాలి. జవహర్ లాల్ నెహ్రూ దార్శనికుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రపంచజ్ఞాన అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. అంతే కాకుండా ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను గొప్ప నాయకుల కంటే మెరుగ్గా పాటించినవాడు. ‘‘భారత స్వాతంత్య్ర, ప్రజాస్వామ్య సూర్యుడు అస్తమించరాదు. మన ఆశలు మోసానికి గురికారాదు. ఏ మతస్థులమైనా మనమంతా సమాన హక్కులు, అధికారాలు, బాధ్యతలు గల భారతీయులం. మనం మత తత్వాన్ని, సంకుచిత స్వభావాలను ప్రోత్సహించరాదు.’’ ఇది భారత్ భవిష్యత్తు నిర్మాణంపై నెహ్రూ దార్శనిక ప్రకటన. నెహ్రూ మీద బురదజల్లే ప్రయత్నాలు నేడు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి నేటి దేశ నాయకుల స్థాయిలో ఉన్నవారే నెహ్రూను అవమానిస్తున్నారు. వారి భక్తులు సిగరెట్ తాగుతున్న, స్త్రీల ప్రక్కన కూర్చున్న (సందర్భాన్ని ప్రస్తా వించకుండా) ఆయన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను సామా జిక మాధ్యమాల్లో ఉంచి దుష్ప్రచారం చేశారు, చేస్తున్నారు. చరిత్ర చదవని విద్యార్థులు, యువకులు వాటిని ఉపయోగించి నెహ్రూ వ్యక్తిత్వంపై అవాంఛనీయ వ్యాఖ్యానాలు చేశారు. 1905 లో నెహ్రూ ఇంగ్లండ్ ‘హారొ’ నగరంలో పేరుగాంచిన పాఠశాలలో విద్య అభ్యసించారు. ఆ పాఠశాలలో సాధించిన విద్యా ప్రావీణ్యతలకు గానూ నెహ్రూకు ప్రఖ్యాత ఆంగ్ల చరిత్ర కారుడు జార్జ్ మెకాన్లె ట్రెవెల్యాన్ రచించిన ‘గారిబాల్డి‘ పుస్తకా లను బహూకరించారు. గారిబాల్డి ఇటలీ సైన్యాధికారి, రాజకీయ నేత. ఇటలీ జాతిపితలలో ఒకరిగా పేరొందారు. నెహ్రూ ఈ పుస్త కాలను క్షుణ్ణంగా చదివారు. ఆయన దృష్టిలో గారిబాల్డి ఒక విప్లవ వీరుడు. ఆయన జీవితం నుంచే నెహ్రూ భారత స్వాతంత్ర పోరా టానికి స్ఫూర్తి పొందారు. తర్వాత నెహ్రూ 1907 అక్టోబర్‌లో కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటి కాలేజీలో చేరారు. 1910లో జీవశాస్త్రంలో ఆనర్స్ పట్టా పొందారు. తన పాఠ్యాంశాలతో సంబంధం లేక పోయినా రాజకీయ, ఆర్థిక, సామాజిక శాస్త్రాలను, చరిత్ర, సాహి త్యాలను అధ్యయనం చేశారు. ప్రఖ్యాత ఆంగ్ల కవులు, రచయి తలైన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, జె.ఎమ్. కీన్స్, బెర్ ట్రాండ్ రస్సెల్, లొజెస్ డికెన్సన్, మెరెడిత్ టౌన్ సెండ్ల రచనలు నెహ్రూ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చాయి. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో (1942) కారాగార నిర్భంధవాసం గడుపుతున్న సమయంలో కూడా నెహ్రూ వివిధ దేశాల చరిత్రలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలకు సంబం ధించిన 55 పుస్తకాలను అధ్యయనం చేసి విశేష పరిజ్ఞానాన్ని సంపాదించారు. పాఠ్యాంశాలను కూడా సరిగా చదవని విద్యా ర్థులు, ఏమీ అధ్యయనం చేయకుండా అవాకులు చవాకులు వాగే రాజకీయ నేతలు గ్రంథ పఠన ప్రాముఖ్యతను గురించి నెహ్రూ నుండి నేర్చుకోవాలి. పాఠ్యపుస్తకాలకు మించి సామాజిక శాస్త్రా లను జీవితాంతం అధ్యయనం చేయాలని, అప్పుడే సంపూర్ణ అవగాహన, సామాజిక స్పృహ కలుగు తాయని గుర్తించాలి. భారత ప్రప్రథమ ప్రధానిగా నెహ్రూ ప్రగతిశీల సామాజిక విధానాలను అమలుచేశారు. బాలలకు, యువకులకు సమర్థ, ప్రతిభా నైపుణ్యతల విద్యను అందించాలని కోరుకున్నారు. భవి ష్యత్ భారత ప్రగతికి ఇది ముఖ్యమని భావించారు. అందుకోసం ప్రపంచ స్థాయి విద్యాసంస్థలైన అఖిల భారత వైద్య సేవల సంస్థ, భారతీయ సాంకేతిక సంస్థలు (ఐఐటీలు), భారతీయ నిర్వహణ సంస్థలు(ఐఐఎమ్‌లు), సాంకేతిక జాతీయ సంస్థలు (ఎన్ఐటీలు) స్థాపించారు. సోవియట్ యూనియన్ బాటలో పంచవర్ష ప్రణాళి కల ద్వారా బాలలందరికి ఉచిత, నిర్భంధ ప్రాథమిక విద్యను అందజేసే విధానాలను రూపొందించారు. దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో మూకుమ్మడి పాఠశాల విద్యార్థుల నమోదు పథకా లను ప్రవేశపెట్టారు. వేల సంఖ్యలో పాఠశాలలు స్థాపించారు. పోషకాహార లోపం నుండి పిల్లలను రక్షించడానికి ఉచిత పాల, భోజన సదుపాయాలు కల్పించారు. దేశమంతా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దల కోసం వయోజన విద్యాకేంద్రాలను, వృత్తి, సాంకేతిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ప్రజా స్వామ్యం, సామ్యవాదం, ఐక్యత, లౌకికత్వం నెహ్రూ స్వదేశీ సూత్ర మూలస్తంభాలు. భారతదేశాన్ని లౌకికదేశంగా ప్రకటిం చారు. సామ్యవాద సమాజ స్థాపన లక్ష్యంగా నిర్దేశించారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, టువర్డ్స్ ఫ్రీడం (ఆత్మ కథ) లాంటి పుస్తకాలను నెహ్రూ రచిం చారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ జిల్లాలోని ముస్సోరి బోర్డింగ్ పాఠశాలలో చదువుతూ ఉండిన పదేళ్ళ కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి 30 ఉత్తరాలు రాశారు. ఈ ఉత్తరాలలో బాగా చదవమని, ఫస్ట్ మార్కులు తెచ్చుకోమని రాయలేదు. దేశాల చరిత్రలు, ప్రపంచ ప్రజల నాగరికతలను వివరించారు. ఈ ఉత్త రాలను ‘తండ్రి నుంచి తనయకు ఉత్తరాలు’ అన్న శీర్షికతో పుస్త కంగా అచ్చువేశారు. తమ జ్ఞానాన్ని భావి తరాలకు అందజేసి విజ్ఞానంగా మార్చాలి. లేకపోతే మన సమాచార సంపదకు సార్థకత శూన్యం. నేడు నెహ్రూకు పూర్తి విరుద్ధ భావాలున్న నేతలు దేశాధినేతలయ్యారు. ఎంత గొప్పవారయినా తప్పులు చేయని, మచ్చలు లేని మానవులుండరు. పనిచేసే వారిలో పొర పాట్లు, తప్పులు సహజం. అయినా ఎదుటివారు ఏ పక్షం అన్న పట్టింపులు మాని, వారినుండి మంచిని గ్రహించి, చెడును వది లేయాలి. వెలుగులను మరిచి మచ్చలనే వెదికితే మన భవిష్యత్తు కూడా మచ్చలమయం కాకతప్పదు. వ్యాసకర్త: సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ మొబైల్ : 94902 04545 (నేడు బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి) -
మన ఆర్థిక ప్రస్థానం.. బ్రిటిష్ రాజ్... లైసెన్స్ రాజ్.. డిజిటల్ రాజ్!
17వ శతాబ్దం ఆరంభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 22.6 శాతం. అంటే దాదాపు యూరప్ మొత్తం వాటా (23%)తో సమానం. 1952 నాటికి మన వాటా 3.8 శాతానికి పడిపోయింది. కేంబ్రిడ్జ్ చరిత్రకారుడు ఆంగస్ మాడిసన్ వెల్లడించిన ఈ అంచనాలు చాలు... బ్రిటిష్ పాలనలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా కుదేలయిందో చెప్పడానికి! బ్రిటిష్ పాలకులు భారత్‌లో పారిశ్రామికీకరణను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో స్వాంత్రంత్య్రం పొందే నాటికి దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు 74 ఏళ్ల తర్వాత, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. కడు పేదరికం నుంచి డిజిటల్ ఆర్థిక శక్తిగా ఎదగడంలో మన ఆర్థిక విధానాలు పోషించిన పాత్ర, మన ఆర్థికరంగంలో చోటు చేసుకున్న కీలక మార్పులపై 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఒక సింహావలోకనం. నెహ్రూ.. సర్వం ప్రభుత్వం చెప్పుచేతల్లోనే! స్వాతంత్య్రం వచ్చాక అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చికిత్స ప్రారంభించారు. స్వావలంబనతో కూడిన ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, దారిద్య్ర నిర్మూలన లక్ష్యాలతో సోషలిజం ఛాయలతో కూడిన అభివృద్ధి విధానాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వమే ఒక ఎంట్రప్రెన్యూర్‌గా వ్యవహరించేలా 1948లో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధాన తీర్మానం దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రైవేటు కంపెనీలను పూర్తిగా ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంచుకునేలా విధానాలను రూపొందించారు. దేశంలో లైసెన్స్ రాజ్‌కు ఇక్కడే బీజం పడింది. ఉక్కు, మైనింగ్, యంత్ర పరికరాలు, టెలికం, బీమా, విద్యుత్ తదితర కీలక పరిశ్రమల్లో ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగింది. అప్పటి సోవియెట్ యూనియన్ విధానాల ప్రభావంతో పంచ వర్ష ప్రణాళికలకు రూపకల్పన చేసిన నెహ్రూ సర్కారు... మొత్తం ప్రభుత్వ ప్రణాళికలను పర్యవేక్షించడం కోసం 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 1951లో భారత్ మొట్టమొదటి పంచ వర్ష ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై ఈ ఐదేళ్లూ దృష్టి సారించారు. అధిక మొత్తంలో పొదుపులు, పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధించేలా పాలసీలను రూపొందించారు. ఈ తొలి పంచవర్ష ప్రణాళిక మంచి ఫలితాలనే అందించింది. 2.1 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాలను అధిగమించి 3.6 శాతం వృద్ధి సాకారమైంది. లైసెన్స్ రాజ్... 1956 నాటి రెండో పంచవర్ష ప్రణాళిక దేశంలో ప్రభుత్వ రంగ కంపెనీల జోరుకు బాటలు వేయడంతో పాటు లైసెన్స్ రాజ్ ఆవిర్భావానికి కారణమైంది. భారత్‌లో పరిశ్రమలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి, రెండవ గ్రూపుల్లో ప్రధానమైన, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న కంపెనీలను పూర్తిగా ప్రభుత్వ రంగంలో చేర్చారు. ఇక మూడో గ్రూపులో కన్జూమర్ పరిశ్రమలను చేర్చి, వాటిని ప్రైవేటు రంగానికి వదిలేశారు. అయితే, లైసెన్సుల జారీ వ్యవస్థ ద్వారా ప్రైవేటు రంగంపై ప్రభుత్వం పూర్తి పెత్తనం చలాయించేలా విధానాలను రూపొందించడంతో అన్నింటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొని, అధికారుల జోక్యం మితిమీరి, విపరీతమైన అవినీతికి దారితీసింది. భాక్రా–నంగల్ టు భిలాయ్... భారతదేశ ఆధునిక దేవాలయాలు ప్రభుత్వ ప్రణాళికల్లో విద్యుత్, ఉక్కు రంగాలను కీలకమైనవిగా నెహ్రూ భావించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సట్లెజ్ నదిపై నిర్మించిన భాక్రా బహుళార్థసాధక ప్రాజెక్టును పునరుజ్జీవ భారతదేశంలో కొత్త దేవాలయంగా ఆయన అభివర్ణించారు. భాక్రా–నంగల్తో పాటు అనేక జల విద్యుత్ ప్రాజెక్టులు దేశంలో లక్షలాది ఇళ్లలో వెలుగులు నింపాయి, అనేక ఫ్యాక్టరీలను నడిపించాయి, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించాయి. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో 60 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో, జర్మనీ సహకారంతో రూర్కెలా స్టీల్ ప్లాంట్.. రష్యా, బ్రిటన్ ఆధ్వర్యంలో భిలాయ్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), అణు ఇంధన కమిషన్ వంటి ఎన్నో ‘ఆధునిక దేవాలయాలు’ నెహ్రూ హయాంలోనే పురుడు పోసుకున్నాయి. నెహ్రూ తదనంతరం ప్రధాని పగ్గాలు చేపట్టిన లాల్‌బహదూర్ శాస్త్రి హయాంలోనే ఆహార ధాన్యాలు, డెయిరీ రంగంలో స్వయం సమృద్ధికి దోహదం చేసిన హరిత విప్లవం, క్షీర విప్లవం చోటు చేసుకున్నాయి. ఇందిర హయాం... బ్యాంకుల జాతీయీకరణ నెహ్రూ, శాస్త్రి వెనువెంటనే మరణించడం... దేశంలో రాజకీయ అస్థిరతకు దారితీసింది. విదేశీ మారక నిల్వలు అడుగంటడం.. చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో 1966 జూన్ 6న ప్రధాని ఇందిరా గాంధీ డాలరుతో రూపాయి మారకం విలువను ఏకంగా 57 శాతం తగ్గించి 4.76 నుంచి 7.50కు తీసుకొచ్చేశారు. దీనివల్ల ఎగుమతులకు ఊతం లభించినా, దేశంలో ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వ్యవసాయ రుణాలను పెంచడమే లక్ష్యంగా 1969 జూలై 20న దేశంలోని 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. అయితే, ప్రభుత్వ బ్యాంకుల కార్యకలాపాల్లో తీవ్ర రాజకీయ జోక్యం క్రోనీ క్యాపిటలిజానికి దారితీసి, విపరీతంగా మొండిబాకీలు పెరిగిపోయేందుకు కారణమైంది. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిర... 1977 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. డీమానిటైజేషన్ 1.0 1977లో అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశాయ్ సారథ్యంలోని జనతాపార్టీ.. నల్లధనానికి అడ్డుకట్టవేయడం కోసం రూ.1,000, రూ.5,000, రూ.10,000 బ్యాంకు నోట్లను రద్దు చేసింది. అప్పటి పరిశ్రమల మంత్రి జార్జి ఫెర్నాండెజ్... విదేశీ కంపెనీలపై కొరడా ఝుళిపించడంతో బహుళజాతి కంపెనీలైన ఐబీఎం, కోకాకోలా ఇక్కణ్ణుంచి దుకాణం సర్దేశాయి. రాజీవ్పాలన... ఐటీ, టెలికం విప్లవానికి నాంది 1984 అక్టోబర్‌లో ఇందిర హత్యతో 40 ఏళ్ల వయస్సులో యువ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీ... ప్రత్యక్ష పన్నుల తగ్గింపు, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితుల పెంపు వంటి పలు సంస్కరణలు చేపట్టారు. అంతేకాదు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టెలికం విప్లవాలకు నాంది పలికిన ఘనత కూడా రాజీవ్‌కే దక్కుతుంది. పీవీ సంస్కరణల హీరో... 1991లో భారత్ చెల్లింపుల సంక్షోభంతో దివాలా అంచున నిలబడింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌లు బంగారాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రుణాలు తీసుకొని దేశాన్ని గండం నుంచి గట్టెక్కించారు. లైసెన్స్ రాజ్‌కు అంతంతో పాటు మన ఎకానమీని మలుపు తిప్పిన విప్లవాత్మకమైన సంస్కరణలు, సరళీకరణకు తెర తీశారు. దీంతో భారత్‌కు విదేశీ కంపెనీలు క్యూ కట్టి, భారీగా ఉద్యోగాలకు దోహదం చేసింది. వాజ్‌పేయి... ప్రైవేటీకరణకు సై నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున ప్రధాని పగ్గాలు చేపట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ సంస్కరణలు జోరందుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారాలు తెరిచి.. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్ఎన్ఎల్), బాల్కో, హిందుస్థాన్ జింక్ తదితర కంపెనీలను విక్రయించారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల రూపురేఖల మార్చివేత వాజ్‌పేయి ఘనతే. జీడీపీ వృద్ధి ‘మన్మోహనం’ 1991లో ఆర్థిక మంత్రిగా సత్తా చూపిన మన్మోహన్ సింగ్... అనూహ్యంగా 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వ సారథిగా ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వంటి పలు సామాజికాభివృద్ధి పథకాలకు మన్మోహన్ సర్కారు బీజం వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల్లో 5–20 శాతం వరకు వాటాలను విక్రయిచడం ద్వారా ఈ పథకాలకు నిధులను సమకూర్చుకోగలిగారు. పదేళ్ల మన్మోహన్ పాలనలోనే భారత్ అత్యధిక జీడీపీ వృద్ధి రేటును (8–9 శాతం) సాధించింది. అయితే, 2008లో చోటుచేసుకున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ వృద్ధి పడకేసింది. అంతేకాదు, కార్పొరేట్లకు ఎడాపెడా ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారడంతో పాటు, 2జీ, కోల్ గేట్ వంటి పలు కుంభకోణాలు మన్మోహన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేశాయి. నోట్ల రద్దుతో మోదీ షాక్... 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ పాలనలో దేశ ప్రజలు అనేక విప్లవాత్మకమైన సంస్కరణలతో పాటు తీవ్రమైన షాక్‌లను కూడా చవిచూశారు. 2016 నవంబర్ 8న రాత్రికి రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి దేశంలో అతిపెద్ద డీమానిటైజేషన్‌ను ప్రకటించడం ద్వారా మోదీ షాకిచ్చారు. దేశంలో తొలిసారి రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రజలు పడరాని పాట్లు పడినా, దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పడింది. మరోపక్క, దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకునే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తీసుకొచ్చి సంస్కరణలను కొత్తపుంతలు తొక్కించారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. దివాలా చట్టం (ఐబీసీ)తో మొండిబాకీల సమస్యకు కొంతమేర పరిష్కారం చూపారు. మరోపక్క, మోదీ సర్కారు 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ కంపెనీల ప్రైవేటీకరణను వేగవంతం చేశారు. ఎల్ఐసీలో వాటానూ అమ్మకానికి పెట్టారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కొత్త ఆలోచనలతో విద్యా, ఉద్యోగావకాశాల సృష్టిలో మోదీ సఫలం అయ్యారనే చెప్పొచ్చు. మోదీ హయాంలోనే భారత్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సవాళ్లు ఉన్నా... ఉజ్వల భవిష్యత్తు నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, బ్యాంకుల్లో మొండిబాకీల దెబ్బతో మందగించిన మన ఎకానమీపై.. కరోనా పంజా విసిరింది. దేశవ్యాప్త లాక్డౌన్ ఫలితంగా 2020–21 జూన్ త్రైమాసికంలో జీడీపీ 24.4 శాతం కుప్పకూలింది. భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే అత్యంత ఘోరమైన క్షీణతను చవిచూసింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా, ఎకానమీ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరినా... ప్రజల్లో ఆర్థిక అసమానతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తలసరి ఆదాయంలో మన పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా మనల్ని అధిగమించింది (2,227 డాలర్లు). ప్రస్తుతం 2100 డాలర్లతో తలసరి ఆదాయం విషయంలో ప్రపంచ దేశాల్లో మన ర్యాంక్ 144 స్థాయిలో అట్టడుగున ఉంది. అయితే, దేశ జనాభాలో 35 ఏళ్ల వయస్సు లోపు వారు 65 శాతం ఉండటం.. యువ భారత్ భవిష్యత్తుకు ఢోకా లేదనే నమ్మకాన్ని పెంచుతోంది. వచ్చే రెండు దశాబ్దాల పాటు ఏటా 12 లక్షల మంది కార్మిక శక్తి దేశానికి జతవుతుందని... 2030 నాటికి పని చేసే జనాభా (15–60 ఏళ్ల వయస్సు) 100 కోట్లకు చేరుతుందనేది పీడబ్ల్యూసీ తాజా అంచనా. ఇదే గనుక జరిగితే దేశంలో ఆర్థిక అసమానతలు దిగిరావడంతో పాటు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాకారం అవుతుందని, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందనేది ఆర్థికవేత్తల మాట. -
వారి ముందు చూపు వల్లే ఈ రోజు దేశం మనుగడ: శివసేన
ముంబై: మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. నెహ్రూ-గాంధీ కుటుంబం వల్లనే ప్రస్తుతం కరోనా సంక్షోభంలో భారత్ మనుగడ సాగించ గలుగుతున్నదని శివసేన పేర్కొంది. కాగా, కోవిడ్ కట్టడిలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నదేశాలు సాయం చేయడం మన నేటి దుస్థితికి అద్దం పడుతుందని విమర్శించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం మాత్రం వేలాది కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును ఆపేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదని తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా సంక్షోభ సమయంలో పేద దేశాలు భారత్‌కు సహాయం చేస్తుండగా, ఢిల్లీలో 20,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరని శివసేన మండిపడింది. ఒక వైపు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ వంటి చిన్న దేశాల నుంచి వైద్య సహాయం పొందుతూ మరోవైపు పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం, ప్రధానమంత్రి కొత్త నివాసం నిర్మాణం కొనసాగించడంపై ఎవరూ విచారం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని శివసేన ఎద్దేవా చేసింది. "కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న భారతదేశం నుంచి ప్రపంచానికి ముప్పు ఉందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై పోరాటంలో ఎక్కువ దేశాలు భారత్‌కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ 10,000 రెమ్‌డెసివిర్ వైల్స్ పంపగా, భూటాన్ మెడికల్ ఆక్సిజన్ పంపింది. నేపాల్, మయన్మార్, శ్రీలంక కూడా ‘ఆత్మనిర్భర్’ భారతదేశానికి సహాయం అందించాయి" అంటూ రాసుకొచ్చింది. "స్పష్టంగా చెప్పాలంటే.. నెహ్రూ-గాంధీలు సృష్టించిన వ్యవస్థల వల్లనే భారత్ మనగులుగుతున్నది. చాలా పేద దేశాలు భారత్‌కు సహాయం అందిస్తున్నాయి. గతంలో పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు.. వేరే దేశాల నుంచి సహాయం పొందేవి. దేశంలో ప్రస్తుత పాలకుల వల్ల భారత్ అలాంటి స్థితికి దిగజారుతున్నది" అని శివసేన విమర్శించింది. "కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారని, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నదానికి ఇదే నిదర్శనమని శివసేన విమర్శించింది. “పండిట్ నెహ్రూ, (లాల్ బహదూర్) శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలోని మునుపటి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వల్లనే ప్రస్తుతం దేశం మనుగడ సాధిస్తున్నది. వారు ఇచ్చిన విశ్వాసానికి దేశం ప్రస్తుతం కృతజ్ఞతలు తెలుపుతోంది" అని సామ్నా పేర్కొంది. -
జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్
న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జేఎన్ఎంఎఫ్).. డాక్టోరల్ స్టడీస్ చదివే దేశానికి చెందిన వారితోపాటు, ఇతర ఆసియా దేశాల విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ► పీహెచ్డీ చదివే విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్: ► స్కాలర్షిప్ అందించే సమయం: రెండేళ్లు. ► పీహెచ్డీ విభాగాలు: ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, సోషియాలజీ, కంపెరేటివ్ స్టడీస్ ఇన్ రిలీజియన్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఎకాలజీ–ఇన్విరాన్మెంట్. వీటిలో ఏదో ఒక స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ చేసే అభ్యర్థులకు ఉపకార వేతనం లభిస్తోంది. ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఫుల్‌టైం పీహెచ్డీ స్కాలర్ అయి ఉండాలి. ► వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, తీన్‌మూర్తీ హౌస్, న్యూఢిల్లీ–110011 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: jnmf.in చదవండి: JEE Advanced 2021: అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..! సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో! -
బాలల దినోత్సవం: పిల్లలకు గవర్నర్ సందేశం
సాక్షి, అమరావతి: రేపు బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం రాజ్ భవన్ నుంచి సందేశం ఇచ్చారు. శనివారం(నవంబర్ 14)న పండిట్ జవహర్లాల్ నేహ్రు జన్మదినం, ఈ రోజున ప్రతి ఎడాది బాలల దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పిల్లలందరికి ఆయన హృదయపూర్వక శుభకాంక్షలు తెలిపారు. చిన్నారులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వారే రేపటి భావి భారత పౌరులన్నారు. చిన్నారులు దేశం యొక్క నిజమైన బలమని, మనం జీవించే సమాజానికి పునాది అని పేర్కొన్నారు. మాతృభూమిని రక్షించడం, దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడం భావి భారత పౌరులుగా వారి బాధ్యత అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
నెహ్రూకు ఠాగూర్ రాసిన లేఖ చూశారా!
సాక్షి, న్యూడిల్లీ: రవీంద్రనాథ్ ఠాగూర్ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు రాసిన లేఖను లోక్‌సభ సభ్యులు శశిథరూర్ శనివారం పంచుకున్నారు. నెహ్రూ బయోపిక్ తనని ఎంతగానో ఆకట్టుకుందంటూ ఠాగూర్ తన చేతితో రాసిన లేఖను శనివారం ట్విటర్ షేర్ చేసి నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేశారు. 1936 ఠాగూర్ తన చేతితో రాసిన లేఖ అని ఎంపీ తన పోస్టులో వెల్లడించారు. ‘1936లో నెహ్రూ ఆత్మకథ చదివిన తరువాత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ నెహ్రూకు ఇచ్చిన అసాధారమైన గమనిక ఇది’ అని ట్విటర్లో థరూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టుకు ఇప్పటి వరకు దాదాపు 7 వేలకు పైగా లైక్‌లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఎంపీ పోస్టుకు నెటిజన్లు ఫిదా అవుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాటి మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు థరూర్‌కు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఠాగూర్ రాసిన కొన్ని కవితలలోని ఫేమస్ కొట్స్ షేర్ చేస్తున్నారు. ‘ఈ రోజు వరకు ప్రపంచంలోని అత్యంత తెలివైన అసాధారమైన వ్యక్తి ఠాగుర్’, ‘అందుకే ఠాగూర్ మాటలలో, పనులలో మాస్టర్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ప్రియమైన జవహర్లాల్, నేను మీ గొప్ప ఆత్మకథ పుస్తకాన్ని చదవడం ముగించాను. మీ విజయానికి నేను మంత్రముగ్థుడినయ్యాను. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అంతేగాక మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మానవత్వపు లోతైన భావాల వైపు ఈ పుస్తకం నడిపిస్తుంది. ఇది వాస్తవాల చిక్కులను అధిగమించి మమ్మల్ని గొప్ప వ్యక్తి వైపుకు నడిపిస్తుంది. మీ రవీంద్రనాథ్ ఠాగూర్’’ అంటూ ఠాగూర్ రాసుకొచ్చిన ఈ లేఖ మే 31, 1936 నాటిదని ఎంపీ పేర్కొన్నారు. This was Gurudev Rabindranath Tagore’s note to Pandit Nehru after reading his autobiography in 1936. Extraordinary and exquisite. pic.twitter.com/46PtaVJixG — Shashi Tharoor (@ShashiTharoor) July 30, 2020 -
‘కరోనా వ్యాప్తిలో భారత్ అగ్రస్థానానికి వెళ్తుంది’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలోనే సువర్ణాధ్యాయాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘గత సంవత్సరం ఈ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బంగారు అధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాల ప్రభుత్వానికి తిరిగి ఓటు వేశారు’ అంటూ ప్రధాని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. యశ్వంత్ సిన్హా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘శుభాకాంక్షలు ప్రధాని మోదీ గారూ... భారత ప్రజాస్వామ్యంలోకి సువర్ణాధ్యాయం తెచ్చినందుకు. వచ్చే ఏడాది దేశ పరిస్థితి మరింత అద్భుతంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి వెళుతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది’ అని యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు. Congratulations to PM Modi for ushering in 'a golden chapter in the history of Indian democracy'. The next year promises to be even better when India will climb to the top in Covid cases and the economy would have collapsed totally. — Yashwant Sinha (@YashwantSinha) June 1, 2020 మోదీ-2.0 మొదటి సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా క్షీణించిందని, ఆ క్షీణత ఈ ప్రభుత్వ తప్పు వల్ల కాదని.. మాజీ ప్రధాని నెహ్రూ వల్లనే అని యశ్వంత్ సిన్హా ఎద్దేవా చేశారు. నెహ్రూ గనక 1947 నుంచి 1964 వరకూ దేశాన్ని పాలించకపోతే దేశం రెండంకెల వృద్ధి రేటును సాధించేదని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. The sharp decline in economic growth rate in the first year of Modi-2 is not because of any fault of this govt but because of Pt Nehru. If he had not ruled India from 1947 to 1964 India today would be growing at double digit. — Yashwant Sinha (@YashwantSinha) May 30, 2020 -
నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
-
నెహ్రూను మించిన ప్రధాని పీవీ
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూను మించిన ప్రధాని పీవీ నరసింహారావు అని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ఆర్వీఆర్ చంద్రశేఖర్‌రావు కొనియాడారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమం సందర్భంగా పీవీకి సన్నిహితుడిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు బహుబాషా కోవిదుడే కాదని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన లీడర్షిప్ ఇన్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్‌లో పీవీ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుందని, ఆయన ప్రసంగాన్ని కొనసాగించేందుకు కాన్ఫరెన్స్‌ను మరో రోజు పొడిగించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. పీవీకి అనుకోకుండా పదవులు వచ్చినా.. అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పీవీని ప్రధానిగా కాంగ్రెస్ ప్రకటించే సమయంలో తాను ఢిలీల్లో ఉన్నానని, ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పగా, తెలుగు వ్యక్తి ప్రధాని కావడంపై ఆయన ఎంతో సంతోషించారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన మనవడు ఎన్వీ సుభాష్ ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. -
ఆ బాలీవుడ్ నటికి బెయిల్ నిరాకరణ
అహ్మదాబాద్: దేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేసులో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను సోమవారం గుజరాత్‌లోని బుండీ కోర్టు కొట్టివేసింది. దీంతోపాటు ఆమెకు ఎనిమిది రోజులపాటు జుడీషియల్ కస్టడిని విధించింది. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ఇతర కుటుంబ సభ్యులపై అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన పాయల్‌పై అక్టోబర్ 10న బుండీ పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పాయల్ దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై సోమవారం బుండీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కోర్టు బెయిల్ పిటీషన్‌ను తోసిపుచ్చింది. కాగా గాంధీ కుటుంబ సభ్యుల నుంచి తనపై చర్యలు చేపట్టాలని కోరుతూ.. రాజస్ధాన్ సీఎంపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఇటీవల నటి పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబం సభ్యులపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాయల్‌పై రాజ్‌స్థాన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చార్మేష్ వర్మ ఫిర్యాదు చేశారని బుండీ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లోకేంద్ర పాలివాల్ తెలిపారు. చదవండి: బాలీవుడ్ నటి అరెస్ట్ -
‘రాహుల్ సావర్కర్’ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ‘రేపిన్ ఇండియా’ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. మహిళలపై అకృత్యాల్ని పెంచేదిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని.. భేషరతుగా రాహుల్ జాతికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈక్రమంలో శనివారం జరిగిన కాంగ్రెస్ భారత్ బచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని.. తాను ‘రాహుల్ సావర్కర్‌ను కాదు’ అని తేల్చి చెప్పాడు. అయితే, మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉన్న శివసేన రాహుల్ వ్యాఖ్యలపై స్పందించింది. హిందుత్వ పితామహుడు.. భరత జాతికి ఎనలేని సేవలు చేసిన వీర సావర్కర్ పేరును తక్కువ చేసి మాట్లాడొద్దని సూచించింది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మాదిరిగా వీర సావర్కర్ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని శివసేన ఎంపీ సంజయ్ రావత్ గుర్తు చేశారు. సావర్కర్ గౌరవానికి భంగం కలిచించే రీతిలో మాట్లాడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా రావత్.. స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ భారత దేశ మహనీయుడు. ఆయన కేవలం మహారాష్ట్రకే పరిమితం కాదు. జాతిపిత మహాత్మ గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాగే వీరసావర్కర్ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు’అని పేర్కొన్నారు. -
నెహ్రూపై సాధ్వీ సంచలన వ్యాఖ్యలు..
భోపాల్: దేశతొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందరికంటే నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై సాధ్వీ ఈ విధంగా స్పందించారు. ‘భారత్ తొలినాళ్లలో మంచి దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశం రాముడు, కృష్ణుడు పుట్టిన దేశం. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాతనే అత్యాచార సంస్కృతిని తీసుకువచ్చారు. దానికి ప్రధాన కారణం తొలి ప్రధాని నెహ్రూనే. ఎందుకంటే ఆయనే పెద్ద రేపిస్ట్. టెరరిజం, నక్సలిజం, రేపిజం అన్నీ నెహ్రూ కుంటుంబం నుంచి వచ్చినవే. కాంగ్రెస్ నాయకులే దేశాన్ని సర్వనాశనం చేశారు’ అంటూ వివాదాస్పద రీతిలో మాట్లాడారు. కాగా ఉన్నావ్ ఘటనపై రాహుల్ తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. దేశంలో పెరుగుతున్న అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని అయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం భారత్‌ను ఎగతాళి చేస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
మా ముత్తాత గురించి నేను విన్న కథ!
న్యూఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన ముత్తాత, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన మధుర ఙ్ఞాపకాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. తన చిన్నతనంలో నెహ్రూ గురించి విన్న కథను ట్విటర్లో షేర్ చేశారు. ‘ మా ముత్తాత ప్రధానిగా ఉన్న సమయంలో ఓ రోజు వేకువజామున మూడు గంటలకు ఇంటికి వచ్చారట. ఎంతగానో అలసిపోయిన తన అంగరక్షకుడు ఆదమరచి తన పరుపు మీద నిద్రపోతున్న దృశ్యాన్ని చూశారట. వెంటనే తన చేతిలో ఉన్న బ్లాంకెట్ అతడికి కప్పి.. ఎదురుగా ఉన్న కుర్చీలో నిద్రపోయారట. కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఓ వ్యక్తి గురించి మనకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాయి’ అని ప్రియాంక నెహ్రూ వ్యక్తిత్వం గురించి తన పోస్టులో రాసుకొచ్చారు. My favourite story about my great-grandfather is the one about when as PM, he returned from work at 3 am to find his bodyguard exhausted and asleep on his bed. He covered him with a blanket and slept on an adjacent chair. #JawaharlalNehru pic.twitter.com/HDDiC1hked — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 14, 2019 కాగా చాచా నెహ్రూగా చిన్న పిల్లల అభిమానం చూరగొన్న జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నవంబరు14ను బాలల దినోత్సవంగా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం సందర్భంగా ఎంతో మంది చిన్నారులు నెహ్రూ మాదిరి వేషం ధరించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. -
‘సాగర్’పై నెహ్రూకు మమకారం
సాక్షి, నాగార్జునసాగర్ : బాలబాలికలన్నా, గులాబీ పుష్పాలన్నా భారత తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ప్రీతి. ఏ సభలోనైనా బాలబాలికలను ముద్దాడిన తర్వాతనే వేదికను అలంకరించేవారు. 1955 డిసెంబర్ 10వతేదీన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి తెలుగు ప్రజానీకం గుండెల్లో నెహ్రూ నిలిచిపోయారు. ఆధునిక భారత నిర్మాణంలో భాగంగా ఈ మానవతా మందిరానికి శంకుస్థాపన చేసిన వారంటే విజయపురి (నేటినాగార్జునసాగర్, నందికొండ) విద్యార్థులకు పౌరులకు ఎంతో అభిమానమే. నెహ్రూకు కూడా నాగార్జున సాగరమంటే ప్రత్యేక అభిమానమే. డ్యాం నిర్మాణానికి శ్రమశక్తి ప్రారంభమైన తొలిరోజులవి. ఉద్యోగులు, కార్మిక సంతానానికి డ్యాం అథారిటీయే విద్యాలయాలను ప్రారంభించింది. 1957 నవంబర్ నెలలో నాగార్జునసాగర్ చిన్నారి విద్యార్థులు పండిట్ జవహర్లాల్ నెహ్రూకు జన్మదిన శుభాకాంక్షలు పంపారు. ఆయన ఎంతో పొంగిపోతూ స్వదస్తూరితో వారికి లేఖ రాశారు. నా జన్మదినం సందర్భంగా మీరు పంపిన శుభాకాంక్షలకు నేను మిక్కిలి కృతజ్ఞుడను. మీ ఆధారాభిమానాలకు నేనెంతో ఉప్పొంగి పోయాను. నేను అందుకున్న శుభాకాంక్షలకు నాలో కల్గిన భావాలను ప్రకటించుటకు తగిన పదాలు కూడా లభించడం లేదు అంటూ ముగించారు. ఎంతమంచి మనసు ఆయనది ఈ లేఖ నేటికీ నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భద్రంగా ఉంది. ఇది ఈ విద్యాలయానికి అమూల్య సంపదే. రాష్ట్రంలో వారి దస్తూరితో చిన్నారులను ఉద్దేశించి రాసిన లేఖ మరే విద్యాలయంలోనే లేదని భావించవచ్చు. భావిభారత నిర్మాణానికి నెహ్రూ సూత్రధారులని భావించేవారు. అందుకనే ఆసేతు హిమాచల పర్యంతం వారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటూ చాచా నెహ్రూను స్మరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తారు. సాగర్‌తో మరికొన్ని అనుబంధాలు 1955 డిసెంబర్ 10న సాగర్‌డ్యాం శంకుస్థాపన సందర్భంగా ‘నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం పవిత్రకార్యంగా భావిస్తున్నాను. భారతావనిలో నిర్మాణం చేసుకుంటున్న ఆధునిక దేవాలయాలకు ఇది చిహ్నం. మానవతా మందిరానికే ఈ శంకుస్థాపన’ అంటూ ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు. నెహ్రూకు సాగరంటే ఎంత ప్రీతో సాగర్ వాసులకు అయన అంటే అంతే. 1962లో రక్షణ నిధికి ఆయన ఇచ్చిన పిలుపునకు విజయపురి పౌరులు స్పందించి నవంబర్ 7వ తేదీన రూ.1,00,001లు పంపారు. 1963డిసెంబర్ 6వతేదీన డ్యాం అథారిటీ నిర్వహణలో ఉన్న ఆస్పత్రికి చాచానెహ్రూ సతీమణి పేరు కమలానెహ్రూ ఆసుపత్రిగా ఇందిరాగాంధీచే సాగర్ వాసులు నామకరణం చేయించారు. కమలనెహ్రూ పేరిట మనరాష్ట్రంలో ఉన్న ఆస్పత్రి ఇదొక్కటే. తెలుగు ప్రజానీకం ఎంతో కృతజ్ఞత కలవారని నిరూపించుకోవడానికి సాగర్ కుడికాల్వకు జవహర్ కెనాల్‌గా నామకరణం చేశారు. ఆప్రేమతోనే హిల్‌కాలనీలోలని నెహ్రూపేరిట పార్కును నిర్మించి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
నెహ్రూ జయంతి.. మోదీ, సోనియా నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘన నివాళి అర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ నెహ్రూకు నివాళులర్పించారు. పండిట్ జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా ప్రధాని స్పందిస్తూ ‘మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’అని పేర్కొన్నారు. ఇక న్యూఢిల్లీలోని శాంతివనంలోని నెహ్రూ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నెహ్రూ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. కాగా, 1889 నవంబరు 14న అలహాబాద్‌లో జన్మించిన నెహ్రూ.. మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణిల తొలి సంతానం. జాతీయోద్యమంలో పాల్గొని రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పని చేసిన ఈయన.. స్వాతంత్రానంతరము దేశానికి తొలి ప్రధాని అయ్యారు. చిన్న పిల్లలంటే అమితంగా ఇష్టపడే నెహ్రూ.. వారికి ‘చాచా నెహ్రూ’గా మారిపోయారు. అందుకే ఆయన పుట్టిన రోజు నవంబరు 14న ‘బాలల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. సుదీర్ఘకాలం పాటు స్వతంత్ర భారత్‌కు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ 1964, మే 27న మరణించారు. -
సోషలిస్ట్ స్వాప్నికుడు –శ్రేయో వైజ్ఞానికుడు
స్వాతంత్య్రోద్యమ ప్రస్థానంలో కీలకమైన 1930, 1940 దశకంలో యువతను ఆకర్షించి వారిని ఉద్యమంలో భాగం చేసి విదేశాల్లో స్వరాజ్య సమర గొంతుకను వినిపించడంలో, మద్దతును కూడగట్టడంలో జవహర్ లాల్ నెహ్రూ అద్వితీయ కృషి చేశారు. స్వాతంత్య్రం తర్వాత 1947 నుండి 1964 వరకు దార్శనికత కల్గిన ప్రధానమంత్రిగా నవ్య, విశాల, వైవిధ్య బహుళత్వ భారత నిర్మాణంలో, సంక్షేమ రాజ్య ప్రజాస్వామ్య స్థాపనలో నెహ్రూ నిమగ్నమయ్యారు. విశాల భావాలు, అభ్యుదయ ధోరణి, చురుకైననాయకత్వ లక్షణాలు, వైజ్ఞానిక మేధోపటిమతో దేశాన్నిసంఘటితపరుస్తూ, సంస్థానాలను ఒక్కతాటిపైకి తెచ్చి పునర్నిర్మాణానికి దీపస్తంభమై నిలిచాడు. భారత భవిష్యత్‌ను సమున్నతంగా తీర్చిదిద్దడానికి వ్యవసాయ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వయం స్వావలన, స్వయం సమృద్ధి కోసం, ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి బలమైన పునాదులను, సౌధాలను నిర్మించి చరిత్రలో చెరగని ముద్రవేశారు. నెహ్రూ అమరత్వం సందర్బంగా సుప్రసిద్ధ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆయనను ’మేకర్ ఆఫ్మాడ్రన్ ఇండియా‘ గా అభివర్ణించింది. ది ఎకనామిస్ట్ పత్రిక సామాన్య ప్రజల ఆకాంక్షలను అకళింపుచేసుకున్న మహోన్నత వ్యక్తి అని, అతడు లేని అంతర్జాతీయ యవనిక పేదరాలిగా మారిందని వ్యాఖ్యానించింది. నవంబర్ 14, 1889 లో జన్మించిన నెహ్రూ హౌరా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1919–1920 కాలంలో జాతీయోద్యమంలో అతివాదులు, మితవాదుల మధ్య సంఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నప్పుడు నె్రçహూ గాంధీవైపు నిలిచాడు. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో ‘సంపూర్ణ స్వరాజ్’ తీర్మా నం చేయించాడు. ఉద్యమ తీవ్రతను పెంచడం కోసం శాసనోనల్లంఘన ఉద్యమానికి యావత్తూ కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేశాడు.ఉద్యమ ప్రస్థానంలో 1921–1945 కాలంలో 3,259 రోజులు జైలు జీవితాన్ని గడిపాడు. గణతంత్ర, ప్రజాస్వామ్య రూపశిల్పిగా వ్యవహరించి రాజ్యాంగ నిర్మాణాన్ని నిర్దేశిం చాడు. ప్రతి పౌరుడికి అవకాశాల్లో సమానత, సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందేలా తన మేధో సహచరుడు,సామాజిక విప్లవకారుడు అంబేడ్కర్‌కు సంపూర్ణ తోడ్పాటు అందించాడు. బహుళ భాషా సంస్కృతులు, కుల, మతప్రాంతపరంగా అనేక వైవిధ్యాలు ఉన్న బహుళత్వ భారత్‌లో ఐక్యత కాపాడుకునే ఉద్దేశంతో కేంద్రానికి విశిష్ట అధికారాలు ఉండేలా నిబంధనలు రూపొందించాడు. వర్ణ వివక్ష సామ్రాజ్యవాద విధానాల వ్యతిరేక పోరులో అంతర్జాతీయ గొంతుకగా మారాడు. రష్యా విప్లవ ప్రేరణతో ప్రజాస్వామ్య సోషలిజాన్ని రూపొందించి ప్రజల ప్రగతికి, సంక్షేమానికి ఉపయోగపడే విద్య, వైద్యం, రవాణా, గనులు, అంతరిక్షం, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేశాడు. వైజ్ఞానిక దృక్పథంతో హోమిభాబా ఆధ్వర్యంలో అణుశక్తి కమిషన్ ఏర్పాటు చేశారు. అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇస్రోను ఏర్పాటు చేశాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ, నిట్, ఐఐఎంలు, విశ్వ విద్యాలయాలు, అన్ని పరి శోధన కేంద్రాలు, రక్షణరంగ పరిశ్రమలు నెహ్రూ ఏర్పాటు చేసినవే. బాంబే ప్లాన్ వెలుగులో మిశ్రమ ఆర్థికవ్యవస్థను ఏర్పాటు చేసి స్వదేశి పెట్టుబడి దారులకు ప్రోత్సాహాన్ని అందించాడు. హైందవ సమాజంలో స్త్రీలపై కొనసాగుతున్న వివక్ష, అణచివేత విధానాలను తొలగించడానికి అంబేడ్కర్ రూపొందించిన హిందూకోడ్ బిల్లులు ఆమోదం పొందడానికి కృషి చేశారు. 1953 సెప్టెంబర్ 20న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నెహ్రూ లేఖ రాస్తూ, తీవ్ర జాతీయవాదం దేశానికి కీడు కలిగిస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు ఆయన హెచ్చరిక నిజమని రుజువవుతోంది. నె్రçహూ దార్శనికత, రాజ్యాంగ విలువల రక్షణ కోసం పౌరసమాజం చారిత్రక భాధ్యతను చేపట్టాలి.(రేపు నెహ్రూ జయంతి ) అస్నాల శ్రీనివాస్ వాస్య కర్త తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం -
కొంపముంచిన ఫేస్బుక్ వీడియో.. నటిపై కేసు
జైపూర్: నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక.. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకుగాను బాలీవుడ్ టీవీ నటి పాయల్ రోహత్గి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. గత నెల 21న పాయల్ రోహత్గి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తల్లిదండ్రులతో పాటు ఆయన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో చర్మేశ్ శర్మ అనే ఓ కాంగ్రెస్ కార్యకర్త పాయల్ రోహత్గి మీద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ.. ‘పాయల్ జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీ లాల్ నెహ్రూతో పాటు ఆయన భార్య, తల్లిని కూడా అవమానిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాక లాల్‌బహుదూర్ శాస్త్రి మరణం గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విదేశాలు, మన దేశం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకునేలా ఈ వీడియో ఉంది. పాయల్ మాజీ ప్రధానులను అవమానించడమే కాక దేశ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపాడు. టీవీ రియాలిటీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. 2008లో బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్నది. -
‘థరూర్ జీ.. ఇండియా గాంధీ ఎవరు?’
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో దేని గురించైనా చెప్పేటప్పుడు పూర్తి అవగాహనతో, సరైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి. అలా కాకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి, చేతికి దొరికిన ఫోటోను షేర్ చేస్తే.. ఆనక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఈయన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం తెలిసిందే. ఆంగ్ల భాషపై థరూర్‌కున్న పట్టు ఆమోఘం. కొత్త కొత్త పదాలతో ట్వీట్ చేస్తూ నెటిజనులను అలరిస్తుంటారు శశిథరూర్. అయితే ప్రస్తుతం మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు లభిస్తున్న విశేష ఆదరణ గురించి బీజేపీ శ్రేణులు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో దీనికి కౌంటర్ ఇచ్చేందుకు శశిథరూర్ చేసిన ప్రయత్నం కాస్త బెడిసి కొట్టింది. వివరాలు.. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ రష్యా పర్యటన సందర్భంగా తీసిన ఫోటోని ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘1954లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇండియా గాంధీ యూఎస్ వెళ్లినప్పుడు తీసిన ఫోటో ఇది. ఇప్పుడున్నంత ప్రత్యేక పీఆర్ ప్రచారం, మీడియా పబ్లిసిటీ ఏమి లేని రోజుల్లోనే వారిని చూడటానికి ఎంతమంది అమెరికా ప్రజలు వచ్చారో చూడండి’ అంటూ ట్వీట్ చేశారు శశి థరూర్. ఈ ట్వీట్లో నెటిజన్లు రెండు తప్పిదాలను గుర్తించారు. ఒకటి ఇందిరా గాంధీ పేరును ఇండియా గాంధీగా పేర్కొన్నారు. రెండోది ఫోటోకు సంబంధించిన సమాచారం పూర్తిగా తప్పు. ఈ ఫోటోను 1956 మాస్కో పర్యటన సందర్భంగా తీసింది. ఈ తప్పులను గుర్తించిన నెటిజన్లు శశి థరూర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. Nehru & India Gandhi in the US in 1954. Look at the hugely enthusiastic spontaneous turnout of the American public, without any special PR campaign, NRI crowd management or hyped-up media publicity. pic.twitter.com/aLovXvCyRz — Shashi Tharoor (@ShashiTharoor) September 23, 2019 ‘థరూర్ జీ ఇండియా గాంధీ ఎవరు’... ‘ఈ ఫోటో 1954 అమెరికాలో తీసింది కాదు.. రష్యా, మాస్కోలో 1956లో తీశారు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై థరూర్ స్పందించారు. ‘ఈ ఫోటో అమెరికాలో తీసింది కాదు.. రష్యాలో తీసిందని నాకు తెలిసింది. మాజీ ప్రధానులకు విదేశాల్లో విశేష జనాదరణ ఉందని చెప్పడమే ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం. మోదీని గౌరవిస్తున్నారు అంటే దేశాన్ని గౌరవిస్తున్నట్లే ’అంటూ మరో ట్వీట్ చేశారు థరూర్. I am told this picture (forwarded to me) probably is from a visit to the USSR and not the US. Even if so, it still doesn't alter the message: the fact is that former PMs also enjoyed popularity abroad. When @narendramodi is honoured, @PMOIndia is honoured; respect is for India. https://t.co/9KQMcR0zTD — Shashi Tharoor (@ShashiTharoor) September 23, 2019 -
‘కశ్మీర్ విముక్తి కోసం మూడు తరాల పోరాటం’
ముంబై: దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 1947లో కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయకుండా నెహ్రూ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. నెహ్రూ నిర్ణయం వల్లనే కశ్మీర్లో ఉగ్రవాదం పెచ్చుమీరిపోయిందని ఆరోపించాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా ఆదివారం ముంబైలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ అంశం మాజీ హోంమంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్‌కు అప్పగించినట్లయితే ఎప్పుడో భారత్‌లో విలీనమయ్యేదని అభిప్రాయడ్డాడు. ‘కశ్మీర్లో ఉగ్రమూకలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాం. దేశం గర్వపడే అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయడం వారి అపరిపక్వతకు నిదర్శం. బీజేపీ ఈ అంశాన్ని జాతీయవాద విజయంగా పరిగణిస్తుంది. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దును రాజకీయ సమస్యగా రాహుల్ గాంధీ చిత్రీకరిస్తున్నారు. రాహుల్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు, కానీ కశ్మీర్ విముక్తి కోసం బీజేపీ మూడు తరాల నాయకులు పోరాడుతున్నారు. బీజేపీ ప్రధాన ఎజెండా దేశాన్ని ఐక్యంగా ఉంచడమే. ఒకే దేశం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతానికి బీజేపీ కట్టుబడి ఉంది’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
నెహ్రూపై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేరస్తుడని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 అమలుచేశారని నెహ్రూను క్రిమినల్‌గా అభివర్ణించిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలను ప్రజ్ఞా సింగ్ సమర్ధించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దేశమాతను బాధించేవారు, దేశాన్ని ముక్కలుగా చేయాలనుకునే వారెవరైనా నేరస్తులేనని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370, 35 ఏను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఆమె ప్రశంసలు కురిపించారు. మోదీ, అమిత్ షా దేశభక్తులని కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దును దేశభక్తులు స్వాగతిస్తుంటే..దీన్ని స్వాగతించలేనివారు ఎన్నటికీ దేశభక్తులు కాలేరని స్పష్టం చేశారు. కాగా గతంలో మహాత్మా గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి పార్టీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. -
నెహ్రు ఓ క్రిమినల్ : చౌహాన్
భువనేశ్వర్ : బీజేపీ సీనియర్ నాయకులు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెహ్రు ఓ క్రిమినల్ అని విమర్శించారు. జమ్మూ కశ్మీర్‌కు జరిగిన అన్యాయానికి నెహ్రునే కారణమని ఆరోపించారు. నెహ్రు తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే కశ్మీర్ పూర్తిగా భారత్ సొంతమయ్యేదని అన్నారు. ‘ భారత భద్రతా బలగాలు కశ్మీర్ నుంచి పాక్ గిరిజనులను వెళ్లగొడుతున్న సమయంలో నెహ్రు కాల్పుల విరమణను ప్రకటించి తొలి నేరానికి పాల్పడ్డారు. అందువల్ల 1/3 భూభాగం(పీవోకే) పాకిస్థాన్ చేతిలో ఉండిపోయింది. నెహ్రు ఇంకొద్ది రోజులు కాల్పుల విరమణ ప్రకటించి ఉండకపోతే కశ్మీర్ పూర్తిగా మన సొంతమయ్యేది. ఇక, జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని తీసుకురావడం ద్వారా నెహ్రు రెండో నేరం చేశారు. దీని ద్వారా ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది దేశానికి చేసిన అన్యాయం మాత్రమే కాదు నేరం కూడా’ అని శివరాజ్‌సింగ్ పేర్కొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును తీసుకువచ్చింది. దీని ప్రకారం కశ్మీర్, లదాఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా నెహ్రు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. -
కశ్మీరం పై సోషల్ ‘యుద్ధం’
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గత నాలుగైదు రోజులు గా కశ్మీర్ పరిణామాలను గమనిస్తున్న ప్రజానీకం సోమవారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయింది. 370వ అధికరణ ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం, రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంతో తెలుగు ప్రజలు సోమవారమంతా ఇదే విషయంపై చర్చలు జరిపారు. ఏ ఇద్దరు మనుషులు కలిసినా, రాజకీయ నేతలు ఎదురుపడినా కశ్మీర్ అంశంపైనే మాట్లాడుకోవడం గమనార్హం. ఏమవుతుందో ఏమో? దేశ భద్రత, భావోద్వేగాలకు సంబంధించిన విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పెరుగుతుందా.. తగ్గుతుందా అనే విషయంపై ఎక్కువగా చర్చ జరగడం తెలుగు ప్రజల చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. దీంతో పాటు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కశ్మీర్ ప్రజ ల్లో ఎలాంటి స్పందన వస్తుంది.. దేశ భద్రతకు సంబంధించి ఏమైనా పరిణామాలు జరుగుతాయా.. సరిహద్దుల్లో సైన్యం మోహరింపు ఎలా ఉంది.. స్థానికంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు.. కేంద్ర నిర్ణయం స్టాక్మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపింది.. అనే అంశాలు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. సామాజిక మాధ్యమాల్లోనూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కశ్మీర్ అంశంపై భిన్న వాదనలు నడిచాయి. 370వ అధికరణ ద్వారా అక్కడి ప్రజలకు సంక్రమించిన అధికారాల విషయంలో ఇరువర్గాలు ఓ రకంగా సామాజిక మాధ్యమాల్లో యుద్ధమే చేశాయి. ఈ అధికరణ ద్వారా కశ్మీర్లో వివాహానంతర వారసత్వ హక్కులు, దేశంలోని ఇతర రాష్ట్రాలకున్న ప్రత్యేక అధికారాలు, కశ్మీర్లో కేంద్ర చట్టాలు, అత్యున్నత న్యాయస్థానాల తీర్పుల అమలు తదితర అంశాలపై పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ అధికరణ నెహ్రూ, అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందమని కొందరు, దేశాన్ని విభజించి పాలించేందుకు జరుగుతున్న కుట్రను ఎదుర్కోవాలంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వాదోపవాదాలు చేస్తూ పోస్టులు పెట్టారు. -
ఆ జైలు గది కూలిపోయింది!
చండీఘడ్ : చారిత్రక నేపథ్యం ఉన్న ఓ జైలు గది కూలిపోయింది. ఈ ఘటన పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని జైతూ టౌన్లో ఉన్న ఈ జైలు గదిలో దివంగత కాంగ్రెస్ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు 1923లో కొన్ని రోజులు జైలు జీవితాన్ని గడిపారు. ఇటీవల పంజాబ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు ఈ జైలు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 240 చరదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జైలు కూలిపోయినట్టుగా.. గురువారం పంజాబ్ సీనియర్ పోలీసు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో బ్రిటీష్ వారు ‘నాబా’ రాష్ట్రంలోకి భారతీయులు ప్రవేశించవద్దని నిషేధించారు. ఈ నేపథ్యంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అకాలీలు.. జైతుటౌన్‌లో చేపట్టిన ‘జైతు కా మోర్చా’ పేరిటి నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా జవహర్లాల్ నెహ్రూ, కె. సంతానం, ఏటీ గిద్వానీలు నిరసనకు దిగడంతో బ్రిటీషర్లు వారిని అరెస్టు చేసి ఈ కారాగారంలో బంధించారు. ఇక 2008లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ జైలు గదిని సందర్శించి ‘దేశ మొదటి ప్రధాని’ ఈ జైలులో స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా కొన్ని రోజుల ఉన్నారన్నారు. చారిత్రక నేపథ్యం ఉన్నఈ జైలు గది కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరితే రూ.65 లక్షలు నిర్వహణ ఖర్చుల కోసం కేటాయిస్తామని ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరి పవన్ గోయాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత పదేళ్ల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జైలు గదిని టూరిజం శాఖలోకి తీసుకువచ్చినప్పటికీ ఏమాత్రం నిర్వహణ మెరుగుపడలేదు. చివరికి గురువారం ఇది కూలిపోయింది. -
ఉగ్రవాదానికి కారణం నెహ్రూనే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం, రాజకీయ సమస్యలకు భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూయే కారణమని శుక్రవారం లోక్‌సభలో హోం మంత్రి అమిత్ షా నిందించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలికమైనదే తప్ప అది శాశ్వతం కాదని ఆయన అన్నారు. హోం మంత్రి అయ్యాక తొలిసారిగా అమిత్ షా లోక్‌సభలో ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన నడుస్తోండగా జూలై 3కు ఆ గడువు ముగియనుంది. దీంతో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించారు. జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రణాళిక ప్రకటిస్తే, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక, పారదర్శక విధానాల్లో పోలింగ్ జరుగుతుందని అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) 2019 బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. రాష్ట్రపతి పాలన పొడిగింపుపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని, ఆ భావజాలాన్ని కూడా మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహించదనీ, ఉగ్రవాదమే లేని, సరిహద్దుల్లో భద్రమైన దేశంగా భారత్‌ను మార్చడమే తమ లక్ష్యమని అమిత్ షా అన్నారు. ‘కశ్మీర్లో మూడింట ఒక వంతు భాగం ఈ రోజు మన దగ్గర లేదు. స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్లోకి పాకిస్తాన్ చొరబడి, మూడింట ఒక వంతు భూభాగాన్ని ఆక్రమించిన తర్వాత కాల్పుల విరమణను ప్రకటించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూయే ఆ ప్రకటన చేశారు. ఆక్రమించిన భాగం పాకిస్తాన్ వశమైంది. నాటి ఉప ప్రధాని, హోం మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ మాటను కూడా అప్పుడు నెహ్రూ పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. అదే ఆనాడు పటేల్ చెప్పిన మాటను నెహ్రూ పరిశీలించి, ఆయన చెప్పినట్లు విని ఉంటే ఇప్పటి పాక్ ఆక్రమిత కశ్మీర్ మన చేతుల్లోనే ఉండేదనీ, ఆ ప్రాంతంలో అసలు ఉగ్రవాదమే ఉండేది కాదని అమిత్ షా అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో షా స్పందిస్తూ, తాను నెహ్రూ పేరును పలకననీ, అయితే కశ్మీర్ సమస్యకు కారణం తొలి ప్రధానేనని చెప్పడంలో మాత్రం తనకు ఏ మాత్రం సందేహం లేదని స్పష్టం చేశారు. -
నెహ్రూ కారణంగానే కశ్మీర్ సమస్యన్న షా
-
ఆ వివాదానికి నెహ్రునే కారణం : అమిత్ షా
న్యూఢిల్లీ : కశ్మీర్ వివాదానికి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రునే కారణమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లుపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు తాము ప్రజల మనోగతాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదంటున్నాయని.. కానీ నెహ్రు అప్పటి హోం మంత్రి పటేల్ అభిప్రాయం తీసుకోకుండానే.. పీవోకే ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు ఇచ్చేశారని అన్నారు. కశ్మీర్‌ను అభివృద్ధి చేయడమే తమకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ బిల్లు కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుతో పాటు, నియంత్రణ రేఖ వెంబడి నివసిస్తున్న.. ఆర్థికంగా వెనుకబడినవారికి మేలు చేకూరుస్తుందని తెలిపారు. ఉగ్రమూకలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. సర్జికల్ దాడులను సమర్థించిన అమిత్ షా.. ఈ దాడిలో ఒక పౌరుడు కూడా చనిపోలేదని అన్నారు. తాము ఆర్టికల్ 356ని రాజకీయ లబ్ధికి వాడుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కశ్మీర్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అంతకుముందు జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ అమిత్ షా పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివర్లో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కశ్మీర్లో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని అన్నారు. -
మానవ కంప్యూటర్
సాక్షి, కడప : కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయశర్మ గొప్ప గణిత మేధావిగా పేరు గాంచారు. దేశ, విదేశీయుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందినవారు. 1907 నవంబర్ 28న జన్మించారు. పుట్టుకతోనే చూపులేదు. అంధుడు పుట్టాడని పెంచడం కష్టమని.. గొంతు పిసికి దిబ్బలో పూడ్చేయాలని మంత్రసాని సలహా ఇచ్చింది. మరికొందరు మహిళలు పురిటి బిడ్డ నోట్లో వడ్ల గింజలు వేశారు. అయినా ఆ పసివాడు చావలేదు సరికదా.. చక్కగా ఆరోగ్యంగా ఎదిగాడు. ప్రపంచం ఈర్ష్యపడే స్థాయికి పేరుగాంచారు. ఆ రోజులలో బ్రెయిలీ లిపి లేకపోవడంతో సంజీవరాయ శర్మ చదువుకునేందుకు వీలు కాలేదు. అక్క బడికి వెళ్లి వచ్చాక ఇంటి వద్ద పాఠాలను గట్టిగా చదువుతుంటే విని గుర్తు పెట్టుకునేవాడు. అలా ఆయనకు మామూలు పాఠాలతోపాటు గణితం బాగా వచ్చింది. అందులో అపార జ్ఞానం సాధించారు. అతని బాల్య దశలోనే తండ్రి చనిపోయారు. తల్లే పెంచింది. పల్లెల్లో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు తదితర అంశాలను సంజీవరాయశర్మ క్షణాల్లో చెప్పేవారు. రైతులు ఈ సాయానికి గానూ ఆయనకు అంతో.. ఇంతో డబ్బు ఇచ్చేవారు. ఆ వయసులోనే వయొలిన్ పట్ల ఆకర్షితుడై వాయించడం నేర్చుకున్నారు. తర్వాత వయొలిన్ వాయించడం జీవితంలో ఒక భాగమైంది. గణితంలో ప్రజ్ఞ సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే. అంటే 8 మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి. అలాగే గణితంలో కూడా అవధానం ఉంది. లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధానాలు చేయడంలో దిట్టగా మారారు. పుట్టిన తేదీ, సంవత్సరం, ప్రదేశం, సమయం చెప్పగానే ఆయన దానికి సంబంధించిన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చెప్పేసేవారు. దాంతోపాటు క్లుప్తంగా జాతకాన్ని కూడా తెలిపేవారు. అలా ఆయన దేశమంతటా మొత్తం 6 వేల గణిత అవధానాలు చేశారు. వేలాది మంది కూర్చున్న సభలో నిమిషానికి 20, 30 కష్టమైన లెక్కలకు అడిగిన వెంటనే సమాధానాలు చెప్పేవారు. ప్రశ్న అడగ్గానే వయొలిన్‌ను కొద్దిగా పలికించి వెంటనే సమాధానం చెప్పేవారు. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడిగితే దైవ దత్తంగా వచ్చిందని బదులిచ్చేవారు. ప్రపంచంలోనే గణితం విషయంలో బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి కంప్యూటర్ను ఓడించిందంటారు. అలాంటి శకుంతలాదేవినే ఓడించిన గొప్ప వ్యక్తి లక్కోజు సంజీవరాయశర్మ. ఎంత పెద్ద లెక్క అడిగినా కూడా క్షణాల్లో బదులిచ్చేవారు. గౌరవ పురస్కారాలు గణితంలో లక్కోజు గొప్పతనం తెలిసి.. దేశమంతటా ఎందరో గొప్పవాళ్లు ఆయన అవధానాలకు వెళ్లేవారు. మరికొందరు పెద్దలు ప్రత్యేకంగా అవధానం చేయించి విని ఆశ్చర్యపోయేవారు. 1959లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఢిల్లీలో లక్కోజుతో గణిత అవధానాన్ని ఏర్పాటు చేయించి, తిలకించారు. ఆ కార్యక్రమానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా హాజరయ్యారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 1996లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తొలిసారిగా 1928లో గణిత అవధానం చేశారు. 1995 వరకు దేశమంతటా 6 వేల ప్రదర్శనలు ఇచ్చారు. 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ప్రధాన ఆకర్షణగా నిలిచి వందలాది లెక్కలకు బదులిచ్చారు. 19 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అప్పట్లో ఆయన సతీమణి వయసు 9 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1994 జనవరి 5న ఆమె శ్రీకాళహస్తిలో ఉండగా మరణించారు. సంజీవరాయశర్మ హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1997 డిసెంబర్ 2న కన్నుమూశారు. ప్రపంచం మొత్తాన్ని తన అద్భుతమైన గణిత విద్యతో ఆకట్టుకున్న గొప్ప వ్యక్తి ఇంత వరకు ఈ భూమిపై మరొకరు పుట్టలేదని.. ప్రపంచంలోని గణిత మేధావులంతా ఎంతో ప్రశంసించారు. -
‘నెహ్రూ భార్య విహారానికి ఎయిర్‌ఫోర్స్ విమానం’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకోవడంతో వ్యక్తిగత విమర్శలు తారాస్థాయి చేరాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ స్వామి నెహ్రూపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. నెహ్రూ తన యూరప్ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యూరప్ భార్య కోసం ఎయిర్‌ఫోర్స్ విమానం సమకూర్చాలని 1950ల్లో రక్షణ కార్యదర్శిగా ఉన్న తన మామ జేడీ కపాడియాను నెహ్రూ కోరగా అందుకు ఆయన నిరాకరించారని గుర్తుచేశారు. దీంతో ఆయనను బదిలీ చేసి తదుపరి కార్యదర్శితో తన పని చక్కబెట్టుకున్నారని నెహ్రూను ఉద్దేశిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. The Namo citing Virat misuse recalls for me the case of my father in law J.D. Kapadia ICS who as Defence Secy in the 1950s refused to give Airforce plane to ferry one of Nehru’s European mistresses. Of course he was transferred and next Secy okayed. Thus the decline be began — Subramanian Swamy (@Swamy39) May 9, 2019 -
‘వేల మందిని చంపిన పాపం నెహ్రూదే’
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మీద విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశాంబీలో పర్యటించిన మోదీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుంభమేళా నిర్వహణ విషయంలో ఎలా వ్యవహరించాయో వివరించారు. ఈ క్రమంలో 1954లో కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటను మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాను చాలా చక్కగా నిర్వహించారు. కానీ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధ్వర్యంలో 1954లో అలహాబాద్‌లో కుంభమేళా నిర్వహించినప్పుడు తొక్కిసలాట జరిగింది. వేల మంది చనిపోయారు. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి పేర్లు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అంతేకాక వారికి కనీసం ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం అందలేద’ని మోదీ ఆరోపించారు. నెహ్రూను కాపాడటం కోసమే అప్పటి మీడియా ఈ వార్తలను ప్రజల దృష్టికి తీసుకురాలేదన్నారు మోదీ. అంతేకాక ఆ తొక్కిసలాటలో వేల మంది మరణించారని.. ఈ పాపం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూదే అని ఆరోపించారు. గతంలో కూడా మోదీ.. నెహ్రూను ఉద్దేశిస్తూ.. గులాబీలు ధరించే వారికి తోటల గురించి అవగాహన ఉంటుందేమో కానీ.. రైతుల కష్టాల గురించి వారికి ఏ మాత్రం తెలియదని విమర్శించారు. -
నెహ్రూను తగ్గించాలని కాదు
సాక్షి, బళ్లారి/అమ్రేలీ/బాగల్‌కోట: భారత తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించేందుకు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించలేదని ప్రధాని మోదీ తెలిపారు. సర్దార్ పటేల్ తమ నాయకుడని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, గుజరాత్లో నర్మదా నదీతీరాన నిర్మించిన పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఇప్పటివరకూ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో 75 శాతం పోలింగ్.. గతంలో పుణే, అహ్మదాబాద్, జమ్మూలో తరచూ బాంబు పేలుళ్లు జరిగేవి. కానీ గత ఐదేళ్లలో ఒక్క బాంబు దాడి జరిగినట్లైనా మీరు విన్నారా? కశ్మీర్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సందర్భంగా ఒక్క హింసాత్మక ఘటన జరగలేదు. నేను పటేల్ విగ్రహాన్ని నెహ్రూను తక్కువ చేయడానికి నిర్మించలేదు. పటేల్ విగ్రహం ఎంత ఎత్తుగా ఉందంటే, మీరు(కాంగ్రెస్ నేతలు) ఇకపై ఇతరులను తక్కువ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు’ అని అన్నారు. గుజరాత్ నన్ను దృఢంగా మార్చింది 2017లో చైనాతో డోక్లామ్ ఉద్రిక్తత సందర్భంగా కటువుగా, దృఢంగా వ్యవహరించేలా గుజరాత్ నన్ను తయారుచేసింది. గుజరాత్ ప్రజలు నాలో నైతిక విలువలను పెంపొందింపజేశారు. ఇందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామనీ, కశ్మీర్లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (అఫ్సా) తొలగిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అదే జరిగితే అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు చంపేయరా? వైష్ణోదేవి ఆలయాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకోగలరా?’’ అని ప్రశ్నించారు. కేంద్రంలో మరోసారి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మోదీ కర్ణాటక ప్రజలకు పిలుపునిచ్చారు. బాగల్‌కోట, ఛిక్కొడి, బెళగావిల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కేంద్రంలో కాంగ్రెస్ బలహీన, నిస్సహాయ ప్రధానిని నియమించాలని అనుకుంటోంది. బలమైన ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఢిల్లీ(కేంద్రం) వైపు చూడండి. బలహీనమైన ప్రభుత్వం ఎలా ఉంటుందంటే బెంగళూరువైపు చూడండి’ అని తెలిపారు. ఆమ్రేలీలో పార్లమెంటు భవంతి ఆకృతిలో జ్ఞాపికను అందుకుంటున్న ప్రధాని మోదీ -
అమితాబ్ సైకిల్ మీద ఇక్కడికొచ్చేవాడు..
అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ.. ఆ మధ్య వీపీ సింగ్.. కాఫీ తాగడానికి, రాజకీయ కబుర్లు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చేవారు. బిగ్ బి అమితాబ్ కూడా కుర్రాడిగా ఉన్నప్పుడు సైకిల్ మీదొచ్చేవాడు. ఇప్పుడు.. 2019 సార్వత్రిక ఎన్నికల సంగతులు మాట్లాడుకోవడానికి రిక్షా కార్మికుడు, లాయర్లు, జర్నలిస్టులు, విద్యావంతులు ఇలా అన్ని రకాల వారు వస్తున్నారు. గంటల తరబడి కాఫీలు తాగుతూ రాజకీయాలపై చర్చిస్తున్నారు. అదే.. ఇండియన్ కాఫీ హౌస్. దేశంలో రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఉన్న ఈ కాఫీ హౌస్ ఇప్పటికీ వేడివేడి రాజకీయ వార్తలకు, చర్చలకు కేంద్రంగా భాసిల్లుతోంది. ఎత్తయిన సీలింగ్, ఆర్చితో చూడగానే చర్చిగా కనిపిస్తుంది ఈ కాఫీ హౌస్. 1957 నుంచి ఉన్న ఈ కాఫీ హౌస్ నగరవాసులందరీకీ సుపరిచితమే. కాలం మారినా, రాజకీయాలు మారుతున్నా, జనాల అభిరుచులు మారుతున్నా.. ఈ కాఫీహౌస్ మాత్రం మారలేదు. లోపల ఆనాటి ఇంటీరియర్ డెకరేషనే నేటికీ ఆకట్టుకుంటోంది. కాఫీ, ఇతర తినుబండారాల రేట్లు కూడా ఎక్కువేం కాదు. కాఫీ హౌస్ కాబట్టి మొదట్లో ఇక్కడ టీ దొరికేది కాదు. కాలం మారినా కూడా ఇప్పటికీ ఇక్కడ టీకి చోటేలేదు. అలహాబాద్‌కు గుండెకాయనదగిన సివిల్ లైన్స్‌లో ఉన్న ఈ కాఫీహౌస్‌కు 45 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా వస్తున్న వారు కూడా ఉన్నారు. కొందరయితే కాఫీ హౌస్‌లో కొన్ని సీట్లను రిజర్వు చేసేసుకున్నారు. వారెప్పుడొచ్చినా అక్కడే కూర్చుంటారు. ఇక్కడకొచ్చే వారు తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తుంటారు. వాదోపవాదాలు కూడా తీవ్రంగానే జరుగుతాయి. అయితే, గొడవలు మాత్రం జరగవు. ‘ఎవరెంత గట్టిగా వాదించుకున్నా చివరికి అంతా ప్రశాంతంగానే వెళ్లిపోతారు’ అన్నారు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడి వస్తున ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ రిటైర్డ్ అధికారి అశోక్ యాదవ్. ‘అప్పట్లో నెహ్రూ, తర్వాత వీపీ సింగ్ మా కాఫీహౌస్‌లో కాఫీతాగి కాసేపు గడిపేవారు. అమితాబ్ బచ్చన్ కూడా సూపర్‌స్టార్ కాకముందు సైకిల్ మీద ఇక్కడికొచ్చేవాడు’ అంటూ ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు కాఫీ హౌస్ మేనేజర్ పీఆర్ పాండా. 45 ఏళ్లుగా ఇక్కడికి రోజూ వస్తున్నారు అవదేశ్ ద్వివేది. ‘ఇంతకు ముందు ఎన్ని చర్చలు జరిగినా ఎవరూ ఎదుటి వారిని నొప్పించేలా మాట్లాడేవారు కాదు. అదుపు తప్పకుండా వాదించుకునే వారు. ఇప్పుడలా కాదు. కుర్రాళ్లు ప్రతి దానికీ ఆవేశ పడిపోతున్నారు. తమ మాట కాదంటే చాలు ఉద్రేక పడిపోతున్నారు’ అన్నారాయన. అలాఅని ఎవరూ తమ అభిప్రాయాలను చెప్పడానికి భయపడరన్నారు. రాజకీయ నాయకులు కావాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తుంటారు. దేశ రాజకీయాలను తెలుసుకుంటుంటారు. ప్రతిపక్షాల వాళ్లు కూడా వస్తారు. ప్రభుత్వాన్ని తిట్టిపోస్తుంటారు’ అంటూ ప్రస్తుత పరిస్థితిని వివరించారు పాండే. -
నెహ్రు చేసిన తప్పిదం వల్లే : అమిత్ షా
న్యూఢిల్లీ : భారత్ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ సమస్య జఠిలమైందని బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2019లో శుక్రవారం అమిత్ షా మాట్లాడుతూ.. 1947లో నెహ్రు కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించి పెద్ద తప్పిదం చేశారని, దాని పరిహాసమే ప్రస్తుత పరిస్థితులకు కారణమన్నారు. కశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆర్టికల్ 370, 35-ఏ విషయాల్లో ఏమైన మార్పులు చేస్తారా అన్న ప్రశ్నను ఆయన దాటేవేసారు. ఈ అంశంపై తాను మాట్లాడబోనని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు మరణించినా.. పాక్ ప్రధాని ఈ ఘటనను ఖండించకపోవడంపై షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్‌ను తమ ఎన్నికల ప్రచారానికి వాడుకోమని స్పష్టం చేశారు. మోదీ చేసిన అభివృద్ధి ఎజెండాతోనే ఎన్నికలు వెళ్తామన్నారు. మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి ఎవరి హయాంలో జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం గాంధీల కోసమేనని, బీజేపీ మాత్రం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. చదవండి : (పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చాం : అమిత్ షా ) -
మోదీ ప్రధాని కావడానికి కారణం అదే
రాయ్‌పూర్: యోగా చేసిన వారిని రాజయోగం వరిస్తుందని, అందుకే జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ దేశ ప్రధానులయ్యారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాయపూర్‌లో పతంజలి గ్రూప్‌కు చెందిన ఓ స్టోర్ ప్రారంభోత్సవంలో రాందేవ్ మాట్లాడారు. ఒత్తిడిని దూరంచేసే అతి ప్రాచీన విధానమైన యోగాను మన రాజకీయనేతలంతా అభ్యసించాలని రాందేవ్ కోరారు. నిరంతరం యోగా చేయడంతోనే రాజయోగం సిద్ధించి నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులయ్యారని, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సైతం యోగా బాగా చేస్తారని రాందేవ్ అన్నారు. టీ అమ్ముకునే నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి, సాధువైన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి యోగాతో వచ్చిన రాజయోగమే కారణమని రాందేవ్ వ్యాఖ్యానించారు. రాజకీయ రణరంగంలో గెలవాలంటే పోరాటపటిమనందించే యోగా తప్పనిసరి అని అన్నారు. బుద్ధి చెప్పాలంటే యుద్ధం చేయాల్సిందే.. పుల్వామా ఉగ్రదాడి వంటి చర్యలతో నిత్యం సమస్యలు సృష్టిస్తున్న పాకిస్తాన్‌కు, ఉగ్రవాదులకు యుద్ధం ద్వారానే భారత్ బుద్ధిచెప్పాలని రాందేవ్ అన్నారు. యుద్ధంలో ఓడిస్తే మరో 50 ఏళ్ల దాకా పాక్ భారత్‌వైపు కన్నెత్తికూడా చూడదన్నారు. పాకిస్తాన్ నైరుతి ప్రాంతమైన బలోచిస్తాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించాలని ఉద్యమిస్తున్న అక్కడి వేర్పాటువాదులకు భారత్ అన్నిరకాల సాయం అందించాలని రాందేవ్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని ద్వేషించే పాకిస్తానీయులకు భారత్ పూర్తిసాయం అందించి పాకిస్తాన్ పూర్తిగా నాశనమయ్యేలా చేయాలని రాందేవ్ అన్నారు. ‘ రాముడు ముస్లింలకు సైతం పూర్వీకుడే. అందుకే రామాలయ నిర్మాణానికి ముస్లింలు కూడా ముందుకు రావాలి’ అని రాందేవ్ వ్యాఖ్యానించారు. -
బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్?
బాల్యానికి గంతలు కట్టేస్తున్నారు.అలాగే అనిపిస్తోంది. అందరూ చెప్పేవాళ్లే కానీ.. జీవితాన్ని చూపించేవాళ్లు తక్కువైపోయారు. చూపులేని వాళ్లను నడిపించినట్లు నడిపిస్తున్నారే కానీ.. రెక్కలు కట్టి ఎగరమని చెప్పడం లేదు. నిజానికి.. బాల్యం చెక్కినట్లు జీవితాన్ని మరేదీ చెక్కలేదు. బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్? రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే! నేటి మన సంతోషానికి, నిన్నటి మన జ్ఞాపకాల చిరునవ్వులకు, రోజూ ఉదయాన్నే జీవితంపై ఆశతో మనం నిద్రలేవడానికి ఒక అర్థవంతమైన కారణం పిల్లలు. లోకం తీస్తున్న పరుగులన్నీ పిల్లల కోసమే. లోకం నిండా ప్రేమ ఉన్నది పిల్లలకు పంచడానికే. అక్షరాలున్నది పిల్లలకు నేర్పించడానికే. మేడలు నిర్మిస్తున్నది పిల్లల సౌఖ్యానికే. పిల్లలు.. కుటుంబానికే కాదు, లోకం మొత్తానికే వెలుగు. వాళ్లొక్క నవ్వు నవ్వితే ప్రకృతి పరవళ్లు తొక్కుతుంది. వాళ్లొక్కమారు ఆడుకుంటూ గిర్రున తిరిగితే విశ్వాంతరాళమే వారి చుట్టూ పరిభ్రమిస్తుంది. వాళ్ల కళ్లలోని కాంతులను చూస్తే చుక్కలు చెలిమికొస్తాయి. చెయ్యిచాచి వాళ్లడిగితే చందమామయ్య అమ్మచేతి అద్దంలోకి వచ్చేస్తాడు. ఇల వాళ్లదే, కల వాళ్లదే. భువి వాళ్లదే. దివి వాళ్లదే. రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే. పెద్దల్ని వాచ్ చేసేవాళ్లు, పెద్దలకు టీచ్ చేసేవాళ్లు కూడా. ఎన్ని తెలిసిన జ్ఞానికైనా, ఒకటేదో మిగిలే ఉంటుంది పిల్లల్నుంచి చేర్చుకోడానికి! ఏమీ తెలియనివారిక్కూడా.. ధైర్యమూ, దారీ ఇచ్చే సంకేతమేదో పిల్లల మాటల్లో దొరుకుతుంది. ‘ఔట్ డేటెడ్’లను నడిపిస్తారు. ‘అప్డేట్’లను కూడా అప్‌గ్రేడ్ చేస్తారు! జవహర్లాల్ నెహ్రూ అనే ఓ పిల్లాడుండేవాడు. పెద్దయ్యాక దేశ ప్రధాని అయ్యాడు. ప్రధాని అయ్యాక కూడా పిల్లల్తో ఆడాడు. పాడాడు. చాక్లెట్లిచ్చాడు. ఆయనకీ తెలీదు తన పుట్టినరోజు ఏదో ఒక నాటికి ‘పిల్లల రోజు’ అవుతుందని. అయింది. పిల్లలే ఆయనకిచ్చిన కానుక ‘చిల్డ్రన్స్ డే’. పిల్లలు ఏదీ ఉంచుకోరు. వెంటనే పంచుకుంటారు! కానీ మనం చేస్తున్నదేమిటి? పిల్లల కోసం బాల్యాన్ని కొద్దిగానైనా మిగల్చడం లేదు. చేస్తున్నదంతా వాళ్ల మంచి కోసమే. వాళ్ల ఫ్యూచర్‌ని చక్కగా ప్లాన్ చేస్తాం. కానీ వాళ్ల ప్రెజర్‌ని పట్టించుకోం. విజ్ఞానవంతుల్ని చేయాలని చూస్తాం. వికాసం కోసం చూడం. ఎదుగుతున్నారనే అనుకుంటాం.. లోలోపల గుదులుకుంటున్నారేమోనని చూడం. మన కలల్ని వాళ్లు నెరవేర్చాలని కోరుకుంటాం. వాళ్లకొచ్చే పీడకలల్ని అర్థం చేసుకోం. అన్నీ ఇస్తాం. అనుబంధాలను ఇవ్వం.ఆడుకోమంటాం.ప్లేగ్రౌండ్ ఇవ్వం. ఇంత హింసేమిటి? బట్టీల్లో, కర్మాగారాల్లో కనిపించే బాలల వెట్టిచాకిరీ మాత్రమే మనకు హింసగా కనిపిస్తుంది. ఇంట్లో, స్కూల్లో పెట్టే హింస కనిపించదు. చైల్డ్ లేబర్ని, చైల్డ్ ట్రాఫికింగ్‌ని, చైల్డ్ హెరాస్మెంట్ని, చైల్డ్ అబ్యూజ్‌ని అరికట్టే చట్టాలు ఉన్నాయి. ప్రయోజకుల్ని చేసే లక్ష్యంతో.. ఎదుగుతున్న మొగ్గల్ని చిదిమేసే హింసను అరికట్టేందుకు ఏ చట్టం ఉంది? పిల్లలకు ఎంతో ఎక్కువ చేస్తున్నాం అనుకుంటున్న మనం.. తక్కువ చేస్తున్నదేమిటో కూడా ఈ బాలల దినోత్సవం రోజు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. డిజి బిజి ఓ ముప్పయ్ ఏళ్ల కిందట... పిల్లలు గ్రౌండ్లో ఆటల్లో మునిగిపోతే, సాయంత్రం దాటి చీకట్లు ముసురుకుంటున్నా ఇల్లు గుర్తుకు వచ్చేది కాదు. ‘ఇక ఆడుకున్నది చాలు. ఇళ్లకు వెళ్లండి’ అని ఆ దారిన వెళ్లే పెద్దవాళ్లు ఎవరో కోప్పడే వరకు ఆటలు ఆగవు. మరీ గడుగ్గాయిలైతే... వాళ్లను వెతుక్కుంటూ తల్లులు రావాలి, చెవులు మెలేసి ఇంటికి లాక్కెళ్లాల్సిందే. సంతోషాలు రాశిపోసిన బాల్యం అది. ఆనందం చిందిన బాల్యం అది. ఆరోగ్యం నిండిన బాల్యం అది. గడిచిన తరాలు అనుభవించిన సృజనాత్మకమైన బాల్యం అది. ఈ తరానికి తెలిసిన బాల్యం ఎలక్ట్రానిక్ బాల్యం. ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే రోజు గడిచిపోయే కాలమిది. అమ్మానాన్నలు ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు, ఎవరి స్మార్ట్‌ఫోన్‌లో వాళ్లు మునిగిపోతున్నారు. పిల్లలు కంప్యూటర్లో హారర్ షోలతో ఉత్కంఠకు గురవుతుంటారు. టామ్ అండ్ జెర్రీ చూస్తూ కసిగా నవ్వుకుంటుంటారు. ఏడిపించి నవ్వడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంటారు. ఈ తరానికి గేమ్స్ అంటే వీడియో గేమ్సే, కదలకుండా కూర్చుని మెడ వంచేసి, వత్తులేసుకున్నట్లు కళ్లు తెరుచుకుని గంటల కొద్దీ గడపడమే వాళ్లకు తెలిసిన ఆటలు. బాల గేయాలంటే సీడీలు ప్లే చేసి ‘చిట్టి చిలకమ్మ’ను చూడడమే తప్ప నోరు తెరిచి ఆలపించాలనే ఆలోచనే ఉండడం లేదు. ల్యాప్‌టాప్, యూ ట్యూబ్, స్మార్ట్ ఫోన్, వీడియోగేమ్స్‌లో కుదురుకుపోతున్నారు తప్ప ఒళ్లు కదిలించే ఆటల వైపే చూడడం లేదు. గది నిండా ఎలక్ట్రానికి డివైజ్‌లు. వాటిని ప్లే చేసే ఓ ప్రాణమున్న డివైజ్. ఇదే ఈ తరం ఎంజాయ్ చేస్తున్న ‘ఈ– బాల్యం’. అంతంత సేపు స్క్రీన్ చూస్తే చూపు పోతుందని కోప్పడితే, రిమోట్‌తో డ్రోన్‌ను ఎగిరిస్తారు. బయటకు వెళ్లి ఆడుకోమంటే... జేబు నిండా డబ్బులేసుకుని ప్లే స్టేషన్‌కెళ్లి బంపింగ్కార్స్తో ఢీ కొట్టుకోవడమే నేటి తరం ఆనందిస్తున్న ఆట. ఈ మోడరన్ టెక్ లైఫ్‌లో ‘నో ఫుడ్ డే’ ఉంటుందేమో కానీ ‘నో టెక్ డివైజ్ డే’ ఉండదు. డే మొత్తం కాదు ఓ గంట కూడా స్క్రీన్కు దూరంగా... తనకు తానుగా మెదడు పెట్టి, మనసుతో గడపలేకపోతోంది ఈ హైటెక్ జనరేషన్. సాంకేతికాభివృద్ధి మనిషి జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉపయోగపడాలి.మనిషిని మరబొమ్మలా చేయకూడదు. నిజానికి అన్నింటికీ నెపాన్ని పిల్లల మీద తోసేస్తారు, కానీ వాళ్లు ఇలా మారడానికి మూలం ఏమై ఉండాలి?‘జో అచ్యుతానంద జోజో ముకుందా...’ అమ్మ ఒడిలో పడుకుని పాట వింటూ నిద్రలోకి జారిపోతుంది ఏడాది పాపాయి. ఆ పాటను అమ్మ పాడడం లేదు. పక్కనే స్మార్ట్‌ఫోన్‌లో పాట పెట్టేసి పాపాయిని ఒడిలోకి తీసుకుని జో కొడుతుందంతే. అమ్మ గొంతు వినడమే బిడ్డకు భరోసా అని, అమ్మ శ్రావ్యంగా పాడకపోయినా... పాట బాగాలేదని పాపాయి ముఖం చిట్లించదని ఆ అమ్మకు తెలియాలి. తాను జోల పాడి నిద్ర పుచ్చితే, తాను ‘చిట్టి చిలకమ్మ’ అని పలుకుతూ పాపాయికి నేర్పిస్తే... పాపాయి కూడా తన ఆట తాను ఆడుకుంటుంది. తన పాట తాను పాడుకుంటుంది. అది లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ప్లే చేయడం మాత్రమే నేర్చుకుంటుంది. తనలో క్రియేటివిటీ ఉందన్న సంగతి కూడా తెలియకుండానే పెద్దదయిపోతుంది. అందుకే... అమ్మలూ! జోల పాడండి, పాపాయికి తాను పాట వినడమే కాదు, పాడాలి కూడా అని తెలిసేలా పెంచండి. సృజనాత్మకతతో వికసించాల్సిన రేపటి తరాన్ని టెక్ సీలో ముంచవద్దు. అమ్మ, నాన్న, ఓ బిడ్డ, నాలుగు స్మార్ట్ఫోన్లు, ఓ టాబ్లెట్, ల్యాప్‌టాప్... ఇదీ ఇప్పటి కుటుంబ ముఖచిత్రం. బాల్య సంబంధాలు నాన్న కోప్పడితే వెళ్లి బాబాయి వీపు వెనుక దాక్కోవడానికి లేదు. లేదా నాన్న భయం లేదని తెలిస్తే బాబాయ్‌తో చెప్తానుండు అని అనడానికీ లేదు. తాతయ్య బజారు నుంచి వస్తూ వస్తూ చేసంచిలో కారాబూందీ పొట్లం కట్టించుకొని వచ్చి, మంచం మీద కూచుంటూ పిలిచి, బుగ్గలు పుణికి దానిని చేతిలో పెడితే, తీసుకుని తింటున్నప్పుడు తాతయ్య నవ్వే నవ్వు చూడ్డానికి లేదు. విసుక్కునే అమ్మను మందలించి దగ్గరకు తీసుకునే నానమ్మ ఒడి లేదు. ‘జామకాయలు కోద్దాం రా’ అని ఉప్పు మూట ఎక్కించుకుని పెరట్లో ఆటలాడే పిన్ని వాత్సల్యం లేదు. ఉన్న అనుబంధాలు పరిమితమైపోయాయి. ప్రతి ఇంట్లో అమ్మా నాన్న అన్న లేదా చెల్లి. నలుగురు మనుషుల కుటుంబంలో అనుబంధపు తీపి తెలుస్తున్నదా నేటి బాల్యానికి. నిన్న మొన్నటి వరకూ కనీసం సెలవుల్లో పెదనాన్న ఇంటికి వెళతాము, మేనమామ ఇంటికి వెళతాము అని అనేవారు. వెళ్లేవారు. ఇప్పుడు వెళ్లినా భరించే స్థితిలో బంధువులు ఉండటం లేదు. రోజులకు రోజులు అట్టి పెట్టుకునే ఓపిక ఉండటం లేదు. వీలు ఉండటం లేదు. బతుకులు బాదరబందీలో చెదిరిన బంధాలలో బాల్యం చాలా విలువైన అనుబంధాలను మిస్ అవుతూ ఉంది. ‘మనవాళ్లు’ అనే భావన ఎప్పుడూ పిల్లలకు భద్రతను ఇస్తుంది. నన్ను ప్రేమించే నా వాళ్లు ఉన్నారని రక్త సంబంధీకులను చూసి పిల్లలు సంబర పడతారు. ఉత్సాహ పడతారు. పిల్లలకు కజిన్స్ మొదటి స్నేహితులవుతారు. వారి రహస్యాలు పంచుకునే నేస్తులవుతారు. అలకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, పిల్లలు మాత్రమే ఆశించే కోరికలు ఇవన్నీ ఒట్టి అమ్మానాన్నల వల్ల తీరిపోవు. వారి ఒక్కరి సమక్షం చాలదు. బంధువులు కావాలి. రక్తసంబంధీకులు కావాలి. బాల్యం డొల్ల కాకుండా తన వారితో కూడిన జ్ఞాపకాలను వారిలో కూరాలి. వేరుగా ఉండొచ్చు కాని వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. ఇరుగు పొరుగు మీద హక్కు ఉండదు.స్నేహితుల మీద డిమాండ్ ఉండదు. కాని రక్త సంబంధీకులను నిలదీయవచ్చు. మంచిలో చెడులో భాగానికి పిలుపియ్యవచ్చు. అవి లేని ఒంటరివాళ్లుగా పిల్లలను మారుస్తున్నామేమో ఆలోచించాలి. పిల్లలు అడిగితే బర్గర్ చేతిలో పెడుతున్న తల్లిదండ్రులు ఒక బంధాన్ని చేతికి దారంలా చుడుతున్నారా? ఆలోచిద్దామా? వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. కలలు కూడా దోచుకునే... సినిమాకు వెళ్లాలంటే పెద్ద పథకం. నాన్న పర్మిషన్ అడగాలి. అమ్మకు వీలు కుదరాలి. పోపులడబ్బాలో డబ్బులు ఉండాలి. ఇంటర్వెల్లో గోల్డ్‌స్పాట్ తాగడం కోసం వారం రోజులుగా పోగేసిన చిల్లర జేబుల్లో ఉంటుంది. మసాలా వడలు, పునుగులు న్యూస్ పేపర్ కాగితంలో పట్టుకుని తింటూ సినిమా చూస్తుంటే మజా వస్తుంది. మరుసటి రోజు స్కూల్లో స్నేహితులకు ‘నేను నిన్న సినిమా చూశాను తెలుసా’ అని చెప్తే గొప్ప వస్తుంది. పిల్లలకు అతి చవకైన వినోదం సినిమా. తల్లిదండ్రులు కూడా సినిమా బడ్జెట్‌ను పెద్ద బడ్జెట్‌గా చూసేవారు కాదు. రోజువారి బాదరబందీలో పిల్లలతో సినిమాకు వెళ్లడం వారికీ ఓ ఆటవిడుపు. కాని ఇవాళ సినిమా వ్యవహారం మారిపోయింది. సింగిల్ స్క్రీన్స్ పోయాయి. మల్టీప్లెక్సులు వచ్చాయి. రేట్లు ఖరీదయ్యాయి. పాప్‌కార్న్ ప్యాకెట్, కూల్‌డ్రింక్ ధర టికెట్ కంటే ఎక్కువగా ఉంటుంది.ఒక కుటుంబం ఒకసారి సినిమాకు వెళ్లాలంటే పెద్ద ఖర్చు అవుతుంది. దాని వల్ల తల్లిదండ్రులు సినిమాకు వెళ్లడాన్ని నిరుత్సాహపరుస్తున్నారు.పిల్లలు ఒక ముఖ్యమైన ఆనందాన్ని మిస్ అవుతున్నారు.‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని ఒక సినిమాలో కవి అన్నాడు. పిల్లలకు రంగుల కలలు ఇచ్చే సినిమాను కూడా దూరం చేసే దొంగలు ఎవరో మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? వాల్‌పోస్టర్లు చూసి ఇమాజినేషన్లోకి వెళ్లగలిగిన క్రియేటివిటీని చిదిమేస్తున్నాం. ప్రభుత్వాలు పార్కులు కట్టడం లేదు. స్కూళ్లలో ప్లేగ్రౌండ్లు ఉండటం లేదు. వీధుల్లో ట్రాఫిక్. ఆటలు దూరమైన పిల్లలు కోరే కనీస వినోదం, బయటకు వెళ్లే వీలు సినిమా. అది కూడా తప్పించి టీవీ లేదా ఫోన్లో వారికి దొరికింది చూసే వీలు కల్పిస్తూ కంటి జబ్బులకు కారణం అవుతున్నాం. సినిమా బాల్యంలో ఒక ముఖ్య జ్ఞాపకం. ఇవాళ ఎంతమంది పిల్లలకు ఆ జ్ఞాపకం ఉంటోంది? కత్తి యుద్ధాలు చేసే హీరోను చూసి ఇంటికొచ్చి చీపురుపుల్లలు పట్టుకునేవారు. టేప్ రికార్డుల్లో పాట వస్తుంటే డాన్స్ చేసేవారు అటకెక్కిన ఆటలు చింటూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఆ రోజు చింటూకి చాలా సంతోషంగా ఉంది. అమ్మనాన్నలతో కలిసి సినిమాకు వెళ్లాడు. బయట ఐస్‌క్రీమ్ ఇప్పించాడు నాన్న. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో క్రికెట్ బ్యాట్, బాల్ కొనిచ్చాడు. బ్యాట్ పట్టుకోగానే చింటూ ముఖం మతాబులా వెలిగిపోయింది. బ్యాట్‌ని ఎడమచేత్తో ఛాతీమీదుగా గట్టిగా పట్టుకున్నాడు. బాల్ని షర్ట్ జేబులో కుక్కుతుంటే ‘జేబు చిరుగుతుందిరా! నే పట్టుకుంటా’ అని తల్లి అంటే ‘ఊహూ..’ అని తల అడ్డంగా ఊపి, ఆ రెంటినీ తనే గట్టిగా పట్టుకున్నాడు. అమ్మనాన్నలతో ఉన్నా చింటూ ధ్యాసంతా ఇంటి దగ్గర బంటి, చిన్ను, మున్నాలతో కలిసి ఎప్పుడెప్పుడు క్రికెట్ ఆడుకుంటానా ఉంది. ఇంటికి చేరుకునే సరికి చీకటి పడింది. తల్లిదండ్రి వారిస్తున్నా తన స్నేహితుల ఇళ్లవైపు పరిగెత్తాడు. ‘ఇప్పుడెక్కడ ఆడుకుంటారు.. రేప్పొద్దున రా!’ అనడంతో గ్రౌండ్లో ఔట్ అయిన బ్యాట్స్‌మెన్‌లో బ్యాట్‌ను చంకలో పెట్టుకొని దిగాలుగా ఇంటి ముఖం పట్టాడు. ‘రేపు సండే స్కూల్ లేదుగా ఎంచక్కా ఆడుకోవచ్చు’ అని తల్లి చెప్పడంతో మురిపెంగా ఆ రాత్రి బ్యాట్‌ని పక్కనే పెట్టుకొని పడుకున్నాడు రేపటి ఆటను కలగంటూ! తెల్లారి చింటు.. మున్నా, బంటి బ్యాట్‌కి పనిచెబుతూ కేరింతలు కొడుతున్నారు. ‘ఏంటా అల్లరి..? కాస్త పక్కకెళ్లి ఆడుకోండి..’ గద్దించాడు ఎదురింటి పెద్దమనిషి. రెండు బాల్స్ వేశారో లేదో ‘ఏం ఆటల్రా.. కాళ్లకు అడ్డంపడుతూ మమ్మల్ని పడేసేట్టున్నారు అరిచేసింది పక్కింటి ఆంటీ. ఇంతలో చిన్ను బ్యాట్‌తో బాల్ని కొడితే అది కాస్తా ఎదురింటి కిటికీకి తగిలి అద్దం పగిలింది.అంతే, ఆ ఇంటి వాళ్లతో పెద్ద గొడవ అవడంతో కోపం వచ్చి చింటూను నాలుగు బాదింది తల్లి. ‘పోయిన వారం ఇలాగే వాలీబాల్ అంటూ తీసుకొచ్చారు. ఆ బాల్‌తో ఆడుకుంటూ ఎదురుగా వచ్చే వెహికిల్‌ను చూసుకోలేదు. కాస్తయితే, ఆ వెహికిల్ కింద పడేవాడే. ఇప్పుడు చూడండి..’ అంటూ భర్తను కోప్పడి చింటూని ఇంట్లోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది. ఏడుస్తూ ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయాడు చింటూ. మరుసటి రోజు ఇంట్లో ఆడుకుంటే బాల్ వెళ్లి సామాన్లకు తగిలి, అవి పగిలిపోతున్నాయని కొట్టింది. చింటు సైకిల్ కూడా బయట తొక్కడానికి లేదు. ఎటు నుంచి ఏ వెహికిల్ వస్తుందో అని అమ్మ భయపడుతుంది. ఇంట్లో తొక్కే స్థలం ఉండదు. అప్పుడప్పుడు ఆ సైకిల్ మీద కాసేపు కూర్చుంటాడు అంతే! చుట్టూ అపార్ట్మెంట్లు. ఇరుకిరుకుగా ఉండే ఇళ్లు. గజం స్థలం దొరికినా డజన్ ఇండ్లు కట్టేస్తున్న రోజులివి. తల్లి ఈ మధ్య ఓ కొత్త ఉపాయం కనిపెట్టింది. చింటూ ఉదయం ఏడున్నరకు స్కూల్‌కి వెళితే ఇంటికి వచ్చేసరికి నాలుగు దాటిపోతుంది. రాగానే బట్టలు మార్చి పాలు, స్నాక్స్ ఇస్తుంది. ఐదు నుంచి ఏడు గంటల వరకు ట్యూషన్లో చేర్చితే సరి. చింటూ ఆటలకు, అల్లరికి ట్యూషన్ చెక్ పెట్టేసింది. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ టీవీ చూస్తూ ఉంటుంది. అమ్మ స్మార్ట్ ఫోన్లో చింటు గేమ్స్ ఆడుకుంటూ ఆమె పక్కనే కూర్చుంటాడు. ఇప్పుడు అమ్మకు నిశ్చింతగా ఉంది. పిల్లవాడు ఎటూ పోవడం లేదు. స్కూల్, ఇల్లు. ఇప్పుడు ఎవరితోనూ గొడవలు లేవు. ఉదయాన్నే బద్దకంగా లేచిన చింటూ టైమ్ అయిపోతుందనే హడావుడిలో రెడీ అవుతుంటాడు. పుస్తకాల సంచి భుజాలకు తగిలించుకొని, పాలిష్ చేసిన షూస్ వేసుకొని, వాటర్ బాటిల్‌ని మెడకు వేసుకొని.. స్కూల్ బస్సు ఎక్కేస్తాడు. మళ్లీ సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. అటు నుంచి ట్యూషన్‌కి, ఆ తర్వాత ఇంటికి. సైకిల్ తొక్కడం లేదని కాళ్లకు అడ్డుగా ఉందని అమ్మ దాన్ని అటకమీదకు చేర్చింది. దాని పక్కనే ఇప్పుడు బ్యాట్ కూడా చేరిపోయింది. ఆ పక్కనే దుమ్ము కొట్టుకుపోయిన రెండు బాల్స్.. చింటూవైపు దిగాలుగా చూస్తూ ఉన్నాయి ఎప్పుడు చింటూ చేతిలో తమకు ఊపిరి ఆడుతుందో అని. చింటూ ఒక్కడే కాదు బంటి, మున్నా, చిన్ను.. ఇప్పుడు ఎంతో మంది పిల్లల జీవిత పుస్తకంలో బాల్యం పేజీ ఆటల్లేక రెపరెపలాడుతోంది పిల్లలకు కావల్సిన ఆటవస్తువులు అయితే కొనగలుగుతున్నారు. కానీ, వాటితో ఆ పిల్లలను ఫ్రీగా ఆడుకోవాల్సినంత మైదానాన్ని ఎలా ఇవ్వగలరు. గుడి బడి గుర్తుందా? చిన్నప్పుడు శ్రీరామ నవమికి పందిళ్లలో స్నేహితులతో తాగిన తియ్యటి పానకం గుర్తుందా? నానమ్మలు, అమ్మమ్మలు చెప్పిన దేవతలు, రాక్షసుల కథలు గుర్తున్నాయా? పరీక్షలప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టి ఫస్టు మార్కు రావాలని మొక్కుకోవడం జ్ఞాపకమేనా? టీవీలో చూసిన రామాయణం, మహాభారతం, బడిలో వ్యాస రచనకో, వక్తృత్వానికో బహుమతిగా ఇచ్చిన బొమ్మల భాగవతం, ధృవచరిత్ర, భక్త మార్కండేయ పుస్తకాల జ్ఞాపకాల పుటలు ఇప్పటికీ తెరుచుకునే ఉన్నాయా? సంపూర్ణ రామాయణం సినిమాలో సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తికెళ్లిపోయే సీను చూసి ఏడ్చిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే అనిపిస్తోంది కదా! దేవుళ్లకీ కష్టాలు తప్పవనీ, అయితే అవి ఎంతోకాలం ఉండవనీ, రాక్షసులు, దుర్మార్గులు చివరికి చావక తప్పదనీ పుస్తకాలలో చదివిన, సినిమాలలో చూసిన ఘట్టాలు గుర్తుండే ఉంటాయి కదా! కృష్ణాష్టమి వేడుకలలో ఉట్టి కొట్టడం, హనుమజ్జయంతికి ఉపవాసాలుండి కొబ్బరి కాయలు కొట్టి, బోలెడంత బలం వస్తుందని గట్టిగా నమ్మడం, ఆంజనేయస్వామి అంత మహాసముద్రం మీదుగా ఎగురుకుంటూ లంకకు చేరడం, తోకతో నిప్పంటించటం... ఇవన్నీ మన బాల్యజ్ఞాపకాలు కదా... అవి ఎంత బలాన్నిచ్చేవి. మానసికంగా ఎంత ధైర్యాన్ని నూరిపోసేవి! జబ్బు చేస్తే తగ్గిపోవాలని మొక్కుకోవడం, ఆ తర్వాత కుటుంబమంతా కలసి తిరుపతి కొండకో, అన్నవరానికో వెళ్లి మొక్కు తీర్చుకుని రావడం ఎంత చేదు, తీపి కలగలసిన జ్ఞాపకం? ఇప్పుడవన్నీ ఏవి? ప్రసాదం కోసం గుడికెళ్లడం, ప్రసాదంతోనే పొట్ట నింపుకోవడం, గణపతి నవరాత్రుళ్లలో భజన బృందాలతో గొంతు కలపడం, గుళ్లో పాడటం కోసం పొద్దున్నే లేచి త్యాగరాజు, అన్నమయ్య కృతులు సాధన చేయడం తలచుకుంటుంటే ఇప్పటికీ గొంతులోనుంచి తొంగి చూసే ఆ గమకాలను ఆపగలమా? మైకులో భగవద్గీత శ్లోకాలు పాడటం, పీర్ల పండుగప్పుడు స్నానాలు చేసి పీర్లు పట్టుకుని భక్తితో ఊగిపోతూ గుండాలు తొక్కుతుంటే కళ్లు ఇంతింత చేసుకుని చూడటం, రంజానుకు స్నేహితులు తెచ్చిన ఖీర్ తాగిన తియ్యటి జ్ఞాపకం, క్రిస్టమస్ పండక్కి భక్తిగీతాలు పాడటం, క్రిస్టమస్ ట్రీ తయారు చేయడం... ఇవన్నీ ఇప్పుడేమైనాయి? జ్వరం వచ్చినప్పుడు గుళ్లో పూజారిగారు నీకేం కాదురా, రేప్పొద్దుటికల్లా తగ్గిపోతుంది పో అంటూ విభూతి పెడితే తెల్లారేసరికి జ్వరం జారిపోవడం ఎంత నమ్మకం కలిగించేది? ఆధ్యాత్మికతలు ఎప్పుడూ మంచి భావనలనే పాదుకొల్పుతాయి. మన ప్రయత్నం మనం చేద్దాం.. ఆ తర్వాత అన్నిటినీ ఆ పై వాడున్నాడనే ధైర్యం ఓ టానిక్కు. చెయ్యరాని పనులు చేస్తే కళ్లు పోతాయి అనే భయం ఉంటే చెడ్డపనుల జోలికి పోతారా ఎవరైనా? బాల్యం నుంచి భక్తిగా, ఆధ్యాత్మిక వాతావరణంలో పదిమందితో కలిసి మెలిసి తిరిగితే అదెంత బలం? ఎంత ధైర్యం? బిట్టర్ చాక్లెట్ ‘‘ఎందుకలా ఉన్నావ్?’’ పన్నెండేళ్ల భూదేవి అడిగింది బాల సదన్ చూరు కింద అరుగు మీద దిగాలుగా కూర్చున్న ఆకాశ్‌తో. వాడికీ పదకొండు, పన్నెండేళ్లుంటాయేమో!‘‘ప్చ్.. ’’అన్నాడు నిర్లిప్తంగా చేతిలో ఉన్న రేపర్తియ్యని చాక్లెట్‌ను అటూఇటూ తిప్పుతూ.‘‘ప్చ్.. అంటే’’ అంది ఆకాశ్ పక్కనే కూర్చుంటూ. ‘‘ఏం లేదు’’అని తన పక్కనే కూర్చున్న ఆమెను అయోమయంగా చూస్తూ అన్నాడు.‘‘ఆ చాక్లెట్ ఎవరు ఇచ్చారు?’’ మళ్లీ ప్రశ్న భూదేవి నుంచి.‘‘కావాలా.. తీసుకో’’ అంటూ ఇవ్వబోతుంటే ‘‘నా దగ్గరా ఉంది..’’కుర్తీ జేబులోంచి తీస్తూ చూపించింది. ‘‘కొత్తగా జాయినయ్యావా? ఎవరు తీసుకొచ్చారు?’’ అడిగాడు ఆసక్తిగా.ఈసారి ఆ అమ్మాయి జవాబు చెప్పకుండా దిక్కులు చూసింది. ‘‘ఇప్పుడే కనిపిసున్నావైతే అడిగా.. ’’ ఆకాశ్. అయినా ఆమె నుంచి సమాధానం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆచాక్లెట్ను కుడిచేయి బొటనవేలు, నాలుగు వేళ్ల మధ్య ఉంచి ఆడిస్తోంది. ‘‘గర్ల్స్ అటువైపే ఉండాలి. సాయంత్రం ఆరు దాటితే ఇటు రాకూడదు’’చెప్పాడు ఆకాశ్.‘‘ఊ... తెలుసు. ఇందాక ఇటువైపు వస్తుంటే చెప్పారు.ఏడవుతోంది బాయ్స్ వైపు వెళ్లొద్దు అని’’అంది. ‘‘ఎందుకలా ఉన్నావ్?’’ మళ్లీ మొదటి ప్రశ్న భూదేవి నుంచి. ‘‘అమ్మ గుర్తొస్తోంది’’ గద్గదిక స్వరంతో ఆకాశ్. కాస్త చేరువగా జరిగి.. మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. ఆ స్పర్శ.. ఆలంబనకు ఆకాశ్ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. మొహం అటువైపు తిప్పి ఆ వైపు భుజంతో కళ్లు తుడుచుకున్నాడు. వాడి పరిస్థితి అర్థమైంది అమ్మాయికి. ‘‘అమ్మ, నాన్న.. ’’ అంటూ ఆగింది. ‘‘అమ్మ చచ్చిపోయింది. నాన్నే చంపేశాడు. నాన్న జైల్లో ఉన్నాడు’’ దూరంగా ఆగిపోయిన నిర్మాణం ముందున్న ఇసుక కుప్పల వైపు చూస్తూ చెప్పాడు ఏ భావం లేకుండా!‘‘ఎప్పుడు?’’ అడిగింది వాడికి కొంచెం ఎడంగా జరుగుతూ. ఏంటీ ఎప్పుడు? అన్నట్టుగా చూశాడు. గ్రహించిన ఆమె ‘‘అమ్మ ఎప్పుడు చనిపోయింది అని’’ వివరంగా అడిగింది. ‘‘త్రీ ఇయర్స్ అవుతోంది’’ చెప్పాడు. ‘‘అప్పటి నుంచీ ఇక్కడే ఉన్నావా?’’ ఆ అమ్మాయి.మళ్లీ ‘‘ప్చ్’’ అంటూ అడ్డంగా తలూపాడు. ‘‘మరి’’ అన్నట్టు చూసింది. ఆరు చేతివేళ్లు చూపిస్తూ ‘‘సిక్స్ మంత్స్ అవుతోందంతే ఇక్కడికి వచ్చి. అంతకుముందు బాబాయ్ వాళ్లింట్లోనే ఉన్నాను. బాబాయే ఇక్కడ దింపి వెళ్లాడు’’చెప్పాడు. ‘‘కానీ.. కానీ’’ ఆగాడు. ‘‘ఏమైంది’’ అంటూ మళ్లా ఓరగా జరిగి ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది. ‘‘నాకు ఇక్కడ నచ్చట్లేదు. పారిపోవాలనిపిస్తోంది’’ ఈసారి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ‘‘ఒరేయ్ .. ఏడ్వకురా.. పర్లేదు. సర్దుకుంటుంది’’ అంటూ వాడి చేతిలోని చాక్లెట్ తీసుకుని రేపర్ విప్పి వాడికివ్వబోయింది. ‘‘ఛీ ..’’అంటూ విసిరికొట్టి అక్కడి నుంచి ముందుకు పరిగెత్తి బాదాం చెట్టు కింద ఆగాడు. హతాశురాలైంది భూదేవి. తనూ వాడి దగ్గరకు పరిగెత్తి.. ‘‘ఏమైందిరా’’ కంగారుగా అడిగింది. ‘‘అది వాడిచ్చిన చాక్లెట్. చేదు.. వాక్’’అన్నాడు వస్తున్న ఏడుపును ఆపుకొనే ప్రయత్నం చేస్తూ. ‘‘వాడెవడు?’’అడిగింది. ‘‘బాలసదన్ ప్రిన్సిపాల్ తమ్ముడు. నేనొచ్చినప్పటి నుంచీ... నన్ను.. ఆ ఇసుక తెన్నెల వైపు తీసుకెళ్లి.. నా బట్టలు.... ’’ చెప్పలేక ఆగిపోయాడు. ఏడుస్తూ నేల మీద పడిపోయాడు. ‘‘నాకు అమ్మ కావాలి అక్కా.. అమ్మ కావాలి. నేను నాన్న దగ్గరుండాలి’’ అంటూ.భూదేవి కళ్లల్లోనూ నీళ్లే. తన దగ్గరున్న చాక్లెట్ వంక చూసుకుంది. అలాంటి చాక్లెట్ ఇచ్చే.. ఆర్నెల్ల కిందట ఓ అంకుల్ తనను తీసుకెళ్లిపోయాడు. పుణే అట.. అక్కడ ఎవరో ఆంటీకి అమ్మేశాడు. ఈ ఆర్నెల్లు ఎందరో అంకుల్స్.. చాక్లెట్స్ ఇచ్చి.. నా బట్టలు కూడా.. ’’ భూదేవి మెదడు గతాన్ని గుర్తుచేస్తుంటే.. కళ్లు నీళ్లను కుమ్మరిస్తున్నాయి.. అసంకల్పితంగానే ఆ అమ్మాయీ ఆ చాక్లెట్‌ను విసిరి కొట్టింది. మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. చిట్టీ... కొట్టేది బట్టీ ‘‘మా బుజ్జిగాడు రోబోలోని చిట్టీ రా. ఎంత షార్ప్ గ్రాస్పింగ్ పవర్ తెల్సా? అలా చూస్తే ఇలా పట్టేస్తాడు. ఎప్పుడూ చదువే. ఆ చదువు తప్ప మరో లోకం తెలియదు’’ ఫ్రెండ్స్ ఇండ్లకు వెళ్లినప్పుడు వినిపించే మురిపెపు మాటలివి. అవి విన్నవాడికి తన కొడుకు గుర్తొస్తాడు. ఆ రోబోగాడెవడో కనీసం కళ్లతో స్కాన్ చేశాడు. కానీ నా కొడుక్కు ఇలా పుస్తకాన్ని టచ్ చేస్తే... అలా మెదడులోకి మెటీరియల్ పంపే ట్యుటోరియల్ ఏదైనా దొరికితే బాగుండని ఆశ.పే‘రెంట్స్’ అనే పేరున్నందువల్ల అవసరాలకనీ రెంట్స్ పే చేస్తూ చదువులకు బిల్స్ పే చేస్తున్నందున పే చేసేదానికి ఫలితం తప్పక రావాలన్నదే ఇప్పటి తల్లిదండ్రుల ఆశ. అందుకే వాళ్లు కార్పొరేట్స్కూళ్లూ, కాలేజీలలో బందీలయ్యారు. ఇంకా విపరిణామం ఏమిటంటే... నెక్ట్స్ ఇయర్ ఇంటర్లోకి వస్తున్న పేరెంట్స్ ఫోన్ నంబర్లు సంపాదించి, వాడి క్వార్టర్లీ ఎగ్జామ్స్ కంటే అర్లీగానే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు చిన్ననాటి ఆటలు చదువులకు సాయం చేస్తున్నాయా లేదా చూద్దాం. గోడకేసి బంతి కొడుతూ ఆటాడినవాడికి న్యూటన్స్ థర్డ్‌లా చిన్నప్పుడే వచ్చేసి ఉంటుంది. గోలీలాడుతున్నప్పుడు గీసిన బాక్స్‌లో మనం గురి చూసిన గోలీని కొడితే... అసలది బయటకు వచ్చిన మన కొట్టుడుగోలీ అక్కడే కూర్చుండిపోయి మనం ఔటయ్యిన్నాడు ఉక్రోశం మాత్రమే ఉంటుందేమోగానీ... ఇంటర్‌కొచ్చాక మొమెంటమ్, ఫోర్సూ, డైరెక్షన్ అనే వెక్టార్స్ గురించి తెలిసిన నాడు అలనాటి ఉక్రోశం గుర్తొచ్చి ఉల్లాసం మిగులుతోంది. ఎప్పుడూ పదేళ్ల నాడు కాలేజీలో చదవబోయే అడ్వాన్స్డ్ చదువులన్నింటికీ అడ్వాన్స్‌గా గల్లీల్లో మనం ఆల్రెడీ ప్రాక్టికల్స్ చేసే ఉన్నామని తెలిసిపోతుంది. దాంతో చదువు గోలీలాటంత ఈజీ అవుతుంది. కాన్సెప్ట్ బుర్రలోకి గిల్లీదాండంత సిల్లీగా ఎక్కిపోయి సింపులవుతుంది. ఈలోపు మావాడు రోబో అంటూ స్వయానా ఆ తండ్రే చెబుతున్న మాటలు వింటుంటే... అదీ నిజమే కదా అని జాలేస్తుంది. సంస్కారం అడ్డొచ్చిగానీ... లేకపోతేనా ‘‘ఒరే పేరెంట్స్లారా... వాడు ఒక రకంగా నిజంగానే రోబో అవునో కాదో తెలియదు గానీ... వాడు మాత్రం కచ్చితంగా ఒరిజినల్లంత విలువ లేని కాపీలను సృష్టించే జిరాక్స్ మెషీన్ రా’’ అని అరవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంటర్లోకి వస్తున్న పేరెంట్స్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు చేస్తున్నారు. -
మళ్లీ ఐఏఎస్‌లు...!!
ఒకే నెలలో రెండుసార్లు ఐఏఎస్‌ల గురించి... ‘సేవ’ని అటకెక్కించిన అధికారులున్న నేపథ్యంలో తమిళనాడు తిరువణ్ణామలై కలెక్టరు కందసామి ఒక ఒయాసిస్సు. కలెక్టరుగా ఓ మామూలు కుటుంబానికి చేయూతనిచ్చి, స్వయంగా వంట చేసి, ఆర్డరు ఇచ్చి వచ్చారు. సేవకీ, పరిపాలనా దక్షతకీ ప్రతీకగా నిలిచే ఈ సర్వీసు బ్రిటిష్‌వారి పాలనలో మిగుల్చుకున్నది. అయితే ఆనాటి ఐసీఎస్‌ల ఆర్భాటం, హంగులు నెహ్రూగారికి నచ్చేవి కావని నెహ్రూ రక్షణాధికారి రుస్తుంజీ ‘ఐయాం నెహ్రూ షాడో’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. నాకు గత 65 సంవత్సరాలుగా ఈ ఆఫీసర్లు తెలుసు. నా పన్నెండో ఏట విశాఖకు జేపీగిల్ గ్విన్ గారు కలెక్టరుగా ఉండేవారు. సాయంకాలం సభకి బంగళా నుంచి రోడ్డు పక్క చేతులు వెనక్కు కట్టుకుని నడిచి రావడం నేను స్వయంగా చూశాను. నెహ్రూకీ, రాజేంద్రప్రసాద్‌కీ సెక్రటరీగా పనిచేసిన హెచ్‌వీఆర్ అయ్యంగా ర్ని చూశాను. ‘సురభి’ సంపాదకుడిగా ఆంధ్రాలో ఆఖరి ఐసీఎస్ వీకే రావుగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన వయసిప్పుడు 104 సంవత్సరాలు. ఆయన కొడుకు, మేనల్లుడు ఐఏఎస్‌లు. వారి ఫొటో కోసం ముగ్గురు ఐఏఎస్‌లు కనీసం నాలుగేసిసార్లు నాకు ఫోన్లు చేసి సమకూర్చారు. ఇవాళ కలెక్టర్లు డవాలా బంట్రోతుల వెనుక మాయమవుతారు. వారు సాధారణంగా ఆకాశం నుంచి దిగి వస్తారు. మానవమాత్రులలో కలవరు. They lost their human facelong back. . అలనాటి చిత్తూరు కలెక్టరు బీకే రావుగారు– నాకు రచయితగా చేయూతనిస్తూనే జీవితంలో మనిషిగా పెద్ద రికాన్ని నష్టపోని ఉదాత్తతని నేర్పారు. నరేంద్ర లూథర్ మా నాటకంలో (వందేమాతరం) భాగంలాగా హైదరాబాదులో మాకు తోడుగా నిలిచారు. ఇంకా సీఎస్ శాస్త్రిగారు, జొన్నలగడ్డ రాంబాబుగారు వంటి అరుదైన అధికారులు ఆ పదవులకు వన్నె తెచ్చారు. వీపీ రామారావుగారు ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. దయాచారిగారు నా నాటిక ‘కళ్లు’ ప్రదర్శించిన విషయాన్ని ఆనందంగా పంచుకున్నారు. కెవీ రమణాచారిగారు నా ‘దొంగగారొస్తున్నారు...’ నాటికలో ప్రధాన పాత్రని నటించారు. అభిరుచికి అగ్ర తాంబూలమిచ్చి, అధికారం అడ్డం పడకుండా పదవినీ, పరిచయాల్నీ నిలుపుకున్న పెద్దలు వీరు. ఈ గొడవంతా ఇప్పుడెందుకు? నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి– ముగ్గురు చీఫ్ సెక్రటరీలను (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్) మూడు కారణాలకి– ఒకే రోజు నిలదీశారు. ఎందుకు? సరైన దుస్తులు వేసుకొని కోర్టుకి రానందుకు! ఒకాయన పాంటు, షర్టు దాని మీద పసుపు జాకెట్ వేసుకున్నారు. మరొకాయన పరిస్థితీ అలాంటిదే. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్గారు వారి వాంగ్మూలాన్ని వినడానికి నిరాకరించారు. కారణం– వారి దుస్తులు! ‘మీరు పిక్నిక్కి రాలేదు. మీమీ రాష్ట్రాలకు ప్రాధాన్యం వహిస్తూ వాజ్యాలను జరపడానికి వచ్చారు’ అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగారి కథ. పదవిలో ఉన్న రాష్ట్ర న్యాయమూర్తుల స్థాయిలోనే రిటైరైన న్యాయమూర్తులకు వైద్య సదుపాయాలు ఇస్తున్నారా? అన్నది వాజ్యం. ‘మేం అప్పుడే చేసేశాం సార్!’ అన్నారు చీఫ్ సెక్రటరీగారు. ‘ఏమిటి చేసేశారు?’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్న. ఈయన నీళ్లు నమిలారట. ‘మా ఆర్డర్లో రాష్ట్ర ప్రధాన అధికారి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోకుండానే కోర్టుకి వచ్చారని తెలియజేస్తాం’ అన్నారు న్యాయమూర్తి. వీరు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో నిలిచిన ఆఫీసర్లు– కనీస మర్యాదల్ని పాటించకపోవడం, ఆ కారణంగా న్యాయమూర్తి విచారణ జరపడానికి తిరస్కరించడం ఈ తరం అధికారులు తెచ్చిపెట్టిన అపఖ్యాతి. అలనాటి ఐపీఎస్‌లను పాలనా దక్షతకి సలహాదారులుగా– మార్గదర్శకులుగా ఆనాటి నాయకులు భావించేవారట. ఐసీఎస్ సాధికారికమైన పాలనకు గీటురాయి. ఇది వీకే రావు గారు స్వయంగా చెప్పిన వైనం. నీలం సంజీవరెడ్డిగారి వంటి నాయకులు ఈ అధికారుల్ని నెత్తిన పెట్టుకునేవారట. అంతెందుకు? ఫొటో కోసం కూర్చున్న ఆ కాలపు ఐసీఎస్ వీకే రావుగారు 104 సంవత్సరాల మనిషి– బహుశా 45 సంవత్సరాల కిందట ఉద్యోగ ధర్మంగా వేసుకునే దుస్తుల్ని వేసుకుని కెమెరా ముందు కూర్చోవడం గమనార్హం. కొసమెరుపు: నాతో మాట్లాడిన ఒక ఐఏఎస్గారన్నారు: ‘మారుతీరావుగారూ! కోర్టులో వకాల్తాకి వచ్చిన అధికారులు ఫలానా దుస్తుల్లో ఉండాలన్న రూలు లేదు’ అని. అయితే ‘మర్యాద’కీ ‘రూలు’కీ చుక్కెదురు. కోర్టులో నిలవడం బాధ్యత. సాధికారికమైన దుస్తులు న్యాయస్థానం పట్ల అధికారులు చూపే మర్యాద. దీనికి రూలు పుస్తకం అనవసరం. వెరసి– నేటి ఐఏఎస్‌ల నిర్వాకమిది. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
నెహ్రూ విగ్రహాన్ని తొలగించిన యోగి
లక్నో : ఆనంద్ భవన్ సమీపంలో ఉన్న భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు క్రేన్‌కు ఎదురుగా నిల్చోని నిరసన వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. దేశ ప్రథమ ప్రధానికిచ్చే కనీస మర్యాద ఇదేనా అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాక యోగికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుందరీకరణ కోసం నెహ్రూ విగ్రహాన్నే మాత్రమే తొలగించారు, అదే వీధిలో ఉన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. కానీ అధికారులు మాత్రం నెహ్రూ విగ్రహం తొలగింపు వెనక వేరే ఉద్దేశం లేదని తెలియజేశారు. వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళా ఏర్పాట్లలో భాగంగానే నెహ్రూ విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలపారు. -
మూడుకోట్ల జనం పేరు
ఆయన గుండెల మీద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడింది. కానీ స్వజాతి నాయకత్వం మాత్రం ఆయన గుండెలని పగలగొట్టాలని విశ్వ ప్రయత్నమే చేసింది. అయినా నమ్మినదే చేశారాయన. కుమిలిపోలేదు. విశ్వసించినదానినే గౌరవించారు. వైరాగ్యాన్ని దరి చేరనీయలేదు. తుది పైసా కూడా జాతి స్వేచ్ఛ కోసం అర్పించారు. తన కడుపులో పేగులు ఆకలితో గాండ్రిస్తున్నా వినిపించుకోకుండా, ప్రజల క్షుద్బాధనే పట్టించుకున్నారాయన. అందుకు, ఆయన ‘ఆంధ్రకేసరి’. కానీ, ఆయన అణువణువూ సింహమే, అన్నారు రాజాజీ. ఆయన ఏం చేసినా ఆంధ్రుల అభ్యుదయం కోసమే అన్నారు జవహర్లాల్. నిజమే, చరిత్రలో ఎక్కడో గాని తారసపడని ఓ కచ్చితమైన ప్రజల మనిషి. ఆయన– టంగుటూరి ప్రకాశంపంతులు. ఆంధ్రకేసరి జీవిత చరిత్ర మీద సింహావలోకనం చేసినా రోమాంచితం చేసే ఘట్టాలు కనిపిస్తాయి, అడుగడుగునా. ప్రకాశం (ఆగస్టు 23, 1872 – మే 20, 1957) చరిత్ర అంటే భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రే అనకపోవచ్చు. టంగుటూరి ఉద్యమం అంటే ఆంధ్రుల ఉద్యమ చరిత్ర అని కూడా అనకపోవచ్చు. కానీ ప్రకాశం అంటే... దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నట్టు ‘మూడుకోట్ల జనం పేరు’. అంటే నాటి ముక్కోటి ఆంధ్రుల హృదయ స్పందన. ఒంగోలు సమీపంలోని కనపర్తి అనే గ్రామంలో మేనమామల ఇంట ప్రకాశం పుట్టారు. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మగారు. పూర్వీకులది టంగుటూరు. తరువాత ప్రకాశం గారి తాతగారు వల్లూరు వచ్చేశారు. కాబట్టి మాది వల్లూరే అని ప్రకాశం గారు రాసుకున్నారు. అద్దంకి, వినోదరాయుడిపాలెం, నాయుడుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరాలలో ప్రకాశం బాల్యం గడిచింది. ప్రాథమిక విద్య కూడా ఆ ప్రాంతాలలోనే జరిగింది. ప్రకాశం గారి జీవితంలో ఒంగోలు ప్రయాణం, అక్కడ నుంచి గోదావరి గట్టున రాజమహేంద్రవరానికి చేరుకోవడం ఆకస్మికంగా, నాటకీయంగా జరిగాయి. అవే ప్రకాశాన్ని తీర్చిదిద్దాయి. 1884లో గోపాలకృష్ణయ్య హఠాత్తుగా కన్నుమూశారు. దీనితో సుబ్బమ్మగారు ఒంగోలు చేరుకుని చిన్న భోజనశాలను ఏర్పాటు చేసింది. గోపాలకృష్ణయ్య మరణించేనాటికి సుబ్బమ్మగారు గర్భిణి. తండ్రి పోయిన తరువాత ఈ భూమ్మీద పడినవాడే జానకిరామయ్య. ప్రకాశం తమ్ముడు. ఆ నాలుగు మాసాల పురిటికందుతోనే, పచ్చి బాలింతగానే ఆమె ఒంగోలు వచ్చి దారుణమైన శ్రమకోర్చి ఆ చిన్న భోజనశాల నిర్వహించారు.అప్పటికి ప్రకాశం వయసు పన్నెండేళ్లు. ఒంగోలు పాఠశాలలో ఆనాటి ప్రధానోపాధ్యాయుడు బాగా చదివే పిల్లలను ఇంటికి రప్పించుకుని మరీ చదువు చెప్పేవారు. అలాంటి అవకాశం ప్రకాశంగారికి కూడా దక్కింది. అలా అని ప్రకాశం బుద్ధిమంతుడైన విద్యార్థి మాత్రం కాదు. ఒకవైపు పోకిరి పిల్లలతో కలసి అల్లరి. ఇంకోవైపు నాటకాలు. చిలిపి అల్లరి కాస్తా నేరాల స్థాయికి పోకుండా తనను కాపాడినవి నాటకాలేనని ప్రకాశంగారు భావించారు. నాటక పరిచయం ఒక కొత్త వెలుగును ఇచ్చింది. ప్రకాశం నిజ జీవితంలోకి ఒక గొప్ప పాత్రను ప్రవేశపెట్టింది రంగస్థలం. ఆయన మిడిల్ స్కూల్లో లెక్కల మాస్టారు.ఇంగ్లిష్, ఇంగ్లిష్ గ్రామర్ కూడా బాగా చెప్పేవారని ప్రతీతి. పేరు ఇమ్మానేని హనుమంతరావునాయుడు గారు. రాజమహేంద్రవరంలో మరో అంకం సాగడానికి కారకుడు కూడా నాయుడుగారే. నాయుడుగారు ముప్పయ్ రూపాయల జీతంతో పనిచేసే బతకలేని బడిపంతులే. ఆయనా, ప్రకాశం ఏ క్షణంలో కలుసుకున్నారో గాని, మానవ సంబంధాలలోనే అదొక మంచి ముహూర్తంగా చెప్పాలి. ఆయన శిష్యరికంలోనే ప్రకాశం మిడిల్ స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కానీ ఆ పరీక్షకు మూడు రూపాయల రుసుము చెల్లించాలి. ఇందుకోసం ఒంగోలుకి పాతికమైళ్ల దూరంలో ఉన్న బావగారింటికి నడిచి వెళ్లారు ప్రకాశం. కానీ బావ కూడా డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. చివరికి సుబ్బమ్మగారే తన పట్టుబట్టను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి కొడుక్కి ఇచ్చారు. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాక కొత్త సమస్య వచ్చింది. మిడిల్ స్కూల్ పరీక్ష ఉత్తీర్ణత మెట్రిక్‌తో సమానం. అందుకే, ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని బంధువుల నుంచి ఒత్తిడి వచ్చింది. అలా సుబ్బమ్మగారిని భోజనశాల పని నుంచి తప్పించాలన్నదే వారందరి కోరిక. కానీ ప్రకాశం జీవితాశయం న్యాయవాది కావడం. అదే చెప్పారు. ఆ తల్లి కూడా అందుకే మొగ్గారు. చదువు కొనసాగింది. ఆ సమయంలోనే హనుమంతరావునాయుడు తన భార్య కోరిన మీదట రాజమండ్రి యాత్రకు బయలుదేరారు. వారి వెంటే ప్రకాశం రాజమండ్రి వెళ్లారు. ఒంగోలు నుంచి బెజవాడ. అక్కడ నుంచి విజ్జేశ్వరానికి ఎడ్ల బండి. అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవర పట్టణ ప్రవేశం. మొత్తం పదిరోజులు. అనుకోకుండా నాయుడుగారు, ప్రకాశం గారు కూడా అక్కడ పాఠశాలలోనే చేరారు. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారితో పరిచయం ఆ గోదావరి తీరంలోనే జరిగింది. గయోపాఖ్యానం, పారిజాతాపహరణ నాటకాలు నాయుడుగారు, ప్రకాశం గారి కోసమే చిలకమర్తి రాశారు. గయోపాఖ్యానంలో గయుని పాత్ర నాయుడుగారిది.గయుని భార్యగా ప్రకాశం నటించారు. కానీ నాటకాలతో ప్రకాశం చదువుకు మంగళం పాడకుండా అందుకయ్యే ఖర్చంతా నాయుడుగారే భరించేవారు. మెట్రిక్యులేషన్ ఇక్కడే పూర్తి చేశారు.అప్పుడే రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చిన్న గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేశారు ప్రకాశం. జీతం నెలకి పద్నాలుగు రూపాయలు. అంత చిన్న వయసులోనే ప్రకాశం గారి తల వంచని తత్వం ఎంతటిదో బయటపడింది. ఆ చిన్న కొలువుకీ అర్హత పరీక్ష అన్నారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ ఉండగా మళ్లీ పరీక్ష ఏమిటి, ఈ ఉద్యోగం నాకు అక్కరలేదంటూ ప్రకాశం ఆ ఆఫీసుకి ఉత్తరం రాసి పడేశారు.అందుకే కాబోలు నాయుడుగారు ప్రకాశం గారిని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్‌ఎలో చేర్పించారు. నాటక ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రౌడీ గ్యాంగ్‌లతో పరిచయాలు పెరుగుతున్నాయి. ఆయన తొడగొట్టి అవతలి వాళ్లని చావగొట్టిన సంఘటనలు, వాళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్న దుర్ఘటనలు కూడా జరిగిపోతున్నాయి. తన కంటూ ఒక గుంపును నిలబెట్టుకునే పనిలో బెస్తవాడలకి వెళ్లడం, వాళ్లు కల్లు తాగుతూ ఉంటే పక్కనే నిలబడడం వంటివి కూడా జరిగాయి. అవన్నీ ఎలా ఉన్నా తన ఆశయం – న్యాయవాది కావడం– గురించి ప్రకాశం మరచిపోలేదు. మద్రాస్ వెళ్లారు అందుకు. ఇదొక కొత్త అంకం. దీనికి తెర లేపిన వారు కూడా నాయుడుగారే. కొణితివాడ జమిందారు దగ్గర 90 రూపాయలు అప్పు చేసి శిష్యుడికి ఇచ్చారాయన. 1894 సంవత్సరంలో ప్రకాశం గారు రాజమండ్రి తిరిగి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించారు. మంచి పేరొచ్చింది. ఆ వెనుకే డబ్బు కూడా ఉరుకుతూ వచ్చింది. 1901లో రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారాయన. కానీ మళ్లీ కొత్త కోరిక. చిన్న కోర్టులలో కాదు, పెద్ద కోర్టులలో, పెద్ద పెద్ద కేసులు వాదించాలి. అందుకు బారెట్లా అవ్వాలి. చాలా ప్రతిఘటనల మధ్య ఇంగ్లండ్ వెళ్లారు ప్రకాశం. లండన్ జీవితం, బారెట్లా చదువు ప్రకాశం గారికి ఒక కొత్త ఉషోదయాన్ని చూపించాయి. అంతవరకు ఆయన జీవిత గమనంలో కానరాని కొత్త కోణమది. ఈ పురాతన దేశం తనకు పడిన సంకెళ్ల బరువు, అవి తెచ్చిపెట్టిన న్యూనత ఎంత హీనమో, ఎంత అమానుషమో ఎలుగెత్తి ఘోషిçస్తున్న క్షణాలవి. జాతిలోని ఆ ఆక్రోశానికి పోరాట రూపం ఇస్తున్న స్వాతంత్య్రోద్యమ రూపశిల్పులతో యువ ప్రకాశానికి పరిచయం కలిగింది, అక్కడే.›అప్పుడే దాదాభాయ్ నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్‌కి పోటీ చేశారు. ప్రకాశం కూడా ప్రచారంలోకి దిగారు. ఇండియా సొసైటీతో పరిచయం ఏర్పడింది. భారత స్వాతంత్య్రోద్యమానికి విదేశాల నుంచి సాయం చేయడం, ఒక తరహా పోరాటాన్ని సమన్వయం చేయడం ఈ సొసైటీ ఉద్దేశం. అదే ‘ఇండియా’ పత్రికను కూడా వెలువరించేంది. సొసైటీ తరఫున గోపాలకృష్ణ గోఖలేని పిలిచి ఉపన్యాసం ఇప్పించారు.లాలా లజపతిరాయ్‌ని కూడా ప్రకాశం అక్కడే కలుసుకున్నారు. అందుకు వేదిక అయినది – శ్యాంజీ కృష్ణవర్మ నివాసం. ఈయన గదర్ వీరుడు. రమేశ్చంద్ర దత్తు, ఉమేశ్ చంద్ర బెనర్జీలు కూడా ప్రకాశం గారికి అక్కడే పరిచయమయ్యారు. బారెట్లా పూర్తి చేసిన తరువాత ఆయన మద్రాస్ హైకోర్టులో చేరారు. అక్కడ వద్దని ఎందరో నిరుత్సాహపరిచినా లెక్కచేయలేదు. పని చేసే చోటుతో కాదు, ఆ పని పట్ల ఉండే విశ్వాసం, అసలు మనిషికి ఉండవలసిన ఆత్మ విశ్వాసం విజయానికి సోపానాలవుతాయని ప్రకాశం భావించారు. అదే నిరూపించారు కూడా. న్యాయవాదిగా ఆయన ఎన్నోసార్లు న్యాయమూర్తులతో సంఘర్షణకు దిగారు. న్యాయమూర్తుల అవాంఛనీయ ధోరణులను విమర్శించడానికి ఆయన ‘లా టైమ్స్’ అన్న పత్రికను కూడా వెలువరించారు. భారతదేశంలో చిత్తరంజన్‌దాస్‌కు ఆరోజులలో యువతలో విశేషమైన ఆకర్షణ ఉండేది. ప్రకాశం కూడా ఆయనను ఎంతో అభిమానించారు. దగ్గరయ్యారు. ఇద్దరికీ మైత్రి ఏర్పడింది. ఒకసారి ఒక లక్షాధికారి కేసు కోసం బొంబాయి వెళ్లినప్పుడు పూనా కూడా Ðð ళ్లి బాలగంగాధర తిలక్‌ను ‘దర్శించుకుని’ వచ్చారు. అప్పుడే గోపాలకృష్ణ గోఖలే అతివాదిగా పేరొందిన తిలక్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. అయినా గోఖలే పట్ల తిలక్ చూపుతున్న మర్యాద ప్రకాశాన్ని పరవశుడిని చేసింది. అందుకు గోఖలే స్పందన ఏవగింపు కలిగించింది. తన జీవితంలో అన్నీ ఆకస్మిక ఘటనలే అని రాసుకున్నారు ప్రకాశం. 1907లో బిపిన్ చంద్రపాల్ మద్రాస్ వచ్చారు. తెలుగునాట కాకినాడ మొదలుకొని మద్రాసు వరకు ఆయన సాగించిన ప్రయాణం జాతీయవాద జైత్రయాత్రగా మారిపోయింది. మెరీనా బీచ్‌లో ఆయన సభకు అధ్యక్షత వహించడానికి అంతా భయపడుతున్న సమయంలో అప్పుడే ప్రాక్టీస్ ప్రారంభించిన ప్రకాశం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కడు సాహసంతో ముందుకు వచ్చారు. తరువాత హోంరూల్ ఉద్యమంలో అనిబిసెంట్ వెంట నడిచారు. 1917 నాటి కలకత్తా సభలకు గాంధీతో పాటు ప్రకాశం కూడా పాల్గొన్నారు. అప్పటికి ఆయన ఏ మాత్రం వక్త కాదని తేల్చారు ప్రకాశం. కానీ జాతీయ కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను ప్రచురించడానికి హిందూతో సహా పత్రికలన్నీ సహకరించలేకపోయేవి. అందుకే 1921లో ప్రకాశం స్వరాజ్య పత్రికను స్థాపించారు. 1927లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు జరిగిన ఘట్టం ప్రకాశం అంటే ఏమిటో భారతదేశానికి తెలిసే అవకాశం ఇచ్చింది. మద్రాస్ నగరంలోని పారిస్ కార్నర్ దగ్గర సైమన్ గోబ్యాక్ ఉద్యమకారుల మీద కాల్పులు జరిగాయి. ఒక భారీకాయుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు. అప్పుడే ప్రకాశం తెగించి ముందుకు వెళ్లారు. ‘మీరు బలవంతంగా వెళ్లదలిస్తే మేం కాల్చవలసి వస్తుంది’ అన్నాడు ఓ పోలీస్ ఆఫీసర్. అయితే అక్కడి గుంపులో ఉన్న ఒక మహమ్మదీయుడు ముందుకు వచ్చి, ‘ధైర్యం ఉంటే కాల్చు, మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాం.ఆయన ఎవరో నీకు తెలియదల్లే ఉంది.’ అన్నాడు. అక్కడితో ఆ ఆఫీసర్ జులం తగ్గింది. ప్రకాశం ఆ యోధుడి భౌతికకాయాన్ని చూసి, సమీపంలోనే ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ మేజిస్ట్రేట్‌ను చూడ్డానికి వెళ్లారు. తరువాత గాంధీ పిలుపుననుసరించి (చాలా విషయాల్లో ఆయనతో విభేదించినా) లక్షలు ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు ప్రకాశం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.అంతకు ముందే సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్‌కి ఎన్నికయ్యారు. ఏఐసిసి కార్యదర్శి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ మత్రివర్గంలో రెవెన్యూ మంత్రి అయ్యారు. వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆయనే. కానీ అప్పటికే ఆయన తాను ఆర్జించిన సర్వం ప్రజలకు అర్పించేశారు. ఆయన దారిద్య్రం నుంచి వచ్చారు. ఈ పదవులు, ఆర్జనలు, హోదాలు ఒక భ్రమ అన్న రీతిలో తృణప్రాయంగా వదిలి పెటి మళ్లీ దారిద్య్రాన్ని ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు. చినిగిన దుస్తుల్లో, చిల్లులు పడ్డ శాలువతో, తిండిలేక డస్సిపోయిన ముఖంతో విజయవాడ వీధులలో, రాష్ట్రంలో అనేక చోట్ల ఆయనను చూసిన వారు ఆ దృశ్యాలను ఎప్పటికి మరచిపోలేకపోయారు. తల్లి సుబ్బమ్మగారు అంతిమక్షణాలలో కొడుకును పిలిచింది. ఒక చిన్న మూటను అప్పగించింది. ఎనిమిది వందల రూపాయలున్నాయి అందులో. ఆమె కష్టార్జితం. ‘తన అంత్యక్రియలకి’ అని చెప్పారావిడ. కన్నతల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా నాకు మా అమ్మ ఇవ్వలేదు అని విలపించారాయన. అయినా, దేశమాత రుణాన్ని ప్రకాశం గారు తీర్చుకున్న తీరు ఎప్పటికీ ఒక అద్భుతం. - డా. గోపరాజు నారాయణరావు -
నా వ్యాఖ్యల్లో తప్పుంటే క్షమించండి
సాక్షి, బెంగళూరు: భారత తొలి ప్రధాని నెహ్రూ స్వార్థపరుడంటూ చేసిన వ్యాఖ్యలపై టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా క్షమాపణ చెప్పారు. మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయడానికి గాంధీ అనుకూలంగా ఉన్నా, నెహ్రూ స్వార్థపూరితంగా ఆలోచించారని బుధవారం దలైలామా అన్నారు. గాంధీ కోరుకున్నట్లు జిన్నా ప్రధాని అయ్యుంటే దేశ విభజన జరిగేది కాదన్నారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో క్షమాపణ చెప్పారు. ‘నేనేదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. గాంధీ దేశ విభజనను వ్యతిరేకించారని విని నమ్మలేకపోయా. పాక్ కన్నా భారత్‌లో ముస్లింల జనాభా ఎక్కువ. గడిచిందేదో గడిచిపోయింది’ అని శుక్రవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో అన్నారు. పాక్, భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దురదృష్టకరమని, భారత్ ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సమస్య పరిష్కారానికి చొరవచూపాలన్నారు. తమ మాతృభూమి నుంచి వేలాదిగా వలసొచ్చిన టిబెటన్లను అక్కున చేర్చుకుని సొంత మనుషుల్లా చూస్తున్నందుకు భారత్ కృతజ్ఞతలు తెలిపారు. టిబెటన్ల సంస్కృతి పరిరక్షణకు నెహ్రూ ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం కుమారస్వామి పాల్గొన్నారు. -
దళితుల ద్రోహి నెహ్రూ కుటుంబమే: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని అత్యధిక కాలం పాలిం చిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీయే దళిత ద్రోహి అని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం విషయంలో బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆ చరిత్ర తెలుసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో దళితులపై జరిగిన దాడులు ఎన్నడూ జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, వేధింపుల నిరోధక సవరణ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించిన మోదీ ప్రభుత్వాన్ని దళితుల సంక్షేమంపై ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర సచి వాలయం నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ సానుకూలంగా ఉందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ఆదేశాల్విండి.. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలను తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక కోరింది. దత్తాత్రేయ ఆధ్వర్యంలో వేదిక ప్రతినిధులు కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, సరోజ తదితరులు కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని, అధికారాల బదలాయింపు కూడా జరగడం లేదని వివరించారు. -
‘ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారన్న తన వ్యాఖ్యల్లో ఎదైనా తప్పు ఉంటే తనని క్షమించాలని టిబెట్ బౌద్ధ గురువు దలైలామా కోరారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పుచేస్తారని, నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారని ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు ఉద్దేశ పూరితంగా చేసినవి కావని, ఏమైనా తప్పుంటే తనని క్షమించాలని శుక్రవారం ట్వీట్ చేశారు. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇటీవల దలైలామా మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధానిగా మహ్మద్ అలీ జిన్నాను చేయాలని మహాత్మ గాంధీ భావించారని, దానిని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారని దలైలామా పేర్కొన్నారు. దేశ ప్రధానిగా తనకు అవకాశం ఇవ్వాలని నెహ్రూ పట్టుబట్టినట్లు కూడా ఆయన తెలిపారు. మహ్మద్ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలైయ్యేది కాదని దలైలామా ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దలైలామా వ్యాఖ్యలపై బీజేపీ-కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో దలైలామా క్షమాపణలు కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవమైనవని, గాంధీ మొదటి నుంచి జిన్నాను ప్రధాని చేయాలని ప్రయత్నించారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. నెహ్రూ కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారన్న వ్యాఖ్యలు నిజమైనవని, ఇలాంటి చారిత్రాత్మక విషాయాలపై మరింత లోతుగా చర్చ జరగాల్సిన అవసరముందని స్వామి తెలిపారు. My statement has created controversy, if I said something wrong I apologise: Dalai Lama on his statement, "Mahatma Gandhi ji was very much willing to give Prime Ministership to Jinnah but Pandit Nehru refused." pic.twitter.com/jjIEmc280E — ANI (@ANI) August 10, 2018