సాక్షి, గుంటూరు: పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే ప్రపంచస్థాయి విద్యకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఎక్స్ ద్వారా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులూ అర్పించారు.
‘‘మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ.. ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్‌వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం’’ అని సందేశంలో సీఎం జగన తెలియజేశారు.
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపిన సీఎం జగన్.. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2023
అంగన్‌వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో…
Comments
Please login to add a commentAdd a comment