Childrens day
-
ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన
అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలు నిర్వహించింది. ఫిలడెల్ఫియా లోని స్థానిక భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 250 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు.. అలాంటి పౌరులను ఉత్తమ పౌరులుగా, మంచి నాయకులుగా తీర్చిదిద్దేందుకు నాట్స్ బాలల సంబరాలు దోహదపడతాయని నాట్స్ మాజీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని అన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. తెలుగు విద్యార్థుల బంగారు భవితకు తోడ్పడే ఎన్నో కార్యక్రమాలు నాట్స్ చేపడుతుందని శ్రీధర్ అప్పసాని తెలిపారు.పోటీలకు మంచి స్పందన..బాలల సంబరాలను పురస్కరించుకుని తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి, చిత్రలేఖనం అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. ఎనిమిదేళ్లలోపు, పన్నెండేళ్ల లోపు, ఆపైన ఉన్న చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. అనేక మంది పిల్లలు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, నేషనల్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్స్ రమణ రాకోతు, బోర్డు అఫ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి, చాఫ్టర్ కోఆర్డినేటర్ సరోజ సాగరం, సంయుక్త కార్యదర్శి రామ్ నరేష్ కొమ్మనబోయిన, బాబు మేడి, విశ్వనాథ్ కోగంటి, నిరంజన్ యనమండ్ర, అప్పారావు మల్లిపూడి, రాజశ్రీ జమ్మలమడక, శ్రీనివాస్ సాగరం, సురేంద్ర కొరటాల, పార్ధ మాదాల, రవి ఇంద్రకంటి, సాయి సుదర్శన్ లింగుట్ల, శ్రీనివాస్ ప్రభ, రామక్రిష్ణ గొర్రెపాటి, మధు కొల్లి, రామ్ రేవల్లి, నాగార్జున కొత్తగోర్ల, రాఘవన్ నాగరాజన్, వేణు కొడుపాక, చైతన్య & లహరి, కృష్ణ నన్నపనేని, కిషోర్ నర్రా ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజేష్ కాండ్రు, రవి తుమ్మల, కిషోర్ నారే, మురళి మేడిచెర్ల, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి, తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టిఏజిడివి అధ్యక్షులు రామ్మోహన్ తాళ్లూరి, కార్యదర్శి సురేష్ బొందుగుల, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ చుండూరి, సంయుక్త కోశాధికారి శివ అనంతుని, లవకుమార్ ఐనంపూడి, పూర్వ అధ్యక్షులు హరనాథ్ దొడ్డపనేని, తదితరులు పాల్గొని వారికి తోడ్పాటుని అందించారు.బాలల సంబరాల కోసం యూత్ మెంబర్స్ అమ్రిత శాకమూరి, స్తుతి రాకోతు , యుక్త బుంగటావుల , నిత్య నర్ర, ప్రణతి జమమ్మలమడక, అభినవ్ మేడి, నిహారిక ఐనంపూడి, హవిషా పోలంరెడ్డి , అక్షయ పుల్యపూడి , సుమేధ గవరవరపు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం నిర్వహించిన బాలల సంబరాల కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.స్థానికంగా ప్రముఖ సంగీత, నృత్య గురువులు శ్రీనివాస్ చాగంటి, అన్నపూర్ణ చాగంటి, వల్లి పిల్లుట్ల, శ్రీలక్ష్మి జంధ్యాల, సౌమ్య గండ్రకోట, మైత్రేయి కిదాంబి, భారతి అశోక్, ప్రత్యూష నాయర్, సవిత వారియర్, శ్రీ హరిత, మధుమిత, ప్రసన్న గన్నవరపు, శ్రీదేవి ముంగర, రఘు షాపుష్కర్, నాగేశ్వరి అడవెల్లి, పద్మ శాస్త్రి, కల్యాణ రామారావు గన్నవరపు, విమల మొగుళ్లపల్లి, రూప మంగం, ఈ సంబరాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సాకేత్ ప్రభ గణేశ ప్రార్ధనతో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా సాగింది. రెండు వందల యాబై పైగా చిన్నారులు ఈ సంబరాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్వేతా కొమ్మోజి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.తెలుగు సినీగీతాల గానం, నృత్యంతో చిన్నారులు అద్వైత్ బొందుగుల, ధృతి కామరాసు, క్రిశిత నందమూరి, అనిషా చెరువుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. బాలల సంబరాలకు రుచికరమైన విందు అందించినందుకు మహాక్ష ఇండియన్ ఫ్లేవర్ రెస్టారెంట్‌ను నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల అభినందించారు. సంబరాలకు స్పాన్సర్స్‌గా డివైన్ ఐటీ సర్వీసెస్, వెంకట్, సుజనా శాకమూరి, రిటైర్ వైసెలీ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సాయం అందించారు.(చదవండి: -
డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్‌లో బాలల సంబరాలు ఘనంగా నిర్వహించింది. భారత మాజీ ప్రధాని నెహ్రు జయంతి సందర్భంగా ప్రతి యేటా నాట్స్ డల్లాస్ విభాగం బాలల సంబరాలు నిర్వహిస్తోంది. గత పద్నాలుగు ఏళ్లుగా ఓ సంప్రదాయంలా నిర్వహిస్తున్నఈ సంబరాలను ఈ సారి ప్రిస్కో నగరంలో వండేమేట్టర్ మిడిల్ స్కూలులో ఘనంగా జరిపింది. బాలల సంబరాల్లో భాగంగా చదరంగం, గణితం, సంగీతం నృత్యం, తెలుగు పదజాలం, తెలుగు ఉపన్యాసం విభాగాల్లో జరిగిన పోటీల్లో దాదాపుగా 250 కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో దరఖాస్తు చేసుకున్న పిల్లల్ని వివిధ వయసుల వారీగా విభజించి ఈ పోటీలు నిర్వహించారు. నాట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు విద్యార్థులే కాకుండా, ఇతర ప్రవాస భారతీయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ సంగీతం, నృత్యంతో పాటు సినిమా సంగీతం, నృత్యం విభాగాల్లో జరిగిన పోటీల్లో బాల బాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగు పదజాలం, తెలుగు ప్రసంగ పోటీల్లో అనర్ఘళంగా తెలుగు మాట్లాడి అతిథులను అబ్బురపరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో దాదాపు 90 మందికి పైగా పిల్లలు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. డల్లాస్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి నేతృత్వంలో ఈ బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు మూడు నెలల ముందు నుండే పక్కా ప్రణాళికతో బాలల సంబరాలను నాట్స్ డల్లాస్ బృందం విజయవంతం చేసింది.నాట్స్ బాలల సంబరాలకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఉప కోశాధికారి రవి తాండ్ర, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారెలు ఇచ్చిన అమూల్యమైన సూచనలు, మార్గదర్శకత్వం బాలల సంబరాల విజయానికి దోహదపడ్డాయని స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి తెలిపారు.డల్లాస్ చాప్టర్ సలహా బోర్డు సభ్యులు సురేంద్ర ధూళిపాళ్ల, కవిత దొడ్డ, డీ వీ ప్రసాద్, రవీంద్ర చుండూరు, డాలస్ చాప్టర్ జట్టు సభ్యులు సౌజన్య రావెళ్ల , కావ్య కాసిరెడ్డి, పావని నున్న, శ్రీనివాస్ ఉరవకొండ, కిరణ్ నారె, ఉదయ్, నాగార్జున, బద్రి బియ్యపు, మోహన్ గోకరకొండ, యూత్ టీం నుండి నిఖిత, సహస్ర, ప్రణవి, వేద శ్రీచరణ్, అద్వైత్, ధృవ్, పావని, అమితేష్, ఈశ్వర్, చంద్రాంక్ తదితరులు నాట్స్ బాలల సంబరాల్లో పాల్గొని విద్యార్ధులను ప్రోత్సహించారు.బాలల సంబరాలను జయప్రదం చేసిన జట్టు సభ్యులకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, న్యాయనిర్ణేతలకు, దాతలకు, యువ సభ్యులకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి ధన్యవాదాలు తెలిపారు. ఈ బాలల సంబరాలను పద్నాలుగు సంవత్సరాలక్రితం డల్లాస్ నగరంలో ఏర్పాటుచేసి, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, మరిన్ని నాట్స్ చాఫ్టర్లు ఉన్న నగరాలకు విస్తరించామని తెలిపారు. మన ప్రవాస భారతీయ పిల్లలకు, ప్రత్యేకంగా తెలుగు వారి పిల్లలకు, వారి ప్రతిభను, నాయకత్వ లక్షణాలను, పోటీతత్వాన్ని పెంపొందించే అవకాశాలను కల్పించటం చాలా సంతోషంగా ఉందని బాపు నూతి అన్నారు. ఈ బాలల సంబరాలలో ప్రతి సంవత్సరం పాల్గొనే పిల్లల సంఖ్య పెరుగుతుండటంపై బాపు హర్షం వ్యక్తం చేశారు. స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వోల్డీలక్స్ మరియు ఫార్మ్2కుక్ లకు నాట్స్ డల్లాస్ చాప్టర్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా బాలల సంబరాలను దిగ్వజయంగా నిర్వహిస్తున్న డల్లాస్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు అధ్యక్షులు మదన్ పాములపాటిలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ ప్రస్థానం) -
విజయవాడ : ఉల్లాసంగా.. ఉత్సాహంగా..7వ అమరావతి బాలోత్సవం (ఫొటోలు)
-
స్టూడెంట్ల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ (ఫొటోలు)
-
చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న సీరియల్ బ్యూటీ.. ఎంత క్యూట్‌గా ఉన్నారో?
-
మాక్ అసెంబ్లీలో చిన్నారులతో రేవంత్
-
చిల్డ్రన్స్ డే స్పెషల్- లిటిల్ స్టార్స్ సందడి చేసిన చైల్డ్ ఆర్టిస్టులు
-
సాక్షి మీడియా హౌస్ లో..తారే జమీన్ పర్ లిటిల్ స్టార్స్ (ఫొటోలు)
-
లిటిల్ స్టార్స్.. చిల్డ్రన్స్ డే స్పెషల్
-
నలత లేకుండా చలాకీగా..!
పిల్లలు తమ తల్లిదండ్రుల కంటి దీపాలు. వాళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో దేదీప్యమానంగా వెలుగుతుండటమే తల్లిదండ్రులు, పెద్దలు కోరుకునేది. ఈ నెల 14వ తేదీ బాలల దినోత్సవం. ఈ సందర్భంగా... పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం పెద్దలు గమనించాల్సిన, అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని అంశాలివి...అప్పుడే పుట్టిన పిల్లలకు ఏడుపే వాళ్ల భాష. తమ తాలూకు బాధలను పెద్దలకు తెలియజెప్పడానికి వాళ్లు ఏడుపునే సాధనంగా ఎంచుకుంటారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు, ఎందుకు ఏడుస్తారో, అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. పిల్లల్లో ఏడుపుకు కొన్ని కారణాలు ఆకలి వేసినప్పుడు, భయపడినప్పుడు, ∙దాహం వేసినప్పుడు ఒక్కరే ఉండి బోర్‌గా అనిపించినప్పుడు ∙పక్క తడి అయినప్పుడు, వాతావరణం మరీ చల్లగా లేదా వేడిగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు కాంతి బాగా ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా పళ్లు వస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షను వచ్చినప్పుడు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) జ్వరం జలుబు, చెవినొప్పి వంటి సాధారణ లేదా కొన్ని తీవ్రమైన సమస్యలను పిల్లలు ఏడుపు ద్వారా తెలియజేస్తారు. 1–6 నెలల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, చెవి నొప్పి, జలుబు వంటివి ప్రధాన కారణాలు.ఇన్ఫెన్టైల్ కోలిక్... చిన్న పిల్లల్లో ఏడుపుకు ముఖ్యమైన కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆకలి వేయడంగానీ, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్‌కు కొన్ని కారణాలు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజిషన్), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్, కడుపులోని గాలి వెళ్లిపోయేందుకు తేన్పు వచ్చేలా చూడటం అంటే ఎఫెక్టివ్ బర్పింగ్తో ఏడుపు మాన్పించవచ్చు. చికిత్స వరకు వెళ్లాల్సివస్తే... కొందరికి యాంటీస్పాస్మోడిక్స్తో పాటు బాగా అవసరమైన పరిస్థితుల్లో మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనేవి ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి.ఏడాది నుంచి రెండేళ్ల వరకు... ఏడాది వయసు నుంచి పిల్లలు కొద్దికొద్దిగా సపోర్ట్ తీసుకుంటూ నిలబడుతుండటం, కొద్ది కొద్దిగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ మళ్లీ పడిపోతూ, మళ్లీ నిలబడుతుండటం చేస్తుంటారు. వీళ్లు నిలబడుతుండటానికి సపోర్ట్ ఇస్తూ ఆడుకునేలా చేస్తుండాలి. ఈ టైమ్‌లోనే పిల్లలు రివాల్వింగ్ చైర్స్ వంటివి పట్టుకుని నిలబడానికి ప్రయత్నించినప్పుడు అవి చక్రాల మీద జారిపోయి, పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఏ వస్తువును పడితే ఆ వస్తువును కదిలించడానికి ప్రయత్నించడం, సొరుగులు లాగేయడం వంటివి చేస్తుంటారు. ఈ సమయాల్లో వారి వెనకే ఉంటూ ప్రోత్సహిస్తూనే, వాళ్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి.రెండేళ్ల వయసు నుంచి స్కూలుకు వెళ్లే సమయం వరకు... ఈ టైమ్‌లో పిల్లలను కాస్త ఆరుబయట ఆడనివ్వాలి. వాళ్లు ఆరుబయటకు వెళ్తుంటే భయపడకుండా కాస్త నీరెండలోకి, మట్టిలోకి వెళ్లడానికి అనుమతించాలి. కాకపోతే ఎండ నేరుగా తగలకుండా హ్యాట్ లాంటిది వాడటం, ఒళ్లంతా కప్పి ఉంచేలా దుస్తులు తొడగడం, అవసరమైతే 30 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే ఆరుబయట ఆడుకుని వచ్చాక వాళ్ల ఒళ్లు తుడిచి, చేతులు శుభ్రంగా కడగాలి. మట్టితో ఆడుకోనివ్వని పిల్లల కంటే అలా ఆడుకున్న చిన్నారులకే ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.మూడు నుంచి ఐదేళ్ల వయసుకు.. ఈ వయసులో చిన్నారులు ఇతర పిల్లలతో కలిసి ఆడుతుంటారు. అలా ఆడేలా వారిని ప్రోత్సహించాలి. ఈ టైమ్‌లో ట్రైసైకిల్ లేదా సైకిల్ నేర్చుకునేలా సపోర్ట్ చక్రాలున్న సైకిల్, బంతిని విసిరి పట్టుకునే ఆటలు (థ్రోయింగ్ అండ్ క్యాచింగ్), గెంతడం, స్కిప్కింగ్, డాన్సింగ్ వంటి యాక్టివిటీస్ చేసేలా ప్రోత్సహించాలి. ఈ వయసు పైబడిన పిల్లలు, వాళ్ల వయసుకు తగినట్లుగా కాస్తంత పెద్ద ఆటలను ఆడేలా చూడాలి.అన్ని టీకాలూ టైముకు ఇప్పించడం... పిల్లలకు ఆయా సమయాల్లో ఇప్పించాల్సిన టీకాలు (వ్యాక్సినేషన్) తప్పక ఇప్పించాలి. ఈ టీకాల షెడ్యూలు చిన్నపిల్లల డాక్టర్లందరి దగ్గరా ఉంటుంది. వారిని సంప్రదించి... డీటీఏపీ, ఫ్లూ, హెచ్ఐబీ, ఎమ్ఎమ్ఆర్, పోలియో, రొటా వైరస్ మొదలైన వ్యాక్సిన్లు అన్నింటినీ ఆయా సమయాలకు ఇప్పిస్తూ ఉండాలి.ఆహారం విషయంలో... పాలు మరిచిన పిల్లలకు మొదట్లో గుజ్జుగా చేసిన అన్నం, పప్పు, నెయ్యి వంటి ఆహారాన్ని అందిస్తూ, క్రమంగా ఘనాహారం వైపు మళ్లించేలా చేయాలి. కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటూ మార్కెట్లో లభ్యమయ్యేవాటి కంటే ఇంట్లో ఆరోగ్యకరమైనన పరిస్థితుల్లో వండిన భోజనాన్ని తాజాగా అందిస్తుండటమే మేలు.‘క్లీన్ ప్లేట్ రూల్’ వద్దు... ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కొందరు తల్లులు తాము ప్లేట్లో వడ్డించినదంతా పిల్లలు తినేయాలని అనుకుంటుంటారు. పిల్లలను ఘనాహారం వైపు మళ్లించే వీనింగ్ ప్రక్రియ సమయంలో ప్లేట్లో పెట్టిందంతా పిల్లలు తినేయాలని అనుకోవద్దు. కడుపు నిండిన వెంటనే వారు తినడానికి విముఖత చూపుతారు. అప్పుడు ఫీడింగ్ ఆపేయాలి. ఈ ‘క్లీన్ ప్లేట్ రూల్’ బదులుగా చిన్నారులకు చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినిపించడం మేలు. ఇక పిల్లలు కాస్త ఎదిగాక అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, పీచు పుష్కలంగా ఉండేలా పొట్టుతీయని కాయధాన్యాలతో వండిన అన్నం, మాంసాహారం తినిపించేవారు చికెన్, చేపలు, తాజా పండ్లతో కూడిన ఆహారాలు అందిస్తూ వారికి అన్ని పోషకాలు అందేలా జాగ్రత్త తీసుకోవాలి. వారు మితిమీరి బరువు పెరగకుండా ఉండేందుకు నెయ్యి, వెన్న వంటి శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ఉప్పు వంటి వాటిని పరిమితంగా ఇవ్వడం మేలు. పిల్లలకు తినిపించేటప్పుడు తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా, వారు ముద్ద నమిలి మింగేవరకు ఆగి, అప్పుడు మరో ముద్ద పెట్టడం, ఆహారం వారికి ఇష్టమయ్యే రీతిలో చాలా రకాల (వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్) ఆహారాలను మార్చి మార్చి రుచిగా, కాస్తంత గుజ్జుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక పిల్లలు పెద్దవుతున్న కొద్దీ పెద్దలు వాళ్లతో కమ్యూనికేట్ అవుతూ ఉండటం, వాళ్ల ఫీలింగ్స్ గురించి మాట్లాడటం, ప్రతికూల ఆలోచనలను, ధోరణులను దగ్గరికి రాకుండా చూడటం, వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతుండటం, వాళ్ల సెల్ఫ్ ఎస్టీమ్‌కు భంగం రానివ్వకుండా ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడటం, మొదట్లో చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచి, వాటిని నెరవేర్చగానే చిన్న చిన్న బహుమతులు అందిస్తూ ప్రోత్సాహపూర్వకంగా ప్రశంసించడం, వారికై వారు తమ లక్ష్యాలను మెల్లగా పెద్దవిగా చేసుకునేలా చూడటం, విఫలమైనప్పుడు ఏమాత్రం నిరుత్సాహపరచకుండా మరింత ప్రోత్సహించడం చేస్తూ వాళ్లు అన్నివిధాలా మానసిక, శారీరక ఆరోగ్యాలతో ఎదిగేలా చేయాలి. (చదవండి: పిల్లలూ దేవుడూ చల్లని వారే) -
సాక్షి టీవీ లిటిల్ స్టార్స్ స్పెషల్ డ్రైవ్ ప్రోమో
-
'మీ చిన్న హృదయాలు స్వచ్ఛంగా ఉండాలి'.. శ్రీజ పోస్ట్ వైరల్!
శ్రీజ కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి కూతురిగా శ్రీజకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లికి ఫ్యామిలీతో కలిసి హాజరైంది. తన ఇద్దరు కూతుళ్లతో వరుణ్ పెళ్లిలో సందడి చేసింది. పెళ్లిలో నూతన దంపతులతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?) తాజాగా ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తన కూతుళ్లతో పాటు మెగా, అల్లు కుటుంబాల పిల్లలు ఉన్న ఫోటోను పంచుకుంది. అంతే కాకుండా పిల్లల మనస్తత్వం గురించి నోట్ రాసుకొచ్చింది. శ్రీజ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఇక్కడ ఉన్న అన్ని చిన్న హృదయాలు ప్రేమ, స్వచ్ఛత, నవ్వు, ఆనందం, ఉత్సుకతతో నిండి ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది చూసి ఫ్యాన్స్ సూపర్ పిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో రామ్ చరణ్- ఉపాసన కూతురు క్లీంకార ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా ఓకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు కుటుంబాల పిల్లలను చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. కాగా.. 2016లో కల్యాణ్ దేవ్‌తో శ్రీజ వివాహం జరిగిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్) View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
పిల్లల కోసం ఎంతో చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే ప్రపంచస్థాయి విద్యకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఎక్స్ ద్వారా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులూ అర్పించారు. ‘‘మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ.. ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం’’ అని సందేశంలో సీఎం జగన తెలియజేశారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపిన సీఎం జగన్.. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2023 -
అప్పట్లో బాలల దినోత్సవం అంటే అలా ఉండేది..ఆరోజులే వేరు
అప్పట్లో పండగలంటే పంద్రా ఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగు అనే బాలల దినోత్వవమేగా ! అదిగదిగో, తెల్లవారుఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. ఇంట్లో వాళ్ళు పొయ్యి మీద డేగిశా నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి. అప్పటికీ అక్కడికీ చేరిన ఇరుగూ పొరుగూ అని అన్ని రకాల బడి పిల్లలు ఒకరికొకరు బద్ద శత్రువుల్లా కనపడేవారు ఆ కాసింత కాలం. ఎవరికి వారు ముందుగా తమ తమ యూనిఫాంలు ఇస్త్రీ రుద్దించుకోవాలి మరి. "కొండలా కూచుంది ఎంతకీ తరగనంది ఏందిరో వింత గొడవా అనే పాట అప్పుడు తెలీకపోయినా పాడుకునే ఉంటాము ఇస్త్రీ చెయ్యవలసిన ఆ బట్టల కొండనీ చూసి ఆ జాతీయ పండగలకు దగ్గర్లో ఏ శుభకార్యం వచ్చినా, పిల్లల పుట్టిన రోజు వచ్చినా పనిలో పని అని , కలిసి వస్తాయి స్కూల్ డ్రెస్సు లే కుట్టించేవారు ఇంట్లో పెద్దలు. స్కూల్ డ్రస్సే కదాని చిన్న చూపేమీ లేదు మాకు, కొత్త తెల్ల అంగి, బ్లూ నిక్కర్ డ్రస్ వేసుకుని బడికి వెల్లడం ఎంత దర్జా ఒలకబోసే పని.చాచా నెహ్రూ పుట్టిన రోజు ఎప్పుడో తెలీదు, బాలల దినోత్సవం అంటే మాత్రం ప్రతి బాలబాలికల యొక్క రెండో పుట్టిన రోజని మాత్రం ఖచ్చితంగా తెలుసు. బిలబిల్లాడుతూ దారివెంట గలగలల కబుర్లు నడిచేవి. పుయ్యిమని మా PET సుందరం సార్ విజిల్ మోతతో కబుర్లన్నీ అఠెన్షన్ మూసి పెట్టి కాలికి కాలు, చేతుకి చేతులు దగ్గరగా చేర్చి విధ్యార్థులు వరుసలు కట్టిన మా బాలల జాతికి మా హెడ్మాస్టర్ హనీఫ్ గారు ఒక సందేశాన్ని ఇచ్చేవారు, విద్యార్థి వరుసల మధ్యలో క్లాస్ లీడర్లు, కండపుష్టి, దబాయింపు తెలిసిన కుర్రాళ్ళు వచ్చి మా అరచేతుల్లో పంచి పెట్టే నెయ్యి చాక్లెట్ తిని మళ్ళీ హానీఫ్ గారి ప్రసంగానికి అంకితం అయ్యేవాళ్ళం. బాగా చదివే పిల్లలకు, బాగా పరిగెత్తే పిల్లలకు, ఖోఖో,కబాడి ఇత్యాది మల్లయుద్దాలు ఆడే పిల్లలకు, క్రమం తప్పకుండా బడికి హజరయ్యే వాళ్ళకు బహుమతులు ఇచ్చేవారు. స్టేజీ మీద పాటలు పాడి కొంతమంది రంజింపజేసేవారు, ఇంకొంతమంది అయ్యామే డిస్కో డాన్సర్ ’ అనీనూ, ’ఒలమ్మీ తిక్క రేగిందా ’ అని కూడాను స్టెప్పులు వేసేవారు. వారికి బహుమతులతో పాటు చొక్కాలకు రూపాయి నోట్లు పిన్నీసు పెట్టి తగిలించేవారు. విజిళ్ళు వేసీ , చప్పట్లు చరిచి ఎంకరేజింగ్ కూడానూ. పదేళ్ల పాటు సాగిన నా బడి బ్రతుకులో నాకు కాసింత అబ్బిన చిత్రకళకు చోటు ఎప్పుడూ దొరకలేదు,ఏనాడు స్టేజి ఎక్కి ఇదిగో బొమ్మకు ఈ బహుమతి అని అందుకున్నది లేదు. అది ఈ రోజుకూ లేదనుకో. అయినా బొమ్మలు వేసినందుకు బడిలో తన్నకపోవడమే మహద్భాగ్యం. ఇంకా పురస్కారాలు కూడానా? ఆశకు అంతుందా ఎక్కడయినా ? పిల్లల పండగ వస్తుందనగానే పిల్లలందరం కలిసి తలా ఇంతా ఇంతా చిల్లర డబ్బులు వేసుకుని క్లాసు రూములకు సున్నాలు కొట్టి, ఝండాలు కట్టి, నల్ల బల్లలకు బుడమాకు-బొగ్గు కలిపిన సింగారం చేసి, తరగతి గది ముందు కళ్ళాపి చల్లి, రంగురంగుల ముగ్గులు చిత్రించి అవి చూసుకోవడానికి ఇంతింత కళ్ళయ్యేవాళ్లం. బడి లోపలి గోడల మీద నేను వేసిన చాచా నెహ్రూ కోటు మీది గులాబి పువ్వుని అందుకుని అమ్మాయిలు జడల్లొ తురుముకునేవారు. అదీ ఒక పురస్కారం వలెనే అని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసినా లాభం లేదు. అప్పుడు మా నూనెపల్లేలో ఉన్నట్లు ఇప్పుడు ఏ పల్లె పాఠశాలల్లో కూడా బడి పాకలు ఉన్నట్టు లేవు, చెట్టు కింద తరగతులు నడుస్తున్నట్టు కానరావు, క్లాస్ ముగియగానే నిక్కర్ల వెనుక దుమ్ము దులుపుకుంటు మగపిల్లలు పైకి లేస్తే , లంగాలు విదిలించుకుంటూ ఆడపిల్లలు నిలబడేవారు, వారి వడి నిండా క్లాసుల తరబడి గంటలుగా వింటూ వింటూ తిన్న పొద్దుతిరుగుడు, కర్బూజా విత్తనాల పొట్టు తెల్లగా రాలేది క్లాసుల నిండా. ఆ రాలినదల్లా విత్తనాల పొట్టు మాత్రమే కాదని అవి నా భవిష్యత్తు లో తలుచుకోబోయే జ్నాపకాల పూల చినుకులని ఇప్పడు తెలుస్తుంది. బాల్యం చెదిరి, వయసు ముదిరి ఇప్పుడు ఆ రాశిని రెండు చేతులా ఎత్తి పట్టుకుని "ఏవి తల్లి! నిరుడు కురిసిన ఆ హిమసమూహములు?" అంటున్నారు సాహిత్య వాళ్ళు.నూనెపల్లె వాళ్ళకు హిమము ఎక్కడిదిరా? అవి కర్బూజా గింజెల పొట్టురా నాయనా. ఒక్కసారి కళ్ళు మూసుకుని వెనక్కి వెళితే అవన్నీ అక్కడే ఉన్నాయిరా, ఇంకా ఈత గింజలూ, రేగు గింజలు, సీతా ఫలం గింజలు, ఉసిరికాయ గింజలూ, రంగు జండాలు, బాలలదినోత్సవమునూ, చాచా నెహ్రూ నూ. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
Childrens Day 2023 Special Debate: విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం
-
Children’s Day 2023: పిల్లలకు ఎన్ని హక్కులున్నాయో తెలుసా?
నవంబర్ 14 మన ప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రూ జయంతి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాలబాలికల విద్యను ప్రొత్సహించడంతో పాటు వాళ్ల హక్కుల కోసం పాటుపడ్డారు. అందుకే పిల్లలు ఆయన్ని చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. అలా.. ఆయనకు, ప్లిలలకు మధ్య ఉన్న బంధానికి గుర్తుగా.. పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని క్రమం తప్పకుండా ప్రతీ యేటా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే.. ఐక్యరాజ్య సమితి మాత్రం నవంబర్ 20ను అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది. కానీ, మనం మాత్రం నెహ్రూ పుట్టిన రోజు తేదీనే బాలల దినోత్సవంగా(బాల దివాస్) నిర్వహించుకుంటున్నాం. బాలల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కృషి.. ఇదీ బాలల దినోత్సవం నాడు ప్రభుత్వాలు చేపట్టే చర్యలు. అలాగే పిల్లలకు కొన్ని హక్కులు ఉంటాయి. చాలామందికి పిల్లలకు హక్కులు ఉంటాయని వినడమేగానీ.. అవేంటన్నది మాత్రం తెలియదు. బాలల దినోత్సవ లక్ష్యాల్లో ఒకటైన వాటి గురించి తెలుసుకుందాం.. భారత రాజ్యాంగంలో బాలబాలికల హక్కుల పరిరక్షణ కోసం కొన్ని ఆర్టికల్స్(అధికరణలు) ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. ఆర్టికల్ 15 (3).. స్త్రీలు, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించుకోవడానికి చట్ట సభలకు అధికారం ఉంది. ఈ అధికరణ ప్రకారం.. ఏదీ అడ్డురాదు. ఆర్టికల్ 21(A).. 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించాలి. భారత రాజ్యాంగంలో 45వ అధికరణ బాలలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని పేర్కొంది. దీనిని అమలు చేయడానికి 2002లో 86వ రాజ్యాంగ సవరణలో 6-14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని 21-A అధికరణగా పేర్కొన్నారు. అంటే నిర్బంధ ప్రాథమిక విద్య ప్రస్తుతం ప్రాథమిక హక్కు అన్నమాట. ఆర్టికల్ 24 ప్రకారం.. ఫ్యాక్టరీలు, గనుల్లోనూ 14 సంవత్సరాల వయసులోపు పిల్లలతో పని చేయించడానికి వీల్లేదు ఆర్టికల్ 23 (1)..(2014లో చేసిన సవరణలను కలుపుకుని) మనుషులతో క్రయవిక్రయాలు జరపడం, అడుక్కోవడం లేదంటే మరేయితర రూపంలో బలవంతంగా పని చేయించుకోవడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు ఆర్టికల్ 39(E) : ఆర్థిక అవసరాలు, ఇతరత్రా పరిస్థితులు.. ఇలా గత్యంతర లేని కొన్ని పరిస్థితుల్లో పిల్లలు తమ శక్తికి మించి పనిచేస్తుంటారు. ఇలాంటివి ప్రోత్సహించరాదు. ఇది పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా వర్తిస్తుంది ఆర్టికల్ 39-(F) : బాల్యం, యవ్వనం దోపిడీకి గురికాకుండా ఉండాలి. బాలల కోసం గౌరవప్రదమైన స్వేచ్ఛాయుత పరిస్థితుల్ని, వివిధ సౌకర్యాల్ని కల్పించి వారి అభివృద్ధికి కృషి చేయాలి. ఆర్టికల్ 45 .. ఆరు నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యనందించాలి ఆర్టికల్ 51A(K): 6 నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. (ఈ అంశాన్ని 86వ రాజ్యాంగ సవరణ 2002లో ప్రాథమిక విధుల్లో చేర్చారు) ఆర్టికల్ 350-A .. భాషా పరమైన మైనార్టీల బాలలకు ప్రాథమిక విద్యను మాతృభాషలోకి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలి. బాలల సంక్షేమానికి తెచ్చిన చట్టాలివి.. బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం – 1956: బాలికల్ని అక్రమంగా తరలించి వారితో బలవంతంగా లైంగిక కార్యకలాపాల్ని చేయించడం, బాలికల్ని అమ్మడం ఈ చట్టం ప్రకారం నేరం. బాలల చట్టం – 1960 : కేంద్ర పాలిత ప్రాంతాల్లో, అనాథ బాలలు తప్పుదోవ పట్టిన బాలలు, తల్లిదండ్రులు విస్మరించిన, దుష్పప్రవర్తన ఉన్నటువంటి పిల్లల్ని సరైనమార్గంలో పెట్టడం, వారి సంక్షేమానికి, ఉన్నతికి సరైన విద్య, శిక్షణ కల్పించడం ఈ చట్టం ఉద్దేశం గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్(సంరక్షకుల మరియు పర్యవేక్షకుల చట్టం) – 1890 : బాలలకు సంరక్షకుడు ఉన్నప్పుడు .. వాళ్ల సంక్షేమం ఆ గార్డియన్స్ పూర్తి బాధ్యత బాలకార్మికులు నిషేధ చట్టం – 1986 : 14 ఏండ్లలోపు బాలబాలికల్ని ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో పనిచేయించడం నిషేధం న్యాయసేవల చట్టం – 1987 (Legal services authority Act – 1987) : బాలలకు కావల్సిన న్యాయపరమైన సేవల అందజేత శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లయ్ చట్టం 1992 : శిశువులకు కావల్సిన తల్లిపాలకు ప్రత్యామ్నాయ పౌష్టికాహారం అందజేసేందుకు. శిశు నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం – 1994 : గర్భస్త దశలో ఉన్న శిశువు ఆడ, మగా నిర్ధారించే స్కానింగ్ పరీక్షలు ఈ చట్టం నిషేధిస్తుంది ఆరు నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించడానికి 2009లో భారత పార్లమెంట్ చట్టం చేసింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 21 (A) గుర్తించింది. జువైనల్ జస్టిస్ చట్టం – 2000: బాల నేరస్తుల రక్షణ, బాగోగులు చూడటం బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006 : 1929లో బాల్యవివాహ నిరోధక చట్టాన్ని 2006లో రద్దు చేసి దాని స్థానంలో నూతన బాల్యవివాహ నిరోధక చట్టం – 2006 రూపొందించారు. హక్కులు.. మనుగడ హక్కు విద్యా హక్కు రక్షణ హక్కు యువగొంతుకలకు సాధికారత కల్పించేందుకు.. ఎందులోనైనా పాల్గొనేందుకు హక్కు అభివృద్ధి హక్కు: సంపూర్ణ వృద్ధిని పెంపొందించడం కోసం ఆరోగ్యం& శ్రేయస్సు హక్కు: ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం.. వ్యక్తిత్వ గుర్తింపు హక్కు సృజనాత్మకతను పెంపొందించే క్రమంలో.. వ్యక్తీకరణ హక్కు సమానత్వాన్ని ప్రొత్సహించే క్రమంలో.. వివక్షకు వ్యతిరేకంగా హక్కు సురక్షిత పర్యావరణ హక్కు.. రేపటి ప్రపంచ సంరక్షణ కోసం కింద పేర్కొన్న చట్టాలు బాలల్ని, ఫ్యాక్టరీలలో పనిచేయడం నిషేధిస్తున్నాయి. ►ఫ్యాక్టరీస్ చట్టం – 1948 ►ప్లాంటేషన్ లేబర్ చట్టం – 1951 ►మర్చంట్ షిప్పింగ్ చట్టం – 1951 ►మైనింగ్ చట్టం – 1952 ►మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కింగ్ చట్టం – 1961 ►అప్రెంటీస్ చట్టం – 1961 ►బీడీ, సిగార్స్ వర్కర్స్ చట్టం – 1966 జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ – 2005 : రాజ్యాంగం పార్లమెంట్ బాలలకు కల్పించిన ప్రత్యేక హక్కులు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో సమీక్షించే సంస్థ ఇది. బాలలపై జరిగే నేరాలను సత్వరం విచారించి న్యాయం అందించడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఈ కమిషన్ అవకాశం కల్పిస్తుంది. లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ చట్టం – 2012 (Protection of children from sexual ofference 2012) : బాలలతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఈ చట్టం శిక్షిస్తుంది. ఇలాంటి కేసులను సత్వర విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఇవేగాకుండా..ఐపీసీ, సీఆర్పీసీ, హిందూ వివాహ చట్టం, భారతీయ వారసత్వ చట్టం.. తదితరాలు కూడా బాలల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన సెక్షన్లను కలిగి ఉన్నాయి. -
చిల్డ్రన్స్ డే స్పెషల్.. ఓటీటీలో పిల్లలకు ఇష్టమైన చిత్రాలు!
సినిమాలన్నీ అందరూ చూసేలా ఉండవు. ఈ మధ్య ఎన్ని ఎక్కువ బూతులు ఉంటే అంత మంచిది అన్నట్లుగా అసభ్య పదజాలాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఓటీటీలో అయితే మరీనూ.. ఓటీటీకి కఠిన నియమనిబంధనలంటూ ఏమీ లేకపోవడంతో వెబ్ సిరీస్‌లలో ఇష్టారీతిన డైలాగ్స్, సీన్లు వాడేస్తున్నారు. దీంతో ఓటీటీలు పెద్దలకు మాత్రమే, పిల్లలకు పనికి రాదు అనుకుంటారు చాలామంది! అయితే వెతికితే దొరకనిదంటూ ఏమీ ఉండదు.. చిన్నారుల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ ఎన్నో కామెడీ, యాక్షన్ చిత్రాలు, సిరీస్‌లు, కార్టూన్లు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు ఇష్టపడే కార్టూన్స్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.. నెట్‌ఫ్లిక్స్ ► లోకి ► స్ట్రేంజర్ థింగ్స్ ► నరుటో ► పవర్ రేంజర్స్ ► బెన్ & హోలీస్ లిటిల్ కింగ్డమ్ ► మైటీ లిటిల్ భీమ్ ► చిల్లర్ పార్టీ ► విష్ డ్రాగన్ హాట్‌స్టార్ ► బేమాక్స్ ► బ్లూయి ► ఫ్రోజెన్ ► ద జంగిల్ బుక్ అమెజాన్ ప్రైమ్ వీడియో ► మిస్టర్ బీన్ ► హ్యారీ పోటర్ -
కేటీఆర్ అంకుల్.. కాలనీకి నల్లానీరు ఇప్పించరూ
సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నివసించే ఉమర్ అనే బాలుడు మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావును కోరిన చిరుకోరిక తక్షణమే నెరవేరింది. నగరంలోని రాజేంద్రనగర్ గోల్డెన్ సిటీలో పిల్లర్ నంబర్ 248 వద్ద నివసిస్తున్న తాము ఐదేళ్లుగా మున్సిపల్ నీటి కనెక్షన్ కోసం నిరీక్షిస్తూ ఎన్నో సమస్యలు పడుతున్నామంటూ చిన్నారి ఉమర్ ఓ వీడియోలో ప్లకార్డు ప్రదర్శించాడు. ఈ వీడియోను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు సోమవారం ట్వీట్ చేయడంతో ఆయన దీన్ని చూసి తక్షణమే స్పందించారు. బాలుడు నివసించే కాలనీకి ప్రత్యక్షంగా వెళ్లి సమస్యను పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ను ఆదేశించారు. దీంతో ఎండీ సోమవారం గోల్డెన్ సిటీ కాలనీలో పర్యటించారు. బాలుడు ఉమర్‌తోపాటు కాలనీవాసులను కలిసి సమస్యను తెలుసుకున్నారు. తక్షణం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ కాలనీలో నల్లా పైప్‌లైన్ ఏర్పాటుకు జలమండలి రూ. 2.85 కోట్లను మంజూరు చేసిందని... ఇటీవల వర్షాల కారణంగా రోడ్‌కటింగ్ అనుమతులు లేకపోవడంతో పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రెండు వారాల్లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసి నల్లా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా కాలనీకి నీటి సరఫరా కొనసాగిస్తామన్నారు. బాలుడు ఉమర్ తమ కాలనీ నీటి సమస్యను వివరించిన నాలుగు గంటల్లోపే మంత్రి కేటీఆర్ స్పందించడం, జలమండలి ఎండీ దానకిశోర్ నేరుగా గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం చకచకా జరిగిపోవడం విశేషం. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కేటీఆర్ అత్యంత ప్రాధాన్యతనివ్వడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. -
చిల్డ్రన్స్ డే రోజు విషాదం.. స్కూల్ బస్సు బోల్తా, ఇద్దరు మృతి
డెహ్రాడూన్: బాలల దినోత్సవం (నవంబర్ 14) రోజున విషాదం చోటుచేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితో సహా ఉపాధ్యాయుడు మరణించారు. మరికొంతమంది చిన్నారులు గాయపడ్డారు. నాయగావ్ భట్టే పరిధిలోని కిచ్చా ప్రాంతానికి చెందిన వేదారం స్కూల్ విద్యార్థులను చిల్డ్రన్స్ డే సందర్భంగా పిక్నిక్కు తీసుకెళ్లారు. సితార్‌గంజ్ ప్రాంతంలో బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. స్కూల్ పిల్లల కేకలు విన్న స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వగా సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: రాష్ట్రపతి ముర్మును క్షమాపణలు కోరిన సీఎం మమతా.. ఎందుకంటే? -
చిల్డ్రన్స్ డే, కొడుకుతో కలిసి డిస్నీ ల్యాండ్‌లో నాని రచ్చ.. వీడియో వైరల్
నేచులర్ స్టార్ నాని తన కొడుకుతో కలిసి చేసి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ సమయంలో కొడుకు అర్జున్‌తో సరదగా ఆడుకుంటూ ఉండే వీడియోల తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా కొడుకుతో నాని సరదగా సమయాన్ని గడిపాడు. కొడుకు కోసం షూటింగ్స్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వాలిపోయాడు. బాలల దినోత్సవం సందర్భంగా తనయుడితో కలిసి కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్‌లో సందడి చేశాడు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్? అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ది పార్ట్నర్స్ స్టాచ్యూ(Partners statue) ముందు నాని, అర్జున్ అచ్చం అలాగే నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. అర్జున్ మిక్కీ మౌస్లా డ్రెస్ వేసుకుని.. క్యూట్ క్యూట్‌గా ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నాని తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం నాని పోస్ట్ ఫ్యాన్స్‌ని, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు సరదా కామెంట్స్‌తో స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
గూగుల్‌ను మెప్పించి.. విజేతగా నిలిచిన శ్లోక్
దేశవ్యాప్తంగా వందకిపైగా నగరాలు.. లక్షా పదిహేను ఎంట్రీలు.. ఆ మొత్తంలో గూగుల్‌ను మెప్పించి విజేతగా నిలిచాడు ఓ కుర్రాడు. ఆ డూడుల్ ఇప్పుడు బాలల దినోత్సవం సందర్భంగా.. గూగుల్ హోం పేజీలో దర్శనమిస్తోంది. గూగుల్ సోమవారం ఉదయం డూడుల్ ఫర్ గూగుల్ 2022 పోటీల ఫలితాలను ప్రకటించింది. ఈ పోటీలో పశ్చిమ బెంగాల్ కోల్‌కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీగా విజేతగా నిలిచాడు. ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్ అనే డూడుల్‌ను రూపొందించాడు శ్లోక్. అది స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రకటించింది గూగుల్. సోమవారం ఆ డూడుల్ Google.co.inలో ప్రదర్శితమవుతోంది. న్యూటౌన్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు శ్లోక్. ‘‘రాబోయే పాతికేళ్లలో.. మానవాళి అభివృద్ధికి నా దేశ శాస్త్రవేత్తలు తమ సొంత పర్యావరణ అనుకూల రోబోట్‌ను అభివృద్ధి చేస్తారు. భారతదేశం భూమి నుంచి అంతరిక్షానికి క్రమం తప్పకుండా ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలను చేస్తుంటుంది. యోగా, ఆయుర్వేదంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో దేశం మరింత బలపడుతుంది’’ అంటూ తన డూడుల్ సందేశంలో పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా మొత్తం వంద నగరాల నుంచి లక్షా 15వేల ఎంట్రీలు వచ్చాయి ఈ పోటీకి. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు ఈ పోటీకి అర్హులు. మొత్తం ఎంట్రీల నుంచి చివరగా 20 మందిని ఎంపిక చేశారు. చివరికి శ్లోక్‌ను విజేతగా ప్రకటించారు. గూగుల్ డూడుల్ టీంతో పాటు న్యాయనిర్ణేతల ప్యానెల్లో ప్రముఖ నటి, ఫిల్మ్ మేకర్ నీనా గుప్తాతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. డూడుల్ ఫర్ గూగుల్ పోటీలు.. యువతరంలో సృజనాత్మకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆధునిక దేశ నిర్మాత
ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసినవాడు జవహర్లాల్ నెహ్రూ. వలసవాద వ్యతి రేకిగా, లౌకికవాదిగా, మానవతావాదిగా, ప్రజా స్వామ్యవాదిగా, స్వాతంత్య్ర ఉద్యమ నేతగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి నెహ్రూ... భారతదేశ సమగ్రాభివృద్ధికి దాదాపు 17 ఏళ్లు ప్రధానమంత్రిగా కృషి చేశారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఆ రోజుల్లో 1936లో ఆటో బయోగ్రఫీ, 1946లో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రచించి, ఆనాటి రాజకీయ, సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రముఖ రాజ నీతిజ్ఞునిగా ప్రసిద్ధి కెక్కారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ కుమా రుని విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సైన్స్‌లో డిగ్రీ చదివించారు. లండన్‌లోని ‘ఇన్నర్ టెంపుల్ ఇన్’లో న్యాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసి లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించారు నెహ్రూ. 1912 నుండి అఖిల భారత కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. 1920లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ జీతో పాటు పాల్గొన్నారు. 1946లో ఏర్పడిన ప్రొవి జనల్ ప్రభుత్వంలో ప్రధానిగా ఎన్నికయ్యారు. నెహ్రూ భారతదేశం లౌకిక తత్వంతో సోష లిస్టు భావజాలంతో ముందుకు వెళ్లడానికి తోడ్ప డ్డారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు సమీక రించడం కష్టమవుతున్న నాటి పరిస్థితులలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన ధీశాలి నెహ్రూ. బహుళార్థ సాధక భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, రైల్వేల అభివృద్ధి, రోడ్డు మార్గాలు, విమానాశ్ర యాలు, ఇనుము, ఉక్కుకర్మాగారాలు, శాస్త్ర పరి శోధన సంస్థలను ప్రభుత్వ రంగంలోనే ప్రారం భించిన దార్శనికుడాయన. ప్రముఖ ఆర్థిక వేత్త మహలనోబిస్ నేతృత్వంలో పంచవర్ష ప్రణాళి కలకు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి నెహ్రూ. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తటస్థ వైఖరి అవలంబించి, అలీన ఉద్యమానికి నేతృత్వం వహించారు. ప్రతిరోజు భారత ప్రజలు వివిధ సమస్యలపై దాదాపు రెండు వేలకు పైగా ఉత్తరాలు రాసేవారు. ప్రతి రాత్రి అదనంగా నాలుగు లేదా ఐదు గంటలు పని చేసి, ఆ ఉత్తరాలను అధ్యయనం చేసి సమాధానాలను రాయడం ఆయన నిరంతర కృషికి నిదర్శనం. 12 శాతం అక్షరాస్యతతో ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న దేశంగా ఉన్న భారత దేశాన్ని నెహ్రూ తన రాజకీయ పరిజ్ఞా నంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా నిలబెట్టారు. ఇంతటి గొప్ప దార్శనికుడు నెహ్రూజీకి బాలల పట్ల అమితమైన ప్రేమ, వాత్సల్యం ఉండేవి. అందుకనే పిల్ల లందరూ చాచా నెహ్రూగా పిలిచేవారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. నిజా నికి 1956 నుంచి అంతర్జాతీయ బాలల దినో త్సవం జరిగే రోజునే ఇండియాలోనూ బాలల దినోత్సవాన్ని జరిపేవారు. అయితే 1964 మే 27న పిల్లల్ని ఎంతగానో ఇష్టపడే నెహ్రూజీ తుదిశ్వాస విడిచిన తర్వాత... ఆయన పుట్టిన రోజును భారత ప్రభు త్వం బాలల దినోత్సవంగా జరపాలని నిర్ణ యించింది. ఈ తరుణంలో ఆ మహనీయుని స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం అవసరం. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు, జన చైతన్య వేదిక మొబైల్: 99499 30670 -
కబళిస్తోన్న స్మార్ట్ ఫోన్.. పౌరుల భవిష్యత్తుపై వైద్య నిపుణుల ఆందోళన
సాక్షి, నిజామాబాద్ : కొన్నేళ్ల క్రితం క్రీడా మైదానాలు పిల్లలతో కిటకిటలాడేవి.. ఎక్కువ సేపు మైదానంలో గడిపితే ఇళ్లకు రావాలని తల్లిదండ్రులు మందలించేవారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ పట్ల మక్కువ చూపుతూ మైదానాలకు, ఆటలకు దూరమవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను మైదానాలకు వెళ్లి ఆడుకోవాలని సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, కోవిడ్ కాలంలో ఆన్లైన్ పాఠా లు చెప్పడం తదితర కారణాలలో విద్యార్థులు ఆన్లైన్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆన్లైన్ గేమ్‌లు వ్యసనంగా మారాయి. అనేక కొత్త అంశాలు తెలుసుకునేందుకు, ప్రాజెక్టు వర్క్‌లు సృజనాత్మకంగా చేసేందుకు ఇంటర్నెట్ ఉపయోగపడుతున్నప్పటికీ.. ఎక్కువ మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతుండడంతో రేపటి పౌరుల భవిత ఏమిటనే ఆందోళనను పలువురు మనస్తత్వ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బాలల దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని బోధన్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లోని 3 ప్రభుత్వ, 3 ప్రైవేటు పాఠశాలల్లోని 9, 10 తరగతులకు చెందిన 120 మంది విద్యార్థులపై ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. వారి అభిప్రాయాలను సేక రించింది. ఇందులో 60 మంది బాలురు, 60 మంది బాలికలు ఉన్నారు. జాతిపితపై అభిమానం.. ఆసక్తిలేని రాజకీయాలు స్వాతంత్య్ర సమర యోధుల్లో జాతిపిత మ హాత్మా గాంధీ అంటే అభిమానమని ఎక్కువ మంది విద్యార్థులు మనోభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత స్థానం భగత్ సింగ్‌కు దక్కింది. రాజకీయాల పట్ల ఆసక్తి కనబర్చలేదు. ఇంజినీరు, వైద్య వృత్తిపై మక్కువ చూపారు. తల్లిదండ్రుల్లో అమ్మకే ఎక్కువ ఓటేశారు. బాల్యం తమ అభిరుచుల మేరకు గడుస్తోందని, చదువును ఇష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గణిత శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చారు. సాఫ్ట్వేర్ వైపే మొగ్గు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలతో దేశ, విదేశాల్లో స్థిరపడవచ్చనే ఆలోచనతో డాక్టర్ చదువుల కంటే సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గణితంతో కూడిన ఎంపీసీపై శ్రద్ధ పెడుతున్నారు. – ఖాందేశ్ రాజేశ్వర్‌రావు, విద్యార్థి తండ్రి, ఆర్మూర్ అవసరానికే వాడాలి కోవిడ్‌కు ముందు పిల్లలు సెల్ఫోన్లు ముడితే కోపగించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కోవిడ్ అనంతరం ఆన్లైన్ తరగతుల కారణంగా సెల్ఫోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సి వచ్చింది. సెల్‌ఫోన్ వల్ల మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. విద్యార్థుల చదువుల అవసరానికి మాత్రమే సెల్‌ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించేలా అవగాహన కల్పించాలి. మా పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. – ప్రవీణ్ పవార్, ప్రధానోపాధ్యాయుడు, విద్య హైస్కూల్, ఆర్మూర్ రోగగ్రస్త యువతగా రేపటి పౌరులు విద్యార్థులు స్మార్ట్ ఫోన్‌కు బానిసలవుతున్నారు. శారీరక శ్రమ లేకుంటే మానసిక ధృఢత్వం ఉండ దు. విద్యార్థులను జంక్ ఫుడ్‌కు అలవాటు చేయ డంతో ఊబకాయం, శక్తి, యుక్తి, ఉత్తేజం లేని యువత తయారవుతోంది. స్మార్ట్ ఫోన్లలో పో ర్నోగ్రఫీతో మానసిక రోగగ్రస్తులుగా మారుతున్నారు. తలనొప్పి, కంటిచూపు దెబ్బతినడం, కోపం, చికాకు చిన్నవయస్సులోనే వస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి తల్లి,దండ్రుల హత్యకు తెగిస్తున్నారు. ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణులు బాల్యం మీ అభిరుచుల మేరకు గడుస్తోందా? ►అవును 99, కాదు 21 చదువును ఇష్టంగా భావిస్తున్నారా..? ►అవును 98, కష్టంగానా ? : కాదు 22 ఇష్టమైన పని ►చదవడం 58, ఆన్లైన్ గేమ్ ఆడడం 36, మైదానంలో ఆడడం 26 పెద్దయ్యాక ఏమవుతారు ►డాక్టర్ 38, ఇంజినీర్ 42, పోలీస్ 17, కలెక్టర్ 14, సాప్ట్వేర్ 2, ఆర్మీ 2, టీచర్ 3, సీఏ 1, రాజకీయం 1 అమ్మానాన్నల్లో ఎవరంటే ఇష్టం ►అమ్మ 55, నాన్న 30, ఇద్దరు 35 ఇష్టమైన సబ్జెక్టు ►ఆంగ్లం 25, గణితం 43, రసాయన శాస్త్రం 10, భౌతికశాస్త్రం 11, సోషల్ 20, తెలుగు 11 స్వాతంత్య్ర పోరాట యోధుల్లో ఇష్టమైనవారు ►గాంధీ 53, నెహ్రూ 13, సర్దార్ పటేల్ 19, భగత్‌సింగ్ 20, సుభాష్ చంద్రబోస్ 15 తల్లిదండ్రుల ప్రభావం ఉంటోంది విద్యార్థుల ఆలోచనలపై తల్లిదండ్రులు, కుటుంబాల ప్రభావం ఎంతో ఉంది. సెల్ఫోన్లు, టీవీ ల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాల ల్లో కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా క్రీడలపై ఆసక్తి పెంచాలి. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం మానుకోవాలి. ఒక వేళ ఇచ్చినా కొంత సమయమే గడిపే విధంగా వ్యవహరించాలి. –అజారుద్దీన్, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం ఇబ్బందికరంగా సెల్ఫోన్లు సెల్ఫోన్లు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొంత మార్పు వచ్చింది. చదవాలనే పట్టుదల పెరిగింది. బాలుర కంటే బాలికలే ఉంతో ఉత్సాహంగా చదువులో ముందుంటున్నారు. –శేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ముబారక్‌నగర్ ఉన్నత పాఠశాల, నిజామాబాద్ క్రీడలను ప్రోత్సహించాలి పిల్లలు ఇంటి బయట ఆడు తుంటే ఇంట్లోకి పిలిచి బయటకు వెళ్లకుండా టీవీ చూస్తూ ఆడుకో అనే తల్లిదండ్రుల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో పిల్లలు మానసిక, శారీరక సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో గేమ్స్ పీరియడ్‌ను విధిగా నిర్వహిస్తూ మైదానంలో క్రీడలు ఆడించాలి. – జాదె శ్రీనివాస్, విద్యార్థి తండ్రి, ఆర్మూర్ తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి ఆన్లైన్ తరగతులతో ప్రతి విద్యార్థి మొబైల్ వాడాల్సి వచ్చింది. క్లాసుల తరువా త పిల్లలు మొబైల్ ఫోన్ల లో గేమ్స్‌కు అలవాటు పడ్డారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనప్పటికీ ఇష్టంగా చదవలేకపోతున్నారు. తల్లిదండ్రులు శ్రద్ధతో విద్యార్థులు చదువుకునేలా చూడాలి. –బచ్చు రవి, ఉపాధ్యాయుడు, ఘన్పూర్, డిచ్పల్లి మండలం ప్రాథమిక స్థాయి నుంచే .. ప్రాథమిక పాఠశాల దశ నుంచి పిల్లలు సెల్‌ఫోన్‌కు అలవాటు పడుతున్నారు. పిల్లల సెల్‌ఫోన్ వియోగంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.తరగతి గదిలో కాకుండా ఇంటి వద్ద పాఠ్యాంశాలను చదవటంపై ఆసక్తి కనబర్చేందుకు పిల్లలపైప్రత్యేక దృష్టిపెట్టాలి. –మధుకుమార్, టీచర్, ఇందూర్ హైస్కూల్, బోధన్ అభిరుచులు మారుతున్నాయి విద్యార్థుల అభిరుచులు రోజుకో విధంగా మారుతున్నాయి. కొంత మంది అపారమైన జ్ఞానం కలిగి ఉంటే మరి కొందరికి బద్దకం ఎక్కువ. భవిష్యత్తులో ఏమి కావాలో నిర్ణయించుకుని కృషి చేస్తున్నవారూ ఉన్నారు. –శ్యామ్, పీఈటీ, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం మొబైల్ ఫోన్లకే ప్రాధాన్యత పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై కౌన్సెలింగ్ ఇవ్వాలి. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను గాడిలో పెట్టాలి. ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడానికి కృషి చేయాలి. – అబ్దుల్ హఫీజ్, ఘన్పూర్, డిచ్పల్లి మండలం సెల్‌ను దూరం చేయలేని పరిస్థితి ఆన్లైన్ పాఠాల వల్ల పిల్లలకు సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. బడి నుంఇ ఇంటి రాగానే తల్లిదండ్రుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను తీసుకుంటున్నారు. చదవటం, హోం వర్క్ చాలా వరకు పాఠశాలల్లోనే సాగుతోంది. ఇంటి వద్ద చదవటం గతం కంటే తగ్గింది. పిల్లలను సెల్ ఫోన్ నుంచి దూరం చేయలేని పరిస్థితి ఉంది. –మంజుల, విద్యార్థి తల్లి, బోధన్ -
Childrens Day Special: బాలోత్సవ్..
ఊహల్లోకి కూడా ప్లే గ్రౌండ్‌ను రానివ్వకుండా చేసిన వీడియో గేమ్స్.. కల్చరల్ యాక్టివిటీ అర్థాన్నే మార్చేసిన రీల్స్.. విచిత్ర వేషధారణకు ఇంపోర్టెడ్ వెర్షన్‌గా పాపులర్ అయిన హాలోవీన్.. పిల్లల ఉత్సాహానికి.. ఉత్సవానికి కేరాఫ్ అనుకుంటున్నాం! స్థానిక ఆటలు, పాటలు.. సృజనను పెంచే సరదాలను మరుగున పడేసుకున్నాం! అలాంటి వాటిని వెలికి తీసి వేదిక కల్పించే ఉత్సాహం ఒకటి ఉంది.. అదే బాలోత్సవ్! పిల్లల దినోత్సవమే దానికి సందర్భం! ఆ వేడుక గురించే ఈ కథనం.. బోనమెత్తిన పెద్దమ్మ తల్లి ఆడిపాడే జానపదం మొదలు సంప్రదాయ కూచిపూడి వరకు పిల్లల ఆటపాటలు చూపే వేదిక బాలోత్సవ్. రుద్రమదేవి మొదలు అల్లూరి వరకు చారిత్రక ప్రముఖులను నేటి తరానికి మరొక్కసారి గుర్తు చేసే సందర్భాన్ని కల్పిస్తుంది. పిల్లలలో నైపుణ్యం వెలికితీసేందుకు, విద్యార్థి దశ నుంచే సమానత్వ స్ఫూర్తిని చాటేందుకు ఓ మహా యజ్ఞంలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా బాలోత్సవ్ జరుగుతూ వస్తోంది. ముప్పై ఏళ్ల కిందట కొత్తగూడెంలో మొదలైన ఈ పిల్లల పండుగ తెలుగు నేలపై నలుదిశలా విస్తరించింది.. విస్తరిస్తోంది. వేదికలు మారుతున్నా, కొత్త నిర్వాహకులు వస్తున్నా బాలోత్సవ్∙స్ఫూర్తి మారలేదు.. జోష్ తగ్గలేదు. కొత్తగూడెంలో మొదలు బొగ్గుగని, థర్మల్ పవర్ స్టేషన్ ఇతర పరిశ్రమలకు చెందిన అధికారులు, ఉద్యోగులు కలసి 1960లో రిక్రియేషన్ కోసం కొత్తగూడెం క్లబ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా క్లబ్ అంటే ఇండోర్ గేమ్స్, పేకాట అని పేరు పడిపోయింది. 1991లో ఈ క్లబ్ కార్యదర్శిగా డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబు ఎన్నికయ్యారు. క్లబ్ అంటే ఉన్న ఓ రకమైన అభిప్రాయాన్ని చెరిపేసి కొత్తగా ఏదైనా చేయాలనే తలంపుతో 1991లో పట్టణ అంతర్ పాఠశాల సాంస్కృతికోత్సవాలకు శ్రీకారం చుట్టారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్న పిల్లల్లో సృజనను వెలికి తీసేందుకు దీన్ని చేపట్టారు. కేవలం ఒక రోజు జరిగిన ఈ కార్యక్రమానికి నాలుగు అంశాల్లో పోటీలు నిర్వహించగా.. కొత్తగూడెం టౌన్ నుంచి దాదాపు రెండు వందల మంది దాకా విద్యార్థులు పాల్గొన్నారు.గమ్మత్తేంటంటే అచ్చంగా పిల్లల కోసమే రూపొందిన ఈ కార్యక్రమంలో చిన్నారుల ఆటపాటలు చూసి పెద్దలు సైతం రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను మరిచిపోవడం! పట్టణం నుంచి జాతీయ స్థాయికి చిన్నారుల ఆటపాటలకు ఎంత శక్తి ఉందో ఆ ఒక్కరోజు కార్యక్రమంతో నిర్వాహకులకు అర్థమైంది. అందుకే మరుసటి ఏడాది మండల స్థాయిలో బాలల ఉత్సవాలను నిర్వహించారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ 1994కల్లా జిల్లా స్థాయికి, నూతన సహస్రాబ్దిని పురస్కరించుకుని 2000 నుంచి రాష్ట్ర స్థాయికి ఈ పోటీలు విస్తరించాయి. ఆ తర్వాత 2014 నుంచి అంతర్రాష్ట్ర స్థాయిలో ఈ వేడుకలు మొదలయ్యాయి. ఆ బృహత్తర కార్యక్రమానికి చేయూతనివ్వడానికి సింగరేణి సంస్థతో పాటు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు ముందుకు వచ్చారు. స్థానికులు కూడా తమ వంతు సహకారం అందించారు.. ఆ ఉత్సవాల్లో పాల్గొనే పిల్లలు, తల్లిదండ్రులు, గురువులకు తమ ఇళ్లల్లో ఆశ్రయం ఇస్తూ! పాతికేళ్ల ప్రస్థానం 1991లో నాలుగు అంశాల్లో 200 మందితో మొదలైన వేడుకలు 2016లో కొత్తగూడెం క్లబ్ వేదికగా చివరిసారి ఉత్సవాలు జరిగే నాటికి పద్నాలుగు వందల పాఠశాలల నుంచి ఇరవై రెండువేల మంది ఈ వేడుకల్లో భాగమయ్యే వరకు చేరుకుంది. స్థానికులే కాదు వివిధ రాష్ట్రాల్లోని పిల్లలు సైతం ఎప్పుడెప్పుడు ఈ పోటీల్లో పాలు పంచుకుందామా అన్నట్టుగా ఎదురు చూసే విధంగా బాలోత్సవ్ పేరు తెచ్చుకుంది. మొబైల్, ఇంటర్నెట్ జమానాలోనూ తన ప్రభను కోల్పోలేదు. 2016 తర్వాత వివిధ కారణాలు, కరోనా సంక్షోభం వల్ల కొత్తగూడెం క్లబ్ ఈ బాలోత్సవ్ వేడుకలకు విరామం ఇచ్చింది. అయినప్పటికీ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే అద్భుతమైన ఈవెంట్‌గా అనేక మందికి ఈ బాలోత్సవ్ స్ఫూర్తిగా నిలిచింది. సమతా భావన బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య 1950వ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నిజాం పాలన, స్వాతంత్య్రానంతర అభివృద్ధిని చూశారు.. చూస్తున్నారు. ఎన్ని మార్పులు జరిగినా మనుషుల మధ్య కుల,మత, పేద,ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు ఎంతకీ తగ్గకపోవడం ఆయన్ని కలచి వేసింది. అందుకే విద్యార్థి దశలోనే సమానత్వ భావనను పిల్లల్లో పెంపొందించాలని ఆరాటపడ్డారు. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలోని విద్యార్థులనే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలను సైతం ఆకర్షిస్తోన్న కొత్తగూడెం బాలోత్సవ్ ఆయన దృష్టిలో పడింది. దీంతో భద్రాద్రి బాలోత్సవ్‌కు 2009లో శ్రీకారం చుట్టారు. పట్టణ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించాలని భావించినా జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాల నుంచి ఎంట్రీలు రావడంతో జిల్లా స్థాయి వేడుకలుగానే మారాయి ఇవి. తొలిసారే ఏకంగా 2500 మంది విద్యార్థులు వ్యాస రచన, వక్తృత్వం, కథా రచన, చిత్రలేఖనం, విచిత్ర వేషధారణ, శాస్త్రీయ, లలిత కళలు వంటి వివిధ అంశాల్లో పోటీ పడ్డారు. మరుసటి ఏడాదికే భద్రాద్రి బాలోత్సవ్ కూడా రాష్ట్ర స్థాయి వేడుకల సరసన చేరిపోయింది. నవంబర్ 14 వచ్చిందంటే చాలు ఇటు కొత్తగూడెం అటు భద్రాచలంలో జరిగే బాలోత్సవ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు ఉవ్విళ్లూరేవారు. అలా 2009 నుంచి 2016 వరకు కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లో భద్రాద్రి బాలోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతూ వచ్చాయి. ప్రైవేటుకు దీటుగా.. భద్రాద్రి బాలోత్సవ్‌లో వేడుకలకు విద్యార్థులు స్పందిస్తున్న తీరు అనేక మందిని ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్ యుగంలోనూ జానపద పాటలకు విద్యార్థులు ఆడిపాడటం, శాస్త్రీయ నృత్యరీతులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపించడం ప్రేక్షకులను ముచ్చటగొలిపేది. అంతేకాదు చిత్రలేఖనం, సైన్స్‌ఫేర్, క్విజ్ ఇలా అనేక విభాగాల్లో ఏ మాత్రం పరిచయం లేని పిల్లలు, వారి తల్లిదండ్రులు, గురువులు ఒకే చోట కలసిపోయే తీరు వేడుకలకు కొత్త వన్నెలు అద్దాయి. ఈ ఉత్సాహంతో భద్రాద్రి బాలోత్సవ్ వేడుకల్లో కీలక భూమిక పోషించిన బెక్కంటి శ్రీనివాసరావు మరో అడుగు ముందుకు వేశారు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులను బాలోత్సవ్ వేదిక మీదకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం అవార్డ్ విన్నింగ్స్ టీచర్స్ అసోసియేషన్ (ఆటా)ను ఏర్పాటు చేశారు. అలా ఉమ్మడి ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డులు పొందిన టీచర్లు తమ పాఠశాల పరిధిలోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని భద్రాద్రి బాలోత్సవ్‌కు తీసుకురాసాగారు. ఈ క్రమంలో 2018లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్, అవార్డ్ విన్నింగ్స్ టీచర్స్ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బాలోత్సవ్‌ను నిర్వహించారు. కరోనా సంక్షోభం వచ్చిన 2020 మినహాయిస్తే ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. 2021లో ఈ వేడుకలను ఆన్లైన్లో జరిపారు. ఈసారి ఆటా బాలోత్సవాలు భద్రాచలంలో నవంబరు 12,13,14 తేదీల్లో జరుగుతున్నాయి. మొత్తం 24 అంశాల్లో 44 విభాగాల్లో పోటీలుంటాయి. 6 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. సబ్ కేటగిరీలో 4 నుంచి 6 ఏళ్లు, జూనియర్ కేటగిరీలో 7 నుంచి 10 ఏళ్లు, సీనియర్స్ కేటగిరీలో 11 నుంచి 16 ఏళ్ల పిల్లలు పోటీ పడతారు. ముగింపు రోజైన నవంబరు 14న విజేతలకు బహుమతులు అందిస్తారు. అన్ని కేటగిరీల్లో ప్రవేశం ఉచితం. దేవస్థానం డార్మెటరీల్లో వసతి కల్పిస్తారు. మధ్యాహ్న భోజనం అందిస్తారు. ప్రత్యేకంగా గదులు కావాలి అనుకునేవారు దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న గదులను తక్కువ ధరకే పొందవచ్చు. రామదాసు కీర్తనలపై ఈసారి బాలోత్సవ్‌లో పిల్లల చేత రామదాసు కీర్తనలను ఆడిపాడించనున్నారు. నవంబరు 12వ తేదిన ప్రారంభ వేడుకలకు ముందు కూచిపూడి, భరతనాట్యం, గిరిజన సంప్రదాయ, జానపద కళలను అభినయించే విద్యార్థులంతా బృందంగా భక్తరామదాసు కీర్తనలను ఆలాపించనున్నారు. నర్తించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అంతర్జాతీయ స్థాయి కళాకారులైన డాక్టర్ మోహన్, డాక్టర్ రాధామోహన్‌ల చేత నవంబరు 13,14 తేదీల్లో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. గుంటూరు వేదికగా ప్రపంచ స్థాయిలో పిల్లల వేడుకలకు సంబంధించి కొత్తగూడెం బాలోత్సవ్ ఓ బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. ఇలాంటి కార్యక్రమం తమ ప్రాంతంలోనూ చేపట్టాలనే ఆలోచనను కలిగించింది ఎంతో మందికి. వారిలో వాసిరెడ్డి విద్యాసాగర్ ఒకరు. 2017 నుంచి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – (నంబూరు గ్రామం, పెదకాకాని మండలం) గుంటూరు వేదికగా బాలల పండుగకు శ్రీకారం చుట్టారు. ఉభయ రాష్ట్రాల్లోని విద్యార్థులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా బయటి దేశాల్లో ఉన్న తెలుగు చిన్నారులనూ భాగం చేస్తూ ‘ప్రపంచ తెలుగు బాలల పండుగ – వీవీఐటీ బాలోత్సవ్ పేరు’తో ఈ వేడుకలను మొదలుపెట్టారు. కరోనాకు ముందు 2019 జరిగిన ఉత్సవంలో ఏకంగా 9,900ల మంది బాలలు భాగస్వాములు అయ్యారు. ఇందులో సగానికి పైగా పిల్లలు తెలంగాణ వారు కావడం మరో విశేషం. కరోనా కారణంగా 2020, 2021లలో వేడుకలను నిర్వహించలేదు. ఈ ఏడాదికి నవంబర్ 12 నుంచి 14 వరకు వీవీఐటీ – గుంటూరు వేదికగా వేడుకలు జరగనున్నాయి. 29 అంశాల్లో 54 విభాగాల్లో పోటీలుంటాయి. గుంటూరు, విజయవాడ బస్ స్టేషన్ల నుంచి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. అదే విధంగా ఈ ఉత్సవంలో పాల్గొనే విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులకు వసతి, భోజన సదుపాయాలనూ అందిస్తున్నారు. ఎన్నారైల పిల్లల పాటలు, నృత్య రూపకాలను ఈ బాలోత్సవ్‌లో భాగం చేస్తున్నారు. అలా పల్లె స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు.. విదేశాల్లో ఉన్న విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రయత్నం బాలోత్సవ్‌లో మాత్రమే జరుగుతోంది. కాకినాడలో క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్ కాకినాడకు చెందిన ‘క్రియా సొసైటీ’ ఆధ్వర్యంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో 2002 నుంచి ప్రతిఏడూ పిల్లల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే 2011లో కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు స్కూలు విద్యార్థులకు కొత్తగూడెం బాలోత్సవ్ నుంచి ఆహ్వానం అందింది. విద్యార్థులతో పాటు క్రియా సొసైటీ సభ్యులు సైతం కొత్తగూడెం బాలోత్సవ్‌కు వచ్చారు. ఒకే చోట వందలాది పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, వారి టీచర్లు, తల్లిదండ్రులు ఒకే వేదిక మీద కలవడం.. పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం.. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రదర్శనలు జరగడం చూసి సంబరపడ్డారు క్రియా సభ్యులు. దీంతో మరు ఏడాది కూడా బాలోత్సవ్ నిర్వాహణ తీరు తెన్నులను పరిశీలించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ‘క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్’ పేరుతో జేఎన్టీయూ – కాకినాడ క్యాంపస్‌లో పిల్లల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ వంటి పోటీలు మొదలుపెట్టారు. త్రొలిసారిగా 2013లో మూడు వందల పాఠశాలల నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు హాజరవగా గతేడాది ఐదు వందల పాఠశాలల నుంచి పదివేల మంది వరకు వచ్చారు. ఈ ఏడాది నవంబరు 19, 20 తేదీల్లో జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్‌లో క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్ జరగనుంది. విశాఖలో కొత్తగూడెం బాలోత్సవ్ ప్రేరణతోనే వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా 2013లో విశాఖ బాలోత్సవ్‌ను నిర్వహించారు. ఆ తర్వాత 2019లో అచ్చంగా కొత్తగూడెం తరహాలోనే భారీ ఎత్తున ఇటు స్టీల్ ప్లాంట్, ఆంధ్రా యూనివర్సిటీ.. ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఆవరణలో విశాఖ బాలోత్సవ్‌ను నిర్వహించారు. రెండు వేదికలకు సంబంధించి సుమారు ఏడు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది గిరిబాలోత్సవ్ పేరుతో అరకులోనూ వేడుకలు నిర్వహించారు. ఈ ఏడాదికి డిసెంబరులో విశాఖ బాలోత్సవ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు నేలపై 2016లో.. కొత్తగూడెం బాలోత్సవ్ రజతోత్సవాలు జరిగాయి. వీటికి విజయవాడ కేంద్రంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే విజ్ఞాన కేంద్రం సభ్యులు హాజరయ్యారు. అదే ఏడాది విజయవాడలో విద్యావేత్తలు, మేధావులు, లాయర్లు, డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. చివరకు 2017న అమరావతి బాలోత్సవ్ పేరుతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. కరోనా సంక్షోభం సంవత్సరం 2020 మినహాయిస్తే ప్రతి ఏడాదీ అమరావతి బాలోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలు డిసెంబరు 16,17,18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇతర జిల్లాల్లోని విజ్ఞాన కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ 2018 నుంచి మచిలీపట్నంలో కృష్ణా బాలోత్సవాలు, ఏలూరులో హేలాపురి బాలోత్సవాలు మొదలయ్యాయి. ఇదే తరహాలో నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలలో కూడా బాలోత్సవాలకు బీజం పడింది. మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్లో డిసెంబరు 6,7 తేదీల్లో బాలోత్సవాలు జరగబోతున్నాయి. -టి. కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, కొత్తగూడెం సరిహద్దులు చెరిపేస్తూ కొత్తగూడెం క్లబ్ మొదలుపెట్టిన బాలోత్సవ్ ఆ తర్వాత పట్టణస్థాయి పండగగా మారిపోయింది. ఇలాంటి సంబురం ప్రతిజిల్లాలో జరిగితే బాగుండనిపించేది. ఇప్పుడు ఆ కల నెరవేరింది. సరిహద్దులు చెరిపేస్తూ తెలుగువారున్న ప్రాంతాలాకు చేరిపోతోంది. పదుల సంఖ్యలో బాలోత్సవాలు జరుగుతున్నాయి. – వాసిరెడ్డి రమేశ్‌బాబు, (బాలోత్సవ్ కన్వీనర్) ఒత్తిడి నుంచి లాగి.. ఈ పోటీ ప్రపంచంలో పిల్లలను చదువుల ఒత్తిడి నుంచి కొంతైనా బయటకు లాగి వారిలో దాగిన సృజనను వెలికి తీసేందుకే కొత్తగూడెం బాలోత్సవ్ మొదలైంది. అలాంటి మహాత్తర కార్యక్రమానికి కొత్తగూడెం క్లబ్ విరామం ఇవ్వడంతో గుంటూరులో వీవీఐటీ చేపట్టింది. – వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రతిభను ప్రోత్సహించాలి పాఠాలు చెప్పినందుకు మాకు జీతం ఇస్తున్నారు. సిలబస్‌కు మించి విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చిందనేది నా అభిప్రాయం. నాలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయలంతా ఒక వేదిక మీదకు వచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఆటా బాలోత్సవ్‌ను చేపట్టాం. – బెక్కంటి శ్రీనివాస్ ఆ లోటు తీర్చేందుకే బహుమతులు లేకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహిస్తే పిల్లలు చాలా సంతోషిస్తారు. అందుకే 2002 నుంచి పిల్లలకు వివిధ అంశాల్లో పోటీలు పెడుతూ వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తున్నాం. కొత్తగూడెం బాలోత్సవ్ లోటును తీర్చేందుకే క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్‌ను జరుపుతున్నాం. – జగన్నాథరావు (క్రియా సొసైటీ, కాకినాడ) నేను, మా అన్న 2020లో కాకినాడ క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్‌కి వెళ్లాం. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ ఒక అన్న చేసిన ‘ఓరగేమీ’ క్రాఫ్ట్ హంస చాలా నచ్చింది. కొంతమంది మట్టితో ఎడ్ల బండి, ట్రాక్టర్‌లాంటి బొమ్మలు చేశారు. నాకు బాగా నచ్చాయి. స్కూల్లో లేనివెన్నో అక్కడ కనిపించాయి. అవన్నీ స్కూల్లో ఉంటే బాగుండు అనుకున్నాను. మన టాలెంట్‌ని అక్కడ చూపించుకోవచ్చు అనిపించింది. ఈసారి కూడా వెళ్తున్నాం. రన్నింగ్ రేస్, ఓరగేమీ క్రాఫ్ట్‌లో పార్టిసిపేట్ చేస్తా. – పి. రాజ దుహిత్, (ఆరవ తరగతి), హైదరాబాద్ వసతి కల్పించాను కొత్తగూడెంలో బాలోత్సవ్ జరిగేటప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు అనేక సార్లు వసతి కల్పించాను. రజతోత్సవం తర్వాత బాలోత్సవ్ వేదిక కొత్తగూడెం నుంచి గుంటూరుకు మారింది. మా పాప సాహిత్య.. 2018లో సబ్ జూనియర్ కేటగిరీలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. – పవన్, (కొత్తగూడెం) అప్పుడు విద్యార్థిగా.. ఇప్పుడు గురువుగా 2018లో భద్రాద్రి బాలోత్సవ్ వేడుకల్లో సీనియర్ కేటరిగిలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నా శిష్యులు పది మంది సబ్ జూనియర్, జూనియర్ కేటగిరీలో ప్రదర్శనలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. – సాయిలక్ష్మీ (భద్రాచలం) ఎన్నటికీ మరువలేను నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు 2011లో బాలోత్సవ్ వేడుకల గురించి పేపర్లో చూసి హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లి కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దుబాయ్, రష్యాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాను. బాలోత్సవ్‌ను ఎన్నటికీ మరువలేను. – పీవీకే కుందనిక (హైదరాబాద్) -
Fashion: ట్రెడిషన్ టు వెస్ట్రన్.. పిల్లల డ్రెస్సింగ్లోనూ ఎన్నో మార్పులు
ఒకప్పటితో పోల్చితే పిల్లల డ్రెస్సింగ్లోనూ ఎన్నో మార్పులు వచ్చేశాయి. వేదికల మీదా క్యాట్‌వాక్‌లతో చిన్నారుల డ్రెస్సులు కొత్తగా మెరిసిపోతున్నాయి. పుట్టిన రోజుకు సిండ్రెల్లా స్టైల్.. సంప్రదాయ వేడుకకు శారీ స్టైల్.. పార్టీకి వెళ్లాలంటే వెస్ట్రన్ స్టైల్.. గోల్డెన్ టైమ్‌ని గుర్తుకు తేవాలంటే .. వింటేజ్ స్టైల్ క్యాజువల్ లుక్‌లో ఒక విధంగా.. కంఫర్ట్ వేర్ అంటూ మరో విధంగా ఈ చిల్డ్రన్స్ డే కి చిన్నారుల లుక్స్‌ని మరింత ఆకట్టుకునేలా మార్చేసే డ్రెస్సింగ్ స్టైల్స్‌లో కొన్ని... పెద్దవారితో పోటీగా, కాంబినేషన్ డ్రెస్సింగ్గానూ చిన్నారుల ఫ్యాషన్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. చిల్డ్రన్కే ప్రత్యేమైన స్టైల్స్‌ని క్రియేట్ చేసే డిజైనర్లు కూడా తమ సృజనకు పదును పెడుతూనే ఉన్నారు. డ్రెస్సింగ్‌కు తగినట్టు వారి ఇతర అలంకరణ వస్తువుల రూపకల్పనకూ డిజైనర్లు పోటీపడుతూ ఉన్నారు. -
‘నా చిన్నప్పటి ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా తనకు కనిపించిన అనేక మేసేజ్‌లలో ఇది బాగా నచ్చిందని, ఈ మెసేజ్ ప్రతీ రోజుకి వర్తిస్తుందని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘పెరిగి పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావ్ అనే ప్రశ్నకి నా చిన్నతనంలో అసలు సమాధానం దొరికేది కాదు. కానీ ఈ రోజు నేను పెద్దయ్యాను. ఇప్పుడు నాకు సమాధానం దొరికింది. అదేంటంటే... తిరిగి చిన్న పిల్లాడిగా మారిపోవాలని అనిపించడం’ అంటూ ఉన్న మెసేజ్‌ని ఆయన షేర్ చేశారు. ఈ మేసేజ్ చదివిన నెటిజన్లు ఆనంద్ మహీంద్రాలోని చమత్కారం చూసి చిరునవ్వులు చిందిస్తున్నారు. This was circulating on Children’s Day, but relevant 365 days of the year. If you want to remain creative & innovative, rediscover the child in you… pic.twitter.com/DV4xXTngf5 — anand mahindra (@anandmahindra) November 16, 2021 -
Children's Day 2021 Special: నక్క సాయెబు – నక్క బీబీ.. కథ!
ఒక నక్క సాయెబుగారూ నక్క బీబీ అడవిలో కాపురం చేసుకుంటూ వున్నారు. నక్క సాయెబుగారికి ఏ పనీ రాకపోయినా జాతిబుద్ధి సోకి వాళ్లను ముంచి, వీళ్లని ముంచి మొత్తం మీద బీబీగారు ఏమడిగితే అది తెచ్చిపెడుతూ, ఆమె కళ్లలో కాటుక తడవకుండా చూసుకుంటూ వస్తున్నారు. బీబీగారు చిన్నమనిషి కాదు. నా మొగుడు సిపాయి, నా మొగుడు పైల్వాను అనుకుంటూ వుండేవారు. సరే వాళ్లున్న యింటి మీదుగా రోజూ ఒక ఏనుగు దాని మానాన అది కాలువకు స్నానానికి పోతూ వుండేది. స్నానానికి పోతూ వుంటే అప్పుడే స్నానానికి సిద్ధమవుతున్న నక్కబీబీగారు దాన్ని చూశారు. ఆ టైములో నక్కబీబీగారి ఒంటి మీద నూలుపోగు లేదు. అందువల్ల ఆవిడ సిగ్గుతో చచ్చిపోయి, గబగబా చీర చుట్టుకొని యింట్లోకి పరుగు తీశారు. ఆ తర్వాత, అలిగి మంచంమీద పడుకున్నారు. నక్కసాయెబుగారు కంగారుపడిపోయారు. ‘బీబీగారూ. ఏం జరిగింది? చెప్పంyì . చెప్పండి?’ అని సముదాయించారు. ‘చూడండి. నాకూ మానం మర్యాదా గోషా పరదా వున్నాయి. పొద్దున లేస్తే మీ పని మీద మీరు వెళ్లిపోతారు. యింట్లో నేనొక్కదాన్నే వుండాలి. ఎవరైనా కన్నేసి ఏదైనా చేస్తే నేనేం కావాలి? యివాళ నీళ్లు పోసుకుంటూ ఉంటే ఏనుగు చూసింది. యిప్పుడు యీ పని చేస్తుంటే చూసింది రేపు ఒంటికి పోతా వుంటే రెండుకు పోతా వుంటే చూస్తుంది. అది రోజూ ఈ దోవన పోతుంటే నాకు చచ్చేంత సిగ్గుగా వుంటోంది. మీరు నా మానం మర్యాదలు కాపాడేవాళ్లయితే దాన్ని చంపి దాని రక్తంతో మన యింటి ముందు కళ్లాపి చల్లండి’ అంది నక్క బీబీ. బీబీగారు అంత మాట అన్నాక నక్కసాయెబుగారు వెనక్కి తగ్గితే ఏం బాగుంటుంది? ‘నీ కోరిక నెరవేరుస్తా బీబీ’ అని చెప్పి మాట యిచ్చి అడవికి వెళ్లారు. వెళ్లి ఎక్కడెక్కడి నుంచో నారను సేకరించారు. తాడు పేనారు. పేని ఏనుగు వచ్చే దారిలో అక్కడొక ఉచ్చు, ఇక్కడొక ఉచ్చు అమర్చుకుంటూ వచ్చి తాడు కొసను తన నడుముకు కట్టుకున్నారు. ఏనుగుని ఉచ్చులో బంధించి ఆ తర్వాత చంపాలని ఆయన పథకం. ఎప్పటిలాగే ఏనుగు స్నానానికి బయలుదేరింది. దారిలో వస్తూ వస్తూ నక్క సాయెబుగారి ఉచ్చులో కాలు పెట్టింది. ఆ ఉచ్చు దానికో లెక్కా? చీమతో సమానం. అందుకని తాడును లాక్కుంటూనే అది తన దారిన తాను పోతూ వుంది. తాడు చివరను సాయెబుగారు నడుముకు కట్టుకున్నారు గదా. అందువల్ల ఆయన్ను కూడా లాక్కుపోతూ వుంది ఏనుగు. ఇది సాయెబుగారు ఊహించలేదు. తాడు చివరను నడుముకు కట్టుకుంటే చాలదా, నా బలానికి ఏనుగు ఆగిపోదా అనుకున్నాడు ఆయన. యిప్పుడు కథ తిరగబడేసరికి బిత్తరపోయి ‘ఓలమ్మో ఓరి నాయనో’ అని గోల మొదలుపెట్టారు. ఆ ఆరుపులకీ కేకలకీ ధర్మపత్ని అయిన నక్కబీబీగారు యింట్లో నుంచి బయటికొచ్చి చూశారు. సాయెబుగారిని ముళ్లల్లో పొదల్లో రాళ్లల్లో రప్పల్లో లాక్కుని పోతూ వుంది ఏనుగు. తమాషా ఏమిరా అంటే అసలా ఏనుగుకి ఆ దోవలో ఒక నక్కబీబీగారు ఒక నక్కసాయెబుగారు కాపురం వుంటున్నారని గానీ, నక్కబీబీగారు తనని చూసి సిగ్గుపడుతున్నారనిగానీ, తనని చంపడానికి వాళ్లు పథకం వేశారనిగానీ, ఉచ్చు పన్నారనిగానీ ఏమీ తెలియదు. మహారాజులకి అల్పసంగతులు పడతాయా? పట్టవు. అందుకే అది పోతూ పోతూ వుంటే వెనుక కుయ్యోమొర్రో అంటున్నారు సాయెబుగారు. ఆయన వెంట బీబీగారు లబోదిబోమంటున్నారు. ‘ఓరయ్యో నా మానం పోతే పోయింది మీరు దక్కితే చాలు. ఓరయ్యో నా మర్యాద పోతే పోయింది మీరు దక్కితే చాలు. ఓరయ్యో నా గోషా పోతేపోయింది మీరు దక్కితే చాలు. ఓరయ్యో నా సిగ్గు పోతే పోయింది మీరు దక్కితే చాలు’అని శోకండాలు తీస్తున్నారు బీబీగారు. ఎన్ని శోకండాలు తీసినా నక్కసాయెబుగారు వెనక్కి వస్తారా? ఏనుగుతోపాటు కాలువలో మూడు మునకలు మునిగి చావుతప్పి కన్ను లొట్టపోయి ఎట్టో బతికి బయటపడి చెంపలు వేసుకున్నారు పాపం. - మహమ్మద్ ఖదీర్‌బాబు (పుప్పుజాన్ కతలు నుంచి) -
Happy Childrens Day 2021: చందమామ.. నా ఆత్మ కథ!!
మీకు నేను ప్రతి రాత్రీ ఒకేవేళకు కనిపించను, అప్పుడప్పుడు అసలే రాను, అందువల్ల నేను మంచివాడిని కాదని అనుకునేరు.. తల్లిదండ్రులంటే నాకూ భయభక్తులున్నాయి. చదువు సంధ్యలేకుండా నేను అల్లరిచిల్లరగా తిరగటం లేదు. నిజంగా నా కథ తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతున్నదో మీకే తెలుస్తుంది. నా మీద మీకు అంత అపనమ్మకమూ ఉండదు. నాకు ప్రతిరోజూ వచ్చి మీతో ఆడుకోవాలనే ఉంటుంది. కానీ ఏమి చెయ్యను? చాలా ఏళ్ల కిందట, లక్షలు, కోట్ల సంవత్సరాల కిందట, అప్పటికి మనుషులు ఇంకా పుట్టలేదు, జంతువులు పుట్టలేదు. చెట్లు పుట్టలేదు. నీళ్లు కూడా లేవు. అప్పుడు మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మను మీరెరుగరూ? మీరుంటున్నది మా అమ్మ ఒళ్లోనేగా. భూదేవి మా అమ్మ. మా అమ్మ సూర్యుని కూతురు. మా అమ్మ చిన్నప్పుడు మా తాత సూర్యుడిలానే ఉండేదట. నేను కూడా ఎరుగుదునుగా నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని. నా కళ్లు కూడా సరిగా చూడనిచ్చేవికావు. మా అమ్మ పుట్టినప్పటి నుంచి మా తాత చుట్టూ గిరగిరా బొంగరంలా తిరుగుతూ ఆడుకొంటూ ఉండేది. అదే మా అమ్మకు ఆచారమైపోయింది. ఇలా ఉండగా నేను పుట్టాను. పుట్టి, కాళ్లు వచ్చిన తర్వాత ఒక చోట ఎలా కూర్చుంటాం? కాళ్లు, చేతులు ఊరుకోనిస్తాయా? నేనూ మా అమ్మ కొంగు వదలిపెట్టకుండా ఆమె చుట్టూ అల్లాబిల్లీ తిరిగేవాడ్ని. చుక్కలు ఎంతో ప్రేమతో పిలిచేవి కానీ నేను మా అమ్మను వదిలిపెట్టేవాడ్ని కాను. ఆ రోజుల్లో నేను మా తాత సూర్యుడిలాగా ఉండేవాడ్ని. అందుకని అందరూ నన్ను ఎత్తి ముద్దులాడ పిలిచేవాళ్లు. మా అమ్మకు నన్ను చూస్తే ఎంతో సంతోషం. నా ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఇచ్చింది. మీకు అద్దం ఇస్తే ఏం చేస్తారు? ముఖం చూసుకోరా? నేనూ ఆ పొరపాటే చేశాను. అద్దంలో చూసుకునే కొద్ది నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించసాగింది. అలా చూసుకుంటూ ఉంటే ఇక ప్రపంచంలో మరొటి అందమైనది ఉన్నట్లే కనిపించేది కాదు. అందువల్ల ఎప్పడూ అదేపనిగా నన్ను నేను అద్దంలో చూసుకునేవాడ్ని. మా అమ్మ చివాట్లు పెడుతూ ఉండేది. నేను వింటేగా? ఇలా చేయగా చేయగా కొన్నాళ్లకు నా కాంతి అంతా పోయింది. ముఖం మాడిన అట్ల పెనంలాగా అయిపోయింది. నాకు పుట్టెడు ఏడుపు వచ్చింది. చుట్టూ చూశాను. చుక్కలు మిలామిలా మెరుస్తున్నాయి. ఎదురుగా చూశాను.. మా అమ్మ జ్యోతిలాగా వెలిగిపోతుంది. మా అమ్మకు పక్కగా చూశాను. మా తాత ఎలా ఉన్నాడని? చూడటానికి కళ్లు చాలకుండా ఉన్నాయి. మళ్లీ నన్ను నేను చూచుకున్నాను. నా ఒళ్లు నాకే కనిపించలేదు. నాకు పట్టరాని ఏడుపు వచ్చింది. పోయినకాంతి ఎలా తిరిగి సంపాదించటం అని ఆలోచించాను. ఏమీ పాలుపోలేదు. దిగాలుపడి కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిలలాడింది. చప్పున ఒక ఉపాయం తోచింది. అక్కడ నుంచి ఒక గంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే ‘ఎవరది.. ఎందుకొచ్చావ్?’ అని కిటికీలోనుంచే గద్దించింది. ‘నేనే చుక్కమ్మా.. చందమామను.. కాస్త వెలుగుపెట్టవూ?’ అన్నాను. ‘ఫో..ఫో.. ఇప్పుడు కావలసివచ్చానేం నేను? నల్లటి అట్ల పెనం మొహం నువ్వూ?’ అని కసిరింది. మీ అక్కయ్య బొమ్మ ఇవ్వక కసిరితే ఎలా ఉంటుంది? నా పనీ అంతే అయ్యింది. కాళ్లీడ్చుకుంటూ ఇంకొక చుక్కమ్మ ఇంటికి వెళ్లాను. ‘ఇక్కడ మాకే లేకపోతే నీ మొహానికెక్కడ ఇవ్వమంటావ్ వెలుగు?’ అని మూలిగింది ఆమె. తతిమ్మా చుక్కమ్మలూ ఇలాగే అన్నాయి. ఇక ఏమిచేసేది? బావురుమని ఏడ్చాను. అప్పుడే మా తాత సూర్యుడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఒక్క గంతులో మా తాతయ్య ఇంటిముందు వచ్చిపడ్డాను. కానీ లోపలికి వెళ్లడం ఎట్లా? తలుపు తీద్దామంటే చేతులు కాలిపోవూ? అంతగా మా తాతయ్య ఇల్లు వెలిగిపోతున్నది. నేను ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అంతలో మా తాతయ్య ఏడుగుర్రాల బండిలో వస్తూ నన్ను చూశాడు. ‘నాయనా ఎందుకు ఏడుస్తున్నావ్? నాకు చెప్పవూ? నీకేమి తక్కువ?’ అన్నాడు. ‘తాతయ్యా.. నాలోని మంటలన్నీ ఆరిపోయాయి. వెలుతురంతా పోయింది. నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడు ముఖంతో మీ అందరి మధ్య నేను ఎలా ఉండాలి? తాతయ్యా తాతయ్యా నాకు కాస్త వెలుగివ్వవూ?’ అని జాలిగా అడిగాను. తాతయ్య ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా అన్నాడు. ‘నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావురా.. మీ అమ్మ ఇచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు. ఆ అద్దం పెట్టి చూస్తే ఎన్ని రంగులు కనిపించేవి? ఎంత ప్రపంచం కనిపించేది? ఎన్ని విచిత్రాలు కనిపించేవి? సరే జరిగిందేదో జరిగింది. ఇక మీదనన్నా నేను చెప్పినట్టుచెయ్యి. నీ అద్దం ఉంది చూశావా.. దాన్ని ఎప్పుడూ నా కాంతి పడుతూ ఉండేటట్టుగా పట్టుకో.. ఆ అద్దం మీద వెలుతురు నీ ముఖానికి తిప్పుకో.. అప్పుడు నీ ముఖం తెల్లగా ఉంటుంది’ అన్నాడు. అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకున్నారు? నాటి నుంచి మా తాతయ్య చెప్పినట్లే చేస్తున్నాను. ఆయన వెలుగును నా అద్దంలో పట్టి నావైపుకు తిప్పుకుంటూ ఉన్నాను. నా ముఖం మళ్లీ ప్రకాశించడం మొదలుపెట్టింది. అయితే అప్పుడప్పుడు మా అమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందువల్ల మీకు సరిగా వేళకు కనిపించలేకపోతున్నాను. అంతే కానీ మరేమీ లేదు. - చందమామ (1947, జులై సంచిక నుంచి) చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
పిల్లల కోసం ప్రత్యేక సినిమాలు!
పిల్లలూ.. కథలే కాదు మీకోసం చక్కటి సినిమాలూ వచ్చాయి. మీకు వినోదం పంచడానికి తెలుగు సహా మీకు తెలిసిన ప్రపంచ భాషలన్నిటిలోనూ మీకోసం సినిమాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.. బాలరాజు కథ.. మహాబలిపురం పట్టణంలో బాలారాజు అనే పదేళ్ల పిల్లవాడుండేవాడు. అతనికో చెల్లి రాధ. తండ్రిలేని పిల్లలు. తల్లితో కలసి మేనమామ కుటుంబం ఉంటున్న గుడిసె పక్కనే మరో గుడిసెలో నివసించేవారు. మేనమామ సోమరి, తాగుబోతు. దాంతో ఇటు తమ కుటుంబంతోపాటు మేనమామ కుటుంబాన్ని బాలరాజే పోషిస్తూండేవాడు. టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తూ. ఈ చలాకీ పిల్లవాడు టూరిస్ట్‌లు ఇచ్చిన డబ్బు తీసుకుని ‘టాటా గిడి గిడీ’ అంటూ తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపేవాడు. ఒకరోజు గుంటూరుకు చెందిన ధనిక దంపతులు కారులో మహాబలిపురం వస్తారు. వాళ్లకు పిల్లలు ఉండరు. ఆ జంటకు మన బాలరాజే గైడ్. వాళ్లను మహాబలిపురం తిప్పుతుండగా తల్లికి ఆరోగ్యం పాడైనట్టు చెల్లి రాధ వచ్చి చెబుతుంది. ఆ అన్నా, చెల్లి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లిపోతారు. కానీ అప్పటికే వాళ్లమ్మ చనిపోయుంటుంది. ఈ విషయం తెలిసిన గుంటూరు దంపతులు ఆ పిల్లలిద్దరినీ దత్తత తీసుకోవాలనుకుంటారు. ప్రతినెల తనకు వంద రూపాయలు ఇవ్వాలనే నియమం మీద ఆ పిల్లలను ఆ దంపతులకు దత్తత ఇస్తాడు బాలరాజు మేనమామ. పిల్లలను తీసుకుని వెళుతుండగా తమ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగిందని టెలిగ్రాం అందుతుంది ఆ దంపతులకు. దాన్నొక అపశకునంగా, దానికి బాలరాజు గ్రహచారమే కారణం అనుకుంటూంటారు ఆ దంపతులు. ఆ మాటను చాటుగా విన్న ఆ అన్నా, చెల్లెలు తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతారు. బాలరాజు గురువుగా భావించే ఓ శిల్పాచార్యుడు ఆ పిల్లవాడిని ఓదారుస్తాడు. శిల్పాచార్యుడు పర్యవేక్షిస్తున్న శిల్పాల తయారీ స్థలంలో ఓ వినాయకుడి విగ్రహం ఉంటుంది. దాని దగ్గరున్న ఓ శిలాఫలకంలో కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి. వాటిల్లో ఉన్నట్టే పరిస్థితులు ఎదురవుతుంటాయి బాలరాజుకు. చదువులేని బాలరాజుకు ఆ సంఘటనలే లోకజ్ఞానాన్ని కలగజేస్తుంటాయి. ఇంతలోకి గుంటూరు దంపతుల్లోని భార్య ఈ పిల్లల మీద బెంగతో మంచం పడుతుంది. ఆ పిల్లలను తీసుకెళితే తన భార్య మళ్లీ ఆరోగ్యవంతురాలవుతుందని తలుస్తాడు. పిల్లలను వెదుక్కుంటూ మళ్లీ మహాబలిపురం వస్తాడు. దత్తత ఇవ్వమని పిల్లల మేనమామను బతిమిలాడుతాడు. మేనమామ ఒప్పుకొని పిల్లలను అతనితో పంపించేస్తాడు. పిల్లల మాట వినగానే ఆ తల్లి కళ్లు తెరుస్తుంది. బాలరాజు కోరిక మేరకు అతని మేనమామ కుటుంబాన్ని కూడా తమ ఇంటికి తీసుకొస్తారు గుంటూరు దంపతులు. అలా బాలరాజు కథ సుఖాంతమవుతుంది. ఇది ‘వా రాజా వా’ అనే తమిళ సినిమాకు రీమేక్. మూల కథ.. నాగరాజన్. మాటలు.. ముళ్లపూడి వెంకటరమణ, దర్శకత్వం.. బాపు. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా కథను టూకీగా 1970, ఆగస్ట్ చందమామ సంచికలో బాపూ బొమ్మలతో ప్రచురించారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. పథేర్ పాంచాలి బెంగాల్‌లోని నిశ్చింద్రపురం ఊరి చివరన ఉంటుంది హరిహర్ రాయ్‌గారి పాత పెంకుటిల్లు. వచ్చే కొద్దిపాటి సంపాదనతో అతను పూజారిగా జీవనం సాగిస్తుంటాడు కానీ గొప్ప కవి, నాటక రచయిత అవ్వాలని కలలు కంటుంటాడు. అతని భార్య సర్వజయ, కూతురు దుర్గ, కొడుకు అపు హరిహర్ రాయ్‌కు వరుసకు అక్క అయిన ఇందిరమ్మ అనే ముసలావిడ.. అతని కుటుంబ సభ్యులు. హరిహర్ రాయ్ సంపాదన కోసం ఊర్లు పట్టుకు తిరుగుతుంటాడు. సర్వజయకు ఇందిరమ్మంటే పడదు. దుర్గ, అపుల అల్లర్లు, ఆకతాయి పనులు, చిన్న చిన్న సంతోషాలతో కాలం గడుస్తూంటుంది. దుర్గ స్నేహితురాలి పెళ్లి కుదురుతుంది. ఆపెళ్లికి వెళ్లి తిరిగి వస్తూండగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆ వానలో దుర్గ డాన్స్ చేస్తుంది. అలా వర్షంలో తడవడంవల్ల దుర్గకు జ్వరం వస్తుంది. వైద్యంచేసినా జ్వరం తగ్గదు. తరువాతి రోజు రాత్రి తుఫాను వస్తుంది. ఆ రాత్రే దుర్గ చనిపోతుంది. పక్కింటి వాళ్ల సహాయంతో అంత్యక్రియలూ జరుగుతాయి. ఈ విషయం తెలియని హరిహర్రాయ్ ఊరి నుంచి ఇంటికి వస్తాడు. దుర్గ చనిపోయిందని తెలిసి భోరున విలపిస్తాడు. సర్వజయను ఓదార్చడమైతే ఎవరి తరమూ కాదు. తుఫానుకు వంటగది కూలిపోయి ఉంటుంది. ఆ ఊరు వదిలేసి కాశీ వెళ్లిపోవటానికి సిద్ధమవుతుంది ఆ కుటుంబం. గ్రామపెద్దలు వచ్చి ఊరు వదిలివెళ్లొద్దని సర్దిచెప్తారు. కానీ హరిహర్ రాయ్ ఒప్పుకోడు. ఇల్లు సర్దే క్రమంలో అపుకి దుర్గ దొంగలించిన పూసలదండ దొరుకుతుంది. అపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దండను కొలనులోకి విసిరేస్తాడు. ఆ విషయం ఎవరికీ చెప్పడు. హరిహర్ రాయ్ కుటుంబం ఎద్దుల బండిలో కాశీకి బయలుదేరడంతో సినిమా ముగుస్తుంది. 1929లో బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రాసిన ‘పథేర్ పాంచాలి’ అనే బెంగాలీ నవల ఆధారంగానే అదే పేరుతో 1955లో ఈ సినిమాను తీశాడు సత్యజిత్ రాయ్. ఈ నవలను 1960లో మద్దిపట్ల సూరి తెలుగులో అనువదించారు. వేర్ ఈజ్ ది ఫ్రెండ్స్ హోమ్ (ఇరానియన్ సినిమా. కథ, దర్శకత్వం.. అబ్బాస్ కైరోస్తమి) ఇరాన్‌లోని కొకర్ గ్రామంలో అహ్మద్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడుంటాడు. ఇంటిపనుల్లో వాళ్లమ్మకు సాయం చేస్తూ ఊరిలోని బడిలో చదువుకునేవాడు. ఎప్పటిలాగే ఆరోజు కూడా ఇంటికి వచ్చి హోమ్‌వర్క్ చేయబోతుంటే తెలుస్తుంది పొరపాటున తన క్లాస్మేట్ మహమ్మద్ రెజా నమత్‌జాద్ నోట్‌బుక్‌ను తను తెచ్చేశాడని. వెంటనే ఆ నోట్‌బుక్‌ను అతనికి తిరిగి ఇవ్వకుంటే అతను హోమ్‌వర్క్ చేయలేడు. హోమ్‌వర్క్ చేయకుంటే టీచర్ క్లాస్‌లోకి రానివ్వడు. అందుకే ఎలాగైనా ఆ రోజే ఆ నోట్‌బుక్‌ను స్నేహితుడికి ఇవ్వాలని అనుకుంటాడు. జరిగిన విషయం తల్లితో చెప్తాడు. ‘రేపు ఇవ్వొచ్చులే’ అని వారిస్తుంది ఆమె. దాంతో అమ్మకు తెలియకుండా నోట్‌బుక్‌ను చొక్కాలోపల దాచుకుని పరుగులాంటి నడకతో బయలుదేరుతాడు అహ్మద్. వాళ్లూరికి పక్కనున్న కొండ మీద ‘పొస్థే’ అనే ఊళ్లోనే ఉంటుంటాడు నమత్‌జాద్. పరిగెత్తుకుంటూ పోస్థేకి చేరుకుంటాడు అహ్మద్. కానీ అంతకు క్రితమే నమత్‌జాద్ వాళ్ల బంధువైన హెమాతి వాళ్ల ఇంటికి వెళ్లాడని తెలుస్తుంది. అతికష్టం మీద హెమాతి వాళ్ల ఇంటికీ వెళ్తాడు. అక్కడ హెమాతి ఉండడు. అహ్మద్ స్వగ్రామం అయిన కొకర్కే వెళ్లాడని తెలుస్తుంది. మళ్లీ పరిగెత్తుకుంటూ కొకర్కు వస్తాడు అహ్మద్. అక్కడా నమత్‌జాద్ కనిపించడు. మళ్లీ పోస్థేకు వెళతాడు. అయినా నమత్‌జాద్ జాడ కనిపెట్టలేకపోతాడు. ఈలోపు రాత్రవుతుంది. నిరాశతో ఇల్లు చేరతాడు అహ్మద్. ఎక్కడికెళ్లావంటూ పిల్లాడిని మందలిస్తుంది తల్లి. తన హోమ్‌వర్క్‌తో పాటు నమత్‌జాద్ హోమ్‌వర్క్ కూడా పూర్తిచేస్తాడు అహ్మద్. తరువాతి రోజు తరగతి గదిలో పిల్లల హోమ్‌వర్క్ చూసిన టీచర్ నమత్‌జాద్ హోమ్‌వర్క్ బుక్‌లో గుడ్ అని రాస్తాడు. డ్రీమ్స్ (జపనీస్ సినిమా. కథ, దర్శకత్వం.. అకిరా కురసోవా) ఇందులో మొత్తం 8 కథలుంటాయి. ఒక కథకు మరో కథకు సంబంధం ఉండదు. దేనికదే స్వతంత్ర కథగా నడుస్తుంది. వీటిల్లోని సన్‌షైన్ త్రూ ది రైన్ అనే ఒక కథ గురించి మాత్రం ఇక్కడ తెలుసుకుందాం. జపాన్‌లోని ఓ గ్రామంలో ఒక ఆరేళ్ల పిల్లాడు ఉంటుంటాడు. ఒకరోజు మధ్యాహ్నం హఠాత్తుగా వానపడుతుంది. ఓ వైపు ఎండగానే ఉంటుంది.. ఇంకోవైపు చినుకులు పడుతునే ఉంటాయి. పిల్లవాడి అమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చేటలో ఎండబెట్టిన వాటిని ఇంట్లోకి చేరుస్తుంటుంది. పిల్లాడేమో వానలో నిలబడి ఉంటాడు. ‘ఇలా ఎండా.. వానా ఒకేసారి వస్తే మన ఇంటి పక్కనున్న అడవిలో నక్కల పెళ్లి జరుగుతుంది. వాటి పెళ్లిని మనుషులు చూస్తే వాటికి కోపం వస్తుంది. అందుకే త్వరగా ఇంట్లోకి వచ్చేయ్’ అంటుంది అమ్మ. ఆమె అలా ఇంట్లోకి వెళ్లగానే పిల్లాడు వడివడిగా నడుచుకుంటూ ఇంటి పక్కనున్న అడవిలోకి వెళ్లిపోతాడు. అక్కడ ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద చెట్లు ఉంటాయి. వాటి మొదళ్లు చాలా లావుగా బలంగా ఉంటాయి. పిల్లాడు ఓ చెట్టు వెనుక దాక్కుంటాడు. నక్కల వేషధారణలోని స్త్రీ, పురుషుల గుంపు లయబద్ధంగా సంగీత వాయిద్యాలు వాయిస్తూ నాట్యం చేస్తూంటుంది. ఆ గుంపుకి కనిపించకుండా పిల్లాడు ఓ చెట్టు బోదె వెనుక దాక్కుని అంతా గమనిస్తుంటాడు. కాని ఓ ఇద్దరు ఆ బాలుడిని కనిపెడ్తారు. కళ్లతో కోపాన్ని చూపిస్తారు. పిల్లాడు భయపడి ఇంటికి పారిపోతాడు. వాడి కోసం ఎదురుచూస్తున్న అమ్మ ‘నా మాట వినకుండా నక్కల పెళ్లి చూసి వాటికి కోపం తెప్పించావు. ఓ మగనక్క వచ్చి ఈ కత్తి నీకు ఇమ్మంది. దీన్ని తీసుకెళ్లి వాటికి తిరిగి ఇచ్చేసి క్షమాపణ చెప్పి రా! నక్కల క్షమాపణ సంపాదించే వరకు నిన్ను ఇంటికి రానివ్వను’ అంటుంది కరాఖండిగా. ‘నక్కలు ఎక్కడుంటాయో నాకు తెలీదు’ అంటాడు పిల్లాడు. ‘ఇలాంటి వాతావరణంలో నక్కలు ఇంద్రధనుస్సు కింద ఉంటాయి’ అని చెప్పి పిల్లాడిని బయటే ఉంచి తలుపు వేసేస్తుంది అమ్మ. రూళ్లకర్రలా ఉన్న ఆ కత్తిని తీసుకుని పక్కనే ఉన్న తోటలోకి వెళ్తాడు పిల్లాడు. ఆ తోటంతా రంగురంగుల పూలమయం. ఎదురుగా ఉన్న రెండు కొండల మధ్య అద్భుతమైన ఇంద్రధనుస్సు కనపడుతుంది. నడుచుకుంటూ దాని దగ్గరకు వెళ్తాడు పిల్లాడు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ముగింపు ప్రేక్షకుల ఊహకే వదిలేస్తాడు దర్శకుడు. ఇలా మొత్తం ఎనిమిది కథలతో ఈ సినిమా సాగుతుంది. ఇంకెన్నో పిల్లల సినిమాలు.. పిల్లలూ.. ఇలా మిమ్మల్ని అలరించే ఇంకెన్నో మంచి సినిమాలు ఉన్నాయి. వీటిల్లో కష్టాంక (రష్యన్), ది రెడ్ బెలూన్ (ఫ్రెంచ్), చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ (ఇరానియన్), ది కార్ట్ (ఇరానియన్), గిఖోర్ (అర్మీనియన్), ది బ్లూ అంబ్రెల్లా (హిందీ), ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ (క్యూబన్), ది మ్యాన్ హూ ప్లాంటెడ్ ట్రీస్ (ఫ్రెంచ్), ది కలర్ ఆఫ్ పారడైజ్ (ఇరానియన్), ది కిడ్ (అమెరికన్), బైసికిల్ థీవ్స్ (ఇటాలియన్), ది వైట్ బెలూన్ (ఇరానియన్), లాస్ట్ ఇన్ ది డెజర్ట్ (అమెరికన్), జంపింగ్ ఓవర్ పెడల్స్ అగైన్ (చెకోస్లోవియన్ ), కాక ముటై్ట (తమిళ్), ఇవాన్స్ చైల్డ్‌హుడ్ (రష్యన్), ది చైల్డ్‌హుడ్ ఆఫ్ మాక్సిమ్ గోర్కీ (రష్యన్), ది మిర్రర్ (ఇరానియన్), ది రన్నర్ (ఇరానియన్), స్ట్రే డాగ్స్ (ఇరానియన్) ... వంటివి తప్పక చూడాల్సిన కొన్ని చిత్రాలు. – అనిల్ బత్తుల (‘పిల్లల సినిమా కథలు పుస్తకం’ నుంచి..) చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
రావూరి భరద్వాజ: ఉడతమ్మ ఉపదేశం.. కథ
గోదావరీ నదీతీరాన ఒకప్పుడు చిక్కని అడవులు ఉండేవి. ఆ అరణ్యాల నిండా రకరకాల జంతువులు ఉండేవి. ఆ జంతువులను చూడడానికీ, అడవిలోని చెట్లను చూడడానికీ, దూరప్రాంతాల నుంచి చాలామంది వస్తూ పోతూ ఉండేవారు. ఆ వచ్చినవారు తమ వెంట రకరకాల కాయలనూ, పళ్లనూ, మిఠాయిలనూ తెచ్చుకొనేవారు. తిన్నంత తిని, మిగిలిన వాటిని దూరంగా విసిరేస్తూ ఉండేవారు. ఒకసారి– ఈ అడవిని చూడడానికి ఒక కుటుంబం వచ్చింది. వస్తూ వస్తూ వాళ్లు రకరకాల ఫలహారాలు తెచ్చుకున్నారు. మధ్యాహ్నం దాకా అడవిలో తిరిగారు. చూడవలసినవన్నీ చూశారు. అలసిపోయి ఒక చెట్టు కిందకొచ్చారు. వచ్చాక– తాము తెచ్చుకున్న మూటలు, పొట్లాలు విప్పుకొని కడుపునిండా తిన్నారు. తినగా మిగిలిన వాటిని చెట్టు కిందే పారబోశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక వెళ్లిపోయారు. ఇదంతా ఆ చెట్టుతొర్రలో ఉన్న ఉడతపిల్లాడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడి వాళ్లక్కడకు వెళ్లిపోయాక, ఆ ఉడతబ్బాయి కిందకు దిగివచ్చాడు. చెల్లాచెదురుగా చెట్టు కింద పడి ఉన్న మిఠాయి ముక్కల్ని ముందు కొంచెం రుచి చూశాడు. అవి తియ్యగానూ, రుచిగానూ ఉన్నాయి. తాను తినగలిగినన్ని తిని, మిగిలిన వాటిని అమ్మకోసం అట్టేపెట్టాడు. సాయంకాలం అయ్యేసరికి, ఆపసోపాలు పడుతూ అమ్మ ఉడత వచ్చింది. రాగానే– ఒక ఆకులో కాసిని మిఠాయి తునకలుంచి అమ్మ ముందుంచాడు ఉడతబ్బాయి. కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది ఉడతమ్మ. జరిగిన సంగతంతా తల్లికి చెప్పాడు ఉడతబ్బాయి. చెప్పీ చెప్పీ చివరికిలా అన్నాడు– ‘అమ్మా! నువ్వు ఇంతకాలమూ, ఈ అడవిలో దొరికే పిందెల్నీ, కాయల్నీ మాత్రమే నాకు పెడుతున్నావు. నేనూ తింటున్నాను. ఈ ప్రపంచంలో మనం తినగలిగినవి ఇవేనేమో, ఇలాంటి వాటినే మనం తినాలేమో అనుకున్నాను. నువ్వయినా– నాకెప్పుడూ ఈ మిఠాయిల సంగతి చెప్పనన్నా చెప్పలేదు. ఎందుకని?’ అన్నాడు ఉడతబ్బాయి. ఉడతమ్మ సన్నగా నిట్టూర్చింది. ‘నాన్నా! ఇలాంటివి నాకూ తెలుసు. కావాలనే, వీటి గురించి నీకు చెప్పలేదు. సుఖాలకు అలవాటుపడడం తేలిక. ఆ అలవాటు నుంచి బయటపడడం కష్టం. ముందుగా– కష్టాలంటే ఏమిటో తెలియాలి. అవి బాగా అనుభవించాలి. ఆ తర్వాత సుఖాలను రావాలి.’ ‘కొంతకాలం సుఖపడిన తర్వాత కష్టాలు వచ్చాయనుకో– అప్పుడు, ఆ కష్టాలను అనుభవించడానికి పెద్దగా ఇబ్బందులు పడనవసరం ఉండదు. అందుకే– నీకీ మిఠాయిలను గురించి, అవి తినడంలో ఉండే సుఖాలను గురించి చెప్పలేదు. అంతేగాని, నీ మీద కోపంతో కాదు’ అంది ఉడతమ్మ. ‘ఈ మిఠాయిలూ అవీ దొరకడం చాలా కష్టమా?’ అన్నాడు ఉడతబ్బాయి దూరంలోకి చూస్తూ, ఏదో ఆలోచిస్తూ. ‘ఒకరకంగా కష్టం! ఇంకోరకంగా కష్టం కాదు. అయినా– నాకు తెలీక అడుగుతున్నాను; ఈ గొడవలన్నీ నీకెందుకురా నాన్నా?’ అంది ఉడతమ్మ. ‘ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తెలుసుకోవలసినవి, ఇప్పుడే తెలుసుకోవడంలో దోషమేమీ లేదు కదా! అందుకే– అన్నీ అడుగుతున్నాను.’ ‘నేనో విషయం స్పష్టంగా చెబుతున్నాను వినమ్మా! నేను ఇకముందు నుంచి ఈ పచ్చికాయలు, పిచ్చికాయలు తినను. నాకు ఖరీదైన భోజనమే కావాలి. అవి– నువ్వెలా తెస్తావో కూడా నాకు అవసరం లేదు. అవి నీవు తెచ్చిపెడుతున్నంత కాలం నీతో ఉంటాను. మానేసిన రోజున, చెప్పాపెట్టకుండా ఎటో పోతాను. అప్పుడు నాకోసం నువ్వు ఏడ్చినా, మొత్తుకున్నా లాభంలేదు. తర్వాత నీ ఇష్టం’ అన్నాడు ఉడతబ్బాయి. ఉడతమ్మ గుండెలు గుభేలుమన్నాయి. ‘నిన్న సాయంకాలం దాకా కుర్రాడు బాగానే ఉన్నాడు. ఈరోజు ఉదయం తాను బయటకెళుతున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఇంత తిండి మూటగట్టుకుని ఇంటికి వచ్చేసరికి కుర్రాడిలా తయారయ్యాడేమిటి?’ ఉడతమ్మ కొడుకుని కావలించుకుంది. బంగారు కన్నయ్యలాంటి తన కొడుకు ఇలా బండబారిపోవడానికి కారణాలేమిటో ఉడతమ్మ సరిగ్గానే ఊహించింది! ‘బుజ్జినాన్నా! నువ్వెప్పుడూ నన్ను ఏదీ అడగలేదు. ఇంతకాలానికిగాను, నువ్వు నన్ను అడిగిందల్లా మిఠాయిలు మాత్రమే! ఇలా నువ్వు అడగడం కూడా సహజమేరా! పిచ్చితండ్రీ!’ ‘చిన్నతనంలో అవీ ఇవీ తినాలని అందరికీ అనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా అమ్మనూ, నాన్ననూ ఏవేవో కావాలని నేనూ అడిగాను. కాకపోతే ఒక చిన్నసంగతి మాత్రం నువ్వు గుర్తుంచుకో!’ అంది ఉడతమ్మ. ‘ఏమిటది?’ అడిగాడు ఉడతబ్బాయి. ‘రేపు– నాకూ చిన్నతనం రావచ్చు. నాక్కూడా, అవీ ఇవీ తినాలని అనిపించవచ్చు. అప్పుడు నేనూ నిన్ను అడుగుతాను. అలా అడిగినప్పుడు, నువ్వు ముఖం చిట్లించుకోకుండా, విసుక్కోకుండా తెచ్చిపెడితే నాకు అంతే చాలు’ అంది ఉడతమ్మ. ఉడతబ్బాయి ఆశ్చర్యపోయి, అమ్మవైపు చూశాడు. ‘అదేమిటీ? మళ్లీ నీకు చిన్నతనం రావడమేమిటీ?’ అన్నాడు ముఖం చిట్లిస్తూ. ‘ఎల్లకాలం నేను ఇలాగే ఉండను కదా! ఎప్పటికో అప్పటికి ముసలితనం ముంచుకొస్తుంది కదా! అప్పుడు నేనూ– నీకు మల్లేనే ఎక్కడికీ కదలలేను కదా! ఏమీ సొంతంగా తెచ్చుకోలేను కదా! ఆ రెండో చిన్నతనంలో, నాకు అవీ ఇవీ తినాలనిపించినప్పుడు– నువ్వీ విషయాలన్నీ గుర్తుంచుకొని, విసుక్కోకుండా తెచ్చిపెట్టు. నాకంతకన్నా ఇంకేమీ అవసరం లేదు’ అంది ఉడతమ్మ. ‘అమ్మా! నువ్వు నన్ను చూసినంత బాగా నేనూ నిన్ను చూడాలని, ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నట్టు? ఇప్పుడలా జరగడంలేదా?’ అన్నాడు ఉడతబ్బాయి. ‘మొన్నమొన్నటిదాకా అలానే జరుగుతూ ఉంది నాన్నా! ఈ మధ్యనే మనవాళ్లు మనుషుల్ని చూసి చెడిపోవడం ప్రారంభించారు. అందుకే ఇంతగా చెప్పవలసి వస్తోంది’ అంది ఉడతమ్మ కొడుకు వైపు జాగ్రత్తగా చూస్తూ. ఉడతబ్బాయి కళ్లనిండా నీళ్లుతిరిగాయి. ‘అమ్మా! నాకేమీ వద్దు. నాకోసం నువ్వు కష్టపడను కూడా వద్దు. నువ్వు తప్ప– ఇంకేమీ నాకు వద్దు’ అన్నాడు ఉడతబ్బాయి వాళ్లమ్మ కాళ్లను చుట్టుకుపోతూ. – రావూరి భరద్వాజ, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! -
గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!!
పాపం ఈ పెద్దవాళ్లెపుడూ యింతే. ముందస్తుగా వాళ్ల మాట వినాలి అంటారు గదా. పోనీలే మనం అల్లరి చేస్తే అప్పుడు మన్ని రష్చించరు. మళ్లీ అల్లరి చెయ్యను.. అంటే చెయ్యి అంటారు. చేస్తానూ అంటే ఒద్దూ అంటారు. ఎప్పుడూ మనమే వాళ్ల మాట వినాలి అంటారు. ఒక్కసారేనా వాళ్లు మన మాట వినరు. అంతెందుకు.. యిప్పుడు పాపం బాఘా చిన్న పిల్లలుంటారా.. వాళ్లకి కుంచెం తెలుగు వస్తుంది చూడు.. అప్పుడేమో.. ఎవరూ లేకుండా కుంచెం మాటాడుతారు. యీ అమ్మా.. నాన్నా.. బామ్మ.. యిలాటివాళ్లు ఎలాగో వినేస్తారు. అప్పుడు పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. వాళ్ల ముగుడూ అలాటి వాళ్లు మనింటికొస్తారు.. అప్పుడేమో ఈ పాపాయిని కూచోబెట్టి నీ పేరు చెప్పూ అంటారు. పాపం పాపాయికి బాఘా తెలుగురాదు గదా.. దానికి భయంవేసి చెప్పదు. అప్పుడేమో ఈ పెద్దవాళ్లందరూ చూట్టూ నించుని చెప్పుచెప్పు చెప్పూ అని కేకలు వేస్తారు గదా.. పాపాయికి కోపం వచ్చేస్తుంది. దాన్ని రష్చించడానికి నేను చెప్తాననుకో పేరు! వాళ్లు వినరుగా నన్ను కొఠేస్తారు. దాని పేరు అదే చెప్పాలిట. అది చెప్పదుగా మరి. అప్పుడు వాళ్లమ్మా నాన్న దాన్ని కొఠేస్తారు మొండి పిల్లా అని. వాళ్లకి మొండి పిల్ల అంటే అసలు అర్థం తెలీదు. నాకు తెలుసనుకో. పక్కింటి లావుపాటి పిన్నిగారు ఒకసారి పేరంటానికెళ్లి వాళ్ల పాపను ఎత్తుకుంటుంది కదా.. అప్పుడు పాప చంక దిగనంటుంది కదా.. వాళ్లమ్మ పిలిచినా వాళ్లనాన్న, బామ్మ పిలిచినా రాను పో అంటుంది. ఆఖరికి ఇంకో పాపాయి వచ్చి ఉంగా భాషలో ఆలుకుందా వత్తావే అని పిలిచినా సరే లాను పో అంతుందే అదీ మొండి పిల్ల. ఏవిటో ఈ పెరపంచకంలో బోల్డుబోల్డు రకాల పిల్లలు. బోల్డురకాల పెద్ధవాళ్లు. అప్పుడప్పుడూ నేను హాచర్యపడి పోయేస్తుంటాను. బుడుగూ, మరేమోనేం మా అమ్మావాళ్లూ రోజూ నన్ను బళ్లోకి వెళ్లమంటున్నారు. లాపోతే కొట్టుతాను అంటున్నారు ఎలాగ? ముందస్తుగా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వీడు నన్ను అనుమానం చేస్తున్నాడు కదా. నా పేరు బుడుగు అయినా వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ? అందుకే. అయినా వాడి ఖష్టాలు చూస్తే జాలి వేస్తోంది గదా మనకి. అసలు నీ చిన్నప్పటినించీ, మీ తాతయ్య చిన్నప్పటినించీ చిన్న పిల్లలు ఎప్పుడూ ఇలా కష్టపడుతూనే ఉన్నారు. అందరు చిన్నపిల్లలినీ ఇలా బళ్లో పెట్టెయ్యడమే. పోనీ ఏదో ప్పదిరోజులికి ఒకసారి వెళ్లితే చాలదుట. రోఝూ వెళ్లాలిట. మళ్లీ యీ పెద్దవాళ్లందరూ చిన్నప్పుడు ఇలా కష్టపడినవాళ్లే. అయినా పెద్దయ్యాక ఇప్పుడు చిన్న చిన్న పిల్లలిని బళ్లో పెఠేస్తున్నారు. అంతెందుకులే.. పాపం నన్ను కూడా రేపో మూడ్రోజులుకో బళ్లోపెట్టాలని చూస్తున్నారు గదా. నన్నేం చెయ్యలేరనుకో. అయినా చిన్నవాళ్లూ బళ్లోకెళ్లకుండా ఉండడానికని కొన్ని సంగతులు చెప్తాను. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. ఒకటి: జెరం వచ్చిందని చెప్పాలి. మనం చెప్తే నమ్మరుగదా.. అందికని యేం చెయ్యాలంటే ముందస్తుగా చొక్కా యిఫ్పేసుకోవాలి. అప్పుడేమో ఎండలో నిలబడాలి చాలాసేపు. అప్పుడు వీపు మీద .. పొట్ట మీద జెరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేసుకుని అమ్మ దగ్గిరికి వెళ్లాలి. అమ్మోయి జెరం జెరం గబగబా చూడూ.. బళ్లోకి వెళ్లద్దని చెప్పూ అని చెప్పాలన్నమాట. ఇంకోటి: జెరం రాగానే పరిగేసుకు కెళ్లి చెప్పాలి తెలుసా.. లాపోతే జెరం చల్లారిపోతుంది. ఉంకోటి కూడాను.. ఇలాంటి దానికి అసలు బామ్మ మంచిది. బామ్మకి చెప్పేస్తే చాలు.. అప్పుడు అదే అమ్మకి చెప్తుంది. రెండు: కుంచెం మంది పిల్లలు కడుపునొప్పి అని అంటారు కాని అది మంచిదికాదులే. రెండుసార్లో.. ఫదిసార్లో అయాకా అమ్మావాళ్లూ కారప్పూసా పకోడీలు చేసుకుని మనకి పెట్టకుండా తినేస్తారు. యిప్పుడు లేదుగదే అమ్మా అని చెప్పినా సరే.. పెట్టరు. ఇప్పుడు లేకపోతే రేపోప్పదిరోలుకో వస్తుందిగా అందుకని వద్దూ అని అంటారు. అందుకని, తలనొప్పి అన్నింటికన్నా మంచిది. ముందస్తుగా అమ్మ నమ్మదు అనుకో. అయినా సరే మనం తలనొప్పి తలనొప్పి అని పదిసార్లో వందసార్లో చెబితే కుంచెం నమ్ముతారు. ఇది కూడా ముందస్తుగా బామ్మకే చెప్పాలి. అమ్మకి చెబితే లాబంలేదు. అసలు ఏం చేసినా లాబంలేదు. ఎలాగేనా బళ్లోకి వెళ్లాలిలే. అందుకని కుంచెం ఎలాగో చాలా కష్టపడి రోఝూ బళ్లోకే పోవడం మంచిది. గబగబా గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా. అప్పుడు ఇంచక్కా ఎప్పుడూ బడి మానేయొచ్చు. యింకోటి.. మా బాబాయంత పెద్దవాళ్లు అయ్యాకా.. అసలు ఇంక బళ్లోకి వెళ్లద్దంటారులే. మా బాబాయి అంతేగా.. బళ్లోకి వెళ్తాను వెళ్తాను అంటాడు. బామ్మా, నాన్న..యింక చాల్లే, ఆఫీసుకి వెళ్లిపో అంటారు. అదన్నమాట. ఈ పెద్దవాళెపుడూ యింతే. మనం వెళ్తాం అంటే వద్దూ అని అంటారు. మనం వెళ్లను ఒద్దూ అంటే, వెళ్లూ వెళ్లూ బళ్లోకెళ్లూ బడి దొంగా అంటారు యెలాగ? ఇంకో ఉత్తరం చూడు.. వీడు కుంచెం పెద్ద కుర్రాడిలా వున్నాడు. వురేయ్ వురేయి బుడుగూ మలేమోన మా అమ్మా నాన్నా డబ్బులు అసలు ఈటంలేదూ ఎలాగరా మరీ అని రాశాడు గదా.. ఇది కూడా చాలా కష్టమే. అసలు డబ్బులు అంటే చాలామందికి చాలా యిష్టంట. నాక్కూడా కుంచెం యిష్టమేననుకో. కాని ఏం చేస్తాం. చిన్న పిల్లలికీ, కాలేజీకి వెళ్లే బాబాయిలకీ డబ్బులు చాలా యివ్వరు. అడిగినా సరే. కాని అబద్ధం చెప్తే చాలా డబ్బులు ఇస్తారుట. బాబాయి యిలాగే చేస్తాడుట. మళ్లీనేమో నాన్నకి అమ్మ డబ్బులు ఇవ్వదు కదా. ఎందుకూ అంటుంది. అప్పుడు నాన్న కుంచెం అబద్ధాలు చెప్పుతాడుట. చిన్న పిల్లలు మాత్తరం అబద్ధం చెప్పకూడదుట. చెప్పితే కొట్టుతారు. కాని మనం నిజెం చెప్పుతాను అంటూ కుంచెం మంది పెద్దవాళ్లు డబ్బులిస్తారులే. పక్కింటి లావుపాటి పిన్నిగారి ముగుడు లేడూ.. వాడేం.. బీడీలు కాలుస్తాడులే. బీడీలు కాలచడం అంటే తప్పు కదా ఊరికే జెటకా తోలడానికి దాచుకోవాలి అంతే. వాడు నిజెంగా కాలిచేస్తాడు గదా. పక్కింటి లావుపాటి పిన్నిగారు అతనికి చెప్పిందిలే వురేయ్ ముగుడూ అలా బీడీలు కాలచకూడదూ అని. అయినా వాడు మా యింటికి వచ్చి నాన్న దగ్గర కూచుని కాలుచుతాడు గదా. అప్పుడేమో నేను వురేయ్ నీ సంగతి చెప్పుతా ఉండు అని అంటాను గదా. వాడు ఘబుకుని నన్ను ముద్దు పెఠేసుకుని ఓ కాణీయో ప్పదణాలో యిచ్చేసి చెప్పకమ్మా బుడుగు తప్పమ్మా ఒద్దమ్మా యిలాని ఏడుచుతాడు. అప్పుడు నేనేమో పోనీలే అని.. యేవండీ పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. మరేమోనూ మీ ముగుడేమో మా నాన్నతో కలసి బీడీలు కాలచలేదండీ అని అబద్ధాలు చెపేస్తాను. ఏవిటో నేను యెప్పుడు ఇలా అందరినీ రష్చించుతానులే. - ముళ్లపూడి వెంకటరమణ చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!
‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది’ అని కథలో వినగానే బాలల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్టు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఆ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. ఇవాళ కూడా బాలల చేతిలో ఒక చిలుక ఉంది. దాని పేరు సెల్‌ఫోన్. అది బాలల గొంతును పట్టుకుని ఉందా... బాలలు దాని గొంతును పట్టుకోబోతారా తేలాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం విలువైనది. దాని అవసరం ఈ కరోనా సమయంలో విపరీతంగా తెలిసి వచ్చింది. పిల్లలు సెల్ఫోన్లు, లాప్టాప్ల ఆధారంగానే క్లాసులు విన్నారు. కొంతలో కొంతైనా తమ తరగతి స్వభావాన్ని నిలుపుకున్నారు. ఇది సాంకేతిక వల్లే సాధ్యమైంది. అదే సమయంలో ఆ సాంకేతికతే వారి ఊహా జగత్తు గొంతు నులుముతోంది. అనవసర వీడియోలకు, గేమ్‌లకు వారిని లొంగదీస్తోంది. పనికిమాలిన, ఎటువంటి వికాసం ఇవ్వని కాలక్షేపంలో కూరుకుపోయేలా చేస్తోంది. దేశంలో అలక్ష్యానికి గురయ్యే సమూహాలు తాము అలక్ష్యానికి గురవుతున్నామని గొంతెత్తుతాయి. లేదా ప్రభుత్వాలే తమ పాలసీ రీత్యానో వారికి ఓటు ఉంటుందన్న ఎరుక వల్లనో కొన్ని పనులు వారి కొరకు చేస్తాయి. కాని పిల్లలకు ఓటు ఉండదు. వారు ఏదైనా అరిచి చెప్పే వీలూ ఉండదు. దేశంలో వారికి మించిన నిర్లక్ష్యానికి గురయ్యే సమూహం ఉందా?... అందరూ ఆలోచించాలి. తాజా అధ్యయనాల్లో దేశంలో రోజుకు ముప్పైకి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇళ్లల్లో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, చదువుకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఎలాంటివో ఎవరు పట్టించుకుంటున్నారు? ‘సాంకేతిక విద్య’ విప్లవం మొదలయ్యే వరకు బాలల వికాసం ఒకలా, ఆ విద్య వల్ల వస్తున్న ఉపాధి తెలిశాక ఆ వికాసం మరోలా మారిపోయింది. ఒకప్పుడు విద్యావిధానం, తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటపాటలకు, కళలకు, కథలకు చోటు ఇచ్చేవారు. ‘ఆడుకోండ్రా’ అని అదిలించేవారు. కథల పుస్తకాలు తెచ్చిచ్చేవారు. నేడు ఐదవ తరగతి నుంచే భవిష్యత్తులో తేవలసిన ర్యాంకు గురించి హెచ్చరిస్తున్నారు. ఆటస్థలానికి, లైబ్రరీకి ఏ మాత్రం చోటులేని స్కూళ్లు పిల్లల్ని సిలబస్‌ల పేరుతో తోముతున్నాయి. పిల్లలకు పార్కులు అవసరం అని ప్రభుత్వాలు భావించనప్పుడు ఆటస్థలాలు అవసరం అని విద్యా సంస్థలూ భావించవు. ఇవాళ మున్సిపాల్టీలలో, నగరాలలో ఎన్ని పిల్లల పార్కులు ఉన్నాయో చూస్తే కాంక్రీట్ల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పెనుగులాడుతున్న బాలలు కనిపిస్తారు. పిల్లలు భయం వేస్తే అమ్మమ్మ కొంగు చాటుకు వెళ్లి దాక్కున్నట్టు వారికి ఆందోళన కలిగితే గతంలో ఏ చందమామనో పట్టుకుని కూచునేవారు. నేడు అన్ని పిల్లల పత్రికలూ మూతపడ్డాయి. వారికి కథలు చెప్పే అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు అనేక కారణాల రీత్యా వేరొక చోట్ల జీవిస్తున్నారు. ఒకవేళ వారు ఉన్నా ఫోన్లు, సీరియల్సు వారినీ ఎంగేజ్ చేస్తున్నాయి. పిల్లలతో మాట్లాడటానికి ఎవరికీ సమయం లేదు. పిల్లలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్ఫోన్లు అడ్డు నిలుస్తున్నాయి. వారి ఆందోళనకు ఓదార్పు ఏది? ఎగరని చిలుకలు, పురి విప్పని నెమళ్లు ఉంటే ప్రకృతి ఎంత నిస్సారంగా ఉంటుందో ఆటలాడని, నవ్వని, కథ వినని, వినిపించని, బొమ్మలేయని, పాట పాడని, నృత్యం చేయని పిల్లలు ఉంటే కూడా ప్రకృతి అంతే నిస్సారంగా ఉంటుంది. నవంబర్ 14 (బాలల దినోత్సవం) సందర్భంగా గతంలో తెలుగునాట వెలిగిన బాలల పత్రికల నుంచి ఏరి కూర్చిన సంజీవని పుల్లలతో ఈ సంచికను తీర్చిదిద్దాం. ఇలాంటివి కదా పిల్లలకు కావాలసింది అని అనిపిస్తే అవి ఎందుకు వారికి లేకుండా పోయాయో అందరూ ఆలోచిస్తారని ఆశ. చిలుకలను ఎగురనిద్దాం. నెమళ్లను పురివిప్పనిద్దాం. వారి ఆటస్థలాలను వారికి అప్పజెబుదాం. వారు ఆటలాడుకునే పిరియడ్లను స్కూళ్లలో వెనక్కు తెద్దాం. ర్యాంకులు అవసరమైన చదువులు మాత్రమే ఉండవని చెబుదాం. ఈ ప్రపంచం వారి కోసం ఎన్నో గండభేరుండ పక్షులను సిద్ధం చేసి వీపు మీద ఎక్కించి వారు కోరుకున్న విజయ తీరాలకు చేరుస్తుందని నమ్మకం కలిగిద్దాం. బాలల వికాసమే సమాజ వికాసం. – బాలల దినోత్సవం ప్రత్యేకం చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
రెండేళ్ల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో..
సాక్షి, మధురవాడ (భీమిలి): కొందరు చిన్నప్పటినుంచే ప్రతిభ కనబరుస్తుంటారు. ఇటువంటివాళ్లను చూసి ఇది గాడ్ గిఫ్ట్ అంటాం. ఈ చిన్నారి విషయంలో మదర్ గిఫ్ట్ కూడా ఉంది. తన బిడ్డను తీర్చిదిద్దిన వైనం రికార్డులు తెచ్చిపెట్టింది. రెండేళ్ల వయసులోనే జ్ఞాన్దేవ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. మధురవాడ శివశక్తినగర్‌కు చెందిన గంధం అమిత ప్రియ ఏకైక కుమారుడు జ్ఞాన్దేవ్. బాలుడు తల్లి అమిత ప్రియ గీతం యూనివర్సిటీలో ఎం.కామ్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. తండ్రి మనోహర్, తల్లి ఈశ్వరి కుమారీల సంరక్షణలో ఉంటుంది.అమితప్రియ రెండేళ్ల కుమారుడు జ్ఞాన్దేవ్కు 6 జాతీయ చిహ్నాలు , 12 రాశి ఫలాలు, 24 వాహనాలు, 13 రకాలు పండ్లు, 21 సంగీత పరికరాలు, 13 సముద్ర జీవ రాశులు, 10 చారిత్రక స్థలాలు, 10 స్టేషనరీ వస్తువులు, 10 కంప్యూటర్ విడిభాగాలు, 10 రకాల క్రీడల బంతులు, 8 ఇండియన్ సీఈవోలు, 5 ప్రార్థనా స్థలాలు, 6 మతాలు, 8 రకాల నీటి మొక్కల మూలాలు, 9 మంచి అలవాట్లు గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. అలాగే 15 రకాల చర్యలను నటన ద్వారా చూపించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాందించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: (విశాఖ కోకిల.. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి) -
ఊహలకు అందని రూపాలు
టీ కప్పులు, మగ్‌లను అందమైన కళారూపాలుగా మార్చుతూ, ఫంక్షనల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ, మార్కెటింగ్ చేస్తూ, ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారింది శ్రీనియా చౌదరి. ఈ కళారూపం అంతగా సక్సెస్ కాదన్న వారి నోళ్లను మూయిస్తూ, ఛాలెంజ్‌గా తీసుకొని మరీ ఈ కళలో రాణిస్తోంది. ఢిల్లీలో సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన కళారూపాలను వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఎవరి ఊహకూ అందని కళారూపాలు శ్రీనియా చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. పదేళ్లుగా సిరామిక్ మెటీరియల్‌తో మగ్‌లను తయారుచేస్తూ, వాటినే అందమైన కళాఖండాలుగా తీర్చిదిద్దుతోంది. యూరప్‌లోని లాట్వియాలో సిరామిక్స్ బియన్నాలే, మార్క్ రోత్కో మ్యూజియంలలోనూ తన కళారూపాలు స్థానాన్ని పొందాయంటే శ్రీనియా కృషి, పట్టుదల ఎంత బలమైనవో ఇట్టే తెలిసిపోతాయి. సాధనమున సమకూరిన కళ స్వతహాగా చిత్రకారిణి అయిన శ్రీనియా ఈ కళలో రాణించడానికి మట్టిపైనే చిత్రాలు వేసేది. ఆ తర్వాత మట్టితో కళారూపాలు తయారుచేసి వాటిపైనే చిత్రీకరించేది. తన ప్రతి చిత్రంలోనూ సమాజం గురించిన ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. ‘సెరామిక్స్‌తో రకరకాల కళాత్మక రూపాలను తయారుచేయడం అనేది శతాబ్దాలుగా ఉంది. కానీ, నేను ప్రత్యేకంగా ఎంచుకున్న మగ్గులతో డిజైన్లు, మగ్గులపై పెయింటింగ్.. ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని అనుసరించే నేను నా దైన సృజనను జోడించాను. అభ్యాసనకు మట్టితోనే కళారూపాలను తీర్చడంలో కొన్నాళ్లు నిమగ్నమయ్యాను. ఎంతోమందిని అవి ఆకట్టుకున్నాయి. వీటికున్న డిమాండ్‌ను బట్టి ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నాను. నెలల సమయం.. కోవిడ్ టైమ్‌లోనూ నా ఆలోచనా విధానాన్ని నలుగురితో పంచుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి వెబ్‌షాప్‌ను ప్రారంభించాను. కొన్ని వారాల పాటు వెబ్‌షాప్‌ను నిర్వహించాను. వ్యూవర్స్‌లో మంచి ఆసక్తి కనపడింది. కానీ, నిత్యసాధనతోనే ఈ కళలో రాణించగలరు. ఏ కాలమైనా సరే యంత్రంతో తయారుచేసిన వస్తువుకన్నా, పూర్తిగా చేతితో తయారుచేసిన వస్తువు ఖరీదు ఎక్కువ. అందుకే, సిరామిక్‌తో మగ్ తయారీ నుంచి వాటి రూపాల్లో మార్పులతో పాటు.. ఒక కళాఖండంగా తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా నేను అనుకున్న కళారూపం స్కెచ్ వేసుకుంటాను. అది సంతృప్తిగా అనిపించాక దానిని వాస్తవ రూపానికి తీసుకు రావడానికి నెలల సమయం పడుతుంది. ఒక్కో సమయంలో అయితే ఒక చిన్న పీస్‌ను మాత్రమే తయారు చేస్తుంటాను. ఒకదానితో మరోటి అస్సలు పోలికే ఉండదు. దేనికది ప్రత్యేకం. కానీ, అన్ని కళారూపాలకు మంచి డిమాండ్ ఉంది. ఆన్లైన్ వేదిక ద్వారా నా కళారూపాలను నేనే మార్కెటింగ్ చేస్తుంటాను. విదేశీయులు కూడా ఈ ఫంక్షనల్ ఆర్ట్‌ను బాగా ఇష్టపడుతున్నారు. వ్యాపారిగా మారినప్పటికీ ప్రతీ కళారూపాన్ని నేనే స్వయంగా సృష్టిస్తాను. ఎవరి సాయమూ తీసుకోను. అచ్చులు పోయడం అనేది నా ఆలోచనకు పూర్తి విరుద్ధం. అందుకే ప్రతీ కళాఖండం విభిన్నంగా ఉంటుంది’ అని వివరిస్తారు శ్రీనియా. -
పిల్లాడి పెద్దమనసు..మేక్ ఎ విష్
భరించలేని బాధ, కష్టం కలిగినప్పుడు చుట్టపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోము. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, బయటపడే ఆలోచనల్లో మునిగిపోతాం. అటువంటిది ఓ చిన్నపిల్లాడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, ఎన్నాళ్లు జీవించి ఉంటాడో తెలియనప్పటికీ ... కూడు, గూడు లేనివాళ్ల ఆకలి తీర్చండి అని చెబుతూ, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నాడు. అమెరికాలోని మిస్సిసీపికి చెందిన పదమూడేళ్ల అబ్రహం ఒలెబెగికి గతేడాది ‘అప్లాస్టిక్ ఎనీమియా’ ఉన్నట్టు తెలిసింది. అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా కారణంగా..శరీరంలో సరిపడినంతగా కొత్త రక్తకణాలు ఉత్పత్తి కావు. దీని వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ విషయం తెలిసినప్పుడు అబ్రహం ఏ మాత్రం భయపడలేదు. రెగ్యులర్‌గా డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు. ఇటువంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతోన్న పిల్లల కోరికలను తీర్చే ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ అబ్రహం గురించి తెలిసి అతని విష్ను తీర్చేందుకు సంప్రదించింది. అందరు పిల్లలు కోరుకున్నట్లే తన జీవిత లక్ష్యాన్ని కోరుకుంటాడని ఫౌండేషన్ అనుకుంది. కానీ అందరికంటే భిన్నంగా ‘‘ఇల్లు లేని వారికి ఏడాది పాటు ఆకలి తీర్చండి, అదే నా మేక్ ఏ విష్’’ అని కోరాడు. అబ్రహం కోరిక నచ్చిన మేక్ ఏ విష్ అతని కోరిక మన్నించడంతోపాటు, మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చింది. పౌండేషన్ సాయంతో గూడులేని నిరాశ్రయులకు ఆహారం అందించి, ఆకలి తీరుస్తున్నాడు అబ్రహాం. తన తల్లితో కలిసి వందమంది ఆకలిని తీర్చాడు. అబ్రహం పెట్టే ఫుడ్ తిన్న వారంతా థ్యాంక్స్ బాబు అంటూ అబ్రహంకు కృతజ్ఞతలు చెబుతూ ..ఆయుష్షు పెరగాలని దీవిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫౌండేషన్ సాయంతో 2022 ఆగస్టు వరకు కొనసాగనుంది. అబ్రహం టేబుల్.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అబ్రహం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా దాత దొరికితే అతని సమస్య దాదాపు తీరుతుంది. ఫౌండేషన్ సాయంతో నిరాశ్రయుల ఆకలి తీరుస్తూ ఎంతో సంతోషంగా ఉన్న అబ్రహం భవిష్యత్‌లో ‘‘అబ్రహం టేబుల్’’ పేరు మీద ఓ ఎన్జీవోని ప్రారంభించి ఈ సేవలను మరింతగా విస్తరించాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రపంచ వ్యాప్త నెటిజన్లు అబ్రహంను మెచ్చుకోవడమేగాక, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. -
పిల్లలూ దేవుడూ చల్లనివారే...
రోజారమణి ‘భక్త ప్రహ్లాద’ చేస్తే నేటికీ అదొక అద్భుత నటన. ‘లవకుశ’లో లవుడుగా కుశుడుగా ఆ చిన్నారులు చెదిరిపోతారా మస్తిష్కం నుంచి. ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అన్న పద్మినికి ఇన్నేళ్లు వచ్చినా ‘కుట్టి పద్మినే’. గతంలో బాలలు గొప్పగా నటించే పాత్రలు ఉండేవి. బాలల కోసమే తీసే సినిమాలు ఉండేవి. బాలలే నటించగా బాల భారతం వచ్చింది. బాల రామాయణమూ వచ్చింది. బాలల సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చేవి. అవన్నీ ఇప్పుడు లేవు. పిల్లల భావోద్వేగాలను చెప్పే సినిమాలు దేవుడెరుగు. పిల్లలకు ఆరోగ్యకరమైన వినోదం అందించే సినిమాలు ఎక్కడ? ఆమిర్‌ఖాన్ తీసిన ‘లగాన్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో 11 మంది గ్రామీణులు బ్రిటిష్ వారి మీద క్రికెట్ ఆడి గెలుస్తారు. ఆ గ్రామీణుల్లో ఒక వయసు మళ్లిన వృద్ధ డాక్టర్ ఉంటాడు. ఒక దళిత వికలాంగుడు ఉంటాడు. చేతి వృత్తుల వారు ఉంటారు. ముస్లిం ఉంటాడు. వీరందరితోపాటు ఈ టీమ్‌కు సపోర్ట్‌గా ఒక పిల్లవాడు కూడా ఉంటాడు. మేచ్ జరుగుతున్నప్పుడు కీలక ఆటగాడు గాయపడితే ఈ పిల్లవాడే బై రన్నర్‌గా రంగంలో దిగుతాడు. ఈ పాత్రల అల్లిక ఇలా ఎందుకు? దేశం అంటే సమాజం అంటే అందరూ అని. వారిలో పిల్లలూ ఉంటారని. ఇదే ఆమిర్ ఖాన్ డిస్లెక్సియాతో బాధపడే పిల్లల పక్షాన నిలబడి ‘తారే జమీన్ పర్’ తీస్తే ఆ సినిమా గొప్ప ప్రశంసలు పొందింది. అతనికి కలెక్షన్లు కూడా కురిపించింది. తెలుగు సినిమా కూడా ఇలా ఆలోచించగలదు. కాని ఆలోచించడం లేదు. ఘనమైన బాలల పాత్రలు గతంలో తెలుగు సినిమాల్లో బాలల పాత్రలు చాలా గట్టిగా ఉండేవి. వారి మీదే తీసిన సినిమాలూ వచ్చేవి. బాలల కేంద్రంగా ఉన్నా పెద్ద హీరోలు ఆ సినిమాలు చేసేవారు. ఎన్.టి.ఆర్ ‘రాము’, ‘లవకుశ’, ఏ.ఎన్.ఆర్ ‘సుడిగుండాలు’, శోభన్‌బాబు ‘సిసింద్రీ చిట్టిబాబు’, హరనాథ్ ‘లేత మనసులు’ వంటి సినిమాల్లో నటించారు. సావిత్రి పిల్లల కోసమే ‘చిన్నారి పాపలు’ సినిమాను నిర్మించారు. ‘పాపం పసివాడు’ సినిమా ఆ రోజుల్లో మాస్టర్ రాము నటించగా సూపర్‌హిట్ అయ్యింది. పిల్లలే పాత్రలుగా బాలలకు చెప్పాల్సిన కథలు బాలల ద్వారానే చెప్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో తెలుగులో ‘బాల భారతం’ వచ్చింది. భారత కథలోని అన్ని పాత్రలను ఈ సినిమాలో బాలలే ధరించడం విశేషం. ‘మానవుడే మహనీయుడు’ వంటి హిట్ సాంగ్‌ను శ్రీశ్రీ రాశారు. ఆ తర్వాత పిల్లలే అన్ని పాత్రలు పోషించగా భానుమతి రామకృష్ణ ‘భక్తధృవ మార్కండేయ’ తీశారు. కె.ఎస్.ప్రకాశరావు స్వీయదర్శకత్వంలో ‘బాలానందం’, బి.ఆర్.పంతులు దర్శకత్వంలో ‘పిల్లలు తెచ్చిన చల్లనిరాజ్యం’ ఇవన్నీ పిల్లలకూ సినిమాల్లో చోటు ఉందనీ పిల్లలూ సినిమా కథను నడిపించగలవనీ నిరూపించాయి. ఇదే సమయంలో ‘భక్త ప్రహ్లాద’లో రోజారమణి విశేష ప్రతిభ కనపరిచి ప్రహ్లాదునిగా ఘనఖ్యాతి పొందారు. ఇది జరిగిన చాలా రోజులకు నిర్మాత ఎం.ఎస్.రెడ్డి పూనిక మీద గుణశేఖర్ దర్శకత్వంలో ‘బాల రామాయణం’ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో రాముడిగా నటించారు. ఈ సమయాలకు అటు ఇటుగా బేబీ షాలినీ ‘బంధం’ వంటి సినిమాలతో వెలిగితే తరుణ్ ‘మనసు మమత’, ‘తేజ’ వంటి సినిమాలతో అలరించాడు. బేబి సుజిత ‘పసివాడి ప్రాణం’తో సినిమాకు ప్రాణం పోసింది. భద్రం కొడుకో కమర్షియల్ సినిమా ఒక ధోరణిలో బాలలకు చోటు కల్పిస్తే తెలుగులో 1992లో వచ్చిన ‘భద్రం కొడుకో’ పార్లల్ సినిమాగా బాలల చిత్రాలకు దారి గట్టి పరిచింది. వీధి బాలల సమస్యలను చర్చించిన ఈ సినిమాకు ఓల్గా రచన చేయగా అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్న సినిమా ఇది. ఆ తర్వాత అక్కినేని కుటుంబరావు మరికొన్ని బాలల సినిమాలు తీశారు. అయితే ఆ దారిలో ఎక్కువ సినిమాలు రాలేదు. మణిరత్నం తమిళంలో తీయగా తెలుగులో డబ్ అయిన ‘అంజలి’ ఒక రకమైన పిల్లలను లోకానికి చూపితే పిల్లలు తమకు జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నిలబడి ఎదగాలని చెప్పిన గుణ్ణం గంగరాజు ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల్ని పిల్లల్లా చూపుతూ ప్రశంసలు పొందింది. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు బాలల కోసం సినిమా తాను తీయకపోవడం వెలితిగా భావించి బి.నరసింగరావు దర్శకత్వంలో ‘హరివిల్లు’ నిర్మించారు. మారిన ధోరణి 2000 సంవత్సరం తర్వాత తెలుగు సినిమాల్లో పిల్లల పాత్రలు, చేష్టలు పూర్తిగా మారిపోయాయి. వారు పుట్టిన వెంటనే ప్రేమలో పడే స్థాయిలో ‘ఖుషి’ సినిమా నుంచి కొత్త పోకడలు పోయాయి. పదేళ్ల లోపే గట్టిగా ప్రేమలో పడుతూ ‘తూనీగా తూనీగా’ అని పాడుకోవడం మొదలెట్టారు. హైస్కూల్ తరగతి గదుల్లో వారి ప్రేమలు కొనసాగాయి. మాస్టర్ భరత్ తమిళం నుంచి వచ్చి హాస్యం పేరుతో పంచ్‌లు వేయడం మొదలుపెట్టాడు. భారతీయ భాషల్లో మెరుగైన బాలల పాత్రలతో సినిమాలు వస్తుంటే అతి చిన్న మార్కెట్ కలిగిన ఇరాన్ సినిమా అద్భుతమైన బాలల చిత్రాలతో ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే మనం ఒక గొప్ప బాలల చిత్రం తీయలేకపోయాం. వారిని అలరించే టైం మిషన్ వంటి సబ్జెక్ట్స్ తీసుకుని ‘ఆదిత్య 369’ వంటి కమర్షియల్ చిత్రాలు కూడా తీయలేకపోతున్నాం. బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. బాలల థియేటర్ కొన్నాళ్లు యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు లేదు. బాలల సినిమాలు రాయితీల వల్ల అయినా తయారయ్యేవి. ఇప్పుడు అవీ లేవు. తెలుగు బాలలూ... మీరిప్పుడు అనుభవిస్తున్నది పసిడి కాలం కానేకాదు... ప్లాస్టిక్ స్క్రీన్ కాలం! ఏం విషాదం ఇది!! బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. వారికి కాసింత వినోదాన్ని పంచుదాం -
బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన నెహ్రూ
సాక్షి, అమరావతి: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బాలల విద్యకు బలమైన పునాదులు వేసారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. పండిట్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. బాలలు భారతీయ సమాజానికి వెన్నెముకగా పండిట్ నెహ్రూ భావించారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే ఆర్యోక్తిని అనుసరించి దేశ భావిపౌరులుగా మాతృభూమిని కాపాడుతూ, భారతావనికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత బాలలపై ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ను కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శనివారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ను ఏపీ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొద్దిసేపు మాట్లాడారు. -
అవమానించడం కాదు! అనుసరిద్దాం!!
జీవిత కాలమంతా బాలలు, యువకుల పట్ల పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ఆసక్తీ, అభిరుచీ ఉండేవి. వారి సంక్షేమానికి, విద్యావ్యాప్తికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి, చేపట్టిన విధానాల గుర్తింపుగా ఆయన జన్మదినమైన నవం బర్ 14ను బాలల దినోత్సవంగా జరుపు కుంటున్నాము. దేశాభివృద్ధికి, భావి తరాల బాగుకు నెహ్రూ ప్రదర్శించిన దార్శనికత, రాజనీతిజ్ఞతలను ఈ తరం విద్యార్థులు, యువకులు తెలుసుకోవాలి. జవహర్ లాల్ నెహ్రూ దార్శనికుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రపంచజ్ఞాన అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. అంతే కాకుండా ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను గొప్ప నాయకుల కంటే మెరుగ్గా పాటించినవాడు. ‘‘భారత స్వాతంత్య్ర, ప్రజాస్వామ్య సూర్యుడు అస్తమించరాదు. మన ఆశలు మోసానికి గురికారాదు. ఏ మతస్థులమైనా మనమంతా సమాన హక్కులు, అధికారాలు, బాధ్యతలు గల భారతీయులం. మనం మత తత్వాన్ని, సంకుచిత స్వభావాలను ప్రోత్సహించరాదు.’’ ఇది భారత్ భవిష్యత్తు నిర్మాణంపై నెహ్రూ దార్శనిక ప్రకటన. నెహ్రూ మీద బురదజల్లే ప్రయత్నాలు నేడు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి నేటి దేశ నాయకుల స్థాయిలో ఉన్నవారే నెహ్రూను అవమానిస్తున్నారు. వారి భక్తులు సిగరెట్ తాగుతున్న, స్త్రీల ప్రక్కన కూర్చున్న (సందర్భాన్ని ప్రస్తా వించకుండా) ఆయన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను సామా జిక మాధ్యమాల్లో ఉంచి దుష్ప్రచారం చేశారు, చేస్తున్నారు. చరిత్ర చదవని విద్యార్థులు, యువకులు వాటిని ఉపయోగించి నెహ్రూ వ్యక్తిత్వంపై అవాంఛనీయ వ్యాఖ్యానాలు చేశారు. 1905 లో నెహ్రూ ఇంగ్లండ్ ‘హారొ’ నగరంలో పేరుగాంచిన పాఠశాలలో విద్య అభ్యసించారు. ఆ పాఠశాలలో సాధించిన విద్యా ప్రావీణ్యతలకు గానూ నెహ్రూకు ప్రఖ్యాత ఆంగ్ల చరిత్ర కారుడు జార్జ్ మెకాన్లె ట్రెవెల్యాన్ రచించిన ‘గారిబాల్డి‘ పుస్తకా లను బహూకరించారు. గారిబాల్డి ఇటలీ సైన్యాధికారి, రాజకీయ నేత. ఇటలీ జాతిపితలలో ఒకరిగా పేరొందారు. నెహ్రూ ఈ పుస్త కాలను క్షుణ్ణంగా చదివారు. ఆయన దృష్టిలో గారిబాల్డి ఒక విప్లవ వీరుడు. ఆయన జీవితం నుంచే నెహ్రూ భారత స్వాతంత్ర పోరా టానికి స్ఫూర్తి పొందారు. తర్వాత నెహ్రూ 1907 అక్టోబర్‌లో కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటి కాలేజీలో చేరారు. 1910లో జీవశాస్త్రంలో ఆనర్స్ పట్టా పొందారు. తన పాఠ్యాంశాలతో సంబంధం లేక పోయినా రాజకీయ, ఆర్థిక, సామాజిక శాస్త్రాలను, చరిత్ర, సాహి త్యాలను అధ్యయనం చేశారు. ప్రఖ్యాత ఆంగ్ల కవులు, రచయి తలైన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, జె.ఎమ్. కీన్స్, బెర్ ట్రాండ్ రస్సెల్, లొజెస్ డికెన్సన్, మెరెడిత్ టౌన్ సెండ్ల రచనలు నెహ్రూ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చాయి. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో (1942) కారాగార నిర్భంధవాసం గడుపుతున్న సమయంలో కూడా నెహ్రూ వివిధ దేశాల చరిత్రలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలకు సంబం ధించిన 55 పుస్తకాలను అధ్యయనం చేసి విశేష పరిజ్ఞానాన్ని సంపాదించారు. పాఠ్యాంశాలను కూడా సరిగా చదవని విద్యా ర్థులు, ఏమీ అధ్యయనం చేయకుండా అవాకులు చవాకులు వాగే రాజకీయ నేతలు గ్రంథ పఠన ప్రాముఖ్యతను గురించి నెహ్రూ నుండి నేర్చుకోవాలి. పాఠ్యపుస్తకాలకు మించి సామాజిక శాస్త్రా లను జీవితాంతం అధ్యయనం చేయాలని, అప్పుడే సంపూర్ణ అవగాహన, సామాజిక స్పృహ కలుగు తాయని గుర్తించాలి. భారత ప్రప్రథమ ప్రధానిగా నెహ్రూ ప్రగతిశీల సామాజిక విధానాలను అమలుచేశారు. బాలలకు, యువకులకు సమర్థ, ప్రతిభా నైపుణ్యతల విద్యను అందించాలని కోరుకున్నారు. భవి ష్యత్ భారత ప్రగతికి ఇది ముఖ్యమని భావించారు. అందుకోసం ప్రపంచ స్థాయి విద్యాసంస్థలైన అఖిల భారత వైద్య సేవల సంస్థ, భారతీయ సాంకేతిక సంస్థలు (ఐఐటీలు), భారతీయ నిర్వహణ సంస్థలు(ఐఐఎమ్‌లు), సాంకేతిక జాతీయ సంస్థలు (ఎన్ఐటీలు) స్థాపించారు. సోవియట్ యూనియన్ బాటలో పంచవర్ష ప్రణాళి కల ద్వారా బాలలందరికి ఉచిత, నిర్భంధ ప్రాథమిక విద్యను అందజేసే విధానాలను రూపొందించారు. దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో మూకుమ్మడి పాఠశాల విద్యార్థుల నమోదు పథకా లను ప్రవేశపెట్టారు. వేల సంఖ్యలో పాఠశాలలు స్థాపించారు. పోషకాహార లోపం నుండి పిల్లలను రక్షించడానికి ఉచిత పాల, భోజన సదుపాయాలు కల్పించారు. దేశమంతా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దల కోసం వయోజన విద్యాకేంద్రాలను, వృత్తి, సాంకేతిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ప్రజా స్వామ్యం, సామ్యవాదం, ఐక్యత, లౌకికత్వం నెహ్రూ స్వదేశీ సూత్ర మూలస్తంభాలు. భారతదేశాన్ని లౌకికదేశంగా ప్రకటిం చారు. సామ్యవాద సమాజ స్థాపన లక్ష్యంగా నిర్దేశించారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, టువర్డ్స్ ఫ్రీడం (ఆత్మ కథ) లాంటి పుస్తకాలను నెహ్రూ రచిం చారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ జిల్లాలోని ముస్సోరి బోర్డింగ్ పాఠశాలలో చదువుతూ ఉండిన పదేళ్ళ కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి 30 ఉత్తరాలు రాశారు. ఈ ఉత్తరాలలో బాగా చదవమని, ఫస్ట్ మార్కులు తెచ్చుకోమని రాయలేదు. దేశాల చరిత్రలు, ప్రపంచ ప్రజల నాగరికతలను వివరించారు. ఈ ఉత్త రాలను ‘తండ్రి నుంచి తనయకు ఉత్తరాలు’ అన్న శీర్షికతో పుస్త కంగా అచ్చువేశారు. తమ జ్ఞానాన్ని భావి తరాలకు అందజేసి విజ్ఞానంగా మార్చాలి. లేకపోతే మన సమాచార సంపదకు సార్థకత శూన్యం. నేడు నెహ్రూకు పూర్తి విరుద్ధ భావాలున్న నేతలు దేశాధినేతలయ్యారు. ఎంత గొప్పవారయినా తప్పులు చేయని, మచ్చలు లేని మానవులుండరు. పనిచేసే వారిలో పొర పాట్లు, తప్పులు సహజం. అయినా ఎదుటివారు ఏ పక్షం అన్న పట్టింపులు మాని, వారినుండి మంచిని గ్రహించి, చెడును వది లేయాలి. వెలుగులను మరిచి మచ్చలనే వెదికితే మన భవిష్యత్తు కూడా మచ్చలమయం కాకతప్పదు. వ్యాసకర్త: సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ మొబైల్ : 94902 04545 (నేడు బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి) -
వనితకు వ్యవసాయమే ప్రాణం..
కుబేరునికైనా.. బికారికైనా కడుపు నింపేది పట్టెడన్నమే.. ఈ బువ్వను సృష్టించేది రైతే.. మట్టితో సహవాసం చేస్తూ చెమటే ఇంధనంగా పోరాడే అన్నదాత లేకుంటే ఈ లోకం ఏమైపోతుందో.. ఈ విలువ చిన్నారి వనితకు 6వ తరగతిలోనే తెలిసింది అప్పటి నుంచి వ్యవసాయమే ప్రాణంగా భావిస్తోంది... బాలల దినోత్సవం సందర్భంగా ఈ పాప జీవనశైలి మిగతా బుడతలకు ఆదర్శంగా మారాలని ఆశిద్దాం.. సాక్షి, ఒంగోలు: నాగార్జున సాగర్‌కు సమీపంలో ఉంటుంది గేన్యా నాయక్ తండా.. అక్కడే వడిత్య వనిత తల్లిదండ్రులు రెండకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఎప్పట్లాగానే వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి. ఇక లాభం లేదనుకొని ముగ్గురు పిల్లలతో ఒంగోలు వలస వచ్చారు. బిడ్డలను బాగా చదివించాలనుకున్నారు. వీరిలో మధ్య సంతానంగా వనిత జన్మించింది. మంగమూరు రోడ్డులో ఉన్న శ్రీ షిరిడీ సాయి హైస్కూలులో వనిత మూడో తరగతిలో చేరింది. అలా ఆరో తరగతికి రాగానే అక్కడ పనిచేస్తున్న డ్రాయింగ్ మాస్టారు ఎన్. మాల్యాద్రి స్ఫూర్తి ఆమెపై పడింది. దీనికి కారణం ఆయన సేంద్రియ వ్యవసాయం చేయడమే. క్షేత్ర పర్యటనల్లో భాగంగా పిల్లలతో పాటు ఆయనకు ఒంగోలు సమీపంలో ఉన్న కొనగానివారిపాలెం వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లేవారు. ఇది నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. స్వతహాగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనితకు ఆ పరిసరాలు ఎంతగానో నచ్చాయి. ( చదవండి: ‘దేశీ’ ఉత్పత్తులే దివ్యౌషధాలు! ) భవితపై ఆలోచన.. ఆ క్షేత్రంలో శ్రీగంధం, టేకు చెట్లు ఉంటాయి. ఇక అంతర సేద్యంగా జామ, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లతో పాటు వరి కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి మాల్యాద్రి విశేషంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ కేవలం కషాయాలతోనే వైరస్‌లను కట్టడి చేస్తారు. ఇక బలం కోసం దిబ్బ ఎరువు వాడతారు. ఇలాంటి విషయాలే వనితను విస్తృతంగా ప్రభావితం చేశాయి. తల్లిదండ్రులు లెక్కకు మించి.. శక్తికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి చేతులు కాల్చుకున్న వైనాన్ని చూసిన అనితకు సేంద్రియ వ్యవసాయం ఎంతో మంచిదని అర్థం అయింది. అందుకే అప్పటి నుంచి వ్యవసాయంలో అన్ని పద్ధతులు తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. 4 అన్ని పనులు నేర్చుకుంటూ.. ప్రస్తుతం తొమ్మిదో తరగతికి వచ్చిన వనిత వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులనూ తన గురువు సహాయంతో నేర్చుకోగలిగింది. చేలో కట్టలు కట్టడం, పాదులు, కలుపు తీయడం, వివిధ రకాల గారర్డెనింగ్లో మెళకువలు తెలుసుకుంది. లాక్డౌన్ కారణంగా ఈ పాప తల్లిదండ్రులు తమ స్వగ్రామం అయిన గేన్యా నాయక్ తండాకు వెళ్లారు. దీంతో అనిత.. తమ గురువుగారి ఇంట్లోనే కుటుంబ సభ్యురాలిగా ఉంటోంది. ఇలా ఆరు నెలలుగా ఆ పాపను మాస్టారు కుటుంబం ప్రేమతో చేరదీస్తోంది. అక్కడే ఉంటూ వ్యవసాయంలో ఇంకా లోటు పాట్లను తెలుసుకునేందుకు ఈమె ప్రయత్నిస్తోంది. ‘వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు పడిన కష్టాల గురించి విన్నాను. వారు ఆ బాధలు భరించ లేక ఒంగోలు వచ్చారు. మానాన్న ఆటో తోలుతూ ఉంటాడు. అమ్మ ఓ అపార్టుమెంటులో వాచ్‌ఉమెన్‌గా పని చేస్తోంది. అన్న మా ఊర్లో హాస్టళ్లో చదువుతుండగా.. తమ్ముడు మా స్కూల్లోనే ఏడో తరగతి చదువుతున్నాడు. సేంద్రియ వ్యవసాయమే చాలా మంచిది. రసాయన ఎరువులు వాడటం వల్ల అందరికీ రోగాలు వస్తున్నాయి. ఇలాంటి ఉత్పత్తులు వాడకూడు. నేను పెద్దయ్యాక అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలని ఉంది. అంతా ప్రకృతి పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. అప్పుడే మంచి దేశం ఉత్పత్తి అవుతుంది. సేంద్రియ ఉత్పత్తులు పండించి దేశానికి అన్నం అందించాలన్నదే నాకల’ అని ఎంతో నమ్మకంతో చెప్పిందీ పాప. అడిగిన వారికి సేంద్రియ ఉత్పత్తులు మాల్యాద్రి మాస్టారికి లాయర్ పేటలో ఫ్రీడమ్ బర్డ్స్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది. ఇందులోని సభ్యులకు, తమ స్కూల్‌కి చెందిన తల్లిదండ్రులకు తమ వ్యవసాయ క్షేత్రంలోని ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. ముఖ్యంగా జామ, నిమ్మ, ఆకుకూరలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది రెండెకరాల్లో వరి కూడా సాగు చేశారు. ‘వనితకు వ్యవసాయం పట్ల చాలా ఇష్టం ఉంది. నేను చేయగలిగిన అన్ని పనులూ నేర్చుకుంది. పాప తల్లిదండ్రులు కూడా ఆమె ఇష్టాన్ని గుర్తించారు. చిన్నతనంలోనే రైతులను బతికించాలని.. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతం చేయాలనే ఆలోచనలతో అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలని కలలు కనడం నిజంగా అభినందనీయం. ఆమె భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు చేరుకోవాని ఆశిస్తున్నా’ అని ఆమె గురువు నాయుడు మాల్యాద్రి చెప్పారు. -
వారు దేశానికి వెలకట్టలేని ఆస్తి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతి రూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. (సంఘీభావ పాదయాత్రలకు నీరాజనం ) చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతిరూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. #ChildrensDay2020 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2020 కాగా, అంతకు క్రితం రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతున్ని కోరుకుంటున్నానన్నారు. -
బాలల దినోత్సవం: పిల్లలకు గవర్నర్ సందేశం
సాక్షి, అమరావతి: రేపు బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం రాజ్ భవన్ నుంచి సందేశం ఇచ్చారు. శనివారం(నవంబర్ 14)న పండిట్ జవహర్లాల్ నేహ్రు జన్మదినం, ఈ రోజున ప్రతి ఎడాది బాలల దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పిల్లలందరికి ఆయన హృదయపూర్వక శుభకాంక్షలు తెలిపారు. చిన్నారులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వారే రేపటి భావి భారత పౌరులన్నారు. చిన్నారులు దేశం యొక్క నిజమైన బలమని, మనం జీవించే సమాజానికి పునాది అని పేర్కొన్నారు. మాతృభూమిని రక్షించడం, దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడం భావి భారత పౌరులుగా వారి బాధ్యత అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
వాడే పారేసిన బ్యాటరీలతో...
నిహాల్ తమన్నా.. 11 ఏళ్ల కుర్రాడు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయ తెలుగు కుటుంబం. నేపథ్యం సంగతి పక్కనబెడితే.. ఈ బుడతడు కాస్తా సీఈవోగా మారిపోయాడు. వ్యాపారం చేయడమొక్కటే లక్ష్యం కాదు, అది పర్యావరణానికి, భూమాతకు మేలు చేకూర్చే కాన్సెప్ట్‌తో ముందుకొచ్చాడు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక వన్ ఇన్ మిలియన్ అవార్డు అందుకున్నాడు. న్యూజెర్సీలో అయిదో తరగతి చదువుతున్న నిహాల్ కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన వారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో కుర్రాడు మిహిర్ కూడా నిహాల్‌కు జత కలిశాడు. ప్రస్తుత జీవన విధానంలో ప్రతీ చోట బ్యాటరీలు వాడుతున్నాం. ఒక్క అమెరికాలో ప్రతి ఏడాది దాదాపు 300 కోట్ల బ్యాటరీలు వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య వెయ్యి కోట్ల కంటే ఎక్కువ. మొబైల్ నుంచి ఇన్వర్టర్ దాకా, షేవర్ నుంచి కెమెరా దాకా.. ఇంట్లో వాడే సగం వస్తువులు బ్యాటరీతోనే పని చేస్తున్నాయి. అయితే బ్యాటరీ కెపాసిటీ పూర్తికాగానే దాన్ని చెత్తబుట్టలో వేసేస్తున్నాం. ఇలా వాడే పారేసిన బ్యాటరీల వల్ల భూమికి తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పర్యావరణానికి జరుగుతున్న ఈ హాని గురించి తెలుసుకున్న నిహాల్ తమన్నా, మిహిర్ ఇద్దరు తమ వంతుగా ఏమైనా చేయాలనుకున్నారు. బ్యాటరీల వల్ల ముప్పును నివారించడానికి కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. వీరి ప్రధాన లక్ష్యం వాడిపారేసిన బ్యాటరీ భూమిలోకి చేరకూడదు. ఈ విషయంలో ప్రజలను చైతన్యమంతం చేయడం లక్ష్యంగా www.recyclemybattery.org అనే వెబ్సైట్ ప్రారంభించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పని చేస్తున్న ఈ సంస్థ ప్రధానంగా బ్యాటరీల పునర్వినియోగం కోసం పని చేస్తోంది. మొదటి ఏడాదిలోనే 45 మంది విద్యార్థులను సంస్థలో భాగస్వామ్యం చేశాడు నిహాల్. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది పెద్దవాళ్లకు, లక్ష మంది విద్యార్థులకు నేరుగా బ్యాటరీ పునర్వినియోగం మీద అవగాహన కల్పించారు. స్కూళ్లు, ఆఫీసులు, లైబ్రరీలు వంటి పలు చోట్ల పాత, పాడైన బ్యాటరీలు సేకరించేందుకు 200 బాక్స్‌లను ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 38 వేల బ్యాటరీలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేశారు. అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల్లో, ముఖ్య నగరాల్లో బ్యాటరీలను సేకరించిందుకు స్నేహితుల సహకారం తీసుకుంటున్నారు ఈ చిన్నారులు. నిహాల్, మిహిర్ వీరిద్దరూ చేస్తున్న ఈ పనికి ఐటీ సర్వ్ అలియన్స్ తమ మద్దతు పలికింది. వీళ్ల చేస్తున్న మంచి పనికి ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి. నిహాల్‌కు నేషనల్ వేస్ట్ రీసైక్లింగ్ అసోసియేషన్ అవార్డు, న్యూజెర్సీ స్టేట్ రీసైక్లింగ్ అవార్డు, గ్లోబల్ కిడ్స్ అచీవర్ అవార్డులు లభించాయి. నిహాల్ చేస్తున్న పర్యావరణకృషికి గాను 2000 సంవత్సరానికి వన్ ఇన్ మిలియన్ అవార్డు లభించింది. ఈ భూమిని కాలుష్యం నుంచి నేను కాపాడినప్పుడు మీరు కూడా ఆ పని చేయగలరన్న నినాదంతో ముందుకెళ్తున్న నిహాల్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, పర్యావరణానికి మేలు చేసే మరిన్ని పనులు చేయాలని ఐటీ సర్వ్ అలయన్స్ అభిలషించింది. -
ప్రధానికి మనోజ్ తివారీ లేఖ
న్యూఢిల్లీ: దేశంలో బాలల దినోత్సవాన్ని నవంబర్ 14వ తేదీకి బదులు డిసెంబర్ 26న జరపాలని కోరుతూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇలా చేస్తే అది సిక్కుల పదో గురువైన గురు గోవింద్ సింగ్ ఇద్దరు కొడుకులకు ఘన నివాళి అవుతుందని లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎందరో బాలలు ఎన్నో త్యాగాలు చేశారని, కానీ వారిలో గురు గోవింద్ సింగ్ కుమారులైన జొరావర్ సింగ్, ఫతే సింగ్‌ల త్యాగం గొప్పదన్నారు. 1705వ సంవత్సరంలో డిసెంబర్ 26నే వాళ్లిద్దరు ధర్మాన్ని రక్షించడానికి తమ ప్రాణాలర్పించారన్నారు. స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని ప్రతి ఏటా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనోజ్ తివారీ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సిక్కు ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఆయన లేఖాస్త్రం సాధించారన్న వాదనలు వినబడుతున్నాయి. పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ఆయన బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుంజలో ఉన్నారు. పూర్వాంచల్ వాసులు కూడా ఢిల్లీలో గణనీయంగా ఉన్నారు. (చదవండి: ‘మఫ్లర్'మ్యాన్‌కు ఏమైంది?) -
నీ కొడుకును నేనే నాన్నా!
సాక్షి, పిఠాపురం: బాలల దినోత్సవం వేళ ఆనందంగా గడపాల్సిన ఆ బాలికలు విషాదంలో మునిగిపోయారు. కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రి దూరమవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. పుస్తకాల బ్యాగ్ మోయాల్సిన ఆ చిట్టి చేతులు తండ్రి చితికి నిప్పుపెట్టేందుకు కుంపటి పట్టుకోవాల్సి వచ్చింది. అభంశుభం తెలియని ఆ పసిహృదయాలు తండ్రి లేడని, ఇక తిరిగి రాడని తెలిసి తల్లడిల్లిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. నిండా ఎనిమిదేళ్లు కూడా నిండని బాలిక తన తండ్రికి తలకొరివి పెట్టిన హృదయ విదారకర సంఘటన కొత్తపల్లి మండలం కొండెవరంలో గురువారం చోటుచేసుకుంది. కొరివి పెట్టడానికి కొడుకు లేడన్న బాధ లేకుండా తానే కొడుకై కన్న తండ్రి రుణాన్ని తీర్చుకుంది ఆ బాలిక. తండ్రి చితికి తలకొరివి పెట్టి చితిమంట వద్ద విలపిస్తున్న సమీర కొత్తపల్లి మండలం కొండెవరానికి చెందిన కొల్లు నరసింహమూర్తి, నూకరత్నం దంపతులకు సమీర(8), పద్మ (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో సమీర స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. రెక్కాడితేనే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే నరసింహమూర్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసి నిద్రించాడు. ఉదయం అందరూ లేచి అన్ని పనులు చేసుకుంటున్నారు. సమీరను పాఠశాలకు పంపేందుకు సిద్ధం చేసిన నూకరత్నం, నరసింహమూర్తి నిద్రలేవకపోవడాన్ని గమనించి లేపే ప్రయత్నం చేసింది. ఎటువంటి కదలిక లేకపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆయన మృతదేహానికి తలకొరివి పెట్టడానికి మృతుడికి కొడుకులు ఇతర బంధువులు లేకపోవడంతో ఆ కార్యాన్ని తాను నిర్వర్తిస్తానంటూ పెద్ద కుమార్తె సమీర ముందుకొచ్చింది. తన స్కూల్యూనిఫాంతోనే తాను కొడుకుతో సమానం అంటు తండ్రి అంతిమయాత్రలో పాల్గొని తండ్రి చితికి నిప్పంటించి తలకొరివి పెట్టింది. అల్లారుముద్దుగా చూసుకునే నాన్నకు తానే తలకొరివి పెట్టాల్సి వచ్చిందంటూ ఆ చిన్నారి కన్నీటిపర్యంతమైన తీరు అందరితో కంటతడి పెట్టించింది. -
కంటతడి పెట్టిస్తున్న ఫొటో
న్యూఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేసిన ఫొటో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. 1938లో బ్రిటీష్ వారి తుపాకీ గుళ్లకు బలైపోయిన బాజీ రౌత్ అనే బాలుడిని స్మరించుకుంటూ సెహ్వాగ్ చేసిన పోస్టు మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. దేశ రక్షణకై బాల్యంలోనే అతడు చూపిన ధైర్యసాహసాలను కొనియాడిన సెహ్వాగ్... బాలల దినోత్సవం నాడు బాజీని గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకతను తన పోస్టులో వివరించాడు. అతి చిన్న వయస్సులోనే ప్రజల రక్షణకై ప్రాణాలు విడిచిన బాజీని భారతదేశపు స్వాతంత్ర్య పోరాటంలో తొలి(పిల్లవాడైన) అమరుడిగా అభివర్ణించాడు. ఈ మేరకు.. ‘ఒడిశాలోని నీలకాంతపూర్‌కు చెందిన అమరుడు బాజీ రౌత్. తనకు పన్నెండేళ్లు ఉన్నపుడు.. ఓ బ్రిటీష్ దళం తమను పడవలో ఎక్కించుకుని బ్రాహ్మణి నది అవతలి తీరానికి తీసుకువెళ్లాల్సిందిగా అడిగింది. అయితే అదే దళం తమ గ్రామంలోని ఎంతో మంది అమాయకులను అత్యంత పాశవికంగా చంపిందంటూ వారి గురించి కథలు కథలుగా విన్న బాజీ.. వారు తీరం దాటితే ఇంకెంతో విధ్వంసం సృష్టిస్తారు కదా ఆలోచించాడు. అందుకే తీరం దాటించే ప్రసక్తే లేదని వారితో కరాఖండిగా చెప్పాడు. దాంతో చంపేస్తామంటూ బ్రిటీష్ సేనలు బాజినీ భయపెట్టాయి. అయినప్పటికీ బాజీ వారికి తలొగ్గలేదు. వాళ్ల మాటలకు ఎదురుచెప్పాడు. ఇంతలో కోపోద్రిక్తుడైన ఓ బ్రిటీష్ సైనికుడు బాజీ తల మీద తుపాకీ వెనుక భాగంతో గట్టిగా కొట్టాడు. దాంతో అతడు కిందపడిపోయాడు. అయినప్పటికీ బాజీ మెల్లగా శక్తినంతా కూడగట్టుకుని పైకి లేచి.. తాను బతికున్నంత కాలం వాళ్లను అవతలి తీరానికి చేర్చేది లేదని తేల్చిచెప్పాడు. అప్పుడు వెంటనే ఓ సైనికుడు తన కత్తిని బాజీ తలలోకి దింపగా... మరొకడు ఆ చిన్నారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో బాజీతో పాటు అక్కడే ఉన్న అతడి స్నేహితులు లక్ష్మణ్ మాలిక్, ఫగూ సాహో, హృషి ప్రదాన్, నాటా మాలిక్ కూడా మృత్యువాత పడ్డారు. బాలల దినోత్సవం నాడు ఆ ధైర్యశాలికి సెల్యూట్ చేస్తున్నా. అత్యంత పిన్నవయసులో అసువులు బాసిన ఆ అమరుడు మరింత గుర్తింపునకు అర్హుడు’ సెహ్వాగ్ తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో.. ‘చాలా గొప్ప వ్యక్తిని గుర్తుచేశారు. అతడి త్యాగం మరవలేనిది. ఆ అమాయకపు ముఖం కంటతడి పెట్టిస్తోంది. మీకు ధన్యవాదాలు వీరూ భాయ్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా బాజీ రౌత్ ఒడిశాలోని నీలకాంత్‌పూర్‌లో 1926లో జన్మించాడు. పేద కుటుంబానికి చెందిన అతడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. అతడి తల్లి ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో 1938లో బాజీ రౌత్ బ్రిటీష్ సేనల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. -
మా ముత్తాత గురించి నేను విన్న కథ!
న్యూఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన ముత్తాత, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన మధుర ఙ్ఞాపకాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. తన చిన్నతనంలో నెహ్రూ గురించి విన్న కథను ట్విటర్లో షేర్ చేశారు. ‘ మా ముత్తాత ప్రధానిగా ఉన్న సమయంలో ఓ రోజు వేకువజామున మూడు గంటలకు ఇంటికి వచ్చారట. ఎంతగానో అలసిపోయిన తన అంగరక్షకుడు ఆదమరచి తన పరుపు మీద నిద్రపోతున్న దృశ్యాన్ని చూశారట. వెంటనే తన చేతిలో ఉన్న బ్లాంకెట్ అతడికి కప్పి.. ఎదురుగా ఉన్న కుర్చీలో నిద్రపోయారట. కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఓ వ్యక్తి గురించి మనకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాయి’ అని ప్రియాంక నెహ్రూ వ్యక్తిత్వం గురించి తన పోస్టులో రాసుకొచ్చారు. My favourite story about my great-grandfather is the one about when as PM, he returned from work at 3 am to find his bodyguard exhausted and asleep on his bed. He covered him with a blanket and slept on an adjacent chair. #JawaharlalNehru pic.twitter.com/HDDiC1hked — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 14, 2019 కాగా చాచా నెహ్రూగా చిన్న పిల్లల అభిమానం చూరగొన్న జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నవంబరు14ను బాలల దినోత్సవంగా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం సందర్భంగా ఎంతో మంది చిన్నారులు నెహ్రూ మాదిరి వేషం ధరించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. -
రాజ్‌భవన్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సాక్షి, విజయవాడ : రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి భవిష్యత్తుకు పునాది వేసేలా బాల్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మంచి లక్ష్యాలతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి ఎందరో మహనీయుల త్యాగాలను పిల్లలకు వివరించారు. ప్రపంచంలోనే ఉత్తమ శక్తిగా ఎదిగే అవకాశం మన దేశానికే ఉందని అన్నారు. మహనీయుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు అలవరుచుకోవాలని సూచించారు. అన్నిరంగాల్లో దేశ పురోగాభివృద్ధిలో బాలలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పిల్లలందరికీ బాలాజీ, దుర్గమాత ఆశీస్సులు ఉండాలని దీవించారు. -
సర్కార్ బడులకు మహర్దశ
-
సామాజిక పెట్టు‘బడి’!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. స్కూళ్లను చక్కటి సదుపాయాలతో తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 45,329 ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన బోధన అందించేందుకు ఉద్దేశించిన ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం నేడు ప్రారంభం కాబోతోంది. బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలిసారిగా చదువులపై భారీ వ్యయం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా వ్యయం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యారంగంపై చేసే వ్యయం సామాజిక పెట్టుబడిగా మారి మానవ వనరుల అభివృద్ధి జరగనుంది. దీని ద్వారానే మెరుగైన సమాజం సాధ్యమని ముఖ్యమంత్రి జగన్ దృఢంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘మనబడి నాడు– నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. విప్లవాత్మక నిర్ణయం మూడేళ్లలో మూడు దశల్లో నాడు–నేడు కార్యక్రమానికి రూ.12,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అంచనాలు ఇంకా పెరగవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక సీఎస్ పీవీ రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్లపై వ్యయం చేయడం అంటే ఇదంతా సామాజిక పెట్టుబడేనని తెలిపారు. తద్వారా ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో విశ్వాసం పెంచాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్పారు. వివిధ రాష్ట్రాలు విద్యను ప్రైవేట్ పరం చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం వెనుక సామాజిక బాధ్యత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. స్కూళ్ల అభివృద్ధి ఇలా - నాడు–నేడు తొలి దశ కార్యక్రమం కింద 15,715 స్కూళ్లలో 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ.3.627 కోట్లు అవసరమని అంచనా వేశారు. – తొలిదశలో గ్రామీణ, గిరిజన, పట్టణ, రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధి. - జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో కలెక్టర్లు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపడతారు. - ఇప్పటికే రాష్ట్రంలోని 45,329 సూళ్ల పరిస్థితికి సంబంధించి 20.19 లక్షల ఫొటోలను కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. - మౌలిక వసతుల కల్పన అనంతరం స్కూళ్ల ఫొటోలు మరోసారి తీసి తాజాగా ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలిసేలా వెబ్ పోర్టల్‌లో పొందుపరుస్తారు. - మన బడి పేరుతో నాడు–నేడు కింద చేపట్టనున్న పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు పబ్లిక్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
హ్యాపీ చిల్డ్రన్స్ డే
మదర్ ఈజ్ ఎ వెర్బ్. ఇట్ ఈజ్ సమ్‌థింగ్ యు డు, నాట్ జస్ట్ హు ఆర్ యు! (అమ్మ అనే మాట ఒక క్రియ. నువ్వేం చేశావో అదే నువ్వు. నువ్వెవరివో అది కాదు నువ్వు). కొంచెం ఫిలాసఫీ, కొంచెం అంతర్లీనత కలిసి ఉన్న ఈ వాక్యం ఈ నెల 10న అసోం పోలీస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ప్రత్యక్షమైంది! సాధారణంగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిలాసఫీ, ఫిలాసఫీకి పోలీస్ డిపార్ట్మెంట్.. ఒకదానికొకటి సరిపడనివి. వాక్యంలో అంతర్లీనత కూడా కలిసి ఉందంటే.. డిపార్ట్మెంట్లో ఎవరో బాగా చదువరులైన వాళ్లు ఉండి ఉండాలి. ఆ చదువరులు అమెరికన్ రచయిత్రి చెరిల్ లేసీ డొనోవాన్ 2009లో రాసిన పుస్తకం ‘ది మినిస్ట్రీ ఆఫ్ మదర్‌హుడ్’ ను కూడా చదివే ఉండాలి. మదర్ ఈజ్ ఎ వెర్బ్. ఇట్ ఈజ్ సమ్‌థింగ్ యు డు, నాట్ జస్ట్ హు ఆర్ యు.. అనే మాట ఆ పుస్తకం లోనిదే. కొన్ని మాటలు అనువాదం చేశాక కూడా ఎంత తన్నుకున్నా అర్థం కావు. మాటల్లో లోతు ఎక్కువగా ఉన్నందు వల్ల కలిగే కష్టం అది. ‘అమ్మ అనే మాట ఒక క్రియ’.. అనే ఈ మాటను మాటల్లోకి కాకుండా, ఒక చక్కటి ఫొటోలోకి తర్జుమా చేస్తే ఇదిగో.. మీరిక్కడ చూస్తున్న ఫొటో అవుతుంది. ఇద్దరు మహిళా పోలీసు అధికారులు డ్యూటీ చేయడానికి వచ్చి, తమ డ్యూటీలో ఏ మాత్రం భాగం కాని ‘పని’ని తల్లి మనసుతో చేతుల్లోకి ఎత్తుకున్నారు. ఆ రోజు అసోంలో ‘టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష రాసేందుకు బిడ్డ తల్లులూ వచ్చారు. దరంగ్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రానికి అలా బిడ్డలతో వచ్చిన ఇద్దరు తల్లులకు సహాయంగా ఎవరూ లేకపోవడంతో అక్కడ విధుల్లో ఉన్న ఈ ఇద్దరు మహిళా పోలీసులు చొరవ చూపి, వారి బిడ్డల్ని చేతుల్లోకి తీసుకున్నారు. ‘‘మీరు నిశ్చింతగా పరీక్ష రాసి రండి. అంతవరకు మీ బిడ్డల పూచీ మాది’’ అని భరోసా కూడా ఇచ్చారు. ట్విట్టర్లో అసోం పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన ఈ ఫొటో ఇప్పుడు.. చిన్నారులు స్వేచ్ఛగా అడుకుంటూ చుట్టుపక్కలంతా తిరిగినట్లుగా.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కలియ తిరుగుతోంది. ఈ ఇద్దరు మహిళా పోలీసులపై ఏకధారగా ప్రశంసలు కురుస్తున్నాయి. ‘వియ్ సెల్యూట్’ అని, ‘గ్రేటెస్ట్ వర్క్ ఎవర్, ప్రౌడ్ ఆఫ్ యు’ అని కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. చెరిల్ లేసీ కరెక్టుగానే చెప్పారు. అమ్మ ఏ యూనిఫామ్‌లో ఉన్నా, అమ్మ మనసుకు ఏ యూనిఫామూ ఉండదు. -
చిద్రమౌతున్న బాల్యానికి బంగారు భరోసా
సాక్షి, నల్గొండ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని బాలల పరిరక్షణ సమితి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ పేరున ఆరు మాసాలకోసారి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బాలకార్మికులను గుర్తిస్తుంది. అయినా ఎక్కడో ఒక చోట బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయస్సులో ఖార్ఖానాల్లో, ఇటుకబట్లీల్లో, ఇతర ప్రైవేట్ వ్యాపార సంస్థల్లో మగ్గిపోతున్నారు. బాలల పరిరక్షణ కోసం బాలల న్యాయ చట్టం, ఉచిత నిర్బంధ విద్యా హక్కు, ఇలా ఎన్నో చట్టాలను చేసింది. ఆడపిల్లలపై అకృత్యాలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలను ఎదిరించడం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలు ఈ నెల 7న ప్రారంభం కాగా.. 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. ఎన్నో ప్రత్యేక చట్టాలు.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని బాలల పరిరక్షణ సమితి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ పేరున ఆరు మాసాలకోసారి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బాలకార్మికులను గుర్తిస్తుంది. అయినా ఎక్కడో ఒక చోట బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయస్సులో బాలకార్మికులుగా ఉంటూ తమ జీవితాన్ని కోల్పోతున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ విభాగం ఏర్పాటు చేసింది. బాల్య వివాహాలతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తుంది. అయితే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం 2016లో ప్రత్యేక చట్టాన్ని చేసింది. అదే విధంగా 2006లో బాల్య వివాహాల నిరోధక చట్టం, 2015లో బాలల న్యాయ చట్టం, 2009లో ఉచిత నిర్బంధ హక్కు చట్టాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1098 టోల్ ఫ్రీ నంబర్.. చిన్నపిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారి సమాచారాన్ని అందించేందుకు 1098కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. బాల కార్మికులతో పాటు అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడినా ఈ నంబర్‌కు సమచారం అందిస్తే వెంటనే వారు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు. ఆరు మాసాలకోసారి బాలకార్మికుల గుర్తింపు.. ఆరు మాసాలకోసారి బాలకార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌ల పేర పోలీస్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ఏ ఆధారం లేనివారికి ఆ వయస్సును బట్టి సంబంధిత పాఠశాలల్లో చేర్పించి వారి సంరక్షణ బాధ్యతను చూసుకుంటారు. బాలకార్మికులు ఇలా.. జిల్లాలో బాల కార్మికులను 2018–19 సంవత్సరంలో గుర్తించడం జరిగింది. కట్టంగూర్ మండలంలో అత్యధికంగా 79 మందిని గుర్తించగా.. చింతపల్లి, కనగల్, నాంపల్లి, తిప్పర్తి మండలాల్లో ఇద్దరు చొప్పున గుర్తించారు. నకిరేకల్ 62, మిర్యాలగూడ 59, మాడుగులపల్లి 58, నల్లగొండ 53, త్రిపురారం 23, కేతెపల్లి 16, తిరుమలగిరి సాగర్ 16, వేములపల్లి 12, గుర్రంపోడు 11, దేవరకొండ 10, నేరేడుగొమ్ము 9, మునుగోడు, పెద్దవూరలో 8మంది చొప్పున, అనుమల, శాలిగౌరారంలో ఏడుగురు చొప్పున, చండూరులో ఆరుగురు, చందంపేట, గుండ్రపల్లిలో ఐదుగురు చొప్పున, అడవిదేవులపల్లి, చిట్యాల, దామరచర్ల మండలాల్లో నలుగురు చొప్పున బాలకార్మికులను గుర్తించారు. అక్రమ రవాణా నిరోధక చట్టం.. అక్రమ రవాణా నిరోధానికి 1956లో ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో అక్రమ రవాణా బాధితులు ఎవరంటే ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా లైంగిక వ్యాపారాలకు తరలించబడిన వారు. బలవంతపు వెట్టి చాకిరీలో ఉన్నవారు, ఏ ఉద్దేశంతో అయినా సరే అమ్మివేయబడిన వారు, మంచి జీవనోపాధి ఇస్తామన్న మాటలు నమ్మి తెలియని ప్రాంతానికి తరలించబడినవారు. అక్రమ రవాణా బాధితులను కాపాడుతున్న సందర్భాల్లో... ప్రత్యేక పోలీస్ అధికారి లేదా అక్రమ రవాణానిరోధక ఆఫీసర్ అక్రమ రవాణా జరగబోతున్నా, జరిగిన సందర్భాలను తెలుసుకోవడాకి వారెంట్ లేకుండా పరిశోధించవచ్చు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ఇద్దరు గౌరవపరమైన వ్యక్తుల నుంచి సమర్థత తీసుకోవాలి. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళ అయి ఉండాలి. అక్కడ కనిపించిన పిల్లలందరినీ బయటికి తీసుకురావాలి. అక్రమ రవాణా నుంచి కాపాడిన తర్వాత.. వయస్సు నిర్ధారణ, గాయాలను గుర్తించడం కోసం వైద్యం కోసం తరలించాలి. న్యాయమూర్తి ముందు హాజరుపర్చాలి. మహిళా పోలీస్, సామాజిక కార్యకర్త చేత బాధితురాలిపై విచారణ జరిపించాలి. పూర్తి శ్రద్ధ, సంరక్షణ బాధితురాలికి కల్పించాలి. పిల్లలయితే సీడబ్ల్యూసీని ప్రవేశపెట్టాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, డీఈఓ, డీఎంహెచ్ఓ, పీడీ డీఆర్డీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒకరిని, స్వచ్ఛంద సంస్థ నుంచి ఒకరిని సభ్యులుగా తీసుకుంటారు. ఐసీడీఎస్ పీడీ కన్వీనర్‌గా ఈ కమిటీకి ఉంటారు. బేటీ బచావో, బేటీ పడావో ప్రయోజనాలు.. 2015 జనవరి 22న కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అమ్మాయిలు ఉన్నత విద్యను పొందడానికి అవకాశం ఉంటుంది. తమకంటూ సొంత గుర్తింపును సృష్టించుకోవచ్చు. ఈ పథకం వల్ల కలిగే పలు ప్రయోజనాలు.. బాలికల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. ఈ పథకం కింద బాలికలు ఉన్నత విద్యను పొందుతారు. బాలికల వివాహాం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య వివక్షత తగ్గనుంది. ఈ పథకం కింద బ్యాంక్‌లో డిపాజిట్ చేయబడిన మొత్తం ఆదాయ పన్ను నిబంధన 80–సీ కింద మినహాయింపు ఉంటుంది. ఈ పథకానికి అర్హులైన వారు సుకన్యయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఇలా.. బేటీ బచావో బేటీ పడావో పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వయో పరిమితి 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది. 10 సంవత్సరాల వయస్సు గల ఏ అమ్మాయి అయినా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న బా లికలు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి బాలల జనన ధ్రువీకరణ, చిరునామా, గుర్తింపు కార్డును జత చేయాల్సి ఉంటుం ది. దరఖాస్తులను సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో అందించాలి. -
14న సెల్‌ఫోన్స్ స్విచాఫ్ చేయండి!
చెన్నై, టీ.నగర్: బాలల దినోత్సవం నవంబరు 14వ తేదీన సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి పిల్లలతో ఆనందంగా గడపాల్సిందిగా తల్లిదండ్రులకు పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని పాఠశాలలకు ఒక సర్క్యులర్ పంపింది. పాఠశాలల్లో నవంబరు 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ తరçఫున ఆరోజున సెల్ఫోన్లను లేకుండా గడపాల్సిందిగా పిలుపునిచ్చింది. ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తల్లిదండ్రులు తమ సెల్ఫోన్లను స్విచాఫ్ చేసి పిల్లలతో గడపాలని, దీన్ని వారానికి ఒకసారి లేదా రోజూ కూడా అమలులోకి తీసుకురావచ్చని తెలిపింది. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల వద్ద ఈ విషయంపై ఒత్తిడి తేవాలని కోరింది. పిల్లలు, ఉపాధ్యాయులు దీన్ని ఆచరణలో పెట్టాలని పేర్కొంది. -
డూడుల్ గీయండి... లక్షలు పట్టండి
న్యూఢిల్లీ: విద్యార్థులూ.. మీరు చక్కగా బొమ్మలు వేయగలరా? అయితే గూగుల్ ఓ కొత్త ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. మీరంతా గూగుల్ వెబ్సైట్ తెరవగానే గూగుల్ లోగోపైన డూడుల్ చూసే ఉంటారు. ఏ రోజు ప్రాముఖ్యతను ఆ రోజు చిన్న కార్టూన్ రూపంలో అది సూచిస్తుంది. ఇప్పుడు మీరు గీయబోయే చిత్రం ఆ డూడుల్ స్థానంలో కనిపించనుంది. నవంబర్ 14న ‘బాలల దినోత్సవాన్ని’ పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయనున్న డూడుల్‌కు కార్టూన్లు వేయాల్సిందిగా గూగుల్ కోరుతోంది. ఇది కేవలం మీ డూడుల్ కనిపించేలా చేయడమే కాదండోయ్.. అయిదు లక్షల క్యాష్‌ను కూడా మోసుకొస్తుంది. ‘నేను పెద్దయ్యే సరికి.. నేనేం ఆశిస్తున్నానంటే’ అన్న అంశం మీద డూడుల్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కింద, మీకు ఉన్న ఏ ఆలోచనకైనా రూపం ఇవ్వచ్చు. ఉదాహరణకు చంద్రుడి మీద జీవితం ఎలా ఉంటుంది? భూమ్మీద కాలుష్యం లేకపోతే ఎలా ఉంటుంది? భూమి అంతా సాధు జంతువులతో నిండిపోతే ఎలా ఉంటుంది ? వంటి ఏ అంశం మీదైనా డూడుల్ తయారు చేయవచ్చు.డూడుల్‌లో కచ్చితంగా ‘జీఓఓజీఎల్ఈ’ అన్న గూగుల్ స్పెల్లింగ్ ఉండాలి. ఎంపిక ఇలా...: మొదట మీరు గీసిన చిత్రాలన్నింటినీ గూగుల్ బృందం ఎంపిక చేస్తుంది. ఈ బృందంలో బాగా డూడుల్స్ తయారుచేసే నేహా డూడుల్స్ మేడం, యూట్యూబ్‌లో టాలెంట్ చూపించే ప్రజక్త కోళి, మనందరికీ ఇష్టమైన ఛోటా భీమ్ బొమ్మ గీసిన రాజివ్ చికాల కూడా ఉన్నారు. వీరంతా మేటిగా ఉన్న 20 చిత్రాలను ఎంపిక చేస్తారు. వీటిని అక్టోబర్ 21 నుంచి నవంబర్ 6 వరకు పబ్లిక్ ఓటింగ్‌లో ఉంచుతారు. గెలిచిన వారికి 5 లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రూ. 2 లక్షల విలువైన సాంకేతికతను మీ పాఠశాలకు ఇస్తారు. -
విద్యార్థులే గురువులుగా..!
రోజు స్కూల్‌కు వస్తున్నాం. ఇంటికి వెళ్తున్నాం. మా గురువులు మాకు పాఠాలు బోధించేందుకు ఎంత శ్రమ పడుతున్నారో మేం బోధన చేస్తే అర్థమయింది. పాఠాలు చెప్పడం ఎంత కష్టమో.. క్రమశిక్షణ అంటే ఏమిటో తెలిసింది. విద్యార్థులందరూ ఒకేచోట ఉన్నప్పడు వారిని ఎలా క్రమశిక్షణలో పెట్టాలో బోధపడింది’ అని అన్నారు విద్యార్థులు. రోజు గురువులు చెప్పే పాఠాలు విన్న విద్యార్థులు బుధవారం టీచర్స్ డే సందర్భంగా వారు పాఠాలు చెప్పడం ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు. కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ సౌభాగ్యానికి, సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులే గురువులుగా మారి పాఠాలు బోధించారు. ఎవరి నైపుణ్యం మేరకు వారు బోధన చేసి గురువులతో శభాష్ అనిపించుకున్నారు. తమకు రోజు పాఠాలు చెప్పే గురువులు ఎలా కష్టపడుతున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇంగ్లిషు, సాంఘీకం బోధించా... తొమ్మిదో తరగతి ఇంగ్లిషు, సాంఘిక శాస్త్రం పాఠాలు చెప్పా. మాకు పాఠాలు చెప్పడానికి ప్రతిరోజు మా టీచర్లు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. పాఠాలు చెప్పడం అంటే నేర్పడం కాదు.. మనం కూడా నేర్చుకోవాలన్న విషయం అర్థమయింది. -వంశీ, 10వతరగతి టీచరవుతా... భవిష్యత్తులో టీచరవుతా. తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే ముందుగా మనం నేర్చుకోవాలి. పుస్తకాలే కాకుండా సమాజంలో నిత్యం జరిగే అనేక విషయాలపై అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు పుస్తకాల్లో దొరకవు. మన చుట్టూ ఉన్న సమాజంపై అవగాహన కలిగి ఉంటేనే చెప్పగలం. -అభిత, 10వతరగతి సన్నద్ధమయ్యా.. 8వతరగతి ఫిజికల్ సైన్స్ బోధించా. మాకు సార్లు చెప్పినప్పుడు మా దృష్టి మరోవైపు వెళ్లేది. పాఠం చెప్పడానికి రెండు రోజులు సన్నద్ధమయ్యా. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. -సౌమ్య, 9వతరగతి స్నేహితులే చెప్పినట్టు ఉంది.. తోటి స్నేహితులే పాఠాలు చెప్పినట్టు ఉంది. రోజు కలిసి తిరుగుతాం. కలిసి పాఠాలు చెప్పుబున్నట్లు అనిపించింది. ఎలా చెప్తారో అనుకున్నా. బాగానే బోధించారు. మాకు అర్థమయ్యేందుకు మా గురువులు ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు అర్థమయింది. -రాకేశ్, 8వతరగతి శభాష్ అనిపించుకున్నారు ప్రతి క్లాసులో ఎవరికి వారు బాగానే బోధించారు. ముందుగా వారికి కొన్ని విషయాలపై అవగాహన కల్పించాం. బాగా అర్థం చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా తరగతి గదుల్లో వారు ఎంచుకున్న సబ్జెక్టును విద్యార్థులకు బోధించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఎలా ఆరాటపడతారో స్వయంగా తెలుసుకున్నారు. శభాష్ అనిపించుకున్నారు. -రమేశ్, హెచ్ఎం -
అచ్చం నానీ లాగే ఉన్నాడే..!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమా విశేషాలతో పాటు ఫ్యామిలీ ఈవెంట్స్, మెమరబుల్ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు. తాజాగా బాలల దినోత్సవం సందర్భంగా నాని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తన చిన్నప్పటి ఫొటోతో పాటు తన కొడుకు అర్జున్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాని ‘మేమిద్దరం ఒకేలా ఉన్నాం, నిజజీవితంలో డ్యూయల్ రోల్’ అంటూ కామెంట్ చేశాడు. నాని కొడుకు అచ్చం చిన్నతనంలో నాని లాగే ఉండటంతో ఫ్యాన్స్ ఆ ఫొటోనూ రీ ట్వీట్ చేస్తూ ఇద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. Happy children’s day :) Yes, we both look similar! Real life dual role from a different generation 😉 pic.twitter.com/mXlxMxkgVQ — Nani (@NameisNani) 14 November 2018 -
మగ్గిపోతున్న ‘పసి మొగ్గలు’
ఆదిలాబాద్‌టౌన్ : పలకా బలపం పట్టాల్సిన చేతులు మెకానిక్ షెడ్లు, ఇటుక బట్టీల్లో పానలు, పారలు పడుతున్నారు. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన వీరు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని ఆయా పట్టణాల్లో రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు భిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జీల్లో దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం, కార్మిక శాఖ ఇటు వైపుగా చూస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఫలితంగా బాల కార్మికులకు విముక్తి కలగడం లే దు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశ పెట్టిన పలు కార్యక్రమాలు, చట్టాలన్ని మొక్కుబడిగా అమలవుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పిల్లలు బందీలుగా మిగులుతున్నా రు. బాలల దినోత్సవం సందర్భంగా మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించడం తప్పా వారికి అక్షరాలు దిద్దించేలా పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలు అమలుకు నోచుకోవడంలేదు. బాట పట్టినా.. బడికి రాని పిల్లలు సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతియేటా బడిబాట కార్యక్రమాలను చేపడుతోంది. ఉపాధ్యాయులు చిన్నారుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించి చేర్పించేలా చూడాలని కోరుతున్నా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అనేక కార్యక్రమాలను చేపడుతున్నన్నా పిల్లలు బడిబాట పట్టడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్, చదువుల పండుగ, బడిబాట, విద్యా పక్షోత్సవాలు, విద్యా సంబరాలు.. ఆచార్య జయ శంకర్ చదువుల పండుగ.. ఇలా గత పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 500లకు పైగా మంది చిన్నారులు బడిబయట ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా మండలాల్లో బాల కార్మికులు అధికంగానే ఉన్నట్లుగా అధికారులు కూడా గుర్తించారు. కాగా అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో కేవలం 144 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. గత మూడు నాలుగు నెలల క్రితం నిర్వహించిన బడిబాటలో పిల్లల్ని చేర్పించలేక పోయారు. విద్యాహక్కు చట్టంలో భాగంగా బాల కార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి మూతబడ్డాయి. నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం.. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. కొన్నేళ్లుగా విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పిల్లలు బడికి.. పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువ కావడానికి చట్టం తీసుకువచ్చిన విషయం విదితమే. లక్ష్యం సాధించకపోవడంతో విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2009 ఆగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడం వల్లే నేటికీ ఉచిత నిర్బంధ విద్య అమలు కావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యా సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉండగా, బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ తర్వాత పిల్లలు బడికి వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించకపోవడంతో బడిలో చేరిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. పిల్లల్ని బడిలో చేర్పించాలి బడి బయటి పిల్లల్ని ఉపాధ్యాయులు బడిలో చేర్పించాలి. జిల్లాలో 144 మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు గుర్తించాం. 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పనులకు పంపకుండా పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా కృషి చేయాలి. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్ -
బడికి పోవాల్సింది కానీ.. పనికి వెళ్తున్నాం
సాక్షి, వరంగల్: చాలా మంది పిల్లలకి బాలల దినోత్సవం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ రోజే పాఠశాలల్లో ఆటలు, పాటలతో పాటు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. వీటన్నింటితో బడికి వెళ్లే పిల్లలు సంతోషంగా ఉంటారు. మరీ కుంటుంబ కష్లాల వల్లా చాలా మంది పిల్లలు వారి బాల్యాన్ని బలిచేసుకుంటున్నారు. వీరికి బాలల దినోత్సవం అంటూ ఒకటి ఉంటుందని బహుశ తెలియకపోవచ్చు. తెలిసిన బడికి పోవాల్సింది కానీ.. పనికీ వెళ్తున్నాం అని అనుకుంటూ వారి జీవితాలని సాగిస్తున్నారు. కనీసం మనమైనా ఇటువంటి పిల్లలని గుర్తించి వారి బాల్యాన్ని బలి కాకుండా కాపాడగలమా ? పలక పట్టాల్సిన చేతులు పలుగు పట్టుకొని పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా సంరక్షించే శాఖలు సేవలు చేస్తున్నా బాలలు కార్మికులుగా మారే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఈ ఫొటోలో ఉన్న బాలుడి పేరు మడకం జోగయ్య, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన గొత్తికోయ ప్రాంతానికి చెందినవాడు. తల్లిదండ్రులు ప్రతి ఏడాది ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యవసాయ రైతు వద్దకు మిర్చి పంట వద్ద మకాం ఉంటారు. వీరితోపాటు ఈ బాలుడు వచ్చి తోట పనుల్లో నిమగ్నమవుతాడు. తోటకు తడికట్టడం, మందు చల్లడం, కూలీలకు నీళ్లు తీసుకురావడం వంటి పనులు చేస్తుంటాడు. చదువుకునేందుకు స్థోమత లేక తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ పనులు చేస్తున్నాడు. బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని తెలిసినా ఆ కుటుంబ పేదరిక పరిస్థితికి ఈ బాలుడితో పనిచేయించక తప్పడం లేదని ఆ రైతు వాపోయాడు. ఇలాంటి బాలలు ఎంతో మంది మన ఏజెన్సీ ప్రాంతం, రాష్ట్రం, దేశంలో కనిపించడం పరిపాటిగా మారింది. ఏజెన్సీలో మారని తీరు.. ఏటూరునాగారం: ఏజెన్సీలో బాలురతో పనిచేయించడం, బాల్య వివాహాలు జరిగినా సంబంధిత మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అక్కడ పనిచేసే సిబ్బందికి అన్ని తెలిసినా కూడా బాల్య వివాహాన్ని అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వివాహాలు చేసేవారు, వి వాహాలు చేసుకునే బాలికలు అక్కడుండే సిబ్బంది తెలిసినవారు కావడంతో వారి వివాహాన్ని అడ్డుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. చట్టాలపై అవగాహన, రక్షణ కల్పించేవారు లేక బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బడీడు పిల్లలు బడిలో చేరి డ్రాపౌట్లుగా మారడం, పశువుల కాపరిలా మారడం వంటి చర్యలు ఏజెన్సీలో అనునిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఈ చట్టాల పటిష్టతోపాటు బాలలకు కావాల్సిన సౌకర్యాల కల్పనను మరింత బలోపేతం చేస్తేనే బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు అదుపులోనికి వస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. భారత మొదటి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రూపొందించిన∙చట్టాలు ఇవే.. జీవించే హక్క: ఇది ఆరోగ్య ప్రమాణానికి సరైన జీవన స్థితికి గల హక్కు. దీని ప్రకారం పిల్లలు, అనా రోగ్యం, ఇతర ప్రమాదాల వల్ల మరణించకుం డా ఆరోగ్యంగా జీవించే హక్కును సంపాదించుకున్నారు. ప్రతి బిడ్డకు ఆహారం ఆరోగ్యం, విద్య అందించి వారి పరిపూర్ణ, శారీరక, మానసిక, సామాజిక వికాసానికి పునాది వేయాలి. రక్షణ హక్కు : అన్ని రకాల బాధలు, అవమానాల, దాడుల నుంచి పిల్లలకు విముక్తి, స్వేచ్ఛ కల్పించుట, అత్యవసర పరిస్థితులలో సంఘర్షణలు, సంభవిస్తే ప్రత్యేక రక్షణను కల్పించాలి. దోపిడీ నుంచి రక్షణను కల్పించి వారి అభివృద్ధికి తగిన జాగ్రత్త తీసుకోవడం, భారత రాజ్యంగ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలు, ఫ్యాక్టరీలలో గాని, గనులలోగాని, ఇతర వ్యాపార సముదాయాల్లో పనులు చేయించడం నేరం. పిల్లల ఉన్నతికి, వికాసానికి హక్కు: పిల్లలు ఆలంబన, వికాసం, సంరక్షణ, సాంఘిక భద్రత హక్కులతోపాటు విశ్రాంతికి, వినోదానికి సాంస్కతిక కార్యకలాపాలకు సంబంధించిన హక్కులు కూడా ఉన్నాయి. బడికి వెళ్లని 5–14 సంవత్సరాల పిల్లలకు (పశువులను మేపుతూ, పొలం పనులు చేసేవారు) నిర్భంద ఉచిత విద్యను ఆదేశించడం జరిగింది. భాగం పంచుకునే హక్కు: బాలల అభిప్రాయాలపై గౌరవం, భావ ప్రకటన, స్వేచ్ఛ, సరైన సమాచారం పొందే హక్కు. పిల్లలు వారి మనస్సులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కులు వారి భావాలకు తగిన విలువను ఇవ్వాలి. భావప్రకటనకు స్వేచ్ఛకు కలిగించాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం 1933లో బాలల చట్టం చేసి చిన్న పిల్లలను శ్రమ దోపిడీ నుంచి రక్షించడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పింది. 1938లో బాలల ఉద్యోగ కల్పన చట్టం ఏర్పాటు కాగా కఠిన శ్రమకు లోనయ్యే పనుల్లో వారిని వినియోగించరాదని సూచనలు చేసింది. కర్మాగారాల్లో పిల్లలతో పనిచే యించరాదని 1948లో కర్మాగారాల చట్టాన్ని రూపొందించారు. బాలలను రక్షించడానికి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, చైల్డ్ ఫౌండేషన్ వారు ఉచిత టెలిఫోన్ నంబర్‌ను రూపొందించారు. 1098కు బడిలో గానీ, బడిబయట గానీ, పిల్లలను బడికి పంపకుండా వేరే పనులు చేయించినా, ఇతరులతో ఇబ్బందులు, వేదింపులకు లోనైతే వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే ఇబ్బందులకు గురైన బాలలకు రక్షణ కల్పించడం జరుగుతుంది. అండగా ఉండేందుకు తోడ్పడుతుంది. బాలలను రక్షించేందుకు ప్రత్యేక దృష్టి జిల్లాలో బాలలను రక్షించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాం. చిన్నారులపై అఘాయిత్యాలు, బాలలను కార్మికులుగా పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే వెళ్లి వారి ని విముక్తి చేయడం జరుగుతుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 954 మంది బాలబాలికలను రక్షించాం. ఎలాంటి ఇబ్బంది ఉన్నా 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. – చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి, భూపాలపల్లి జిల్లా బాలలతో పనిచేయించడం నేరం.. వయస్సు నిండని బాలలతో పనులు చేయిం చడం చట్ట రీత్యా నేరం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం 5–14 వయస్సు కలిగిన పిల్లలు బడిలో ఉండాలి. బడిబయట ఉంటే వెంటనే వారిని బడిలో చేర్పించాలి. 18 ఏళ్ల వయస్సు నిండని యువతికి వివాహం జరిపిస్తే బాల్య వివాహం కిందకు వస్తుంది. – ఓంకార్, బాలల సంరక్షణ అధికారి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -
బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పిల్లల ఎదుగుదల కోసం, వారి అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఉత్తమమైన ప్రదేశంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజాసంకల్పయాత్ర చేపట్టి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పిల్లలందరిని చదివించే బాధ్యత తీసుకుంటామని నవరత్నాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. Happy children’s day! For your sake, I vow to make our state a better place for you to grow up and flourish in. — YS Jagan Mohan Reddy (@ysjagan) 14 November 2018 -
బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్?
బాల్యానికి గంతలు కట్టేస్తున్నారు.అలాగే అనిపిస్తోంది. అందరూ చెప్పేవాళ్లే కానీ.. జీవితాన్ని చూపించేవాళ్లు తక్కువైపోయారు. చూపులేని వాళ్లను నడిపించినట్లు నడిపిస్తున్నారే కానీ.. రెక్కలు కట్టి ఎగరమని చెప్పడం లేదు. నిజానికి.. బాల్యం చెక్కినట్లు జీవితాన్ని మరేదీ చెక్కలేదు. బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్? రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే! నేటి మన సంతోషానికి, నిన్నటి మన జ్ఞాపకాల చిరునవ్వులకు, రోజూ ఉదయాన్నే జీవితంపై ఆశతో మనం నిద్రలేవడానికి ఒక అర్థవంతమైన కారణం పిల్లలు. లోకం తీస్తున్న పరుగులన్నీ పిల్లల కోసమే. లోకం నిండా ప్రేమ ఉన్నది పిల్లలకు పంచడానికే. అక్షరాలున్నది పిల్లలకు నేర్పించడానికే. మేడలు నిర్మిస్తున్నది పిల్లల సౌఖ్యానికే. పిల్లలు.. కుటుంబానికే కాదు, లోకం మొత్తానికే వెలుగు. వాళ్లొక్క నవ్వు నవ్వితే ప్రకృతి పరవళ్లు తొక్కుతుంది. వాళ్లొక్కమారు ఆడుకుంటూ గిర్రున తిరిగితే విశ్వాంతరాళమే వారి చుట్టూ పరిభ్రమిస్తుంది. వాళ్ల కళ్లలోని కాంతులను చూస్తే చుక్కలు చెలిమికొస్తాయి. చెయ్యిచాచి వాళ్లడిగితే చందమామయ్య అమ్మచేతి అద్దంలోకి వచ్చేస్తాడు. ఇల వాళ్లదే, కల వాళ్లదే. భువి వాళ్లదే. దివి వాళ్లదే. రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే. పెద్దల్ని వాచ్ చేసేవాళ్లు, పెద్దలకు టీచ్ చేసేవాళ్లు కూడా. ఎన్ని తెలిసిన జ్ఞానికైనా, ఒకటేదో మిగిలే ఉంటుంది పిల్లల్నుంచి చేర్చుకోడానికి! ఏమీ తెలియనివారిక్కూడా.. ధైర్యమూ, దారీ ఇచ్చే సంకేతమేదో పిల్లల మాటల్లో దొరుకుతుంది. ‘ఔట్ డేటెడ్’లను నడిపిస్తారు. ‘అప్డేట్’లను కూడా అప్‌గ్రేడ్ చేస్తారు! జవహర్లాల్ నెహ్రూ అనే ఓ పిల్లాడుండేవాడు. పెద్దయ్యాక దేశ ప్రధాని అయ్యాడు. ప్రధాని అయ్యాక కూడా పిల్లల్తో ఆడాడు. పాడాడు. చాక్లెట్లిచ్చాడు. ఆయనకీ తెలీదు తన పుట్టినరోజు ఏదో ఒక నాటికి ‘పిల్లల రోజు’ అవుతుందని. అయింది. పిల్లలే ఆయనకిచ్చిన కానుక ‘చిల్డ్రన్స్ డే’. పిల్లలు ఏదీ ఉంచుకోరు. వెంటనే పంచుకుంటారు! కానీ మనం చేస్తున్నదేమిటి? పిల్లల కోసం బాల్యాన్ని కొద్దిగానైనా మిగల్చడం లేదు. చేస్తున్నదంతా వాళ్ల మంచి కోసమే. వాళ్ల ఫ్యూచర్‌ని చక్కగా ప్లాన్ చేస్తాం. కానీ వాళ్ల ప్రెజర్‌ని పట్టించుకోం. విజ్ఞానవంతుల్ని చేయాలని చూస్తాం. వికాసం కోసం చూడం. ఎదుగుతున్నారనే అనుకుంటాం.. లోలోపల గుదులుకుంటున్నారేమోనని చూడం. మన కలల్ని వాళ్లు నెరవేర్చాలని కోరుకుంటాం. వాళ్లకొచ్చే పీడకలల్ని అర్థం చేసుకోం. అన్నీ ఇస్తాం. అనుబంధాలను ఇవ్వం.ఆడుకోమంటాం.ప్లేగ్రౌండ్ ఇవ్వం. ఇంత హింసేమిటి? బట్టీల్లో, కర్మాగారాల్లో కనిపించే బాలల వెట్టిచాకిరీ మాత్రమే మనకు హింసగా కనిపిస్తుంది. ఇంట్లో, స్కూల్లో పెట్టే హింస కనిపించదు. చైల్డ్ లేబర్ని, చైల్డ్ ట్రాఫికింగ్‌ని, చైల్డ్ హెరాస్మెంట్ని, చైల్డ్ అబ్యూజ్‌ని అరికట్టే చట్టాలు ఉన్నాయి. ప్రయోజకుల్ని చేసే లక్ష్యంతో.. ఎదుగుతున్న మొగ్గల్ని చిదిమేసే హింసను అరికట్టేందుకు ఏ చట్టం ఉంది? పిల్లలకు ఎంతో ఎక్కువ చేస్తున్నాం అనుకుంటున్న మనం.. తక్కువ చేస్తున్నదేమిటో కూడా ఈ బాలల దినోత్సవం రోజు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. డిజి బిజి ఓ ముప్పయ్ ఏళ్ల కిందట... పిల్లలు గ్రౌండ్లో ఆటల్లో మునిగిపోతే, సాయంత్రం దాటి చీకట్లు ముసురుకుంటున్నా ఇల్లు గుర్తుకు వచ్చేది కాదు. ‘ఇక ఆడుకున్నది చాలు. ఇళ్లకు వెళ్లండి’ అని ఆ దారిన వెళ్లే పెద్దవాళ్లు ఎవరో కోప్పడే వరకు ఆటలు ఆగవు. మరీ గడుగ్గాయిలైతే... వాళ్లను వెతుక్కుంటూ తల్లులు రావాలి, చెవులు మెలేసి ఇంటికి లాక్కెళ్లాల్సిందే. సంతోషాలు రాశిపోసిన బాల్యం అది. ఆనందం చిందిన బాల్యం అది. ఆరోగ్యం నిండిన బాల్యం అది. గడిచిన తరాలు అనుభవించిన సృజనాత్మకమైన బాల్యం అది. ఈ తరానికి తెలిసిన బాల్యం ఎలక్ట్రానిక్ బాల్యం. ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే రోజు గడిచిపోయే కాలమిది. అమ్మానాన్నలు ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు, ఎవరి స్మార్ట్‌ఫోన్‌లో వాళ్లు మునిగిపోతున్నారు. పిల్లలు కంప్యూటర్లో హారర్ షోలతో ఉత్కంఠకు గురవుతుంటారు. టామ్ అండ్ జెర్రీ చూస్తూ కసిగా నవ్వుకుంటుంటారు. ఏడిపించి నవ్వడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంటారు. ఈ తరానికి గేమ్స్ అంటే వీడియో గేమ్సే, కదలకుండా కూర్చుని మెడ వంచేసి, వత్తులేసుకున్నట్లు కళ్లు తెరుచుకుని గంటల కొద్దీ గడపడమే వాళ్లకు తెలిసిన ఆటలు. బాల గేయాలంటే సీడీలు ప్లే చేసి ‘చిట్టి చిలకమ్మ’ను చూడడమే తప్ప నోరు తెరిచి ఆలపించాలనే ఆలోచనే ఉండడం లేదు. ల్యాప్‌టాప్, యూ ట్యూబ్, స్మార్ట్ ఫోన్, వీడియోగేమ్స్‌లో కుదురుకుపోతున్నారు తప్ప ఒళ్లు కదిలించే ఆటల వైపే చూడడం లేదు. గది నిండా ఎలక్ట్రానికి డివైజ్‌లు. వాటిని ప్లే చేసే ఓ ప్రాణమున్న డివైజ్. ఇదే ఈ తరం ఎంజాయ్ చేస్తున్న ‘ఈ– బాల్యం’. అంతంత సేపు స్క్రీన్ చూస్తే చూపు పోతుందని కోప్పడితే, రిమోట్‌తో డ్రోన్‌ను ఎగిరిస్తారు. బయటకు వెళ్లి ఆడుకోమంటే... జేబు నిండా డబ్బులేసుకుని ప్లే స్టేషన్‌కెళ్లి బంపింగ్కార్స్తో ఢీ కొట్టుకోవడమే నేటి తరం ఆనందిస్తున్న ఆట. ఈ మోడరన్ టెక్ లైఫ్‌లో ‘నో ఫుడ్ డే’ ఉంటుందేమో కానీ ‘నో టెక్ డివైజ్ డే’ ఉండదు. డే మొత్తం కాదు ఓ గంట కూడా స్క్రీన్కు దూరంగా... తనకు తానుగా మెదడు పెట్టి, మనసుతో గడపలేకపోతోంది ఈ హైటెక్ జనరేషన్. సాంకేతికాభివృద్ధి మనిషి జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉపయోగపడాలి.మనిషిని మరబొమ్మలా చేయకూడదు. నిజానికి అన్నింటికీ నెపాన్ని పిల్లల మీద తోసేస్తారు, కానీ వాళ్లు ఇలా మారడానికి మూలం ఏమై ఉండాలి?‘జో అచ్యుతానంద జోజో ముకుందా...’ అమ్మ ఒడిలో పడుకుని పాట వింటూ నిద్రలోకి జారిపోతుంది ఏడాది పాపాయి. ఆ పాటను అమ్మ పాడడం లేదు. పక్కనే స్మార్ట్‌ఫోన్‌లో పాట పెట్టేసి పాపాయిని ఒడిలోకి తీసుకుని జో కొడుతుందంతే. అమ్మ గొంతు వినడమే బిడ్డకు భరోసా అని, అమ్మ శ్రావ్యంగా పాడకపోయినా... పాట బాగాలేదని పాపాయి ముఖం చిట్లించదని ఆ అమ్మకు తెలియాలి. తాను జోల పాడి నిద్ర పుచ్చితే, తాను ‘చిట్టి చిలకమ్మ’ అని పలుకుతూ పాపాయికి నేర్పిస్తే... పాపాయి కూడా తన ఆట తాను ఆడుకుంటుంది. తన పాట తాను పాడుకుంటుంది. అది లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ప్లే చేయడం మాత్రమే నేర్చుకుంటుంది. తనలో క్రియేటివిటీ ఉందన్న సంగతి కూడా తెలియకుండానే పెద్దదయిపోతుంది. అందుకే... అమ్మలూ! జోల పాడండి, పాపాయికి తాను పాట వినడమే కాదు, పాడాలి కూడా అని తెలిసేలా పెంచండి. సృజనాత్మకతతో వికసించాల్సిన రేపటి తరాన్ని టెక్ సీలో ముంచవద్దు. అమ్మ, నాన్న, ఓ బిడ్డ, నాలుగు స్మార్ట్ఫోన్లు, ఓ టాబ్లెట్, ల్యాప్‌టాప్... ఇదీ ఇప్పటి కుటుంబ ముఖచిత్రం. బాల్య సంబంధాలు నాన్న కోప్పడితే వెళ్లి బాబాయి వీపు వెనుక దాక్కోవడానికి లేదు. లేదా నాన్న భయం లేదని తెలిస్తే బాబాయ్‌తో చెప్తానుండు అని అనడానికీ లేదు. తాతయ్య బజారు నుంచి వస్తూ వస్తూ చేసంచిలో కారాబూందీ పొట్లం కట్టించుకొని వచ్చి, మంచం మీద కూచుంటూ పిలిచి, బుగ్గలు పుణికి దానిని చేతిలో పెడితే, తీసుకుని తింటున్నప్పుడు తాతయ్య నవ్వే నవ్వు చూడ్డానికి లేదు. విసుక్కునే అమ్మను మందలించి దగ్గరకు తీసుకునే నానమ్మ ఒడి లేదు. ‘జామకాయలు కోద్దాం రా’ అని ఉప్పు మూట ఎక్కించుకుని పెరట్లో ఆటలాడే పిన్ని వాత్సల్యం లేదు. ఉన్న అనుబంధాలు పరిమితమైపోయాయి. ప్రతి ఇంట్లో అమ్మా నాన్న అన్న లేదా చెల్లి. నలుగురు మనుషుల కుటుంబంలో అనుబంధపు తీపి తెలుస్తున్నదా నేటి బాల్యానికి. నిన్న మొన్నటి వరకూ కనీసం సెలవుల్లో పెదనాన్న ఇంటికి వెళతాము, మేనమామ ఇంటికి వెళతాము అని అనేవారు. వెళ్లేవారు. ఇప్పుడు వెళ్లినా భరించే స్థితిలో బంధువులు ఉండటం లేదు. రోజులకు రోజులు అట్టి పెట్టుకునే ఓపిక ఉండటం లేదు. వీలు ఉండటం లేదు. బతుకులు బాదరబందీలో చెదిరిన బంధాలలో బాల్యం చాలా విలువైన అనుబంధాలను మిస్ అవుతూ ఉంది. ‘మనవాళ్లు’ అనే భావన ఎప్పుడూ పిల్లలకు భద్రతను ఇస్తుంది. నన్ను ప్రేమించే నా వాళ్లు ఉన్నారని రక్త సంబంధీకులను చూసి పిల్లలు సంబర పడతారు. ఉత్సాహ పడతారు. పిల్లలకు కజిన్స్ మొదటి స్నేహితులవుతారు. వారి రహస్యాలు పంచుకునే నేస్తులవుతారు. అలకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, పిల్లలు మాత్రమే ఆశించే కోరికలు ఇవన్నీ ఒట్టి అమ్మానాన్నల వల్ల తీరిపోవు. వారి ఒక్కరి సమక్షం చాలదు. బంధువులు కావాలి. రక్తసంబంధీకులు కావాలి. బాల్యం డొల్ల కాకుండా తన వారితో కూడిన జ్ఞాపకాలను వారిలో కూరాలి. వేరుగా ఉండొచ్చు కాని వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. ఇరుగు పొరుగు మీద హక్కు ఉండదు.స్నేహితుల మీద డిమాండ్ ఉండదు. కాని రక్త సంబంధీకులను నిలదీయవచ్చు. మంచిలో చెడులో భాగానికి పిలుపియ్యవచ్చు. అవి లేని ఒంటరివాళ్లుగా పిల్లలను మారుస్తున్నామేమో ఆలోచించాలి. పిల్లలు అడిగితే బర్గర్ చేతిలో పెడుతున్న తల్లిదండ్రులు ఒక బంధాన్ని చేతికి దారంలా చుడుతున్నారా? ఆలోచిద్దామా? వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. కలలు కూడా దోచుకునే... సినిమాకు వెళ్లాలంటే పెద్ద పథకం. నాన్న పర్మిషన్ అడగాలి. అమ్మకు వీలు కుదరాలి. పోపులడబ్బాలో డబ్బులు ఉండాలి. ఇంటర్వెల్లో గోల్డ్‌స్పాట్ తాగడం కోసం వారం రోజులుగా పోగేసిన చిల్లర జేబుల్లో ఉంటుంది. మసాలా వడలు, పునుగులు న్యూస్ పేపర్ కాగితంలో పట్టుకుని తింటూ సినిమా చూస్తుంటే మజా వస్తుంది. మరుసటి రోజు స్కూల్లో స్నేహితులకు ‘నేను నిన్న సినిమా చూశాను తెలుసా’ అని చెప్తే గొప్ప వస్తుంది. పిల్లలకు అతి చవకైన వినోదం సినిమా. తల్లిదండ్రులు కూడా సినిమా బడ్జెట్‌ను పెద్ద బడ్జెట్‌గా చూసేవారు కాదు. రోజువారి బాదరబందీలో పిల్లలతో సినిమాకు వెళ్లడం వారికీ ఓ ఆటవిడుపు. కాని ఇవాళ సినిమా వ్యవహారం మారిపోయింది. సింగిల్ స్క్రీన్స్ పోయాయి. మల్టీప్లెక్సులు వచ్చాయి. రేట్లు ఖరీదయ్యాయి. పాప్‌కార్న్ ప్యాకెట్, కూల్‌డ్రింక్ ధర టికెట్ కంటే ఎక్కువగా ఉంటుంది.ఒక కుటుంబం ఒకసారి సినిమాకు వెళ్లాలంటే పెద్ద ఖర్చు అవుతుంది. దాని వల్ల తల్లిదండ్రులు సినిమాకు వెళ్లడాన్ని నిరుత్సాహపరుస్తున్నారు.పిల్లలు ఒక ముఖ్యమైన ఆనందాన్ని మిస్ అవుతున్నారు.‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని ఒక సినిమాలో కవి అన్నాడు. పిల్లలకు రంగుల కలలు ఇచ్చే సినిమాను కూడా దూరం చేసే దొంగలు ఎవరో మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? వాల్‌పోస్టర్లు చూసి ఇమాజినేషన్లోకి వెళ్లగలిగిన క్రియేటివిటీని చిదిమేస్తున్నాం. ప్రభుత్వాలు పార్కులు కట్టడం లేదు. స్కూళ్లలో ప్లేగ్రౌండ్లు ఉండటం లేదు. వీధుల్లో ట్రాఫిక్. ఆటలు దూరమైన పిల్లలు కోరే కనీస వినోదం, బయటకు వెళ్లే వీలు సినిమా. అది కూడా తప్పించి టీవీ లేదా ఫోన్లో వారికి దొరికింది చూసే వీలు కల్పిస్తూ కంటి జబ్బులకు కారణం అవుతున్నాం. సినిమా బాల్యంలో ఒక ముఖ్య జ్ఞాపకం. ఇవాళ ఎంతమంది పిల్లలకు ఆ జ్ఞాపకం ఉంటోంది? కత్తి యుద్ధాలు చేసే హీరోను చూసి ఇంటికొచ్చి చీపురుపుల్లలు పట్టుకునేవారు. టేప్ రికార్డుల్లో పాట వస్తుంటే డాన్స్ చేసేవారు అటకెక్కిన ఆటలు చింటూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఆ రోజు చింటూకి చాలా సంతోషంగా ఉంది. అమ్మనాన్నలతో కలిసి సినిమాకు వెళ్లాడు. బయట ఐస్‌క్రీమ్ ఇప్పించాడు నాన్న. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో క్రికెట్ బ్యాట్, బాల్ కొనిచ్చాడు. బ్యాట్ పట్టుకోగానే చింటూ ముఖం మతాబులా వెలిగిపోయింది. బ్యాట్‌ని ఎడమచేత్తో ఛాతీమీదుగా గట్టిగా పట్టుకున్నాడు. బాల్ని షర్ట్ జేబులో కుక్కుతుంటే ‘జేబు చిరుగుతుందిరా! నే పట్టుకుంటా’ అని తల్లి అంటే ‘ఊహూ..’ అని తల అడ్డంగా ఊపి, ఆ రెంటినీ తనే గట్టిగా పట్టుకున్నాడు. అమ్మనాన్నలతో ఉన్నా చింటూ ధ్యాసంతా ఇంటి దగ్గర బంటి, చిన్ను, మున్నాలతో కలిసి ఎప్పుడెప్పుడు క్రికెట్ ఆడుకుంటానా ఉంది. ఇంటికి చేరుకునే సరికి చీకటి పడింది. తల్లిదండ్రి వారిస్తున్నా తన స్నేహితుల ఇళ్లవైపు పరిగెత్తాడు. ‘ఇప్పుడెక్కడ ఆడుకుంటారు.. రేప్పొద్దున రా!’ అనడంతో గ్రౌండ్లో ఔట్ అయిన బ్యాట్స్‌మెన్‌లో బ్యాట్‌ను చంకలో పెట్టుకొని దిగాలుగా ఇంటి ముఖం పట్టాడు. ‘రేపు సండే స్కూల్ లేదుగా ఎంచక్కా ఆడుకోవచ్చు’ అని తల్లి చెప్పడంతో మురిపెంగా ఆ రాత్రి బ్యాట్‌ని పక్కనే పెట్టుకొని పడుకున్నాడు రేపటి ఆటను కలగంటూ! తెల్లారి చింటు.. మున్నా, బంటి బ్యాట్‌కి పనిచెబుతూ కేరింతలు కొడుతున్నారు. ‘ఏంటా అల్లరి..? కాస్త పక్కకెళ్లి ఆడుకోండి..’ గద్దించాడు ఎదురింటి పెద్దమనిషి. రెండు బాల్స్ వేశారో లేదో ‘ఏం ఆటల్రా.. కాళ్లకు అడ్డంపడుతూ మమ్మల్ని పడేసేట్టున్నారు అరిచేసింది పక్కింటి ఆంటీ. ఇంతలో చిన్ను బ్యాట్‌తో బాల్ని కొడితే అది కాస్తా ఎదురింటి కిటికీకి తగిలి అద్దం పగిలింది.అంతే, ఆ ఇంటి వాళ్లతో పెద్ద గొడవ అవడంతో కోపం వచ్చి చింటూను నాలుగు బాదింది తల్లి. ‘పోయిన వారం ఇలాగే వాలీబాల్ అంటూ తీసుకొచ్చారు. ఆ బాల్‌తో ఆడుకుంటూ ఎదురుగా వచ్చే వెహికిల్‌ను చూసుకోలేదు. కాస్తయితే, ఆ వెహికిల్ కింద పడేవాడే. ఇప్పుడు చూడండి..’ అంటూ భర్తను కోప్పడి చింటూని ఇంట్లోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది. ఏడుస్తూ ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయాడు చింటూ. మరుసటి రోజు ఇంట్లో ఆడుకుంటే బాల్ వెళ్లి సామాన్లకు తగిలి, అవి పగిలిపోతున్నాయని కొట్టింది. చింటు సైకిల్ కూడా బయట తొక్కడానికి లేదు. ఎటు నుంచి ఏ వెహికిల్ వస్తుందో అని అమ్మ భయపడుతుంది. ఇంట్లో తొక్కే స్థలం ఉండదు. అప్పుడప్పుడు ఆ సైకిల్ మీద కాసేపు కూర్చుంటాడు అంతే! చుట్టూ అపార్ట్మెంట్లు. ఇరుకిరుకుగా ఉండే ఇళ్లు. గజం స్థలం దొరికినా డజన్ ఇండ్లు కట్టేస్తున్న రోజులివి. తల్లి ఈ మధ్య ఓ కొత్త ఉపాయం కనిపెట్టింది. చింటూ ఉదయం ఏడున్నరకు స్కూల్‌కి వెళితే ఇంటికి వచ్చేసరికి నాలుగు దాటిపోతుంది. రాగానే బట్టలు మార్చి పాలు, స్నాక్స్ ఇస్తుంది. ఐదు నుంచి ఏడు గంటల వరకు ట్యూషన్లో చేర్చితే సరి. చింటూ ఆటలకు, అల్లరికి ట్యూషన్ చెక్ పెట్టేసింది. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ టీవీ చూస్తూ ఉంటుంది. అమ్మ స్మార్ట్ ఫోన్లో చింటు గేమ్స్ ఆడుకుంటూ ఆమె పక్కనే కూర్చుంటాడు. ఇప్పుడు అమ్మకు నిశ్చింతగా ఉంది. పిల్లవాడు ఎటూ పోవడం లేదు. స్కూల్, ఇల్లు. ఇప్పుడు ఎవరితోనూ గొడవలు లేవు. ఉదయాన్నే బద్దకంగా లేచిన చింటూ టైమ్ అయిపోతుందనే హడావుడిలో రెడీ అవుతుంటాడు. పుస్తకాల సంచి భుజాలకు తగిలించుకొని, పాలిష్ చేసిన షూస్ వేసుకొని, వాటర్ బాటిల్‌ని మెడకు వేసుకొని.. స్కూల్ బస్సు ఎక్కేస్తాడు. మళ్లీ సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. అటు నుంచి ట్యూషన్‌కి, ఆ తర్వాత ఇంటికి. సైకిల్ తొక్కడం లేదని కాళ్లకు అడ్డుగా ఉందని అమ్మ దాన్ని అటకమీదకు చేర్చింది. దాని పక్కనే ఇప్పుడు బ్యాట్ కూడా చేరిపోయింది. ఆ పక్కనే దుమ్ము కొట్టుకుపోయిన రెండు బాల్స్.. చింటూవైపు దిగాలుగా చూస్తూ ఉన్నాయి ఎప్పుడు చింటూ చేతిలో తమకు ఊపిరి ఆడుతుందో అని. చింటూ ఒక్కడే కాదు బంటి, మున్నా, చిన్ను.. ఇప్పుడు ఎంతో మంది పిల్లల జీవిత పుస్తకంలో బాల్యం పేజీ ఆటల్లేక రెపరెపలాడుతోంది పిల్లలకు కావల్సిన ఆటవస్తువులు అయితే కొనగలుగుతున్నారు. కానీ, వాటితో ఆ పిల్లలను ఫ్రీగా ఆడుకోవాల్సినంత మైదానాన్ని ఎలా ఇవ్వగలరు. గుడి బడి గుర్తుందా? చిన్నప్పుడు శ్రీరామ నవమికి పందిళ్లలో స్నేహితులతో తాగిన తియ్యటి పానకం గుర్తుందా? నానమ్మలు, అమ్మమ్మలు చెప్పిన దేవతలు, రాక్షసుల కథలు గుర్తున్నాయా? పరీక్షలప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టి ఫస్టు మార్కు రావాలని మొక్కుకోవడం జ్ఞాపకమేనా? టీవీలో చూసిన రామాయణం, మహాభారతం, బడిలో వ్యాస రచనకో, వక్తృత్వానికో బహుమతిగా ఇచ్చిన బొమ్మల భాగవతం, ధృవచరిత్ర, భక్త మార్కండేయ పుస్తకాల జ్ఞాపకాల పుటలు ఇప్పటికీ తెరుచుకునే ఉన్నాయా? సంపూర్ణ రామాయణం సినిమాలో సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తికెళ్లిపోయే సీను చూసి ఏడ్చిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే అనిపిస్తోంది కదా! దేవుళ్లకీ కష్టాలు తప్పవనీ, అయితే అవి ఎంతోకాలం ఉండవనీ, రాక్షసులు, దుర్మార్గులు చివరికి చావక తప్పదనీ పుస్తకాలలో చదివిన, సినిమాలలో చూసిన ఘట్టాలు గుర్తుండే ఉంటాయి కదా! కృష్ణాష్టమి వేడుకలలో ఉట్టి కొట్టడం, హనుమజ్జయంతికి ఉపవాసాలుండి కొబ్బరి కాయలు కొట్టి, బోలెడంత బలం వస్తుందని గట్టిగా నమ్మడం, ఆంజనేయస్వామి అంత మహాసముద్రం మీదుగా ఎగురుకుంటూ లంకకు చేరడం, తోకతో నిప్పంటించటం... ఇవన్నీ మన బాల్యజ్ఞాపకాలు కదా... అవి ఎంత బలాన్నిచ్చేవి. మానసికంగా ఎంత ధైర్యాన్ని నూరిపోసేవి! జబ్బు చేస్తే తగ్గిపోవాలని మొక్కుకోవడం, ఆ తర్వాత కుటుంబమంతా కలసి తిరుపతి కొండకో, అన్నవరానికో వెళ్లి మొక్కు తీర్చుకుని రావడం ఎంత చేదు, తీపి కలగలసిన జ్ఞాపకం? ఇప్పుడవన్నీ ఏవి? ప్రసాదం కోసం గుడికెళ్లడం, ప్రసాదంతోనే పొట్ట నింపుకోవడం, గణపతి నవరాత్రుళ్లలో భజన బృందాలతో గొంతు కలపడం, గుళ్లో పాడటం కోసం పొద్దున్నే లేచి త్యాగరాజు, అన్నమయ్య కృతులు సాధన చేయడం తలచుకుంటుంటే ఇప్పటికీ గొంతులోనుంచి తొంగి చూసే ఆ గమకాలను ఆపగలమా? మైకులో భగవద్గీత శ్లోకాలు పాడటం, పీర్ల పండుగప్పుడు స్నానాలు చేసి పీర్లు పట్టుకుని భక్తితో ఊగిపోతూ గుండాలు తొక్కుతుంటే కళ్లు ఇంతింత చేసుకుని చూడటం, రంజానుకు స్నేహితులు తెచ్చిన ఖీర్ తాగిన తియ్యటి జ్ఞాపకం, క్రిస్టమస్ పండక్కి భక్తిగీతాలు పాడటం, క్రిస్టమస్ ట్రీ తయారు చేయడం... ఇవన్నీ ఇప్పుడేమైనాయి? జ్వరం వచ్చినప్పుడు గుళ్లో పూజారిగారు నీకేం కాదురా, రేప్పొద్దుటికల్లా తగ్గిపోతుంది పో అంటూ విభూతి పెడితే తెల్లారేసరికి జ్వరం జారిపోవడం ఎంత నమ్మకం కలిగించేది? ఆధ్యాత్మికతలు ఎప్పుడూ మంచి భావనలనే పాదుకొల్పుతాయి. మన ప్రయత్నం మనం చేద్దాం.. ఆ తర్వాత అన్నిటినీ ఆ పై వాడున్నాడనే ధైర్యం ఓ టానిక్కు. చెయ్యరాని పనులు చేస్తే కళ్లు పోతాయి అనే భయం ఉంటే చెడ్డపనుల జోలికి పోతారా ఎవరైనా? బాల్యం నుంచి భక్తిగా, ఆధ్యాత్మిక వాతావరణంలో పదిమందితో కలిసి మెలిసి తిరిగితే అదెంత బలం? ఎంత ధైర్యం? బిట్టర్ చాక్లెట్ ‘‘ఎందుకలా ఉన్నావ్?’’ పన్నెండేళ్ల భూదేవి అడిగింది బాల సదన్ చూరు కింద అరుగు మీద దిగాలుగా కూర్చున్న ఆకాశ్‌తో. వాడికీ పదకొండు, పన్నెండేళ్లుంటాయేమో!‘‘ప్చ్.. ’’అన్నాడు నిర్లిప్తంగా చేతిలో ఉన్న రేపర్తియ్యని చాక్లెట్‌ను అటూఇటూ తిప్పుతూ.‘‘ప్చ్.. అంటే’’ అంది ఆకాశ్ పక్కనే కూర్చుంటూ. ‘‘ఏం లేదు’’అని తన పక్కనే కూర్చున్న ఆమెను అయోమయంగా చూస్తూ అన్నాడు.‘‘ఆ చాక్లెట్ ఎవరు ఇచ్చారు?’’ మళ్లీ ప్రశ్న భూదేవి నుంచి.‘‘కావాలా.. తీసుకో’’ అంటూ ఇవ్వబోతుంటే ‘‘నా దగ్గరా ఉంది..’’కుర్తీ జేబులోంచి తీస్తూ చూపించింది. ‘‘కొత్తగా జాయినయ్యావా? ఎవరు తీసుకొచ్చారు?’’ అడిగాడు ఆసక్తిగా.ఈసారి ఆ అమ్మాయి జవాబు చెప్పకుండా దిక్కులు చూసింది. ‘‘ఇప్పుడే కనిపిసున్నావైతే అడిగా.. ’’ ఆకాశ్. అయినా ఆమె నుంచి సమాధానం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆచాక్లెట్ను కుడిచేయి బొటనవేలు, నాలుగు వేళ్ల మధ్య ఉంచి ఆడిస్తోంది. ‘‘గర్ల్స్ అటువైపే ఉండాలి. సాయంత్రం ఆరు దాటితే ఇటు రాకూడదు’’చెప్పాడు ఆకాశ్.‘‘ఊ... తెలుసు. ఇందాక ఇటువైపు వస్తుంటే చెప్పారు.ఏడవుతోంది బాయ్స్ వైపు వెళ్లొద్దు అని’’అంది. ‘‘ఎందుకలా ఉన్నావ్?’’ మళ్లీ మొదటి ప్రశ్న భూదేవి నుంచి. ‘‘అమ్మ గుర్తొస్తోంది’’ గద్గదిక స్వరంతో ఆకాశ్. కాస్త చేరువగా జరిగి.. మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. ఆ స్పర్శ.. ఆలంబనకు ఆకాశ్ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. మొహం అటువైపు తిప్పి ఆ వైపు భుజంతో కళ్లు తుడుచుకున్నాడు. వాడి పరిస్థితి అర్థమైంది అమ్మాయికి. ‘‘అమ్మ, నాన్న.. ’’ అంటూ ఆగింది. ‘‘అమ్మ చచ్చిపోయింది. నాన్నే చంపేశాడు. నాన్న జైల్లో ఉన్నాడు’’ దూరంగా ఆగిపోయిన నిర్మాణం ముందున్న ఇసుక కుప్పల వైపు చూస్తూ చెప్పాడు ఏ భావం లేకుండా!‘‘ఎప్పుడు?’’ అడిగింది వాడికి కొంచెం ఎడంగా జరుగుతూ. ఏంటీ ఎప్పుడు? అన్నట్టుగా చూశాడు. గ్రహించిన ఆమె ‘‘అమ్మ ఎప్పుడు చనిపోయింది అని’’ వివరంగా అడిగింది. ‘‘త్రీ ఇయర్స్ అవుతోంది’’ చెప్పాడు. ‘‘అప్పటి నుంచీ ఇక్కడే ఉన్నావా?’’ ఆ అమ్మాయి.మళ్లీ ‘‘ప్చ్’’ అంటూ అడ్డంగా తలూపాడు. ‘‘మరి’’ అన్నట్టు చూసింది. ఆరు చేతివేళ్లు చూపిస్తూ ‘‘సిక్స్ మంత్స్ అవుతోందంతే ఇక్కడికి వచ్చి. అంతకుముందు బాబాయ్ వాళ్లింట్లోనే ఉన్నాను. బాబాయే ఇక్కడ దింపి వెళ్లాడు’’చెప్పాడు. ‘‘కానీ.. కానీ’’ ఆగాడు. ‘‘ఏమైంది’’ అంటూ మళ్లా ఓరగా జరిగి ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది. ‘‘నాకు ఇక్కడ నచ్చట్లేదు. పారిపోవాలనిపిస్తోంది’’ ఈసారి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ‘‘ఒరేయ్ .. ఏడ్వకురా.. పర్లేదు. సర్దుకుంటుంది’’ అంటూ వాడి చేతిలోని చాక్లెట్ తీసుకుని రేపర్ విప్పి వాడికివ్వబోయింది. ‘‘ఛీ ..’’అంటూ విసిరికొట్టి అక్కడి నుంచి ముందుకు పరిగెత్తి బాదాం చెట్టు కింద ఆగాడు. హతాశురాలైంది భూదేవి. తనూ వాడి దగ్గరకు పరిగెత్తి.. ‘‘ఏమైందిరా’’ కంగారుగా అడిగింది. ‘‘అది వాడిచ్చిన చాక్లెట్. చేదు.. వాక్’’అన్నాడు వస్తున్న ఏడుపును ఆపుకొనే ప్రయత్నం చేస్తూ. ‘‘వాడెవడు?’’అడిగింది. ‘‘బాలసదన్ ప్రిన్సిపాల్ తమ్ముడు. నేనొచ్చినప్పటి నుంచీ... నన్ను.. ఆ ఇసుక తెన్నెల వైపు తీసుకెళ్లి.. నా బట్టలు.... ’’ చెప్పలేక ఆగిపోయాడు. ఏడుస్తూ నేల మీద పడిపోయాడు. ‘‘నాకు అమ్మ కావాలి అక్కా.. అమ్మ కావాలి. నేను నాన్న దగ్గరుండాలి’’ అంటూ.భూదేవి కళ్లల్లోనూ నీళ్లే. తన దగ్గరున్న చాక్లెట్ వంక చూసుకుంది. అలాంటి చాక్లెట్ ఇచ్చే.. ఆర్నెల్ల కిందట ఓ అంకుల్ తనను తీసుకెళ్లిపోయాడు. పుణే అట.. అక్కడ ఎవరో ఆంటీకి అమ్మేశాడు. ఈ ఆర్నెల్లు ఎందరో అంకుల్స్.. చాక్లెట్స్ ఇచ్చి.. నా బట్టలు కూడా.. ’’ భూదేవి మెదడు గతాన్ని గుర్తుచేస్తుంటే.. కళ్లు నీళ్లను కుమ్మరిస్తున్నాయి.. అసంకల్పితంగానే ఆ అమ్మాయీ ఆ చాక్లెట్‌ను విసిరి కొట్టింది. మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. చిట్టీ... కొట్టేది బట్టీ ‘‘మా బుజ్జిగాడు రోబోలోని చిట్టీ రా. ఎంత షార్ప్ గ్రాస్పింగ్ పవర్ తెల్సా? అలా చూస్తే ఇలా పట్టేస్తాడు. ఎప్పుడూ చదువే. ఆ చదువు తప్ప మరో లోకం తెలియదు’’ ఫ్రెండ్స్ ఇండ్లకు వెళ్లినప్పుడు వినిపించే మురిపెపు మాటలివి. అవి విన్నవాడికి తన కొడుకు గుర్తొస్తాడు. ఆ రోబోగాడెవడో కనీసం కళ్లతో స్కాన్ చేశాడు. కానీ నా కొడుక్కు ఇలా పుస్తకాన్ని టచ్ చేస్తే... అలా మెదడులోకి మెటీరియల్ పంపే ట్యుటోరియల్ ఏదైనా దొరికితే బాగుండని ఆశ.పే‘రెంట్స్’ అనే పేరున్నందువల్ల అవసరాలకనీ రెంట్స్ పే చేస్తూ చదువులకు బిల్స్ పే చేస్తున్నందున పే చేసేదానికి ఫలితం తప్పక రావాలన్నదే ఇప్పటి తల్లిదండ్రుల ఆశ. అందుకే వాళ్లు కార్పొరేట్స్కూళ్లూ, కాలేజీలలో బందీలయ్యారు. ఇంకా విపరిణామం ఏమిటంటే... నెక్ట్స్ ఇయర్ ఇంటర్లోకి వస్తున్న పేరెంట్స్ ఫోన్ నంబర్లు సంపాదించి, వాడి క్వార్టర్లీ ఎగ్జామ్స్ కంటే అర్లీగానే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు చిన్ననాటి ఆటలు చదువులకు సాయం చేస్తున్నాయా లేదా చూద్దాం. గోడకేసి బంతి కొడుతూ ఆటాడినవాడికి న్యూటన్స్ థర్డ్‌లా చిన్నప్పుడే వచ్చేసి ఉంటుంది. గోలీలాడుతున్నప్పుడు గీసిన బాక్స్‌లో మనం గురి చూసిన గోలీని కొడితే... అసలది బయటకు వచ్చిన మన కొట్టుడుగోలీ అక్కడే కూర్చుండిపోయి మనం ఔటయ్యిన్నాడు ఉక్రోశం మాత్రమే ఉంటుందేమోగానీ... ఇంటర్‌కొచ్చాక మొమెంటమ్, ఫోర్సూ, డైరెక్షన్ అనే వెక్టార్స్ గురించి తెలిసిన నాడు అలనాటి ఉక్రోశం గుర్తొచ్చి ఉల్లాసం మిగులుతోంది. ఎప్పుడూ పదేళ్ల నాడు కాలేజీలో చదవబోయే అడ్వాన్స్డ్ చదువులన్నింటికీ అడ్వాన్స్‌గా గల్లీల్లో మనం ఆల్రెడీ ప్రాక్టికల్స్ చేసే ఉన్నామని తెలిసిపోతుంది. దాంతో చదువు గోలీలాటంత ఈజీ అవుతుంది. కాన్సెప్ట్ బుర్రలోకి గిల్లీదాండంత సిల్లీగా ఎక్కిపోయి సింపులవుతుంది. ఈలోపు మావాడు రోబో అంటూ స్వయానా ఆ తండ్రే చెబుతున్న మాటలు వింటుంటే... అదీ నిజమే కదా అని జాలేస్తుంది. సంస్కారం అడ్డొచ్చిగానీ... లేకపోతేనా ‘‘ఒరే పేరెంట్స్లారా... వాడు ఒక రకంగా నిజంగానే రోబో అవునో కాదో తెలియదు గానీ... వాడు మాత్రం కచ్చితంగా ఒరిజినల్లంత విలువ లేని కాపీలను సృష్టించే జిరాక్స్ మెషీన్ రా’’ అని అరవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంటర్లోకి వస్తున్న పేరెంట్స్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు చేస్తున్నారు. -
పిడుగుల దినోత్సవం
అల్లరి చేసే చిన్నారులను చిచ్చర పిడుగులతో పోలుస్తారు. కొందరు పిల్లలు సాధించిన విజయాలను చూస్తే కొంతమంది పిల్లలు పుట్టుకతో పిడుగులు. అనుకోక తప్పదు. కొందరు చిన్నారులు వయసులో మాత్రమే చిన్నవాళ్లు. పెద్దలు సైతం సాధించలేని విజయాలను సొంతం చేసుకున్న ఘనత వారిది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించిన చిన్నారులు కొందరు, మేధాశక్తితో మేధావులనే మెప్పించిన వాళ్లు కొందరు, కాల్పనిక శక్తిని చాటిన వారు కొందరు, కళా సేవా రంగాల్లో కొందరు... ఆటలాడుకునే వయసులో ఆడుతూ పాడుతూనే అద్భుతాలను సాధించిన కొందరు చిన్నారుల విజయగాథలు బాలల దినోత్సవం సందర్భంగా... శ్రవణ్–సంజయ్ కుమరన్ శ్రవణ్ కుమరన్, సంజయ్ కుమరన్ అన్నదమ్ములు. చెన్నైలో ఉంటారు వీళ్లు. శ్రవణ్ వయసు పదహారేళ్లు, సంజయ్ వయసు పదిహేనేళ్లు. సాధారణంగా ఈ వయసులోని పిల్లల చేతికి మొబైల్‌ఫోన్ చిక్కితే వీడియోగేమ్స్ ఆడటం లేదా చాటింగ్ చేయడంతో కాలక్షేపం చేస్తారు. ఈ గడుగ్గాయిలు అలాంటిలాంటి వాళ్లు కాదు. బడికి వెళ్లే వయసులోనే మొబైల్ ఫోన్లతో ఆటలాడుకున్నారు. అంతటితో ఆగలేదు. మొబైల్ ఫోన్లలోని రకరకాల యాప్స్ వాళ్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి యాప్స్ స్వయంగా రూపొందించాలని బలంగా అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రకరకాల మొబైల్‌ఫోన్స్‌పై ప్రయోగాలు ప్రారంభించారు. సొంతంగా యాప్స్ రూపొందించారు. వాటిని బంధు మిత్రులకు పరిచయం చేశారు. యాప్స్ అద్భుతంగా పనిచేస్తుండటంతో ఈ గడుగ్గాయిలకు బంధు మిత్రుల నుంచి ప్రోత్సాహం దొరికింది. తల్లి దండ్రుల సహకారం కూడా తోడైంది. దాదాపు డజను వరకు యాప్స్ రూపొందించారు. తాము రూపొందించిన యాప్స్‌ను స్వయంగా తామే మార్కెట్లోకి విడుదల చేయడానికి వీలుగా 2012లో ‘గో డైమెన్షన్స్’ పేరిట కంపెనీని ప్రారంభించారు. దానికి ఈ అన్నదమ్ములే సీఈవోలు. దేశంలోని అతి పిన్నవయస్కులైన సీఈవోలుగా రికార్డులకెక్కారు. శ్రవణ్ ఇప్పుడు పన్నెండో తరగతి, సంజయ్ పదో తరగతి చదువుకుంటున్నారు. వీళ్లిద్దరి విజయగాథ ఫోర్బ్స్ మ్యాగజీన్కెక్కిందంటే వీళ్లు సాధించిన ఘనత ఏ స్థాయికి చెందినదో ఊహించుకోవాల్సిందే. వీళ్లు రూపొందించిన యాప్స్ అన్నింటిలోకీ ఆహార వృథాను అరికట్టడానికి వీళ్లు రూపొందించిన ‘గో డొనేట్’ యాప్ విశేషంగా ప్రశంసలు పొందింది. మెలిటా టెస్సీ పదిహేనేళ్ల వయసులో ఉండే చాలామంది పిల్లలు వ్యాసరచన రాయడానికే తంటాలు పడతారు. చెన్నైకి చెందిన చిన్నారి మెలిటా టెస్సీ మాత్రం ఆ వయసులో ఏకంగా నవల రాసేసింది. చిన్నారుల కాల్పనిక శక్తికి నిదర్శనంగా నిలిచిన ఆమె నవల ‘బ్యాటిల్ ఆఫ్ ది స్ఫియర్స్ ప్రతులు దేశవ్యాప్తంగా పలు పుస్తక ప్రదర్శనల్లోను, బుక్స్టోర్స్లోను, ఆన్లైన్లోను ఇప్పటికీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మెలిటాకు ఇష్టమైన వ్యాపకం చదవడం. తొమ్మిదేళ్ల వయసులోనే ‘డెయిరీ ఆఫ్ వింపీ కిడ్’ నవల చదివింది. ఆ తర్వాత ఇక ఆగలేదు. దొరికిన నవలలను, కథల పుస్తకాలను వదలకుండా చదవసాగింది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి కోరిన పుస్తకాన్నల్లా ఆమెకు సమకూర్చారు. చదవడంతో సరిపెట్టుకోకుండా స్వయంగా ఏదైనా రాస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో పదమూడేళ్ల వయసులో రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టింది. పదిహేనేళ్ల వయసుకే పర్యావరణ పరిరక్షణ ముఖ్యాంశంగా తొలి కాల్పనిక నవలను విజయవంతంగా రాసేసింది. నోషన్ ప్రెస్ ప్రచురణకర్తలకు ఈ నవల నచ్చడంతో వారు దీనిని ప్రచురించారు. కాల్పనిక సాహిత్యం అంటే తనకు చాలా ఇష్టమని, ‘హ్యారీ పాటర్’ రాసిన జేకే రౌలింగ్ తన అభిమాన రచయిత్రి అని చెబుతుంది మెలిటా. కౌటిల్య పండిట్ ‘గూగుల్ బోయ్’గా ప్రసిద్ధి పొందిన కౌటిల్య పండిట్ సాధించిన సంచలన విజయాలు ఎన్నెన్నో ఉన్నాయి. హరియాణాకు చెందిన కౌటిల్య పండిట్ వయసు పదకొండేళ్లు. కొన్నాళ్లు కోహండ్ గ్రామంలో తన తండ్రి సతీశ్ శర్మ నడుపుతున్న ఎస్డీ మోడర్న్ స్కూల్లో చదువుకున్నాడు. ప్రస్తుతం చండీగఢ్‌లోని భవన్ విద్యాలయలో ఆరో తరగతి చదువుకుంటున్నాడు. అసాధారణమైన జ్ఞాపక శక్తితో బాలమేధావిగా గుర్తింపు పొందాడు. తన ఐదేళ్ల వయసు నుంచే వివిధ ప్రదర్శనల్లో ఈ చిచ్చర పిడుగు చూపిన ప్రతిభా పాటవాలు టీవీ చానెళ్లకు పాకాయి. ఇంత చిన్న వయసులోనే గొప్ప జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్న కౌటిల్య పండిట్ మేధా సామర్థ్యాన్ని కురుక్షేత్ర వర్సిటీ సైకాలజీ విభాగం నిపుణులు స్వయంగా పరిశీలించారు. కౌటిల్య ఐక్యూ 130గా వారు తేల్చారు. పదేళ్ల వయసు పిల్లల్లో ఈ స్థాయి ఐక్యూ అత్యంత అరుదని చెప్పారు. సోనీ టీవీ ‘ఎంటర్టైన్మెంట్ కేలియే కుbŒ∙భీ కరేగా’ కార్యక్రమానికి కౌటిల్యను ఆహ్వానించింది. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో క్షణమైనా ఆలోచించకుండానే అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెబుతూ అమితాబ్ బచ్చన్‌నే నోరెళ్లబెట్టేలా చేశాడు ఈ చిచ్చరపిడుగు. కౌటిల్య ప్రతిభకు ముచ్చటపడిన గణితవేత్త ఆనంద్‌కుమార్ తాను నడుపుతున్న ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్కి ఆహ్వానించారు. ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం సిద్ధపడుతున్న ‘సూపర్ 30’ విద్యార్థులను కౌటిల్య ప్రతిభా పాటవాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం జ్ఞాపకశక్తి మాత్రమే కాదు, కౌటిల్యకు రాజకీయ పరిజ్ఞానం, సామాజిక చైతన్యం కూడా ఎక్కువే. ఆ చైతన్యంతోనే గుర్గావ్లో ‘క్లీన్ ఎయిర్ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఆనంద్ గంగాధరన్, మోహక్ భల్లా వీళ్లిద్దరూ బాల్య మిత్రులు. ఢిల్లీలోని మౌంట్ కార్మెల్ స్కూల్లో క్లాస్మేట్స్. సాధారణంగా పదో తరగతి విద్యార్థులు సాధారణంగా స్కూలు, ట్యూషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అరుదుగా దొరికే తీరిక వేళల్లో సినిమాలు, ఆటలు వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. ఆనంద్ గంగాధరన్, మోహక్ భల్లా నాలుగేళ్ల కిందట పదో తరగతిలో ఉండేవారు. అప్పుడు వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మనుషులు నడిచేటప్పుడు కూడా శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని ఏదో రీతిలో సద్వినియోగం చేయవచ్చు కదా అని ఆలోచించారు. ఆలోచన వచ్చిందే తడవుగా ప్రయోగాలు ప్రారంభించారు. పోర్టబుల్ మొబైల్ చార్జర్ రూపొందించారు. వీరు రూపొందించిన చార్జర్‌ను షూస్‌కు అనుసంధానించారు. నడుస్తూనే ఈ చార్జర్ ద్వారా మొబైల్ ఫోన్ల చార్జింగ్ చేసుకోవచ్చు. మామూలు చార్జర్లతో పోలిస్తే ఈ చార్జర్ రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. మొబైల్ ఫోన్ పూర్తిగా చార్జ్ కావడానికి ఇంట్లో గంటసేపు చార్జింగ్ పెట్టాల్సి వస్తే, వీరు తయారు చేసిన చార్జర్‌లో పెట్టి, అరగంట నడక సాగిస్తే చాలు. ఆనంద్, మోహక్‌లు రూపొందించిన ‘వాకీ మొబి చార్జర్’ వార్తలకెక్కి మేధావులను ఆకట్టుకుంది. హృదయ్ పటేల్ యుద్ధ క్రీడల్లో ఘనత సాధించాలంటే ఎంతో ఓపిక, అకుంఠిత దీక్షతో ఏళ్ల తరబడి సాధన కావాలని అంతా నమ్ముతారు. పసితనం వీడని హృదయ్ పటేల్ తైక్వాండో తరగతిలో శిక్షణ ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే అంతర్జాతీయ పోటీలో పాల్గొని ఏకంగా బంగారు పతకాన్ని సాధించి ఆరితేరిన చాంపియన్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బెంగళూరులో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన ఈ చిచ్చర పిడుగు అల్లరి రోజు రోజుకీ పెరుగుతుండటంతో కొంతైనా అల్లరి తగ్గించుకుంటాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతడిని 2016 నవంబర్‌లో తైక్వాండో కోచింగ్ సెంటర్లో చేర్చారు. అప్పటికి అతడి వయసు మూడేళ్ల లోపే. కోచింగ్‌లో చేరిన మరుసటి సంవత్సరమే, అంటే 2017 జూలైలో దక్షిణ కొరియాలో జరిగిన చున్చియాన్ కొరియా ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. పోటీలో పాల్గొన్న వారందరిలోనూ హృదయ్ పటేల్ అతి పిన్న వయస్కుడు కావడంతో అక్కడి మీడియాను ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులందరూ అతడినే ఆసక్తిగా గమనించసాగారు. వివిధ దేశాల నుంచి వచ్చిన అరవై మంది చాంపియన్లను అవలీలగా ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకోవడంతో హృదయ్ పటేల్ రికార్డులకెక్కాడు. ఆ ఘనవిజయంతో అంతర్జాతీయ మీడియాలో అతడి పేరు మార్మోగింది. నిజానికి కొరియా వెళ్లడానికి అతడికి స్పాన్సర్షిప్ దొరకలేదు. కనీసం ఆరేళ్లయినా నిండితే గానీ అంతర్జాతీయ పోటీలకు వెళ్లడానికి స్పాన్సర్షిప్ ఇవ్వలేమని ఒక యువజన సంస్థ చేతులెత్తేసిందని హృదయ్ తల్లి పింకాల్ చెప్పారు. అయితే, హృదయ్ ప్రతిభపై నమ్మకం ఉంచిన తన భర్త నవీన్‌భాయ్ పటేల్ అప్పు చేసి మరీ అతడిని కొరియా తీసుకువెళ్లాడని తెలిపారు. తైక్వాండోలో చేరినా అతడి అల్లరి ఏమాత్రం తగ్గలేదని మురిపెంగా చెబుతారామె. హృదయ్ పటేల్ ప్రస్తుతం బెంగళూరులోని జైన్ హెరిటేజ్ స్కూల్లో ఎల్కేజీ చదువుకుంటున్నాడు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నిస్తే ఈ గడుగ్గాయి ‘నా దగ్గర ఒకే బెల్టుంది. అది గ్రీన్ బెల్ట్’ అని బదులిస్తాడు. అది తైక్వాండోలో సాధించినదే. అనీష్ భాన్వాలా గురి చూసి లక్ష్యాన్ని ఛేదించడం ఏమంత తేలికైన విషయం కాదు. హరియాణా కుర్రాడు అనీష్ భాన్వాలాకు మాత్రం అదో సాదాసీదా ఆట. పట్టుమని పదిహేనేళ్ల వయసులోనే ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ షూటింగ్ పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. కామన్వెల్త్ షూటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. గత ఏడాది నుంచే అనీష్ భారత షూటింగ్ టీమ్‌లో కొనసాగుతున్నాడు. కర్నాల్‌లోని సెయింట్ థెరిసా కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకుంటున్న అనీష్ గత ఏడాది జరిగిన కామన్వెల్త్ పోటీల్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. జర్మనీలో గత ఏడాది జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో రెండు రజత పతకాలను, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఏడాది సిడ్నీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో వ్యక్తిగతంగా బంగారు పతకాన్ని, టీమ్ తరఫున రజత పతకాన్ని సాధించాడు. అనీష్ చిన్నప్పటి నుంచే షూటింగ్‌పై ఆసక్తి చూపేవాడు. అతడి ఆసక్తిని గమనించిన తండ్రి తెలిసినవారి వద్ద నుంచి పిస్టల్‌ను ఎరువు తెచ్చి, స్కూలు మైదానంలో షూటింగ్ రేంజ్ వద్ద సాధన చేయించేవాడు. ç శ్రుతి పాండే రెండేళ్ల వయసులో చిన్నారులు బుడి బుడి అడుగులు వేస్తుంటారు. మెల్లగా పరుగులు తీయడానికి ఉత్సాహం చూపుతారు. అలాంటి బుడి బుడి అడుగుల వయసులో శ్రుతి పాండే మాత్రం యోగాసనాలు వేయడం ప్రారంభించింది. అలహాబాద్‌లో ఆమె నర్సరీలో ఉన్నప్పుడే స్కూల్లో ఆమె ప్రదర్శనకు టీచర్లు ముగ్ధులయ్యారు. ఆమెకు నాలుగేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు ఆమెను గురు హరిచేతన్ యోగా శిక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె ప్రదర్శించిన యోగాసనాలకు గురువు సైతం అబ్బురపడ్డారు. వెంటనే ఆమెను తన కేంద్రంలో చేర్చుకుని శిక్షణ ప్రారంభించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అత్యంత క్లిష్టమైన యోగాసనాలను అవలీలగా వేయగలగడం సాధించింది. ఇక ఆమెకు నేర్పాల్సిందేమీ లేదని గురువు నిర్ధారించి, ఆమెనే శిక్షకురాలిగా తయారు చేశారు. తన ఆరేళ్ల వయసులోనే, 2011లో బ్రహ్మ సరస్వతి ధామ్‌లో దాదాపు ముప్పయి మందికి యోగా శిక్షణ ప్రారంభించి, ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలైన యోగా శిక్షకురాలిగా రికార్డులకెక్కింది. ఆమె వద్ద శిక్షణ పొందిన తొలి బృందంలో అన్ని రకాల వయసుల వారు, అన్ని రకాల వృత్తుల వారు ఉన్నారు. వాళ్లలో వ్యాపారవేత్తలు, గృహిణులు కూడా ఉన్నారు. చిన్న వయసు నుంచే యోగా ప్రారంభించడం మంచిదని, దేశంలోని ప్రతి పాఠశాలలోనూ యోగా శిక్షణను తప్పనిసరి చేయాలని కూడా ఆమె అంటుంది. శుభేందుకుమార్ సాహు సాధారణంగా హైస్కూల్ పిల్లలు సైన్స్ పాఠాలను చదువుకోవడంతోనే సరిపెడతారు. ఒడిశాలోని గంజాం జిల్లా హింజిలికి చెందిన శుభేందుకుమార్ సాహు మాత్రం అక్కడితో సరిపెట్టుకోలేదు. సైన్స్ పాఠాల్లో చదువుకున్న ఆవిష్కరణలు, వాటి వెనుకనున్న శాస్త్రవేత్తల గాథలు అతడిని ఆకట్టుకున్నాయి. తాను కూడా నలుగురికీ ఉపయోగపడేలా ఏదో ఒకటి ఆవిష్కరించాలనుకున్నాడు. ఆ తపనతోనే రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరానికి రూపకల్పన చేశాడు. కోల్‌కతాలో జరిగిన సైన్స్ ప్రదర్శనలో తాను రూపొందించిన పరికరాన్ని ‘గిఫ్ట్ ఫర్ ఫార్మర్స్’ పేరిట ప్రదర్శించాడు. సులువుగా విత్తనాలు నాటడానికి, నేల దున్నడానికి, పురుగుమందులు చల్లడానికి పనికొచ్చే ఈ యంత్రం పనితీరు శాస్త్రవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీనికి గుర్తింపుగా 2016లో శుభేందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ ఎచీవ్‌మెంట్స్’ సత్కారం లభించింది. రాష్ట్రపతి అవార్డు రావడంతో శుభేందు జాతీయ మీడియాలో మెరిశాడు. శుభేందుకు చిత్రలేఖనం, వ్యాసరచన వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. జయకుమార్ పేదరికంలో మగ్గుతూ చదువుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి పరిస్థితుల్లో చదువుకుంటూనే ఆవిష్కరణలు చేయడమంటే అద్భుతమనే చెప్పాలి. శివకాశికి చెందిన జయకుమార్ అలాంటి అద్భుతాన్నే సాధించాడు. రెండేళ్ల కిందట తక్కువ ఖర్చుతో మంటలను ఆర్పే పరికరాన్ని రూపొందించాడు. అప్పడు అతడు తొమ్మిదో తరగతి విద్యార్థి. జయకుమార్ తల్లి బాణసంచా కర్మాగారంలో దినసరి కూలి. కొన్నేళ్ల కిందట బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె గాయపడింది. తన తల్లిలాగ మరెవరూ అగ్నిప్రమాదాల్లో గాయపడరాదని తలచిన శివకుమార్ తన స్కూల్ టీచర్ సహాయంతో తక్కువ ఖర్చుతోనే అగ్నిమాపక యంత్రాన్ని రూపొందించాడు. ఈ పరికరం రూపొందించినందుకు శివకుమార్‌కు 2016లో నేషనల్ యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. సైరి రహాంగ్డాలే అక్కడక్కడా బాల కళాకారులు ఉండటం అరుదే గాని, వారు తమ తమ కళా ప్రదర్శనలకు, వాటి ద్వారా వచ్చే విజయాలకు మాత్రమే పరిమితమైపోతుంటారు. పదిహేనేళ్ల సైరి రహాంగ్డాలే ధోరణి ఇందుకు పూర్తిగా భిన్నం. భరతనాట్యంలో ఇప్పటికే ప్రతిష్ఠాత్మక ఘన విజయాలు సాధించిన సైరి, తన నాట్యప్రదర్శనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తోంది. నాట్య ప్రదర్శనల ద్వారా డబ్బు రావడం మొదలయ్యాక, తాను ఆ డబ్బును చుట్టు పక్కల పేద పిల్లల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నానని చెప్పిందని, ఆమె సంకల్పానికి తాము వీలైనంతగా చేయూతనిస్తున్నామని సైరి తల్లిదండ్రులు మీతా, ప్రకాశ్ రహాంగ్డాలే చెప్పారు. తమిళనాడులోని సేలంలో చదువుకుంటున్న సైరి పంచరత్న అవార్డు, నిత్యశ్రీ అవార్డు వంటి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకుంది. -
బాల్యం బాగుంటేనే భవిష్యత్తు
బాల్యం అమూల్యం, ఆ అమూల్యమైన బాల్యం దృఢంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుం టుంది. బాల్యం బాగా లేకపోతే పౌరులు కూడా ఊసురోమని తయారౌతారు. మన నాయకులు స్వచ్ఛ భారత్ అంటున్నారు. బేటీ బచావ్– బేటీ పడావ్ అంటున్నారు. ఇంకా చాలా నినాదాలిస్తున్నారు. కానీ ఈ నినాదాలు నిజరూపం దాల్చడం లేదు. 28 శాతం మంది పిల్లలు బాల కార్మికులుగా బతుకు బండిని లాగుతున్నారనీ, అమ్మాయిల్లో 31 శాతం మందికి బాల్య వివాహాలు జరుగుతున్నాయనీ, పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒకరు మొదటి జన్మదినం చూడకుండానే కన్నుమూస్తున్నారనీ, 11 శాతం మంది పిల్లలు మాఫియా చేతుల్లో మగ్గిపోతున్నారనీ, సర్కారు వారి గణాం కాలే సెలవిస్తున్నాయి. పరిస్థితి ఈ విధంగా ఉంటే పెద్దలు నినాదాలకే పరిమితమైతే పిల్లలు బాగుపడేదెన్నడు? సత్పౌరులుగా ఎదిగేదెన్నడు? ఈ దేశం బాగుపడేదెప్పుడు అనే ప్రశ్న ప్రతి వారినీ పీడించేదే. స్వచ్ఛ భారత్ అని సెలవిస్తూ కోట్లు తగలేస్తున్నవారు, ఉత్తరప్రదేశ్‌లోని నూర్పూర్లో చెత్తకుప్పల దగ్గర విషాహారం తిని ఐదుగురు అమాయక పిల్లలు చనిపోవడం స్వచ్ఛభారత్‌కి మచ్చకాదా? మున్సిపాలిటీ చెత్త బళ్లు లాగుతున్న బాల, బాలికలు అనునిత్యం దర్శనమిస్తుంటారు. మీ స్వచ్ఛ భారత్ పిల్లల్ని పక్కనబెట్టి పెద్దలకు పరిమితమైందా? ఇక బేటీ పడావ్– బేటీ బచావ్ అన్న నినాదానికి వస్తే ఉన్న స్కూళ్లను మూసేస్తుంటే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు. బేటీ బచావ్ అనే మీ నినాద తీవ్రత ఎంతవరకు వెళ్లిందంటే 2014 నుంచి నేటి వరకు బాలికలపై 7 లక్షలకు పైగా అత్యాచారాలు జరిగాయి. ఇవి కేవలం పోక్సో చట్ట ప్రకారం నమోదైన లెక్కలు మాత్రమే. బాలికలపై అత్యాచారాలు చేసి చెరపట్టిన వారిలో ప్రజా ప్రతినిధులు సహితం ఉన్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు. ప్రజల కోసమే పుట్టానని ప్రగల్భాలు పలికే ఓ ముఖ్యమంత్రి గారి ఏలుబడిలో ఒకే జిల్లాలో రెండు నెలల వ్యవధిలో 18 అత్యాచారాలు జరిగాయి. ఇది సిగ్గు చేటైన విషయం కాదా? అమ్మాయిల చదువును ప్రోత్సహిస్తారా లేక షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి అని పెళ్లి చేసుకొని పరాన్నభుక్కుగా వర్ధిల్లమని దీవిస్తారా? అర్ధరాత్రి పెద్దనోట్ల రద్దు అని ప్రకటన చేసి ప్రజల్ని పరుగులు పెట్టించిన పెద్దలు, బాల కార్మిక వ్యవస్థ రూపు మాపడానికి అలాంటి ప్రకటన చేసి ఓ గడువు విధించి అనంతరం మీ వద్ద బాల కార్మికులుంటే కఠినంగా శిక్షిస్తామని ప్రకటన చేస్తే బాల కార్మిక సమస్య తీరిపోదా, కేవలం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అని కోట్లు ఖర్చు చేసి తద్దినాల్లా తంతు ముగిస్తే సరిపోతుందా. పిల్లలు విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవనం, ఆటపాటలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆట–పాటల సౌకర్యాలు కల్పించి బాల బాలికలను భావి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటే భావి తరం మిమ్మల్ని క్షమిస్తుందా, పిల్లలను అనేక వ్యాధుల నుంచి దూరం ఉంచే పౌష్టికాహారం, కనీసం రక్షిత మంచినీరు అందించలేని మీరు చిన్నారుల ముందు దోషులు కాక మరేమౌతారు అని ప్రశ్నిస్తున్నది. బాలల హక్కుల కమిషన్లను సహితం నీరుకారుస్తూ, పిల్లల హక్కులని ఎందుకు కాలరాస్తున్నారు? దీనికి సంబంధించి మీ వద్ద ఏదైనా సమాధానం ఉందా? దోషులుగా నిలబడతారో? బాలవీరులుగా పిల్లలను తీర్చిదిద్ది చరిత్రలో వీరులుగా నిలిచిపోతారో కేంద్ర, రాష్ట్ర పాలకులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రచయిత: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
అనుమానం
‘‘బై రియో! నేను వెళ్తున్నా. మళ్లీ నేనొచ్చే వరకు ఏడ్వద్దు. వచ్చేప్పుడు నీకిష్టమైన స్ట్రాబెర్రీ చాక్లెట్లు తీసుకొస్తాను,’’ అని ప్రేమగా కూతుర్ని ముద్దు పెట్టుకుంది సుచిత్ర. ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌గా పని చేస్తోంది. తాను వెళ్లే సమయానికి కూతుర్ని స్కూల్లో దింపి, వచ్చేటప్పుడు తీసుకొస్తుంది. రియో స్మైల్ కిడ్స్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. అమ్మకు బై చెప్పిన రియో అక్కడే ఉన్న వ్యాన్‌డ్రైవర్ సంతోష్‌ని చూసి ఒక్కసారిగా భయపడింది. సంతోష్ రియోను దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించినా.. వదిలించుకొని క్లాస్ రూంలోకి పరుగుపెట్టింది. సంతోష్ పెరిగిన జుట్టు, గడ్డంతో ఉండటం వల్లనేమో పిల్లలు అతని దగ్గరకు వెళ్లడానికి భయపడతారు.కిడ్స్ స్కూల్ కావడంతో దాదాపుగా టీచర్లంతా మహిళలే. ప్రిన్సిపల్ ఉమాదేవి వీరందరినీ కోఆర్డినేట్ చేస్తుంది. స్కూల్ వ్యవ హారాలు మొత్తం ఉమాదేవి భర్త కరస్పాండెంట్ సురేందర్ చూసుకుంటాడు. సురేందర్ పిల్లల తల్లిదండ్రులందరికీ తెలుసు. పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారని పిల్లల తల్లి దండ్రులకు ఆ స్కూల్ అంటే మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ప్రారంభంలో ఇరవై మంది ఉన్న పిల్లల సంఖ్య 150కి చేరింది. ఒకసారి పిల్లలు ఏడుస్తున్నారని టీచర్ చేయి చేసుకోగా, ఆమెను ఉద్యోగం నుంచే తొలగించాడు. అది పిల్లల తల్లిదండ్రుల ముందే జరగడంతో స్కూల్‌పై నమ్మకం ఇంకా పెరిగింది. సాయంత్రం రియోను తీసుకెళ్లడానికి సుచిత్ర రానే వచ్చింది. ఫీజు విషయమై ప్రిన్సిపల్ ఉమాదేవితో ఏదో మాట్లాడుతుండగా రియో తల్లి చుట్టూ తిరుగుతూ చీర కొంగుతో ఆడుకుంటోంది. అమ్మ తీసుకెళ్లడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్న రియో డ్రైవర్ సంతోష్‌ను చూడగానే తెలియని భయానికి లోనైంది. తల్లిని గట్టిగా పట్టుకుంది. రియో ఫీజు గురించి మాట్లాడి తన కారులో రియోను తీసుకెళ్లింది సుచిత్ర. ‘‘రియో! హోమ్‌వర్క్ చేస్కో. టీవీ చూడటం ఆపేయ్’’ అని వంటింట్లో నుంచి గద్దించింది సుచిత్ర. రియో పోగో చానల్లో కార్టూన్లను చూస్తూ అల్లరి చేస్తోంది. ‘‘డాడీ వస్తారు. వచ్చే వరకు నువ్వు ఇలాగే టీవీ చూస్తుండు. నిన్ను కొడతాడు’’ అంది బెదిరింపుగా. రియో ఆ విషయాన్ని వినీ విననట్లుగా, భయం లేనట్టుగా టీవీకి అంకితమైంది. రియో అల్లరిని ఆపడానికి సుచిత్ర డ్రైవర్ సంతోష్‌కి చెప్తా తీసుకెళ్తాడు అంది. అంతే ఆ ముక్క విన్నదో లేదో రియో ‘మమ్మీ!’ అంటూ భయంగా పరుగెత్తుకొచ్చింది. ఎన్నడూ భయపడని విధంగా విచిత్రంగా రియో భయ పడటాన్ని సుచిత్ర గమనించింది. ‘‘లేదు.. లేదు.. ఊరికే అన్న. ఏం లేదు’’ అని ఊరడించింది. తెల్లారాక రియో సాధారణంగా కనిపించడం చూసి సుచిత్ర మనసు కుదుట పడింది. ‘డాడీ ఈ బాల్ పట్టుకో’ అంటూ డాడీతో ఆడుకుంటూ సాధారణంగా ఉంది రియో. ‘‘స్కూల్ టైమౌతోంది. త్వరగా రా.. రెడీ అవ్వాలి’’ అని సుచిత్ర పిలిచింది. కొద్దిసేపటి తర్వాత సుచిత్ర రియోను రెడీ చేసి తానూ రెడీ అయింది. ఇద్దరూ కార్లో బయల్దేరారు. దారిలో సిగ్నల్ దగ్గర తన స్కూల్ బస్సు పక్కనే వాళ్ల కారు ఆగడంతో అటువైపు తనను పిలుస్తున్న ఫ్రెండ్స్ కనిపించారు. వారికి హాయ్ అని చేతులూపింది. అదే సందర్భంలో వ్యాన్ డ్రైవర్ సంతోష్‌ను చూసి చటుక్కున మొహాన్ని తిప్పేసింది రియో.సుచిత్ర రియోను స్కూల్లో దింపి ఆస్పత్రికి వెళ్లింది. ఫస్ట్ అవర్ క్లాస్ అయిపోయింది. ఇంటర్వల్ పీరియడ్‌లో రియో తన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటోంది. ఇంతలో ఒక టీచర్ వారి దగ్గరకొచ్చి ‘’చిల్డ్రన్ గోటూ యువర్ క్లాస్ రూమ్స్’’ అని అంది. పిల్లలంతా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడు ఫ్లోర్లున్న బిల్డింగ్‌లో తమ తమ క్లాస్ రూమ్స్‌లోకి వెళ్తున్నారు. రియో క్లాస్ రూమ్ రెండో ఫ్లోర్లో ఉంది. మూడో ఫ్లోర్లో మొత్తం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. రియో తన క్లాస్‌రూమ్‌కి వెళ్తూ.. తన క్లాస్మేట్ చిన్నూ ఏడుస్తుండగా, ఆయా తనని బలవంతంగా మూడో ఫ్లోర్‌కి తీసుకెళ్లడం చూసింది. ‘‘ఏయ్ చిన్నూ..! ఎక్కడికి?’’ అంటూ ఆమె వెనుకే మూడో ఫ్లోర్‌కి వెళ్లింది. రియో రావడం గమనించని ఆయా చిన్నూని బరబరా గుంజుకెళ్లి హాల్లో ఉన్న పీఈటీ టీచర్ ముందు ఉంచింది. ‘‘ఈ పిల్ల అస్సలు కుదురుగా ఉండట్లేదు. పైగా బాగా ఏడుస్తోంది’’ అని ఆయా ఆ టీచర్‌తో అంది. ‘‘అవునా! ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావ్’’ అని పాలుగారే ఆ చెంపలపై చెళ్లున చరిచింది. చిన్నూ ఇంకా ఏడుపు ఎక్కువ చేసింది. దాంతో టీచర్ కోపం ఇంకా పెరిగింది. చిన్నూని పట్టుకోమని ఆయాతో చెప్పి, గదిలోకెళ్లి ఏదో ఇంజెక్షన్ తెచ్చింది. చేతులను గట్టిగా పట్టుకోమని, నోరు మూయమని ఆయాతో చెప్పి చిన్నూకి ఆ ఇంజెక్షన్ చేసింది. అంతే, అప్పటి వరకూ బిగ్గరగా ఏడ్చిన చిన్నూ ఒక్కసారిగా కూలబడిపోయింది. చిన్నూ రెక్కల్ని పట్టుకుని ఈడ్చుకుంటూ అదే ఫ్లోర్‌లోని ఒక గదిలోకి తీసుకెళ్లింది టీచర్. ఈ తతంగాన్నంతా దూరం నుంచి బిక్కుబిక్కుమంటూ గమనించిన రియో మెల్లిగా మెట్లు దిగి రెండో ఫ్లోర్‌లోని తన క్లాస్‌రూమ్‌కి వెళ్లింది. ఉమాదేవి రియో ఇదంతా చూడటాన్ని గమనించింది.సాయంత్రం సుచిత్ర వచ్చింది. స్కూల్ వదిలాక పిల్లలంతా తాము ఎక్కాల్సిన వ్యాను దగ్గరకు వెళ్తున్నారు. మిగతా పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తున్నారు. రియో కోసం సుచిత్ర ఆత్రంగా చూస్తోంది. చివరగా రియో దిగాలుగా వస్తుండటాన్ని సుచిత్ర చూసింది. ప్రిన్సిపల్ ఉమాదేవి వేరే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూనే, రియో సుచిత్రకు ఏం చెబుతుందోనని టెన్షన్ పడుతోంది. సుచిత్ర దగ్గరకు వచ్చిన రియో ‘‘మమ్మీ! మరేమో చిన్నూ.. చిన్నూ...’’ అని ఏదో చెప్పబోయేసరికి ఉమాదేవి సుచిత్ర దగ్గరికొచ్చి నవంబర్ పద్నాలుగున జరగబోయే చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడుతూ సుచిత్ర దృష్టిని రియో చెప్పే మాటలపైకి వెళ్లకుండా అడ్డుపడింది. కొద్దిసేపు మాట్లాడాక సుచిత్ర రియోతో ఇంటికి బయల్దేరింది. ఇంటికెళ్లాక రియో విషయాన్ని భర్త సురేందర్‌కి చెప్పింది ఉమాదేవి. ‘‘ఏవో మాయమాటలు చెప్పి ఆ పిల్లని మరిపించలేకపోయావా? ఈ విషయం సుచిత్రకు తెలిస్తే ఏమైనా ఉందా? పదేళ్లుగా కష్టపడుతున్న దానికి ఫలితం ఉండదు. స్కూల్ రెప్యుటేషన్ పోతుంది. అందరికీ తెలిస్తే కొత్తగా పిల్లలను ఎవరూ చేర్పించరు’’ అంటూ ఉమాదేవితో సురేందర్ తన మనసులోని అనుమానాల్ని బయటికి తీసుకొస్తున్నాడు. ‘‘అలా ఏం జరుగదు లేండి. రియో చిన్నపిల్ల. వెంటనే మర్చిపోతుంది’’ అని భర్తతో అంది ఉమాదేవి. ఈ మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఆలోచనల్లో మునిగిపోయాడు సురేందర్.ఇంటికెళ్లిన రియో.. చిన్నూ విషయం మర్చిపోయి ఆడుకుంటోంది. నానమ్మ పిలి చినట్టుగా వినిపిస్తే రియో వెళ్లింది. అప్పుడే భోజనం చేసిన నానమ్మ రియోతో టీవీ పక్కనున్ను ట్యాబ్లెట్స్ను తీసుకురమ్మంది. టీవీ పక్కన ట్యాబ్లెట్ల కవర్లో ఇంజెక్షన్లు చూసింది. అంతే, పరుగున వంట గదిలో ఉన్న తల్లి దగ్గరకు వచ్చి.. ‘‘మమ్మీ.. చిన్నూకి స్కూల్లో ఇంజెక్షన్ చేశారు’’ అని చెప్పింది. ‘‘అవునా ఎక్కడ.. ఇక్కడా.. ఇక్కడా’’ అని చెక్కిలిగింతలు పెట్టి, ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు సుచిత్ర. ‘‘త్వరగా హ్యాండ్‌వాష్ చేసుకుని రా.. డిన్నర్ చేద్దాం’’ అని పిలిచింది. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకున్నారు. నిద్రలో రియో ‘మమ్మీ..! డ్రైవర్.. డ్రైవర్..’ అంటూ భయంగా కేకలు వేసింది. దిగ్గున లేచిన సుచిత్ర ‘‘రియో.. రియో.. ఏమైంది’’ అంటూ.. తన చేతులతో రియోని నెమ్మదిగా తడుతూ పడుకోబెట్టింది.తెల్లారి ఉదయం రియోని స్కూల్లో దింపడానికి సుచిత్ర వెళ్లింది. వెళ్లేసరికి ఎవరో పేరెంట్స్ డ్రైవర్ సతీష్‌ని కొడుతుండటాన్ని చూసింది. అక్కడే సురేందర్, ఉమాదేవి.. కొందరు టీచర్లు ఉన్నారు. వేరే వ్యాన్‌లో వెళ్లే పాపను ఇతని వ్యాన్‌లో తీసుకెళ్లాడని, చీకటి పడ్డాక పాప తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టారని, ఇప్పుడొచ్చి సతీష్‌ని కొడుతూ సురేందర్‌ని వివరణ అడుగుతున్నారని అక్కడి వారిలో ఒకరు సుచిత్రకు చెప్పారు. రియోని దింపి సుచిత్ర ఆస్పత్రికి వెళ్లింది. సురేందర్ ఆ పాప పేరెంట్స్‌తో పొరపాటు జరిగిందని చెప్పి తక్షణమే సతీష్‌ని ఉద్యోగం నుంచి తీసేశాడు. ఇదంతా తనకు పట్టనట్లు రియో క్లాస్‌కి వెళ్లింది. బ్రేక్ సమయంలో పిల్లలంతా ఆడుకుంటుండగా రియో దిగాలుగా కూర్చుంది. ఈ విషయాన్ని టీచర్ అశ్విని గమనించింది. రియోకి కూడా అశ్విని టీచర్‌తో చనువు ఉంది. కాబట్టి టీచర్ అడక్కుండానే చిన్నూకి ఇంజెక్షన్ ఇచ్చారని చెప్పింది. ‘‘ఇంజెక్షన్ ఏంటి రియో?’’ అని నవ్వింది ఆ టీచర్. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్సిపల్ ఉమాదేవి భర్త సురేందర్‌కి చెప్పింది. ఆ రోజు రియోని తీసుకెళ్లడానికి సుచిత్ర లేట్‌గా వచ్చింది. పిల్లలంతా వెళ్లిపోయారు. రియో ఎక్కడని అక్కడున్న టీచర్ని అడిగింది. ప్రిన్సిపాల్‌ని కలవమని చెప్పగా కలిసింది. ప్రిన్సిపాల్ ఉమాదేవి ‘‘మీరొచ్చి తీసుకెళ్లా రనుకున్నాం. మీరు తీసుకెళ్లలేదా?’’ అని ఎదురు ప్రశ్నించింది.‘‘ఏం మాట్లాడుతున్నారు? నేనొచ్చిందే ఇప్పుడు’’ అంటూ రియో ఎక్కడని నిలదీసింది. దాంతో భయపడ్డ ఉమాదేవి, భర్త సురేందర్‌కి ఫోన్ చేయగా స్కూల్‌కి వచ్చాడు. ‘‘డ్రైవర్ సతీష్ వచ్చాడా?’’ అని అడిగాడు. ‘‘ఆ వచ్చాడు సర్. మిమ్మల్ని కలవాలని చెప్పి ఇంతకు ముందే వెళ్లాడు’’ అని మరో డ్రైవర్ చెప్పాడు. ‘‘రియోను సతీష్ తీసుకెళ్లాడా?’’ అనుమానంగా అన్నాడు సురేందర్. అనుమానం వచ్చి సుచిత్ర, ప్రిన్సిపాల్‌తో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చీకటి పడటంతో రేపు ఉదయం స్కూల్‌కి వస్తామని చెప్పారు.రోజూ రియో ఆటలతో సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా మూగబోయినట్లైంది. మర్నాడు ఉదయమే స్కూల్‌ని పరిశీ లించడానకి వచ్చాడు ఎస్సై రమణ. రియో స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, టీచర్ల గురించి ఆరా తీశాడు. అంతా డ్రైవర్ సతీష్ ప్రవర్తన గురించి చెప్పారు. సురేందర్ కూడా సతీష్‌ను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో ఎస్సైకి వివరించాడు. ఈ క్రమంలో పిల్లలు బ్రేక్ టైమ్‌లో బయటకొచ్చారు. కొందరు అక్కడ పడి ఉన్న ఇంజెక్షన్ నీడిల్‌తో ఆడుకోవడం ఎస్సై గమనించాడు. స్కూల్ మొత్తాన్నీ చూడాలని చెప్పాడు ఎస్సై. మూడో ఫ్లోర్లో 304 గది ఏంటి తాళం వేసి ఉందని అడిగాడు. ‘‘సార్! లోపల సీలింగ్ చేయలేదు. అందుకే దాన్ని స్టోర్‌రూమ్‌గా వాడుతున్నాం’’ సమాధానమిచ్చాడు సురేందర్. సుచిత్రను సాయంత్రం స్టేషన్‌కి రావాలని ఎస్సై కబురు పంపాడు. సాయంత్రం సుచిత్ర, భర్త రఘుతో కలిసి స్టేషన్‌కి వెళ్లింది. గంటన్నరసేపు వారితో విడివిడిగా మాట్లాడిన ఎస్సై... కేసు నమోదు చేశామని, ఎంక్వైరీ జరుగుతోందని, ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే చెబుతామని వాళ్లను పంపించేశాడు.మర్నాడు ఉదయం రఘు ఇంటికెళ్లాడు ఎస్సై రమణ. కాలింగ్ బెల్ కొట్టేసరికి రఘు వచ్చి డోర్ తీశాడు. మీరొకసారి స్టేషన్‌కు రావాలన్నాడు. పాప విషయం ఏమైందని రఘు అడిగేసరికి స్టేషన్లో చెబుతానని సుచిత్ర, రఘులను తీసుకెళ్లాడు.సుచిత్రను ఇంటరాగేషన్ రూమ్‌లోకి తీసుకెళ్లి ‘‘నేనడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో అనే సమాధానమే చెప్పాలి’’ అని బెదిరించాడు. దాంతో కంగుతిన్న సుచిత్ర అలాగే ఉండిపోయింది.‘‘రియో మీకు పుట్టిన బిడ్డ కాదు. ఎస్ ఆర్ నో’’ అని అడగ్గా.. ‘‘నో’’ అని చెప్పింది సుచిత్ర. ‘‘రఘుకు నువ్వు రెండో భార్యవి. అవునా?’’ అనే ప్రశ్నకు ‘‘అవును’’ అని భయంగా చెప్పింది. ‘‘ఇప్పుడు చెప్పు రియోను ఎందుకు చంపావు?’’ అని అడగ్గా బిత్తరపోయిన సుచిత్ర, ‘‘నేను చంపడం ఏంటీ?’’ అని ఎదురు ప్రశ్నించింది. పోలీసులు తమ స్టైల్లో అడిగేసరికి నిజాన్ని ఒప్పుకుంది. చిన్న పాపను చంపడానికి మనసెలా వచ్చిందని ఎస్సై కోపంగా అడిగేసరికి... ‘‘రఘు మొదటి భార్య అర్చన రోడ్డు ప్రమాదంలో మరణించగా.. రఘు ఇంట్లో వాళ్ల ఒత్తిడితో ఏడాది క్రితం నన్ను పెళ్లి చేసుకున్నాడు. అర్చన కూతురు రియోనే తన సర్వస్వం అన్నాడు. ఇంకా పిల్లలొద్దు అన్నాడు. దాంతో నా ప్రాణం ఆగినంత పనైంది. రియో ఉండబట్టేగా రఘు ఇలా అన్నాడని తట్టుకో లేకపోయాను. అందుకే రియోని కిడ్నాప్ చేయించి హత్య చేయించాను. చిన్నూకి ఇంజెక్షన్ చేశారని రియో చెప్పినప్పుడు కావాలనే పట్టించుకోలేదు. హత్య చేయడానికి ఇదే సరైన సమయమని అనుకున్నాను. ఇప్పుడు అనుమానం మొత్తం కరెస్పాండెంట్ సురేందర్ పైకి వెళ్తుందని పథకం చేసి అమలు చేశాను’’ అంది. ‘‘రియో మిస్సింగ్ తర్వాత అందర్నీ విచారించాం. డ్రైవర్ సతీష్ తల్లి అనారోగ్యంగా ఉండటంతో అలా డిప్రెషన్లో ఉన్నాడని తేలింది. అలాగే స్కూల్ కరస్పాండెంట్ సురేందర్‌ని కూడా ఇంటరాగేట్ చేశాం. చిన్నపిల్లలపై డ్రగ్స్ ప్రయోగిస్తున్నాడన్న ఆధారాలు దొరకడంతో కరెస్పాండెంట్ సురేందర్ దంపతులను అదుపులోకి తీసుకున్నాం. అయితే రియో విషయంలో వాళ్లకేమీ సంబంధం లేదని తేలింది. దాంతో వాళ్లందరి మీదా అనుమానాలు తీరిపోయాయి. దాంతో మీ ఇద్దరినీ విడివిడిగా ఇంటరాగేట్ చేశాం. నువ్వు రియోకి కన్నతల్లివి కాదని తెలియడంతో, అనుమానం నీవైపు తిరిగింది. చివరికి మా అనుమానమే నిజమైంది’’ అన్నాడు ఎస్సై రమణ. -ఉమేశ్ కోమటి -
‘నవంబర్ 14 అంకుల్ డే..’
సాక్షి, న్యూఢిల్లీ : బాలల దినోత్సవాన్ని నవంబర్ 14కు బదులు డిసెంబర్ 26న నిర్వహించాలని వంద మందికి పైగా బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నవంబర్ 14న బాలల సంక్షేమం కంటే జవహర్లాల్ నెహ్రూకు చిన్నారులపై ప్రేమ గురించిన ప్రస్తావనే అధికమవుతోందని వారు ఆక్షేపించారు. మొఘలులకు వ్యతిరేకంగా గురు గోవింద్ సింగ్ మైనర్ కుమారులు షహిజద అజిత్ సింగ్ (18), జుజార్ సింగ్ (14), జోర్వార్ సింగ్ (9), ఫతే సింగ్ (7)ల ప్రాణ త్యాగానికి ప్రతీకగా డిసెంబర్ 26న బాలల దినోత్సవం నిర్వహించాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ జయంతైన నవంబర్ 14ను ‘అంకుల్ డే’ లేదా ‘చాచా దివస్’గా జరపాలని లేఖలో ప్రధానిని కోరారు. గురు గోవింద్ సింగ్ కుమారుల బలిదానాల స్ఫూర్తిని చిన్నారుల్లో నింపేందుకు డిసెంబర్ 26ను బాలల దినోత్సవంగా జరపడం సముచితమని పేర్కొన్నారు. -
స్కూలు వ్యాను కింద పడి బాలిక మృతి
-
షాకింగ్ : సెటిల్మెంట్ చేసుకోమన్నారు!
సాక్షి, హైదరాబాద్ : 'చిల్డ్రన్స్ డే రోజు శివ్ రచిత్‌ను తయారుచేసి 8:30 కి చిరునువ్వుతో స్కూలుకు పంపించాను. రోజులాగే మా ఆయన అనిల్ రోజులాగే బాబును స్కూలు వద్ద దింపి వచ్చాడు. కానీ స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంతో పసివాడు శవమై తేలాడంటూ' మల్కాజ్గిరి విష్ణుపురి కాలనీలోని బచ్పన్ స్కూలులో నీటి సంపులో శవమై కనిపించిన బాలుడి తల్లి విశాల తన ఆవేదన వ్యక్తం చేశారు. శివ్ రచిత్ మృతిపై వివరాలు అడగగా స్కూలు మేనేజ్మెంట్తో ఎంతో కొంతకు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఎస్ఐ శంకరయ్య సలహా ఇవ్వడం దారుణమని బాలుడి బంధువులు పేర్కొన్నారు. 'మా పిల్లల గురించి అడిగే హక్కు, అధికారం మాకు లేదా.. అడిగేందుకు మాకు బాధ్యత లేదా. మేం స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తామంటే.. ఆ ప్రశ్నలేవో మాకే రాసివ్వండి. మేం వారిని అడుగుతామని ఎస్ఐ అన్నారు. ప్రశ్నలు రాసివ్వడానికి అసలు ఇది స్కూలు పరీక్షలా.. సీసీ కెమెరాలు రెండు రోజుల నుంచి పనిచేయలేదన్నారు. బాలుడు ఆడుకుంటూనే నీటిలో పడిపోయాడని అంత ఈజీగా ఎలా గుర్తించారు. 150 మంది పిల్లలకు ఆరుగురు ఆయాలున్నారని చెబుతున్నారు. నీటి కోసం తెరిస్తే.. ఆ తర్వాత మూయకుండా అలాగే వదిలేస్తే పిల్లల ప్రాణాలకు ప్రమాదమని తెలియదా. అయినా నీటి సంపు పక్కనే చిన్న పిల్లల్ని ఆడుకోనివ్వకూడదని కూడా విద్యార్థుల పేరెంట్స్, బంధువులే చెప్పాలా' అంటూ వారు ప్రశ్నించారు. పరారీలో స్కూలు యాజమాన్యం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని పేరెంట్స్, బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన బచ్పన్ స్కూలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. శివ్ రచిత్ తల్లిదండ్రులు మాత్రం బాబు కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికులను సైతం ఈ విషాదం కలిచివేస్తోంది. -
పాఠశాల సంప్‌లో పడి చిన్నారి మృతి
-
ఈ చిరునవ్వులు.. ఇక కనిపించవు..
హైదరాబాద్: అప్పటివరకు అక్కతో ఆడుకున్నాడు.. స్కూల్లో బాలల దినోత్సవం కావడంతో అమ్మ అందంగా ముస్తాబు చేసింది.. నాన్న తీసుకెళ్లి పాఠశాల వద్ద వదిలివెళ్లాడు. ఆ తర్వాత ఏంజరిగిందో ఏమో.. చివరికి స్కూల్ ఆవరణలోని సంప్‌లో ఆ చిన్నారి శవమై తేలాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరం కావడంలేదు. ఈ హృదయవిదారక ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆర్కేనగర్ వీణా అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న అనిల్ కుమార్ వ్యాపారి. అతనికి భార్య విశాల, ఎనిమిదేళ్ల కూతురు అనన్య, రెండున్నరేళ్ల కుమారుడు శివ్రచిత్ ఉన్నారు. అనన్య స్థానిక ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. శివ్‌రచిత్‌ను విష్ణుపురి కాలనీలోని బచ్పన్ ప్లేస్కూల్లో నర్సరీలో చేర్పించారు. రోజూలాగే మంగళవారం ఉదయం అనిల్.. శివ్‌రచిత్‌ను పాఠశాల వద్ద స్కూల్ యాజమాన్యానికి అప్పగించి వ్యాపా రం నిమిత్తం వెళ్లాడు. బాలల దినోత్సవం కావడంతో 11.30కే తీసుకెళ్లాలని చెప్పడంతో అనిల్ భార్యకు సమాచారం అందించాడు. సంప్‌లో పడిఉన్న చిన్నారి.. ఉదయం 11.20 సమయంలో పాఠశాలకు వచ్చిన విశాలకు అబ్బాయి స్కూల్‌కు రాలేదని యాజమాన్యం చెప్పడంతో భర్తకు ఫోన్ చేసింది. తానే రచిత్‌ను స్కూల్ వద్ద వదిలిపెట్టానని అనిల్ చెప్పాడు. అనిల్ తన స్నేహితులకు సమాచారం అందించాడు. విశాల, అనిల్ స్నేహితులు స్కూల్ యాజమా న్యాన్ని నిలదీసింది. అదే సమయంలో ఏడుస్తూ వచ్చిన ఆయా సంప్ వద్దకు తీసుకెళ్లి చూపించగా.. అందులో పడివున్న రచిత్‌ను గమనించారు. హుటాహుటిన తార్నాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తూ యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం చేశారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు తన కొడుకు మృతి చెందడానికి స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304ఏ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి చెప్పారు. కాగా, స్కూల్ డైరెక్టర్ రాఘవేంద్రరావు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు సంప్‌లో పడి విద్యార్థి మృతి చెందడంతో బుధవారం మల్కాజిగిరి పరిధిలోని అన్ని పాఠశాలల బంద్‌కు టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, టీఆర్ఎస్వీ, ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చాయి. యాజమా న్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా? సోమవారం మంచినీరు రావడంతో మంచినీటి సంపు మూత తెరచి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, యాజమాన్యం నిర్లక్ష్యమే రచిత్‌ను బలిగొన్నదని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్ ఉన్న ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. సంప్ నిండిందా లేదా అని చూసిన వాచ్మెన్.. దాని మూత పూర్తిగా మూయలేదని, దానిమీద కాలు వేయడం వల్లే చిన్నారి సంప్‌లో పడిఉండొచ్చని భావి స్తున్నారు. యాజమాన్యం వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారిం చామని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలి పారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు పాఠశాల మూసివేయడానికి గల అవకాశాలపై నివేదిక అందజేస్తామన్నారు. -
బుజ్జి ‘కేటీఆర్’కు మంత్రి ఫిదా..!
హైదరాబాద్: నవంబర్ 14న పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజును మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు తమ ఫ్యాన్సీ డ్రస్సులతో అందరి చూపు వారిపై ఉండేలా చేశారు. ఓ చిన్నారి మంత్రి కేటీఆర్‌లా డ్రస్ వేసి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్సీ డ్రస్సు ఈవెంట్లో చిన్నారులు రకరకాల దుస్తులతో పాల్గొన్నారు. అందులో భాగంగా పిల్లలు మోడ్రన్‌గా రెడీ అయి ఈవెంట్‌కు హజరయ్యారు. కానీ రెండేళ్ల పాప ఐరా కేటీఆర్‌లా దుస్తులు వేసుకుని బాలల దినోత్సవ వేడుకలకు వచ్చింది. అంతేకాక మెడలో గులాజీ రంగు టీఆర్ఎస్ పార్టీ కండువాను, కేటీఆర్ పేరు ఉన్న కార్డు కూడా వేసుకుంది. చూడముచ్చటగా ఉన్న బుజ్జాయి ఫొటోలను తల్లిదండ్రులు మంత్రికి పంపించారు. ఆ ఫొటోలను కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ‘ ఆ చిన్నారి ఫొటోలు నా మనసుకు ఎంతగానో హత్తుకున్నాయి. ఆ పాప తల్లిదండ్రులకు ధన్యవాదాలు’ అంటూ తన అకౌంట్ కేటీఆర్ ట్విట్ చేశారు. -
ఈ చిన్నారులెవరో గుర్తుపట్టారా..?
బాలల దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు తమ చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యంగ్ హీరో ఆసక్తికరమైన ఫొటోలతో తన ఫ్యాన్స్‌ను అలరించారు. అదే బాటలో యంగ్ హీరో మంచు మనోజ్ ఓ ఆసక్తికరమైన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. చిన్నతనంలో అక్క లక్ష్మీ ప్రసన్న, అన్న విష్ణులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన మనోజ్, ‘మీలోని ప్రేమ, ఆనందాన్ని వ్యక్తీకరించండి, మీలోని బాల్యాన్ని సజీవంగా, ఆనందంగా ఉంచండి. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇటీవల ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్, నటుడిగా మంచి మార్కులు సాధించాడు. మరో హీరో విష్ణు ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. Express your joy, love and laughter. Keep that inner child in you alive and happy! Happy #ChildrensDay everyone! ❤️ pic.twitter.com/HlmDzKMXel — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 14 November 2017 -
జానెడు పొట్ట..
బుక్కెడు బువ్వ.. గుక్కెడు నీళ్లు.. నిలువ నీడ.. బతుకుకు తోడు కరువై... జానెడు పొట్ట కోసం పోరాడుతున్న బాలలెందరో.. నేడు బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల బాధలపై బతుకు చిత్రాలు.. పాల‘బుగ్గల’ పసివాడా.. పట్నం వచ్చిన పోరగాడా.. పాలు మరిచిన పిల్లవాడా.. బాధ్యతలను మోస్తున్న మొనగాడా.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ కట్టెమైన బతుకులు భారమైన బతుకులో బాధలను మరిచి.. బతుకు బండిలో పయణిస్తున్నామని తలచి.. ఎర్రటి ఎండలో.. కట్టెల బరువుతో నడిచి.. అమ్మకు అండగా ఉంటున్నామని సంతోషించి.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ గుక్కెడు నీటి కోసం.. భూమిపై మూడింట రెండొంతుల నీరున్నా.. ప్రజలు దాహం.. దాహం.. అంటూ ల్లాడుతున్నారు. పాలకులు రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలుపుతున్నారు... కానీ నేటికీ గుక్కెడు నీటి కోసం తపిస్తున్న పేదలెందరో.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ ‘వీధి’ బాలలం పలకా, బలపం పట్టాల్సిన చిట్టి చేతులు మురికి సంచులను పట్టాయి. పేదరికం, విధి కారణంగా వీధి వీధి తిరుగుతూ పడవేసిన ప్లాస్టిక్ సామాన్లను ఎరుతున్నారీ చిన్నారులు.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ ఈ నవ్వులు బడిలో విరియాలి.... తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్ రూపుదిద్దుకుంటుంది. కానీ నేడు ఎందరో బాలలు చదువుకు దూరమవుతూ.. రోడ్ల వెంట, చెత్త కుప్పల దగ్గర కనిపిస్తున్నారు. బడిలో ఉండాల్సిన ఈ చిన్నారులు బతికేందుకు ఇలా రోడ్డుమీదకొచ్చారు... – పెద్దపల్లి వరప్రసాద్, సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ గుక్కెడు నీటి కోసం.. భూమిపై మూడింట రెండొంతుల నీరున్నా.. ప్రజలు దాహం.. దాహం.. అంటూ అల్లాడుతున్నారు. పాలకులు రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలుపుతున్నారు... కానీ నేటికీ గుక్కెడు నీటి కోసం తపిస్తున్న పేదలెందరో.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ చెత్తలో బతుకును వెతుకుతూ.. పుట్టిన వెంటనే ఆడ పిల్లలను చెత్త కుప్పల్లో పడేయడం మనం చూస్తూనే ఉంటాం... పై చిత్రంలో కనిపిస్తున్న ఈ ఈ బాలిక అదే చెత్త కుప్పల్లో తన బతుకును వెతుకుతూ సాగుతోంది... తరాలు మారినా ఆడపిల్ల్లల తలరాతలు మారడం లేదు.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ ఆకలి రాజ్యం ధనవంతుడినైనా.. పేదవాడినైనా.. ఒకేలా పలకరించేది ఆకలి మాత్రమే.. కోట్లు సంపాదించే దీ కూటి కోసమే... భువిపై ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులెందరో..– సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ -
అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి: రకుల్
సాక్షి, హైదరాబాద్ : ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. నేడు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్ నుంచి రవీంద్రభారతి వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని నటి రకుల్‌తో పాటు ఆ శాఖ డైరెక్టర్ విజయోద్రీ మంగళవారం ఉదయం ప్రారంభించారు. సైకిల్ ర్యాలీ ముగిసిన తర్వాత రకుల్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ ద్వారా బ్రూణ హత్యలు చేయడం చట్టరీత్యా నేరమని, లింగ నిర్ధారణకు సహకరించే వారినీ కఠినంగా శిక్షించాలని కోరారు. అమ్మాయి, అబ్బాయిల మధ్య వ్యత్యాసాలు చూపించవద్దన్నారు. అందరూ సమానమేనని, ఇద్దరికీ సమాన స్వేచ్ఛ ఇవ్వాలని ఆమె చెప్పారు. మహిళల అక్రమ రవాణా నివారించడంతో పాటు బాల్య వివాహాలను నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా రకుల్ పిలుపునిచ్చారు. పెళ్లి చేసుకోవడానికి వరకట్నం తీసుకునే వారిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు రకుల్ విజ్ఞప్తిచేశారు. -
బాల్యం భవిష్యత్తు సంకేతం
పుట్టిన పిల్లలు ఇంత దుర్భరమైన స్థితిలో ఉంటూండగా, వారికి కనీసం రక్షిత మంచినీరు ఇవ్వడం బాధ్యతగా గుర్తించని పెద్ద మనుషులు.. మరింత మంది పిల్లలని కనండహో అంటూ సిగ్గు లేకుండా చాటింపు వేయడం దారుణం. బాల్యం చాలా అమూల్యమైనది. గనిలో, పనిలో, కార్ఖానాలో నలిగిపోకూడదు. బిచ్చగాళ్లు కాకూడదు. బాలికా వధువులై దుర్భర జీవితం గడపకూడదు. అసాంఘిక శక్తుల చేతులలో బాలబాలికలు కీలుబొమ్మలు కాకూడదు. విద్యాగంధానికి దూరమై వింత పశువుల్లా మారకూడదు. వారి విజ్ఞాన సాధనకు, వినోదానికి, చదువు, ఆటపాటలు అందుబాటులో ఉండాలి. పిల్లలు ఎదగడానికి పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు ఉండాలి. రక్షిత మంచినీరు లభించాలి. వెరసి పిల్లలకు అన్ని సదుపాయాలు ఉండి మంచి జాతి పౌరులుగా ఎదగాలి. జాతికి గర్వకారణమై ముద్దుబిడ్డలుగా మారాలి. ఇదంతా జరగాలి అంటే పిల్లలకంటూ కనీసం సంవత్సరంలో ఒక రోజైనా కేటాయించి వారి పరిస్థితులను సమీక్షించి, సమస్యలు ఉంటే చక్కదిద్దాల్సిన బాధ్యతను ప్రపంచ దేశాలు నెత్తిన ఎత్తుకోవాలని ఆలోచిం చారు రెవరెండ్ డా. చార్లెస్ లియోనార్డ్. మాంచెస్టర్‌కు చెందిన ఈ పాస్టర్ ఒకటిన్నర శతాబ్దం క్రితం అంటే 1856లోనే ఈ ఆలోచన చేశారు. ఆయన ప్రతిపాదన మేరకు ప్రతి సంవత్సరం జూన్ రెండో ఆదివారాన్ని ‘రోజ్ డే’ లేదా బాలల దినోత్సవంగా గుర్తించారు. తదనంతరం ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ‘రోజ్ డే’ లేదా ‘చిల్డ్రన్స్ డే’ ను ప్రపంచంలోని అత్యధిక దేశాలు జూన్ 1న లేదా వారికి అనుకూలమైన తేదీల్లో నిర్వహిస్తున్నాయి. మన దేశంలో భారత నిర్మాత, ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి పిల్లలంటే అపార ప్రేమ. వారికోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో ఉండేది. అందుకే ఆయన జ్ఞాపకార్థం నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా భారత ప్రభుత్వం గుర్తించింది. అందరూ అనుభవించే బాల్యం.. ప్రకృతి మనుషులకు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూదోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. ‘పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్ర స్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు’ అని నెహ్రూ అనేవారు. పిల్ల లను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని ఆయన తరచూ చెప్పేవారు. నెహ్రూకు పిల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరమూ నవంబర్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వపరంగా బాలల దినోత్సవం సంబరాలు ఐతే ఘనంగానే జరుగుతున్నాయి. కానీ, ఇంకా పిల్లలు పీడన నుంచి విముక్తి చెందలేదు. 46 శాతం మంది పిల్లలు పౌష్టికాహారం లోపంతో బాధపడుతుంటే 74 శాతం మంది పిల్లలు, రక్తహీనతతో 90 శాతం మంది పిల్లలు నివారించగలిగే డయేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. హెచ్.ఐ.వి లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో 2,20,000 మంది పిల్లలు ఉంటే ప్రతి సంవత్సరం ఈ సంఖ్యకు అరవైవేల మంది అదనంగా తోడవుతున్నారు. ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు భారతదేశానికి చెందిన వాళ్లంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దేశంలో 1,000 మంది పిల్లలు జన్మిస్తే 79 మంది పుట్టగానే మృత్యువాత పడుతున్నారు. ఈ విషయంలో ప్రపంచ సరాసరి కంటే మనం అత్యంత హీనమైన స్థితిలో ఉన్నాం. ఇక దేశం మొత్తంగా చూస్తే 1,30,00,000 మంది పిల్లలు ప్రమాదకర పరిస్థితుల్లో బాల కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. మరోవైపున విద్యకు దూరమై కుల, మత, ప్రాంత, భాష, లింగ వివక్షతో ఎంతో మంది చిన్నారులు మగ్గిపోతున్నారు. ఈ 21వ శతాబ్దిలో కూడా దేశంలో బాలికా వధువుల సంఖ్య గణనీయంగా ఉంది. ఇన్ని అరిష్టాలు ఉండగా, మరోవైపున చదువుల పేరుమీద పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యాలు అంతా ఇంతా కాదు. జ్ఞాన సముపార్జన మాట దేవుడెరుగు కాని పాఠశాలల్లో పిల్లల ప్రాణాలు పోకుంటే చాలు అన్న చందంగా చదువులు తయారయ్యాయి. ఇక మాఫియా ముఠాల చేతుల్లో బిచ్చగాళ్లుగా, దొంగలుగా, వ్యభిచార గృహాల్లో దుర్భరమైన జీవనం సాగిస్తున్న చిన్నారుల సంఖ్యకు కొదవలేదు. పైన ఏకరువు పెట్టిన విషయాలన్నీ ప్రభుత్వాలకు, పెద్దలకు తెలియని కొత్త సంగతులేమీ కావు. కానీ వారికి బాలబాలికలంటే పట్టదు. వారి సమస్యలు అంటే గిట్టదు. పుట్టిన పిల్లలు ఇంత దుర్భరమైన స్థితిలో ఉంటే వారికి కనీసం రక్షిత మంచినీరు ఇవ్వడం కూడా తమ బాధ్యతగా గుర్తించని పెద్ద మనుషులు.. తగుదునమ్మా అంటూ మరింత మంది పిల్లలని కనండహో అని సిగ్గూ ఎగ్గూ లేకుండా చాటింపు వేస్తున్నారు. మన సమాజంలోని పెద్ద మనుషులందరికీ బాలల హక్కుల సంఘం సవినయంగా విన్నవిస్తున్నది ఏమిటంటే పిల్లలకు మంచి జీవితం అందాలి, అందించాలి. లేకపోతే మంచి సమాజాన్ని చూడటం ఎన్నటికీ ఫలించని కలగానే మిగిలిపోతుంది. బాలల హక్కుల సంఘం, సాక్షి దినపత్రిక నేడు హైదరాబాద్ కేంద్రంగా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పిల్లలకు చాచా నెహ్రూ కలలు కన్న సమాజాన్ని సమకూర్చాలంటూ పెద్దలందరినీ కోరుతున్నాం. (నేడు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా) అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం ‘ 93910 24242 -
సారీ.. నానమ్మా!
ఒక వయసొచ్చాక తక్కువ వినపడుతుంది. వినపడినదంతా ఎక్కువగా అనిపిస్తుంది.పెద్దలతో మాట్లాడుతున్నప్పుడుమనం చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రతిరోజూ లేచినప్పటినుంచి నిద్రపోయేదాకా‘నా వల్ల ఈ కుటుంబానికి ఎంత కష్టం?’అనుకుంటూనే జీవిస్తుంటారు.ఒక్క మాట చాలు. దుఃఖంలో కూరుకుపోవడానికి.పిల్లలకు నేర్పించండి ఇంట్లోని పెద్దలను గౌరవించమని!నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఒక నానమ్మ కథ! ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు మాటా పలుకూ లేకుండా ఉన్నాయి. రాత్రి చీకటి నిస్సహాయంగా ఉంది.అలలు గాఢతను నింపుకుని తమ మీదకు వచ్చే దేనినైనా దూరం నెట్టేద్దామా అని సమాయత్తమవుతూ ఉన్నాయి. ఆ ముసలామె రెయిలింగ్ దగ్గర నిలుచుని ఉంది. సాయంత్రం అయిదింటికి ట్యాంక్‌బండ్ మీద ఆటోలో దిగిందామె. ఒక్కోవిగ్రహం దగ్గరా కాసేపు కాసేపు కూర్చుంటూ ఇప్పుడు రోడ్డు దాటి రెయిలింగ్ దగ్గర నిలుచుంది. దూరంగా మసక నింపుకున్న బుద్ధుని చిర్నవ్వు. శరణు జొచ్చడానికి తీరిక ఇవ్వని సమాజం ఆ అర్ధరాత్రి అప్పుడొక వాహనం అప్పుడొక వాహనంగా దూసుకొని పోతోంది. ఆ రెయిలింగ్ ఎక్కి నీళ్లలోకి ఎలా దూకాలో ఆ ముసలామెకు అర్థం కాలేదు. అరవై అయిదేళ్ల వయసులో అలాంటి పని చేయాల్సి వస్తుందని ఊహించనుకూడా ఊహించలేదు. ముడతలు పడ్డ చేతి చర్మం రెయింగ్ను పట్టుకున్న మణికట్టు మీద సంశయాన్ని ప్రదర్శిస్తూ ఉంది. దాని మీద రాలాల్సిన కన్నీటి చుక్కలు గాలి అప్పుడే వీయగా శూన్యంలో లుప్తమైపోయాయి. ఒక్క నిమిషం ఆమె గట్టిగా గాలి పీల్చుకుంది. మెడలో ఉన్న తన పెళ్లినాటి బంగారు గొలుసు తీసి గట్టుమీద పడేసింది. రెయిలింగ్‌ను గట్టిగా పట్టుకొని కాళ్లను తేలిగ్గా చేసి నడుము వంచేస్తే దేహం దాని మానాన అది నీళ్లలో పడిపోతుందని నిర్ణయించుకుంది. రెయిలింగ్ గట్టిగా పట్టుకుంది. నడుము కొద్దిగా వొంచింది. పాదాలు తేలిక చేసి దేహాన్ని నీళ్లలో పడేస్తుండగా టక్కున ఎవరో పట్టుకుని ఆపేశాడు. స్పెషల్ పోలీస్.ఆత్మహత్యలు చేసుకునేవారి మీద నిఘా పెట్టే టీమ్‌లో ఒక సభ్యుడైన శివ.చాలా సేపటిగా ఆమెనే గమనిస్తున్నాడు.‘ఏమైందమ్మా?’ అడిగాడు.ఆమెకు కళ్లవెంట వెచ్చదనం ఉబికింది.‘ఊరుకో తల్లి. ఈ వయసులో ఏమిటి ఈ పని?’ఆమె ఊరికే ఉంది. అతడు ఆమె చేయి పట్టుకుని కొయ్యబల్ల మీద కూర్చోపెట్టాడు.‘కొడుకు ఏమైనా అన్నాడా?’ అడిగాడు.‘కోడలు ఏమైనా అన్నదా?’ అడిగాడు.ఆమె తల అడ్డంగా ఊపింది.‘మరి ఎవరు?’‘మనవడు’ చెప్పిందామె.‘మనవడా? వయసెంత?’ఆమె అతడివైపే చూస్తూ చెప్పింది.‘ప..ది... సం..వ..త్స..రా..లు’. ఒక పదేళ్ల పిల్లాడు ఒక ముసలామె ఆత్మహత్యకు ఎలా ప్రేరేపిస్తాడు? ‘బుజ్జీ... కాస్త నా స్లిప్పర్స్ ఎక్కడున్నాయో చూసి పెట్టవా నాన్నా’... బుజ్జి నుంచి సమాధానం లేదు. ‘బుజ్జీ... ఈ నానమ్మకు హెల్ప్ చేయరా కన్నా’ ‘నువ్వే వెతుక్కో పో’ ‘నువ్వు వెతకొచ్చుగా’ ‘ఏం... నువ్వు గుడ్డిదానివి కాలేదుగా. నువ్వు బ్లైండ్ అయిపో నేను వెతికి పెడతా’ఆమె మాట లేనట్టుగా ఉండిపోయింది.‘అమ్మ డిన్నర్‌కి పిలుస్తోంది’ పిలిచాడు బుజ్జి.ఆమె లేచింది.‘నీ కోసం స్పెషల్‌గా చపాతీ చేయలేదు. అన్నమే తిను. అయినా నీలాంటి ఓల్డ్ లేడీస్ ఏమీ తినరట కదా. నువ్వు మాత్రం ఫుల్‌గా తింటావు. నీకు వేరే పనేం లేదానానమ్మా’... ఆ రాత్రి ఆమె పస్తే పడుకుంది.‘నువ్వు ఎందుకు వేరే డాటర్స్నీ సన్నీ కనలేదు?’ ఒకరోజు అడిగాడు.ఆమె నీరసంగా నవ్వింది.‘నాకు మీ నాన్న ఒక్కడే పుట్టాడురా. వాడే లోకం అనుకున్నాను’‘ఇంకా చాలామందికి బర్త్ ఇచ్చి ఉంటే సరిపోయేదిగా. వాళ్ల దగ్గర ఉండేదానివి. ఎప్పుడూ ఇక్కడే పడి ఉంటావ్. మా ఫ్రెండ్స్ అశ్విన్, భువన్, ఆదేశ్ వాళ్ల ఇళ్లలో నీలా ఎవరూ ఉండరు తెలుసా? వాళ్ల మమ్మీ డాడీ ఎంతో హ్యాపీగా ఉంటారు’ఆమె వాడి వైపు చూసింది.దూరంగా కోడలు చిర్నవ్వుతో వాడి మాటలు వింటూ ఉంది. సాయంత్రం పార్క్‌లో కలిసిన కాలనీ ఆమెతో మాటామాటగా ఈ సంగతి చెప్పింది.‘పిల్లలు అలా మాట్లాడరు. ఎవరైనా మాట్లాడిస్తే తప్ప’ అందామె సానుభూతిగా.‘ఏం చేయను. నా మనసు ముక్కలవుతోంది’‘పిల్లలకు నేర్పాల్సింది తల్లిదండ్రులే. కాని వాళ్లను తమ పగ తీర్చుకోవడానికి సాధనంగా వాడుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. మీ కోడలికి మీరుండటం ఇష్టం లేదు. ఆ మాట తను నేరుగా చెప్పలేక మీ మనవణ్ణి ఆయుధంగా వాడుకుంటోంది. పాపం చిన్నపిల్లాడు. వాడికేం తెలుసు. తల్లి ఎలా చెబుతుంటే అలా చెబుతున్నాడు’‘కోడలు తిట్టినా ఇంత బాధ ఉండదు. కాని చిన్నపిల్లాడితో అంటే’... ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది. మనవడిని ఒడిలో కూర్చుపెట్టుకుని కథలు చెప్పాల్సిన వయసు. కాని ఆ మనవడే విలన్‌గా మారడం ఆమెను తినేస్తోంది.‘ఎందుకీ బతుకు? ఎక్కడైనా దూకి చస్తాను’ అనుకుందామె. పోలీసులు ఆమె కొడుకును, కోడలును, మనవణ్ణి స్టేషన్‌కు పిలిపించారు.సాయంత్రం నుంచి పెద్దావిడ కనిపించకపోయేసరికి వాళ్లు కంగారుగా వెతుక్కుంటున్నారు.తీరా ఈ సంగతి తెలిసేసరికి ఇద్దరూ హడలిపోయారు. కోడలు కంగారుపడిపోయింది.‘క్షమించండత్తయ్యా. ఏదో మిమ్మల్ని ఉడికించడానికి అంటున్నాడని ఊరుకున్నాను. మీరింత బాధపడతారని తెలియదు’ అంది నిజంగానే.‘అమ్మా... ఏంటిది.. చిన్నపిల్లాడు ఏదో అన్నాడని ఇలా చేస్తావా. నేను అనుంటే ఫీలవ్వాలి గానీ’ అన్నాడు కొడుకు.బుజ్జి ఇదంతా స్టన్ అయ్యి చూస్తున్నాడు.‘నానమ్మా.. నువ్వు చచ్చిపోతావా?’ అన్నాడు దగ్గరకొచ్చి చేతులు పట్టుకుని దీనంగా. ఆమె ఆ పసివాణ్ణి చుట్టుకుపోయింది.కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.ఆ తర్వాత బుజ్జి ఆమెను ఏమీ అనలేదు.కొడుకు, కోడలు కూడా బుజ్జికి నానమ్మ ఎంత విలువైన మనిషో, కుటుంబానికి ఎంత పెద్దదిక్కో వివరించారు.ఆమెతో వాళ్లకు పేచీ ఉంటే లేదా ఆమెకు వాళ్లతో పేచీ ఉంటే ఆమెను ఏదైనా మంచి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పిస్తారు తప్పితే ఆమె మనసు ముక్కలు చేయడానికి పిల్లలను మాత్రం ఆయుధంగా మార్చరు గాక మార్చరు. ఇది మాత్రం సత్యం. ఆచరిస్తే... అనుసరిస్తారు పెద్దలను గౌరవించే విధానాన్ని పిల్లలు తల్లిదండ్రుల దగ్గరనుంచే నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులతో గౌరవ మర్యాదలతో మెలిగితే, వీరిని చూసి పిల్లలు తమ తాత, నానమ్మలను గౌరవిస్తారు. ఇంటిలోని పెద్దవాళ్లు ఆస్తి వ్యవహారాలలో లేదా ఇతర విషయాలలో నచ్చకపోతేనో లేదా వారి వ్యవహార శైలి నచ్చకపోతేనో వారి గురించి పిల్లల ముందు కామెంట్ చేయకూడదు. తల్లిదండ్రులు ‘ముసల్ది, ముసలాడు, వాడు, అది...’ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అది తప్పకుండా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. పెద్దవాళ్లకు అనారోగ్యం చేసినప్పుడు ఆ చికిత్సకు అయ్యే ఖర్చు గురించి తల్లిదండ్రులు తప్పుగా మాట్లాడితే అది కూడా పిల్లల పసి మనస్సులపై ముద్రపడుతుంది పెద్దవాళ్లకు పెట్టే ఖర్చు దండగ అని. పెద్దవాళ్లు తమను ఎలా పైకి తీసుకువచ్చారు... అందుకోసం వారు ఎంత కష్టపడ్డారు.. నైతిక విలువలు, ఇతర సంస్కృతీ సంప్రదాయాలు, మంచి అలవాట్లను నేర్పించేందుకు వారు ఎంతగా కృషి చేశారు... వంటి విషయాలను చెప్పుకుంటూ ఉండటం వల్ల తాత, నాయనమ్మ లేదా అమ్మమ్మ తాతయ్యలు మంచివాళ్లని అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలను తాతానానమ్మల దగ్గర కూర్చుని, వారి చేత కథలు, ఇతర మంచి విషయాలు చెప్పించుకునేలా చేయాలి. అప్పుడు వారి మీద గౌరవాభిమానాలు కలుగుతాయి. ముందు మనం మన పెద్ద వాళ్లను గౌరవించాలి. అప్పుడు పిల్లలు మనల్ని అనుసరిస్తారు. డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్స్ - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నెహ్రూ ఇంట.. బాల్యం దయనీయం!
పొదల్లో పడిన బంతిని తెచ్చుకుందామంటే కమాండో అడ్డుకున్నాడు. బయటికెళ్లి ఆడుకుందామంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వద్దన్నాడు. తాజ్‌మహల్ చూద్దామంటే.. కుదరదని కేర్ టేకర్ తేల్చేశాడు. ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను తినబోతే.. ఆయా అడ్డుకుంది. స్కూలుకైనా వెళ్దామనుకుంటే.. టీచర్లే ఇంటికి వస్తున్నారు. బయట స్వేచ్ఛగా ఆడుకుంటున్న చిన్నారులను చూసి.. తాము బంగారు పంజరాల్లో చిలకలమని ఆ అన్నా చెల్లెళ్లు ఎన్నోసార్లు బాధపడ్డారు.- సాక్షి, బాలల దినోత్సవ ప్రత్యేకం నవంబరు 14.. జాతీయ బాలల దినోత్సవం. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకే, ఆయన జయంతిని దేశమంతా బాలల దినోత్సవంగా జరుపుకొంటాం. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. చిన్నారులను ఎంతో ప్రేమించే నెహ్రూ ఇంట్లో వారసులు మాత్రం వారి బాల్యాన్ని అందరిలా ఆస్వాదించలేకపోయారు. ఇందిరాగాంధీ, రాహుల్, ప్రియాంకా బాల్యం భారంగా, దయనీయంగా గడిచింది. నెహ్రూ కుటుంబ వారసులైన కారణంగా తమ ప్రమేయం లేకుండానే వీరు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారిపోయారు. వీరి జీవితాలకు సంబంధించిన పలు విషాదకర సంఘటనలను బాలల దినోత్సవం సందర్భంగా మీకోసం అందిస్తున్నాం. ఇందిరా, రాహుల్, ప్రియాంకాగాంధీల గురించి మునుపెన్నడూ వినని విషయాల గురించిన సమాచారం ఇది. స్వాతంత్య్ర సంగ్రామం కాలంలో జవహర్లాల్ నెహ్రూ పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. ఈ సమయంలో ఆయన తన గారాలపట్టి ఇందిరాగాంధీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే, ఆ దూరం తెలియనివ్వకుండా తన కూతురుకు తరచుగా ఉత్తరాలు రాస్తుండేవారు. నెహ్రూ జైలుకు వెళ్లిన ప్రతీసారి.. నాన్న ఆరోజు ఇంటికి రారని చిన్నారి ఇందిర చాలా బాధపడేవారు. ముఖ్యంగా నెహ్రూ అరెస్ట వార్త తెలుసుకున్న రోజు ఎంత బాధపడేవారో.. ఆయన జైలు నుంచి విడుదలవుతున్నారని తెలిసి అంతే సంతోషపడేవారు. కానీ, మిగిలిన కుటుంబ సభ్యులు తోడుగా ఉండటం ఆమెకు కాస్త ఉపశమనంగా ఉండేది. ఈ విషయంలో ఇందిర మనవలు, మనవరాళ్ల పరిస్థితి మరీ దిగజారిందనే చెప్పాలి. భారంగా రాహుల్, ప్రియాంకల బాల్యం..! ఘనమైన రాజకీయ వారసత్వం, రాజకుటుంబం. వారికేం? నోట్లో బంగారు చెంచాలు పెట్టుకుని పుట్టారు అని అనుకుంటుంది దేశమంతా. కానీ, వారి గురించి ఈ లోకానికి తెలియని కొన్ని నిజాలెన్నో ఉన్నాయి. వాస్తవానికి వారి బాల్యం మనమనుకున్నంత స్వేచ్ఛగా గడిచిపోలేదు. స్థితిమంతుల కుటుంబం, వారసత్వంగా ప్రధాని పగ్గాలు చేపడుతుండటంతో వీరికి శత్రువులూ అదేస్థాయిలో పెరుగుతూ వచ్చారు. 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ తరువాత వీరి కుటుంబ సభ్యులంతా ఉగ్రవాదులకు లక్ష్యంగా మారారు. ఇందిరాగాంధీ హత్య జరిగినపుడు రాహుల్ వయసు 14 ఏళ్లు, ప్రియాంకాకు 12 సంవత్సరాలు. వీరు కూడా ఉగ్రవాదులకు లక్ష్యంగా మారడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంతగా అంటే.. వీరికి సంబంధించిన ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తేగానీ, అనుమతించేవారుకాదు అధికారులు. ఇద్దరినీ స్కూలు మాన్పించారు. టీచర్లే ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. సినిమాలు, షికార్లు, ఆటపాటలు అన్నీ బంద్. అందరి పిల్లల్లా మైదానంలో కాకుండా ఇంటిలో వీరిద్దరే ఆడుకునేవారు. మొత్తానికి పంజరంలో చిలకల్లా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థలో వీరి బాల్యం గడిచిపోయింది. రాహుల్ గాంధీ అలియాస్ రౌల్ విన్సీ! రాజీవ్ గాంధీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక. రాహుల్ డిగ్రీలో చేరాడు. అది మధ్యలో ఉండగానే.. రాజీవ్‌గాంధీ ఎల్టీటీఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు. దీంతో రాహుల్ చదువును విదేశాల్లో కొనసాగించాడు. తమిళపులులు లండన్‌లోనూ హాని తలపెట్టవచ్చన్న అనుమానంతో రాహుల్‌ను అమెరికా పంపారు. ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. అక్కడ రాహుల్‌గాంధీ అంటే ఎవరో అతని క్లాస్‌మేట్స్‌కి తెలియదు. ఎందుకంటే.. భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం రాహుల్‌గాంధీ పేరును రౌల్ విన్సీగా మార్చింది. ఈ విషయం ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌కి తప్ప ఇంకెవరికీ తెలియదు. నెహ్రూ సేవలకు గుర్తుగా బాలల దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకొంటున్నా.. ఆయన ఇంట బాలలు ఎదుర్కొన్న పరిస్థితులు నిజంగా దురదృష్టకరం. -
పెద్దలకు చద్దిమూటలు
మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంలో మెరుగులు తీరును వచ్చేనాళ్ల విభాప్రభాతములు... అని తన శైశవ గీతి కవితలో అన్నాడు మహాకవి శ్రీశ్రీ. భావి ప్రపంచానికి నిజమైన భాగ్య విధాతలు పాపం పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ ఎరుగని బాలలే! ప్రతితరం అప్పటికో, అంతకుముందో, అంతకు చాలా చాలా ముందో.. బాల్యం అన్న ఒక దశను ఆస్వాదిస్తూనో, దాటుకొని వచ్చో ఉంటుంది. మహానుభావులంతా పెద్దవాళ్లవ్వక ముందు చిన్న పిల్లలే! ‘పెద్దల మాట చద్ది మూట’ అంటారు. ఆ పెద్దలంతా ‘చిన్న పిల్లలు’ అన్న ఒక ఆలోచనను దాటుకొని వచ్చినవారే! ఆ పెద్దలు తాము దాటొచ్చిన బాల్యానికి చెప్పే మాటలన్నీ మంచి వైపుకు తీసుకెళ్లేవే!! అందుకే ఆ మాటలు చద్ది మూటలయ్యాయి. ప్రపంచాన్ని మార్పు వైపుకు అడుగులు వేయించిన కొందరు మార్గదర్శకులు బాల్యం గురించి, పిల్లల ఆలోచనల గురించి చెప్పిన కొన్ని గొప్ప మాటలను బాలల దినోత్సవం (నవంబర్ 14) సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ పెద్దలకు చెబుతోన్న మాటలు. పెద్దలకు పెద్దలే అందిస్తోన్న చద్దిమూటలు. ఈ చద్ది మూటలను మీ పిల్లలకు తినిపించండి. అలాగే వాళ్ల కోసమే ప్రత్యేకమైన రోజు కోసం మిఠాయిలు కూడా అందిస్తున్నాం. అవీ తినిపించండి. పిల్లలు నవ్వితే సమాజమనే పువ్వు అందంగా పూస్తుంది. మంచి మాటలతో ఆ నవ్వులను అలాగే పూయిద్దాం... ♦ పసిపిల్లలు పూలతోటలోని మొగ్గల్లాంటి వాళ్లు. వాళ్లను ప్రేమగా సాకాలి. నేటి బాలలే రేపటి పౌరులు. వారే భావి భారత భాగ్యవిధాతలు. – జవహర్లాల్ నెహ్రూ, భారత తొలి ప్రధాని ♦ చిన్నపిల్లల ద్వారానే మనం ప్రేమ సూత్రాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం. మహాత్మాగాంధీ, భారత జాతిపిత ♦ మీ పిల్లలు తెలివైన వాళ్లుగా ఎదగాలనుకుంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలను చదివి వినిపించండి. వాళ్లు మరింత తెలివైన వాళ్లుగా ఎదగాలనుకుంటే, అలాంటి మరిన్ని కథలను చదివి వినిపించండి. అల్బర్ట్ ఐన్‌స్టీన్, భౌతిక శాస్త్రంలో నోబెల్’ గ్రహీత ♦ మీరు పిల్లలకు ఏమైనా బోధించగలమనుకుంటున్నారా? ఏమీ బోధించలేరు. పిల్లలు తమంతట తామే అన్నీ నేర్చుకుంటారు. మీరు చేయాల్సిందల్లా నేర్చుకునే ప్రక్రియలో పిల్లలకు ఎదురయ్యే అవరోధాలను తొలగించడమే. అదే మీ బాధ్యత. స్వామీ వివేకానంద, ఆధ్యాత్మిక గురువు ♦ పిల్లలే ప్రపంచంలోని అత్యంత విలువైన వనరులు. బంగారు భవితకు వారే మేలిమి ఆశలు. జాన్ ఎఫ్ కెన్నడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు ♦ దేవుడెక్కడ ఉంటాడని పాశ్చాత్య దేశాల పిల్లలను అడిగితే వాళ్లు ఆకాశం వైపు చూపిస్తారు. అదే ప్రశ్న భారతదేశంలోని పిల్లలను అడిగితే వాళ్లు తమవైపే చూపిస్తారు. మదర్ థెరిసా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ♦ ఏడ్వలేని వివేకం నుంచి, నవ్వలేని తత్వజ్ఞానం నుంచి, చిన్నారుల ముందు మోకరిల్లలేని ఘనత నుంచి నన్ను దూరంగా ఉంచండి. ఖలీల్ జిబ్రాన్, లెబనీస్–అమెరికన్ రచయిత, తత్వవేత్త ♦ పిల్లలకు బోధించడానికి నాకో నాలుగేళ్ల సమయం ఇవ్వండి. నేను వాళ్లలో నాటిన విత్తు పెకలించడానికి వీల్లేనంతగా ఎదుగుతుంది. వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ రష్యా తొలి అధ్యక్షుడు ♦ మీ సొంత జ్ఞానంతో మీ పిల్లలకు పరిమితులు విధించకండి. రవీంద్రనాథ్ టాగోర్, విశ్వకవి, ‘నోబెల్’ గ్రహీత ♦ మీరెప్పుడూ చదవని పుస్తకాన్ని మీ పిల్లలకు ఇవ్వకండి. దీన్ని నియమంగా పాటించండి. – జార్జ్ బెర్నార్డ్ షా, సుప్రసిద్ధ ఐరిష్ రచయిత ♦ పిల్లలను మంచిగా మలచడానికి ఉత్తమమార్గం వాళ్లను సంతోషపెట్టడమే. ఆస్కార్ వైల్డ్, సుప్రసిద్ధ ఐరిష్ కవి, రచయిత ♦బలప్రయోగంతోనో, కరకుదనంతోనో పిల్లలకు చదువు నేర్పకండి. వాళ్ల మనసులకు ఆసక్తి రేకెత్తించే విషయాలను తెలుసుకునేలా వాళ్లను ప్రోత్సహించండి. – ప్లాటో, గ్రీకు తత్వవేత్త ♦ మనం మన వర్తమానాన్ని త్యాగం చేసినట్లయితే, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. – అబ్దుల్ కలాం, భారత మాజీ రాష్ట్రపతి ♦ పిల్లలు వాళ్ల తొలినాటి లక్షణాలతోనే పెరిగినట్లయితే, ప్రపంచంలో అంతా మేధావులే ఉండేవాళ్లు. గోథే, జర్మన్ రచయిత, రాజనీతిజ్ఞుడు ♦ పిల్లలందరూ కళాకారులే. ఎదిగిన తర్వాత కూడా కళాకారులుగా ఎలా కొనసాగాలన్నదే సమస్య. పాబ్లో పికాసో, సుప్రసిద్ధ స్పానిష్ చిత్రకారుడు ♦ పిల్లలకు అనుకరించే స్వభావం సహజంగానే ఉంటుంది. వాళ్లకు మంచి ప్రవర్తనను నేర్పాలని ఎంతగా ప్రయత్నించినా, వాళ్లు తమ తల్లిదండ్రులను అనుకరించడం మానుకోరు. –మార్క్ ట్వైన్, సుప్రసిద్ధ అమెరికన్ రచయిత ♦ పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించే వ్యక్తులే పిల్లలు. మానవాళి భవితవ్యం వాళ్ల చేతుల్లోనే ఉంది. అబ్రహాం లింకన్, అమెరికా మాజీ అధ్యక్షుడు ♦ మనం స్వర్గాన్ని అందిపుచ్చుకోగల అరచేతులే చిన్నారులు. హెన్నీ వార్డ్ బీచర్, అమెరికన్ సంఘ సంస్కర్త ♦ పిల్లలు నిరంతరం మీ దృష్టిని ఆకర్షించాలని కోరుకోరు. వారికి కావలసిందల్లా ప్రేమ మాత్రమే. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియన్ నాడీ వైద్యుడు, మనస్తత్వ నిపుణుడు ♦ పిల్లలను ఎలా చూసుకుంటున్నదనే దానిపైనే ఒక సమాజం అసలు స్వభావం అవగతమవుతుంది. నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ♦ పిల్లలకు ఎలా ఆలోచించాలో నేర్పించాలి గాని, ఏది ఆలోచించాలో కాదు – సిడ్నీ సుగర్‌మ్యాన్, అమెరికన్ న్యాయమూర్తి ♦ అఖండ పాండిత్యం కంటే కాస్తంత ఇంగితజ్ఞానం గొప్పది. అదే మనం పిల్లలకు నేర్పాల్సింది. విష్ణుశర్మ, ‘పంచతంత్ర’ రచయిత ♦ పిల్లలకు ఏ మేలు చేసినా అది మొత్తం సమాజానికి చేసినట్లే. – గౌతమ బుద్ధుడు ♦ పిల్లల్లో సహజంగా ఉండే జిజ్ఞాసను రేకెత్తించడమే బాలల విద్యావిధానానికి ఉండవలసిన ఏకైక లక్ష్యం. మారియా మాంటిసోరి, ఇటాలియన్ వైద్యురాలు, విద్యావేత్త ♦ ఏదో ఒకటి నింపేయడానికి పిల్లలేమీ ఖాళీ కుండలు కాదు. జ్ఞానంతో వెలిగించాల్సిన దీపాలు వారు. చిన్మయానంద సరస్వతి, ఆధ్యాత్మికవేత్త ♦ పిల్లల విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సినవి మూడే నియమాలు– వాళ్లను ప్రేమించండి, వాళ్లకు పరిమితులు చెప్పండి, వాళ్ల మానాన వాళ్లను ఎదగనివ్వండి. ఎలేన్ ఎమ్ వార్డ్, అమెరికన్ రచయిత్రి ♦ ఏ సమూహానికైనా పసిపిల్లలకు పాలు సమకూర్చడం కంటే గొప్ప పెట్టుబడి మరొకటి ఉండదు విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ మాజీ ప్రధాని ♦ పిల్లల నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఎంత సహనం ఉందో వాళ్ల సమక్షంలో తేలిపోతుంది. ఫ్రాంక్లిన్ పీ జోన్స్, అమెరికన్ హాస్యరచయిత ♦ ఈ ప్రపంచానికి పిల్లలు ఇచ్చే చక్కని సందేశం ఒక్కటే: సహజంగా, నిజాయతీగా, స్వాభావికంగా జీవించండి. – మెహ్మెట్ మ్యూరట్ ఇల్డాన్, టర్కిష్ రచయిత -
అమ్మాయిని కాపాడేదెలా?
సాక్షి, వనపర్తి : లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడం చట్టరీత్యా నేరం అని తెలిసినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏమాత్రం ఆగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చేపట్టిన తనిఖీల్లోనే ఈ విషయం స్పష్టమైంది. వనపర్తి జిల్లాలో కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశాల మేరకు కొన్ని రోజులపాటు లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిలిపివేసినట్లు చెప్పుకున్న ఆస్పత్రుల నిర్వాహకులు, ఆర్ఎంపీలు, స్కానింగ్‌సెంటర్ల నిర్వాహకులు ప్రస్తుతం రూటు మార్చారు. దందాను గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గర్భంలో ఉన్నది ఆడశిశువు అని తేలితే పలువురు తల్లిదండ్రులు అబార్షన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాసులకు కక్కుర్తిపడి ఆస్పత్రుల నిర్వాహకులు ఈ పనికి ఒప్పుకుంటున్నారు. ఫలితంగా ఆడపిల్లల నిష్పత్తి జిల్లాల్లో తగ్గిపోతోంది. బుధవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. కొత్త పోకడలతో... లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసే వైద్యులు కొత్త పోకడలను ఎంచుకున్నారు. తమకు తెలిసిన వారి ద్వారా వస్తేనే చేయడానికి ఒప్పుకుంటున్నారు. ఇందుకు రూ. 10వేల నుంచి రూ.20వేల వరకు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాలు, తండాల్లో ఉండే ఆర్ఎంపీ వైద్యులు ఇలాంటి కేసులను ఎక్కువగా రాబట్టి వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్‌లో ఉండే ఆస్పత్రులు, క్లినిక్, స్కానింగ్ సెంటర్లకు తీసుకువస్తున్నారు. వీరికి స్కానింగ్ చేసిన అనంతరం కడుపులో పెరుగుతున్నది ఆడశిశువు అని తెలిస్తే క్లినిక్‌లో కాకుండా రహస్య ప్రాంతాల్లో అబార్షన్లు చేయిస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఇటీవల వైద్యశాఖ అధికారులు, పోలీసుల తనిఖీలు చేసినా బయటపడటం లేదు. నెలలతో సంబంధమే లేదు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 20వారాల కంటే తక్కువగా ఉన్న గర్భాన్ని అత్యవసర ప రిస్థితి అయితేనే న్యాయ సలహా తీసుకొని అ బార్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ పలువురు వై ద్యులు, ఆర్ఎంపీలు అవేవీ పట్టించుకోవడం లే దు. డబ్బే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 20 వారాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నా తొలగిస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన కొన్ని దాడుల్లో తేటతెల్లమైంది. విస్తుపోయే ఘటనలు.. ♦ ఆగస్టు 11న వనపర్తి డీఎంహెచ్ఓ శ్రీనివాసులుకు పెబ్బేరులోని కృష్ణ నర్సింగ్ హోమ్‌లో అ బార్షన్ చేస్తున్నట్లు పక్కా సమాచారం రావడం తో తనిఖీచేశారు. 6నెలల గర్భాన్ని తొ లగించేం దుకు ఇంజక్షన్లు, మందులను ఇచ్చిన ట్లు తేలింది. అదేవిధంగా పెబ్బేరులోని సాయి రాం ఆస్పత్రిలోని భవిత ల్యాబ్‌లో అనుమతిలేకుండా ఉన్న స్కానింగ్ మిషన్‌ను కూడా సీజ్ చేశారు. ♦ ఆగస్టు 6న వనపర్తి మల్లిక నర్సింగ్ హోమ్‌లో ఎనిమిది నెలల గర్భిణీకి అబార్షన్ చేస్తున్నారన్న సమాచారంతో డీఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించారు. అబార్షన్‌కు వాడిన మందులు లభించాయి. వెంటనే అక్కడి నుంచి ఆస్పత్రిలో ఉన్నవారు పారిపోయారు. -
టీచర్స్ డే రోజు గోవా సీఎం ఏమన్నారంటే...
పనాజీః ప్రశ్నించడం బాల్యం నుంచే అలవడాలని గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు. తమ ప్రశ్నలపై ఉపాధ్యాయులు ఆగ్రహిస్తే తనకు మెయిల్ చేయాలని పిల్లలకు సూచించారు. ‘ బాలలు భయపడాల్సిన పనిలేదు...మీ ప్రశ్నలపై టీచర్లు కోప్పడితే నాకు ఈ మెయిల్ పంపండ’ ని పనాజీలో జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో అన్నారు.నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను చిన్నారులకు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. పిల్లల్లో ఆలోచన రేకెత్తించేలా మనం వారికి శిక్షణ ఇవ్వాలి...వారి ప్రశ్నలు కొన్ని సార్లు సంక్లిష్టంగా ఉంటాయని తెలుసు..అయినా విజ్ఞానం పొందే సామర్థ్యాన్ని మనం కల్పించాల’ ని అన్నారు. ఈ దిశగా విద్యా వ్యవస్థలోమార్పులు చోటుచేసుకోవాలని పారికర్ ఆకాంక్షించారు. -
రాచనగరిలో కీచకులు
బాలికపై సామూహిక అత్యాచారం బాలల దినోత్సవం రోజున ఘటన ఆలస్యంగా వెలుగులోకి నిందితుల కోసం ముమ్మర గాలింపు మైసూరు : సభ్య సమాజం తలదించుకునే సంఘటన రాచనగరిలో చోటుచేసుకుంది. బాలల దినోత్సవం రోజునే ఓ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన మైసూరును ఓ అపాయకర నగరంగా మార్చివేసింది. ఉదయ గిరి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన వివరాలు ... ఈనెల 14న బాలల దినోత్సవం రోజున నగరానికి చెందిన 13 ఏళ్ల బాలికను నదీంపాష అనే యువకుడు శాంతినగర పార్కుకు తీసుకువచ్చాడు. తన స్నేహితుడి ఇంటి వద్ద చిన్న కార్యక్రమం ఉందని సదరు బాలికకు మాయమాటలు చెప్పి శ్రీరంగపట్టణంలోని డాబాలోని ఓ గదికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆ గదిలో తన స్నేహితులు తన్వీర్, సద్దాం షరీఫ్‌లు ఉన్నారు. ముగ్గురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఈ విషయం బయటపెడితే చంపేస్తామని బాలికను బెదిరించి ఇంటికి పంపివేశారు. భయాందోళనకు గురైన బాలిక ఈ విషయాన్ని ఇంటిలో ఎవరికి చెప్పలేదు. రెండు రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పి రావడంతో భయపడిపోరుున బాలిక అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
బాలల బ్రహ్మోత్సవం
పిల్లలు అల్లరి చెయ్యడం సహజం. అల్లరిలో అందం ఉంటుంది. అల్లరిలో బ్రహ్మాండం ఉంటుంది. బాలకృష్ణుడు మన్ను తిన్నాడని తల్లి యశోద... ‘ఏదీ నోరు తెరువు’ అంటుంది. ఆ చిన్ని నోటిలో బ్రహ్మాండాన్ని చూసి... ‘బాపురే! పదునాలుగు భువన భాండమ్ములు’ అని కాసేపు అవాక్కవుతుంది. ఇంకాసేపు మురిసిపోతుంది. మన పిల్లలకు అమ్మానాన్న, సమాజం... యశోదలాగా పెంపుడు తల్లులు. వారిలోని బ్రహ్మాండాన్ని గుర్తించి... పెంచి, పెద్దచేసి మళ్లీ సమాజానికే... ఆ బ్రహ్మాండాన్ని చూపడం ఒక ఆనందకరమైన మురిపెం. ఇంగ్లిష్‌లో ఒక భావన ఉంది. అంటే పిల్లలే బ్రహ్మాండమైన సమాజాలకు అంకురాలు. ఇవాళ 14 నవంబర్. బాలల దినోత్సవం. కానీ.. ‘ఫ్యామిలీ’కి మాత్రం ఇవాళ బాలల బ్రహ్మోత్సవం. బ్రహ్మాండోత్సవం. లక్ష నక్షత్రాలు ఐదు రోజులుగా ఏమంత మంచి విషయాల్లేవు! కరెన్సీ నోట్లు రద్దయ్యాయి. ఏటీఎంలు పనిచెయ్యడం లేదు. గ్రూప్ 2 పరీక్షల్లో గందరగోళం. రాష్ట్రంలో చలి తీవ్రత. బాలల దినోత్సవం ఒక్కటే ఇవాళ కాస్త మంచి సంగతి. పిల్లలకు ఈ నోట్ల పాట్లతో, ఏటీఎంలతో, గ్రూప్ 2 లతో, చలి తీవ్రతతో పనిలేదు. వాళ్ల ప్రపంచం వేరు. ఇంట్లో మన కళ్ల ముందే ఉన్నారు అనుకుంటాం కానీ, వాళ్లది కంప్లీట్‌గా వేరే లోకం. వాళ్లవి కంప్లీట్‌గా వేరే ఆలోచనలు. మన ఈతి బాధలతో వాళ్లని డిస్టర్బ్ చేస్తే.. ‘‘మోదీ వద్దన్నాడని మానేయకుండా.. అందరూ నోట్లు తీసుకుంటూ, అందరూ నోట్లు ఇచ్చుకుంటూ, అందరూ నోట్లు మార్చుకుంటూ ఉంటే ఏమౌతుంది?’’ అని ప్రశ్నిస్తారు. ‘‘ఏటీఎంల దగ్గరికి మనమే ఎందుకు వెళ్లాలి? మొబైల్ ఏటీఎం మిషన్లను ఇంటింటికీ తిప్పొచ్చు కదా’’ అని అడుగుతారు. బహుశా గ్రూప్ 2 ‘పరీక్ష’ల గురించి వాళ్లేం మాట్లాడకపోవచ్చు. చలి గురించి కూడా! పగలు ఎండ ఉంటుంది. రాత్రి.. పక్కలో అమ్మోనాన్నో ఉంటారు. ఇవసలు ఇష్యూలే కావు. వాళ్ల తలనొప్పి ఎప్పుడూ ఒకటే. ‘ఎందుకు?’ అన్నదొక్కటే. ప్రతిదాంట్లోనూ ‘ఎందుకు?’. లక్ష నక్షత్రాలుంటే లక్ష ‘ఎందుకు?’లు! ‘ఎందుకు?’ అనే ప్రశ్న పిల్లల్ని శాస్త్రవేత్తల్ని చేస్తుంది. తత్వవేత్తల్ని చేస్తుంది. సమాజానికి ఇద్దరూ అవసరమే. బల్బూ వెలగాలి. బతుకు పరమార్థమూ తెలియాలి. శాస్త్రవేత్తలోంచి తత్వవేత్తను, తత్వవేత్తలోంచి శాస్త్రవేత్తను బలవంతంగా మొలకెత్తించాలని చూస్తే.. ఎందుకు అనే ప్రశ్న వేసే అవసరం లేకుండానే పిల్లలు విజ్ఞానవంతులైపోయే ప్రమాదం ఉంది. ప్రశ్నించనివ్వని విజ్ఞానం ప్రపంచాన్ని ఎదగనివ్వని పౌష్టికాహారం. తెలుగులో ఉన్న ఏకైక చిల్డ్రన్ ఫ్రెండ్లీ రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు కొన్నాళ్ల క్రితం ‘నామిని ఇస్కూలు పుస్తకం’ అని ఓ పుస్తకం రాశారు. ‘ఏకైక’ అనడం ఎందుకంటే.. తక్కినవాళ్లంతా పిల్లల్ని ఎలా జ్ఞానవంతుల్ని చెయ్యాలో చక్కగా బోధించినవాళ్లు. ఈయనొక్కరే పిల్లల్ని ఎలా జ్ఞానవంతుల్ని చెయ్యకూడదో విడమరిచి చెప్పిన వారు! మేథ్స్ని మేథ్స్లా ఎలా చెప్పకూడదో, ఇంగ్లిష్‌ని ఇంగ్లిష్లా ఎలా నేర్పకూడదో నామిని ఆ పుస్తకంలో రాశారు. నామిని ఎమ్మెస్సీ మేథ్స్. ఈయన మేడీజీ పుస్తకాలు రాసే రచయిత కాదు. మేడీజీ పాఠాలు చెప్పే అయ్యవారూ కాదు. పిల్లల్ని నామిని మచ్చిక చేసుకోరు. పిల్లలకే నామిని మచ్చిక అవుతారు. ‘నామిని ఇస్కూలు పుస్తకం’లో కె.వాణి అనే అమ్మాయి ఉంటుంది. ఐదో తరగతి. లీవ్ లెటర్ రాస్తుంది. లీవ్ లెటర్లలో మన టీచర్లు చెప్పే ఫార్మాట్ ఒకటి ఉంటుంది కదా... సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనీ, సఫరింగ్ ఫ్రమ్ హెడ్డేక్ అనీ, సఫరింగ్ ఫ్రమ్ స్టమకేక్ అనీ.. దాన్ని ఫాలో అయిపోయింది కె.వాణి. పేరెంట్స్‌తో కలిసి ఆ అమ్మాయి తిరుమల కొండకు వెళుతోంది. అందుకే ‘సఫరింగ్ ఫ్రమ్ తిరుమల హిల్స్’ అని రాసింది. పిల్లలు చెప్పింది చెప్పినట్లు అర్థం చేసుకుంటారు. మనమే చెప్పేది చెప్పాల్సినట్టు చెప్పం. మళ్లీ మన ఎవాల్యుయేషన్ ఒకటి! పాస్ అనీ, ఫెయిల్ అనీ! ఆ గ్రేడ్ అనీ, ఈ గ్రేడ్ అనీ. పిల్లల ఐక్యూ లెవల్స్, ఈక్యూ లెవల్స్ వేరువేరుగా ఉండొచ్చు. కానీ పిల్లలందరి లెవల్ ఒకటే. ‘ఎందుకు?’ అనే లక్ష నక్షత్రాల లెవల్. ఆ లెవల్‌కి మనం రీచ్ అవాలి. రీచ్ అవడంలో పిల్లలకు నేర్పడం ఒక్కటే ఉండదు. పిల్లలను చూసి నేర్చుకోవడం కూడా ఉంటుంది. ఇవాళ బాలల దినోత్సవం. బ్యాంకుల దగ్గర, ఏటీఎమ్‌ల దగ్గర ఎంత మనం టూ థౌజండ్ రుపీస్ వాల్యూ టెన్షన్లో ఉన్నా.. ఆ దారిన స్కూలు పిల్లలు వస్తున్నప్పుడో, వెళుతున్నప్పుడో ఒక మెరుపు మెరవచ్చు. ఒక వాన కురవొచ్చు. ఒక హరివిల్లు విరబూయొచ్చు. ‘అవి మనకే’ అనుకుంటే కొంత టెన్షన్ తగ్గుతుంది. మనం బతికే బతుక్కి మరీ అంత అటెన్షన్ ఇవ్వనవసరం లేదనీ అనిపిస్తుంది. ఆకాశంలోని వింతల్ని చూసి ‘అవి మనకే’ అని పిల్లలు అనుకుంటారని శ్రీశ్రీ రాశారు. పిల్లల లోకాన్ని చూసినప్పుడు ‘అది మనకే’ అని మనకూ అనిపించాలి. పిల్లల నవ్వులు, పిల్లల పరుగులు, పిల్లల ఆటలు, పిల్లల పాటలు, పిల్లల అల్లర్లు.. మనసుకు నెమ్మదిని ఇచ్చాయంటే అవి నిజంగా మనకే. అవన్నీ మనం గెంతడం కోసం మెరిసిన మెరుపులే, కురిసిన జల్లులే. విరిసిన హరివిల్లులే. 1. మూడు ముళ్లు కాదు... నాలుగు ముక్కలు రావాలి పేరు: స్వాతి, వయసు.. 14 ఏళ్లు, రంగం: దేశం సిగ్గుపడేది ఘనత.. బాల్యవివాహాల మీద పోరాటం వడగావ్కు చెందిన స్వాతి కి పదకొండేళ్ల వరకు స్కూల్ తెలియదు. రోజూ తల్లితో కలిసి చెత్త ఏరడానికి వెళ్లేది. చదువంటే పిచ్చి. ఇది గమనించిన ‘సిస్టర్ ఆఫ్ డాన్ బాస్కో’ అనే ఎన్జీవో ప్రతినిధులు స్వాతి వాళ్ల గుడిసెకు వెళ్లారు. ఆమె పేరెంట్స్‌ను ఒప్పించి స్కూల్లో చేర్పించారు. అప్పుడే స్వాతి లాంటి చురుగ్గా ఉన్న పిల్లలతో బాల్య వివాహాల మీద స్ట్రీట్ ప్లే వేయించారు. అందులో స్వాతి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా నటించింది. ఆ పాత్ర ఆమెపై ప్రభావం చూపింది. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు ఆమె పేరెంట్స్ స్వాతి కోసం పెళ్లి సంబంధం చూశారు. విషయం అర్థమైంది ఆ అమ్మాయికి. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పాత్ర గుర్తొచ్చింది. బాల్యవివాహం ఎంత తప్పో చెప్పింది. మాకే నీతులు చెప్తున్నావా అంటూ అమ్మానాన్న కొట్టారు. భయపడలేదు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఎన్జీవోకు వెళ్లిపోయింది. పరిస్థితి వివరించింది. స్వాతి కోసం వాళ్లవాళ్లెవరూ రాలేదు. దాంతో ఆ యేడాది చదువు కొనసాగింది. మేలో మళ్లీ ఇంటికి వెళ్తానంటే ఎన్జీవో సిబ్బంది వద్దన్నారు. వాళ్లను సమాధానపరిచి మళ్లీ వడగావ్ చేరుకుంది స్వాతి. అయితే ఆమె ఊహించినట్లే పెళ్లి కోసం మళ్లీ ఒత్తిడి తెచ్చారు. ఈసారి అన్నలూ చేయిచేసుకున్నారు. పోలీస్ కంప్లయింట్ ఇస్తాననీ, ఎన్జీవో సిబ్బందికి ఫోన్ చేస్తే పోలీసులను వెంటబెట్టుకొని వస్తారని బెదిరించింది. బాల్య వివాహం చేస్తే అయిదేళ్లు జైలు శిక్ష, జరిమానా తప్పదని హెచ్చరించింది. రెండు నెలల్లో తమ తల్లిదండ్రుల్లోనే కాదు ఇంకొంత మంది పెద్దల్లో కూడా కొంత మార్పు తెచ్చింది. ప్రస్తుతం స్వాతి ఎనిమిదవ తరగతి చదువుతోంది. డాక్టర్ కావాలనేది ఆమె ఆశయం. 2. మనసు చిత్రణ పేరు: కిషన్ శ్రీకాంత్, ఊరు: బెంగళూరు, ప్రస్తుత వయసు: 20 ఘనత: చిన్న వయసులో చిత్ర దర్శకత్వం వహించి, గిన్నిస్ రికార్డు సాధించడం కిషన్ శ్రీకాంత్ పుట్టింది 1996, జనవరి 26న. పదేళ్లకే 24 సినిమాలు, టీవీ సీరియల్స్‌లో 300 ఎపిసోడ్లలో నటించాడు. ఓ సామాజిక సమస్య ఆధారంగా కథ రాసుకుని స్వీయదర్శకత్వంలో కేరాఫ్ ఫుట్‌పాత్ సినిమా తీశాడు. అది 2006 నవంబర్ 26వ తేదీన విడుదలైంది. అది విజయవంతం కావడంతోపాటు ఐదు భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఇంగ్లిష్‌లోనూ విడుదలై అతడి పేరు ‘యంగెస్ట్ పర్సన్ టు డెరైక్ట్ ఎ ప్రొఫెషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో గిన్నిస్ బుక్‌లో నమోదైంది.ఇలా నటనలో బిజీగా ఉన్న శ్రీకాంత్‌కు... రోజూ స్కూలుకెళ్లడం సాధ్యమయ్యేది కాదు. అయినా అతడు పదవ తరగతిలో 93 శాతం మార్కులతో పాసవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్నాటక ప్రభుత్వం అతడిని అభినందనలతో ముంచెత్తి ప్రశంసాపత్రంతో గౌరవించింది. ఆ సందర్భంగా శ్రీకాంత్ నేరుగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదవడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. కర్నాటక ప్రభుత్వం అనుమతించింది. శ్రీకాంత్ పదహారేళ్లకే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషన్లో చేరాడు. అతడి సినిమా కథాంశమిది... ఒక మురికివాడలో ఫుట్‌పాత్ మీద ఉన్న అనాథ పిల్లాడిని ఒక మహిళ ఇంటికి తీసుకెళ్లి పోషిస్తుంది. అతడిని చదువుకుంటున్న పిల్లలు నిరక్షర కుక్షి అని అవహేళన చేయడం, దాంతో అతడు కసితో ఉన్నత విద్యనభ్యసించి తీరాలని కల కనడం, కలను సాకారం చేసుకుంటాడు. మైఖేల్ ఫారడే, ఆల్వా ఎడిసన్, అబ్దుల్ కలామ్ వంటి మేధావుల జీవిత చరిత్రలను సినిమాలు తీస్తే పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనేది శ్రీకాంత్ అభిప్రాయం. 3. జ్ఞాపకాల చిత్రం పేరు: ఎడ్మండ్ థామస్ క్లైంట్, ఊరు: కొచ్చి, వయసు: ఏడు (ఇప్పుడు లేడు), ఘనత: చిత్రలేఖనం ఎడ్మండ్ థామస్ క్లైంట్‌ది ఆశ్చర్యం, ఆనందం, విషాదం కలగలిపిన జీవితం. జీవించింది ఏడేళ్లలోపే. అప్పటికే 20 వేల పెయింటింగ్‌లు వేశాడు. కేరళలోని కొచ్చిలో 1976 మే 19న పుట్టిన ఎడ్మండ్... 1983 ఏప్రిల్ 15న రంగుల చిత్రాలను మనకు మిగిల్చి కిడ్నీ సమస్యతో అనంతలోకాలకు వెళ్లిపోయాడు.ఎడ్మండ్కి హిందూ పండుగల ఇతివృత్తంతో చిత్రాలు వేయడం ఇష్టం. ఇంటికి సమీపంలో జరిగే వేడుకలను, ప్రతి సంఘటనను, ప్రతి సన్నివేశాన్ని మనోఫలకం మీద ముద్రించుకుని దానిని బొమ్మ వేసేవాడు. త్రివేండ్రంలో ‘18 ఏళ్లలోపు వయసు చిత్రకారులు వేసిన చిత్రాల ప్రదర్శన’లో ప్రథమ బహుమతి అందుకున్నాడు. చేయి తిరిగిన చిత్రకారులకు కూడా ఇరవై వేల చిత్రాలు వేయడానికి కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఎడ్మండ్ సాధించింది ఆరేళ్ల పదకొండు నెలలలోపే. ఎడ్మండ్ జ్ఞాపకార్థం కేరళ ప్రభుత్వం 1995, 2007 లలో అతడి చిత్రాలన్నింటినీ ప్రదర్శనకు పెట్టింది. ఏటా క్లైంట్ పేరుతో కొచ్చిలో పిల్లలకు పెయింటింగ్ కాంపిటీషన్లను నిర్వహిస్తున్నారు. కొచ్చిలో ఒక వీధికి క్లైంట్ రోడ్ అని పేరు పెట్టారు. 4.నవ లోకపు ఉదయాదిత్య పేరు: ఎం. టెనిత్ ఆదిత్య, రంగం: నూతన ఆవిష్కరణలు ఘనత: 11 ఏళ్ళ వయసులోనే ‘పవర్ మైండ్’ అనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రూపకల్పన. తమిళనాడులోని విరుదునగర్ ప్రాంతానికి చెందిన టీనేజ్ కుర్రాడు ఎం. టెనిత్ ఆదిత్య బుర్ర పాదరసం. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన. ఆరో తరగతిలో ఉండగానే తొలి ఆవిష్కరణ సాధించాడు. ఆ తపన, పట్టుదల, అలాంటి ఆలోచనలతోనే ఇప్పటి వరకు ఈ కుర్రాడు ఏకంగా 19 కొత్త ఆవిష్కరణలు చేశాడు.ఆదిత్య కనిపెట్టినవన్నీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిపెట్టాయి. ‘అరటి ఆకులు పాడైపోకుండా కాపాడే టెక్నాలజీ’ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌హిట్. అలాగే, సాకెట్ల కోసం బోలెడన్ని ఎక్స్టెన్షన్ బోర్డులు వాడే పని లేకుండా, ఏ రకమైన ప్లగ్కైనా పనికొచ్చే ‘ఎడ్జస్టబుల్ ఎలక్ట్రిసిటీ ఎక్స్టెన్షన్ బోర్డ్’ కూడా. తన 11వ ఏటే 2008లో ‘పవర్ మైండ్’ అనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రూపొందించాడు. 570 ఏళ్ళ పాటు పనిచేసే సత్తా ఈ సాఫ్ట్వేర్ సొంతం. మెరుపుల నుంచి విద్యుత్ తయారీ, ఏ మాత్రం నష్టం లేకుండా ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడం - ఇలా ఆదిత్య కనిపెట్టినవి బోలెడు.ప్రస్తుతం కోయంబత్తూరులోని ఎస్.వి.ఎస్. కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆదిత్యను ఎప్పుడు కదిలించినా, బోలెడన్ని కొత్త కొత్త ఆలోచనలు చెబుతాడు. కనిపెట్టాల్సినవి ఇంకా చాలా ఉన్నాయంటాడు. 5. టీన్ మార్ పేరు: లాఠీ గ్యాంగ్, ఊరు: కర్ణాటక రాష్ట్రం వాఘ్వాడా వయసు: 14-15 ఏళ్లు, ఘనత: ఆత్మరక్షణకు లాఠీధారణ ఉత్తరప్రదేశ్‌లో గులాబ్ గ్యాంగ్ గురించి విన్నాం. ఆడవాళ్లకు అన్యాయం చేసే మగవాళ్లను లాఠీలతో దండించే గులాబీ రంగు వస్త్రాల మహిళా దళం దేశంలో ఒక సంచలనం. వారి స్ఫూర్తితో ఆడవాళ్లు ఆత్మరక్షణకు ఎన్నో చోట్ల లాఠీలు పట్టుకున్నారు. ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలో ఇది బాలికలు చేస్తున్నారు. బెలగావి జిల్లాలోని వాఘ్వాడా గ్రామంలో ఆడపిల్లలు స్కూలుకు వెళుతుంటే పక్క గ్రామాల నుంచి పోకిరీలు వచ్చి ఏడిపిస్తున్నారు. నడిచిపోతున్న బాలికలను మోటార్ సైకిళ్ల పై వెంబడించి వేధించడం, వారిని తాకి వేగంగా బండ్ల మీద పారిపోవడం చేస్తుండేసరికి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు స్కూలు వద్దు ఏం వద్దు ఇళ్లల్లో కూచోండి అని ఆదేశించారు. నాలుగు గోడల మధ్యే ఉండిపోవడం అంటే భవిష్యత్తును నాశనం చేసుకోవడమే అని భావించి బాలికలు చివరకు తామే లాఠీలు పట్టుకోవాల్సి వచ్చింది. స్కూలుకు వెళ్లే సమయంలో, వచ్చే సమయంలో లాఠీలు పట్టుకుని గుంపుగా నడిచే బాలికలను మనం ఇక్కడ చూడవచ్చు. వీరిలో వచ్చిన ఈ ధైర్యం చూసి గ్రామస్తులు ముచ్చట పడుతున్నారు. ఇరుగు పొరుగు గ్రామాల బాలికలు స్ఫూర్తి పొందుతున్నారు. ఇక పోకిరీలు పరార్ అయ్యారని వేరే చెప్పాలా? 6. పేపర్ గర్ల్ టు సూపర్ గర్ల్ పేరు: శివాంగి, ఊరు: కాన్పూర్ సమీపాన దెహా. వయసు: 15, ఘనత: లక్ష్యాన్ని కనుగొనడం శివాంగి 15 ఏళ్ల వయసులో చేసిన పని... తన లక్ష్యం చదువుకోవడం అని గ్రహించడం. తండ్రి రోడ్డు పక్కన మేగజీన్లు, న్యూస్‌పేపర్లు అమ్మేవాడు. భోజన విరామానికి, వేరే పనులు ఉన్నప్పుడు అతడు స్టాల్ వదిలి వెళితే శివాంగే కూచుని పుస్తకాలు, దినపత్రికలు అమ్మేది. కాని ఇలా ఎంతకాలం... బాగా చదువుకుంటేనే పైకి రాగలం అని అనుకున్నదామె. అందుకు మార్గాలు అన్వేషించింది. బిహార్‌కు చెందిన ఆనందకుమార్ అనే వ్యక్తి కాన్పూర్‌లో ‘సూపర్30’ అనే ప్రోగ్రామ్ నడుపుతున్నాడని పేద, నిమ్న వర్గాలకు చెందిన బాలబాలికలకు తర్ఫీదు ఇచ్చి పై చదువులకు సాయపడతాడని తెలుసుకుంది. దెహాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో క్లాసు పూర్తయిన వెంటనే ఆనందకుమార్‌ను కలిసి తనకు తర్ఫీదు ఇవ్వమని కోరింది. అక్కడే చదువుకుంటూ గురువు ఇంటినే తన ఇంటిగా చేసుకొని కుటుంబ సభ్యుల ఆత్మీయతను పొంది ఐఐటిలో సీటు సాధించింది. ఐఐటి కాన్పూర్‌లో విద్యను అభ్యసించి నేడు మంచి ఉద్యోగాన్ని సాధించింది. తెల్లవారుజామునే న్యూస్‌పేపర్ వేసి రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన అబ్దుల్ కలామ్ మాత్రమే కాదు రోడ్డు పక్క దినపత్రికలు అమ్మి ఇంత ఎదిగిన శివాంగి వంటి వారు కూడా ఆదర్శమే. 7. మహామది పేరు: మేఘాలి మాళవిక, ఊరు: భువనేశ్వర్ వయసు: 10, ఘనత: నదుల ప్రచారం ఎవరైనా ఒక నిమిషంలో ఒకటి నుంచి వంద వరకు అంకెలు చెప్పగలరు. కాని మేఘాలి ఒక నిమిషంలో 165 నదుల పేర్లు చెప్పగలదు. యూరప్‌లో ఉన్న 165 నదుల పేర్లు ఒక్క నిమిషంలో చెప్పడం వల్ల మేఘాలి పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. మేఘాలికి అద్భుతమైన ధారణశక్తి ఉంది. నదుల గురించి విపరీతమైన ఆసక్తి ఉంది. మీరొక ఖాళీ ప్రపంచ పటం ఇస్తే తను ప్రపంచంలోని నదులన్నింటి ప్రవాహాన్ని పెన్‌తో గీసి చూపిస్తుంది. తనకు ఐదు ఖండాల్లోని వేయి నదులు కంఠోపాఠం. ఇలా నదులను గుప్పిట బిగించి ఎందరో విద్యార్థులకు చూపరులకు నదుల పట్ల అవగాహన కలిగిస్తున్న చిన్నారి మేఘాలి ఒక్కతే కావచ్చు. ‘నదులు మానవ జీవనానికి ముఖ్యమైన జీవనాధారం. వాటిని కలుషితం చేయొద్దు’ అని చెబుతుంది మేఘాలి. భువనేశ్వర్‌లో ఐదో క్లాస్ చదువుతున్న ఈ ‘నడిచే ఎన్సైక్లోపిడియా’కు ప్రపంచ దేశాలు వాటి పొరుగు దేశాలు ఆ దేశాల్లో వాడే కరెన్సీ ఇవన్నీ కంఠోపాఠం. అంతేనా?... తను చక్కగా వయొలిన్ నేర్చుకుంటోంది. బొమ్మలు గీస్తోంది. కాసేపు ఉల్లాసానికి కామిక్స్ చూస్తుంది. రోజులో ఎక్కువ సమయం కామిక్స్‌తో గడిపే పిల్లలు మేఘాలిలా భౌగోళిక అవగాహన, కళలు వృద్ధి చేసుకోవడం మంచిది కదూ? 8. ఎకో మెడికో పేరు: సుష్మ వర్మ, ఊరు: లక్నో వయసు: 16, ఘనత: పర్యావరణం పై ప్రేమతో పిహెచ్డి ఎనిమిదేళ్ల వయసులో పదో తరగతి పాసయ్యింది. 15 ఏళ్ల వయసుకే ఎంఎస్సి చేసి రికార్డు సాధించింది. తన చదువుతో తండ్రికి ఉద్యోగం ఇప్పించింది. ఇప్పుడు లక్నో పచ్చదనం కోసం పిహెచ్డి చేస్తోంది. పదహారేళ్ల వయసులో లక్నో బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్న సుష్మ వర్మ జీవితంలో ఆదర్శాలకు అంతులేదు. చిన్నప్పటి నుంచి చదువులో మేధావి అయిన సుష్మ తన కంటే వయసులో దాదాపు ఎనిమిదేళ్లు పెద్దయిన విద్యార్థులతో కలిసి చదువుకుంది. పదమూడేళ్లకు డిగ్రీ పూర్తి చేశాక మెడికల్ ఎంట్రన్స్ రాసి డాక్టర్ కావాలనుకుంది సుష్మ. అయితే పదిహేడు సంవత్సరాలు నిండనిదే మెడిసిన్ చదవడానికి వీల్లేదనే నియమం ఉండటం వల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసింది.అంత చిన్న అమ్మాయి అంత జటిలమైన చదువును చదవగలదా అని అనుమానించినవారికి యూనివర్సిటీ సెకండ్‌గా నిలిచి ఆశ్చర్యం గొలిపింది. అయితే ఆ సమయంలోనే ఆమెను లక్నో చుట్టుపక్కల పరిసరాలు ఆకర్షించాయి. ఫీల్డుకెళ్లినప్పుడల్లా బీడువారిన భూమిని చూసి దీనిని పచ్చదనంతో నింపడం ఎలా అని ఆలోచించేది సుష్మ. ఫలితం ఇప్పుడు ఆమె తన పిహెచ్డి సీటును ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ విభాగంలో నమోదు చేసుకుంది. పర్యావరణం కోసం ఏదైనా చేయాలనే సుష్మ తపన ఇప్పుడు చాలా మంది యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. 9. భూగోళ జ్ఞాన బలుడు పేరు: కౌటిల్య పండిత్, రంగం : విజ్ఞానం ఘనత : 150 దాటిన ఐ.క్యూ!, మినీ ఎన్సైక్లోపీడియా రు.10 లక్షల బహుమతి ‘కౌన్ బనేగా’ పోటీ అర్హత జనరల్ నాలెడ్జిలో అసమాన ప్రతిభ కనబరిచి, ‘గూగుల్ బాయ్’గా ప్రఖ్యాతిగాంచిన కౌటిల్య పండిత్ రెండేళ్ల క్రితం, తన ఆరేళ్ల వయసులో తొలిసారి ఈ దేశాన్ని నివ్వెరపరిచాడు. సమకాలీన వార్తా విశేషాలు, భౌగోళిక గణాంకాలు, లౌకిక విషయాలలో కౌటిల్య గ్రాహ్య, జ్ఞాపక శక్తులు అపారమైనవని గ్రహించిన కురుక్షేత్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు అతడి మస్తిష్క సామర్థ్యాలపై పరిశోధన జరపాలన్న ఉత్సుకతను కూడా కనబరిచారు! విశ్వవిద్యాలయ చైర్మన్ సి.ఆర్.దరోలియా.. కౌటిల్య ఐ.క్యూ. దాదాపు 150 పాయింట్లకు మించడాన్ని గమనించారు. ఆరేళ్ల వయసుకు అది ఎక్కువే. హరియాణాలోని కర్నాల్ జిల్లా వాడైన ఈ చిన్నవాడి భవిష్యత్తు లక్ష్యాల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల నగదు బహుమతిని ఇవ్వడమే కాకుండా, అతడికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన సమయంలోనే ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడా చేతుల మీదుగా తను అందుకున్న ప్రశంసాపత్రంలో ఉన్న చిన్న పొరపాటును కౌటిల్య ఆ వేదిక మీదనే ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాడు! ఆ దృశ్యాన్ని టీవీలో ప్రత్యక్షంగా తిలకించిన హరియాణా ప్రజలు ఆ చిన్నారి సూక్ష్మ బుద్ధిని, తెలివితేటల్ని చూసి ముచ్చటపడ్డారు. అంతకు పూర్వం బాలల దినోత్సవం సందర్భంగా 2013 నవంబర్‌లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్లో ఆ కార్యక్రమ వ్యాఖ్యాత అమితాబ్‌బచ్చన్‌ని కూడా ఇలాగే ఈ బుడతడు తన పరిజ్ఞానంతో మంత్రముగ్ధుణ్ణి చేశాడు. ఆ తర్వాతి ఏడాది బ్రహ్మకుమారీల ‘ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం’ ప్రధాన గురువు దాది గుల్జార్ ఆహ్వానంపై ఆమెను కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. కౌటిల్య జన్మస్థలం కొహండ్. మూడు నాలుగేళ్ల వయసులోనే.. ఏమిటి, ఎక్కడ, ఎవరు, ఎలా, ఎందుకు అనే ప్రశ్నలతో పీక్కుతినేవాడని ఇతడి తల్లిదండ్రులు మురిపెంగా చెప్పుకుంటారు. కౌటిల్య తండ్రి సతీశ్ శర్మ ఆ ఊళ్లోనే ఒక పాఠశాల నడుపుతున్నారు. కౌటిల్య సెలబ్రిటీ అయ్యాక అతడితో కలిసి ఫొటో దిగడానికి ఆ ఊరికి వచ్చేవారు ఎక్కువైనట్లే, అతడి పాఠశాలలో పిల్లల్ని చేర్పించేందుకు వస్తున్న తల్లిదండ్రుల సంఖ్యా ఏటికేడాది పెరుగుతూనే ఉంది. 10. వేగానికి కొత్త కొలమానం పేరు: ప్రియాంశి సోమాని రంగం : మనోగణన (మెంటల్ కాలిక్యులేషన్) ఘనత : 12 ఏళ్ల వయసులో ప్రపంచ విజేత నాలుగు ప్రపంచ పోటీల్లో అసాధారణ ప్రతిభ లిమ్కా, గిన్నిస్ రికార్డులు! జీనియస్ కేటగిరీలో అవార్డు. 2010లో జరిగిన ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్’ పోటీలతో ప్రియాంశి సోమానీ ప్రావీణ్యం వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల వయసులో ఆమె ఆ కప్పును గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన మరో మూడు పోటీలలో కూడా కూడికలు, హెచ్చవేతలు, స్క్వేర్ రూట్లలో వంద శాతం కచ్చితత్వాన్ని ప్రదర్శించి, గణిత మేధావుల ప్రశంసలు అందుకుంది. తొలి పోటీలో 16 దేశాల నుంచి వచ్చిన 37 మంది ప్రత్యర్థుల్ని ఓడించి మరీ ప్రియాంశి విజేతగా నిలబడింది. అదే ఏడాది (2010) జరిగిన ‘పోగో అమేజింగ్ కిడ్స్ అవార్డు’ పోటీలోని జీనియస్ కేటగిరీలో టైటిల్ సాధించింది. ప్రియాంశి గుజరాతీ అమ్మాయి. తండ్రి సత్యేన్ సోమాని బిజినెస్‌మ్యాన్. తల్లి అంజు సోమాని గృహిణి. కూతురిలోని అపరిమితమైన గణాంశ శక్తిని ఆమె పసితనంలోనే గమనించిన ఈ తల్లీతండ్రీ గణితాంశాలలో ఆమెను ప్రోత్సహించారు. తండ్రి బిజినెస్ మానుకుని, తల్లి నిద్ర మానుకుని కూతురి ప్రతిభ పదునెక్కేందుకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చారు. అంతర్జాతీయ పోటీలకు ఆమె చేత దరఖాస్తు పెట్టించారు. ప్రియాంశి ప్రస్తుతం ముంబై ఐ.ఐ.టి.లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తోంది. ఆమె కోసం కుటుంబం కూడా ముంబైకి తరలివెళ్లింది. ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్ కన్నా వేగంగా లెక్కలు వెయ్యడం ప్రిశాంశి ప్రత్యేకత. అందుకే ఆమె ‘మెంటల్ కాలిక్యులేటర్’గా ప్రసిద్ధి చెందింది. ఏ వయసు వారితోనైనా అంకెలు, సంఖ్యలు ఒక ఆట ఆడుకుంటాయి. ప్రియాంశి దగ్గర ఆ లెక్కలు ఉడకవు. ఆమే వాటితో ఆడుకుంటుంది. నిమిషాల్లో కఠినమైన పజిల్స్‌ని సైతం తేలగొట్టేస్తుంది. ఈ ప్రత్యేకతే ఆమెను 2011లో ‘వరల్డ్ మేథ్ డే’కి భారతీయ రాయబారిని చేసింది. ‘‘వేగాన్ని నేను ఇష్టపడతాను. కళ్ల ముందు ఒక గణిత సమస్య ఉన్నప్పుడు, దాని పరిష్కారం కోసం నా మెదడు వేగం అందుకుంటుంది. ఎంత వేగం అందుకుంటుందో చెప్పలేను. ఆన్సర్ ఎలాగూ కనిపెడతాను. కానీ ఎంత వేగంగా కనిపెట్టగలననేదే నా సమస్య’’ అంటుంది ప్రియాంశి. ప్రస్తుతం ఈ బాల మేధావిపై స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు పీహెచ్.డి. చేస్తున్నారు! 11. పాకశాస్త్ర ప్రవీణుడు పేరు: నిహాల్ రాజ్ వయసు: ఆరేళ్లు రంగం: పాకశాస్త్రం ఘనత: వంటల ద్వారా వచ్చిన సొమ్మును ఆటిజం పిల్లలకు డొనేట్ చేస్తున్నాడు. కొచ్చికి చెందిన నిహాల్ అద్భుతమైన వంటగాడు. యేడాది నుంచి వీడియో ద్వారా వంటలు నేర్పించే ట్యూటర్‌గా మారాడు. నోరూరుంచే రకరకాల పాయసాలను, ఐస్‌క్రీములు, కేక్‌లను తయారు చేయడం ఎలాగో చెప్తున్నాడు. పిల్లలకే కాదు పెద్దలకూ పనికొచ్చేలా. నిహాల్ తండ్రి రాజగోపాల్ వి కృష్ణన్. తల్లి రూబీ. ఆమె బేకర్. నిహాలకు వంటలో నైపుణ్యం తల్లి నుంచే అబ్బినట్టుంది. ఆమె వంట చేస్తుంటే చుట్టూ తిరిగేవాడట. అంత చిన్న వయసులోనే వంటకు కావల్సిన పదార్థాలు అందించడం, అమ్మ వంట చేస్తుంటే ఆసక్తిగా గమనించడం చేస్తుండేవాడట. అది గమనించిన రూబీ కొడుకుకు వంట చేయడం నేర్పించింది. అయితే తల్లి దగ్గర వంట ప్రక్రియ మాత్రమే నేర్చుకొని సొంత రెసిపీలు కనిపెట్టడం మొదలుపెట్టాడు ఈ బుల్లి షెఫ్. కొడుకు పాకానికి ముగ్ధుడైన తండ్రి ఆ సింపుల్, స్వీట్ అండ్ డిలీషియస్ రెసిపీలను స్క్రిప్ట్ లేకుండా పదిమందికీ తెలియజెప్పేందుకు ఓ ట్యూబ్చానెల్ను క్రియేట్ చేశాడు. ఒక్క యేడాదిలో ఆ చిన్నోడు వంటల్ని మొత్తం 20 వీడియోలుగా తీశాడు తండ్రి. ఈ లిటిల్ షెఫ్ తయారు చేసిన మిక్కిమౌజ్ మ్యాంగో ఐస్‌క్రీమ్ వీడియో హక్కులను 2వేల డాలర్లకు ఫేస్బుక్ కొనుక్కొంది. ఆ డబ్బును ఏంచేద్దామని తల్ల్లీదండ్రి అడిగితే స్పెషల్లీ చాలెంజ్డ్ పిల్లలకు ఇద్దామన్నాడట. కొడుకు చెప్పినట్టే ఆ డబ్బును ఆటిజం పిల్లల కోసం డొనేట్ చేశారు. 12. ఒడుపైన నైపుణ్యం పేరు: దిలీప్ కుమార్ వయసు : పదమూడు రంగం : క్రీడలు ఘనత : ఏఐఎఫ్ఎఫ్ అండర్-14 క్యాంప్‌కి ఎన్నికయ్యాడు. దిలీప్ కుమార్ సొంతూరు అనంతపురం జిల్లా, కొడిగినహళ్లిలోని కలవపల్లి. ఇద్దరు సంతానంలో రెండోవాడు. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. దిలీప్ కాళ్లల్లోని వేగం, కళ్లల్లోని చురుకుదనం చూసి.. మెరుపులా కదలడం గమనించిన కోచ్ అరుణ్‌కుమార్‌కు దిలీప్లో భవిష్యత్ ఫుట్‌బాల్ ప్లేయర్ కనిపించాడు. దిలీప్ కూడా తక్కువ సమయంలోనే తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అరుణ్ మనసు చూరగొన్నాడు. యేడాదిలోనే మెళకువలు నేర్చుకుని 2014 -15 అనంతపురం జిల్లా ఫుట్‌బాల్ లీగ్ పోటీలకు సన్నద్ధుడయ్యాడు. అందులో ఆ అబ్బాయి ప్రతిభను చూసిన కోచ్ ఇంకా మంచి శిక్షణ అందితే దిలీప్ అంతర్జాతీయస్థాయి ఆటగాడవుతాడని భావించాడు. అలా కోచ్ సహాయంతో 2015లో అనంతపురం స్పోర్ట్స్ విలేజ్‌లో చేరాడు. ఫుట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్నా చదువునూ నిర్లక్ష్యం చేయలేదు. శిక్షణ సమయంలోనే మూడు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తన సత్తా చాటాడు. ఆ ప్రతిభే దిలీప్‌ను ఏఐఎఫ్ఎఫ్ అండర్ 14 క్యాంప్‌కి ఎన్నికయ్యేలా చేసింది. రోజుకు రెండుగంటల ప్రయాణం, పేదరికం.. వంటి ప్రతికూలతలను పట్టించుకోకుండా చక్కటి ఆటగాడిగా పేరుతెచ్చుకోవాలనే గోల్పైనే దృష్టి నిలిపి ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ ఆటలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 13. మిత్ర కళాకారిణి పేరు: ఆరుషి భట్నాగర్ వయసు : పదమూడు రంగం: చిత్రలేఖనం ఘనత: ఏడాది వయసులోనే యంగెస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు. ఏడాది వయసులోనే రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలలో ట్రోఫీని, ఇండోర్ యంగెస్ట్ ఆర్టిస్ట్ అవార్డ్‌తో పాటు మరో 9 అవార్డులను సొంతం చేసుకుంది ఆరుషి. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్లో సోలో ఎగ్జిబిషన్‌తో పాటు దేశ, విదేశాలలో 16 సోలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసింది. 23 కార్యక్రమాలకు గౌరవఅతిథిగా పాల్గొంది. తొమ్మిది కళాఖండాలను విక్రయించి దాని ద్వారా వచ్చిన డబ్బును ‘రేఖాంకన్’ పేరుతో పేద విద్యార్థులకు సాయం చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు మూడు వేలకు పైగా పెయింటింగ్స్ వేసిన ఆరుషి 2005లోనే యంగెస్ట్ పోగో అమేజింగ్ కిడ్స్ అవార్డ్‌నూ కైవసం చేసుకుంది. ఇంత చిన్న వయసులో పెయింటింగ్ ఎలా సాధ్యమైంది? అని ఆరుషిని అడిగితే ‘నేను పాకే వయసులోనే మా నాన్న నాకు ఆడుకోవడానికి కొన్ని కలర్స్ ఇచ్చేవారంట. వాటితో నేలమీదనే ముచ్చటైన డిజైన్స్‌ను గీసేదాన్నట. అలా నా చిత్రలేఖన కళ మొదలైంది’ అని నవ్వుతూ చెబుతుంది. ‘నేను అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్‌ను’ అని చెప్పే ఆరుషి క్రేయాన్స్, వాటర్ కలర్స్, ఆక్రిల్, ఆయిల్ కలర్స్, గ్లాస్, ఇంక్ కలర్స్‌ను వాడుతుంది. ఆరుషి చేతులు పెయింటింగ్‌లోనే కాదు ఫొటోగ్రఫీలోనూ మేటి అనిపించుకున్నాయి. జాతీయస్థాయి ఫొటోగ్రఫీలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 9 ఏళ్ల ఆరుషి చదువులో ముందుంటుంది. ‘రేఖాంకన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి సామాజిక పిల్లల్లో చిత్రలేఖనాసక్తిని పెంచుతోంది. తన కళ ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థకు, ఆర్ట్ వర్క్‌కు వినియోగిస్తుంది. నాలుగేళ్ల క్రితం తాను చదివే స్కూల్లో ఒకమ్మాయి తల్లి ప్రమాదంలో చనిపోవడంతో తన రెండు కళాఖండాలను అమ్మి దాని ద్వారా వచ్చిన లక్షరూపాయలతో ఆర్థిక సాయం చేసింది. ఆరుషికి ఎన్నో తెలివితేటలు, ముందు చూపు, మానవతా దృక్పథం ఉందనడానికి ఇదో చిన్న ఉదాహరణ. 14. స్వశక్తి స్వరూపిణి పేరు: దామినీసేన్ ఘనత: కాలి వేళ్లతో రాయడం రికార్డ్: గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందరూ చేతులతో రాస్తుంటే దామిని కాలివేళ్లతో పుస్తకాల్లో అక్షరాలను లిఖిస్తుంది. తన పనులే కాదు, ఇంటి పనులను కూడా కాలివేళ్లతో చేసేస్తూ తల్లికి సాయంగా ఉంటుంది. పదవ తరగతి పరీక్షలో 80 శాతం మార్కులు తెచ్చుకున్న దామినీ వికలాంగురాలు అన్నవారి నోటనే ఔరా అనిపించింది. కాలివేళ్లతో ఒక గంటలో 38 చిత్రాలను గీసిన ఆర్టిస్ట్‌గా దామినీసేన్ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సొంతం చేసుకుంది. బాల్యం నుంచే ఎన్నో రికార్డులను తన కాలి గోటితో సొంతం చేసుకుంది దామిని. మన దేశంలోని ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు చెందిన దామినీసేన్ పుట్టుకతోనే వికలాంగురాలు. రెండు చేతులు లేకుండా పుట్టిన ఆమెను అంతా వింతగా చూశారు. ‘చేతులు లేకుండా ఎలా బతుకుతుంది’ అని మొహమ్మీదే అనేవారు. ‘మా అమ్మాయికి మేమే రెండు చేతులం’ అనేవారు అమ్మానాన్న. అంతటి భరోసా ఇవ్వడంతో ఏదైనా సాధించి, వారిని సంతోషపెట్టాలను కున్నాను’ అంటుంది దామిని. ఇరుగుపొరుగు పిల్లలు దామినీతో ఆడుకోవడానికి కూడా వెనుకంజ వేసేవారు. దామినీకి చదువుపట్ల ఉన్న ఆసక్తి గమనించి ఆమెను గురుకుల పాఠశాలలో చేర్చారు తల్లీదండ్రి. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న దామిని తన లాంటి ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తుంది. మాధవ్ శింగరాజు -
బాలల నేస్తం చాచా నెహ్రూ
నవంబరు 14 బాలల దినోత్సవం సందర్భంగా... కాలేజీలో నెహ్రూను జో అని పిలిచేవారు.అత్యధిక కాలంపాటు ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిగా నెహ్రూ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేకపోయారు.బాలలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలన్న ఆదేశసూత్రాలు నెహ్రూ ప్రతిపాదనలే! పంచవర్ష ప్రణాళికల రూపకర్త నెహ్రూనే. ఆ ప్రణాళికలలో విద్యకు అధిక మొత్తాన్ని కేటాయించింది ఆయనే. సాహస బాలల పురస్కారాన్ని బాలల దినోత్సవం రోజునే అందజేయడం ఆనవాయితీ.నవంబర్ 14 చిన్నారులందరూ బాగా గుర్తుంచుకునే రోజు. ఎందుకంటే ఆరోజు బాలల దినోత్సవం కాబట్టి. మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అందరికీ తెలిసిందే. ఇంతకూ నెహ్రూకు, బాలలకు సంబంధం ఏమిటి? నెహ్రూ పుట్టినరోజును మాత్రమే బాలల దినోత్సవంగా జరుపుకోవడానికి కారణమేమిటో చూద్దామా? జవహర్లాల్ నెహ్రూ నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో 1889 నవంబర్ 14న జన్మించారు. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. తల్లి స్వరూపరాణి. మోతీలాల్ గొప్ప న్యాయవాది, మంచి పేరున్న రాజకీయవేత్త. వీరిది బాగా కలిగిన కుటుంబం కావడం వల్ల నెహ్రూ, ఆయన తోబుట్టువులు చిన్నప్పటి నుంచి మంచి వస్త్రధారణతో, పాశ్చాత్య పోకడలతో ఆధునికంగా కనపడేవారు. వీరికి హిందీ, సంస్కృతం బాగా వచ్చు. పదిహేను సంవత్సరాల వయసులో నెహ్రూ ఉన్నత చదువులకోసం ఇంగ్లండ్ వెళ్లి, అక్కడి ప్రతిష్ఠాత్మకమైన ట్రినిటీ కళాశాలలో, ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. కొడుకు కూడా తనలాగే న్యాయవాది కావాలన్న ఆకాంక్షతో మోతీలాల్ నెహ్రూను పట్టుబట్టి మరీ న్యాయశాస్త్రం చదివించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడే నెహ్రూ మానసికంగా ఎంతో వికాసాన్ని పొందారు. ప్రపంచ రాజకీయాలపట్ల అవగాహన పెంచుకున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం కోసం స్వదేశానికి తిరిగి వచ్చిన నెహ్రూను గాంధీజీ నాయకత్వంలోని స్వాతంత్య్రోద్యమం అమితంగా ఆకట్టుకుంది. దాంతో ధనార్జన కోసం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి బదులు సాటి ఉద్యమకారులతో కలసి స్వాతంత్య్ర సముపార్జన కోసం పోరాడేందుకే ఆయన మనసు మొగ్గు చూపింది. ఆంగ్లేయులపై పోరాటానికి నడుంకట్టారు. కొడుకు రాజకీయప్రవేశాన్ని మోతీలాల్ మొదట కొంత వ్యతిరేకించారు. పెళ్లి చేస్తేనయినా మారతాడేమోననే ఆశతో కమలా కౌల్ అనే యువతితో వివాహం జరిపించారు. అయితే తండ్రి ఆశను అడియాసలు చేస్తూ, వివాహానంతరం కూడా నెహ్రూ స్వాతంత్య్రపోరాటంలోనే కాలం గడుపుతుండటంతో ఆయనలోని నిబద్ధతను గుర్తించి ప్రోత్సహించారు. అంతేకాదు, కుమారునితోబాటు తాను కూడా స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు మోతీలాల్. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ అడుగుజాడలలో నడిచారు జవహర్లాల్. తనతోబాటు ఎంతోమంది యువకులను జాతీయోద్యమం వైపు మళ్లేలా చేశారు. ఫలితంగా ఆంగ్లేయులు నెహ్రూను తొమ్మిదేళ్లపాటు జైలులో ఉంచారు. జైలుకు వెళ్లేటప్పటికి నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని చాలా చిన్నది. జైలు జీవితం గడిపేటప్పుడు కూడా నెహ్రూ ఊరికే కూచోలేదు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే గ్రంథ రచన చేశారు. ఆయనలోని పోరాటపటిమ, కార్యదక్షత, సహనశీలత, అభ్యుదయ దృక్పథం, అద్భుతమైన ఆలోచనా సరళి, వీటన్నింటితోబాటు నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కలిపి నెహ్రూను స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిని చేశాయి. 1964లో జబ్బుతో చనిపోయేవరకు ఆయన ప్రధాని పదవిలో కొనసాగారు. నెహ్రూ కోటుకు గులాబీ పువ్వు చిన్నారి ప్రియదర్శినికి సుద్దులు చెబుతూ జైలు నుంచే నెహ్రూ ఎన్నో ఉత్తరాలు రాశారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండే ఆ ఉత్తరాలు ఆ తర్వాతి కాలంలో లేఖాసాహిత్యంలో అగ్రస్థానం సంపాదించుకున్నాయి. చిన్న వయసులోనే భార్య చనిపోయినా, నెహ్రూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తల్లి లేని లోటు తెలియకుండా కుమార్తెను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. తన కుమార్తెనే కాదు, చుట్టుపక్కల పిల్లలను కూడా చేరదీసేవారు. ప్రేమగా లాలించేవారు. అందుకే అందరూ ఆయన్ను చాచా (బాబాయ్) అని పిలిచేవారు. ఓసారి నెహ్రూకు ఓ పాఠశాల వార్షికోత్సవంలో ఓ చిన్నారి గులాబీపువ్వును ఇచ్చింది. ఆ పువ్వును తీసుకుని ఆయన తన కోటుకు అలంకరించుకున్నారు. దాంతో ఆ చిన్నారి మొహం ఆనందంతో వెలిగిపోయింది. అప్పటినుంచి ఆయన కోటుకు గులాబీని అలంకరించుకోవడం మొదలు పెట్టారు. బాలల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమను చూసి, 1964లో ఆయన మరణానంతరం నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం మొదలు పెట్టారు. - బాచి