బుక్కెడు బువ్వ.. గుక్కెడు నీళ్లు.. నిలువ నీడ.. బతుకుకు తోడు కరువై... జానెడు పొట్ట కోసం పోరాడుతున్న బాలలెందరో.. నేడు బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల బాధలపై బతుకు చిత్రాలు..
పాల‘బుగ్గల’ పసివాడా..
పట్నం వచ్చిన పోరగాడా..
పాలు మరిచిన పిల్లవాడా..
బాధ్యతలను మోస్తున్న మొనగాడా..
– సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
కట్టెమైన బతుకులు
భారమైన బతుకులో బాధలను మరిచి..
బతుకు బండిలో పయణిస్తున్నామని తలచి..
ఎర్రటి ఎండలో.. కట్టెల బరువుతో నడిచి..
అమ్మకు అండగా ఉంటున్నామని సంతోషించి..
– సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
గుక్కెడు నీటి కోసం..
భూమిపై మూడింట రెండొంతుల నీరున్నా.. ప్రజలు దాహం.. దాహం.. అంటూ ల్లాడుతున్నారు. పాలకులు రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలుపుతున్నారు... కానీ నేటికీ గుక్కెడు నీటి కోసం తపిస్తున్న పేదలెందరో.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
‘వీధి’ బాలలం
పలకా, బలపం పట్టాల్సిన చిట్టి చేతులు మురికి సంచులను పట్టాయి. పేదరికం, విధి కారణంగా వీధి వీధి తిరుగుతూ పడవేసిన ప్లాస్టిక్ సామాన్లను ఎరుతున్నారీ చిన్నారులు..
– సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
ఈ నవ్వులు బడిలో విరియాలి....
తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్ రూపుదిద్దుకుంటుంది. కానీ నేడు ఎందరో బాలలు చదువుకు దూరమవుతూ.. రోడ్ల వెంట, చెత్త కుప్పల దగ్గర కనిపిస్తున్నారు. బడిలో ఉండాల్సిన ఈ చిన్నారులు బతికేందుకు ఇలా రోడ్డుమీదకొచ్చారు... – పెద్దపల్లి వరప్రసాద్, సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
గుక్కెడు నీటి కోసం..
భూమిపై మూడింట రెండొంతుల నీరున్నా.. ప్రజలు దాహం.. దాహం.. అంటూ అల్లాడుతున్నారు. పాలకులు రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలుపుతున్నారు... కానీ నేటికీ గుక్కెడు నీటి కోసం తపిస్తున్న పేదలెందరో.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
చెత్తలో బతుకును వెతుకుతూ..
పుట్టిన వెంటనే ఆడ పిల్లలను చెత్త కుప్పల్లో పడేయడం మనం చూస్తూనే ఉంటాం... పై చిత్రంలో కనిపిస్తున్న ఈ ఈ బాలిక అదే చెత్త కుప్పల్లో తన బతుకును వెతుకుతూ సాగుతోంది... తరాలు మారినా ఆడపిల్ల్లల తలరాతలు మారడం లేదు.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
ఆకలి రాజ్యం
ధనవంతుడినైనా.. పేదవాడినైనా.. ఒకేలా పలకరించేది ఆకలి మాత్రమే..
కోట్లు సంపాదించే దీ కూటి కోసమే... భువిపై ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులెందరో..– సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment