Anand Mahindra Share Interesting Post on Children's Day Goes Viral - Sakshi
Sakshi News home page

Anand Mahindra: ‘నా చిన్నప్పటి ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది’

Published Tue, Nov 16 2021 3:55 PM | Last Updated on Tue, Nov 16 2021 5:48 PM

Anand Mahindra Tweet Gives Smile On lips - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. చిల్డ్రన్స్‌ డే సందర్భంగా తనకు కనిపించిన అనేక మేసేజ్‌లలో ఇది బాగా నచ్చిందని, ఈ మెసేజ్‌ ప్రతీ రోజుకి వర్తిస్తుందని పేర్కొంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 

‘పెరిగి పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావ్‌ అనే ప్రశ్నకి నా చిన్నతనంలో అసలు సమాధానం దొరికేది కాదు. కానీ ఈ రోజు నేను పెద్దయ్యాను. ఇప్పుడు నాకు సమాధానం దొరికింది. అదేంటంటే... తిరిగి చిన్న పిల్లాడిగా మారిపోవాలని అనిపించడం’ అంటూ ఉన్న మెసేజ్‌ని ఆయన షేర్‌ చేశారు. ఈ మేసేజ్‌ చదివిన నెటిజన్లు ఆనంద్‌ మహీంద్రాలోని చమత్కారం చూసి చిరునవ్వులు చిందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement