answer
-
కోడి ముందా? గుడ్డు ముందా?
కోడి ముందా, గుడ్డు ముందా? చిరకాలంగా మనిషి మెదడును తొలుస్తున్న అంతుచిక్కని ప్రశ్న. దీనికి సమాధానం కనిపెట్టేందుకు సైంటిస్టులు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోడి కంటే బహుశా గుడ్డే ముందు వచ్చి ఉండొచ్చని అలాంటి తాజా పరిశోధన ఒకటి పేర్కొంది. జంతువుల ఆవిర్భావానికి చాలాకాలం ముందునుంచే జీవుల్లో గుడ్డు వంటి నిర్మాణాలు ఏర్పడేవని తేలి్చంది. క్రోమోస్పెరియా పెర్కిన్సి అనే ఏకకణ జీవిపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు జెనీవా యూనివర్సిటీ బయోకెమిస్ట్ మరైన్ ఒలివెట్టా తెలిపారు. పరిశోధన బృందానికి ఆమే సారథ్యం వహించారు. పునరుత్పత్తి ప్రక్రియ సందర్భంగా సి.పెర్కిన్సిలో జరిగే పాలింటమీ ప్రక్రియ అచ్చం జంతువుల్లో పిండం ఎదుగుదలను పోలి ఉంటుందని ఒలివెట్టా వివరించారు. ‘‘ఆ ప్రక్రియ ఫలితంగా గుడ్డును పోలే బోలు కణ పదార్థం రూపొందినట్టు కనిపెట్టాం. సంక్లిష్టమైన బహుళకణ జీవుల ఆవిర్భావానికి చాలాముందే తొలినాటి జీవుల్లో పిండం వంటి నిర్మాణాల జెనెటిక్ ప్రోగ్రామింగ్ వ్యవస్థ ఉండొచ్చని దీన్నిబట్టి అంచనా వేయవచ్చు. తొలి నాళ్లలోనే జీవుల్లో బహుళకణ సమన్వయం వంటి ప్రక్రియలు సాగేవనేందుకు మా పరిశోధన ఫలితాలు ఊతమిస్తున్నాయి’’అని చెప్పారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని అంగీకరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కశ్మీర్‌పై మళ్లీ విషం చిమ్మిన పాక్.. తిప్పికొట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో మరోమారు కశ్మీర్ అంశంపై విషం చిమ్మింది. ఈ నేపధ్యంలో కశ్మీర్ విషయంలో పాక్ ఐక్యరాజ్యసమితిలో అసత్యాలను ప్రచారం చేస్తూ, ఈ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ ఆరోపించింది.అబద్ధాలు ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను పాక్ ఉపయోగించుకుంటోందని భారత్ పొరుగుదేశం పాక్‌పై దుమ్మెత్తి పోసింది. పాక్ ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగించినా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మారబోవని భారత్ పేర్కొంది. సమాచార సంబంధిత ప్రశ్నలపై యూఎన్ జనరల్ అసెంబ్లీకి చెందిన నాల్గవ కమిటీ సాధారణ చర్చలో రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ప్రసంగించారు. ఒక పాకిస్తానీ ప్రతినిధి బృందం మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి ఈ ప్రతిష్టాత్మక వేదికను ఉపయోగించుకున్నదని ఆయన ఆరోపించారు.దుష్ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం ఈ ప్రతినిధి బృందానికి అలవాటైందని రాజీవ్ శుక్లా ఆరోపించారు. ఐక్యారాజ్య సమితిలో పాకిస్తాన్.. జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దరిమిలా శుక్లా పాక్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. పాక్ ఎన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చినా వాస్తవాలు మారవన్నారు. ఈ ఫోరమ్ (పాక్) రాజకీయ ఎజెండా కోసం కాకుండా నిర్మాణాత్మకంగా చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా, విశ్వసనీయ సమాచారం అందిస్తూ ప్రజలను సాధికారతపరచడానికి భారత్ కృషి చేస్తున్నదన్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో నిరసనలు -
‘పెళ్లెప్పుడు?’.. రాహుల్ సమాధానాల జాబితా!
‘పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తరచూ ఎదురవుతుంటుంది. దీనికి అతని నోటి నుంచి సమాధానం తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ గాంధీ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మరోమారు ఈ ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. దానికి రాహుల్ గాంధీ నవ్వుతూ బదులిచ్చారు.రాయ్‌బరేలీ ఎన్నికల ర్యాలీలో ఒక వ్యక్తి రాహుల్‌ను మీ పెళ్లెప్పుడు? అని అడిగాడు. దానికి రాహుల్ నవ్వుతూ ‘త్వరలోనే చేసుకోవాలి’ అని సమాధానమిచ్చారు. గతంలో రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నప్పుడు ఓ ఆరేళ్ల చిన్నారి.. రాహుల్‌తో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించింది. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ప్రస్తుతం నేను పనుల్లో బిజీగా ఉన్నాను’ అని సమాధానమిచ్చారు. వెంటనే ఆ చిన్నారి ‘ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయని’ అడిగింది. ఈ ప్రశ్న వినగానే రాహుల్ ఆశ్చర్యపోయారు. అప్పట్లో రాహుల్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఒకసారి పట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీతో ‘మా మాట విని పెళ్లి చేసుకోండి. సమయం ఏమీ మించిపోలేదు. మీరు పెళ్లి చేసుకుంటే మేము ఊరేగింపులో పాల్గొంటాం. పెళ్లి విషయంలో మీరు మీ అమ్మగారి మాట కూడా వినడం లేదని ఆమె మాతో చెప్ప బాధ పడ్డారు. మీరు పెళ్లి చేసుకోవాల్సిందే’ అని అన్నారు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘మీరు అన్నారంటే.. అయిపోతుంది’ అని అన్నారు.గతంలో రాహుల్ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌కు వెళ్లిన సందర్భంలో ఆయన అక్కడ మోటార్ సైకిళ్లను రిపేర్ చేస్తున్న ఒక మెకానిక్‌తో మాట్లాడారు. అప్పుడు ఆ మెకానిక్ రాహుల్‌తో ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడిగాడు. దానికి రాహుల్ ‘నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే చేసుకుంటాను’ అని సమాధానమిచ్చారు. -
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. పరీక్షల్లో జవాబు పత్రాలపై పాటలు, జైశ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్ధులను ప్రొఫెసర్లు పాస్ చేశారు. రాష్ట్రంలోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఉదంతం వెలుగు చూసింది. యూనివర్సీటీలో ఇటీవల ఫార్మసీ పరీక్షలు జరిగాయి. ‘ఫార్మసీని కెరీర్‌గా ఎంచుకోవడం’పై ప్రశ్న రాగా.. పలువురు విర్యార్ధులు తమ జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ అని రాశారు.అంతేగాక హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెరట్ల పేర్లు కూడా రాశారు. విచిత్రమేంటంటే.. ఆ విద్యార్థులందరూ పాస్ అయ్యారు. అయితే పలువురు విద్యార్ధులు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమకు మంచి మార్కులు వేసి పాస్ చేసేందుకు పలువురు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చే సినట్లు వీసీ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసినట్లు వచ్చిన ఆరోపణలపై తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కమిటీ తన నివేదికలో ఇది నిరూపితం అయినట్లు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను హెచ్చరించామన్నారు. అయితే దీనికి పాల్పడినఉపాధ్యాయులను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసిందని, అయితే మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కోడ్ ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘నేను పేదవాడిని.. పాస్ చేయండి’.. సమాధాన పత్రంలో వింత అభ్యర్థనలు!
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన ఇంటర్, మెట్రిక్యులేషన్ పరీక్షల జవాబు పత్రాలను సంబంధిత అధ్యాపకులు దిద్దుతున్నారు. ఈ సమాధాన పత్రాలలో పలువురు విద్యార్థులు తమకు తగినన్ని మార్కులు వేయాలని విన్నవించుకుంటున్నారు. ‘నేను పేదవాడిని. నన్ను పాస్ చేయించండి’ అని ఒక విద్యార్థి వేడుకోగా, మరో విద్యార్థిని ‘సార్, దయచేసి నన్ను పాస్ చేయండి, లేకపోతే మా నాన్న నాకు పెళ్లి చేస్తారు’ అని రాసింది. ఒక విద్యార్థి అత్యంత విచిత్రమైన రీతిలో ప్రశ్నలకు సమాధానాలు రాసే బదులు ప్రేమ లేఖ రాశాడు. జవాబు పత్రాలు దిద్దుతున్న ఉపాధ్యాయులకు వింతవింత సమాధాన పత్రాలు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని బెదిరింపులు కూడా కనిపిస్తున్నాయని అధ్యాపకులు మీడియాకు తెలిపారు. ఫన్నీ కవితలు, పద్యాలు మొదలైనవి కూడా రాస్తున్నారు. ముఖ్యంగా గమనిక అంటూ పలు సందేశాలను రాస్తున్నారు. విద్యార్థులు తమను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరీక్షా పత్రాలు దిద్దుతున్న అఖిలేష్ ప్రసాద్ అనే అధ్యాపకుడు మీడియాకు తెలిపారు. -
‘పెళ్లెప్పుడు?’ పిల్లాడి ప్రశ్నకు రాహుల్ ఏమన్నారు?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో కొనసాగింది. ఈ సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీని ఆరేళ్ల బుడ్డోడు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడు. దీనికి రాహుల్ గాంధీ సరదా సమాధానం ఇచ్చారు. అదేమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే! ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఉన్న రాహుల్‌ను ఆ కుర్రాడు ఈ ప్రశ్న అడగగానే రాహుల్ గాంధీ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అర్ష్ అనే ఆరేళ్ల బాలుడు రాహుల్ గాంధీకి సంబంధించి ఓ బ్లాగ్ క్రియేట్ చేశాడు. దానిలో ఆ కుర్రాడు రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా అభివర్ణించాడు. ఆ కుర్రాడు రాహుల్ గాంధీని ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని అడిగాడు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. తర్వాత ఆలోచిస్తాను’ అని అన్నారు. తరువాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాగా బీహార్ వచ్చిన రాహుల్‌ను చూసేందుకు జనం తరలివచ్చారు. ఈ యాత్ర మణిపూర్‌లో ప్రారంభమై పశ్చిమ బెంగాల్ మీదుగా బీహార్‌కు చేరుకుంది. -
‘వీలైతే నేను మలాల అవుతా’
72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్–2023 కిరీటం దక్కించుకోగా ఫస్ట్ రన్నరప్‌గా థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ నిలిచింది. అయితే ఈ పోటీల్లో ఆఖరి రౌండ్ ప్రశ్నలు చాలా ఆసక్తికరంగానూ గమ్మత్తుగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే అందాల భామలు తమదైన శైలిలో చెప్పి జడ్జిలను మత్రముగ్గుల్ని చేసి కీరిటాన్ని దక్కించుకుంటారు. ఇక్కడ ఈ ముగ్గుర్నీ ఒకే ప్రశ్న అడిగారు. అయితే ఆ ప్రశ్నకు థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఊహించిన రీతిలో ఆమె నుంచి వచ్చిన సమాధానం అక్కడున్న వారిని షాక్ గురి చేయడమే గాక సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఇంతకీ పోర్సిల్డ్ ఏం చెప్పిందంటే..మిమ్మల్ని ఒక ఏడాది వేరొక మహిళల ఉండమంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటారని జడ్జిలు ప్రశ్నించగా..అందుకు పోర్సిల్డ్ తాను మలాలా యూసఫ్‌జాయ్‌ని ఎంచుకుంటానని తేల్చి చెప్పింది. ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఫేస్ చేసిందో మనకు తెలుసు. మహిళల విద్యకోసం పోరాడింది. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత బలంగా పోరాడింది మలాలా. అందువల్ల నేను ఎంచుకోవాల్సి వస్దే ఆమెను సెలక్ట్ చేసుకుంటానని సగర్వంగా చెప్పింది. ఐతే ఇదే ప్రశ్నకు కిరీటం దక్కించుకున్న నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ పోర్సిల్డ్ మాదిరిగానే మహిళల హక్కుల కోసం పాటుపడిన మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్‌ను ఎంచుకుంటాను చెప్పగా, మరో విశ్వసుందరి ఆస్ట్రేలియన్ మోరయా విల్సన్ మాత్రం తన తల్లిని ఎంచుకుంటానని చెప్పింది. ఆమె వల్ల ఈ రోజు ఇక్కడ వరకు రాగలిగానని, అందువల్ల తన తల్లిని ఎంపిక చేసుకుంటానని చెప్పింది. ఇక్కడ థాయిలాండ్ భామ పోర్సిల్డ్ పాక్‌కి చెందిన ఐకానిక్ మహిళ, నోబెల్ శాంతి గ్రహిత మలాలా యూసుఫ్ జాయ్‌ని చెప్పడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఆమె సమాధానం ప్రతి ఒక్కరిని కదిలించింది, ఆలోచింప చేసేలా ఉందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా సెంట్రల్ అమెరికా 1975 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహించింది. FINAL Q&A starting with Thailand! @porxild#72ndMISSUNIVERSE #MissUniverse2023 @TheRokuChannel pic.twitter.com/w71IH4kEvY — Miss Universe (@MissUniverse) November 19, 2023 (చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?) -
రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది?
రష్యా పలు అధికారిక కార్యక్రమాల కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్ (బాడీ డబుల్స్)ను వినియోగిస్తున్నదంటూ సోషల్‌మీడియాలో తరచూ పలు ఊహాగానాలను షికారు చేస్తున్నాయి. అయితే వీటిని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఖండించింది. క్రెమ్లిన్ అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటువంటి వాదనలను వినోదం కోసమే చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మాస్కోలో ప్రారంభమైన రష్యా ఎగ్జిబిషన్లో పెస్కోవ్ మాట్లాడుతూ ‘మాకు ఉన్నది పుతిన్ ఒక్కరే. రష్యా అధ్యక్షుని ‘బాడీ డబుల్స్’ అంటూ వస్తున్న ఊహాగానాలు హాస్యాస్పదమైనవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇటువంటివి విరివిగా కనిపిస్తున్నాయని అన్నారు. కొందరు నిపుణులు ఇంటర్నెట్లో పుతిన్ రూపాలను లెక్కకుమించి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రష్యా అధ్యక్షుని బాడీ డబుల్స్‌ను పలు విదేశీ పర్యటనలతో సహా కొన్ని బహిరంగ కార్యక్రమాలకు కూడా ఉపయోగించారని ఒక వార్తాపత్రిక పేర్కొంది. అలాగే ఇటీవల జపనీస్ టీవీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిల్ బుడనోవ్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. పుతిన్ ‘లుక్-అలైక్’ అంటూ వచ్చిన పలు నివేదికలు అసంబద్ధమైనవంటూ తాజాగా మరోమారు డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మంచి ఫిట్నెస్ కలిగి ఉన్నారని , నాన్‌స్టాప్‌గా కూడా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–4 జవాబు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక ‘కీ’లను తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను సైతం అభ్యర్థుల కోసం వెబ్సైట్లో ఉంచింది. వీటిని వచ్చే నెల 27వ తేదీ వరకు వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. ఈ జవాబు పత్రాలు నిర్ణిత గడువు తర్వాత వెబ్సైట్లో తెరుచుకోవని కమిషన్ స్పష్టం చేసింది. దాదాపు 9 వేల గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ జూలై 1న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో పేపర్–1కు 7,63,835 మంది అభ్యర్థులు హాజరు కాగా, పేపర్–2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. కమిషన్ వెబ్సైట్లో ప్రాథమిక కీలు పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబు పత్రాలను స్కానింగ్ చేసిన కమిషన్... వాటిని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. నెల రోజుల పాటు వీటిని వెబ్సైట్ తెరిచి పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక కీలు సోమవారం నుంచి కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాథమిక కీల పైన ఏవేనీ అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీనుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు నిర్దేశిత లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో తగిన ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను కేవలం ఇంగ్లీషులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని, ఈమెయిల్, పోసు ద్వారా వచ్చే వినతులను సైతం పరిగణించమని, మరిన్ని వివరాలను వెబ్సైట్ తెరిచి చూసుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
రైల్వేలో భారీగా ఉద్యోగాలు ఖాళీ.. మొత్తం ఎన్ని లక్షల పోస్టులంటే?
సాక్షి, అమరావతి: దేశంలో రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉండటం గమనార్హం. ఈ మేరకు రైల్వేశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో పేర్కొంది. దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా మొదటిస్థానంలో నిలిచిన రైల్వేశాఖ.. దేశంలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగాను గుర్తింపు పొందింది. ఇక కీలకమైన ఆపరేషనల్ సేఫ్టీ విభాగంలో 53,178 పోస్టులు పెండింగులో ఉండటం గమనార్హం. దేశంలో అన్ని రైల్వేజోన్ల పరిధిలో కలిపి మొత్తం 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిలో అత్యధికంగా గ్రూప్–సి ఉద్యాగాలే 2.48 లక్షలు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్–ఏ ఉద్యోగాలు 1,965, గ్రూప్–బి ఉద్యోగాలు 105 ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నార్తర్న్ రైల్వేలో 32,636 పోస్టులు ఖాళీగా ఉండగా, అత్యల్పంగా దక్షిణ పశ్చిమ రైల్వే జోన్లో 4,897 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చదవండి: టీడీపీ నేతకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు -
మరోసారి ఇక ఎవ్వరూ దరఖాస్తు చేయరు సార్!
-
హనుమాన్ శోభాయాత్రలో హింస
న్యూఢిల్లీ: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో శనివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటిదాకా 21 మందిని అరెస్టు చేసినట్లు, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు అన్సర్‌తోపాటు ఎస్సైపై కాల్పులు జరిపాడంటున్న మహ్మద్ అస్లాంను అరెస్టు చేశామన్నారు. అస్లాం నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నారు. ‘మసీదు సమీపంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దాడులకు దిగాయి. 8 మంది పోలీసులు, ఒక స్థానికుడు గాయపడ్డారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నాం. ఇతర నిందితులనూ గుర్తిస్తాం. బులెట్ గాయాలైన ఎస్ఐ పరిస్థితి నిలకడగా ఉంది’ అని తెలిపారు. 2020 ఫిబ్రవరి తర్వాత ఢిల్లీలో మత ఘర్షణలు ఇదే మొదటిసారి. ఆదివారం జహంగీర్‌పూర్‌లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు. ఒక వర్గంపైనే కేసులు సరి కాదని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా అన్నారు. బయటివారి కుట్రే శోభాయాత్ర సందర్భంగా ఓ వర్గానికి చెందిన ప్రార్థన మందిరంలోకి చొరబడి మతపరమైన జెండాలను ఎగురవేసేందుకు కొందరు ప్రయత్నించారని, రెచ్చగొట్టేలా నినాదాలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్లే ఘర్షణ జరిగిందని అంటున్నారు. సి–బ్లాక్ మసీదు వద్ద ఘర్షణకు దిగినవారు ఇక్కడివారు కాదని, బయటి నుంచి వచ్చినవారేనని స్థానికులు చెబుతున్నారు. జహంగీర్‌పూర్‌లో హిందువులు, ముస్లింలు దశాబ్దాలుగా కలసిమెలిసి జీవిస్తున్నారని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు. బయటి శక్తులు తమ మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడుతున్నారు. వారిపైనా ఎఫ్ఐఆర్: ఎన్సీపీసీఆర్ ఢిల్లీ మతఘర్షణల్లో చిన్నారులు భాగస్వాములై రాళ్లు విసరడం పట్ల జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆదివారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణల్లో పిల్లలను వాడుకున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను అదేశించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. హింస కోసం పిల్లలను వాడుకోవడం జువెనైల్ జస్టిస్ చట్టం కింద నేరమేనని గుర్తుచేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారిపై కేసులు పెట్టాలని పేర్కొంది. నిందితులపై చేపట్టిన చర్యలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. ఉత్తరాఖండ్‌లోనూ.. హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో భగవాన్‌పూర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా శనివారం ఘర్షణ జరిగింది. ప్రదర్శనలో పాల్గొంటున్నవారిపై మరోవర్గం ప్రజలు రాళ్లు రువ్వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని చెప్పారు. ఘర్షణకు కారణమైన 9 మంది నిందితులను అరెస్టు చేశామని, 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. -
ఈ బుడతడి మాటలకూ పోలీసులు ఫిదా
-
‘నా చిన్నప్పటి ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా తనకు కనిపించిన అనేక మేసేజ్‌లలో ఇది బాగా నచ్చిందని, ఈ మెసేజ్ ప్రతీ రోజుకి వర్తిస్తుందని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘పెరిగి పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావ్ అనే ప్రశ్నకి నా చిన్నతనంలో అసలు సమాధానం దొరికేది కాదు. కానీ ఈ రోజు నేను పెద్దయ్యాను. ఇప్పుడు నాకు సమాధానం దొరికింది. అదేంటంటే... తిరిగి చిన్న పిల్లాడిగా మారిపోవాలని అనిపించడం’ అంటూ ఉన్న మెసేజ్‌ని ఆయన షేర్ చేశారు. ఈ మేసేజ్ చదివిన నెటిజన్లు ఆనంద్ మహీంద్రాలోని చమత్కారం చూసి చిరునవ్వులు చిందిస్తున్నారు. This was circulating on Children’s Day, but relevant 365 days of the year. If you want to remain creative & innovative, rediscover the child in you… pic.twitter.com/DV4xXTngf5 — anand mahindra (@anandmahindra) November 16, 2021 -
సైజు తగ్గిన మోదీకి నా సానుభూతి
విశ్లేషణ కన్హయ్య జైలు నుంచి విడుదలైన రోజు నేను, ప్రొఫెసర్ సోమ సుందరం జేఎన్యూకు వెళ్లాం. విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం దగ్గర సాయంత్రం ఆరు గంటల నుంచి విద్యార్థినీ విద్యా ర్థులు; ప్రభాత్ పట్నాయక్, జయతీ ఘోష్ వంటి మేధావులు, పూర్వ విద్యార్థులు కన్హయ్య కోసం పదకొండు గంటల వరకు వేచి ఉన్నారు. అర్ధరాత్రి 12.30 లకి సభ జరిగితే కన్హయ్య ఉపన్యాసాన్ని అంతా శ్రద్ధగా విన్నారు. అతడు వాడిన ప్రతి పదానికి ఆనందంగా చప్పట్లు చరిచారు. ఆ భావాలను ఆహ్వానించారు. మార్క్సిజం పేరు చెప్పకుండానే ఆ సిద్ధాంతాన్ని బోధించాడు. దళితులు- కమ్యూనిస్టులు కలవాలనే మాట చెప్పకుండానే ఎరుపు - ఆకునీలం ఆహార ప్లేట్లను ఉదహరిస్తూ, సాధించవలసిన కలయిక గురించి స్పష్టంగా చెప్పాడు. పార్లమెంట్ సమా వేశాలు జరుగుతున్న సమయం. తన హావభావాలన్నీ రంగరించి సభ్యులను మెప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ శాయశక్తులా కష్టపడుతున్నారు. రాహుల్ గాంధీ మీద విరుచుకు పడుతున్నారు. బయట మీడియాలో ఒకవైపు మోదీ, మరోవైపు కన్హయ్య బొమ్మలు చూపుతూ సవాల్-ప్రతి సవాల్, ప్రశ్న- జవాబులతో దేశదేశాలలో ఈ అంశం మార్మోగిపోయింది. గత ముప్పయ్యేళ్లలో ఇలాంటి అవకాశాన్ని అంది పుచ్చుకుని సమర్థంగా మాట్లాడి, విద్యార్థిలోకాన్ని ఉత్తేజ పరిచిన ఘటన లేదని మేధావులు మొదలు అంతా కొనియాడుతున్నారు. ఒక సర్వే ప్రకారం కన్హయ్య ఉపన్యాసాన్ని 1 కోటి 80 లక్షల మంది ఆలకించారు. ఇంతటి మహత్తర అవకాశం కల్పించిన మోదీ గారిని అభినందించకుండా ఉండలేక పోతున్నాను. అంతటి స్థాయికి ఎదిగిన కన్హయ్య మీద అనైతిక ప్రక్రియలు ఇంకా కొనసాగిస్తున్నారు. వార్తా వాహినిలో డాక్ట్రిన్ చేయడం ద్వారా అతడిని ముద్దాయిని చేయాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. జరిగిన అవమానం చాలక, మళ్లీ సంఘ్ పరివార్ తాబేదారు మీడియా ద్వారా బురద చల్లడానికి ప్రయత్నిస్తూనే ఉంది. విశ్వవిద్యాలయాలలో అమ్మాయిలు, అబ్బాయిలు కలసి తిరగడం సహజం. ఎక్కడైతే యువతీయువకులు కలసి మెలిసి తిరుగుతారో అక్కడ భగ్న ప్రేమికులు, యాసిడ్ దాడులు ఉండవు. కానీ ఈ వాస్తవాన్ని గమనిం చకుండా ఫొటోలు మార్ఫ్ చేయించి విడుదల చేస్తున్నారు. అమ్మాయిలు సిగరెట్లు, మద్యం తాగుతున్నట్టు ఫేస్బుక్లో ఫొటోలతో మాయ చేస్తున్నారు. కుప్పలు కుప్పలుగా కండోమ్‌లు దొరుకుతున్నాయని బీజేపీ నాయకులు అవమా నకరంగా మాట్లాడుతున్నారు. జేఎన్‌యూలో సంఖ్యా రీత్యా హిందువులే ఎక్కువ. అయినా వారి మీదే లజ్జాకరమైన ప్రకటనలు చేస్తున్నారంటే, మన పిల్లల మీద మనమే చేయని నేరాన్ని మోపి పైశాచికానందం పొందవచ్చునని మనుస్మృతి చెప్పిందా? వాస్తవాన్ని అవాస్తవంగా, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించమని నాగ్‌పూర్ కేంద్రం నూరి పోస్తున్నదా? జైపూర్ ఆరెస్సెస్ కేంద్రంలో అట్టహాసంగా సభలు జరిగాయి. అక్కడ పేదరికం ఎలా పోగొట్టాలి? ఆర్థికంగా దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి? తదితర అంశాల మీద మచ్చుకైనా మాట్లాడలేదు. పేదరికం, కరువుకాట కాలతో ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలు ఒకవైపు; మరో వైపు విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి పారి శ్రామికవేత్తలు వేల కోట్లు మొదలు లక్షల కోట్ల రూపా యలు ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము దుర్వి నియోగం చేసి విదేశాలలో కేళీవిలాసాలతో కాలక్షేపం చేస్తున్నారు. వారంతా బీజేపీ వారసపుత్రులే. అలాంటి వారి మీద చర్య తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యా మని ఆరెస్సెస్ సభలో చర్చించరు. అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే విదేశా లలోని నల్లధనాన్ని వెనక్కు తెస్తామంటూ చేసిన హామీ నెరవేరలేదు. పైగా అక్కడి బ్యాంకులలోని నల్లధనం మాయమైపోతున్నది. ఆ నల్లధనాన్ని బంగారంగా మార్చి, దేశంలోకి తెచ్చి బాండ్ల రూపంలో తెల్లడబ్బుగా మార్చు కునే ప్రక్రియ ఎన్డీఏ హయాంలో యథేచ్ఛగా జరుగుతోంది. అఫ్జల్‌గురును కీర్తించే పీడీఎఫ్‌తో జమ్మూకశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల మాటేమిటి? దీని మీద ఆరెస్సెస్ విధానం ఏమిటి? వీటి మీద వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? స్వదేశీ భక్తి- విదేశీ తొత్తులు- ఇది తరుచు ఆరెస్సెస్ చేసే నినాదం. మోదీ దేశంలో కంటే విదేశాలలోనే ఎక్కువగా పర్యటించారని అంచనా. విదేశీ కార్పొరేట్ సంస్థలకు ఎన్ని రాయితీలు ఇచ్చారు? ప్రపంచంలో చైనా తరువాత భారత్ జనాభాయే ఎక్కువ. ఇక్కడ అపార మార్కెట్‌కు అవకాశం ఉంది. కానీ చైనా మార్కెట్ తీరు వేరు. తమ వ్యాపార వ్యవస్థకు అనుకూలంగా ఉండే భారత్ రావడానికే విదేశీ కంపెనీలు తహతహలాడు తున్నాయి. వీరికి అనుకూలంగా విదేశీ పెట్టుబడులకు ఎన్డీఏ తలుపులు బార్లా తెరిచింది. విదేశీ నిధులను పారిశ్రామిక, నీటి పారుదల అవసరాలకు ఉపయోగించు కుంటే ప్రయోజనం. అలా కాకుండా సర్వీస్ రంగాల మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. దేశంలో అద్భుతాలు సృష్టించే నిపుణులు ఉన్నారు. వారి ప్రతిభను గుర్తించకుండా ఇతర దేశాల వెంట ఎన్డీఏ ప్రతినిధులు పరుగులు తీస్తున్నారు. దాదాపు 280 విదేశీ విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వాటికి సదుపాయాలు కల్పించడానికి వెచ్చిస్తున్న దానిలో 10 శాతం ఇక్కడి విశ్వవిద్యాలయాల మీద ఖర్చు చేస్తే మంచి ఫలితాలే వస్తాయి. కానీ ఎందుకీ విదేశీ విధ్వంసం. ఇక్కడే ఉంది మతలబు. విదేశీ, ప్రైవేటు విశ్వ విద్యాలయాలలో రిజర్వేషన్లు ఉండవు. దళితులు, బలహీనవర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే కాషాయ మానసపుత్రులకు, అగ్ర వర్ణాలకు రుచించదు. విదేశీ విశ్వవిద్యాలయాల వంటి అంశం మీద ఆరెస్సెస్ పెద్దలు ఎందుకు చర్చించరు? అధికారంలో ఉండగానే విద్యా విధాన నిర్ణయాల వ్యవస్థలో కాషాయ భక్తులను నియమించుకోవాలి. న్యాయ, పాలనా వ్యవస్థలతో పాటు, సైన్యం సహా మతవాదులతో నిం పాలి. ఏబీవీపీకి కాయకల్ప చికిత్స చేసి, ప్రత్యర్థులను; ముఖ్యంగా లౌకిక, ప్రగతిశీల భావాలు కలిగిన వారిని పాలక వ్యవస్థ ద్వారా ఎలా తప్పించాలో జైపూర్ సభలో చర్చించారు. నిక్కర్లను వీడి ప్యాంట్లకు ఎదగాలని కూడా నిర్ణయించారట. అధికారం వచ్చింది కదా, ఇంకా నిక్కర్లెందుకు? అధికారం పోయాక ఎలాగూ నిక్కర్లే కట్టాలి. ఇంతై వటుడింతై అన్నట్టు కన్హయ్య ఎదిగితే ఆజానుబాహుడు మోదీ మరుగుజ్జుగా మారారు. ఎదిగిన కన్హయ్యకు అభినందనలు. సైజు తగ్గిన మోదీకి నా సానుభూతి. (వ్యాసకర్త: నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి) మొబైల్: 9490952222 -
ఎగ్జామ్ టిప్స్
జవాబు పత్రం తెరవగానే శుభ్రంగా కనిపించాలి. అంటే మొదటి పేజీలో కొట్టి వేతలు అలికినట్టుగా ఉండటం ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. అంటే కచ్చితంగా తెలిసిన జవాబులు ఉన్న ప్రశ్నలనే మొదట ఆన్సర్ చేయడం మంచిది.అక్షరాలు ముత్యాల్లా ఉండాల్సిన పని లేదు. కాని శుభ్రంగా కనిపిస్తే చాలు. పేపర్ దిద్దేవారికి ఈ స్టూడెంట్ తను రాస్తున్న దాని పట్ల శ్రద్ధాసక్తులు కలిగినవాడు అని అనిపించాలి. అప్పుడు మీ జవాబును వారి శ్రద్ధగా చదివి మార్కులు వేస్తారు. {పశ్నను అరకొరగా చదవకండి. ఏ ప్రశ్న ఎన్ని మార్కులకు అడిగారో స్పష్టంగా గమనించండి. ఆ ప్రశ్నకు ఎంత సమాధానం రాయాలో అంతే రాయండి. ఉత్సాహం కొద్దీ అవసరం లేని వివరాలు రాయవద్దు. వ్యాకరణం, అన్వయం ముఖ్యం. మీరు సమాధానాలు సరిగ్గా రాసినా వ్యాకరణం సరిగా లేని ఒక అర్థం రావలసిన వాక్యానికి మరో అర్థం వచ్చే అవకాశం ఉంది. కనుక పరీక్ష మొత్తం రాసే సమయాన్ని రాసింది ‘వెరిఫై’ చేసుకునే సమయాన్ని విభజించుకోవాలి. చివరి పదిహేను నిమిషాలు అంత వరకూ రాసిన సమాధానాలను వెరిఫై చేసుకోవడానికి వాడుకోవాలి. ఆ సమయంలో రాసిన వాటిలో ఉన్న లోటుపాట్లను గమనించి సరి చేసుకోవాలి. కొందరు గ్రూప్ సబ్జెక్ట్‌లను శ్రద్ధగా లాంగ్వేజ్‌లను తేలిక దృష్టిలో రాస్తారు. ఒక విద్యార్థి ప్రతి పరీక్ష ముఖ్యమైనదే. సరిగ్గా చదివి సరిగ్గా రాయగలిగితే లాంగ్వేజ్‌లలో చాలా మంచి మార్కులు సాధించవచ్చు. ‘అస్పష్టమైన చేతిరాత అసంపూర్ణ విద్యకు సంకేతం’ అన్నారు మహాత్మాగాంధీ. మీ చేతిరాత ఎగుడు దిగుడుగా చిన్నగా లేక పెద్దగా ఎలాగైనా ఉండొచ్చు. కాని అస్పష్టంగా మాత్రం ఉండరాదు. అక్షరాలు స్పష్టంగా రాయడమే పరీక్షలో సగం విజయం అని గ్రహించాలి. - వై. మల్లికార్జునరావు, డెరైక్టర్, నేషనల్ హ్యాండ్రైటింగ్ అకాడెమీ, హైదరాబాద్. -
పాతాళ ప్రశ్నకు జవాబు ఏది?
‘‘నన్నొదలరా బాబూ... పాతాళప్రశ్నలు అడగకు’’ అంటాడు గురువు శిష్యుడితో. ఏదైనా సులువైన ప్రశ్నకు జవాబు చెప్పలేనప్పుడు- ‘‘అదేంట్రా... అదేమైనా పాతాళప్రశ్నా? ఆ మాత్రం జవాబు చెప్పలేవా?’’ అనే మాట కూడా వినిపిస్తుంటుంది. అసలింతకీ పాతాళప్రశ్న అంటే ఏమిటి? అసలా మాటను ఎందుకు ఉపయోగిస్తారు? కఠినమైన, సంక్లిష్టమైన ప్రశ్నను, జవాబు చెప్పడానికి అవకాశం లేని ప్రశ్నను పాతాళప్రశ్న అంటారు. భూమి అడుగున ఉండే చిట్టచివరి లోకం పాతాళం. అక్కడికి చేరుకోవడం ఎంత కష్టతరం? అసలు సాధ్యపడే విషయమేనా? కానే కాదు. అలాగే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడమూ వీలుకాదు. జవాబు చెప్పడానికి ఏమాత్రం వీలుకాని అలాంటి కఠినమైన ప్రశ్నల విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. -
అమ్మకు సాక్షి సలామ్
2015 మదర్స్ డే సందర్భంగా అమ్మలకు 15 సూచనాభివందనాలు అఆలు అంటే... అమ్మకోసం ఐదు ఆన్సర్లు 1 నాకు నెల రోజుల క్రితం బాబు పుట్టాడు. వాడికి రోజూ పది నుంచి పదిహేనుసార్లు విరేచనాలు అవుతున్నాయి. తల్లిపాలు పడకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని, తల్లిపాలు మాని పోతపాలు పట్టమని చెబుతున్నారు. నేనేం చేయాలో తగిన సలహా ఇవ్వండి. - కృష్ణవేణి, తణుకు బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలకు మించిన ఆహారం లేదు. ఈ వయసు పిల్లల్లో పాలు తాగిన ప్రతిసారి ఇలా విరేచనం అవ్వడం సాధారణం. తక్కువమంది పిల్లల్లోనే పాలు పడవు. పాలు పడుతున్నప్పుడు బాబు బరువు క్రమంగా పెరుగుతుంటే తల్లిపాలు జీర్ణమవుతున్నట్లే. విరేచనాలు అవుతున్నాయనే కారణంతో తల్లిపాలు ఇవ్వడాన్ని ఆపడం ఎంతమాత్రమూ మంచిది కాదు. బాబు బరువు పెరగడం లేదంటున్నారు కాబట్టి ఇతర కారణాల కోసం పిల్లల వైద్యుని సంప్రదించండి. 2 నా వయసు 33. మా బాబు వయసు మూడేళ్లు. వాడు సరిగా అన్నం తినడం లేదు. మూడేళ్లకు ఉండాల్సిన బరువు కూడా లేడు. వాడు అందరిలాగే బరువు పెరగడానికి నేనేం చేయాలో చెప్పండి. - సులక్షణ, విజయవాడ బరువు పెరగకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ అందుకు లోపలి అవయవాలైన మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... ఈ నాలుగు ప్రధాన అవయవాలకు సంబంధించిన కారణాలు ఏవైనా అయి ఉండవచ్చు. కొన్నిసార్లు జన్యుపరమైన అంశాల వల్ల లేదా వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ఎత్తు/ఆకృతిని బట్టి కూడా బరువు పెరగకపోవచ్చు. పౌష్టికాహార లోపం వల్ల కూడా బరువు పెరగకపోవచ్చు. మీరు ఒకసారి పిల్లల వైద్యుడిని సంప్రదించి, బాబుకు కొన్ని పరీక్షలు చేయించి పై కారణాలలో దేనివల్ల బాబు బరువు పెరగడం లేదో నిర్ధారణ చేసుకోవడం అవసరం. 3 ప్రస్తుతం నా వయసు 38. పదేళ్ల క్రితం నాకు కొడుకు పుట్టాడు. కానీ రెండేళ్ల క్రితం ఈతకు వెళ్లి చనిపోయాడు. నాకు మళ్లీ బిడ్డలను కనాలని ఉంది. కానీ... ఈ వయసులో బిడ్డలు పుడితే పుట్టుకతో వచ్చే జబ్బులు వస్తాయని మా దగ్గరి వాళ్లు చెబుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరి, నరసరావుపేట వయసు పెరిగాక సంతానాన్ని కనడంలో వచ్చే ముఖ్యమైన సమస్య బిడ్డకు ‘డౌన్స్ సిండ్రోమ్’ రావడం. ఇలాంటి హైరిస్క్ తల్లులు ట్రిపుల్ స్క్రీనింగ్ అనే పరీక్ష చేయించి, మూడోనెల గర్భంలో న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ అనే పరీక్షతో డౌన్స్ సిండ్రోమ్‌ను పసిగట్టవచ్చు. ఈ ఫలితాలు పాజిటివ్ వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష ద్వారా ఉమ్మనీరు తీసి దాన్ని జన్యుపరమైన పరీక్షలకు పంపాలి. ఆ పరీక్షలతో పై జబ్బు ఉందోలేదో నిర్ధరించవచ్చు. ఆ ఫలితాలతో తదుపరి చర్యల గురించి ఆలోచించాలి. 4 ఇటీవలే నాకు కూతురు పుట్టింది. ఇది నాకు తొలిచూలు. రొమ్ముపాలే ఇస్తున్నాను. అయితే రొమ్ములో పాలు అయిపోయాయా లేదా అన్నది నాకు తెలియడం లేదు. ఎప్పుడు రొమ్ము మార్చాలో కూడా తెలియడం లేదు. ఈ విషయంలో నాకు తగిన సలహాలు ఇవ్వండి. పాలుపట్టడంలో జాగ్రత్తలు చెప్పండి. - స్నేహ, మహబూబ్‌నగర్ సాధారణంగా పిల్లలు పాలు తాగడం 10-15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలు పాలు తాగడానికి అలవాటు పడటంలో కాస్త ఆలస్యం కావడం చాలా సాధారణం. చాలామంది పిల్లలు ఒక పక్కనే పాలు తాగి సంతృప్తి చెందుతారు. కానీ కొందరు ఒక పక్క తాగి మళ్లీ మరో పక్క కూడా తాగుతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చివరలో వచ్చే పాలని హైండ్ మిల్క్ అంటారు. ఈ పాలలో ఎక్కువ క్యాలరీస్ ఉండి, బిడ్డ బరువు పెంచడానికి ఇవి దోహదపడతాయి. సాధారణం శిశువు రోజుకు ఐదారుసార్లు మూత్ర విసర్జన చేస్తూ, బరువు పెరుగుతూ ఉంటే అతడికి తల్లిపాలు సరిపోతున్నాయని భావించవచ్చు. అయితే పాలు పట్టే తల్లులు ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటిస్తే మంచిది.పాలిచ్చే తల్లులు వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం ఎంతో అవసరం. రొమ్ములను పరిశుభ్రంగా ఉంచుకోవడం బిడ్డకు మేలు చేసే అంశం.సాధారణంగా పడుకొని పాలు ఇవ్వడం కంటే కూర్చుని పాలివ్వడం మంచిది. 5 నాకు చిన్నపిల్లలంటే చాలా ప్రేమ. అయితే నా రొమ్ములు చాలా చిన్నవి. పెళ్లయి రెండేళ్లయ్యింది. ఇంకా పిల్లలు లేరు. నాకు మాత్రం ఎప్పుడెప్పుడు గర్భవతిని అవుతానా అని ఆతృతగా ఉంది. ఒకవేళ రేపు నాకు బిడ్డలు పుడితే ఈ రొమ్ములలో బిడ్డకు తగినన్ని పాలు పడతాయా? బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే ఏవైనా ముందుజాగ్రత్తలు ఉండే చెప్పండి. ఇప్పటి నుంచే పాటిస్తాను. - ఒక సోదరి, గణపవరం రొమ్ముల పరిమాణానికి పాలకు సంబంధం లేదు. పాలు బాగా పడటానికి మందులు అంతగా ఉపయోగపడవు. బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే తల్లులు తీసుకోవాల్సిన ఆహారం ఎంతో ముఖ్యం. మంచి పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో మేలు. బిడ్డకు పాలిచ్చే తల్లులు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. మీకు పుట్టబోయే బిడ్డకు పాలు సరిపోతాయా లేదా అని ఆందోళన చెందకుండా, మానసికంగా ఆనందంగా ఉండటం వల్ల పాలు ఉత్పత్తి అయ్యే హార్మోన్లు కూడా బాగా స్రవించి పాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6 కుంకుమపువ్వుతో బిడ్డ రంగు మారుతుందా? మంచి రంగు మాట పక్కన పెడితే... కుంకుమపువ్వును పరిమితంగా తీసుకుంటే దీనితో చాలా పౌష్టికాహార ప్రయోజనాలు మాత్రం ఉన్నాయి. దీన్ని పాలలో చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం. ఎక్కువ వాడితే గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వాడితే గర్భస్రావమూ అయ్యే అవకాశం ఉంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. 7 వేవిళ్ల బాధ మరీ ఎక్కువగా ఉంటే...! గర్భవతి అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండి, రక్తహీనత లేకుండా, తగినంత హిమోగ్లోబిన్ ఉన్నవాళ్లయితే వాంతుల కారణంగా గర్భధారణ సమయాల్లో పెరగాల్సినంతగా బరువు పెరగకపోయినా... దాన్ని పెద్ద ఇబ్బందిగా పరిగణించాల్సి అవసరం లేదు. అయితే ఐదు నెలల తర్వాత కూడా గర్భిణీ తగినంతగా బరువు పెరగకపోతే మాత్రం అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. వేవిళ్ల సమస్యను ఎదుర్కొనడానికి ప్రధానంగా ఇంటిచిట్కాలు, ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. అల్లం మురబ్బా లేదా అల్లం, ఉప్పు, నిమ్మరసం కలిసిన మిశ్రమాన్ని తీసుకోవడంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇదేమీ వేవిళ్లకు ఔషధం కాదు. అయితే వేవిళ్లతో బాధపడేవారికి చాలావరకు ఉపశమనంగా ఉంటుంది. 8 ప్రసవం ముందు రోజుల్లో కాళ్ల వాపులుంటే...? గర్భవతుల్లో కాళ్ల వాపు వచ్చే కండిషన్‌ను జెస్టెషనల్ అడిమా అంటారు. మామూలుగానైతే దీని గురించి ఆందోళన పడాల్సిందేమీ లేదు. అయితే ఇలా వాపు వస్తున్న గర్భవతుల్లో హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఏదైనా ఉందేమో చూడాలి. ఇక మన భారతీయ మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. మహిళల్లో హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 11 ఉండటాన్ని ఒక మోస్తరుగా సాధారణంగా పరిగణిస్తుంటాం. అయితే కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం చాలా సాధారణం. ఇక కొందరు మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు, వాళ్లలో కూడా కాళ్లవాపులు ఉండవచ్చు. వాళ్లు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. 9 గర్భవతులు ఇద్దరి కోసం తినాలా... గర్భవతులు తమ కోసం... కడుపులో ఉన్న బిడ్డ కోసం... ఇలా ఇద్దరి కోసం తినాలంటూ చాలామంది అంటుంటారు. కడుపులోని బిడ్డ తన ఆహారాన్ని తల్లినుంచి ఎలాగైనా గ్రహిస్తుంటాడు. కాబట్టి సాధారణ బరువు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు మామూలుగానే తింటే సరిపోతుంది. అంటే బరువు తక్కువగా ఉన్నవారు మినహా మిగతా వారంతా ఇద్దరి కోసం తినడం సరికాదని గ్రహించాలి. 10 గర్భవతులకూ, కడుపులో బిడ్డకూ స్కానింగ్‌తో ప్రమాదమా? అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్లోలా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ప్రమాదరహితమైనవి. ఇవి ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి ప్రతిరోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి కూడా రావచ్చు. అప్పుడు కూడా ఇవి ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు. 11 ఏవి పురిటి నొప్పులు...? ఏవి కావు? గర్భసంచి కండరాల్లోని సంకోచ-వ్యాకోచాల్లో ఏవి పురిటి నొప్పులో గుర్తించడానికి ఒక గుర్తు ఉంటుంది. సంకోచ సమయంలో పొట్ట కండరాలు గట్టిబడటంతో పాటు నొప్పి నడుము వెనక భాగం నుంచి మొదలై క్రమంగా ముందు భాగంలో తొడల వరకు (సరిగ్గా చెప్పాలంటే ప్యూబిక్ బోన్ వరకు) వ్యాపిస్తుంది. పురిటి నొప్పులుగా వచ్చిన నొప్పులు ఒకసారి వచ్చాక అదేపనిగా రాకుండా... వస్తూ, తగ్గుతూ ఉంటాయి. ఈ పురిటినొప్పులు పూర్తి ప్రభావపూర్వకంగా ఉన్నప్పుడు గర్భసంచి ముఖద్వారం (అంటే సర్విక్స్) తెరచుకుంటూ ఉంటుంది. అంటే గర్భసంచి పైభాగం (ఫండస్) ముడుచుకుంటూ, ముఖద్వార (సర్విక్స్) భాగం తెరచుకుంటూ ఉండేవి నిజమైన పురిటి నొప్పులన్నమాట. ఉఊలు అంటే... ఉవిదలతో ఊఁ కొట్టించే వివరాలు 12 అమ్మలూ... మానసిక సమస్యలు! ప్రసవం తర్వాత హార్మోనల్ మార్పుల వల్ల గానీ లేదా శారీరక, మానసిక సమస్యల వల్లగాని కొత్తగా తల్లులైన చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు వస్తాయి. కొందరు డిప్రెషన్లోకి వెళ్తారు. దీన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. పోస్ట్ పార్టమ్ సమస్యలు సైకోసిస్, యాంగ్జైటీ డిజార్డర్స్... ఇలాంటి చాలా రకాల మానసిక సమస్యలు కనిపించవచ్చు. చాలామంది తల్లుల్లో అవి త్వరగానే వాటికవే తగ్గిపోతాయి. కానీ కొందరిలో మాత్రం అవి దీర్ఘకాలం కొనసాగుతాయి. వాటకవే తగ్గిపోయే సమస్యలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఒక జబ్బుగా పరిణమించేవాటిలో మాత్రం చికిత్స చేయాల్సి ఉంటుంది. మరి తల్లులకు చికిత్స చేస్తే ఆ మందులు పాల (బ్రెస్ట్ మిల్క్)లోకి ఇంకే ప్రమాదం ఉంటుంది. అందుకే పాలలోకి ఇంకని మందులనే సైకియాట్రిస్ట్‌లు ఇస్తారు. కొందరి ఈసీటీ అనే ఎలక్రో కన్వల్సివ్ థెరపీ అనే చికిత్స ఇస్తారు. ముందుగానే మానసిక సమస్యలు ఉండటం, మునుపటి ప్రసూతి సమయంలో ఇలాంటి సమస్యలు రావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి సమస్యలు ఉండటం అనే అంశాలు తల్లుల్లో మానసిక సమస్యలు వచ్చేందుకు రిస్క్ ఫ్యాక్టర్లు. వీరి విషయంలో తల్లి వల్ల బిడ్డకు హాని జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. 13 రొమ్ములు తడుముకున్నప్పుడు గడ్డలుంటే..? ఇది చాలామంది యువతులలో నెలకొనే సర్వసాధారణమైన అపోహ. యువతులు, బాలికలలో ఇలాంటి గడ్డలు రావడం సహజం. వీటిని బ్రెస్ట్ లంప్స్ అంటారు. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా లేదు. చిన్న వయసులో బ్రెస్ట్ క్యానర్ రావడం చాలా అరుదు. రొమ్ములో గడ్డలు, రొమ్ములో నొప్పి, చనుమొ నల నుండి డిశ్చార్జి, రుతుస్రావానికి ముందు నొప్పి మొదలైనవన్నీ రొమ్ముకు సంబంధించిన సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. దీని వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం చాలా తక్కువ. అరకొర సమాచారం, క్యాన్సర్‌పై పరిపూర్ణమైన అవగాహన లేనందునే ఇటీవల కాలంలో బ్రెస్ట్ లంప్స్పై యువతులు విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. మా వద్దకు వస్తున్న యువతులలో ఎక్కువ మందికి ఇదే సమస్య. రొమ్ముకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుగా వాటి గురించి కుటుంబ సభ్యులకు తెలిపి, ఆ తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. సమగ్రమైన పరీక్ష లేదా కొన్నిసార్లు ఆల్ట్రాసౌండ్ వంటి చిన్నపాటి టెస్ట్ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఈ సమస్యలో చాలామందికి చికిత్స కూడా అవసరం ఉండదు. కొన్నిటికి మాత్రం చిన్నపాటి శస్త్రచికిత్సతో సమస్య తీరిపోతుంది. 14 గర్భవతుల్లో రక్తహీనత... రక్తహీనత అనే కండిషన్లో రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల కలుగుతుంది. మహిళల్లో ప్రతి డెసిలీటర్కూ 11 నుంచి 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండటాన్ని నార్మల్‌గా పరిగణిస్తారు. ఇది 10 నుంచి 10.9 వరకు ఉంటే దాన్ని చాలా మైల్డ్ అనీమియా అని, 7 నుంచి 10 ఉంటే దాన్ని ఓ మోస్తరు అనీమియా, 7 కంటే తక్కువ ఉంటే తీవ్రమైన అనీమియా అని, ఒకవేళ ఆ విలువ 4 కంటే తక్కువ ఉంటే అతితీవ్రమైన అనీమియా అని చెప్పవచ్చు. రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే తొందరగా అలసిపోవడం, నీరసంగా ఉండటం, తలతిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ కళ్లు, నాలుకను డాక్టర్లు పరీక్షిస్తారు. అవి పేలవంగా ఉండటాన్ని బట్టి రక్తహీనతను అనుమానించి రక్తపరీక్షలు చేయిస్తారు. అయితే చాలామంది రక్తహీనత కోసం హీమోగ్లోబిన్ పాళ్లను మాత్రమే పరీక్షిస్తారు. నిజానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ చేయించాలి. ఈ పరీక్ష ద్వారా రక్తహీనత ఎంత తీవ్రంగా ఉందో తెలియడంతో పాటు అది ఎందువల్ల ఉందో కూడా కొంతమేరకు తెలుస్తుంది. సీబీపీని ఆధారంగా తీసుకుని తదుపరి పరీక్షలను నిర్ణయిస్తారు. 15 బిడ్డకిచ్చే పాలు... తల్లికీ మేలు! బిడ్డకు పాలివ్వడం అటు కేవలం పాపాయికే కాదు... ఇటు తల్లికీ మేలు చేకూరుస్తుంది. ఉదాహరణకు ... బిడ్డకు పాలు పట్టినంత కాలం గర్భధారణకు స్వాభావికంగానే అవకాశాలు తక్కువ. అంటే ఒకరకంగా ఇది ప్రకృతిసిద్ధమైన గర్భనిరోధక సాధనం. (చాలా సందర్భాల్లో ఇది నెరవేరినా కొన్నిసందర్భాల్లో మాత్రం గర్భధారణ జరగవచ్చు. అందుకే పాలిచ్చే తల్లులూ సెక్స్‌లో పాల్గొంటే గర్భనిరోధక సాధనాలు వాడాలి) పాలిచ్చే తల్లులకు రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే రొమ్ములో హానికరం కాని నాన్ క్యాన్సరస్ గడ్డలు వచ్చే రిస్క్ కూడా తక్కువే. మిగతావారితో పోలిస్తే బిడ్డకు పాలు పట్టే అమ్మలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలూ తక్కువే. ఒకవేళ వచ్చినా తీసుకోవాల్సిన ఇన్సులిన్ మోతాదు కూడా మిగతావాళ్ల కంటే తక్కువగా ఉంటుందని బ్రిటన్ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో తేలింది. మిగతావారితో పోల్చినప్పుడు పాలిచ్చే తల్లుల్లో యుటిరైన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. బిడ్డకు పాలివ్వడం ఆస్టియోపోరోసిస్నూ నివారిస్తుంది. -
నిర్లక్ష్య ఫలితం ఇది!
కనువిప్పు ‘‘మీ పెద్ద అబ్బాయి ఏం చదువుతున్నాడు?’’ అని ఎవరైనా అడిగితే మా నాన్న ముఖంలో కనిపించే విషాదాన్ని మరవ లేకుండా ఉన్నాను. పెద్దల మాట చద్ది మూట అంటారు. నేను మాత్రం పెద్దలు ఏదైనా చెప్పబోతే ‘చెప్పింది చాలు. సుత్తి ఆపు’ అన్నట్లుగా చూసేవాడిని. నీతులు చెప్పబోతే నిప్పులు మింగినట్లు ఇబ్బందిగా ముఖం పెట్టేవాడిని. ‘‘ఎప్పుడు చూసినా బజార్లో కనిపిస్తావు. బుద్ధిగా చదువుకోవచ్చు కదా’’ అని ఒకసారి మా పెద నాన్న అంటే- ‘‘నా విషయం మీకు అనవసరం. ఈ నీతులేవో మీ అబ్బాయికి చెప్పుకోండి’’ అన్నాను కోపంగా. ఇక అప్పటి నుంచి పెదనాన్న నన్ను చూస్తేనే ఒకలా ముఖం పెట్టేవారు. ‘‘గొడవల్లో తలదూరుస్తున్నావట. చదువుకోవాలని లేదా?’’ అని మా బావ ఒకసారి అక్షింతలు వేయబోతే- ‘‘నాకు చెప్పేంత సీన్ నీకు లేదు. నీ పనేదో నువ్వు చూసుకో’’ అని దురుసుగా సమాధానం ఇచ్చే సరికి ఆయన తీవ్రంగా హర్ట్ అయ్యారు. ‘‘నువ్వు పరాయి వాడివైతే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వినాల్సిన అవసరం లేదు. నువ్వు దగ్గరి బంధువు కదా అని నీ మంచికే చెప్పాను. ఇక ముందు నేను నీతో మాట్లాడను. దయచేసి నువ్వు కూడా నాతో ఎప్పుడూ మాట్లాడవద్దు’’ అన్నాడు బావ బాధగా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొడవలు. దగ్గరి వాళ్లు ఎందరో దూరం అయ్యారు. అయినా సరే నాలో పశ్చాత్తాపం లేదు. మార్పు లేదు. అందరూ అనుకున్నట్లుగానే ఇంటర్మీడియెట్ తప్పాను. ఎన్నిసార్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసినా పాస్ కాలేక పోయాను. ఖాళీగా ఉంటే మరింత చెడిపోతాడనే కారణంతో నాన్న నాతో చిన్న కిరాణా కొట్టు ఒకటి పెట్టించాడు. ఈ కొట్టు వల్ల లాభాలు రావు. నష్టాలు రావు. ఏదో నడవాలి కాబట్టి నడుస్తుంది. ‘‘మీ పెద్ద అబ్బాయి ఏం చదువుతున్నాడు?’’ అని ఎవరైనా అడిగితే మా నాన్న ముఖంలో కనిపించే విషాదాన్ని మరవ లేకుండా ఉన్నాను. అందుకే గట్టిగా నిర్ణయించుకున్నాను. అది వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు. నాన్న నా గురించి గర్వంగా చెప్పుకునేలా చేయాలనుకున్నాను. ఇప్పుడు నా కళ్లు పూర్తిగా తెరుచుకున్నాయి. -టియస్, రాజమండ్రి