సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక ‘కీ’లను తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను సైతం అభ్యర్థుల కోసం వెబ్‌సైట్‌లో ఉంచింది.
వీటిని వచ్చే నెల 27వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు. ఈ జవాబు పత్రాలు నిర్ణిత గడువు తర్వాత వెబ్‌సైట్‌లో తెరుచుకోవని కమిషన్ స్పష్టం చేసింది. దాదాపు 9 వేల గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ జూలై 1న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో పేపర్–1కు 7,63,835 మంది అభ్యర్థులు హాజరు కాగా, పేపర్–2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు.
కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీలు
పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబు పత్రాలను స్కానింగ్ చేసిన కమిషన్... వాటిని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. నెల రోజుల పాటు వీటిని వెబ్‌సైట్ తెరిచి పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక కీలు సోమవారం నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
ఈ ప్రాథమిక కీల పైన ఏవేనీ అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీనుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు నిర్దేశిత లింకు ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో తగిన ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను కేవలం ఇంగ్లీషులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని, ఈమెయిల్, పోసు ద్వారా వచ్చే వినతులను సైతం పరిగణించమని, మరిన్ని వివరాలను వెబ్‌సైట్ తెరిచి చూసుకోవాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment