Documents
-
గవర్నర్ కుటుంబ సభ్యుల వివరాలను సేకరించిన అధికారులు
-
9న సీఎం చేతుల మీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు
హైదరాబాద్: ఈనెల 9 తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామ క పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ఆదివారం సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీచేస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి సరి్టఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారని, సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలలోపే ఎల్.బి.స్టేడియానికి చేరేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వారిని హైదరాబాద్‌కు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు. -
‘డీఎస్సీ’కి నకిలీల బెడద!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ఈ నెల 9న నియామక పత్రాలు అందిస్తారో లేక వాయిదా వేస్తారోననే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది అభ్యర్థులు నకిలీ స్థానికత పత్రాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని పరిశీలించాకే నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా న్యాయ సమస్యలు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.అడ్డదారిలో సర్టిఫికెట్లు..: టీచర్ పోస్టును ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులు నకిలీ స్థానికతతో సర్టిఫికెట్లు తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున రాష్ట్ర అధికారులు మెరిట్ లిస్ట్‌ను జిల్లాలకు పంపగా అందులో ఎవరి లోపాలు ఏమిటని అభ్యర్థులు పరస్పరం కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరికొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అభ్యర్థి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పరిగణిస్తారు. గతంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు పరిగణనలోకి తీసుకొనేవాళ్లు. ఉన్నత క్లాసులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వద్ద ఆ రికార్డు తప్పకుండా లభించే వీలుండేది. కానీ ఇప్పుడు ఒకటి నుంచి ఏడో తరగతి నిబంధన ఉండటంతో ఏదో ఒక స్కూల్ నుంచి అభ్యర్థులు ధ్రువీకరణ తెస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ వద్ద సరైన రికార్డులు కూడా ఉండటం లేదు. కరోనా వ్యాప్తి అనంతరం చాలా వరకు ప్రైవేటు ప్రాథమిక స్కూళ్లు మూతపడటం వల్ల వాటిల్లో చదివిన విద్యార్థుల రికార్డులు ప్రభుత్వం వద్ద పక్కాగా లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు తెస్తున్నారని అధికారులకు అందుతున్న ఫిర్యాదులనుబట్టి తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలోనూ నకిలీ సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా ఇవి అధికారికంగా వచ్చే ధ్రువపత్రాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు భావించగా చాలాచోట్ల అనర్హులు ఈ పత్రాలు తీసుకురావడం గందరగోళానికి దారితీస్తోంది.మోసాల్లో మచ్చుకు కొన్ని ..∙ఆదిలాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థి ఎస్జీటీ కేటగిరీలో ర్యాంకు సాధించాడు. ఉట్నూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినట్లు స్థానికత సర్టిఫికెట్ జత చేశాడు. అయితే ఆ సర్టిఫికెట్తో బోనఫైడ్, ఇతర సర్టిఫికెట్లను అధికారులు పోల్చి చూడగా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రిపేరు తప్పుగా ఉన్నాయి. దీన్ని నిలదీసిన అధికారులకు తన దగ్గరున్న మరో స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీనిపై ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.ఆదిలాబాద్ పట్టణంలో మరాఠీ మీడియంలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఓ మహిళా అభ్యర్థి స్థానికంగానే చ దువు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. అయితే అవి నకిలీవని, ఆమె మహారాష్ట్రలో చదివిందంటూ మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో నుంచి రిజిస్టర్ తెప్పించి అధికారులు పరిశీలించగా అభ్యర్థి ఇంటిపేరు, తండ్రిపేరు కొట్టేసి ఉన్నట్లు గుర్తించారు.వరంగల్ జిల్లాలో ఓ అభ్యర్థి స్థానికంగా చదివినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌పై కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పాఠశాల రికార్డులు తెప్పించాలని అధికారులు ప్రయత్నించగా అది ఎప్పుడో మూతపడటంతో రికార్డులు దొరకలేదు.మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. భార్యకు డీఎస్సీలో ర్యాంకు రావడంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ధ్రువీకరణ పత్రం సమర్పించింది. ఇద్దరి వార్షికాదాయం రూ. లక్షల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు ఆపేశారు.కోల్చారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ర్యాంకు వచ్చింది. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆమె తన తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించింది. నిబంధనల ప్రకారం భర్త ఆదాయం ప్రకారం సర్టిఫికెట్ ఉండాలనేది ఇతర అభ్యర్థుల అభ్యంతరం. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. -
Supreme Court: ఇంత కాఠిన్యమా?
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) కేసుల దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవసరానికి మించిన కాఠిన్యం చూపుతోందంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుల నుంచి జప్తు చేసే డాక్యుమెంట్లను వారికిచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ తలంటింది. ‘‘కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ డాక్యుమెంట్లను నిరాకరించడం సబబా? ఇది జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడం కాదా?’’ అంటూ అక్షింతలు వేసింది. పీఎంఎల్ఏకు సంబంధించిన ఒక కేసును న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎ.అమానుల్లా, జస్టిస్‌ఏజీ మసీతో ధర్మాసనం బుధవారం విచారించింది. ‘‘నిందితునికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు మీరు జప్తు చేయొచ్చు. అతనికి అవన్నీ గుర్తుండాలని లేదు కదా! అడిగితే ఇవ్వడానికి ఇబ్బందేమిటి? వేలాది పేజీల డాక్యుమెంట్లనైనా నిమిషాల్లో స్కాన్ చేసిన అందుబాటులోకి తేవచ్చు. దర్యాప్తు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడలేరా?’’ అని ప్రశ్నించింది. ‘‘క్లిష్టతరమైన విచారణ ప్రక్రియను ఎదుర్కొంటున్న నిందితునికి సొంత డాక్యుమెంట్లే ఇవ్వకపోవడం న్యాయమా? అత్యంత హీనం, అమానుషమని భావించిన కేసుల్లోనూ నిందితులను బెయిల్ దొరికిన సందర్భాలు బోలెడు! కానీ ఈ రోజుల్లో అమాంబాపతు కేసుల్లో కూడా బెయిల్ రావడం గగనంగా మారుతోంది. కాలం మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కేసుల్లో మేం (ధర్మాసనం) కఠినంగా ఉండొచ్చా? అది భావ్యమేనా?’’ అంటూ ఈడీని జస్టిస్ ఓకా నిలదీశారు. బెయిల్ కోసం, లేదా కేసే తప్పుడుదని నిరూపించేందుకు డాక్యుమెంట్లపైనే ఆధారపడే పరిస్థితుల్లో వాటిని పొందే హక్కు నిందితునికి ఉంటుందని స్పష్టం చేశారు. -
పోలవరం డాక్యుమెంట్ల వెనక చంద్రబాబు కుట్ర..!
-
అసంపూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబదీ్ధకరణ) దరఖాస్తుల్లో అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనివారు 75శాతం మంది దాకా ఉన్నారు. అధికారులు దరఖాస్తులు పరిశీలించే క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. 2020 ఆగస్టు 26కు ముందు ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చి ంది. రూ.1,000 ఫీజుగా చెల్లించి దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.అయితే వివిధ కారణాల వల్ల ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అప్పట్లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగా గత డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 2020 నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో జనవరి నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలైంది. అరకొరగానే అప్లోడ్ దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్పట్లో అప్లోడ్ చేయలేదు. మొత్తంగా 75 శాతం అసంపూర్తి దరఖాస్తులే అందజేశారు. ప్లాట్ల రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, లే అవుట్ కాపీలు, ఇతర పత్రాలు అప్లోడ్ చేయకుండా వచ్చి న దరఖాస్తులను పక్కనబెడుతూ అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా, వాటిలో కేవలం 60,213 దరఖాస్తులు మాత్రమే ఆమోదించినట్టు పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. తద్వారా రూ.96.60 కోట్లు ఫీజు రూపంలో వసూలైనట్టు చెప్పారు. పరిశీలించిన దరఖాస్తుల్లో 75 శాతం పూర్తిస్థాయి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వాటిని ఆమోదించడం లేదని దరఖాస్తుదారులకు చెప్పారు. షార్ట్‌ఫాల్స్ వివరాలను కూడా దరఖాస్తుదారులకు తెలియజేశారు.మరోసారి అవకాశం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడానికి పురపాలకశాఖ మరో చాన్స్ ఇచ్చి ంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయడానికి, మున్సిపాలిటీ/కార్పొరేషన్/నగరాభివృద్ధి సంస్థల నుంచి అధికారిక షార్ట్ ఫాల్స్ లెటర్ కోసం వేచిచూడకుండా పూర్తిస్థాయి డాక్యుమెంట్లను ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సేల్‌డీడ్, ఈసీ, మార్కెట్ వ్యాల్యూ సర్టీ ఫికెట్, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర దరఖాస్తు వివరాలను మొబైల్ నంబర్ ఓటీపీని వినియోగించుకొని ఈ పోర్టల్ ద్వారా సవరించుకోవచ్చునని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు.ఇందుకోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఏవైనా సందేహాలుంటే తీర్చుకోవడానికి లేదా వివరాల కోసం ఈ హెల్ప్‌డెస్క్‌లను సందర్శించవచ్చునని తెలిపారు. -
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
మీ దస్తావేజులు మీకే ఇస్తారు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో మాట్లాడేందుకు ‘పచ్చ’ముఠాకు ఏమీలేక భూముల పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ చంద్రబాబు తనకు ఉచ్ఛనీచాలు లేవని చాటుకుంటున్నాడు. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, తాను మాత్రం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక లక్ష్యంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి భయంకరమైన కుట్రకు తెరలేపాడు. మీ భూములు పోతాయని, దస్తావేజులు ఇవ్వరని, భూ యజమానులను జైల్లో పెడతారంటూ దారుణమైన అపోహల్ని సృష్టించాడు. వాటిని తాను స్వయంగా చెప్పడంతోపాటు ఏకంగా పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు జారీచేశాడు. ప్రజలను భయపెట్టేందుకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చిన మొట్టమొదటి నేతగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. భూములపై దు్రష్పచారాలను తొలుత ఎల్లో మీడియాతో చేయించి ఆ తర్వాత తానే ఆ విషయాలను చెబుతూ వికృత తాండవం చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆ దుష్ప్రచారాన్ని పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా మరీ చేస్తుండడం చంద్రబాబు బరితెగింపునకు పరాకాష్ట. ఈ దు్రష్పచారాలపై వాస్తవాలివే.. పచ్చి అబద్ధం.. స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాక యజమానులకు దస్తావేజులు ఇవ్వరనేది టీడీపీ సృష్టించిన భయంకరమైన అపోహ. ఏడాదిగా 9,58,296 స్థిరాస్తుల రిజి్రస్టేషన్లుగా జరగ్గా సంబంధిత రైతులకు ఒరిజినల్ దస్తావేజులే ఇచ్చారు.15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇళ్ల యజమానులకు ఎప్పటిలాగే ఇచ్చారు. 1.75 లక్షల మందికి టిడ్కో ఇళ్లను రిజి్రస్టేషన్ చేసి ఒరిజినల్ పత్రాలు ఇచ్చారు. ఈ–స్టాంపింగ్ పైనా ఎడతెగని దు్రష్పచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ 2016లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్లను ఈ–స్టాంపింగ్ ద్వారా జారీచేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీచేశారు. ఇవన్నీ ఒరిజినల్సే. ఏవి జిరాక్స్ కాపీలు కాదు. మీ వారసులను నిర్ణయించేది మీరే.. సమస్య వస్తే కోర్టులకూ వెళ్లొచ్చు.. మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారనేది మరో దారుణమైన వక్రీకరణ. భూ యజమానులు తమ వారసులను తామే నిర్ణయించుకోవచ్చు. ఇంకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం సెక్షన్ 25 (3) ప్రకారమైనా.. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ వారసత్వాన్ని నిర్థారణలో ఏదైనా వివాదం ఉందని భావిస్తే సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో వివాదం ఉంటే భూ యజమానులే కోర్టుకు వెళ్లాల్సి వుంటుంది. మీ ఆస్తి మీది కాదని టైట్లింగ్ ఆఫీసర్ చెప్పలేరు.. రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒకసారి రైతు పేరు చేరితే ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం వారు ఎటువంటి రికార్డు సమర్పించాల్సిన అవసరంలేదు. ఆ డేటాపై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజుల వరకు అభ్యంతరాలు సమర్పించవచ్చు. ఆ తర్వాత వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదవుతాయి. ఈ రిజిస్టర్‌లోని పేర్లపై రెండేళ్లలోగా ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే అప్పుడు కన్‌క్లూజివ్ టైటిల్ నిర్ధారణ అవుతుంది. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ (టీఆర్ఓ) ఇచి్చన ఈ నిర్ధారణ ఆర్డర్‌పై అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైట్లింగ్ అప్పిలేట్ ఆఫీసర్‌కి (ఎల్‌టీఏఓ)కి అప్పీలు చేసుకోవచ్చు. దానిపైనా సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. భూ యజమానులను జైల్లో ఎందుకు పెడతారు? సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెడతారని, తాతల నాటి భూములైనా నేతల దయ ఉండాల్సిందేనని, జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చంటూ చంద్రబాబుకు మతి చెడిపోయి పత్రికల్లో పిచ్చి ప్రకటన ఇచ్చాడు. ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇవన్నీ వక్రభాష్యాలే. సరైన పత్రాల్లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో భయానక స్థితిని కల్పించేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, వాయిస్ రికార్డింగ్స్ ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. అయినా, రాజకీయ లబ్దికోసం చంద్రబాబు బట్టలు విప్పేసుకుని మరీ దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉన్నాడు. ఈ ప్రచారాన్ని ప్రింట్ మీడియాలో చేస్తే ఈసీ అనుమతి అవసరంలేదనే లొసుగును అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వృద్ధ నేత చేసే పనేనా ఇది? సిగ్గు విడిచి, ప్రజల ప్రయోజనాలు గాలికొదిలేసి తన కోసం చేస్తున్న కుతంత్రం ఇది. చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.. ఈ చట్టానికి సంబంధించి ఇంకా నిబంధనలు రూపుదిద్దుకోలేదు. దీని పరిధినీ నిర్ధారించలేదు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేయబడిన అధికారులనూ నియమించనేలేదు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను తీసుకున్నాక మార్పులు, చేర్పులకు ప్రభుత్వం సిద్ధమంది. నిబంధనలు తయారుచేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి వచ్చాకే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ చట్టానికి టీడీపీ మద్దతిచ్చింది.. నిజానికి.. ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ దానికి పూర్తి మద్దతిచ్చింది. అంతేకాదు.. సుదీర్ఘ అధ్యయనం, ఎంతో కసరత్తు తర్వాత ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీగల్ అడ్వైజర్‌గా నల్సార్ యూనివర్సిటీని నియమించుకుని ముసాయిదా బిల్లును రూపొందించింది. 2011 నుండి 2019 వరకు తయారుచేసిన వివిధ మోడల్ చట్టాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లును 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. దీనికి అప్పుడు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా డిపార్ట్మెంట్ , ఐటీ, హోమ్, సోషల్ వెల్ఫేర్ వంటి డిపార్ట్మెంట్లన్నీ మూడేళ్లపాటు జాగ్రత్తగా పరీక్షించి పలు సూచనలు చేశారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తిరిగి మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏ కేంద్ర చట్టాలకీ వ్యతిరేకంగా ఈ చట్టంలేదని నిర్ధారించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బాబు బినామీ ఆస్తులు బయటకు వస్తాయనే దుష్ప్రచారం.. వాస్తవానికి.. రీ సర్వే పూర్తయ్యాకే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తుంది. అది జరిగితే అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో చంద్రబాబు ఆయన ముఠా బలవంతంగా లాక్కుని బినామీ పేర్లపై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయోననే భయంతో సాధారణ జనంతో దీనికి ముడిపెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకరకాల చట్టాలు చేస్తుంటాయి. వాటివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందని భావిస్తే సవరణలు తెస్తారు. కానీ, ఒక చట్టాన్ని రద్దుచేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు ఇప్పుడు ఆ పని కూడా చేసి తన విలువల స్థాయి ఏంటో ప్రదర్శించుకున్నారు. మేనిఫెస్టోలో అమలుచేయలేని అనేక హామీలిచ్చి నా ఈ ఒక్క దానిపైనే ఇంత దృష్టిపెట్టి గందరగోళం సృష్టించడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? వారు దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయోననే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల్లో ఎవరైనా ఇది మంచిది కాదని ఒక్క మాటైనా చెప్పారా? రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అనేకమంది బీజేపీ ముఖ్యనేతలు తమ ప్రసంగాల్లో ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? ఈ చట్టం మంచిది కాదని బీజేపీ నాయకులతో చంద్రబాబు చెప్పించగలరా? కేవలం తమ బినామీ ఆస్తులను రక్షించుకునేందుకే ఎల్లోగ్యాంగ్ చేస్తున్న గందరగోళమే ఇదంతా? -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్ అయింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సీఐడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఛానళ్లలో బాధ్యత రహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం. ప్రతి ఛార్జ్ షీట్‌కు 8 వేల నుండి 10 వేల కాపీలతో రూపొందించాం. ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం’ అని సీఐడీ ప్రకటనతో పేర్కొంది. -
జూన్‌లో జాబ్‌ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్‌ల జాతరకు లైన్‌క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్‌శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
General Election 2024: మీ ఓటు ఉందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి..
కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఢిల్లీలో విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ 'రాజీవ్ కుమార్' ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సీఈసీ ప్రకటించారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ తెలిపారు. అయితే ఈ రోజు నుంచి జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుందని తెలిపారు. పోలింగ్ సీజన్‌కు ముందు.. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి, ఓటర్ల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి, పోలింగ్ బూత్ కనుక్కోవడం ఎలా? అనే మరిన్ని వివరాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే ఓటు వేయడానికి వెళ్లే ముందు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే.. ఓటర్ ఐడీ డ్రైవింగ్ లైసెన్స్ పాస్‌పోర్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డ్ MNREGA జాబ్ కార్డ్ NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్ స్టేట్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్ కేంద్ర/రాష్ట్రం ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఐడీ కార్డు ఎలక్టోరల్ రోల్లో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే.. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి స్టేట్ ఎంటర్ చేసి, భాషను ఎంచుకోవాలి పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సర్చ్ మీద క్లిక్ చేయాలి పోలింగ్ బూత్‌ను ఎలా కనుక్కోవాలంటే.. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత పోలింగ్ బూత్‌ని తెలుసుకోవడానికి రాష్ట్రం, భాషను ఎంచుకోవాలి. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి EPIC/ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా సెర్చ్ చేయడం భాషను ఎంచుకోవాలి EPIC నంబర్/ఓటర్ ID కార్డ్ వివరాలను ఫిల్ చేయాలి రాష్ట్రాన్ని ఎంచుకోవాలి క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి -
స్థిరాస్తులు.. డాక్యుమెంట్లు-1: అన్నీ పక్కాగా ఉంటేనే..
ఏ వ్యవహారమైనా కాగితాలు ముఖ్యం. వ్యవహారాన్ని మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తి చేసే వరకు ప్రతి స్థాయిలో, ప్రతి దశలో, ప్రతి అంశానికి సంబంధించిన కాగితాలు.. అవేనండి.. డాక్యుమెంట్లు అవసరం. అవేమిటో కొన్ని చూద్దాం.. కొనే ముందు డాక్యుమెంట్లు.. స్థిరాస్తి డాక్యుమెంట్లలో అతి ముఖ్యమైనవి అమ్మకానికి సంబంధించిన దస్తావేజులు. అమ్మే వ్యక్తి ఆ ఆస్తిని ఎలా కొన్నారు? తను కొన్నట్లు ధృవీకరించే దస్తావేజులు. అమ్మకం ద్వారా లేదా మరే ఇతర మార్గంలో హక్కు ఏర్పడ్డా, దానికి సంబంధించిన కాగితాలు. ఉదాహరణకు, వీలునామా లేదా గిఫ్ట్ డీడ్. ఈ రెండింటినీ టైటిల్ డీడ్స్ అంటారు. వీటి ద్వారానే మీకు ఆస్తి అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు సంక్రమించినట్లు తెలుస్తుంది. ఆస్తి తనదా కాదా అని తెలుస్తుంది. ఇవి ఒరిజినల్ అయి ఉండాలి. లింకు డాక్యుమెంట్లు చూడాలి. మీకు అమ్మే వ్యక్తి, సదరు అసెట్‌ను కొనుక్కోవడానికి ముందు ఓనర్ ఎవరు? ఆ ఓనర్‌కి ఆస్తి ఎలా సంక్రమించింది? ఇది చాలా ముఖ్యం. సబ్ రిజిస్ట్రార్ లేదా పంచాయతీ/గ్రామ వ్యవస్థలో ఉండే రికార్డులు .. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉంటాయి. పహాణీ/ఖాతా.. సర్వే నంబర్లు, ఉప సర్వే నంబర్లు, సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. మ్యుటేషన్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తిలో పేరు మార్పిడి, టైటిల్ మార్పునకు సంబంధించిన పత్రాలు, ప్రస్తుతం మీకు అమ్మే వ్యక్తి పేరు మ్యుటేషన్ పత్రంలో ఉండాలి. ఫ్లాట్ అయితే జాయింటు డెవలప్మెంటు అగ్రిమెంటు కాపీలు ఉండాలి. ఈ అగ్రిమెంటు ద్వారా హక్కుల సంక్రమణ జరుగుతుంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఒక్కొక్కప్పుడు ఓనరు ఒకరు కాగా, అమ్మకానికి హక్కులు వేరే వ్యక్తికి ఇస్తారు. పవర్ ఉన్న వాళ్లు అమ్మాలి. బిల్డింగ్ ప్లాను. అనుమతి పొందిన ప్లాను. సంబంధిత అధికారులు జారీ చేసినది. సంబంధిత అధికారులు జారీ చేసిన ఎన్వోసీ. అలాగే విద్యుత్ శాఖ, నీటి శాఖ మొదలైన శాఖలు ఇచ్చినవి. ఒరిజినల్ అగ్రిమెంటుకు జరిగిన మార్పులు, చేర్పులు, కూర్పులకు సంబంధించిన సప్లిమెంటరీ అగ్రిమెంటు లేదా వాటిని ఒప్పుకుంటున్నట్లు ఒప్పందం. అలాట్మెంట్ లెటర్. కట్టడానికి రాసుకున్న అగ్రిమెంటు, బిల్డర్ ఫ్లాటును అప్పగించినట్లు పత్రం, వీలుంటే అమ్మే వ్యక్తి తను కొన్నప్పుడు చేసిన చెల్లింపుల కాగితాలు, రశీదులు. మీరు కొంటున్న స్థిరాస్తిని ఆ ఓనరు బ్యాంకు నుండి అప్పు తీసుకుని కొని ఉంటే తత్సంబంధ కాగితాలు. మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఇతర పెనాల్టీలు, చెల్లింపులు, ఆఖ కాగితాలు, చెల్లింపుల రశీదులు, సొసైటీ మెంబర్షిప్ కాగితాలు, వారిచ్చే ధృవీకరణ పత్రాలు. సబ్–రిజిస్ట్రార్ నుండి ఒరిజినల్ ఉఇ. వీలున్నంతవరకు ఎన్ని సంవత్సరాల దాకానైనా వెళ్లండి. అలాగే 2001 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ వేల్యు సర్టిఫికెట్టు, దానితో పాటు తాజాది అంటే మీరు కొనే నాటికి స్థిరాస్తి మార్కెట్ వేల్యుయేషన్ సర్టిఫికెట్ చూసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 7.50 లక్షలకుపైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే రైతులకు అందించారు. ఇప్పుడు రెండో దశలోని 2 వేల గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరుకోవడంతో ఆ గ్రామాల్లోని రైతులకు విడతల వారీగా భూ హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాల్లో 8.68 లక్షల భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సివుండగా ఇప్పటికే 5.12 లక్షల పత్రాలను ముద్రించి ఆయా జిల్లాలకు పంపారు. ఇందులో 2.48 లక్షల పత్రాలు ఈ–కేవైసీ పూర్తి చేసి పంపిణీ కూడా చేశారు. మిగిలిన పత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో పంపిణీ దాదాపు పూర్తయింది. గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇంకా 5 శాతం లోపు పంపిణీ చేయాల్సి ఉంది. బాపట్ల, వైఎస్సార్, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో ఇంకా 30 శాతం వరకు పూర్తి చేయాల్సివుంది. పశ్చిమగోదావరి, కర్నూలు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 90 శాతం పెండింగ్ ఉండటంతో అక్కడ భూ హక్కు పత్రాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరో నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–4 జవాబు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక ‘కీ’లను తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను సైతం అభ్యర్థుల కోసం వెబ్సైట్లో ఉంచింది. వీటిని వచ్చే నెల 27వ తేదీ వరకు వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. ఈ జవాబు పత్రాలు నిర్ణిత గడువు తర్వాత వెబ్సైట్లో తెరుచుకోవని కమిషన్ స్పష్టం చేసింది. దాదాపు 9 వేల గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ జూలై 1న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో పేపర్–1కు 7,63,835 మంది అభ్యర్థులు హాజరు కాగా, పేపర్–2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. కమిషన్ వెబ్సైట్లో ప్రాథమిక కీలు పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబు పత్రాలను స్కానింగ్ చేసిన కమిషన్... వాటిని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. నెల రోజుల పాటు వీటిని వెబ్సైట్ తెరిచి పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక కీలు సోమవారం నుంచి కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాథమిక కీల పైన ఏవేనీ అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీనుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు నిర్దేశిత లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో తగిన ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను కేవలం ఇంగ్లీషులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని, ఈమెయిల్, పోసు ద్వారా వచ్చే వినతులను సైతం పరిగణించమని, మరిన్ని వివరాలను వెబ్సైట్ తెరిచి చూసుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్‌కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
డిజిటల్ లోన్ గురించి తెలుసా? ఈ డాక్యుమెంట్లుంటే సులువుగా రుణం!
పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల చుట్టూ తిరగాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే అధికారులు ఆమోదించి లోన్ మంజూరు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ఆన్లైన్లో పర్సనల్ లోన్ పొందవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.. డిజిటల్ ప్లాట్ఫామ్లో లేదా యాప్‌లో లభించే వ్యక్తిగత రుణాన్ని డిజిటల్ లోన్ అంటారు. దీన్నే ఆన్లైన్ పర్సనల్ లోన్ అని కూడా పిలుస్తారు. సాధారణ పర్సనల్ లోన్‌తో పోలిస్తే డిజిటల్ లోన్ చాలా తక్కువ సమయంలో మంజూరవుతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతం అయినప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అందువల్ల సరైన డాక్యుమెంటేషన్ ఇక్కడ కీలకం. బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు! అర్హత సాధారణ పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పర్సనల్ లోన్‌కి కూడా అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కనీస ఆదాయం లేదా టర్నోవర్ కలిగిన స్వయం ఉపాధి పొందుతున్నవారు ఈ లోన్ పొందవచ్చు. ఆన్లైన్ పర్సనల్ లోన్‌కు అర్హత దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అందుబాటులో లేనప్పుడు ఆ వ్యక్తి సమర్పించే అదనపు డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారుల వయస్సు, ఉపాధి, వృత్తిపరమైన అనుభవం వంటి సమాచారం కూడా అవసరమవుతుంది. డాక్యుమెంట్లు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచడం వలన అనవసరమైన జాప్యాలు, తిరస్కరణలు, అభ్యర్థనలు లేకుండా లోన్ అప్రూవల్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. డిజిటల్ లోన్ దరఖాస్తు ప్రక్రియ సాఫీగా జరగడానికి అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు ఏవో ఇక్కడ ఇస్తున్నాం.. ఐడెంటిటీ ప్రూఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణగ్రహీతలు తమ గుర్తింపును నిర్ధారించేందుకు చెల్లుబాటు అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్‌ను అందించాలి. వీటిలో ముఖ్యమైనవి పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్. అడ్రెస్ ప్రూఫ్ లోన్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి ఐడెంటిటీ ప్రూఫ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్ కూడా అవసరం. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటివి కొన్ని చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్‌లు. ఇన్కమ్ ప్రూఫ్ రుణగ్రహీతలు తమ ఆదాయాన్ని చూపించే ఏదైనా డాక్యుమెంట్‌ను కలిగి ఉండాలి. ఇందు కోసం లేటెస్ట్ శాలరీ స్లిప్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి సమర్పించవచ్చు. ఈ డాక్యుమెంట్లు దరఖాస్తుదారు ఆర్థిక స్థిరత్వాన్ని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తాయి. సంతకం ప్రూఫ్ దరఖాస్తుదారు, రుణ సంస్థ మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని రూపొందించడానికి ఈ-సైన్ అని పిలిచే డిజిటల్ సంతకం అవసరం. ఇది పరస్పర అంగీకారం, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. -
AP: ఇక దస్తావేజులతో పని లేదు.. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ–స్టాంపులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు వంటి వాటి కోసం దస్తావేజులు (నాన్–జ్యుడిషియల్ స్టాంపులు) వినియోగించాల్సిన అవసరం లేదు. ఈ–స్టాంపుల ద్వారా ఈ పనులన్నింటినీ చేసుకునే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే రూ.100, రూ.50 ఇతర నాన్–జ్యుడిషియల్ స్టాంపులను స్టాంప్ వెండర్ల వద్ద కొనక్కర్లేదు. ప్రభుత్వం అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్లలో ఎంత డినామినేషన్ కావాలంటే అంతకి ఈ–స్టాంపులను సులభంగా పొందొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ–స్టాంపింగ్ విధానం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఈ–స్టాంపుల ద్వారా ట్యాంపరింగ్‌కు, అవకతవకలకు ఆస్కారం ఉండదు. 1,200 కామన్ సర్విస్ సెంటర్లకు అనుమతి మొదట్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల (అగ్రిమెంట్లు వంటివి) కోసం ఈ–స్టాంపింగ్‌ను అనుమతించారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు సైతం ఈ–స్టాంపింగ్‌ను ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం 1,200 కామన్ సర్విస్ సెంటర్లు (ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు (ఏసీసీ)–మీ సేవా కేంద్రాలు వంటివి), 200 మంది స్టాంప్ వెండర్లకు ఈ–స్టాంపింగ్ చేసేందుకు లైసెన్సులు ఇచ్చింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఈ–స్టాంపింగ్‌కి సంబంధించి ఒక కౌంటర్‌ను ప్రారంభిస్తోంది. ఏసీసీ సెంటర్లు అందుబాటులో లేనివారు, వాటి గురించి తెలియని వారు నేరుగా ఆ కేంద్రాల వద్ద కెళ్లి ఈ–స్టాంపులు పొందొచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ–స్టాంపింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి దశలో మండల కేంద్రాల్లో ఉన్న సచివాలయాల్లో తేవడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 30 శాతం రిజిస్ట్రేషన్లు ఈ–స్టాంపింగ్ ద్వారానే.. ఇప్పటికే నెల నుంచి ఈ–స్టాంపింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ సగటున 10 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే అందులో 30 శాతం ఈ–స్టాంపుల ద్వారానే జరుగుతున్నట్లు ఈ విధానాన్ని పర్యవేక్షిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో 70 శాతానికిపైగా రిజిస్ట్రేషన్లు ఈ–స్టాంపింగ్ ద్వారానే జరిగేలా చూసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దస్తావేజుల కంటే ఎక్కువ భద్రత నాన్–జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల కంటే ఈ–స్టాంపులకు ఎక్కువ భద్రత ఉంటుంది. వీటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. పాత తేదీల మీద స్టాంపులు విక్రయించే అవకాశం ఉండదు. దస్తావేజుల వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాదు. కానీ ఈ–స్టాంపింగ్ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలోనే ఉంటుంది. ప్రజలు మోసపోవడానికి ఆస్కారం ఉండదు. గతంలో మాదిరిగా దస్తావేజులను అధిక ధరలకు కొనే బాధ కూడా తప్పుతుంది. ఏసీసీ సెంటర్‌కి వెళితే అక్కడ ఒక దరఖాస్తు పూర్తి చేస్తే చాలు.. ఈ–స్టాంపు ఇస్తారు. నాన్–జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల మాదిరిగా రూ.100, రూ.50, రూ.20, రూ.10 ఎంత డినామినేషన్ అయినా ఈ–స్టాంపుల ద్వారా పొందొచ్చు. సుమారు రూ.రెండు లక్షల డినామినేషన్ వరకు ఈ–స్టాంపులు జారీ చేసే అవకాశాన్ని కల్పించారు. పలు బ్యాంకులు సైతం ఈ–స్టాంపింగ్‌కి అనుమతి తీసుకుంటున్నాయి. వినియోగదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను కూడా ఇకపై బ్యాంకుల్లో చలానాలుగా కాకుండా ఈ ఏసీసీ కేంద్రాల్లోనే చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ విధానాన్ని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తోంది. ఈ–స్టాంపులతో ఎంతో మేలు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ–స్టాంపుల విధానాన్ని ప్రవేశపెట్టాం. దస్తావేజుల స్థానంలో ప్రజలు వీటిని వినియోగించుకోవచ్చు. నాన్–జ్యుడిషియల్ స్టాంపుల కంటే వీటికే భద్రత ఎక్కువగా ఉంటుంది. ఏసీసీ కేంద్రాలు అందుబాటులో లేని వారు తమకు సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఈ–స్టాంపింగ్ అవకాశాన్ని పొందొచ్చు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ విధానం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. – వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
గుడ్‌న్యూస్! ఆధార్ ఉచిత అప్డేట్ గుడువు పొడగింపు
ఆధార్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పొడిగించింది. మరో నెలలు అంటే జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్‌కు సంబంధించి గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ కోసం ఇచ్చిన పత్రాలను సెప్టెంబర్ 14 లోపు ఉచితంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవాలని యూఏడీఏఐ తన వెబ్సైట్లో పేర్కొంది. డాక్యుమెంట్ల అప్డేట్, అప్లోడ్ కోసం జూన్ 14 వరకే గడువు ఉండేది. ఇప్పుడు దాన్ని యూఏడీఏఐ పొడిగించింది. ఈ అప్డేట్ సౌకర్యం https://myaadhaar.uidai.gov.in వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్లను స్వయంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవచ్చు. అదే ఆధార్ సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రంలో అప్డేట్ చేయించుకుంటే రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
డిజీలాకర్ అంటే? డైనమిక్ కేవైసీతో లాభాలేంటి?
భారత ఫిన్‌టెక్‌ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌లు, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్‌టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్‌టెక్ సంస్థలు డిజీలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్‌టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. డిజీలాకర్ ప్రస్తుతం డిజీలాకర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్‌లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్‌బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్‌ను డిజీయాత్ర యాప్‌పై ఐడెండిటీ వెరిఫికేషన్‌కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్‌లెస్ చెకిన్‌కు వీలు లభిస్తోంది. డైనమిక్ కేవైసీ డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్‌టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది. -
వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త.. ఇకపై అది ఒక్కటి చాలు!
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం చర్యలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకపై ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలోని వివిధ డిజిటల్ వ్యవస్థలతో లావాదేవీల్లో వ్యాపార సంస్థలు తమ గుర్తింపు ధ్రువీకరణ కోసం పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) కార్డు ఒక్కటే సమర్పించినా సరిపోనుంది. ప్రస్తుతం వ్యాపారాలకి అనుమతులు తీసుకునేందుకు జీఎస్టీఎన్, టిన్, ఈఎస్ఐసీ వంటి రకరకాల ఐడీలు అవసరమవుతున్నాయి. దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఇది తోడ్పడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు, వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాస్–2 (వీఎస్వీ–2) స్కీమును ప్రవేశపెడుతున్నట్లు ఆమె తెలిపారు. అసెస్‌మెంటుకు సంబంధించి పన్నులు, వడ్డీలు, జరిమానాలు వంటి అంశాల్లో వివాదాల పరిష్కారానికి ఇది ఉపయోగపడనుంది. పన్ను వివాదాల తగ్గింపుపై దృష్టి .. పన్నుపరమైన వివాదాలను తగ్గించేందుకు కూడా ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు చేశారు. ఒకే తరహా లీగల్ వివాదాలపై అప్పీళ్లు చేసేందుకు బోలెడంత సమయం, వనరులు వృధా అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్దిష్ట చట్టాన్ని సవాలు చేసే కేసు ఏదైనా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంటే.. ఐటీ శాఖ మళ్లీ అదే తరహా కేసు మరొకటి దాఖలు చేయకుండా వాయిదా వేసేలా కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలని ఆమె ప్రతిపాదించారు. రీక్లెయిమింగ్ సులభతరానికి ఐఈపీఎఫ్ షేర్లు, డివిడెండ్ల రీక్లెయిమింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు సమీకృత ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ చెప్పారు. ఇక, ఫీల్డ్ ఆఫీసుల్లో దాఖలయ్యే వివిధ రకాల ఫారంలను కేంద్రీకృతంగా హ్యాండిల్ చేసేందుకు కంపెనీల చట్టం కింద సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా కార్పొరేట్లకు మరింత వేగవంతంగా సమాచారం/స్పందన లభించగలదని ఆమె పేర్కొన్నారు. కేవైసీ.. ఈజీ.. కస్టమర్ల వివరాల సేకరణకు సంబంధించిన నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా అందరికీ ఒకే తరహా ప్రక్రియ పాటించడం కాకుండా ’రిస్క్ ఆధారిత’ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థల దగ్గర ఉండే వ్యక్తుల గుర్తింపు, చిరునామాలను ఒకే చోట అప్డేట్ చేసేలా నిర్దిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. ఇందుకోసం డిజిలాకర్ సర్వీసును, ఆధార్‌ను ఉపయోగించనున్నారు. అలాగే, ఒకే సమాచారాన్ని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు వేర్వేరుగా సమర్పించాల్సిన అగత్యం తప్పించేలా ఏకీకృత ఫైలింగ్ ప్రక్రియ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. చదవండి: సరైన సమయం కాదు.. అందుకే రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోను వెనక్కి ఇస్తున్నాం: అదానీ గ్రూప్ -
ఆధార్ కార్డ్‌లో మీ వివరాలు అప్డేట్ చేయాలా? ఇలా సింపుల్‌గా చేయండి!
ఆధార్ కార్డ్(Aadhaar Card).. ప్రస్తుతం ఈ పేరు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలు విషయంలో, ఆర్థిక వ్యవహరాల్లో కీలకంగా మారింది. దీంతో కొందరు ఆధార్ కార్డ్‌ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఈ కార్డ్ విషయంలో అక్రమాలను అరికట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల 10 ఏళ్లకోసారి ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలన్న వార్తలు బలంగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి కాకపోయినా, చేయడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. ఇటీవల ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ స్కీం లాంటి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ అందిస్తున్న సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మారింది. ఇక ఆర్థిక వ్యవహారాల్లోనూ ఆధార్ నెంబర్ కీలక పాత్ర పోషిస్తోంది.ఈ తరుణంలో ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లబ్ధిదారులకు చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించాలి. కేవలం అప్డేట్తో పాటు అందులో తప్పులు ఉంటే మార్చుకోవాలి. కార్డులోని పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే వెసలుబాటు ఉంది. వీటిని అప్డేట్ చేయడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఆన్లైన్లో ఈ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ వివరాలు అప్డేట్ చేసి అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అనంతరం ఈ సేవకు అవసరమయ్యే పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు ఆధార్ అప్డేట్ కోసం ఇవే స్టెప్స్ ఫాలో కావచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు కాకుండా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్, ఫోటో అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అప్డేట్ ఇలా చేసుకోండి - ఆధార్ SUP పోర్టల్ uidai.gov.inని సందర్శించండి, ఆన్లైన్లో అప్డేట్ చిరునామాను ఎంచుకోండి - మీ ఆధార్ నంబర్ లేదా VIDని నమోదు చేయండి - మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపే సెక్యూరిటీ కోడ్ OTP వస్తుంది - మీరు అందుకున్న OTPని నమోదు చేయండి - "చిరునామా" ఎంపికను ఎంచుకుని, సబ్మిట్ చేయండి - మీ అన్ని అడ్రస్ వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను నొక్కి, ఆపై చివరగా నిర్ధారించుకోండి - సపోర్టింగ్ డాక్యుమెంట్ రంగు స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి - పత్రం సరైనదని నిర్ధారించుకోండి. అన్నీ సరైనవే అయితే ఎస్ బటన్ ఎంచుకోండి - BPOని ఎంచుకుని, సబ్మిట్పై క్లిక్ చేయండి - మీ అప్డేట్ రిక్వెస్ట్ ఇప్పుడు సబ్మిట్ చేయండి - అనంతరం మీ URN నంబర్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో పాటు మీ ఈమెయిల్‌కి కూడా వస్తుంది. - మీరు మీ URN స్థితిని ఆన్లైన్లో కూడా తనిఖీ చేయవచ్చు -
చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డ ఉదంతం క్రమంగా చినికి చినికి గాలివానగా మారుతోంది. ఆ పత్రాల్లో బ్రిటన్, ఉక్రెయిన్, ఇరాన్‌లకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలున్నట్టు వస్తున్న వార్తలు మరింత దుమారానికి దారి తీస్తున్నాయి. బరాక్ ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటి సదరు పత్రాలు ఆయన పదవి నుంచి తప్పుకున్నాక ఉపయోగించిన ప్రైవేట్ కార్యాలయంలో గత నవంబర్‌లో బయటపడ్డాయి. ఈ అంశం సోమవారం వెలుగులోకి వచ్చింది. వాటి ఉనికిని కనిపెట్టింది బైడెన్ తరఫు లాయర్లేనని, వెంటనే వారు నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చారని ఆయన వర్గం సమర్థించుకున్నా విపక్షాలు ఇప్పటికే దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 2022 ఆగస్టులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోనూ ఇలాగే భారీ సంఖ్యలో రహస్య పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్ స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఈ విషయమై ట్రంప్‌పై దర్యాప్తు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నాయి. అదే కోవలో బైడెన్ కూడా విచారణ ఎదుర్కోక తప్పదంటున్నారు. దీనిపై అటార్నీ జనరల్ మెరిక్ గార్లండ్కు ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందింది. నేషనల్ ఆర్కైవ్స్, రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని తనకు నివేదించగానే దీనిపై విచారణ బాధ్యతలను షికాగో అటార్నీ జాన్ లాష్చ్ జూనియర్‌కు గార్లండ్ అప్పగించారు. ఆయన నుంచి ఇప్పటికే అన్ని వివరాలూ తెప్పించుకున్నారు. బైడెన్‌పై పూర్తిస్థాయి నేర విచారణ ప్రారంభించాలా, వద్దా అన్న కీలక అంశంపై గార్లండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రంప్ రహస్య డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది గార్లండే కావడం విశేషం! అధ్యక్షుల నిజాయితీకి అత్యంత ప్రాధాన్యమివ్వడమే గాక వారి ప్రవర్తన విషయంలో అత్యంత పట్టింపుగా ఉండే అమెరికాలో చివరికిది బైడెన్ పదవికి ఎసరు పెడుతుందా అన్నది చూడాలి. ఏం జరిగింది? బైడెన్ వద్ద పలు రహస్య పత్రాలు బయట పడ్డట్టు సోమవారం అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో వైట్‌హౌస్ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. 2022 నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలోని పెన్ బైడెన్ సెంటర్లో ఉన్న బైడెన్ ప్రైవేట్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న సందర్భంగా అందులో పలు రహస్య పత్రాలను ఆయన లాయర్లు కనుగొన్నట్టు పేర్కొంది. అవన్నీ ఒబామా అధ్యక్షునిగా, బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటివని, అంటే 2013–16 నాటివని చెబుతున్నారు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే పలు పత్రాలు కూడా వీటిలో ఉన్నాయి! అవి రహస్య పత్రాలని తెలియగానే తన లాయర్లు వెంటనే నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చి వాటిని అప్పగించారని బైడెన్ చెప్పుకొచ్చారు. ఉపాధ్యక్షునిగా పదవీకాలం ముగిశాక 2017 నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ కార్యాలయాన్ని వాడుకున్నారు. ఆ పత్రాల్లో ఏముంది? బైడెన్ ఆఫీసులో దొరికినవి మామూలు రహస్య పత్రాలేనంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే వాటిలో బ్రిటన్, ఇరాన్, ఉక్రెయిన్లకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు సేకరించిన అత్యంత రహస్య సమాచారం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ తదితర వార్తా సంస్థలు తాజాగా వెల్లడించడం సంచలనం రేపుతోంది. కావాలనే ఆలస్యంగా బయట పెట్టారా? రహస్య పత్రాలు ప్రైవేట్ కార్యాలయంలో దొరకడం ఒక ఎత్తైతే, దాన్ని ఇంతకాలం దాచి ఉంచడం బైడెన్‌కు మరింత ఇబ్బందికరంగా మారేలా కన్పిస్తోంది. 2022 నవంబర్ 2న ఈ పత్రాలు వెలుగు చూసినప్పటికి అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికలు మరో వారంలోపే ఉన్నాయి. పత్రాల విషయం అప్పుడే బయటికొస్తే ఆ ఎన్నికల్లో డెమొక్రాట్లకు పెద్ద ఎదురుదెబ్బే తగిలేది. అందుకే దీన్ని దాచి ఉంచినట్టు తేలితే బైడెన్‌కు మరింత తలనొప్పిగా మారడం ఖాయం. మధ్యంతరంలో ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ లభించడం తెలిసిందే. రాజకీయ వేడి బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడం అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య దుమారానికి దారి తీస్తోంది. ట్రంప్ ఎస్టేట్ మాదిరిగా బైడెన్ ఇల్లు, కార్యాలయాల్లో ఎఫ్‌బీఐ ఎప్పుడు సోదాలు చేస్తుందంటూ రిపబ్లికన్ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ట్రంప్ అయితే మరో అడుగు ముందుకేసి, రహస్య పత్రాలను కాపాడలేకపోయినందుకు వైట్‌హౌస్‌లో కూడా ఎఫ్‌బీఐ సోదాలు చేయాలన్నారు! ప్రతినిధుల సభలో రహస్య పత్రాల వ్యవహారాలను చూసే శక్తిమంతమైన ఓవర్‌సైట్ కమిటీ సారథి అయిన రిపబ్లికన్ సభ్యుడు జేమ్స్ కోమర్ ఇప్పటికే దీనిపై పూర్తి సమాచారమివ్వాలంటూ నేషనల్ ఆర్కైవ్స్‌కు, వైట్‌హౌస్ కౌన్సెల్ కార్యాలయానికి లేఖలు రాశారు. ట్రంప్ పత్రాల గొడవ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా తప్పుకున్నాక పలు రహస్య పత్రాలను వైట్‌హౌస్ నుంచి తన ఫ్లోరిడా ఎస్టేట్‌కు తీసుకెళ్లారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. 2022 ఆగస్టులో ఆయన ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాల్లో వందలాది డాక్యుమెంట్లు దొరికాయి. తనకేమీ తెలియదని, ఇదంతా రాజకీయ కుట్ర సాధింపని ట్రంప్ ఎదురు దాడికి దిగారు. దొరికినవన్నీ తన వ్యక్తిగత పత్రాలేనంటూ బుకాయించారు. దీనిపై ఇప్పటికే ఆయనపై సివిల్, క్రిమినల్ విచారణలు జరుగుతున్నాయి. మొత్తం 3,000కు పైగా డాక్యుమెంట్లను వైట్‌హౌస్ నుంచి తరలించినట్టు టంప్ర్పై అభియోగాలు నమోదయ్యాయి. నాకు తెలియదు: బైడెన్ వాషింగ్టన్: తన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డట్టు తెలిసి ఆశ్చర్యపోయానని బైడెన్ అన్నారు. ‘ఆ పత్రాల గురించి, ఉపాధ్యక్షునిగా నేను తప్పుకున్న తర్వాత నా కార్యాలయంలోకి అవెలా వచ్చాయో నాకు తెలియదు. వాటిల్లో ఏముందో కూడా తెలియదు. వీటిపై జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా. ఇలాంటి అంశాలను నేనెంత సీరియస్‌గా తీసుకుంటానో అందరికీ తెలుసు’ అన్నారు. మెక్సికో పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రశ్నించడంతో ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కెన్నెడీ హత్య.. మరిన్ని డాక్యుమెంట్లు బహిర్గతం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ హత్యకు సంబంధించి 13 వేల పై చిలుకు డాక్యుమెంట్లను వైట్‌హౌస్ తాజాగా బయట పెట్టింది. దీంతో ఆ ఉదంతానికి సంబంధించి 97 శాతానికి పైగా సమాచారం జనానికి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినట్టేనని ప్రకటించింది. అయితే మరో 515 డాక్యుమెంట్లను పూర్తిగా, 2,545 డాక్యుమెంట్లను పాక్షికంగా గోప్యంగానే ఉంచనుంది! వాటిని 2023 జూన్ దాకా విడుదల చేయబోమని ప్రకటించింది. హత్యకు సంబంధించిన అతి కీలకమైన విషయాలు వాటిలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తి 1963 నవంబర్ 22న కెన్నెడీని డాలస్‌లో కాల్చి చంపడం తెలిసిందే. దీని వెనక పెద్ద కుట్ర ఉందంటారు. హార్వే కొన్నేళ్లపాటు సోవియట్ యూనియన్‌లో ఉండొచ్చిన వ్యక్తి కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కెన్నెడీని చంపించి ఉంటుందని, రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు హార్వేను పోలీసులు కాల్చి చంపారని ఊహాగానాలున్నాయి. -
పాన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారా.. అందుబాటులోకి కొత్త సేవలు వచ్చాయ్!
పాన్ కార్డు పొందాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు సమర్పించి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అప్లై చేసుకుని, అంతే ఈజీగా పొందవచ్చు. ఎలా అంటారా? కేవలం ఆధార్ కార్డు (Aadhaar Card) ఉంటే చాలు, కొన్ని గంటల వ్యవధిలోనే మీరు పాన్ కార్డు పొందచ్చు. ఫినో పేమెంట్స్.. కొత్త సేవలు ఫినో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారులు కొన్ని గంటల్లో ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా కొత్త పాన్ కార్డ్‌ల డిజిటల్ వెర్షన్లను పొందవచ్చు. ఇందుకోసం ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రోటీన్ ఇగౌవ్ టెక్నాలజీస్ (ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పాన్ కార్డ్ జారీ సేవలను విస్తరించనున్నాయి. ఈ భాగస్వామ్య ఫలితంగా పేపర్‌లెస్ పాన్ కార్డ్ జారీ చేసే సేవలను ప్రారంభించిన మొదటి పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 12.2 లక్షలకు పైగా మర్చంట్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఈ పాయింట్లు అన్నింటిలో పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. వినియోగదారులు ఎటువంటి పత్రాలను సమర్పించకుండా లేదా అప్లోడ్ చేయకుండా ఆధార్ ఆధారిత ధృవీకరణను ఉపయోగించి పాన్ కార్డ్ పొందవచ్చు. ఇందుకోసం ఫినో బ్యాంక్ పాయింట్లలో పాన్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాన్ కార్డు సేవను ఎంచుకున్న వారికి కొన్ని గంటల వ్యవధిలో ఇపాన్ కార్డు మెయిల్ వస్తుంది. అదే ఫిజికల్ పాన్ కార్డు ఎంచుకుంటే 4 నుంచి 5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఈ-పాన్ చట్టబద్ధమైన పాన్ కార్డ్‌గా అంగీకరించబడుతుంది. చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ! -
ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లను ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు యత్నించిన టీ–టీడీపీ జనరల్ సెక్రటరీ గాజుల విజయ జ్ఞానేశ్వర్నాయుడు అలియాస్ జీవీజీ నాయుడును జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 70లోని జర్నలిస్టు కాలనీ–ప్రశాసన్‌నగర్ సమీపంలో ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రోనక్ కొటేచాకు జ్యోతి సిగ్నేచర్ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. రోనక్ కొటేచా ఎక్కువగా ముంబైలో ఉండటాన్ని గమనించిన జీవీజీ నాయుడు ఇళ్ల కబ్జాకు స్కెచ్ వేశాడు. 2013లో ఈ రెండు ఫ్లాట్లను తాను కొంటున్నట్లుగా ఫోర్జరీ పత్రాలు తయారు చేసి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జరిగినట్లుగా సృష్టించాడు. వీటితో పాటు కొన్ని ఫోర్జరీ సంతకాలతో కూడిన క్యాష్ రిసిప్ట్‌లను కూడా తయారు చేశారు. 2020లో సిటీ సివిల్ కోర్టులో స్పెషల్ పర్ఫార్మాన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ పిటిషన్‌ను దాఖలు చేస్తూ తాను మొత్తం డబ్బులు చెల్లించినా రోనక్ కొటేచా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న రోనక్ కొటేచా జూలైలో హైదరాబాద్‌కు వచ్చి ఫోర్జరీ పత్రాలతో తన ఫ్లాట్‌ను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న జీవీజీ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులో జీవీజీ నాయుడు సమర్పించిన పత్రాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా వాటిల్లో రోనక్ కొటేచా సంతకాలన్నీ ఫోర్జరీ అంటూ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది. దీంతో పోలీసులు జీవీజీ నాయుడుతో పాటు బల్విందర్ సింగ్, మరికొంత మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు తనను అరెస్ట్ చేయకుండా నాయుడు ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని విఫలయత్నం చేయగా కోర్టు మూడు వారాల పాటు అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలచ్చింది. కోర్టు గడువు గత నెల 20న ముగియడంతో అప్పటి నుంచి పోలీసులు నాయుడును అరెస్ట్ చేసేందుకు యత్నించారు. నిందితుడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుండగా ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగా పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.