నామినేషన్‌ వేయాలంటే.. | Here Is The List Of Documents To Be Submitted By Candidates Contesting in Assembly | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వేయాలంటే..

Published Sun, Nov 11 2018 12:29 PM | Last Updated on Sun, Nov 11 2018 12:32 PM

Here Is The List Of Documents To Be Submitted By Candidates Contesting in Assembly - Sakshi

క్రిమినల్‌ కేసులుంటే..
అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉంటే వివరాలను అఫిడవిట్‌లో పొందు పర్చాలి. వాటి వివరాలను అభ్యర్థులు డిసెంబర్‌ 5వ తేదీలోగా స్థానిక దినపత్రికల్లో మూడు మార్లు ప్రచురితం చేయాలి. చానళ్లలోనూ మూడుమార్లు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. దినపత్రికలు, చానళ్లలో ఇచ్చిన ప్రకటనల ఖర్చుల రశీదులను జిల్లా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. 

ఫారం–ఏ.. ఫారం– బీ సమర్పించాలి 
రాజకీయ పార్టీల తరపున పోటీచేసే ఫారం–ఏ, ఫారం–బీను నవంబర్‌ 19వ తేదీ 3గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అతడిని∙స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు బ్యాలెట్‌ పేపరుపై పేరు ఎలా ఉండాఅభ్యర్థులు లనేది ముందుగానే రాసి ఇవ్వాలి. దానికి అనుసరించే బ్యాలెట్‌లో పేర్లు చేరుస్తారు. ముందుగా జాతీయ గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఆ తర్వాత రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల పేర్లను, ఆ తర్వాత గుర్తింపులేని, స్వతంత్రంగా పోటీచేసే అభ్యర్థుల పేర్లను చేరుస్తారు. గడువు వరకు దాఖలైన నామినేషన్లను నవంబర్‌ 20 రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో పరిశీలిస్తారు. 22న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను రిటర్నింగ్‌ అధికారులు ప్రకటిస్తారు. డిసెంబర్‌ 7న ఉదయం 7 నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

నారాయణఖేడ్‌: వచ్చే నెల 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 12న విడుదల కానుంది. ఆ రోజు నుంచి 19వ తేదీవరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శాసన సభ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు వారి కార్యాలయాల్లో కార్యాలయాల్లో స్వీకరిస్తారు. అభ్యర్థులు నామినేషన్‌తోపాటు అఫిడవిట్‌ (ఫారం– 26)ను తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు జారీ చేసింది. నామినేషన్‌ వేసేందుకు ఫారం 2బీ ఉచితంగా సంబందిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అందజేస్తారు. రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించేటప్పుడు అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే కార్యాలయం లోనికి అనుమతిస్తారు. నామినేషన్‌ వేసే జనరల్‌ అభ్యర్థులు రూ.10వేలు, షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలకు చెందిన వారు రూ.5వేలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఒకే డిపాజిట్‌పై అభ్యర్థులు నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంటుంది. 

స్వతంత్రులకు 10 మంది ప్రతిపాదన.. 
నామినేషన్‌ పత్రాలు సమర్పించే అభ్యర్థులు గుర్తింపు పొందిన పార్టీల వారైతే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. గుర్తింపు లేని పార్టీలకు చెందిన వారు, స్వతంత్రంగా పోటీచేసే వాళ్లను 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ పత్రంలోని (ఫారం–2బీ, పార్ట్‌–3లోని(సీ) కాలం ఎదురుగా కేటాయించవలసిన గుర్తులను (ఎన్నికల కమీషన్‌ పంపిన ఫ్రీ సింబల్స్‌ నుంచి) మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో రాయాల్సి ఉంటుంది. 


ప్రతీ కాలం నింపాల్సిందే..
అభ్యర్థి నామినేషన్‌ పత్రంలోని ప్రతీ కాలం తప్పనిసరిగా నింపాల్సి ఉంటుంది. ఆ కాలంలో నింపవలసింది లేనట్లయితే లేదు, వర్తించదు అని రాయాలి. అంతే కానీ డ్యాష్‌ (–) వంటి సింబల్స్‌ రాయకూడదు. ఏ కాలం కూడా ఖాళీగా వదిలివేయరాదు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం–26 నో టరైజ్డ్‌ ఆఫిడవిట్‌లో అన్ని కాలాలను నిం పాలి. ఏదేని కాలంలో నింపవలసిం ది లేనట్లయితే లేదు, వర్తించదు అని రాయాలి. అంతే కాని డ్యా ష్‌ వంటివి రాయకూడదు. 

వివరాలు సరిగా లేకుంటే తిరస్కరణ
మెదక్‌ అర్బన్‌: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని వివరాలను నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్న చోట నింపాల్సి ఉంటుంది. అభ్యర్థికి సంబంధించిన అప్పులు, స్థిరచరాస్తులు, ఏమైనా కేసులు ఉన్నాయా తదితర వివరాలు నమోదు చేయాలి. అభ్యర్థులచే ప్రతిజ్ఞ చేయిస్తాం. ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు కావల్సిన అన్ని వివరాలను అభ్యర్థులు తప్పకుండా అందించాల్సిందే. లేక పోతే నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది. అభ్యర్థులు సంబంధిత అధికారులు, సిబ్బందికి సహకరించాలి.
–నగేష్, జాయింట్‌ కలెక్టర్, మెదక్‌

ప్రభుత్వానికి బకాయిలు ఉండొద్దు..
ఎన్పీడీసీఎల్‌ నుంచి విద్యుత్‌కు సంబంధించిన, మున్సిపాల్టీ, లేదా గ్రామ పంచాయతీ నుంచి నీటికి సంబంధించి, ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్‌లో ఉన్నట్లయితే గత పదేళ్లుగా ఎలాంటి బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలి. నామినేషన్‌ సమయంలో రిటర్నింగ్‌ అధికారి ముందు భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. ప్రతిజ్ఞను తనకు నచ్చిన దేవుడి పేరు మీద గానీ, మనస్సాక్షి మీదగానీ చేయవచ్చు. బ్యాలెట్‌ పేపర్‌పై పేరును ఎలా రాయాలో తెలుపుతూ తెలుగులో రాసి ఇవ్వాలి. 

రాష్ట్రంలో ఏదో ఒక చోట ఓటు హక్కు తప్పనిసరి..
పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండాలి. ఓటు హక్కు కలిగి ఉన్న నియోజకవర్గం ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి నుంచి ఓటరు జాబితా సర్టిఫైడ్‌ ప్రతిని తీసుకు వచ్చి నామినేషన్‌ వెంట సమర్పించాలి. ప్రతిపాదకులు మాత్రం అభ్యర్థి పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్లై ఉండాలి. ప్రతిపాదకులు నిరక్షరాస్యులు అయి నామినేషన్‌ పేపర్‌లో వేలిముద్ర వేసినట్లయితే తిరిగి రిటర్నింగ్‌ అధికారి ముందు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇటీవల దిగిన నాలుగు కలర్‌ పాస్‌పోర్టు సైజు ఫోటోలను ఒక స్టాంపు సైజు ఫోటోను సమర్పించాల్సి ఉంటుంది. ఫొటో వెనుకాల అభ్యర్థి సంతకం చేయాలి. నామినేషన్‌ వేసేందుకు 48గంటల ముందు అభ్యర్థి తన పేరున కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు తెరచిన బ్యాంకు ఖాతాలు అనుమతించబడవు. 

రిటర్నింగ్‌ అధికారి నుంచి పొందేవి..
రిటర్నింగ్‌ అధికారి నుంచి చెల్లించిన డిపాజిట్‌ మొత్తానికి రవీదును పొందాలి. స్క్రూటినీకి హాజరయ్యేందుకు నోటీసు, ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్టర్‌ పొందాలి. కరపత్రం, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతరసామాగ్రి ముద్రించేందుకు ప్రజా ప్రాతినిద్య చట్టంలోని సెక్షన్‌ 127–ఏ సూచనలు. ప్రతిజ్ఞ, శపథం చేసినట్లు ధ్రువీకరణ పత్రం, నామినేషన్‌ పత్రంలోని లోపాలు, ఇంకనూ జతపర్చవలసిన చెక్‌ మెమో.    
 
                                   ముఖ్యమైన తేదీలు

ఎన్నికల నోటిఫికేషన్‌                                             ఈ నెల 12
                                                            (నామినేషన్ల స్వీకరణ ప్రారంభం)   
నామి
నేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ                                      19
నామినేషన్ల పరిశీలన                                                       20
ఉపసంహరణకు చివరి తేదీ                                                22

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement