ఎన్నికల చిత్రాలు | Election Candidates Different Campaign Meny Ways | Sakshi
Sakshi News home page

ఎన్నికల చిత్రాలు

Published Mon, Dec 3 2018 12:15 PM | Last Updated on Mon, Dec 3 2018 12:15 PM

Election Candidates Different Campaign  Meny Ways - Sakshi

అవ్వా.. నీ ఓటు నాకే వేయాలె

జోగిపేట(అందోల్‌): అవ్వా నీ ఓటు నాకే ఎయ్యాలే....అంటూ అందోలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్రాంతికిరణ్‌ అందోలు మండలం తాలెల్మ గ్రామంలో రోడ్డు పక్కన కూర్చున్న వృద్ధురాలిని అభ్యర్థించారు. నా ఓటు కారు గుర్తుకే బిడ్డా అంటూ ఆ వృద్ధురాలు సమాధానం ఇవ్వగానే కార్యకర్తలంతా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.  

‘మాస్కు’చూసి ఓటెయ్యండి..


గజ్వేల్‌: సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి ఆదివారం గజ్వేల్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు కేసీఆర్‌ మాస్కులను ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం, రాష్ట్ర అభివృద్ధికి కారు గుర్తుకు ఓటు వేయాలని నినాదాలు చేశారు.

బస్సులో వెళ్లి ‘కారు’కు ఓటెయ్యండి..

సిద్దిపేటజోన్‌ : సిద్దిపేట–ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద పట్టణ ఆటో డ్రైవర్స్‌ గౌరవాధ్యక్షుడు పాల సాయిరాం ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఆటో, ఆగిన బస్సుల వద్దకు వెళ్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావుకు ఓటు వేసి గెలిపించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement