vote
-
బడుగు బతుకులపై పచ్చ జేసీబీలు
శాంతిపురం: టీడీపీకి ఓటు వేయలేదనే అనుమానంతో ఆ పార్టీ నేతలు పన్నిన కుట్రను అధికారులు పకడ్బందీగా అమలు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇళ్లు కట్టారంటూ 9 ఇళ్లను కూల్చివేసి, ఆయా కుటుంబాలను నిర్వాసితులను చేశారు. బాధితుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సంతూరు సమీపంలోని చెల్దిగాని చెరువు పక్కన మిట్టపై 9 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని పాతికేళ్లుగా నివసిస్తున్నాయి. వీరిలో దళితులైన గణేష్, అశ్వత్, సోమశేఖర్, మంగమ్మ, భవానీ కుటుంబాలతో పాటు బీసీలైన నారాయణప్ప, కనకమ్మ, కావలి నారాయణప్ప, నరసింహులు కుటుంబాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరి ఎక్కువ మంది వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే అనుమానంతో అధికార పార్టీ నాయకులు వీరిని టార్గెట్ చేశారు. వారి ఇళ్లకు కరెంటు, నీటి సదుపాయాలను ఇప్పటికే తొలగించారు. బాధితులు కలెక్టర్, కడ పీడీ, శాంతిపురం తహసీల్దార్, ఎంపీడీవోలను కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. మరోచోట ఇంటి స్థలాలు కేటాయిస్తే అక్కడికి వెళ్లిపోతామని మొరపెట్టుకున్నారు. కానీ 48 గంటల్లో ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులిచ్చిన అధికారులు గడువు తీరగానే కూల్చివేతలకు పూనుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పోలీసుల భద్రత నడుమ రెండు జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూల్చేశారు. ఇళ్లలోని వస్తువులు, ధాన్యం అంతా మట్టి పాలు చేశారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు పిల్లాపాపలు, వృద్ధులతో సహా వీధిన పడ్డాయి. సీఎం నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యమా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దళితులు, పేదలపై అధికారుల జరిపిన దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షడు కోదండరెడ్డి, మండల కన్వినర్ బుల్లెట్ దండపాణి, రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, నాయకులు సైపుల్లా, కావలి వెంకటరమణ, గజ్జల రమేష్, చలపతి ఖండించారు. బాధితులను పరామర్శించిన అనంతరం అక్రమ నిర్మాణం పేరుతో ఇళ్లను కూల్చిన అధికారులు మండల, నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే చర్యను కొనసాగించగలరా అని ప్రశ్నించారు. పిల్లలు, వృద్ధులకు నిలువ నీడ లేకుండా చేసి రాక్షసత్వం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటివరకూ పునరావాస ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించారు. ఎలా బతకాలి రోడ్డు ప్రమాదంలో భర్త, నాన్న చనిపోయారు. ముసలి వాళ్లైన అమ్మ మంగమ్మ, అమ్మమ్మ, వికలాంగుడైన కొడుకుతో కుటుంబాన్ని లాక్కొస్తున్నాను. రోజూ కూలికి పోతేనే ఇల్లు గడుస్తుంది. పైసా పైసా కూడబెట్టుకుని రేకుల ఇల్లు కట్టుకుంటే దిక్కులేని వాళ్లమనే కనికరం లేకుండా కూల్చేశారు. ఇప్పుడు మేం ఎలా బతకాలి?. ఎక్కడ తలదాచుకోవాలి?. – అశ్వని, బాధితురాలు అడవుల పాల్జేశారు ఓటు వేయలేదనే అనుమానంతో మా ఇంటిని కూలదోసి ఏమీ లేకుండా చేశారు. మతిస్థిమితం లేకుండా తన లోకాన తాను తిరిగే భర్త. స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బిడ్డలతో బతుకుతున్నా. కూలి పనులు చేస్తూ బతుకు వెళ్లదీస్తుంటే మా నోట్లో మట్టి కొట్టారు. మమ్మల్ని అడవుల పాలు చేశారు. – శారదమ్మ, బాధితురాలు -
అసెంబ్లీకి పోటీ.. అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభను సమర్థవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. సభలో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం విపక్షాల బాధ్యత అని పేర్కొన్నారు.నేడు(నవంబర్ 14) బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కార్యాలయ ప్రాంగణంలో ‘విద్యార్థులు అండర్-18 మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మాక్ అసెంబ్లీ వంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరమని తెలిపారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు.‘విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారు. చైల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన మీ అందరినీ అభినందిస్తున్నా. జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయి. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారు.18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18ఏళ్లకు తగ్గించారు. అదే విధంగా అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరముంది. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. దీని వల్ల యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు... 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నా. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీలో ఇలాంటి బిల్స్‌ను పాస్ చేయడం అభినందనీయం’ అని తెలిపారు. -
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి నెట్వర్క్:ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులు నెల రోజులు దాటినా నేటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇళ్లు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటేయలేదనే అనుమానంతో ఓటర్లపైన.. వైఎస్సార్సీపీకి ఓటేయించారనే నెపంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైన ప్రతాపం చూపిస్తున్నారు. చివరకు మధ్యాహ్న భోజన పథకం వంట మహిళలనూ టీడీపీ నేతలు వదలటం లేదు.ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాడనే కక్షతో దాడిచిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగసముద్రం గంగమ్మ జాతరలో టీడీపీ నేతలు బుధవారం రాత్రి మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అశోక్, అతడి బావమరిది విఘ్నేష్ (సుబ్రహ్మణ్యం)లను తీవ్రంగా గాయపరిచారు. బాధితుల కథనం ప్రకారం.. సింగసముద్రం గ్రామానికి చెందిన అశోక్ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేయించాడని అతడిపై కక్ష పెంచుకున్నారు. బుధవారం గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా అశోక్ బావమరిది విఘ్నేష్‌ని టీడీపీ నేతలు కొడుతున్నారన్న సమాచారం తెలియడంతో అశోక్ జాతర వద్దకు వెళ్లాడు. దీంతో టీడీపీ నేత సుబ్రహ్మణ్యం ఆగ్రహంతో ఊగిపోతూ ‘అశోక్ వచ్చాడు. వీడే మన టార్గెట్’ అంటూ 40 మందితో కలిసి అశోక్‌పై మూకుమ్మడిగా దాడిచేశాడు. గాయపడిన అశోక్ గురువారం ఉదయం రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్, విఘ్నేష్ భయపడి గ్రామం వదిలి కుప్పం వెళ్లిపోయారు. దాడులతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.పులివెందులలో మామా అల్లుళ్లపై..వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్త అబ్దుల్, ఆయన మామ కుల్లాయప్పపై టీడీపీ కార్యకర్తలు శ్రీను, సంజీవ్, ఫయాజ్, సుమంత్ బుధవారం రాత్రి దాడి చేశారు. అబ్దుల్‌కు, కుల్లాయప్ప ఇంట్లో ఉండగా టీడీపీ కార్యకర్తలు దాడి జరిపి గాయపరిచారు. క్షతగాత్రులిద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించి.. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన అబ్దుల్, కుల్లాయప్పను పార్టీ మునిసిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నప్ప పరామర్శించారు. అనపర్తి మండలంలో బీజేపీ, టీడీపీ కలిసి..తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు కూటేశ్వరస్వామి కాలనీలో వైఎస్సార్సీపీ కార్యకర్త కర్రి కోటేశ్వరరెడ్డిపై రామవరం, కుతుకులూరు గ్రామాలకు చెందిన బీజేపీ, టీడీపీ కార్యకర్తలు బుధవారం రాత్రి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరెడ్డి అనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి కారణంగా కోటేశ్వరరెడ్డి చెవి కర్ణభేరికి రంధ్రం పడినట్టు గుర్తించారు. దాడితో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటేశ్వరరెడ్డి గతంలో గుండె ఆపరేషన్ చేయించుకుని అనారోగ్యంతో ఉన్నారని, దాడి సమయంలో ఆందోళనకు గురై అతడు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అన్యాయంగా దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ నాయకుడి వాహనం ధ్వంసంవైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బంగారు నాగేంద్ర కారును బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో ఉంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు బంగారు నాగేంద్ర తన కారును ఇంటి బయట పార్క్ చేసి ఉంచాడు. బుధవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు కారు అద్దాలు ధ్వంసం చేశారు. సమీపంలో ఉన్న వైఎస్సార్సీపీ బ్యానర్లను చించివేశారు. ఘటనపై బాధితుడు పెనమలూరు పోలీసులకు నాగేంద్ర బుధవారం ఫిర్యాదు చేశారు. వంట మహిళపైనా టీడీపీ దౌర్జన్యంఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలిపై టీడీపీ నాయకులు గురువారం దౌర్జన్యం చేశారు. కుదప గ్రామానికి చెందిన పోతురాజు పద్మావతి 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థుల కోసం వంట చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వంట ఏజెన్సీ నిర్వాహకురాలిని మార్చాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. పాఠశాల హెడ్మాస్టర్ బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం జరపగా.. మెజార్టీ సభ్యులు పద్మావతి వంట ఏజెన్సీ నిర్వహించేందుకు అంగీకరించారు. అయితే.. టీడీపీ నాయకులు ‘మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ఇష్టం వచ్చిన మనుషుల్ని మేం పెట్టుకుంటాం. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో. వంట చేయడానికి వీల్లేదు’ అంటూ తనపై దౌర్జన్యం చేశారని పద్మావతి వాపోయారు. ఈ ఘటనపై ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. రాడ్లు, కర్రలతో దాడిఅన్నమయ్య జిల్లా ములకలచెరువులో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి తెగబడ్డారు. మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేతలు దిన్నెపాటి రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు గురువారం రాత్రి మండల కేంద్రానికి రాగా.. టీడీపీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ, చిన్ని కృష్ణ, శివకుమార్ తదితరులు వారిపై రాడ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు టీడీపీ నేతలను ప్రతిఘటించి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పంచాయతీపై టీడీపీ ఫ్లెక్సీఅనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం నీలిగుంటలో పంచాయతీ కార్యాలయంపై టీడీపీ నాయకుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటుపై సర్పంచ్ కన్నంరెడ్డి వరహాలబాబు ఎంపీడీవో కాశీవిశ్వనాథరావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే రాజకీయ పరమైన ఫ్లెక్సీని పంచాయతీ కార్యాలయం నుంచి తొలగించాలని కోరారు. ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం వల్ల గ్రామంలో ఇరుపార్టీల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇళ్లలో శుభకార్యానికి హాజరైన వైఎస్సార్సీపీ దళిత నాయకుడు వినోద్‌పై టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు. అతడిని అడ్డగించి ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారు. ఇంటికి తాళం వేసి మహిళ నిర్బంధంవైఎస్సార్ సీపీకి ఓటేసిందనే అనుమానంతో నడవలేని స్థితిలో ఉన్న మహిళను ఇంట్లో ఉండగా.. ఆ ఇంటికి తాళం వేసి నిర్బంధించిన ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మిట్టమీదకండ్రిగలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, మరో 10 మందికి వైఎస్సార్సీపీ హయాంలో ఇంటి పట్టాలు ఇచ్చారు. నాగేశ్వరరావు కుటుంబం గృహం నిర్మించుకుని అందులోనే కాపురం ఉంటోంది. ఈ క్రమంలో నాగేశ్వరరావు కుటుంబం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేసిందనే అనుమానంతో ఓ టీడీపీ నాయకుడు కక్షపూరితంగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించారని రెవెన్యూ అధికారుల ద్వారా గురువారం నాగేశ్వరరావు ఇంటికి తాళం వేయించాడు. నడవలేని స్థితిలో ఇంటిలో ఉన్న మునెమ్మ కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా తాళం వేసి నిర్బంధించారు. ఈ విషయంపై తహసీల్దార్ ఉదయ్భాస్కర్రాజును వివరణ కోరగా.. వీఆర్వో లోకేశ్వరి పొరబాటుగా ఇంటికి తాళం వేయడంతో మందలించినట్టు చెప్పారు. ఇల్లు ధ్వంసం చేసి.. ఇద్దరిపై దాడిపల్నాడు జిల్లా శ్రీరామపురం తండాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కేతావత్ గోవిందు నాయక్, కేతావత్ అంజి నాయక్‌లకు చెందిన గృహాన్ని బుధవారం రాత్రి టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ పాత్లావత్ అంజి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన కేతావత్ గోవిందు నాయక్, కేతావత్ అంజి నాయక్‌పై టీడీపీ నేత పాత్లావత్ అంజి, మరో 10 మంది రాడ్లు, కర్రలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయపడిన గోవిందు నాయక్, అంజి నాయక్‌లను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెల్దుర్తి ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.ముస్లింలపై విరుచుకుపడిన టీడీపీ శ్రేణులువక్ఫ్ బోర్డు అధికారి లెక్కలు చూస్తుండగా ముస్లింలపై దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం దాదేపల్లెలో గురువారం చోటుచేసుకుంది. ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని మసీదు మరమ్మతు పనులకు సంబంధించిన నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం వచ్చిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గౌస్ మొహిద్దీన్ గ్రామానికి చేరుకుని లెక్కలు పరిశీలిస్తుండగా.. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఘటనలో ఎస్.బావాజాన్, ఎస్.సనావుల్లా, పి.షేర్‌ఖాన్, ఎస్.మషాయక్, ఎస్.మహమ్మద్ ఖైఫ్, ఎస్.జహీర్లకు గాయాలయ్యాయి. బావాజాన్ ఎముకలు విరగడంతో అపరస్మారక స్థితికి చేరాడు. సనావుల్లాకు ముఖం, ఛాతిపై బలమైన గాయాలయ్యాఇ. ఈ ఘటనతో దాదేపల్లెలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధితులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించి, ఘర్షణకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నంపొలంలో నిద్రిస్తుండగా కత్తులతో దాడి చేసిన టీడీపీ నాయకులుతీవ్ర గాయాలతో అటవీ ప్రాంతంలోకి పారిపోయి ప్రాణం దక్కించుకున్న బాధితుడుపీలేరు ఆస్పత్రిలో చికిత్ససాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమంద పంచాయతీ ఎగువపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత కిరణ్ గురువారం పొలంలో నిద్రించగా..టీడీపీ నాయకులు కత్తులతో విరుచుకుపడి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణభయంతో అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసి అన్నమయ్య జిల్లా పీలేరుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఎగువపల్లెకు చెందిన కిరణ్ వైఎస్సార్సీపీ మండల స్థాయి నాయకుడు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. గురువారం మధ్యాహ్నం కిరణ్ ఎగువపల్లెలోని తన టమాటా తోటలో పడుకుని ఉండగా.. టీడీపీ నాయకులు కిరణ్‌పై కత్తులు, కర్రలతో ఒక్కసారిగా దాడి చేశారు. కిరణ్ తలపై కత్తులతో నరికారు. ఛాతీపై కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ కిరణ్ ప్రాణ భయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాడు. అక్కడ నుంచి అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో కొంత తేరుకున్నాక పుంగనూరు నియోజకవర్గ నాయకులకు ఫోన్‌చేసి తన పరిస్థితిని వివరించాడు. నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒకచోట దాడులు జరగడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్నాయి. -
టీడీపీ నేతల నిర్వాకానికి తల్లి, కూతురు బలి
కళ్యాణదుర్గం: టీడీపీ నాయకుల కక్ష సాధింపులకు తల్లి, కుమార్తె బలయ్యారు. తన భర్తపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడంతో తీవ్ర మనస్తాపం, ఆందోళనకు గురైన గొల్ల మమత (24).. తన 8 నెలల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లికార్జునపల్లికి చెందిన గొల్ల శాంతకుమార్ వైఎస్సార్సీపీ కార్యకర్తగా పార్టీ తరఫున గ్రామంలో చురుగ్గా పనిచేశారు. ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ కిరాణా దుకాణం వద్ద జగన్‌కు అనుకూలంగా మాట్లాడాడు. అనంతరం గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శాంతకుమార్‌ను మందలించేందుకు కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టారు. శాంతకుమార్‌ను ఎలాగైనా కేసులో ఇరికించి జైలుకు పంపాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన హనుమంతు అనే టీడీపీ కార్యకర్తను ఉసిగొల్పి శాంతకుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఈ విషయంపై బుధవారం పోలీసులు శాంతకుమార్‌ను స్టేషన్‌కు పిలిపించారు. భర్త జైలుకు వెళ్తాడన్న భయంతో.. తన భర్త శాంతకుమార్‌ను స్థానిక టీడీపీ నాయకులు అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని, అతన్ని జైలులో పెట్టిస్తారన్న భయంతో అతడి భార్య మమత తీవ్రంగా కుంగిపోయింది. ముందుగా తన 8 నెలల కుమార్తెను ఇంటి ఆవరణలోని నీటి తొట్టెలో ముంచి ప్రాణం పోయాక.. బాత్రూంలో ఉన్న ఇనుప కడ్డీలకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించేసరికే చిన్నారితో పాటు మమత మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకుమార్తె మృతితో మల్లికార్జునపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలివచ్చారు. తల్లీకుమార్తె మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. ఇవి రాజకీయ హత్యలే: వైఎస్సార్సీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే వారి అధికార దాహానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి అన్నారు. కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి, పార్టీ నేతలు రామచంద్ర, హనుమంతరెడ్డి, చిత్తప్ప, తలారి సత్యప్ప, కృష్ణమూర్తి, ఆంజనేయులు తదితరులతో కలిసి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ఇద్దరి మృతదేహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇవి అధికార పార్టీ చేసిన రాజకీయ హత్యలని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న కారణంతో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడం, అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇక్కడ విష సంస్కృతికి తెర లేపారని విమర్శించారు. తల్లీకూతురు మృతికి కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. అప్డేట్స్హోరాహోరీగా సాగిన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మూడో రోజు.. కొనసాగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటివరకు 44 మంది అభ్యర్థులను ఎలిమినేట్తీన్మార్ మల్లన్న ( కాంగ్రెస్) : 1,23,873రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్): 1,04,990గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి: 43,797గెలుపు కోటాకు −31,222 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నగెలుపు కోటాకు 50105 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తిఅశోక్ ఫలితాలను వెల్లడించని అధికారులుఅశోక్ ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత మొదలుకానున్న బీజేపీ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శుక్రవారం మధ్యాహ్నానికి 37 మంది ఎలిమినేట్కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,410 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,676 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,571 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,862 ఓట్లు గెలుపు కోటాకు 31,685 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా, 50,419 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి ఉన్నారు.మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచ్చినా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. -
ఓటేసిన సచిన్, సూర్యకుమార్.. ఫోటోలు వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఐదో దశలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్, వెటరన్ అజింక్యా రహానే, అర్జున్ టెండూల్కర్ సైతం ఓటు వేశారు. సచిన్ తన తనయుడు అర్జున్‌తో కలిసి ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ బయట సిరాతో ఉన్న వేలిని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అదేవిధంగా సూర్యకుమార్ సైతం ఓటు వేసిన అనంతరం తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వినియోగించుకోవాలని సూర్య పిలుపునిచ్చాడు. Let’s shape the future of our nation by casting our vote today. ✌️ pic.twitter.com/ZYgT69zhis— Surya Kumar Yadav (@surya_14kumar) May 20, 2024 -
ప్రతి భారతీయుడికి ఓ గర్వకారణం.. ఎన్నికల పోలింగ్‌పై ఆర్బీఐ గవర్నర్
దేశంలో 5వ విడుత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో ముఖేష్ అంబానీ సోదరులు అనిల్ అంబానీ, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ముంబైలోని పెద్దార్ రోడ్డులోని యాక్టివిటీ స్కూల్లోని పోలింగ్ కేంద్రానికి గవర్నర్ తన భార్య, కుమార్తెతో కలిసి వచ్చారు. ఓటు వేసిన అనంతరం..140 కోట్ల మంది ప్రజలు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వించదగ్గ తరుణం. ప్రతి భారతీయుడికి ఓ గర్వకారణం అని అన్నారు. ఆర్థిక విషయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని, జూన్ 7న తదుపరి ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం వరకు వేచి చూడాల్సిందేనని అన్నారు. #WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l— ANI (@ANI) May 20, 2024 మనదేశానికి ఎంతో గర్వకారణమైన ఈ ఎన్నికల్లో దేశ పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శక్తికాంత దాస్ విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎంతో కఠినమైన ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిగేలా అహర్నిశలు శ్రమిస్తున్న భారత ఎన్నికల సంఘానికి, ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు.కాగా, దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజక వర్గాలకు (మే 20న)ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. -
ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఈరోజు(సోమవారం) ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైనా యూపీలోని ఒక గ్రామంలో ఇప్పుటికీ ఒక్క ఒటు కూడా పడలేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం యూపీలోని కౌశాంబి పరిధిలోని హిసంపూర్ మాడో గ్రామానికి చెందిన వేలాది మంది గ్రామస్తులు ఓటు వేయడానికి నిరాకరించారు. గ్రామంలోని కూడలి వద్ద ఓటింగ్ బహిష్కరణకు సంబంధించిన పోస్టర్లు అతికించారు. అయితే ఓటరు కేంద్రం వద్ద ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటర్ల కోసం వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం కావస్తున్నా ఒక్కరు కూడా ఓటు వేయలేదు.గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, దీనిపై ఇంత వరకు ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా నోరు మెదపలేదని వారు మీడియా ముందు వాపోయారు. అందుకే తాము ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామపెద్ద వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదని, రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తున్నదన్నారు. గ్రామానికి చెందిన పిల్లలు చదువుకోడానికి రైల్వే లైన్ దాటి వెళుతున్నారన్నారు.తాము ఇక్కడి రైల్వేలైన్‌పై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులు కోరగా హామీ ఇచ్చి, దానిని విస్మరించారన్నారు. గ్రామస్తులంతా పోలింగ్ కేంద్రం బయటే నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారిని ఒప్పుంచేందుకు ప్రయత్నించినా , వారు తమ డిమాండ్లు నెరవేరేవరకూ ఓటు వేయబోమని తెగేసి చెప్పారు. -
ఓటు వేయనివారిపై నటుడు పరేష్ రావల్ ఆగ్రహం
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ ఓటింగ్ కొనసాగుతోంది. దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తన ఓటు హక్కు వినియోగంచుకోవడంతో పాటు ఓటర్లందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.నటుడు పరేష్ రావల్ తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పరేష్ రావల్ ఓటు వేయని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చాలామంది ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపిస్తుంటారు. అయితే మన వంతుగా ఓటు వేయడం అనేది మన బాధ్యత. ఓటు వేయకుంటే దాని పర్యవసానం కూడా మనమే ఎదుర్కొంటాం. దానికి ప్రభుత్వం బాధ్యత వహించదు’ అని పరేష్ రావల్ పేర్కొన్నారు. #WATCH | Bollywood actor Paresh Rawal says, "...There should be some provisions for those who don't vote, like an increase in tax or some other punishment." pic.twitter.com/sueN0F2vMD— ANI (@ANI) May 20, 2024 -
‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు
కంబదూరు/పెదవేగి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి వైఎస్సార్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు. -
మభ్యపెట్టి సైకిల్, కమలానికి ఓట్లేశారు
ద్వారకాతిరుమల : నల్లజర్ల మండలం సుభద్రపాలెం, తెలికిచర్లలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ఇద్దరు ఉద్యోగులు ఓటర్లు వేయమన్న సింబల్‌కు కాకుండా సైకిల్, కమలంపై ఓట్లు వేసి తమ ప్రేమను చాటారు. ఆ ఇద్దరు ఉద్యోగుల్లో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ ఉన్నారు. స్థానికుల కథనం ప్రకారం.. బిరుదుగడ్డ నందెమ్మ అనే దివ్యాంగురాలు సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లింది.అక్కడ ఓపీఓగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ లక్ష్మి సహాయం కోరింది. అయితే ఆ టీచర్ నందెమ్మ చెప్పిన గుర్తుకు కాకుండా కమలం, సైకిల్‌కు ఓటు వేసింది. దీన్ని గుర్తించిన బాధిత నందెమ్మ ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని అధికారులకు, బయట ఉన్న స్థానికులకు తెలిపింది. దీంతో అసలు విషయం బయటపడటంతో అధికారులు ఆమెను బయట కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే సదరు అంగన్వాడీ టీచర్ భర్త టీడీపీలో కీలక పదవిలో ఉన్నాడని, ఆమె కుమార్తెను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకరరావు బంధువుకిచ్చి వివాహం చేసినట్టు చెబుతున్నారు. దీంతో టీడీపీపై ఆమెకున్న ప్రేమను ఇలా ఓట్లు వేసి చూపిందని అంటున్నారు.అదే విధంగా తెలికిచెర్లలోని 166 వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు అక్కడ పీఓగా విధులు నిర్వర్తిస్తున్న జానకి సహాయాన్ని కోరారు. అయితే వారు చెప్పిన సింబల్స్‌కు కాకుండా సైకిల్, కమలం గుర్తులకు ఆమె ఓట్లు వేయడాన్ని ఆ బూత్ ఏజెంట్లు, బాదిత ఓటర్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్నికల రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో జానకి స్ధానంలో సెక్టోరియల్ అధికారిగా వై.సత్యనారాయణను నియమించారు. అలాగే పీఓ జానకిని పోలీసుల సెక్యూరిటితో ఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళారు. పీఓ జానకి ఉదయం నుంచి ఇదేవిధంగా ఓట్లు వేసిందని అక్కడివారు చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారులు వీరిపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. -
సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు వేశారు
-
ఉత్సాహంతో ఓటేశాం.. మీరూ కదలండి (ఫొటోలు)
-
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
-
చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవాలి..
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ అర్హులు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖులు కోరుతున్నారు. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.సార్వత్రిక ఎన్నికలు ఫేజ్ 4మొత్తం లోక్‌సభ సీట్లు: 96రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు: 10పోటీలోని మొత్తం: 1,717మొత్తం పోలింగ్ స్టేషన్లు: 1,81,196పోటీలో ఉన్న మహిళలు: 170గ్రాడ్యుయేట్లు: 1,010కోటీశ్వరులు: 476అభ్యర్థులపై ఉన్న కేసుల సంఖ్య: 360 -
మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)
-
సెలబ్రిటీల ఓటు ఇక్కడే..
బంజారాహిల్స్: పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో చాలామంది ప్రముఖులు ఓటు వేయనుండగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కూడా మరికొంతమంది తారలు ఓటు వేయనున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటు వేసి తమ బాధ్యతను చాటిచెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రజలపై సినీతారల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ఎన్నికల్లో ఓటర్లు కూడా భారీగా తరలివచ్చి తాము సైతం అంటూ ఓటు వేశారు. సోమవారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సైతం అటు సినీ ప్రముఖులు, ఇటు ఓటర్లు అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. 👉 బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా బంజారాహిల్స్‌లోని నందినగర్ కమ్యూనిటీ హాలులో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 జూనియర్ ఎన్టీఆర్ బంజారాహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్లో, కల్యాణ్‌రామ్ ఎమ్మార్వో ఆఫీసు పోలింగ్ బూత్‌లలో ఓటు వేస్తారు. 👉 సినీ ప్రముఖుల్లో చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన, నితిన్‌లు జూబ్లీహిల్స్ క్లబ్ బూత్ నెంబర్–149లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 హీరో రవితేజ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ, సెంట్రల్ నర్సరీ బూత్ నెంబర్ 157లో, అక్కినేని నాగార్జున, అమల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో, మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేస్తారు. 👉 విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బ్రహ్మజీ, జీవిత, రాజశేఖర్‌లు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో మోహన్‌బాబు, మంచు విష్ణు, రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, విశ్వక్సేన్, రాణా, సురేష్‌బాబు ఓటు వేస్తారు. 👉 అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌లు జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–69 బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో ఓటేస్తారు. 👉 హీరో వెంకటే‹Ù, బ్రహా్మనందం మణికొండ హైస్కూల్లో, రాజమౌళి, రమ షేక్‌పేట ఇంటర్నేషనల్ హైస్కూల్లో, సుధీర్ బాబు దర్గా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, అల్లరి నరేష్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లోని మహిళా ఆర్థిక సహకార సంస్థలో, తనికెళ్ల భరణి యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాలులో ఓటు వేస్తారు. -
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
ఓటరా..! ఓటు వేయడం మీ బాధ్యత! అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రజలను చైతన్యపరుస్తుంది. పైగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే యత్నం కూడా చేస్తోంది.. అంతేగాక టీవీ, సామాజిక మాధ్యమాలతో సహా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే "దేవుడు హుండీలో డబ్బులు వేయడం కాదు! దేశం కోసం ఓటు వేయడం నేర్చుకో!, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకోవడం మన కర్తవ్యం వంటి మాటలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంతలా చేసినా చాలా వరకు ముఖ్యంగా విద్యావంతులే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది కూడా. అయితే ఇలా ఓటు హక్కుని వినియోగించకపోతే కొన్ని దేశాల్లో అధికారులు అస్సలు ఊరుకోరట. చాలా దారుణమైన శిక్షలు విధిస్తారట. అవేంటో తెలుసుకుందామా.!బెల్జియంఇక్కడ వరుసగా నాలుగుసార్లు ఓటు వేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఆస్ట్రేలియాఇక్కడ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది.సింగపూర్ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఆ వ్యక్తుల ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుందిగ్రీస్ఇక్కడ ఏకంగా ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్ నమోదవుతుంది..(చదవండి: పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!) -
ఓటు ఎలా వేయాలి ?..ట్రైనింగ్ వీడియో మీకోసం
-
AP Elections 2024 Polling: పులివెందులకు సీఎం జగన్
వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి స్వస్థలం పులివెందులకు చేరుకుంటారు. రేపు.. సోమవారం ఉదయం పులివెందుల భాకరాపురంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం వైఎస్ జగన్ 90,543ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.క్లిక్ చేయండి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 -
ఇంటింటి అభివృద్ధి కొనసాగిద్దాం..
ఈ మంచిని కొనసాగిద్దాం..మీ బిడ్డ ఐదేళ్ల పాలనలో కేలండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకాన్ని అందిస్తామో మీకు ముందుగానే చెప్పాడు. రైతుభరోసా, అమ్మఒడి, చేయూత.. ఇలా ఫలానా పథకాన్ని ఫలానా నెలలో ఇస్తామని చెప్పి ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లలో మీ అందరికీ మేలు చేశాడు. ప్రతి ఇంటికి మంచి చేశాడు.మన ఇంటికి జరుగుతున్న ఈ మంచిని పొరపాటున చంద్రబాబు ప్రలోభాలతో మోసపోయి పోగొట్టుకోవద్దని ప్రతి ఒక్కరికీ విన్నవించుకుంటున్నా. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో మీరంతా చూశారు – సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ: మీ జగన్‌కు మీరు వేసే ఓటు.. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు విన్నవించారు. మీ అందరికీ మంచి చేస్తూ, సంతోషాలను పంచుతూ 130 సార్లు బటన్లు నొక్కి రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా నేరుగా మీ చేతికే అందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గత ఐదేళ్లుగా చేసినమంచిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. నిర్ణయాత్మక ఎన్నికలివి..మరో 36గంటల్లో ఎన్నికల సమరం జరగనుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలివి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. ఆయన్ను నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకి అర్థం ఇదే. గత 59 నెలలుగా మీ బిడ్డ ఎప్పుడూ చూడని విధంగా పాలనలో మార్పులు తెచ్చాడు. 130సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాడు. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కి మంచి చేసిన ప్రభుత్వాలు ఉన్నాయా? 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఏ ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా? రాష్ట్రంలో గతంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా ఇచ్చాడు.నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే 1.35 లక్షల మంది మన సచివాలయాల్లోనే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేసి విశ్వసనీయతను చాటుకున్నాం. గడప గడపకూ మన మేనిఫెస్టోను పంపించి మీరే టిక్ పెట్టాలని అక్కచెల్లెమ్మలను కోరాం. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను మచ్చుకు కొన్ని గడగడా చెబుతా.విద్యా విప్లవాలు..నాడు–నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లతో పాటు సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజుల చెల్లింపు, అంతర్జాతీయ యూనివర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు, తప్పనిసరి ఇంటర్న్‌షిప్ లాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అక్కచెల్లెమ్మలకు అండగా..అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వారి పేరిటే 31లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు, రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, నష్టపోతే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను గతంలో ఎప్పుడైనా చూశారా? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా? వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. కోలుకునే సమయంలో ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, టెస్టులు చేసి మందులు కూడా ఇచ్చేలా ఆరోగ్య సురక్ష తెచ్చాం. ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాలను గతంలో చూశారా?గ్రామ స్వరాజ్యం..ఏ గ్రామాన్ని చూసినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు, ప్రతి 60 – 70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం మహిళా పోలీసులు, ఆపదలో ఆదుకునే దిశ యాప్ లాంటివి మీ బిడ్డ పాలనలో సాకారం చేశాడు. మళ్లీ ఇంటికే అన్నీ రావాలంటే..పేదల తలరాతలు మారాలంటే ఫ్యాను గుర్తుకే ఓటేయాలి. వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్లీ నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆసుపత్రులు మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి.చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి.2014 బాబు విఫల హామీలు» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?» ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? » అర్హులందరికీ 3సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ హామీ అమలైందా?» ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా?» సింగపూర్‌ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురంలో ఎవరికై నా కనిపిస్తున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. »అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.దీవించండి..నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.కొల్లేరు మిగులు భూముల పంపిణీ..!కొల్లేరు సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ మీ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి. నేను ఇచ్చిన మాట ప్రకారం జయమంగళ వెంకటరమణ అన్నను ఎమ్మెల్సీగా చేశా. కొల్లేరు ప్రాంతంలో సర్వే దాదాపుగా పూర్తైంది. రిపోర్టు కూడా సిద్ధమైన వెంటనే మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తాం. మీ బిడ్డే మీ దగ్గరకు వచ్చి ఆ పంపిణీ కార్యక్రమం చేస్తాడు. -
Telangana: ఓటేద్దాం.. రండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్థారణైతే చాలని, ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును గుర్తింపునకు ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఈ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. ఓటరు గుర్తింపు నిర్థారణకు ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.ఎపిక్‌లో లోపాలుంటే వేరే గుర్తింపు తప్పనిసరి..ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో(కింద జాబితాలో చూడవచ్చు) ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు.. ఓటరు గుర్తింపుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో.. ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ఈ కింది జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది.» ఆధార్ కార్డు» ఉపాధి హామీ జాబ్‌కార్డు, బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్,» కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు» రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రర్ (ఎన్పీఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు » భారతీయ పాస్‌పోర్టు» ఫొటో గల పెన్షన్ పత్రాలు » కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు»ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు» కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)చాలెంజ్ ఓటు అంటే?ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్థారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్థారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్థారణ అయితే సదురు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌తో ఎన్నో సదుపాయాలు..ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్లకు ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవడం, బీఎల్ఓ/ఈఆర్వోతో అనుసంధానం కావడం, ఈ– ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు.పోలింగ్ సమయం ముగిసినా లైన్లో ఉంటే ఓటేయవచ్చురాష్ట్రంలోని 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ముందు లైనులో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న వారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. పోలింగ్ కేంద్రంలో సెల్ఫోన్లపై నిషేధం!పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కార్డ్ లెస్ ఫోన్లు, వైర్ లెస్ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది. పోలింగ్ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీలు లేదు. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత అధికారులు మాత్రమే ఎన్నికల కేంద్రంలో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లవచ్చు. అయితే వాటిని సైలెంట్ మోడ్‌లో ఉంచాల్సిందే.మీ ఓటును వేరే వాళ్లు వేసేశారా? అయితే.. టెండర్ ఓటేయవచ్చు! ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవాళ్లు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెíషీన్(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు. ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటేయదల్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటెవరికి వేశారో బయటికి కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు.జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?» ఎన్నికల సంఘం వెబ్సైట్https://electoralsearch.eci. gov. in కి లాగిన్ కావాలి. » మీ వివరాలు/ ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)/ మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులు వు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేసేందుకు వీలుంటుంది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయస్సు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు.» ఓటర్ హెల్ప్ లైన్ 1950కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.(మీ ఏరియా ఎస్టీడీ కోడ్ ముందు యాడ్ చేయాలి). » 1950 నంబర్‌కి మీ ఎపిక్ నంబర్‌ను ఎస్ఎంఎస్ చేసి తెలుసు కోవచ్చు. (ఎస్ఎంఎస్ ఫార్మాట్: ‘ఉఇఐ ఎపిక్ నంబర్’. ఈసీఐ, ఎపిక్ నంబర్ మధ్య స్పేస్ ఉండాలి).పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో..ఎలా తెలుసుకోవాలి?రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేసింది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.అనుచితంగా ప్రవర్తిస్తే పోలింగ్ బూత్ నుంచి గెంటివేతేపోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయని పేర్కొంది. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు..అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్(ఏఎస్డీ) ఓటర్ల జాబితాను రూపొందించి సంబంధిత పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకుంటే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాల్సి ఉంటుంది. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్థారించుకుంటారు. అనంతరం ఈ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర సైతం తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ సైతం తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో సైతం తీసుకుంటారు. అనంతరం ఆ వ్యక్తికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న వేతనంతో కూడిన సెలవుసెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలకు ఈసీ ఆదేశంరాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 13న పోలింగ్ జరగనుండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్–1974 కింద ఫ్యాక్టరీలు, షాపులు, ఇండస్ట్రియల్ అండర్ టేకింగ్స్, ఎస్లాబ్లిష్మెంట్స్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ మార్చి 22న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వని పక్షంలో కార్మిక, ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ శనివారం మీడియాకు వెల్లడించారు. -
Lok Sabha Election 2024: పెరిగేదే లే!
ఓటెయ్యండి బాబూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండమ్మా.. ఓటు విలువ తెలుసుకో యువతా అంటూ ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు చెవిలో ‘ఈవీఎం’ కట్టుకుని పోరుతున్నా ఓటర్లలో మాత్రం ఉత్సాహం పెద్దగా కనిపించడం లేదు! ఇప్పటిదాకా జరిగిన మూడు విడతల పోలింగ్‌లో ఓటింగ్ మందకొడిగానే నమోదైంది. 2019తో పోలిస్తే తగ్గింది కూడా. సుదీర్ఘ షెడ్యూల్, మండుటెండలతో పాటు పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణాలుగా కని్పస్తున్నాయి. తక్కువ ఓటింగ్ మన దేశంలో కొత్తేమీ కాదు. ఈ పరిణామంతో అధికార, ప్రతిపక్షాల్లో ఎవరికి నష్టం, ఎవరికి లాభమన్న చర్చ ఊపందుకుంది...ఈసారి సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో మూడు అంకాలు ముగిశాయి. మే 7న మూడో విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ స్థానాల్లో 2019లో నమోదైన 67.33 శాతంతో పోలిస్తే 1.65 శాతం తగ్గినట్లు ఈసీ డేటా చెబుతోంది. తొలి రెండు విడతల్లోనూ ఇదే తంతు. 102 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం ఓట్లు పడ్డాయి. 2019లో ఈ స్థానాల్లో 69.4 శాతం ఓటింగ్ నమోదైంది. 88 సీట్లకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్‌లో 66.71 శాతం ఓటింగే నమోదైంది. 2019లో ఆ స్థానాల్లో వీటికి 69.2 శాతం ఓటింగ్ జరిగింది. మరో నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో మే 13న జరిగే నాలుగో దశలో అత్యధికంగా 96 సీట్లున్నాయి. చివరి మూడింట్లో పోలింగ్ జరగాల్సిన స్థానాలు 164 మాత్రమే. 2019లో రికార్డు ఓటింగ్... 2019లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటిదాకా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రికార్డు. 1951–52 తొలి లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 45.67 శాతం ఓటింగ్‌తో పోలిస్తే ఓటర్లలో చైతన్యం పెరుగుతూ వస్తోందనే చెప్పాలి. అయినా ఇప్పటికీ కనీసం 70 శాతాన్ని కూడా చేరకపోవడం మాత్రం ఆందోళనకరమే. రికార్డు పోలింగ్ నమోదైన గత ఎన్నికలనే తీసుకుంటే జనాభా భారీగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఓటింగ్ నమోదవడం గమనార్హం. బిహార్ (57.33%), ఉత్తరప్రదేశ్ (59.21), ఢిల్లీ (60.6%), మహారాష్ట్ర (61.02), ఉత్తరాఖండ్ (61.88%), తెలంగాణ (62.77%), గుజరాత్ (64.51%), పంజాబ్ (65.94%), రాజస్థాన్ (66.34%), జమ్మూ కశీ్మర్ (44.97%), జార్ఖండ్ (66.8%) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. 2014లో 66.44 శాతం ఓటింగ్ నమోదైంది. 2009లో నమోదైన 58.21 శాతంతో పోలిస్తే ఏకంగా 8.23 శాతం పెరిగింది! మన దేశంలో ఓటింగ్ ఒకేసారి అంతలా ఎగబాకడం కూడా రికార్డే.ఎందుకు తగ్గుతోంది...! ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికైతే ఓటింగ్ సరళి నిరాసక్తంగానే ఉంది. మిగతా నాలుగు విడతల్లో ఓటర్లు భారీగా బాగా బారులు తీరితేనే కనీసం 2019 స్థాయిలోనైనా ఓటింగ్ నమోదయ్యే అవకాశముంటుంది. లేదంటే భారీగా తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి... ⇒ పట్టణ ఓటర్లు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఓటింగ్ శాతం పడిపోవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి. మూడు విడతల్లో పట్టణ నియోజకవర్గాల్లో పేలవ ఓటింగే ఇందుకు నిదర్శనం. ⇒ యూపీలోని గాజియాబాద్‌లో 2019లో 55.88 శాతం ఓట్లు పడగా ఈసారి 49.88 శాతానికి దిగజారింది. కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్లో 54.31 శాతం నుంచి 54.06 శాతానికి; బెంగళూరు సౌత్‌లో 53.69 శాతం నుంచి 53.17 శాతానికి తగ్గింది. ⇒ 2019లో కూడా పట్టణ ఓటర్లలో ఇదే ధోరణి కనబడింది. అత్యంత తక్కువ ఓటింగ్ నమోదైన 50 లోక్‌సభ స్థానాల్లో 17 మెట్రోపాలిటన్, పెద్ద నగరాల్లోనే కావడం గమనార్హం. ⇒ తక్కువ ఓటింగ్‌కు వలసలు కూడా కారణమే. పొట్టకూటి కోసం వలస వెళ్లేవాళ్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఓటింగ్ తగ్గుతున్నట్లు తేలింది. ⇒ వచ్చి ఓటేసేంత స్థోమత లేకపోవడం, కూలి డబ్బులను వదులుకోలేని అశక్తత వల్ల వారు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోతున్నారు. ⇒ దేశంలో అత్యధిక ఓటర్లున్న ఉత్తరప్రదేశ్‌లో అతి తక్కువ ఓటింగ్ నమోదవడం దీనికి నిదర్శనం. ⇒ మండుటెండలు కూడా ఓటింగ్‌కు గండికొడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ⇒ రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగేలా ఉండటంతో మిగతా నాలుగు విడతల ఓటింగ్‌పైనా తీవ్ర ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.ఫలితాలపై ప్రభావం.. ఎప్పుడెలా...?! 1951 నుంచి 2019 వరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే భారీగా ఓటింగ్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు అనూహ్య ఫలితాలే వచ్చాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో ఓటింగ్ 5 శాతం పైగా పెరిగి 60 శాతం దాటింది. ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర పరాజయం పాలై జనతా కూటమికి అధికారం దక్కింది. 1980లో ఓటింగ్ మళ్లీ భారీగా పడిపోయింది. అధికార జనతా పార్టీ ఓడి కాంగ్రెస్ విజయం సాధించింది. 1984 ఎన్నిక్లలో ఓటింగ్ 7 శాతం పైగా పెరగడం ఇందిర మరణంపై వెల్లువెత్తిన సానుభూతికి నిదర్శనంగా నిలిచింది. రాజీవ్‌గాంధీ ఘన విజయం సాధించారు. 1989లో మళ్లీ ఓటింగ్ తగ్గింది. కాంగ్రెస్ ఏకంగా సగానికి పైగా సీట్లను కోల్పోయింది. 1991 ఎన్నికల్లోనూ ఓటింగ్ 6 శాతానికి పైగా తగ్గింది. మళ్లీ అధికార పక్షానికి షాక్ తగిలి కాంగ్రెస్ గద్దెనెక్కింది. 2004లో ఓటింగ్ స్వల్పంగానే తగ్గినా ఐదేళ్ల వాజ్‌పాయి సర్కారు ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు కొలువుదీరింది. 2009 ఓటింగ్ స్వల్పంగా పెరిగింది. యూపీఏ ప్రభుత్వమే కొనసాగింది. 2014లో ఓటింగ్ రికార్డు స్థాయిలో 8 శాతానికి పైగా పెరిగింది. బీజేపీ తొలిసారి ఘనవిజయం కొట్టింది. పెరిగిన ఓటింగ్ మోదీ వేవ్‌కు అద్దం పట్టింది. 2019లోనూ 1 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. బీజేపీ మెజారిటీ మరింత పెరిగింది. ఆ లెక్కన ఈసారి ఓటింగ్ భారీగా తగ్గితే కచి్చతంగా అనూహ్య ఫలితాలే రావచ్చంటున్నారు రాజకీయ పండితులు.అధికార పార్టీకే నష్టమా? 2019లో 67.4 శాతం ఓటింగ్ జరిగినా వాస్తవంగా చూసుకుంటే 30 కోట్ల మంది ఓటే వేయలేదు! ఇదే నిరాసక్తత ఈసారి కూడా కొనసాగితే ఓటింగ్‌కు దూరంగా ఉండేవారి సంఖ్య 35 కోట్లకు పెరగవచ్చు. ఓటింగ్ భారీగా తగ్గడం దేనికి సంకేతమన్న దానిపైనా పలు రకాలు వాదనలున్నాయి. ఓటింగ్ పడిపోవడం అధికార పారీ్టకే ఎక్కువ నష్టమని చరిత్ర చెబుతోంది, అయితే ఇది అన్నివేళలా నిజం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘ఓటింగ్ తక్కువగా నమోదైనప్పుడు ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓటింగ్ తగ్గుదల 5 శాతం లోపుంటే ప్రజలు మార్పు కోరుకోవడం లేదని, పెద్దగా స్తబ్ధత లేదని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో స్థానికాంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చు. ఏదైనా జరగొచ్చు’’ అంటున్నారు రాజీకీయ విశ్లేషకుడు నోమిత పి.కుమార్. ఓట్ల శాతం భారీగా తగ్గడం వల్ల మెజారిటీలకు గండిపడి ఒక్కోసారి ఫలితాలు భారీగా తారుమారవుతాయన్నది మరికొందరి వాదన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
మే 13, 2024.. సోమవారం. రెండు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ. ప్రతీ ఓటరు ఓటేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సందర్భం. ఈ నేపథ్యంలో ఓటుకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓటు వేయడానికి అమల్లో ఉన్న పద్ధతులేంటీ? అన్న విషయాలు తెలుసుకుందాం.ఓటరు జాబితాలో పేరుందా?మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సిన విషయం మీ పేరు ఓటరు జాబితాలో ఉందా? ఎన్నికల సంఘం వెబ్సైట్లో మీ పేరు లేదా ఎపిక్ నెంబర్ లేదా అడ్రస్‌తో చెక్ చేసుకోవచ్చు. https://electoralsearch.eci.gov.in/ వెబ్సైట్లో మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చుఎపిక్ డౌన్లోడ్ చేసుకోండిఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్) ఉండడం మంచిది. మీ పేరు జాబితాలో ఉంటే మీ ఎపిక్‌ను మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://voterportal.eci.gov.in/login వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేయగానే డౌన్లోడ్ అప్షన్ వస్తుంది. అయితే మీ మొబైల్ నెంబర్ అనుసంధానం కాకపోతే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోలేరు.ఎపిక్‌లో లోపాలుంటే... ఇక కొందరి ఓటరు కార్డుల్లో స్వల్ప తేడాలు (అడ్రస్ మార్పు, ఫోటో పాతది ఉండడం లేదా పేరు అక్షరాల్లో మార్పులు) ఉండొచ్చు. దానికి ఎలాంటి కంగారు లేదు. ఎపిక్ వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పిస్తారు. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుంది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది.♦ ఆధార్‌కార్డు ♦ ఉపాధి హామీ కార్డు♦ జాబ్ కార్డు ♦ బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్ ♦ కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ♦ డ్రైవింగ్ లైసెన్స్♦ పాన్‌కార్డు ♦ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్(ఎన్పిఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు ♦ భారతీయ పాస్‌పోర్టు ♦ ఫొటో గల పెన్షన్ పత్రాలు ♦ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు ♦ ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ♦కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)పోలింగ్ స్లిప్పులుపోలింగ్కు కొన్ని రోజుల ముందే పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేస్తారు. అయితే, వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరు. కానీ ఇందులో.. పార్ట్ నెంబర్, ఓటరు సీరియల్ నెంబరు ఉంటాయి. ఈ వివరాలతో ఓటరు జాబితాలో మిమ్మల్ని సులభంగా గుర్తిస్తారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదున్నా.. మీకు ఓటు హక్కు కల్పిస్తారు. కాబట్టి పోలింగ్ స్లిప్పు ఉంటే మీ పని చాలా సులభం.పోలింగ్ బూత్‌లో మీ ఓటు ఎలా వేసుకోవాలంటే.?పోలింగ్ బూత్‌లోకి వెళ్లగానే మీ దగ్గరున్న పోలింగ్ స్లిప్పును చూపించండి. లేదా మీ ఓటరు సీరియల్ నెంబర్, పార్టు నెంబరు చెప్పండి.ఈ వివరాలను బట్టి ఒక్క నిమిషంలో ఓటర్ వివరాలను ధృవీకరిస్తారువివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తరువాత మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు.మీ వివరాలను (ఓటరు ఐడీ నెంబరు) ఫారం 17Aలో నమోదు చేస్తారు.ఓటరు జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు.ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తు పెట్టి మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌కు వెళ్లడానికి అనుమతిస్తారు.ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే EVM మెషీన్, దాని పక్కనే VVPAT యంత్రమూ ఉంటుంది.(మీరు ఎవరికి ఓటేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే ఈ VVPAT)ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క.... వారికి కేటాయించిన గుర్తులు మరో వైపు... వీటి పక్కన్నే నీలి రంగు బటన్ ఉంటాయి.మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న నీలి రంగు బటన్‌ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క.బటన్ నొక్కిన తరువాత అయిదు సెకన్ల పాటు చిన్న శబ్ధం వినిపిస్తుంది.ఆ వెంటనే VVPAT మెషీన్‌పై పచ్చటి లైట్ వెలుగుతుంది.VVPATపై ఉండే స్క్రీన్‌పై చూస్తే... మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకూ గుర్తు, ఈవీఎంపై అతడికి కేటాయించిన క్రమసంఖ్య, పేరు ముద్రించిన కాగితపు స్లిప్ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది.ఏడు సెకన్ల తరువాత ఈ స్లిప్ కాస్తా బాక్స్‌లోకి పడిపోతుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రెండూ జరుగుతున్నాయి కాబట్టి.. పోలింగ్ బూత్‌లో రెండు ఈవీఎంలు, రెండు వీవీ పాట్లు ఉంటాయి. ఒక ఓటు మాత్రమే వేసి రెండో ఓటు మరిచిపోవద్దు. ఓపిగ్గా.. రెండు ఓట్లు వేసి ప్రజాస్వామ్యంలో ఓటరుగా మీ బాధ్యతను నిర్వర్తించుకోవాలి.మీ ఓటు గురించి మీకు ఎలాంటి అనుమానాలున్నా.. మాకు ఈ మెయిల్ రాయగలరు. info@sakshi.com మీ సందేహాలకు సంబంధించి ఎన్నికల అధికారులతో మాట్లాడి సమాధానం ఇవ్వగలం. -
ఓటేసి వస్తే టిఫిన్ ఫ్రీ
శివమొగ్గ: ఓటు హక్కు చాలా విలువైనది, ఓటేసి వస్తే టిఫిన్లు ఫ్రీ అని శివమొగ్గలోని శుభం హోటల్ యజమాని ప్రకటించాడు. దీంతో ఓటేసినవారు పోలోమంటూ హోటల్‌కు రావడంతో రద్దీ ఏర్పడింది. ఓటు వేసిన సిరా గుర్తు చూపిస్తే టిఫిన్, టీ, కాఫీలు ఉచితంగా ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్లను పెట్టారు. ఉచితంగా మసాల దోసె, పలావ్ ఇచ్చి అభినందించారు. ముఖ్యంగా ఓటర్లు మసాల దోసె కోసం ఎగబడ్డారు. యజమాని ఉదయ్ కదంబ మాట్లాడుతూ ఉచితమని చెప్పడం వల్ల వెయ్యి నుంచి 1500 వరకు మంది రావొచ్చని అనుకున్నా. కానీ సుమారు 5 వేల మందికి పైగా వచ్చారు. అయినా కూడా అందరికీ ఉపాహారం ఇచ్చామని, తమ వల్ల 5 వేల మంది ఓటు వేశారన్న సంతోషంగా ఉందని అన్నారు. -
విదేశాల నుంచి వచ్చి ఓటు
రాయచూరు రూరల్: జిల్లాలో మంగళవారం జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా భారతీయులు స్వదేశానికి తరలివచ్చి ఓటేయడం గమనార్హం. అమెరికా నుంచి శక్తినగర్‌కు తరలివచ్చిన డీవీఏ సయ్యద్ అబ్దుల్ ఖాద్రి తాలూకాలోని శక్తినగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం–18లో ఓటు వేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. కాగా జిల్లాలోని మస్కి తాలూకా వటగల్కు చెందిన అమరేష్ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు ఖర్చు చేసుకొని ఓటు వేయడానికి స్వదేశానికి తరలిరావడం విశేషం. ఆయన ఒమన్ దేశం నుంచి మస్కికి వచ్చి ఓటేశారు. -
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలి. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతోంది. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.ముఖేశ్ అంబానీ కుటుంబంముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద విలువ: సుమారు రూ.18.9 లక్షల కోట్లు.2019 సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్: రూ.3.5లక్షల కోట్లు.గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్‌తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.ఆనంద్ మహీంద్రామహీంద్రా గ్రూప్ సంస్థలకు ఆనంద్ మహీంద్రా సారథ్యం వహిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండడం ఈయన ప్రత్యేకత. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ మహీంద్రా ముంబయిలో తన ఓటు వేశారు.అనిల్ అంబానీరిలయన్స్ ఏడీఏజీ గ్రూప్ ఛైర్మన్‌గా అనిల్ అంబానీ వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని కఫ్ పరేడ్‌లోని జిడి సోమాని స్కూల్లో 17వ లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకున్నారు.నరేష్ గోయల్జెట్ ఎయిర్వేస్ ఎయిర్‌లైన్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత 2019లో ముంబయిలో ఓటువేశారు.శక్తికాంత దాస్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్ పనిచేస్తున్న శక్తికాంత దాస్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు వేశారు.ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకునే వారు చరిత్రలో తెలుసుకోవాల్సినవి..1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 భవితవ్యంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు. 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.1999 ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోయింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.2008లో రాజస్థాన్‌లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది కర్నాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం. సదరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కాగే ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, లేకుంటే వారి ఇళ్లకు సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపివేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారాయి.రాజు కాగే తన నియోజకవర్గమైన బెలగావిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఆయన ‘నాకు గతంలో కొన్ని చోట్ల తక్కువ ఓట్లు వచ్చాయి. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఇకముందు మాకు ఎక్కువ ఓట్లు రాకపోతే, అప్పుడు మేము మీ ఇంటికి అయ్యే విద్యుత్తును నిలిపివేస్తాం. దీనిని గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను’ అని ప్రజల ముందు వ్యాఖ్యానించడం చూడవచ్చు.దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి పూనావాలా ఈ వ్యాఖ్యలను రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటనతో ముడిపెట్టారు. డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్‌కు ఓటు వేయాలని, లేకపోతే మీరనుకున్న పనులు జరగవని ప్రజలతో అన్నారు. ఇది కాంగ్రెస్‌కు ఉన్న అర్హత, అహంకారాన్ని తెలియజేస్తోందని, ఓటర్లను తమ బానిసలు అని కాంగ్రెస్ నేతలు ఎలా అనుకుంటారని పూనావాలా ప్రశ్నించారు.కగ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గం చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఏప్రిల్ 26న రెండో దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను 14 స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరిగింది. మూడో దశలో మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. -
ప్రియాంక ఉంటేనే ఓటు.. గ్రామస్తుల హెచ్చరిక!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలో ఆసక్తికర రాజకీయం నెలకొంది. ఐదో దశ నామినేషన్లకు గడువు సమీపిస్తున్నా, అటు రాయ్‌బరేలీ, ఇటు అమేధీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులెవరనేది కాంగ్రెస్ ఇంకా వెల్లడించలేదు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అయోమయంలో చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాయ్‌బరేలీ జిల్లాలోని కనకపూర్ గ్రామస్తులు మరో ముందడుగు వేశారు. గ్రామం బయట ‘ప్రియాంకా గాంధీ పోటీ చేయకుంటే తాము ఓటు వేయం’ అని రాసివున్న బ్యానర్‌ను ఉంచారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీచేయకుంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గాంధీ కుటుంబంతో తమ అనుబంధం ఏళ్ల నాటిదని, అందుకే గాంధీ కుటుంబం నుండి ప్రియాంక లేదా రాహుల్ ఇక్కడి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.మరోవైపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీ కుటుంబం ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకా గాంధీకి రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ నేడు (బుధవారం) ప్రకటిస్తుందనే వార్త వినిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేకుంటే కాంగ్రెస్ ప్లాన్ బీని సిద్ధం చేసినట్లు సమాచారం. -
Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వదార్పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్‌ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్‌ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువుఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం కాదు’
‘‘ఎవరో ఒకరు... ఎపుడో అప్పుడు...నడవరా ముందుగా.. అటో.. ఇటో.. ఎటో వైపు’’అప్పుడెప్పుడో వచ్చిన సినిమా ‘అంకురం’ కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన గీతం!ఈ వీడియో చూస్తే ఆ పాట గుర్తుకు రాక మానదు. బెంగళూరు ట్రాఫిక్ కూడళ్లలో పండు ముదుసలి ఒకరు.. ‘‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం’ కాదు అన్న ప్లకార్డ్ పట్టుకుని ఒంటరిగా ప్రచారం చేశారు. ఆ అనుభవజ్ఞుడి ప్రచారానికి జనాలూ ఫిదా అయ్యారు. ‘‘మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు’’ అంటూ కొందరు ప్రశంసించడమూ ఈ వీడియోలో చూడొచ్చు. ನನ್ನ ಮತ ದ್ವೇಷಕ್ಕಾಗಿ ಅಲ್ಲ❌ನನ್ನ ಮತ ಬದಲಾವಣೆಗಾಗಿ✅ಒಂದು ವಿನೂತನ ಕ್ಯಾಂಪೇನ್👇 pic.twitter.com/MwkXcYe3JR— Mamatha R (@mamathcr) April 25, 2024 ఇక.. రేపు (శుక్రవారం) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
శతాధిక వృద్ధుడి స్ఫూర్తి.. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు
సార్వత్రిక ఎన్నికలు రెండో దశ పోలింగ్‌లో ఆదర్శంగా నిలిచాడు ఈ శతాధిక వృద్ధుడు. శుక్రవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో ఓటు వేయడానికి 102 ఏళ్ల హాజీ కరమ్ దిన్ జమ్మూలోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నాడు. చేతి కర్ర, కుటుంబ సభ్యుల సాయంతో జమ్మూ నియోజకవర్గంలోని రియాసి జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌కి వచ్చి ఓటేశాడు.ఓటు వేసిన అనంతరం శతాధిక వృద్ధుడు తన సిరా వేసిన వేలిని చూపిస్తూ బూత్ బయట ఫొటోలకు పోజులిచ్చాడు. "ఈ వయస్సులో ఈ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిసారీ ఓటు వేశాను. 102 సంవత్సరాల వయస్సులో ఈ ప్రయాణం నేటికీ కొనసాగుతోంది" అని ఆయన వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.రియాసి జిల్లా జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 22 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17.81 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఐదేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూలో జరుగుతున్న మొదటి ప్రధాన ఎన్నికలు ఇవే. -
సార్వత్రిక సమరం: లోక్‌సభ తొలి విడత పోలింగ్ చిత్రాలు
-
బియ్యపు గింజపై ‘ఓటు వేయండి’!
దేశంలో లోకసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగున్నాయి. వివిధ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే జనం చేతిలో ఓటు అనే అయుధం ఉంది. దీనితో వారు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తుంటుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఒక హస్త కళాకారిణి వినూత్న రీతిలో ఓటు హక్కుకున్న ప్రాముఖ్యత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. జైపూర్‌లోని సాంగనేర్ నివాసి నీరూ చాబ్రా ప్రజలకు ఓటుహక్కు ప్రాముఖ్యతను తెలియజేయాలని భావించారు. ఇందుకోసం ఆమె బియ్యపుగింజలపై ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ రాశారు. ఆమె బియ్యపు గింజపై భారత మ్యాప్‌ను సూక్ష్మ శైలిలో గీయడంతోపాటు ఎన్నికల స్లోగన్ కూడా రాశారు. ఈ సందర్భంగా నీరూ చాబ్రా మీడియాతో మాట్లాడుతూ 1984 నుంచి తాను బియ్యపు గింజపై సూక్ష్మ అక్షరాలు రాయడాన్ని కొనసాగిస్తున్నానని, కిచెన్‌లో వంట చేసేటప్పుడు తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు. మెల్లమెల్లగా ఈ కళలో ప్రావీణ్యం సంపాదించానని అన్నారు. కాగా నీరూ బియ్యపు గింజపై 108 అక్షరాలు రాసి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నీరూ చాబ్రా ప్రతిభను గతంలో మెచ్చుకున్నారు. -
మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలు వివరించి స్టార్ క్యాంపైనర్లుగా చేయాలి. ఈ మంచి కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ రావాలి.. మోసపోకూడదంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి గడపకూ చెప్పాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి గుంటూరు శివారు ఏటుకూరు వద్ద నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అందరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. ఈరోజు గుంటూరులో కనిపిస్తున్న ఈ మహా జన సముద్రం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పుడు జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు, ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అవ్వాతాత, సోదరులు, స్నేహితులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి గ్రామానికి పౌర సేవలు, విద్య, వైద్యం, రైతన్న లకు భరోసా, అక్క చెల్లెమ్మలకు సాధికారత, అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సేవలు అందించిన మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా? గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను ఒక్క రూపాయి కూడా లంచం, వివక్షకు తావు లేకుండా 130 సార్లు బటన్ నొక్కి పారదర్శకంగా నేరుగా అందించిన ఈ ప్రభుత్వానికి, మీ జగన్‌కు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కేందుకు, మరో వంద మందికి చెప్పి నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా? రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు.. ఈ ఎన్నికల యుద్ధం కేవలం చంద్రబాబుకు, జగన్‌కు మధ్య జరుగుతున్నది కాదు. ఈ యుద్ధం బాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, వాటిని ఆపిన బాబు దుర్మార్గాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది వారి మోసాలకు, మన విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఆ అబద్ధాల బాబుకు ఇద్దరు వంత పాడుతున్నారు. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు. 2014 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మోసగించిన బాబు ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ నమ్మబలుకుతున్నారు. మంచి కొనసాగాలో వద్దో ఆలోచించండి.. ఈ రోజు మీరంతా ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో కలసి ఒక్క అంశంపై ఆలోచన చేయమని కోరుతున్నా. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే గత 58 నెలలుగా జరుగుతున్న మంచిని మీరందరూ కొనసాగించేందుకే ఓటు వేసినట్లే. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. ఈ 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని మీ అంతట మీరే మీకు వద్దని చెప్పినట్లేనని గుర్తుంచుకోవాలని కోరుతు న్నా. 58 నెలల క్రితం మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి ఫలానాది చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్ మాదిరిగా భావించి 99 శాతం హామీలను అమలు చేసి మీ ముందుకు వచ్చి మరోసారి ఆశీస్సులు కోరుతున్నాడు. సెల్‌ఫోన్ లైట్లతో సంఘీభావం.. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుండాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆస్పత్రులు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లలో ఏ ఒక్కటీ తగ్గకుండా గెలిపించేందుకు మీరు సిద్ధమేనా? పేదల భవిష్యత్తు బాగుండాలని చేస్తున్న ఈ యుద్ధానికి మీరంతా సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయాలి. పాలకుడు మోసగాడైతే... ఎలాంటి వారు రాజకీయ నాయకుడిగా ఉండాలి? ఎలాంటి వారిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలన్న విషయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఎందుకంటే మనం వేసే ఓటు ద్వారా రాబోయే ఐదేళ్ల జీవితం ఆ పాలకుడి చేతుల్లో పెడుతున్నాం. ఆ పాలకుడికి మంచి మనసు ఉండి మంచి చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడు అయితే మన బతుకులు అంధకారం అవుతాయి. పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. అక్కచెల్లెమ్మల బతుకులు అతలాకుతలం అవుతాయి. రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యల పాలవుతాయి. అవ్వాతాతల సంక్షేమం అడుగంటిపోతుంది. అందుకే ఈ వాస్తవాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా. గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న కిలారు రోశయ్య, అసెంబ్లీ అభ్యర్థులు నూరి ఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్, మురుగుడు లావణ్య, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, విడదల రజని, అంబటి మురళీకృష్ణ, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మందపాటి శేషగిరిరావు, బత్తుల దేవానంద్ తదితరులు ఏటుకూరు సిద్ధం సభలో పాల్గొన్నారు. బాధలు విన్నాడు.. భరోసా ఇచ్చాడు.. తనను కలిసిన బాధితులకు సీఎం జగన్ ఆపన్న హస్తం సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను పలువురు కలిసి తమవారికి వచ్చిన కష్టాలు చెప్పుకొన్నారు. వైద్యం అందించాలని కోరారు. వారి బాధలు సావధానంగా విన్న సీఎం జగన్.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన తన సోదరుడు షేక్ సుభానికి వైద్యం చేయించండన్నా అంటూ గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన బాజీబీ సీఎం జగన్‌ను వేడుకున్నారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని భాగ్యనగర్ కాలనీ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ వస్తున్నారని తెలుసుకుని కోమాలో ఉన్న సోదరుడిని కుటుంబ సభ్యులతో కలిసి అంబులెన్స్‌లో తీసుకొచ్చి రోడ్డుపై నిలబడింది బాజీబీ. వారిని గమనించిన సీఎం వెంటనే బస్సు దిగి సమస్యను తెలుసుకున్నారు. వీఆర్వోగా పనిచేస్తున్న సుభాని గత ఆగస్ట్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, అప్పటి నుంచి కోమాలోకి వెళ్లాడని చెబుతూ ఇప్పటి వరకు రూ.20 లక్షలు ఖర్చయ్యాయని, సీఎం సహాయనిధి ద్వారా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రూ.3 లక్షలు సాయం కూడా అందించారని సీఎం దృష్టికి తెచ్చారు. ఇక వైద్యం చేయించే స్తోమత తమకు లేదన్నారు. వారి సమస్యను విన్న సీఎం జగన్.. సుభానికి ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే, దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన గంటెల వెంకటేశ్వర్లు, శారదల 12 ఏళ్ల కుమారుడు చరణ్‌కు పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మేమంతా సిద్ధం యాత్రకు ధూళిపాళ్ల శివారులో సీఎం జగన్ రోడ్ షో చేస్తుండగా బస్సు వెంట ఆ బాలుడిని ఎత్తుకుని తల్లిదండ్రులు పరుగెత్తడం సీఎం జగన్ గమనించి.. బస్సాపి వారిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే చరణ్‌కు వైద్యం చేయిస్తామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైద్యానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. బాబు మోసాలకు వంతపాడుతున్న వదినమ్మ, దత్తపుత్రుడు సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాల బుర్రకథకు తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కని పిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘మీ బిడ్డకు ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించాలని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి’ అని ప్రజలను కోరుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. భారీ వర్షంలోనూ జనం ‘సిద్ధం’ భోజన విరామం కూడా లేకుండా 9 గంటల పాటు సీఎం జగన్ యాత్ర అభిమాన సముద్రం ముందు గాలి దుమారం తేలిపోయింది. ఈదురు గాలులు వీస్తున్నా జనసందోహం చెక్కు చెదరని సంకల్పంతో జననేత కోసం నిరీక్షించింది. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సుయాత్ర పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నంబూరు వరకు జరిగింది. యాత్ర మేడికొండూరు చేరుకునేసరికి ఈదురు గాలులతో వర్షం మొదలైంది. జన సంద్రమే గొడుగులా సీఎం జగన్ కాన్వాయి ముందుకు సాగింది. గుంటూరులో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు పలుదఫాలుగా వర్షం పడింది. గాలుల ధాటికి పలు చోట్ల ఫ్లెక్సీలు ఒరిగిపోవడంతో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని నిలబెట్టడం గమనార్హం. ఏటుకూరులో భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణం మొత్తం తడిచి ముద్ద అయింది. ప్రతిచోటా అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర శుక్రవారం భోజన విరామం కూడా లేకుండా తొమ్మిది గంటల పాటు నిరాటంకంగా సాగింది. గుంటూరు జిల్లాలో పేరేచర్ల నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర జనసంద్రాన్ని తలపిస్తూ రోడ్‌షో జరిగింది. 2014 ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. ఒక్కసారి 2014 ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. నాడు కూడా ఇదే కూటమి! మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాగితాలతో ప్రజల జీవితాలతో చెలగా టమాడారు. ఇదే చంద్రబాబు సంతకం చేసి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో పాంప్లెట్లు ముద్రించి ప్రతి ఇంటికి పంపారు. మీరు మర్చిపోతారేమోననే భయంతో టీవీలలో, పేపర్లలో ఊదరగొట్టారు. చంద్రబాబు నాటి మోసాల్లో ఒక్కసారి ముఖ్యమైన వాటిని మీకు గుర్తు చేస్తా. ♦ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? ♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. మీకుగానీ, మీ ఇంటి చుట్టుపక్కల వారికిగానీ ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ♦ మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ♦ సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. మరి జరిగిందా? ♦ ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి గుంటూరులో ఏమైనా కనిపిస్తోందా? -
ఇద్దరు ఓటర్లు.. 107 కిలోమీటర్లు.. ఎన్నికల అధికారుల సాహసం!
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల కోసం ఇద్దరు వృద్ధులతో ఓటేయించడానికి ఎన్నికల అధికారులు సాహసం చేశారు. ప్రమాదకరమైన మలుపులు, అడవుల గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో 100 ఏళ్లు, 86 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎన్నికల అధికారులు అహేరి నుండి సిరొంచ వరకు 107 కిలోమీటర్లు ప్రయాణించి 100 ఏళ్ల కిష్టయ్య మదర్బోయిన, 86 ఏళ్ల కిష్టయ్య కొమెర ఇళ్లకు చేరుకున్నారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసే పరిస్థితిలో లేరు కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గంలో 1,037 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 338 మంది దివ్యాంగుల దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,205 మంది ఓటర్లు ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఓటును మించిన ఆయుధం లేదు
గచ్చిబౌలి (హైదరాబాద్): బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని, ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవా లని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే బాధ్యతగల పౌరులుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందుకు ‘సివిజిల్’ యాప్‌ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు అందిన వంద నిమిషాలలోపు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్ తెలిపారు. బ్యాలెట్ పవర్ గొప్పది: రోనాల్డ్‌రాస్ బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ చాలా గొప్పదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్‌లో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈనెల 15లోగా ఫారమ్–6 ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటుహక్కు పొందాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, పెద్దసంఖ్యలో యువత, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైటెక్స్ రోడ్‌లోని మెటల్ చార్మినార్ వరకు రన్ కొనసాగింది. -
ఎన్నికల బరిలో విచిత్ర పార్టీలు!
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మొదటి దశలో బీహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు (నవాడ, జముయి, ఔరంగాబాద్, గయ) ఓటింగ్ జరగనుంది. మరోవైపు బీహార్‌లో విచిత్రమైన పేర్లు కలిగిన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పార్టీల పేర్లు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. ఈ జాబితాలో ఆల్ హింద్ ఫార్వర్డ్ బ్లాక్ (రివల్యూషనరీ), స్మార్ట్ పార్టీ, లాగ్ పార్టీ, న్యూమరికల్ పార్టనర్షిప్ పార్టీ మొదలైనవి ఉన్నాయి. ప్రముఖ నేత చిరాగ్ పాశ్వాన్ బావమరిది గౌతమ్ పాశ్వాన్ సమజ్దార్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ ఏక్తా పార్టీ నుంచి అనిల్ చౌదరి, భారతీయ లోక్ చేతన పార్టీ నుంచి గుడియా దేవి, రాష్ట్రీయ జన సంభవ పార్టీ నుంచి శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల సంఘం రద్దు చేసింది. బీహార్‌లోని గయ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విచిత్రమైన పేర్లు కలిగిన మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో భారతీయ లోక్ చేతన పార్టీకి చెందిన శివశంకర్ పోటీకి దిగారు. డెమోక్రటిక్ సమాజ్ వాదీ పార్టీ నుంచి ధీరేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుండి లాగ్ పార్టీకి చెందిన అజిత్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి జనజాగరణ్ పార్టీకి చెందిన శంభు ఠాకూర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
దక్షిణకొరియాలో నేడే ఎన్నికలు
సియోల్: దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్లో 254 స్థానాలను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన 46 స్థానాలను చిన్నాచితక పారీ్టలకు వాటికి లభించిన ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్ పవర్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ పోటీ పడుతున్నాయి. దేశంలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈసారి రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు పీపుల్ పవర్ పార్టీ నేత, అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రిఫరెండమ్ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆయన 2022లో అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో పీపుల్ పవర్ పార్టీకి తక్కువ స్థానాలు వస్తే యూన్ సుక్ ఇయోల్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకోవచ్చు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నాయకుడు లీ జే–మ్యూంగ్ ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. సర్వే కూడా అదే అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిక్యం పెరిగితే పరిపాలన పరంగా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. -
Lok Sabha Elections 2024: 20 ఏళ్ల తర్వాత ఓటు
న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్‌లోని సింగ్భూమ్ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు రెండు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా 2024 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం మావోయిస్టులకు కంచుకోటల్లాంటి మారుమూల ప్రాంతాల్లో 118 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కుల్దీప్ చౌదరి చెప్పారు. ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్ అడవుల్లో ఉన్న సరండా వంటి 118 గ్రామాల్లోకి మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కు సిబ్బందితోపాటు సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా పంపుతామన్నారు. నుగ్డి గ్రామంలోని మిడిల్ స్కూల్, బొరెరో గ్రామంలోని మధ్య విద్యాలయలో మొదటిసారిగా పోలింగ్ బూత్‌లను నెలకొల్పామన్నారు. కొన్ని ప్రాంతాల్లోకి సిబ్బంది నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఏ ప్రాంతాన్నీ వదలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ‘ఆపరేషన్ అనకొండ’ ద్వారా భద్రతా బలగాలు తల్కోబాద్ వంటి 25 వరకు గ్రామాల్లో 15 కొత్త క్యాంపులను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశాయని పేర్కొన్నారు. 121 పోలింగ్ బృందాలను రైళ్ల ద్వారా పంపించామన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి ఇళ్ల వద్దే ఓటు వేసే సదుపాయం కలి్పంచినట్లు చెప్పారు. ఎస్టీ్ట రిజర్వుడు స్థానమైన సింగ్భూమ్లో బీజేపీ నుంచి మాజీ సీఎం మధు కోడా భార్య, సిట్టింగ్ ఎంపీ గీతా కోడా రంగంలో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యరి్థని ప్రకటించాల్సి ఉంది. -
బుందేల్‌ఖండ్‌లో బందిపోటు రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఒకప్పుడు బందిపోటు దొంగల కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడిచేవి. దశాబ్దాల తరబడి రాజకీయాలపై వారి ఆధిపత్యం కొనసాగింది. ఈ బందిపోటు దొంగలు ఎవరికి మద్దతిస్తే వారే ఎన్నికల్లో గెలిచేవారు. ఓట్ల కోసం ఆ బందిపోటు దొంగలు ఓటర్లను బెదిరించేవారు. ఎన్నికల రాజకీయాలను వారు తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. 80వ దశకంలో యూపీలో భాగమైన బుందేల్‌ఖండ్‌లోని ఏడు జిల్లాలలోని ఆరింటిలో బందిపోట్లు తమ ఆధిపత్యం చెలాయించారు. ఝాన్సీ, జలౌన్, బందా, మహోబా, హమీర్పూర్, చిత్రకూట్‌లో వారి ఆటలు సాగేవి. దాదువా, నిర్భయ్ సింగ్ గుర్జార్, థోకియా తదిర బందిపోట్లు తాము ఈ ప్రాంతానికి రాజులుగా ప్రకటించుకున్నారు. తరువాతి కాలంలో వీరు రాజకీయ నేతలుగా, రాజకీయాలను శాసించేవారుగా మారారు. నేతలుగా మారిన దోపిడీ దొంగల జాబితాలో ముందుగా దాదువా పేరు వినిపిస్తుంది. దాదువా తన కుమారుడు వీర్ సింగ్‌ను జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించాడు. దాదువా 2007లో ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అయితే అప్పటికే అతని కుటుంబ సభ్యులు రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీర్ సింగ్ చిత్రకూట్ నుంచి ఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా, అతని సోదరుడు బాల్ కుమార్ పటేల్ మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మేనల్లుడు రామ్ సింగ్ కూడా ఎస్పీ టిక్కెట్‌పై ప్రతాప్‌గఢ్‌లోని పట్టి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందాడు. దాదువా మాదిరిగానే అంబికా పటేల్ అలియాస్ థోకియా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తమ హవా చాటుకున్నారు. 2005లో థోకియా అత్త సరిత బందాలోని కార్వీ బ్లాక్‌కు అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో అత్త సవిత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007లో తల్లి పిపారియా దేవి రాష్ట్రీయ లోక్‌దళ్ టిక్కెట్‌పై బందాలోని నారైని అసెంబ్లీ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె థోకియా పేరుతో 27 వేల ఓట్లను పొందగలిగారు. నిర్భయ్ సింగ్ గుర్జార్ కూడా ఎన్నికల్లో కాలు మోపారు. ఝాన్సీలోని గరౌత, జలౌన్, భోగానిపూర్‌లలోని రాజకీయాలన్నీ అతని కనుసన్నల్లో నడిచాయి. నిర్భయ్ సింగ్ గుర్జార్ అండతో నేతలు ఎన్నికల రేసులో దూసుకెళ్లేవారు. ఫూలన్ దేవి ఝాన్సీ డివిజన్లోని జలౌన్ జిల్లాలోని గోర్హా అనే చిన్న గ్రామానికి చెందిన బందిపోటు రాణిగా పేరొందింది. 1981 ఫిబ్రవరి 14న బెహ్మాయి ఊచకోత ఘటనతో ఫూలన్ దేవి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి విడుదలైన రెండేళ్ల తర్వాత 1996లో సమాజ్‌వాదీ పార్టీ ఆమెకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఫూలన్ తన తొలి ఎన్నికల్లోనే మీర్జాపూర్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యింది. -
‘కోళ్లనే కాపాడలేనివాడు మమ్మల్నేం కాపాడతాడు?’
ఎన్నికల గుర్తు కారణంగా పార్టీ లేదా అభ్యర్థి ఓడిపోయారంటూ వచ్చే వార్తలను మనం ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. ఎన్నికల గుర్తులు పార్టీలకు ప్రాణం లాంటివి. ఎన్నికల గుర్తును చూసి ఓటువేసేవారి సంఖ్య అధికంగానే ఉంటుందనే మాట వినిపిస్తుంటుంది. ఓటు వేసే సమయంలో గుర్తులు కనిపించకుంటే ఓటు వేయకుండానే వెనుదిరిగేవారు కూడా ఉన్నారట. అవి 1957 సాధారణ ఎన్నికలు.. పంజాబ్‌లో ఒక అభ్యర్థి తన ఎన్నికల చిహ్నంగా కోడిని ఎంచుకున్నాడు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన తన ఎన్నికల గుర్తు గురించి అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ఇందుకోసం ఆయన ఆ ప్రాంతంలో వందల కోళ్లను వదిలాడు. అయితే ఎక్కడినుంచో వచ్చిన ఒక నక్కల గుంపు ఆ కోళ్లను వేటాడింది. కొన్ని కోళ్లు ఎలాగోలా నక్కల బారి నుంచి తప్పించుకున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి ఓటర్లు.. నక్కల బారి నుంచి ఎన్నికల గుర్తునే కాపాడుకోలేని అభ్యర్థి మమ్మల్ని ఎలా కాపాడతాడని ఎదురుతిరిగారట. 1957 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఇటువంటి విచిత్ర ఉదంతం చోటుచేసుకుందట. యూపీలోని ఓ పోలింగ్ బూత్‌కి వచ్చిన కొందరు పడవ నడిపేవారు ఓటు వేయకుండానే వెనుదిరిగారట. వారిని కారణం అడిగితే లోపల బ్యాలట్ పేపర్‌పై బోటు గుర్తు లేదని, అందుకే ఎవరికీ ఓటు వేయకుండా వెళ్లిపోతున్నామని చెప్పారట. -
‘‘పులులను పట్టండి... ఓట్లు అడగండి’’!
స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొన్నిచోట్ల ఎన్నికలను బహిష్కరించారనే వార్తలను మనం వినేవుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ పరిధిలో గల పండరి గ్రామస్తులు ఇప్పుడు విచిత్రమైన డిమాండ్ వినిపిస్తున్నారు. అది నెరవేరాకే ఓటు వేస్తామని తెగేసి చెబుతున్నారు. లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. పండరి గ్రామస్తులు కొన్నాళ్లుగా పులుల దాడులతో భీతిల్లిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాము ఓటువేయమని చెబుతున్నారు. పండరి గ్రామం టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉంటుంది. దీంతో గ్రామంలో తరచూ పులుల దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఎంతకాలమైనా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని, అందుకే తాము రాబోయే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించనున్నామని పేర్కొంటూ గ్రామస్తులు పలుచోట్ల పోస్టర్లు అంటిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య పులుల భీభత్సమని, వాటి కారణంగా ఇక్కడి రైతులు పొలాలకు కాపలా కాసేందుకు వెళ్లలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా పులుల భయంతో స్కూలుకు వెళ్లడం లేదని దీంతో ఇక్కడి పిల్లల భవిష్యత్తు అయోమయంగా తయారయ్యిందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలోకి పులుల రాకను అరికట్టేవరకూ తాము ఓటు వేసేందుకు వెళ్లేదిలేదని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఓటు ప్రజాస్వామ్య జీవధాతువు
భారతదేశంలో రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికల శంఖారావంతో ఊపందుకున్నాయి. ఓటరు చైతన్యం ఇందులో కీలకం. ఓటు దేశ ప్రజలకు జీవధాతువు. మన జీవిత నిర్మాణానికి అది ఒక పనిముట్టు. ఓటుహక్కును మనం దుర్వినియోగం చేసుకుంటే, మన మిగిలిన హక్కులన్నీ కాల రాయ బడతాయి. అందుకే ఓటు అనేది అత్యున్నతమైనది. దాని విలువ అమూల్యమైనది. ఆ విలువ మానవ విలువలతో సమానమైనది. భిన్న భావజాలాల ప్రభావం ఈ ఎన్నికల మీద ఉండబోతోంది. అంబేద్కర్ వాదుల, సామ్యవాదుల, సోషలిస్టుల, కమ్యూనిస్టుల, స్త్రీవాదుల, దళిత బహుజన వాదుల, మైనారిటీ హక్కుల వాదుల, మానవ హక్కుల పోరాటవాదుల సిద్ధాంతాల ప్రజ్వలనం సమాజంలో అంతర్గతంగా బలంగా ఉందని చెప్పక తప్పదు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మళ్ళీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగు రోజుల్లో షెడ్యూలు వస్తుందనగా... బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం దీని లక్ష్యం. సీఏఏ చట్టం 2019 లోనే పార్ల మెంట్ ఆమోదం పొందినా, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా... విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదను చూసి ఇపుడు దానిని తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31 కంటే ముందు మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ చట్టం వర్తిస్తుంది. భారతదేశంలోకి అనేక మతాలవారు ఆయా కాలాల్లో వచ్చారు. భారతీయ జన జీవనంలో కలసిపోయారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అన్ని మతాలవారు, కులాల వారు కలసి పోరా డారు. భారతదేశానికి మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుండి ముస్లింలకు పార్లమెంట్‌లోనూ, అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఇస్తూ వస్తు న్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ముస్లిం సభ్యులు 76 మంది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ముస్లిం ఎంపీలు గణనీయంగా ఎన్నికయ్యారు. ఆనాడు ముస్లింల జనాభా 6 శాతం కంటే తక్కువ. మొదటి రాజ్యసభలో సుమారు 10.5 శాతం ముస్లిం సభ్యులున్నారు. 2014లో బీజేపీ స్వల్ప మెజారిటీతో లోక్‌సభ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుండి ముస్లింల ప్రాతినిధ్యం అత్యల్పం. అందుకే 2024 ఎన్నికల్లో ముస్లింలు ఏకమై సెక్యులర్ పార్టీలకు ఓట్లు వేస్తారని ఒక పరిశోధనా పత్రం పేర్కొంది. బీజేపీపై పోటీ చేసే బలమైన అభ్యర్థికి ఓట్లు వేస్తారని ఆ పరిశోధన అంచనా వేసింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 27 మంది ముస్లిం అభ్యర్థులు గెలవగా (17వ లోక్‌సభ), 16వ లోక్‌సభలో 23 మంది ముస్లిం సభ్యు లున్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇది ముస్లింలు తక్కువ సంఖ్యలో వున్న రెండోసభ. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా (17.22 కోట్లు్ల) కలిగివున్న దేశం. నిజానికి ముస్లింలు ఈ దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న ప్రధానమైన శక్తులు. వారిని నిర్లక్ష్యం చేయడం దేశ అభివృద్ధికి, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు. క్రైస్తవులు భారతదేశానికి ఇతర దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. హిందూమతంలో అస్పృశ్యతకు, నిరాదరణకు గురైనవారు ఆ మతంలోకి వెళ్ళి అక్షర విద్యను నేర్చుకున్నారు. దళితులు ఎక్కువ మంది క్రైస్తవ మతంలో చేరి అక్షర విద్యను నేర్చుకున్నారు. వారిని నిరాకరించడం వల్ల, జనరల్ సీట్లలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల లౌకికవాదం దెబ్బతింటుంది. ఇక బౌద్ధం భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక విప్లవాన్ని తీసుకువచ్చింది. సమసమాజ భావాన్ని ప్రజ్వ లింప చేసింది. మానవతా ధర్మాన్ని ప్రబోధం చేసింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ సంస్కృతి వికాసం జరిగింది. భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు బౌద్ధం విస్తరించింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధులు కోట్లాది మంది వున్నారు. వారు ప్రత్యక్షంగా లేకపోవచ్చు. పరోక్ష రాజకీయ ఉద్యమంలో వున్నారు. తప్పకుండా భారత రాజ కీయాల్లో వీరి ప్రభావం స్పష్టంగా వుంది. ఇకపోతే రావ్‌ు మనోహర్ లోహియా ప్రభావం దళిత బహుజన రాజకీయాల మీద బలంగా వుంది. మండల కమిషన్ రిపోర్టును బయటికి తీసుకొచ్చిన వి.పి.సింగ్ ప్రభావం కూడా బలంగా వుంది. కమ్యూనిస్ట్‌లు, అంబేడ్కర్ వాదుల అశేషమైన భావజాలం కూడా 2024 ఎన్నికల మీద వుంది. భారతదేశంలో అనేక భావజాలాల ప్రభావానికి ఈ ఎన్నికలు గురవు తాయి అనడంలో సందేహం లేదు. ఫూలే, అంబేడ్కర్, రావ్‌ు మనో హర్ లోహియా, పెరియార్ రామస్వామి నాయకర్, వి.పి. సింగ్, కాన్షీరావ్‌ు... వీరందరి ప్రభావం తప్పక ప్రజల మీద ఉంది. ఇకపోతే 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన తొమ్మిదేళ్ళ పది మాసాల్లో పెరిగిన నిరుద్యోగం, చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు, నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురావడంలో విఫలం కావడం, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొన్న అష్ట కష్టాలను ప్రధానాంశాలుగా ప్రతిపక్షాల కూటిమి ‘ఇండియా’ విస్తృతంగా ప్రచారం చేయాలి. మాజీ ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ చెప్పినట్లుగా దశ మహపాతకాలు దేశ ఎన్నికల వ్యవస్థను కరకర నమిలేస్తున్నాయి. భారతదేశంలో ఎన్నికలు కొత్త కాదు. ప్రజలు చైతన్యవంతులు, ఆలోచనాపరులు. అయితే, యువతకు ఉద్యోగ వసతి కల్పిస్తారనీ, ఆర్థిక అభివృద్ధి చేస్తారనీ ఎక్కువమంది మోదీకి ఓట్లు వేశారు. కానీ పేద ప్రజలకు భరోసాని ఇచ్చే ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామి’ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నీరుగార్చింది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడమనేది కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధ విధి. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కొంత మేలు ఉన్నప్పటికీ, లోపాలు కూడా లేక పోలేదు. సున్నితమైన నియోజకవర్గాల్లో, ఎన్నికల సంబంధ హింసాకాండ చోటు చేసుకొనే అవకాశమున్న పోలింగ్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించడానికి విడతలవారీ ఎన్నికల నిర్వహణ దోహదపడుతుంది. 85 ఏళ్ళ వయస్సు పై బడిన వారందరూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 85 వయస్సు పైబడిన ఓటర్లు దేశ వ్యాప్తంగా 82 లక్షల మంది ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో వందేళ్ళు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది వున్నారు. భారతదేశ రాజకీయాల్లో ఈనాడు అనివార్యంగా ఓబీసీలకు సీట్లు పెంచవలసిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. బీసీలు వృత్తికారులే కాక, శ్రామికశక్తులు! చాలామంది బీసీలు తమ విముక్తిదాతైన ఫూలే గూర్చి తెలుసుకోలేకపోతున్నారు. మహాత్మా ఫూలే ఓబీసీలకు అర్థమైనపుడే వారిలో సామాజిక, రాజ కీయ చైతన్యం వస్తుంది. స్త్రీలకు కూడా మునిపటి కంటే ఎక్కువ సీట్లు ఇస్తారు. విద్యాధికులు, రిటైర్డ్ ఆఫీసర్లు, అడ్వకేట్లు, పాత్రికేయ ప్రము ఖులు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు రాజకీయ రంగంలోకి దూకారు. ఆంధ్రప్రదేశ్‌లోకి బీజేపీని ఆహ్వానించడం వల్ల చంద్రబాబు ముస్లింల, క్రైస్తవుల, సోషలిస్టుల, కమ్యూ నిస్టుల ఓట్లు కోల్పోతున్నారు. రాజ్యాంగేతరమైన భావజాలం ఎన్ని కలలో పెరగడం ఆశ్చర్యకరం. అయితే భారతదేశంలో ఇవన్నీ అనేక సందర్భాలలో జరుగుతూ వచ్చాయి. వాటన్నింటినీ భారతదేశం తట్టుకొని నిలబడుతూ వచ్చింది. బీజేపీ తన వ్యూహ ప్రతి వ్యూహ రచనల్లో ప్రధానంగా పార్టీలను చీల్చడం, లొంగదీసుకోవటం వంటి అనేక వ్యూహాలతో ముందుకువెళ్తోంది. కానీ భారత రాజ్యాంగాన్ని దాటి వెళ్లే శక్తి ఏ వ్యక్తికీ, ఏ పార్టీకీ లేదని మనం తప్పక నమ్మాలి. దాని అంతర్గత శక్తి బౌద్ధ సూత్రాలతో నిండి ఉంది. అందుకే 2024 ఎన్నికలకు దళిత బహుజన లౌకికవాద భావజాలంతో ముందుకు నడవాల్సిన చారిత్రక సందర్భం ఇది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో రాహుల్, సోనియా?
ఈ టైటిల్ చూసి ఏవేవో ఊహలకు వెళ్లకండి. ఓటు వేసే విషయంలో వారిపై ఎటువంటి నిర్బంధం లేదు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అదేమిటో, వారితో పాటు ప్రియాంకా గాంధీ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారో, దీనికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో ఆసక్తిగా మారనున్న రాజకీయ సమీకరణాలను మనం చూడబోతున్నాం. ‘ఇండియా కూటమి’ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్లను పంచుకున్నప్పుడు, గాంధీ కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు నేతల ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశాలు లేవని ఎవరూ ఊహించివుండరు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు. అయినా వారు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వారి సొంత పార్టీకి ఓటు వేసుకోలేరు. ‘ఆప్’తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న న్యూఢిల్లీ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి అప్పగించింది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ‘ఆప్’ పోటీ చేయనుండగా, కాంగ్రెస్ చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలో పోటీ చేస్తోంది. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకు నెలవుగా ఉండేది. అయితే 2014లో మోదీ వేవ్ ఇక్కడి అన్ని సమీకరణలను తుడిచిపెట్టేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గాంధీ కుటుంబ సభ్యులు తమ సొంత పార్టీకి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పటడం బహుశా ఇదే తొలిసారి. నిజానికి కాంగ్రెస్ పార్టీ తనకు తగ్గుతున్న మద్దతు కారణంగా, యూపీ, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో చేతులు కలపవలసి వచ్చింది. 1952- 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీ స్థానాన్ని ఏడు సార్లు గెలుచుకుంది. బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ న్యూఢిల్లీ స్థానం నుండి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంకల ఇళ్లు న్యూఢిల్లీ ఏరియాలోనే ఉండటంతో వారికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా న్యూఢిల్లీ ఓటర్లే. దీంతో వీరు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారు. -
ఆలోచించండి ఓ అమ్మానాన్న.. ఈసీ వినూత్న ప్రయత్నం
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల గురించి ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులు త్వరలో తమ తల్లిదండ్రులకు లేఖలు రాయబోతున్నారు. "నా భవిష్యత్తు దేశంలోని బలమైన ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉంది. దీని కోసం ఓటరు జాబితాలో మీ పేర్లను తప్పకుండా చూసుకుని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని పిల్లలు తమ తల్లిదండ్రులను కోరనున్నారు. జాతీయ సగటుతో సమానంగా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం చొరవతో ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా జిల్లా యంత్రాంగం, విద్యా శాఖల సహకారంతో కృషి చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) చొరవలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాయడంలో సహాయం కోరుతూ డైరెక్టర్ జనరల్ (పాఠశాల విద్య)కి లేఖ రాసింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో కుటుంబంలోని అర్హులైన సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని పిల్లలు ఇచ్చే "ప్రతిజ్ఞ లేఖ"పై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సగటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా నమోదవుతూ వస్తోంది. 2019లో జాతీయ సగటు 67.4 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 59.21 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2014లో దేశ సగటు 66.44 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 58.44 శాతం ఓటింగ్ నమోదైంది. -
ఓటర్లపై ఒత్తిడి తెస్తే.. చర్యలు తీసుకోవాల్సిందే!
కూకట్పల్లి (హైదరాబాద్): ‘‘ప్రజలు స్వేచ్ఛా పూరిత వాతావరణంలో ఓటు హక్కును విని యోగించుకునేలా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉండాలి. ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఒత్తిడి చేసే లా అభ్యర్థులు వ్యవహరిస్తే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ బాగా పనిచేసింది. కానీ ఓ అభ్యర్థి తనకు ఓటేయకపోతే ఆత్మ హత్య చేసుకుంటానంటూ ప్రచార మాధ్యమా లలోకెక్కారు. అది విచారకరం. ప్రజలను ఒత్తి డికి గురిచేసి గెలవడానికి అభ్యర్థి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం సరి కాదు..’’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమ ర్శించారు. గురువారం మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ప్రజలు ఓటు హక్కును ఆయుధంలా ఉపయోగించుకుని తమ జీవన పరిస్థితులకు మార్చుకోవచ్చని.. ఆ మార్పే దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని స్పష్టం చేశారు. మంచి వారికి ఓటేయాలి.. తమ సమస్యలను వినడంతోపాటు అభివృద్ధి చేయగల సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకా శం ఓటు ద్వారానే లభిస్తుందని.. అభ్యర్థుల గుణ గణాలను పూర్తిగా విశ్లేషించాకే ఓటేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గుంతల రోడ్లను చూసి ఎమ్మెల్యేలు, ఎంపీలను తిట్టేకంటే ముందు మంచివారికి ఓటు వేయటం మంచి నిర్ణయమన్నారు. ఓటింగ్ సమయంలో వచ్చిన సెలవులను ఉపయోగించుకొని కుటుంబంతో కలసి విహార యాత్రలకు వెళ్తున్నారని.. ఆ ఆలోచన సరికాదని స్పష్టం చేశారు. యువత ఓటు హక్కును తప్ప కుండా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ మాట్లా డుతూ.. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. గెలవకుంటే శవయాత్ర అంటూ.. గతంలో కేసీఆర్ సర్కారు పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేయగా గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం, దీంతో కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనను గెలిపించకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత తాను గెలిస్తే జైత్రయాత్ర, లేకుంటే శవయాత్ర జరుగుతుందని ఆయన పేర్కొనడం కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని ఉద్దేశిస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
బడా సినిమాల కంటే చిన్న చిత్రాలకే ఓటీటీల బాగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అటు థియేటర్లు దొరికేవి కావు, ఆ తర్వాత రిలీజ్ చేద్దామంటే టీవీల్లోనూ పెద్దగా వేసేవారు కాదు. కానీ ఇప్పుడలా కాదు. పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసే ఛాన్సులు ఇస్తున్నాయి. దీంతో సినీ ప్రేమికులు.. చిన్న చిత్రాలని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడలా రెండు తెలుగు సినిమాలు చాలారోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేశాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) తెలుగులో గతేడాది వచ్చిన ఓ ప్రేమకథా సినిమా 'ప్రేమిస్తే చచ్చేది మేమే'. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఈ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలియదు. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోకి ఈ చిత్రం వచ్చేసింది. పూర్తిగా నిబ్బానిబ్బీ తరహా కథతో ఈ చిత్రాన్ని తీశారు. ఓ ధనవంతులైన అమ్మాయి, ఆటో నడుపుకొనే కుర్రాడు ప్రేమలో పడితే.. చివరకు ఏమైందనేదే స్టోరీ. కథ పరంగా ఓకే కానీ బడ్జెట్ పరిమితి అనేది స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించింది. గతేడాది అక్టోబరు చివర్లో వచ్చిన మరో తెలుగు సినిమా 'ఓటు'. టైటిల్‌కి తగ్గట్లే ఓటు విలువ చెప్పే ఈ చిత్రం కూడా ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో జనాలకు పెద్దగా తెలియదు. పేరున్న నటీనటులు కూడా మూవీలో ఎవరూ లేరు. దీంతో ఈ చిత్రం అలా థియేటర్లలోకి వచ్చి ఇలా వెళ్లిపోయింది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోనే రిలీజైంది. ఒకవేళ ఏదైనా తెలుగు మూవీస్ చూస్తూ టైంపాస్ చేయాలనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
ఓట్ ఫ్రమ్ హోం
సాక్షి, నరసరావుపేట: చేతికర్ర సాయంతో ఓ దివ్యాంగుడు.. ఆటోలో ఓ ముసలవ్వ.. ఇలా అనేక మంది ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు పడే తిప్పలు గతంలో కనిపించేవి. కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారి కష్టాలకు చెక్ పెట్టింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40%కి మించి వైకల్యం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానాన్ని సీఈసీ ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు ఏపీలోనూ అమలుకు చర్యలు చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే.. ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 80 ఏళ్ల పైబడి వయసు ఉన్నవారు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఐదు రోజుల ముందే 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలిస్తాయి. అర్హులైన వారికే ‘ఓట్ ఫ్రమ్ హోం’కు అవకాశం కల్పిస్తాయి. బూత్ లెవల్ అధికారి కూడా ఇంటి నుంచే ఓటు వేయడానికి అర్హులైన వారిని సంప్రదించి.. వారి ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేయిస్తారు. పోలింగ్ బూత్ తరహా ఏర్పాట్లు ఇంటి నుంచే ఓటు వేసే కార్యక్రమానికి కూడా సాధారణంగా పోలింగ్ కేంద్రంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తారు. ఓటు ఎవరికి వేశారో బయటకు రాదు. పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. ఇంటి నుంచి ఓటు వేయటానికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంత మందికి ఓటు హక్కు కల్పించారనే వివరాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల సిబ్బంది సమాచారమిస్తారు. వయో వృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. మంచి అవకాశం... 80 ఏళ్లు నిం.డిన మా లాంటి వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించి ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచే ఓటు వేయడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. దీని వల్ల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశముంది. – యెన్నం వెంకట నర్సిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్. ఉప్పలపాడు, పల్నాడు జిల్లా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక కొంతమంది తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ విధానం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయవంతమైంది. మన రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని అర్హులైన వారు వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్ శివశంకర్, పల్నాడు జిల్లా కలెక్టర్ -
కోటికి పైగా దొంగ ఓట్లు..బయటపడ్డ బాబు, పవన్ దొంగ ఓట్ల గుట్టు
-
జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు
-
ఒక్కడే.. కానీ రెండు ఓట్లు!
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక్కచోటే ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన. ఇలా లేకపోతే ‘అక్కడ- ఇక్కడ’ పేరుతో ఎన్నో దొంగ ఓట్లు నమోదై గందరగోళ పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. దొంగ ఓట్లు ఏరివేతకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటున్నా సాధారణ పౌరులు నుంచి సెలబ్రెటీల వరకూ ఒక్క చోట కంటే ఎక్కువ చోట్లే ఓటును ఏదొక రకంగా నమోదు చేసుకుంటూనే ఉంటున్నారు. ఇదంతా ఎందుకంటే ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న కొందరు ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఏపీలో ఓట్లు నమోదు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు ‘రెండో ఓటు’ను నమోదు చేసుకోవడానికి అది కూడా ఏపీలో నమోదుకు దరఖాస్తు చేయడంపై ఒకవైపు విస్మయం.. మరొకవైపు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు, అతని భార్య, కుమారుడు ఇప్పుడు కొత్త ఓటు కోసం ఏపీలోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-168లో కొణిదల నాగబాబు(సీరియల్ నెంబర్-323), కొణిదల పద్మజ(సీరియల్‌నెంబర్- 324), సాయి వరుణ్ తేజ్(సీరియల్ నెంబర్-325) ఓటు వేశారు. వీరు తాజాగా ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారు. నాగేంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేయగా, ఇక్కడ నాగేంద్రబాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాధారణ జనం.. అమ్మ నాగబాబు అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి
సాక్షి, అమరావతి: ఒక వ్యక్తికి ఒకేచోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలని, తప్పుడు సమాచారంతో పక్క రాష్ట్రంలో ఉన్న వారు ఓటరుగా నమోదు చేసుకుంటే వారిపై పీపుల్స్ యాక్ట్ సెక్షన్–31 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. డూప్లికేట్, డబుల్ ఓట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు అందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న వారు ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకునేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరించడానికి డిసెంబరు 9 చివరి తేదీ అని, అభ్యంతరాలను 26లోగా పరిష్కరించి జనవరి 5, 2024న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి ఇక్కడ ఓటరుగా నమోదు చేయిస్తూ టీడీపీ ప్రత్యేకంగా శిబిరాలు పెట్టి చేరి్పస్తుండటంపై వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. డిసెంబరు 5న ఇచ్చిన ఈ ఫిర్యాదును పరిశీలించి ఈ ఉత్తర్వులను జారీచేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. ఈ ఆదేశాలను జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేసింది. ఎన్నికల కమిషన్ జారీచేసిన ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.. ♦ పీపుల్స్ యాక్ట్–1950 సెక్షన్ 17, 18 ప్రకారం ఒక ఓటరు ఒకచోట మాత్రమే నమోదై ఉండాలి. అలా కాకుండా ఒక చోటకు మించి వేరేచోట లేదా మరో ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకుంటే సెక్షన్–31 (పీపుల్స్ యాక్ట్ ) ప్రకారం చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తారు. ♦ ఫాం–6 అనేది మొదటిసారి మాత్రమే నమోదు చేసుకునేవారు వినియోగించాలి. దీని ద్వారా దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడా కూడా అప్పటికే ఓటరుగా నమోదు అయి ఉండకూడదు. తమకు ఎక్కడా ఓటు లేదంటూ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇలా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వేరే నియోజకవర్గాల్లో లేదా వేరే ప్రాంతాల్లో ఓటు ఉన్నట్లు దర్యాప్తులో తేలితే వారిపై పీపుల్స్ యాక్ట్ సెక్షన్–31 ప్రకారం శిక్షించడం జరుగుతుంది. వయస్సు 20 ఏళ్లు దాటిన వారు ఫాం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే అలాంటి కేసుల విషయంలో అధికారులు విధిగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి బీఎల్ఓలు కారణాలు రాయాలి. ♦ ఫాం–8 కింద దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని అంశాలను విచారణ చేసి తీరాలని బూత్‌లెవల్ ఆఫీసర్లకు ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. వాటిలో సంబంధిత వ్యక్తి ఓటరు ఐడిని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో చెక్ చేయాలి. అలా ఎక్కడైనా వారి పేరు వెబ్ సైట్లో ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని ఆ దరఖాస్తుదారుని అప్లికేషన్‌పై కామెంట్‌గా రాయాలి. ఫీల్డ్ వెరిఫికేషన్‌లో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలి. వీటికి సంబంధించి బూత్ లెవల్ ఏజంట్ల నుంచిగాని ఇతరుల నుంచి సందేహాలు, అభ్యంతరాలుంటే బూత్ లెవల్ ఆఫీసర్లు నమోదు చేసుకోవాలి. వీటన్నింటిని అంటే డాక్యుమెంట్స్, ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు బీఎల్ఓలు బీఎల్ఏల రిమార్కులను పొందుపరిచిన అనంతరమే ఈఆర్ఓలు ఆ దరఖాస్తులపై తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ♦ దరఖాస్తుదారుడు తప్పుడు ధ్రువీకరణ/సమాచారం ఇచ్చినట్లు తేలితే వారిపై ఈఆర్వోలు పీపుల్స్ యాక్ట్–1950 కింద కేసులు నమోదు చేసి శిక్షపడేలా చర్యలు తీసుకుంటారు. ఈసీ నిర్ణయం హర్షణీయం: లేళ్ల అప్పిరెడ్డి ఇక తమ ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్ శుక్రవారం కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీచేయడం హర్షణీయమని శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి ‘సాక్షి’తో అన్నారు. తెలంగాణ ఓటు వేసిన టీడీపీ మద్దతుదారులు ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకుని ఇక్కడ కూడా ఓటు వేసే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. దొంగ ఓట్లు నమోదు చేయించటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని.. అది ఆయన నైజమన్నారు. నిజానికి.. ప్రజాస్వామ్యంలో ఫాం–6 అనేది కొత్తగా ఓటర్లుగా నమోదుచేయడానికి ఉపయోగించేదన్నారు. అదే ఓటర్లు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చినట్లయితే ఫాం–8 ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలని.. కానీ, ఫాం–6 ఉపయోగించి 30 సంవత్సరాల పైబడిన ఓటర్లను టీడీపీ నమోదు చేయిస్తోందన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం చంద్రబాబు చేయిస్తున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు. -
ఎక్సైజ్ అధికారి కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. మహిళ మృతి
కాజీపేట: ఓ ఎక్సైజ్ అధికారి కుమారుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. రోడ్డు పక్కన నిల్చున్న మహిళను నేరుగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈఘటన గురువారం జరగగా, బంధువులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కాజీపేట–ఫాతిమానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కాజీపేట 48వ డివిజన్ శౌరినగర్ కాలనీకి చెందిన గాదె కవిత (38) గురువారం మధ్యాహ్నం సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు భర్తతో కలిసి వచ్చి రోడ్డుపక్కన నిలబడి ఉంది. ఇదే సమయంలో దర్గా కాజీపేట వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కవితను స్థానికుల సహాయంతో భర్త ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. #JustIn Kazipet road accident!@HiWarangal @TriCityWarangal pic.twitter.com/hY54Ts8LNj — Fasi Adeeb🇮🇳 (@fasi_adeeb) December 1, 2023 డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే కవిత మృతి.. ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి కుమారుడు దొడ్ల వంశీ భార్గవ్ అతి వేగంగా కారును డ్రైవ్ చేసి ఢీకొట్టడంతో కవిత తీవ్రంగా గాయపడి మృతిచెందింది. విదేశాల్లో ఉంటూ ఇటీవలే వివాహా వేడుక నిమిత్తం వచ్చిన వంశీ అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన.. నిందితుడు ఎక్సైజ్ అధికారి కుమారుడు కావడంతోనే అతడిని కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఫాతిమానగర్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు కాజీపేట పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. వందల మంది తరలి వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో బ్రిడ్జికి ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో పోలీసులు ట్రాఫిక్‌ను దర్గా కాజీపేట మీదుగా మళ్లీంచారు. పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి న్యాయం చూస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. మృతురాలికి ఆడపిల్లలు, భర్త ఉన్నారు. నిందితుడిపై కేసు నమోదు.. కారును నిర్లక్ష్యంగా నడిపి మహిళ మృతికి కారణమైన వంశీ భార్గవ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. మృతురాలి భర్త జోసఫ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సార్ల రాజు తెలిపారు. దర్గా రైల్వేగేట్ వద్ద ట్రాఫిక్ జామ్ కాజీపేట రూరల్ : కాజీపేట సెయింట్ గాబ్రియల్ స్కూల్ వద్ద కారు ఢీకొని మహిళ మృతి చెందిన ఘ టనలో శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయం చేయాలని ఫాతిమానగర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది ప డ్డారు. అన్ని వర్గాల వాహనదారులు దర్గా రైల్వే గేట్ నుంచి భట్టుపల్లి, కడిపికొండ బ్రిడ్జి మీదుగా బాపూజీనగర్ సెంటర్ మీదుగా కాజీపేటకు చేరుకున్నా రు. దీంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు ఫాతిమానగర్, దర్గా రోడ్లు, దర్గా రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొందరు పాదచారులు, విద్యార్థులు, ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొకొని ఫాతిమానగర్ బ్రిడ్జి కింద నుంచి రైలు పట్టాలు దాటి వెళ్లారు. -
మెదటిసారిగా ఓటేసిన ఆనందంలో యువతులు (ఫొటోలు)
మెదటిసారిగా ఓటేసిన ఆనందంలో యువతులు (ఫొటోలు) -
ఓటేసిన రాజకీయ ప్రముఖులు - అధికారులు (ఫొటోలు)
-
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: కేటీఆర్
-
ఓటు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
ఓటేయండి.. సెల్ఫీ తీసుకోండి.. సాక్షికి పంపండి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటేసే వారికోసం సాక్షి. కామ్ సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫోటో గ్యాలరీలు గ్యాలరీ -4 గ్యాలరీ -3 గ్యాలరీ -2 గ్యాలరీ -1 -
ఓటు వేసిన వెంటనే చూపుడు వేలిపై సిరాచుక్క ఎందుకు వేస్తారు?
ఎన్నికల్లో చాలా ప్రధానమైన అంశం సిరాచుక్క. మనం ఓటేశామని చెప్పడానికి సిరాచుక్క ఓ గుర్తుగా మాత్రమే కాదు, దొంగ ఓట్లను చెక్ పెట్టే ఆయుధంలానూ పనిచేస్తుంది. నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పట్టేందుకు భారత ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్ధాలుగా అమలు చేస్తోంది. ఇంతకీ ఈ సిరా ఎక్కడ తయారవుతుంది? దీని వెనకున్న చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం. తెలంగాణలో ఓట్ల పండగకి సర్వం సిద్ధమైంది. రేపే(నవంబర్30) తెలంగాణలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ఓటు వేశాక చూపుడు వేలిపై ఇంక్ మార్క్ వేస్తారన్న విషయం తెలిసిందే. ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా గుర్తుగా ఇండెలబుల్ ఇంక్‌ను ఉపయోగిస్తారు. ఈ సిరా వెనుక పెద్ద చరిత్రే ఉంది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చాలా సమస్యలు ఎదుర్కొంది. ఓటు వేసినవాళ్లు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో ఎలా అడ్డుకోవాలో అర్థం కాలేదట. అప్పుడే కొన్నిరోజుల వరకు చెరిగిపోని సిరాతో గుర్తు వేయాలన్న ఆలోచన వచ్చింది. అదే “బ్లూ ఇంక్” పద్ధతి. భారతదేశంలో 1962లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా బ్లూ ఇంక్ వాడటం మొదలుపెట్టారు. R&D ఆర్గనైజేషన్ ఈ ఇంక్‌ను తయారు చేసేది. ఆ తర్వాత దీనిని మైసూర్‌కు చెందిన పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌కు బదిలీ చేసింది. అప్పట్నుంచి భారత్‌లో జరిగే అన్ని ఎన్నికలకు ఇక్కడి నుంచే ఇంక్‌ను తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇంక్‌ను సరఫరా చేస్తుంది. కెనడా, కాంబోడియా, మాల్దీవులు, నేపాల్, నైజీరియా, దక్షిణాఫ్రికా, టర్కీ సహా కొన్ని దేశాల ఎన్నికల అవసరాలకు ఇక్కడి నుంచే ఇంక్ సరఫరా అవుతుండటం గమనార్హం. ఇటీవలి కాలంలో ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌పెన్నులను కూడా తయారీ చేస్తుంది ఈ సంస్థ. ఇతర దేశాల్లో వీటిని వాడుతున్నారు.కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు.ఈ ఇంక్ వేలిపై వేయగానే కొన్ని గంటల్లోనే పోదు. ఒకప్పుడు అయితే కొన్ని నెలల పాటు ఉండేది. ఇప్పుడు కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు ఆ మార్క్ అలాగే ఉంటుంది. ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు ఇంక్ సరఫరా చేసేముందు ఆ ఇంక్‌ను పలుమార్లు టెస్ట్ చేస్తారు. ఇండెలబుల్ ఇంక్‌లో సుమారు 15 నుంచి 18 శాతం సిల్వర్ నైట్రేట్ తో పాటు కొన్నిరసాయనాలను ఉపయోగిస్తారు. దీంతో ఈ సిరా కొన్ని రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఇది 5, 7,5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది.ఒక బాటిల్ ఇంక్ ధర సుమారు రూ. 127 ఉంటుంది. ఒక సీసాలో సుమారు 10 ml సిరా ఉంటుంది. దొంగఓట్లు నమోదు కాకుండా ఉండేందుకు గాను ఈ సిరాను చూపుడు వేలికి వేస్తారు. ఒకవేళ వేలికి గాయమైనా, చూపుడు వేలు లేకపోయినా మరో వేలికి వేస్తారు. ఇక ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆప్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇతరులకు ఇందులో ఏం వాడారన్నది తెలియదు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు
-
డబ్బులిస్తే తీసుకోండి.. సమర్థులకే ఓటేయండి
సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం అభ్యర్థులెవరైనా డబ్బులిస్తే తీసుకుని ఓటును మాత్రం సమర్థులకే వేయాలని సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పిలుపునిచ్చారు. ‘ఓటుకు నోటు’కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో భాగంగా తెలంగాణ ఆర్టిస్ట్స్ ఫోరమ్, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్, ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్‌ల ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’వాల్‌పోస్టర్‌ను రామ్‌గోపాల్ వర్మ మంగళవారం ఆవిష్కరించారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ...ప్రజలను మేలుకొల్పడంలో పొలిటికల్ కార్టూన్స్ చాలా ప్రభావం చూపిస్తాయన్నారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండి, అభివృద్ధి, రోడ్లు, విద్య, వైద్యం తదితర అవసరాలను మెరుగుపరిచే అభ్యర్థులనే ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. తానెప్పుడూ పొలిటికల్ మేనిఫెస్టో చూడనని, దానిని రూపొందించడం, అమలు చేయడం తెలిస్తే తానే ఓ రాజకీయ నాయకుడిగా మారిపోయే వాడినని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ’ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’లో భాగమైన కార్టూనిస్ట్‌లను ఆర్జీవీ అభినందించారు. వ్యంగ్య చిత్రాలను గీసే వారు ఇంత సీరియస్‌గా ఉంటారని కార్టూనిస్టులను చూశాకే తెలిసిందని చమత్కరించారు. కార్యక్రమంలో కార్టూనిస్టులు శంకర్ (సాక్షి), సుభాని, మృత్యుంజయ, నర్సిం, అక్బర్, వెంకటేశ్ కతుల, రాకేశ్, పి.ఎస్.చారీ, సురేందర్ సముద్రాల, జె.వెంకటేశ్, నివాస్ చొల్లేటి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, జనరల్ సెక్రటరీ రవికాంత్ రెడ్డి తదితర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్లకు రాపిడో గుడ్ న్యూస్.. ఉచిత సర్వీసులు
హైదరాబాద్: ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని 2,600 పోలింగ్స్టేషన్లకు రాపిడో సేవలు లభించనున్నాయి. ఓటర్లు తమ మొబైల్ ఫోన్ రాపిడో యాప్‌లో ‘ఓట్ నౌ’ కోడ్‌ను నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకొనేలా ఈ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. రవాణా సదుపాయం లేని కారణంగా ఓటు వేయలేని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. గ్రేటర్లో గత ఎన్నికల్లో 40 శాతం నుంచి 55 శాతం వరకే ఓటింగ్ నమోదైందని, దీన్ని మరింత పెంచేందుకు తమవంతు కృషిగా రాపిడో సేవలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఓటేయకుంటే జరిమానా, లైసెన్స్ రద్దు!
కరీంనగర్ అర్బన్: మన దేశంలో కొన్నిచోట్ల 60 శాతం ఓటింగ్ జరిగితే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే దీన్ని హక్కుగా చూడకుండా బాధ్యతగా తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలన్న డిమాండ్ కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. వేయకుంటే కొన్ని దేశాలు జరిమానా విధిస్తుండగా, మరికొన్ని ప్రభుత్వ సాయాన్ని, సదుపాయాలను నిలిపివేస్తున్నాయి. ఇంకొన్ని దేశాల్లోనైతే అలాంటి వారికి ఏకంగా ఓటుహక్కును తొలగించేస్తున్నారు. ఎందుకు ఓటు వేయలేకపోయారో సరైన కారణం చూపితే గానీ మళ్లీ ఆ హక్కును కల్పించరు. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన దేశాల్లో బెల్జియం, అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బొలీవియా, ఉక్రెయిన్, బ్రెజిల్, ఈజిప్టు, గ్రీస్, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, టర్కీ, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ తదితరాలు ఉన్నాయి. బెల్జియం : 10 వేల యూరోల వరకు జరిమానా ఈ దేశంలో ఓటరు జాబితాలో పేరు ఉండి, వరుసగా నాలుగుసార్లు ఓటెయ్యకపోతే.. పదేళ్ల వరకు ఓటుహక్కు తొలిగిస్తారు. మొదటిసారి ఓటు వేయకపోతే 2 వేల నుంచి 4 వేల యూరోల వరకు, రెండోసారి 10 వేల యూరోల వరకు జరిమానా విధిస్తారు. పైగా సర్కారు ఉద్యోగావకాశాలు, పథకాలు, సదుపాయాల్లో ప్రాధాన్యం తగ్గిస్తారు. ఎన్నికలు జరిగిన వారం రోజుల్లో సంబంధిత ఓటర్లపై చర్యలు తీసుకుంటారు. అమెరికా : ఎన్నికల రోజు సెలవు ఉండదు ఇక్కడ ఓటు వేయడంపై ఎలాంటి ఆంక్షలూ లేవు. అయినా ఇక్కడ 85 శాతం వరకు ఓటింగ్ నమోదవుతుంది. పోలింగ్ రోజు సెలవు ఉండదు. ఉద్యోగులు, ప్రజలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఓటు విలువ పట్ల అమెరికన్లలో చైతన్యం ఎక్కువ. బొలీవియా : గుర్తింపు కార్డు ఉంటేనే సౌకర్యాలు ఈ దేశంలో ఓటు వేసినవారికి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అది ఉన్నవారికే ప్రభుత్వ సౌకర్యాలను కల్పిస్తారు. రేషన్, విద్యుత్, తాగునీటి వసతి పొందాలంటే ఈ కార్డును సంబంధిత అధికారులకు చూపించాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయకపోతే.. వేతనాలు సరిగా అందవు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా : వారం రోజుల్లో విచారణ ఇక్కడ అర్హులైన ప్రతిఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఎన్నికల రోజున వీరంతా తప్పకుండా ఓటు వేయాలి. వేయకుంటే జరిమానా విధిస్తారు. ఎన్నికలు జరిగిన వారంలోగా విచారణ చేపట్టి, అపరాధ రుసుము ఎంతన్నది నిర్ణయిస్తారు. ఇక్కడ 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఎన్నికలకు చాలా ముందు నుంచే ఓటుహక్కు వినియోగంపై ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గ్రీస్ : డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు రద్దు ఇక్కడ ఓటు వేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు రద్దవుతాయి. లేదంటే వాటి మంజూరును నిలిపివేస్తారు. ఓటు వేయకపోవడానికి గల కారణాలను అధికారులకు ఆధారాలతో చూపించాల్సి ఉంటుంది. వారు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే మళ్లీ ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సౌకర్యాలపై ఆంక్షలు విధిస్తారు. సింగపూర్ : పేరు తొలగిస్తారు అభివృద్ధికి మారుపేరుగా నిలిచే సింగపూర్‌లో ఓటు వేయడం తప్పనిసరి. వేయనివారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. ఓటు వేయకపోవడానికి గల కారణానికి ఆధారాలను అధికారులకు చూపిస్తే పునరుద్ధరిస్తారు. ఎక్కువ మంది ప్రజలు కోరుకునే ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లే సింగపూర్ అభివృద్ధిలో ముందుందన్న వాదనలున్నాయి. ఇక్కడా తప్పనిసరి చేయాలి.. ఎన్నికలు ప్రగతికి బాటలు వేస్తాయి. మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడతాయి. అందుకే అయిదేళ్లకోసారి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే, చాలా ప్రాంతాల్లో అర్హులైన అనేక మంది వివిధ కారణాలతో తమ ఓటుహక్కు వినియోగించుకోవడం లేదు. వందశాతం లక్ష్యంగా ఎన్నికల సంఘం అధికారులు కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతీ ఓటరు ఓటు వేసేలా ప్రచారం, ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన దగ్గర కూడా ఓటు వేయడం తప్పనిసరి చేయాలి. ఇతర దేశాల తరహా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. -
ఓటు విలువ.. వీళ్ల ఓటమి ఎన్నికల చరిత్రకెక్కింది!
ఒక్కటి.. చాలా చాలా చిన్న అంకె. అందుకునేమో చాలామంది దానిని తేలికగా తీసుకుంటారు. కానీ, గెలుపోటముల విషయానికొచ్చేసరికి మాత్రం ఆ ‘1’ ఎంతో ఎంతో కీలకంగా మారుతుంటుంది. పరీక్షల్లో ఒక్క మార్కు, ఆటలో ఒక్క పరుగు, ఎన్నికల్లో ఒక్క ఓటు.. అంతెందుకు చరిత్రలో ఒక్క ఓటుతో ప్రభుత్వం కుప్పకూలడం కూడా చూశాం. ఎన్నికల్లోనూ ఒక్క ఓటుతో ఓడిన నాయకుల చరిత్రను ఒక్కసార తిరగేస్తే.. ఓటు విలువేంటో కచ్చితంగా తెలియడం ఖాయం. ►2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు. సంతేమరహళ్లి నియోజకవర్గంలో జనతాదళ్(సెక్యులర్)-JDS అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తి .. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ ధ్రువనారాయణ్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ధ్రువనారాయణ్‌కు 40,572 ఓట్లు.. కృష్ణమూర్తికి 40,751 ఓట్లు పోలయ్యాయి. ►2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు. నాథ్‌ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషి బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడారు. సీపీ జోషికి 62,216 ఓట్లు పోల్‌కాగా.. జోషికి 62,215 ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ ఓటమి గురించి చర్చ జరిగింది. ఎందుకంటే సీపీ జోషి అప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉండడం మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ ఎన్నికపై జోషి కోర్టుకు ఎక్కారు. ప్రత్యర్థి చౌహాన్ భార్య రెండు పోలింగ్ బూత్‌లలో ఓటేసినట్లు ఆరోపించారు. రాజస్థాన్ హైకోర్టు జోషికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. సుప్రీం కోర్టులో మాత్రం వ్యతిరేక ఫలితం దక్కింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన నియోజకవర్గంలో తానే గెలుపును చవిచూడలేకపోయారాయన. ఫలితంగా.. రెండోసారి అశోక్ గెహ్లాట్ సీఎం పదవి చేపట్టారు. జోషి ఎన్నిక వ్యవహారంలో ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఉంది. సీపీ జోషి తల్లి, సోదరి, ఆఖరికి ఆయన కారు డ్రైవర్ కూడా అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేకపోయారు. ఇక కర్ణాటకలో ఓడిన కృష్ణమూర్తి విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. ఆయన కారు డ్రైవర్ ఆయనకు ఓటేయలేదు. ఓటేసేందుకు కృష్ణమూర్తిని డ్రైవర్ అనుమతి అడిగినా.. పోలింగ్ రోజు కావడంతో కుదరని డ్యూటీలోనే ఉంచారట కృష్ణమూర్తి. ఫలితం.. ఒక్క ఓటు ఆయన్ని ఓటమిపాలుజేసింది. అందుకే రాజకీయ ప్రత్యర్థులెవరికీ కూడా ఇలాంటి ఓటమి రాకూడదని తాను కోరుకుంటున్నట్లు ఆయన చెబుతూ వచ్చేవారు. ►సింగిల్ డిజిట్ ఓట్లతోనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. 2018 మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తుయివావ్ల్ నిజయోకవర్గంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ఎల్ పియాన్మావాయి కేవలం మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రత్యర్థి మిజోరాం నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లాల్‌చాందమా రాల్తేకు 5,207 ఓట్లు రాగా.. పియాన్మావాయికి 5,204 ఓట్లు పోలయ్యాయి. దీంతో రీకౌంటింగ్‌కు ఆయన పట్టుబట్టినా.. అక్కడా అదే ఫలితం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాదు.. లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండుసార్లు ఇలా సింగిల్ డిజిల్ ఓటములు ఎదురైన సందర్భాలు నమోదు అయ్యాయి. 1989లో అనకాపల్లి(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) నిజయోకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ తొమ్మిది ఓట్ల తేడాతో నెగ్గారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో.. బీహార్ రాజ్‌మహల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోమ్ మారండి కేవలం 9 ఓట్ల తేడాతోనే నెగ్గారు. 192 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది మంది ఎంపీలు లోక్‌సభకు కేవలం సింగిల్ లేదంటే డబుల్ డిజిట్ ఓట్లతో నెగ్గారనేది ఎన్నికల సంఘం లెక్క. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఒక్కోసారి ఒక్క ఓటుతోనూ అభ్యర్థుల తలరాతలు తారుమారు అవుతుంటాయి. రాజ్యాంగం 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ అందించిన హక్కు.. ఓటేయడం. ఆ ఓటు హక్కు అందరూ సక్రమంగా వినియోగించుకుని ఉంటే.. చారిత్రక ఓటముల్లోకి పైన నేతల పేర్లు ఎక్కి ఉండేవి కావేమో!. -
అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి
న్యూఢిల్లీ: రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ, ప్రతికూల రాజకీయాలతో జనం విసుగెత్తిపోయారని వెల్లడించారు. బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఇచి్చన హామీలన్నీ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. జనం ఆకాంక్షలను నెరవేర్చడం తమ బాధ్యత అని వివరించారు. కాంగ్రెస్ ఇస్తున్న డొల్ల హామీలు నమ్మొద్దని, సుపరిపాలన అందించే బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. తమ పార్టీ పట్ల జనం అచంచల విశ్వాసం చూపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ వల్లనే ప్రగతి సాధ్యమని వారు నమ్ముతున్నారని వివరించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల కలిగే మేలు ఏమిటో మధ్యప్రదేశ్ ప్రజలు ఇప్పటికే గుర్తించారని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అదికారంలోకి తీసుకురావాలని ఛత్తీస్‌గఢ్ ప్రజలకు సూచించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించి, బీజేపీని గెలిపిస్తారన్న నమ్మకం తనకు సంపూర్ణంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ఓట్.. ఆల్ఔట్..
ముందుగా నాయకుల హామీలపై.. రెండు మాటలు సరదాగా.. అసలే చలికాలం.. ఆపై ఎన్నిక లు.. ఇంకేం గొర్రెల నాయకుడు దండోరా వేయించాడు. మా పాలనలో అన్ని గొర్రెలకు ఉచితంగా కోటు పంపిణీ చేస్తానని. అన్ని గొర్రెలు ఖుషీగా పండుగ చేసుకున్నాయి. ఇలాంటి నాయకుడు దొ రకడం తమ అదృష్టమని పాలాభిషేకాలూ గట్రాలూ చేశాయి. అందులో కాసింత అమాయకంగా, అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న గొర్రెకు రాకూడని డౌట్ వచ్చింది..అడగకూడని ప్రశ్న ఆ నాయకుడిని అడిగింది. ‘మేం ఇంతమందిమి ఉన్నాం కదా.. అందరికీ అంత ఉన్ని ఎక్కడనుంచి తెస్తారూ ’.. అని. ‘‘ ఇంకెక్కడనుంచి గొర్రెల నుంచే తీస్తాం కదా..’’ నాయకుడి సమాధానం. మగదోమ – నీకోసం సింహాన్ని వేటాడి తేనా డియర్ ఆడదోమ – వద్దులే ముందు పడుకో మగదోమ – పోనీ ఐరావతాన్ని కుట్టి నీకు బ్లడ్ బాత్ చేయించనా ఆడదోమ– వద్దు..వద్దు ముందు నిద్రపో, నాకూ నిద్ర వస్తోంది మగదోమ – పోనీ ఇంకా ఏదైనా.... ఆడదోమ– అసలే ఓట్ల టైమ్.. రాజకీయ నా యకులను కుట్టి వచ్చావా ఏంటి... నోరుమూసుకు ని పడుకోకపోతే ఆల్ ఔట్ పెట్టి బయటకు పోతా.. ఇదో సైకాలజీ.. ఇలాంటి జోకులు, కథలు ఎన్నికల టైమ్‌లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇదంతా రాజకీయ నాయకులపై. ఎన్నికలపై, పోలింగ్‌పై వారి అభిప్రాయాన్ని ప్రతిఫలిస్తుంటాయి. చాలామంది ఓటర్లు ఎన్నికల పట్ల నిరాసక్తంగా, పోలింగ్‌కు దూరంగా ఉంటుంటారు. వీలుంటే పోలింగ్ తేదీని హాలిడేగా కూడా పరిగణిస్తుంటారు. పొలిటీషియన్లపై , ఎన్నికలపై మంచి అభిప్రాయం క్రమక్రమంగా కనుమరుగవుతోందని పై జోకులు చెబుతూనే ఉంటాయి. ఇలాంటి కథల వెనుక, ఓటు పట్ల నిరాసక్తత వెనుక సైకాలజీ కూడా ఉందట..అమెరికాలోని స్టోనీబ్రూక్, మిన్నెసోటా యూనివర్సిటీల పొలిటికల్ సైన్స్–ఎలక్షన్ సైకాలజీ ప్రొఫెసర్లు అధ్యయనం చేసి ఇలా చెబుతున్నారు.. నిరాసక్త జీవులు.. ♦ జీవితంలో కష్టానష్టాలు ఎదుర్కొని ప్రభుత్వం నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి సాయం దక్కనివారు ఓటేసేందుకు విముఖతతో ఉంటారు. తమకు లాభం లేదనుకున్నప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమిటన్న అభిప్రాయం వారిది. ♦ తోటివారిని పెద్దగా నమ్మనివారు, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడతారనే అభిప్రాయంతో ఉన్నవారు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉంటారట. ♦ పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోవడంతోనూ ఓటు వేయకుండా ఉండేవారూ ఎక్కువే. తమకు న చ్చిన అభ్యర్థి ఉన్నప్పుడే ఓటు వేయాలనిపిస్తుందని కొందరు ఓటర్లు ఓ సర్వేలో వెల్లడించారు. ♦ అభ్యర్థుల్లో ఎవరూ మంచివారు లేరని.. చెడ్డవారిలో ఎక్కువ, తక్కువ అంటూ ఎవరూ ఉండరనే అభిప్రాయంతో ఓటేయడం లేదని చెప్పినవారూ ఎందరో. ♦ కొందరైతే నిత్యం రాజకీయ వార్తలను చూస్తుంటారు. పార్టీలు, అభ్యర్థులపై చర్చలూ చేస్తారు. కానీ ఎన్నికల వ్యవస్థ రిగ్గింగ్‌కు గురైందనే, ఎవరు గెలుస్తారో ముందే తేలిపోయినట్టేననే భావనతో ఓటు వేయరు. ♦ గెలిచినవారు హామీలు నిలబెట్టుకోకపోవడం, డబ్బులున్నవారే గెలుస్తుండటం వంటివి కూడా జనం ఓటింగ్‌పై అనాసక్తికి కారణాలు ♦ ‘రాజకీయాలతో, నేతలతో మనకేం పని, నా పనేదో నాకుంది..’ అనుకునేవారు ఓటేసేందు కు వెళ్లరు. ముఖ్యంగా యువతలో ఇలాంటి భా వన కనిపిస్తుందని.. కెరీర్, చదువు, ఇతర వ్యా పకాల్లో మునిగి ఉండటంతో వారు నిత్యవార్తలకు, రాజకీయాలకు దూరంగా ఉంటుండట మే దీనికి కారణమని అధ్యయనం పేర్కొంది. రాజకీయ జీవులు.. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, రాజకీయాలు–ఎన్నికలు తమ నిత్యజీవితంపై ప్రభావం చూపుతాయన్న అవగాహన ఉన్నవారు క చ్చితంగా ఓటు వేస్తారని.. కొత్త అంశాలు, సంగతులపై ఆసక్తి ఉండేవారు ఓటు వేసే అవకాశాలు ఎక్కువని, దీనికి భిన్నంగా ఉండేవారు దూరంగా ఉంటారని తేల్చింది. నిస్వార్థజీవులు.. ఎప్పుడో అరుదుగా తప్ప మామూలుగా అయితే ఒక ఓటు పడకపోతే, లేక అటూ ఇటూ అయితే వచ్చే తేడా ఏమీ ఉండదనే భావనలో కొందరు ఉండగా, గంటల తరబడి క్యూలో నిలుచుని మరీ ఓటు వేసేవారు కొందరు. మనుషుల్లో ఉండే నిస్వార్థమైన తత్వమే ఇలా ఓటు వేయడానికి కారణమని న్యూయార్క్ యూనివర్సిటీ సైకాలజీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారతీయుల బాధ.. ♦ మేం ప్రభుత్వంపై, పథకాలపై ఆధారపడటం లేదనే భావనతో ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు ఓటు వేయడానికి దూరంగా ఉంటున్నాయి. తమకు ఏమైనా అవసరమైతే డబ్బుతోనో, పలుకుబడితోనో చేసుకోగలమనేది వారి భావన. ♦ సొంత ప్రాంతాలను వదిలి వలస వెళ్లినవారు.. కొత్త ప్రాంతాల్లో నేతలు, అభ్యర్థులపై ఆసక్తి లేకుండా ఉండటం, వారాంతాల్లో పోలింగ్ వల్ల ఓటేయడం కంటే వినోదంపై దృష్టిపెట్టడం వల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గుతోంది. ♦ భూస్వాములో, నేర చరిత్ర ఉన్నవారో, రాజకీయాలు తెలియని ప్రముఖులో ఎన్నికల బరిలోకి దిగినచోట మధ్యతరగతి, యువత వారిపట్ల ఏహ్యభావంతో ఓటేయడం లేదు. వేరేవారికి వేసినా గెలవరని భావిస్తున్నారు. ♦ రోతగా మారిన రాజకీయాలకు, నేతల అవినీతికి నిరసన అంటూ కొందరు ఓటు వేయకుండా ఉంటున్నారు. ♦ ఓటు ప్రాధాన్యత చాటి చెప్తూ సెలబ్రిటీలతో ఎన్నికల సంఘం చేస్తున్న ప్రచారం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని.. యువత పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేయడం లేదని పరిశీలకులు చెప్తున్నారు. అమెరికాలోనూ అంతే.. పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాలో జనం ఓటేయడంలో బద్ధకస్తులే. అక్కడ పేదలు, యువత, విదేశాల నుంచి వచ్చి స్థిరపడినవారు పెద్దగా ఓటేసేందుకు ముందుకు రావడం లేదని అధ్యయనాల్లో తేలింది. -సరికొండ చలపతి -
ఓట్ తో దుమ్ము రేపుదాం..!
-
ఓటు వేయకుండానే వెనుదిరిగిన సీఎం జోరాంతంగా.. ఆ తర్వాత
ఐజ్వాల్: ఈవీఎం మొరాయించడంతో మిజోరాం సీఎం జోరాంతంగా ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాసేపు వేచి ఉన్న సీఎం.. అప్పటికీ ఈవీఎం పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. మరికాసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు మిజోరాంలో 40 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య జనం పోలింగ్‌లో పాల్గొన్నారు. ఐజ్వాల్ నార్త్-II అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 19-ఐజ్వాల్ వెంగ్లాయ్ పోలింగ్ స్టేషన్లో ఈరోజు ఉదయం తన ఓటు వేయడానికి సీఎం జోరాంతంగా వెళ్లారు. అదే సమయంలో ఈవీఎం మొరాయించింది. తప్పని స్థితిలో సీఎం జోరాంతంగా వెనుదిరిగారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని తెలిపారు. కాసేపయ్యాక మళ్లీ వచ్చి ఓటు వేశారు. రాష్ట్రంలో అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇదీ చదవండి: ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు.. సీఆర్పీఎఫ్ జవాన్‌కి గాయాలు -
మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకున్నారా? సందేహాలున్నాయా? చెక్ చేసుకోండిలా!
తెలంగాణ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది…పార్టీలు ప్రచారాల్లో మునిగితేలుతూంటే… ఓటరు మహాశయుడూ నవంబరు 30వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాడు. తొలిసారి ఓటేస్తున్నామన్న ఉత్సాహం యువ ఓటర్లది.... నచ్చని నేతలను వదిలించుకోవాలని ఇతరులు ఎదురు చూస్తున్నారు. మరి… ఓటరు జాబితాలో మీ పేరుందో? లేదో చూసుకున్నారా? దాంట్లో తప్పులేమీ లేవు కదా? ఉంటే సరిచేసుకోవడం ఎలా అన్న అనుమానం వెంటాడుతోందా? ఏం ఫర్వాలేదు… సాక్షి.కాం మీతోనే ఉంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా మీ ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? పేరెలా పరిశీలించాలి? మొబైల్‌ఫోన్‌కు ఆధార్ నెంబరును లింక్ చేసుకోవడమెలా వంటి అనేక సందేహాలకు సమాధానాలు అందిస్తోంది. ఆలస్యం ఎందుకు…. చదివేయండి. మీ సందేహాలు తీర్చుకోండి. ఇంకా ఏవైనా మిగిలిన ఉంటే ఎన్నికల కమిషన్ అధికారులతోనే మీ డౌట్స్ క్లియర్ చేసేందుకూ ప్రయత్నిస్తాం. మీరు చేయాల్సిందల్లా… మీ సందేహం/సమస్యను vote@sakshi.com ఐడీకి మెయిల్ చేయడమే!! ఓటర్ల సమాచారాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఓటర్లకు సంబంధించిన అన్ని సేవలను, సమాచారాన్ని ఒక దగ్గరకు చేర్చి https://voterportal.eci.gov.in ను రూపొందించింది. ఓటరుగా నమోదు చేసుకోవడం మొదలుకొని జాబితాలో పేరును చెక్ చేసుకోవడం వరకూ అన్ని సేవలూ ఇక్కడే లభిస్తాయి. జాబితాలో మీ పేరు చూసుకోండిలా… ఈ వెబ్సైట్లోకి ప్రవేశించగానే… కుడివైపున సర్వీసెస్ అన్న భాగంలో ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని ఒక చిన్న ట్యాబ్‌ను గమనించండి. దాన్ని క్లిక్ చేస్తే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునే పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ ఇలా ఉంటుంది…. ఇందులో మూడు రకాలుగా మీ పేరును చెక్ చేసుకోవచ్చు. మొదటది మీ వివరాలను అందించడం. రెండోది మీ ఓటర్ ఐడీ సంఖ్య ద్వారా… మూడోది మొబైల్ నెంబరు ద్వారా (ఓటరు ఐడీకి మొబైల్ ఫోన్ నెంబరు అనుసంధానం చేసి ఉంటేనే) వివరాలిచ్చి ఇలా…. ఓటర్ ఐడీలో ఉన్నట్టుగానే మీ పేరును టైప్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంటిపేరైనా ఇవ్వవచ్చు. లేదంటే… ఓటరు ఐడీలో మీరు ఇచ్చి తల్లి/తండ్రి లేదా ఇతర బంధువు పేరు వివరాలు ఇచ్చి కూడా వెతకవచ్చు. నమోదు చేసుకున్న పుట్టినరోజు లేదా మీ వయసు వివరాలు ఇచ్చి కూడా జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఇవేవీ లేకుంటే స్త్రీ, పురుషుడు లేదా థర్డ్ జెండర్ అన్న వివరాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు కానీ… కొంచెం వ్యయ ప్రయాసతో కూడుకున్న పని. చివరగా.. మీ జిల్లా, మీ నియోజకవర్గం వివరాలు ఇవ్వడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. పేజీ చివర ఉన్న Captcha Code బాక్స్లోఉన్న అక్షరాలు లేదా అంకెలను రాసి సెర్చ్ బటన్ నొక్కితే మీ వివరాలు కనిపిస్తాయి. నోట్: పేర్లు, ఇతర వివరాలు టైప్ చేసేటప్పుడు పెద్ద, చిన్న అక్షరాలు, పదాల మధ్య ఖాళీలు సరిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పేజీ పై భాగంలోనే మీ రాష్ట్రాన్ని ఎంపిక చేయడం మరచిపోవద్దు. అలాగే తెలుగుతోపాటు దాదాపు 11 భారతీయ భాషల్లో సమాచారాన్ని వెతకవచ్చునని గుర్తించండి. ఓటర్ ఐడీ ద్వారా… మీ ఓటర్ ఐడీలోని సంఖ్య ద్వారా జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం చాలా సులువు. పైన కనిపిస్తున్న మాదిరిగా ఉంటుంది వెబ్‌సైట్‌లోని స్క్రీన్. ఒక పక్కన ఓటర్ ఐడీ సంఖ్యను ఎంటర్ చేయాలి. రెండోవైపున ఉన్న కాలమ్ నుంచి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత Captcha Code ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సరి. మొబైల్ ఫోన్ ద్వారా… రాష్ట్రం, భాషలను ఎంచుకున్న తరువాత స్క్రీన్ మధ్యలో ఉన్న కాలమ్‌లో ఓటర్ ఐడీకి అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబరును ఎంటర్ చేయాలి. ఎన్నికల కమిషన్ పంపే ఓటీపీని దిగువనే ఉన్న కాలమ్‌లో టైప్ చేసి Captcha Code కూడా ఎంటర్ చేయాలి. దీని తరువాత సెర్చ్ కొడితే మీ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఓటర్ ఐడీ డౌన్లోడ్ చేసుకోవాలంటే… ముందుగా https://voterportal.eci.gov.in కు వెళ్లండి. సర్వీసెస్ భాగంలో దిగువన ‘ఈ-ఎపిక్ డౌన్లోడ్’ అని ఉన్న కాలమ్పై క్లిక్ చేయండి. ఇలా ఒక స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది. భారతీయ ఓటరు లేదా విదేశాల్లో ఉన్న ఓటర్లు తమకు సంబంధించిన కాలమ్స్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. రిజస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపిని ఎంటర్ చేసి ఓటర్ ఐడీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయాలో తెలుసుకోవాలంటే… హోమ్ పేజీలో సర్వీసెస్ భాగంలో ‘నో యువర్ పోలింగ్ స్టేషన్ అండ్ ఆఫీసర్’ అన్న కాలమ్‌ను క్లిక్ చేయండి. ఓటర్ ఐడీ సంఖ్య, Captcha Code లు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. చివరగా… ఓటర్ ఐడీలో మీ వివరాలు మార్చుకోవాలనుకుంటే https://voterportal.eci.gov.in హోమ్ పేజీలోనే ఫామ్స్ అన్న భాగంలో అవసరమైన పత్రాలు ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి మార్పులు చేర్పులు, అభ్యంతరాలు, తొలగింపుల వంటివి చేయవచ్చు. -
ఉల్లిపాయలు అడిగారట!
ఉల్లిపాయలు అడిగారట! -
‘ఆయుధ’ పూజతో బిజిగా ఉన్నాడట, తర్వాత రమ్మంటున్నాడు!
‘ఆయుధ’ పూజతో బిజిగా ఉన్నాడట, తర్వాత రమ్మంటున్నాడు! -
ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోండి
-
ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోండి
-
ఇంకా పెరగాలి ఓటు ధర!
ఓ జర్నలిస్టు... ఓ (అ)సామాన్య ఓటరును ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓటును నోటుకూ, ఓ రేటుకూ అమ్ముకుంటున్నారనీ, ఈ పద్ధతి తప్పు అని తెలియజెప్పాలని సదరు జర్నలిస్టు ఉద్దేశం. అదే విషయాన్ని అతణ్ణి అడిగాడు. ‘‘సార్... పేపర్లలో టీవీల్లో... మీరే దాన్ని ‘విలువైన ఓటు’, ‘విలువైన ఓటు’ అంటుంటారా, లేదా? మరి అంత విలువైనదాన్ని ఫిరీగా ఇచ్చేయడమేంటి?... నాన్చెంచ్’’ ‘‘ఓటు ధర ఇలా పెరిగిపోవడం ఓ చెడు సంకేతం కాదా?’’ ‘‘ఎంతమాత్రమూ కాదు. నిజానికి నా ఒపీనియనింగు పెకారం ఓటింగు ప్రైసింగు వింకా పెరగాలి. ఒకప్పటి రేట్లూ..ఇప్పటి ధరలూ, ఇప్పటికి తరిగిపోయిన రూపాయి విలువా.. వీటన్నింటినీ కూలంకచంగా పరిచీలింపచేసి, ఏ ఆడమ్ చ్మిత్తుతోనో, అమర్తచేనుతోనో లెక్కలు కట్టించారనుకోండి, పెరిగిన ద్రవ్యోల్బణం పెకారం.. ప్చ్..ఇప్పటి మన ఓటు ధర చాలా తక్కువని తెలుతుంది. ఇంకో విషయం.. ఓటు ధర బాగా పెరిగిందనుకోండి.. ‘అమ్మో.. మా చీటు ఇంతటి వ్యాల్యుయేషనబుల్ కదా’ అంటూ, దాన్ని నిలబెట్టుకోవడం కోసం మమ్మల్ని మరింత చంతృప్తిపరచేలా పాలిస్తుంటారు సార్ నేతలు’’ ‘‘అదేంటీ... ఇలా చెబుతున్నారు?’’ ‘‘సార్... మీకు మీ ఆఫీసువాళ్లు ఏడాదికోసారి బోనచు ఇస్తుంటారా, లేదా? దాన్ని మీరు తీసుకుంటారా లేక ‘అబ్బే..అప్పనంగా వచ్చింది మాకెందుకండీ’ అని వదిలేస్తారా?’’ ‘‘తీసుకుంటాం’’ ‘‘మాకు నెలనెలా వచ్చే మా పింఛనే జీతమనుకుందాం. జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఎప్పుడో... ఐదేళ్లకోసారి బోనచుగా ఏ ఐదువేలో, ఆరువేలో ఇస్తారు. మీరు ఏడాదికోసారి బోనచు రాకపోతేనే ఎంతో అల్లల్లాడిపోతారు కదా. మాకేమో ఏదో ఓ రెణ్ణెల్ల పింఛన్‌ను..అది కూడా ఐదేళ్లకు..మచ్చుకు కొద్దిగా బోనచులాగా పడేస్తే..మీరీమాత్రానికే ఇంతగా విదైపోతుంటారెందుకో నాకు అర్థంకావడం లేదు’’ ‘‘ఇలా ఓటుకు ధర పెరుగుతూ పోవడం ప్రజాస్వామ్యానికి అనర్థం కాదా?’’ ‘‘ఓటును అమ్మడం, అమ్ముకోవడం అని మాటిమాటికీ అనకండి సిరాగ్గా! అమ్ముతున్నాడంటూ బదనాం చేయడానికి ఓటరే దొరికాడా మీకు తేరగా? అసలుఓటును అమ్ముకోడం అనడమేంటి? బార్బేరియన్’’ అన్నాడు చిరాగ్గా. ‘‘మరి ఏమనాలి?’’ ‘‘సార్.. నిజానికి ఇదొక వెకనమిక్ యాక్టివిటీ. అనగా... ఓ ఆర్థిక కార్యెకలాపం. ఉదాహరణకు..ఓ విలువైన పనికి టెండర్లు పిలుస్తారు. బిడ్డింగు వేస్తారు. ఎవరు ఎక్కువ లాభదాయకంగా కోటింగు చేస్తే, వాళ్లకు ఇస్తారు. ఓటు విషయంలోనూ అదే జరుగుతోందని ఎందుకనుకోరు? ‘అరె ఓ విలువైన పనికి బిడ్డింగు జరిగింది, ఎవరు ఎక్కువగా ఇస్తే, వాళ్లకు ఓటిచ్చారు’ అని మీరెందుకనుకోరు?’’ ‘‘బిడ్డింగులో ఎవరు లాభదాయకంగా కోట్ చేస్తే వారికే పని అప్పగిస్తారు. కానీ ఓటు విషయంలో అభ్యర్థులందరినుంచీ డబ్బులు తీసుకుంటారు కదా ఓటర్లు?’’ ‘‘నేను ముందే చెప్పాను కదా... ఇదొక ఆర్థిక కార్యెకలాపం అని. ‘ఓట్లు అమ్ముకుంటుంటారూ, అమ్ముకుంటున్నారం’టూ అదేపనిగా ఓటరును బ్లేమింగు చేస్తుంటారుగానీ..వాస్తవానికి ఏ ముగ్గురో, నలుగురో పోటీపడి ఆక్షనింగులో మానుంచి ఎమ్మెల్లే పదవిని కొనుక్కుంటున్నారననే ‘ఓ–కామర్స్’లా దీన్ని మీరెందుకు చూడరు? అరె... మార్కెట్ అన్నాక వొడిదొడుకులుంటాయ్. డిమాండును బట్టి ‘ఎలక్షన్ ఓటు రేటు సూచీ’ విండెక్చు ప్రకారం.. ఒక్కోసారి ఓటు ధర అమాంతం పెరుగుతుంది. ఒక్కోసారి పడిపోతుంది. కొన్నిసార్లు కొందరు ఓడిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేసుకున్న దాఖలాలు లేవా? మిగతా కామర్చు విషయాల్లోలాగే..చెరతులు వర్తిస్తాయనీ లేదా ‘ద వోటు ప్రైసెస్ ఆర్ సజ్జెట్టు టు మార్కెట్ రిచుకు’ అని పేపర్లలో మీరే రాస్తుంటారు కదా. ఇక్కడా అంతే. చేమ్ టు చేమ్. దీనికి మీరెందుకంతగా ఆశ్చర్యపోతుంటారెందుకో నాకర్థం కావడం లేదు’’ ‘‘మీరు పేపర్లు బాగా చదువుతూ, టీవీ ఎక్కువగా చూస్తుంటారు కదా? అందునా బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రాములు’’ ‘‘అవును... మీకెలా తెలుసు?’’ కాస్త సిగ్గు నటిస్తూ, కాంప్లిమెంటులా తీసుకున్నాడా ఎక్్చపర్టు!! -
ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది?
మనదేశంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వచ్చే ఏడాది అంటే 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఓటింగ్ కోసం ఈవీఎంలను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని ఎన్నికల సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేస్తారు. అయితే ఓటింగ్ సమయంలో ఎవరైనా ఈవీఎం బటన్‌ను రెండుసార్లు నొక్కితే ఏమవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఓటింగ్ నిర్వహించి, ఆ తర్వాత డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో వేలాది ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇవి ముందుగానే సిద్ధం చేయనున్నారు. ఎన్నికల తేదీకి ముందు ఈ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చే బాధ్యతను ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఓటరు ఎవరైనా ఈవీఎంలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఒకేసారి అనేక బటన్లను నొక్కితే ఏమవుతుందనే ప్రశ్న మన మదిలో మెదులుతుంటుంది. రెండు వేర్వేరు గుర్తులు ఉన్న బటన్లను నొక్కి. ఆ రెండు పార్టీలకు ఓటు వేయవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది సాధ్యం కాదు. ఒక ఓటు వేసిన తర్వాత ఏ బటన్ నొక్కినా ఆ యంత్రంలో ఎటువంటి స్పందన చోటుచేసుకోదు. ఎన్నికల సంఘం తెలిపిన సమాచారం ప్రకారం అభ్యర్థికి ఓటు వేయడానికి సంబంధిత బటన్‌ను నొక్కిన వెంటనే, ఆ ఓటు నమోదువుతుంది. దీని తర్వాత ఈవీఎం లాక్ అవుతుంది. ఎవరైనా మళ్లీ ఆ బటన్ నొక్కినా ఏమీ జరగదు. ఎవరైనా మరో బటన్ నొక్కినా ఓటు నమోదు కాదు. ఒకరికి ఒక ఓటు అనే ప్రాతిపదికన ఈవీఎంలను తయారు చేశారు. ప్రిసైడింగ్ అధికారి తిరిగి బటన్ ప్రెస్ చేసిన తరువాతనే రెండవ ఓటుకు మార్గం ఏర్పడుతుంది. అంటే ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదు. ఇది కూడా చదవండి: బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం? -
టెకీల కోసం ఓటు బాట
ఐటీ హబ్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కసరత్తు ఐటీ ఉద్యోగులు ఓటు వేసేలా అవగాహన సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు పోలింగ్‌కు దూరంగా ఉంటారనే అపవాదును తొలగించే దిశగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు వారికి చేరువలో బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఓటింగ్ రోజున సెలవు వచ్చిది కదా అని ఎంజాయ్ చేసే టెకీలను పోలింగ్ కేంద్రం వైపు రప్పించేందుకు కార్పొరేట్ సంస్థల సహాయాన్ని కూడా తీసుకుంటోంది. రాజధానిలో ఓటింగ్‌శాతం పెంచేందుకు ఈసీతోపాటు బహుళజాతి సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేలా సంస్థలు ఉద్యోగులను ప్రేరేపిస్తున్నాయి. హైరైజ్ భవనాల్లో పోలింగ్ స్టేషన్లు.. ఎన్నికలపై వర్క్ ఫ్రం హోమ్ ప్రభావం ఆఫీసుల్లో కియోస్క్ లు ఇప్పటికీ పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అవలంబిస్తున్నాయి. ఈ విధానాలు ఐటీ హబ్ నియోజకవర్గాల్లో ఎన్ని కలపై కొంతమేర ప్రభావాన్ని చూపించవచ్చు. ఇంటి నుంచి పనిచేస్తున్న వారు ఓటు హక్కును వినియోగించుకోవడం కష్టమేనని ఓ ఐటీ కంపెనీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై ఉద్యోగులకు సహాయం చేయడానికి త్వరలోనే ప్రత్యేక డ్రైవ్‌లను చేపట్టనున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐటీ కారిడార్‌లోని వివిధ కార్యాలయాల్లో కియోస్‌్కలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీ హబ్‌లో పెరిగిన ఓటర్లు.. ఐటీ కేంద్రాలైన మణికొండ, నానక్‌రాంగూడ, నార్సింగి, ఉప్పల్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాలు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు సంస్థలు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఈ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ విజయతీరాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో టెకీలను పోలింగ్ స్టేషన్లకు రప్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయి. వారిని పోలింగ్ కేంద్రానికి రప్పించేలా ఏర్పాటు చేస్తున్నాయి. ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్ అంటే మినీ ఇండియా. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారిలో చాలామందికి స్వస్థలాల్లోనే ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఉద్యోగులు స్థానికంగా ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలూ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాయి. కనీసం మూడు నెలలపాటు ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కచ్చితంగా ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాయి. ఆ తర్వాత బదిలీపై వెళితే ఓటును సంబంధిత నియోజకవర్గానికి మార్పు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఓటరు కార్డులో చిరునామాలను అప్‌గ్రేడ్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు సాయం అందిస్తున్నాయి. హైరైజ్ భవనాల్లో పోలింగ్ స్టేషన్లు.. ‘లెట్స్ ఓట్’ అనే స్వచ్ఛంద సంస్థ గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాలు, విద్యా సంస్థలతోపాటు ఫేస్బుక్, ఎక్స్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఓటర్ హెల్ప్‌లైన్, సీవిజిల్ వంటి మొబైల్ యాప్‌లపై ప్రచారం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ పెరగకపోయినా.. దీర్ఘకాలంలో ఇది ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఓ ప్రతినిధి చెప్పారు. మరోవైపు, ఎన్నికల సంఘం గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, కమ్యూనిటీ సెంటర్లు, హైరైజ్ భవనాల్లో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అంశంపై కసరత్తు చేస్తోంది. -
హామీలను నెరవేర్చిన.. పార్టీలకే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీలకు, మంచి చేస్తారనే అభ్యర్థులకే ఓటేయాలి. అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అవి అమలయ్యే హామీలా? కాదా? అనేది చూడాలి. అలాగే ఇంతకుముందు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చూడాలి. పార్టీలిచ్చే హామీలు రాష్ట్ర బడ్జెట్‌ను మించిపోతున్నాయి. కొన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉత్తుత్తవిగా ఉంటున్నాయి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) ‘ప్రజల మేనిఫెస్టో–2023’ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా ఉంది. పార్టీలు చట్టాల పరిధిలో లేక తామే ఒక చట్టంగా వ్యవహరిస్తున్నాయి. గెలిచిన పార్టీలు అంతా తమదే అనుకుంటున్నాయి. మార్పు కోసం రాజ్యాంగ సంస్కరణలు రావాలి’ అని చెప్పారు. ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ‘మా ఓటు అమ్మకానికి లేదు. మద్యం, డబ్బు సంచులతో రావద్దు’ అని ఓటర్లు నినదించాలన్నారు. జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీలు రకరకాల తాయిలాలతో విడుదల చేసే మేనిఫెస్టులు చిత్తు కాగితాలతో సమానమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోమా శ్రీనివాస్‌రెడ్డి తదిరులు పాల్గొన్నారు. ఎఫ్‌జీజీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. రాష్ట్ర బడ్జెట్లో విద్య, ఆరోగ్యానికి 25 శాతం నిధులు కేటాయించాలి. సంక్షేమ పథకాలకు బడ్జెట్లో 30 శాతానికి మించకుండా కేటాయించాలి. పెట్రోలు, డీజిల్‌పై ట్యాక్స్ తగ్గించాలి. రైతుబంధు పది ఎకరాల్లోపు రైతులకే ఇవ్వాలి. కౌలు రైతులకూ రైతుబంధు ఇవ్వాలి. పంటల బీమా అమలు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మూడు బోర్ల వరకు పరిమితి విధించాలి. నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక ఉన్నత కమిటీ ఉండాలి. ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అవినీతికి అడ్డుకట్ట వేయాలి. లోకాయుక్త చట్టాన్ని కర్ణాటకలో మాదిరిగా సవరించాలి. కేంద్రంతో రాష్ట్రం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేయాలి. మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. పార్టీలు తమ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలకయ్యే వ్యయం వివరిస్తూ, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో కూడా తెలపాలి. ఆహార కల్తీపై గట్టి నిఘా ఉండాలి. నైపుణ్యం, ఉపాధి పెంచాలి. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ ఆస్తి వివరాలు వెల్లడించాలి. మహిళలకు 25శాతం టికెట్లు కేటాయించాలి. నేర చరిత్రులకు టికెట్ ఇవ్వొద్దు. ప్రభుత్వ భూముల అమ్మకంపై నిషేధం విధించాలి. ధరలపై నియంత్రణ ఉండాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. -
సాయుధ తెలంగాణకు ఓటు ఆయుధమై..
అది 1952 మార్చి 27... కాలినడకన కొందరు, ఎడ్ల బండ్లపై మరికొందరు సుదూరాన ఉన్న పోలింగ్ బూత్‌లకు ఒకరెనక ఒకరు వెళ్లి తమ ఓటుతో తొట్టతొలి ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకున్న రోజు. సుమారు 224 ఏళ్ల అసఫ్‌జాహీల రాచరికం, ఆపై నాలుగేళ్ల సైనిక పాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో ఓటు వేసేందుకు జనం వస్తారో లేదోనన్న అధికారుల అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి ఎన్నికలోనే జనచైతన్యం ఓటెత్తింది. అప్పటివరకు తుపాకుల నీడలో అభద్రత, భయం నీడలో తలదాచుకున్న వారంతా ఊరూరా కదిలి మొత్తంగా 52,02,214 మంది ఓటు వేయడంతో అధికార యంత్రాంగం సంబురపడింది. నాటి ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మాపూర్‌కు చెందిన జరుపాటి రాములమ్మ (110) తొలి ఓటు వేసి తమకు స్వాతంత్య్రం రావడం నిజమేనని నమ్మినట్టు పేర్కొంది. మిశ్రమ ఫలితాలు... నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థులు విజయం సాధించగా సత్యాగ్రహ పోరాటాలు జరిగిన హైదరాబాద్, ఔరంగాబాద్, గుల్బర్గా డివిజన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తంగా తెలుగు ప్రజలు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు, పీడీఎఫ్ 35 స్థానాల్లో, సోషలిçస్టు పార్టీ 11 చోట్ల, మరో 10 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. బీఆర్ అంబేడ్కర్ ఆధ్వరంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) 5 చోట్ల గెలవగా అందులో తెలంగాణలోని ద్విసభ నియోజకవర్గాలైన జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్ స్థానాలను కైవసం చేసుకుంది. అంటే మొత్తంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోని ఓటర్లు 66 స్థానాల్లో కాంగ్రేసేతర అభ్యర్థులను గెలిపించారు. అప్పటి ఓటు.. ఇంకా గుర్తుంది నాకు ఓటు వచ్చే సరికి 40 ఏళ్లు . ఇప్పుడు 110 ఏళ్ల వరకు ఉంటాయనుకుంటా. అప్పుడు ఎండాకాలం. ఊరోళ్లమంతా నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసినం. ఇంకా నాకు గుర్తుంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు తప్పకుండా వేస్తున్న. – జరుపాటి రాములమ్మ, లక్ష్మాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా తొలి సభలో అత్యధికం విద్యావంతులే.. హైదరాబాద్ తొలి శాసనసభకు ఉన్నత విద్యావంతులే అత్యధికంగా ఎన్నికైయ్యారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన మాసూమాబేగం శాలీబండ స్థానం నుంచి ప్రముఖ కవి ముగ్ధూం మోహియొద్దీన్‌ను ఓడించారు. 1927లో ఉస్మానియాలో గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ జీఎస్ మెల్కొటే ముషీరాబాద్ నుంచి విజయం సాధించారు. చాదర్‌ఘాట్ నుంచి జస్టిస్ గోపాలరావు ఎక్బోటే, సోమాజిగూడ నుంచి మెహిది నవాజ్ జంగ్, వనపర్తి నుంచి సురవరం ప్రతాపరెడ్డి, షాద్‌నగర్ నుంచి బూర్గుల రామకృష్ణారావు, వికారాబాద్ నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, బేగంబజార్ నుంచి కాశీనాథ్ వైద్య గెలుపొందారు. ఓటు వేయకపోవడం చనిపోవడంతో సమానం.. నాకిప్పుడు 103 ఏళ్లు. తొలి ఎన్నికలప్పుడు మా ఊర్లో డప్పు చాటింపు వేసి ఓటు వేసేందుకు పిలుచుకొనిపోయిండ్రు. అప్పటి నుంచి ఓటు తప్పకుండా వేస్తున్న. ఓటు వేయకపోతే చనిపోవడంతో సమానమని నమ్ముత. వచ్చే ఎన్నికల్లోనూ ఓటు వేస్త. – మల్తుం బాలవ్వ, చిట్యాల, కామారెడ్డి అజ్ఞాతం నుంచి చట్ట సభకు.. తొలుత నిజాం, ఆపై భారత సైన్యంపై తుపాకులు ఎక్కుపెట్టిన కమ్యూనిస్టు పార్టీల నాయకులు అనేక మంది అజ్ఞాతం వీడిన అనంతరం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి జైలు నుంచే నామినేషన్ వేసి స్వయానా తన బావమరిది భూదాన్ రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. గత 70 ఏళ్లలో ఓటు తప్పలేదు.. నాకిప్పుడు 98 ఏళ్లు. రజాకార్ల బాధలు ప్రత్యక్షంగా చూసినం. వారిపై తిరగబడినం. స్వతంత్రం వచ్చినంక తొలి ఎన్నికలో ఓటు వేసేందుకు ఎడ్లబండిలో పోయినం. 1952 ఎన్నికల నుంచి ప్రతిసారీ ఓటు వేస్తూనే ఉన్న... – చల్లారం మధురవ్వ, తిమ్మాయపల్లి, సిద్దిపేట - శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
ఓటేయకుంటే బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.350 కట్! నిజమేనా?
ఎన్నికల్లో ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 పెనాల్టీ కింద భారత ఎన్నికల సంఘం (ECI) కట్ చేస్తుందంటూ ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి హిందీ వార్తపత్రికలో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఓటు వేయడాన్ని విస్మరించినవారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్ అవుతుందని, సదురు వ్యక్తికి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి ఆ మొత్తం కట్ చేస్తారని ఆ న్యూస్ క్లిప్పింగ్‌లో ఉంది. దీన్ని కొంత మంది విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓటు వేయకపోతే డబ్బులు కట్ అవుతాయంటూ హెచ్చరిస్తున్నారు. (అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!) దీనిపై ప్రభుత్వ వార్తాసంస్థ పీఐబీకి చెందిన ఫ్యాక్ట్‌చెక్ (pib fact check) విభాగం స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ (fake news) అని తేల్చింది. గతంలోనే సర్కులేట్ అయిన ఈ ఫేక్ న్యూస్ మరోసారి ప్రచారంలోకి వచ్చిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్’(ట్విటర్) ద్వారా పేర్కొంది. కాగా ఈ వార్త ఓ హిందీ వార్తాపత్రికలో 2019లో ప్రచురితమైంది. హోలీ ప్రాంక్‌గా దీన్ని ప్రచురించారు. అయితే ఇది అప్పటి నుంచి అసలైన వార్తగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ 2021లోనే క్లారిటీ ఇచ్చింది. क्या लोकसभा चुनाव में मतदान नहीं किए जाने पर बैंक अकाउंट से कटेंगे 350 रुपए❓ जानें वायरल ख़बर की सच्चाई❕#PIBFactCheck: 🔶 यह ख़बर #फ़र्ज़ी है। 🔶 @ECISVEEP ने ऐसा कोई निर्णय नहीं लिया है। 🔶 जिम्मेदार नागरिक बनें, मतदान अवश्य करें!! 🔗 https://t.co/8EwXdkIPlF pic.twitter.com/ikFLUndfCh — PIB Fact Check (@PIBFactCheck) September 15, 2023 -
Voter Card : పట్టా రమణ వయసు 223 ఏళ్లు..!
అనకాపల్లి: భారత ఎన్నికల కమిషన్ జారీ చేస్తున్న కొన్ని ఓటరు గుర్తింపు కార్డులు తప్పుల తడకలుగా దర్శనమిస్తున్నాయి. అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన పట్టా రమణ పేరుతో జారీ అయిన కార్డులో ఆయన పుట్టిన తేదీ 01.01.1800 గా కార్డులో నమోదైంది. అంటే ఆయన వయసు ప్రస్తుతం 223 ఏళ్లు. ఇలాంటి తప్పులు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. కార్డు జారీ చేసే సమయంలో కనీస పర్యవేక్షణ లోపించడంతో ఇలాంటి తప్పులు దర్శనమిస్తున్నాయని ఓటర్లు వాపోతున్నారు. ఈ పాపం బాబు హయాంలో జరిగిందేనని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఓటర్ల జాబితాను తప్పుల తడక చేయడంలో చంద్రబాబు, తెలుగుదేశం నేతల పాత్ర ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల ఎన్నికల సంఘానికి కలిసి వైఎస్సార్సిపి బృందం ఫిర్యాదు చేసింది. విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ముఖ్య అంశాలు ఇవి. దొంగ ఓట్ల నమోదు బాబు హయాంలో విచ్చలవిడిగా జరిగింది నాడు సేవా మిత్ర నేడు మై టీడీపీ యాప్‌లతో చంద్రబాబు మాల్‌ప్రాక్టీస్ చేస్తున్నారు ఓటరు కులమేంటని అడుగుతున్నారు ఓటరు ప్రొఫైల్ సర్వే పేరిట అభ్యంతరకర ప్రశ్నలు అడుగుతున్నారు ఆధారాలు, పట్టికల రూపంలో ఫిర్యాదు చేస్తున్నారం ఒక్కరికి ఒక్క ఓటు ఉండాలన్నదే మా సిద్ధాంతం అదే విధానంతో పారదర్శక ఓటర్ల జాబితా కోరుతున్నాం ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం చేయాలి ఈ తప్పులపై ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఆధార్‌తో అనుసంధానం చేయగలిగితే.. 99% తప్పులు పరిహరిస్తాయని భావిస్తోంది. ఇదే జరిగితే.. ఓటర్ల జాబితా పక్కాగా ఉండడంతో పాటు.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా ఉంటుంది చదవండి: బాబు ఫిర్యాదే ఓ బోగస్ -
ఓటు మన బాధ్యత
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓటు’. ఫ్లిక్ నైన్ స్టూడియోస్‌పై ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని నటుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేసి, సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. ‘‘మన దేశంలో కుల, మత, ప్రాంతీయ అభిప్రాయ బేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. ‘‘మందుకు, నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా?’, ‘ఓటు అనేది హక్కు కాదు.. మన బాధ్యత’’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. హృతిక్ శౌర్య మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్‌తో పాటు చాలా ముఖ్యమైన కథతో ‘ఓటు’ రూపొందింది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తన్వి నేగి. నటుడు గోపరాజు రమణ మాట్లా్లడారు. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: ఎస్. రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ. -
మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందా? ఒకసారి పరిశీలించుకోండి. ఓటు లేకపోతే తక్షణం నమోదు చేయించుకోండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా రూపకల్పనకు శుక్రవారం శ్రీకారం చుడుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 21 వరకు అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారు. ఓటర్ల జాబితాను పరిశీలించి సవరణలు చేస్తారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని బీఎల్వోలతో కలిసి ఓటర్ల పరిశీలనలో పాల్గొంటాయి. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు 22 నుంచి రాజకీయ పార్టీల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేస్తారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 30కి పూర్తి చేసి అక్టోబరు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. శనివారం, ఆదివారం అయిన అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. డిసెంబరు 26 కల్లా క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 5న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వీటి నమోదుపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర జనాభా ప్రకారం 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు కనీసం 12 లక్షలు ఉండాలి. కానీ 3.50 లక్షల ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. 2024 జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో వీరి నమోదుపైనా దృష్టి సారిస్తున్నారు. వీరు ఫారం 6ను వినియోగించి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. చనిపోయిన వారు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ఫారం 7ను వినియోగించుకోవాలి. చిరునామా, నియోజకవర్గం మార్చుకోవడానికి ఫారం 8 ఇవ్వాలి. ప్రవాసాంధ్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫారం 6 ఏను ఇవ్వాలి. పరిశీలనకు తీసుకొనే అంశాలు ♦ ఓటరు జాబితాలో ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉంటే వారి అభీష్టం మేరకు ఒక చోట ఉంచి మిగిలిన ఓట్లను తొలగిస్తారు. ♦ నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తిస్తారు. ♦ డోర్ నంబర్లు లేకుండా ఉన్నా, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లను పరిశీలిస్తారు. ♦ ఇంటి నంబరు లేనివి, ఒకే ఇంటి నంబరు, వీధి పేరుపై వందలాది ఓట్లు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తారు. ♦ దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఒక్క ప్రాంతంలోనే ఉంచుతారు ♦ ఒక బూత్‌లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ సిఫారసు చేస్తారు. దొంగ ఓట్ల దొంగ బాబే! 2019 ఎన్నికల్లో గెలవడానికి అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఇవ్వని హామీలేదు. అయినా నమ్మకం కుదరక ఇష్టానుసారంగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఒకే ఇంట్లో 40–50 మొదలు.. ఏకంగా 600–700 ఓట్ల వరకు గంపగుత్తగా ఓట్లు ఉన్నట్లు సృష్టించారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం ముందు తట్టుకోలేక తల వంచారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నాటి లీలలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే ఉలిక్కిపడుతున్నారు. గంపగుత్తగా ఉన్న దొంగ ఓట్లను ప్రభుత్వం గుర్తించి తొలగిస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు. విచారించగా ఆ దొంగ ఓట్లన్నీ నాటి బాబు పాలనలో రికార్డుల్లోకి ఎక్కినవేనని స్పష్టమవుతోంది. ఇలాగైతే ప్రజల్లో ఇంకా చులకనవుతానని భావించి ఎల్లో మీడియాను రంగంలోకి దింపారు. తను చేసిన తప్పును ప్రస్తుత ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై వేసి.. తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. రోజుకో రీతిన తప్పుడు కథనాలు వండి వార్చుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజకీయంగా లబ్ధి పొందాలని వ్యూహం పన్నారు. ఇది కూడా బెడిసి కొడుతోంది. బాబు తీరు చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుంది. -
ఓటు హక్కును వినియోగించుకున్న హెచ్ డీ కుమార స్వామి
-
కర్ణాటక ఎన్నికలు.. ఓటేసిన రాజకీయ, సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
ప్రధాని డిగ్రీని చూసే ప్రజలు ఓటేశారా?
నరేంద్ర మోదీ విద్యార్హతల విషయం పెద్ద దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అజిత్ పవార్ మంత్రుల పట్టాల గురించి ప్రశ్నించడం సరికాదన్నారు. ఒక నాయకుడు తన హయాంలో ఏం సాధించారనే దానిపై ప్రజలు దృష్టిసారించాలని గానీ ఇలాంటివి కావని మండిపడ్డారు. ఈ మేరకు పవార్ బహిరంగ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత గురించి మాట్లాడుతూ..2014లో ప్రజలు ప్రధాని మోదీ డిగ్రీ చూసే ఓట్లు వేశారా అని నిలదీశారు. అందుకు ఆయన సృష్టించిన చరిష్మానే దోహదపడింది. అదే ఆయన్ను ఎన్నకల్లో గెలిచేలే చేసింది. తొమ్మిదేళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాంటి వ్యక్తి డిగ్రీ గురించి అడగడం అంత సరైంది కాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై అతనని ప్రశ్నించాలి గానీ మంత్రి డిగ్రీ ముఖ్యమైన అంశం కాదు. ఒకవేళ ఆయన డిగ్రీపై క్లారిటీ వస్తే గనుక ద్రవ్యోల్బణం తగ్గుతుందా? లేక అతన డిగ్రీ పరిస్థితులను చూసి ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు. అయినా ఈ విషయం కోర్టు వరకు వెళ్లడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని పవార్ అన్నారు. కాగా, గత వారమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన మోదీ డిగ్రీ గురించి ప్రజలకు తెలియాలంటూ కేంద్ర సమాచార కమిషన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందిదే. అయితే గుజరాత్ హైకోర్టు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టి మరీ ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్లను అందించాల్సిన అవసరం లేదని తీర్పు ఇస్తూ..అరవింద్ కేజ్రీవాలాకు జరిమానా విధించింది. (చదవండి: గుండెపోటులకు కరోనానే కారణమా! ఆరోగ్యమంత్రి ఏం చెప్పారంటే..) -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఓటీపీ రాకుంటే.. ఓటు వేసే ప్రసక్తే లేదు!
యశవంతపుర(బెంగళూరు): ఇప్పుడు అందరూ ఆన్లైన్లో లావాదేవీలు చేయడం పరిపాటైంది. లావాదేవీల్లో ఓటీపీని ఎంటర్ చేశాకే పూర్తవుతుంది. కానీ తాము మొబైల్ టవర్లు– ఇంటర్నెట్ లేని కారణంగా ఓటీపీ వసతిని పొందలేకున్నామని చిక్కమగళూరు జిల్లా కళస తాలూకా బలిగె, మెణసిన హడ్య గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున ఓటుకు ముడిపెట్టారు. హామీలపై నమ్మకం లేదు నాయకులపై నమ్మకం వద్దు, వారిచ్చే హామీలు మాకొద్దు, మా గ్రామంలో మొబైల్ టవర్ కావాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఓటీపీ లేకుంటే– ఓటు లేదనే నినాదంతో ఆందోళన మొదలుపెట్టారు. ఈ నినాదంతో అంతటా బ్రోచర్లను అంటించడం ఆరంభమైంది. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన పోలీసులు బలిగె, మెణసినహడ్య గ్రామాలకు మొబైల్ టవర్‌ను వేయలేదు. నెట్ లేకుంటే ఎలా టవర్లు వేయకుంటే, వచ్చే విధానసభ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. 70 కుటుంబాలున్న గ్రామంలో 10 ఏళ్ల నుంచి మొబైల్ నెట్వర్క్ లేదు, ఫలితంగా ఇంటర్నెట్ కూడా అందని పండే అయ్యింది. ఈ డిజిటల్ యుగంలో ప్రభుత్వం సౌకర్యాలు కావాలన్నా మొబైల్, ఇంటర్నెట్ చాలా ముఖ్యమయ్యాయని గ్రామస్థులు తెలిపారు. కాగా, ఓటీపీ లేకుంటే ఓటు లేదనే అభియానతో ప్రజాప్రతినిధులలో చలనం కనపడుతోంది. ఆందోళనలను విరమించాలని గ్రామాల పెద్దలకు రాయబారాలు పంపారు. ఈ అభియాన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లు గ్రామస్థులకు మద్దతుగా సందేశాలు పెడుతున్నారు. చదవండి విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే? -
ఓటుకు కోట్లు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి
-
ఒవైసీకి రెండు ఓట్లు.. కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించిన ఓటరు జాబితాలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీకి రెండు వేర్వేరు చిరునామాలతో రెండు చోట్ల ఓట్లున్నట్టు తేలింది. సాధారణ పౌరులకు ఇలా ఉన్నట్టు అడపాదడపా వినడం సాధారణమే అయినా.. ఒక ఎంపీకి నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల ఓటర్ల జాబితా లో పేరుండటం చర్చనీయాంశమైంది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు గుర్తింపు కార్డు నంబర్ (ఎపిక్ నంబర్) టీడీజడ్1557521తో హైదర్‌గూడ ఉర్దూ హాల్ లేన్ చిరునామాతో మదీనా హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఒక ఓటుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎపిక్ నంబర్ కేజీవై0601229తో మైలార్‌దేవ్‌పల్లిలో సెయింట్ ఫియాజ్ స్కూల్ పోలింగ్స్టేషన్లో మరో ఓటుంది. ఎన్నికల సంఘానికి టీపీసీసీ ఫిర్యాదు ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ముమ్మాటికీ నిబంధనలకు విరుద్ధమేనని వాదిస్తోంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి రెండు చోట్ల ఓటు హక్కు ఉండటంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
న్యూజీలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు.. మన దగ్గర కూడా అమలయితే బావుండు!
మన దగ్గర కూడా అమలయితే బావుండు.. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ ఇచ్చి ఈజీగా ఓట్లు కొనవచ్చు! -
యూఎన్‌లో చైనాకు వ్యతిరేకంగా ఓటుకు దూరం...వివరణ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఉయ్ఘర్ ముస్లింలపై చైనా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించగా భారత్ గైర్హాజరైంది. ఐతే భారత్ తానెందుకు దూరంగా ఉందో వివరణ ఇచ్చింది. ఈ ఓటింగ్ అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు ఎప్పటికి సహాయకారి కాదని స్పష్టం చేసింది. అలాగే జిన్జియాంగ్లోని ప్రజల మానవ హక్కులను గౌరవించాలని నొక్కి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ మత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....అన్ని మానవహక్కులను సమర్థించేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఓటు అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు సహాయకారి కాదని , భారత్ కేవలం దీర్ఘకాలికి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహిరిస్తుంది. భారత్ ఎప్పుడు ఇలాంటి విషయాల్లో సంభాషిచేందుకు ఇష్టపడుతుంది. అంతేకాదు జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో మానవ హక్కుల ఆందోళనలను అంచనా వేయగలం. ప్రజల మానవ హక్కులు గౌరవింపబడటమే కాకుండా హామీ ఇవ్వాలి. సంబంధిత పక్షం దీన్ని పరిష్కరిస్తారని భావిస్తున్నాం. అని అన్నారు. అలాగే భారత్‌లా చైనాకు వ్యతిరేకంగా ఓటింగ్‌కు దూరంగా 11 దేశాలు ఉన్నాయి. ఈ మేరకు యూఎన్హెచ్ఆర్సీలో తీర్మానానికి అనుకూలంగా 17 మంది సభ్యులు ఓటు వేయగా చైనా, పాకిస్తాన్, నేపాల్‌తో సహ 19 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఐతే భారత్, బ్రెజిల్, మెక్సికో, ఉక్రెయిన్‌తో 11 దేశాలు గైర్హాజరయ్యారు. (చదవండి: యూకే మంత్రి వీసా వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్) -
కాంగ్రెస్‌కు షాకిచ్చిన సీతక్క
-
ఓటుహక్కు వినియోగించుకున్న ప్రధానమంత్రి మోదీ
-
ఓటేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి
-
రష్యా ఓటింగ్ నిర్వహించనుందా? అప్పుడూ అలానే ఉక్రెయిన్ నుంచి వాటిని లాక్కొంది!
May Vote On Joining Russia: రష్యా గత నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అంతేగాక రష్యా ఇటీవలే తన తొలి సైనిక చర్య పూర్తయిందని ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో రిపబ్లిక్ భూభాగంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగవచ్చు అని ఉక్రెయిన్‌లోని లుగాన్స్క్ వేర్పాటువాద ప్రాంత అధిపతి లియోనిడ్ పసెచ్నిక్ పేర్కొన్నారు. అంతేకాదు రష్యా ఈ సమయంలో ప్రజలు రష్యన్ ఫెడరేషన్లో చేరడంపై అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విషయమై రష్యా చట్ట సభ సభ్యుడు లియోనిడ్ కలాష్నికోవ్ మాత్రం ఇప్పుడూ అలా చేసేందుకు సరైన సమయం కాదన్నారు. అయితే ఉక్రెయిన్‌కి తూర్పున ఉన్న స్వయం ప్రకటిత డోనెట్స్క్ లుగాన్స్క్ రిపబ్లిక్లకు రక్షణగా వ్యవహరిస్తోందని రష్యా పేర్కొంది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని రష్యా ఎగువ సభలోని రాజ్యాంగ శాసన కమిటీ అధిపతి ఆండ్రీ క్లిషాస్ అన్నారు. ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాన్ని రష్యా గుర్తించినట్లు ప్రకటించింది కూడా. ఈ ప్రాంతాల అధికారులు తమ రాజ్యాంగాలకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు వారిక ఉందని స్పష్టం చేసింది. రష్యన్ మాట్లాడే ప్రాంతాలు 2014లో 14 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి కైవ్ నియంత్రణ నుంచి వైదొలగాయి. ఫిబ్రవరి 2014లో కైవ్‌లో జరిగిన ప్రజా తిరుగుబాటులో మాస్కో అనుకూల నాయకుడిని తొలగించి, రష్యాలో భాగమవడంపై దక్షిణ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే రష్యా క్రిమియాను ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకుంది. కాబట్టి మళ్లీ ఇప్పుడూ కూడా రష్యా అలానే చేస్తుందేమోనని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రష్యా పై నోరు పారేసుకోవడమే తప్ప ఉక్రెయిన్‌కి చేసిందేమీ లేదు! ఉక్రెయిన్ ఎంపీ) -
అంతర్జాతీయ కోర్టులో సీన్ రివర్స్ ... ఊహించని షాక్‌లో రష్యా
Indian Judge Votes Against Russia: ఉక్రెయిన్ పై దాడిని నిలిపివేయాలని బుధవారం అంతర్జాతీయ ఉన్నత న్యాయస్థానం(ఐసీజే) రష్యాని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయస్థానం మాస్కో బలప్రయోగం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ భూభాగంలో ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం పెండింగ్‌లో ఉందని ప్రిసైడింగ్ జడ్జి జోన్ డోనోఘ్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలిపారు. అయితే ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కైవ్ అంతర్జాతీయ న్యాయంస్థానంలో ఫిర్యాదు చేసింది. అయితే మాస్కో ఐసీజేకి అధికార పరిధి లేదంటూ వాదిస్తూ ఉంది. కానీ ఐసీజే ఈ కేసులో అధికార పరిధిని కలిగి ఉందని తీర్పునివ్వడమే గాక ఉక్రెనియన్ భూభాగంలో మారణహోమం జరిగినట్లు రష్యన్ ఫెడరేషన్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు కూడా తమ వద్ద లేవని గట్టి కౌంటరిచ్చింది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న శరణార్థుల సంఖ్య మూడు మిలియన్లకు చేరుకోవడం తోపాటు కైవ్‌లోని నివాస భవనాలపై రష్యా దళాలు దాడులను పెంచడంతో బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. యూటర్న్ తీసుకున్న భారత న్యాయమూర్తి అయితే భారత్ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పుడు తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన ఉక్రెయిన్ రష్యా వ్యవహారంలో కూడా అలానే ఉండాలనుకుంది. అంతేకాదు తటస్థంగా ఉన్నమంటూ రష్యాకు సహకరిస్తున్న భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము నామినేట్ చేసిన భారత జడ్జీ ఊహించని షాక్ ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ జరిగిన ఐరాస భద్రతా మండలి, సాధారణ సమావేశాల్లో భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండించమే కాక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిందే తప్ప ఓటింగ్‌కి మాత్రం దూరంగానే ఉండిపోయింది. అయితే హేగేలోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్ తన తటస్థ వైఖరికి భిన్నంగా ఓటు వేసింది. ఈ మేరకు ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. జస్టిస్ భండారీ పూర్తిగా ప్రభుత్వం, వివిధ మిషన్ల మద్దతుతో ఐసీజేకికి నామినేట్ అయ్యారు. జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పైగా ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా ఇవన్నీ స్వతంత్ర చర్య అయినప్పటికీ, వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం వైఖరికి భిన్నంగా ఉందని స్పష్టమైపోయింది. దీంతో ఇప్పటివరకు తటస్థ రాగం ఆలపించిన భారత్‌కు భారీ షాక్ తగిలింది. (చదవండి: రష్యా పైశాచికత్వం...చిన్నారులని కూడా చూడకుండా బాంబుల దాడి) -
‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కావాలి
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్‌లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఆవశ్యకతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి లేవనెత్తారు. వన్ నేషన్–వన్ –ఎలక్షన్ –వన్ ఓటరు లిస్ట్ ఉండాలని, లేదంటే ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలకి ఆటంకం ఏర్పడుతోందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగానున్న బీజేపీ కార్యకర్తలతో ఆన్లైన్లో ప్రధాని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాధికులు, సంపన్నులు ఓటు వెయ్యకపోవడం పట్ల మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కలిగిన మన దేశంలో ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. 1951–52లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 45% పోలింగ్ జరిగితే 2019 నాటికి 67శాతానికి పెరిగిందన్నారు. మహిళా ఓటర్లు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం హర్షణీయమని, కానీ ఇంత తక్కువ ఓటింగ్ జరగడానికి గల కారణాలేంటో రాజకీయ పార్టీలన్నీ ఆలోచించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికల గురించి సోషల్ మీడియాలో సుదీర్ఘ చర్చలు చేస్తారు కానీ , పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం లేదన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా క్షేత్రస్థాయిలో బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు (పన్నా ప్రముఖ్స్) కనీసం 75% పోలింగ్ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. ఓట్ల శాతం పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యల్ని ప్రధాని అభినందించారు. 75% ఓటింగ్ జరిగేలా చూడాలి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 75శాతానికి పెరిగేలా చర్యలు చేపట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తాను హాజరు కావాల్సిన ఒక కార్యక్రమానికి సందేశాన్ని పంపారు. కోవిడ్–19తో బాధపడుతూ హోం క్వారంటైన్లో ఉన్న ఆయన తన సందేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో 75% ఓటింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు అంటే హక్కు కాదని, తమ బాధ్యతని భావించిన రోజు దేశంలో ఓటింగ్ శాతం పెరుగుతుందని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఓటింగ్ తప్పనిసరి చేయాలి.. దేశంలో ఓటు వెయ్యడాన్ని తప్పనిసరి చేయా లని 86 శాతం మంది ముక్తకంఠంతో కోరారని ఒక సర్వేలో వెల్లడైంది. పబ్లిక్ యాప్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ జాతీయ ఓటరు దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటింగ్‌పై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నాలుగు లక్షల మందికిపైగా పాల్గొన్నారు. వారిలో 86 శాతం మందికి పైగా ఓటింగ్‌ను తప్పనిసరి చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 80శాతం మందికిపైగా చెప్పారు. దేశంలో తక్కువగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్‌ని తప్పనిసరి చేయాలా అని అడిగిన ప్రశ్నకు 86శాతం మందికి పైగా చేసి తీరాలని అన్నారు. -
ఎన్నారైలకు ఓటు హక్కు.. పంజాబ్ ఎన్నికల వేళ తెరపైకి కొత్త నినాదం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకోవడంతో రాజకీయ పార్టీలు ప్రతీ అంశంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, ఇక్కడున్న వారి కుటుంబ సభ్యుల మద్దతు పొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నారై సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తున్నాయి. ఎన్నారై విజన్ పేరిట ఇండియా నుంచి విదేశాలకు వలసలు ఎక్కువగా కొనసాగిన రాష్ట్రాల్లో పంజాబ్, కేరళాలు ముందు వరుసలో ఉంటాయి. పంజాబ్ రాష్టం నుంచి అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో పంజాబీలు ఉపాధి కోసం వలస వెళ్లారు. తర్వాత అక్కడ వ్యాపార రంగాల్లో కూడా రాణించారు. ముఖ్యంగా కెనడా, యుకే, గల్ఫ్ దేశాలలో పంజాబీలు స్థానికంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నారను. ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగించిన ఆందోళనకు మద్దతుగా విదేశాల్లో పలు కార్యక్రమాలు చేపట్టడం, ఆర్థిక అండదండలు అందించడంలో ఎన్నారై పంజాబీలు కీలకంగా వ్యవహారించారు. ఈ ఎన్నికల్లో ప్రవాస పంజాబీలు, వారి కుటుంబ సభ్యుల, బంధువుల ఓట్లు కీలకం కావడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నారై పాలసీని ప్రకటించింది. ప్రవాస పంజాబీలు స్థానికంగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నారైల సమస్యలు పరిష్కరించేందుకు సింగిల్ విండో ఏర్పాటు చేస్తామని కూడా తెలిపింది. అంతేకాదు ప్రవాస పంజాబీలను ఆకర్షించడం ద్వారా టూరిజం సెక్టార్‌ను డెవలప్‌చేస్తామని కూడా తెలిపింది. ఎన్నారై ఓటుహక్కు ఇండియాలో పారిశ్రామికంగా సహాకారం అందించే విషయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న పాలసీల పట్ల ఎన్నారైలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. దీంతో పాటు చిరకాలంగా ఉన్న ఎన్నారైలకు ఓటు హక్కు డిమాండ్‌పై సానుకూలంగా స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కొన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రవాసంలో ఉన్న వారికి కూడా ఓటు హక్కును కల్పించాయి. మన దేశంలో ఇంకా ఈ సౌకర్యం లేదు. ఈ అంశంపై ఇప్పటికే పార్లమెంటు సభ్యుడు, అంతర్జాతీయ వ్యవహరాల్లో నిపుణుడైన శశిథరూర్ ఆన్లైన్ వేదికగా అనేక డిబెట్లు నిర్వహిస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ దగ్గర పడే సమయానికి ఎన్నారై ఓటింగ్ అంశం మరోసారి బలంగా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయంలో రాజ్యంగ పరంగా, దేశభద్రత పరంగా అనేక చిక్కుముళ్లు ఉన్నాయని మరికొందరి వాదన. ఎన్నారై సంక్షేమంలో పంజాబ్ భేష్ - మంద భీమ్‌రెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు) వివిధ దేశాల్లో ఉన్న పంజాబీల కోసం ... ఎన్నారై డిపార్టుమెంటు పేరిట ఒక శాఖను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దీనికి అనుబంధంగా ఒక మంత్రి ఉంటారు. ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పంజాబ్ ఎన్నారై కమీషన్ కూడా ఉంది. ఎన్నారైల కష్టసుఖాలను వినిపించేందుకు ఎన్నారై సభ పేరిట ఒక సొసైటీ కూడా పంజాబ్‌లో ఉంది. ఐజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఒక ఎస్పీ స్థాయి అధికారి పలువురు ఇతర అధికారులతో పంజాబ్ పోలీస్ ఎన్నారై వింగ్ పనిచేస్తున్నది. ఆరు ఎన్నారై పోలీసు స్టేషన్లు ఉన్నాయి. విదేశీ జైళ్లలో మగ్గుతున్నవారికి న్యాయ సహాయం చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నారై పెళ్లిళ్ల సమస్యలు పరిష్కరించడం తదితర కార్యక్రమాలను ఈ విభాగం చూస్తుంది. ఏజెంట్లను నియంత్రించడానికి పంజాబ్ ట్రావెల్ ప్రొఫెషనల్స్ రెగులేషన్ యాక్టు-2013ను ప్రవేశపెట్టారు. వివిధ దేశాలలో పంజాబ్ ప్రభుత్వం ఎన్నారై కోఆర్డినేటర్లను నియమించింది. -
అక్కడ ‘ఓటు’ ప్రలోభాలపర్వం రూ. లక్షకు..!
సాక్షి, బెంగళూరు: స్థానిక సంస్థల కోటాలో 25 సీట్లకు ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు పడ్డారు. మందు, విందు, చిందులతో తమవైపు తిప్పుకోవడానికి శ్రమిస్తున్నారు. అనేకమంది అభ్యర్థులు టీపీ, జీపీ సభ్యులైన ఓటర్లకు తోటల్లో ఘుమఘమలాడే వంటకాలతో విందు వినోదాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వారు కాదు. కాబట్టి వారిపై పార్టీ పర్యవేక్షణ ఉండదు. కొందరు సభ్యులు అన్నిపార్టీల విందులకూ హాజరై మజా చేయడం జరుగుతోంది. అందుకే అభ్యర్థులు విందు, డబ్బులు ఇవ్వడమే కాకుండా తమకే ఓటు వేయాలంటూ ఒట్టు పెట్టించుకుంటున్నారు. ఓటుకు రూ.25 వేల ముడుపు ధనవంతులైన అభ్యర్థులు రిసార్టులు, హోంస్టేలు, తోటల్లో గత నాలుగైదు రోజులుగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తటస్థంగా ఉండే కొందరికి ఏదో రకంగా ప్రలోభానికి గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల మధ్య ఉన్న ప్రలోభాలపర్వం ఇప్పుడు రూ. లక్షకు చేరుకుంది. ఒక్కో నియోజకవర్గంలో ఓటుకు రూ. 25 వేలు డబ్బులు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఖర్చు పెరిగిపోతోందని అభ్యర్థులు లోలోపల మథనపడుతున్నట్లు సమాచారం. -
మీకు తెలుసా.. ఓట్లు ఎన్నిరకాలుగా వేయవచ్చో..?
సాక్షి, కరీంనగర్: ఓటర్లు నేరుగా ఎన్నికల కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం పరిపాటే. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటును పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడమే కాకుండా... ఐదు రకాలుగా అవకాశాలు కల్పించింది. అంటే... ఒక్కఓటు.. ఐదు రకాలన్న మాట. సాధారణ ఓటు... 18 ఏళ్లు నిండిన పౌరులు దేశంలో ఓటు హక్కును కలిగి ఉంటారు. వీరు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేస్తారు. దీనిని సాధారణ ఓటుగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలోనే అత్యధిక శాతం పోలింగ్ జరుగుతుంది. టెండర్ ఓటు... ఓటరు జాబితాలో పేరుండి పోలింగ్ కేంద్రం వద్దకు పోయేసరికి తమ ఓటును ఇంకొకరు వేశారనుకోండి... ఆ తర్వాత అసలైన ఓటరు వస్తే.. టెండరు ఓటు వేసే అవకాశం ఉంది. దీనిని టెండరు ఓటు అంటారు. చదవండి: (Huzurabad Bypoll: వారిని ఖుషీ చేసేందుకు కోళ్లు, పొట్టేళ్లు డోర్ డెలివరీ) సర్వీస్ ఓటు... సరిహద్దుల్లో సైనికులు, పారా మిలటరీ దళాల ఉద్యోగులు ఈ విధానంలో ఓట్లు వేస్తారు. వీరంతా స్వగ్రామాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఎన్నికల సంఘం వీరికి సర్వీస్ ఓటు వేసే అవకాశం కల్పించింది. ప్రాక్సీ ఓటు... తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయించే ప్రక్రియను ప్రాక్సీ ఓటు అంటారు. దీనిని ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఇటువంటి విధానాన్ని వినియోగించుకుంటారు. ఇటువంటి ఓట్లు తక్కువగా కనిపిస్తుంటాయి. పోస్టల్ బ్యాలెట్.... ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే వీలుండదు.దీంతో వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టు ద్వారా తాము వేయదలుచుకున్న అభ్యర్థికి ఎన్నికల సిబ్బంది ఓటు వేసుకుంటారు. కాబట్టి ఈ పద్దతిలో ఓటు వినియోగించుకోవడాన్ని పోస్టల్ బ్యాలెట్ అంటారు. -
అయ్యయ్యో.. వద్దమ్మా! డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ
‘అయ్యయ్యో, వద్దమ్మా.. ఈ మధ్యనే ఓటు అర్హత వచ్చింది.. తొలిసారి ఓటు హక్కు వినియోగిస్తున్నా..డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ’ ఇదీ తొలిసారి టుహక్కు వచ్చిన యువత మనోగతం సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్: ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన శక్తిమంతమైన ఆయుధం ఓటు హక్కు. పరిపాలకులను ఎంచుకునే అరుదైన అవకాశం అరుదుగా వస్తుంటుంది. అలాంటి వజ్రాయుధమైన ఓటును యువతకు బీరు, బిర్యానీ, క్రికెట్ కిట్లు, సెల్ఫోన్లు తదితర ప్రలోభాలను ఎరవేసి కొనేందుకు రాజకీయనాయకులు ప్రయత్నిస్తుంటారు. కానీ, తాము మాత్రం అలా కాదని నేటితరం యువత కుండబద్దలు కొడుతోంది. డబ్బు, ప్రలోభాలకు నేటియువత లొంగదని, సుపరిపాలన అందించేవారికి పట్టం కట్టడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇటీవల ఓటు హక్కు వచ్చిన కొందరు యువతను ‘సాక్షి’ కదిలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొలిసారిగా తమకు ఓటు హక్కు వచ్చిందని, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. సమర్థులు, ప్రయోజకులకే తాము ఓటేస్తామని చెప్పారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సరిగ్గా వాడితే, అద్భుతాలు సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో విధిగా ఓటు వేసే మధ్యవయస్కులు, సీనియర్ సిటిజన్లు కూడా నాయకుల తలరాతలు మార్చేది.. యువత ఓటింగే కీలకమని అభిప్రాయపడుతున్నారు. -
ఓటుకు కోట్లు కుట్రను కళ్ళకు కట్టినట్లు చెప్పిన మార్కం టేలర్
-
ఓటుకు పనితీరే కొలమానం
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, ఎన్నుకోబోయే వ్యక్తి పనితీరు, ప్రజా ప్రయోజనాలనే కొలమానంగా తీసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పోటీచేసే వ్యక్తి గుణగణాలు, సామర్థ్యం, యోగ్యత, నడతను కచ్చితంగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కులమతాలు, ధన ప్రభావంతో ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉపరాష్ట్రపతి తన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి రచించిన ‘ఎకోటి కాలింగ్’పుస్తకాన్ని తెలుగులో అనువదించిన ‘సుపరిపాలన’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రభుత్వం కంటే పాలనే కీలకమైందని, పాలనా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయ వలసిన అవసరం ఉందని సూచించారు. సౌకర్యాల కల్పనతో పాటు ప్రజలకు అడ్డంకులు లేని ఆనందమయ జీవితాన్ని కల్పించడమే సుపరిపాలన ధ్యేయమన్నారు. ఎన్నుకోబడిన ప్రతినిధులు తమ బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహించాలని, ప్రజలకు పరిపూర్ణమైన సేవలు అందించాలన్నారు. కరదీపికలా సుపరిపాలన పుస్తకం.. కొత్తగా సివిల్ సర్వీసుల్లోకి వచ్చే వారికి సుపరిపాలన పుస్తకం కరదీపికలా పని చేస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడులు, అడ్డంకులు తదితర ఎన్నో అంశాలను ఇందులో చర్చించినట్లు తెలిపారు. థర్డ్ జండర్స్, న్యాయం లాంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను వెలువరించిన ఈ పుస్తకం, ఉద్యోగంతో పాటు సమాజం పట్ల జోషి చేసిన అధ్యయనాన్ని తెలియజేస్తుందని, రచయిత జోషి రచించిన ఇంగ్లీషు పుస్తకాన్ని సరళమైన, చక్కని తెలుగులో అనువాదం చేసిన అన్నవరపు బ్రహ్మయ్యకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ ఎస్.కె.జోషి, అనువాదకుడు బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
నేడే తెలంగాణ ‘పట్టభద్రుల’ ఓటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘హైదరాబాద్’ మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో .. భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 మంది, ‘నల్లగొండ’స్థానంలో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు. రెండు స్థానాల్లో 15 వేల మంది అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బంది చొప్పున మొత్తం 8 వేల పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) శశాంక్ గోయల్ పేర్కొన్నారు. రెండు నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు శనివారం రాత్రిలోగా పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది చేరుకున్నట్టు నివేదికలు వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 17న (బుధవారం) ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని 8 హాళ్లలో 56 టేబుళ్లు ఏర్పాటు చేసి ‘హైదరాబాద్’స్థానానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. నల్లగొండలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ ఓట్లను లెక్కించనున్నారు. ఇక్కడ కూడా 8 హాళ్లలో 56 టేబుళ్లను ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్నారు. ‘హైదరాబాద్’ స్థానం నుంచి సురభి వాణిదేవి (టీఆర్ఎస్), ఎన్.రామచందర్‌రావు (బీజేపీ), జిల్లెల చిన్నారెడ్డి (కాంగ్రెస్), ఎల్.రమణ (టీడీపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు (స్వతంత్ర అభ్యర్థి)లతో సహా 93 బరిలో ఉన్నారు. ‘నల్లగొండ’ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్), రాణిరుద్రమ (యువ తెలంగాణ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లతో సహా మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుండటం, భారీసైజు బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తుండటంతో ఓటర్లు తమ ప్రాధాన్యతల ఆధారంగా అభ్యర్థుల పేర్లను వెతకడం కొంచెం కష్టంగా మారనుంది. పోలింగ్ శాతం పెరిగేనా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పట్టభద్రుల మండలి ఎన్నికలు రాజకీయ వేడి పుట్టించాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. గతంతో పోలిస్తే ఈసారి ఏకంగా 85 శాతం అధికంగా ఓటర్ల నమోదు జరిగింది. పోలింగ్ ఆదివారం రోజున నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే... ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అధికారవర్గాలు ఆశిస్తున్నాయి. ‘తొలి’ప్రాధాన్యత ఇస్తేనే ఓటు చెల్లుబాటు / ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత ఓటు విధానంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ తొలి ప్రాధాన్యత ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఓటు చెల్లుబాటు కాదు. ఓటింగ్‌కు సంబంధించి సీఈఓ శశాంక్ గోయల్ ఓటర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. అవి ఇలా ఉన్నాయి.. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రంతో పాటు ఇచ్చిన ఊదా (వయోలెట్) రంగు స్కెచ్ పెన్‌తో మాత్రమే ఓటు వేయాలి. మరే ఇతర పెన్నులు, పెన్సిల్స్ ఉపయోగించరాదు. ఓటరు తాను మొదటి ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న ఖాళీ గడిలో ‘1’అంకెను రాయాలి. ఓటర్లు తమ తదుపరి ప్రాధాన్యతలను చెప్పడానికి 2 ,3, 4, 5 ... అంకెలను ద్వారా ఆయా అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలో రాయాలి. ఓటు (బ్యాలెట్ పత్రం) చెల్లుబాటు కావడానికి ఓటర్లు తప్పనిసరిగా తొలి ప్రాధాన్యత (1)ను ఇవ్వాలి. మిగిలిన అభ్యర్థులకు తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేయడం, వేయకపోవడం ఓటర్ల ఇష్టం. తొలి ప్రాధాన్యత ఓటు వేసి, తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేసినా, వేయకున్నా ఓటు చెల్లుబాటు అవుతుంది. ప్రాధాన్యతలను తెలపడానికి అంతర్జాతీయ ప్రామాణిక అంకెలు 1, 2, 3, 4... లేదా రోమన్ అంకెలు ఐ, ఐఐ, ఐఐఐ, ఐV.. లేదా భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ గుర్తించిన ఇతర భారతీయ భాషల్లో ఉపయోగించే అంకెలను వినియోగించవచ్చు. అయితే ఓటరు.. ఒకే భాష/ సంఖ్యా విధానానికి సంబంధించిన అంకెలను మాత్రమే వాడాలి. భిన్నమైన న్యూమరికల్స్‌ను కలిపి ఉపయోగించరాదు. ఒకే సంఖ్యను ఒక అభ్యర్థి కన్నా ఎక్కువ మందికి ఇవ్వకూడదు. అలా రాస్తే ఓటు చెల్లుబాటు కాదు. ఏ ఒక్క అభ్యర్థికి ఒకటి కన్నా ఎక్కువ ప్రాధాన్యతలను ఇచ్చినా ఓటు చెల్లుబాటు కాదు. అభ్యర్థి పేరుకు ఎదురుగా రైట్/ టిక్ గుర్తు లేదా గీ గుర్తులతో ఎంపికను తెలియజేస్తే ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్ పత్రంపై ఓటర్లు తమ ఇంటి పేరు, ఇతర పదాలు, సంతకం, పొడి అక్షరాలు రాయకూడదు. వేలిముద్రలు కూడా వేయకూడదు. అలాచేస్తే ఓటు చెల్లదు. ప్రాధాన్యతల ఎంపికను అంకెల్లో మాత్రమే సూచించాలి. ఒకటి, రెండు, మూడు ... అని అక్షరాల్లో రాయకూడదు. అభ్యర్థి ఎదురుగా ఉన్న గడిలో మాత్రమే ప్రాధాన్యత సంఖ్యను రాయాలి. రెండు గడుల మధ్య ఉన్న గీతపై ప్రాధాన్యత అంకెను రాస్తే ఓటు చెల్లుబాటు కాదు. ఓ క్రమపద్దతిలో మడతపెట్టిన బ్యాలెట్ పత్రాన్ని పోలింగ్ అధికారులు ఓటర్లకు అందించనున్నారు. ఓటర్లు మడత విప్పి ఓటు వేసిన తర్వాత మళ్లీ అదే తరహాలో మడత పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డుల్లో ఏదున్నా ఓకే... పట్టభద్రుల ఓటర్లందరికి ఓటరు గుర్తింపు (ఎపిక్) కార్డు జారీ చేశారు. పోలింగ్ కేంద్రానికి ఎపిక్ కార్డును తీసుకువచ్చి ఓటేయవచ్చు. ఒకవేళ ఎపిక్ కార్డు అందుబాటులో లేకుంటే ఈ కింద పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని సీఈఓ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు ఇండస్ట్రియల్ హౌస్‌లు, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఓటర్లకు విద్యా సంస్థలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు, వర్శిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లమా సర్టిఫికేట్ ఒరిజినల్, సంబంధిత అధికారులు జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్. -
అనంతలో అమానుషం: టీడీపీకి ఓటు వేయలేదని..
కళ్యాణదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో ఓ అన్న చెల్లెలిపైనే దాడిచేసి ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బాలవెంకటాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కురుబ లక్ష్మీదేవి పుట్టుకతోనే అంధురాలు. ఈమెకు ముగ్గురు అన్నలు. ఆమె మూడో అన్న తిప్పేస్వామి వద్ద ఉంటోంది. ఈ నెల 13న పంచాయతీ ఎన్నికల్లో ఆమె పెద్దన్న ఉలిగన్న సాయంతో ఓటు వేసింది. రాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలైన తిప్పేస్వామి, అతని కుటుంబ సభ్యులు నువ్వు టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి వేశావంటూ దుర్భాషలాడుతూ లక్ష్మీదేవిపై దాడిచేసి ఇంట్లోంచి గెంటేశారు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానన్న ఆమెను ఉలిగన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. విషయం సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో బుధవారం ఉదయం కూడా తిప్పేస్వామి కుటుంబ సభ్యులు మరోసారి ఆమెపై దాడికి పాల్పడ్డారు. చదవండి: కానిస్టేబుల్ పాడు పనులు.. అమ్మో పాము.. యువతి వాహనంపై వెళ్తుండగా.. -
పంచాయతీ పోరు: అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే?
సాక్షి, శ్రీకాళహస్తి : సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు సమయంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే మాత్రం లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. స్టేజ్–2 అధికారి సమక్షంలో లాటరీ తీస్తారు. ముందుగా ఆ ఇద్దరు అభ్యర్థుల పేర్లు (ఒక్కొక్క అభ్యర్థి పేరు ఐదు) చీటిల్లో రాస్తారు. అవి ఒకే రంగు, ఒకే సైజు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. చీటిల్లో పేర్లు కూడా కనిపించకుండా మొత్తం పది చీటిలను బాగా చుట్టి ఒక డబ్బాలో వేస్తారు. ఆ డబ్బాను అటు ఇటు బాగా తిప్పిన తర్వాత అధికారి ఒక చీటిని బయటకు తీస్తారు. అందులో ఎవరు పేరు వస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒకరి ఓటు మరొకరు వేస్తే.. చిత్తూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఒకరి ఓటు మరొకరు వేస్తే, ఓటు కోల్పోయిన వ్యక్తికి ఇచ్చే ఓటును టెండర్ ఓటు అంటారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు ఓటు వేయడానికి వచ్చే ముందు ఎవరైనా వేరే వ్యక్తి తన ఓటును వేసి ఉంటే, అసలు ఓటరు∙గుర్తింపు నిజమైతే అతనికిచ్చే ఓటును టెండర్ ఓటు అంటారు. అలాంటి పరి స్థితి ఎక్కడైనా తలెత్తితే పీఓ ఫారం –24 పూరించి, ఆ వ్యక్తి దగ్గర సంతకం, వేలిముద్ర తీసుకోవాలి. టెండర్ ఓటు కలి్పంచే వారికి బ్యాలెట్ పేపర్లో చి వరి నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. చివరి బ్యాలెట్ పేపర్లో కౌంటర్ ఫైల్, బ్యాలెట్ పేపర్లో టెండర్ బ్యాలెట్ పేపర్ అని వెనుక వైపు పీఓ రాయాల్సి ఉంటుంది. మార్క్ కాపీలో నోట్ చేయకూడదు. ఆ ఓటును బ్యాలెట్ బాక్సులో వేయకుండా ప్రత్యేకమై న కవర్లో ఉంచి రిటరి్నంగ్ అధికారికి అందజేయాలి. టెండర్ ఓట్లు 2 శాతం మించితే ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. చదవండి: పంచాయతీ బరిలో స్పీకర్ సతీమణి పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే.. -
హైదరాబాద్‌ను నిజంగా ప్రేమిస్తే : దర్శకుడు శేఖర్ కమ్ముల
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రేపటి(ఆదివారం)తో ముగియనున్న సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచార హోరు సాగుతోంది.అటు సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందేశాల జోరు కూడా పెరిగింది. ఓటు హక్కు వినియోగంపై ఉత్సాహాన్ని రేకెత్తించేలా విడియోలను పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉరుకుపరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపే నగరవాసుల్లో ఓటు హక్కు వినియోగం శాతం పెంచేలా చైతన్యాన్ని కలిలిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ యాంకర్ ఉదయ భాను ముందు వరుసగా నిలిచారు. తాజాగా మంచి కాఫీ లాంటి ‘ఆనంద్’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన శేఖర్ కమ్ముల ఎన్నికలకు సంబంధించి మంచి సందేశంతో ముందుకొచ్చారు. మన నగరాన్ని నిజంగా ప్రేమిస్తే.. మనం తప్పకుండా డిసెంబరు 1 వతేదీన తప్పకుండా ఓటు వేయాలని ఆయన కోరారు. (లక్షలకు లక్షలు దోచేస్తారు : ఉదయభాను వీడియో) -
ప్రలోభాలు కాదు, ప్రగతి కోసం ఓటేద్దాం: ఉదయభాను
-
లక్షలకు లక్షలు దోచేస్తారు : ఉదయభాను వీడియో
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందించే ప్రముఖ యాంకర్ ఉదయభాను పరిచయం అవసరం లేని సెలబ్రిటీ. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉదయ భాను మరోసారి ట్రెండింగ్‌లో నిలిచారు. గ్రేటర్ పోరులో ఓటు హక్కు వినియోగంపై ఆమె అద్భుతంగా మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అమ్ముకుంటే జరిగే పరిణామాలపై తనదైన శైలిలో అనర్గళంగా చెప్పుకొచ్చారు. ఓటు మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం అంటూ కొత్త భాష్యాన్ని చెప్పుకొచ్చారు. మాటల, అంకెల గారడీలో నాయకులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వైనాన్ని కనిపెట్టాలని సూచించారు. ఓటును నిర్వీర్యం చేయొద్దు...ఓటు వేసి తీరదాం అంటూ ఫేస్బుక్ లో ఒక వీడియోను ఉదయ భాను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో మీకోసం... -
ఓటు మన బాధ్యత
మనిషి ఇంట్లో ఉండటం తక్కువ. రోజంతా బయటే! చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాపకాలు. అలసి ఇంటికి చేరిన వారిని ఇల్లు ఆదరిస్తుంది. ఫ్యాన్ వేసి కూర్చోబెడుతుంది. మంచినీళ్ల గ్లాసు చేతికి అందిస్తుంది. స్నానానికి వేణ్ణీళ్లు పెడుతుంది. అప్యాయంగా భోజనం వడ్డిస్తుంది. సేదతీరాక, ‘ఈరోజు ఎలా గడిచింది?’ అని అడుగుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మనిషికి కూడా ఇలాంటి ఆదరణే ఉండాలి. రోజూ వెళ్లొచ్చే రోడ్లు బాగుండాలి. రాకపోకలకు రవాణా సౌకర్యం ఉండాలి. రద్దీ తక్కువగా ఉండాలి. రక్షణ, భద్రత ఉండాలి. ఒక్కమాటలో.. మహానగరమే అయినా మన ఇల్లులా ఉండాలి! ఆ నగర ‘గృహ’ బాధ్యత ‘మేయర్’ది అయితే, మేయర్ ఎన్నికల్లో ఓటు వేయడం పౌరుల బాధ్యత. ఇంట్లో నీళ్ల ట్యాప్ అయినా, రోడ్డు మీద నడిచే మన బతుకు బండైనా ఉండేది మేయర్ చేతిలోనే. ఆ మేయర్‌ని ఎన్నుకునే అవకాశం మళ్లీ ఇప్పుడు నగరజీవి చేతికి వచ్చింది. డిసెంబర్ 1న హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు. కోటీ 20 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ సిటీలో 74 లక్షలకు పైగా ఓటేయబోతున్నారు. వారిలో మహిళా ఓటర్లు 35 లక్షలకు పైగానే. ఈ మహిళల ఓట్లే ఇప్పుడు కీలకం! ఓటు హక్కును వినియోగించుకోడం తమ బాధ్యత అని భావిస్తున్నారా లేదా అని తెలుసుకోడానికి జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మెట్రో కార్పోరేషన్) పరిధిలోని మహిళా ఓటర్లను ‘సాక్షి’ కలిసింది. ఎక్కువమంది మహిళల్లో ఓటు వేయడం పట్ల చైతన్యంతో కూడిన బాధ్యత వ్యక్తం అయింది. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఓటు వేసేదాన్ని. సిటీ ఎన్నికల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే స్థానిక సమస్యల పరిష్కారంలో నగర పాలకవర్గానిదే ప్రధాన పాత్ర అని ఇప్పుడు తెలుస్తోంది. అందుకే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా ఓటేస్తాను. మా శేరిలింగంపల్లి డివిజన్లో అనుమతి లేని నిర్మాణాల వంటి అనేక అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దగలిగిన వ్యక్తినే కార్పొరేటర్‌గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. చుట్టూ ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత, సరైన ప్రతినిధిని ఎన్నుకోవాల్సిన విధి సిటిజన్‌గా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎన్నికల సమయంలో నిరాసక్తంగా ఉండి తర్వాత ఎవరిని తప్పు పట్టినా ప్రయోజనం ఉండదు. – పి. నీలిమ, ప్రాజెక్ట్ మేనేజర్, మైక్రోసాఫ్ట్ అప్పట్లో మాకు 21 ఏళ్లకు ఓటు హక్కు వచ్చేది. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ ఓటు వేస్తున్నాను. ఎలక్షన్ల సమయంలో రేడియో ఉద్యోగంలో పని ఎక్కువగా ఉంటుంది. ఎన్ని పనులున్నా సరే ఓటు వేయడం మానలేదు. ఉదయం ఓటింగ్ మొదలయ్యే సమయానికే బూత్‌కి వెళ్లి ఓటు వేసిన తర్వాత డ్యూటీకి వెళ్లేదాన్ని. ఢిల్లీలో ఉద్యోగం చేసినన్నాళ్లు అక్కడ వేశాను, ఇప్పుడు హైదరాబాద్‌లో వేస్తున్నాను. తలవంచుకుని వెళ్లి ఓటు వేసి రావడం కాదు, ఓటింగ్ సరళిని గమనించి సమాచారంతో ఆఫీసుకు వెళ్తుంటాను. – ఎమ్.ఎస్.లక్ష్మి, న్యూస్ కరస్పాండెంట్, ఆల్ ఇండియా రేడియో మేము హైదరాబాద్‌కి వచ్చి ముప్పై ఏళ్లయింది. ఇక్కడ ఓటు వచ్చి ఇరవై ఏళ్లయింది. ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నాం. మా కష్టం ఎవరూ తీర్చరు. అలాగని ఓటు వేయకపోతే... మనం ఊర్లో ఉన్నా లేనట్లే చూస్తారు. ప్రభుత్వం మాలాంటి వాళ్ల కోసం ఏదైనా పథకం పెట్టినప్పుడు మమ్మల్ని ఏ లీడరూ పట్టించుకోరు. మాకూ అర్హత ఉందని గట్టిగా అడగాలంటే ఓటు వేయాల్సిందే. – టి. సరస్వతి,పూల వ్యాపారి ఒకరొచ్చి చెప్పాలా?! ఓటు వేయడం ద్వారా మన జీవితంలో ఐదేళ్ల కాలాన్ని ఆ ప్రతినిధి చేతిలో పెడుతున్నాం. అందుకే ఆ ఎన్నిక ప్రక్రియలో విధిగా భాగస్వాములు కావాలి. సరైన వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకోవాలి. నగరంలో మనిషికి ప్రభుత్వం చేయాల్సిన కనీస సర్వీసులు కరెంటు, వాటర్, డ్రైనేజ్ సర్వీసులే. అవన్నీ మనం కట్టే పన్నుల నుంచి అందుతున్న సర్వీసులే. ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలను సక్రమంగా అందించే బాధ్యత ఆ ప్రతినిధిది. స్ట్రీట్ లైట్ వెలగకపోయినా, డ్రైనేజ్ పొంగినా మనకు అందాల్సిన సర్వీస్ గురించి అడగగలగాలి. అలాగే జనం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎవరో వచ్చి చైతన్యపరచాలని ఎదురు చూడకూడదు. ఎవరికి వాళ్లు చైతన్యవంతం కావాలి. ఇక చాలా మందికి క్యూలో నిలబడడం అంటే నామోషీ. బేషజాలకు పోయి విలువైన ఓటు హక్కును వినియోగించుకోరు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ కూడా రాష్ట్రపతి హోదాలో నేరుగా వెళ్లి ఓటేయకుండా, క్యూలో నిలబడి తన వంతు కోసం ఎదురు చూసి మరీ ఓటేశారు. అంతకంటే స్ఫూర్తి మరేం కావాలి? నా మట్టుకు నేను ప్రతి ఎన్నికలోనూ ఓటేశాను. సాధారణ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలో గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యుయెన్సీ ఓటు కూడా వేశాను. ఇప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఓటు వేస్తాను. – పి. హరిత, ఎంటర్ప్రెన్యూర్ -
వైరల్ ట్వీట్.. తప్పులో కాలేసిన ట్రంప్ కుమారుడు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలంటూ ప్రస్తుత అధ్యకుడు డొనాల్ట్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మిన్సెసోటాలోని ప్రజలంతా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎరిక్ మంగళవారం ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎరిక్ చేసిన తాజా ట్వీట్ అతన్ని ఇరకాటంలోకి నెట్టివేసింది. ఎన్నికలు అయిపోయిన ఇన్ని రోజులకు ఎరిక్ ఓటు వేయాలని కోరడం ఏంటని కొంతమంది నెటిజన్లు నోరెళ్లపెడుతున్నారు. అయితే అమెరికాలో ఎన్నికల రోజు కూడా ఎరిక్ ప్రజలను ఓటు వేయాలని కోరుతూ ట్వీట్ శారు. ఒకవేళ సాంకేతిక లోపం కారణంగా ఆ ట్వీట్ ఇప్పడు వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. చదవండి: అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు! ఏదేమైనప్పటికీ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే నెటిజన్లు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి తమ అకౌంట్లలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. బరాక్ ఒబామా దగ్గర 8 ఏళ్లు ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వైట్ హౌస్‌లో బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజాయాన్ని ఎదుర్కొన్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ అధికార మార్పిడికి సంబంధించి బైడెన్ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం తాజా పరిణామాలు. చదవండి: వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా But of course Eric Trump scheduled an Election Day tweet for the wrong week... pic.twitter.com/a4tL0UYRm8 — Rex Chapman🏇🏼 (@RexChapman) November 10, 2020 Proof Eric Trump is Internet Explorer (yes this is real) pic.twitter.com/YiJaPl6aeN — Bizarre Lazar 🏴☠️ (@BizarreLazar) November 11, 2020 You are a 🤡 do you know what day it is? — Antonio Gianola (@antoniogianola) November 10, 2020 Now I am not an expert, but I think @EricTrump just told Minnesota to commit voter fraud. pic.twitter.com/5AOOxew1xn — Kyle (@wylekolfe) November 11, 2020 -
పాలిటిక్స్‌పై విజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ‘పెళ్లి చూపులు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నాడు. యువత ఫాలోయింగ్ అందులోనూ అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడే హీరోల లిస్ట్‌లో అతడు మొదటి స్థానంలో ఉంటాడు. తన డ్రెస్సింగ్, మాట్లాడే విధానం, ఆటిట్యూడ్‌కి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫైటర్’ చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే విజయ్‌కు జంటగా నటిస్తున్నారు. చదవండి: యూరప్ వీధుల్లో ‘అర్జున్‌రెడ్డి’ తాజాగా ఈ హీరో.. ప్రజాస్వామ్యం, ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్, అనుపమ చోప్రాలతో జరిగిన చిట్‌చాట్‌లో రాబోయే రోజుల్లో ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా? అని విజయ్ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయ్.. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ విధానంపై విముఖత వ్యక్తం చేశారు. డబ్బులు, మందు కోసం ఓటును అమ్ముకునే వారికి ఓటు హక్కు తీసేయాలని అన్నారు. తన ఓటు విలువేంటో తెలియని వాళ్లకు ఓటు హక్కు ఎందుకని విజయ్ అభిప్రాయపడ్డాడు. అలాగే బాగా డబ్బున్న ధనవంతులకు కూడా ఓటు హక్కు వద్దని, చదువుకుని ఓటు హక్కు విలువ తెలిసిన మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని పేర్కొన్నాడు. కాగా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో నెటిజన్లు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. కొంతమంది విజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు అతడి మాటలను తప్పుబడుతున్నారు. చదవండి: అనుష్క–విజయ్– ఓ సినిమా? Did he just say that he prefers Dictatorship more than democracy and not everyone should be allowed to vote? Deverakonda is a classic example of how apolitical folks slowly move towards RW Authoritarianism in the end. pic.twitter.com/JsNmZ0f1GS — Advaid അദ്വൈത് (@Advaidism) October 9, 2020 -
ఇంటి నుంచి ఓటేయాలంటే..
న్యూఢిల్లీ: 80 సంవత్సరాలు దాటిన వారు, దివ్యాంగులు ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు వేసేందుకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు లేఖ ద్వారా సూచించింది. ఇందులో భాగంగా ఇంటి నుంచి ఓటు వేసే వారికి బూతు స్థాయి అధికారి 12డీ దరఖాస్తు అందిస్తారు. నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లోగా దాన్ని నింపాలి. నింపిన దరఖాస్తును బీఎల్ఓ బూతు స్థాయి అధికారి తీసుకొని రిటర్నింగ్ అధికారికి అందిస్తారు. ఈ ప్రక్రియ అన్ని రకాల సాధారణ ఎన్నికలకు, ఉపఎన్నికలకు, లోక్ సభ సీటుకు జరగనున్న ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ లేఖలో పేర్కొంది. ఈ నెల 28 నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ‘పీడబ్ల్యూడీ’ యాప్‌ను ఎన్నికల సంఘం తయారు చేసింది. 80 సంవత్సరాలు దాటిన వారు, దివ్యాంగులు ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అక్టోబర్ 28 నుంచి జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీంతో పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. చదవండి: అగ్రి చట్టాలను చెత్తబుట్టలో పారేస్తాం -
తుక్కుగూడలో కేకేకు ఓటు హక్కుపై రిట్
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో మెంబర్‌గా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు (కేకే) వేసిన ఓటు చెల్లదని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజ్యసభ సభ్యుడిగా కేకేను.. ఏపీకి కేటాయించారని, ఆయన ఓటును రద్దు చేయాలని కోరుతూ బీజేపీకి చెందిన కౌన్సిలర్లు రిట్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ఎన్నికల అధికారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ బి.వెంకట్రెడ్డిలను పేర్కొన్నారు. కేకే ఓటు వేయడానికి అనుమతించిన ఎన్నికల అధికారి ఎస్.రాజేశ్వర్‌రెడ్డి అనుమతి ఇవ్వడాన్ని మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5 (2), (3)కు వ్యతిరేకమని ప్రకటించాలని కోరతూ రాజుమోనిరాజు సహా ఎమిమిది మంది కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. మధుమోహన్, వెంకట్‌రెడ్డి.. చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నిక అయ్యేందుకు ఎక్స్అఫీషియో మెంబర్‌గా కేకే ఓటు కీలకమైందని, ఏపీకి చెందిన ఎంపీగా కేకే ఉన్నందున ఆయన తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఎన్నికల అధికారి అనుమతించడం చెల్లదని ప్రకటించాలని కోరారు. -
'మీ ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి'
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు ఓటు వేసి గెలిపించాలని తృణముల్ కాంగ్రెస్ ఢిల్లీ ప్రజలను కోరింది. తాజాగా తృణముల్ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ బుధవారం ఢిల్లీలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి రాఘవ్ చాదాకు ఓటు వేసి గెలిపించాలని ట్విటర్ ద్వారా ప్రజలను కోరారు. అంతేగాక ఈ ఎన్నికల్లో ఒక్క కేజ్రీవాల్‌నే కాకుండా ఆప్ అభ్యర్థులందరికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ' ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేయండి.. ఆప్ అభ్యర్థి రాఘవ్ చాదానను గెలిపించండి.. అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ అభ్యర్థులందరిని గెలిపించండి' అంటూ డెరెక్ ఒబ్రెయిన్ వీడియా ద్వారా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్న సంగతి తెలిసిందే.(‘సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారు’) Vote for @AamAadmiParty Vote for the candidate from Rajendra Nagar constituency @raghav_chadha Vote for @ArvindKejriwal and all AAP candidates in Delhi WATCH pic.twitter.com/KcgHbPpkB7 — Citizen Derek | নাগরিক ডেরেক (@derekobrienmp) January 30, 2020 -
పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి: ఎస్ఈసీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సిబ్బంది అందరూ మున్సిపల్ ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) విజ్ఞప్తి చేసింది. తమ టీ–పోల్ సాఫ్ట్వేర్ tsec.gov.inలో మున్సిపల్ ఎన్నికల సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకొని పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని (ఫారం–12) పొందవచ్చని తెలిపింది. ఈ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారికి నిర్ణీత సమయానికి సమర్పించి, తదుపరి తమ పోస్టల్ పత్రాన్ని పొందే వరకు పర్యవేక్షించుకోవచ్చని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని పొందేందుకు సిబ్బంది తమ ఆర్వోలు/ మున్సిపల్ కమిషనర్ నుంచి ఫారం–12ను పొంది, అందులో వివరాలను పొందుపరచి వారికి సమర్పించాక.. వారికి పోస్ట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని పంపుతారని తెలియజేసింది. దానిపై సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకుని నిర్ణీత కవర్లో పెట్టి కౌంటింగ్ మొదలయ్యేలోగా రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని సూచించింది. గతేడాది జరిగిన పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బంది చాలా తక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నందున, మున్సిపల్ ఎన్నికల్లో సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవాలని కోరింది. -
ఒకే కుటుంబం.. ఒకే పోలింగ్ కేంద్రం
కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం సరికొత్త ఆలోచన చేసింది. ఈ విధానంతో వారంతా ఒక పోలింగ్ స్టేషన్లోనే ఇక నుంచి ఓటు వేసుకోనున్నారు. ఇందుకోసం బీఎల్వోలు జిల్లా అంతటా చురుగ్గా సర్వే చేపడుతున్నారు. గతంలో ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఓటు వినియోగించుకుని ఇబ్బందులు పడేవారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టే దిశగా ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకువచ్చింది. పాలకొండ రూరల్/రేగిడి/సరుబుజ్జిలి/ఆమదాలవలస: కొద్ది కాలం క్రితం ఎపిక్ నోషనల్ నెంబరింగ్ మొబైల్ యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో బీఎల్వోలకు శిక్షణ ఇచ్చారు. వీరు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేసి ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకువస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాతోపాటు ప్రతి ఇంటినీ జియో ట్యాగ్ చేసి గూగుల్ ఎర్త్‌కి అనుసంధానం చేస్తున్నారు. ఆ ఇంటికి ఒక నంబర్ కేటాయించి ఆ కుటుంబంలోని ఓటర్లను జియో ట్యాగ్ చేయనున్నారు. దీనివల్ల కుటుంబ సభ్యులంతా ఒకేచోట ఓటు వేయడమే కాకుండా బోగస్ ఓట్లకు చెక్ పెట్టే అవకాశం ఉంది. గూగుల్ ఎర్త్‌లో ఇప్పటికే నమోదైన ఇంటి నంబర్ల ఆధారంగా పోలింగ్ కేంద్రాలకు స్పష్టమైన హద్దులు ఏర్పడనున్నాయి. గూగుల్ ఎర్త్‌లోనే ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని గృహాలన్నీ స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకువస్తారు. దీనివల్ల ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికే వెళ్లి ఓటు వినియోగించుకునేవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికల నాటికి సిద్ధం..? రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు నాటికి ఈ నూతన విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ఎన్నికల యంత్రాంగం కృషి చేస్తోంది. దీంతో ఇప్పటికే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతి బీఎల్వోకు ఆండ్రాయిడ్ మొబైల్ అందించి ఈ యాప్ అప్లోడ్ చేసి గ్రామాల్లో సర్వేలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై బీఎల్వోలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఇల్లు జియో ట్యాగ్.. పోలింగ్ కేంద్రాలలోని ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేయడం ద్వారా గూగుల్ ఎర్త్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక చిత్రాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో వలంటీర్లు, శిక్షణ సర్వేయర్ల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని గృహాలను జియో ట్యాగ్ చేస్తున్నారు. ప్రతి ఇంటిని గూగుల్ ఎర్త్‌లో గుర్తించి ప్రత్యేకించి ఒక నెంబరు కేటాయించారు. ఈ నెంబర్ల ఆధారంగా ప్రస్తుతం బీఎల్వోలు సదరు ఇళ్లలోని ఓటర్లను జియోట్యాగ్ చేస్తున్నారు. ఒక కుటుంబంలోని ఓటర్లకు సంబంధించిన నెంబర్లన్నీ ఒకే ఇంటి నెంబరుకు పిన్ చేస్తున్నారు. దీంతో అందులోని ఓటర్లను వేర్వేరుగా ఇతర పోలింగ్ కేంద్రాలకు కేటాయించే అవకాశం ఉండదు. దీంతోపాటు గుర్తింపు కార్డుల నెంబర్లు, పూర్తి వివరాలతో కూడిన డేటాను అనుసంధానం చేస్తుండటంతో బోగస్ ఓట్లను సులభంగా గుర్తించే వీలుంటుంది. గందరగోళం లేకుండా ఉంటుంది.. గతంలో ఒక కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఉండడం వలన ఓటింగ్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగేవి. జాబితాల్లో ఇంటి పేరు, భర్త పేరు, అడ్రస్‌లు కూడా సక్రమంగా ఉండేవి కావు. దీనివలన ఓటరు గందరగోళానికి గురయ్యేవాడు. ప్రస్తుతం ఈ నూతన విధానం వలన కుటుంబం మొత్తం ఒకే చోట, ఒకేసారి ఓటు చేసి ఇంటికి రావచ్చు. దీనివలన బోగస్ ఓట్లు రద్దవుతాయి. – ఎస్.నాగేశ్వరరావు, కొత్తకోట, సరుబుజ్జిలి మంచి ప్రక్రియ.. గతంలో ఎవరి ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో వెతుక్కోవడం ఇబ్బందిగా ఉండేది. తండ్రి ఓటు ఒక ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో ఉంటే పిల్లల ఓటు వేరే ప్రాంతంలో ఉండేవి. ఇప్పుడలా కాకుండా కుటుంబంలోని సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలోకి తీసుకురానుండడం మంచి ప్రక్రియ. అలాగే ఓటరు గుర్తింపు కార్డుల నెంబరు డేటాతో అనుసంధానం చేయడం వలన బోగస్ ఓట్ల గుర్తింపు సులభతరమవుతుంది. – చందక జగదీష్‌కుమార్, మాజీ సర్పంచ్, తంపటాపల్లి, పాలకొండ మండలం 90 శాతం పూర్తి చేశాం.. కుటుంబ సభ్యులందరూ ఒకేచోట ఓటు వేసేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిని, అందులో ఉండే సభ్యుల వివరాలను జియోట్యాగ్ చేస్తున్నాం. ఈ నెల 30వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే రెవెన్యూ సబ్ డివిజన్లో 90 శాతం మేర జియోట్యాగ్ జరిగింది. గడువులోగా శతశాతం పూర్తి చేస్తాం. –టి.వి.ఎస్.జి.కుమార్, ఆర్డీవో, పాలకొండ -
ఓటు భద్రం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓట్ల గల్లంతు వ్యవహారం దుమారం రేపుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ.. ఇలా ఏ తరహా ఎన్నికలు జరిగినా తమ ఓట్లను అకారణంగా తొలగించారని వేల మంది ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం’నిర్వహించి వివిధ కారణాలతో లక్షల సంఖ్యలో ఓట్లను తొలగిస్తోంది. నివాసం మారారని/ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, చనిపోయారని, డూప్లికేట్ ఓటు, బోగస్ ఓటు అని నిర్ధారించిన తర్వాతే సంబంధిత వ్యక్తుల ఓట్లను తొలగించాల్సి ఉండగా, చాలా సందర్భాల్లో సరైన విచారణ జరపకుండానే అర్హులైన వ్యక్తుల ఓట్లను తొలగిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు ధ్రువీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. సెప్టెంబర్ 1 ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని తాజాగా నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈ కార్యక్రమంలో ఓటర్ల ధ్రువీకరణతో పాటే ఓటరు పేరు, చిరునామాలో తప్పులను సరిచేసుకోవడం, ఫొటోలను మార్చుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటును ధ్రువీకరించుకున్న వ్యక్తుల పేర్లను వారి అనుమతి లేకుండా ఓటర్ల జాబితాల నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల సంఘం హామీనిచ్చింది. ఓటర్ల జాబితాకు సంబంధించి ఓటర్లకు నిరంతర అప్డేట్స్ పంపడానికి వారి ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సైతం ఈ కార్యక్రమంలో భాగంగా సేకరిస్తోంది. ఇంటింటికీ బీఎల్ఓలు... ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ఓటర్లందరి నుంచి గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తున్నారు. పాస్‌పోర్టు/డ్రైవింగ్ లైసెన్స్/ఆధార్/రేషన్‌కార్డు/ప్రభుత్వ గుర్తింపు కార్డు/బ్యాంకు పాసుపుస్తకం/రైతు గుర్తింపు కార్డు/పాన్‌కార్డు/ జాతీయ జనాభా రిజిస్ట్రర్(ఎన్పీఆర్)లో భాగంగా రా>జీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసే స్మార్టు కార్డు/తాజా నల్లా/టెలిఫోన్/విద్యుత్/గ్యాస్ కనెక్షన్ బిల్లుల్లో ఏదైనా ఒకదానికి సంబంధించిన జిరాక్స్ ప్రతిని బీఎల్ఓలకు అందజేసి తమ ఓటు హక్కును పటిష్టం చేసుకోవచ్చు. ‘ఓటర్ హెల్ప్‌లైన్’ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తమ వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా కూడా ఓటరు ధ్రువీకరణ చేసుకోచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంతో ప్రయోజనాలు.. 1) ఓటర్లకు శాశ్వత లాగిన్ సదుపాయం 2) క్రమం తప్పకుండా ఎస్ఎంఎస్ల ద్వారా అలర్ట్ 3)బీఎల్ఓ/ఈఆర్ఓలతో పరిచయం 4) మీ అనుమతి లేకుండా పేరు తొలగించే వీలుండదు 5) ఎన్నికల సంబంధింత సకల సమాచారాన్ని మీ మొబైల్/మెయిల్‌కు అందుతుంది ఓటర్లు నేరుగా స్వీయ ధ్రువీకరణ చేసుకోవచ్చు.. ఓటర్లు స్వయంగా తమ ఓటును ధ్రువీకరించుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://www.nvsp.in)లో తమ పేరుతో లాగిన్ అకౌంట్‌ను ప్రారంభించి తమ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను అందజేయడంతో పాటు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామాలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. కొత్త ఫొటోను అప్లోడ్ చేయవచ్చు. అదేలా అంటే.. స్టెప్1: మీ ఎపిక్ నంబర్‌తో https://www.nvsp.in వెబ్‌సైట్‌కు లాగిన్‌కండి. స్టెప్ 2: మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, సంబంధం రకం/పేరు, చిరునామా, ఫొటోలను ధ్రువీకరించండి. స్టెప్ 3: మీ వివరాల్లో తప్పులను సరిచేయడం/వివరాల్లో మార్పులు చేయడం, ఫొటోగ్రాఫ్ మార్పు అవసరమైతే చేయండి. స్టెప్ 4: ఏదైనా మీ గుర్తింపు ధ్రువీకరణను అప్లోడ్ చేయండి. స్టెప్ 5: తదుపరి సేవల కోసం మీ మొబైల్ నంబర్/మెయిల్ ఐడీలను జతచేయండి. -
84.75 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 84.45 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,36,842 ఓట్లు ఉండగా.. 2,00,726 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషుల ఓట్లు 99,023, మహిళల ఓట్లు 1,01,703 ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 81.18%, 2018 ఎన్నికల్లో 86.38% పోలింగ్ నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 78.85% పోలింగ్ నమోదైంది. 50 శాతం పైగా నమోదు.. ఉప ఎన్నిక జరిగిన సోమవారం ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం, 11 గంటల వరకు 31.34 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 52.89 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 69.95 శాతం, సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 84.75 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నానికే 50 శాతం పైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం లోపలికి వచి్చన వారంతా ఓటేశారు. గరిడేపల్లి మండలం కల్మల చెరువలో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. హుజూర్నగర్ అంబేడ్కర్‌నగర్ పోలింగ్ కేంద్రంలో, మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండా, గరిడేపల్లి మండలం వెల్దండలో సాయంత్రం 6 గంటల వరకు ఓటేశారు. గరిడేపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలోని 252 పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో 40 నిమిషాల పాటు పోలింగ్ నిలిచింది. ఆ తర్వాత సాంకేతిక నిపుణులు దాన్ని సరిచేయడంతో మళ్లీ యథావిధిగా ఓట్లు వేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు జీకే.గొక్లానీ, సచింద్రప్రతాప్‌సింగ్, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎస్పీ ఆర్.భాస్కరన్, జేసీ సంజీవరెడ్డిలు పరిశీలించారు. నియోజకవర్గంలోని 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. కృష్ణపట్టె ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ భాస్కరన్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఓటేసిన అభ్యర్థులు.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.. మఠంపల్లి మండలం గుండ్లపల్లి, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి హుజూర్‌నగర్‌లోని ఎన్ఎస్పీ క్యాంపు పాఠశాలలో, బీఎల్ఎఫ్ అభ్యర్థి మేడి రమణ హుజూర్నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్ హుజూర్నగర్ మండ లం బూరుగడ్డలోని పోలింగ్ కేంద్రంలో ఓటే శారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓటు నియోజకవర్గంలో లేకపోవడంతో ఆమె ఓటేయలేదు. 24న ఓట్ల లెక్కింపు.. ఈ నెల 24న సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ గోదాం నుంచి ఈవీఎంలను సూర్యాపేట మార్కెట్ గోదాంలోకి చేర్చి స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. మెజారిటీతో గెలుస్తున్నాం: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గౌరవప్రదమైన మెజారిటీతో వి జయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత సామాజిక మాధ్యమం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. -
2 రాష్ట్రాల్లో ఓటేసిన సినీ క్రీడా రాజకీయ ప్రముఖులు
-
హుజూర్నగర్ ఉప ఎన్నిక: ఓటు వేసిన సైదిరెడ్డి
-
విశ్వాస పరీక్షకు సిద్ధం!
-
వీరి ఓటు విలువ ఇంతింత కాదయా!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఎన్నికలు నిర్వహించడమంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఈ ఖర్చు 1998 నాటి నుంచి అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 55 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింటుందని ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అనే స్వతంత్య్ర పరిశోధనా సంస్థ అంచనా వేసింది. 50 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఎన్నికల కమిషన్ ముందుగానే అంచనా వేసింది. ఈ మొత్తాన్ని విభజిస్తే ఒక్కో నియోజక వర్గానికి వంద కోట్ల రూపాయలు, ఒక్క ఓటుకు 700 రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్క. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి లోక్‌సభ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్నిబట్టి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు, ప్రతి అసెంబ్లీ 20 నుంచి 28 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు అర్హుడు. ఈసారి లోక్‌సభకు 8, 049 అభ్యర్థులు, అసెంబ్లీలకు 3,589 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరంతా కలిసి అధికారికంగా 6,639.22 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంది. ప్రతి అభ్యర్థి పరిమితికి మించే ఖర్చు చేస్తారని, పరిమితంగానే ఖర్చు చేసినట్లు దొంగ లెక్కలు చూపిస్తారని అందరికి తెల్సిందే. అందుకనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఓ సందర్భంలో ‘కొందరి లోక్‌సభ జీవితం పెద్ద అబద్ధంతోనే ప్రారంభమవుతోంది’ అని చమత్కరించారు. ఈసారి అభ్యర్థులందరూ కలిసి 24వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అంచనా వేసింది. రాజకీయ పార్టీలు మరో 18 వేల కోట్లు, ఎన్నికల కమిషన్ లేదా ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయలు, మీడియా–దాతలు మూడు రెండు కోట్లు, రాజకీయేతరులు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేశారు. దీనికి అదనంగా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ వర్గాలు మద్యం, డ్రగ్స్, ఆభరణాలు, నగదు రూపేనా అక్రమంగా రవాణా అవుతున్న రూ. 3, 475 కోట్లను పట్టుకున్నారు. 2014 ఎన్నికలకన్నా ఇది నాలుగింతలు ఎక్కువ. ఈ మొత్తంలో పాలకపక్ష బీజేపీ 45 నుంచి 50 శాతం అంటే 24 వేల కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టగా, కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 20 శాతం వరకు డబ్బు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడానికి కారణం అంతగా డబ్బులు అందుబాటులో లేకపోవడమే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకే అధిక నిధులు వచ్చిన విషయం తెల్సిందే. -
పొరపాట్లు లేకుండా ఓట్ల లెక్కింపు
నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.ముత్యాలరాజు కౌంటింగ్ సూపర్వైజర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాయలంలో కౌంటింగ్ సూపరవైజర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్లు లెక్కించే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎవైనా సమస్యలు ఉత్పన్నమైతే ఆర్ఓల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్ తహసీల్దార్లు, కౌంటింగ్ సూపరవైజర్లు పాల్గొన్నారు. సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణద్వివేది ఓట్ల లెక్కింపుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం సీఈఓ విజయవాడ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఎటువంటి అల్లర్లు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, జేసీ కె. వెట్రిసెల్వి, ఎన్నికల పరిశీలకులు, ఆర్ఓలు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు జస్‌కిరణ్‌సింగ్ సూక్ష్మపరిశీలకులకు సూచించారు. మంగళవారం కస్తూర్బాకళాక్షేత్రంలో సూక్ష్మపరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు మాట్లాడారు. ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అందరూ చదవాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మపరిశీలకులు అభ్యర్థులను, ఏజెంట్లను పలకరించడం, విష్ చేయకూడదన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. -
డోల్‌ను రంజుగా వాయిస్తున్న పంజాబీ యువతి
పంజాబీ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన డోల్‌ను భలే రంజుగా వాయిస్తున్న ఈ ఫొటోలో అమ్మాయి జహన్ గీత్ దేవల్. పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. వాస్తవానికి ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వచ్చింది ఆమెకు ఇప్పుడే. అయినా ఊరూరూ తిరుగుతూ ఓటు వెయ్యండహో అంటూ డోలు వాయిస్తూ ఇతరుల్లో స్ఫూర్తి నింపుతోంది. పంజాబ్‌లో అమ్మాయిలు డోలు వాయించడమంటేనే అదొక వింత. అది మగవాళ్లు మాత్రమే వాయించే వాద్య పరికరం అని పేరుంది. ఆ అడ్డుగోడల్ని ఛేదించి నాలుగేళ్ల క్రితం అంటే పద్నాలుగేళ్ల వయసులోనే జహన్ డోలు పట్టింది. సాధారణంగా పంజాబ్‌లో డోలుని శుభకార్యాల్లో వాయిస్తారు. ‘‘నేను తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఫస్ట్ టైమ్ ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లందరూ ఈసారి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలి. తమకు నచ్చిన ప్రతినిధిని ఎంచుకోవాలి‘‘ అంటూ ప్రచారం చేస్తున్నారు ఆమె. ‘‘మనం రాజకీయ నాయకుల్ని గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం. వారిలో ఎంత ప్రతిభ ఉందో తెలీకుండానే ఆహో ఓహో అని అంటూ ఉంటాం. ఒక్కోసారి తల్లిదండ్రుల ప్రలోభాలకి కూడా లొంగిపోతాం. కానీ అలా చెయ్యకూడదు. మనకి బంగారు భవిష్యత్ ఎవరి వల్ల వస్తుందో ఆలోచించి ఓటు వెయ్యాలి‘‘ అని అంటున్నారు జహన్. -
ప్రపోజ్ చేశాడు.. వెంటనే వద్దన్నాడు
-
ప్రపోజ్ చేశాడు.. వెంటనే వద్దన్నాడు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఈసీ మొదలు సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు ఓటు ఆవశ్యకత గురించి చెప్పడమే కాక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలంటూ తెగ ప్రచారం చేశారు. అయితే వీరి ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపిందో తెలీదు కానీ ఓ ఢిల్లీ యువకుడు చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లను ఆలోచనలో పడేయడమే కాక ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. డాక్టర్ అంగద్ సింగ్ చౌదరీ అనే వ్యక్తి తన ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేవిధంగా ఉంది. వీడియోలో ఓ యువకుడు.. తాను ఇష్టపడిన అమ్మాయికి.. తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు. కానీ ఆమె తిరస్కరిస్తుందేమో అనే ఆలోచనతో వెనకడుగు వేస్తుంటాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్తాడు. అందుకు వారు ‘ఎక్కువగా ఆలోచించకు. వెళ్లి నీ ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పమ’ని సలహా ఇస్తారు. ధైర్యం కూడగట్టుకున్న ఆ యువకుడు.. యువతి దగ్గరకు వెళ్లి.. మోకాళ్ల మీద కూర్చుని.. తన ప్రేమను తెలియజేస్తాడు. అందుకు ఆమె కూడా అంగీకరిస్తుంది. దాంతో ప్రేమించిన యువతి చేతికి ఉంగరం తొడగడానికి ఆమె చేతిని అందుకుంటాడు. కానీ వెంటనే ఆ ఆలోచనని విరమించుకుంటాడు. తాను ఆమెకి సరి జోడు కాదు.. మన్నించమని కోరతాడు. రెండు సెకన్ల ముందే తనను పెళ్లి చేసుకోమని కోరిన వ్యక్తి ఇంత సడెన్‌గా ఇలా మాట్లాడటంతో సదరు యువతి ఆశ్చర్యపోతుంది. కారణం అడుగుతుంది. అందుకు ఆ యువకుడు ఆమె చూపుడు వేలును చూపించి.. ఓటు వేయలేదని చెప్తాడు. అంతేకాక ‘దేశాన్ని ప్రేమించలేని వ్యక్తి.. తనను ఎలా ప్రేమిస్తుంద’ని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు. సింపుల్‌గా చాలా మంచి సందేశం ఇచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Che Guevara: “At the risk of seeming ridiculous, let me say that the true revolutionary is guided by a great feeling of love. It is impossible to think of a genuine revolutionary lacking this quality.” Indian Tik Tok: pic.twitter.com/dlF5MWzIbd — Dr. Angad Singh Chowdhry (@angadc) May 5, 2019 -
బస్సాపి...ఓటేసొచ్చాడు
కర్ణాటకలోని మంగళూరు–శివమొగ్గ రూట్లో వెళుతోంది ఆ బస్సు. రోజులాగే ప్రయాణికులతో బస్సు నిండుగా ఉంది. వెళుతున్న బస్సు ఒకసారిగా రోడ్డు పక్కకొచ్చి ఆగిపోయింది. వెంటనే డ్రైవర్ బస్సులోంచి దిగి పక్కనున్న కేంద్రానికి పరుగెత్తాడు. కొన్ని నిమిషాల తర్వాత వచ్చి బస్సు స్టార్ట్ చేసి యథాప్రకారం ముందుకు సాగాడు. దారి మధ్యలో బస్సు ఆగడం, డ్రైవరు ఎక్కడికో పరుగెత్తుకెళ్లడం చూసి ప్రయాణికులు ముందు కంగారుపడ్డారు. ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. అయితే, తిరిగొచ్చిన డ్రైవర్ చేతి చూపుడు వేలు మీదున్న సిరా చుక్క చూశాక జరిగిందేమిటో వారికి అర్థమయింది. విధి నిర్వహణలో ఉంటూ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటేసి వచ్చిన ఆ డ్రైవరును అంతా అభినందించారు. ఆ డ్రైవరు పేరు విజయ్ శెట్టి. జయరాజ్ ట్రావెల్స్‌లో గత పదేళ్లుగా డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఇటీవల అతని నియోజకవర్గంలో పోలింగు జరిగింది. ఆరోజు సెలవయినా కూడా జయరాజ్ డ్యూటీ చేశాడు. అలాగే, ఓటు కూడా వేశాడు. ప్రయాణికులతో గమ్య స్థానం వెళుతూ దారిలో బెలువాయిలో తన ఓటున్న పోలింగు కేంద్రం దగ్గర బస్సాపి ఓటేసొచ్చాడు. కొన్ని నిమిషాల్లోనే పని ముగించుకురావడంతో ప్రయాణికులు కూడా చిరాకుపడలేదు. శెట్టి ఓటు వేసిరావడాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. వందల మంది దాన్ని షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్ అయింది. అందరూ ఓటు విలువ తెలిసిన మనిషంటూ శెట్టిని అభినందించారు. ప్రజలకు ఓటు విలువ తెలియజేసిన ఈ డ్రైవరును సన్మానించనున్నట్టు దక్షిణ కర్ణాటకకు చెందిన సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ కమిటీ ప్రకటించింది. -
పెళ్లి నుంచి నేరుగా ఓటేయడానికి..
శ్రీనగర్ : ఎన్ని పనులున్నా ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో పెళ్లి నుంచి నేరుగా ఓ కొత్త జంట ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని ఉదంపుర్ పోలింగ్ బూత్‌కు పెళ్లి దుస్తుల్లోనే వచ్చిన ఈ జంటకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలో వైరల్ అవుతోంది. కొత్తజంటకు వివాహ శుభాకాంక్షలు చెబుతూ, ఓటు హక్కును తప్పకుండా ప్రతిఒక్కరు వినియోగించుకునేలా ఈ జంట అందరికీ స్పూర్తినిస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభంమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. -
సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చిన ద్వివేది..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా సమాధానమిచ్చారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ద్వివేది ఓటు వేసిన వీడియోను ఈసీ అధికారులు శనివారం విడుదల చేశారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగా ఆయన ఓటు వేయలేకపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. -
నల్గొండ: ఎన్నికలు ప్రశాంతం
సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే గత ఎంపీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ బాగా తగ్గింది. డిసెంబర్లో జరగిన శాసనసభ ఎన్నికల్లోనూ 90శాతానికి మించి పోలింగ్ నమోదు కాగా లోక్‌సభ ఎన్నికల్లో 75.11శాతానికి పడిపోయింది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నేతల్లో కనిపించిన జోష్, హడావుడి ఈ ఎన్నికల్లో కనిపించలేదు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. మరో వైపు ఎండ తీవ్రత అధికంగా ఉండడం కూడా ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు రవాణా ఇతరత్రా ఖర్చులు ఇచ్చి పోటాపోటీగా తీసుకురావడంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆ రెండు ఎన్నికల్లో ఓటర్ల ఆలనాపాలనా చూడటంతోపాటు పెద్ద ఎత్తున నజరానాలు, మద్యం, డబ్బు పంపిణీ జరిగింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. చాలా పోలింగ్ కేంద్రాలు ఉదయం నుంచే బోసిపోయాయి. అత్యధికంగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్(ఎస్సీ), తుంగతుర్తి(ఎస్సీ), ఆలేరు, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 81.70 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం నుంచే పోలింగ్ మందకొడిగా సాగింది. 7నుంచి 9గంటల వరకు 13శాతం పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అతి తక్కువగా 8.20శాతం, జనగామలో 8.37శాతం తుంగతుర్తిలో 18శాతం, మునుగోడులో 16.2శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9నుంచి 11గంటల వరకు 26.95శాతం పోలింగ్ నమోదైంది. జనగామలో 16.50శాతం, ఇబ్రహీంపట్నంలో 22శాతం, తుంగతుర్తిలో 37.85శాతం నమోదైంది. 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.99శాతం పోలింగ్ నమోదు కాగా, అనూహ్యంగా జనగామ నియోజకవర్గంలో పుంజుకుని 48.65శాతం నమోదైంది. మునుగోడులో 44.15శాతం, నకిరేకల్‌లో 33.74శాతం ఓట్లు పోలయ్యాయి. ఒంటి గంట నుంచి 3 గంటల వరకు 57.41శాతం పోలింగ్ జరిగింది. తుంగతుర్తిలో 66.70శాతం, ఆలేరులో 64.50శాతం, ఇబ్రహీంపట్నంలో 45.60శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3నుంచి 5గంటల వరకు 68.25శాతం పోలింగ్ జరిగింది. భువనగిరిలో అత్యధికంగా 81.70శాతం, ఆలేరులో 75.25శాతం, మునుగోడులో 72.50శాతం, తుంగతుర్తిలో 69.13శాతం, ఇబ్రహీంపట్నంలో 65 శాతం, నకిరేకల్‌లో 64.75శాతం, జనగామలో 62.23శాతం ఓట్లు నమోదయ్యాయి. 5 గంటల అనంతరం తెలిసిన వివరాల ప్రకారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 81.70 శాతం, ఆలేరులో 79.96శాతం, ఇబ్రహీంపట్నం 68.57శాతం, మునుగోడు 78.45శాతం, నకిరేకల్ 75.95శాతం, తుంగతుర్తి 72.38 శాతం, జనగామ 68.73శాతం పోలింగ్ ఓటింగ్ నమోదైంది. అందని పోల్ చిట్టీలు ఎన్నికల కమిషన్ పోల్ చిట్టీలను ఇంటింటికీ పంపిణీ చేయాలని ఆదేశించింది. కానీ, ఓటర్లందరికీ పోల్ చిట్టీలు అందలేదు. దీంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. అలాగే కొందరికి చిట్టీలు అందినా గుర్తింపు కార్డు కావాలని ఎన్నికల సిబ్బంది చెప్పడంతో వెనుదిరిపోయారు. పోలింగ్ కేంద్రాల వద్ద 11 రకాల గుర్తింపు కార్డుల జాబితాను ప్రదర్శించాల్సి ఉన్నా చాలా చోట్ల అది జరగలేదు. ఆలేరులో పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వచ్చిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడి దృష్టికి ఓటర్లు ఈవిషయాన్ని తీసుకువచ్చారు. ఆయన వెంటనే గుర్తింపు కార్డులకు సంబంధించిన బ్యానర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించి వెళ్లారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. 2014లోక్‌సభ, 2018శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతం పడిపోయింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో 79.68శాతం, ప్రస్తుతం 75.11శాతం నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే 4.57శాతం ఓటింగ్ తగ్గింది. డిసెంబర్ 2018లో శాసనసభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలో 88.69శాతం ఓట్లు పోలవగా ప్రస్తుతం 75.11శాతం నమోదైంది. మూడు నెలల్లోనే 13.58శాతం ఓటింగ్ తగ్గింది. తీవ్రమైన ఎండలు ఎండ తీవ్రత కూడా పోలింగ్ సరళిపై తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం 10.30గంటల నుంచే భానుడు భగ్గుమనడంతో జనం పోలింగ్ కేంద్రాలకు రావడానికి అనాసక్తి కనబరిచారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా లేకపోవడం ఎండలో నిలబడి ఓట్లు వేయడానికి ఆసక్తి చూపలేదు. అరకొరగా వేసిన టెంట్లు, ఓటర్లకు ఇబ్బందులు కలిగించాయి. -
ఓటు వేస్తే.. పెట్రోలుపై డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లకు గుడ్ న్యూస్. పోలింగ్‌లో ఓటింగ్ శాతానికి పెంచేందుకు పెట్రోలు డీలర్లు బంపర్ ఆఫర్ ప్రకటించారు. లోక్‌సభ మొదటి విడదల ఎన్నికల్లో మీరు ఓటు వేసిన తర్వాత పెట్రోల్‌గానీ, డీజిల్ గానీ కొనుగోలు చేస్తే దానిపై డిస్కౌంట్ ఆఫర్ ఉంది. పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిన వారికి లీటరుపై 50 పైసలు డిస్కౌంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులోఉంటుంది. అయితే ఓటు వేసిన గుర్తును (వేలిపై ఇంకు గుర్తు) పెట్రోల్ బంకుల్లో చూపించి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. పోలింగ్ రోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆల్ ఇండియా పెట్రోలియమ్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ తెలిపారు. అటు ఉత్తరాఖండ్‌లో పోలింగ్ సందర్భంగా ఏప్రిల్ 11న ఓటు హక్కును వినియోగించుకున్న వారికి పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై 50పైసలు డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఉత్తరాఖండ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పోలింగ్ రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకరికి గరిష్టంగా 20 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్‌పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాగా స్వార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ నేడు ( ఏప్రిల్ 11న) ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
మేము ఓటేస్తాం.. మీరూ వేయండి
హన్మకొండ చౌరస్తా: ‘మాకు సైతం ఓటు హక్కు కావాలని కొట్లాడి సాధించుకున్నాం.. అందుకే ఎన్నికల్లో సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులకోం.. మీరు సైతం ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలి’ అంటూ ట్రాన్స్‌జెండర్స్ పిలుపునిచ్చారు. అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల, తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హన్మకొండలోని వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ఈ చైతన్య ర్యాలీలో ప్లకార్డులు, నినాదాలు చేస్తూ సుమారు 300 మంది హిజ్రాలు పాల్గొన్నారు. ఈ ర్యాలీని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సలహాదారుడు ప్రొఫెసర్ పర్చా కోదండ రామారావు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మంచి నేతలను ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ హిజ్రాలను సమాజం చిన్నచూపు చూస్తున్నప్పటికీ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుంటున్నారని ప్రశంసించారు. ఓటుకు దూరంగా ఉండే వ్యక్తులు హిజ్రాలను ఆదర్శంగా తీసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్ సంఘం అధ్యక్షురాలు ఓరుగంటి లైలా మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది, దీనిని డబ్బు, మద్యంతో వెలకట్టలేమని అన్నారు. తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు గౌతమి, కోశాధికారి రజిత, సుధా, స్నేహా, జ్వాల సంస్థ సభ్యులు బుర్రి కృష్ణమూర్తి, కీత రాజ్‌కుమార్, వాంకె నర్సింగరావు, నిజాం తదితరులు పాల్గొన్నారు. ఓటు వేయడం మానుకోలేదు.. 2006కు ముందు వరకు మాకు ఓటు హక్కు లేదు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాం. విద్యావంతులు, యువత స్పందించి అందరూ ఓటు వేసేలా చైతన్యం కల్పించాలి. నూటికి 99శాతం మంది ఓటును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడు పుట్టుకొస్తాడు. మాలో ఉన్నత విద్య చదివిన వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ అర్హత ప్రకారం ప్రభుత్వ శాఖక్లా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. స్నేహ, వరంగల్ నాయకుల ప్రలోభాలకు గురికాము.. మాకు ఓటు హక్కు లేనప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. 2006 నుంచి ఇప్పటి వరకు శాసనసభ, లోక్‌సభ, కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగు సార్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాం. మాకు ఓటు ఉందని తెలిసిన అనేక మంది నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. కానీ మా సమస్యలను ఎవరు గుర్తించి పరిష్కరిస్తారని నమ్మకం ఉన్న నేతలకే స్వచ్ఛందంగా ఓటు వేస్తాం. మేము బతకడానికి అడుక్కుంటాము గానీ ఓటును అమ్ముకోం. రేష్మ, వరంగల్ -
ఓటు పుట్టుక.. నేపథ్యం
సాక్షి, నారాయణఖేడ్: ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగం ఎన్నుకున్న విధానం ఓటు. ఏ భాషలో అయినా అభ్యర్థులను ఎన్నుకోవడాన్ని ఓటు అని పిలుస్తారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు, ఓటర్లు అనే పదాలు తరుచూ వినిపిస్తున్నాయి. కానీ చాలా మందికి ఓటు అనే పదానికి అర్థం తెలియదు. ఓటు అన్న పదం ఓటన్ అనే లాటిన్ పదం నుంచి సేకరించారు. ఓటు అన్న పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. ఓటు అంటే తెలుగు నిఘంటువు ప్రకారం సమ్మతి తెలపడం, మద్దతు ఇవ్వడం, అంగీకారం, వాగ్దానం, ఎన్నుకోవడం అనే అర్థాలు ఉన్నాయి. ఎన్నికల్లో అభ్యర్థికి పాలనా అధికారాన్ని ఇవ్వడానికి తమ సమ్మతి తెలపడం అనే అర్థం ఉంది. పుట్టుక ఓటు వినియోగం క్రీస్తు పూర్వం 139 నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. పురాతన గ్రీస్ దేశంలో పగిలిన మట్టి పాత్రల ముక్కలను ఓట్లుగా వినియోగించినట్లుగా ప్రచారంలో ఉంది. ప్రాచీన భారతదేశంలో క్రీస్తు శకం 920లో తమిళనాడులో అరటి ఆకుల ద్వారా ఎన్నికలను నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. ఈ పద్ధతిని కూడా వొలూ వ్యవస్థ అని పిలిచే వారు. ఆమెరికాలో మొదటి సారిగా కాగితపు బ్యాలెట్లతో మాసాచు అనే సెట్స్‌లో ఓ చర్చి ఫాస్టర్ ఎన్నిక కోసం వినియోగించారు. ఆయా దేశాల రాజ్యాంగాలు పాలనా పరంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని అందించాయి.1952 నుంచి మన దేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు వినియోగంలోకి వచ్చింది. గతంలో బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వారు. తర్వాత ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా ఓటు వేస్తున్నారు. రాబోయే కాలంలో ఓటు వేసిన తర్వాత రశీదు ఇచ్చే విధానం కూడా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని పలువురు అధికారులు అంటున్నారు. -
ఉత్సాహంగా ఓటేస్తాం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ దేశమంతా సందడి నెలకొంది. తొలిదశ పోలింగ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా స్వస్థలాలకు వెళ్లేందుకు పలువురు సిద్ధమవుతుండగా, తొలిసారి ఓటుహక్కును వినియోగించుకునేందుకు యువతీయువకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏదేమైనా ఓటేయాల్సిందే.. తలకు మించిన భారమే అయినా ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలమైన పశ్చిమబెంగాల్‌కు వెళతానని దక్షిణ ఢిల్లీలో ఉంటున్న టీ వ్యాపారి నిఖిల్ పట్వారియా(47) తెలిపారు. ‘ఇటీవల నా తండ్రి అంత్యక్రియలు జరిగాయి. నదియా జిల్లాలోని స్వగ్రామం కృష్ణనగర్‌కు వెళ్లాలంటే రూ.15,000 ఖర్చవుతుంది. అయినా సరే ఊరికి వెళ్లి ఓటు వేస్తాను’ అని వెల్లడించారు. తాను గత 21 సంవత్సరాలుగా ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలో టీ–అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. యువతలో అసంతృప్తి హైదరాబాద్‌లో రాజకీయ ప్రచార వ్యూహకర్తగా పనిచేస్తున్న అనుస్తుప్‌రాయ్ బర్మన్(25) ఎన్నికల నేపథ్యంలో స్వస్థలమైన బెంగాల్‌లోని బరసత్‌కు వెళుతున్నట్లు చెప్పారు. మే 19న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకుంటానని తెలిపారు. కాగా, సుస్థిరాభివృద్ధితో పాటు మైనారిటీలపై దాడులు, మూకహత్యలు, పెద్దనోట్ల రద్దుపై యువత ప్రధానంగా అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. రఫేల్ ప్రభావం ఉంటుంది.. మతోన్మాదుల నియంత్రణలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని బిహార్‌కు చెందిన ప్రజాసంబంధాల అధికారి ప్రీతి సింగ్(27) అభిప్రాయపడ్డారు. ‘రఫేల్ ఒప్పందంపై చెలరేగిన వివాదం, అవినీతిమయమైన విద్యావ్యవస్థ ప్రధాన సమస్యగా మారాయి. మనకు మంచి నాయకుడు కావాలంటే ప్రతీఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. బిహార్‌లోని పట్నాసాహిబ్ లోక్‌సభ స్థానానికి మే 19న జరిగే ఎన్నికల్లో నా ఓటు హక్కును వినియోగించుకుంటాను’ అని ప్రీతి తెలిపారు. ఢిల్లీకి కేజ్రీవాల్ బెస్ట్.. ప్రధానిగా మోదీ.. ఢిల్లీకి చెందిన ఆటో డ్రైవర్లు రాజు, సకీల్ ఖాన్లు లోక్‌సభ ఎన్నికలపై మాట్లాడారు. ఆటో చార్జీలు పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజు, ఖాన్ స్పందిస్తూ..‘ఆటో చార్జీలు పెరిగితే ఎక్కే ప్రయాణికులు తగ్గిపోయే అవకాశముంది. ఈ నిర్ణయం ఆటో డ్రైవర్లకు నిజంగా> లబ్ధి చేకూరుస్తుందని నేను భావించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలు, పనితీరుపై మేమంతా సంతృప్తిగా ఉన్నాం. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ప్రధాని మోదీకే ఓటు వేస్తాం. ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో మంచి పనులు చేపట్టింది. కానీ మోదీ కాకుండా మరో వ్యక్తిని ప్రధానిగా ఊహించుకోలేం. మోదీ గొప్ప ప్రధాని అయితే, కేజ్రీవాల్ గొప్ప సీఎం’ అని తెలిపారు. -
ప్రశ్నపత్రమేదైనా జవాబు.. ఓటే!
పాలక పక్షాల నోటికొచ్చింది సమాచారం! విడదీయరాని ఆర్థిక బంధాలతో వాటికి ఊడిగం చేస్తున్న పచ్చ ప్రసారమాధ్యమాలు అసత్యాలు, అర్థసత్యాలను వ్యాప్తి చేస్తున్నాయి. అసలు ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా, ఇదే ప్రజాభిప్రాయమంటూ వండి వారుస్తున్నాయి. పాలకుల నోటికి హద్దు లేదు. నిన్న ఒక మాట నేడు ఒక మాట! ఎన్నికల ముందొక మాట, తర్వాత మరో బాట! ఓటరుకిది పరీక్షా సమయం. పరీక్షలెన్నయినా, ప్రశ్న పత్రాలేవైనా జవాబు ఒకటే, ఓటే! ఎక్కడో పోయి పోరాటాలు చేయడం కాదు, నీలోనే ఉన్న అరిషడ్వర్గాలనే అంతఃశ్శత్రు నిర్మూలనకు నడుంకట్టు, అంతా మంచే జరు గుతుంది అంటారు తాత్వికులు. మనిషిలోని కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యా లనే ఆరు అవలక్షణాల్ని అదుపు చేయగలిగితే అంతా జయించినట్టే అనేది దానర్థం. జానపద గాథల్లో, మన సినిమాల్లో చూపించినట్టు వేరె వరో ఉద్ధారకులు జాతిని తీర్చిదిద్దడానికి ఆకాశం నుంచి ఊడిపడరు! ఎవరిని వారు సంస్కరించుకొని, అంతా బుద్ధిగా నడుచుకుంటే సమా జం దానంతట అదే బాగవుతుందని తాత్పర్యం. బుద్ధి మందగించి వాటిని చెలరేగనిచ్చినపుడు మనిషైనా, సమాజమైనా పతనం అంచు లకు జారడమే! ఏదైనా అంతే! ధర్మాధర్మాలు అన్ని యుగాల్లోనూ ఉన్నాయి. వాటి నిష్పత్తిలో హెచ్చుతగ్గులే యుగధర్మాల్ని మార్చాయి, రాను రాను దిగజార్చాయి. ఇప్పుడు ఎన్నికల్నే తీసుకుందాం, ఓటరు బలహీనతపైన పాలకులు, పాలకపక్షాలు చేసే రాజకీయ విన్యాసాలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఎన్నిక ఎన్నికకు మరింత దిగజారుడు తనం తేటతెల్లమౌతోంది. తెలుగు సమాజంలో ఇదివరకు ఏ ఎన్నిక ల్లోనూ లేనంతగా ‘కులం’ ఈసారి జడలు విప్పుకుంటోంది. ఆర్థిక ప్రలో భాలతో ఏమైనా చేయొచ్చన్న విచ్ఛలవిడితనంతో ‘డబ్బు’ ఏరులై పారు తోంది. పగ్గాల్లేని అహంకారం వల్ల ఇంగితం విడిచిన ‘అధికారం’ ఏపీలో అరాచకాలు సృష్టిస్తోంది. అర్హుల తొలగింపు, అనర్హుల జోడింపులతో అసలు ఓటరు ‘అస్థిత్వమే’ ప్రమాదంలో పడింది. పరిస్థితి చక్కదిద్దే బాధ్యత విస్మరిస్తున్న ‘వ్యవస్థల వైఫల్యాలు’ రాజ్యాంగ స్ఫూర్తినే పరిహ సిస్తున్నాయి. నిజాల్ని నిలువునా పాతరేసి చెలరేగుతున్న అబద్ధపు ఆధి పత్యం ‘సమాచార వెల్లువ’ను సందేహాస్పదం చేస్తోంది. ఇవే, నేడు మన ఎన్నికల్ని, స్థూలంగా ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న అరిషడ్వర్గాలు. సదా అప్రమత్తత, ఈ అరిష్టాల గుర్తింపు, దుర్గుణాలకు లొంగకపోవ డమే ఇప్పుడు ఓటరు తక్షణ కర్తవ్యం. ప్రజాస్వామ్యం ముసుగులో చెలా మణి అవుతున్న ఈ అంతర్గత శత్రువుల్ని జయించడమే లక్ష్యం. కులం నిర్ణయిస్తుందా? రాజకీయాధికారాన్ని కులమే నిర్ణయించేదయితే, సుదీర్ఘకాలం ఈ దేశ ప్రధానులుగా ఏ జగ్జీవన్రామో, కాన్షీరామో, మాయావతో ఉండా ల్సింది. వారు పుట్టిన కులాల సంఖ్యా బలం అటువంటిది. కానీ, అలా జరుగలేదే? జరుగదు కూడా! అది అంగీకరించలేని వారు ఇప్పుడు ‘కులం’ కేంద్రకం చేసి రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. కుల బలం ఆధారంగా రాజకీయ పార్టీలనే స్థాపించి, రాజ్యాధికారం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. తమ ఆర్థిక, రాజకీయ విధానాల ద్వారా ప్రజా భిప్రాయాన్ని నేరుగా ప్రభావితం చేయజాలమని గ్రహించిన ఆయా పక్ష నేతలు కొందరు, కులం కార్డును వినియోగించి దొడ్డిదారిలో ‘ప్రజా తీర్పు’ ప్రభావితం చేయాలనుకుంటున్నారు. నియోజకవర్గ ఓటర్లలో కులాల వారీ లెక్కలు తీసి, బలాలు–బలగాల లెక్కలతో బరిలోకి దిగుతు న్నారు. నేరుగా లబ్ధి పొందలేమనుకుంటే, ఇంకొకరి రాజకీయ ప్రయోజ నాల్ని దెబ్బతీసేందుకు కులం కార్డు వాడుతున్నారు. ఫలానా నియోజక వర్గంలో ప్రత్యర్థి బలంగా ఉన్నాడంటే, మూడో పక్షంతో తెరచాటు బంధమల్లి, అదే కులానికి చెందిన అభ్యర్థిని వారి తరపున దింపి, ఓట్ల చీలికకు ఎత్తులు వేస్తున్నారు. సగటు ఓటరుకు లేని కుల భావనను రాజ కీయ పక్షాలే రుద్దుతున్నాయి. కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తు న్నాయి. ఎన్నికల తర్వాత ఇది ఏ విపరిణామాలకు దారి తీస్తుందోనని కొన్ని జిల్లాల్లో వివిధ సామాజిక వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. పుట్టలు పగిలినట్టు నోట్ల కట్టలు ప్రలోభాలు లేకుండా ఓటరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే వాతావరణం కల్పించాలి. అభ్యర్థులెవరూ పరిమితి మించి ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయొద్దు. కానీ, ఓటర్లకు, కార్యకర్తలకు, నాయకులకు, ఓటు దళారీలకు, వ్యవహారకర్తలకు... ఇబ్బడి ముబ్బడిగా డబ్బు పంచుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. సాక్షాత్తు ఏపీ శాసనసభాపతి స్థానంలోని నాయకుడే, ‘గత ఎన్నికల్లో నాకు 11 కోట్ల రూపాయలు ఖర్చయింది’ అని పలికినా... ఏ వ్యవస్థలూ చర్య తీసుకోలేదు. అలా ఖర్చు పెట్టడం ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి ప్రకారం శిక్షార్హమైన నేరం. టీడీపీకే చెందిన రాజమండ్రి ఎం.పీ మురళీమోహన్ డబ్బు తాజాగా పట్టుబడింది. రూ. 2 కోట్ల మొత్తాన్ని ఎన్నికలకు తరలిస్తుండగా హైదరాబాద్‌లో గురువారం çపట్టుకున్నారు. ఏపీ సీఎం బాబు బినామీగా ఈయనకు పేరుంది. ఇది సరే, మరి పట్టుబడకుండా పంపిణీ అయిం దెంత? చిత్తూరు జిల్లాలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 25 నుంచి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని పాలకపక్షం వ్యూహరచన చేసిం దని రాజకీయ వర్గాల్లో ప్రచారం. గుంటూరులోని కొన్ని నియోజకవ ర్గాల్లో.. ప్రత్యర్థికి బలమైన మద్దతుదారులనుకున్న చోట, ‘ఓటు వేయ కుండా ఉండండి చాలు... ఇదో ఇంతిస్తాం’ అని బేరాలు సాగుతు న్నాయి! ఎన్నికల వ్యయానికి ముందు, తర్వాత రాజకీయ అవినీతితోనే ఆ సొమ్మును పోగుచేస్తున్నారు. లాభాలూ ఆర్జిస్తున్నారు. అధికారమంటే అడ్డులేనితనమా? ఏం చేసైనా అధికారం నిలబెట్టుకోవాలనే తపన వెనుక దురుద్దేశాలను ప్రజలు గ్రహించాలి. ఇదివరలో ఓట్లు కొనడానికి అభ్యర్థులు, పార్టీలు సొంత డబ్బు ఖర్చు చేసేది. కానీ, కాలం మారి... ప్రభుత్వంలో ఉన్న వారు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఓట్ల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నారు. అందంగా సంక్షేమ కార్యక్రమాల ముసుగు తొడిగి, నగదు బదిలీతో నేరుగా ఓట్లు కొల్లగొడుతున్నారు. ఏపీలో ప్రభుత్వం ఎన్నికలకు సరిగ్గా రెండు, మూడు నెలల ముందు పలు సంక్షేమ కార్యక్రమాల పేరిట నగదు బదిలీకి ఎత్తు వేసింది. ఒక్కో లబ్దిదారుకు, ఈ మూడు నెలల్లో ముఫ్పై, నలబై వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో చూసుకునే యోగం కల్పించి, ప్రలోభ పెడుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల, అభివృద్ధి కార్య క్రమాల బిల్లుల్ని నిలిపి వేసి, నిధుల్ని ఇటు మళ్లించింది. ఎన్నికలకు సరిగ్గా పది రోజుల ముందు, అంటే ఏప్రిల్ ఒకటో తేదీ ఒక్కరోజే, కొన్ని వేల కోట్ల రూపాయల మేర ఖజానా ఖాళీ అయిందంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇలా నిధుల దారి మళ్లింపును లోగడ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ (కాగ్) కూడా తప్పుబట్టింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏపీలో కొనసాగించిన అరాచకాలకు అడ్డే లేదు. గ్రామీణ స్థాయిలో పార్టీ యంత్రాంగంతో ఏర్పరచిన ‘జన్మభూమి’ కమిటీలతో సమాంతర ప్రభు త్వాన్నే నడుపుతున్నారు. ఎన్నికైన పంచాయతీ పాలనా సంస్థలకు, సచి వాలయానికి, చట్టబద్ద ప్రభుత్వ విభాగలకు విలువే లేదు. అయిదేళ్ల పాటు పోలీసు యంత్రాంగాన్ని ఇష్టానుసారం వినియోగించుకున్న పాల కపక్షం, ఎన్నికల్లోనూ వారి సేవల్ని దుర్వినియోగపరుస్తోంది. ఇంటలి జెన్స్ విభాగాన్ని ఇంటి సంస్థగా మార్చి, విభాగాధిపతి బదిలీని అడ్డుకు నేందుకు టీడీపీ ప్రభుత్వం చేసిన నానా యాగీని ప్రజలు కళ్లారా చూశారు. ఈసీ అధికారాల్నే న్యాయస్థానంలో సవాల్ చేసేంత సాహసా నికి హేతువు.. నిండైన స్వార్థం, అధికార లాలస! కడకు కోర్టు మంద లిస్తే క్షమాపణలు చెప్పి బయటపడింది. ఓటరు ఉనికికే ఎసరు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ప్రాథమిక యూనిట్ ఓటరు. సదరు ఓటరు ఉనికికే ప్రమాదం తెచ్చే దురాగతానికి టీడీపీ ప్రభుత్వం ఒడిగట్టింది. అధికారం అడ్డుపెట్టుకొని, తమకు అనుకూలం కాదనుకు న్నవారి ఓట్లను గంపగుత్తగా గల్లంతు చేయడం, దొంగ ఓట్లను ఇబ్బడి ముబ్బడిగా చేర్పించడం.. ఇదీ వరస! సామాన్యుల డాటాను ఏక మొత్తంగా ప్రైవేటు జేబు సంస్థకు అప్పగించి, అనైతిక పద్దతుల్లో దాన్ని వాడింది. వేర్వేరు సంక్షేమ పథకాల లబ్ధిదారుల డాటాను ఓటరు జాబి తాతో అనుసంధానపరచింది. ఈ డాటా ఆధారంగా సర్వే జరిపిస్తూ అనుకూలురకు ఒక పద్ధతి, వ్యతిరేకులకు మరో పద్ధతి పాటించి, ఓ కొత్త రకం వైట్‌కాలర్ నేర ప్రక్రియకు తెర లేపింది. ఇది పట్టుబడటంతో, తమ డాటాను పొరుగురాష్ట్రం దొంగిలించిందటూ ఎదురుదాడితో అరిచి గీపె ట్టింది. ఏపీలో 56 లక్షల దొంగ ఓట్లు చేర్పించారని ఒక అభియోగం వస్తే, దాదాపు 7 లక్షల పైచిలుకు నిజమైన ఓట్లను గల్లంతు చేశారని మరో అభియోగం ఆధారాలతో వచ్చింది. చట్టం ద్వారా లభించిన విస్తృ తాధికారాలుండి కూడా ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోంది. న్యాయ స్థానాలూ ఈ దురాగతాన్ని అడ్డుకోలేకపోయాయి. వ్యవస్థల వైఫల్యమొక శాపం రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాలు, పాలకపక్షాలు దారి తప్పినపుడు రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం, ఇతర స్వతంత్ర సంస్థలు కల్పించుకోవాలి. కనీసం, న్యాయం కోరినపుడు ఆదుకోవాలని చూడటం సహజం. కానీ, సదరు సంస్థలు సకాలంలో న్యాయం చేయ కపోతే బాధితులకు దిక్కేది? ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే ఆయా ప్రభుత్వ పాలనా వ్యవస్థలు, అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం పరిధిలోకొస్తాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇందులో భాగమే! అటువంటిది, ప్రభుత్వ తాబేదారుగా ఒక ప్రధాన కార్యదర్శి ఈసీ నిర్ణ యాన్నే కోర్టులో సవాల్ చేయడాన్ని ఎలా చూడాలి? పరిమితికి మించి డబ్బు ఖర్చు చేసిన ఒక్క కేసులోనూ అభ్యర్థిత్వం రద్దు కాలేదు. సెన్సార్ ఆమోదించిన ఒక సినిమా ఒక రాష్ట్రంలో విడుదలై మరో రాష్ట్రంలో విడు దలకు నోచుకోలేదు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలు గాలికి పోయినా ఏ సంస్థా చర్య తీసుకోలేదు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన ప్రభుత్వ సంస్థలు నిర్లజ్జగా పాలకపక్షాలకు ఊడిగం చేస్తున్నాయి. వెతుక్కోవాల్సిన గతి! నిజాల్ని నిలువునా పాతరేసి అబద్ధాలు రాజ్యమేలుతున్నాయి. పాలక పక్షాల నోటికొచ్చింది సమాచారం! విడదీయరాని ఆర్థిక బంధాలతో వాటికి ఊడిగం చేస్తున్న పచ్చ ప్రసారమాధ్యమాలు అసత్యాలు, అర్థస త్యాలను వ్యాప్తి చేస్తున్నాయి. ఉభయులూ కలిసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపుతూ, తప్పుడు సమాచారంతో కనికట్టు చేస్తున్నారు. జన హితం గాలికిపోతోంది. ఇది సగటు ఓటరును గందరగోళంలోకి నెడు తోంది. అసలు ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా, ఇదే ప్రజాభిప్రా యమంటూ వండి వారుస్తున్నాయి. నలుదెసల ‘నకిలీ వార్తల’యుగంలో బాధ్యతగా ఉండాల్సింది పోయి, బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. పాలకుల నోటికి హద్దు లేదు. నిన్నొక మాట నేడొక మాట! ఎన్నికల ముందొక మాట, తర్వాత మరో బాట! నిజమేదో జనం వెతుక్కోవా ల్సిన దుర్గతి. ప్రజాస్వామ్యాన్ని ఆవహించిన ఈ అరిషడ్వర్గాలను అధి గమించాలి. ఓటరుకిది పరీక్షా సమయం. పరీక్షలెన్నయినా, ప్రశ్న పత్రా లేవైనా జవాబు ఒకటే, ఓటే! దిలీప్ రెడ్డి -
వేసిన ఓటు చూసుకోండి
విజయనగరం మున్సిపాలిటీ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానం మార్పులు సంతరించుకుంటోంది. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడగా 1951లో దేశంలో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. తొలినాళ్లలో బ్యాలెట్ విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఈ విధానంలో బ్యాలెట్ పేపర్‌పై ఓటర్ నచ్చిన అభ్యర్థికి ముద్ర వేసి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కించి విజేతను ప్రకటించేవారు. 2004 వరకు ఇదే విధానం కొనసాగగా 2004 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) అందుబాటులోకి వచ్చాయి. ఈవీఎం వినియోగంపై ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం పారదర్శకత కోసం వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్)ను ప్రవేశపెట్టింది. ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్‌ను వినియోగించనున్నారు. ఈ విధానంలో మీరు ఎవరికి ఓటు వేశారో మీరు ధ్రువీకరించుకునే సదుపాయం కల్పించారు. వీవీ ప్యాట్ అంటే.. ఇటీవల తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వీవీ ప్యాట్‌ను ప్రవేశపెట్టింది. ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో సరిచూసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం వీవీ ప్యాట్ ప్రత్యేకం. ఇందుకోసం వీవీ ప్యాట్ అనే అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సరికొత్త యంత్రం ద్వారా ఎలా ఓటు వేయాలో తెలుసుకుందాం. వీవీ ప్యాట్‌తో ఓటు వేసే విధానం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే అక్కడ ఓటింగ్ కోసం మూడు యంత్రాలు కనిపిస్తాయి. అవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. పోలింగ్ అధికారి తన వద్ద ఉండే కంట్రోల్ యూనిట్ ద్వారా మనల్ని ఓటింగ్‌కు అనుమతిస్తారు. అధికారులు చెప్పిన తర్వాత మనం ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ ఉంచిన బూత్‌లోకి వెళ్లాలి. బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థులకు సంబంధించిన పార్టీల గుర్తులు ఉంటాయి. మనం మొదట బ్యాలెట్ యూనిట్లో నచ్చిన గుర్తుకు ఓటు వేయాలి. ఏడు సెకెన్ల పాటు కనిపించే ఓటు ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్‌పై క్లిక్ చేయాలి. మనం ఓటు వేసిన వెంటనే ఏ అభ్యర్థికి ఓటు వేశామో.. ఆ అభ్యర్థికి సంబంధించిన గుర్తు ముద్రించిన కాగితం ఒకటి వీవీ ప్యాట్ యంత్రానికి అమర్చిన అద్దం వెనకాల కనిపిస్తుంది. ఇది 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. దానిని పరిశీలించి మనం ఎంచుకున్న అభ్యర్థికే ఓటు పడిందా, లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఈ విధానంలో ఏ గుర్తుకు ఓటు వేశామో అక్కడికక్కడే కచ్చితంగా ధ్రువీకరించుకోవచ్చు. అనుమానం వస్తే లెక్కింపు వీవీప్యాట్‌లో కనిపించిన కాగితం ముక్క 7 సెకన్ల అనంతరం.. యంత్రం అడుగు భాగంలో అమర్చిన బాక్సులోకి వెళ్లిపోతుంది. అది ఇక బయటకి రాదు. దీంతో మన ఓటు ప్రక్రియ ముగిసినట్టు. యంత్రం పనితీరుపై అభ్యర్థి ఎప్పుడైనా అనుమానం వ్యక్తం చేస్తే ఆ కాగితపు ముక్కలను పరిశీలించి, లెక్కించే సౌలభ్యం ఉండటం ఈ సరికొత్త ఓటింగ్ విధానం ప్రత్యేకత. -
ఓటు.. ఐదు రకాలు
సాక్షి, పాల్వంచరూరల్: ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ఓటు ద్వారానే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఐదు రకాలుగా ఓట్లు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. టెండర్ ఓటు, సాధారణ ఓటు, సర్వీస్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రభుత్వశాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఓటర్లే. ఎన్నికల సమయంలో వీరు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. వారికి కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను తపాలాశాఖ ద్వారా పంపించి ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరికొంతమంది పోలింగ్ ముందురోజే ప్రత్యేకంగా ఉద్యోగులకోసం పోస్టల్ పోలింగ్‌ను ఏర్పాటుచేసి ఓటువేయిస్తారు. ఓట్ల లెక్కింపు అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో సందర్భంలో పోస్టల్ ఓట్లే కీలకంగా మారతాయి. టెండర్ ఓటు ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్న ఓటరు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసేటప్పటికీ ఆ వ్యక్తి ఓటును మరొకరు వేసినా.. సదరు వ్యక్తి ఓటు వేయొచ్చు. ఇందుకోసం రిటర్నింగ్ అధికారి వద్ద తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని నిరూపించాలి. పోలింగ్ అధికారి హామీతో ఓటును వినియోగించుకోవచ్చు. దీన్నే టెండర్ ఓటు అంటారు. సాధారణ ఓటు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ పౌరుడు అన్నిరకాల ఎన్నికల్లో ఓటువేసే అవకాశం కలిగి ఉంటాడు. ఇదే సాధారణ ఓటు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందేందుకు అర్హులు. ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఆధారాలు చూపిస్తే ఓటు హక్కు కల్పిస్తారు. సర్వీస్ ఓటు సైనికులకోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వీస్ ఓటు వేసే అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సైన్యంలో విధులు నిర్వహించే సైనిక ఉద్యోగులు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉంటారు. సైన్యంలోని ప్రధాన అధికారి ద్వారా/ తపాలా శాఖ ద్వారా ఓటును పంపించవచ్చు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫరబుల్ ద్వారా కూడా పంపవచ్చు. ప్రవాస భారతీయులకూ.. ఈసారి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆన్లైన్లో ఫారం 6ఏ ద్వారా దరఖాస్తులు చేసుకుని తగిన ఆధారులుచూపించి ఓటు హక్కును పొందవచ్చు. ఓటు హక్కు పొందిన ప్రవాస భారతీయుల ఆసక్తి మేరకు విదేశాలనుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. -
పుట్టపర్తి ఎమ్మెల్యే.. ఓటు కదిరిలో!
పుట్టపర్తి అర్బన్: తన ఓటును కూడా వేసుకోలేని అభ్యర్థి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి. ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పని చేసినా ఈయన ఏనాడు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరనే వదంతి ఉంది. పుట్టపర్తిలో అద్దె గదుల్లో ఉంటూ రాజకీయాలు చేయడమే తప్ప.. ఇక్కడి ప్రజలను, అభివృధ్దిని ఏ మాత్రం పట్టించుకోలేదని స్థానికులు వాపోతుంటారు. కనీసం నియోజకవర్గంలో ఓటు కూడా లేకపోవడం చూస్తే నియోజకవర్గ ప్రజలపై ఆయనకున్న అభిమానం ఏపాటిదో అర్థమవుతోంది. కదిరి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెం.230లో ఓటరు జాబితా సీరియల్ నెం.282లో పల్లె రఘునాథరెడ్డికి ఓటు ఉంది. ఈ విషయం తెలిసి స్థానికులు ఆయనపై జోకులు వేసుకుంటున్నారు. ఆయన ఇటీవల టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించినా..అదీ కూడా అద్దె గదిలోనే కావడం గమనార్హం. -
నమస్కారం.. మీ ఓటు ఎవరికి..?
సాక్షి, తిరువూరు : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటును ఎవరికీ వేస్తారో చెప్పాలంటూ నియోజకవర్గాల వారీగా ఓటర్లకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నమస్కారం ఇది ప్రజాభిప్రాయ సేకరణ. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికి మీరు ఓటు వేస్తారు. టీడీపీ అయితే ఒకటి, వైఎస్సార్సీపీ అయితే రెండు, జనసేన లేక ఇతర పార్టీలకు అయితే మూడు నొక్కండి అంటూ నిత్యం ఫోన్లు చేస్తున్నారు. 83339 99999 నంబరు నుంచి రికార్డ్ వాయిస్‌తో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఒక సారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అరగంట తర్వాత లేదా ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేంత వరకు ఈ విధమైన ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఫ్యాన్సీ నంబరు కావడంతో కాల్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు. తిరిగి ఈ నంబరుకు డయల్ చేస్తే నంబరు ఉపయోగంలో లేదు అనే రికార్డ్‌డెడ్ వాయిస్ వస్తోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాయిస్‌తో మీ నియోజకవర్గంలో టీడీపీకీ చెందిన ఏ అభ్యర్థికి మద్దతు తెలియజేస్తారో చెప్పాలంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అది పార్టీకి సంబంధించిన వ్యవహారంగా ఉండేదని, కాని ఇప్పుడు ఏకంగా ఏ పార్టీకి ఓటు వేస్తారో ముందుగానే చెప్పాలంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా చేయడం సరికాదని ఓటర్లు వాపోతున్నారు. పోలింగ్ బూత్‌లో రహస్యంగా ఉండాల్సిన వివరాలను ఈ విధంగా నిత్యం బహిరంగంగా అడగడం ఏమిటంటూ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల అధికారులు కోడ్ ఉల్లంఘనులపైనే కాకుండా ఇలాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నారు. -
రాజ్యాంగమా.. నీవే దిక్కు!
స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలో చాలామంది ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వాలు అంటే తెలియదు. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి కొన్ని రాజ్యాంగ హక్కులు కల్పించినప్పటికీ ఇప్పటి వరకు వాటిని స్వేచ్ఛగా వాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా దళిత హక్కులకు పూర్తిగా భగం వాటిల్లితోంది. అందుకు ఉదాహరణ మండలంలోని రామాయపాలెం. సాక్షి, మర్రిపూడి(ప్రకాశం): ఈ గ్రామంలో 591 ఓట్లు ఉన్నాయి. దళితవాడలో 250 మంది దళితులు నివసిస్తున్నారు. కాలనీలో 198 మంది దళితుల (మాదిగలు) ఓట్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ నంబరు 14 లో తమ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే దాదాపు 35 ఏళ్లుగా ఈ దళితవాడలోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న దాఖలాలు లేవు. అధికారపార్టీకి చెందిన నేతల బెదిరింపులే ఇందుకుకారణ మని దళితులు వాపోతున్నారు. బెదిరింపుల పర్వం మండలంలోని సింహభాగం చౌదరి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 393 ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో అక్కడ అధికార తెలుగుదేశం పార్టీదే హవా. ఎన్నికల సమయంలో దళితులకు చెందిన ఓట్లను వినియోగిచుకోనివ్వరు. ఎస్సీ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురౌతున్నారు. వారి ఓట్లు లాక్కుని వేసుకోవడం రామాయపాలెం గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. ఆ గ్రామంలో ప్రతి ఎన్నికల్లో ఓటర్లును బెదిరించడం, ప్రలోభాలకు లోను చేయడం, ఎదురుతిరిగితే దౌర్జన్యానికి దిగడం జరుగుతోంది. అందుకే ఆ గ్రామ దళితులు భయపడి తమ ఓటును వినియోగించుకోకుండా బూత్‌ల వద్ద ఉన్న ఏజెంట్లకు ఇచ్చి వెళ్లిపోతుంటారు. నా ఓటు నేను వేసుకుంటా అన్న మాట దళితుల నుంచి వినిపిస్తే గ్రామంలోకి రానివ్వరు. పనులకు పిలవరు, డబ్బులు ఇచ్చినా తాగునీరు (బబుల్స్ నీరు), పాలు కట్ అంటారు. అందుకే భయపడి అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లకు ఓటరు స్లిప్ ఇస్తామంటున్నారు. నాడు 10 ఓట్లే వేశారు మండలంలోని రామాయపాలెం గ్రామంలోని పోలింగ్ బూత్ నంబరు 14 వద్దకు ఓటు వినియోగించుకోనివ్వకపోవడంతో దళితవాడలో నూతన పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలంటూ గతంలో జిల్లా కలెక్టర్‌కు రెండుసార్లు వినతిపత్రం సమర్పించారు. 2014 ఎన్నికల్లో ఓటు వినియోగించుకోనివ్వకపోవడంతో అప్పటి కలెక్టర్ విజయకుమార్‌ను సంప్రదిస్తే మాకు పోలీస్ సెక్యూరిటీతో 10 ఓట్లు మాత్రమే వేసుకోనిచ్చి మిగిలిన ఓట్లు అన్నీ సీసీ కెమేరాలు తొలగించి అధికార పార్టీకి చెందినవారు వేసుకుని గెలుచుకున్నారని గ్రామ దళితులు వాపోతున్నారు. దళితవాడలో నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ అధికారులను వేడుకున్నా ఉపయోగంలేదు. దీంతో మండల స్థాయి అధికారులు, బూత్‌లెవల్ అధికారుల అండతో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. ఓటరు లిస్టులో ఓట్లు ఉన్నాయని ఈ సారైనా తమ ఓటు హక్కు తమకు కల్పించాలని వేడుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రలోభాలా? ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాస్వామ్యదేశంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు అంబేడ్కర్ దళితులను కల్పించారు. నేటి సమాజంలో అసమానతలు తొలగాలని సమానత్వం పెంపొందించాలని రాజ్యాగంలో దళితులకు ఓటు హక్కు అనే ఆయుధం మాకు ఇచ్చారు. కానీ అ పరిస్థితి లేదు. ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. - కోండ్రు మోజేష్ (నేషనల్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మండల అధ్యక్షుడు) బూత్ వద్దకు ఎలా వస్తారో చూస్తామంటున్నారు మాగ్రామంలో పోలింగ్ బూత్ నంబరు 14 వద్ద కు వెళ్లాలంటే భయంగా ఉంది. పోలింగ్‌బూత్ వద్దకు దళితులు ఎలా వస్తారో చూస్తామంటున్నారు. - మక్కెన బ్రహ్మయ్య ఓటు లాక్కుని వేసుకుంటారు ఓట్లు వేయడానికి ఎన్నిసార్లు పోలింగ్‌బూత్ వద్దకు వెళ్లినా నా ఓటు లాక్కుని పచ్చనేతలు వేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మా ఓట మమ్ములనువేసుకోనివ్వండి సారూ. - మక్కెన శ్యాంసన్ దళితవాడలో పోలింగ్ బూత్ పోలింగ్ బూత్‌నంబరు 14 వద్ద ఎలాగూ ఓటు వేసుకోనివ్వరు. అందు వల్లా మా ఓట్లు మేమువేసుకోవడానికి వీలుగా దళితవాడలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. - ఎం. హరి ఇప్పటి వరకు వినియోగించుకోలేదు మండలంలోని రామాయపాలెం గ్రామంలోని దళితవాడలో నివసిస్తున్నా దాదాపు 35 ఏళ్లుగా ఓటు వినియోగించుకున్న దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికల సమయంలో మమ్ములను బెదిరించి లాక్కుని ఓటు వేసుకుంటున్నారు. - మక్కెన శ్రీను -
ఓటు నమోదుకు రేపే చివరి రోజు: ఈసీ
-
ఆఫ్లైన్లోనూ ఓటు దరఖాస్తుకు అవకాశం
అమరావతి: ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 15తో గడువు ముగుస్తుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది తెలిపారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎన్నికల అనంతరం పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుపైనే ఉందన్నారు. ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. అనేక మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు, తనిఖీకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ స్థాయిలో ఓట్లు పెరిగేందుకు ప్రజలతో పాటు అన్ని వర్గాల కృషి ఉందని వ్యాఖ్యానించారు. ఓటు నమోదు కోసం ఆన్లైన్లో సర్వర్ డౌన్ అయితే ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు చేయవచ్చునని సూచించారు. బూత్ లెవెల్ అధికారి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ దరఖాస్తు ఫారంలను నేరుగా సమర్పించవచ్చని తెలిపారు. ఏపీ ఓటర్ల నమోదులో వెనకబడి ఉందన్న వాదనలు సరికాదని అన్నారు. ఓటర్ల నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని చెప్పారు. 7 నుంచి 9 శాతం వరకూ ఓటర్లు పెరిగే అవకాశముందని వ్యాక్యానించారు. 3.95 కోట్లకు ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని అన్నారు. జనవరి 11కు ముందు 20 లక్షల కొత్త ఓట్లు జాబితా చేర్చామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ తర్వాత విడుదల చేయనున్న అనుబంధ ఓటర్ల జాబితా తర్వాత మరో 20 లక్షలకు పైగా ఓట్లు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ఎన్నికల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు ఏపీలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. 6600 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 6160 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, 31 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, 46 తాత్కాలిక చెక్‌పోస్టులు, 18 మొబైల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాణిజ్య పన్నుల శాఖల ఆధ్వర్యంలో 161 బృందాలతో లావాదేవీలపై నిఘా పెంచినట్లు చెప్పారు. సోషల్ మీడియాపై నిఘా కోసం జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లో 29.91 కోట్ల నగదు, 13.57 కిలోల బంగారం, 70 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసుల తనిఖీల్లో 190 జిలెటిన్ స్టిక్స్, 50 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఓటు హక్కుపై చైతన్యం పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటింగ్ శాతం పెరిగితే అది దేశానికి శుభసూచకం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన పెంచాలని పలు రంగాల ప్రముఖులకు పిలుపునిచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా, సామాజిక, వినోద రంగాల ప్రముఖులను ట్యాగ్ చేస్తూ ప్రధాని బుధవారం వరస ట్వీట్లతో పాటు ప్రత్యేక బ్లాగ్ రాశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, వ్యాపార దిగ్గజం రతన్ టాటా, బెంగాల్ సీఎం మమత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నాగార్జున, మోహన్‌లాల్ తదితరుల పేర్లు ప్రస్తావించారు. తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు, ఏపీ సీఎం చంద్రబాబు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, దీపికా పదుకొణె తదితరులను ట్యాగ్ చేశారు. మీడియా రంగ ప్రముఖులు వినీత్ జైన్, సంజయ్ గుప్తా, అరుణ్ పూరీలతో పాటు సంస్థలు పీటీఐ, ఏఎన్‌ఐలను జతచేస్తూ ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకమన్నారు. ఓటేయకుంటే ఆ నొప్పి తెలియాలి ‘అధిక ఓటింగ్ శాతంతో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. అది దేశానికి శుభసూచకం కూడా. పటిష్ట ప్రజాస్వామ్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుంది. గత కొన్నేళ్లుగా ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు విలువను తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులను కోరుతున్నా. దేశ ప్రగతి పథంలో భాగస్వామి అయ్యేందుకు పౌరుడి ఇష్టాన్ని ఓటు సూచిస్తుంది. పోలింగ్ బూతులకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోని వారికి ఆ బాధ తెలియాలి. భవిష్యత్తులో మీరు కోరుకోని, అవాంఛనీయ పరిస్థితి రావాలని అనుకుంటున్నారా? మీరు ఆ రోజు ఓటేయనందుకే ఈ పరిస్థితి తలెత్తిందని చింతిస్తారా?’ అని మోదీ బ్లాగ్‌లో ప్రశ్నించారు. -
అక్కడ ఓటెయ్యక పోతే వేటే
ఎక్కువ మంది ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు జనరంజక పాలనను అందిస్తాయని, ఆ దిశగా పోలింగ్ శాతం పెంచేందుకు వివిధ దేశాలు పలు నిబంధనలు విధిస్తున్నాయి.మన రాష్ట్రంలో 65 శాతం, దేశంలో చాలాచోట్ల 60 శాతం ఓటింగ్ నమోదవడమే కష్టం. ఈ నేపథ్యంలో ఓటువేయడాన్ని పౌరులు బాధ్యతగా తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలన్న డిమాండ్ కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి బలంగా వినిపిస్తోంది. ఆస్ట్రేలియాలో అపరాధ రుసుము.. ఈ దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఓటేయకుంటే జరిమానా విధిస్తారు. ఎన్నికలు జరిగిన వారంలోగా విచారణ చేపట్టి, అపరాధ రుసుము ఎంతన్నది నిర్ణయిస్తారు. ఇక్కడ 96 శాతం దాకా ఓటింగ్ నమోదవుతుంది. ఎన్నికలకు చాలా ముందునుంచే ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గ్రీస్...డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు రద్దు... ఈ దేశంలోఓటువేయకుంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ రద్దవుతాయి. ఓటుహక్కును వినియోగించుకోని వారు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే అది మంజూరు కాదు. ఓటు వేయకపోవడానికి గల కారణాలను అధికారులకు ఆధారాలతో చూపించాల్సి ఉంటుంది. వారు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే మళ్లీ ఓటు హక్కును పునరుద్ధ్దరిస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సౌకర్యాలపై ఆంక్షలు విధిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 33 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. ఈ హక్కును వినియోగించుకోకుంటే కొన్ని దేశాలు జరిమానా విధిస్తుండగా, మరికొన్ని ప్రభుత్వ సాయాన్ని, సదుపాయాలను నిలిపేస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఉద్యోగుల జీతాలను కొంతకాలం నిలిపివేస్తున్నారు. మరికొన్ని దేశాల్లో ఓటు హక్కును తొలగిస్తున్నారు. సరైన కారణం చూపితేగాని దాన్ని పునరుద్ధరించే అవకాశం ఉండదు. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన దేశాల్లో ప్రముఖంగా బెల్జియం, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బొలీవియా, ఉక్రెయిన్, బ్రెజిల్, ఈజిప్టు, గ్రీస్, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, టర్కీ, స్విట్జర్లాండ్, నార్త్ కొరియా తదితర దేశాలున్నాయి. సింగపూర్‌లో ఓటు వేయని వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగిస్తారు. ఓటు వేయకపోవడానికి కారణాలను, ఆధారిత పత్రాలను అధికారులకు సమర్పిస్తేనే తిరిగి వారి పేర్లను పునరుద్ధరిస్తారు. అత్యధిక పోలింగ్ శాతం ప్రపంచంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యే దేశాల్లో ఆస్ట్రేలియా, చిలీ, బెల్జియం, ఇటలీ, లెక్సింబర్గ్ ముందుంటాయి. ఇక్కడ 90–96 శాతం మధ్య పోలింగ్ జరుగుతుంది. నెదర్లాండ్స్, స్లోవేకియా, ఆస్ట్రియా, స్వీడన్, జర్మనీ, డెన్మార్క్, న్యూజిలాండ్, ఐస్లాండ్ దేశాల్లో 80 శాతానికి పైగా నమోదవుతుంది. 60 శాతానికన్నా తక్కువగా అమెరికా, పాక్, స్విట్జర్లాండ్, రష్యా దేశాల ప్రజలు తమ ఓటు హుక్కును వినియోగించుకుంటున్నారు. వెనెజులా, నెదర్లాండ్స్, లెక్సింబర్గ్లలో ఓటింగ్ తప్పనిసరి. ఓటు వేయకుంటే ప్రభుత్వ రాయితీలు నిలిపివేస్తారు. అనేక ఆంక్షలు... బెల్జియం...ఓటు వేయకుంటే భారీ జరిమానా... ఇక్కడ ఓటరు జాబితాలో పేరుండి, వరుసగా నాలుగు సార్లు ఓటెయ్యక పోతే...పదేళ్లవరకూ ఓటు హక్కును తొలగిస్తారు. మొదటిసారి ఓటు వేయకపోతే 2,000 నుంచి 4,000 యూరోల వరకూ జరిమాన. రెండోసారి అయితే 10,000 యూరోల వరకూ జరిమానా విధిస్తారు. అంతే కాకుండా సర్కారు ఉద్యోగావకాశాలు, పథకాలు, సదుపాయాల్లో ప్రాధాన్యం తగ్గిస్తారు. ఎన్నికలు జరిగిన వారం రోజుల్లో ఓటు వేయని వారిపై చర్యలు తీసుకుంటారు. బొలీవియాలో ఓటుతోనే గుర్తింపు... ఈ దేశంలో ఓటు వేసినవారికి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అది ఉన్నవారికే ప్రభుత్వ సౌకర్యాలు లభిస్తాయి. రేషన్, విద్యుత్, తాగునీటి వసతి పొందాలంటే ఈ కార్డు తప్పనిసరి. ఉద్యోగులు ఓటు వేయకపోతే మూడునెలలపాటు బ్యాంకుల నుంచి వేతనాలు డ్రా చేసే అవకాశం ఉండదు. దీంతో ప్రజలు అనేక విధాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆంక్షలు లేని అమెరికా... అందుకే పోలింగ్ శాతం తక్కువ అమెరికాలో ఓటు వేయడంపై ఎలాంటి ఆంక్షలూ లేవు.. పోలింగ్ రోజున సెలవు ఉండదు. ఉద్యోగులు, ప్రజలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇక్కడ 60 శాతం కన్నా పోలింగ్ తక్కువగా ఉంటుంది. వేయనివారి పేర్లు.. సర్టిఫికెట్లలలో.. ఇటలీ దేశంలో ఓటు వేయడం పౌరుడి విధిగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎన్నికల్లో ఓటు వేయనివారి పేర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల వద్ద పెడతారు. పోలీసులు జారీచేసే అన్ని సర్టిఫికెట్లలో ఈ వివరాలు ఉంటాయి. దీంతో అక్కడి ప్రజలు ఓటు వినియోగించుకోవడంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. – ఎలక్షన్ డెస్క్ -
వైఎస్ జగన్ పేరు మీద ఫారం-7 దరఖాస్తు
-
ఏకంగా జగన్ ఓటుకే ఎసరు పెట్టారు!
వైఎస్సార్ జిల్లా: పులివెందులలో మరో అక్రమం బయటపడింది. టీడీపీ ప్రభుత్వం ఏకంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటుకే ఎసరు పెట్టింది. అక్రమార్కులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు మీద ఫారం-7 దరఖాస్తు చేశారు. సాధారణంగా తమకు ఉన్న ఓటును తొలగించాలని ఓటరు ఎన్నికల అధికారికి ఫారం-7 ద్వారా దరఖాస్తు చేస్తారు. వైఎస్ జగన్ విషయంలో కూడా ఆయనకే తెలియకుండా టీడీపీ నాయకులే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు ఆశ్చర్యపోయారు. ఒక మొబైల్ నుంచి ఈ దరఖాస్తు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ అక్రమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సమస్య పెద్దదిగా మారుతుందని భావించి బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. స్థానిక తహసీల్దార్ ఈ ఘటనపై పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్‌కు తెలియకుండానే దరఖాస్తు చేసినట్లు విచారణలో తేలిందని తహసీల్దార్ తెలిపారు. -
ఓటు మన ఆయుధం
-
ఓటు మన ఆయుధం
-
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషకు రెండు చోట్ల ఓటు
శ్రీకాకుళం , కాశీబుగ్గ : సమావేశాల్లో నీతులు దంచే అధికార పార్టీ నాయకుల అసలు రంగు బయటపడుతోంది. సభల్లో సామాన్యుల కంటే తామేదో గొప్పవారమని చెప్పుకునే నేతల మేడిపండు విషయాలు రానురాను జనాలకు తెలుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అక్రమంగా తొలగిస్తూ, ఆ తప్పును ప్రతిపక్షంపైకి నెట్టేస్తున్న సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలి అసలు గుట్టు బయటపడింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె గౌతు శిరీషరెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు. మొదటి ఓటు : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మందస మండలం భిన్నాల గ్రామంలో పోలిం గ్ బూత్ నంబర్ 139లో ఎపిక్ నంబర్ యుఈజె1512607 నంబర్‌తో శిరీష గౌతు తండ్రి గౌతుశ్యామ సుందర శివాజీ అని ఓటు హక్కు కలిగి ఉంది. రెండో ఓటు: విశాఖపట్నం జిల్లా తూర్పులో ఆంధ్రా యూనివర్సిటీ పాఠశాల ఆవరణంలో బూత్ నంబర్ 173లో శిరీషా యార్లగడ్డ (42 సంవత్సరాలు) భర్త వెంకన్నచౌదరి యార్లగడ్డ పేరుతో ఎపిక్ నంబర్ ఐడివై1048669తో ఓటు హక్కు కలిగి ఉన్నారు. అల్లుడికీ రెండు చోట్ల.. పలాస ఎమ్మెల్యే శివాజీ అల్లుడు, శిరీష భర్త, పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి కూడా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు. మొదటి ఓటు : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పురుషోత్తపురంలో పోలింగ్ బూత్ నంబర్ 64లో ఎపిక్ నంబర్ యుఈజె0982059తో వెంకన్న చౌదరి యార్లగడ్డ (45 ఏళ్లు) తండ్రి కృష్ణమూర్తి యార్లగడ్డ పేరున ఓటు హక్కు ఉంది. రెండో ఓటు: విశాఖపట్నం జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో బూత్ నంబర్ 173లో సీరియల్ నంబర్ 516 లో ఆంధ్రాయూనివర్సిటీ పాఠశాలలో ఎపిక్ నంబర్ ఐడీవై0548941 నంబర్‌తో వెంకన్న చౌదరి యార్లగడ్డ తండ్రి కృష్ణమూర్తి పేరుతో ఓటు హక్కు కలిగి ఉన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌కు రెండు చోట్లపలాస ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, జిల్లా గ్రం థాలయ సంస్థ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావుకు రెండు చోట్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మొదటి ఓటు : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస మండలం పెదంచల పంచాయతీలో బూత్‌నంబర్ 51లో సీరియల్ నంబర్ 528లో ఎపిక్ నంబర్ ఎపి010020366036 నంబర్‌తో పీరుకట్ల విఠలరావు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ గ్రామానికి సుమారు 9కిలో మీటర్లు దూరంలో ఉన్న పలాస–కాశీబుగ్గ జంటపట్టణంలో కాశీబుగ్గ బూత్ నంబర్ 11లో ఎపిక్ నంబర్ యుఈజె0973868 నంబర్‌తో విఠల్‌రావు పీరుకట్ల పేరుతో ఓటు పొంది ఉన్నారు. కుమారుడు కూడా.. గౌతు శిరీష కుమారుడు శ్రవణ శ్రీహర్షకు పలాస మండలం కేదారిపురంలో (ఎపిక్ యుఈజె1517077), విశాఖలో (ఎపిక్ నంబర్ ఐడివై2903557)తో రెండు చోట్ల ఓటు కలిగి ఉన్నారు. అత్తమ్మ–మామ శిరీష అత్తమ్మ విజయలక్ష్మియార్ల గడ్డకు విశాఖ, పలాసలో రెండు చోట్ల యుఈజె1517069 ఓటు, ఐడీవై 2293058 నంబర్‌తో ఓటు హక్కు ఉంది. అలాగే శిరీష మామ కృష్ణమూర్తి విశాఖ–పలాసలో ఎపిక్ నంబర్ యుఈజె1512607, ఐడివై2905206 నంబర్‌తో ఓటు హక్కు కలిగి ఉన్నారు.