
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందించే ప్రముఖ యాంకర్ ఉదయభాను పరిచయం అవసరం లేని సెలబ్రిటీ. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉదయ భాను మరోసారి ట్రెండింగ్‌లో నిలిచారు. గ్రేటర్ పోరులో ఓటు హక్కు వినియోగంపై ఆమె అద్భుతంగా మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అమ్ముకుంటే జరిగే పరిణామాలపై తనదైన శైలిలో అనర్గళంగా చెప్పుకొచ్చారు. ఓటు మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం అంటూ కొత్త భాష్యాన్ని చెప్పుకొచ్చారు. మాటల, అంకెల గారడీలో నాయకులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వైనాన్ని కనిపెట్టాలని సూచించారు. ఓటును నిర్వీర్యం చేయొద్దు...ఓటు వేసి తీరదాం అంటూ ఫేస్‌బుక్ లో ఒక వీడియోను ఉదయ భాను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో మీకోసం...
Comments
Please login to add a commentAdd a comment