
మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన చద్విక్ బోస్‌మ్యాన్ గత శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా పేగు సంబంధిత క్యాన్సర్తో బాధపడుతున్న 43 ఏళ్ల చద్విక్ అకాల మరణాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. చద్విక్ మృతి పట్ల అభిమానులు సోషల్ మీడియాలో వినూత్నరీతిలో కామెంట్లు పెట్టారు. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడే బ్లాక్‌పాంథర్ క్యారెక్టర్‌కు ప్రాణం పోసిన చద్విక్ బోస్‌మన్‌ను తలుచుకుంటూ కొంతమంది అతన్ని అనుకరిస్తూ వీడియోలు కూడా చేశారు.
చద్విక్‌పై చేసిన వీడియోల్లో ఒకటి మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇకోరోడు బోయిస్ అనే పేరుతో ఒక కుర్రాడికి ట్విటర్ ఖాతా ఉంది. చద్విక్‌పై ఉన్న అభిమానంతో వారు చేసిన ఎమోషనల్ వీడియో అందరికి తెగ నచ్చేసింది. ముఖ్యంగా బోస్‌మ్యాన్‌ను అనుకరిస్తూ ఒక కుర్రాడు చేసిన తీరు ముచ్చట గొలుపుతుంది. అచ్చం చద్విక్ తరహాలో డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటూనే.. హావభావాలు పలికించాడు. (చదవండి : వామ్మో.. ఏంటి ఇది నిజమేనా.?!)
మొదట బ్లాక్ పాంథర్ క్యారెక్టర్‌లో ఉన్న చద్విక్‌కు తన తండ్రి, గురువైనా టిచల్లాస్ ఫాథర్ చెప్పే వ్యాఖ్యలతో వీడియో ప్రారంభమై.. అవెంజర్స్ చివరి రెండు భాగాల్లోని ఫైట్ సీక్వెన్స్, సివిల్ వార్, బ్లాక్ ఫాంథర్‌లో చద్విక్ చెప్పే డైలాగ్స్ వినిపిస్తాయి. ఇక చివరిలో ఇన్ మై కల్చర్.. డెత్ ఈజ్ నాట్ ఎండ్ అనే డైలాగ్తో ముగుస్తుంది. ' వాకండా ఫర్ ఎవర్.. డెడికేటెడ్ టూ చాడ్‌విక్.. లెజెండ్స్ నెవెర్ డై' అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ కుర్రాళ్లు చేసినన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'చాలా బ్రిలియంట్‌గా చేశారు.. చద్విక్ నిజంగా ఘనమైన నివాళి అవుతుంది.. ఎన్నిరోజులైనా బ్లాక్‌పాంథర్‌ను మరిచిపోలేం.. బ్లాక్‌పాంథర్‌గా చద్విక్‌ను మిస్సవుతున్నాం.. రిప్ చద్విక్ బోస్‌మ్యాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
WAKANDA FOREVER 🙅🏽♂️❤️ #DedicatedtoChadwick #Legendneverdie pic.twitter.com/VsyTcSdY7Z
— ikorodu bois (@IkoroduB) September 3, 2020
Comments
Please login to add a commentAdd a comment