Black Panther
-
ఆస్కార్‌కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!
సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ ఆస్కార్ వేడుక. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు ఆస్కార్ బరిలో నిలవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు సినిమాలు పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో ఫైనల్‌కు చేరిన పాటలు మొత్తం ఐదు ఉన్నాయి. వాటిలో ‘నాటు నాటు’తో పాటు 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), 'హోల్డ్ మై హ్యాండ్' (టాప్‌గన్.. మావెరిక్), 'లిఫ్ట్ మీ అప్'(బ్లాక్ పాంథర్), 'దిస్ ఈజ్ ఎ లైఫ్' (ఎవ్రీథింగ్ ఎవీవ్రేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు పోటీలో నిలిచాయి. వీటిల్లో మార్వెల్ సూపర్ హీరో చిత్రం ‘బ్లాక్‌పాంథర్: వకాండా ఫరెవర్’లో రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట, టామ్ క్రూజ్ హీరోగా వచ్చిన ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట.. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో కూడా మన ‘నాటు నాటు’ పాటకు గట్టి పోటీ ఇచ్చాయి. కానీ చివరికీ మన పాటనే విజయం వరించింది. చదవండి: ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా? అయితే అస్కార్ బరిలోనూ నిలిచిన ఆ సాంగ్ నాటు నాటు సాంగ్‌కు రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదే కాకుండా 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట ఆ తర్వాత వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. అమెరికాలో థియేటర్లలోనూ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 14 పాటలతో పోటీపడిన ‘నాటు నాటు’ సాంగ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యాలు సమకూర్చిన ‘నాటు నాటు’ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 81 పాటలు బరిలో నిలవగా ఫైనల్‌గా 15 పాటలు మాత్రమే షార్ట్‌లిస్ట్‌లో చేరాయి. అందులో ‘నాటు నాటు’ పాటకి చోటు దక్కింది. భారత చలన చిత్ర చరిత్రలో షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన తొలి పాట ఇదే. చదవండి: Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే.. Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు! -
Black Panther: ‘వామ్మో.. ఇదేం దాడిరా బాబు..’
-
Black Panther: ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
అడవిలో క్రూర జంతువులు తమ ఆహరం కోసం మరోక జీవిపై ఆధారపడతాయి. సింహం, పులి వంటి జంతువులు.. ఆహరం కోసం వేరే జంతువులపై దాడిచేసి వాటిని చంపి తినేస్తాయి. వేటలో భాగంగా... అనేక జంతువులు విభిన్నరీతిలో ప్రవర్తిస్తాయి. క్రూర జంతువులు తమకు కావాల్సిన వేటకోసం నానా తంటాలు పడుతుంటాయి. కొన్ని జంతువులు తమ వేటను గమనించి.. మెల్లగా చడి చప్పుడు చేయకుండా అమాంతం వాటిపై దాడిచేస్తాయి. కొన్ని సమయాల్లో క్రూర జంతువులు ఈ దాడిలో పైచేయి సాధిస్తే.. మరి కొన్ని సమయాల్లో సాధు జంతువులు తమపై దాడిచేస్తున్న జంతువుకే చుక్కలు చూపిస్తాయి. వాటి నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంటాయి. జంతువుల వేటకు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఒక నల్లచిరుత దాడి వీడియోను పరిమల్ నాత్వాని అనే యూజర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక అడవిలో.. నలుపు రంగు చిరుత తన వేటను చూసింది. ఆ తర్వాత.. చెట్టు చాటు నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ.. దాని వైపు వెళ్లింది. అక్కడంతా పచ్చని గడ్డి పరుచుకుని ఉంది. అది.. తన చెవులను నిటారుగా ఉంచి తన దృష్టిని వేటపైనే ఉంచింది. ఎలాంటి శబ్దం చేయకుండా నక్కి మెల్లగా వేటవైపు వెళ్లింది. నల్ల చిరుత గంభీరంగా.. నక్కుతూ వెళ్లి.. తన వేటపై అమాంతం దూకింది. ఈ వీడియో చూస్తుంటే.. మనపైనే దాడి చేస్తుందేమో.. అన్నంత భయంకరంగా ఉంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం దాడిరా బాబు..’,‘ ఒళ్లు గగుర్పొడిచే వీడియో బాబొయ్..’,‘ దాడికి గురైన జీవి ఖచ్చితంగా బ్రతికి ఉండదు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
నువ్వా.. నేనా...అంటున్న నల్లపులి, చిరుత..
-
వైరల్: నల్లపులి, చిరుతల ఫైటింగ్!
బెంగళురు: సాధారణంగా అడవిలో ఒక జంతువు ఆవాసంలోకి కొత్త జంతువు రావడానికి ఇష్టపడదు. అయితే ఒకవేళ వస్తే.. రెండు జంతువులు ఒకదాన్ని ఒకటి బెదిరించుకుంటూ గొడవకు దిగుతాయి. అలాంటి ఓ ఘటన కర్నాటకలోని కబిని వైల్డ్‌లైఫ్ సాంక్చూవరీలో చోటుచేసుకొంది. సాధారణంగా క్రూర మృగాలు అడవిలో చెట్టుపై భాగంలో ఎక్కి కూర్చొని, వేరే జంతువులు చెట్టు కిందకి రాగానే ఒక్కసారిగా వాటిపై దూకి దాడి చేస్తాయి. అయితే, ఓ చిరుతపులి చెట్టుపై ఎక్కి వేట కోసం ఎదురుచూస్తొంది. ఓ బ్లాక్ పాంథర్ అదే చెట్టుని చేరుకొని చెట్టుపైకి ఎక్కుతుంది. దీంతో రెండు అరుస్తూ ఒక దానితో మరొకటి గొడవకు దిగి, నువ్వా.. నేనా.. అన్నట్లు గాండ్రించుకున్నాయి . నా పంజా రుచి చూస్తావా అన్నట్లు ఆగ్రహించాయి. కాగా, నల్ల చిరుతే చివరకు కాస్త వెనక్కు తగ్గి వెళ్ళిపోయింది. ఈ వీడియోను ఇన్సోసిస్ సహవ్యస్థపకులు నందన్ నిలేకని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. చదవండి: భర్త చీటింగ్.. పోస్టర్లతో భార్య నిరసన! -
జాగ్వార్ Vs అనకొండ.. భయంకర వీడియో!
అనకొండ, బ్లాక్ పాంథర్(నల్ల చిరుతపలి) మధ్య ఫైట్ జరుగుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఇది 2013లోనే బయటకొచ్చిన వీడియో. అయితే అమెరికాలోని ఓ వ్యక్తి ఇటీవల ట్విటర్లో పోస్టు చేయడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దక్షిణ అమెరికాలోని గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. అదే విధంగా జాగ్వార్ విషయానికొస్తే అమెరికాలోనే ఇది పెద్ద పిల్లి. ఈ రెండు తమ బలాన్ని నిరూపించుకునేందుకు తలపడితే ఆ దృశ్యాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఉంది. ఇందులో ఈ రెండు భయంకరంగా పోరాడుతూ.. నీటిలోకి, నేల మీదికి లాక్కుంటూ వేటికవే తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. చదవండి: నెవెర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ ఫైట్ సీన్! ఈ వీడియోలో మెలనిస్టిక్ జాగ్వార్ దీనినే బ్లాక్ పాంథర్ అని కూడా పిలుస్తారు. ఇది భారీ అనకొండను నీటి నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము మాత్రం బ్లాక్ పాంథర్నుంచి తప్పించుకునేందుకు నీటిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ అనకొండను వదలకుండా పట్టు బిగిస్తూ భూమి మీదకు లాగుతోంది. మరి ఈ పోరాటంలో ఎవరిది పై చేయి సాధించిందనేది తెలియలేదు. దీనిని చూసిన నెటిజన్లు.. జాగ్వార్ అద్భుతంగా పోరాడిందని, వీడియో భయంకరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ అనకొండలు ప్రపంచంలోనే అత్యంత భారీ పాములలో ఒకటి. అంతేగాక 130 కిలోల వరకు బరువు కలిగి ఉంటాడి. వీటికి నీటిలో వేగం అమితంగా ఉంటుంది. అయితే భూమిపై వీటి బలం తక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ నీళ్లున్న ప్రదేశాల సమీపంలోనే ఎక్కువగా నివసిస్తుంటాయి. Registro raríssimo de uma onça-pintada lutando com uma sucuri. pic.twitter.com/bQPGu9Cutn — Biodiversidade Brasileira (@BiodiversidadeB) January 5, 2021 -
అభిమాన నటుడికి బాలుడి అరుదైన నివాళి
లాస్ఎంజెల్స్: బ్లాక్ పాంథర్ స్టార్ చాద్విక్ బోస్‌మ్యాన్ మృతికి 7 ఏళ్ల బాలుడు ప్రత్యేక నివాళి అర్పించాడు. అమెరికాకు చెందిన కియాన్ వెస్ట్‌బ్రూక్ అనే బాలుడు తన అభిమాన నటుడి జ్ఞాపకార్థం రోజున స్మారక చిహ్నం కూడా నిర్వహించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవేంజర్స్ బొమ్మలను ప్రదర్శిస్తూ బోస్‌మ్యాన్‌కు వందనాలు అర్పిస్తున్న ఫొటోను బాలుడి తండ్రి కింగ్ వెస్ట్‌బ్రూక్ శనివారం తన ట్విటర్లో షేర్ చేశాడు. దీనికి ‘మా బాబు తన అభిమాన సూపర్ స్టార్ బ్లాక్ పాంథర్ కోసం ప్రత్యేకంగా నివాళి ఆర్పించాడు. అంతేకాదు బోస్‌మన్‌కు స్మారక చిహ్నన్ని కూడా ఏర్పాటు చేసి ‘వకాండా ఫరేవర్’ అంటూ వందనాలు ఆర్ఫించాడు’ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు. బోస్‌మ్యాన్‌కు ఇలా బాలుడు నివాళులు ఆర్పించి తన అభిమానాన్ని చాటుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ పోస్టుకు ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా లైక్‌లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: బ్లాక్ పాంథర్ నటుడు కన్నుమూత) MY BABY BOY AND THE AVENGERS HOLDING A MEMORIAL FOR BLACK PANTHER❤💪🏾#Wakanda4Ever pic.twitter.com/nYAnER23Ig — King Westbrook (@KingWestbrook7) August 29, 2020 ‘ఇది నిజంగా హృదయాన్ని తాకే దృశ్యం’, ‘ఇది చూడగానే నా గుండె బరువెక్కింది’, ‘చాద్విక్ బోస్‌మ్యాన్ అద్భతమైన నటుడు. ఆయన అందరికి ఆదర్శం’ అంటూ నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యకం చేస్తూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.ఈ పోస్టులో కియాన్ బ్లాక్ పాంథర్(బోస్‌మ్యాన్) బొమ్మను ఓ పెట్టలో ఉంచి నల్లటి పట్టు వస్రంతో కప్పాడు. దాని చూట్టు ఆవేంజర్స్ బొమ్మలను ప్రదర్శించాడు. అంతేగాక పూలు, ఆవార్డు పతకాన్ని కూడా బోస్‌మ్యాన్‌కు బొమ్మపై ఉంచాడు. అనంతరం పక్కనే నిలబడి నివాళులు ఆర్పించిన ఈ ట్వీట్ ఆయన అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. అయితే బోస్‌మ్యాన్ మరణవార్త తెలియాగానే కియాన్ దిగ్భ్రాంతికి గురైనట్లు అతడి తండ్రి చెప్పాడు. ‘‘ఆయన(బోస్‌మ్యాన్) నాతో పాటు బ్లాక్ బాయ్స్ అందరికి రోల్ మోడలని, ఎందుకుంటే బ్లాక్ అబ్బాయిలు కూడా హీరో కాగలరని ఆయన నిరూపించారు’’ అంటూ కియాన్ చాద్విక్ మరణంపై ఇలా స్పందించాడంటూ బాలుడి తండ్రి పేర్కొన్నాడు. కాగా గత కొంతకాలంగా పెద్ద పెగు క్యాన్సర్‌తో బాధపడుతున్న చాద్విక్ బోస్‌మ్యాన్ ఆగష్టు 28న తుదిశ్వాస విడిచిన విషయం విధితమే.(చదవండి: నువ్వు నిజంగా దేవుడివి సామి) -
అద్భుతం.. బ్లాక్ పాంథర్‌ను దించేశాడు
మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన చద్విక్ బోస్‌మ్యాన్ గత శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా పేగు సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతున్న 43 ఏళ్ల చద్విక్ అకాల మరణాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. చద్విక్ మృతి పట్ల అభిమానులు సోషల్ మీడియాలో వినూత్నరీతిలో కామెంట్లు పెట్టారు. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడే బ్లాక్‌పాంథర్ క్యారెక్టర్‌కు ప్రాణం పోసిన చద్విక్ బోస్మన్ను తలుచుకుంటూ కొంతమంది అతన్ని అనుకరిస్తూ వీడియోలు కూడా చేశారు. చద్విక్పై చేసిన వీడియోల్లో ఒకటి మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇకోరోడు బోయిస్ అనే పేరుతో ఒక కుర్రాడికి ట్విటర్ ఖాతా ఉంది. చద్విక్పై ఉన్న అభిమానంతో వారు చేసిన ఎమోషనల్ వీడియో అందరికి తెగ నచ్చేసింది. ముఖ్యంగా బోస్మ్యాన్ను అనుకరిస్తూ ఒక కుర్రాడు చేసిన తీరు ముచ్చట గొలుపుతుంది. అచ్చం చద్విక్ తరహాలో డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటూనే.. హావభావాలు పలికించాడు. (చదవండి : వామ్మో.. ఏంటి ఇది నిజమేనా.?!) మొదట బ్లాక్ పాంథర్ క్యారెక్టర్లో ఉన్న చద్విక్కు తన తండ్రి, గురువైనా టిచల్లాస్ ఫాథర్ చెప్పే వ్యాఖ్యలతో వీడియో ప్రారంభమై.. అవెంజర్స్ చివరి రెండు భాగాల్లోని ఫైట్ సీక్వెన్స్, సివిల్ వార్, బ్లాక్ ఫాంథర్లో చద్విక్ చెప్పే డైలాగ్స్ వినిపిస్తాయి. ఇక చివరిలో ఇన్ మై కల్చర్.. డెత్ ఈజ్ నాట్ ఎండ్ అనే డైలాగ్‌తో ముగుస్తుంది. ' వాకండా ఫర్ ఎవర్.. డెడికేటెడ్ టూ చాడ్విక్.. లెజెండ్స్ నెవెర్ డై' అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ కుర్రాళ్లు చేసినన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'చాలా బ్రిలియంట్‌గా చేశారు.. చద్విక్ నిజంగా ఘనమైన నివాళి అవుతుంది.. ఎన్నిరోజులైనా బ్లాక్పాంథర్ను మరిచిపోలేం.. బ్లాక్పాంథర్గా చద్విక్ను మిస్సవుతున్నాం.. రిప్ చద్విక్ బోస్‌మ్యాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. WAKANDA FOREVER 🙅🏽♂️❤️ #DedicatedtoChadwick #Legendneverdie pic.twitter.com/VsyTcSdY7Z — ikorodu bois (@IkoroduB) September 3, 2020 -
హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్ మృతి
మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన చద్విక్ బోస్‌మ్యాన్ శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన పేగు సంబంధిత క్యాన్సర్‌తో బా«దపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. చద్విక్ వయసు కేవలం 43 సంవత్సరాలే. 2016లో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. క్యాన్సర్ చికిత్స, కీమోథెరపీలను తీసుకుంటూనే ‘బ్లాక్ పాంథర్, మార్షల్, దా 5 బ్లడ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారాయన. 2003లో నటుడిగా చద్విక్ తన కెరీర్‌ను ప్రారంభించారు. 2013లో వచ్చిన ‘42’లో ఆయన చేసిన జాకీ రాబిన్సన్ పాత్ర పెద్ద బ్రేక్. ఆ తర్వాత ‘ది కిల్ హోల్, డ్రాఫ్ట్ డే, గెట్ ఆన్ అప్, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్’ వంటి సినిమాలు చేశారు. చద్విక్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
బ్లాక్ పాంథర్ నటుడు కన్నుమూత
-
గుండె పగిలింది : కమలా హారిస్
హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మ్యాన్ అకాలమరణం సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని మరణం తీరని లోటంటూ పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఇతరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డొమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా విచారం ప్రకటించారు. తెలివైన వాడు, మంచివాడు. తన స్నేహితుడు ఇంత చిన్న వయసులో ఈ లోకాన్ని వీడాడంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. (బ్లాక్ పాంథర్ నటుడు కన్నుమూత) చాడ్విక్ బోస్‌మ్యాన్ పెద్దప్రేగు క్యాన్సర్‌తో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కాలిఫోర్నియాలో జరిగిన ఫ్రీడమ్ ఫర్ ఇమ్మిగ్రెంట్స్ కార్యక్రమంలో కమలా హారిస్‌కు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలాను జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం కమలాతో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. అదే అతని ఆఖరి ట్వీట్ కావడం విషాదం. దీంతో కమలా హారిస్ చాడ్విక్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. కాగా బ్లాక్ పాంథర్ మార్వెల్ పాత్రతో పాపులర్ అయిన జాకీ రాబిన్సన్ పాత్రతోపాటు అనేక పాత్రల్లో అద్భుతమైన నటనతో మెప్పించారు. YES @KamalaHarris! 👏🏾👏🏾👏🏾#WhenWeAllVote #Vote2020 pic.twitter.com/iOU3duBAcA — Chadwick Boseman (@chadwickboseman) August 11, 2020 Heartbroken. My friend and fellow Bison Chadwick Boseman was brilliant, kind, learned, and humble. He left too early but his life made a difference. Sending my sincere condolences to his family. pic.twitter.com/C5xGkUi9oZ — Kamala Harris (@KamalaHarris) August 29, 2020 -
బ్లాక్ పాంథర్ నటుడు కన్నుమూత
‘బ్లాక్ పాంథర్’ నటుడు చాడ్విక్ బోస్మాన్(43) కన్నుమూశారు. గత కొంతకాలంగా కోలన్(పెద్దపేగు) క్యాన్సర్‌తో పోరాడుతున్న బోస్‌మెన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అతని మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ‘నిజమైన పోరాట యోధుడు, చాడ్విక్ పట్టుదలతో మీరు ఎంతో ప్రేమించిన అనేక చిత్రాలను మీ ముందుకు తీసుకువచ్చాడు. చాడ్విన్ ఇంట్లోనే మరణించాడు" అని చాడ్విక్ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా చాడ్విక్ నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఈ నటుడు 2016 నుండి స్టేజ్ త్రీ ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. (సంచలన దర్శకుడి ఇంట విషాదం) బోస్మాన్ దక్షిణ కరోలినాలోని అండర్సన్లో పుట్టి పెరిగాడు. 2013లో లెజండరీ బేస్ బాల్ ఆటగాడు జాకీ రాబిన్సన్ కథతో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘42’ తో సినిమాల్లో వచ్చాడు. 2016లో వచ్చిన కెప్టెన్ అమెరికా: సివిల్ వార్‌లో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా కనిపించి అంనతరం బోస్‌మెన్ అతని ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. అతను అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్,ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌లోని మరో రెండు పాత్రలతో అభిమానులను అలరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డా 5 బ్లడ్స్‌లో చాడ్విక్ చివరి సారిగా కనిపించారు. బోస్మాన్ చివరి సారిగా ఆగస్టు 12న ట్వీట్ చేశాడు. డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ కమలా హారిస్ నామినేషన్‌ను అభినందిస్తూ ఈ ట్వీట్ చేశాడు. (వివాదంలో ప్రముఖ కామెడీ షో) చదవండి : గుండె పగిలింది : కమలా హారిస్ -
బ్లాక్ పాంథర్-చిరుత ఫొటోలు వైరల్
సాక్షి, కర్ణాటక: గత కొద్ది రోజులుగా కర్ణాటక అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) సంచరిస్తున్న వార్త సోషల్ మీడియా హల్చల్ చేసింది. దాని ఫొటోలు కూడా విపరీతంగా వైరల్ అవ్వడంతో అందరూ సినిమాల్లోని కల్పిత జంతువు బ్లాక్ పాంథర్లు నిజంగా కూడా ఉన్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్లాక్ పాంథర్, చిరుత పులి జతకట్టిన ఫొటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. వీటిని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ మిథున్ హెచ్ తన కెమెరాలో బంధించి షేర్ చేశాడు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ ఫొటోల క్రెడిట్‌కు సంబంధించి వివాదానికి దారితీసింది. కానీ ఈ వివాదం త్వరగానే పరిష్కారించబడింది.ఈ ఫొటోలను గత ఏడాది మిథున్ హెచ్ కర్ణాటకలోని కబిని ఫారెస్ట్‌లో చిత్రీకరించాడు. కర్నాటకలో అంత్యంత ప్రాచుర్యం పొందిన వన్యప్రాణుల అడవుల్లో ఇది ఒకటి, ఇది నాగరహైల్ నేషన్ పార్క్‌కు ఆగ్నేయంలో ఉంది. (చదవండి: వైరల్ : నల్ల చిరుతను చూశారా?) ‘ది ఎటర్నల్ కపుల్.. సాయా(బ్లాక్ పాంథర్), క్లియోపాత్ర(చిరుత పులి) చూడండి’ అనే క్యాప్షన్‌తో మిథున్ షేర్ చేశాడు. దీంతో ఈ పోస్టుకు వేలల్లో లైక్‌లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ అరుదైనా దృశ్యాన్ని మిథున్ ఇలా వివరించాడు. ‘‘సయా, క్లియోపాత్రా 4 సంవత్సరాల నుండి ఈ అడవిలో కలిసి నివసిస్తున్నాయి. కల్పిత రాజ్యంలో వారు అనాలోచితంగా వ్యవహరించడంతో అడవి సజీవంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి జంటలలో మగవాడు బాధ్యత వహిస్తూ తన స్త్రీని అనుసరిస్తాడు. కానీ ఇక్కడ క్లియో బాధ్యత వహిస్తే పాంథర్ తనని అనుసరిస్తాడు’’ అంటూ రాసుకొచ్చాడు. ఓ ఇంటర్యూలో మిథున్ మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉంది. ఆన్లైన్లో ఈ చిత్రాలకు విశేష స్పందన వచ్చింది. నేను ఇది ఊహించలేదు. అలాగే దీనిపై వచ్చిన విమర్శలను కూడా నేను ఊహించలేదు. పాంథర్-చిరుతల ఫొటోలు తీసేందుకు నాకు 6 రోజుల సమయంలో పట్టింది’’ అని వెల్లడించాడు. View this post on Instagram The Eternal Couple . Saaya and Cleopatra have been courting since 4 years now and whenever they are together it’s a sight to behold. The forest comes alive as they trot nonchalantly in his fabled kingdom. Usually in the courting pairs generally it is the Male who takes charge and moves around with the female following close behind. But with this couple it was definitely Cleo who was in charge while the Panther followed. . This was shot on a surreal winter morning when a single Deer alarm led me to this breathtaking sight. . #kabini #love #leopard #nikon #wild #Natgeo #mithunhphotography #instagood #instadaily #jungle #bigcat #forest #wildlifephotography #nature #wildlife #blackpanther #melanistic #therealblackpanther #thebisonresort A post shared by Mithun H (@mithunhphotography) on Jul 19, 2020 at 7:52am PDT -
వైరల్ : నల్ల చిరుతను చూశారా?
బెంగళూరు : సినిమాల్లో చూపించే కొన్ని కల్పిత జంతువులు నిజంగా ఉంటాయా అనే సందేహం చాలా సార్లు కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా జంగిల్ బుక్ చిత్రంలో భగీరా పేరిట చూపెట్టిన నల్ల చిరుత నిజంగా ఉంటుందా లేదా అనే చర్చ అయితే తీవ్రంగానే జరిగింది. అయితే ఆ సినిమాలో చూపెట్టిన నల్ల చిరుత పులులు నిజంగానే ఉన్నాయి. అది కూడా మన భారతదేశంలోనే. కర్ణాటకలోని నాగర్హోల్ నేషనల్ పార్క్‌లో కాబిని నది పరిసరాల్లో నల్ల చిరుత పులులు ఉన్న సంగతి తెలిసిందే. వైల్డ్‌లైఫ్ ఫొటోలు ప్రచురించే ‘ఎర్త్’ తమ ట్విటర్ ఖాతాలో వీటిని షేర్ చేసింది. దీంతో అవి కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారాయి.(చదవండి : సైకిల్ గర్ల్‌పై అత్యాచారం, హత్య: నిజమెంత?) వాస్తవానికి ఈ ఫొటోలను 2019లో ప్రముఖ వైల్డ్‌లైఫ్ పొటోగ్రాఫర్ షాజ్ జంగ్ తీశారు. కాబిని నది పరిహహాక ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉన్న వైల్డ్క్యాట్స్కు సంబంధించి జంగ్ అనేక ఫొటోలు తన ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం వైరల్‌గా మారిన ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది ప్రకృతి చాలా గొప్పదని అర్థం వచ్చేలా కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం.. ‘జంగిల్ బుక్ చిత్రంలోని భగీరా నువ్వేనా’అని పోస్ట్‌లు చేస్తున్నారు. మరికొందరు తాము గతంలో తీసిన బ్లాక్ పాంథర్ చిత్రాలను కూడా షేర్ చేస్తున్నారు. A black panther roaming in the jungles of Kabini, India. pic.twitter.com/UT8zodvv0m — Earth (@earth) July 4, 2020 -
రెండేళ్ల తర్వాత మళ్లీ కనిపించింది
ముంబై : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అభయారణ్యంలో నల్ల చిరుత సంచారం పర్యాటకులను కనువిందు చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని తడోబా అభయారణ్యాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత కనిపించడంతో పర్యాటకులు తమ చరవాణిలో చిరుతను బందించేందుకు పోటీపడ్డారు. ఇక్కడ వివిధ రకాల జంతువులు, మృగాలు ఉన్నప్పటికీ.. అత్యంత అరుదుగా కనిపించే నల్ల చిరుత సంచారం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సంవత్సరాల క్రితం తడోబా అభయారణ్యంలో కనిపించిన నల్ల చిరుత.. ఇవాళ మళ్లీ తడోబా అభయారణ్యంలో దర్శనమిచ్చింది. -
ఆస్కార్ అవార్డ్స్: బ్లాక్ పాంథర్,రోమా చిత్రాలకు అవార్డుల పంట
-
ఆమె ఆస్కార్
ప్రపంచ సినిమా ఒక అధిరోహకుడైతే అతణ్ణి సవాలు చేసే ఎవరెస్ట్ ఆస్కార్. ప్రపంచ సినిమా ఒక నావ అయితే దాని సత్తా సవాలు చేసే పసిఫిక్ ఆస్కార్. ప్రపంచ సినిమా ఒక ప్రయోగం అయితే దాని ఫలితాలను నిగ్గుతేల్చే సైంటిస్ట్ ఆస్కార్. కథలన్నీ కంచికి చేరుతాయో లేదో కాని సినిమాలన్నీ ఆస్కార్‌కు చేరాలని కలలు కంటాయి. ఆస్కార్ వేదిక మీద తన సినిమా ప్రస్తావన రావాలని, తనకు అవార్డు దక్కాలని వేల మంది గొప్ప గొప్ప నటీనటులు, దర్శకులు కష్టపడుతూ ఉంటారు. ఆస్కార్‌లో బహుమతి గెలుచుకున్న చిత్రం ప్రపంచానికి తెలుస్తుంది. ఆస్కార్ గెలుచుకున్న నటుడు గౌరవంగా తలెత్తి చూసే స్థాయిలో నిలబడతాడు. ఆస్కార్ గెలుచుకున్న నటి వెండి తెర ఇలవేలుపుగా మారుతుంది. ఆస్కార్ మీద ఆశలు ఎన్నో అభాండాలు అన్ని. వివక్ష ఉంటుందని పక్షపాతం ఉంటుందని ఎన్నో అభిప్రాయాలు ఆరోపణలు. కాని ఈసారి మాత్రం ఆస్కార్‌లో స్త్రీలు తమ ప్రతిభ చాటారు. నటనలో, సాంకేతిక విభాగాలలో మగవాళ్లకు గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి ఆస్కార్ ఆమె ఆస్కార్గా నిలిచింది. ఆస్కార్ ఆమెది కూడా అని రుజువు చేసింది. నెల రోజులుగా ఊరిస్తున్న అత్యంత ఘనమైన 91వ ఆస్కార్ వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్ వేడుకగా ఆదివారం జరిగింది. ఎవరూ అంచనా పెట్టుకోని ‘గ్రీన్‌బుక్’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ను గెలుచుకుంది. ‘బొహెమియన్ రాప్సోడి’ చిత్రానికి నాలుగు,‘ రోమా’,‘ బ్లాక్ పాంథర్’ సినిమాలకు చెరి మూడు ఆస్కార్లు దక్కాయి. 2019 ఆస్కార్ వేడుకలో ప్రధానంగా కనిపించిన అంశం అకాడమీ మహిళలను గుర్తించడం. కొత్త కొత్త విభాగాల్లో స్త్రీలు అవార్డులు గెలుచుకొని రికార్డ్ సృష్టించారు. హోస్ట్ లేకపోయినా మాయ రుడాల్ఫ్, టినా ఫే, అమీ పోయిల్హర్ అవార్డ్ షోను విజయవంతంగా ప్రారంభించారు. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో ‘హన్నా బీచ్లర్’ అవార్డ్ పొందారు. ‘బ్లాక్ పాంథర్’ సినిమాలో సూపర్ హీరో స్వస్థలం ‘వాకాండా’ సృష్టి ఆమెకు ఈ అవార్డ్‌ను సాధించిపెట్టింది. ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకన్న తొలి నల్ల జాతీయురాలు ఈమే. ఇక కాస్ట్యూమ్ విభాగంలో తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న నల్ల జాతీయురాలుగా రూత్ కార్టర్ రికార్డు సాధించింది. నాన్ యాక్టింగ్ కేటగిరీలో కాకుండా ఇతర విభాగాల్లో నల్లజాతీయులు అస్కార్ అందుకోవడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే ఉత్తమ సహాయనటి విభాగంలో ‘రెజీనా కింగ్’ అనే నల్ల జాతీయురాలు అస్కార్డ్ అవార్డు అందుకున్నారు. ఇలా ఒకే ఏడాది ముగ్గురు నల్ల జాతీయులూ ఆస్కార్ అందుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మెక్సికన్ చిత్రం ‘రోమా’ స్త్రీల కథాంశం కలిగి ఉండటం కూడా మరో విశేషం. ఈ విభాగంలో మెక్సికోకు ఇదే తొలి ఆస్కార్ కావడంఇంకో విశేషం. ఈ చిత్ర దర్శకుడు అల్ఫాన్సో క్వేరాన్కు 2014లో ‘గ్రావిటీ’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నారు. ఈ యేడాది ఒకే చిత్రానికి (రోమా) సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ రెండు విభాగాల్లో రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇలా గెలుచుకున్న మొదటి వ్యక్తి కూడా అల్ఫాన్సో కావడం విశేషం. రోమా ఉత్తమ విదేశీభాషా చిత్రం రోమా సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇంగ్లిష్‌లో తీయని ఒక సినిమా అత్యధిక ఆస్కార్ అవార్డులకు నామినేట్ కావడం. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విదేశీభాషా చిత్రం సహా మొత్తం పది విభాగాల్లో ఇది నామినేట్ అయింది. ఇన్ని నామినేషన్లు పొందడం ఇంతకుముందు కేవలం 2000 సంవత్సరంలో వచ్చిన ‘క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్’కే సాధ్యమైంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విదేశీభాషా చిత్రం అవార్డులను రోమా గెలుచుకుంది. ఇంగ్లీషేతర సినిమా మూడు అవార్డులు గెలవడం కూడా ఒక ఘనత. ఇంకో విశేషం, రోమాకు సినిమాటోగ్రఫీ కూడా దర్శకుడు అల్ఫాన్సో క్వేరాన్ చేయడంతో రెండు కీలక అవార్డులను వ్యక్తిగతంగా ఆయన గెలుచుకున్నట్టయింది. 2013లో గ్రేవిటీ చిత్రానికిగానూ దర్శకుడిగా తొలి ఆస్కార్ గెలుచుకున్న క్వేరాన్ ఆ ఘనత సాధించిన తొలి లాటిన్ అమెరికన్ దర్శకుడు అయ్యాడు. అయితే అది పూర్తిగా హాలీవుడ్ చిత్రం. కానీ రోమా ఆయన దేశమైన మెక్సికో నేపథ్యంలో సాగే ఆయన మార్కు స్పానిష్ సినిమా. 1970ల్లో మెక్సికో సిటీలోని రోమా ప్రాంతంలో ఇద్దరు ఆడవాళ్లు చేసిన పోరాటం రోమా ఇతివృత్తం. పనిమనిషి క్లియో, ఆమె యజమానురాలు సోఫియా. ఇద్దరూ ఉమ్మడిగా నష్టపోయింది మగవాళ్ల వల్ల. క్లియో దృష్టికోణంలో కథ సాగుతుంది. కడుపు మాత్రం చేసి ఏ బంధపు బరువు మోపుకోకుండా క్లియోను వదిలేస్తాడు ప్రియుడు. నలుగురు పిల్లలు అయిన తర్వాత డాక్టర్ అయిన భర్త వేరే స్త్రీ మోజులో సోఫియాను వదిలేస్తాడు. భిన్న వర్గాలకు చెందిన ఈ స్త్రీలు ఈ కష్ట సమయంలో ఒకరికొకరు మానసిక ఆలంబన అవుతారు. రాజకీయాంశాలను బలంగా వ్యక్తీకరించే క్వేరాన్ గొప్పతనం ఎక్కడంటే, క్లియో ప్రియుడు ఫెర్మిన్ను పారామిలిటరీ బలగాల్లో చేర్చడం. సరిగ్గా క్లియోకు నెలలు నిండిన సమయంలో రేగిన విద్యార్థుల నిరసన జ్వాలలను అణచివేసే బలగాల్లో ఫెర్మిన్ ఉండటమూ, అతడి అసలైన కర్కశ ముఖం చూసిన భయంలో క్లియో గర్భాన్ని పోగొట్టుకోవడమూ సినిమా కేవలం ఇది ఇద్దరు ఆడవాళ్ల కథ మాత్రమే కాదనుకునేలా చేస్తుంది. స్థూలస్థాయిలో ఇందులో కనబడేది రాజ్యపు విధ్వంసం, సూక్ష్మస్థాయిలో అర్థమయ్యేది ఆ ధ్వంసమవుతున్నదాన్ని నిలబెట్టుకోవడానికి కొందరు చేసే ప్రయత్నం. దానికి రుజువు, అంతకుముందు నీటిని చూసి భయపడే క్లియో, సముద్రంలో మునిగిపోతున్న యజమానురాలి పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడుకోవడం. ఇది పాక్షికంగా క్వేరాన్ ఆత్మకథాత్మక చిత్రం. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రించడంతో రంగుల్నీ చూసీ చూసీ అలసిపోయివున్న కళ్లకు నలుపు తెలుపుల్లోని హాయి ఏమిటో తెలుస్తుంది. విదేశీభాషా విభాగంలో మెక్సికో నుంచి ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రం కావడం ఒక విశేషమైతే, నెట్‌ఫ్లిక్స్ దీన్ని పంపిణీ చేయడం ఇంకో సంగతి. ప్రసంగాలూ... స్ఫూర్తిమాటలూ ఆస్కార్ వేడుకలో అవార్డ్ ఎవరికొస్తుంది అన్నదాని కంటే, అవార్డ్ అందుకున్న విజేత వేదిక మీద కృతజ్ఞతా పలుకుగా ఏం మాట్లాడతారన్నదానిమీదే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. 1942లో ‘మిసెస్ మిన్వెర్’ సినిమాకు ఉత్తమ నటిగా ఎంపికైన గ్రీర్ గార్సన్ ఆపకుండా ఆరునిమిషాలు మాట్లాడిందట. దాంతో ఆ ఏడాది నుంచి ఆస్కార్ యాక్సెప్టెన్స్ స్పీచ్‌ను 45 సెకండ్లకు కుదించింది అకాడమీ. అయితే 45 సెకన్లలో మాట్లాడడానికి థాంక్స్ తప్ప ఇంకేం మాటలుంటాయి అని అసహనపడకండి. నలభై అయిదు సెకన్లలో ఆలోచింపచేయొచ్చు, నవ్వించొచ్చు, బోర్ కొట్టించొచ్చు అని ఆస్కార్ కమిటీ అభిప్రాయం. దాన్ని ఫాలో అవమని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఆ నియమం ఆధారంగా గతేడాది టాక్ ఆఫ్ ది నైట్ అయ్యారు ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ స్పీచ్‌లో ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే పదం వాడారామె. ‘సినిమా సెట్లో వర్ణ, లింగ నిష్పత్తి సమంగా ఉండేలా చూసుకోవడం’ అని ఆ మాట అర్థం. ఈ ఏడాది ఉత్తమ నటి పురస్కారం అందుకున్న ఒలివియా కోల్మన్ అవార్డ్ అందుకోగానే ‘దిస్ ఈజ్ హిల్లేరియస్.. నాకు ఆస్కార్ వచ్చిందా? సరే. థాంక్స్ చెప్పాల్సిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఒకవేళ మర్చిపోతే దయచేసి క్షమించండి. మళ్లీ కలిసినప్పుడు ప్రేమతో ఓ ముద్దిస్తాను. ఆస్కార్ స్పీచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిలందరూ.. ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. క్లీనర్‌గా పని చేసే రోజుల్లో నేను ఎక్కువగా చేసిన పని ఇదే. థాంక్యూ ఎవ్రీ వన్’ అంటూ తన స్పీచ్‌ని పూర్తి చేశారు. అవార్డ్ గెలుచుకున్న నటీనటులు సాధారణంగా ‘థాంక్స్ టు గాడ్’ అని దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు. అయితే ఒలివియా మాత్రం ‘థాంక్స్ టు లేడీ గాగా’ అంటూ లేడీగాగాకు కృతజ్ఞతలు చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తర్వాత ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో అవార్డ్ అందుకున్న రేకా ‘మెన్స్ట్రుయేషన్ మీద తీసిన సినిమాకు ఆస్కార్ వస్తుందని అనుకోలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా!’ అన్నారు. ‘ఎన్నిసార్లు ఒడిపోయామన్నది ముఖ్యం కాదు. మళ్లీ ఎన్నిసార్లు తిరిగి ప్రయత్నించావన్నది ముఖ్యం. విజయం సాధించాలంటే క్రమశిక్షణతో కూడిన తపన ఉండాలి’ అంటూ స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చారు లేడీ గాగా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ‘‘షాలో’’కి ఆస్కార్ తీసుకున్నారు ఆమె. ‘వైస్’ చిత్రానికి గాను మేకప్ విభాగంలో.. గ్రెగ్ కన్నమ్, కేట్ బిస్కోయి, పాట్రికా డిహానీ లీ.. ఆస్కార్‌ని గెలుచుకున్నారు. రాసుకొని తెచ్చుకున్న థాంక్యూ చీటీని వంతుల వారీగా చదువుదామనుకున్నారు. తీరా చదవాల్సిన టైమ్‌కి కన్ఫ్యూజ్ అయ్యారు. దాంతో ఈ ఏడాది వరస్ట్ స్పీచ్ ఇదే అంటూ సోషల్ మీడియా కామెంట్స్ బారిన పడ్డారు. మాటల బాణాలు.. ట్రంప్ మీదా? ‘ప్రపంచ వేదిక సాక్షిగా మా పూర్వీకులందరినీ గుర్తుచేసుకుంటున్నా. ఈ దేశాన్ని నిర్మించింది వాళ్లే. మానవత్వాన్ని పెంపొందించుకోవడమే నిజమైన ఉద్యమం. 2020 ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయ్. అందరం చరిత్రకు సరైనవైపే ఉందాం. ప్రేమ వైపు ఉందామా? ద్వేషం వైపు ఉందామా? అందరం సరైన నిర్ణయం తీసుకుందాం!’ అన్నారు దర్శకుడు స్పైక్ లీ. ఇది ఆయన ఆస్కార్ స్పీచ్కన్నా ఆస్కార్ వేదికగా డొనాల్డ్ ట్రంప్‌కి విసిరిన బాణంలా అభిప్రాయపడ్డారు వీక్షకులు. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే (బ్లాక్లాంన్స్‌మాన్) విభాగంలో ఆయన ఆస్కార్‌ను అందుకున్నారు. 2015లో గౌరవ ఆస్కార్ అందుకున్నప్పటికీ ఇది అతని తొలి అవార్డు. అవార్డ్ అనౌన్స్ చేసిన సామ్యూల్ జాక్సన్‌పై అమాంతం దూకారు స్పైక్ లీ. ‘యాక్సెప్టెన్స్ స్పీచ్ టైమర్ అప్పుడే ఆన్ చేయకు’ అంటూ ఆస్కార్ ప్రొడ్యూసర్‌కి కేకేశారు. జెంటిల్‌మేన్ ఆఫ్ ది నైట్ ‘అండ్ ది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు రెజినా కింగ్’ అని అనౌన్స్ చేశారు. రెజినా ఉత్సాహంగా లేచారు. అవార్డ్ అందుకోబోయే కంగారులో డ్రెస్ కొంచెం ఇబ్బంది పెట్టడంతో వేగంగా కదల్లేకపోయారు. దాంతో ముందు వరుసలో కూర్చున్న ‘కెప్టెన్ అమెరికా’ పాత్రధారి క్రిస్ ఈవన్ రెజీనాకు తన చేయి అందించాడు. అంతేకాదు స్టేజ్ వరకూ ఆమెను నడిపించుకుంటూ వెళ్లాడు. దీంతో ఇంటర్నెట్ మొత్తం ‘జెంటిల్‌మేన్ ఆఫ్ ది నైట్’ అంటూ క్రిస్‌ను హైలైట్ చేసింది. హోస్ట్ లేకపోతే ఏంటి? ఒక థీమ్‌కు సంబంధించిన మోనోలాగ్‌తో ఆస్కార్‌ను ప్రారంభించడం ఆనవాయితీ. దానికి ఒక హోస్ట్ ఉంటారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ వేడుకకి థీమ్ లేదు. హోస్ట్ లేరు. అయితేనేం మేమున్నామంటూ సాటర్డే నైట్ స్టార్స్ టినా ఫే, మాయా రుడాల్ఫ్, అమీ పోయిలీర్ చిన్న మోనోలాగ్‌తో ఆస్కార్ ఆస్కార్ వేడుకను ప్రారంభించారు. ఆ తర్వాత వరుస జోక్స్‌తో వేడుకను ముందుకు తీసుకెళ్లారు. ఏదో ఓ జోక్‌ను పేల్చి ‘మేమే హోస్ట్స్ అయ్యుంటే ఇలా అనేవాళ్లమేమో?’ అంటూ నవ్వులు పూయించారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ అందించడానికి స్టేజ్ మీదకు వచ్చిన ఈ స్నేహితులు ‘బేసిక్‌గా ఉమెన్ అంటేనే సపోర్టీవ్. నమ్మరా? వీళం్లదరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది నేనే’అనే చలోక్తులు చిమ్మారు. ఆస్కార్.. నాట్ సో వైట్ ‘ఆస్కార్.. .తెల్ల జాతీయుల పక్షపాతి’ అనే అపవాదును మొన్నటి వరకూ ఉండేది. పోయిన ఏడాది నుంచి ఆ పక్షపాతం చాలా తగ్గింది అంటున్నారు విశ్లేషకులు. ఈ ఏడాది అవార్డులను అందుకున్న వారే కాదు అందించిన వాళ్లూ విభిన్నమైన వాళ్లే. రూత్ కార్టర్– కాస్ట్యూమ్ విభాగంలో ఆస్కార్ అందుకున్న మొదటి అఫ్రికన్ అమెరికన్. యానిమేటడ్ ఫిల్మ్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న మొదటి నల్ల జాతీయుడు పీటర్ రామ్సే. ఇలా ఈ ఏడాది వర్ణాలకు అతీతంగా షో జరగడంతో ఆస్కార్.. నాట్ సో వైట్ అనే మంచి పరిణామానికీ తెర తీసింది. డ్రైవింగ్‌లో ఆస్కార్ మిస్ ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ‘గ్రీన్‌బుక్’ చిత్రాన్ని ప్రకటించడం చాలామందికి రుచించలేదు. ఒక నల్లజాతి పియానిస్ట్, ఓ తెల్ల జాతి డ్రైవర్ కలిసి చేసిన ప్రయాణమే ‘గ్రీన్‌బుక్’. ఈ చిత్ర దర్శకుడు పీటర్ ఫారెల్లీపై లైంగిక వేధింపుల ఆరోపణలూ ఉన్నాయి. ‘ఎవరో ఎవర్నో డ్రైవ్ చేసిన ప్రతిసారి నేనోడిపోతున్నాను’ అంటూ ‘గ్రీన్‌బుక్’ విజయంపై కామెంట్ చేశారు దర్శకుడు స్పైక్ లీ. ఆయన తీసిన ‘బ్లాక్లాంన్స్‌మాన్’ చిత్రానికి బెస్ట్ఫిల్మ్ మిస్ అయ్యింది. 1989లో కూడా ‘డ్రైవింగ్ మిస్ డైసీ’ చిత్రం పోటీగా నిలిచి స్పైక్ లీ తీసిన ‘డూ ది రైట్ థింగ్’కు అస్కార్ మిస్ అయ్యేలా చేసింది. హైలైట్స్ ∙ఆస్కార్ స్టేజ్ సెటప్ అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టయిల్ని తలపించేలా ఉందనే కామెంట్స్ వినిపించాయి. ‘ఆర్ట్‌లో ఒక్కొక్కరు ఒక్కో బొమ్మను వాళ్లకు నచ్చిన విధంగా ఊహిస్తూ చూస్తారు. ట్రంప్ హెయిర్స్టయిల్లా ఊహించుకున్న వాళ్లకు అలా కనపడి ఉండొచ్చు’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్. ∙ఈ ఏడాది బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్‌ను నటి గ్లెన్ క్లోజ్ గెలుస్తుంది అని అనుకున్నారంతా. గ్లెన్ కూడా తన డ్రెస్‌ను ఆస్కార్ అవార్డ్ ప్రతిమలా డిజైన్ చేసుకుంది. దాదాపు 20 కిలోల బరువున్న ఈ డ్రెస్‌తో రెడ్ కార్పెట్ పై నడిచి అందరి చూపులనూ తన వైపు తిప్పుకుంది. కాని ఆమెకు అవార్డు రాలేదు. ∙ఈ ఫంక్షన్లో లేడీ గాగా, బ్రాడ్లీ కూపర్ పాడిన ‘షాలో’ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. ∙రెండు ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న మొదటి నల్లజాతీయుడు మహర్షెల్లా అలీ. ఈ ఏడాది గ్రీన్‌బుక్ చిత్రానికి ఆయన ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ తీసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం మూన్లైట్ చిత్రానికి ఉత్తమసహాయనటుడు విభాగంలో తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నారు మహర్షెల్లా అలీ. ∙ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలిచారు రోమీ మాలిక్. ఆ అవార్డు అందుకున్న తొలి అరబ్ అమెరికన్ వ్యక్తి రోమీ మాలిక్. స్పీచ్ ఇచ్చిన తర్వాత స్టేజీ మీద నుంచి బ్యాలెన్స్ తప్పి కింద పడ్డారు. ∙గత ఆరేళ్లుగా యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో డిస్నీ సంస్థకు ఆస్కార్ అవార్డులు వస్తూన్నాయి. ‘స్పైడర్‌మ్యాన్: ఇట్ టు ది స్పైడర్ వర్స్’ చిత్రంతో ఆ స్పీడ్‌కు బ్రేక్ వేసింది సోనీ. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ ఏడాది ఆస్కార్‌ను చేజిక్కించుకుంది. అయినా డిస్నీ ఆస్కార్ ఖాతాలో ఈ యేడాదీ ఆస్కార్ పడింది.. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ‘బావ్’తో. ∙ ‘ఏ స్టార్ ఈజ్ బార్న్’ చిత్రం ఈ ఏడాది ఎనిమిది ఆస్కార్ నామినేషన్స్‌ను దక్కించుకుంది. కానీ ఒరిజినల్ స్కోర్ విభాగంలో మాత్రమే ఆస్కార్ అవార్డును అందుకోగలిగింది. విజేతల జాబితా ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్ ఉత్తమ డైరెక్టర్: అల్ఫాన్సో క్వేరాన్ (రోమా) ఉత్తమ నటుడు : రమీ మాలిక్ (బొహెమియన్ రాప్సోడి) ఉత్తమ నటి: ఒలివియా కోల్మన్ (ద ఫెవరెట్) ఉత్తమ సహాయ నటుడు: మహర్షెల్లా అలీ (గ్రీన్‌బుక్) ఉత్తమ సహాయ నటి : రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్) ఒరిజినల్ స్క్రీన్ ప్లే : గ్రీన్‌బుక్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : బ్లాక్లాంన్స్‌మాన్ (స్పైక్ లీ) ఉత్తమ విదేశీ చిత్రం : రోమా యానీమేటెడ్ ఫీచర్ : స్పైడర్‌మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వర్స్ సౌండ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి విజువల్ ఎఫెక్ట్స్ : ఫస్ట్‌మ్యాన్ ఫిల్మ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి యానీమేటెడ్ షార్ట్: బావ్ లైవ్ యాక్షన్ షార్ట్: స్కిన్ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఒరిజినల్ స్కోర్ : బ్లాక్ పాంథర్ ఒరిజినల్ సాంగ్ : షాలో (ఏ స్టార్ ఈజ్ బార్న్) ప్రొడక్షన్ డిజైన్: బ్లాక్ పాంథర్ (రూత్ కార్టర్) సినిమాటోగ్రఫీ : రోమా (అల్ఫాన్సో క్వేరాన్) క్యాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్ (హన్నా బీచ్లర్ ) మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: వైస్ ( గ్రెగ్ కన్నమ్, కేట్ బిస్కోయి, పాట్రికా డిహానీ లీ) డాక్యుమెంటరీ ఫీచర్: ఫ్రీ సోలో సౌండ్ మిక్సింగ్ : బొహెమియన్ రాప్సోడి -
ఆ రెండు సినిమాలకు ఆస్కార్ అవార్డుల పంట
సినీ ప్రపంచంలో ఉన్నతమైన అవార్డుగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం నేడు అట్టహాసంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ప్రధానం చేసే ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షిస్తూ ఉంటుంది. అయితే నేటి కార్యక్రమంలో ఓ భారతీయ సినిమా కూడా ఆస్కార్ అవార్డును అందుకుంది. స్త్రీ జీవితంలో ప్రధాన పరిణామమైన రుతుచక్రం ఇతివృత్తంతో రూపొందిన ‘పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ డాక్యూమెంటరీని ఆస్కార్ వరించింది. ఈ వేడుకలో రెండు హాలీవుడ్ చిత్రాలు అవార్డుల పంటను పండించాయి. ‘రోమా’, ‘బ్లాక్ పాంథర్’ చిత్రాలకు అనేక విభాగాల్లో అవార్డులు వచ్చాయి. మొత్తంగా ఏ చిత్రానికి ఏ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయంటే.. ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్ ఉత్తమ నటుడు: రామి మలేక్ (బొహేమియన్ రాప్సోడీ) ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్ (ది ఫేవరేట్) ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్సో క్వారోన్ (రోమా) ఉత్తమ సహాయ నటుడు: మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్) ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్) ఉత్తమ ఛాయాగ్రాహకుడు: అల్ఫాన్సో కరోన్(రోమా) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ‘బ్లాక్ పాంథర్‘ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: రూత్‌కార్టర్(బ్లాక్ పాంథర్) ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: బొహెమియన్ రాప్సోడి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ‘స్పైడర్ మ్యాన్:ఇన్ టూ ది స్పైడర్ వర్స్ ఉత్తమ విదేశీ చిత్రం: ‘రోమా’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం: ‘ఫ్రీ సోలో’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (భారతీయ చిత్రం) -
ఆస్కార్ పండగొచ్చేసింది!
‘‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’’ తర్వాత ఏర్పడే ఉత్కంఠ భరిత క్షణాలను చూసేరోజు రానే వచ్చింది. నేడే ఆస్కార్ అవార్డ్ వేడుక జరగనుంది. విశ్లేషణలు అయిపోయాయి. విశేషాలు మాట్లాడేసుకున్నాం. మిగిలిందల్లా ఆస్కార్ ఎన్వలప్లో ఎవరి పేరు రాసిందో తెలుసుకోవడమే మిగిలి ఉంది. 91వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో ఘనంగా జరగనుంది. ఆస్కార్‌లో ఎప్పుడూ కనిపించని విషయాలు ఈ ఏడాది చోటు చేసుకోనున్నాయి. వాటితో పాటు మరికొన్ని విశేషాలు. ఆస్కార్ సినిమాలు అనగానే ఆర్ట్ సినిమాలకే అనే ఉద్దేశాలు లేకపోలేదు. అయితే వాటిని ఈ ఏడాది కొట్టిపారేసింది. ఏడు నామినేషన్లతో ‘బ్లాక్ ప్యాంథర్’ చిత్రం మొదటి సూపర్ హీరో సినిమాగా నిలిచింది. ఆస్కార్ నామినేషన్ దక్కితే గొప్పే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఒక్కరే ఒకటికంటే ఎక్కువ నామినేషన్లు పొందితే ఆశ్చర్యపడే విషయం. ఈ ఏడాది హాట్ ఫేవరెట్ ‘రోమా’ దర్శకుడు ఆల్ఫోన్స్ కువరో నాలుగు నామినేషన్లు దక్కించుకున్నారు. నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, కెమెరామేన్ విభాగాల్లో నామినేషన్ సాధించారాయన. ఈ ఫీట్‌ని ఆల్రెడీ వారెన్ బీట్టీ రెండుసార్లు (హెవెన్ కెన్ వెయిట్, రెడ్స్), జోయిల్, ఎతన్ ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్’ సినిమాకు సాధించారు. ఎక్కువ సార్లు నామినేషన్ అందుకున్న రికార్డ్ నటీమణుల్లో మెరీల్ స్ట్రీప్ 21 నామినేషన్స్‌తో ముందు వరుసలో ఉన్నారు. నటుల్లో 12 నామినేషన్లతో జాక్ నికోల్సన్ ఉన్నారు. ఆస్కార్ ఎక్కువసార్లు అందుకున్న నిర్మాణ సంస్థగా వాల్ట్ డిస్నీ 22 ఆస్కార్లను అందుకుంది.ఆస్కార్ విగ్రహాన్ని ఏ నటీనటులైనా, సాంకేతిక నిపుణుడైనా తన అవార్డ్ షెల్ప్‌లో చూసుకోవాలని కోరుకుంటాడు. ఆస్కార్ విగ్రహం తయారీ గురించిన విషయాలు తెలుసుకుందాం. 13.5 సె.మీ ఉండే ఈ ప్రతిమ సుమారు మూడున్నర కేజీల బరువు ఉంటుంది. ఫిల్మ్ మీద కత్తి పట్టుకుని నిల్చున్న యోధుడిలా ఉండే ఆస్కార్ ప్రతిమను న్యూ యార్క్‌కు చెందిన కంపెనీ తయారు చేస్తుంది. -
ఆస్కారం ఎవరికి?
91వ ఆస్కార్ అవార్డు వేడుకలకు టైమ్ దగ్గరపడుతోంది. ఈ వేడుక వచ్చే నెల 24న జరగనుంది. ఈ అవార్డుల బరిలో ఏయే చిత్రాలు నిలబడతాయి? ఏయే నటీనటులు, సాంకేతిక నిపుణులు నిలబడతారు? అనే ఆసక్తి గత కొన్నాళ్లుగా నెలకొంది. మంగళవారం (భారతీయ కాలమానం ప్రకారం రాత్రి సుమారు 7 గంటలకు) నామినేషన్స్‌ను విడుదల చేశారు. ‘ద ఫేవరెట్, నెట్‌ఫ్లిక్స్ రోమా’ చిత్రాలకు పది నామినేషన్స్ దక్కడం విశేషం. ‘ద స్టార్ ఈజ్ బోర్న్, వైస్’ చిత్రాలు 8, ‘బ్లాక్ ప్యాంథర్’ ఏడు విభాగాల్లో నామినేట్ అయ్యాయి. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఫస్ట్ సూపర్ హీరో ఫిల్మ్‌గా ‘బ్లాక్ ప్యాంథర్’ నిలిచింది. ఇక.. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న విభాగాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఉత్తమ చిత్రం: బ్లాక్ ప్యాంథర్, బ్లాక్లాంన్స్‌మాన్, బొహెమియాన్ రాప్సోడి, ది ఫేవరెట్, గ్రీన్‌బుక్, రోమా, ఏ స్టార్ ఈజ్ బోర్న్, వైస్. ఉత్తమ నటుడు: క్రిస్టియన్ బాలే (వైస్), బ్రాడ్లీ కూపర్ (ఏ స్టార్ ఈజ్ బోర్న్), విలియమ్ దఫోయ్ (ఎట్ ఇటర్నిటీస్ గేట్), రామీ మాలిక్ (బొహెమియాన్ రాప్సోడి), విగ్గో మార్టెన్సెన్ (గ్రీన్ బుక్). ఉత్తమ నటి: యలిట్జా అపారిసియో (రోమా), గ్లెన్ క్లోజ్ (ది వైఫ్), ఒలివియా కోల్మన్ (ద ఫెవరెట్), లేడీ గగా ( ఏ స్టార్ ఈజ్ బోర్న్), మెలిస్సా మెకర్తీ(కెన్ యు ఎవర్ ఫర్గివ్ మీ?). ఉత్తమ దర్శకుడు: స్పైక్ లీ (బ్లాక్లాంన్స్‌మాన్), పావెల్ పౌలీకోస్కీ(కోల్డ్‌వార్), యోర్గోస్ లాంతిమోస్ (ది ఫేవరెట్), అల్ఫోనో క్వారోన్ (రోమా) ఆడమ్ మెక్కే (వైస్). ఉత్తమ సహాయనటుడు: మహర్షెల్లా అలీ (గ్రీన్‌బుక్), ఆడమ్ డ్రైవర్ (బ్లాక్లాంన్స్‌మాన్), సామ్ ఎల్లియోట్ (ఏ స్టార్ ఈజ్ బోర్న్), రిచర్డ్ ఈ గ్రాంట్ (కెన్ యు ఎవర్ ఫర్గివ్ మీ?), సామ్ రాక్వెల్ (వైస్). ఉత్తమ సహాయనటి: అమీ ఆడమ్స్ (వైస్), మరినా డిటవీరా (రోమా), రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్), ఎమ్మా స్టోన్ (ది ఫేవరెట్), రాచెల్ వీజ్ (ది ఫేవరెట్) ఉత్తమ విదేశీ చిత్రం: కేపర్నామ్ (లెబనాన్), కోల్డ్ వార్ (పోల్యాండ్), నెవర్ లుక్ అవే (జర్మనీ), రోమా (మెక్సికో), షాప్ లిఫ్టర్స్ (జపాన్) ఇంకా ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైన్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్.. ఇలా మొత్తం 24 విభాగాలకు నామినేషన్లు ప్రకటించారు.పోటీదారులకు ఒక మెట్టు పూర్తయింది. మరో మెట్టు ‘అవార్డు వేదిక’. మరి.. బరిలో నిలిచినవాళ్లల్లో ఆ మెట్టుని కూడా విజయవంతంగా ఎక్కేదెవరో వేచిచూద్దాం. -
మేకింగ్ ఆఫ్ మూవీ - బ్లాక్ పాంథర్
-
అరుదైన బ్లాక్ పాంథర్ కనిపించింది!!
భువనేశ్వర్ : ఒడిశాలోని సుందర్‌గఢ్ అడవిలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. ఎన్నడూలేనిది తొలిసారి ఈ అడవీప్రాంతంలో నల్లచిరుత (బ్లాక్ పాంథర్) కనిపించింది. అడవిలో నల్లచిరుత సంచరిస్తుండగా కెమెరాలో రికార్డు అయిందని సుందర్‌గఢ్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ హెచ్‌కే బిస్త్ తెలిపారు. సుందర్‌గఢ్ ఫారెస్ట్ డివిజన్లోని గర్జన్‌పహడ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏర్పాటుచేసిన కెమెరాల్లో నల్లచిరుత తిరుగుతున్న దృశ్యాలు నమోదయ్యాయని ఒడిశా అటవీశాఖ ప్రధానాధికారి సదీప్ త్రిపాఠీ తెలిపారు. నల్లచిరుత కనిపించిన తొమ్మిది రాష్ట్రం ఒడిశా. మెలనిస్టిక్ లియోపార్డ్స్‌గా పిలిచే ఈ బ్లాక్ పాంథర్స్ ఇప్పటివరకు కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని అడవుల్లో కనిపించాయి. 22 ఏళ్ల కిందట ఒడిశాలోని ఫూల్బనీ, సిమ్లీపాల్ అడవుల్లో నల్లచిరుతలు కనిపించినట్టు చెప్తారు. అయితే, అప్పుడు కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో వీటి ఉనికి నిర్ధారించలేదు. జంతువుల సంచారాన్ని, సమాచారాన్ని సేకరించేందుకు 2015లో అడవిలో కెమెరాలు ఏర్పాటుచేశారు. పరిశోధకులు అందుబాటులో లేని సమయంలోనూ దూరం నుంచి ఆపరేట్ చేస్తూ.. జంతువుల సంచారాన్ని నమోదుచేసేందుకు వీలుగా ఈ కెమెరాలు ఏర్పాటుచేశారు.