Black Panther: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. | Black Panther Attack On Animal In Forest: Viral Video | Sakshi
Sakshi News home page

Black Panther: ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Published Mon, Nov 15 2021 12:23 PM | Last Updated on Mon, Nov 15 2021 1:15 PM

Black Panther Attack On Animal In Forest: Viral Video - Sakshi

అడవిలో ‍క్రూర జంతువులు తమ ఆహరం కోసం మరోక జీవిపై ఆధారపడతాయి. సింహం, పులి వంటి జంతువులు.. ఆహరం కోసం వేరే జంతువులపై దాడిచేసి వాటిని చంపి తినేస్తాయి. వేటలో భాగంగా... అనేక జంతువులు విభిన్నరీతిలో ప్రవర్తిస్తాయి. క్రూర జంతువులు తమకు కావాల్సిన వేటకోసం నానా తంటాలు పడుతుంటాయి. కొన్ని జంతువులు తమ వేటను గమనించి.. మెల్లగా చడి చప్పుడు చేయకుండా అమాంతం వాటిపై దాడిచేస్తాయి.

కొన్ని సమయాల్లో క్రూర జంతువులు ఈ దాడిలో పైచేయి సాధిస్తే.. మరి కొన్ని సమయాల్లో సాధు జంతువులు తమపై దాడిచేస్తున్న జంతువుకే చుక్కలు చూపిస్తాయి. వాటి నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంటాయి. జంతువుల వేటకు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా.. ఒక నల్లచిరుత దాడి వీడియోను పరిమల్‌ నాత్వాని అనే యూజర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక అడవిలో.. నలుపు రంగు చిరుత తన వేటను చూసింది. ఆ తర్వాత.. చెట్టు చాటు నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ.. దాని వైపు వెళ్లింది. అ‍క్కడంతా పచ్చని గడ్డి పరుచుకుని ఉంది. అది.. తన చెవులను నిటారుగా ఉంచి తన దృష్టిని వేటపైనే ఉంచింది. ఎలాంటి శబ్దం చేయకుండా నక్కి మెల్లగా వేటవైపు వెళ్లింది. 

నల్ల చిరుత గంభీరంగా.. నక్కుతూ వెళ్లి.. తన వేటపై అమాంతం దూకింది. ఈ వీడియో చూస్తుంటే.. మనపైనే దాడి చేస్తుందేమో.. అన్నంత భయంకరంగా ఉంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం దాడిరా బాబు..’,‘ ఒళ్లు గగుర్పొడిచే వీడియో బాబొయ్‌..’,‘ దాడికి గురైన జీవి ఖచ్చితంగా బ్రతికి ఉండదు..’ అంటూ కామెం‍ట్‌లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement