Green grass
-
సహారాలో పచ్చందనం
సహారా. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. కనుచూపుమేర సుదూరాల దాకా పరుచుకున్న ఇసుక మేటలు. ఏళ్ల తరబడి వాన ఆనవాలు కూడా కనిపించని ప్రదేశాలకు ఆలవాలం. అలాంటి సహారా పచ్చబడుతోంది. నీళ్లు నిండిన మడుగులు, పచ్చని గడ్డితో, అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్న పలు జాతుల మొక్కలతో కనువిందు చేస్తోంది...! వాతావరణ మార్పులు సహారాను కూడా వదలడం లేదు. పశి్చమ ఆఫ్రికాలోని ఈ ఎడారిలో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు ఈ ప్రాంతాన్ని కొద్ది రోజులుగా ముంచెత్తుతున్నాయి. అసలు వాన చినుకే పడని ప్రాంతాలు కూడా కుండపోతతో తడిసి ముద్దగా మారుతున్నాయి. దాంతో సహారాలో విస్తారంగా గడ్డి మొలుస్తోంది. పలు రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి. ఏకంగా అంతరిక్షం నుంచి నాసా తీసిన తాజా చిత్రాల్లో ఎడారిలోని విస్తారమైన ప్రాంతం ఆకుపచ్చగా కనిపిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! చాద్ రిపబ్లిక్, సూడాన్, ఎరిత్రియా, మాలి, నైగర్ వంటి పలు దేశాల్లో సహారాలోని విస్తారమైన ప్రాంతం పచ్చని కళ సంతరించుకుని కనిపిస్తోంది. భారీ వర్షాలు సహారాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సెపె్టంబర్ 7, 8 తేదీల్లో కుండపోత కురిసింది. ఆ ప్రాంతాల్లో సాధారణంగా కొన్నేళ్లలో పడాల్సిన వాన కేవలం ఆ రెండు రోజుల్లోనే నమోదైంది. దాంతో ఎన్నడూ నీటి ఆనవాళ్లకు కూడా నోచుకోని విస్తారమైన ఇసుక మేటలు కాస్తా కొలనులుగా మారి ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఐటీసీజెడ్)లో మార్పులే దీనికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆఫ్రికాలోని ఉష్ణమండల గాలులు ఉత్తర దిశ నుంచి వచ్చే పొడి గాలితో భూమధ్యరేఖ సమీపంలో కలుస్తుంటాయి. ఫలితంగా తుపాన్లు, భారీ వానలు ఏర్పడే ప్రాంతాన్నే ఐటీసీజెడ్గా పిలుస్తారు. ఈ సీజన్లో ఇది సహారా ఎడారికి సమీపంగా జరిగింది. వానలు, వరదలకు కారణమయ్యే లా నినా పరిస్థితులు ఇందుకు తోడయ్యాయి. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సహారా పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాంతో పలు దేశాల్లో 40 లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితులయ్యారు. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. 21 వేల ఏళ్లకోసారి... సహారా ఎడారి ప్రతి 21 వేల ఏళ్లకోసారి పూర్తిగా పచ్చదనం సంతరించుకుంటుందట. విస్తారమైన అడవులు, నదులు, సెలయేళ్లు, గుట్టలతో కళకళలాడుతూ ఉంటుందట. కొన్ని వేల ఏళ్లపాటు ఇలా సాగాక తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా మళ్లీ విస్తారమైన ఇసుక మేటలతో ఎడారిగా మారిపోతుంది. ఒక్క చివరి మంచు యుగాన్ని మినహాయిస్తే గత 8 లక్షల ఏళ్లుగా ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోందని సైంటిస్టులు తేల్చారు. భూ అక్షంలో 21 వేల ఏళ్లకు ఒకసారి కలిగే స్వల్ప మార్పులే ఇందుకు కారణమని గతేడాది జరిగిన ఒక అధ్యయనం తేలి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పశువులకు అలాంటి గడ్డి వేస్తున్నారా? కాల్షియం లోపం వస్తుంది!
‘మేపు లోనే సేపు’ అని నానుడి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పూర్తి సామర్ధ్యం పొందాలంటే మేలైన, నాణ్యమైన పశుగ్రాసాలను పచ్చిమేతగా అందించాలి. దాణా కన్నా పచ్చని పశుగ్రాసాలను మేతగా అందిస్తే అధిక పాల దిగుబడి సాధించడంతో పాటు పాడి పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచినవారమవుతాం. పాడి పరిశ్రమ లాభసాటి కావాలంటే ఖర్చు తగ్గాలి. ఇది తగ్గాలంటే మేలు జాతి పశుగ్రాసాలను పశువులకు మేతగా అందించాలి. దీనితో 40–50 శాతం ఖర్చు తగ్గటంతో పాటు పాల దిగుబడి 20 శాతం పెరుగుతోంది. రైతులు పశుగ్రాసాల్లో ఏదో ఒకటి లేదా రెండు రకాలను పెంచి పాడి పశువులకు మేపుతుంటారు. అలా కాకుండా కొన్ని రకాల పశుగ్రాసాలను పెంచి పశువులకు క్రమపద్ధతిలో మేపితే మరింత మేలు జరుగుతోంది. ఈ విధానాన్ని అమలాపురం ఏరియా పశు వైద్యశాల అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపిస్తున్నారు. ఏరియా పశు వైద్యశాల వెనుక నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని చదును చేసి పదిహేను సెంట్ల స్థలంలో పది రకాల పశుగ్రాసాలను పెంచుతున్నారు. పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు ఎల్.విజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనా క్షేత్రంలో సూపర్ నేపియర్, గిని గడ్డి, కనుమ గడ్డి, రెడ్ నేపియర్, గిని గ్రాస్, మోని, చంగల్ గడ్డి, బొబ్బర గడ్డి, సీవో4, సీవో 5 రకాల గడ్డిని పెంచుతున్నారు. ఔత్సాహికులైన పాడి రైతులకు పశుగ్రాసాల పెంపక విధానాన్ని వివరిస్తున్నారు. ప్రతి గడ్డిలో వైవిధ్యభరితమైన పోషకాలు ఉండటంతో అన్ని రకాలు మేపితే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కేవలం పేరా గ్రాస్ (ఇంగ్లీష్ గడ్డి) మాత్రమే మేపితే పశువుల్లో కాల్షియం లోపించే అవకాశముంది. చెంగల్ గడ్డి ‘రాగి సంగటి’తో సమానం. సూపర్ నేపియర్ ఐదేళ్లు పాటు మేత అందుతోంది. కాండం మెత్తగా ఉండడంతో పాటు ఇందులో అధిక పోషకాలుంటాయి. రెడ్ నేపియర్‌లో ప్రోటీన్, గినీ గడ్డిలో శక్తినిచ్చే పోషకాలు ఎక్కువ. వీటిని కలిపి అందించడం వల్ల అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. దీని వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువులు బలంగా ఉంటాయి. శాస్త్రీయ పద్ధతిలో పశు పోషణలో భాగంగా వివిధ పోషకాలున్న పశుగ్రాసాలను పరిచయం చేయటంతో పాటు వివిధ రకాల నేలలకు అనువైన పశుగ్రాసాల రకాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. గడ్డి విత్తనాలు, కనుపులను ఉచితంగా అందజేస్తున్నారు. రైతులతో పాటు వెటర్నరీ విద్యార్థులకూ అవగాహన కల్పిస్తున్నారు. పదిహేను సెంట్లలో ఏడాదికి సగటున 2.5 టన్నుల పశు గ్రాసాన్ని రైతులు పొందనున్నారు. ఒక ఎకరం భూమిలో ఈ విధంగా పశుగ్రాసాలు పెంచితే 5 నుంచి 6 పాడి పశువులకు ఏడాది పొడవునా మేత అందించవచ్చు. వీటితో పాటు కలబంద, నల్లేరు, పసుపు, రణపాల, తులసి, తిప్పతీగ, ఇన్సులిన్ మొక్క వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతూ, సంప్రదాయ వైద్యంలో వాటి ఉపయోగాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు. ఒకటికి పది రకాల పశుగ్రాసాల పెంపకం వల్ల పాడి రైతుల ఆదాయం పెరుగుతోందంటున్నారు విజయ్‌రెడ్డి (98663 27067). – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం 13 నుంచి సింహపురి సేంద్రియ మేళా గో–ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సింహపురి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు నెల్లూరులోని వి.ఆర్ కాలేజి గ్రౌండ్స్‌లో సేంద్రియ ఉత్పత్తులతో పాటు చేపలు, రొయ్యలు, పీతల ప్రదర్శన–అమ్మకం మేళా జరగనుంది. ఇతర వివరాలకు.. 81436 32488. 15,16 తేదీల్లో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఆదిగురు భారత్ ఫౌండేషన్ అధ్వర్యంలో జనగాంలోని బానపురంలో గో΄ాల్ గోశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో సేంద్రియ, గోఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఉంటుంది. ద్రావణాలు, కషాయాలు, గానుగ నునెలు, నెయ్యి, ధూప్ స్టిక్‌లు తదితర ఉత్పత్తుల తయారీపై నిపుణులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 70953 14226. -
Black Panther: ‘వామ్మో.. ఇదేం దాడిరా బాబు..’
-
Black Panther: ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
అడవిలో క్రూర జంతువులు తమ ఆహరం కోసం మరోక జీవిపై ఆధారపడతాయి. సింహం, పులి వంటి జంతువులు.. ఆహరం కోసం వేరే జంతువులపై దాడిచేసి వాటిని చంపి తినేస్తాయి. వేటలో భాగంగా... అనేక జంతువులు విభిన్నరీతిలో ప్రవర్తిస్తాయి. క్రూర జంతువులు తమకు కావాల్సిన వేటకోసం నానా తంటాలు పడుతుంటాయి. కొన్ని జంతువులు తమ వేటను గమనించి.. మెల్లగా చడి చప్పుడు చేయకుండా అమాంతం వాటిపై దాడిచేస్తాయి. కొన్ని సమయాల్లో క్రూర జంతువులు ఈ దాడిలో పైచేయి సాధిస్తే.. మరి కొన్ని సమయాల్లో సాధు జంతువులు తమపై దాడిచేస్తున్న జంతువుకే చుక్కలు చూపిస్తాయి. వాటి నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంటాయి. జంతువుల వేటకు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఒక నల్లచిరుత దాడి వీడియోను పరిమల్ నాత్వాని అనే యూజర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక అడవిలో.. నలుపు రంగు చిరుత తన వేటను చూసింది. ఆ తర్వాత.. చెట్టు చాటు నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ.. దాని వైపు వెళ్లింది. అక్కడంతా పచ్చని గడ్డి పరుచుకుని ఉంది. అది.. తన చెవులను నిటారుగా ఉంచి తన దృష్టిని వేటపైనే ఉంచింది. ఎలాంటి శబ్దం చేయకుండా నక్కి మెల్లగా వేటవైపు వెళ్లింది. నల్ల చిరుత గంభీరంగా.. నక్కుతూ వెళ్లి.. తన వేటపై అమాంతం దూకింది. ఈ వీడియో చూస్తుంటే.. మనపైనే దాడి చేస్తుందేమో.. అన్నంత భయంకరంగా ఉంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం దాడిరా బాబు..’,‘ ఒళ్లు గగుర్పొడిచే వీడియో బాబొయ్..’,‘ దాడికి గురైన జీవి ఖచ్చితంగా బ్రతికి ఉండదు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
రైతన్నా.. జరపదిలం
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పొలం గట్లపై.. చేలలో పాముల సంచారం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు జరభ్రదంగా ఉండాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ పేర్కొంటున్నారు. చేలలో పచ్చని గడ్డి పెరిగి అందులో విషసర్పాలు సంచరిస్తుంటాయి. చేలలో పనిచేస్తుండగా పాముకాటు బారిన పడి ఏటా కొందరు రైతులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాత్రివేళ చేను కావలికి వెళ్లి చీకట్లో గడ్డిలోంచి నడుస్తుండగా పాము కాటేస్తున్నాయి. పగటి వేళ సైతం చేను పనుల్లో బిజీగా ఉండగా పాము సమీపంలోకి వచ్చినా గమనించకపోవడంతో వాటి కాటుకు గురైన సందర్భాలూ ఉన్నాయి. అయితే చిన్నపాటి జాగ్రత్తలు, స్వీయరక్షణ చర్యలు పాటిస్తే పాముల బెడద నుంచి బయటపడొచ్చని శాస్త్రవేత్త రాజశేఖర్ సూచిస్తున్నారు. జాగ్రత్తలు రాత్రివేళ పొలం వద్దకు వెళ్లే రైతులు టార్చిలైట్లు, కర్ర, సెల్‌ఫోన్ వెంట తీసుకెళ్లాలి. శబ్ధం చేస్తూ నడవాలి. రాత్రి చేలకు వెళ్లే రైతులు బూట్లు వేసుకోవడం మంచిది. జిల్లాలో వివిధ రకాల పాములు ఉండగా నాగుపాము, కట్ల పాము, రక్త పింజర వంటి వాటిలోనే అధిక విషం ఉంటుంది. మిగతావి చా లా వరకు విషరహితాలే. పాము కాటేయగానే భయపడకుండా వెం టనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. లేదా సమీపం లో ఉన్న రైతులకు విషయం చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లమని కోరాలి. పాటు కాటేస్తే.. వెంటనే కాటేసిన చోటుకి కొంచెం పైభాగంలో దారంతో కట్టుకట్టి రక్త ప్రసరణ పైకి జరగకుండా చూడాలి. కాటేసిన ప్రాంతాన్ని కదపకుండా, కుదుపులకు గురికాకుండా చూడాలి. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. ఇంట్లోని ఫ్రిజ్‌లో లేదా బయట ఐస్‌ముక్కలు దొరికితే తీసుకురావాలని సూచించాలి. ఐస్ ముక్కలు ఉన్నట్లయితే కాటేసిన చోటును, ఆ అవయవాన్ని మంచు ముక్కలతో చుట్టి వస్త్రంతో కట్టేయాలి. దీంతో రక్త ప్రసరణ నెమ్మదిగా జరిగి విష ప్రభావం గుండెకు, ఊపిరితిత్తులకు చేరడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఆస్పత్రికి వెళ్లే వరకు ఇది కాపాడుతుంది. కాటేసిన ప్రాంతం నుంచి వీలైనంత రక్తాన్ని పిండేయాలి. సాధారణంగా పాములు కాళ్లు, చేతులకే కాటేస్తాయి. ఇలా జరిగితే కాటేసిన చేయి, కాలును పెకైత్తకుండా వీలైనంత కిందికి అంటే విషరక్తం గుండెకు సులువుగా చేరకుండా కదలనీయకుండా కిందికి పట్టి ఉంచాలి. మంత్రాలు, చెట్లు, పసరు తదితర మందులంటూ కాలయాపన చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. మనిషిని కాటు వేసే ముందు పాము ఇతర జంతువును కాటేస్తే మనిషికి అంతగా అపాయం ఉండదు. పాము కాటుకు గురైన వ్యక్తి ధైర్యంగా ఉండాలి. చుట్టు ఉన్నవారూ ధైర్యం చెప్పాలి. జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రి, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు నివారణ మందులు అందుబాటులో ఉన్నందున బాధితుడిని సాధ్యమైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. పాములను గుర్తించడమిలా.. నాగు పాము : సాధారణంగా ముదురు గోధుమ వర్ణంలో ఉండి పడగ కలిగి ఉంటుంది. కట్ల పాము : నలుపు రంగులో ఉండి ఒంటిపై నలుపు, తెలుపు చారలు కలిగి ఉంటుంది. రక్త పింజర : గోధమ రంగులో ఉండి శరీరంపై, వీపు భాగంలో డైమండ్ ఆకారపు గుర్తులు మూడు వరుసల్లో ఉంటాయి. అలాగే తలపై బాణపు గుర్తు ఉంటుంది. విషప్రభావం పాము కాటేసిన ప్రదేశంలో రెండు లేదా నాలుగు కామ ఆకారపు గుర్తులు పడతాయి. అరగంటలోపే విషం ఒళ్లంతా పాకి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. కళ్లు మూత పడడం, కాళ్లూచేతులు తాత్కాలికంగా పక్షవాతం రావడం, మాట ఆగిపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాము విషాన్ని న్యూరో టాక్సిన్ అంటారు. రక్త పింజర కరిచిన భాగం ఉబ్బి తీవ్రంగా నొప్పి కలిగిస్తుంది. అరగంటలో నోట్లోంచి, చెవుల్లోంచి రక్త స్రావం జరుగుతుంది. ఆ విషాన్ని హీమో టాక్సిన్ అంటారు. ఆస్పత్రి దూరంగా ఉంటే.. ఆస్పత్రి చాలా దూరంలో ఉంటే వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. పాము కరిచిన భాగాన్ని బట్టతో లేదా టవాల్‌తో గట్టిగా కట్టాలి. ఇలా చేయడం వల్ల విషం తొందరగా శరీరంలోకి వ్యాపించదు. కట్టును పది నిమిషాలకు ఒకసారి వదిలి కడుతూ ఉండాలి. కొత్త బ్లేడుతో పాము కరిచిన స్థానంలో ప్లస్గుర్తులా ఒక సెంటిమీటర్ లోపలికి కోయాలి. కాసేపటికి విషంతో కూడిన రక్తం దానంతట అదే బయటకు పోతుంది. వైద్యుడితో యాంటీ స్నేక్ వీనమ్(ఏఎస్వీ) తీసుకుంటే ప్రాణాపాయం ఉండదు.