అడవి అనే పదం వింటే కృూర జంతువులు, వాటి వేట గుర్తుకొస్తుంది. జంతురాజ్యమైన అడవిలో సాధు జంతువులు తమకు ఎప్పుడు, ఏ వైపు నుంచి ప్రమాదం వచ్చిపడుతుందోనని భయపడుతూనే బతుకుతుంటాయి. సాధారణంగా పులులు, సింహాలు ఎక్కువగా టార్గెట్ చేసేది జింకలనే. జింకలు చాలా సున్నితమైనవి. ఇవి పూర్తిగా శాఖాహారులు.. మాంసాహారం జోలికి వెళ్లవు. గడ్డి, ఆకులు, పండ్లు తింటూ తమ జీవనాన్ని కొనసాగిస్తుంటాయి.
అయితే సాధు జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇదే నిజం.. జింక ఏకంగా చనిపోయిన పామును నోటితో నమిలి మింగేసింది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. శాఖాహారులైన జంతువులు ఒక్కోసారి పాములను కూడా తింటాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెర్బివర్(శాఖాహారి) జాతికి చెందిన జింక ఇలా మాంసాహారం తినడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు చెబుతున్నారు.మరోవైపు జింకలు మాంసాన్ని వెంబడించవచ్చని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ పేర్కొంది. జింకలో ఫాస్పరస్, ఉప్పు, కాల్షియం వంటి ఖనిజాలను ఉండవని.. ముఖ్యంగా శీతాకాలపు నెలలలో మొక్కల జీవితం తక్కువగా ఉంటుందని,. ఈ కారణాలతో జింకలు మాంసాన్ని తినడానికి అవకాశం ఉంటుందని తెలిపింది.
చదవండి: ఆ రోబోకి మనిషిలా శ్వాస తీసుకోవడం, చెమటలు పట్టడం జరుగుతాయట!
Cameras are helping us understand Nature better.
— Susanta Nanda (@susantananda3) June 11, 2023
Yes. Herbivorous animals do eat snakes at times. pic.twitter.com/DdHNenDKU0
Comments
Please login to add a commentAdd a comment