అతిపెద్ద పామును చూశాం.. రెండు తలల పామును చూశాం. అత్యంత విషపూరితమైన పాముల గురించి చాలా కథనాలు విన్నాం. తాజాగా బంగారు రంగు పాము ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎక్స్(ట్విటర్) యూజర్ సంతోష్ ఈ గోల్డెన్ స్నేక్ వీడియోని ఏప్రిల్ ఒకటో తేదీన షేర్ చేశారు. గోల్డెన్ స్నేక్ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ వీడియో ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.
బంగారురంగులో ఓ ఆరు అడుగుల పాము రోడ్డు దాటుతున్నట్టుగా వీడియో ఈ పోస్ట్‌లో ఉన్నాయి. పామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూ రికార్డు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. బంగారు వర్ణంలో ధగ ధగ లాడుతూ అలా రోడ్డు అవతల ఉన్న గడ్డిలోకి జారిపోయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్ని తులాలుంటుంది, దుబాయ్ నుంచి డైరెక్ట్‌గా వచ్చేసినట్టుంది అంటూన్న కామెంట్స్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలిచాయి. అది ఎల్లో స్నేక్ అనీ అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటని మరొకరు వ్యాఖ్యానించారు.
Golden snake 🐍 pic.twitter.com/kYnJ52gCEa
— Shanthosh (@shanthosh) April 4, 2024
Comments
Please login to add a commentAdd a comment