golden
-
బంగారు ఇల్లు!.. ధర తెలిస్తే గుండె జల్లు (ఫోటోలు)
-
Mouni Roy: సారీ లుక్‌లో గోల్డన్ గార్ల్..
-
గోల్డెన్ స్నేక్.. డైరెక్టుగా దుబాయ్ నుంచి..!
అతిపెద్ద పామును చూశాం.. రెండు తలల పామును చూశాం. అత్యంత విషపూరితమైన పాముల గురించి చాలా కథనాలు విన్నాం. తాజాగా బంగారు రంగు పాము ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎక్స్(ట్విటర్) యూజర్ సంతోష్ ఈ గోల్డెన్ స్నేక్ వీడియోని ఏప్రిల్ ఒకటో తేదీన షేర్ చేశారు. గోల్డెన్ స్నేక్ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ వీడియో ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. బంగారురంగులో ఓ ఆరు అడుగుల పాము రోడ్డు దాటుతున్నట్టుగా వీడియో ఈ పోస్ట్‌లో ఉన్నాయి. పామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూ రికార్డు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. బంగారు వర్ణంలో ధగ ధగ లాడుతూ అలా రోడ్డు అవతల ఉన్న గడ్డిలోకి జారిపోయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్ని తులాలుంటుంది, దుబాయ్ నుంచి డైరెక్ట్‌గా వచ్చేసినట్టుంది అంటూన్న కామెంట్స్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలిచాయి. అది ఎల్లో స్నేక్ అనీ అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటని మరొకరు వ్యాఖ్యానించారు. Golden snake 🐍 pic.twitter.com/kYnJ52gCEa — Shanthosh (@shanthosh) April 4, 2024 -
81st Golden Globe Awards 2024: 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో తారల సందడి.. ఫోటోలు
-
రామ్‌చరణ్‌కి గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు
హీరో రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 2023 పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్‌తో పాటు ఈ అవార్డు కోసం షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, రిద్ధి డోగ్రా, రాశీ ఖన్నా నామినేషన్స్ దక్కించుకోగా ఫైనల్‌గా రామ్ చరణ్‌ని వరించింది. ఇటీవలే రామ్ చరణ్ ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్) క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజాగా ‘గోల్డెన్ బాలీవుడ్ అవార్డు’ కి ఎంపికవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: బంగారు తిరుచ్చి ఉత్సవం (ఫొటోలు)
-
సచిన్‌కు ‘గోల్డెన్ టికెట్’
ముంబై: భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ ప్రత్యేక అతిథులుగా ఎంపిక చేసిన కొందరు ప్రముఖులకు బీసీసీఐ వరుసగా ‘గోల్డెన్ టికెట్’ ఇచ్చి మ్యాచ్‌లకు ఆహ్వానిస్తోంది. ఇటీవలే నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఈ టికెట్ అందించిన బోర్డు కార్యదర్శి జై షా తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘గోల్డెన్ టికెట్’ అందించారు. అద్భుత క్రికెటర్, జాతికి గర్వకారణంగా నిలిచిన ‘భారత రత్న’ సచిన్‌కు టికెట్ అందించడం పట్ల జై షా సంతోషం వ్యక్తం చేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సచిన్‌లాంటి వ్యక్తి ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఒక భాగంగా మారారని వ్యాఖ్యానించారు. కొత్త టికెట్లూ హుష్ కాకి! వరల్డ్ కప్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని 4 లక్షల టికెట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చినట్లు బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ పరిస్థితి చూస్తే ఏమీ మారలేదని అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అమ్మకానికి పెట్టారు. అయితే భారత్‌కు సంబంధించి అన్ని మ్యాచ్‌లకూ టికెట్లే లేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని మ్యాచ్‌లకు ‘సోల్డ్ అవుట్’ చూపిస్తుండగా... మిగతా మ్యాచ్‌లకు మీరు క్యూలో ఉన్నారు అని ‘బుక్ మై షో’ చెబుతోంది. గతంతో పోలిస్తే టికెట్ కోసం ప్రయతి్నస్తున్నవారికి వేచి ఉండాల్సిన సమయం వేర్వేరుగా చూపించగా... ఇప్పుడు అందరికీ ఒకే మెసేజ్ ‘90 నిమిషాలు’ అనే చూపిస్తుండటం విశేషం! అసలు ఏ మ్యాచ్‌కు ఎన్ని టికెట్లు అమ్ముతున్నారనే విషయంపైనే సమాచారం లేకపోగా, 4 లక్షల టికెట్ల గురించి ఎక్కడా స్పష్టత లేదు! చూస్తుంటే ఇదంతా అభిమానులను కాస్త ఓదార్చించేందుకు బీసీసీఐ ఆడిన ఒక డ్రామాలాగానే కనిపిస్తోంది. -
అమితాబ్‌కు ‘గోల్డెన్ టికెట్’
భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డెన్ టికెట్’ను నట దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా అందజేశారు. ఈ టికెట్ ద్వారా ప్రత్యేక అతిథి హోదాలో అన్ని వేదికల్లో అన్ని మ్యాచ్‌లనూ చూసే అవకాశం ఉంటుంది. మహానటుడే కాకుండా క్రికెట్ వీరాభిమాని అయిన అమితాబ్‌కు ‘గోల్డెన్ టికెట్’ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు, ఎప్పటిలాగే టీమిండియాకు ఆయన మద్దతు కొనసాగాలని జై షా వ్యాఖ్యానించారు. -
గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి తెలుసా! అత్యంత ధనవంతులే తీసుకోగలరా!
గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి విన్నారా!. దీన్ని ఎక్కువగా అత్యంత ధనవంతులే కోరుకుంటారట. ఈ పాస్‌పోర్ట్‌ని పొందడమే అదృష్టంగా భావిస్తారట వారు. అసలేంటి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్. ధనవంతులకు ఆ పాస్‌పోర్ట్ అంటే ఎందుకంతా క్రేజ్!. గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే పెట్టుబడి ద్వారా పౌరసత్వం పొందే పాస్‌పోర్ట్. గణనీయమైన ఆర్థిక పెట్టుబడుల ద్వారా వ్యక్తులకు పౌరసత్వం లభిస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు విదేశాల్లో నివాసం ఉండగలుగుతారు. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని వీసా రహిత ప్రయాణం అనాలి. ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపారాలను విస్తరించుకునేందుకు సులవైన మార్గం కూడా. ఈ పాస్‌పోర్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు.. గోల్డెన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అనేక దేశాలకు పాస్‌పోర్ట్ లేకుండా ఈజీగా రాకపోకలు సాగించగలరు. కొన్ని దేశాలు పన్ను భారాన్ని తగ్గించుకోవాలని చూసే వారికి అనూకూలమైన పన్ను విధానాలను అందించి మరీ పెట్టుబడులు పెట్టేలా చేసి మరీ ఈ వీసాలను ఇస్తాయట. ఇది కొత్త మార్కెట్లకి, పెట్టుబడి అవకాశాలకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ కారణంగా ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, నాణ్యమైన జీవన ప్రమాణాలను తదితరాలను పొందుతారు. ఇలాంటి పౌరసత్వాలను అందించే దేశాలు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఆంటిగ్వా మరియు బార్బుడా మరియు డొమినికా వంటి దేశాలు ఇలాంటి ఆకర్షణీయమైన పౌరసత్వ కార్యక్రమాలను అందిస్తున్నాయి. అలాగే మాల్టా, సైప్రస్ వంటి దేశాలు ఐరోపా చుట్టి వచ్చేలా, కొన్ని కరేబియన్ దేశాలు, వనాటు వంటివి యునైటెడ్ స్టేట్స్లో ఉండేలా ఆకర్షణీయమైన వీసాలను అందిస్తున్నాయి. చుట్టుమడుతున్న వివాదాలు గమ్యాన్ని బట్టి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్ వందల వేల నుంచి మిలియన్ల వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఈ వీసా ఆర్థిక ప్రయోజనాలు, మెరగైన జీవనశైలికి ప్రధాన ఆకర్షణగా ఉన్నా.. ఆస్తుల దుర్వినియోగం జరిగే ప్రమాదం పొంచి ఉంది. అత్యంత ధనవంతులకు ఇదోక అవకాశంలా.. ఆస్తులను కాపాడుకునేందుకు సులభమైన మార్గంలా ఉండే ప్రమాదం ఉంది. అలాగే భద్రత, స్వేచ్ఛ పరంగా కూడా ఈ పాస్‌పోర్ట్ విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. (చదవండి: అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..) -
'గోల్డెన్ వాటర్ స్పౌట్'..ప్రకృతి అద్భుతం
ప్రకృతిలో కనిపించే కొన్ని అద్భుతాలు చూసేందుకు బాగుంటాయి. కానీ అవి చాలా ప్రమాదకరమైనవి. టోర్నడోలు ఎలాగైతే.. భూమిపై సుడిగాలిలా వచ్చి ఎలా చుట్టుకుంటూ ఆకాశంలోకి లాగేసి పడేస్తుందో.. అలాంటిది ఇది. ఇవి ఎక్కువగా అమెరికా వంటి దేశాల్లో చూస్తుంటాం. నీటి మీద కూడా సుడిగాలి వస్తే.. నీరు అంతా గిరగిర తిరుగుతూ రివర్స్‌లో ఆకాశంలోకి వెళ్తున్నట్లు ఉంటుంది. చూడటానికి ఇది ఆకాశం నీరు తాగుతుందా!.. అన్నట్లు ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..రష్యాలోని పెర్మ్ ప్రాంతంలో కామా నదిపై ఈ అద్భుతం చోటు చేసుకుంది. సాధారణంగా నీరు సుడిగాలిలా వెళ్తుంటే తెల్లగా ఉండాలి కదా. కానీ ఇక్కడ..గోల్డెన్ కలర్లో వెళ్తుంది. చూస్తే అది గోల్డెన్ వాటర్ స్పౌట్ గ్లైడింగ్లా ఉంది. దీన్ని పడవలో వెళ్తున్న ప్రయాణికులు జులై 13, 2023న తమ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో నది ఉపరితలం నుంచి ఆకాశం వరకు విస్తరించి ఉంది వాటర్స్పాట్. నెటిజన్లు మాత్రం ఇది 'స్వర్గానికి నది'లా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. వాటర్స్పాట్ అంటే.. ఇది సముద్రాలు, సరస్సులు, నదులు వంటి పెద్దనీటిపై కనిపంచే అద్భుత దృశ్యం. ఆకాశంలోని మేఘం నుంచి నదిలోని నీటి ఉపరితం వరకు ఓ సుడిగాలిలా విస్తరించి ఉంటుంది. ఈ వాటర్స్పాట్లు నాన్ సూపర్ సెల్యులార్(సరైన వాతావరణంలో ఏర్పడేవి) లేదా ఉరుములతో కూడిన వాటర్స్పౌట్లు(టోర్నాడిక వాటర్స్పౌట్లు). అయితే చూసేందుకు అద్భుతమైన దృశ్యాంలా ఉన్న ఇవి చాలా ప్రమాదాలను కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. A little about nature and the difference of mentality. Kama River. Perm region. July 13, 2023. pic.twitter.com/AaWTHqrnCR — Zlatti71 (@djuric_zlatko) July 17, 2023 (చదవండి: సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే కారణమా..!) -
నటి కార్తికకు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్‌కు యుఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. దుబాయ్‌లోని ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో విశేషమైన పాత్ర పోషిస్తుంది కార్తిక. ఈ క్రమంలో కొన్నేళ్లగా అక్కడే స్థిరపడి యంగ్ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తికకు గోల్డెన్ వీసా అందజేశారు. దుబాయ్‌లోని టూఫోర్ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుఎఇకి చెందిన హమద్ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? ‘‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది’’ అని కార్తీక నాయర్ అన్నారు. కార్తిక తల్లి రాధ గురించి పరిచయం అవసరం లేదు. 1980ల్లో ఆమె స్టార్ హీరోయిన్గా రాణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆమె నటించారు. నటిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి గతంలో రాధకు కూడా గోల్డెన్ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే! కేరళలోనూ ఉదయ్ సముద్ర గ్రూప్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సంస్థలు ఉన్నాయి. తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తిక తెలిపారు. -
విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? బంగారు డిస్క్‌లతో ప్రయోగం
మొత్తం విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపైనో.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలపైనో ఏదైనా జీవం ఉందా అన్నది ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్న. ఈ గ్రహాంతర వాసుల (ఏలియన్లు) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా ఏలియన్లు ఉంటే మనను గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల్లో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. ఏమిటా బంగారు డిస్కులు, వాటిపై ఏముందన్న వివరాలు తెలుసుకుందామా.. భూమి, మానవుల విశేషాలతో.. ఒకవేళ ఎక్కడైనా గ్రహాంతర జీవులు ఉండి ఉంటే.. వాటికి భూమి మీద జీవం, మనుషులు ఉన్నట్టు తెలిపేందుకు శాస్త్రవేత్తలు వ్యోమనౌకలలో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. వాటిపై మనుషులు సాధించిన ప్రగతి, వివిధ సాంస్కృతిక, సాంకేతిక అంశాలను వివరించేలా ఉన్న డిజైన్లు, ఆకారాలను నిక్షిప్తం చేశారు. అయితే ఇవి పూర్తిస్థాయి బంగారు ప్లేట్లు కాదు. పన్నెండు అంగుళాల వ్యాసం ఉన్న గట్టి రాగి ప్లేట్లపై మందంగా బంగారు పూత పూశారు. ఇప్పటివరకు నాలుగు వ్యోమనౌకలలో.. అంతరిక్షంలో సుదూర ప్రయోగాల కోసం పంపిన వ్యోమనౌకలలో నాసా శాస్త్రవేత్తలు బంగారు డిస్‌్కలను అమర్చారు. ఇప్పటివరకు పయోనిర్–10, పయోనిర్–11, వోయేజర్–1, వోయేజర్–2 వ్యోమనౌకలు వీటిని తీసుకుని అంతరిక్షం అంచుల్లోకి చేరుకున్నాయి కూడా. వోయేజర్ వ్యోమనౌకల్లో పంపిన డిస్్కలపై పంపిన డేటాను శాస్త్రవేత్త కార్ల్ సాగన్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఏలియన్లకు అర్థమయ్యేలా.. 1977లో వోయేజర్ వ్యోమనౌకలలో పంపిన బంగారు డిస్క్‌లను గ్రామ్‌ఫోన్ రికార్డుల తరహాలో రూపొందించారు. వాటిలో గణితం, సైన్స్‌కు సంబంధించిన వివరాలను, వివిధ ధ్వనులను నమోదు చేశారు. గణితం, సైన్స్‌కు సంబంధించిన అంశాలు యూనివర్సల్ అని.. ఎప్పటికైనా వీటిని గ్రహాంతర వాసులు అర్థం చేసుకోగలరని శాస్త్రవేత్తల భావన. అందుకే ఈ డిస్క్‌లను టైం క్యాప్సూల్స్ అని కూడా పేర్కొన్నారు. ఈ బంగారు డిస్క్లకుపైన కవర్‌ను కూడా అమర్చారు. దీనిని అల్యూమినియంతో తయారు చేశారు. అంతరిక్షంలో పరిస్థితులను తట్టుకుని కోట్ల ఏళ్లు ఉండేందుకు వీలుగా.. యురేనియం–238ను పూత పూశారు. ఈ కవర్‌పై ‘‘అన్ని కాలాలు, అన్ని ప్రపంచాల్లో సంగీతాన్ని సృష్టించేవారి కోసం..’’ అని రాశారు. బంగారు డిస్క్‌లలో ఏమేం నిక్షిప్తం చేశారు? ► మానవులు, భూమికి సంబంధించి అనలాగ్ పద్ధతిలో ఎన్కోడ్ చేసిన 115 చిత్రాలు (తింటూ, తాగుతూ ఉన్న మనుషులు, తాజ్‌మహల్ వంటి ప్రముఖ స్థలాలు, క్రీడాకారులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లి, ఎల్రక్టానిక్ పరికరాలు, న్యూటన్ రాసిన బుక్‌లోని ఓ పేజీ.. ఇలా ఎన్నో). ► హిందీ, బెంగాలీ, కన్నడ సహా 55 భాషల్లో పలకరింపులు. ► ప్రముఖ సంగీత విద్వాంసులకు సంబంధించిన 90 నిమిషాల సంగీతం. ► భూమిపై వినిపించే వివిధ రకాల ధ్వనులతో కూడిన (ఉరుములు, జంతువుల అరుపులు, మనుషుల మాటలు, ముద్దు ధ్వని సహా) 12 నిమిషాల ఆడియో. ► అంతరిక్షంలో మన సౌర కుటుంబం, భూమి ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలిగేలా డిస్క్ కవర్‌పై మ్యాప్. ► డిస్క్‌లోని వివరాలను డీకోడ్ చేసేందుకు వీలైన మేథమేటికల్, సైన్స్ ఆకృతులు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వజ్ర సింహాసన వైభవం
మైసూరు: స్వచ్ఛమైన బంగారం, అపురూపమైన వజ్రాలు, రత్నాలు పొదిగిన సింహాసనాన్ని చూడాలంటే మైసూరు ప్యాలెస్‌కు వెళ్లాల్సిందే. దసరా మహోత్సవాలకు నగరం హంగులు అద్దుకుంటుండగా, ప్యాలెస్‌లోనూ ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ప్యాలెస్‌లో ఉన్న దర్బార్ హాల్లో ఉన్న బంగారు సింహాసనాన్ని జోడించారు. వృశ్చిక లగ్నంలో పూజలు చేసి మంగళవారం ఉదయం 10.45 గంటల నుంచి 11.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో పూజలు చేసి జోడింపు ప్రారంభించారు. మొదట వేద పండితుల సమక్షంలో గణపతి హోమం, చాముండి పూజ, శాంతి హోమం చేశారు. రాజవంశీకుడు యదువీర్ పాల్గొన్నారు. ప్యాలెస్‌లో కింది గదిలో ఉన్న స్ట్రాంగ్ రూంలో విడివిడిగా ఉన్న బంగారు, వజ్రఖచిత భాగాలను పోలీసు బందోబస్తు మధ్య దర్బార్ హాల్లోకి తీసుకొచ్చారు. పురాతన కాలం నుంచి సింహా సనం ఉంచే స్థలంలో జోడించారు. ఈ కార్యక్రమంలో గెజ్జగెహళ్లి గ్రామస్తులు, రాజమాత ప్రమోదాదేవి పాల్గొన్నారు. జోడింపు పూర్తయ్యాక మళ్లీ పూజలు చేసి తెల్లని వస్త్రంతో కప్పిఉంచారు. సెప్టంబర్ 26వ తేదీన దసరా నవరాత్రి ఉత్సవాల రోజున యదువీర్ ఈ సింహాసనాన్ని అధిష్టిస్తారు. (చదవండి: వధువు స్పెషల్ ఫోటో షూట్... ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు) -
కేదార్నాథ్ గోడలకు బంగారు తాపడం వద్దు
డెహ్రాడూన్: హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయ గర్భగుడి లోపలి గోడలకు బంగారు రేకుల తాపడం చేయడంపై తీర్థపురోహితుల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి. వెండి రేకుల స్థానంలో బంగారు రేకులను తాపడం చేయిస్తానంటూ మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు ముందుకు రాగా ఆలయ కమిటీ అనుమతించింది. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇది ఆలయ ఆచారాలకు విఘాతమంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. బంగారు రేకుల తాపడం కోసం చేపట్టే డ్రిల్లింగ్‌తో గర్భాలయ గోడలకు నష్టమన్నది వారి ఆందోళన. దీన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయేంద్ర అజయ్ కొట్టిపారేశారు. ‘‘బంగారు తాపడంలో తప్పేముంది? దీన్ని కావాలనే వ్యతిరేకిస్తున్నారు’’ అన్నారు. -
భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం (ఫొటోలు)
-
గోల్డెన్ మిల్క్ తో వందలాది వ్యాధులకు చెక్..
-
ప్రిన్స్ ఫిలిప్ బర్త్‌డేకి మామిడి పండ్లు
జైపుర్ మహారాణి గాయత్రీదేవి యేటా ప్రిన్స్ ఫిలిప్ పుట్టినరోజుకు బుట్టెడు ఆల్ఫాన్సో రకం మామిడి పండ్లు పంపేవారని, వాటిని ఆయన ఇష్టంగా స్వీకరించేవారని గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్ : ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. మరొక ఆసక్తికరమైన విశేషం.. క్వీన్ ఎలిజబెత్, గాయత్రీదేవి దంపతుల ప్రేమ కథలకు, జీవిత విధానాలకు దగ్గరి పోలికలు ఉండటం!! క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌ల జంటకు; మన జైపుర్ మహారాణి గాయత్రీదేవి, మాన్సింగ్ల జంటకు మధ్య ఆసక్తికరమైన పోలికలు కొన్ని కనిపిస్తాయి. క్వీన్ ఎలిజబెత్‌తో డెబ్బై నాలుగేళ్ల దాంపత్య బాంధవ్యాన్ని గడిపి, తన నిండు నూరేళ్లకు దగ్గరి వయసులో నిన్న శుక్రవారం ఆమె చెయ్యి వదలి వెళ్లిన ప్రిన్స్ ఫిలిప్.. క్వీన్‌ని చూసింది ఆమె 13 ఏళ్ల వయసులో. మాన్సింగ్ గాయత్రీదేవిని మొదట చూసింది కూడా ఆమెకు 13 ఏళ్ల వయసులోనే. ఏడేళ్లపాటు మాన్సింగ్ గాయత్రిని ప్రేమించాడు. ఆమెకు 21 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకున్నాడు. ఒడ్డు పొడుగు కన్నా ‘పోలో’ ఆటలో అతడి ‘ఒడుపు’ చూసి మనసిచ్చేసింది గాయత్రి. అక్కడ బ్రిటన్ లో ఆ జంటదీ ఇదే కథ. ఫిలిప్ క్రికెట్ ఆడతాడు. ఎవరిదో పెళ్లిలో ఎలిజబెత్‌ని తొలిసారి చూశాడు. తర్వాత ఏడేళ్లపాటు ప్రేమలేఖలు నడిచాయి. ఆరో యేట (ప్రేమకు ఆరో యేట) ఎలిజబెత్ తండ్రిని కలిసి, ‘నేను మీ అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాను’ అని అడిగాడు. ఒక్క ఏడాది ఆగమన్నారు ఆయన! ఆగడం ఎందుకంటే అప్పటికి ఎలిజబెత్‌కి 21 ఏళ్లు వస్తాయి. అలా ఇక్కడ గాయత్రీ దేవికి, అక్కడ క్వీన్ ఎలిజ బెత్కి వారి ఇరవై ఒకటో యేటే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఏడేళ్లకు అక్కడ ఎలిజబెత్‌కి క్వీన్‌గా పట్టాభిషేకం జరిగితే, ఇక్కడ జైపుర్‌లో గాయత్రీదేవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడ క్వీన్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ‘డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్’ అయితే, ఇక్కడ గాయత్రి భర్త రాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఎలిజబెత్, ఫిలిప్‌ల వివాహం జరిగిన ఏడాదే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. జైపుర్, మరో 18 సంస్థానాలు కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రానికే మాన్సింగ్ గవర్నర్ అయ్యారు. గాయత్రి దేవి ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ జంటలో భార్య, ఈ జంటలో భార్య ప్రత్యక్ష పాలనలో ఉంటే, ఆ జంటలో భర్త, ఈ జంటలో భర్త పరోక్ష విధులకు పరిమితం అయ్యారు. గాయత్రీదేవి పుట్టింది కూడా క్వీన్ ఎలిజబెత్ పుట్టిన లండన్‌లోనే. క్వీన్ కన్నా గాయత్రి ఏడేళ్లు పెద్ద. 1950, 60 లలో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్; గాయత్రిదేవి, మాన్సింగ్ దంపతులు ప్రపంచానికి ‘గోల్డెన్ కపుల్’. వీరి రెండు ప్రేమ కథలకు పోలికలు ఉండటం మాత్రమే కాదు, రెండు జంటలూ మంచి ఫ్రెండ్స్ కూడా! ప్రిన్స్ ఫిలిప్ వేసవిలో పుట్టారు. ఏటా జూన్ 10 న ఆయన పుట్టినరోజు జరుగుతున్నా అసలు పుట్టిన రోజు మాత్రం మే 28. నూరేళ్ల క్రితం 1921లో ఆయన పుట్టే సమయానికి గ్రెగోరియన్ క్యాలెండర్ పుట్టలేదు. ఆ ముందువరకు ఉన్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఆయన ‘మే’ నెలలోనే పుట్టినట్లు. మే అయినా, జూన్ అయినా.. ఇండియాలో అది మామిడి పండ్ల కాలం. ఏటా ఆయన పుట్టిన రోజుకు గాయత్రీదేవి బుట్టెడు ఆల్ఫోన్సో మామిడి పండ్లను కానుకగా పంపేవారు. ఆ పండ్లను ప్రిన్స్ ఫిలిప్ ఎంతో ప్రీతిగా స్వీకరించేవారని గాయత్రీ దేవి ఆంతరంగిక సలహాదారు ఒకరు తనతో చెప్పినట్లు గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్: ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ దంపతులతో గాయత్రీదేవి, మాన్సింగ్ -
మన రైలు.. ఇక మరింత వేగం!
సాక్షి, హైదరాబాద్: మన రైలు వేగం మరింత పెరగనుంది. గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగు పెట్టనుంది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇది సరికొత్త మైలురాయి కావడం విశేషం. స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ కారిడార్లను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేయడంతో అక్కడ రైళ్లు వేగంగా వెళ్లడానికి మార్గం సుగమమైంది. లాక్డౌన్ సమయంలో... స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ పేరుతో దేశవ్యాప్తంగా రెండు కారిడార్లను కేంద్రం అభివృద్ధి చేసింది. డబ్లింగ్ లైన్ ఉన్న మార్గాలను అనుసంధానిస్తూ ఉత్తర–దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుతూ ఈ మార్గాలు విస్తరించాయి. వీటిలో ప్రమాదకర మలుపులు లేకుండా చేయటంతోపాటు కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ, 260 మీటర్ల పొడవున్న పట్టాలను పటిష్టమైన రీతిలో ఏర్పాటు చేశారు. లాక్డౌన్ సమయం లో ఈ పనులు పూర్తి చేశారు. అనంతరం జూలై నుంచి దశలవారీగా ఆర్డీఎస్ఓ పర్యవేక్షణలో కన్ఫర్మేటరీ అసిలోగ్రాఫ్ కార్‌తో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించారు. తర్వాత పూర్తిస్థాయి రైళ్లను గరిష్ట వేగంతో నడిపి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవటంతో ఆ పరీక్షలు విజయవంతమైనట్టు ప్రకటించారు. తాజాగా రైల్వే సేఫ్టీ కమిషనర్ కొన్ని చిన్నచిన్న సూచనలు చేస్తూ రైళ్లను గరిష్ట వేగంతో నడిపేందుకు అనుమతి మంజూరు చేశారు. దీంతో రెండుమూడు వారాల్లో ఆ మార్పులు పూర్తిచేసి రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,280 కి.మీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,612 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్ విస్తరించి ఉండగా.. ప్రస్తుతానికి 1,280 కిలోమీటర్ల మేర ఈ తరహా ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. స్వర్ణ వికర్ణ కారిడార్‌కు సంబంధించి బల్లార్షా నుంచి కాజీపేట వరకు 234 కి.మీ., కాజీపేట నుంచి విజయవాడ, గుంటూరు వరకు 510 కి.మీ., స్వర్ణ చతుర్భుజి కారిడార్‌లో (చెన్నై–ముంబై సెక్షన్) 536 కి.మీ. ఈ మార్గం ఉంటుంది. ఇప్పటికే సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైళ్లను నడుపుతున్నారు. ఇకపై మిగతా మార్గాల్లో కూడా ఇది అమలవుతుంది. ప్రస్తుతం ఆ మార్గాల్లో 90 కి.మీ. నుంచి 110 కి.మీ. గరిష్ట వేగంగా ఉంది. కొన్ని మార్గాల్లో పరిమిత దూరం 120 కి.మీ. వరకు నడుపుతున్నారు. సింగిల్ లైన్లు, సరైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ లేని మార్గాల్లో మాత్రం రైళ్లు ఇప్పటిలాగానే సాధారణ వేగంతో నడుస్తాయి. ఇందులో కొన్ని ప్రధాన మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్–నిజామాబాద్ మార్గం ఒకటి. -
‘ఇవి బంగారం కాదు.. నిజంగా ప్రకృతి అద్భుతం’
న్యూఢిల్లీ: బంగారు వర్ణంలో కనిపించే చితాకోకచిలుక ప్యూపాల వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం బంగారు నాణేళ్లలా మెరిసిపోతున్న ఈ లార్వాల వీడియోను ఆటవీ శాఖ అధికారి ప్రవీణ్ కశ్వన్ సోమవారం ట్విటర్లో షేర్ చేశాడు. ఇవి లార్వా-ఇమాగో మధ్య చితాకోకచిలుకగా పరివర్తనం చెందె జీవ కీటక దశ అని తన ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇవి బంగారం కాదు. టిథోరియా టారిసినా, సితాకోకచిలుకల ప్యూపాలు.. అద్బుతమైన ప్రకృతి’ అంటూ ట్వీట్ చేశాడు. 8 సెకన్ల నిడివి గల ఈ వీడియోను షేర్ చేసిన 8 గంటల్లోపే 43 వేల వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. (వైరల్ : సందర్శకులపై నీటి జల్లులు) ఈ వీడియోకు ‘‘ఇప్పటీ వరకు ఇలాంటి ప్యూపాలనే చూడలేదు’’, ‘‘ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.. నీజంగా ప్రకృతి అద్భుతం’’, ‘‘బంగారం లాంటి ప్యూపా.. పరిణతి చెందిన వజ్రం’’ అంటూ నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా బంగారం మాదిరిగా కనిపించించే ఈ సితాకోకచిలుక ప్యుపాలను "టిథోరియా టారిసినా ప్యూపా" కశ్యన్ తన పోస్టులో వెల్లడించాడు. వీటిని ‘మచ్చల టైగర్వింగ్’ అని కూడా పిలుస్తారు. ఇవి దక్షిణ అమెరికాలోని మెక్సికోలో కనిపించే అరుదైన సీతాకోకచిలుక జాతి అని కశ్వన్ పేర్కొన్నాడు. -
అరచేతిలో అద్భుతం.. ఎప్పుడైనా చూశారా?
డానాంగ్: అర చేతుల్లో అద్భుతం.. ఈ ఫోటో చూసిన వెంటనే ఎవరికైనా ఇదే మాట తడుతుంది. దూరం నుంచి చూసే వారికి ఇంత పెద్ద భారీ వంతెనను పడిపోకుండా ఈ రెండు చేతులు కాపాడుతున్నాయేమో అన్పిస్తోంది. మరి ఆ అర చేతుల్లో మనం కూడా వాలిపోవాలంటే.. చలో వియత్నాం. ‘గోల్డెన్ హ్యాండ్స్’ అని పిలుచుకుంటున్న ఈ వంతెన వియత్నాంలోని బనా హిల్స్ రిసార్ట్ వద్ద నిర్మించారు. ఈ వంతెనను సముద్ర మట్టానికి సుమారు 4593 అడుగుల ఎత్తులో కట్టారు. వంతెనకు ఇరు పక్కల వంగపువ్వూ రంగులో ఉండే లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు. దూరం నుంచి చూసినప్పుడు అడవిలో నుంచి రెండు భారీ చేతులు వచ్చి ఈ వంతెనను పట్టుకున్నాయేమో అనిపిస్తోంది. జూన్ నెలలో ప్రారంభించిన ఈ వంతెనను చూడటానికి ఇప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అంతేనా ఈ వంతెనకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వియత్నాం ప్రభుత్వం దాదాపు 10 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో భాగంగా ఈ ‘గోల్డెన్ బ్రిడ్జి’ని నిర్మించారు. ఈ వంతెనపై నిల్చోని చూస్తే ఆకాశానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అన్పిస్తోంది అంటున్నారు పర్యాటకులు. అయితే ఈ వంతెనపైకి కేవలం పాదచారులను మాత్రమే అనుమతిచ్చింది వియత్నాం ప్రభుత్వం. -
బద్రినాథ్ గుడిలో కొత్త బంగారు గొడుగు
గోపేశ్వర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌లోని విష్ణు భగవానుడి విగ్రహంపై కొత్త బంగారు గొడుగును ఏర్పాటుచేశారు. నాలుగు కేజీల బరువున్న ఈ గొడుగును లూధియానాకు చెందిన సూద్ కుటుంబం కానుకగా సమర్పించింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దాన్ని దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల నడుమ గర్భగుడిలో ప్రతిష్టించారు. సూద్ కుటుంబీకులు, దేవాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 ఏళ్ల కిత్రం గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మహరాణి అహల్యా బాయ్ సోల్కర్ సమర్పించిన గొడుగు స్థానంలో కొత్త గొడుగును అమర్చారు. -
బంగారు రేణువులను ముద్దలు చేస్తుంది...
సూక్ష్మ ప్రపంచం.. అదేనండీ... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లతో కూడినది ఓ వింతల లోకం. అదెలా అనే ప్రశ్నకి క్వీన్స్‌ల్యాండ్ శాస్త్రవేత్తలు సమాధానం చెబుతున్నారు. బంగారు రేణువులను హరాయించుకుని ముద్దలుగా మార్చేసే సరికొత్త బ్యాక్టీరియాను వీరు గుర్తించారు మరి! అయితే ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మీ స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ల వైపు ఒక్కచూపు చూసేయండి. దాంట్లో ఉండే అతితక్కువ మోతాదు బంగారం, ఇతర విలువైన ఖనిజాల కోసం అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. అంతేకాదు.. బంగారు గనుల్లో టన్నులకొద్దీ మట్టి తవ్వి తీస్తే వచ్చే బంగారం గ్రాముల్లోనే! ఈ కొత్త బ్యాక్టీరియా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందనుకోండి. ఈ రెండు అంశాల్లోనూ గణనీయమైన మార్పు వస్తుంది. పాత, పడేసిన సర్క్యూట్ బోర్డుల నుంచి ఇవే ఎంచక్కా సువర్ణాన్ని వెలికితీసి ఇస్తాయి. గనుల విషయంలోనూ అధిక లాభాలు పొందేందుకు అవకాశమేర్పడుతుంది. ఈ మధ్యే కనుక్కొన్న ఈ బ్యాక్టీరియా ప్రస్తుతానికి కొంచెం నెమ్మదిగానే పనిచేస్తోంది గానీ.. కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా వేగం పెంచడం కష్టం కాకపోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2016 నాటి లెక్క ప్రకారం.. కంప్యూటర్లు, టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లలో దాగి ఉన్న మొత్తం బంగారం విలువ లక్ష కోట్ల రూపాయల పైమాటే కావడం కొసమెరుపు! -
ఆలయంలో బంగారు రంగు కూర్మము ప్రత్యక్షం
కనగల్ : మండలంలోని శేరిలింగోటం చెరువు కట్టపై ఉన్న శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలోకి మంగళవారం బంగారు రంగుతో ఉన్న తాబేలు వచ్చింది. పక్కనే చెరువు ఉన్నందున అందులోంచి తాబేలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కూర్మానికి స్థానికులు కుంకుమ చల్లి పూజలు చేశారు. విష్ణుమూర్తి దశావతారాల్లో కూర్మావతారం ఒకటైనందున ఆలయంలో తాబేలు ప్రత్యక్షం కావడంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోషమల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
గిన్నిస్ 'మ్యాన్ విత్ ద గోల్డెన్ షర్ట్'..!
నాసిక్‌ః అతడో వ్యాపారి, రాజకీయనాయకుడుగా పేరొందిన వ్యక్తి. అయితే అతడ్ని స్నేహితులు మాత్రం ద మ్యాన్ విత్ ద గోల్డెన్ షర్ట్ అని పిలుస్తున్నారు. ఆ సార్థక నామం వెనుక కథా కమామీషూ ఏమిటంటే... మహరాష్ట్ర నాసిక్ కు చెందిన పంకజ్ పరాఖ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించాడు. 47 ఏళ్ళ పరాఖ్ 2014 ఆగస్టు 1న 98,35,099 రూపాయల అత్యంత ఖరీదైన బంగారు షర్టును ధరించి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాడు. నిజంగా తనకీ గౌరవం లభించడం నమ్మలేకపోతున్నానని, తనకు ఇటువంటి గుర్తింపు రావడంకన్నా.. తమ మారుమూల గ్రామం పేరు.. ప్రపంచవ్యాప్తమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని పరాఖ్ చెప్తున్నాడు. పాఠశాల డ్రాపవుట్ అయిన పరాఖ్... గార్మెట్ ఫ్యాబ్రికేషన్ వ్యాపారవేత్తగానూ, కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే కాక, ముంబైకి 260 కిలోమీటర్ల దూరంలోని నాసిక్ జిల్లా యెవోలా పట్టణానికి డిప్యూటీ మేయర్ కూడ. అయితే అన్ని ప్రత్యేకతలున్న పరాఖ్.. 4.10 కిలోలు.. అంటే ప్రస్తుతం 1.30 కోట్ల రూపాయల ఖరీదుచేసే షర్లుతోపాటు, బంగారు వాచ్, గొలుసులు, ఉంగరాలు, మొబైల్ కవర్, కళ్ళద్దాలకు బంగారు ఫ్రేమ్ వంటి ఇతర వస్తువులతో కలసి సుమారు 10 కేజీల బంగారు వస్తువులను ధరించి, ఓ లైసెన్స్డ్ రివాల్వర్ చేత పట్టుకొని, ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతోపాటు యెవోలా వీధుల్లో మిరుమిట్లు గొలుపుతూ కనిపించి, అప్పట్లో అందర్నీ ప్రత్యేకంగా ఆకట్టుకోవడమే కాక.. ఏకంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపును కూడ పొందాడు. రెండేళ్ళ క్రితం తన 45వ పుట్టిన రోజు సందర్భంలో... ప్రత్యేకంగా ఆ గోల్డెన్ షర్టును కుట్టించుకున్నానని, తనకు పాఠశాల వయసునుంచే బంగారం అంటే ఎంతో ఇష్టమని, అదే ఇష్టం ఏళ్ళు గడిచే కొద్దీ పాషన్ గా మారిందని పరాఖ్ చెప్తున్నాడు. నాసిక్ కు 85 కిలోమీటర్ల దూరంలోని బాఫ్నా జ్యువెలర్స్ వారు డిజైన్ చేసిన ఆ షర్టుకు, ముంబైలోని శాంతి జ్యువెలర్స్ వారు ముత్యాల హంగులద్దారని పరాఖ్ తెలిపాడు. 18 నుంచి 22 క్యారెట్ల బంగారంతో ఆషర్టు రూపొందించేందుకు సుమారు 20 మంది కళాకారులు, 3,200 గంటలు వెచ్చించారని, షర్టు... లోపలి భాగంలో మెత్తని క్లాత్ వేసి కుట్టడంతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధరించేందుకు కూడ ఎంతో వీలుగా ఉంటుందని పరాఖ్ తెలిపాడు. అంతేకాక షర్టు ఉతికేందుకు, రిపేర్ చేసుకునేందుకు కూడ వీలుగా ఉండటంతోపాటు తనకు ఈ అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన షర్టుకు లైఫ్ టైం గ్యారంటీ ఉందని ఫరాఖ్ వెల్లడించాడు. 30 సంవత్సరాల క్రితం పేదరికం అనుభవించిన పరాఖ్ ఎనిమిదో తరగతి తర్వాత స్కూలుకు స్వస్తి చెప్పి, యెవోలాలో తల్లిదండ్రులు కొనసాగిస్తున్న చిన్నపాటి గార్మెట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. వ్యాపారాభివృద్ధిలో ఒక్కో అడుగు ముందుకేస్తూనే రాజకీయాల్లోనూ ప్రవేశించి, 1982 లో మొదటిసారి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యాడు. 25 ఏళ్ళక్రితం తన పెళ్ళిలో వధువు కన్నా ఎక్కువ బంగారం ధరించడంతో అందరూ తనను వింతగా చూశారని ఈ సందర్శంలో పరాఖ్ గుర్తు చేసుకున్నాడు. తన ఇష్టమే ఇప్పుడు ఇంతటి గౌరవాన్ని తెచ్చిపెడుతుందని ఊహించలేదని, ఇప్పటికీ బంగారంపై అదే ఇష్టం ఉన్న తాను... పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు వెళ్ళినపుడు సుమారు మూడున్నర కేజీల బరువుండే బంగారు ఆభరణాలను ధరించి వెడతానని, తన భార్య మాత్రం 50 గ్రాములకు మించి ఆభరణాలు ధరించదని చెప్తున్నాడు. మానవత్వానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే పరాఖ్... సామాజిక సేవ, విద్యా సంబంధిత కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటుంటాడు. మొత్తం ఖర్చును తానే వెచ్చించి, గత ఏడేళ్ళలో రాజస్థాన్ ఉదయపూర్ లోని ప్రముఖ నారాయణ్ సేవా సంస్థాన్ ఆస్పత్రిలో సుమారు 150 పోలియో ఆపరేషన్లను చేయించాడు. ప్రతి సంవత్సరం ఓ వారం పాటు తన సమయాన్ని వెచ్చించి, ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, పేద రోగులకు ఆర్థిక సహాయం, ఆహారం, మందులు అందించి.. పరాఖ్ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. -
సైకిల్ తో భారత స్వర్ణ చతుర్భుజిని దాటాడు..!
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లలో తన సైక్లింగ్ ను పూర్తి చేసిన ఓ యువకుడు... ఇప్పుడు తన భారత ప్రయాణంవైపు దృష్టి సారించాడు. సన్నని దారులు, ఇరుకైన ప్రాంతాల్లోని అడ్డంకులను సైతం తప్పించుకొంటూ ప్రయాణించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే కివి సైకిల్ తో... రికార్డు సాధనే ధ్యేయంగా దూసుకుపోతున్నాడు. భారత ప్రధాన నగరాల్లో పారిశ్రామిక వ్యవసాయ, సాంస్కృతిక కేంద్రాలుగా పనిచేసే రహదారి నెట్వర్క్ స్వర్ణ చతుర్భుజిని దిగ్విజయంగా దాటేశాడు. రెండేళ్ళ క్రితం 24 ఏళ్ళవయసున్న టిమ్ ఛిట్టాక్ తన ఫాస్టెట్ సైక్లింగ్ తో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ పర్యటనలు ముగించుకొని తాజాగా భారత్ లో ప్రవేశించాడు. న్యూజిల్యాండ్ వైకటో విశ్వవిద్యాలయంనుంచి లా అండ్ ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన ఛిటాక్... ఫిబ్రవరి 27న ఢిల్లీలో న్యూజిల్యాండ్ ఎంబసీనుంచీ సైకిల్ ప్రయాణం ప్రారంభించాడు. సగటున 250 కిలోమీటర్ల చొప్పున మొత్తం 24 రోజుల్లో 6000 కిలోమీటర్ల దూరం సైకిల్ ప్రయాణం చేస్తూ చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, జైపూర్, కాన్పూర్, పూనే, సూరత్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మొదలైన నగరాలన్నీ చుట్టేశాడు. తాను సవాలుగా స్వీకరించిన ఈ సైక్లింగ్ తనకు గొప్ప అనుభవాన్నిచ్చిందని ఛిటాక్ చెప్తున్నాడు. సైక్లింగ్ చేయడానికి జాతీయ రహదారులు కొంత సహకరించేవిగానే ఉంటాయని, ఇన్నర్, లింక్ రోడ్లలో ప్రయాణమే పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పాడు. తాను ప్రయాణంలో ఉన్నపుడు కనీసం రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసుకుంటానని చెప్తున్న ఛిటాక్... ఒకసారి ఓ ట్రక్ కింద పడబోయి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపాడు. భారత స్వర్ణ చతుర్భుజిపై సైక్లింగ్ చేసి, గిన్నిస్ రికార్డును సాధించే ప్రయత్నంలో ఛిటాక్ రోజుకు 80 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కినట్లు చెప్పున్నాడు. గిన్నిస్ ను సంప్రదించిన అనంతరం ప్రారంభించిన అతడి ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమౌతుందో తెలియాల్సి ఉంది.