
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలోగల కంచి బంగారు, వెండి బల్లుల గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల విశిష్టత ఏంటో తెలుసుకుందాం...
బంగారు, వెండి బల్లులకి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.
అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చె΄్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.
చదవండి: ‘కేన్సర్.. మనీ వేస్ట్’ : రియల్టర్ ఎంత పనిచేశాడు!
బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవి నుంచి శాపవిముక్తి ΄÷ందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.
పౌరాణిక..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి’ క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరం పైకప్పు మీద బంగారు, వెండి రంగులలో రెండు బల్లులు కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.. ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా తొలగుతాయని స్థల పురాణం చెబుతోంది. అదే విధంగా బల్లి శరీరం మీద పడిన వారు... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్పలితం ఉండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం.
బల్లి ఇంట తిరుగాడుతున్నప్పటీకీ ...అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా.... కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెబుతారు.