
ప్రపంచ మానువులంతా ఒక్కేటనన్న భావన పెంపొందించేలా వివిధ దేశాలూ, ప్రాంతాల్లోని వారసత్వ చిహ్నలను పరిరక్షించడానికి యునెస్కో శ్రమిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలను, ప్రజలకు తెలియజేసేలా గుర్తుచేస్తోంది. ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం(world Heritage Day). ప్రతి ఏటా ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను చెప్పి, భవిష్యత్తు తరాల కోసం వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్యోద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్(ఐసీఓఎంఓఎస్)సంస్థ 1982 ఏప్రిల్ 18న మొదటిసారి ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది. 1983లో యునెస్కో ఇదే తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది.
భారతదేశం గొప సాంస్కృతిక వారసత్వానికి నిలయం. అవి మన సంస్కృతి, చరిత్రలో ముఖ్యభాగం. వాటిని కాపాడం మనందరి బాధ్యత. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ(యునెస్కో) వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక, సహజ, మిశ్రమ అనే వర్గాలుగా విభజించింది. 2024 జులై నాటికి 168 దేశాల్లో మొత్తం 1223 హెరిటేజ్ స్టేల్స్ ఉన్నాయి.
మన దేశంలో వాటి సంఖ్య 43 ఉన్నాయి. అయితే ఇందులో 35 సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతుండగా, ఏడు సహజ సౌందర్యానికి ప్రతీకగాఉన్నాయి. మిగిలింది మిశ్రమ సంస్కృతి ఇందులో సిక్కింలోని కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం చోటు దక్కించుకుంది.
ఆ జాబితాలో మనవి..
మొట్టమొదటిసారిగా 1983లలో మహారాష్ట్ర ఎల్లోరా గుహలు, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోట, తాజ్‌మహల్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2024లో అహోమ రాజవంశీకులు అసోంలోని నిర్మించిన సమాధులు కూడా ఇందులోకి చేరాయి. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన తొలి వారసత్వ సంపద ఇదే.
ఇక మన తెలుగువారంతా గర్వించేలా తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం కూడా ఈ జాబితాలో చేరడం విశేషం.
ఏవేవి ఉన్నాయంటే..
ఫతేపూర్ సిక్రి, భీంబేట్కాలోని రాతి ఆవాసాలు, చంపానేర్- పావగఢ్ ఆర్కియోలాజికల్ పార్క్, సాంచీ బౌద్ధ కట్టడాలు, కుతుబ్మినార్, డార్జిలింగ్ పర్వత రైల్వే, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఢిల్లీలోని ఎర్రకోట, జైపుర్‌లోని జంతర్‌మంతర్, రాజస్థాన్ గిరి దుర్గాలు, నలందాలోని నలందా మహావిహార, పటన్లోని రాణీకీ వావ్, చండీగఢ్‌లోని లే కార్బుజియర్ నిర్మించిన వాస్తు కట్టడాలు, అహ్మదాబాద్ చారిత్రక నగరం, ముంబైలోని విక్టోరియన్ గోథిక్, కళాత్మక నిర్మాణాలు, ధోలావీరా-హరప్పా నగరం, అస్సాంలోని మియోడమ్స్.
మహాబలిపురం, హంపీ స్మారక చిహ్నాలు.
కజిరంగా, కియోలాదేవ్, సుందరబన్ జాతీయ ఉద్యాన వనాలు, మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నందాదేవి పువ్వుల లోయ జాతీయ ఉద్యానాలు, హిమాలయాల్లోని నేషనల్ పార్కు కన్జర్వేషన్ ఏరియా, కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానం, శాంతినికేతన్, పశ్చిమ కనుమలు.
కోణార్క్ సూర్య దేవాలయం, తమిళనాడులోని గంగైకొండ చోళపురం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయం, పట్టదకల్ దేవాలయాలు, ఖజురహో దేవాలయం, బోధ్ గయలోని మహాబోధి ఆలయం, బేలూరు చెన్నకేశవ, హలెబీడు-హోయసలేశ్వర, సోమనాథ్పూర్ కేశవ(హోయసల) దేవాలయాలు, గోవాలో చర్చిలు, కాన్వెంట్లు.
(చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!)