heritage
-
యుద్ధంలో కాదు.. బుద్ధుడిలోనే భవిష్యత్తు
భువనేశ్వర్: ఘనమైన వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని, నేడు మనం చెప్పే మాట వింటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భవిష్యత్తు అనేది యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉందని ప్రపంచానికి చెప్పగల శక్తి భారత్‌కు ఉందని తెలిపారు. గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, మనందరి జీవితాల్లో ప్రజాస్వామ్యం ఒక అంతర్భాగమని స్పష్టంచేశారు. ప్రపంచ స్థాయిలో మన దేశ ప్రతిష్ట ఎంతగానో పెరిగిందని అన్నారు. కేవలం మన మనోగతమే కాకుండా గ్లోబల్ సౌత్ దేశాల అభిప్రాయాలను సైతం ప్రపంచ వేదికపై బలంగా వినిపించగలుగుతున్నామని వెల్లడించారు. ఆయుధ బలంతో సామ్రాజ్యాలు విస్తరిస్తున్న కాలంలో అశోక చక్రవర్తి శాంతి మార్గంలో నడిచారని గుర్తుచేశారు. మన వారసత్వ బలానికి ఇదొక ప్రతీక అని వెల్లడించారు. యుద్ధంలో కాకుండా బుద్ధుడి బోధనల్లోనే భవిష్యత్తు ఉందని భారత్ నమ్ముతున్నట్లు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మీ వల్లే తలెత్తుకొని ఉండగలుగుతున్నా.. ‘‘ప్రవాస భారతీయులను మన దేశానికి రాయబారులుగా పరిగణిస్తున్నాం. వైవిధ్యం గురించి మనకు ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యంపై మన జీవితాలు నడుస్తున్నాయి. భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమాజంతో హృదయపూర్వకంగా మమేకమవుతూ ఉంటారు. ఇతర దేశాల నియమ నిబంధనలు మనం చక్కగా గౌరవిస్తాం. మనకు ఉద్యోగం, ఉపాధి కల్పించిన దేశానికి నిజాయితీగా సేవ చేయడం, ఆ దేశ ప్రగతిలో పాలుపంచుకోవడం మనకు అలవాటు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన హృదయం భారతీయతతో నిండి ఉంటుంది. భారత్ కోసమే మన గుండె చప్పుడు వినిపిస్తుంది. ప్రవాస భారతీయులు మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు. వారి వల్లే విదేశాలకు వెళ్లినప్పుడు నేను తలెత్తుకొని ఉండగలుగుతున్నా. మనది యువ భారత్: 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నా. మనది యువ భారత్. ఇక్కడ యువ జనాభా అధికం. అంతేకాదు నైపుణ్యం కలిగిన యువత మన దగ్గర ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చగల సత్తా ఇండియాకు ఉంది. డిజిటల్ టెక్నాలజీలో మనం ముందంజలో ఉన్నాం. ఆధునిక యుద్ధ విమానాలు, రవాణా విమానాలను మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. ‘మేడ్ ఇన్ ఇండియా’ విమానాల్లో మీరంతా ప్రవాసీ భారతీయ దివస్‌కు వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. భారతదేశ ఆసలైన చరిత్రను విదేశాల్లో చాటి చెప్పండి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచానికి ఆయుర్వేదం ఇచ్చిన భారత్: క్రిస్టినా క్లారా ప్రపంచ నాగరికత అభివృద్ధిలో భారత్ వెలకట్టలేని అత్యున్నత పాత్ర పోషించిందని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా ప్రశంసించారు. ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె గురువారం మాట్లాడారు. గణితం, వైద్యం, సముద్రయానం వంటి రంగాల అభివృద్ధికి భారత్ దోహదపడిందని చెప్పారు. భారత్ అందించిన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని అన్నారు. క్రిస్టిన్ క్లారాకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ప్రకటించింది. -
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత లాభం కోసం కులం పేరిట సమాజంలో విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. మన గ్రామీణ సంస్కృతి, వారసత్వం, విలువలను బలోపేతం చేసుకోవాలంటే విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేయడాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. సామాజిక నిర్మాణాన్ని బలహీనపర్చాలని చూస్తున్న శక్తులకు బుద్ధి చెప్పాలని అన్నారు. శనివారం ఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవం–2025ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 2014 నుంచి గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చుదిద్దుకోవాలన్న లక్ష్య సాధనలో గ్రామసీమల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. పల్లె ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... గ్రోత్ సెంటర్లుగా మన గ్రామాలు ‘‘గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేయాలని సంకల్పించాం. ప్రజలు సాధికారత సాధించడానికి చర్యలు చేపట్టాం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలు తగ్గుతాయి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం. గ్రామాలను గ్రోత్ సెంటర్లుగా, అవకాశాల గనిగా మార్చాలన్నదే మా లక్ష్యం. నూతన శక్తితో గ్రామాలు ప్రగతి పథంలో పరుగులు పెట్టాలి. మా ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలన్నీ అందుకోసమే. పదేళ్లుగా ఎంఎస్పీ పెంచుతున్నాం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గత పదేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్లు అందజేశాం. వ్యవసాయ రుణాల కింద ఇచ్చే సొమ్మును 3.5 రెట్లు పెంచాం. పదేళ్లుగా వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూనే ఉన్నాం. మన ఉద్దేశాలు పవిత్రంగా ఉంటే ఫలితాలు సైతం గొప్పగా ఉంటాయి. గత పదేళ్లపాటు చేసిన కఠోర శ్రమకు తగిన ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 2011తో పోలిస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఖర్చు వెనుకాడకుండా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఆదాయంలో 50 శాతానికిపైగా సొమ్మును కేవలం ఆహారం కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అది 50 కంటే తక్కువ శాతానికి తగ్గిపోయింది’’ అని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ పేదరికం 5 శాతమే ‘‘మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారిని విస్మరించాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. పేదరికం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చాలావరకు మారిపోయింది. 2012లో గ్రామీణ పేదరికం 26 శాతం ఉండగా, 2024 నాటికి అది 5 శాతానికి పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో తేలింది. కొన్ని పార్టీలు, వ్యక్తులు పేదరిక నిర్మూలన అంటూ దశాబ్దాలపాటు నినాదాలు చేశారు. కానీ, వారు సాధించింది ఏమీ లేదు. పేదరికం నిజంగా తగ్గిపోవడాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. -
పండుగలకే పండుగ!
నాగాలాండ్‌లో జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్‌లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్‌బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా
బెంగాల్లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం.. ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్‌తోపాటు ఎక్స్ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్‌లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది. -
2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉన్న బండరాళ్లివి!
రాక్ సొసైటీ గుర్తింపు పొందిన ఉర్దూ విశ్వవిద్యాలయంలోని పత్తర్ కే దిల్, ఏక్తా మే తాకత్ హై పేర్లు కలిగిన రెండు బండరాళ్లకు మాత్రం 2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉందని, దక్కన్ పీఠభూముల్లో భాగం అని చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు బండరాళ్లలో రెండు రాళ్లు పక్కపక్కనే ఉండడాన్ని గుర్తించి ఈ రాళ్లకు ‘పత్తర్కే దిల్’ అని నామకరణం చేశారు. రాళ్లన్నీ ఒకేచోట ఉండడంతో ఏక్తా మే తాకత్ హై (యునైటెడ్ వి స్టాండ్) అని నామకరణం చేశారు. అలాగే మరోచోట ఉన్న రాళ్లకు కూడా అనేక్ తా మే ఏక్తా (యూనిటీ ఇన్ డైవర్సిటీ) అని కూడా పిలుస్తున్నారు. రాక్స్ పేరిట వీకెండ్స్ వాక్ ∙విభిన్న రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలకు చెందిన వారితో మినీ భారత్‌గా మారిన హెచ్‌సీయూలో విద్యార్థులలో ఐక్యత బలపడేలా చేసేందుకు హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్ పేరిట వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు ద్వారా వీకెండ్స్‌లో వాక్‌లను నిర్వహిస్తున్నారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో మష్రూమ్ రాక్, వైట్ రాక్, టెంపుల్ రాక్, వర్జిన్ రాక్, వైట్ రాక్స్, హైరాక్స్, సాసర్ రాక్, కోన్ రాక్ కాంప్లెక్స్ ఇలా రకరకాల పేర్లతో ఈ బండరాళ్లను విద్యార్థులు పిలుస్తుంటారు. హెచ్‌సీయూ, మనూ యూనివర్సిటీల్లో హెరిటేజ్ రాక్స్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ‘ఏక్తా మే తాకత్ హై’పేరుతో పిలిచే రాళ్లు ‘పత్తర్ కే దిల్.. ఏక్ తా మే తాకత్ హై.. అనేక్ తా మే ఏక్తా.. ‘మష్రూమ్ రాక్,.. వైట్ రాక్స్.. టెంపుల్ రాక్’లు హెరిటేజ్ రాక్స్గా గుర్తింపు పొందాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన భారీ బండరాళ్లకు పెట్టిన పేర్లు ఇవి. నగరంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న రాతి సంపద హెచ్‌సీయూ, మనూ ఉర్దూ యూనివర్సిటీల్లో ఉండడం విశేషం. నగరంలో గుర్తించిన హెరిటేజ్ రాళ్లలో హెచ్‌సీయూ ‘మష్రూమ్రాక్’ ఉంది. వీటికి శతాబ్దాల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. వీటి గురించి భావితరాలకు తెలిసేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌సీయూలో 2,300 ఎకరాలు, ‘మనూ’లో 200 ఎకరాలు కలిపి 2,500 ఎకరాలలో విభిన్న తరహాలో ఏర్పడిన భారీ బండరాళ్ల (రాక్స్)ను రక్షిస్తూ వస్తున్నారు. – రాయదుర్గం -
లడఖ్ కళలను పరిరక్షిస్తున్న నూర్ జహాన్
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వేసవికాలం... నూర్జాహాన్‌కు మరపురాని రోజులవి. ఆమె కాలేజీలో చదువుతున్న ఢిల్లీ నుండి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. లేహ్ పాత పట్టణం ఆవరణలో కొంతమంది విదేశీయులు తారసపడ్డారు. వారు సమీపంలోని బౌద్ధ దేవాలయంలో పరిరక్షణ పనిని నిర్వహిస్తున్న బృందంలో ఉన్నారు. వారితో మాట్లాడిన కొన్ని మాటలు నూర్జాహాన్ జీవిత గమనాన్ని మార్చేశాయి. నూర్జాహాన్ కళా పరిరక్షణ రంగం గురించి చదవడం ప్రారంభించింది. 2017లో లేహ్‌లో తన కజిన్ వజీదా తబస్సుమన్తో కలిసి ‘షెస్రిగ్ లడఖ్’ అనే తన స్టూడియోను ప్రారంభించి, లడఖ్‌లోని మొదటి తరం ఆర్ట్ కన్జర్వేటర్లలో భాగమైంది.‘ఈ రంగంలోకి అనుకోకుండా ప్రవేశించాను. కళ లేదా వారసత్వానికి సంబంధించిన స్పృహ జీవితంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఒకసారి అనుకున్నది తారసపడితే గతంలోని చాలా చుక్కలను కనెక్ట్ చేయగలను’ అని భారత జాతీయ ఐస్ హాకీ జట్టుకు గోల్ కీపర్‌గానూ చేసిన 34 ఏళ్ల నూర్ చెబుతారు.లోతైన పరిశోధన‘‘లడఖ్‌లో కళల పరిరక్షణను ఎప్పుడూ వృత్తిగా పరిగణించలేదు. స్థానికుల కోసం కాదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టుల కోసం వచ్చి వెళ్లి΄ోవడం చూస్తుంటాం. అందుకే దీన్నే ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాం. సుమారు రెండు దశాబ్దాల క్రితం లడఖ్‌లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టర్‌గా జీవనోపాధి పొందడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండేది. నేను స్కూల్లో చేరగానే యువత దృష్టి డాక్టర్లు, ఇంజనీర్లుగా మారడం వైపు మళ్లింది. కళల పరిరక్షణ, పునరుద్ధరణ ఎప్పుడూ జీవనోపాధికి సంబంధించిన సాధనంగా పరిగణించబడలేదు. దీంతో ఈ రంగంలో ఎక్కువగా బయటి వ్యక్తులే ఉన్నారు.సవాల్‌గా నిలిచే రంగంలేహ్ సమీపంలోని సుమ్దా చు¯Œ లోని 13వ శతాబ్దానికి చెందిన గేట్‌వే స్థూపంపై నెల రోజుల΄ాటు పని చేయడం అంటే, అక్కడి స్థానికులతో కలిసి జీవించడం. గోల్డెన్ టెంపుల్ లోపల పెయింటింగ్స్‌పై పని చేయడంలో నిచ్చెనపై గంటల తరబడి గడిపేవాళ్లం. డిస్కిట్ సమీపంలోని సన్యాసిని ఆలయాన్ని పునరుద్ధరించడానికి, ఒక లోయలో వారాలు గడపడానికి ముగ్గురు మహిళల బృందం అవసరం అయ్యింది. విరిగిన జనరేటర్, వన్య్రప్రాణుల నుండి ఆహార నిల్వలను కాపాడుకోవడం ప్రతిదీ ఓ సవాల్‌గా ఉండేది. నా జీవితమంతా పట్టణ వాతావరణంలో జీవించాను కాబట్టి ఈ వాతావరణంలో పని చేస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ డిసెర్టేషన్పై పనిచేస్తున్నప్పుడు సొంత ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్నాను పాత పట్టణం లేహ్‌లో మా పూర్వీకుల శిథిలమైన ఇంటిని స్టూడియోగా మార్చాను. తంగ్కా పెయింటింగ్‌లు, పాత పెయింటెడ్ ఫర్నిచర్, చెక్క కళాఖండాలు, పాత గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, మెటీరియల్‌లను, ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో విషయావగాహనకు, పరిధిని విస్తరించడానికి ఇటువంటి సౌకర్యం చాలా ముఖ్యమైనది. షెస్రిగ్ లడఖ్‌ను స్థాపించిన ఐదేళ్ల వరకు ఇంటిని పునరుద్ధరించడం, స్టూడియో పనిని పూర్తి చేయగలిగాం. సంరక్షణ దిశగా పనులుమా బృందంలో నలుగురు ఆడ, ఒక మగ. ఐదుగురం కలిసి లడఖ్ చుట్టుపక్కల ఉన్న స్థానిక కమ్యూనిటీలు, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారిని సంప్రదించాం. నిధులు నిరంతరం సమస్య. ప్రతి ్ర΄ాజెక్ట్కు కొత్త సవాళ్లు ఉండేవి. ఉదాహరణకు,19వ శతాబ్దం మధ్యలో డోగ్రా దండయాత్ర సమయంలో, వారి సైన్యం ముల్బెఖ్ ఆలయంలో స్థావరాన్ని ఏర్పాటు చేసి దానిలో వంట చేసింది. కాబట్టి, సాధారణ పునరుద్ధరణ పనులతో పాటు, పెయింటింగ్స్‌పై మిగిలి΄ోయిన ధూళిని కూడా మేం శుభ్రం చేయాల్సి వచ్చింది. సంవత్సరాలుగా, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. గత దశాబ్దంలో లడఖ్‌లో అధిక వర్షపాతం వల్ల సంప్రదాయ మట్టి నిర్మాణాలకు ముప్పు కలిగింది. నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా వారసత్వ ప్రదేశాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. పాత ఆలయాన్ని సంరక్షించడం కంటే కొత్త ఆలయానికి నిధులు సేకరించడం సులభమని గ్రహించిన సందర్భాలూ ఉన్నాయి.కొంతమంది మా పనిని అర్థం చేసుకుంటారు. కానీ పని పూర్తయ్యాక విషయాలు కొత్తగా కనిపిస్తాయని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. పరిరక్షణ, పునరుద్ధరణ అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి, మేం ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసినప్పుడల్లా, ఆ కమ్యూనిటీని, ముఖ్యంగా పిల్లలను వచ్చి మమ్మల్ని చూడమని ఆహ్వానిస్తాం. వారసత్వంపై అవగాహన, ప్రజలు దానిని ఎలా గ్రహిస్తారు అనేది రాబోయే కాలంలో ఈ సమాచారం అత్యంత కీలకం అవుతుంది’ అని వివరిస్తారు నూర్. -
ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా?
మణిపూర్‌లోని ఆండ్రో గ్రామం. ఈ యేడాది ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. అంతటి ప్రత్యేకత ఆ గ్రామానికి ఏముందో తప్పక తెలుసుకోవాల్సిందే! మణిపూర్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామాలపోటీని నిర్వహించింది. దీనిలో ఆండ్రో విలేజ్‌కు వారసత్వ విభాగంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ టూరిజం అధికారులు ఆండ్రో విలేజ్ ప్రతినిధులకు మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేసింది. ఆండ్రో గ్రామం ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ పద్ధతులు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడానికి ప్రధాన కారకంగా నిలిచాయి. ఎన్నో వారసత్వ ప్రత్యేకతలు : అండ్రో గ్రామంలో గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా స్థానిక జానపద కథలను కళ్లకు కట్టే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో శతాబ్దాల నాటి నుంచి వారసత్వంగా అగ్ని ఆరాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. వేల ఏళ్లుగా అఖండదీపం ఆరకుండా వెలుగుతూనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోందిది. ఇక్కడ ప్రకృతి అందాలతోపాటు మటువా బహదూర్ మ్యూజియం, వివిధ గిరిజన∙తెగలకు సంబంధించిన కుటీరాలు, కుండల తయారీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. ఆండ్రో గ్రామస్తులు తమ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ, నిలబెట్టు కోవడంలో స్థానికులను నిమగ్నం చేయడానికి అనేక వ్యూహాలను అను సరిస్తున్నారు. అదే సమయంలో వారిని పర్యాటక కార్యకలాపాలో కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ విశేషాలతోనే ఈ గ్రామం ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా మొదటి ప్లేస్‌లో నిలిచింది. -
ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే అద్భుతాలు మనవే!
ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు గుర్తింపునిచ్చే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో అత్యధికంగా భారతీయ సందర్శనీయ స్థలాలే ఉన్నాయి. దీనికి కారణం ప్రపంచంలో అతి ఎక్కువ మంది సందర్శిస్తున్న దర్శనీయ స్థలాలలో ఈ ప్రాచీన వారసత్వ సంపద ప్రముఖంగా నిలిచాయి.ఖజరహో శిల్పాలుదేశంలోనేకాదు ప్రపంచంలోనే ఎన్ని చారిత్రక కట్టడాలు ఉన్నా ఖజరహో శిల్పకళకు మరేదీ సాటిరాదని మరోసారి రుజువైంది. మధ్య ప్రదేశ్ ఛత్తర్పూర్ జిల్లాలో కొలువై ఉన్న ఖజరహోను ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే కళా వైభవం గల స్థలంగా పేరొందింది. శిల్ప సోయగాలతో ఆకట్టుకునే ఖజరహో గ్రూప్ ఆప్ మాన్యుమెంట్స్ గురించి కళ్లారా చూడాల్సిందే తప్ప ఒక్క మాటలో వివరించలేం. అలాంటి ఖజరహో శిల్పాలతో పాటు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్, సాంచీ అండ్ రాక్స్ షెల్టర్స్ ఆఫ్ భీమ్బెట్కా కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఎల్లోరా గుహలుమహారాష్ట్రాలోని ఎల్లోరా, అజంతా, ఎలిఫెంటా గుహలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌తో పాటు విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో కూడా ఈ జాబితాలో ఉన్నాయి.నేషనల్పార్క్పింక్ సిటీగా పేరొందిన జైపూర్ సిటీ, రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్, కొలడియో నేషనల్పార్క్. జంతర్ మంతర్‌ను ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించిన స్థలాలుగా పేరొందాయి. వెన్నెల దీపంయునెస్కో హెరిటేజ్ సైట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శించిన జాబితాలో నాల్గవ స్థానంలో తాజమహల్. దీంతో పాటు ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ ఉన్నాయి.రాణీకి వావ్గుజరాత్లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో రాణీ కి వావ్, ది హిస్టోరిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ చంపనీర్–పవగడ్, ఆర్కియలాజికల్ పార్క్ లు ఉన్నాయి. -
హెరిటేజ్ లాభాల కోసమా!
సాక్షి, అమరావతి: తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీపై చెలరేగిన వివాదంపై తృణమోల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందించారు. ఇది నిజమా.. లేక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణా.. అని ‘ఎక్స్’లో అనుమానం వ్యక్తం చేశారు. ‘తిరుపతి లడ్డూల కథ వాస్తవమా లేక చంద్రబాబు హెరిటేజ్ సంస్థ లాభాలను పెంచుకోవడానికి, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ సహాయంతో అల్లిన కట్టుకథా? జంతువుల కొవ్వు, పంది కొవ్వుతో తిరుపతి ప్రసాద లడ్డూలు చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ల్యాబ్ రిపోర్టు చూపించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆయన పార్టీ పేర్కొంది.ఇందులో ఆసక్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు, అతని భార్య నెయ్యి తయారు చేసే హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నడుపుతున్నారు. లోక్‌సభ ఫలితాలప్పుడు బీజేపీ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోణలున్నాయి. అదే సమయంలో చంద్రబాబుకు చెందిన కంపెనీ షేర్లు గాలివాటంగా అమాంతం పెరిగిపోయి ఆయన కుటుంబానికి రూ.1,200 కోట్లు లాభాలు తెచి్చపెట్టాయి.ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఆరోపణలు రావడం.. గుజరాత్ నుంచి వచ్చిన ‘ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్’ ఆధారంగా నెయ్యి, పాల సామ్రాజ్యాన్ని నియంత్రించే ఓ కుటుంబం ఆరోపణలు చేయడం యాదృచి్చకం’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చంద్రబాబును ట్యాగ్ చేయడంతో పాటు హెరిటేజ్ సంస్థ ఉత్పత్తుల చిత్రాలను సైతం జత చేశారు. పోస్ట్ ప్రారంభంలో ‘ఇంపార్టెంట్’ అని మొదలుపెట్టారు. -
తిరుపతి లడ్డూ ఆరోపణలతో హెరిటేజ్ లింకులు!?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని నీచపు రాజకీయానికి.. అది ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తెర తీశారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మరోవైపు హిందూ సంఘాలు.. ఇంకోవైపు నలభై ఏళ్ల బాబు రాజకీయం గురించి తెలిసిన నేతలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జాతీయ పార్టీ టీఎంసీ సైతం చంద్రబాబు తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.టీఎంసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే ఎక్స్ వేదికగా చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలకు దిగారు. అందుకు ల్యాబ్ రిపోర్టులను సాక్ష్యంగా చూపిస్తున్నారు. లడ్డూల కోసం ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆయన పార్టీ ఆరోపిస్తోంది. అయితే..చంద్రబాబు, ఆయన సతీమణి పేరిట హెరిటేజ్ పుడ్స్ అనే డెయిరీ సామ్రాజ్యం ఉందని, అది నెయ్యి కూడా ఉత్పత్తి చేస్తోందని అన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఇదే హెరిటేజ్ సంస్థ షేర్లు 1,200 కోట్ల రూపాయలకు పైగా లాభాల్లోకి వెళ్లాయని సాకేత్ గుర్తు చేశారు. అప్పట్లో బీజేపీ, స్టాక్ మార్కెట్‌ను మానిప్యులేట్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఆరోపించారు.𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:𝐈𝐬 𝐭𝐡𝐞 𝐓𝐢𝐫𝐮𝐩𝐚𝐭𝐢 𝐥𝐚𝐝𝐝𝐨𝐨𝐬 𝐬𝐭𝐨𝐫𝐲 𝐫𝐞𝐚𝐥 𝐨𝐫 𝐢𝐬 𝐢𝐭 𝐚 𝐟𝐚𝐤𝐞 𝐜𝐨𝐧𝐭𝐫𝐨𝐯𝐞𝐫𝐬𝐲 𝐜𝐫𝐞𝐚𝐭𝐞𝐝 𝐰𝐢𝐭𝐡 𝐁𝐉𝐏’𝐬 𝐡𝐞𝐥𝐩 𝐟𝐨𝐫 𝐛𝐨𝐨𝐬𝐭𝐢𝐧𝐠 𝐩𝐫𝐨𝐟𝐢𝐭𝐬 & 𝐩𝐥𝐚𝐲𝐢𝐧𝐠 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐬? Andhra Pradesh CM @ncbn… pic.twitter.com/Em5JxD4H1s— Saket Gokhale MP (@SaketGokhale) September 21, 2024 ఎవరి కుటుంబమైతే నెయ్యి- పాల ఉత్పత్తి రంగాన్ని శాసిస్తోందో.. అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు తిరుమల లడ్డూల విషయంలో కూడా గుజరాత్‌కు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆరోపణలు చేశారని సాకేత్ గోఖలే ప్రస్తావించారు.మొత్తంగా.. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు.. తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని, దీనికోసం బీజేపీ సహకారాన్ని సైతం తీసుకున్నారని సాకేత్ గోఖలే ఆరోపించారు.ఇదీ చదవండి: దేవుడే ఇక చంద్రబాబుకి బుద్ధి చెప్తాడు! -
Hyderabad: ‘హరేకృష్ణ’ టెంపుల్.. 430 అడుగులు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడానికి ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్’ పేరుతో 430 అడుగుల ఎత్తులో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించనున్నారు. నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. శ్రీరాధా, కృష్ణుల అద్భుతమైన విగ్రహాలతో పాటు సీతారామచంద్రులు, గౌర నితాయి విగ్రహాలను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించనున్నారు.శ్రీనివాస గోవిందుడి కోసం పూర్తిగా రాతి నుంచి దేవాలయాన్ని చెక్కనున్నారు. ఈ ప్రాజెక్టులో కాకతీయులు, చాళుక్యులు, ద్రవిడ సంస్కృతి, విభిన్నమైన పురాతన కాలం నాటి దేవాలయ కట్టడాల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ గోసేవ మండల్ ఈ ప్రాజెక్టుకు భూసేవక్లుగా వ్యవహరించనున్నారు. ఈ క్యాంపస్‌లో లైబ్రరీ, మ్యూజియం, థియేటర్, పిల్లలు, యువతకు ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలపై బోధనలు చేసేందుకు భగవద్గీత హాల్స్ నిర్మించనున్నారు. ఇక, ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి అనంత శేష స్థాపన కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే హరేకృష్ణ మూమెంట్ చైర్మన్ శ్రీమధు పండిట్ దాస ప్రభుజీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీసత్య గౌర చంద్ర దాస ప్రభు జీ తదితరులు పాల్గొననున్నారు. -
వైద్య వారసత్వం పునరుద్దరణకు కృషి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, హైదరాబాద్ నిర్వహిస్తున్న మాన్యుస్క్రిప్ట్లజీపై రెండురోజుల శిక్షణ కార్యక్రమం 20 జూలై 2024న ముగిసింది. భారతదేశంలోని వివిధ స్క్రిప్ట్‌ల గురించి విజ్ఞానాన్ని అందించడం ద్వారా పండితులకు వైద్య వ్రాత ప్రతులను సులభంగా అనువదించడం దీని లక్ష్యం. మాన్యుస్క్రిప్ట్లజీ లో నిపుణులు మాన్యుస్క్రిప్టులజీ యొక్క వివిధ అంశాలను అనగా వాటిలో ఉన్న వైద్యజ్ఞానాన్ని తెలుసుకోవడం పురాతన లిపి అందులోని అర్థాన్ని తెలుకోవడం మొదలగు వాటి గురించి తెలియజేసారు.వీరిని హైదరాబాద్‌లోని ఎన్ఐఐఎంహెచ్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి పి ప్రసాద్ సత్కరించారు. దాదాపు 100 మంది మేధావులు ఇన్స్టిట్యూట్లో జరిగిన మేధోమథన సెషన్లకు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా హాజరయ్యారు. వారు గ్రంథ, వట్టెఝుత్తు, కన్నడ, నగరి మరియు తెలుగు వంటి ప్రాచీన భారతీయ లిపిల గురించి తెలుసుకున్నారు. ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ సినిరుద్ధ దాష్, మాజీ ప్రొఫెసర్ మరియు హెడ్, మద్రాస్ విశ్వవిద్యాలయం, సంస్కృత శాఖ, డాక్టర్ కీర్తికాంత్ శర్మ, మాజీ రీసెర్చ్ ఆఫీసర్, I.G.N.C.A., శ్రీ షాజీ, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ మాజీ మాన్యుస్క్రిప్ట్ అసిస్టెంట్, ప్రొఫెసర్ M. A. అల్వార్, మహారాజా సంస్కృత కళాశాల, మైసూర్, డాక్టర్ ఉత్తమ్ సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం, త్రిపుర, డాక్టర్. V. S. కంచి అసోసియేట్ ప్రొఫెసర్, ముల్జీ జైతా కళాశాల, మహారాష్ట్ర, Mr. N.R.S. నరసింహ, సీనియర్ అసిస్టెంట్, TTD మ్యూజియం, తిరుపతి, ప్రొఫెసర్ డా. రంగనాయకులు, మాజీ డైరెక్టర్ – చరిత్రకారుడు, TTD మ్యూజియం, ఆంధ్రప్రదేశ్, మాన్యుస్క్రిప్ట్లజీపై లోతైన అవగాహన కల్పించారు. డాక్టర్ వి.కె. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుండి డా.లావనియా,RO (Ayu.), డాక్టర్ రాకేష్ నారాయణన్,RO (Ayu.) మరియు డాక్టర్ ముఖేష్ చించోలికర్, RO (Ayu.) మరియు NIIMH అధికారులు డాక్టర్ V. శ్రీదేవి, RO ( ఆయు.), డాక్టర్ అష్ఫాక్ అహ్మద్, RO (యునాని), డాక్టర్ ఖీ .సాకేత్ రామ్, RO (Ayu.), ఈట సంతోష్ మానె, RO (Ayu.) ఈట. బిస్వో రంజన్ దాస్, RO (Hom.) Dr. Chris Antony, RO (Ayu.) వైద్య మాన్యుస్క్రిప్ట్‌లపై పరిశోధనలు చేపట్టడం కోసం పాల్గొనే వారితో వారి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. -
సీఐడీ కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం
సిట్ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించిన పత్రాలన్నీ న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఆ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. – సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీ కొల్లి రఘురామరెడ్డి సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, కుంభకోణాలపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేసిన కేసుల్లో దోషులకు శిక్ష ఖాయమని తేలడంతో ఎల్లో గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. దాంతో సిట్‌పై దుష్ప్రచారం చేసేందుకు యత్నించి బోర్లా పడింది. చంద్రబాబు కేసుల పత్రాలను సిట్ కార్యాలయం ప్రాంగణంలో కాల్చివేస్తున్నారంటూ ఎల్లో చానళ్లు సోమవారం హడావుడి చేశాయి. ఈ ఎన్నికల తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని భావించే సిట్ అధికారులు ఇలా పత్రాలను కాల్చివేస్తున్నారంటూ వక్రీకరించిన కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. కానీ తాము దర్యాప్తు చేస్తున్న అయిదు కేసుల్లో పూర్తి ఆధారాలతో న్యాయస్థానాల్లో చార్జ్షీట్లు దాఖలు చేశామని, అంతకు ముందే కీలక కేస్ డైరీలు, ఆధారాలుగా ఉన్నఒరిజినల్ పత్రాలను కూడా న్యాయస్థానాలకు సమర్పించామని సిట్ స్పష్టం చేసింది. ఆ సందర్భంగా తీసిన లక్షలాది ఫొటోస్టాట్ కాపీల్లో సరిగా రాని వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశామని వెల్లడించడంతో ఎల్లో మీడియా నోళ్లు మూతపడ్డాయి. అసలు కేసులకు సంబంధించిన పత్రాలను రహస్యంగా కాల్చివేసే ఉద్దేశమే ఉంటే ఎక్కడో రహస్యంగా చేస్తారు. అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సిట్ కార్యాలయ ప్రాంగణంలో.. అదీ పట్టపగలు అందరూ చూస్తుండగా ఎందుకు చేస్తారు? ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోయిన ఎల్లో మీడియా బోల్తా పడింది. అదిగో తోక.. ఇదిగో పులి తాడేపల్లిలోని సిట్ కార్యాలయం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణం సమీపంలో కొన్ని చిత్తుకాగితాలను సిబ్బంది సోమవారం ఉదయం కాల్చివేశారు. అది చూసి టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే ఎల్లో మీడియా చానళ్లు హడావుడి మొదలుపెట్టాయి. చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల కీలక పత్రాలను సిట్ అధికారులు రహస్యంగా దహనం చేసేస్తున్నారని, వాటిలో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలు ఉన్నాయంటూ ప్రచారం ప్రారంభించాయి. అనుమతి లేకుండా సిట్ అధికారులు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్, నారా భువనేశ్వరిల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలు వీటిలో ఉన్నాయని ఊదరగొట్టాయి. చంద్రబాబుపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, లోకేశ్‌ను అక్రమంగా విచారించారని, అందుకే ఆ కేసుల కాపీలను దహనం చేసేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాయి. అంతే కాదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బండారం బయటపడుతుందనే ఆందోళనతోనే సిట్ అధికారులు ఇలా పత్రాలను రహస్యంగా దహనం చేసేస్తున్నారని కూడా ఇష్టానుసారం వక్రీకరణలతో కూడిన కథనాలను ప్రసారం చేశాయి. ఎన్నికల వేళ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడ్డాయి. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన సిట్ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని సిట్ ఓ ప్రకటనలో సమర్థంగా తిప్పికొట్టింది. ‘సిట్ కార్యాలయం సమీపంలో దహనం చేసినవి చిత్తు ప్రతులే. మేము దర్యాప్తు చేస్తున్న 5 కేసుల్లో పూర్తి ఆధారాలతో ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషిట్లు దాఖలు చేశాం. ఈ కేసుల కేస్ డైరీలు, ఇతర కీలక ఆధారాలను న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు సమర్పించాం. ఆధారాల్లో వేటినీ ధ్వంసం చేయలేదు. ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయి. పూర్తి ఆధారాలతో నమోదు చేసిన ఈ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. ప్రతి కేసులో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. ఒక్కో కేసులో ఒక్కో నిందితునికి సంబంధించి దాదాపు 10 వేల పేజీలను ఫొటోస్టాట్ కాపీలు తీయాల్సి వచ్చింది. లక్షలాది పేజీలు కాపీలు తీసే క్రమంలో మెషిన్లు వేడెక్కడం కాగితాలు వాటిలో ఇరుక్కుపోవడం, ఇంకు తగ్గిపోవడం వంటి కారణాలతో చాలా కాపీలు ఫేడ్ అవుట్ అయ్యాయి. వీటిని పక్కనపెట్టేసి కొత్తగా మళ్లీ కాపీలు తీయాల్సి వచ్చింది. ఫేడ్ అవుట్ అయిన వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. ఇది అన్ని దర్యాప్తు సంస్థల్లో, సాధారణ ఆఫీసుల్లో కూడా పాటించే ప్రక్రియే’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఐటీ రిటర్న్‌లు తీసుకున్నాం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను అక్రమంగా తీసుకున్నారని, అందుకే వాటిని దహనం చేశారన్న ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కూడా సిట్ తిప్పికొట్టింది. తాము నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఫుడ్స్, ఇతర నిందితుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను తీసుకున్నామని తెలిపింది. ఆదాయ పన్ను శాఖకు అధికారికంగా లిఖిత పూర్వకంగా కోరి వారి నుంచి ఆ కాపీలను తీసుకున్నామని చెప్పింది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నుంచి కూడా అధికారికంగానే లేఖ రాసి మరీ చాలా పత్రాలను తీసుకున్నామంది. ఆ ఐటీ రిటర్న్‌లు, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తీసుకున్న పత్రాల ఆధారంగానే ఈ కేసులో లోకేశ్, ఇతర నిందితులను విచారించామని సిట్ తెలిపింది. ఆ దర్యాప్తు నివేదికను కూడా న్యాయస్థానానికి సమర్పించామని చెప్పింది. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడాన్ని సిట్ తీవ్రంగా ఖండించింది. ఆ మీడియా చానళ్లు దుష్ప్రచారాన్ని మాని వాస్తవాలను తెలుసుకోవాలని హితవు చెప్పింది. ‘హెరిటేజ్’కు దీటైన జవాబు ఇచ్చిన సిట్ చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించిన తమ కంపెనీ పత్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ రాసిన లేఖకు సీఐడీ దీటైన సమాధానం ఇచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అవన్నీ న్యాయస్థానానికి తాము ఎప్పుడో సమర్పించామని, అన్ని పత్రాలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈమేరకు సిట్ అధికారులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత బారిక్‌కు సోమవారం ఓ లేఖ రాళారు. తాము హెరిటేజ్ ఫుడ్స్‌కు అధికారికంగా లేఖ ద్వారా కోరి 2022 సెప్టెంబర్ 12 నుంచి 2023 అక్టోబరు 4 వరకు ఏడుసార్లు పొందిన ఆ కంపెనీ పత్రాల వివరాలను వెల్లడించారు. ఆ ఒరిజినల్ పత్రాలను న్యాయస్థానానికి సమర్పించిన వివరాలను సీఎఫ్ఆర్ నంబర్లతో సహా తెలిపారు. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తాము జారీ చేసిన ప్రెస్ నోట్‌ను కూడా ఈ లేఖకు జతపరిచారు. ఆ వర్గం మీడియా రాజకీయ దురుద్దేశాలతో సిట్‌పై చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు కాపీని కూడా హెరిటేజ్ ఫుడ్స్‌కు అందించారు. -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్ అయింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సీఐడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఛానళ్లలో బాధ్యత రహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం. ప్రతి ఛార్జ్ షీట్‌కు 8 వేల నుండి 10 వేల కాపీలతో రూపొందించాం. ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం’ అని సీఐడీ ప్రకటనతో పేర్కొంది. -
నిజమైన ఎర్రచందనం స్మగర్లు టీడీపీ వాళ్లే
-
హెరిటేజ్ కోసం పాడి పరిశ్రమను - రైతులను నట్టేట ముంచారు
-
రాజస్థాన్‌లో మొదటి వారసత్వ రైలు ప్రారంభం
జైపూర్: రాజస్థాన్‌లో మొదటి హెరిటేజ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్ వరకు ప్రయాణించనుంది. ప్రముఖ చారిత్రక ప్రదేశాలను కలుపుతూ పర్యటన సాగుతుంది. అందమైన లోయల గుండా సాగే ఈ ప్రయాణం భారత రైల్వే చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబిస్తుంది. రైలు ప్రత్యేకతలు.. ఈ హెరిటేజ్ రైలులో 60 మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారు. పర్యటక ప్రదేశాలను చూడటానికి ట్రైన్లో పెద్ద ద్వారాలు ఏర్పాటు చేశారు. గోరమ్ ఘాట్(రాజస్థాన్ మినీ కశ్మీర్), భిల్ బేరీ వాటర్‌ఫాల్ వంటి ప్రదేశాలను కలుపుతూ రైలు ప్రయాణం సాగుతుంది. రైలు రూపకల్పన 150 ఏళ్ల నాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబిస్తుంది. రైలు వేళలు.. మార్వార్ జంక్షన్ వద్ద ఉదయం 8:30కు ప్రారంభమైన ఈ రైలు కామ్లిఘాట్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుతుంది. వారానికి నాలుగు సార్లు ఈ రైలు ప్రయాణం ఉంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ హెరిటేజ్ రైలు.. సాయంత్రం 5:30కి మార్వార్ చేరుతుంది. హెరిటేజ్ రైలు ప్రయాణానికి ఒక్కొ టికెట్‌కు రూ.2000 వసూలు చేయనున్నారు. హెరిటేజ్ రైలు ప్రారంభం సందర్భంగా బీజేపీ ఎంపీ దివ్యా కుమారి తన మొదటి ప్రయాణం అద్భుతంగా ఉందని వెల్లడించారు. UNESCO భారత్‌లో నాలుగు రైల్వే లైన్లకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (1999), నీలగిరి మౌంటైన్ రైల్వే (2005), కల్కా సిమ్లా రైల్వే (2008), ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై (2004)లు అందులో ఉన్నాయి. మథెరన్ లైట్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో -
Babu Case : లోకేషా.. ఈ ప్రశ్నలకు జవాబేదీ?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రకటనలేంటీ? వాటి అంతరార్థమేంటీ? లోకేష్ : తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిది. సిద్ధమవడానికి సమయం పడుతుంది. సందేహాలు : పార్టీని ఏనుగులా పోల్చడమేంటీ? అసలు ఏనుగు అనడంలో లోకేష్ ఉద్దేశ్యమేంటీ? ఎవరూ కదలలేకపోతున్నారనా? లేక పార్టీ బలంగా ఉందని చెప్పడమా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏనుగే అనుకుంటే, సిద్ధమవడానికి సమయం పడుతుందనుకొందాం. కానీ తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది కాదు కదా. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న ఒక పార్టీలో చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి అవినీతి పాలయి జైల్లోకి వెళ్లాడు. ఒక్క అరెస్ట్‌తోనే పార్టీ తలకిందులయిందన్నది లోకేష్ ఉద్దేశ్యమా? లేక పార్టీ నిద్రాణంగా ఉందన్న భావనలో ఉన్నారా? లోకేష్ : చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో, ఆ వ్యవస్తను మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సందేహాలు : లోకేష్ రాజకీయాల్లోకి 2014 తర్వాత వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటున్న లోకేష్ ముందెక్కడ పోటీ చేయలేదు. అప్పటికే పార్టీ అధికారంలో ఉంది. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ నేరుగా ఎమ్మెల్సీ అయ్యాడు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. పార్టీ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి జాతీయ కార్యదర్శి పదవి తీసుకున్నాడు. అధికారం తమదే కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. అంతే తప్ప.. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సాధించుకోలేదు. తెలుగు రాజకీయాలను భ్రష్టు పట్టించి ఓటుకు కోట్లు కెమెరాల సాక్షిగా ఇస్తూ అడ్డంగా దొరికి, లంచం ఇవ్వడం తప్పు కాదని వాదించే మీలాంటి నాయకులు ఉండడం వల్లే రాజకీయాల్లోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే.., లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేసమయంలో లోకేష్ గానీ, లోకేష్ తండ్రి చంద్రబాబు గానీ జైల్లో లేరు. నిజానికి ఆ సమయంలో చేయని తప్పుకు కేసులు పెట్టి జైలుకు పంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. కాంగ్రెస్ కక్ష కడితే, దానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం వంత పాడి కేసుల్లో ఇంప్లీడ్ అయి తప్పుడు అభియోగాలు బనాయించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించారు. ఈ కేసులు తప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. 2014లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు కట్టబెట్టారు. అంటే లోకేష్ చెప్పే అరెస్ట్ ఇదేనా.? తాము అక్రమంగా అరెస్ట్ చేసి పంపామన్న అపరాధన భావనలో ఉన్నాడా? లోకేష్ : మేం ఎనిమిదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకు హైదరాబాద్/సైబరాబాద్‌లో ఎకరం జాగా లేదు. అసలు నిజాలు : లోకేష్, చంద్రబాబు ఆస్తుల వెల్లడి అన్న కార్యక్రమం ఎంత కామెడీనో తెలుగు ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో కట్టిన రాజసౌధం విలువ లక్షల్లోచూపిస్తావు. ఏంటంటే.. కొన్నప్పుడు అంతే ఉందంటావు. ఇక అసలు మాకు ఒక్క గజం భూమి ఉన్నా.. ఇచ్చేస్తానంటావు. మరి మదీనాగూడలో 14 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్ సంగతేంటీ? అంత ఖరీదైన లోకేషన్లో అంత భూమి ఎలా వచ్చింది? ఖరీదైన స్థలాలన్నీ మీ నానమ్మ నీ ఒక్కరికే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది? ఇందులో క్విడ్ ప్రో కోల గురించి ఎప్పుడైనా వివరణలిస్తావా? దీని గురించి వేసిన కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు, మీ కొడుకు దేవాన్ష్ కు ఇచ్చిన బహుమతులు అమ్మణ్ణమ్మ, బాలకృష్ణ ఐటీ రిటర్నులు, ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు లేవు? లోకేష్ : మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా సంస్థ హెరిటేజ్ నిదానంగా ఎదిగింది. లేదంటే సంస్థ విలువ ఇప్పటికీ మూడు రెట్లు పెరిగేది. అసలు నిజాలు : హెరిటేజ్ విలువ ఎంత? ఆ సంస్థ అంచలంచెలుగా ఎలా ఎదిగింది అన్నది చిత్తూరు నుంచి విజయనగరం వరకు ఎవరిని అడిగినా చెబుతారు. పదవిని అడ్డు పెట్టుకుని హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని దివాళా తీయించినప్పుడే వ్యవస్థలను ముంచే మీ ప్రతిభ అర్థం చేసుకోవాలి. అయినా హెరిటేజ్ అసలు లెక్కలు ఎప్పుడయినా బయటపెట్టారా? ఇందులో మీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరయినా కీలక స్థానాల్లో ఉన్నారా? ఈ మధ్యే మీ అమ్మ భువనేశ్వరీ ఏం చెప్పారు? మా సంస్థ హెరిటేజ్‌లో 2% షేర్లు అమ్మినా మాకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ సంస్థ విలువ రూ.20వేల కోట్లు. కేవలం పాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, సూపర్ మార్కెట్ల ద్వారా రూ.20వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మానవ మాత్రుడు ఎవరయినా ప్రపంచంలో ఉంటారా? మీరు తప్ప. ఇందులో అక్రమ సంపాదన ఎంత? వ్యవస్థలను ముంచిందెంత? మీ సంస్థ బాగు కోసం ఎవరెవరిని తొక్కేశారు. కొంచెం లెక్కలు వివరంగా చెబితే అందరూ నోళ్లు వెల్లబెట్టి వింటారు. లోకేష్ : రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావడం ఆమె ఇష్టం. మేం మా దారులు ఎంచుకొన్నాం. అసలు నిజమేంటీ : పార్టీ లోడు నువ్వెత్తడం లేదని విషయం స్పష్టమయిన తర్వాతే మీ నాన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గత మూడు వారాలుగా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలోనే బ్రాహ్మణి పేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణి రావాలి, పాదయాత్ర చేయాలి, పార్టీని నడిపించాలని ప్రచారం చేస్తున్నారు. అంటే దానర్థమేంటన్నది మీ స్టాన్ఫోర్డ్ బ్రెయిన్‌కు అర్థం కానంత గొప్పదేం ఉండదు. మీరు తారా స్థాయిలో రాజకీయాలు నడిపితే బ్రాహ్మణి పేరు ముందుకు ఎందుకు వస్తుంది? హెరిటేజ్ సంస్థను విడిచిపెట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలి అని పచ్చమీడియా పిచ్చిగా ప్రచారం చేస్తోందంటే ఇంతకు మించిన అర్థం ఇంకేముంటుంది? (Courtesy : Nidhi) లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్, రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్, ఫైబర్ గ్రిడ్.. ఈ మూడు ప్రాజెక్టులు నా మంత్రిత్వ పరిధిలోనివి కావు, కాబట్టి వాటికి నేను బాధ్యుడిని కాదు సందేహాలేంటీ : మొన్నటి వరకు ఏం వాదించారు.? బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అంటే అర్థమేంటీ? తప్పు జరిగింది కానీ మాది బాధ్యత కాదంటున్నావు. ఇక ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శాఖలకు కూడా నేను మంత్రిగా పని చేయలేదంటున్నావు. అంటే అర్థమేంటీ? కుంభకోణం జరిగింది కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా లేదని అర్థమా? స్కిల్ డెవలప్మెంట్ మీ నాన్న శాఖలోనిది అయితే మీ ప్రమేయం అంతగా ఎందుకుంది? ఫైబర్ గ్రిడ్‌కు మీకు సంబంధం లేకుంటే.. మీవైపే అన్ని ఆధారాలు ఎందుకు చూపిస్తున్నాయి? మీ సంస్థ భూములు రింగ్‌రోడ్డు చుట్టే భూములు కొనాలని మీకు కలలో ఐడియా వచ్చిందా? పైగా మీ బెయిల్ పిటిషన్లో మీ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏం వాదించారు? కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్‌లో తండ్రి చంద్రబాబుతో కలిసి ఉన్నందుకు నాపై కేసు ఎలా పెడతారని కోర్టు ముందు వాదించారు. అంటే మునగాల్సి వస్తే తండ్రిని కూడా వదిలేస్తారా? ఇవేనా మీరు నేర్చుకున్న కుటుంబ విలువలు? అసలు నోటీసులు రాకముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారు? సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన మంతనాలకు ఇన్ని రోజులు పడుతుందా? అయినా న్యాయశాస్త్రంలో మీరేమీ డాక్టరేట్ చేయలేదు కదా.. మీకున్న ప్రతిభకు సాల్వే, లూథ్రా లాంటి సీనియర్ లాయర్లకు ఏం సూచనలు చేస్తారు? రాజమండ్రిలో కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీ హోటళ్లలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేకంటే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండడం మిమ్మల్ని నాయకుడిగా నిలిపేది కదా. పైగా నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది కాబట్టి ఏపీ నుంచి ఢిల్లీ వచ్చానని నిజాయతీగా చెబితే సగటు తెలుగు ప్రజలకు కనీసం సానుభూతి అయినా వచ్చేది కదా. ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్సయ్యారు? -
బాబు బాటలోనే భువనేశ్వరి
సాక్షి, అమరావతి: కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ప్రయాణిస్తున్నారు. సోమవారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి తొలిసారిగా రాజకీయ ప్రసంగం చేస్తూ అబద్ధాలను అలవోకగా వల్లెవేశారు. స్కిల్ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు అమాంతంగా తమ హెరిటేజ్ కంపెనీ విలువను పెంచేశారు. రూ.371 కోట్ల కోసం తాము కక్కుర్తి పడ¯నక్కర్లేదని, హెరిటేజ్‌లో రెండు శాతం వాటా అమ్ముకుంటే తమకు రూ.400 కోట్లు వస్తాయంటూ కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేశారు. రెండు శాతానికి రూ.400 కోట్లు అంటే హెరిటేజ్ కంపెనీ విలువ రూ.20,000 కోట్లుగా ఉండాలి. కానీ సోమవారం స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం హెరిటేజ్ మార్కెట్ క్యాప్ అంటే కంపెనీ మొత్తం విలువ రూ.2,171 కోట్లు మాత్రమే. ఈ ప్రకారం చూస్తే రెండు శాతం వాటా విక్రయిస్తే భువనేశ్వరి చేతికి వచ్చేది కేవలం రూ.43.2 కోట్లు మాత్రమే. మరి రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయంటూ ఎలా చెప్పారంటూ స్టాక్ మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మా కంపెనీలో 2% వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయ్.. జగ్గంపేట/అన్నవరం: మా కంపెనీ(హెరిటేజ్)లో 2 శాతం వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయని.. బినామి కంపెనీ పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోపణల్లో నిజం లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు నిరసగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరుగుతున్న నిరాహర దీక్షల శిబిరాన్ని ఆమె సోమవారం సందర్శించారు. శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సొమ్ము తమకు వద్దని.. తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని, తన భర్త చంద్రబాబు ఏ తప్పు చేయలేదని.. అయినా జైల్లో పెట్టారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఓట్లు పోకుండా కాపాడుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, నారా భువనేశ్వరి రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. చంద్రబాబు వెంటనే జైలు నుంచి విడుదలవ్వాలని పూజలు చేశారు. వేదపండితులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. ఆమె వెంట పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, వరుపుల సత్యప్రభ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులున్నారు. -
హెరిటేజ్ షేరుకు షాక్! రెండు రోజుల్లో 20 శాతం డౌన్
హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారులకు షాక్ తగిలింది. చంద్రబాబు కుటుంబం కంపెనీ ప్రధాన ప్రమోటర్ కావడంతో షేరు కుప్పకూలింది. శనివారం చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత రెండు ట్రేడింగ్ సెషన్లలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర దాదాపు 19 శాతం క్రాష్ అయ్యింది. మంగళవారం ఒక్కరోజే 12.5 శాతం (రూ.32) క్షీణించి రూ.221 వద్ద ముగిసింది. భారీ వాల్యూమ్‌తో (దాదాపు 24 లక్షల షేర్లు చేతులు మారాయి) షేరు పడిపోవడం చూస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం ఉన్నట్లు కనబడుతోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరెస్ట్‌కు ముందు, అంటే శుక్రవారం (సెప్టెంబర్ 8న) ట్రేడింగ్ ముగింపు నాటికి షేరు ధర దాదాపు రూ.272 వద్ద ఉంది. షేరు కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగా ఆవిరవుతోంది. గత రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) ఏకంగా రూ.450 కోట్ల మేర కరిగిపోయింది. మంగళవారం ట్రేడింగ్ ముగింపు నాటికి ఇది రూ.2,073 కోట్లకు దిగొచ్చింది. కాగా, హెరిటేజ్ ఫుడ్స్ షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ.287 కాగా, కనిష్ట స్థాయి రూ.135గా నమోదైంది. కంపెనీలో ప్రమోటర్లకు (చంద్రబాబు కుటుంబం) సుమారు 41.58 శాతం వాటా ఉంది. ‘ఇన్నర్ రింగ్ రోడ్డు’ అక్రమాల్లో హెరిటేజ్.. చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలపై ఏపీ సీఐడీ విచారణ జోరు పెంచడం, వీటిలో బాబు కుటుంబంతో పాటు హెరిటేజ్ కంపెనీకి కూడా ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు బయటపడటంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఒకపక్క, ‘స్కిల్’ స్కామ్‌లో ఇప్పటికే చంద్రబాబు అరెస్టయ్యి రిమాండ్‌లో ఉన్నారు. ఇదే తరుణంలో అమరావతి ‘ఇన్నర్ రింగ్ రోడ్డు‘ ప్రాజెక్టులో సైతం బాబు అండ్ కో అందినకాడికి దోచుకున్నారన్న పక్కా ఆధారాలతో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులోనూ బాబును అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ స్కామ్‌లో హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వెంబడి భూములు కొనుగోలు చేసినట్లు ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో వెలికితీయడం గమనార్హం. వీటన్నింటి ప్రభావంతో రానున్న రోజుల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకులేకుండా చేసే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. దీంతో షేరు మరింత కుప్పకూలే అవకాశం ఉందనేది వారి విశ్లేషణ. -
ఏపీలో కనిపించని టీడీపీ బంద్ ప్రభావం
-
మళ్లీ నేనే!
2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్ అనే కలను సాకారం చేసుకునే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రజలకు ఇది ‘మోదీ కీ గ్యారంటీ’. దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. –ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తానని, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి, మళ్లీ తానే ప్రధానమంత్రి అవుతానని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్’ అనే కలను సాకారం చేసుకొనే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి 90 నిమిషాలపాటు ప్రసంగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. రెండోసారి ప్రధానిగా మోదీకి ఇదే చివరి పంద్రాగస్టు ప్రసంగం కావడం విశేషం. ఎర్రకోటపై ప్రసంగించడం ఇది వరుసగా పదోసారి. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... దుష్ట రాజకీయాలపై యుద్ధమే వారసత్వ పార్టీలను ప్రజలంతా వ్యతిరేకించాలి. బుజ్జగింపు రాజకీయాలు సామాజిక న్యాయానికి చాలా హాని కలిగించాయి. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా మన వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయాయి. దుష్ట రాజకీయాలపై ప్రజలు యుద్ధం ప్రకటించాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఈ ఐదేళ్ల కాలంలో మనం చేసే పనులు మరో 1,000 సంవత్సరాలపాటు ప్రభావం చూపుతాయి. మనకు సమర్థవంతమైన యువ జనాభా ఉంది, గొప్ప ప్రజాస్వామ్యం ఉంది, వైవిధ్యం ఉంది. మన ప్రతి కల నెరవేరడానికి ఈ మూడు అంశాలు(త్రివేణి) చాలు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అవినీతి పార్టీలతో నిండిపోయింది. బుజ్జగింపు రాజకీయాలకు, కుటుంబ పాలనకు పెద్దపీట వేసే పార్టీలు ‘ఇండియా’ పేరిట ఒక్కటయ్యాయి. ఎన్డీయే పాలనలో ‘న్యూ ఇండియా’ ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తోంది. ‘బంగారు పక్షి’గా భారత్ మనం గత 1,000 సంవత్సరాల బానిసత్వం, 1,000 సంవత్సరాల భవ్యమైన భవిష్యత్తు మధ్య మైలురాయి వద్ద ఉన్నాం. పరుగు ఆపొద్దు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలి. రాబోయే వెయ్యేళ్ల దిశగా మన అడుగులను నిర్దేశించుకోవాలి. 2047 నాటికి మనదేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది. ఇది కేవలం ఒక కల కాదు, 140 కోట్ల మంది సంకల్పం. మనలో ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్ర నిరూపించింది. ‘బంగారు పక్షి’గా మన దేశం మళ్లీ మారడం ఖాయం. మణిపూర్‌లో శాంతి నెలకొంటుంది. ధరల నియంత్రణకు మరిన్ని చర్యలు ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. 6జీ టెక్నాలజీకి దేశం సన్నద్ధం దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ చేరుకుంది. క్వాంటమ్ కంపూటర్ల రాక కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆధునిక ప్రపంచాన్ని సాంకేతికత ప్రభావితం చేస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ విజయగాథలను తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. మన దేశంలో సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం. గతంతో పోలిస్తే డేటా చార్జీలు భారీగా తగ్గాయి. దీనివల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతోంది. శక్తివంతమైన జి–20 కూటమికి ఈసారి మనమే సారథ్యం వహిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు అగ్రి–డ్రోన్లు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కొత్త పథకం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల వాడకంలో, మరమ్మతుల్లో శిక్షణ ఇస్తాం. తొలుత 15,000 స్వయం సహాయక సంఘాలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. వారికి అగ్రి–డ్రోన్లు అందజేస్తాం. మహిళల సారథ్యంలోనే దేశాభివృద్ది జరగాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా కృషి చేస్తున్నాం. 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలన్నదే నా లక్ష్యం. రైతాంగ ప్రయోజనం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2.5 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేశాం. ఎరువులపై భారీగా రాయితీలు ఇస్తున్నాం. అలాగే చౌక ధరలకే ఔషధాలు విక్రయించే ‘జన ఔషధి కేంద్రాల’ సంఖ్యను 25,000కు పెంచుతాం. నగరాల్లో సొంత ఇల్లు సమకూర్చుకోవాలని భావించే మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు రుణాల వడ్డీల నుంచి ఉపశమనం కలిగించడానికి పథకం ప్రారంభిస్తాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం గత తొమ్మిదేళ్లలో సంక్షేమ పథకాలను ప్రక్షాళన చేశాం. పారదర్శకత తీసుకొచ్చాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం. అవినీతిపరుల ఆస్తుల స్వాదీనం తొమ్మిదేళ్లలో 20 రెట్లు పెరిగింది. అవినీతిపరులకు కోర్టుల నుంచి బెయిల్ దొరకడం కష్టంగా మారింది. ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. పునాదిరాళ్లు వేశాం. వాటిని నేనే ప్రారంభిస్తానన్న విశ్వాసం ఉంది. పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తిచేశాం. 2014లో మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 140 కోట్ల మంది శ్రమతో ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగాం. ఇదంతా సులభంగా జరగలేదు. అవినీతిని అరికట్టాం. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాం. గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ ఇప్పుడు ముఖ్యమైన భాగస్వామి. మన దేశం సాధించిన విజయాలు ప్రపంచ స్థిరత్వానికి ఒక హామీగా నిలుస్తాయి. భారత్‌కు ఇక తిరుగులేదని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. శషభిషలకు ఇక తావులేదు. మన పట్ల ప్రపంచానికి నమ్మకం పెరిగింది. బంతి మన కోర్టులోనే ఉంది. ఈ అవకాశం జారవిడుచుకోవద్దు. మన స్టార్టప్‌లు భేష్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదేశంలోనే ఉంది. మన యువత కృషితోపాటు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే ఇందుకు కారణం. యువ శక్తిపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 98,119 స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించింది. వాటికి నిధులతోపాటు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ముందంజలో ఉన్నాం. నిర్దేశిత హరిత లక్ష్యాలను గడువు కంటే ముందే సాధించాం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మన సైనిక దళాలను ఆధునీకరించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. గతంలో బాంబుపేలుళ్ల గురించి వినేవాళ్లం. ఇప్పుడు దేశం భద్రంగా ఉంది. శాంతి భద్రతలు ఉన్నప్పుడే అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతాం. స్పేస్ టెక్నాలజీలో అభివృద్ధి సాధిస్తున్నాం. వందే భారత్ రైళ్లు ప్రారంభించుకుంటున్నాం. బుల్లెట్ రైళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నా ప్రతి కల జనం కోసమే ప్రజలంతా నా వాళ్లే. నేను ప్రజల నుంచే వచ్చా. ప్రజల కోసమే జీవిస్తా. నేను ఏదైనా కల కన్నానంటే అది జనం కోసమే. వారి కోసం కష్టపడి పని చేస్తున్నా. ఇదంతా కేవలం ఒక బాధ్యత అప్పగించారు కాబట్టి చేయట్లేదు, ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి చేస్తున్నా. ప్రజల్లో ఒకడిగా ఆ ప్రజల బాధలను, కష్టాలను సహించలేను. ప్రజల కలలు విచ్ఛిన్నమైపోవడాన్ని అనుమతించను. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో జనం కోసం పని చేస్తున్నా. విశ్వకర్మ యోజన రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లతో విశ్వకర్మ యోజన అమలు చేస్తాం. వడ్రంగులు, స్వర్ణకారుల వంటి సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం లక్ష్యం. దీంతో ప్రధానంగా ఓబీసీలు ప్రయోజనం పొందుతారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పేదరికం తగ్గితే మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుంది. దేశంలో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంతకంటే జీవితంలో సంతృప్తి ఇంకేమీ ఉండదు. -
పచ్చని చిత్తూరు డెయిరీపై చంద్రబాబు పన్నాగం.. అసలేం జరిగిందంటే?
చిత్తూరు అర్బన్: ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద రెండో సహకార పాల డెయిరీగా పేరుగాంచిన చిత్తూరు విజయా డెయిరీ ఎందుకు మూతబడింది? ఏ ప్రభుత్వ హయాంలో విజయా డెయిరీని మూయించారు? నాటి పాలకులు చేసిన తప్పిదాలు ఏంటి? డెయిరీ మూత వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ పచ్చ మీడియాకు సమాధానాలు తెలుసు. కానీ ఎక్కడా వాటిని ప్రస్తావించదు. ఎల్లో మీడియా ఎందుకు ప్రస్తావించదంటే.. కారణం.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చంద్రబాబునాయుడు చేసిన కుట్ర. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి డెయిరీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పునరుద్ధరిస్తుంటే ‘పచ్చ మీడియా’ ఓర్చుకోవడంలేదు. డెయిరీ ఎదుట ఉన్న వీరరాఘవులునాయుడు విగ్రహం పడేశారంటూ గోల చేస్తూ తప్పుడు కథనాలు వార్చి వడ్డిస్తోంది. డెయిరీ మూసివేత కుట్రకు నాంది చంద్రబాబు నాయుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసే రోజుల్లో ఓసారి చిత్తూరు విజయా డెయిరీని సందర్శించారు. అప్పటికి రోజుకు 4 లక్షల లీటర్ల మేరకు పాల సేకరణ జరుగుతుండేది. డెయిరీలో ప్రత్యక్షంగా దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, పరోక్షంగా 2 లక్షలకు పైగా కార్మికులు విధులు నిర్వర్తించే వారు. చిత్తూరు విజయా పాల డెయిరీ నుంచి డిల్లీ, పూణే, బాంబే తదితర మహా నగరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల మేరకు పాలను తరలించడం గమనించిన బాబు మదిలో ఓ కుట్ర పురుడుపోసుకుంది. హెరిటేజ్ పుట్టిందే ఆ కుట్ర నుంచి.. అదే ఆయన మానస పుత్రిక హెరిటేజ్ పాల డెయిరీ స్థాపన. హెరిటేజ్‌ను స్థాపించాలంటే సహకార రంగంలో పాతుకుపోయిన విజయా పాల డెయిరీని మూయించాలని నిర్ణయించుకున్నారు. తనకు నమ్మిన బంటుగా ఉన్న చిత్తూరు టీడీపీ నేత దొరబాబునాయుడును విజయా పాల డెయిరీకి చైర్మన్‌గా నియమించుకున్నారు. మరో కుడిభుజం జీవరత్నం నాయుడును మేనేజర్‌గా నియమించుకుని విజయా డెయిరీకి వచ్చే పాలను తన డెయిరీకు మళ్లించుకున్నారు. జాగ్రత్తగా డెయిరీని మూత వేయించారు విజయా డెయిరీలో పాల పౌడర్, నెయ్యి లాంటి పదార్థాలు అమ్ముడుపోవడం లేదంటూ, భారీ నిల్వలను ఉంచేశారు. విజయా డెయిరీకి పాల సేకరణ ఎక్కువగా ఉందంటూ వారానికి రెండు రోజులు చొప్పున మిల్క్ హాలిడేను ప్రకటించారు. రైతులకు క్రమంగా పాల ధరలను తగ్గిస్తూ, ఇదే సమయంలో హెరిటేజ్‌లో 20 పైసలు అదనంగా ఇస్తామని ఆశ చూపించి పాలను మళ్లించుకున్నాడు. ముందు నష్టాలు.. తర్వాత లాకౌట్ ఆఖరికి డెయిరీలో భారీ నష్టాలు చూపించి 2002 ఆగస్టు 31వ తేదీన లాకౌట్ ప్రకటించి పూర్తిగా డెయిరీని మూసివేశారు. ఆ సమయంలో డెయిరీ చైర్మన్‌గా ఉన్న దొరబాబు నాయుడు పూర్తిగా చంద్రబాబు నాయుడి కుట్రలకు తోడ్పాటు అందించారు. విజయా పాల డెయిరీపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులను, డెయిరీలో పనిచేస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డున పడేశారు. విగ్రహాన్ని భద్రంగా ఉంచాం.. ప్రభుత్వం విజయ డెయిరీని పునఃప్రారంభించనున్న నేపథ్యంలో గేటు ముందు దారిలో అడ్డుగా ఉన్న వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని జాగ్రత్తగా తీసి భద్రపరిచామని నగర కమిషనర్ అరుణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తీసిన విగ్రహ ఫొటోలను చూపించారు. విగ్రహాన్ని ఎక్కడా పడేయలేదని స్పష్టం చేశారు. పచ్చ మీడియా దాచిన చరిత్ర 1969లో సహకార కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు విజయా డెయిరీని ప్రారంభించారు. అప్పట్లో రోజుకు 3 వేల లీటర్లు పాలు సేకరించేవారు. ఈ పాలను చిత్తూరు, తిరుపతి నగరాల్లో విక్రయించేవారు. 1977–78 నుంచి తిరుమల శ్రీవారికి అభిషేకానికి కూడా విజయా డెయిరీ పాలను సరఫరా చేసేవారు. తిరుమలలోని పలు హోటళ్లు, క్యాంటీన్లకు సైతం ఇక్కడి నుంచి పాలు వెళ్లేవి. ఘనచరిత్ర చిత్తూరు డెయిరీది 1980లో పాలకోవా, రోస్మిల్క్ తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేశారు. అప్పటికీ రోజుకు 50 వేల లీటర్ల పాలసేకరణ జరిగేది. కాల క్రమేణా తిరుమలకు నెలకు రూ.కోటి మేరకు నెయ్యి సరఫరా చేయడంతో పాటు, పాల కోవా, రోస్ మిల్క్ విక్రయాలను చిత్తూరు, తిరుపతి, తిరుమలలో పుంజుకున్నాయి. విజయా డెయిరీ నుంచి తయారుచేసిన పాల పౌడర్‌ను మిలిటరీ క్యాంటీన్లకు తరలించేవారు. లక్షల కుటుంబాల జీవన ధార రోజు రోజుకూ విజయా డెయిరీకి పాలసేకరణ సామర్థ్యం పెరగడంతో జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల పాడి రైతు కుటుంబా లు రోజుకు దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాలను సరఫరా చేసేవి. గ్రామాల్లో పాడి రైతులతో కూడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు దాదాపు 850 గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల సంఘం కింద పాల సేకరణ భవనాలను నిర్మించారు. ఇపుడు డెయిరీ తెరుస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న విజయా డెయిరీని పునరుద్ధరించే క్రమంలో స్థలాన్ని అమూల్ సంస్థకు 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పాలను సేకరించి గిట్టుబాటు ధర కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వీర రాఘవుల విగ్రహానికి సముచిత స్థానం డెయిరీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీరరాఘవులునాయుడు విగ్రహానికి సముచిత స్థానం కల్పిస్తామని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ ఇప్పటికే స్పష్టం చేశారు. విగ్రహాన్ని పడేశామని, మూలనచుట్టి ఎక్కడికో తరలించారంటూ వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. మరోవైపు డెయిరీని మూయించిన దొరబాబు నాయుడు.. చిత్తూరు కలెక్టర్‌ను కలిసి డెయిరీ ఎదుట వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని వినతిపత్రం ఇవ్వడం ఈ ఘటనలో కొస మెరుపు. -
మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని
న్యూఢిల్లీ: మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం, గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద మనకు గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం సాగించిన ప్రయత్నాల ఫలితంగానే మన యువతకు సంస్కృతితో బంధం బలపడిందని అన్నారు. శనివారం ఆయన ట్విట్టర్లో ‘9ఇయర్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ కల్చర్’పేరుతో హాష్‌ట్యాగ్ చేశారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు ట్వీట్లు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. -
సహకార డెయిరీ రంగాన్ని చంపేసింది చంద్రబాబే
చంద్రబాబు ప్రభుత్వం హయాం.. రాష్ట్రంలో సహకార డెయిరీలను ప్రభుత్వమే చిదిమేసింది. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ ఎదుగుదల కోసం గ్రామ గ్రామాన వేళ్లూనుకొన్న సహకార డెయిరీలను ఆయన ప్రభుత్వమే నాశనం చేసేసింది. కొన్నింటిని తనకు అనుంగులుగా ఉండే వ్యక్తులకు అప్పజెప్పింది. చివరకు రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు. పాలకు కనీస ధర కూడా అందక అల్లాడిపోయారు. ‘ఈనాడు’ విషం.. విషపు రాతల ‘ఈనాడు’కు ఈ వాస్తవాలు పట్టవు. ప్రజల సంక్షేమం అసలే పట్టదు. ఎంతసేపూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యం. అందులో భాగంగానే ‘అమూల్ మాకొద్ద’ంటున్నారంటూ విషపు రాతలతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. మూతపడ్డ సహకార పాల డెయిరీలు పునరుద్ధరించి, పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ గ్రామాన మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి సహకార రంగాన్ని బలోపేతం చేసింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. లీటర్‌కు రూ. 4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం కింద లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూరుస్తోంది. పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గిట్టుబాటు ధర వస్తోంది. అమూల్‌కు పాలు పోసే వారే కాదు.. అమూల్ రాకతో పాల సేకరణ ధరలు పెంచడం వలన ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తున్న పాడి రైతులూ లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీల రైతులకూ లబ్ధి అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకూ లబ్ధి చేకూరింది. అమూల్ పాల సేకరణ ధర పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా విధిలేని పరిస్థితుల్లో పాల సేకరణ ధరలు పెంచాయి. అమూల్ ఇచ్చే ధరతో పోలిస్తే తక్కువే అయినా, వాటికి పాలు పోసే పాడి రైతులకు ఈ 30 నెలల్లో రూ.3,312.46 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది. సహకార డెయిరీలకు చంద్రబాబు కాటు హెరిటేజ్ డెయిరీ కోసం రాష్ట్రంలో సహకార డెయిరీ రంగాన్ని ఓ పథకం ప్రకారం నిర్వీర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ పరిధిలోకి మార్చారు. ఆ తర్వాత వాటిని కంపెనీలుగా ప్రకటించుకున్నారు. విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద కంపెనీలుగా ప్రకటించుకున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు లాభాల్లో ఉన్న ప్రభుత్వ డెయిరీలన్నీ బాబు హయాంలో మూతపడ్డాయి. 2017 జనవరి 23న కడప జిల్లాలోని పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణాలోని మినీ డెయిరీ–కంకిపాడు, 2019 మార్చి 15న చిత్తూరు జిల్లాల్లోని మదనపల్లి డెయిరీ, మరో 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మిల్క్ చిల్లింగ్ సెంటర్ (ఎంసీసీ)తో పాటు 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూలు) మూతపడ్డాయి. రాష్ట్రంలోని పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. పాల సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారు. కోట్లాది రూపాయల విలువైన మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, చిల్లింగ్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లతో సహా ఇతర మౌలిక సదుపాయాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటిపై ఈనాడు పత్రిక ఏనాడూ చిన్న వార్తా రాయలేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం నుంచి పాలను సేకరించడమే నిలిపివేసింది. రూ.45 కోట్లకు పైగా బకాయిలను ఎగ్గొట్టారు. అయినా బాబు సర్కారు నోరు మెదపలేదు. సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాల సహకార సంఘాల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గ్రామాల్లో మహిళా డెయిరీ సహకార సంఘాలు (ఎండీఎస్) ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుసంధానంగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పాలు సేకరిస్తున్నారు. మూడు జిల్లాలతో మొదలైన పాల సేకరణ ప్రస్తుతం 17 జిల్లాలకు విస్తరించింది. 20 – 30 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న ప్రైవేటు డెయిరీలు ప్రస్తుతం రోజుకు 5 – 6 లక్షల లీటర్లు సేకరిస్తుంటే, కేవలం 30 నెలల్లోనే అమూల్ సంస్థ రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. గతంలో ప్రైవేటు డెయిరీలు రెండేళ్లకోసారి పాలసేకరణ ధరలు పెంచేవి. అమూల్ మూడు నెలలకోసారి పాల సేకరణ ధరలను సవరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. ఇలా 30 నెలల్లో ఏడు రెట్లు పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.88, ఆవు పాలకు రూ.43.69 చెల్లిస్తున్నారు. 30 నెలల్లో గేదె పాలపై రూ.16.53, ఆవు పాలపై రూ. 9.49 మేర ధరలు పెంచారు. ఒక్క రూపాయి తక్కువ కాకుండా 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు ఆర్బీకేల ద్వారా ఇన్పుట్స్ అందిస్తున్నారు. మధ్యవర్తులు, వాటాదారుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా ప్రోత్సాహకం, బోనస్ పంపిణీ చేస్తున్నారు. ఏటా 2 సార్లు లీటరుకు అర్ధ రూపాయి లాయల్టీ బోనస్ కూడా వస్తోంది. పాడి రైతుల సంరక్షణ, నిర్వహణ కోసం రూ.40 వేల వరకు ఎలాంటి హామీ లేకుండా స్వల్పకాలిక రుణాలందిస్తున్నారు. అమూల్ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలు నిర్మిస్తున్నారు. – సాక్షి, అమరావతి