
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికం స్టాండెలోన్ ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నిరాశపరిచింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరలాభం 91 శాతం తగ్గి రూ.20 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.737 కోట్ల నుంచి రూ.607 కోట్లకు వచ్చి చేరింది. 2017–18లో నికరలాభం రూ.275 కోట్ల నుంచి రూ.60 కోట్లకు తగ్గిపోయింది.
టర్నోవరు రూ.2,122 కోట్ల నుంచి రూ.2,746 కోట్లను వృద్ధి చెందింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది.