
సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో సందడి నెలకొంది. విద్యార్థుల కోలాహలంతో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడింది.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి 1,628 మంది విద్యార్థులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా దేశంలోని మూడు రాష్ట్రపతి నిలయాల చరిత్ర, ప్రాముఖ్యతను వివరించే వీడియోను వీక్షించారు. అనంతరం విద్యార్థులు హెరిటేజ్ వాక్‌లో భాగంగా రాష్ట్రపతి నిలయంలోని పురాతన భవనాలను సందర్శించి వాటి చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వారసత్వ పరిరక్షణకు సంబంధించిన నిపుణులు విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు.
ఈ సెషన్లలో ఇంజినీర్ వేదకుమార్ మణికొండ (డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్), మధు వొటెరి (సీనియర్ ఫెలో – కేంద్ర సాంస్కతిక మంత్రిత్వ శాఖ, తెలంగాణ టూరిజం వాక్ కోఆర్డినేటర్), కల్పనా రమేష్ (కావా డిజైన్ స్టూడియో – ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు) పాల్గొన్నారు.
(చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!)