‘హెరిటేజ్‌ వాక్‌’ పరిశీలన | Heritage walk observation | Sakshi
Sakshi News home page

‘హెరిటేజ్‌ వాక్‌’ పరిశీలన

Dec 27 2016 9:32 PM | Updated on Sep 4 2017 11:44 PM

‘హెరిటేజ్‌ వాక్‌’ పరిశీలన

‘హెరిటేజ్‌ వాక్‌’ పరిశీలన

అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిని రెండేళ్ల క్రితం ప్రభుత్వం వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకశాఖ అమరావతి, ధరణికోట గ్రామాల్లో హెరిటేజ్‌ వాక్‌ నిర్మాణం చేపట్టింది.

 
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిని రెండేళ్ల క్రితం ప్రభుత్వం వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకశాఖ అమరావతి, ధరణికోట గ్రామాల్లో హెరిటేజ్‌ వాక్‌ నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా నిర్మిస్తున్న రోడ్లను మంగళవారం పర్యాటక శాఖ డైరెక్టర్‌ హిమాంశ్‌ శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ కృతికా శుక్లా పర్యాటక శాఖ సలహాదారుడు ప్రొఫెసర్‌ గల్లా అమరేశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ప్రొఫెసర్‌అమరేశ్వర్‌ అమరేశ్వరాలయం, కృష్ణా నది తీర ప్రశస్తిని వారికి వివరించారు. అనంతరం అమరావతి పాత మ్యూజియంలోని మహాస్థూపం, కొత్త  మ్యూజియంలోని శిల్పాలను తిలకించారు. త్వరితగతిని నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రతినిధి కిరణ్,  సాయిబాబు వీర్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement