observation
-
స్థానికంగానే టీచర్ల మెడికల్ బిల్లుల డేటా పరిశీలన
సాక్షి, అమరావతి: మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల సమాచారం స్థానిక డీడీవోల లాగిన్‌లోనే అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ తెలిపారు. వాటిని సరిగ్గా పరిశీలించి.. టీచర్లకు సరైన సమాచారం అందించాలని డీడీవోలను శనివారం కమిషనర్ ఆదేశించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల స్థితిగతులను తెలుసుకునేందుకు, ప్రొసీడింగ్స్ కాపీల కోసం దూరప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నంలోని కమిషనరేట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. బిల్లుల మంజూరు ప్రక్రియను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ డీడీవోలైన హెచ్ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోల లాగిన్‌లో పరిశీలించకపోవడం వల్ల సమస్య వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి స్క్రూటినీ రిపోర్టులు వచి్చన వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా మంజూరు ప్రొసీడింగ్స్ ఆమోదించి, సంబంధిత డీడీవోల లాగిన్లకు పంపిస్తున్నామన్నారు. కానీ డీడీవోలు తమ లాగిన్‌లో బిల్లుల స్థితిగతులను సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల టీచర్లు వాటి కోసం దూరప్రాంతాల నుంచి తమ కార్యాలయానికి వస్తూన్నారని, టీచర్లు, ఉద్యోగులు వీటి కోసం కమిషనరేట్‌ను సంప్రదించే పరిస్థితి వస్తే.. డీఈవోలు, డీడీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన మెడికల్ రీయింబర్స్ బిల్లులను సంబంధిత డీడీవోలు ఆన్లైన్లోనే సమర్పించాలని.. లాగిన్ ఫిజికల్ బిల్లులు స్వీకరించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. -
కరోనా : పెరుగుతున్న అనుమానితుల సంఖ్య
తిరువనంతపురం : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు పుట్టిస్తోంది. అటు భారతదేశంలో కూడా కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కేరళలో 806 మందిని కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో పరిశీలనలో ఉంచారు. వీరిలో పది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె.కె. శైలజ బుధవారం ఈ సమాచారాన్ని అందించారు. 19మందిని వివిధ ఆసుపత్రులలో చేర్పించగా, వారిలో తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్యమంత్రి వెల్లడించారు. పదహారు నమూనాలను పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా పది కేసుల్లో ఫలితం ప్రతికూలంగా (నెగిటివ్) వచ్చినట్టు తెలిపారు. మిగిలిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. చైనానుంచి తిరిగి వచ్చినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య అధికారులతో సంప్రదించాలని ఆమె సూచించారు. మరోవైపు కరోనా వైరస్ ముప్పును ఎదుర్కోవటానికి కేరళలో ఏర్పాట్లను పరిశీలించడానికుద్దేశించిన కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన షౌకత్ అలీ మంగళవారం 436 మంది పరిశీలనలో ఉన్నారని తెలిపారు. -
వైద్య సేవలపై గవర్నర్ ఆరా!
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రిలో వివిధ విభాగాలను శుక్రవారం ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ పరిశీలించారు. పేదలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వార్డుల్లో రోగులను పరామర్శించి యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వార్డు, ఆపరేషరేషన్ థియేటర్లు, సర్జికల్ ఐసియూ,డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ విభాగాలను పరిశీలించి..వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. వైద్య సదుపాయాలపై స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్న గవర్నర్.. ప్రభుత్వాసుపత్రుల్లో వసతి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. -
తుమ్మిళ్ల రిజర్వాయర్లపై అపోహలు వద్దు
రాజోళి (మహబూబ్‌నగర్): తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఆర్డీఎస్ రైతులకు వరమని, ప్రాజెక్టులో నిర్మించే రిజర్వాయర్లపై ఎలాంటి అపోహలు వద్దని అలంపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహం అన్నారు. శుక్రవారం ఆయన తుమిళ్ల ఎత్తిపోతల పనులను ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారామి రెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా తనగల సమీపంలోని ఆర్డీఎస్ కెనాల్ డీ.24 వద్ద పనులు పూర్తిచేసుకున్న డెలవరీ సిస్టంను పరిశీలించారు. అక్కడే కెనాల్ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ కోసం జరుగుతన్న పనులను పరిశీలించారు. అక్కడి నుంచి ప్రెజర్మొయిన్స్ పైప్‌లైన్ మీదుగా తుమ్మిళ్లకు చేరుకున్న ఆయన పంప్‌హౌస్, ఫోర్భే, అప్రోచ్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు మొదటి విడత పూర్తికావొచ్చాయని, ఆగస్టులో తుమ్మిళ్ల ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ పనులు పూర్తయిన నేపథ్యంలో రెండో విడత పనులు జరగవని, రిజర్వాయర్లు నిర్మాణం ఉండదని కొందరు అపోహ చెందుతున్నారని, రిజర్వాయర్లతో సహ ప్రాజెక్టుకు సంబంధించి రూ.783 కోట్లు పరిపాలన అనుమతులు లభించాయని, రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. మొదటి విడత ద్వారా సాగు నీరు అందించిన అనంతరం మల్లమ్మకుంట, జూలకల్, వల్లూర్ రిజర్వాయర్లు నిర్మించడం జరుగుతందన్నారు. సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్ రావ్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని తనకు సూచించారని, ఇకపై పనులను పర్యవేక్షిస్తుంటానని తెలిపారు. మురళీధర్ రెడ్డి, గజేంద్ర, వెంకటయ్య, కిషోర్ పాల్గొన్నారు. -
సాక్షర భారత్‌కు మంగళం
సాక్షి, కడప కోటిరెడ్డి సర్కిల్ : నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యంతో సాక్షరభారత్ ప్రాజెక్టును ప్రారంభించారు. సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయంగా ప్రారంభించిన సాక్షరభారత్ పథకంలో పని చేస్తున్న కోఆర్డినేటర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఏడాది కాలంలో సాక్షర భారత్ కోఆర్డినేటర్లను అనేక కార్యక్రమాలలో ఉపయోగించుకున్నారు. వీరికి 8 నెలల జీతాల బకాయిలు అందాల్సి ఉంది. వాటి కోసం ఎదురు చూస్తున్న సాక్షర భారత్ కోఆర్డినేటర్లను తొలగిస్తు న్నట్లు వయోజన విద్యా సంచాలకులకు శుక్రవారం ఉత్తర్వులు అందాయి. జిల్లా వ్యాప్తంగా 2010 సెప్టెంబర్ 8న సాక్షర భారత్ ప్రాజెక్టు ప్రారంభమైంది. జిల్లాలోని 789 పంచాయతీల్లో 1580 మంది గ్రామ స్థాయి కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండలానికి ఒకరు చొప్పున 50 మంది మండల కోఆర్డినేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరిని మార్చి 31 నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో జీతాల విషయం ఎక్కడా పొందపరచలేదు. కోఆర్డినేటర్లు గ్రామాల్లోని వయోజనులను అక్షరాస్యులుగా చేయడంలో వీరు యజ్ఞంలా పనిచేశారు. సాక్షర భారత్ మొదటి నుంచి చివరి దశ వరకు మందకొడిగా సాగింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్ష్యరాస్యతలో జిల్లా వెనుకబడిఉంది. అయితే ప్రభుత్వం సాక్షరభారత్ వ్యవస్థను రద్దు చేసింది. సామగ్రిని సమీప ప్రభుత్వ ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు అందించాలని జీవోలో ప్రస్తావించారు. రాత్రి వేళ అక్షరాలు నేర్పించడం, ఉదయం పత్రికలు, కథల పుస్తకాలు చదివించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.. మండల స్థాయిలో ఒక కోఆర్డినేటర్‌ను, గ్రామ స్థాయిలో మరో కోఆర్డినేటర్లను నియమించారు. మండల కోఆర్డినేటర్లకు నెలకు రూ.6000 వేతనం, గ్రామ స్థాయి కోఆర్డినేటర్లకు రూ. 2వేలు చెల్లించేవారు. అలాగే కేంద్రాల నిర్వహణకు నెలకు రూ.300 చొప్పున మంజూరు చేసేవారు. వయోజనులకు అక్షరాలు నేర్పిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కోఆర్డినేటర్లను ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే సాక్షర భారత్ కోఆర్డినేటర్లతో పనులు చేయించుకొని 10 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. గ్రామాల్లో, మండలాల్లో పెన్షన్లు, తదితర పనుల్లో పనులు చేయించుకొని మా పొట్ట కొట్టారు. బాబు వస్తే జాబు వస్తుందనుకొన్నాం, కానీ బాబు వస్తే ఉన్న జాబు ఊడిపోతుందని ఇప్పుడు అర్థమైంది. ప్రభుత్వం మాకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలి. –బాబు సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ -
దివీస్ షేర్‌కు మరోసారి నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మ దిగ్గజం దివీస్ లాబ్స్‌కు మరోసారి చిక్కులు తప్పలేదు. యూఎస్ఎఫ్డీఏ తాజా అబ్జరేషన్స్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో దివీస్ లేబ్స్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఈ నెలలో తనిఖీలు నిర్వహించిన తనిఖీల్లో ఆరు లోపాలను(అబ్జర్వేషన్స్) నమోదు చేసినట్లు వెల్లడికావడంతో దివీస్ షేర్ 9 శాతానికిపైగా నష్టపోయింది. మార్చి 21 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రా డే పతనాన్నినమోదు చేసింది. మంగళవారం నాటి ముగింపుతో గత 12నెలల్లో 28 శాతం పడిపోయింది. వైజాగ్‌లోని యూనిట్-2లో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన తుది ఏపీఐల ఇండివిడ్యుయల్ పరీక్షలలో దివీస్ విఫలమైనట్లు తెలుస్తోంది. తయారీ, పరికరాల పరిశుభ్రత వంటి అంశాలలోనూ లోపాలు గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా నివేదికలపై దివీస్ ఇంకా స్పందించలేదు. కాగా అమెరికా రెగ్యులేటరీ నుంచి ఆరు అబ్జర్వేషన్స్ తమకు అందాయని దివీస్ గతవారం తెలిపింది. ఇది సాధారణమేనని పేర్కొంది. -
వర్జీనియా రైతులకు న్యాయం చేస్తాం
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వెంకటేష్ అన్నారు. గురువారం స్థానికంగా రెండు పొగాకు వేలం కేంద్రాలను ఆయన పరిశీలించారు. వేలం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సరాసరి ధర కేజీకి రూ.155 ఇవ్వాలని రైతులు కోరారు. అలాగే విదేశీ ఆర్డర్లు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక ఈ ఏడాది దిగుబడి కొద్దిగా పెరిగిందని, అందువల్ల ఒక్కో బ్యారన్‌కు అదనంగా 4 క్వింటాళ్లు అమ్ముకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. కొనుగోళ్ల సమయంలో ఆయా పొగాకు కంపెనీలు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సంక్షేమ పథకానికి సంబంధించి కొన్ని నిబంధనల వల్ల రైతు కుటుంబాలకు న్యాయం జరగడం లేదని, దీనిపై కూడా దృష్టి సారించాలని కోరారు. అలాగే బ్యారన్లకు బీమా చేయిస్తున్నామని, అయితే సకాలంలో నష్టపరిహారం అందడం లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కాగా దీనిపై పరిశీలించి అన్ని చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. పొగాకు బోర్డు కార్యదర్శి సీఎస్ఎస్ పట్నాయక్, ఆక్షన్ మేనేజర్ కె.రవికుమార్, ప్రొడక్షన్ ఏఎస్ సీహెచ్‌వీ మారుతీప్రసాద్, రీజినల్ మేనేజర్ ఎం.శ్రీరామమూర్తి, అకౌంట్ అసిస్టెంట్ మేనేజర్ చింతమనేని ఏసుదాసు, వేలం అధికారులు కేవీ రాజప్రకాష్, ఆర్.రమేష్‌బాబు, బోర్డు మాజీ వైస్‌చైర్మన్ గద్దే శేషగిరిరావు, పొగాకు బోర్డు సభ్యుడు గడ్డమణుగు సత్యనారాయణ, రైతు సంఘాల అధ్యక్షులు పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 16.3 మిలియన్ కిలోల అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16.3 మిలియన్ కిలోలు పొగాకు అమ్మకాలు పూర్తయ్యాయి. మొత్తం 130 మిలియన్ కిలోలు పంట పండించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సరాసరి ధర 148.21 లభించింది. కాగా ఎన్‌ఎల్‌ఎస్‌లో ఇప్పటివరకు 3.86 మిలియన్ కిలోలు అమ్మకాలు జరిగాయి. జిల్లాలోని 5 వేలం కేంద్రాల్లో ఈ అమ్మకాలు పెరగ్గా, సరాసరి ధర 145.27 రూపాయలు లభించింది. ఎన్ఎల్ఎస్ పరిధిలో 42 మిలియన్ కిలోలు పంట పండించేందుకు బోర్డు అనుమతించింది. -
సర్వజనాస్పత్రిలో ‘సాథి’ బృందం
అనంతపురం మెడికల్ : ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ) పథకం అమలు తీరు తెన్నులను పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన ‘సాథి’ ఆర్గనైజేషన్ సభ్యులు సాయిశోభా రాఘవన్, రేబిక సోమవారం సర్వజనాస్పత్రికి వెళ్లారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు గైనిక్, లేబర్, పీడియాట్రిక్, ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీ, గర్భిణుల ఓపీలను పరిశీలించారు. ఆయా విభాగాల్లో వైద్యులతో మాట్లాడారు. ప్రతి నెలా 9వ తేదీన పీఎంఎస్‌ఏఓ కార్యక్రమం సజావుగా సాగుతోందా అని ఆరా తీశారు. అనంతరం నగరంలోని నీరుగంటి వీధిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి జననీ సురక్ష యోజన కింద గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. బృందం వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఎస్ఓ మారుతిప్రసాద్ ఉన్నారు. ఈ బృందం జిల్లాలోని పెనుకొండ, హిందూపురం ఆస్పత్రులను కూడా పరిశీలించింది. -
‘హెరిటేజ్ వాక్’ పరిశీలన
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిని రెండేళ్ల క్రితం ప్రభుత్వం వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకశాఖ అమరావతి, ధరణికోట గ్రామాల్లో హెరిటేజ్ వాక్ నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా నిర్మిస్తున్న రోడ్లను మంగళవారం పర్యాటక శాఖ డైరెక్టర్ హిమాంశ్ శుక్లా, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా పర్యాటక శాఖ సలహాదారుడు ప్రొఫెసర్ గల్లా అమరేశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ప్రొఫెసర్‌అమరేశ్వర్ అమరేశ్వరాలయం, కృష్ణా నది తీర ప్రశస్తిని వారికి వివరించారు. అనంతరం అమరావతి పాత మ్యూజియంలోని మహాస్థూపం, కొత్త మ్యూజియంలోని శిల్పాలను తిలకించారు. త్వరితగతిని నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రతినిధి కిరణ్, సాయిబాబు వీర్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
నేరస్తులపై నిఘా ఉంచాలి
అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి గుంటూరు (పట్నంబజారు): నేరస్తుల కదిలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని అర్బన్ సమావేశ మందిరంలో సోమవారం వెస్ట్ సబ్ డివిజన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను పరిష్కరించటంతో పాటు నాన్ బెయిలబుల్ కేసుల్లో నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జైలు నుంచి విడుదలైన వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. అనుమానితులపై నిఘా ఉంచాలని సూచించారు. రౌడీ కార్యకలాపాలు సాగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రతి కేసును తప్పని సరిగా సీసీ టీఎన్‌ఎస్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశలో అడిషనల్ ఎస్పీలు భాస్కరరావు, ఇ.సుబ్బరాయుడు, డీఎస్పీ కేజివి.సరిత, వెస్ట్ సబ్‌డివిజన్ ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు. -
డెల్టాలో కమిటీ
• మెట్టూరు, భవానీ • సాగర్‌లో పరిశీలన • ఢిల్లీ బృందంతో • ఎడపాడి సమాలోచన • నేడు అన్నదాతల చెంతకు సాక్షి, చెన్నై: కావేరి ఉన్నత స్థాయి సాంకేతిక పరిశీలన కమిటీ రాష్ర్టంలో పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఆదివారం మెట్టూరు, భవానీ సాగర్ జలాశయాల్లో ఈ కమిటీ పరిశీలన సాగింది. ఈ బృందంతో రాష్ట్ర ప్ర జా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి సమాలోచించారు. ఇక, ఈ కమిటీ డెల్టాలో కమిటీ సోమవారం తంజావూరు, తిరువారూర్, నాగపట్నంలలో పర్యటించనున్నది. కావేరి జల వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు కేంద్ర ఉన్నత స్థాయి సాంకేతిక పరిశీలన కమిటీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే.వాటార్ కమిషన్ చైర్మన్ జీఎస్ జా నేతృత్వంలో ఎస్ మజూద్, ఆర్కే గుప్తాలతో కూడిన ఈ కమిటీలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల అధికారులు ఉన్నారు. శుక్ర, శనివారాల్లో ఈ కమిటీ కర్ణాటకలోని జలాశయాల్లో నీటి పరిస్థితి, అక్కడి సాగుబడిని పరిశీలించింది. అక్కడ పర్యటన ముగించుకుని శనివారం అర్థరాత్రి సేలం చేరుకున్న ఈ కమిటీకి ఆ జిల్లా కలెక్టర్ సంపత్ ఆహ్వానం పలికారు. ఆదివారం ఉదయాన్నే ఈ కమిటీ స్థానిక అధికారులతో సమీక్షించింది. ఈ సమయంలో రాష్ర్ట ప్రజా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి అక్కడికి చేరుకుని ఈ కమిటీకి ఓ నివేదిక సమర్పించారు. డెల్టా జిల్లాల్లో సాగుబడి , నీటి అవసరాలను వివరిస్తూ అందులో పూర్తి సమాచారం పొందు పరిచారు. ఈ నివేదికపై సమాలోచన అనంతరం నేరుగా మెట్టురు డ్యాంకు జిఎస్ జా నేతృత్వంలో బృందం చేరుకుంది. డెల్టాలో పరిశీలన: మెట్టురు డ్యాంకు చేరుకున్న ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అధికారులు సుబ్రమణియన్, ప్రభాకర్‌లు జీఎస్ జాకు అక్కడి పరిస్థితిని వివరించారు. డ్యాంలో నీటి మట్టం, బురద, నీటి రాక, విడుదల తదితర వివరాలను జీఎస్ జా వెంట ఉన్న అధికారులు నమోదు చేసుకున్నారు. నీటి పరిస్థితిని సమీక్షించినానంతరం ఈరోడ్ జిల్లా భవానీ సాగర్‌కు చేరుకున్నారు. అక్కడ నీటి పరిస్థితి పరిశీలించారు. కావేరి తీరం వెంబడి సాగును పరిశీలిస్తూ, నీటి అవసరాల మీద సమగ్ర నివేదికకు ఈ కమిటీ నిర్ణయించింది. సోమవారం తిరువారూర్, తంజావూరు, నాగపట్నంలలో ఈ కమిటీ పరిశీలించి ఏ మేరకు సంబాసాగుబడి సాగుతున్నదో అధ్యయనం చేయనున్నది. ఈ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లే జీఎస్ జా ఈనెల పదిహేడున సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. కాగా, డెల్టా జిల్లాల్లో పర్యటించనున్న ఈ కమిటీ ఆయా జిల్లాల్లోని రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులు, అన్నదాతలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కావాలని, అప్పుడే వాస్తవిక పరిస్థితి తెలుస్తుందని రాజకీయ పక్షాలు సూచించే పనిలో పడ్డారు. ఈ విషయంగా డిఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ పేర్కొంటూ, మొక్కుబడి పరిశీలనగా కాకుండా, అన్ని వర్గాల్ని కలుపుకుని కమిటీ ఏర్పాటు చేసి ఉండాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో రైతు ప్రతినిధులకు అవకాశం కల్పించి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడెక్కడ నీటి అవసరాలు మరీ ఎక్కువో అన్న వివరాలను సమగ్రంగా పరిశీలించాలని , రైతు ప్రయోజనార్థం అధికారులు పూర్తి వివరాలను కమిటీ ముందు ఉంచాలని సూచించారు ముగ్గురు : కావేరి జల వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లు ఇది వరకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ విచారిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ అన్ని పిటిషన్లను విచారించనున్నది. ఇందుకు తగ్గ ఆదేశాలు వెలువడ్డాయి. ఈనెల 17, 18 తేదిల్లో ఈ బెంచ్ ముందుకు పిటిషన్ల విచారణలు రానున్నాయి. ఇక, కావేరి అభివృద్ధి మండలి, కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ నేతృత్వంలో కమలనాథులు ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మోర పెట్టుకున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ దగ్ధం ఘటనపై సీఎండీ ఆరా!
తాడికొండ రూరల్ (గుంటూరు): తాడికొండ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ప్రమాదానికి గురై కాలిపోయిన 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఘటనను పరిశీలించేందుకు ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ గురువారం విచ్చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక కారణాల వలనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన అనంతరం జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేలా చర్యలలో భాగంగా బాపట్ల, పర్చూరు, నరసరావుపేట సబ్స్టేషన్ల నుంచి లోడ్లు తీసుకోనున్నట్టు అధికారులు సీఎండీకి వివరించారు. నాలుగు రోజుల్లో ప్రమాదానికి గురైన ట్రాన్స్ఫార్మర్ను తొలగించి ఆ స్థానంలో మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సుబ్రహ్మణ్యం, చీఫ్ ఇంజినీర్ ఆపరేషన్స్ కె.రాజబాపయ్య, అపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఎస్ఈ శ్రీనివాసరావు, పలువురు ఏఈలు అధికారులు పాల్గొన్నారు. మరో ట్రాన్స్ఫార్మర్కు ఆయిల్ లీకేజీ సబ్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగసిపడడంతో పక్కన ఉన్న మరో 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా ఆయిల్ లీకవుతున్నట్లు అధికారులు గుర్తించి మరమ్మతులు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ బాగా మరిగి ఉండటంతో ఇంకా పొగలు వెలువడుతూనే ఉన్నాయి. ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గితే కానీ ట్రాన్స్ఫార్మర్ను తొలగించే అవకాశం లేకపోవడంతో మరో రోజు వేచి చూసిన అనంతరం తొలగింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. -
అక్రమార్కులకు అడ్డుకట్ట
* ముడి ఖనిజం పరిశీలన * అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న అటవీ శాఖాధికారులు బొల్లాపల్లి : మండలంలోని బండ్లమోటు మైనింగ్ ప్రదేశాన్ని అటవీ శాఖ మాచర్ల ఏసీఎఫ్ పి.సునీత సోమవారం సందర్శించారు. బండ్లమోటు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ నుంచి అక్రమార్కులు తరలించిన ముడి ఖనిజంను తిరిగి ఫారెస్ట్ శాఖాధికారులు స్వాధీనపరుచుకొని అటవీ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలకు చేరవేశారు. ఆ శాఖ ఆధీనంలో ఉన్న ముడి ఖనిజాన్ని ఆమె పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం బండ్లమోటు నర్సరీ వద్ద ఈ విషయంపై అదే పంచాయతీకి చెందిన ఉప సర్పంచ్ ఎస్కే హబీబ్‌బాషా, మరి కొందరు యువకులు కలిసి మైనింగ్‌కు సంబంధించి ముడి ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తుండగా అడ్డగించి పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించినా ఎలాంటి చర్యలు లేవని ఏసీఎఫ్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక అధికారులు ముడి ఖనిజం తరలించే యంత్రాలను వదలివేశారని, దీని ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కేసు నమోదు చేశామని సమస్యను దాటవేస్తున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తరలించిన ముడి ఖనిజంలో 30 టన్నులు తేడా ఉందని కూడా గనులు, భూగర్భ శాఖ అధికారులు నిర్థారించారని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరారు. దీనిపై ఏసీఎఫ్ సునీత మాట్లాడుతూ గనులు, భూగర్భ శాఖ అధికారుల నుంచి ముడి ఖనిజం వివరాలు రావాల్సి ఉందని, సమాచారం రాగానే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అక్రమార్కులను ఉపేక్షేంచిలేదని చెప్పారు. ఆమె వెంట వినుకొండ ఫారెస్ట్ రేంజర్ ఎస్. హరి, ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
బోటు నుంచి పర్యవేక్షణ
ఐజీ సంజయ్ ఘాట్ల పరిశీలన గుంటూరు రూరల్ (అమరావతి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే స్నానపు ఘాట్లను ఐజీ సంజయ్ ఆదివారం బోట్ ద్వారా ప్రయాణిస్తూ పరిశీలించారు. తాళ్ళాయపాలెం ఘాట్‌నుంచి బయలుదేరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని స్నానపు ఘాట్లను ఆయన పరిశీలిస్తూ అమరావతిలోని అమరేశ్వర ఘాట్‌వరకూ ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాళాయపాలెంనుంచి అమరావతి వరకూ ఉన్న ప్రతి ఘాట్‌ను పరిశీలించానని కొన్ని ప్రాంతాల్లో స్నానాలకు అనువుగాని చోట ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తాళాయపాలెంనుంచి అమరావతి ఘాట్‌వరకూ సుమారు రెండున్నర గంటల సమయం పట్టిందని తెలిపారు. నీరు సమృద్ధిగా ఉండడం, తగిన రక్షణ చర్యలు ఉండడంవల్ల భక్తులు ఆనందంగా స్నానాలు ఆచరిస్తున్నారన్నారు. -
వ్యవసాయ మార్కెట్లో హరితహారం మొక్కల పరిశీలన
వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఇప్పటివరకు చేపట్టిన హరితహారం కార్యక్రమంపై బుధవారం ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మార్కెటింగ్ డిప్యూటి డైరెక్టర్, హరితహారం ప్రత్యేక అధికారి, అబ్జర్వర్ రాజశేఖర్‌రెడ్డి మార్కెట్లో నాటిన మొక్కలను స్వ యంగా పరిశీలించారు. చాలా మొక్కలకు ట్రీగార్డులు లేకపోవడంతో త్వర గా ఏర్పాటు చేయాల్సింది గా మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజుకు సూచించా రు. అలాగే పక్కనే ఉన్న మార్కెట్‌కు సంబంధించిన ముసలమ్మకుంటలో నిర్మిస్తున్న నూతన గోదాంను, సమీపంలో పెద్ద సంఖ్యలో నాటిన మొక్కలను పరిశీ లించారు. మొత్తంగా మా ర్కెట్లో హరితహారం కార్యక్రమం విజయవంతంగా భావించి, మొక్కలు ఎదిగే వరకు ఇదే రకమైన శ్రద్ధను కనబరచాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ ముఖ్య అధికారులు రామ్మోహన్‌రెడ్డి, జగన్మోహన్, వెంకటేశ్వర్లు, కనకశేఖర్, రమేష్, వెంకన్న, కుమారస్వామి, రాజేందర్, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, అశోక్, సంజీవ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల పరిశీలన
యాదగిరిగుట్ట : మండలంలోని మహబూబ్‌పేటలో ఇటీవల హరితహారంలో నాటిన మొక్కలను అటవీశాఖ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటీవ్ ఫర్గీన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. ఎక్కువ నీటి నిల్వలు ఎక్కడ ఉంటాయో అక్కడ విరివిగా నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ప్రస్తుతం మండలంలో నాటిన మొక్కలు వాడిపోకుండా ప్రతి రోజు నీళ్ళు పోయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది నాటిన మొక్కలు ఎండిపోతే వాటి ప్రదేశంలోనే మళ్లీ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకున్నప్పుడే హరితతెలంగాణ సాధించిన వాళ్లమవుతామని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో హరితహారంపై చర్చించి, మొక్కల నాటితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ సాంబ«శివరావు, ఏపీఓ శ్రీనివాస్, సర్పంచ్ కందాల రంగారెడ్డి, ఎంఈఓ వనం రాజారాములు, ఈసీ కరుణాకర్, ప్రవీణ్ ఉన్నారు. -
నింగికి నిచ్చెన!
-
సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి
కలెక్టర్ రఘునందన్‌రావు బాకారంలో అక్షరరాస్యత కేంద్రాల పరిశీలన మొయినాబాద్ రూరల్: బాకారం గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలంటే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి మొయినాబాద్ మండలం బాకారంలో వంద రోజుల సంపూర్ణ అక్ష్యరాస్యత సాధన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. అక్షరాస్యత కేంద్రాలను పరిశీలించిన అనంతరం మహిళలతో మాట్లాడారు. చదువు చేర్చుకుంటున్న మహిళలతో అక్షరాలు రాయించారు. సంపూర్ణ అక్షరాస్యతలో భాగంగా మహిళలు తమ ఇళ్ల ముందు ముగ్గులకు బదులు అక్షరాలు రాస్తున్నట్టు చెప్పారు. సర్పంచ్ సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదర్శ గ్రామం అంటే సీసీ రోడ్లు, మంచినీరు, బస్సు, పాఠశాల వంటివి మాత్రమే సరిపోవని, అందరూ చదువుకోవాలని సూచించారు. గ్రామంలో సాక్షరభారత్ ఆధ్వర్యంలో వంద రోజుల సంపూర్ణ అక్షరాస్యత కొనసాగించడంపై సర్పంచ్ సుధాకర్‌యాదవ్‌ను అభినందించారు. అందరూ చదువుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఽకార్యక్రమంలో సాక్షరభారత్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రాందాస్‌నాయక్, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీఓ సుభాషిణి, రోటరీక్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మండల వైస్ ఎంపీపీ పద్మ, సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ కిరణ్, సిబ్బంది శ్రీనివాస్, మీనాక్షి, జ్యోతి, వార్డు సభ్యులు తిరుపతిరెడ్డి, శాంతమ్మ, తదితరులు ఉన్నారు.a -
పుష్కర పనుల పరిశీలన
-
పంద్రాగస్టు వేడుకలు అనంతలోనే
► ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు ► పీటీసీని సందర్శించిన మంత్రులు రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు ఈసారి అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మంగళవారం మంత్రులు పల్లెరఘునాథరెడ్డి, పరిటాల సునీత నగరంలోని పీటీసీ మైదానాన్ని పరిశీలించారు. వేడుకలు పీటీసీలో నిర్వహించాలని రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని మంత్రులతో పాటు కలెక్టర్ శశిధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రిచే జెండా ఆవిష్కరణ, వీవీఐపీల వేదికలు, ప్రజలు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు, రంగులు వేయడం, స్టేడియం చుట్టూ హైమాస్ లైట్ల ఏర్పాటు, ప్రభుత్వ శకటాల ప్రదర్శన, పోలీసు సాయుధ దళాల మార్చ్ఫాస్ట్, స్వాతంత్య్ర∙సమరయోధులకు సన్మానం, ఉత్తమ అవార్డుల పంపిణీ తదితర వాటికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. చరిత్రలో ఒక తీపిగురుతుగా మిగిలిపోయేలా వేడుకలు నిర్వహిద్దామన్నారు. శానిటేషన్, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖరబాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, ఆర్డీఓ మలోలా, డీఎస్పీ మల్లికార్జునవర్మ, అర్అండ్బీ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధి పనులు పరిశీలించిన విదేశీ బృందం
కోలారు: తాలూకాలోని హుత్తూరు గ్రామ పంచాయతీలోని వివిధ గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనులను వివిధ దేశాల నుంచి వచ్చిన అధికారుల బృందం పరి శీలన జరిపారు. తాలూకాలో ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తించిన హుత్తూరు గ్రామ పంచాయతీకి విదేశీ అధికారుల బృందాన్ని జిల్లా పంచాయతీ డిప్యూటీ సెక్రెటరీ చలువరాజ్ స్వయంగా తీసుకువెళ్లి అభివృద్ధి పనులు చూపించారు. ఉపాధిహామీ, ఇందిరా ఆవాస్ యోజనా, ఎన్‌ఎల్‌ఆర్‌ఎం, స్వచ్ఛ భారత్ మిషన్ తది తర కార్యక్రమాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను విదేశీ బృందానికి చూపించారు. డ్రెయినేజీ, రహదారుల నిర్మాణం, అభివద్ధి పనులను విదేశీ బృందం ప ర్యవేక్షించారు. అదే విధంగా స్త్రీ శక్తి సంఘాల పనితీరు, రేషన్ దుకాణం నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళల బ్యాంకు నిర్వహణ గురించి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా కలిగి ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఈఓ నూర్ మహ్మద్ పనాలి జిల్లా పంచాయతీ ఆధ్వర్వంలో గ్రామ పంచాయతీలలో జరుపుతున్న అభివధ్ది పనుల గురించి తెలియ జేశారు. ఈ సందర్భంగా చిలీ, మలావి, కెన్యా, ఉగాండా, రష్యా తదితర దేశాలకు చెందిన 19 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాజధాని పొలాలు పరిశీలించిన ఉండవల్లి
ఈ ప్రకృతి అందాలు ఇక కనుమరుగేనా.. అంటూ నిట్టూర్పు తాడేపల్లి రూరల్: రాజధాని ప్రతిపాదిత ప్రాంతాలైన పెనుమాక, ఉండవల్లిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బుధవారం పర్యటించారు. అక్కడి పొలాలను పరిశీలించారు. ఉండవల్లి గ్రామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సంద ర్శించారు. పర్యటనలో భాగంగా ఇటీవల ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో పంట పొలాల్లో పంట సామాగ్రి దహనమైన ప్రాంతాలను పరిశీలించారు. రైతులు ఎంతమేర నష్టపోయారనే విషయాన్ని వాకబు చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామరైతులు అరుణ్‌కుమార్‌ను కలుసుకొని, తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. పంట పొలాలను ఇవ్వబోమన్న తమను పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న వైనాన్ని ఆయనకు వివరించారు. అయితే ఆయన మాత్రం వాటిపై ఏ మాత్రం స్పందించలే దు. పచ్చటి పొలాలు పూదోటలను చూసి, భవిష్యత్తులో ఈ ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేనా...? అని మధన పడుతూ తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌తో ఫొటోలు తీరుుంచుకున్నారు. తాను వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చానని ఈ క్రమంలో రైతుల ఆవేదన విని పంట పొలాల పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్నేహితులు ఉన్నారు. -
సినిమా థియేటర్ల పరిశీలన
సాలూరు: పట్టణంలోని సినిమా థియేటర్లను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గున్నయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. థియేటర్‌కు ప్రభుత్వ అనుమతులు, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, ప్రేక్షకుల రక్షణ తదితర అంశాలపై థియేటర్లలో పర్యవేక్షించారు. ముందుగా లక్ష్మి, శ్రీలక్ష్మి థియేటర్లను, అనంతరం శ్రీరామా, శ్రీవెంకటేశ్వర డీలక్స్లలో సౌకర్యాలను పరిశీలించడమే కాకుండా తాగునీటి ట్యాంకులలో నీటిని పరిశీలన నిమిత్తం సేకరించారు. అలాగే ఆయా థియేటర్లలోని క్యాంటీన్లలో విక్రయిస్తున్న చిరుతిళ్లను కూడాపరీక్షల నిమిత్తం తీసుకున్నారు. రోడ్లు భవనాలశాఖ, విపత్తుల నివారణశాఖ, మున్సిపల్ శానిటరీ విభాగం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో పాటు విద్యుత్‌శాఖ అధికారులు థియేటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులను, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. నివేదికను ప్రభుత్వానికి అంద జేస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ఆయనవెంట తహశీల్దార్ ఆనందరావు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు తదితరులున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు సినిమా థియేటర్లలోని క్యాంటీన్లలో అధిక ధరలకు కూల్‌డ్రింక్‌లు, ఇతర తినుబండారాలను విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు హెచ్చరించారు. సమాచారం మేరకు సాలూరు తహశీ ల్దార్ ఆనందరావుతో కలిసి క్యాంటీన్‌ను పరిళీలించారు.