సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి
కలెక్టర్ రఘునందన్‌రావు
బాకారంలో అక్షరరాస్యత కేంద్రాల పరిశీలన
మొయినాబాద్ రూరల్: బాకారం గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలంటే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి మొయినాబాద్ మండలం బాకారంలో వంద రోజుల సంపూర్ణ అక్ష్యరాస్యత సాధన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. అక్షరాస్యత కేంద్రాలను పరిశీలించిన అనంతరం మహిళలతో మాట్లాడారు. చదువు చేర్చుకుంటున్న మహిళలతో అక్షరాలు రాయించారు. సంపూర్ణ అక్షరాస్యతలో భాగంగా మహిళలు తమ ఇళ్ల ముందు ముగ్గులకు బదులు అక్షరాలు రాస్తున్నట్టు చెప్పారు. సర్పంచ్ సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదర్శ గ్రామం అంటే సీసీ రోడ్లు, మంచినీరు, బస్సు, పాఠశాల వంటివి మాత్రమే సరిపోవని, అందరూ చదువుకోవాలని సూచించారు. గ్రామంలో సాక్షరభారత్ ఆధ్వర్యంలో వంద రోజుల సంపూర్ణ అక్షరాస్యత కొనసాగించడంపై సర్పంచ్ సుధాకర్‌యాదవ్‌ను అభినందించారు. అందరూ చదువుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఽకార్యక్రమంలో సాక్షరభారత్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రాందాస్‌నాయక్, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీఓ సుభాషిణి, రోటరీక్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మండల వైస్ ఎంపీపీ పద్మ, సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ కిరణ్, సిబ్బంది శ్రీనివాస్, మీనాక్షి, జ్యోతి, వార్డు సభ్యులు తిరుపతిరెడ్డి, శాంతమ్మ, తదితరులు ఉన్నారు.a