సాక్షి, అమరావతి: మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల సమాచారం స్థానిక డీడీవోల లాగిన్‌లోనే అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ తెలిపారు. వాటిని సరిగ్గా పరిశీలించి.. టీచర్లకు సరైన సమాచారం అందించాలని డీడీవోలను శనివారం కమిషనర్ ఆదేశించారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల స్థితిగతులను తెలుసుకునేందుకు, ప్రొసీడింగ్స్ కాపీల కోసం దూరప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నంలోని కమిషనరేట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు.
బిల్లుల మంజూరు ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ డీడీవోలైన హెచ్‌ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోల లాగిన్‌లో పరిశీలించకపోవడం వల్ల సమస్య వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి స్క్రూటినీ రిపోర్టులు వచి్చన వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా మంజూరు ప్రొసీడింగ్స్ ఆమోదించి, సంబంధిత డీడీవోల లాగిన్‌లకు పంపిస్తున్నామన్నారు.
కానీ డీడీవోలు తమ లాగిన్‌లో బిల్లుల స్థితిగతులను సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల టీచర్లు వాటి కోసం దూరప్రాంతాల నుంచి తమ కార్యాలయానికి వస్తూన్నారని, టీచర్లు, ఉద్యోగులు వీటి కోసం కమిషనరేట్‌ను సంప్రదించే పరిస్థితి వస్తే.. డీఈవోలు, డీడీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన మెడికల్ రీయింబర్స్ బిల్లులను సంబంధిత డీడీవోలు ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని.. లాగిన్ ఫిజికల్ బిల్లులు స్వీకరించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment