Suresh Kumar
-
జూన్ 1 నుంచి మలయాళ చిత్రాల షూటింగ్ బంద్
‘‘మలయాళ చిత్రపరిశ్రమ(Malayalam film industry) తీవ్ర సంక్షోభంలో ఉంది... ఇలానే కొనసాగితే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది’’ అంటూ మాలీవుడ్ చిత్రసీమకు చెందిన పలు శాఖలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు కొన్ని మార్పులు చేయకపోతే... జూన్ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకొచ్చాయి.కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం... ఇవన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మలయాళ అగ్రనిర్మాత, కథానాయిక కీర్తీ సురేష్ తండ్రి సురేష్‌కుమార్(Suresh Kumar) ప్రకటించారు.60 శాతం పారితోషికాలకే... ‘‘సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఇలా 30 శాతం పన్ను విధింపబడుతున్న ఇండస్ట్రీ ఏదీ లేదు. ఈ 30 శాతంలో జీఎస్టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పన్ను రద్దు చేయాలి. అలాగే ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు బాగా పెరిగిపోయాయి.వాటిని తగ్గించాలి. సినిమాకి అవుతున్న బడ్జెట్లో 60 శాతం యాక్టర్ల పారితోషికాలకే కేటాయిస్తున్న పరిస్థితుల్లో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల సినిమా నిర్మాణం అనేది లాభదాయకంగా లేదు’’ అని సురేష్‌కుమార్ పేర్కొన్నారు.50 రోజుల్లో పూర్తి చేయకుండా... ఇంకా సినిమా నిర్మాణానికి అవుతున్న సమయం గురించి పేర్కొంటూ... ‘‘50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలకు కూడా 150 రోజులు చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపో తోంది. ఇలా తక్కువ రోజుల్లో పూర్తి చేయలేకపోవడంతో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తీవ్రతరం చేస్తోంది’’ అన్నారు. 176 చిత్రాలు... అపజయంపాలు... బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ సినిమా పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయని చెబుతూ – ‘‘2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నష్టం సినిమా కోసం తెరవెనుక పని చేస్తున్న నిపుణుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది’’ అని పేర్కొన్నారు సురేష్‌కుమార్. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం... వంటి విషయాల్లో సరైన పరిష్కారం లభించకపోతే జూన్ 1 నుంచి షూటింగ్స్, సినిమాకి సంబంధించిన ఇతర కార్యకలాపాలు నిలిపివేయడం ఖాయం అని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి... మలయాళ చిత్రాల షూటింగ్స్ ఆగుతాయా? చర్చలు సజావుగా జరిగి, పరిష్కార మార్గం వెతుక్కుని షూటింగ్స్ చేస్తారా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
పెళ్లికి వేళాయె
హీరోయిన్ కీర్తీ సురేష్ పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమైందట. తన స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కీర్తీ సురేష్ తండ్రి, నిర్మాత జి. సురేష్ కుమార్ ఓ మలయాళ మీడియాతో మాట్లాడుతూ– ‘‘కీర్తీకి 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్తోనే వివాహం జరగబోతోంది.గోవాలో ఈ పెళ్లి జరుగుతుంది’’ అని పేర్కొన్నారాయన. కాగా ఆంటోని తటిల్–కీర్తీలది డెస్టినేషన్ వెడ్డింగ్ అట. గోవాలోని ఓ రిసార్ట్‌లో డిసెంబరు 11 లేదా 12న వీరి వివాహం జరగనుందని టాక్. వివాహ వేడుకలను గోవాతో పాటు కేరళలోనూ జరిపేలా ΄్లాన్ చేశారనే వార్త కూడా వినిపిస్తోంది. ఇక ఆంటోని తటిల్ విషయానికొస్తే... ఆయన కేరళకు చెందిన వ్యాపారవేత్త. -
నన్ను చంపేందుకు.. పోలీసులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే స్కెచ్
-
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని సోమవారం వర్చువల్ మీటింగ్‌లో జిల్లా విద్యాశాఖాధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరీక్షల కోసం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు.పరీక్షల నిర్వహణ కోసం 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చించి పరీక్షా కేంద్రాలకు తగినన్ని బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండేలా చూడాలని సూచించారు.ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్స్ జారీ చేస్తామని చెప్పారు. మాల్ ప్రాక్టీసెస్‌కు పాల్పడితే ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్టు 1997 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. 0866–2974540 లేదా, dir-govexmas@yahoo.com లో సంప్రదించాలన్నారు.పరీక్షల నిర్వహణ తేదీలిలా..ఫస్ట్ లాంగ్వేజ్ 24–05–24సెకండ్ లాంగ్వేజ్ 25–05–24థర్డ్ లాంగ్వేజ్ 27–05–24మాథమెటిక్స్ 28–05–24ఫిజికల్ సైన్స్ 29–05–24బయోలాజికల్ సైన్స్ 30–05–24సోషల్ స్టడీస్ 31–05–24ఓఎస్ఎస్సీ పేపర్–1 01–06–24ఓఎస్ఎస్సీ పేపర్–2 03–06–24 -
‘సెలవుల్లో సరదాగా–2024’
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ‘సెలవుల్లో సరదాగా–2024’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆర్జేడీలు, డీఈవోలు, సమగ్ర శిక్షా ఏపీసీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా అమలు చేయాల్సిన కార్యక్రమాల మార్గదర్శకాలను విడుదల చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు క్రీడలు, వృత్తి నైపుణ్యం, సృజనాత్మక కళలపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను కోరారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, డైట్ ప్రిన్సిపాళ్లతో ‘వుయ్ లవ్ రీడింగ్’ పోటీలను నిర్వహించాలన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, స్థానిక కమ్యూనిటీ సంస్థల సహకారంతో ఈ వేసవి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. -
ఒడిశాలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బహిష్కరణ
భువనేశ్వర్: క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో తమ సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌట్రేను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని సురేష్‌కుమార్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు. జటానీ నియోజకవర్గం నుంచి సురేష్ కుమార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయన తనయుడు మన్మథ్ రౌట్రే బిజూ జనతాదళ్ అభ్యరి్థగా భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. కుమారుడిగా మద్దతుగా నిలుస్తున్నారని, బీజేడీ నేతలతో వేదికను పంచుకుంటున్నారని సురేష్ కుమార్‌పై ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్‌తో తనది ఐదు దశాబ్దాల అనుబంధమని, తనను బహిష్కరించినా చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, బహిష్కరణపై అధిష్టానంతో మాట్లాడతానని సురేష్‌కుమార్ స్పందించారు. -
డీఎస్సీ–2024 నిర్వహణపై ‘ఈసీ’కి లేఖ
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ–2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. -
విద్యార్థులు భవిష్యత్తును మార్చే సీఎం మన జగన్..ఐఏఎస్ సురేష్ కుమార్
-
నిబంధనల ప్రకారమే డీఎస్సీ
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2024లో ప్రతి అంశంలోను పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని, అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా జీవో నం.77 ప్రకారం రోస్టర్ పాయింట్లు చూపించామని చెప్పారు. ప్రస్తుత డీఎస్సీని 2018 డీఎస్సీ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తు నుంచి పరీక్ష వరకు అప్పటి నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక డీఎస్సీ అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేలా కథనం ప్రచురించిందన్నారు. రోస్టర్ విధానం తెలియకుండా ఆ పత్రిక ప్రచురించిన కథనం డీఎస్సీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేసేలా ఉందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన జీవో 77 ప్రకారం అన్ని రోస్టర్లను చూపించామని, కానీ, బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఆ సంవత్సరం రిక్రూట్మెంట్ రోస్టర్లను అలాగే కొనసాగించాలని అన్నారు. జీవో ప్రకారం పాయింట్లు ప్రోస్పెక్టివ్గానే ఉంటాయిగానీ, రెట్రోస్పెక్టివ్‌గా ఉండదని చెప్పారు. ఆయన చెప్పిన వివరాలివీ.. ♦ మొదటి దరఖాస్తుదారులకు ఈడబ్లు్యఎస్ కోటా కనిపించలేదనడంలోనూ వాస్తవం లేదు. దరఖాస్తులు ప్రారంభమైన తేదీ నుంచే ఆప్షన్లో ఈడబ్లు్యఎస్ కోటా ఉంది. ఈనాడులో రాసింది తప్పు. ♦ పరీక్ష ఫీజుపైనా తప్పుగా రాశారు. వాస్తవానికి అభ్యర్థి అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 2018 డీఎస్సీ నిబంధనే. ♦ స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ (ఓపెన్) ఇవ్వవచ్చు. ఒకసారి ఈ ఆప్షన్ ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థి నియామకం కూడా ఎంచుకున్న జిల్లాకే పరిమితం అవుతుంది. ఇదే విధానం జోనల్ పోస్టులకూ వర్తిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకోవాలి. ♦ డీఎస్సీ వెబ్‌సైట్‌కు సర్వర్ సమస్య ఎప్పుడూ లేదు. ఇప్పటివరకు టెట్ – 2024కు 3,17,950 దరఖాస్తులు అందాయి. డీఎస్సీకి 3,19,176 మంది నమోదు చేసుకున్నారు. సర్వర్ సమస్య ఉంటే ఇంత మంది దరఖాస్తు చేసుకోలేరు. అభ్యర్థులు కొందరికి ఫీజు చెల్లించే సమయంలో ఇంటర్నెట్ సమస్య ఉత్పన్నమై ఉంటుంది. దరఖాస్తు అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించాం. ఎవరైనా ఫీజు చెల్లించి ‘జర్నల్ నంబర్’ రాకుంటే చెల్లించిన ఫీజు మొత్తం వారి బ్యాంకు ఖాతాలో ఐదు రోజుల్లో తిరిగి జమ అవుతుంది. ♦ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఫిబ్రవరి 12 నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బుధవారం వరకు మొత్తం 2,40,119 మంది ఫీజు చెల్లించారు. ♦సెంటర్ టెట్ (సీటెట్) విషయంలో కొందరికి అవగాహన లేదు. వాస్తవానికి ఏపీ విద్యా శాఖ వద్ద సీటెట్ డేటాబేస్ ఉండదు. సీటెట్ అభ్యర్థులు మొత్తం మార్కులు, గరిష్ట మార్కులను వారే స్వయంగా నమోదు చేయాలి. ఏపీ టెట్ అభ్యర్థులు మాత్రం హాల్ టికెట్ నంబరు నమోదు చేస్తే సరిపోతుంది. అభ్యర్థులకు ఎడిట్ అవకాశం దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ లేకండా 30 వేల మంది అవస్థలు పడుతున్నారని అనడం కూడా సరికాదు. దరఖాస్తు సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పులు జరిగితే సవరించే అవకాశం లేదని బులెటిన్‌లోనే పేర్కొన్నాం. కానీ అభ్యర్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకొనే అవకాశం కల్పించాం. అభ్యర్థులు మొదట వెబ్సైట్లో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాత జర్నల్ నంబర్, మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ పొందవచ్చు. దీనిద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకుని తిరిగి అప్లై చేసుకోవచ్చు. ఇందులో అభ్యర్థి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అన్ని అంశాలూ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ తప్పుగా ఉంటే పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్స్‌లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకునే అవకాశం ఉందని సురేష్ కుమార్ తెలిపారు. 25 వరకు ఫీజు చెల్లింపు గడువు డీఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించే గడువును పెంచినట్టు పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈనెల 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని, ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే, హెల్ప్ డెస్క్ సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించామని తెలిపారు. -
7, 10 తరగతులకు ‘ఈఈఎంటీ’ ప్రతిభా పరీక్ష
సాక్షి, అమరావతి: విద్యార్థుల్లో ప్రతిభను పోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫనీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ‘ఈఈఎంటీ–2024’ (ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్) పరీక్ష తోడ్పడుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఈఈఎంటీ షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతి విద్యార్థులకు గత 11 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఈ ఉచిత టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలను వెలికి తీసేలా ఈ పోటీలు ఉంటాయన్నారు. జనవరి 23న ప్రిలిమనరీ, 31న మెయిన్స్ పరీక్ష ‘కోడ్ తంత్ర’ సాఫ్ట్వేర్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. 162 మంది విజేతలకు రూ.9 లక్షల బహుమతులు 7, 10 తరగతుల్లో డిసెంబర్ వరకు పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జిపై మరో 20 శాతం ప్రశ్నలు ఉంటాయి. కాగా, ఈ పోటీల్లో మొత్తం 162 మంది విజేతలకు దాదాపు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. మరో 1,752 మందికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు ప్రకటించారు. ఏడో తరగతిలో రాష్ట్ర స్థాయి మొదటి విజేతకు రూ.20 వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10 వేలు బహుమతిగా అందిస్తారు. ఈ పరీక్షకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఎపిఫనీ సంస్థ ప్రతినిధి డి.నభీ కోఆర్డినేటర్లుగాను, వి.ఎస్.సుబ్బారావు పరీక్షా కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.https:// educationalepiphany.org/eemt 2024/registration.php లింక్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు https:// educationalepiphany.org/ వెబ్సైట్లో గాని, 96667 47996 నంబర్‌లోగాని సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ సమావేశంలో ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకటరావు, ఉపాధ్యక్షుడు హేమచంద్ర, కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజీ!
కాళేశ్వరం/సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. ఘటన జరిగిన వెంటనే సాగునీటిశాఖ అధికారులు, ఇతర నిపుణులు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది పరిశీలించేందుకు ప్రయత్నించారు. ఆదివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్ధ మేనేజర్ సురేశ్‌కుమార్ తదితరులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటిమట్టం తగ్గితే ప్రమాదమేంటి? దానికి కారణమేంటి? అన్నది తెలుస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఉన్నట్టుండి నీటిని వదలడంతో గోదావరిలో, తీరం వెంట మేపుతున్న గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయని.. వ్యవసాయ మోటార్లు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు. వంతెనపై రాకపోకలు నిలిపివేత బ్యారేజీ వంతెనపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య రాకపోకలను శనివారం రాత్రి నుంచే నిలిపివేశారు. బ్యారేజీ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా మట్టిపోసి, బారికేడ్లు పెట్టి ఎవరూ రాకుండా చూస్తున్నారు. కుంగిన ప్రాంతం వద్దకు వెళ్లడానికి మీడియాను కూడా అనుమతించడం లేదు. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్లు బ్యారేజీని పరిశీలించడానికి వేర్వేరు సమయాల్లో వచ్చారు. తొలుత వారిని అడ్డుకున్న పోలీసులు తర్వాత బ్యారేజీ పరిశీలనకు అనుమతించారు. బ్యారేజీకి ప్రమాదం లేదు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరిస్థితిని సమీక్షించాక ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్అండ్టీ సంస్థ మేనేజర్ సురేశ్‌కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి బ్యారేజీ వద్ద పెద్ద శబ్ధం వచ్చిందని, ఇంజనీర్లు వెళ్లి పరిశీలించగా బ్యారేజీ పియర్ కుంగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. 7వ బ్లాక్‌లోని 20వ పియర్ దెబ్బతిన్నదని.. అయితే పక్కన ఉన్న పియర్లపై దీని ప్రభావం ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని.. నెలన్నర రోజుల్లో పూర్వ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ నిర్వహణ బాధ్యతను ఎల్అండ్టీ సంస్థ చూస్తోందని.. ప్రస్తుతం మరమ్మతుల బాధ్యతనూ చేపడుతుందని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. రెండు రోజుల్లో బ్యారేజీలోని నీటిని ఖాళీ చేస్తామని.. కుంగిన చోట ఏం జరిగింది? సరిచేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి అన్నది తేల్చుతామని వివరించారు. ఈ ఘటనలో దుష్ట శక్తుల హస్తం ఏదైనా ఉందో, లేదో తెలుసుకునేందుకు మహదేవపూర్తోపాటు మహారాష్ట్ర వైపు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రపంచ రికార్డు వేగంతో నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా గోదావరి నదిపై రూ.1,849 కోట్ల వ్యయంతో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీని నిర్మించారు. ఎల్ అండ్ టీ సంస్థ కేవలం 24 నెలల్లో బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు, దీనికి 87 హైడ్రో మెకానికల్ రేడియల్ గేట్లు ఏర్పాటు చేశారు. ఒక్కోటీ 110 మీటర్ల పొడవు, 4 నుంచి 6 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తుతో నిర్మించిన పియర్స్ (గేట్ల మధ్య పిల్లర్లలా ఉండే కాంక్రీట్ నిర్మాణం) మధ్య ఈ గేట్లను అమర్చారు. బ్యారేజీ నిర్మాణంలో భాగంగా ఒకదశలో కేవలం 72 గంటల్లోనే ఏకంగా 25,584 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించినట్టు నిర్మాణ సంస్థ తమ వెబ్సైట్లో పేర్కొనడం గమనార్హం. నేడు మేడిగడ్డకు డ్యాం సేఫ్టీ బృందం బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని ‘సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ నిపుణుల బృందం సోమవారం పరిశీలన జరపనుంది. కుంగిన ప్రాంతాన్ని సందర్శించి జరిగిన నష్టంపై అంచనా వేయనుంది. ఆ బృందం సిఫార్సుల ఆధారంగా మరమ్మతు పనులు చేపడతారు. వాస్తవానికి బ్రిడ్జిలు, బ్యారేజీలను బ్లాకులుగా నిర్మిస్తారు. పునాదుల పరంగా ఒక బ్లాక్‌కు మరో బ్లాక్‌తో సంబంధం ఉండదు. దీనివల్ల ఏదైనా బ్లాక్‌లో విపత్తు/ప్రమాదం ఎదురైతే మొత్తం బ్రిడ్జి/బ్యారేజీ దెబ్బతినకుండా సదరు బ్లాక్ వరకే నష్టం పరిమితం అవుతుంది. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా నిర్మించారు. తెలంగాణ వైపు నుంచి వాటికి నంబరింగ్ ఇచ్చారు. అలా మహారాష్ట్ర వైపు చివరన ఉన్నది ఏడో బ్లాక్. దీనిలోని 20వ నంబర్ పియర్ ప్రస్తుతం కుంగిపోయింది. దీని ప్రకారం ఏడో బ్లాక్ వరకు నష్టం పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని.. పునాదికి నష్టం జరిగితే ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల ‘డిఫెక్ట్ లయబిలిటీ (లోపాలుంటే సరిచేయాల్సిన బాధ్యత)’ సమయం ఇంకా పూర్తి కానందున.. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీనే మరమ్మతుల వ్యయం భరించాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీలో నీళ్లను నిల్వచేసే అవకాశం ఉండదని అంటున్నాయి. -
ఆన్లైన్లోనే ప్రైవేటు పాఠశాలలకు అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు ఆన్లైన్లో మాత్రమే అనుమతి మంజూరు చేస్తామని, ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశించారు. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలు, సూచనలు, సలహాలపై మంగళవారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయవాడ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రైవేటు పాఠశాలలకు అనుమతి, గుర్తింపునకు సంబంధించి ఆన్లైన్ ద్వారా సకాలంలో చలానా చెల్లింపులు, పోర్టల్‌లో సమస్యలు, ప్రైవేట్ ఉపాధ్యాయులు–సిబ్బంది సమస్యలు, పీఎఫ్, ఆరోగ్య బీమా, ఈఎస్ఐ కార్డు, ఉద్యోగుల జీతాల చెల్లింపు, గుర్తింపు పొడిగింపు, వార్షిక పరిపాలన నివేదిక, ఫీజులు, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాల నిర్వహణపై చర్చించారు. ఇతర సంస్థల ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) వంటివి అప్లోడ్ చేసేందుకు వీలుగా విద్యాశాఖ పోర్టల్‌ను పునరుద్ధరిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రతి ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన వార్షిక పరిపాలన నివేదికను సంబంధిత విద్యాశాఖాధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పి.పార్వతి, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయినికి అభినందన అనకాపల్లి జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి ఈనెల 5 నుంచి 9 వరకు నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ పోటీల్లో పాల్గొని నాలుగు పతకాలు సాధించారు. ఆమెను ఈ సందర్భంగా సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ సురేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల విద్య డైరెక్టర్ పి.పార్వతి, ఏపీ టెట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మేరీ చంద్రిక, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు పాల్గొన్నారు. -
ఎస్పీని బదిలీ చేయాలని బీఎస్పీ పట్టు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎస్పీ సురేశ్‌కుమార్‌ను బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పట్టుబట్టడం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మూడురోజుల క్రితం ఆర్ఎస్పీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సురేశ్‌కుమార్ ఎస్పీగా కొనసాగితే జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ ప్రెస్‌మీట్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ ఐపీఎస్ అధికారి.. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారిపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో అటు పోలీస్‌శాఖ, రాజకీయ, వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఎస్పీ సురేశ్‌కుమార్ స్పందిస్తూ.. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను తాను సన్మానించిన ఫొటోలు పాతవని, షెడ్యూల్ విడుదలయ్యాక పక్కాగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్నట్లు ఎస్పీ సురేశ్‌కుమార్ వివరించారు. అయితే బీఎస్పీ మాత్రం అందుకు సంతృప్తి చెందక ఎస్పీని బదిలీ చేయాలంటూ పట్టుబడుతోంది. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అధికారవర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆరా? ఎస్పీని బదిలీ చేయాలని ఫిర్యాదు రావడం, అందులో కొన్ని ఆధారాలు కమిషన్‌కు ఇవ్వడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. అలాగే రాష్ట్ర పోలీస్‌శాఖ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటికే సమాచారం తీసుకుంది. ఈ ఫిర్యాదులో వాస్తవమెంత? అనే కోణంలో ఆధారాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సిర్పూర్ ఎమ్మెల్యేగా బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్పై రాజకీయ కోణంతో పాటు ఇతర కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్షణం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ష న్ కమిషన్ అధీనంలోనే పని చేయాల్సి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌తో పాటు ఎస్పీ కూడా కమిషన్ ఆదేశాలు పాటించాల్సిందే. బదిలీలు, ఇతర చర్యలు తీసుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్‌లు అధికార పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పది మంది ఐపీఎస్‌లు, నలుగురు కలెక్టర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తప్పించి బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో వేరే అధికారులను నియమించింది. ఈ క్రమంలో జిల్లాలో ఎస్పీ పైనా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ జిల్లా ప్రజల్లో నెలకొంది. -
వినోదం..యాక్షన్
త్రిగుణ్ హీరోగా సురేష్ కుమార్ ఆకిరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గంజామ్’. ప్రణమ్ దేవరాజ్, హ్రితికా శ్రీనివాస్, విస్మయ, దేవరాజ్, రఘు కుంచె, అనితా చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఏవీఆర్ ఆర్ట్స్, ఏయు–ఐ బ్యానర్స్‌పై రత్నాజీ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ– ‘‘నేను చేసున్న 23వ సినిమా ‘గంజామ్’. ఎప్పుడూ నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు. ‘‘వినోదం, యాక్షన్‌తో పాటు సామాజిక స్పృహ కలిగిన సినిమా ‘గంజామ్’. నాకు అవకాశం ఇచ్చిన రత్నాజీగారికి ధన్యవాదాలు. త్రిగుణ్‌కి ఈ సినిమా మరో మంచి హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు సురేష్ కుమార్ ఆకిరి. ‘‘ఒక మంచి ప్రయత్నం మా ‘గంజామ్’. ఈ సినిమా అందర్నీ ఆలోచింపజేసేలా ఉంటుంది’’ అన్నారు రత్నాజీ. ‘‘కథా బలం ఉన్న ‘గంజామ్’ విజయం సాధిస్తుంది’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు, నటుడు రఘు కుంచె. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
స్థానికంగానే టీచర్ల మెడికల్ బిల్లుల డేటా పరిశీలన
సాక్షి, అమరావతి: మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల సమాచారం స్థానిక డీడీవోల లాగిన్‌లోనే అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ తెలిపారు. వాటిని సరిగ్గా పరిశీలించి.. టీచర్లకు సరైన సమాచారం అందించాలని డీడీవోలను శనివారం కమిషనర్ ఆదేశించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల స్థితిగతులను తెలుసుకునేందుకు, ప్రొసీడింగ్స్ కాపీల కోసం దూరప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నంలోని కమిషనరేట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. బిల్లుల మంజూరు ప్రక్రియను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ డీడీవోలైన హెచ్ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోల లాగిన్‌లో పరిశీలించకపోవడం వల్ల సమస్య వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి స్క్రూటినీ రిపోర్టులు వచి్చన వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా మంజూరు ప్రొసీడింగ్స్ ఆమోదించి, సంబంధిత డీడీవోల లాగిన్లకు పంపిస్తున్నామన్నారు. కానీ డీడీవోలు తమ లాగిన్‌లో బిల్లుల స్థితిగతులను సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల టీచర్లు వాటి కోసం దూరప్రాంతాల నుంచి తమ కార్యాలయానికి వస్తూన్నారని, టీచర్లు, ఉద్యోగులు వీటి కోసం కమిషనరేట్‌ను సంప్రదించే పరిస్థితి వస్తే.. డీఈవోలు, డీడీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన మెడికల్ రీయింబర్స్ బిల్లులను సంబంధిత డీడీవోలు ఆన్లైన్లోనే సమర్పించాలని.. లాగిన్ ఫిజికల్ బిల్లులు స్వీకరించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలు అమలు చేస్తోందని పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్ చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 259 పాఠశాలలు సీబీఎస్ఈకి అనుబంధంగా ఉంటే ఇప్పుడు 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యావిధానం అమలు చేయడం సీబీఎస్ఈ చరిత్రలోనే మైలురాయిగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ నిర్మాణాత్మక బోధన అంశంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌కు నాలుగు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్కరణల్లో భాగంగా సీబీఎస్ఈ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యతో పాటు సరైన మూల్యాంకనం, విద్యార్థుల్లో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సమైక్యంగా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారని చెప్పారు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు, విద్యావిధానాలను పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (క్రిస్‌్ప) కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, మోడల్ స్కూల్ కార్యదర్శి ఎం.వి.కృష్ణారెడ్డి, వివిధ ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల ప్రిన్సిపల్స్, ఏపీ, తెలంగాణ ఎస్సీఈఆరీ్ట, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్, రూమ్ టూ రీడ్, అజీమ్ప్రేమ్జీ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నకిలీ సంస్థ
సాక్షి, అమరావతి: హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ అసోసియేషన్‌కు, పాఠశాల విద్యాశాఖకు ఎటువంటి సంబంధం లేదని ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కొందరు వ్యక్తులు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేస్తున్నారని, నిరుద్యోగ యువత వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ తరహా మోసపూరిత కార్యకలాపాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని అనధికార సంస్థలు స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన ఒకే ఒక్క సంస్థ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని, ఈ సంస్థ న్యూఢిల్లీలోని నేషనల్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉందని తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్ కూడా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ అసోసియేషన్ అనేది నకిలీ సంస్థ అని, రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఇతర కార్యాలయాలు ఆ సంస్థకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టంచేశారు. -
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్! పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులను తీసివేయనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 3నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 19 నుంచి మూల్యాంకనం ఈ నెల 19నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో తీసుకోవాలి్సన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ పలు మార్గదర్శకాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో (పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లా కేంద్రాలు మినహా) మూల్యాంకనకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు మార్గదర్శకాలతో కూడిన బుక్లెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అందించింది. ఆయా జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు అప్పగించింది. మూల్యాంకనం సందర్భంగా అందులో పాల్గొనే సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులను తాజా ప్రొసీడింగ్స్‌లో కమిషనర్ వివరించారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత డీఈవోలదేనని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు ఇవీ ♦ మూల్యాంకనంలో పాల్గొనే అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 40 సమాధానాల పత్రాలను మాత్రమే మూల్యాంకన చేయాలి ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసే సమాధాన పత్రాలన్నిటినీ స్పెషల్ అసిస్టెంట్లు పూర్తిగా పరిశీలన చేసి మార్కులను లెక్కించాలి. ♦ పరీక్ష రాసిన అభ్యర్థి నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానాలు రాశాడా అన్న అంశాన్ని స్పెషల్ అసిస్టెంట్లు గమనించాలి. ♦ ఒకవేళ నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటే.. వాటిని మూల్యాంకనం చేసి మార్కులు వేశారా? లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలన చేయాలి. ♦ అదనంగా రాసిన ప్రశ్నల సమాధానాలను అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకన చేసి మార్కులు ఇచ్చినట్టయితే ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విద్యార్థికి నిర్ణీత ప్రశ్నల సంఖ్య మేర మార్కులను కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల సమాధానాలను పరిహరించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లోని కనీసం 20 ఆన్సర్ స్క్రిప్టులను ఆయా కేంద్రాల్లోని చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలించాలి. రోజులో మొత్తంగా 60 వరకు ఆన్సర్ స్క్రిప్టులను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు మూల్యాంకన పూర్తయిన రెండు సమాధానాల పత్రాలను పరిశీలించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 45 పత్రాలను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాల్లో క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 20 పత్రాలను పరిశీలించాలి. పొరపాట్లు జరిగితే చర్యలే ♦ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం, ఫొటోస్టాట్ కాపీలను అందించడం వంటివి ఉన్నందున మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల సమయంలో ఏ విధమైన మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వరుసగా స్పెషల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ♦ పొరపాట్లు చేసిన వారిపై నిబంధనల ప్రకారం పెనాల్టీ సహా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. ♦ మూల్యాంకనాన్ని ఎలాంటి పొరపాట్లు, ఇతర అవాంఛిత అంశాలకు తావులేని విధంగా ప్రశాంతంగా ముగించేందుకు డీఈవోలు చర్యలు తీసుకోవాలి. ♦ జిల్లాస్థాయి పరిశీలకులు మూల్యాంకన కేంద్రాలను తొలి రెండు రోజులు తప్పనిసరిగా సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. -
ట్యాబులపైనా వంకర రాతలు.. ప్రభుత్వ ప్రయత్నాలను జీర్ణించుకోలేని ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద చిన్నారులకు ఇచ్చిన ట్యాబులపైనా ఈనాడు తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీర్ణించుకోలేక ఈనాడు తన దుష్ట నైజాన్ని ‘బడి ట్యాబుల్లో అన్నీ లభ్యం’ వార్త ద్వారా బయటపెట్టింది. రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థులకు అందించిన ప్రతి ట్యాబులోనూ సెక్యూరిటీ ప్యాచ్ వేశారు. అయితే, ఎక్కడో జరిగిన చిన్న ఘటనను పెద్దగా చూపిస్తూ ఈనాడు విషప్రచారం చేస్తోంది. ప్రభుత్వ ఉన్నత లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నానికి ఒడిగడుతోంది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ తీవ్రంగా ఖండించాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ కూడా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు.. ‘బడి ట్యాబుల్లో అన్నీ లభ్యం’ వార్తను ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతాశయంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, 8వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబులను పంపిణీ చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీపడాలని, వారు ఉన్నత శిఖరాలు చేరాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. అయితే, ఈ లక్ష్యాన్ని నీరుగార్చాలని ఎక్కడో జరిగిన చిన్నచిన్న విషయాలకు పత్రికాముఖంగా బురదజల్లే కార్యక్రమం జరుగుతోంది. నిజానికి.. ట్యాబుల విషయంలో ప్రభుత్వం ముందే అనేక రక్షణ చర్యలు తీసుకుంది. అవి ఏమిటంటే.. ♦ ప్రతీ ట్యాబ్‌లో సెక్యూరిటీ ప్యాచ్ వేయడం.. ♦ ప్రతీ ట్యాబ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంటు పర్యవేక్షణలో ఉంటుంది. ♦ ప్రతీ ట్యాబు విధిగా ఇంటర్నెట్కు ఒకసారి కనెక్ట్ చేయాలి. ♦ అలా చేయడంవల్ల ట్యాబుల్లో ఏమైనా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కాకపోతే అప్డేట్ అవుతుంది. ♦ ఎక్కడైనా ట్యాబులో ఏదైనా ఎర్రర్ వస్తే వార్డు వలంటీర్ ఆ ట్యాబు గురించి సంబంధిత శాఖ వారితో సంప్రదించి దానిని సరిచేసి రెండు పనిదినాల్లో విద్యార్థికి అందజేసే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకు సంబంధించి జీఓ–29 ద్వారా ఇలాంటి వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సమస్య ఉన్న ట్యాబులను గుర్తించి ఇప్పటికే సరిచేసి ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతోంది. ♦ కొన్ని సందర్భాల్లో ట్యాబులను మొబైల్ రిపేర్షాపులకు తీసుకెళ్లి బలవంతంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయిస్తున్నారు. అలాంటి ట్యాబుల వివరాలు, విద్యార్థి పేరు, మండలం, స్కూలుతో సహా ఇతర వివరాలు విద్యాశాఖకు వెంటనే తెలుస్తుంది. సదరు స్కూలు హెడ్మాస్టర్కు వెంటనే సమాచారం అందించి నెట్‌కు కనెక్ట్ చేయించి ట్యాబును లాక్ చేయిస్తున్నాం. ♦ ఇక 8వ తరగతి బోధించే ప్రతి ఉపాధ్యాయునికీ ట్యాబ్ ఉపయోగించే విధానం, చిన్నచిన్న ఎర్రర్లను ఏ విధంగా సరిచేసుకోవాలనే అంశాలపై పూర్తిస్థాయి శిక్షణను ప్రారంభిస్తున్నాం. ♦ ఇలా ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ట్యాబులు వినియోగించుకుని జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇలాంటి సత్సంకల్పాన్ని నీరుగార్చే ప్రయత్నాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ తీవ్రంగా ఖండిస్తోంది’. -
ఆలస్యంగా వస్తే అనుమతి లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. 9.30 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన ఎవరినీ అనుమతించబోమన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్క్యులర్ విడుదల చేశారు. www.bse.ap.gov.in లో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను చూడొచ్చన్నారు. అన్ని పరీక్షలను నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులకు సూచనలు.. ♦ హాల్‌టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్మాస్టర్/ప్రిన్సిపాల్‌ని సంప్రదించాలి. ♦ విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకపోతే పరీక్షకు అనుమతించరు. ♦ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, కెమెరాలు, ఇయర్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. ఎవరైనా వాటిని లోపలకు తీసుకువెళ్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ♦ విద్యార్థులు ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలను వేర్వేరు సమాధాన పత్రాల్లో రాయాలి. ఈ రెండింటి కోసం వేర్వేరుగా 12 పేజీల సమాధానాల బుక్లెట్లు ఇస్తారు. ♦ విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో మినహా 12:45 గంటల వరకు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు. ♦ ప్రశ్నపత్రాల లీక్ అని తప్పుడు, నిరాధారమైన పుకార్లకు పాల్పడకూడదు. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ♦ పరీక్ష సమయంలో అక్రమాలకు పాల్పడేవారిపై, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయి. అలాంటివారిని తదుపరి పరీక్షలు రాయనీయరు. ♦ విద్యార్థి పేరు, రోల్ నంబర్, ఇతర వివరాలను 24 పేజీల జవాబు బుక్లెట్, మ్యాప్ లేదా గ్రాఫ్ షీట్‌లోని ఏ పేజీలోనూ రాయకూడదు. ♦ కాగా పరీక్షలు జరిగే రోజుల్లో ఎంఈవోలు, హెచ్ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ల విధులపైనా సూచనలు జారీ చేశారు. -
9 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల 9 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ –2 కాంపోజిట్ పేపర్ మినహాయించి అన్ని పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ –2 కాంపోజిట్ పేపర్ ఒక్కటే ఉదయం 9.30 గంటల నుంచి 11.15 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ బుధవారం షెడ్యూళ్లను ప్రకటించారు. అలాగే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్–4 పరీక్షలను కూడా ఇవే తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి విద్యార్థులు సాధించిన మార్కులను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్‌లో నిర్ణీత గడువులోగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. -
తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ: కెమెరాలో బంధించే కొన్ని ఫొటోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని ఎప్పుడు చూసుకున్న జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేస్తాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫొటో మాత్రం మరింత ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇది తండ్రీకొడుకులు తమ విధి నిర్వహణలో భాగంగా ఒకరికొకరు ఎదురైనపుడు తీసుకున్న ఫొటో. వివరాల్లోకెళ్తే.. సురేష్ కుమార్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేసిన ఈ చిత్రంలో ఉన్న తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తుండగా.. కుమారుడు అదే రైల్వే శాఖలో ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్‌గా ఉద్యోగం సాధించాడు. తండ్రీకొడుకులు డ్యూటీలో ఉన్న సమయంలో ఒక రోజు అకస్మాత్తుగా ఎదురెదురు రైళ్లలో తారసపడ్డారు. ఆ క్షణంలో తీసుకున్న సెల్ఫీ ఫొటోనే ఇది. ఇందులో తండ్రీకొడుకులు ఇద్దరు కూడా తమ యూనిఫామ్ ధరించి ఉన్నారు. अजब ग़ज़ब सेल्फ़ी पिता रेलवे में गार्ड है और बेटा टीटी है । जब दोनो की ट्रेन अगल-बग़ल से गुजरी तो एक सेल्फ़ी का लम्हा बन गया ❤️ pic.twitter.com/Zd2lGHn7z3 — Suresh Kumar (@Suresh__dhaka29) June 15, 2022 అయితే ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘తండ్రీకొడుకులు ఉద్యోగాలు చేయడం సాధారణమే. కానీ ఒకే శాఖలో రెండు విభిన్న హోదాల్లో పనిచేయడం, వారు ఇలా తారస పడటం ఎంతో అద్భుతం’ అంటూ కాంమెంట్ చేస్తున్నారు. నెట్టింట్లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 50వేల మందికి పైగా లైక్ చేశారు. Great moments. — Abinash Kumar Chatterjee (@AbinashKumarCh1) June 16, 2022 చదవండి: (ఆ ఏటీఎం మిషీన్ వద్దకే క్యూ కడుతున్న జనాలు! ఎందుకో తెలుసా!) -
Karnataka: జూలై 19–22 టెన్త్ పరీక్షలు
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షలకు సిద్ధమైంది. మంత్రి సురేశ్‌కుమార్ సోమవారం విధానసౌధలో వివరాలను వెల్లడించారు. జూలై 19న గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పరీక్ష జరుగుతుంది. జూలై 22న భాషా సబ్జెక్ట్ పరీక్ష ఉంటుంది. 8.76 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి పరీక్ష రాయనున్నారు. 7,306 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సాంఘిక శాస్త్రం, సైన్స్, గణితాలకు కలిసి ఒక పరీక్ష, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లకు ఒక పరీక్ష జరుగుతుందని మంత్రి తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. చదవండి: దివ్యాంగుల వసతి గృహంలో కీచక హెచ్ఎం.. -
చచ్చిపోవాలనే ఆలోచన మానుకో: మంత్రి
బెంగళూరు : నగరంలోని సోమసుందరపాల్యకు చెందిన 17 ఏళ్ల బాలుడు అక్కడి హెచ్ఆర్ఎస్ లేఅవుట్లోని ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. స్కూలు ఫీజు కట్టకపోవటంతో అతడ్ని తోటి విద్యార్థుల ముందు తిట్టడమే కాకుండా పరీక్షలు రాయటానికి ఒప్పుకోలేదు యజమాన్యం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని కాపాడారు. అయితే ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. బాలుడి ఆత్మహత్యాయత్నం విషయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్ దృష్టికి వెళ్లింది. చలించిపోయిన ఆయన ఏకంగా బాలుడి ఇంటికే వెళ్లారు. (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర) గురువారం ఆయన బాలుడితో మాట్లాడుతూ.. ‘‘ నీకేమైనా అయితే మీ అమ్మానాన్న, సోదరి ఏమైపోతారో ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా నువ్వు ఎదురించగలగాలి. చచ్చిపోవాలనే ఆలోచనలు మానుకోవాలి. వలస కార్మికుడి కుమారుడు మహేష్ సంగతే చూడు! ఎస్ఎస్ఎల్సీలో అత్యధిక మార్కులు సాధించాడు. అతడి చదువును కొనసాగించడానికి అవసరమైన సహాయం చేయటానికి చాలా మంది ముందుకొచ్చారు. జీవితం అంటే అలా ఉంటుంది. కష్టాలు వచ్చినపుడు గుండె ధైర్యం కోల్పోకూడదు’’ అని ధైర్యం చెప్పాడు. -
ఆశించిన డబ్బు రాలేదని..
సాక్షి, హైదరాబాద్: బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) శాస్త్రవేత్త సురేష్ కుమార్ హత్య కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు ఛేదించారు. అమీర్‌పేటలోని ఘటనాస్థలి వద్ద సేకరించిన ఆధారాలతో నిందితు డు జనగామ శ్రీనివాస్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి జరిగిన ఈ హత్య కేసు వివరాలను డీసీపీ సుమతి, ఏసీపీ తిరుపత న్నతో కలసి పోలీసు కమిషనర్ అంజనీకుమార్.. బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాల యంలో శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఎన్ఆర్ఎస్సీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎస్.సురే ష్ కుమార్ (56) అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్లో 20 ఏళ్లుగా ఉంటు న్నారు. ఇండియన్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచే స్తున్న భార్య ఇందిరకు చెన్నైకి బదిలీ కావడంతో 2005 నుంచి ఆమె పిల్లలతో అక్కడే ఉంటున్నారు. అప్పటి నుంచి సురేష్ ఒంటరిగా ఉంటున్నారు. సోమవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లి మంగళవారం కార్యాలయానికి రాకపోవడంతో సహోద్యోగులు కాల్ చేశారు. సమాధానం ఇవ్వక పోవడంతో ఇందిరకు తెలియజేశారు. ఆమె ఫోన్ కాల్స్‌కూ స్పందించకపోవడంతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న ఇందిర పోలీసుల సాయంతో ఫ్లాట్ డోర్ పగులగొట్టారు. శరీరంపై షర్ట్ మినహా మరేమీ లేకుండా తలకు గాయాలై సురేష్ రక్తపు మడుగుల్లో మరణించి కనిపించాడు. కేసు ఛేదనకు పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సీసీ టీవీ ఫుటేజీని, మృతుడి ఫోన్ కాల్‌డేటాను పరిశీ లించారు. మృతుడికి వచ్చిన ఫోన్‌కాల్స్‌లో నంబర్ ఆధారంగా హత్యకు ముందు జరిగిన సంభాషణ ను తెలుసుకున్నారు. అమీర్‌పేట విజయా డయాగ్నోస్టిక్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జనగామ శ్రీనివాస్‌ను నిందితుడిగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. రక్తనమూనాలు సేకరించేందుకు వచ్చి... సురేశ్‌కుమార్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో తర చూ ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు. ఇదే సమ యంలో విజయా డయాగ్నోస్టిక్‌లో పనిచేసే శ్రీని వాస్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అతడే సురేష్ ఇంటికి వచ్చి రక్త నమూనాలు సేకరించడంతో పాటు మందులిచ్చేవాడు. ఈ విషయాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. రామగుండంకు చెందిన శ్రీనివాస్‌ను పెళ్లయిన 2 నెలల్లోనే భార్య వదిలివెళ్లింది. దీంతో ఒంటరిగా అమీర్‌పేట గురుద్వారా సాయిబాలాజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో సురేష్‌తో శ్రీనివాస్‌కు స్వలింగ సంపర్కం అలవాటైంది. డబ్బులు బాగా వస్తాయని అనుకున్న శ్రీనివాస్‌కు అందుకు అంగీకరిస్తూ వచ్చాడు. ఆ మేరకు డబ్బు లు రాకపోవడంతో సురేష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. సెప్టెంబర్ 30న కత్తితో అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కు వచ్చాడు. రోజూలాగే స్వలింగ సంపర్కంలో పాల్గొన్నాక డబ్బుల గురిం చి వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘర్షణలో శ్రీనివాస్ వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయడంతో సురేష్ తలకు తీవ్రగాయాలై చనిపోయాడు. తానే ఈ హత్య చేసినట్లు శ్రీనివాస్ చెప్పాడు. నిందితుడి నుంచి మృతుడి ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేసిన రూ.10వేల నగదు స్వాధీ నం చేసుకున్నారు. ఈ హత్యను ఛేదించడం లో కృషి చేసిన పోలీసు సిబ్బందిని సీపీ అంజనీ కుమా ర్ రివార్డులతో సన్మానించారు. -
కర్నాటకంలో కొత్త ట్విస్ట్
సాక్షి, బెంగళూరు/ ముంబై: కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుందని, తప్పుడు నిర్ణయంతో చరిత్రలో ద్రోహిగా మారడం ఇష్టం లేదని స్పీకర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తనకు అందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖల్లో 5 మాత్రమే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయని ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్ కూడా రెబెల్స్ జాబితాలో చేరిపోగా, సర్కారు మనుగడ ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. బేగ్ రాజీనామా లేఖ అందింది ‘నేను జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు. భవిష్యత్ తరాలు నన్నో అపరాధిగా చూస్తాయి’అని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ అన్నారు. మంగళవారం విధాన సౌధలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ.. రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఈ నెల 11వ తేదీలోగా ఆధారాలను చూపాలని కోరానని, సమాధానాన్ని బట్టి చర్యలుంటాయని వివరించారు. రాజీనామా చేసిన 14 మందిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలున్నారని వెల్లడించారు. రాజీనామాలను ఆమోదించాలా లేక మరే ఇతర చర్యలు చేపట్టాలా అనే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు, రూల్‌బుక్ ప్రకారం నడుచుకుంటానన్నారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ‘ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా లేఖ ఈ రోజే అందింది. దానిని ఇంకా పరిశీలించలేదు. ఇప్పటికే అందిన అధికార కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 ఎమ్మెల్యేల రాజీనామా పత్రాల్లో ఐదుగురివే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయి. మిగతా వారికి ఈ మేరకు సమాచారం అందించాం. వారు మరోసారి రాజీనామా పత్రాలు అందజేస్తే పరిశీలిస్తా’అని స్పష్టం చేశారు. సీఎల్పీ భేటీకి రాని 20 మంది మంగళవారం ఉదయం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. పదవులకు రాజీనామా చేసిన వారితోపాటు మొత్తం 20 మంది ఈ భేటీకి గైర్హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను కలిశారు. తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానం ప్రతిని వారు స్పీకర్‌కు అందజేశారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజీనామాలు చేసి, బీజేపీతో చేతులు కలిపిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాం. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’అని వెల్లడించారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎల్పీ నేత సిద్దరామయ్య హెచ్చరించారు. ‘రాజ్యాంగం పదో షెడ్యూల్లోని ఫిరాయింపుల చట్టంలోని నిబంధనలు తెలియకనే వారంతా రాజీనామా చేశారు. బీజేపీ వలలో చిక్కుకున్న ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీతో చేతులు కలిపారు. మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంలో తలదూరుస్తున్నారు’ అని అన్నారు. అంతకుముందు విధానసౌధ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్ బెంగళూరుకు చేరుకుని ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు ప్రారంభించారు. రెబెల్స్ మళ్లీ ముంబైకి.. కర్ణాటక తిరుగుబాటు శాసనసభ్యులు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరి మార్గమధ్యంలో సతారా సమీపంలో ఆగిపోయారు. తమ రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం వారు అక్కడే మంగళవారం ఎదురు చూశారు. కొందరి ఎమ్మెల్యేల రాజీనామాలు నిర్దేశిత నమూనా ప్రకారం లేవని స్పీకర్ ప్రకటించడంతో తిరిగి ముంబై వెళ్లారు. రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలలతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. నగర శివార్లలోని ఒక రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని, మరో నాలుగు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు. హెచ్చరికలకు లొంగని రెబెల్స్ రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామంటూ కాంగ్రెస్ హెచ్చరికలు పంపినప్పటికీ వారు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. ‘రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదు. స్వచ్ఛందంగా రాజీనామాలు ఇచ్చాం. ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సోమశేఖర్ మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ మంగళవారం రాజీనామా సమర్పించినట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికే.. ఐఎంఏ గ్రూప్ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే బేగ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఐఎంఏ గ్రూప్ ముఖ్య నిర్వాహకుడు, ఐఎంఏ జ్యుయెల్లర్స్ అధినేత మొహమ్మద్ మన్సూర్ ఖాన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. రోషన్‌బేగ్ తన వద్ద నుంచి రూ.400 కోట్లు తీసుకుని, ఎగనామం పెట్టాడని ఆయన విడుదల చేసిన ఆడియోలో ఆరోపించడం కలకలం రేపింది. -
టీవీ నగర్ ఏర్పాటుకు కృషి చేస్తా..
నాటక, కళా రంగాలంటే ఆయనకు అమితమైన ఇష్టం..ఆ ఇష్టంతోనే తహసీల్దార్ ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. టీవీ రంగంలోకి అడుగుపెట్టారు.. ఎన్నో ఒడిదొడుకులనుఎదుర్కొన్నారు. ఒక్కో మెట్టెక్కి ఎవరికీ దక్కని గౌరవాన్ని అందిపుచ్చుకున్నారు. తాను తీసిన సీరియల్ పేరునే ఏకంగా తన పేరులో భాగం చేసుకున్నారు. ఆయనే టీవీ, సినీ రంగాలకు సుపరిచితమైన దర్శక, నిర్మాత, రచయిత నాగబాల సురేష్‌కుమార్. అందరూ నాగబాల అంటే సురేష్‌కుమార్ ఇంటిపేరు అనుకుంటారు. కానీ ఆయన అసలు పేరు దండనాయకుల సురేష్‌కుమార్..దేశంలోనే మొట్టమొదటి స్నేక్ సీరియల్ నాగబాలను తీసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారాయన. టీవీ రంగంలో ఇప్పటికే 13 నంది అవార్డులు అందుకుని తన జీవితాన్నే ఒక కళగా మార్చుకున్నారు. తన కళా ప్రస్థానంపై సురేష్కుమార్ఏమంటున్నారంటే.. శ్రీనగర్‌కాలనీ: మాది ఆసిఫాబాద్. తండ్రి శ్రీనివాసరావు. ఆయన టీచర్. హిందూస్థానీ కళాకారుడు కూడా. తాతయ్య రామారావు రచయిత, కళాకరుడు. అప్పట్లో కొమురం భీంతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేసి 1976లో రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరాను. మంచిర్యాల, ఆసిఫాబాద్, హైదరాబాద్‌లలో తహసీల్దార్‌గా పనిచేశాను. నా ఏడో ఏట మనదేశం నాటకంతో నా కళా ప్రస్థానం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూ నాటకాలు వేసేవాడిని. ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలు, టీవీ రంగంపై ఉండేది. దీంతో 1995లో లాంగ్ లీవ్ పెట్టి.. తెలుగు టీవీ రంగంలో అడుగుపెట్టాను. నా మొదటి సీరియల్ శ్రీ ఆదిపరాశక్తి. దక్షిణ భారతంలోనే మొదటి పౌరాణిక సీరియల్ ఇది. నటి సనా ఆదిపరాశక్తిగా టీవీ రంగానికి పరిచయమయ్యారు. అది పెద్ద సక్సెస్ సాధించింది. తర్వాత 8 భాషల్లో అనువాదమైంది. ఆ తర్వాత ఫారెస్ట్ అడ్వంచర్‌గా శభాష్ బేబీ, స్వాతిచినుకులు, స్వతంత్ర సంగ్రామం లాంటి సీరియల్స్ చేశాను. టీవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనవచ్చింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి నాటకాలకేపరిమితమయ్యాను. నాగబాలతోటర్నింగ్.. ఆర్థిక ఒడిదుడుకులతో మార్కెటింట్ సొంతంగా చేసుకొని కసితో దేశంలోనే మొట్టమొదటి స్నేక్ సీరియల్ నాగబాలకు శ్రీకారం చుట్టాను. నాగబాల ఓ సంచనలమైంది. టీవీలో మైలురాయిగా, సినీ పరిశ్రమకు సైతం మైమరపించింది. దీంతో దండనాయకుల సురేష్‌కుమార్ అనే నేను నాగబాల సురేష్‌కుమార్‌గా మారాను. ఈ సీరియల్ నాలో ఆత్మస్థైర్యాన్ని, లాభాలను తెచ్చిపెట్టింది. తర్వాత అపరాధి, విజయసామ్రాట్, ఆత్మయాత్ర, రాఘవేంద్రరావు సృష్టి సీరియల్‌కి కథ, మాటలు అందించాను. ఈ తర్వాత లెజండరీస్ డాక్యుమెంటరీస్, పురాణగాథలు చేశాను. 12 బుక్స్ రాశానును. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచిక్చన షిరిడీసాయి చిత్రానికి కథా రచన చేశాను. అవధూత, మహారథి, రణం చిత్రాలకు రచన చేశాను. ఇప్పుడు రెండు పెద్ద సినిమాలకు కథా రచయితగా చేస్తున్నాను. ఆర్థికంగా నష్టపోయా.. టీవీ మాధ్యమంలో సీరియల్స్ ఘన విజయం సాధించినా. మార్కెటింగ్ తెలియక చాలా నష్టపోయాను. ఎంతలా అంటే చేతిలో డబ్బుల్లేక కాలి నడకన ఎర్రగడ్డ నుంచి నారాయణగూడ దాకా నడిచి తీరా అక్కడ డబ్బులు దక్కక జీవితం దుర్భరంగా తయారయ్యేంత దుస్థితి ఏర్పడింది. ఈ ఒడిదుడుకులతో చాలా అనుభవాలు తెలుసుకున్నాను. ఆటుపోట్లు, ఎలాంటి పొరపాట్లు జరిగాయి.. వాటిని ఎలా సరిదిద్దుకొని ఉన్నతంగా ఉండాలనేది పరిస్థితులే నాకు నేర్పించాయి. టీవీ నగర్ ఏర్పాటుకు కృషి చేస్తా.. కొమరం భీం, చాకలి ఐలమ్మ, అభినవ పోతన, తెలంగాణా త్యాగధనులు లాంటి డాక్యుమెంటరీస్ తీశాం. ఇప్పటికీ 896 డాక్యుమెంటరీస్ చేశాను. ప్రస్తుతం టీవీ రచయితల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఫిలింనగర్ మాదిరిగా టీవీ నగర్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం. టీవీరంగంతో పాటు కళాకారుల సంక్షేమం కోసం టీవీ మహాసభలను రెండు నెలల్లో పెట్టబోతున్నాం. కళారంగానికే నా జీవితం అంకితం. – నాగబాల సురేష్‌కుమార్ 13 నంది అవార్డులు.. టీవీ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న నంది అవార్డుల్లో 13 నంది అవార్డులు వచ్చాయి. నేను చేసిన సీరియల్స్‌కు వివిధ విబాగాల్లో 43 నంది పురస్కారాలు అందుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉగాది పురస్కారాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తీసుకోవడం, జాతీయ ఇందిరా ప్రియదర్శిని పురస్కారాన్ని అందుకోవడం మధురానుభూతినిఇచ్చింది. ఇవే కాకుండా మరెన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. -
క్యాసినో పెట్టుబడులే కొంపముంచాయి!
సాక్షి, హైదరాబాద్: రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ప్రధాన నిందితుడు శైలేశ్ గుజ్జర్ విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవాలో కేసినోల ఏర్పాటులో తొందరపాటు నిర్ణయం భారీ నష్టాలను మిగిల్చింది. రిషబ్ కేసులో నిందితులుగా ఉన్న శైలేశ్ కుమార్ గుజ్జర్, అతడి భార్య నందిని గుజ్జర్లను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత చంచల్గూడలోని జైలుకు తరలించారు. క్యాసినోలకు రూ.30 కోట్లు.. శైలేశ్ స్నేహితుడైన సురేశ్ కుమార్ గోవాలో క్యాసినో లు నిర్వహిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాడు. తాను కూడా ఆ వ్యాపారంలోకి దిగాలని శైలేశ్ భావించాడు. అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం రిషబ్ సంస్థలో ఉన్న చిట్టీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము వాడేశాడు. క్యాసినోల అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగిస్తూ.. అక్కడి నోవాటెల్ హోటల్, ఓ బీచ్ రిసార్ట్‌లో క్యాసినోల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశాడు. అద్దెలు, లీజుల కోసం భారీ మొత్తంలో చెల్లించడంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి వాటికి ఆధునీకరణ చేయించాడు. అయితే హఠాత్తుగా గోవా ప్రభుత్వం క్యాసినోల లైసెన్స్ ఫీజును రూ.6 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచేసింది. అయితే శైలేశ్ అప్పటికే క్యాసినోలు సిద్ధం చేయడానికి రూ.30 కోట్లు వెచ్చించడంతో ఇంత భారీ మొత్తం మళ్లీ సమీకరించలేకపోయాడు. నోట్ల రద్దు వేళ భారీ పెట్టుబడులు.. అదే సమయంలో హైదరాబాద్‌లోని రెండు పబ్బుల్లో రూ.10 కోట్లు పెట్టి శైలేశ్ భాగస్వామిగా చేరాడు. ఇవీ ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వకపోవడంతో అన్ని దారులూ మూసుకుపోయాయి. అలావాడిన సొమ్ము డిపాజిట్దారులదే కావడంతో రికవరీలకు ప్రయత్నాలు చేయాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. మరోపక్క ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసుల లెక్కల ప్రకారం ఈ స్కాం విలువ రూ.70 కోట్లకు మించట్లేదు. 2016 నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు అమల్లోకి వచ్చాక డిపాజిట్లు భారీగా పెరిగినట్లు గుర్తించారు. అనేకమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను నగదు రూపంలో పెట్టుబడులుగా పెట్టినట్లు తేల్చారు. వీరికి శైలేశ్ ప్రామిసరీ నోట్లు, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. నగదు లావాదేవీలే అత్యధికం.. శైలేశ్ నిర్వహించిన రిషబ్ చిట్‌ఫండ్స్ సంస్థ రూ.కోట్లలో లావాదేవీలు చేసింది. వారి బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించిన పోలీసులు.. వాటిలో ఆ స్థాయిలో లావాదేవీలు లేనట్లు గుర్తించారు. గడిచిన కొన్నాళ్లుగా శైలేశ్ నగదు లావాదేవీలే చేశాడని, ఆన్లైన్ లేదా చెక్కుల ద్వారా సాగించలేదని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ విషయాన్నీ ఐటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. రిషబ్ సంస్థలో చిట్టీలు పాడుకున్న వారికి రూ.2 వడ్డీ ఇస్తానంటూ శైలేశ్ ఆ మొత్తాలను డిపాజిట్లుగా పెట్టుకున్నాడు. అయితే ఓ దశలో ఇతగాడు ఫైనాన్షియర్ల నుంచి రూ.6 వడ్డీకి నగదు తీసుకువచ్చి రోటేషన్ చేయడానికి ప్రయత్నించాడు. ఇలా భారీ మొత్తం వడ్డీ రూపంలో తీసుకున్న వ్యాపారులనూ పోలీసులు విచారించనున్నారు. రిషబ్ సంస్థలో పని చేస్తున్న పాత ఉద్యోగుల పేర్లతోనూ శైలేశ్ నిధుల మళ్లింపులకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
జస్టిస్ సురేష్‌కుమార్ కెయిత్‌కు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌కుమార్ కెయిత్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్ అధ్యక్షతన బుధవారం మొదటి కోర్టు హాల్లో ప్రత్యేకంగా జరిగిన వీడ్కోలు సమావేశానికి న్యాయమూర్తులు, తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్.ప్రసాద్, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. అనంతరం సీజే జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థకు జస్టిస్ కెయిత్ అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. న్యాయమూర్తిగా సేవలు అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో తనకు సంపూర్ణ సహకారాలు లభించాయని జస్టిస్ కెయిత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ కెయిత్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు కూడా జస్టిస్ కెయిత్ను సత్కరించాయి. హరియాణాకు చెందిన జస్టిస్ కెయిత్ 1963లో జన్మించారు. 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక కేంద్ర ప్రభుత్వం తరఫున పలు కేసులు వాదించారు. 2008లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2016లో తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు తిరిగి ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్తున్నారు. -
చంద్రబాబు అక్రమ కట్టడం కనిపించడం లేదా..?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. ప్యాకేజీ ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రైతులపై వివక్ష చూపిందని అమరావతి రైతులు కమిషన్‌ను ఆశ్రయించారు. టీడీపీ ప్రభుత్వంపై దాఖలైన ఫిర్యాదును కమిషన్ స్వీకరించింది. కాగా, రైతులు ఇచ్చిన పిటిషన్‌పై విచారణకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ శ్రీధర్ హాజరుకాకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ఏపీ ప్రభుత్వం తరపున మరొకరు విచారణకు హజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే తాము ప్యాకేజీ అమలు చేశామని ఏపీ ప్రభుత్వ అధికారులు కమిషన్‌కు తెలిపారు. పొంతనలేని సమాధానాలు.. నదీ సమీపంలోని భూములకు కొట్టుకు పోయే ప్రమాదం ఉందని సుప్రీం కోర్టు చెప్పినందునే ఆ భూములకు తక్కువ ప్యాకేజి ఇచ్చామని సీఆర్డీఏ అధికారులు కమిషన్‌కు విన్నవించారు. కాగా, నదీ సమీపంలోనే చంద్రబాబు అక్రమ కట్టడం కూడా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి సురేష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం అక్రమ కట్టడం మీకు కనిపించడం లేదా అని కమిషన్ ఏపీ అధికారులను ప్రశ్నించింది. అధికారులు పొంతన లేని జవాబులు చెప్పడంతో విచారణ వాయిదా వేసింది. మభ్యపెట్టి తమ నుంచి బలవంతంగా లాక్కున్న భూములు వెనక్కి ఇప్పించాలని, సమాన ప్యాకేజీ ఇవ్వాలని రైతులు కమిషన్‌ను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా.. జరీబు రైతులకు ఇచ్చిన మాదిరిగానే అసైన్డ్ భూములకు కూడా సమాన ప్యాకేజీ ఇవ్వాలనీ, రైతు కూలీలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సురేష్ డిమాండ్ చేశారు. అలాగే, జీవో నెంబర్ 41 ని రద్దు చేయాలనీ, లేదంటే హై కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. -
కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కుమార్ ఇళ్లపై శుక్రవారం ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేసింది. హైదరాబాద్, ప్రొద్దుటూరు, కరీంనగర్ సహా ఏడుచోట్ల సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో సురేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను గుర్తించామని అన్నారు. కరీంనగర్లో విలాసవంతమైన నాలుగు అంతస్తుల భవనం, హైదరాబాద్‌లో మూడు అసార్ట్‌మెంట్లు, 10 ఇళ్ల స్థలాలు గుర్తించినట్లు వెల్లడించారు. -
ఇండస్ట్రీస్ మేనేజర్ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, మహబూబ్‌నగర్ : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు మేనేజర్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు రూ. 3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి జిల్లాలోని మియాపూర్, బాలాజీనగర్‌తో సహా ఐదు చోట్ల సోదాలు నిర్వహించగా భారీగా అక్రమ ఆస్తులను గురించారు. అధికారులు పల్లుచోట్ల ఇంకా సోదాలు జరుపుతున్నారు. -
మహబూబ్‌నగర్ జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
‘ప్రకాశ్‌రాజ్‌కు కామన్సెన్స్ లేదు’
సాక్షి, బెంగళూరు: బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కామన్ సెన్స్ అనేది లేదంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్‌కుమార్ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించారు. ప్రకాశ్‌రాజ్ ప్రవర్తన చూస్తుంటే అతడికి మతిస్థిమితం తప్పినట్లుగా కనిపిస్తోంది. అందుకే కనీస స్పృహ లేకుండా బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని అర్థం చేసుకోవడానికి కామన్సెన్స్ చాలంటూ వాఖ్యలు చేసిన ప్రకాశ్‌రాజ్‌కు లేనిదే అది అంటూ విమర్శించారు. -
మందు పార్టీలో గొడవ..యువకుడు హతం
శివాజీనగర: మద్యం మత్తులో ఉన్న యువకులు స్నేహితుడితో గొడవపడి హత్య చేసిన ఉదంతం పుట్టేనహళ్లి పోలీసు స్టేషన్ వ్యాప్తిలో చోటు చేసుకుంది. పుష్పాంజలి కల్యాణ మంటపం వెనుక నివాసం ఉంటున్న సురేశ్‌కుమార్ (26) రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. సురేశ్‌కుమార్ శనివారం రాత్రి స్నేహితులతో కలిసి జేపీనగర ఐదో స్టేజీలోని ఓ తోటలో మందు పార్టీ చేసుకున్నాడు. ఏదో విషయంపై వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ దశలో సురేశ్‌కుమార్‌పై అతని స్నేహితులు గాజు సీసాలతో మెడపై దాడి చేసి ఉడాయించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
డెంగీతో బాలుడి మృతి..
- ఇంట్లోకి అనుమతించని యజమాని - శవంతో ఆరుబయటే వర్షంలో తడిసిన కుటుంబీకులు సాక్షి, హైదరాబాద్ : డెంగీతో ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. శవాన్ని ఇంట్లోకి తెచ్చేందుకు ఇంటి యజమాని అంగీకరించలేదు. దీంతో ఆ కుటుంబం శవంతో రోడ్డుపైన వానలో తడుస్తూ రోదించడం పలు వురిని కలచివేసింది. జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వరనగర్ లో నివసించే ఈశ్వరమ్మకు ఇద్దరు కుమారులు. జగదీశ్ గుప్తా అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండేళ్ల క్రితం భర్త ఆంజనేయులు కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు సురేశ్‌కుమార్ (11)కు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ సురేశ్ బుధవారం రాత్రి మృతిచెందాడు. కాగా, బాలుడి శవాన్ని ఇంట్లోకి తెచ్చేందుకు జగదీశ్ ఒప్పుకోలేదు. దీంతో వర్షంలో తడుస్తూ తెల్లవారే వరకూ శవంతో రోడ్డుపైనే ఉన్నారు. కనీస కనికరం చూపని ఇంటి యజమాని తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు స్పందించి బాలుడి అంత్యక్రియలకు కావాల్సిన ఆర్థిక సాయం అందించి ఈశ్వరమ్మకు తోడ్పడ్డారు. -
ఆదివారాలు పెట్రోల్ బంద్
-
ఆదివారాలు పెట్రోల్ బంద్
మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో అమలు చెన్నై: మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులు మూతపడనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్ర, హరియాణాల్లోని సుమారు 20 వేల పెట్రోల్ పంపుల్లో ఆ ఒక్కరోజు ఇంధన అమ్మకాలు నిలిచిపోతాయని ఇండియన్ పెట్రోలియం కన్సార్షియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ‘ఆదివారం పెట్రోల్ పంపులను మూసివేయాలని చాలా ఏళ్ల నుంచే అనుకుంటున్నాం. అయితే మా నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కోరడంతో ఆగిపోయాం. ఇప్పుడిక దానినే అమలుచేయాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకుని పర్యావరణాన్ని కాపాడాలని ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ చేసిన సూచన మేరకే అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ‘తమిళనాడులో ఆదివారం ఒక్కరోజు పెట్రోల్ పంపులు మూసివేస్తే సుమారు రూ.150 కోట్ల నష్టం కలుగుతుందని అంచనావేస్తున్నాం’ అని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తెలియజేయలేదన్నారు. 15 మంది సిబ్బంది పనిచేస్తున్న బంకుల్లో మాత్రం సెలవు రోజులోనూ ఒకరిని విధుల్లో ఉంచుతామన్నారు. బీజేపీలోకి అర్వీందర్ లవ్లీ న్యూఢిల్లీ: ఢిల్లీ శాఖ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ మంగళవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో అర్వీందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భారత రాజకీయాలకు ప్రధాని మోదీ, అమిత్‌షాలు కొత్త అర్థంచెప్పారని అర్వీందర్ అన్నారు. ఈయన గతంలో ఢిల్లీలో షీలాదీక్షిత్ సర్కారులో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ముడుపులు ముట్టజెప్పిన వారికే కాంగ్రెస్ టికెట్లు ఇస్తోందన్నారు. -
13.3 మి.మీ సగటు వర్షపాతం నమోదు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 13.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు ముఖ్య ప్రణాళికాధికారి ఇన్చార్జి టి.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 638 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా గోపాలపురం మండలంలో 41.4 మిల్లీమీటర్లు నమోదైందన్నారు. అత్యల్పంగా బుట్టాయిగూడెం, యలమంచిలి మండలాల్లో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమవరంలో 28.6, దేవరపల్లి 27.8, ద్వారకాతిరుమల 26.6, తాళ్లపూడి 26.4, నల్లజర్ల 25.6, కాళ్ల 25.2, జీలుగుమిల్లి 21.2, పెనుమంట్ర 21, గణపవరం 18, పెదపాడు, పెనుగొండలలో 17.8, టీ.నరసాపురం 17.6, భీమడోలు 17.2, ఏలూరు 16.8, కొవ్వూరు 16.2, కొయ్యలగూడెం 15.2, చాగల్లు 14.4, పెంటపాడు, వేలేరుపాడు, పాలకోడేరులలో 14.2, పెరవలి 13.2, తాడేపల్లిగూడెం 12.6, పోడూరు 11.6, దెందులూరు, వీరవాసరం, ఆచంట, ఉండిలలో 11.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదవేగి 10.8, చింతలపూడి, ఉంగుటూరులలో 9.4, తణుకు 9.2, నిడదవోలు, కుకునూరు 8.2, ఉండ్రాజవరం 7.8, ఆకివీడు 7.6, మొగల్తూరు 7, నిడమర్రు 6.8, జంగారెడ్డిగూడెం 6.6, అత్తిలి 6.4, పోలవరం, కామవరపుకోటలో 6.2, ఇరగవరం 5.2, పాలకొల్లు 4 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. -
వడదెబ్బ.. మృత్యుఘోష
- వడదెబ్బకు ఇప్పటివరకు 243 మంది మృత్యువాత - ప్రభుత్వానికి కలెక్టర్ల నివేదిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు! ఇప్పటివరకు(మంగళవారం నాటికి) 243 మంది చనిపోయారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. వడగాడ్పులకు చిన్నాపెద్దా అల్లాడిపోతున్నారు. మండుటెండల్లో బస్సులు, ఆటోలు నడిపే డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మంగళవారం హైదరాబాద్‌లో ఉప్పుగూడకు చెందిన సురేశ్‌కుమార్ అనే ఆటో డ్రైవర్ తాను కూర్చున్న సీట్లోనే ప్రాణాలొదిలాడు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈయన సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డులోని కేఎఫ్‌సీ వద్దకు వచ్చాడు. దాహంగా ఉండడంతో ఆటో నిలిపి ఓ హోటల్‌కు వెళ్లి నీళ్లు తాగి మళ్లీ వచ్చాడు. ఉన్నట్టుండి సీట్లోనే వెనుకకు ఒరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు 108లో గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. సురేశ్ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు చెబుతుండగా.. వడదెబ్బ తగిలి ప్రా ణాలు కోల్పోయాడని తోటి డ్రైవర్లు పేర్కొంటున్నారు. గతేడాదికి ఇప్పటికి ఎంత తేడా.. గత ఏడాది ఏప్రిల్‌లో వడగాడ్పులు ప్రారంభం కాకపోవడంతో ఆ నెలలో వడదెబ్బ మృతులు నమోదు కాలేదు. ఈసారి ఏప్రిల్ నాటికే వడదెబ్బకు 243 మంది మృత్యువాత పడడం గమనార్హం. ఈ వడదెబ్బ మృతులపై మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్సై, మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య నిజ నిర్ధారణ కమిటీ విచారణ జరిపింది. మొత్తం 243 మృతుల్లో 157 కేసులను విచారించి, వాటిల్లో 79 మంది వడదెబ్బతో చనిపోయినట్లు కమిటీ నిర్ధారించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. కలెక్టర్ల నివేదిక ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికంగా 95 మంది చనిపోయారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 38 మంది, మెదక్ జిల్లాలో 33 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 18 మంది చనిపోయారు. వడదెబ్బ మృతులను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్స్‌గ్రేషియా భారాన్ని తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇంతటి తీవ్ర పరిస్థితి ఉన్నా.. జనాన్ని ఆదుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక కరువైంది. విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాలకు, వివిధ శాఖాధిపతులకు ఈ ప్రణాళికను ఇప్పటికే పంపించింది. కానీ దీన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వడగాల్పుల నుంచి రక్షణకు ఏర్పాటైన కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ఒక్కపైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. మరో రెండ్రోజులు వడగాడ్పులు తెలంగాణ వ్యాప్తంగా మరో రెండ్రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం రామగుండం, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్‌ల్లో అత్యధికంగా 44 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. భద్రాచలంలో 42.6, హన్మకొండలో 43.2, హైదరాబాద్‌లో 40.2, ఖమ్మంలో 42.6, మహబూబ్‌నగర్‌లో 43.2, మెదక్‌లో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, సైదాబాద్, ఓల్డ్‌సిటీ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. వడదెబ్బతో 77మంది మృతి సాక్షి, నెట్వర్క్: మంగళవారం ఒక్కరోజే వడదెబ్బకు 77మంది బలయ్యారు. నల్లగొండ జిల్లాలో 17 మంది, వరంగల్ జిల్లాలో 17 మంది, ఖమ్మం జిల్లాలో 16 మంది, మెదక్ జిల్లాలో 8 మంది, కరీంనగర్ జిల్లాలో ఏడుగురు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురు, నిజామాబాద్ జిల్లాలో నలుగురు, ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు వడదెబ్బతో మృతి చెందారు. -
నిబంధనలు పాటించని పాఠశాలలు సీజ్
అనుమతి లేని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కొరడా ఝలిపించారు. మంగళవారం హిమాయత్‌నగర్ డిప్యూటీ డీఈఓ సురేష్‌కుమార్ అంబర్‌పేటలోని గ్లోబల్ కీ స్టోన్, డీడీ కాలనీలో ఉన్న నారాయణ టెక్నో స్కూల్‌ను సీజ్ చేశారు. ఓయూ విద్యార్థి జేఏసీ నగర అధ్యక్షుడు శ్రీకాంత్‌తో పాటు పలువురు విద్యార్థి నాయకుల ఫిర్యాదు మేరకు ఈ స్కూల్‌ను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లఘించినట్లు గుర్తించానని ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ తెలిపారు. పూర్తి స్థాయి అనుమతులు తీసుకొని విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆయన సూచించారు. గ్లోబల్ కీ స్టోన్ స్కూలు కనీస అనుమతి కోసం దరఖాస్తు చేయలేదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సూర్య, హర్షత్, షాహిద్, శ్రీశైలం, సాయి తదితరులు ఉన్నారు. -
అడవి పందులు దూసుకురావడంతో..
అడవి పందులు అకస్మాత్తుగా జీపును ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ విషాదం నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం సంభాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొంతగల్ నుంచి బీర్కూట్ వరకూ కొత్త కల్వర్టు నిర్మాణం జరుగుతోంది. పనుల్లో పాల్గొంటున్న సిబ్బంది.. పనులు ముగించుకొని జీపులో తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా.. అడవి పందులు రోడ్డుపైకి దూసుకొచ్చి జీపును ఢీకొన్నాయి. జీపు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టుంది. ఈ ప్రమాదంలో మనోహర్(26) అనే యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. సురేష్ కుమార్, ఆదిత్య లకు తీవ్ర గాయాలయ్యయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మనసులు కలిసి.. మనువాడి..
ఖండాంతరాలు దాటిన ప్రేమ లండన్ యువతిని పెళ్లిచేసుకున్న వరంగల్ అబ్బాయి వరంగల్: ప్రేమకు ఎలాంటి కట్టుబాట్లు లేవని.. మంచి మనసు ఉంటే చాలని వీరిద్దరూ నిరూపించారు. దేశం కానీ దేశం నుంచి వచ్చి ఓ విదేశీ యువతి తెలంగాణ యువకుడిని పెళ్లి చేసుకుంది. వరంగల్ డాక్టర్స్ కాలనీకి చెందిన అనంతుల సాంబయ్య కుమారుడు సురేష్‌కుమార్ 8 ఏళ్లుగా లండన్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లండన్‌లోని సౌతాంఫ్టన్కు చెందిన హెయినీమార్ష్ కూడా అక్కడే పనిచేస్తోంది. సురేష్, హెయినీమార్ష్లు ఐదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పిన జంట శుక్రవారం ఒక్కటైంది. హిందూ సంప్రదాయం ప్రకారం హెరుునీమార్ష్ తల్లిదండ్రులు క్రిష్టఫర్ డేవిడ్మార్ష్-లిసాజేన్.. పెళ్లి కొడుకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. పెళ్లికూతురు కుటుంబసభ్యు లు సంప్రదాయ దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకున్నారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
చిల్లకూరు: ఓ వినియోగదారుడి నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు విద్యుత్ సబ్ స్టేషన్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ సురేశ్ కుమార్ కు పారిచర్లవారిపాలేనికి చెందిన నాగముని అనే వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోరుతూ వినతి పత్రం అందజేశారు. అయితే, రోజులు గడుస్తున్నా ఆయన విన్నపాన్ని ఏఈ పట్టించుకోలేదు. తనకు రూ.1.20 లక్షలు ఇస్తేనే పని అవుతుందని స్పష్టం చేశాడు. దీంతో నాగముని ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచన మేరకు నాగముని గురువారం మధ్యాహ్నం చిల్లకూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉన్న సురేశ్ కుమార్ కు రూ.1.20 లక్షల లంచం అందిస్తుండగా మాటువేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏఈను విచారిస్తున్నారు. -
'ఓయూలో లక్ష మొక్కలు నాటుతాం'
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): తెలంగాణ హరిత హారంలో భాగంగా ఓయూ క్యాంపస్‌లో పాటు అనుబంధ కళాశాలల్లో లక్ష మొక్కలు నాటుతామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఓయూ క్యాంపస్‌లో మొక్కలు నాటి హరిత హారం కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ ప్రారంభి మాట్లాడారు. ఓయూలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక క్యాంప్‌లో 600 మంది విద్యార్థులు పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటనునట్లు చెప్పారు. క్యాంపస్‌లోని ఖాళీ స్థలంలో గ్రీన్ కారిడార్‌ను నిర్మించనునట్లు చెప్పారు. -
దొంగ దొరికాడు
నారాయణగూడ(హైదరాబాద్ క్రైం): ఉద్యోగం ఇచ్చిన కంపెనీలోనే దొంగతనానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధడు. ఈ సంఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు.. హిమాయత్‌నగర్ రోడ్ నంబరు.9లో ఉన్న సన్‌రైజ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన యజమాని సురేష్ కుమార్ రూ. 80,000 లాకర్లో భద్రపరుస్తుండగా చూశాడు. ఇదే అదునుగా ఎవరులేని సమయంలో లాకర్‌ను పగలగోట్టి సోమ్ముతో ఉడాయించాడు. దీంతో సురేష్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన పద్దతిలో అడగ్గా నేరం ఒప్పుకున్న వాచ్మెన్ డబ్బును సైతం తిరిగి ఇచ్చాడు. దీంతో పోలీసులు నిందితుడిని కోర్టులో హజరుపర్చారు. -
ధర్నాను విజయవంతం చేయండి
ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఓబుళపతి బెళుగుప్ప: ఉపాధ్యాయుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఈ నెల 20న ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఓబుళపతి పిలుపునిచ్చారు. బెళుగుప్పలో మంగళవారం వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, ఉపాద్యక్షులు, సురేష్‌కుమార్, మల్లయ్య, అల్తాఫ్ హుస్సేన్, కార్యదర్శులు జయరాం రవీంద్ర, నారాయణ, రాధాక్రిష్ణారెడ్డి తదితరులతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఓబుళపతి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మెరుగైన పీఆర్సీని 60 శాతం ఫిట్మెంట్తో ప్రకటించాలని, పాఠశాలల పనివేళలను పునఃసమీక్షించాలని, హెల్త్ కార్డుల్లోని అసంబద్ధతలను తొలగించాలని యన డిమాండ్ చేశారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా కోశాధికారి ఫల్గుణప్రసాద్, కమిటీ సభ్యులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమేశ్, మండల నాయకులు పాల్గొన్నారు. -
రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోవాలి
వరంగల్ క్రైం : రౌడీషీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే సహించేది లేదని వరంగల్ రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్చార్జ్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. వరంగల్ అర్బన్, రూరల్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలపై దాడులు చేయడమేగాక, హత్యలు చేస్తున్న రౌడీషీటర్లను అదుపుచేయడంతోపాటు వారి పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జిల్లాలో రౌడీయిజానికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో అర్బన్, రూరల్ పరిధిలో రౌడీషీటర్లకు జిల్లా పోలీసు కార్యాలయంలోని రాణిరుద్రమదేవి ప్రాంగణంలో ‘రౌడీషీటర్ల పరివర్తన’ సదస్సు నిర్వహించారు. రౌడీషీటర్లతో ఎస్పీ ముందుగా మాట్లాడించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు మాట్లాడుతూ తప్పుడు స్నేహాలతో ద్వేషాలకుపోయి నేరాలకు పాల్పడి పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లుగా పేరు నమోదు కావడంతోపాటు శత్రువుల నుంచి ప్రాణ భయం ఉందన్నారు. సమాజంలో తమ కుటుంబాలను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్ల పద్ధతిలో మార్పు వస్తుంద ని ఆశిస్తున్నామన్నారు. ఆర్నెళ్లలో తిరిగి సదస్సు నిర్వహిస్తామని, ఈ లోగా రౌడీషీటర్లలో మార్పు వస్తే పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. రౌడీషీటర్లు వారి కుటుంబ సభ్యుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే రాష్ట్రంలో మరోమారు జిల్లా సంచలనాలకు వేదిక అవుతుందని ఎస్పీ రౌడీషీటర్లను హెచ్చరించారు. సదస్సుకు రూరల్ అదనపు ఎస్పీ కె.శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్, వరంగల్, హన్మకొండ, మామునూర్ డీఎస్పీ లు జనార్దన్, హిమవతి, దక్షిణామూర్తి, సురేష్‌కుమార్‌తోపాటు అర్బన్, రూరల్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐ, సబ్ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
పసిడి చిన్నబోయింది
హుదూద్‌తో కళతప్పిన మార్కెట్ భారీగా ధర తగ్గినా కొనుగోళ్లు స్వల్పమే ముందుకురాని జనం ఆశాభావంతో వర్తకుల నిరీక్షణ ఆర్నమెంట్ బంగారం గ్రాము ధర రూ. 2470/ 24కేరట్స్ గ్రాముకు రూ. 2695/ విశాఖపట్నం సిటీ: బంగారు కొనుగోళ్లనూ హుదూద్ ప్రభావితం చేసింది. పసిడి మార్కెట్ కళ కోల్పోయేలా చేసింది. గతనెల 12నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఆఖరుకు బంగారం ధర తగ్గినా స్పందన కనిపించలేదంటే పరిస్థితి అర్ధమవుతుంది. తాజాగా బంగారం ధర భారీగా తగ్గింది. ఆర్నమెంట్ గోల్డు గ్రాము ధర రూ. 2500 కిందికి తగ్గింది. గత గురువారం నుంచీ అంతకన్నా తక్కువ ధర వద్దే విశాఖ బులియన్ సూచీలు కదలాడుతున్నాయి. గ్రాము ధర రూ.2450 నుంచి 2470 మధ్య గత రెండు రోజులుగా వున్నాయి. సోమవారం ఉదయం 11 గంటల వరకూ అలాగే ధర నిలచివుంటుంది. అయినా కొనడానికి పెద్దగా జనం ముందుకు రావడం లేదు. హుదూద్ అంతగా కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టింది. హుదూద్ చేసిన నష్టాలు కళ్ల ముందే కనిపిస్తుండడంతో బంగారం మార్కెట్‌వైపు అడుగులు పడటంలేదు. నగరంలో 20 పేరొందిన షాపులున్నాయి. చిన్నాచితకా కలుపుకుంటే 300 ఉన్నాయి. రోజూ సగటున ఈ షాపుల్లో రూ. 20 కోట్లు కొనుగోళ్లు జరిగేవి. ప్రస్తుతం రోజూ సుమారు రూ.10 కోట్ల కన్నా తక్కువే బంగారు కొనుగోళ్లు జరుగుతున్నాయని పసిడి మార్కెట్ వర్గాల అంచనా. ఎక్కువమంది నగరవాసులు సాధారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడే వుండడంతో పొదుపు పేరిట బంగారంపై మదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మల్టీనేషనల్ దుకాణాలు రంగప్రవేశం చేశాక కొందరు ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుని పొదుపు చేసేందుకు ఇదో మార్గంగా ప్రోత్సహిస్తున్నారు. తుపాను వల్లే మందగింపు తుఫాన్ ప్రభావం వల్ల అమ్మకాలు కాస్త మందగించిన మాట వాస్తవమే. మళ్లీ పుం జుకుంటాయని ఆశిస్తున్నాం. 10 రోజులు దాటిన తర్వాత పెళ్లిళ్ల హడావిడి ఊపందుకుంటుంది. అప్పుడు మళ్లీ పసిడి అమ్మకాలు పెరుగుతాయి. గత కొన్నేళ్ల పెరుగుదలకు బ్రేక్ ఇస్తూ దాదాపు ధర 20 శాతం తగ్గింది. ఇంత కన్నా తగ్గే ఛాన్స్ లేదు. -సురేష్ కుమార్ జైన్, సంఘ్వీ జ్యూవెలర్స్/విశాఖ బులియన్ అధినేత -
యంత్రం...గుంతలకు మంత్రం
బెంగళూర్ తరహాలో పూడ్చివేత పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ త్వరలో వినియోగంలోకి సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రహదారులపై గుంతల (పాట్‌హోల్స్‌ను) పూడ్చివేతకు అధునాతన యంత్రాన్ని తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ యత్నిస్తోంది. ఈ తరహా పనులకు ఇప్పటికే రోడ్ డాక్టర్ అనే యంత్రాన్ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికంటే మెరుగైన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. బెంగళూరు, ఢిల్లీల్లో ఈ పనులు నిర్వహిస్తున్న రెండు కాంట్రాక్టు సంస్థలతో జీహెచ్ఎంసీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ధన్సింగ్, చీఫ్ ఇంజినీర్ సురేష్‌కుమార్, తదితరులుశనివారం సమావేశమయ్యారు. కాంట్రాక్టు ప్రతినిధులు ఆయా నగరాల్లో తాము వినియోగిస్తున్న వివిధ రకాల యంత్రాల పనితీరును వారికి వివరించారు. వీటిల్లో గ్రేటర్‌కు ఏది అనువుగా ఉంటుందనే విషయమై కమిషనర్ సోమేశ్ కుమార్‌తో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. ఆధునిక యంత్రాలతో ఖర్చు చాలా వరకూ తగ్గనున్నట్టు తెలుస్తోంది. బెంగళూర్‌లో గత ఏడాదిగా ఆధునిక పద్ధతిలో గుంతలు పూడుస్తున్నారు.అక్కడ నాలుగు లేన్ల రోడ్లలో పనులకు కి.మీ.కు ఏడాదికి రూ.85 వేల వంతున చెల్లిస్తున్నారు. నగరంలో అది మరింత తగ్గేందుకు అవకాశం ఉందని ప్రతినిధులు జీహెచ్ఎంసీ అధికారులకు వివరించారు. ఇదీ పనితీరు కెనడా రూపొందించిన పైథాన్-5000 అనే వాహనాన్ని వినియోగించడం ద్వారా మూడు నిమిషాలకో గుంతను పూడ్చి వేయవచ్చని సంబంధిత ప్రతినిధులు తెలిపారు. బెంగళూర్‌లో గడచిన పది నెలల్లో 1400 గుంతలు పూడ్చి వేశామన్నారు. కెనడా, అమెరికా, బ్రెజిల్‌లలో ఈ వాహనాలతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గుంతల పూడ్చివే తతో పాటుచదును చేసే పనిని కూడా వెంటనే పూర్తి చేస్తుంది. దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. వర్షం నీటిలో సైతం దీని ద్వారా పనులు చేసేందుకు వీలవుతుంది. దీన్ని వినియోగించేందుకు ఒక్కరున్నా సరిపోతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వినియోగిస్తున్న యంత్రాలను ఢిల్లీలో ఉపయోగిస్తున్నారు. జెట్ ప్యాచర్గా వ్యవహరించే దీనితో 15 నిమిషాల్లో గుంతను పూడ్చవచ్చు. నగర రోడ్లకు ఏది ఎక్కువ సదుపాయంగా ఉంటుంది? దేనికి ఎంత ఖర్చవుతుంది? ఒకసారి గుంత పూడ్చాక ఎంతకాలం వరకు మన్నికగా ఉంటుంది తదితర అంశాలు అధ్యయనం చేశాక తగిన యంత్రాలను గ్రేటర్లో వినియోగించాలని యోచిస్తున్నారు. మెట్రోపొలిస్ సదస్సు సమయంలో ఒక వేళ వర్షం కురిస్తే.. దెబ్బతిన్న రోడ్లకు వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని యోచిస్తున్నారు. వీలైతే ప్రయోగాత్మకంగా వీటి పనితీరును పరిశీలించాలని భావిస్తున్నారు. -
పండ్ల తోటల నరికివేత
సాక్షి నెట్వర్క్: అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులతో ఆగకుండా వారి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీవారికి చెందిన ఇళ్లపై దాడులు, వ్యవసాయ పొలాలను నాశనంచేయడం, పండ్లతోటలను నరికేయడం వారికి పరిపాటిగా మారింది. మరికొందరిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. శ్రీకాకుళం జిలాల పలాల నియోజకవర్గం మందస మండలం బుడారిసింగికి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సర్పంచ్ సురేష్‌కుమార్ పాణిగ్రాహి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో జూన్ 30వ తేదీ రాత్రి టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ చిదిరాల సతీష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీన్ని సాకుగా తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హత్యాయత్నం చేశారంటూ 200మంది టీడీపీ వర్గీయులు మర్నాడు దాడులకు తెగబడ్డారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీటీసీ మొరవినేని భాస్కరరావుపై మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వారి ఇంటి లోని ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక వర్గంలోని రాపూరు మండలం తెగచెర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొడ్డు మధుసూధన్ రెడ్డికి చెందిన కారును తగులబెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పొలాలకు ఉన్న కంచెను కూడా తగులబెట్టారు. అనంతపురం జిల్లా కనగానపల్లిలో హరిజన సుబ్బరాయుడు పొలంలో మే 18వ తేదీన 350 మామిడి చెట్లను నరికివేశారు. అలాగే శింగనమల నియోజకవర్గం యల్లనూరులో 86 చీనీ చెట్లు, పెద్దమల్లేపల్లిలో 100 చీనీచెట్లను నరికివేశార.ు. చిత్తూరుజిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. -
జానీమూన్‌కు కిరీటం
సాక్షి,గుంటూరు: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా తొలి సారి ముస్లిం మహిళ ఎన్నికయ్యారు. కాకుమాను జెడ్పీటీసీ సభ్యురాలు షేక్ జానీమూన్‌ను జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్‌గా తాడికొండ జెడ్పీటీసీ సభ్యుడు వడ్లపూడి పూర్ణచంద్రరావు ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారి అయిన కలెక్టర్ సురేశ్‌కుమార్ నుంచి చైర్పర్సన్ జానీ మూన్ జెడ్పీ బాధ్యతలు స్వీకరించడంతో నూతన పాలకవర్గం కొలువు దీరినట్టయింది. ఎన్నిక జరిగిందిలా... జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు శనివారం అట్టహాసంగా జరి గాయి. తొలుత ఉదయం 10 గంటలకు ప్రిసైడింగ్ అధికారి సురేశ్‌కుమార్ ఇద్దరు కోప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా జానీమూన్, వైస్‌చైర్మన్‌గా వడ్లపూడి పూర్ణచంద్రరావులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ప్రిసైడింగ్ అధికారి అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత చేబ్రోలు జెడ్పీటీసీ సభ్యురాలు అత్తోట సుధారాణి, చివరగా దుర్గి జెడ్పీటీసీ సభ్యురాలు కొనకంచి హైమావతి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ విధంగా మొత్తం 57 మంది జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తయింది. 10 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకార పత్రం చదవలేకపోయారు. అమృతలూరు జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ పృథ్వీలత ఇంగ్లిషులో ప్రమాణస్వీకారం చేశారు. అజెండాలో రెండవ అంశంగా ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపట్టారు. ఈ రెండు స్థానాలకు నక్కా సువర్ణరాజు ( బాపట్ల), రాజేష్ కుమార్ (మాచర్ల) ఇద్దరే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యా హ్నాం మూడు గంటలకు చైర్మన్ ఎన్నిక జరుగుతుందనిప్రకటించి సమావేశాన్ని వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రిసైడింగ్ అధికారి సురేష్‌కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ స్థానానికి, వైస్ చైర్మన్ స్థానానికి ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వచ్చినట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. చైర్పర్సన్ అభ్యర్థి షేక్ జానీమూన్‌ను జెడ్పీటీసీ సభ్యురాలు పృథ్వీలత ప్రతిపాదించగా, మేకా శివరామకృష్ణ బలపరిచారు. వైస్‌చైర్మన్ వడ్లపూడి పూర్ణచంద్రరావును కె.శ్రీనివాసరావు ప్రతిపాదించగా, సాయిబాబా బలపరిచారు. వెంటనే వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం షేక్ జానీమూన్తో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు ఆమెకు అప్పజెబుతున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఆ తరువాత వైస్ చైర్మన్ వడ్లపూడి పూర్ణచంద్రరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొని నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 23 మంది చైర్పర్సన్ ఎన్నికకు గైర్హాజరయ్యారు. జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే),కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే కేంద్ర సర్వీసులోకి వెళుతున్న జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు తెనా లి శ్రావణకుమార్, అనగాని సత్యప్రకాష్, దూళిపాళ్ల నరేంద్ర,ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాస్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్,ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, డీసీసీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య తదితరులు ప్రసంగించారు. జెడ్పీ సీఈఓ సుబ్బారావు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించారు. అర్బన్ ఎస్పీ జెట్టి గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
హిందూ మున్నని నాయకుడి హత్య!
సాక్షి, చెన్నై: బీజేపీ, హిందూ మున్నని నేతలను టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్న తీవ్రవాదులను ఇటీవల పుత్తూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఉగ్రవాదుల్లో ఒకడైన అబూబక్కర్ సిద్ధిక్ జాడ మాత్రం కానరాలేదు. అతడి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బుధ వారం రాత్రి హిందూ మున్నని నేత దారుణ హత్యకు గురి కావడం కలకలాన్ని సృష్టించింది. ఈ ఘటనతో బీజే పీ, శివ సేన, హిందూ మున్ననని, ఆర్ఎస్ఎస్ వర్గాలు ఆందోళన కు దిగారుు. పథకం ప్రకారం హత్య : కన్యాకుమారి జిల్లా కరక్కొడుకు చెందిన సురేష్‌కుమార్(46) చెన్నై అంబత్తూరులో స్థిర పడ్డారు. అక్కడి మన్నార్ పేట మలైమత్తయ్యమ్మన్ ఆలయం వీధి లో నివాసం ఉంటున్న ఆయనకు భార్య భావన(40), పిల్లలు కృష్ణవేణి(10), కిరణ్మయి(8) ఉన్నారు. సురేష్‌కుమార్ తిరువళ్లూరు ఉత్తర జిల్లా హిందూ మున్నని అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా రు. ఈయనకు అంబత్తూరు ఎస్టేట్ రోడ్డులో కార్యాలయం ఉంది. ప్రతి రోజు ఈ కార్యాలయంలో రాత్రి పది గంటలకు వరకు ఉండేవారు. యథా ప్రకారం బుధవారం రాత్రి పది గంట లకు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఆయన అలా బయటకు వచ్చారో లేదో, మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు, కత్తులతో నరికి పడేశాడు. సురేష్ కుమార్ కేకలు విన్న సమీపంలోని పోలీస్ బూత్‌లో ఉన్న సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ దండగులు ఉడాయించా రు. రక్తపు మడుగులో పడి ఉన్న సురేష్‌కుమార్‌ను అన్నానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ సురేష్‌కుమార్ మృతి చెందారు. ఈ సమాచారంతో బీజేపీ, హిందూ మున్నని, శివసేన, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాల రగిలింది. మృతదేహంతో రాస్తారోకకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని నినాదాలతో హోరెత్తించారు. ఎట్టకేలకు వారిని బుజ్జగించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్తత: తమ నాయకుడు హత్యతో తిరువళ్లూరు ఉత్తర జిల్లా పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మన్నార్ పేట, అంబత్తూరు ఎస్టేట్, పాడి పరిసరాల్లో దుకాణాలన్నీ మూతబడ్డాయి. బంద్‌ను తలపించే రీతి లో వాతావరణం నెలకొంది. కీల్పాకం పరిసరాల్లో భారీ జన సమీకరణతో బీజేపీ, శివసేన, హిందూ మున్నని, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పూందమల్లి హైరోడ్డులో బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. పూందమల్లి హైరోడ్డు స్తంభించడంతో వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆందోళన కారులను బుజ్జగించి, మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అప్పగించారు. మృత దేహాన్ని అంబులెన్స్ లో మన్నార్ పేటకు తరలించే క్రమంలో నిరసనకారులు వాహనాలపై త ప్రతా పం చూపించారు. బస్సులపై దాడులు : అంబులెన్స్ వెంట పెద్ద ఎత్తున ఊరేగింపునకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కదిలారు. మార్గం మధ్యలో బస్సులు, వాహనాలు అడ్డురావడంతో తమ ప్రతాపం చూపించారు. నగర రవాణా సంస్థకు చెందిన పది బస్సుల అద్దాలు పగిలాయి. కార్లు, మోటార్ సైకిళ్లపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గట్టి భద్రత నడుమ మన్నార్‌పేటకు సురేష్‌కుమార్ మృత దేహాన్ని తరలించారు. ఆయన అంత్యక్రియల ఊరేగింపులో తొలుత ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు బృందాలు సురేష్‌కుమార్ హత్య ఘటన విచారణకు మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డెప్యూటీ కమిషనర్ షణ్ముగ వేల్, అసిస్టెంట్ కమిషనర్లు మైల్ వాహనన్, నందకుమార్ పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. పోలీ స్ బూత్‌కు, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ హత్య జరిగిందంటే, ముందుగా రె క్కీ నిర్వహించడంతోపాటుగా, సురేష్‌కుమార్ కదలికలను కొన్నాళ్లు పసిగట్టినట్టు స్పష్టం అవుతోంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరై ఉంటారన్న దిశగా విచారణ సాగుతోంది. అదే సమయంలో సురేష్‌కుమార్ కార్యాలయానికి పక్కనే ఓ షాపులో సీసీ కెమెరా అమర్చి ఉండడంతో అందులోని దృశ్యాలను పరిశీలిస్తున్నారు. తీవ్రవాదుల పనై ఉంటుందా? సురేష్‌కుమార్‌కు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు వేగవంతం అయింది. -
నేడు ఫిల్మ్ చాంబర్లో తెలంగాణ సంబరాలు
వెంగళరావునగర్, న్యూస్‌లైన్: తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్, సినీ దర్శకుల సం ఘం, సినీ నిర్మాతల మండలి, కార్మికుల సమా ఖ్య సంయుక్త సౌజన్యంతో శనివారం ఫిలింనగర్‌లోని ఫిల్మ్ చాంబర్లో తెలంగాణ సంబరాలను నిర్వహించనున్నట్టు ఫోరం కన్వీనర్ నాగబాల సురేశ్‌కుమార్ తెలిపారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న తెలంగాణ టీవీ డెవలప్మెంట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంబరాల విశేషాలను వివరించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన బాబూమోహన్, రసమయి బాలకిషన్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ లోగోను తయారు చేసిన లక్ష్మణ్ ఏలేను ఘనంగా సత్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నాటికలు, పద్యాలు, పాటలు, భజనలు, తెలంగాణ ధూంధాం తదితర కార్యక్రమాలను భారీ ఎత్తు న నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ కళాకారులు, టెక్నీషియన్లు పెద్ద ఎత్తున ఈ వేడుకలకు హాజరుకావాలని కోరారు. విలేకరు ల సమావేశంలో ఫోరం కన్వీనర్లు యాటా సత్యనారాయణ, టీవీ చౌదరి, డి.రామకృష్ణ, వైభవ్ సూర్య, రాజేంద్రరాజు పాల్గొన్నారు. -
వేదిక నిర్మాణంషురూ
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సభా ప్రాంగణంలో పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగసభ జరుగనున్న క్రమంలో బుధవారం నాటికి ప్రాంగణం చుట్టూ బారికేడ్ల నిర్మాణం పూర్తయింది. ప్రాంగణం చివరి భాగంలో వేదిక నిర్మాణ పనులు మొదలయ్యాయి. మొత్తం మూడు వేదికల నిర్మాణం, వీవీఐపీల గ్యాలరీ, వీఐపీ, ప్రెస్ గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి వీలుగా బుధవారం యూనివర్సిటీలో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. గురువారం సాయంత్రానికల్లా ఏర్పాట్లు మొత్తం పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశించారు. సభావేదిక నిర్మాణ పనులు మందకొడిగా సాగడంపై జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి వేళ విద్యుత్ వెలుగుల్లో కూడా ఏర్పాట్లు కొనసాగించాలని, అవసరమైతే మరికొంతమంది సిబ్బందిని నియమించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రాంగణం ప్రారంభంలో స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రుళ్లు కూడా పనులు నిర్వహిస్తున్నారు. పనులు పరిశీలించిన నవీన్ మిట్టల్... చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను బుధవారం ప్రత్యేక అధికారి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్, జేసీ వివేక్ యాదవ్, ఆర్డీవో ఆర్,రామ్మూర్తి, మెప్మా, డీఆర్డీఏ పీడీలు సేనాపతి ఢిల్లీరావు, ప్రశాంతితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లను గురించి స్పెషల్ ఆఫీసర్‌కు వివరించారు. ఏర్పాట్లు వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా సిబ్బందిని సమాయత్తం చేయాలని ప్రత్యేక అధికారి మిట్టల్ కలెక్టర్‌కు సూచించారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ గరికపాటి... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు బుధవారం జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్, జేసీ వివేక్‌యాదవ్, ఆర్డీవో ఆర్.రామ్మూర్తిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వీవీఐపీలు, వీఐపీలు, నాలుగు నుంచి అయిదు లక్షల మంది కార్యకర్తలు తరలిరానున్నారని చెప్పారు. -
రుణ ప్రణాళిక రూ.12,491 కోట్లు
సాక్షి, గుంటూరు: కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వంద శాతం రుణ లక్ష్యాన్ని సాధించే విధంగా బ్యాంకర్లు, అధికార యంత్రాంగం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో డీసీసీ (డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ) సమావేశంలో 2014-15 సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. గతేడాది కంటే 16.15 శాతం వృద్ధితో రూ.12,491.43 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఎన్నికల కోడ్ కారణంగా 89 శాతం రుణ లక్ష్యం సాధించామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు, రుణ లక్ష్యాలను సంపూర్ణంగా అమలుచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది రూ.10,753 కోట్ల రుణ లక్ష్యం కాగా, ఈ ఏడాది రూ.1,737 కోట్లు అదనంగా పెంచినందుకు బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు. వ్యవసాయ రుణాల కింద రూ.7,662.94 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.2,900.90 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,927.59 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగ రుణాలకు అత్యధికంగా రూ.6,328.57 కోట్లు కేటాయించడం ముదావహమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో విడుదల చేయాల్సిన వార్షిక రుణ ప్రణాళిక ఎన్నికల కారణంగా జూన్ నెలలో విడుదల చేయాల్సి వచ్చిందని వివరించారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం వి.ఎం.పార్ధసారథి, నాబార్డు ఏజీఎం ఏవీ భవానీ శంకర్, ఆర్బీఐ ప్రతినిధి మురళీధర్, లీడ్ బ్యాంకు మేనేజర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సురేశ్‌కుమార్ సూచించారు. శనివారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, రిటర్నింగ్ అధికారులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలని సూచించారు. ఈవీఎం నుంచి రిజల్ట్స్‌ను ఏజెంట్లకు కన్పించే విధంగా చూపాల్సి ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్ హాలులో 7 టేబుల్స్ పార్లమెంట్‌కు, 7 టేబుల్స్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలలో సూక్ష్మపరిశీలకులు పర్యవేక్షిస్తారన్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న అధికారులు వారికి కేటాయించిన చోట ఈనెల 15న ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. అక్కడ వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, తప్పని సరిగా అందరూ హాజరు కావాలని ఆదేశించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు అదనంగా కౌంటింగ్ అసిస్టెంట్‌ను కేటాయించామని, వారి సేవలను వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. మెప్మా ప్రాజెక్టు డెరైక్టరు కృష్ణకపర్థి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. సిబ్బందికి వచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో జేసీ వివేక్‌యాదవ్, అదనపు జేసీ కె.నాగేశ్వరరావు, తెనాలి, నరసరావుపేట ఆర్డీవోలు శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరావు, నగరపాలకసంస్థ కమిషనర్ నాగవేణి తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూంల భద్రత పరిశీలన ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూంల భద్రతను గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరు, ఎస్.సురేశ్‌కుమార్ శనివారం పరిశీలించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని తాడికొండ, మంగళగిరి, గుంటూరు తూర్పు,పశ్చిమ, ప్రత్తిపాడు,పొన్నూరు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఇక్కడి స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన విషయం తెలిసిందే. వర్షాల వల్ల రాష్ర్టంలో కొన్ని చోట్ల ఈవీఎంలు భద్రపరిచిన గదుల్లోకి వర్షపునీరు వెళ్ళిందని వార్తలు రావటంతో కలెక్టర్ వచ్చి పరిశీలించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద ఇబ్బంది లేదని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఈవీఎంల వివరాలను స్ట్రాంగ్‌రూంల వద్ద ఉన్న కంప్యూటర్లలో పరిశీలించారు. స్ట్రాంగ్ రూంల వద్ద వర్షపునీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు తహశీల్దార్ చెన్నయ్యను కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట నగరపాలకసంస్థ కమిషనర్ నాగవేణి, తెనాలి రిటర్నింగ్ అధికారి శ్రీనివాసమూర్తి తదితరులున్నారు. స్ట్రాంగ్ రూంలు పరిశీలించిన జేసీ గుంటూరు సిటీ: నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరచిన స్థానిక లయోలా పబ్లిక్ స్కూల్లోని స్ట్రాంగ్ రూంలను నరసరావుపేట పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్‌యాదవ్ శనివారం పరిశీలించారు. అక్కడి భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. గార్డ్స్ వద్ద ఉన్న రిజిస్టర్లో ఆయన సంతకం చేశారు. -
జిల్లాలో 81.9శాతం పోలింగ్ నమోదు
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 81.9 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అత్యధికంగా 88.93 శాతం, తాడికొండలో 88.87 శాతం, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 64.99 శాతం, గుంటూరు తూర్పులో 68.17 శాతం నమోదైనట్టు తెలిపారు. 36,46,011 మంది ఓటర్లకుగానూ 29,85,871 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. 2009 ఎన్నికలలో 77.6 శాతం నమోదైనట్లు చెప్పారు. దాదాపు 5శాతం పెరగడం మంచి పరిణామమన్నారు. ఓట్లలెక్కింపునకు 1,200 మందిని నియమిస్తున్నామని తెలిపారు. 16న కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 15న సాయంత్రం 5గంటలులోగా పోస్టల్ బ్యాలెట్లు అందాలని చెప్పారు. ఎన్నికల విధులలో ఆకస్మికంగా మరణించిన కెవికె కిషోర్, మహబూబ్‌నగర్‌కు చెందిన హోంగార్డు వైకుంఠం కుటుంబసభ్యులకు ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో జెసి వివేక్‌యాదవ్, డిఆర్వో కె.నాగబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఓటుతో ప్రశ్నించే హక్కు
రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్,సురేశ్‌కుమార్ హెచ్చరించారు. అలాగే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే హక్కు ఉండదని, ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. - సాక్షి ప్రతినిధి, గుంటూరు వరుస ఎన్నికలను ఎలా ఎదుర్కొంటున్నారు? పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికలు వరుసగా ఒకేసారి రావడం చాలా అరుదు. ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకొని పనిచేశాం. పంచాయతీ ఎన్నికల అనుభవంతో మిగిలిన ఎన్నికలను సమర్ధంగా నిర్వహించాం. ఇందుకోసం ముందుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నాం. మొత్తం రెండువేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. జిల్లా పరిస్థితులపై పోలీస్ అధికారులకు, నాకు పూర్తిగా అవగాహన ఉంది. మేమంతా జిల్లాకు వచ్చి రెండు సంవత్సరాలైంది. దీని వలన రాజకీయ పార్టీలు, నాయకుల వైఖరిపై అవగాహన ఏర్పడింది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నాం. ప్రజలకు ఈవీఎంలపై ఎలా అవగాహన కల్పిస్తున్నారు? నగరంలో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో ఈవీఎంల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఓటర్లు ఎవరైనా సరే ఈ మోడల్ కేంద్రానికి వచ్చి ఈవీఎంపై వారికి ఉన్న అభ్యంతరాలు, సందేహాలను తీర్చుకోవచ్చు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పంచాయితీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను, పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. అలాగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా చూస్తున్నాం. ఎవరైనా గొడవులు చేసినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా బైండోవర్ చేస్తున్నాం. మిగిలిన ఎన్నికల వరకు వారిని బయటకు రాకుండా చూస్తాం. జేసీ, ఆర్డీవో, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, రిటర్నింగ్ అధికారుల సహకారంతో సమర్ధంగా విధులు నిర్వహించగలుగుతున్నాం. మంచి టీమ్ వర్క్‌తో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సుల రక్షణ ఏ విధంగా..? జిల్లాలో 12 పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను గుంటూరు, తెనాలి, నరసరావుపేట కేంద్రాల్లో భద్రపరుస్తున్నాం. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులను సైతం జిల్లా కేంద్రానికి తరలిస్తున్నాం. బ్యాలెట్ బాక్సులకు పటిష్ట రక్షణ చేపడుతున్నాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూస్తున్నాం. ఓటుహక్కుపై ప్రజల్లో ఎటువంటి చైతన్యం తీసుకువస్తున్నారు? ఓటుహక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే హక్కు ఉండదు. చదువుకున్న వారే ఎక్కువమంది ఓటుహక్కు వినియోగించుకోవడం లేదు. దీన్ని అధిగమించేందుకు స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లకు సమాచారం ఇవ్వడం, అవగాహన కల్పించడం, వారిని చైతన్య పరచడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులు, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాం. అలాగే పోలింగ్ కే ంద్రాల వద్ద వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటుహక్కు ప్రాధాన్యత తెలిపేందుకు రంగోళి, క్విజ్, 3కే వాక్ వంటి పోటీలు నిర్వహిస్తున్నాం. గ రాజకీయపార్టీలకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. పోలింగ్ సమయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తన దిృ్టకి తీసుకురావచ్చు లేదా సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. -
రాజధాని కమిటీ’ విధివిధానాలివీ..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయాలని.. అన్ని వనరులూ అందుబాటులో ఉండే ప్రాంతాన్ని సూచించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి విధివిధానాలను ఖరారు చేస్తూ హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని ఎంపికలో కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) ఏర్పడ్డాక వచ్చే ప్రభుత్వం, పలు ఇతర వర్గాలతో చర్చలు జరిపి వాటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిం చారు. పర్యావరణానికి హాని జరగకుండా, తక్కువ ఖర్చుతో నిర్మించేందుకు అనువుగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించేలా ఉండాలని సూచించారు. విధివిధానాలు ఇవీ.. 1.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుకు విభిన్న ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయాలి. ఏది మేలైన ప్రాంతమవుతుందో సరిపోల్చాలి. దీనిలో భాగంగా అందుబాటులో ఉన్న గణాంకాలు, ఇతర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాకుండా కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) ఏర్పడ్డాక వచ్చే ప్రభుత్వం, పలు ఇతర వర్గాలతో చర్చలు జరిపి వాటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 2. రాజధాని ప్రాంతాలను ఎంపిక చేసేందుకు, సిఫారసులు చేసేందుకు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎ) తగినంత భూమి, నీరు, ఇతర సహజవనరుల లభ్యత ఉండాలి. డిగ్రేడెడ్ అటవీ భూమిని డీరిజర్వేషన్ చేసేందుకు వీలు కలిగి ఉండాలి. బి) పెరిగే జనాభాకు అనుగుణంగా పట్టణాభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించాలి. ముఖ్యంగా రాజ్‌భవన్, అసెంబ్లీ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు, ఆఫీసు కార్యాలయాలు, అతిథి గృహాలు, నివాస భవనాలు, స్టేడియంలు, సమావేశ మందిరా లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, హాస్పిటళ్లు, పాఠశాలలు, కళాశాలలు, శిక్షణసంస్థలు, గ్రంథాలయాలు, మ్యూజియంలు, సినిమా థియేటర్లు, రిక్రియేషన్, పర్యాటక కేంద్రాలు, పార్కులు, మార్కెట్లు.. ఇలా అన్నింటికీ ఆ ప్రణాళికలో చోటుండాలి. సి) రాజధానిగా ఏర్పాటయ్యే ప్రాంతం నుంచి వివిధ జిల్లాలకు, ప్రస్తుత ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌కు, ఇతర నగరాలకు రోడ్డు, రైలు, విమానయాన రవాణా వ్యవస్థ కలిగి ఉండాలి. అలాగే రాజధానిగా ఏర్పాటయ్యే నగరంలో ర్యాపిడ్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను వృద్ధిపరిచేందుకు అవకాశం ఉండాలి. డి) ఈ ప్రాంతంలోని ఇతర ప్రముఖ నగరాలను అనుసంధానం చేస్తూ ఆర్థిక, సామాజిక, సాంస్కృతికపరమైన మౌలిక వసతులను అభివృద్ధిపరిచేందుకు అవకాశాలను అంచనావేయడం కమిటీ సిఫారసులు చేసేటప్పుడు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.. ఎ) ప్రస్తుతం ఉనికిలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలు తొలగించకుండా చూడాలి. అలా చేపట్టాల్సి వస్తే అది చివరి ప్రత్యామ్నాయమే కావాలి. అలాగే ప్రజలను, ప్రజావాసాలను కూడా తరలించేలా ఉండకూడదు. అలా జరిగినా అది నామమాత్రమే కావాలి. బి) నీటి వనరులు సహా ఇతర స్థానిక పర్యావరణానికి ఏ మాత్రం హాని కలుగరాదు సి) ఘనీభవ, ద్రవీభవ కాలుష్యాలను అరికట్టేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ను ఫోకస్ చేస్తూ పర్యావరణ అనుకూలమైన సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. డి) తుపాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలపై అంచనా ఉండాలి. ఇ) నిర్మాణ వ్యయం, భూసేకరణకు ఖర్చు తక్కువయ్యేందుకు గల అవకాశాలను అంచనా వేయాలి. -
ఎన్నికల తనిఖీల్లో రూ.7.77 లక్షలు స్వాధీనం
మద్వానిగూడెం (కలిదిండి), న్యూస్‌లైన్ :ఎన్నికల సందర్భంగా మద్వానిగూడెంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.7,77,600 నగదును పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి సురేష్‌కుమార్, ఎన్నికల జమాఖర్చుల అధికారి రామాంజనేయాచార్యులు కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా జున్నూరు గ్రామానికి చెందిన పి.నరసింహారావు, కె.సూర్యనారాయణరాజు కలిదిండి మండలం పడమటిపాలెం నుంచి మోటారుసైకిల్‌పై వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, రోశయ్య తనిఖీచేసి, వారి వద్ద రూ.7,77,600 నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి వారి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని సురేష్‌కుమార్, రామాంజనేయాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీమ్‌లీడర్ రామ్మోహనరావు, ఏఎస్ఐలు గుమ్మడి శ్రీనివాసరావు, కృష్ణారావు పాల్గొన్నారు. ఈనెల 13వ తేదీన ఈ చెక్‌పోస్టు వద్ద ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.12.82 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. -
అక్రమ డిప్యుటేషన్ల హవా!
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ల హవా కొనసాగుతోంది. అస్మదీయులకు కోరుకున్న పోస్టింగ్ లభిస్తుంది. సదరు కార్యాల యం, పీహెచ్సీలో సిబ్బంది అవసరం లేకపోయినా కొందరు డిప్యుటేషన్లపై వెళ్తున్నారు. అ వసరమైన సెక్షన్, లేకపోతే ఆఫీస్ వేళల్లో సొంత పనులు చక్కబెట్టుకునేందుకు వీలుగా ఉండే పొజిషన్‌ను దక్కించుకుంటున్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన సురేశ్‌కుమార్ డిప్యుటేషన్లు రద్దు చేసి రెగ్యులర్ పద్ధతిన ఉద్యోగులను నియమించారు. అనంతరం వైద్య శిబిరాలు, ఇతర కుంటిసాకులతో 30 శాతం ఉద్యోగులు డిప్యుటేషన్లపై వచ్చిన వారే పనిచేస్తున్నట్టు సమాచారం. సొంత శాఖలోనే అసంతృప్తి.. చాలా పీహెచ్‌సీల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అస్సలు డాక్టర్లు లేని, అవసరమైన సిబ్బందిలేని పీహెచ్‌సీలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలకు సిబ్బందిని సమకూర్చాల్సి ఉంది. కొందరు వ్యక్తులు మాత్రం డిప్యూటేషన్లను దుర్వినియోగపరుస్తుండడంతో ఆ శాఖలోనే వీరిపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. పనిభారం, అవసరమున్న చోట డిప్యూటేషన్లు వేయకుండా అనవసరమైన చోట సొంత అవసరాలకు ఉపయోగపడేలా డిప్యూటేషన్లపై వెళ్లి కాలయాపన చేస్తున్నట్టు సమాచారం. డిప్యూటేషన్లపై వచ్చిన వారు కడుపులో చల్ల కదలకుండా కాలం గడిపేస్తున్నారు. ఇలా పనిచేస్తున్న వారెందరో వీరి పనితీరు మరీ విచిత్రంగా ఉంటుంది. కొందరు పనిచేసే వారైతే.. మరికొందరు సంతకం చేసి బయటకు వెళ్లివస్తున్నట్టు సమాచారం. ఈ సమయంలో తమ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాలు బిగించినా వారి తీరులో మార్పు లేకపోవడం గమనార్హం. పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్న ఆత్మవిశ్వాసంతో వారు ఇలా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వారిని తిరిగి యథాస్థానాలకు పంపించాలంటే రాజకీయ వత్తిడి, ఇతరత్రా కారణాలు పై అధికారులకు కొరకరాని కొయ్యగా మారినట్టు సమాచారం. వీరికితోడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేసిన చోటు నుంచి కదలకుండా ఉంచడంలో ఆంతర్యమేమిటో బోధపడడం లేదు. చివరకు కలెక్టర్ సీరియస్ కావడంతో వారిని బదిలీ చేసిన చోటుకు పంపారు. అయినప్పటికీ సదరు ఉద్యోగులు నిత్యం జిల్లా కార్యాలయంలోనే దర్శనమిస్తున్నారు. ఇదే విషయమై డీఎంహెచ్ఓ కార్యాలయ పరిపాలనాధికారి మురహరిని వివరణ కోరగా ఒక వాచ్‌మన్ తప్ప మరెవరూ ఈ శాఖలో డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేయడం లేదన్నారు. నాల్గో తరగతి ఉద్యోగుల వివరాలు అడగ్గా తనకేమీ తెలియదని, సంబంధిత సూపరింటెండెంట్లను కలవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆ శాఖలో ఎంతో మంది దర్జాగా తమ విధులు నిర్వహిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. -
నీటికి నో టెన్షన్
ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్‌కుమార్ సమ్మక్క-సారలమ్మ జారతకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, జాతరలో నిరంతరం తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ వై.సురేష్‌కుమార్ తెలిపారు. కోటిమంది వస్తారన్న అంచనాతో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఆయన పేర్కొన్నారు. చిలకలగుట్ట, శివరాంసాగర్, కన్నెపల్లి, కొత్తూరు, చింతల్, ఊరట్టం, నార్లాపూర్, జంపన్నవాగు బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో భక్తులు ఎక్కువగా బస చేసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జాతర సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. జాతరకొచ్చే భక్తులు నీటికోసం టెన్షన్ పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. నల్లాలకు, మరుగుదొడ్ల వద్ద ఉన్న నీటి టబ్‌లకు నిరంతరం నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జంపన్నవాగులో 9ఇన్‌ఫిల్టరేషన్ బావులు ఉండగా మరో రెండు కొత్తవి నిర్మిస్తున్నాం. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద కొత్తగా 52 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తున్నాం. ఏర్పాటు చేసిన వాటికి ఇప్పటికే ట్రయల్న్ ్రనిర్వహించాం. భక్తుల తాగునీరు ఇబ్బందులు తీర్చేందుకు గతంలో ఉన్న 260కి అదనంగా మరో 63 నల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు నీటి సరఫరా కోసం 58గొట్టపు బావులతోపాటు మరో 20 కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచి 5హెచ్‌పీ పంపులతో నీరు అందిస్తాం. ఎక్కడైనా నీరు లభించేలా జాతీయ రహదారితోపాటు పస్రా-నార్లాపూర్-మేడారం వరకు చేతిపంపులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే గతంలో 236 చేతిపంపులు ఉండగా ఈసారి మరో 45 కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాక ఎక్కడైనా ఇబ్బందు లు తలెత్తి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా 50 ట్యాంకర్లను జాతర పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతున్నాం. మరుగుదొడ్ల నిర్మాణం గత జాతరలో 8800 మరుగుదొడ్లు ఏర్పాటు చేయ గా ఈసారి వాటి సంఖ్యను పదివేలకు పెంచాం. జాతీయ రహదారి వెంట ప్రతీ గ్రామ శివారులో మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. ఆర్టీసీ బస్టాండ్, అలైటింగ్ పాయింట్, స్నానఘట్టాలు, పోలీస్ క్యాంపు, ఇంగ్లిషు మీడియం స్కూల్, హెలీప్యాడ్ తదితర ప్రాంతాల్లో పక్కా మరుగుదొడ్లు నిర్మించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. వీటికి నిరంతరం నీటి సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా పైపులైన్లు నిర్మిస్తున్నాం. నిర్మించిన టాయిలెట్లను గుర్తించేందుకు ఈసారి జీపీఎస్ ద్వారా కోఆర్డినేట్స్(అక్షాంశాలు-రేఖాంశాలు ప్రకారం) గుర్తించి రికార్డు చేస్తున్నాం. ఈ వివరాలన్నీ అన్లైన్లో పెడుతున్నాం. ఆరు క్లస్టర్లుగా జాతర ప్రాంతం జాతర జరిగే ప్రాంతాలను ఆరు క్లస్టర్లుగా విభజించాం. ప్రతీ క్లస్టర్‌ను ఒక డీఈ పర్యవేక్షిస్తారు. ఆయన పరిధిలో ముగ్గురు ఏఈలు, ఒక పంపు మెకానిక్, ఒక ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఉంటారు. గతంలో తాగునీటికి, శానిటేషన్ పనులకు వేర్వేరుగా అధికారులు ఉండేవారు. ఈసారి ఈ రెండు విభాగాలను ఒకే అధికారి పర్యవేక్షిస్తారు. అలాగే జాతర జరిగే వారం రోజులపాటు ప్రత్యేకంగా ఓ మొబైల్ టీంను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు మేడారంలో ఆర్టీసీ ఏర్పాటు చేయనున్న బస్టాండ్, అలైటింగ్ పాయింట్ ప్రాంతాల్లో రూ.15లక్షల వ్యయంతో 20వేల సామర్థ్యం కలిగిన రెండు గ్రౌండ్ లెవల్ స్టోరేజీ రిజర్వాయర్లు(జీఎల్ఎస్ఆర్) నిర్మించి వాటిచుట్టూ నల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదే ప్రాంతంలో స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు కూడా నిర్మిస్తున్నాం. వీటి నిర్వహణకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తున్నాం. నిరంతరం పరీక్షలు, పర్యవేక్షణ సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్ కలుపుతాం. మరుగుదొడ్లకు ఉపయోగించే నీటిలోనూ క్లోరిన్ కలుపుతాం. క్లోరిన్ శాతాన్ని ప్రతి గంటకు పరీక్షించేందుకు సిబ్బందిని ఏర్పాటుచేస్తున్నాం. ఇతర జిల్లాల్లోని వాటర్ టెస్టింగ్ ల్యాబ్‌లలో పనిచేస్తున్న 150మంది టెక్నీషియన్ల సేవలను జాతరలో వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం జాతర పనులన్నీ హన్మకొండ ఈఈ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జాతర గురించి వినడమే తప్ప ఎన్నడూ చూడలేదు. ఈసారి జాతరలో సేవ చేసే అదృష్టం దొరికినందుకు ఆనందంగా ఉంది. -
రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం
సాక్షి, గుంటూరు: జిల్లా అంతటా సోమవారం నుంచి 25వ రహదారి భద్రతా వారోత్సవాలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లా పరిషత్‌లో ఉదయం 9.15 గంటలకు రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సురేశ్‌కుమార్ పాల్గొని భద్రతా వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు జిల్లా అంతటా నిర్వహించే వారోత్సవ కార్యక్రమాలు, అవగాహన సదస్సుల గురించి రవాణా శాఖ ఉప కమిషనర్ డాక్టర్ వడ్డి సుందర్ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం స్థానిక హిందూ కళాశాల చౌరస్తాలో రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చే సిన ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సులో అర్బన్, రూరల్ ఎస్పీలు గోపీనాథ్ జెట్టి, సత్యనారాయణలు పాల్గొని జెండా ఊపి వారోత్సవాలను ప్రారంభించారు. {sాఫిక్ డీఎస్పీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో అర్బన్ ఎస్పీ గోపీనాథ్ ప్రసంగించారు. వాహనాలను నడిపే డ్రైవర్లకు ఏకాగ్రత ప్రధానమన్నారు. పెరుగుతోన్న జనాభాకు సమాంతరంగా పెరిగే వాహనాల రాకపోకలకు అనుకూలంగా రోడ్ల విస్తరణ జరగాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన డ్రైవర్ల పిల్లలకు ఉపకారవేతనాలు అందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. గుంటూరు నగరంలో చేపట్టిన విజన్ జీరో, ఆపరేషన్ స్పీడ్ బైక్, ఆపరేషన్ నంబర్ ప్లేట్స్ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. మద్యం తాగి వాహనాలను నడపడం నేరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. నేరాల సంఖ్య తగ్గుతుండగా, రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని రూరల్ ఎస్పీ సత్యనారాయణ అన్నారు. ఇంటి యజమాని మరణిస్తే ఆయా కుటుంబాలు ఎంతగా విలపిస్తాయో గుర్తించాలన్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పోలీస్, ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలను విజయవంతం చేయాలని రవాణాశాఖ ఉపకమిషనర్ డాక్టర్ వడ్డి సుందర్ సూచించారు. వారోత్సవాలను వారం రోజులకే పరిమితం చేయకుండా ఏడాది మొత్తం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు, స్టిక్కర్లను రూరల్ ఎస్పీ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఆటో డ్రైవర్లు వీటిని వాహనానికి వెనుక అతికించి విస్తృత ప్రచారం కల్పించాలని ట్రాఫిక్ డీఎస్పీ సుబ్బారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జానకి, డీఎస్పీలు మధుసూదనరావు, నర్సింహ, రవీంద్రబాబు, లావణ్యలక్ష్మి, ఆర్టీవో చందర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శివనాగేశ్వరరావు, సీఆర్పీఎఫ్ కమాండెంట్ జోషి పాల్గొన్నారు. -
నేడు పోలింగ్
సాక్షి, గుంటూరు: జిల్లాలో వాయిదా పడిన పంచాయతీలకు శనివారం పోలింగ్ జరగనుంది. నాలుగు పంచాయతీలు, 29 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ పోలింగ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు అప్పగించారు. ఎన్నిక ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం పోలింగ్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం ఆయా గ్రామాలకు చేరుకుంది. అసలు ఆరు పంచాయతీలు, 45 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత నాలుగు పంచాయతీల సర్పంచ్‌లు, 29 వార్డులకు మాత్రమే ఎన్నికలు ఖరారయ్యాయి. ముత్తాయపాలెం, రామచంద్రపురం పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు నేడు పోలింగ్ కాలేదు. పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, ముప్పాళ్ళ మండలంలో కుందూరివారిపాలెం, పొన్నూరు మండలంలోని కసుకర్రు, మంగళగిరి మండలంలోని బేతపూడి గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నాలుగు సర్పంచ్ స్థానాలకు పది మంది, 29 వార్డులకు 38 మంది బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే నాలుగు పంచాయతీల్లో ఆయా మండలాల తహశీల్దార్లు గ్రామాల్లోనే ఉండాలని జిల్లా కలెక్టరు సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ 144 సెక్షన్ అమలు చేయాల్సి వస్తే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో తహశీల్దార్లు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. -
జోరుగా బాల్‌బ్యాడ్మింటన్
ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్: ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పురుషులు, మహిళల 59వ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సోమవారంనాటికి మూడో రోజుకు చేరింది. మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతుండటంతో క్రీడాభిమానులు పెద్దసంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు. గత ఏడాది జరిగిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల విభాగంలో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన ఇండియన్ రైల్వేస్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఆంధ్ర, ముంబై, కేరళ, కర్నాటక, తమిళనాడు టీంలు ఈ టోర్నీలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఆడిన లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి నాకౌ ట్ దశకు మార్గం సుగమం చేసుకుంటున్నాయి. సోమవా రం పురుషుల పూల్-ఏ విభాగంలో భారత రైల్వేస్, ఒడిశాపై 29-15, 29-10తో ఘన విజయం సాధించింది. పూల్-బిలో హైదరాబాద్, బీహార్‌పై 29-08, 29-04తో విజయం సాధిం చింది. పూల్- సీలో కర్ణాటక-మేజర్ పోర్ట్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మేజర్ పోర్ట్స్ మొదటి సెట్‌ను 29-26తో నెగ్గగా.. రెండో సెట్లో కర్నాటక ఆధిపత్యాన్ని సాధించింది. 29-27, 29-27తో రెండు సెట్లను కైవసం చేసుకుని విజయం సాధించింది. పూల్-డీలో ఆంధ్రా, అసోంపై 29-09,29-08తో సునాయాస విజయంసాధించింది. ఆంధ్రా- తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్‌లో 29-27, 29-11తో ఆంధ్రా గెలుపొందింది. మహిళల పూల్-ఏలో తమిళనాడు, పుదుచ్చేరిపై 29-03, 29-01తో నెగ్గింది. అదే ఫూల్లో హైదరాబాద్, హర్యానపై 29-27, 29-20తో విజయం సాధించింది. పూల్-బీలో కేరళ, ఢిల్లీపై 29-03, 29-07తో గెలిచింది. పూల్-సీలో కర్ణాటక, ఇస్రో జట్టుపై 29-2, 29-0 తో ఘన విజయం సాధించింది. పూల్-డీలో ఆంధ్రా, ఎన్సీఆర్ జట్టుపై 29-12, 29-08తో గెలుపొందింది. ఆర్గనైజింగ్ కార్యదర్శులు వేజెళ్ల సురేష్‌కుమార్, హుస్సేన్, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు మ్యాచ్‌లు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. క్రీడాకారులకు వైద్య సహాయం అం దించేందుకు మంచుకొండ పీహెచ్సీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. -
2014 ప్రాధాన్యతాంశాలుగా పాలన
సాక్షి, గుంటూరు :కొత్త ఏడాదిలో నాలుగు ప్రాధాన్యత అంశాలుగా జిల్లా పాలన సాగనుందని కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గడిచిన ఏడాదిలో జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలో పతకాలు లభించాయన్నారు. మంగళవారం సాయంత్రం గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టరు మాట్లాడారు. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉందని, అభివృద్ధి కార్యక్రమాలకు రెండు,మూడు నెలలు మాత్రమే సమయం వుందన్నారు.నాలుగు ప్రాధాన్యత అంశాల కింద సంక్రాంతి పండుగ తర్వాత డివిజన్ స్థాయిలో జిల్లా అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలోనే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహణ, ఇంకా నిర్మల్ భారత్ అభియాన్ కింద పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే 70 వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. లక్ష మరుగుదొడ్లు నిర్మించే దిశగా లక్ష్యం పూర్తి చేస్తామని చెప్పారు. చివరగా, జిల్లాలో ఇంకా పది లక్షల మంది నిరక్షరాస్యులు వున్నారన్నారు. 18 మండలాల్లో 50 శాతం కంటే తక్కువ సాక్షరత ఉందని, ఈ మండలాల్లోని 305 గ్రామాల్లో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు సాక్షర భారత్ కింద కార్యక్రమం రూపొందించామని ప్రకటించారు. జీఎంసీలో అవినీతి వాస్తవమే జిల్లాలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, చేయలేకపోతున్నామనే బాధా ఉందని జిల్లా కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందులో జీఎంసీలో అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకొచ్చారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజా భాగ స్వామ్యం తప్పనిసరని, నగరంలో ప్రజల స్పందన అంతంత మాత్రంగానే ఉందన్నారు. ‘ఊరంటే గుంటూరే’ కార్యక్రమంలో నిరాశజనకమైన ఫలితాలు వచ్చాయన్నారు. నగర పాలక సంస్థలో అవినీతి ఎక్కువగా ఉన్న విషయం వాస్తవమేనన్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎక్కువగా ఉందని, అక్రమ కట్టడాలపై తుది నోటీసులు ఒక్క కేసులో తప్ప ఏ ఒక్క దాన్లోనూ అధికారులు ఇవ్వలేదని, దీనిపై దృష్టి సారిస్తానని తెలిపారు. జీఎంసీలో అవినీతిపై తన ఫోన్ నంబరు ఇచ్చి వివరాలు తెలియజేయవచ్చని ప్రకటిస్తే కేవలం ఐదారు ఫోన్లు మాత్రమే వచ్చాయన్నారు. పెద్ద ఎత్తున స్పందన వస్తుందనుకుంటే, అలా జరగలేదన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో సభ్యులుగా ఉన్న వారితోనే అడహక్ కమిటీ వేశామని, ఇందులో రాజకీయ కోణం గురించి తనకు తెలియదని కలెక్టరు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారులపై వేమూరు ఎమ్మెల్యే చేయి చేసుకున్న సంఘటనకు స్పందిస్తూ అదనపు జేసీని విచారణ అధికారిగా నియమించామని, ఇప్పటికే విచారణ ప్రారంభించారన్నారు. ఓటర్ల జాబితాపై టీడీపీ వారిచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్నారు. మూడు లక్షల ఓటర్ల దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల వరకు ఓటర్ల చేర్పులు, తొలగింపులు, అభ్యంతరాలపై దరఖాస్తులు అందాయని కలెక్టరు వివరించారు. జనవరి 9 లోగా విచారణ చేసి 16న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా ప్రచురిస్తామన్నారు. ఇరవై సూత్రాల పథకం అమలులో జిల్లా ఎనిమిదవ స్థానంలో ఉండగా, గృహ నిర్మాణం, ఆధార్ అనుసంధానం తదితర అంశాల్లో వెనుకంజలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.20 కోట్ల నిధులతో జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి నిర్మించనున్నట్టు తెలిపారు. జనవరి 18లోగా మిలీనియం ఆస్పత్రికి సౌకర్యాలన్నీ సమకూరతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘సిట్టింగ్’ మంత్ర!
= వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యత = జాక్‌పాట్ కొట్టిన సీనియర్లు = అసమ్మతి అరికట్టడానికి కేపీసీసీ నిర్ణయం? సాక్షి, బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లో అత్యధికం పార్టీలోని సీనియర్ నేతలకే కట్టబెట్టాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. అందులోనూ సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యత కల్పించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపు సమయంలో తలెత్తే అసమ్మతిని సాధ్యమైనంత వరకూ తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం రాష్ట్రం నుంచి తొమ్మిది మంది ఎంపీలు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇందులో మండ్య ఎంపీ రమ్య, బెంగళూరు గ్రామీణ ఎంపీ సురేష్‌కుమార్ తప్ప మిగిలిన వారంతా సీనియర్ నాయకులే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకపై ఆ పార్టీ అధిష్టానం ఎక్కువ దృష్టిని కేంద్రీకరించింది. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవడానికి అనుసరించాల్సిన ‘రోడ్‌మ్యాప్’ను తయారు చేసి అందించాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర నాయకులకు సూచించారు. ఈ క్రమంలో పార్టీ నుంచి ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారికే ఆయా స్థానాల్లో తిరిగి టికెట్టు కేటాయించాల్సిందిగా కేపీసీసీ పదాధికారుల సమావేశంలో తీర్మానించినట్లు సమాచారం. ఇదే తీర్మానాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు తెలుస్తోంది. దీంతో మల్లికార్జున ఖర్గే (గుల్బర్గ), ధరంసింగ్ (బీదర్), విశ్వనాథ్ (మైసూరు), ధృవనారాయణ (చామరాజనగర), వీరప్పమొయిలీ (చిక్కబళాపుర), మునియప్ప (కోలారు), కె.జయప్రకాష్ హెగ్డే (ఉడుపి-చిక్కమగళూరు)లను వ చ్చే లోక్‌సభ ఎన్నికల్లో అదేస్థానం నుంచి బరిలోకి దించాలని కేపీసీసీ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు మంచి పట్టున్న స్థానాల్లో కూడా ఈసారి సీనియర్లకే టికెట్టు కేటాయించాలనే ప్రాథమిక నిర్థారణకు రాష్ట్ర నాయకులు వచ్చారు. ఉత్తర కన్నడ పార్లమెంటు స్థానం కోసం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే, మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీపడుతున్నారు. ఈ టికెట్టు ఎలాగైనా తమ కుమారులైన ప్రశాంత్ దేశ్‌పాండే, నివేదిత్ అల్వాలకు ఇప్పించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో వీరిద్దరిలో ఎవరికి టికెట్టు ఇచ్చినా మరొకరు అసంత ృప్తికి లోనయ్యే తెరవెనక రాజకీయాలు నడిపి పార్టీ అభ్యర్థినే ఓడించే అవకాశం లేకపోలేదని కేపీసీసీ నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో ఈ సీటును పార్టీలో సీనియర్ నాయకుడైన హరిప్రసాద్‌కు కేటాయిస్తే మంచిదనే అభిప్రాయానికి రాష్ట్ర నాయకులు వచ్చినట్లు తెలిసింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఈడిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నందున అదే వర్గానికి చెందిన హరిప్రసాద్‌కు టికెట్టు కేటాయించడం ఉత్తమమని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ కన్నడ ఎంపీ టికెట్‌ను మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నాయకుడైన బి.జనార్థన పూజారికి ఇవ్వాలని కేపీసీసీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ స్థానానికి కేంద్రమంత్రి మొయిలీ కుమారుడైన హర్ష మొయిలీ పోటీ పడుతున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన జనార్థన పూజారి వైపే రాష్ట్ర నాయకులు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. బళ్లారి నుంచి సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడైన ఎన్.వై హనుమంతప్పకు టికెట్టు కేటాయించాలని కేపీసీసీ నిర్ధారణకు వచ్చింది. మండ్యలో ఎస్.ఎం కృష్ణను బరిలో దించాలని రాష్ట్రనాయకులు భావిస్తున్నా ఆయన నిరాకరించడంతో ప్రస్తుత ఎంపీ రమ్యకే తిరిగి టికెట్టు కేటాయించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఉప ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే (జూనియర్ అయినా కూడా) బెంగళూరు గ్రామీణ పార్లమెంటు స్థానాన్ని ప్రస్తుత ఎంపీ సురేష్కుమార్కే కేటాయించాలని కేపీసీసీ నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈనెల 29, 30 తేదీల్లో బెంగళూరులో జరిగే సమావేశంలో ఈ విషయమై ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఢిల్లీ పెద్దలకు లోక్‌సభ అభ్యర్థుల ప్రాథమిక జబితాను కేపీసీసీ పంపించనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, సీఎం సిద్ధరామయ్య కూడా పాల్గొననున్నారు. -
'8వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు'
లెహర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నాలుగు మండలాల్లో ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. గురువారం గుంటూరులో లెహర్ తుఫాన్‌పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సముద్రంలో నాలుగు అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దాంతో సముద్రం అల్లకల్లొలంగా తయారైంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులు ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.గత రాత్రి నుంచి తీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని చెప్పారు. తెనాలి డివిజన్ పరిధిలో పాఠశాలకు శెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవులో ఐదవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు చెప్పారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఏఈ
శేరిలింగంపల్లి, న్యూస్‌లైన్: బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ ఏఈ సురేష్‌కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీ శేరి లింగంపల్లి సర్కిల్-12లో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా తాత్కాలిక లైటింగ్ ఏర్పాటుతో పాటు.. సీఎం పర్యటన సందర్భంగా మాణిక్యం అనే కాంట్రాక్టరు పలు పనులు చేశారు. వాటికి సంబంధించి రూ. 4 లక్షల బిల్లు రావాల్సి ఉంది. అయితే, ఎలక్ట్రికల్ ఏఈ ఆర్.సురేశ్‌కుమార్ బిల్లులు మంజూరు చేయకుండా మాణిక్యాన్ని తిప్పించుకున్నాడు. బిల్లు సిద్ధమైనా దానిమీద సంతకం చేయకుండా కొద్దిరోజులు ఇబ్బందులకు గురిచేశాడు. చివరికి ప్రింటర్, యూపీఎస్ లంచంగా ఇస్తే బిల్లులపై సంతకాలు చేస్తానని చెప్పాడు. దాంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు సిటీరేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎస్కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వ్యూహం పన్ని.. ఏఈ సురేష్‌కుమార్‌కు సదరు కాంట్రాక్టర్ ప్రింటర్, యూపీఎస్, రసీదులను అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేశామని, కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సురేశ్‌కుమార్ ఇళ్లపై అనంతరం ఏసీబీ అధికారులు దా డులు చేశారు. ఎటువంటి అక్రమ ఆస్తుల వివరాలు లభించలేదని తెలిపారు. -
హాకీలో జాతీయస్థాయికి ఎదగాలి
మహబూబ్‌నగర్ క్రీడలు, న్యూస్‌లైన్: జాతీయ క్రీడ హాకీకి గతంలో జిల్లాలో మంచి ఆదరణ ఉండేదని, ఇప్పుడిప్పుడే ఈ క్రీడపై విద్యార్థులు ఆసక్తి కనబరచడం శుభపరిణామని ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అండర్-14 ఎస్జీఎఫ్ హాకీ జిల్లా బాల, బాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయి హా కీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఎంపికలకు జిల్లావ్యాప్తంగా 168 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేశా రు. కార్యక్రమంలో హాకీ మహబూబ్‌నగర్ అధ్యక్ష, కార్యదర్శులు గోటూరు శ్రీనివాస్‌గౌడ్, దూమర్ల నిరంజన్, కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్, ఎంపిక కమిటీ సభ్యులు సురేందర్‌రెడ్డి, పరుశురాం, నిరంజన్‌రావు, మెర్సి, వడెన్న, మన్యం, నిరంజన్‌గౌడ్, మొగులాల్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. జట్ల వివరాలు (బాలురు): శ్రీకాంత్, అనిల్‌కుమార్, నవీన్, వంశీ, గణేష్, సంతోష్, శ్రీశైలం, ఎం.నవీన్, రాజేందర్, కురుమూర్తి, శివకుమార్, పవన్‌కుమార్, చెన్నకేశవరెడ్డి, సాయితేజ, ముకేష్, నరేష్, స్టాండ్‌బై: సంతోష్, సాయిచరణ్, రాకేష్‌గౌడ్, ఎన్నరేష్. (బాలికలు): రేణుక, సుజాత, భీముద్వమ్మ, సునీత, అనిత, శ్వేత, సుధారాణి, సంధ్య, చంద్రకళ, శ్రావ్య, శిరీషా, లావణ్య, రేణుక, శిరీషా, రవళి, స్టాండ్‌బై: దుర్గా, కావ్య, పూజిత, జయమ్మ, ప్రియ. -
సమ్మెకు దిగిన ఎల్ఎన్టీ ఉద్యోగులు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఎల్ఎన్టీ ఉద్యోగులు సోమవారం సమ్మెకు దిగారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 250 గ్రామాలకు పూర్తిగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ సురేశ్‌కుమార్ సమక్షంలో కార్మికులతో ఎల్ఎన్టీ ప్రతినిధు లు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కు దిగారు. సత్యసాయి నీటి సరఫరా పథకం కింద జిల్లాలోని పటాన్చెరు, గజ్వేల్, బొంతపల్లి, జిన్నారం, జగదేవ్‌పూర్, దుబ్బాక, రా మక్కపేట, అందోల్, పుల్కల్, హత్నూర, నర్సాపూర్ మండలాల పరిధిలోని గ్రామాలకు ఎల్ఎన్టీ యాజమాన్యం కాంట్రాక్టు తీసుకుని నీటి సరఫరా చేస్తున్నారు. ఈ సంస్థ లో 12 ఏళ్లుగా 135 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2012 జూలై 31కి సంస్థ ఏరియర్స్ 28 లక్షలు కార్మికులకు ఇంతవరకు చెల్లించలేదు. దీంతో వారు సమ్మెబాట పట్టారు. త మ సమస్యలను పరిష్కరించాలని ఆగస్టు 5న కార్మికశాఖ అధికారుల సమక్షంలో విజ్ఞప్తి చే సినా పట్టించుకోకపోవడంతో యాజమాన్యం తో చర్చలు జరిపామని, అయినా స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు దిగామని కా ర్మిక యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కొం డల్‌రెడ్డి, దండు ప్రభులు తెలిపారు. వేతనా లు చెల్లించే వరకు సమ్మె విరమించమన్నారు. -
ఆక్రమణను అడ్డుకుంటాం
కోదాడటౌన్, న్యూస్‌లైన్: కోదాడ ప్రభుత్వ వైద్యశాల స్థల ఆక్రమణను అడ్డుకుంటామని, తప్పుడు నివేదికలతో స్థలాన్ని కాజేయాలని చూస్తున్న విషయాన్ని తమ న్యాయవాది ద్వారా కలెక్టర్‌కు వివరించామని, కలెక్టర్ వద్ద రివ్యూ పిటిషన్ దాఖలు చేయటంతో పాటు వైద్యశాలలో ఉన్న ప్రస్తుత వివాదాస్పద స్థలంలో ఎటువంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వవద్దని కోదాడ మున్సిపాలిటీలో ఫిర్యాదు చేస్తామని జిల్లా ప్రభుత్వ వైద్యశాలల కోఆర్డినేటర్ సురేష్‌కుమార్ అన్నారు. రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ అధికారుల అదేశం మేరకు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ఆయన అఖిలపక్ష నాయకులతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలో మిగులు భూమిలేదని, దానిని తమ ఇంజినీర్లు ధ్రువీకరించారని తెలిపారు. కొందరు సర్వేయర్లు పక్కన ఉన్న మున్సిపాలిటీ రోడ్డును కూడా ప్రభుత్వ వైద్యశాలలో కలిపి మిగులు స్థలం ఉన్నదని తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఒకవేళ ఆ రోడ్డు ప్రభుత్వ వైద్యశాల స్థలంలోనిది ఐతే తాము ఆ రోడ్డును స్వాధీనం చేసుకుంటామని, వైద్యశాల స్థలంలో కలిపివేసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీ జోక్యం చేసుకుని నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని కోరారు. స్థలాన్ని కాపాడుకునేందుకు రాజధాని స్థాయిలో ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు దొడ్డా నారాయణరావు, బద్దం భద్రారెడ్డి, కనగాల నారాయణ, ఎస్కె లత్తు, గంధం బంగారు, బంగారు నాగమణి, కుదరవెల్లి బసవయ్య, పొడుగు హుస్సేన్, నాళం రాజన్న, పాలకి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, బరిగెల పుల్లయ్య పాల్గొన్నారు. -
ప్రేమోన్మాదికి యూవజ్జీవం
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాండిచ్చేరి సమీపం కారైక్కాల్ జిల్లా ఎంఎంజీనగర్కు చెందిన జయపాల్ ఒక ప్రయివేటు పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఆయన కుమార్తె వినోదిని (23) ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చెన్నై సైదాపేటలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. జయపాల్ కుటుంబానికి వారి సమీప బంధువు సురేష్‌కుమార్ ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచేవాడు. అదే సమయంలో వినోదినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఈ ప్రేమ ప్రతిపాదనను వినోదిని తిరస్కరించింది. దీంతో ఆమెపై సురేష్‌కుమార్ కక్ష పెంచుకున్నాడు. గత ఏడాది నవంబరులో దీపావళి పండుగ నిమిత్తం వినోదిని కారైక్కాల్‌లోని తన తండ్రి వద్దకు వచ్చింది. పండుగ ముగిసిన తర్వాత చెన్నై వెళ్లేందుకు నవంబరు 14వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె వెంట తండ్రి జయపాల్, కుటుంబ మిత్రుడు పద్మనాభన్ ఉన్నారు. అకస్మాత్తుగా వారి ముందుకు వచ్చిన సురేష్‌కుమార్ వినోదిని ముఖంపై యాసిడ్ పోశాడు. తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. మూడు నెలలు మృత్యువుతో పోరాడిన వినోదిని ఈ ఏడాది ఫిబ్రవరి 12న కన్నుమూసింది. సంఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తీర్పు వెల్లడి: ఈ కేసును కారైక్కాల్ సెషన్స్ కోర్టు విచారించింది. దాడి సమయంలో ప్రత్యక్ష సాక్షులను, యాసిడ్ అమ్మకందారులను, వినోదినికి చికిత్స చేసిన వైద్యులు ఇలా మొత్తం 24 మందిని కోర్టు విచారించింది. కేసు విచారణ మంగళవారం పూర్తరుుంది. ‘నీపై మోపిన అభియోగాలు రుజువయ్యూరుు, శిక్ష విధించబోతున్నాం, ఏమైనా చెప్పుకోవాల్సి ఉందా’ అంటూ నిందితుని న్యాయమూర్తి వైద్యనాథన్ ప్రశ్నించారు. అన్నీ హైకోర్టులో చెబుతానంటూ సురేష్ సమాధానమిచ్చాడు. దీంతో సురేష్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో మూడేళ్లు జైలు జీవితం గడపాలని ఆదేశించారు. తగిన శిక్ష పడింది: జయపాల్, వినోదిని తండ్రి నా కుమార్తెను పాశవికంగా హతమార్చిన సురేష్‌కుమార్‌కు తగిన శిక్షే పడింది. యాసిడ్ దాడులకు పాల్పడేవారికి ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలి. వినోదిని మృతితో తమిళనాట యాసిడ్ అమ్మకాలను నియంత్రించారు. ఈ రకంగానూ నా కుమార్తె ఆత్మ శాంతిస్తుంది. కేసును సత్వరం పరిష్కరించిన వారికి కృతజ్ఞతలు.