TTE Son And Railway Guard Father Selfie Photos Viral After Trains Crossed Each Other - Sakshi
Sakshi News home page

TTE Son Railway Guard Father Selife Pic: తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Published Fri, Jun 17 2022 8:07 AM | Last Updated on Thu, Jun 23 2022 8:17 PM

TTE Son and Raiway Guard Fathers Trains Crossed Each Other Selfie - Sakshi

న్యూఢిల్లీ: కెమెరాలో బంధించే కొన్ని ఫొటోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని ఎప్పుడు చూసుకున్న జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేస్తాయి. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ ఫొటో మాత్రం మరింత ‍ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇది తండ్రీకొడుకులు తమ విధి నిర్వహణలో భాగంగా ఒకరికొకరు ఎదురైనపుడు తీసుకున్న ఫొటో.

వివరాల్లోకెళ్తే.. సురేష్‌ కుమార్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ చిత్రంలో ఉన్న తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తుండగా.. కుమారుడు అదే రైల్వే శాఖలో ట్రావెల్‌ టికెట్‌ ఎగ్జామినర్‌గా ఉద్యోగం సాధించాడు. తండ్రీకొడుకులు డ్యూటీలో ఉన్న సమయంలో ఒక రోజు అకస్మాత్తుగా ఎదురెదురు రైళ్లలో తారసపడ్డారు. ఆ క్షణంలో తీసుకున్న సెల్ఫీ ఫొటోనే ఇది. ఇందులో తండ్రీకొడుకులు ఇద్దరు కూడా తమ యూనిఫామ్‌ ధరించి ఉన్నారు.

అయితే ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతోంది. ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘తండ్రీకొడుకులు ఉద్యోగాలు చేయడం సాధారణమే. కానీ ఒకే శాఖలో రెండు విభిన్న హోదాల్లో పనిచేయడం, వారు ఇలా తారస పడటం ఎంతో అద్భుతం’ అంటూ కాంమెంట్‌ చేస్తున్నారు. నెట్టింట్లో  షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే 50వేల మందికి పైగా లైక్ చేశారు. 

చదవండి: (ఆ ఏటీఎం మిషీన్‌ వద్దకే క్యూ కడుతున్న జనాలు! ఎందుకో తెలుసా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement