‘మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’.. ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత వైరల్‌ | viral: 5 Year Old Poem On Smelly Dad Funny Poem | Sakshi
Sakshi News home page

Viral: ‘మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’...ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత

Published Fri, Oct 1 2021 1:32 PM | Last Updated on Fri, Oct 1 2021 1:53 PM

viral: 5 Year Old Poem On Smelly Dad Funny Poem  - Sakshi

పిల్లలు తెలివిగా, చురుకుగా ఉండడంతోపాటు సరదా పనులు చేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలా సరదాగా ఓ ఐదేళ్ల అమ్మాయి త‌న తండ్రిపై చ‌మ‌త్కారంగా ఒక క‌విత రాసి తన కోపంతో పాటు ప్రేమను ప్రదర్శించి అంద‌ర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఆ చిన్నారి తన ప్రాస నైపుణ్యాలను ఆ కవితలో అద్భుతంగా ప్రదర్శించింది. తాజాగా ఈ కవిత ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అందులో.. ఆ చిన్నారి తన తండ్రి లైఫ్‌ స్టైల్‌ని కాస్త ఫన్నీగా వివరించింది. ఆ కవితలో చమత్కారంతో పాటు ప్రాస కూడా కుదిరేలా జాగ్రత్త పడింది. తను రాసిన ఆ క‌విత‌ను ఆమె త‌ల్లి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ఇది షేర్‌ చేయకుండా ఉంటేనే బాగుండేదంటూ క్యాప్షన్‌ పెట్టింది. దీన్ని చదివిన నెటిజన్లు ఆ ఐదేళ్ల చిన్నారి పదాలు తప్పు లేకుండా అంత కరెక్టుగా ఎలా రాసిందని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతూ దూసుకుపోతోంది. 

చదవండి: మాంచెస్టర్‌లో మహారాష్ట్ర కుర్చీ.. 7000 కి.మీ ఎలా ప్రయాణించిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement