
నేటికి కూతురు అనంగానే భారంగానే భావిస్తున్నారు పలువురు. విద్యావంతులైన వాళ్లు సైతం ఇదేతీరులో ప్రవర్తించడం బాధకరం. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతున్న 'ఆడపిల్ల' అనే వివక్ష విషయంలో మాత్రం మార్పు అంతంత మాత్రమే అనేది పలువురు సామజికవేత్తల వాదన. ఇలాంటి భావంతోనే ఓ తండ్రి నెలల పసికందు అని చూడకుండా కిటికిలోంచి విసిరేశాడు. సమయానికి పొరుగింటివాళ్లు స్పందించి కాపాడిన ఆ ప్రాణం..నేడు కనివినీ ఊహించని రీతిలో సంగీత విద్వాంసురాలిగా రాణించడమే కాదు రికార్డులు సృష్టిస్తోంది.
ఆ అమ్మాయే నియాతి చెట్రాన్ష్. ఆమెకు కేవలం నెలల వయసులో ఆమె తండ్రి కర్కశంగా కూతురు కుటుంబానికి భారమని కిటికీలోంచి విసిరేశాడు. ఆ దుశ్చర్యకు ఆ చిన్నారి తల్లిప్రాణం తట్టుకోలేకపోయింది. తక్షణమే ఆ తల్లి కట్టుకున్న భర్తను వద్దనుకుని అన్నీతానై పెంచాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. తాను ఈ ప్రపంచం తీరు మార్చలేకపోవచ్చు కానీ తన కుమార్తెను మాత్రం కాపాడుకోగలను అనుకుంది.
ఇక అలా ఆమె తన కూతురు నియాతికి అన్నీతానై ప్రేమగా పెంచుకుంటోంది. ఇక నియాతికి పెరిగేకొద్దీ సంగీతం పట్ల మక్కువ ఏర్పడటం మొదలైంది. ఆ ఇష్టమే ఆమెను జస్ట్ 12 ఏళ్లకే 42 వాయిద్యాలను వాయించే రేంజ్‌కి తీసుకొచ్చింది. ఆ ప్రతిభ ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా అనతి కాలంలోనే ఆమె పేరు, టాలెంట్ అందరికి తెలియడం మొదలైంది.
దాంతో ఆ చిన్నారి తల్లి ఉద్యోగాన్ని వదిలి.. ఫ్రీలాన్స్‌ర్‌గా పనిచేస్తూ.. కుమార్తె అభిరుచిని కొనసాగించడంలో సహాయపడింది. ఆమె తల్లి ప్రోత్సహాంతో నియాతి జాతీయ అంతర్జాతీ సవేదికలపై ప్రదర్శనలు ఇస్తూ..రికార్డుల సృష్టించడం మొదలుపెట్టింది. అంతేగాదు కేవలం 65 సెకన్లలో 15 వాయిద్యాలపై మన జాతీయ గీతాన్ని వాయించి, ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం సంపాదించింది. ఇవేగాక 13 నిమిషాలకు పైగా కళ్ళకు గంతలు కట్టుకుని శివ తాండవమ్‌ను కూడా ప్రదర్శించింది.
ఎలా ఈ రంగాన్ని ఎంచుకుందంటే..
నియాతి ఆరునెలల వయసులో తల్లి ఇచ్చిన బొమ్మ కీబోర్డ్‌ను చాలా ఆసక్తికరంగా వాయించే ప్రయత్నం చేసేది. అంతేగాదు వంటగదిలోని పాత్రలను ఒక లయబద్ధంగా కొట్టేది. అలా ఐదేళ్లు వచ్చేసరికి లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో గ్రేడెడ్ పియానో పరీక్షలు రాసింది. ఉకులేలే, ఫ్లూట్, తబలా వంటి 16 విభిన్న వాయిద్యాలను వాయించడం నేర్చుకుంది. పైగా నియాతి తన తల్లే తనకు గొప్ప రోల్‌మోడల్ అని ఆమె అందించిన ప్రోత్సాహంతో పేరుప్రఖ్యాతలు తీసుకురావడం తన కర్తవ్యమని సగర్వంగా చెబుతోంది. నిశబ్దంగా ఉసురు తీయాలనుకున్న వారికి మనసుకు హత్తకునే మ్యూజిక్‌తో సమాధానమిస్తానంటోంది.
(చదవండి:
(చదవండి: రూ. 8 లక్షలు విలువ చేసే స్నాక్‌బ్రాండ్! ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..)