
సాక్షి, మహబూబ్‌నగర్ : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు మేనేజర్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు రూ. 3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి జిల్లాలోని మియాపూర్, బాలాజీనగర్‌తో సహా ఐదు చోట్ల సోదాలు నిర్వహించగా భారీగా అక్రమ ఆస్తులను గురించారు. అధికారులు పల్లుచోట్ల ఇంకా సోదాలు జరుపుతున్నారు.