ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్: ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పురుషులు, మహిళల 59వ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సోమవారంనాటికి మూడో రోజుకు చేరింది. మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతుండటంతో క్రీడాభిమానులు పెద్దసంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు. గత ఏడాది జరిగిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల విభాగంలో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన ఇండియన్ రైల్వేస్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఆంధ్ర, ముంబై, కేరళ, కర్నాటక, తమిళనాడు టీంలు ఈ టోర్నీలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాయి.
ఆడిన లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి నాకౌ ట్ దశకు మార్గం సుగమం చేసుకుంటున్నాయి. సోమవా రం పురుషుల పూల్-ఏ విభాగంలో భారత రైల్వేస్, ఒడిశాపై 29-15, 29-10తో ఘన విజయం సాధించింది. పూల్-బిలో హైదరాబాద్, బీహార్‌పై 29-08, 29-04తో విజయం సాధిం చింది. పూల్- సీలో కర్ణాటక-మేజర్ పోర్ట్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మేజర్ పోర్ట్స్ మొదటి సెట్‌ను 29-26తో నెగ్గగా.. రెండో సెట్‌లో కర్నాటక ఆధిపత్యాన్ని సాధించింది. 29-27, 29-27తో రెండు సెట్‌లను కైవసం చేసుకుని విజయం సాధించింది.
పూల్-డీలో ఆంధ్రా, అసోంపై 29-09,29-08తో సునాయాస విజయంసాధించింది. ఆంధ్రా- తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్‌లో 29-27, 29-11తో ఆంధ్రా గెలుపొందింది. మహిళల పూల్-ఏలో తమిళనాడు, పుదుచ్చేరిపై 29-03, 29-01తో నెగ్గింది. అదే ఫూల్‌లో హైదరాబాద్, హర్యానపై 29-27, 29-20తో విజయం సాధించింది. పూల్-బీలో కేరళ, ఢిల్లీపై 29-03, 29-07తో గెలిచింది. పూల్-సీలో కర్ణాటక, ఇస్రో జట్టుపై 29-2, 29-0 తో ఘన విజయం సాధించింది. పూల్-డీలో ఆంధ్రా, ఎన్‌సీఆర్ జట్టుపై 29-12, 29-08తో గెలుపొందింది. ఆర్గనైజింగ్ కార్యదర్శులు వేజెళ్ల సురేష్‌కుమార్, హుస్సేన్, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు మ్యాచ్‌లు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. క్రీడాకారులకు వైద్య సహాయం అం దించేందుకు మంచుకొండ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
జోరుగా బాల్‌బ్యాడ్మింటన్
Published Tue, Jan 14 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement