
శివాజీనగర: మద్యం మత్తులో ఉన్న యువకులు స్నేహితుడితో గొడవపడి హత్య చేసిన ఉదంతం పుట్టేనహళ్లి పోలీసు స్టేషన్ వ్యాప్తిలో చోటు చేసుకుంది. పుష్పాంజలి కల్యాణ మంటపం వెనుక నివాసం ఉంటున్న సురేశ్‌కుమార్ (26) రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. సురేశ్‌కుమార్ శనివారం రాత్రి స్నేహితులతో కలిసి జేపీనగర ఐదో స్టేజీలోని ఓ తోటలో మందు పార్టీ చేసుకున్నాడు. ఏదో విషయంపై వారి మధ్య గొడవ చోటు చేసుకుంది.
ఓ దశలో సురేశ్‌కుమార్‌పై అతని స్నేహితులు గాజు సీసాలతో మెడపై దాడి చేసి ఉడాయించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.