13.3 మి.మీ సగటు వర్షపాతం నమోదు
Published Sat, Sep 3 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 13.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు ముఖ్య ప్రణాళికాధికారి ఇన్‌చార్జి టి.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 638 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా గోపాలపురం మండలంలో 41.4 మిల్లీమీటర్లు నమోదైందన్నారు. అత్యల్పంగా బుట్టాయిగూడెం, యలమంచిలి మండలాల్లో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమవరంలో 28.6, దేవరపల్లి 27.8, ద్వారకాతిరుమల 26.6, తాళ్లపూడి 26.4, నల్లజర్ల 25.6, కాళ్ల 25.2, జీలుగుమిల్లి 21.2, పెనుమంట్ర 21, గణపవరం 18, పెదపాడు, పెనుగొండలలో 17.8, టీ.నరసాపురం 17.6, భీమడోలు 17.2, ఏలూరు 16.8, కొవ్వూరు 16.2, కొయ్యలగూడెం 15.2, చాగల్లు 14.4, పెంటపాడు, వేలేరుపాడు, పాలకోడేరులలో 14.2, పెరవలి 13.2, తాడేపల్లిగూడెం 12.6, పోడూరు 11.6, దెందులూరు, వీరవాసరం, ఆచంట, ఉండిలలో 11.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదవేగి 10.8, చింతలపూడి, ఉంగుటూరులలో 9.4, తణుకు 9.2, నిడదవోలు, కుకునూరు 8.2, ఉండ్రాజవరం 7.8, ఆకివీడు 7.6, మొగల్తూరు 7, నిడమర్రు 6.8, జంగారెడ్డిగూడెం 6.6, అత్తిలి 6.4, పోలవరం, కామవరపుకోటలో 6.2, ఇరగవరం 5.2, పాలకొల్లు 4 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు చెప్పారు.
Advertisement
Advertisement