rain fall
-
నెల్లూరులో గంటపాటు దంచికొట్టిన భారీ వర్షం
-
#APHeavyRains : ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (ఫొటోలు)
-
విజయవాడ వరద : గుండెలను మెలిపెట్టే చిత్రాలు
-
ఢిల్లీకి వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఎల్లో అలెర్ట్ జారీ
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ తరుణంలో సోమవారం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల కారణంగా భారీ వర్ష పాతం నమోదు అయ్యే అవకాశం ఉందని భావించిన వాతావరణ శాఖ ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో గురువారం వరకు తేలికపాటి వర్షం, మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలిపింది.ఢిల్లీలో ఆదివారం ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 5.30వరకు వర్షం పడలేదు. దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో రుతుపవనాల ద్రోణి కదిలి ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలపై మళ్లుతుందని వాతావరణ శాఖ అధికారుల అంచనా. -
తెలంగాణ అంతటా మరోసారి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగాయి. వర్షం బీభత్సంతో వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. పలువురు నీట మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మహబూబాబాద్‌లో కురస్తున్న భారీ వర్షాలకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఫలితంగా రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఐఎండీ గుజరాత్‌తో పాటు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న తెలంగాణా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వర్షపాతం. వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం రాష్ట్రంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి దారి మళ్లించింది. హైదరాబాద్‌లోనూ శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. 2020 వరదల మాదిరిగానే 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్న అనుకూల వాతావరణంతో నగరానికి ఉపశమనం కలిగినట్లు తెలిపింది.ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం సహా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గుజరాత్లో సైతం1976 తర్వాత అరేబియా సముద్రంలో తొలిసారి తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. గుజరాత్లో ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 29 వరకు కురిసింది. ఈ వర్షం ధాటికి 47 మంది మరణించారు. ఈ తరుణంలో ఆదివారం (సెప్టెంబర్1) వాతవారణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన వర్షాలు సెప్టెంబర్ 5వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. -
ఏపీలో భీకర వర్షాలు.. ప్రకాశం బ్యారేజ్ వద్ద హైఅలర్ట్!
AP Rains Forecast Updates..👉బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల్లో కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో పలు చోట్ల కుండపోత కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయవాడలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.👉 ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్ డేట్భారీగా పెరుగుతున్న వరదకొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక జారీఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,05,895 క్యూసెక్కులుమొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తివేతవిజయవాడ నగరవాసులను వీడని వర్షం భయం. బిక్కుబిక్కుమంటున్న కొండ ప్రాంత ప్రజలు. కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో భయంలో స్థానికులు. రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన కొంత ప్రాంత ప్రజలు. మరోవైపు.. క్రీస్తురాజుపురం ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. కాగా, వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. 👉భారీ వర్షాల కారణంగా పలు రైలు సర్వీసులు రద్దు.. SCR Sets Up Help Line Numbers in view of Heavy Rains@drmsecunderabad @drmhyb @drmgnt @drmgtl @drmvijayawada pic.twitter.com/FHyqjISxY6— South Central Railway (@SCRailwayIndia) August 31, 2024 SCR PR No.331 dt.31.08.24 on SCR Sets Up Additional Help Line Numbers in view of Heavy Rains pic.twitter.com/bxkpZvfW0C— South Central Railway (@SCRailwayIndia) August 31, 2024 వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు..రాష్ట్రంలో తుపాను, వరదల నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.ముఖ్యంగా గర్భిణిలకు, పాము కాటుకు గురైన వారికి, విద్యుతాఘాతాలకు గురైన వారికి రాష్ట్ర కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుందిఅత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్ర కంట్రోల్ రూం ఫోన్ నంబరు 9032384168కు ఫోన్ చెయ్యాలి.ఇమెయిల్ ఐడీ: epeidemics.apstate@gmail.comకంట్రోల్ రూం ఇన్ఛార్జిగా డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేస్వరి (7386451239),హెడ్‌గా స్టేట్ హెల్త్ ఆఫీసర్-ఐడిఎస్పీ డాక్టర్ ఎమ్వీ పద్మజ(83748935490) వ్యవహరిస్తారువీరిద్దరి ఆధ్వర్యంలో మూడు షిఫ్టుల వారీగా ముగ్గురు సభ్యుల బృందం సెప్టెంబర్-3వ తేదీ వరకు కంట్రోల్ రూంలో నిరంతరం అత్యవసర వైద్య సేవల్ని పర్యవేక్షిస్తారుషిఫ్టుల వారీ రిపోర్టుల్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు అందజేస్తారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థతో సమన్యయం చేసుకుని పనిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ మొదటి షిఫ్ట్ కు (ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు) టీబీ, జేడీ డాక్టర్ టి.రమేష్-9849909911,రెండో షిఫ్ట్‌కు (మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు) ఐడిఎస్పీ జేడీ డాక్టర్ మల్లేశ్వరి -9491423226,మూడో షిఫ్ట్‌కు (రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు)ట్రైబల్ హెల్త్ పీఓ డాక్టర్ ఎం.రమేష్ బాబు-9959727979ను వైద్య ఆరోగ్య శాఖ నియమించింది 👉విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో, అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. Extreme rains in Umamaheswaram temple area..There is a possibility of landslides.Temple officials Advising to devotees vacate the premises immediately and not to visit temple for couple of days.Video By - Rajesh pic.twitter.com/SDxeGbu3QN— Naveen Reddy (@navin_ankampali) August 31, 2024👉మరోవైపు.. సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా వరద నీరు పెరుగుతోంది. 👉కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో వరద నీరు చేరే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్‌లో వరద ఉధృతితో సీఎం నివాసానికి వరద ముప్పు. దీంతో, అధికారుల్లో ఆందోళన నెలకొంది.ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి పూర్తిగా నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులు దాటితే కరకట్ట వైపు నీళ్లు వెళ్లే అవకాశం ఉంది. 👉విజయవాడకు వచ్చే వాహనాలను నిలిపివేశారు. బొమ్మలూరు వద్ద హైవేపైకి వరద నీరు చేరుకుంది. పలు చోట్ల వరద నీరు చేరుకోవడంతో వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Situation near Mylavaram, NTR District, AP.Mylavaram AWS got 194 mm yesterday and 51 mm till now today.Krishna river will get huge inflows at Prakasam barrage as Nalgonda and Khammam districts also get heavy rain.Video Shared by my friend. pic.twitter.com/9DAugi9S2A— Naveen Reddy (@navin_ankampali) August 31, 2024 👉ఇక, వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12:30-2:30 గంటల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 👉శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు. 👉ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం👉విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు👉వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.👉లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 👉మరోవైపు.. భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది.👉ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.👉ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,55,250 క్యూసెక్కలుగా కొనసాగుతోంద.ఇ👉నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి. పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలి. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకండి అని అధికారులు హెచ్చరించారు. -
రోజంతా ముంచెత్తిన వాన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. అయితే తెల్లవారు జామునుంచే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై చెరువులను తలపించాయి. ఫలితంగా ఆయా రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కురుస్తాయనే ముందస్తు సమాచారంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. హైదరాబాద్ సమీప జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు లోటు వర్షపాతంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సమీప జిల్లాలకు ఈ వర్షంతో భారీ ఊరట దక్కింది. రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం...ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవగా, దక్షిణ ప్రాంత జిల్లాల్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 7.31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 50.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, మంగళవారం నాటికి 58.27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 15శాతం అధికంగా వానలు కురిసినట్టు ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుంలాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.– భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముషీరాబాద్ పార్శిగుట్టకు చెందిన విజయ్‌కుమార్(43) వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. కారులు, బైకులు కూడా కొట్టుకొని పోయాయి. ఒక అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడి కొద్దిమేర ధ్వంసమై బీటల వారింది.పలు ప్రాంతాల్లో గోడలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి వరద పోటెత్తోంది. దీంతో మూసారాంబాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జంటజలాశయాల్లో సైతం భారీ వరద నీరు వచ్చి చేరింది.– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వంద పడకల ఆస్పత్రి భవన ప్రాంగణం జలమయమైంది. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద రెండు అడుగుల వరద నీరు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గద్వాల జిల్లా అయిజ మండలంలో ఓ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. – రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉరకలెత్తాయి. లోతట్లు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. కడ్తాల్ మండలం మేడికుంట చెరువుకు గండి పడి, నీరంతా వృథాగా పోయింది. -
హైదరాబాద్: పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వాన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారి మేఘాలు కమ్ముకొని.. పలు చోట్ల వాన కురిసింది. కోఠి, సెక్రటేరియట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బలహీన పడిన ఉపరీతల ఆవర్థనం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో 2, 3 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయని హైదారబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరీతల ఆవర్థనం బలహీన పడిందని పేర్కొంది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షం పడనున్నట్లు సూచించింది. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది. సాయంత్రం హైదరాబాద్‌కి ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. దక్షిణ ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల పడతాయని పేర్కొంది. -
ఎడారి దేశంలో మళ్లీ వర్షం.. విమాన సర్వీసులు రద్దు
ఎడారి దేశం దుబాయ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. యూఏఈలో గురువారం మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దుబాయ్ వాతావరణ శాఖ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దాంతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుబాయ్‌లో బస్సు సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అబుదాబి అంతటా ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ వంటి విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ముందే నివేదించాయి. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్, అబుదాబి, షార్జాలలో విమాన సర్వీసుల్లో మార్పులుంటాయి. వర్షాల కారణంగా స్థానికంగా రోడ్డు ప్రయాణాల్లో అవాంతరాలు కలుగొచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికులు సిద్ధంకావాలి’ అని ఇండిగో ఎయిర్‌లైన్ తన ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది.ఇదీ చదవండి: భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..బుధవారం రోజునే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు స్థానిక విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. అక్కడి జాతీయ దినపత్రిక ఖలీజ్ టైమ్స్ కథనాల ప్రకారం..గురువారం రాత్రి దుబాయ్‌కి వెళ్లే ఐదు ఇన్‌బౌండ్ విమానాలను దారి మళ్లించగా, తొమ్మిది అరైవల్, నాలుగు అవుట్‌బౌండ్ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిసింది.#6ETravelAdvisory: Due to bad weather in #Dubai #Sharjah #RasAlKhaimah #AbuDhabi, our flight operations are impacted. Road blockages may disrupt local transport. Plan accordingly and allow extra time for airport travel. Check flight status at https://t.co/F83aKzsIHg— IndiGo (@IndiGo6E) May 2, 2024 -
ఉపశమనం.. తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికోడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) రేపు(సోమవారం) రెండు రోజుల పాటు రాష్టానికి తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇక.. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో ఈరోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులంబ గద్వాల జిల్లాలకు వడగాల్పుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు (సోమవారం) రాష్ట్రంలో వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు విచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాస్త ఉపశమనం.. నాలుగు రోజుల వర్ష సూచన ఇప్పటికే తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పలు జిలాల్లో కురిసే అవకాశం ఉంది, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు అదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. -
తెలంగాణకు చల్లటి కబురు.. రెండు రోజులు వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: వేసవి ఎండతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందిన తెలిపింది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఈనెల 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. @CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #ECISVEEP #CEO_Telangana pic.twitter.com/DWngGDsOSh — IMD_Metcentrehyd (@metcentrehyd) April 3, 2024 మరోవైపు.. తెలంగాణలో ఈ ఎండా కాలంలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో 41.2, ఆదిలాబాద్‌లో 41.3, మెదక్, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
రెండురోజుల్లో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: మయన్మార్ తీరానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మరోవైపు వాయవ్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర సముద్రతీర ప్రాంతాల వరకు, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్ అంతర్భాగంగా తూర్పు–పడమర ద్రోణి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ఫలితంగా రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేకచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి వరకు విజయనగరం, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ఇది కూడా చదవండి: టమాటా రైతుకు బాసట.. -
దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వానలు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, హైద రాబాద్ జిల్లాల్లో దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. ముఖ్యంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి కురిసిన కుండపోత వాన గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలను వణికించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో మూడురోజులు వర్షాలు కొన సాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దంచికొట్టి.. వణికించి.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వాన జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోత ట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరింది. రోడ్లు చెరువులను తలపించాయి. పలుచోట్ల రోడ్లపై వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. మియాపూర్‌లో మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఐదు గంటల్లోనే ఏకంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెంటీమీటర్లు వాన పడినట్టు వాతావరణశాఖ ప్రకటించింది. రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్ల పరిధిలో పిల్లర్ నంబర్ 193 ప్రాంతం, శివరాంపల్లి, నేషనల్ పోలీస్ అకాడమీ ప్రాంతాల్లో రోడ్డుపై వరద నిలిచి రాకపోకలు స్తంభించాయి. మణికొండలోని పంచవటి కాలనీలో వరద రోడ్డును ముంచెత్తింది. మంచిరేవుల వద్ద చిన్న గుట్టపై నుంచి బండరాళ్లు దొర్లి ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్డుపైకి వచ్చాయి. ఇక భారీ వర్షం కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. స్తంభించిన ట్రాఫిక్‌తో యాతన కొన్ని ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొంత దూరం ప్రయాణించడానికి కూడా అరగంట, గంట సమయం పట్టడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. బేగంపేట, పంజాగుట్ట, మాదాపూర్, దుర్గం చెరువు, మినిస్టర్ రోడ్డు, టోలీచౌకి, భరత్‌నగర్ ఫ్లైఓవర్, ఎల్బీ నగర్, మేడ్చల్, సుచిత్ర, బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఐకియా తదితర మార్గాల్లో ఈ దుస్థితి కనిపించింది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది. జంట జలాశయాల గేట్లు ఎత్తివేత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో భారీ వర్షాలతో పలు చెరువులు అలుగుపోస్తున్నాయి, వాగులు పొంగుతున్నాయి. దీనితో ఈసీ, మూసీ నదులకు వరద పోటెత్తింది. దీనితో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండల్లా మారాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి 5వేల క్యూసెక్కులకుపైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. మూసారాంబాగ్ వంతెన వద్ద వరద మట్టం పెరగడంతో తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేశారు. ప్రొక్లెయినర్లతో విద్యార్థులను తరలించి.. భారీ వర్షాలు, వరదతో గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో ప్రైవేటు హాస్టళ్లను నిర్వహిస్తున్న సుమారు 15 అపార్ట్మెంట్లు జల దిగ్బంధమయ్యాయి. విద్యార్థులంతా హాస్టళ్లలో చిక్కుకుపోవడంతో భయాందోళన వ్యక్తమైంది. అధికారులు ప్రొక్లెయినర్ల సాయంతో హాస్టళ్లలోని విద్యార్ధులను బయటికి తరలించారు. మరో మూడు రోజులూ భారీ వర్షాలు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఆవర్తన ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరంలో అల్పపీడనం ఏర్పడిందని.. దాని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 15.75, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురంలో 15.35, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు తెలిపింది. మొత్తంగా ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలోని 21 జిల్లాల్లో అత్యధికంగా, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు: సీఎస్ మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని.. అగ్నిమాపక, పోలీసు బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సీఎస్ మంగళవారం కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని.. వాటికి గండ్లు పడకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగులు ఉధృతంగా ప్రవహించే కాజ్ వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద ముందుజాగ్రత్త చర్యగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. -
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
ఈసారి వానలు తక్కువే.. కరువుకు 20 శాతం ఛాన్స్! ఇబ్బందులు తప్పవు
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్ వెదర్’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. వరుసగా గత నాలుగేళ్లుగా దేశంలో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తప్పవు. పంటల ఉత్పత్తి పడిపోతుంది. తద్వారా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. చదవండి: ఆప్‌కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్ -
తిరుపతి నగరంలో భారీ వర్షం (ఫోటోలు)
-
తెలంగాణ: ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంపై వర్ష ప్రభావం.. మరో వారంపాటు ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు..(శని, ఆది వారాల్లో) ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసరాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినప్పటికీ.. ఉదయం లేదా సాయంత్రం పూట చిరుజల్లులు కురిసే అవకాశం ఉండొచ్చని తెలిపింది. #15OCT 4:50AM⚠️ Rainy Morning Ahead for #Hyderabad During 5-8AM Moderate -Heavy Rains expected in Many parts of City in next 3-4Hrs Please Plan Accordingly ⚠️⚠️⚠️#HyderabadRains pic.twitter.com/jH58FNh2BW — Hyderabad Rains (@Hyderabadrains) October 14, 2022 HEAVY DOWNPOUR ALERT TODAY ⚠️ STRONG EASTERLY CONVERGENCE will cause Widespread rains in almost all many districts of Telangana during afternoon - early morning with HEAVY - VERY HEAVY RAINS at few areas ⚠️ Hyderabad too, high chances for strong rains during afternoon - morning pic.twitter.com/wNCk1XY8TY — Telangana Weatherman (@balaji25_t) October 15, 2022 ఇదీ చదవండి: ఏపీకి పొంచి ఉన్న తుపాను గండం! -
హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం.. ఫొటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మాదాపూర్, అమీర్‌పేట, బషీర్ బాగ్, అబిడ్స్, లకిడికాపుల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అల్వాల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అన్నారు. it's Raining 🌧 @Hyderabadrains #rains #HyderabadRains pic.twitter.com/opYupmA8e9 — Muhammed Dastagir (@Dastagir_Hyd) September 27, 2022 Durgam Cheruvu wants all of this water but the drains were never built only 👍🏾 Madhapur is a disaster every rain with our without city wines#HyderabadRains pic.twitter.com/qKrQwRxqF5 — Donita Jose (@DonitaJose) September 27, 2022 @KTRTRS hyderabad capital city #HyderabadRains #ghmc pic.twitter.com/uqW9MM0JU3 — BalaramRajdoot (@BRd175) September 27, 2022 Rain @hyd mind space#HyderabadRains pic.twitter.com/F5VNSbzf9p — sridhar reddy (@reshusri) September 27, 2022 Rains 🙈😓😓😓#HyderabadRains pic.twitter.com/PMqUrUlUj3 — Hemangi Gala🇮🇳 (@hemangigala) September 27, 2022 #HyderabadRains #Hyderabad #whether #rains pic.twitter.com/wZs3XRZoVs — Satish Shukla🇮🇳 (@Satish_shukla99) September 27, 2022 -
జర పైలం: మరో మూడు రోజులు మస్తు వానలే.. ఈ జిల్లాల్లో జాగ్రత్త!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. pic.twitter.com/RPhZIciJTL — IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2022 కాగా, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాద్రాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. pic.twitter.com/qRCs1YJSXV — IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2022 -
అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు...ముగ్గురు మృతి
Assam Floods Nearly 25,000 people affected: దేశంలో అనేక రాష్ట్రలలోని ప్రజలు భయంకరమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అస్సాం మాత్రం అకాల వర్షాలతో వరదల్లో చిక్కుకుంది. అసోంలోని దిమా హసావో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది. కొండ జిల్లా ఆకస్మిక వరదలు కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. కొండచరియలు విరిగిపడటంతో జటింగా-హరంగాజావో, మహూర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ నిలిచిపోయింది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారి బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాల కారణంగా సుమారు ఐదు జిల్లాలోని దాదాపు 25000 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. వరదలు సృష్టించిని విధ్వంసం: న్యూ కుంజంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయ్, నమ్‌జురాంగ్, సౌత్ బగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్, లోడి పాంగ్‌మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఏఎస్డీఎంఏ తెలిపింది. అస్సాంలోని ఇప్పటి వరకు కాచర్, దేమాజీ, హోజాయ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, నాగావ్, కమ్రూవ్ ఈ ఆరు జిల్లాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. ఆరు జిల్లాలో 94 గ్రామాలకు చెందిన 24,681 మంది వరద బారిన పడ్డారు. ఒక్క కాచర్ జిల్లాలోనే 21,000 మంది వరద బారిన పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో కర్బీ ఆంగ్లోంగ్ వెస్ట్ దాదాపు 2,000 మంది బాధితులు, ధేమాజీలో 600 మందికి పైగా ప్రజలు ప్రళయం బారిన పడ్డారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ అడ్మినిస్ట్రేషన్‌తో సహా క్యాచర్, హోజాయ్ జిల్లాలకు చెందిన శిక్షణ పొందిన వాలంటీర్లు దాదాపు 2,200 మందిని రక్షించారు. #WATCH Roads, bridges and agricultural land were inundated in Hojai, Assam yesterday due to floods following incessant rain in the region pic.twitter.com/DitKiMbb6O — ANI (@ANI) May 15, 2022 (చదవండి: పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు) -
కడప నగరం.. జలమయం
కడప కార్పొరేషన్: ‘అసని’ తుపాను ప్రభావంతో నగరంలో జోరుగా వర్షం పడుతూనే ఉంది బుధవారం అర్థరాత్రి నుంచి నిర్విరామంగా కురిసిన వర్షానికి కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తమైంది. మండువేసవిలో వర్షాకాలాన్ని తలపించేలా కురిసిన వర్షాన్ని చూసి జనం ఆశ్చర్యపోయారు. ఉదయం నుంచి సన్నటి జల్లులతో నిరంతరాయంగా కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్టాండు, అప్సర థియేటర్, వై జంక్షన్, మృత్యుంజయకుంట, ఎస్బీఐ కాలనీ, బాలాజీన నగర్, శాస్త్రి నగర్, గంజికుంట కాలనీ, గౌస్ నగర్, పాతకడప, రామాంజనేయపురం, చిన్నచౌకు, ప్రకాష్‌నగర్, ఓంశాంతి నగర్, ఎన్టీఆర్నగర్, అంగడివీధి, మాసాపేట, నంద్యాల నాగిరెడ్డికాలనీ, రామరాజుపల్లె, ఎన్జీఓ కాలనీ, అల్లూరి సీతారామరాజు నగర్, రామకృష్ణ నగర్, భరత్ నగర్, మేకల దొడ్డి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధి వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వ్యాపారులు అవస్థలు పడ్డారు. మోకాలిలోతుకుపైగా ఉన్న నీటిలో వాహనాలు దిగడం వల్ల ఇంజిన్లలోకి నీరు చేరి అవి మొరాయించాయి. పాత కడపలో పెద్ద ఎత్తున వర్షపునీరు నిలవడంతో పాతకడప జెడ్పీ స్కూల్లో పరీక్ష రాసే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. -
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నగరంలోని మలక్ పెట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, చంపా పేట్, ఉప్పల్, మేడిపల్లి, రామంతపూర్, జూపార్క్, ఫలక్‌నూమా, బహదూర్ పురా, పాతబస్తీలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే నగర శివారులోని దుండిగల్, సూరారం, దూలపల్లి, బహదూర్ పల్లి, పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో నగరవాసులకు ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగింది. -
దిల్‌షుఖ్‌నగర్ థియేటర్లోకి భారీగా వరద నీరు, 40 వాహనాలు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం జలమయైంది. నగరంలో ఎక్కడ చూసిన రోడ్లన్ని నీట మునిగాయి. దీంతో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక దిల్‌షుఖ్‌నగర్‌లోని ప్రముఖ శివగంగ థియేటర్లోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అలాగే ఈ భారీ వర్షానికి థియేటర్ పక్కన ఉన్న గోడ కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసిన 40 వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఆ గోడను పక్కనే ఉన్న నాళ పక్కనే కట్డడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నాళ పక్కనే గోడ కట్టడంతో అది కూలడంతో నాళ దెబ్బతిందని, దీంతో భారీగా నీరు రోడ్లపైకి, థియేటర్లోకి, ఇళ్లలోకి చేరినట్లు స్థానికులు పేర్కొన్నారు. -
రాయలసీమలో నేడు, రేపు వానలు
సాక్షి, విశాఖపట్నం: తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా తేమగాలులు రాయలసీమ వైపుగా పయనిస్తున్నాయి. దీంతో పాటు తీరం వెంబడి తూర్పు–పశ్చిమ గాలుల కలయిక (షియర్ జోన్) కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమలో మంగళ, బుధవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. చదవండి: ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు 27 వరకు గడువు -
Telangana: దంచికొట్టిన వాన
మెదక్ జిల్లా చేగుంటలో అత్యధికంగా 21.7 సెంటీమీటర్లు, మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో 20.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25 చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వాన కురిసింది. చాలా ప్రాంతాల్లో పది, పదిహేను సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. పెద్ద సంఖ్యలో కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఐదు జిల్లాల్లో అప్రమత్తం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడే అవకాశం ఉందని.. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల కింద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోపాటు ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 36.9 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.67 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా హైదరాబాద్‌లో 8.17 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది. జిల్లాల్లో వానలే వానలు.. యాదాద్రి జిల్లాలో బుధవారం రాత్రంతా కుండపోత వాన పడింది. 25 చెరువులు అలుగు పోస్తున్నాయి. బిక్కేరు వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1,000 ఎకరాల్లో వరి నీటమునిగింది. పత్తి చేలలో నీరు నిలిచింది. మూసీ కల్వర్టులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేశారు. జనగామ జిల్లాలో భారీ వర్షంతో బచ్చన్నపేట- నక్కవానిగూడెం శివారు, జనగామ మండలం గానుగుపహాడ్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. నల్లచెరువు, వెల్దండ, గండిరామారం, తాటికొండ వల్లభరాయ్, ఛాగల్ మర్రికుంట చెరు వులు మత్తడి పోస్తున్నాయి. రోడ్లపై నీటి వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వీర్నపల్లి మండలంలోని గిరిజన తండాల్లో వాననీరు ఇళ్లలోకి చేరింది. పత్తి చేన్లు మునిగాయి. నక్కవాగు, సుద్దవాగు, బిక్కవాగు, గంజివాగు, సండ్రవాగులు పొంగిపొర్లుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుద్రంగి మండలంలో గొర్రెగుండం జలపాతం దూకుతోంది. వికారాబాద్ జిల్లాలో వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. పరిగి, వికారాబాద్, తాండూర్ పట్టణాల్లోని పలు కాలనీల్లో నీళ్లు చేరాయి. ధారూర్ మండలం రాళ్లచిట్టంపల్లిలో ఇల్లు కూలి షబ్బీర్ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. మోమిన్‌పేట మండలం గోవిందాపూర్‌కు చెందిన బుడ్డమ్మ ఆసరా పింఛన్ తీసుకొని వస్తుండగా మల్లారెడ్డిగూడెం సమీపంలోని వాగు దాటుతూ కొట్టుకుపోయింది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌లో ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చిక్కుకుని.. సురక్షితంగా బయటపడి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం–ఎఖీన్‌పూర్ గ్రామాల మధ్య వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా.. పోలీసులు ఫైర్ రెస్క్యూ టీం, గ్రామస్తులతో కలిసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తెగిన చెరువు కట్ట భారీవర్షంతో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో చెరువు కట్ట తెగిపోవడంతో పెద్దవాగు పొంగిపొర్లింది. సాతారంలో శివార్లలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఏడుగురు, వేంపల్లిలో మరొకరు వాగులో చిక్కుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు గజ ఈతగాళ్లు, తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. -
Monsoon: నైరుతి వచ్చేసింది!
సాక్షి, హైదరాబాద్: ‘నైరుతి’రాష్ట్రాన్ని పలకరించింది. ఈ నెల 3న కేరళను తాకిన రుతుపవనాలు.. చురుకుగా ముందుకు వస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా రాష్ట్రం వైపు వ్యాపిస్తున్నాయి. శనివారం రాష్ట్రంలోని నైరుతి దిశలో ఉన్న జిల్లాల్లో రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఈ రుతుపవనాలు రాష్ట్రంలోని చాలాచోట్ల విస్తరించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే కర్ణాటక తీరం, గోవా అంతటా, మహారాష్ట్రలోని కొంత భాగం వరకు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాగే ఉత్తర కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు.. రాష్ట్రానికి నైరుతి దిక్కు నుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని సూచించింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వానలు కురిశాయి. సగటున సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు మినహాయిస్తే మిగతా అంతటా వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో అత్యధికంగా 8.75 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కాస్త ముందే... ఈ ఏడాది నైరుతి రుతపవనాలు కాస్త ముందుగానే వచ్చాయి. గతేడాది జూన్1న కేరళలోకి ప్రవేశించిన నైరుతి క్రమంగా విస్తరిస్తూ జూన్ 11న రాష్ట్రానికి చేరుకుంది. ఈ ఏడాది మే 30న కేరళకు చేరుకుంటాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసి... క్రమంగా మే 31 నాటికి వస్తాయని ప్రకటించింది. చివరకు మరింత లోతైన అంచనాలతో జూన్ 3న కేరళను తాకుతాయని పేర్కొంది. ఈ మేరకు నైరుతి దిశ నుంచి కిందిస్థాయి గాలులతో రుతుపవనాల రాక కనిపించింది. అనంతరం రుతుపవనాలు చురుకుగా ముందుకు సాగడం... రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి కిందిస్థాయి గాలుల తీవ్రత ఎక్కువవడంతో రెండ్రోజుల్లోనే రాష్ట్రాన్ని పలకరించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆరు రోజుల ముందే రాష్ట్రాన్ని చేరుకోవడం గమనార్హం. -
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం పడుతుంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, బోరబండ, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో డీఆర్ఎఫ్ సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా బొమ్మనదేవిపల్లిలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 35 కేంద్రాల్లో వర్షపాతం రికార్డయిందని, భద్రాచలంలో అత్యధికంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. చదవండి: తెలంగాణలో మళ్లీ ఎన్నికలు: రేపు నోటిఫికేషన్? కుంభకోణం: మాజీ మంత్రి పేషీ నుంచే..! -
ముంబైలో తేలికపాటి జల్లులు
ముంబై: దేశ ఆర్థిక రాజధానిని వరుణుడు కరుణించడం లేదు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ముంబైతో పాటు థానె, కళ్యాణ్, దోంబివాల వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం ఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. పొగమంచు కప్పేయడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. పరిసరాలు సరిగా కనిపించడం లేదు. ఈ సందర్భంగా ప్రాంతీయ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేఎస్ హోసాలికర్ మాట్లాడుతూ.. ‘ముంబై, థానె, నవీ ముంబై ప్రాంతాల్లో గడిచిన ఆరు గంటల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఇక రానున్న మూడు, నాలుగు గంటల్లో ఈ ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది’ అని తెలిపారు. ఇక మరో 24 గంటల పాటు ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపారు. ఇక వాతావరణ శాఖ ప్రకారం మరో 48 గంటల పాటు ముంబై, పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతం అయి ఉంటుందని.. ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు పడి పోతుందని వెల్లడించింది. ముంబై వాతావరణ పరిస్థితులకు సంబంధించి పలువురు నెటిజన్లు ఫోటోలు షేర్ చేస్తున్నారు. Dip in temperatures with smog shrouding parts of Mumbai city and Thane leading to decreased visibility. According to the forecast, it is likely to be cloudy with the minimum temperature at 23 to 22 degrees celsius for next 48 hours#Mumbairains #December #rains #thane #birds pic.twitter.com/quQXw3OJ2Z — Pratik Mukane | प्रतिक मुकणे (@pratikmukane) December 14, 2020 -
విశ్వ నగరాలు.. శాస్త్రీయ విధానాలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో నిండా మునకేస్తోంది మన గ్రేటర్ సిటీ. ఈ దుస్థితిని నివారించేందుకు విశ్వనగరాల్లో అమలవుతున్న అత్యున్నత శాస్త్రీయ విధానాలు భాగ్యనగరంలోనూ అమలుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో లండన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, పారిస్ నగరాల్లో భారీ వర్షం, విపత్తులు సంభవించినపుడు ప్రధాన రహదారులు, కాలనీలు మునగకుండా వరద, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు ఉండడం విశేషం. ఆయా నగరాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను నగరంలోనూ అమలు చేస్తే ముంపు సమస్యలను నివారించడం సాధ్యపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బార్సిలోనాలో.. బెంగళూరులో ఇంజెక్షన్ వెల్ సాంకేతికత ఇలా.. బెంగళూరు నగరంలో ప్రధాన రహదారులను ముంచెత్తుతున్న వరద నీటిని అరికట్టేందుకు భారీ సంఖ్యలో అండర్‌పాస్‌లు, ప్రధాన రహదారులపై ఇంజెక్షన్ వెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భూమిపైనుంచి బోర్వెల్ యంత్రంతో 150 నుంచి 200 అడుగుల లోతు వరకు బోరుబావి(ఇంజెక్షన్ వెల్) తవ్వుతారు. ఈ బావిలోకి 12 ఎంఎం పరిమాణం చిల్లులున్న కేసింగ్ పైపును దింపుతారు. పైపులోనికి రాళ్లు చేరకుండా చుట్టూ సన్నటి జాలీని ఏర్పాటు చేస్తారు. ఈ బోరుబావి చుట్టూ రెండు మీటర్ల లోతు, మరో 1.5 మీటర్ల పొడవు, వెడల్పుతో గుంత ఏర్పాటు చేస్తారు. ఈ గుంతలో ఒక మీటరు మందం వరకు 40 ఎంఎం పరిమాణం ఉన్న బెందడి రాళ్లు వేస్తారు. మరో 0.5 మీటర్ల మేర 20 ఎంఎం పరిమాణం ఉన్న గులకరాళ్లను నింపుతారు. మరో 0.3 మీటర్ల మేర మందం ఇసుకతో నింపుతారు. పార్కు లేదా కమ్యూనిటీ హాలు లేదా లోతట్టు ప్రాంతాల నుంచి వర్షపునీరు వచ్చి ఈ ఇంకుడు గుంతపై కొద్దిసేపు నిలిచే ఏర్పాటు చేస్తారు. ఈ నీరు ఇంకుడు గుంత నుంచి, దానికి మధ్యలో రంధ్రాలున్న కేసింగ్ పైపు ద్వారా దశలవారీగా భూమి లోపలి పొరల్లోకి ఇంకుతుంది. దీంతో వర్షపునీరు భూమి అంతరాల్లో ఉన్న ఆయా పొరల్లోకి పాకుతుంది. దీంతో ఆయా పొరల్లోకి సమృద్ధిగా నీటి ఊట చేరి సమీపంలో కిలోమీటరు పరిధిలో ఉన్న బోరుబావులు త్వరగా రీఛార్జీ అవుతాయి. సాధారణ ఇంకుడు గుంత కంటే ఇంజెక్షన్ వెల్ సాంకేతికత ఆధారంగా నిర్మించే రీఛార్జి పిట్స్‌తో ఫలితాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఒక్కో ఇంజెక్షన్ వెల్‌కు సుమారు రూ.40 వేల అంచనా వ్యయం కానుందని అంచనా. మన నగరంలోని కుత్బుల్లాపూర్ ఉమామహేశ్వర కాలనీ దుస్థితి ఇదీ.. విశ్వ నగరాల్లో చర్యలివే.. ఆయా నగరాల్లోని అన్ని ప్రధాన, సర్వీసు రహదారులకు ఇరువైపులా వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా వరదనీటి కాల్వలను ఏర్పాటు చేశారు. కాల్వల్లో మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ. ఆయా రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో రెయిన్‌గేజ్, స్మార్ట్‌బాల్ టెక్నాలజీ ఆధారంగా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రీయ అంచనాతో ముంపు నివారణ. వరద నీటి కాల్వలపై ఆక్రమణలు పూర్తిగా నిషిద్ధం. లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు కొలనుల ఏర్పాటుతో వరదనీరు నేలగర్భంలోకి సులువుగా ఇంకేలా చర్యలు. పార్కులు, ఫుట్‌పాత్‌లు, రహదారులకు ఇరువైపులా, నగరంలో ఖాళీస్థలాల్లో భారీగా గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయడంతో కాంక్రీట్ విస్తీర్ణం తగ్గి వర్షపు నీరు నేలగర్భంలోకి చేరుతుండడంతో తప్పుతున్న ముంపు అవస్థలు. ప్రతి ఇల్లూ, భవనం, కార్యాలయం, వాణిజ్య సముదాయంపై కురిసిన వర్షాన్ని నిల్వ చేసేందుకు అందుబాటులో విధిగా రీఛార్జింగ్ పిట్. దీంతో రహదారులపైకి వచ్చే వరద సుమారు 60 శాతం తగ్గుతోంది. భవన విస్తీర్ణంలో సగభాగం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడటంతో వరద ముప్పు తప్పుతోంది. ఇక ఫిలడెల్ఫియా (అమెరికా), బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపడుతున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతున ఇంకుడు గుంత ఏర్పాటు. గుంత పూడకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలీ ఏర్పాటు. జాలీకి ఉన్న పెద్ద రంధ్రాల నుంచి వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మి.లీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. లోతట్టు ప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీఛార్జీ అవుతాయి. వర్షపునీటిని ఎక్కడికక్కడే ఇంకింపజేస్తే రహదారులను ముంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది. మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరంలో తరచూ వరదనీరు నిలిచే ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. దీంతో వరదనీరు నేలగర్భంలోకి చేరి భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్లు టీఎస్‌డీపీఎస్ గుర్తించింది. ఈ నమూనా గ్రేటర్ పరిధిలోనూ అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
సాక్షి, హైదరబాద్: నగరంలో మంగళవారం తెల్లవారుజామునుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కోటి, నాంపల్లిలో వాన పడుతోంది. చార్మినార్, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్టలో మోస్తరు వర్షం కురుస్తోంది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, బడంగ్పేట్, మీర్పేట్లో వర్షం పడడంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ముంపు నుంచి పలు శివారు కాలనీలు ముంపు నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పటికే కురిచిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పలు కాలనీలు, ఇంకా బురదమయంగానే ఉన్నాయి. మరోవైపు తూర్పు పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మంగళవారం మధ్యాహ్నం తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీర ప్రాంతంలో 45 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్లు వేగంతో ఈదురుగాలులు విస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
24 గంటల్లో జిల్లాలో నమోదైన వర్షపాతం
సాక్షి, విజయనగరం: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయనగరం జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. సోమవారం కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా భోగాపురంలో 11 సెంటిమీటర్లు, కొత్తవలసలో 10 సెంటిమీటర్లు, డెంకాడలో 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వేపాడ, మెంటాడ, జామి, పూసపాటిరేగ, బొండపల్లిలలో 7 సెంటిమీటర్లు నమోదు కాగా ఎల్ కోట, విజయనగరం, గరివిడి, గుర్ల, గజపతినగరం, పాచిపెంట, గుమలక్ష్మిపురంలలో 6 సెంటీమీటర్లుగా నమోదైంది. ఎస్ కోట, గంట్యాడ, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, తెర్లాం, రామభద్రాపురం, సాలూరు, పార్వతీపురం, గరుగుబిల్లిల్లో 5 సెంటీ మీటర్లు.. దత్తిరాజేరు, బాడంగి, బొబ్బిలి, జేఎం వలసలలో 4 సెంటీమీటర్లు.. కురుపాం, మక్కువ, సీతానగరం, బలిజిపేటలలో 3 సెంటీమీటర్లుగా వర్షపాతలం నమోదైంది. -
కొనసాగుతున్న వాయుగుండం
సాక్షి, విజయవాడ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. క్రమంగా బలపడి 24గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మంగళవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని విశాఖ జిల్లాకు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్స్య కారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశించారు. వాయుగుండం నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. సహాయం కోసం కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నెంబర్లు: 0891-2590102, 0891-2590100 ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, తగినజాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణలోనూ వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. -
హైదరాబాద్‌లో రికార్డు వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో శుక్రవారం మళ్లీ కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లులు పడ్డట్లు కురిసిన హోరు వానతో నగరం అతలాకుతలమైంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు కుమ్మేయడంతో నగరం నిండా ముని గింది. మూడు గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సాయంత్రం 5–8 గంటల మధ్యన అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌లో 15.1 సెంటీ మీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. ఖైరతా బాద్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనూ 12 సెం. మీ.కి పైగా వర్షం కురిసింది. గతంలో 2013 అక్టో బర్లో బేగంపేట్‌లో రెండుగంటల వ్యవధిలో 9.8 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఆ తరవాత ఇప్పుడే రికార్డుస్థాయిలో జడివాన కురిసినట్లు బేగం పేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో పలు ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీ మీటర్ల జడి వాన కురియడంతో ప్రధాన రహదా రులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తింది. సుమారు వంద సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభిం చింది. వాహనదారులు, ప్రయాణికులు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. వరద నీటిలో వాహనాలు నిలిచిపోయి నానా అవస్థలు పడ్డారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. వర్ష బీభత్సానికి పలుచోట్ల విద్యుత్‌తీగలు తెగిపడి కొన్నిగంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షబీభత్సం ఒక్కసారిగా జడివాన కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు నాలాలు ఉప్పొంగాయి. రోడ్లపై, కాలనీల్లో ఎటుచూసినా వరదనీరే. మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరదనీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు లోతట్టు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నిలిచిన వరదనీటిని తొలగించేందుకు సహాయకచర్యలు చేపట్టాయి. విద్యుత్ హైఅలర్ట్ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భారీవర్షం కురిసిన నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ సీఎండి జి.రఘుమారెడ్డి నగరంలోని విద్యుత్‌శాఖ చీఫ్ జనరల్ మేనేజర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వర్షబీభత్సం కారణంగా రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేయాలని కోరారు. వోల్టేజ్లో హెచ్చుతగ్గులున్నా.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912 / 100 నంబర్లకు, స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌లకు ఫోన్ చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లోని 7382072104, 7382072106, 7382071574 లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. నేడు వాయుగుండం ఉత్తర అండమాన్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతా వరణ శాఖ వెల్లడించింది. ఇది ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఉత్తర అండమాన్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపొస్పియర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శనివారం మధ్య బంగాళా ఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరంలో అక్టోబర్ 12వ తేదీ ఉదయం తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
మేఘం.. ఆగమాగం
సాక్షి, నెట్వర్క్: మేఘం ఆగమాగం.. మన్నూ, మిన్నుకు ఏకధారగా కురిసిన ఎడతెరిపిలేని వర్షం.. ప్రజలను జడిపించింది. వాగులు, వంకలను ముంచెత్తింది. దీంతో పల్లెల మధ్య రాకపోకలు స్తంభించాయి. అల్పపీడనం అనల్ప ప్రభావం చూపింది. ఆసుపత్రులకు బయలుదేరిన నిండు గర్భిణులు వాగులు దాటలేక నరకయాతన పడ్డారు. స్కూలుకని వెళ్తున్న స్వీపర్ వరదనీటిలో గల్లంతయ్యాడు. చేపలవేటకు వెళ్లిన జాలరులపై జాలి కూడా చూపలేదు. రహదారులు కొట్టుకు పోయాయి.. కాలనీలు జలమయమయ్యాయి.. రాష్ట్రం మోస్తరు, భారీ, అతి భారీ వర్షాల సంగమ మైంది. రాష్ట్రంలోని 22 మండలాల్లో అతి భారీ, 43 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తానికి శనివారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రవ్యాప్త జనజీవనం అతలాకుతలమైంది. మత్తడి దుంకుతున్న 500 చెరువులు సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా నడిగూడెం మండలంలో 18.63 సెం.మీటర్ల వర్ష పాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 500 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. నడిగూడెం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 30 ఏళ్ల తర్వాత నడిగూడెం చౌదరిచెరువు అలుగు పోస్తోంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్‌పల్లిలో వరి పొలాలు నీట మునిగాయి. గుండాల – నూనెగూడెంబ్రిడ్జి పైనుంచి వరద నీరు పారుతోంది. బీబీనగర్, పోచంపల్లి పరిధిలో మూసీకి వరద పోటెత్తుతోంది. గల్లంతైన స్కూలు స్వీపర్ మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల వాగును దాటేందుకు ప్రయత్నించి స్కూల్ స్వీపర్ రాములు గల్లంతయ్యాడు. భూత్పూర్ మండలం పోతులమడుగు– గోపన్నపల్లి మధ్య కాజ్‌వేపై దాటుతున్న ఆటో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. డ్రైవర్ ఊశన్న కిలోమీటర్ మేర వరద నీటిలో కొట్టుకుపోయి ఓ చెట్టు సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దేవరకద్ర మండలం కౌకుంట్లలో చేపల వేటకు వెళ్లిన ఇస్రంపల్లికి వెంకటేశ్ అనే యువకుడు వాగులో చిక్కుకోవడంతో స్థానికులు కాపాడారు. మహబూబ్‌నగర్‌లో నీట మునిగిన కాలనీల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పార పట్టి వరదనీటిని మళ్లించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 700 ఎకరాల్లో, వనపర్తి జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో 114 చెరువులు నిండుకుండలా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లా పోతులమడుగు కాజ్వే వద్ద కాలువ ఉధృతికి నీటిలో కొట్టుకుపోతున్న ఆటో వాననీటిలో ఆరుగురు లారీ డ్రైవర్లు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఖద్గాం క్వారీలోని మంజీరా నదిలో ఇసుక కోసం వెళ్లిన ఆరుగురు లారీ డ్రైవర్లు చిక్కుకున్నారు. స్థానికులు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నిజాంసాగర్ మండలం సింగితం రిజర్వాయర్‌లో మూడు గేట్లను ఎత్తివేశారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో పెద్దదడ్గి వాగు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో బిచ్కుంద, బాన్సువాడ మండలాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. నీటి మునిగిన వరి పంట కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో వరి పంట నీటమునిగింది. బిక్కవాగు ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఇళ్లలోకి చేరింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం అర్కండ్ల వాగులో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన భూమయ్య త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. లోతట్టు జలమయం మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన చెందారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నీట మునగడంతో వికారాబాద్ జిల్లా కాగ్నా బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపివేసి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు నిండుకుండల్లా జంట జలాశయాలు రంగారెడ్డి జిల్లా నందిగామలో శనివారం 18.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 5 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అంచనా. కోట్‌పల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులు అలుగు దూకుతున్నాయి. పరిగిలోని లక్నాపూర్ ప్రాజెక్టు ఉధృతంగా అలుగు పారుతోంది. హిమాయత్‌సాగర్, గండిపేటకు వరద నీరు పోటెత్తింది. వికారాబాద్ జిల్లాలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహించింది. ·వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలోని జంట జలాశయాలు(హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్) నిండుకుండల్లా మారాయి. ఎగువ ప్రాంతం నుంచి గంటగంటకూ హిమాయత్·సాగర్‌లోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఏ సమయంలోనైనా గేట్లు తెరిచేందుకు· అధికారులు అక్కడే మకాం వేసి సిద్ధంగా ఉన్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ గేట్లు ఎత్తనున్నారు. మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది. గర్భిణులకు వరద కష్టాలు కర్ణాటక రాష్ట్రం చించోళి తాలుకా ఈర్గుపల్లికి చెందిన నిర్మిలకు పురిటినొప్పులు రావడంతో తాండూరు ఆస్పత్రికి తరలిస్తుండగా బెల్కటూర్ వద్దకు రాగానే వాగు పొంగిపొర్లింది. దీంతో గ్రామస్తులు ఆమెను ఎత్తుకుని వాగు దాటించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీకి చెందిన లాల్‌బీ అనే నిండుగర్భిణిని అంబులెన్స్‌లో బషీరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. గంగ్వార్– బషీరాబాద్ మధ్య చిన్న ఏరు పొంగింది. దీంతో అంబులెన్స్ అక్కడే నిలిచిపోయింది. స్థానికులు ఆమెను మంచంపై మోసి ఏరు దాటించారు. బెల్కటూర్ వాగులో నుంచి గర్భిణిని వాగు దాటిస్తున్న స్థానికులు హైదరాబాద్‌లో... ఏకధాటిగా కురిసిన వర్షంతో హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరదనీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మ్యాన్‌హోళ్లు నోళ్లు చెరుచుకున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయంకావడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. బుల్కాపూర్ నాలా, షేక్‌పేట్ కొత్త చెరువు, గోల్కొండ శాతం చెరువులు పొంగిపొర్లాయి. మంగళ్‌హాట్‌లో ఒక ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మీరాలంమండి వాననీటితో నిండిపోయింది. 50 మండలాల్లో 10 సెం.మీ.పైగా.. రాష్ట్రంలో మొత్తంగా 50 మండలాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. శనివారం రాష్ట్రంలో సగటు వర్షపాతం 4.45 సెంటీమీటర్లుగా నమోదైంది. ఈ సీజన్లో శనివారం నాటికి 106.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు లేవని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఆంద్రప్రదేశ్ తీరప్రాంతం గుండా అల్పపీడనం కొనసాగుతోందని, దీంతోపాటు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు, తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులపాటు తెలంగాణ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
విగతజీవిగా లభ్యం
చంపాపేట/చైతన్యపురి/బడంగ్పేట్: తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్.. సోమవారం సాయంత్రం విగతజీవిగా దొరికాడు. సరూర్‌నగర్ చెరువు గండి నుంచి సుమారు 35 అడుగుల దూరంలోని ఒండ్రులో అతడి మృతదేహం లభ్యమైంది. బాలాపూర్ మండలం అల్మాస్గూడ కాలనీకి చెందిన నడిగొప్పు నవీన్ కుమార్ (39)కు భార్య శాలిని, కుమార్తెలు హర్షిత (12), తేజశ్రీ(10) ఉన్నారు. అద్దె ఇంట్లో ఉండే నవీన్.. బిల్డింగ్ కాంట్రాక్టు తీసుకునే శివ వద్ద ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సరూర్‌నగర్‌లో పనులు ముగించుకుని శివ స్కూటీపైనే అల్మాస్‌గూడకు బయలుదేరారు. తపోవన్ కాలనీ ప్రధాన రహదారిపై వరదను దాటేందుకు ప్రయత్నించారు. స్కూటీ మొరాయించడంతో నవీన్ వెనకాల నుంచి నెట్టాడు. ఈ క్రమంలోనే వరద ప్రవాహానికి స్కూటీ శివ చేజారింది. దీంతో నవీన్ కూడా వరదలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు స్కూటీని పట్టుకోగలిగారు కానీ నవీన్‌ను అందుకోలేకపోయారు. రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో వర్షం రావడంతో గాలింపును నిలిపివేసి, తిరిగి సోమవారం ఉదయం 7 గంటల నుంచి మళ్లీ చెరువును జల్లెడ పట్టారు. 18 మంది సభ్యులు 3 బృందాలుగా విడిపోయి నవీన్ కుమార్ ఆచూకీ కోసం వెతికారు. చివరకు చెరువు గండి నుంచి సుమారు 35 అడుగుల దూరంలోని ఒండ్రులో నవీన్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, నవీన్ మృతితో అతనిపైనే ఆధారపడిన ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యింది. ఇక మాకు దిక్కెవరు దేవుడా అంటూ వారు రోదించడం పలువురిని కలిచివేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ బావ మృతిచెందాడని, తమ అక్కకు ఉద్యోగం ఇప్పించడంతో పాటు పిల్లల చదువుకు అయ్యే ఖర్చును భరించాలని మృతుడి బావమరుదులు కె.వినోద్‌కుమార్, సంతోష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ప్రత్యేక ఔట్లెట్ నిర్మిస్తాం... ఆదివారం కురిసిన భారీ వర్షానికి పై కాలనీల నుంచి వర్షపు నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలైన రెడ్డి కాలనీ, సాగర్ ఎన్ క్లేవ్లో నీరు చేరి సాగర్ రింగ్‌రోడ్డు మీదుగా ఏరులా పారిందని, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ఔట్లెట్ నిర్మాణం చేస్తామని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, సోమవారం సరూర్‌నగర్ చెరువును పరిశీలించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్‌లో కుండపోత..
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతు న్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం, జలదిగ్బంధంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో అత్యధికంగా 22.06 సెం.మీ. వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో పత్తి, వరి, కంది పంటలు నీటమునిగాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోగోడ కూలి ముగ్గురు, హైదరాబాద్ పీర్జాదిగూడలో ఆలయ ప్రహరీ కూలి ఇద్దరు మృతిచెందారు. పలు గ్రామాలు జలదిగ్బంధం.. మద్నూర్/నిజాంసాగర్(జుక్కల్): మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో దిగువన ఉన్న కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల చుట్టూ వరద చేరడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బుధవారం మద్నూర్ మండలంలోని ఎన్ బుర, కుర్లా, దోతి, గోజేగావ్, సిర్పూర్, ఇలేగావ్ గ్రామాల చూట్టు వరద నీరు చేరిందని గ్రామస్తులు తెలిపారు. వరద నీరు ఇంట్లోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు గ్రామాల్లోని సిబ్బందితో ఫోన్ లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బిచ్కుంద మండలంలోని మెక్క, మిషన్ కల్లాలి, ఖద్గాం గ్రామాల చుట్టూ వరద నీరు చేరడంతో జలదిబ్బంధంలో ఉన్నాయి. అంతేగాకుండా శెట్లూర్, నాగుల్గావ్, లొంగన్, రాజుల్లా తదితర గ్రామాల్లోని పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. భారీ వర్షాలతో మంజీర పరీవాహక ప్రాంతాలైన మదన్ హిప్పర్గా, కుర్లా, ఎన్ బుర, ఇలేగావ్, సిర్పూర్ గ్రామ శివారులోని సుమారు వెయ్యి ఎకరాల వరి పంట పూర్తిగా నీట మునిగిందని రైతులు పేర్కొన్నారు. బుధవారం భారీ వర్షాలకు జలమయమైన వనపర్తి పట్టణంలోని మారెమ్మకుంట కాలనీ పొలానికి వెళ్లి.. వాగు దాటలేక... అచ్చంపేట రూరల్: ఉదయం డిండి వాగు దాటి పొలానికి వెళ్లిన ఆ భార్యాభర్తలు.. సాయంత్రానికి వాగు ఉధృతి పెరగడంతో ఇంటికి చేరుకోలేక అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చీన్యతండాకు చెందిన సబావత్ బుజ్జి, వెంకట్రాం దంపతులు బుధవారం ఉదయం డిండి వాగు సమీపంలోని తమ పొలానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి తండాకు రావడానికి సిద్ధమయ్యారు. అప్పటికే వాగు ఉధృతి పెరగడంతో అక్కడే ఉండి గట్టిగా కేకలు వేశారు. సమీప పొలాల రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. సీఎం కేసీఆర్, సీఎస్‌కు పరిస్థితిని వివరించి హెలికాఫ్టర్ పంపాలని కోరారు. అయితే చీకటి పడటంతో అది వస్తుందా? రాదా? అని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ అక్కడికి చేరుకుని వాగు అవతల ఉన్న భార్యాభర్తలతో మాట్లాడటానికి యత్నించగా వారి ఫోన్ స్విచ్ఆఫ్ అని వచ్చింది. అయితే ఎట్టి పరిస్థితిల్లోనూ బాధితులను కాపాడతాని వారు వెల్లడించారు. పొంగిపొర్లుతున్న చెరువులు.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక చోట్ల వాగులు వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో అత్యధికంగా 22.06 సెం.మీ. వర్షం కురిసింది. తాడూరులో 15.8 సెం.మీ, నాగర్‌కర్నూల్ 15.6 సెం.మీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో చాలా చెరువులు అలుగుపారుతున్నాయి. ముగ్గురి మృతి... వర్షాలతో ఇంటి గోడలు కూలి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడలో మట్టి మిద్దె కూలి గౌతం (3), మరికల్ మండలంలోని కన్మనూర్‌లో గోడకూలి అనంతమ్మ (68), నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడిక్యాలలో సంకె దేవమ్మ (65) మృతి చెందారు. వనపర్తి జిల్లా పానగల్, చిన్నంబావి మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాటి పరిధిలో ఉన్న జూరాల, భీమా, కేఎల్ఐ పంట కాల్వలకు గండ్లు పడి నీరు పంట పొలాల్లోకి చేరింది. నిలిచిన రాకపోకలు... ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు ధ్వంసమైన ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. నర్వ మండలం కొత్తపల్లి గజ్జలమ్మ వాగు ఉధృతంగా పారుతుండటంతో ఆ ప్రాంతం నుంచి ప్రయాణించకుండా అధికారులు అక్కడ ముళ్లకంచె వేశారు. ఇక వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వనపర్తి జిల్లాలో వరి, కంది, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 4,636 ఎకరాల్లో పంట నీటమునిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,400 ఎకరాల్లో.. నారాయణపేట జిల్లాలో 6000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో çపంటను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, అధికారులు నాగర్‌కర్నూల్ కలెక్టరేట్లో 08540–230201, నారాయణపేట కలెక్టరేట్లో 08506–282282, 282369 హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. కొట్టుకుపోయిన బైక్‌లు.. యువకులు క్షేమం తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు మత్తడి నీటి ప్రవాహంలో రెండు మోటార్ సైకిళ్లు కొట్టుకుపోయాయి. వాటిపై ఉన్న గంధమల్ల చెందిన శాగర్ల మధు, బొత్త మహేశ్, శాగర్ల వెంకటేశ్‌లను స్థానికులు రక్షించారు. ముగ్గురు యువకులు రెండు బైక్‌లపై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్, మహేశ్‌కు స్వల్పగాయలయ్యాయి. పిల్లలను కాపాడబోయి.. వరద కొట్టుకుపోయిన తల్లి మర్పల్లి: వరదనీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను కాపాడబోయి ఓ తల్లి మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని శాపూర్‌లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నెనావత్ దశరథ్, భార్య అనిత.. తమ ముగ్గురు పిల్లలతో పాటు మరో 5 మంది కూలీలతో పత్తి పంటలో కలుపు తీసేందుకు వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ఆటోలు ఇంటి వచ్చే దారిలో శాపూర్‌తండా సమీపంలో ఉన్న కల్వర్టుపై నుంచి భారీ వరద పారుతోంది. దశరథ్, అనిత(42)తో పాటు ముగ్గురు పిల్లలను పట్టుకుని కల్వర్టు దాటే ప్రయత్నం చేశారు. ఇద్దరు పిల్లలు వారి చేతుల నుంచి తప్పి వరదలో కొట్టుకుపోతున్నారు. ఇది చూసిన అనిత పిల్లలను కాపాడేందుకు వరద నీటిలో వెంబడించింది. కొద్ది దూరం వరకు వెళ్లిన పిల్లలు ఓ చెట్టు కొమ్మలను పట్టుకొని అక్కడే నిలిచారు. అనిత మాత్రం వరద ఉధృతిలో అర కిలోమీటరు దూరం కొట్టుకుపోయి ప్రాణాలు విడిచింది. వనపర్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనం హైదరాబాద్‌లో కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం సాక్షి, హైదరాబాద్: నగరంలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. ఉప్పల్ పీర్జాదిగూడలో ఓ దేవాలయం ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. విష్ణుపురి కాలనీకి చెందిన గ్లాస్‌కట్టర్ వర్కర్ జి.ప్రవీణ్(41), మోహన్ (15)లుగా వీరిని గుర్తించారు. వీరిద్దరూ ద్విచక్రవాహనంపై వెళుతున్న క్రమంలో గోడ కూలి వీరిపై పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరద చేరడంతో అనేక వాహనాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు సహా కాలనీల్లో భారీగా వరద నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. పలు చోట్ల స్తంభాలు నేలకూలాయి. సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్యన చాలా ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. జుపార్క్, షేక్‌పేట వద్ద అత్యధికంగా 10.9 సెంటిమీ టర్ల జడివాన కురిసింది. ఈసీఐఎల్–ఏఎస్‌రావునగర్ ప్రధాన రహదారిలో రోడ్డు కుంగి గొయ్యి ఏర్పడింది. రాయదుర్గంలోని మల్కంచెరువు నుంచి వచ్చే వరదనీటి కాలువ తెగిపోవడంతో రోడ్లపై భారీ వరదనీరు పారింది. లోతట్టు ప్రాంతమైన బాలాజీనగర్‌లోని పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. గండిపేట్ కాండ్యూట్ కాలువను ఆనుకుని ఇండ్లల్లో వర్షపు నీరు చేరింది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి జీహెచ్ఎంసీ కాల్ సెంటర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మణికొండలో నీటమునిగిన కార్లు -
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మంగళవారం ఉదయం బలహీనపడి అదే ప్రాంతంలో మధ్యాహ్నం వరకు తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 15°N అక్షాంశం వెంబడి తూర్పు-పశ్చిమ షేర్ జోన్ మీదుగా 3.1 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు వరకు తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కొస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లోని పలు చోట్ల ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(బుధవారం) ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణా కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా.. తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(బుధవారం) రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా.. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి(గురువారం) రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. -
మూడ్రోజుల పాటు వర్షాలు...
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం తెల్లవారు జామున అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు సైతం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ స్పష్టంచేసింది. -
ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు!
సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నాలుగు రోజులు తీరం ప్రాంతం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాగల నాలుగు రోజుల వాతావరణ వివరాలు: ఆగష్టు 13 వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన. ఆగష్టు 14వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగష్టు 15వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన. ఆగష్టు 16వ తేది: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. -
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో 1.5 నుంచి నుంచి 7.6 కిలోమీటర్ల త్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని స్పష్టం చేసింది. సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్ జోన్) ప్రభావంతో ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అదేవిధంగా... నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ర్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ర్ట వ్యాప్తంగా చాలాచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. (నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ) -
పిడుగుల బీభత్సం.. 31 మంది మృతి
పాట్నా: బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో గురువారం ఒక్కరోజే పిడుగుపాటుకు గురై దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా అసోంలో వరదల కారణంగా మరొకరు మృతి చెందారు. పంటపొలాలన్నీ నీటిలో మునిగాయి. మరోవైపు ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వాతావరణ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో తీవ్ర వేడి ఉండగా రాబోయే రెండు రోజులు నగరంలో ఇదే పరిస్థితి ఉంటుందని, వారాంతంలో వర్షాలు పడే సూచన ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీలోని చాలా ప్రదేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. (త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు) బిహార్‌లో గురువారం 26 మంది పిడుగుల దాడికి మృతిచెందినట్లు, అధికారులు వెల్లడించారు. గతవారం కూడా రాష్ట్రంలో పిడుగుల తాకిడికి 100 మందికి పైగా మరణించారు. పాట్నా, సమస్తిపూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, షియోహార్, కతిహార్, మాధేపుర, పూర్నియా వంటి ఎనిమిది జిల్లాల నుంచి ప్రాణ నష్టం జరిగినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఇక ఈ ఘటనపై స్పందించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే పిడుగుల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వీటి మొత్తాన్ని వీలైనంత తర్వగా బాధితులకు అందించాలని అధికారులను ఆదేశించారు. (పిడుగుపాటుకు గురై 22 మంది మృతి) కాగా పొరుగున ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పిడుగుల ప్రభావానికి అయిదుగురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. అస్సాంలో గురువారం తీవ్ర వరద ఉధృతి మరో ప్రాణాన్ని బలితీసుకుంది. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 34 మందికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 72,700 హెక్టార్ల విస్తీర్ణంలోని పంట పూర్తిగా నీట మునిగింది. ఇదిలావుండగా ముంబై పరిసర తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం అంచనా వేసింది. రాబోయే రెండు రోజులు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కవాడిగూడ, గాంధీ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, రాంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిలల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ ప్రాంతాలతో పోల్చితే పాతబస్తీలో భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి పురాతన కట్టడం చౌమల్లా ప్యాలెస్ పాక్షికంగా దెబ్బతింది. రోడ్డు వైపు ఉన్న ప్యాలస్ ప్రహారీ గోడ కూలీపోయింది. దీనివల్ల అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయ ఏర్పడింది. -
నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు కోస్తా, రాయలసీమపై నైరుతి ప్రభావం సాధారణంగా ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తడిసి ముద్దయిన బెజవాడ: ఆదివారం కురిసిన వర్షాలకు విజయవాడ తడిసి ముద్దయింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా అంతటా సాయంత్రం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడగా.. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవగా.. పల్నాడులో అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. -
రెండో వారంలో ‘నైరుతి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈ నెల రెండో వారంలో ప్రవేశించనున్నాయి. సోమవారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రంలోకి ఎప్పుడు వస్తాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణంగా జూన్ 8న ప్రవేశించాలి. ఈసారి ఎప్పుడు ప్రవేశిస్తాయన్న దానిపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టతనివ్వలేదు. రెండో వారంలో వస్తాయని మాత్రమే చెబుతున్నారు. అంటే 8వ తేదీ తర్వాత రెండో వారంలో ఎప్పుడైనా రావచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజా రావు వెల్లడించారు. ఇది వాతావరణంలోనూ, రుతుపవన గాలుల్లోనూ వచ్చే మార్పులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కాగా, 2019లో తెలంగాణలోకి రుతుపవనాలు జూన్ 21న, 2018లో జూన్ 8న ప్రవేశించాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు సంబంధించి జూన్ నుండి సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా చాలావరకు సాధారణ వర్షపాతం (96 నుంచి 104 శాతం) నమోదయ్యే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. పరిమాణాత్మకంగా రుతుపవనాల సమయంలో వర్షపాతం దేశం మొత్తం 102 శాతం (మోడల్ లోపం 4 శాతం ప్లస్ ఆర్ మైనస్). జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం వర్షపాతం 103 శాతం, ఆగస్టులో 97 శాతం (మోడల్ లోపం 9 ప్లస్ఆర్ మైనస్) ఉంటుందని రాజారావు తెలిపారు. ఇక తెలంగాణలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్య వర్షపాతం 102 శాతం (మోడల్ లోపం 8 శాతం ప్లస్ ఆర్ మైనస్) ఉంటుందని రాజారావు వివరించారు. అరేబియా సముద్రంలో వాయుగుండం దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లోకి సోమవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని రాజారావు తెలిపారు. నైరుతి రుతుపవనాలు 1న కేరళలోకి ప్రవేశించడం వల్ల సాధారణ తేదీకి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లైందని రాజారావు వెల్లడించారు. మరోవైపు తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ నైరుతి దిశగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో మంగళవారం ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో హరిహరేశ్వర్ (రైగర్, మహారాష్ట్ర), దామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను దాటే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణలో మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. -
హైదరాబాద్‌లో జోరువాన
-
జోరుగా వానలు..
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్ : వారం రోజు లుగా తీవ్ర ఎండలు, వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన రాష్ట్ర ప్రజలకు ఆదివారం ఉపశమనం లభించింది. ఆదివారం ఉద యం పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ మధ్యాహ్నం ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో 11సెం.మీ. వాన పడగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, ఎల్బీ నగర్, పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలలో 7, రంగారెడ్డి జిల్లా మంచాల, సంగారెడ్డి జిల్లా జిన్నారం, మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలాల్లో 6, హాజీపూర్, శేరిలింగంపల్లి, మస్పూర్, నర్కూక్, మంచిర్యాల మండలాల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్ జిల్లాలో సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల వడగళ్ల వాన కురవగా మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. వివిధ జిల్లాల్లో పిడుగుపాట్లకు ఇద్దరు మృతి చెందగా పలు చోట్ల ఓ మోస్తరు ఆస్తినష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ధర్మారంలో కురిసిన వర్షానికి కొట్టుకుపోయిన మక్కలు అన్నదాతకు అనుకోని కష్టం... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో వర్షాలకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం తడిసిపోయింది. మల్యాల మండలం లంబాడిపల్లి, గొల్లపల్లి మండలాల్లో వడగండ్ల వాన పడింది. మంచిర్యాల జిల్లా భీమిని, కన్నెపల్లి, చెన్నూర్, భీమారం, తదితర మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాల్లో బస్తాల్లో నింపిన ధాన్యం తడిసిపోగా ఆరబోసిన ధాన్యం టార్పాలిన్లు, కవర్లు కప్పినా కొట్టుకుపోయింది. జిల్లాలో ఇప్పటివరకు 1.62 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వరంగ సంస్థలు 1.54 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్లు తూకానికి సిద్ధంగా ఉండగా వర్షానికి నీటమునిగింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని హాలియా, యాదగిరిగుట్ట, మోటకొండూరులలో ఈదురుగాలులకు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని తొమ్మిదోమైలు తండా, రోళ్లపాడు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. అశ్వాపురం మండలంలో రెండు గంటలపాటు వర్షం కురిసింది. ప్రాణాలు తీసిన పిడుగులు... వివిధ జిల్లాల్లో పిడుగుపాట్లకు ఓ రైతు, గొర్రెల కాపరి మృతి చెందడంతోపాటు పదుల సంఖ్యలో పశువులు ప్రాణాలు వదిలాయి. నాగర్కరూŠన్ల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్లకు చెందిన రైతు ఆరేపల్లి కృష్ణయ్య (70)తోపాటు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో గొర్రెల కాపరి గెల్లా మల్లయ్య (60) మృతి చెందాడు. మరోవైపు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేట గ్రామంలో పిడుగుపాటుకు 30 గొర్రెలు, మరో 10 గొర్రె పిల్లలు మృతిచెందాయి. అలాగే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో పిడుగు పడటంతో 15 ఆవులు మృత్యువాత పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాంబాయిగూడెంలో పిడుగుపడి ఓ కార్పెంటర్‌కు చెందిన రూ. 50 వేల విలువైన సామగ్రి కాలిపోయింది. మలక్‌పేట్‌లో భారీ వర్షనికి కొట్టుకుపోతున్న వాహనం హైదరాబాద్‌లో గంటల తరబడి విద్యుత్ కోత... గ్రేటర్ హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం ఒక్కసారిగా జడివానగా మారింది. పటాన్చెరులో 6.9, హస్తినాపురంలో 6.5 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్‌లు కుప్పకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. సుమారు 150 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తింది. మరో రెండ్రోజులు వర్షాలు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ, తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది వచ్చే 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను చేరే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఛతీŠత్స్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణమధ్య కర్ణాటక మీదుగా లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. -
నేడు, రేపు పలుచోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపు లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవ కాశం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీంతో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు... రాష్ట్రంపై భానుడి ప్రతాపం కాస్త తగ్గింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్, హన్మకొండ, రామగుండంలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
భారీ వర్షం.. ఆస్పత్రిలోకి వరద నీరు
సాక్షి, హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు కాలనీల్లోకి ఇళ్లకు వరద నీరు వచ్చి చేరాయి. గత మూడు గంటలుగా వరంగల్, హన్మకొండ, కాజిపేటలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ట్రైసీటీస్‌లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రధాన ప్రాంతాలలో 5 అడుగుల మేర వరద నీరు వచి చేరడంతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం వల్ల వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలోగల ఐసీఎస్‌యూ వార్డులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు వచ్చి చేరుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగులు మండిపడుతున్నారు. -
ఎప్పుడు వచ్చాయని కాదు..
107 శాతం.. అవును.. నేలమ్మ పులకరించేలా, రైతుల్లో హర్షం నింపేలా, కరువు తీరిపోయేలా ఈ సీజన్లో వానలు కురిశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించాక మొదట్లో మొరాయించాయి. ఉత్తరాదిన కుంభవృష్టి కురిస్తే, దక్షిణాదిపై వరుణుడు ముఖం చాటేశాడు. కానీ ఆఖర్లో యావత్ భారతావనిపై వరుణుడు కరుణ చూపించాడు. సెప్టెంబర్ వచ్చాక దక్షిణాదిన కూడా వానలు దంచి కొట్టాయి. ‘‘సెప్టెంబర్ 26 నాటికి దేశవ్యాప్తంగా 107శాతం వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే చాలా ఎక్కువ‘అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేఎస్ హోసైకర్ ట్వీట్ చేశారు. 110శాతం కంటే ఎక్కువగా వర్షాలు కురిస్తే అప్పుడు అధిక వర్షపాతంగా చెబుతామని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో సగటు వర్షపాతం కంటే ఈ ఏడాది ఎక్కువగా వానలు కురిశాయి. సర్వసాధారణంగా నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 30కల్లా దేశం విడిచి వెళ్లిపోతాయి. కానీ ఈసారి రుతుపవనాల తిరోగమనం అక్టోబర్ 6 తర్వాత ప్రారంభమై పదిహేను రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇలాఉండగా, అరేబియా సముద్రం, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో మూడు, నాలుగు రోజుల్లో గుజరాత్, బిహార్, బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఆకాశానికి చిల్లు!
‘అనంత’ జలకళ సంతరించుకుంది. పది రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కరువుసీమ పులకిస్తోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఒక్కరోజే రికార్థు స్థాయిలో 36.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గత నాలుగేళ్లలో ఈ స్థాయి సగటు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సాక్షి, అనంతపురం : వరుణుడి కరుణ కొనసాగుతోంది. సోమవారం రాత్రి ప్రారంభమమైన వాన మంగళవారం ఉదయం వరకూ తెరిపివ్వకుండా కురిసింది. కళ్యాణదుర్గంలో ఏకంగా 114.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గుంతకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, తాడిపత్రి, యాడికి తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాజా వర్షాలతో 27 మీటర్ల కనిష్ట స్థాయి క్షీణించిపోయిన భూగర్భజలాలు బాగా పెరిగే అవకాశం ఉండటంతో అన్నదాత ఇంట ఆనందం వ్యక్తమవుతోంది. ఎడతెరపి లేని వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెన్నా, చిత్రావతి లాంటి నదీ పరీవాహక ప్రాంతాలు కూడా కొంతమేర వర్షపునీరు పారుతోంది. పండమేరు, తడకలేరు, గాజులపల్లి వంక లాంటి ప్రధాన వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శింగనమల, గుంతకల్లు, రొద్దం, యాడికి లాంటి చెరువులు నిండిపోగా, వందలాది చెరువుల్లోకి అంతో ఇంతో నీరు చేరుతోంది. ⇔ యాడికి మండలం పిన్నేపల్లి, కుందుర్పి మండలం రుద్రంపల్లి చెరువు, రొద్దం మండలం లోచర్ల చెరువుకు గండ్లు పడ్డాయి. ⇔ బట్రేపల్లి, ఆలూరుకోన లాంటి కొండ ప్రాంతాలు, జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. నాసముద్రం చెరువు నిండిపోయి మరువ పారుతోంది. ⇔ పెద్దవడుగూరు మండలం వెంకటాంపల్లిలో కొట్టంకూలి వైష్ణవి అనే ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. ⇔ యాడికి మండలం లక్ష్మంపల్లి గ్రామంలో వరద నీటికి ట్రాక్టరు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో యాడికి మండల కేంద్రంలో కాలనీలు జలదిగ్భంలో చిక్కుకున్నాయి. చేనేత కుటుంబాలకు చెందిన మగ్గాలు నీటమునిగాయి. ⇔ కుందుర్పి పీహెచ్సీ ప్రహరీగోడ కూలింది. పట్టణాలు, మండల కేంద్రాల్లో లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు జలమయమయ్యాయి. ⇔ కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలో నీటి ప్రవాహానికి నూర్జహాన్‌కు చెందిన కొట్టంతో పాటు దుస్తులు, బీరువాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. నగదు, బంగారునగలు గల్లంతు కావడంతో రూ.2.50 లక్షల మేర నష్టం జరిగినట్లు సమాచారం. ⇔ అనంతపురం, యాడికి, పెద్దవడుగూరు, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కుందుర్పి, గుంతకల్లు, శింగనమల తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో వరి, వేరుశనగ, పత్తి, అరటి, టమాట, ఇతర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ⇔ పంట నష్టం, ఆస్తి, ప్రాణ నష్టంపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ధర్మవరం: కుణుతూరు వద్ద పొంగిపొర్లుతున్న చెక్ డ్యాం (ఇన్సెట్) యాడికి: జలదిగ్బంధంలో చిక్కుకున్న కాలనీలో సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు, 1. శెట్టూరు: భారీ వర్షానికి కోతకు గురైన లింగదీర్లపల్లి రోడ్డు, 2. విడపనకల్లు: డొనేకల్లు వద్ద 67వ నంబర్ జాతీయ రహదారిపై పోటెత్తిన పెద్దవంక వారం వ్యవధిలోనే 150 మి.మీ వర్షపాతం నమోదు సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటివరకూ 154.7 మి.మీ వర్షం కురిసింది. ఇక జూన్ ఒకటి నుంచి ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 304.1 మి.మీ వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 292.3 మి.మీతో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈనెల 15వ తేదీన 47 శాతం మేర లోటువర్షపాతం ఉండగా...అదిప్పుడు 4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. వారం రోజుల వ్యవధిలోనే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 150 మి.మీ మేర వర్షపాతం నమోదు కావడం విశేషం. జల దిగ్బంధంలో తొమ్మిది గ్రామాలు యాడికి: వర్షాలకు పిన్నేపల్లె చెరువుగట్టు తెగటంతో సోమవారం తెల్లవారుజామున 9 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక భారీ వర్షం కురవడం...ఎగువ నుంచి వచ్చిన నీరు కూడా వచ్చి చేరడంతో మండలంలోని రెడ్డివారిపల్లె, రామన్నగుడిసెలు, చండ్రాయుని పల్లెలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ నీరంతా పిన్నేపల్లె చెరువుకు చేరి చెరువుకు గండి పడింది. దీంతో నీరంతా పిన్నేపల్లె, యాడికిలోని ఎస్సీ కాలనీ, చౌడమ్మ గుడివీధి, ఆస్పత్రి కాలనీ, కొట్టాలపల్లె, వేములపాడు, తిమ్మాపురం గ్రామాల్లోకి భారీగా చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. అనంతపురం ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, చెరువుకు గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించి...ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. -
మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
నిడదవోలు: గోదావరి ఎగువన భారీ వర్షాలు కురువడంతో గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరిగినట్లు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తీవ్రతను పర్యవేక్షిస్తున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు స్పష్టం చేశారు. దాంతో ముంపు ప్రాంత మండలాల అధికారులను, సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజల సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కమిషనర్ సూచించారు. వినాయక నిమజ్జానికి నదకి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వరల నీటీలో ఈతకు వెళ్లడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయవద్దన్నారు. బోటు, మోటారు బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. వరద ఉధృతి క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో రేపు దవళేశ్వరం వద్ద రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. -
మళ్ళీపెరుగుతున్న గోదావరి
సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : గోదావరి ఎగువన మహారాష్ట్ర, ఇంద్రావతి, శబరి ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో మళ్ళీ గోదావరి పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం 21 అడుగులు ఉండగా మంగళవారం రాత్రి 8 గంటలకు 25.10 అడుగులకు పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రాత్రి 8 గంటల సమయంలో 10.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. గోదావరి విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న కాటన్ బ్యారేజీల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యారేజీల 175 గేట్ల ద్వారా మంగళవారం 2,74,241 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి గోదావరిలోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు చేరతాయని ధవళేశ్వరం హెడ్ వర్క్స్ ఈఈ మోహనరావు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు రైతుల సాగు నీటి అవసరాల కోసం జలవనరుల శాఖాధికారులు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. జిల్లాలో వర్షాలు కురవడంతో కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. పశ్చిమ డెల్టాకు 6,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మధ్య డెల్టాకు 2,000 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 3,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలో ఏలూరు కాలువకు 1,124 క్యూసెక్కులు, తణుకు కాలువకు 632, నరసాపురం కాలువకు 1,704 ,అత్తిలి కాలువకు 5,99 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,809 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
వాన కురిసె.. చేను మురిసె
సాక్షి, అమరావతి: గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు తగ్గింది. గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడది 19 శాతానికి తగ్గిపోయింది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. దీంతో బుధవారానికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 17.54 లక్షల హెక్టార్లకు పెరిగింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరి నాట్లు పుంజుకున్నాయి. గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలు మినహా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాట్లు జోరుగా పడుతున్నాయి. అలాగే విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాధారిత పంటలతోపాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ వరి నాట్లు ప్రారంభించారు. అయితే రాయలసీమ జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. నాలుగు రాయలసీమ జిల్లాలుసహా మొత్తం ఏడు జిల్లాలు బుధవారానికి 20 శాతం నుంచి 50 శాతం వరకు లోటు వర్షపాతంలో ఉన్నాయి. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సాధారణ స్థితిలో ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోనూ పరిస్థితి మెరుగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే పంటల సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని చేరుతుందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే నీరు రావడం ప్రారంభమైంది. ఈసారి శ్రీశైలం, సాగర్లు నిండేందుకు ఆస్కారం కనిపిస్తున్నందున సాగర్ కుడికాలువకు నీరిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గిన వర్షపాతం లోటు... ఈ ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మొత్తంగా 556 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికి 275.4 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే 224.1 మిల్లీమీటర్లే కురిసింది. అయితే గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైంది. వర్షపాతం లోటు ప్రస్తుతం 19 శాతానికి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం సైతం పెరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 38.30 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికి 22.17 లక్షల హెక్టార్లు అంటే సుమారు 79 శాతం విస్తీర్ణంలో పంటలు వేసి ఉండాల్సింది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు 17.74 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో ఎక్కువగా జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు వరి ఉంది. మొక్కజొన్న, రాగి, కంది, పత్తి, చెరకు వంటి పంటలైతే 75 శాతం వరకు వేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలేసింది. ఈ సీజన్లో ఇప్పటికి 7.44 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడాల్సి ఉండగా.. 6.33 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌లో మొత్తంగా 15.19 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేయాలన్నది లక్ష్యం. ఇదిలా ఉంటే.. గోదావరి వరదలతో నీట మునిగి దెబ్బతిన్న వరి నారు మళ్లు తిరిగి పోసుకునేందుకు వీలుగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. -
అల్పపీడనం.. అధిక వర్షం
సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షానికి పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలకు పలు చోట్ల నారుమళ్లు, వరినాట్లు నీట మునిగాయి. దీనికి శుక్రవారం కురిసిన వర్షం తోడు కావడంతో ముంపు తీవ్రత మరింత పెరిగింది. పలుచోట్ల చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. భీమవరం, ఉండి ప్రాంతాల్లో 6 స్తంభాలు నేలకూలాయి. యలమంచిలి మండలంలో చించినాడ కాలువకు గండిపడింది. దీంతో పలుచోట్ల నారుమళ్లు, వరినాట్లు నీటమునిగాయి. పాలకొల్లు మండలంలోను పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం యలమంచిలి, పాలకొల్లు. పోడూరు, తణుకు, పెనుమంట్ర, అత్తిలి, పెనుగొండ, పెరవలి, పాలకోడేరు, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు, వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకులాయి. జిల్లా వ్యాప్తంగా చెట్ల కొమ్మలు విరిగిపడడంతో 16 ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడం తదితర కారణాల వల్ల విద్యుత్ శాఖకు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లింది. నారుమళ్లు, నాట్లకు తీరని నష్టం భారీ వర్షాల వల్ల నారుమళ్లకు తీరని నష్టం కలిగింది. నాట్లు వేసిన వరిపొలాలూ దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం.. 4,818 హెక్టార్లలో వరినాట్లు, 430 హెక్టార్లలో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. రికార్డు స్థాయిలో వర్షం.. జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఏకంగా 32.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే గరిష్ట వర్షపాతం. గత రెండు నెలలుగా వర్షాలు లేవు. జూన్ నెలలో అయితే లోటు వర్షపాతం నమోదైంది. యలమంచిలి మండలంలో రికార్డుస్థాయిలో 97.6 మిల్లీమీటర్లు పోడూరులో 90.0, పాలకొల్లులో 78.4, తణుకులో 71.0,పెనుమంట్రలో 60.2, అత్తిలిలో 59.8, పెనుగొండలో 58.6, పెరవలిలో 59.4, పాలకోడేరులో 55.6, ఆచంటలో 50.5 మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. వీరవాసరంలో 46.8, నరసాపురంలో 45.4, భీమవరంలో 39.4, మొగల్తూరులో 38.6, నిడమర్రులో 38.2, గణపవరంలో 38.0, ఉండిలో 31.2, జంగారెడ్డిగూడెంలో 29.0, వేలేరుపాడులో 28.0. టి.నరసాపురం లో 27.4, కుక్కునూరులో 27.2, పెంటపాడులో 26.4, కాళ్లలో 25.2, చాగల్లులో 22.6, తాళ్లపూడిలో 22.2, ఆకివీడులో 21.8, పెదవేగిలో 20.6, చింతలపూడి, తాడేపల్లిగూడెం మండలాల్లో 20.0, ఉంగుటూరులో 19.4, నిడదవోలులో 18.2, కొవ్వూరులో 17.4, భీమడోలులో 17.2, కొయల్యగూడెం లో 16.2, దేవరపల్లిలో 15.8,లింగపాలెం, కామవరపుకోటంలో 14.6, గోపాలపురంలో 12.6, దెందులూరులో12.2, ద్వారకాతిరుమలలో 12.0, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెంలలో 11.6, పెదపాడు,ఏలూరు మండలాల్లో 9.8 మిల్లీమీటర్లు చొప్పున, నల్లజర్లలో 6.2, పోలవరంలో 4.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. -
చినుకు కునుకేసింది
సాక్షి, హైదరాబాద్ : జూలై చివర.. అంటే ఈ సమయానికి బాగా వానలు పడాల్సిన సమయం. జలాశయాలన్నీ కళకళలాడాల్సిన తరుణం.. కానీ నగరంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.. ఏదో పడీపడనట్లుగా.. కురిసీకురవనట్లుగా వర్షం.. దీంతో బోర్లు నోళ్లు తెరిచాయి.. భూగర్భ జలాలు అడుగంటాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నా.. సాధారణంగా పడాల్సిన దానితో పోలిస్తే.. అబ్బే.. ప్చ్ అనాల్సిన పరిస్థితి. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి జూలై 24 వరకు నమోదుకావాల్సిన వర్షపాతం 240.3 మిల్లీమీటర్లు అయితే.. 153.1 మి.మీటర్లే నమోదైంది. అంటే సాధారణం కంటే 36 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. -
చినుకు పడితే చెరువే..
సాక్షి, తూర్పు గోదావరి: చినుకు పడితే చాలు దేశ ఆర్థిక రాజధాని ముంబయి చిగురుటాకులా వణికిపోతుంది. గత పాలకులు, అధికారుల అనాలోచిత చర్యల వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ భయం నేడు జిల్లాలో ప్రధాన నగరాలనూ వెంటాడుతోంది. జిల్లా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో, ‘ప్లాన్డ్ సిటీ’, ‘సెకండ్ మద్రాస్’గా పేరొందిన కాకినాడ నగరాల్లో నేడు ఆ పరిస్థితులే దాపురించాయి. చినుకు పడితే డ్రైనేజీలు పొంగిపోయి ఆ మురుగునీటితో రహదారులు నిండిపోయి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. గత టీడీపీ పాలనలో ప్రజా ప్రతినిధుల అనాలోచిత నిర్ణయాలు, ప్రణాళికలు లేని అధికారుల చర్యలు వెరసి ఆయా ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అమృత్ పథకం కింద చేపట్టిన భూగర్భ డ్రైనేజీల నిర్మాణం కొన్నిచోట్ల ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉండగా మరికొన్ని చోట్ల అసంపూర్తి నిర్మాణాలు ఉన్నాయి. ఇక రాజమహేంద్రవరం లో భూగర్భ డ్రైనేజీలు ఉన్నా వాటిని వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వర్షాకాలం వచ్చి వెళ్లినప్పుడల్లా వాటిలో పేరుకుపోయిన సిల్ట్ తీయడం తప్ప ఆ డ్రైనేజీలు ఎందుకూ వినియోగించడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చక్కని ప్రణాళికలతో ఈ నగరాల్లో ముంపు సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం. కాకినాడ: పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా స్మార్ట్‌సిటీ కాకినాడ తయారైంది. సరైన ప్రణాళిక లేకుండా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ వల్ల చిన్నపాటి వర్షానికి కూడా కాకినాడ నగరం తీవ్ర ముంపు సమస్యను ఎదుర్కొంటోంది. వర్షపునీటి పారుదలకు సరైన వ్యవస్థ లేకపోవడం ఇందుకు ప్రధాన అవరోధంగా కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలతో పాటు నిత్యం రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డు, బాలాజీచెరువు వంటి ముఖ్యప్రాంతాలు కూడా కొద్దిపాటి వర్షం పడినా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైన్లలోని మురుగునీరు పొంగి పొర్లడంతోపాటు వాహనాలు మెకాలిలోతు నీటిలో ప్రయాణించాల్సిన దుస్థితిని నగరవాసులు ఎదుర్కొంటున్నారు. 17 ముంపు ప్రాంతాలు గుర్తింపు జిల్లా కేంద్రం కాకినాడలో మెయిన్‌రోడ్డు, సినిమా రోడ్డు, నూకాలమ్మ గుడి, బాలాజీచెరువు, పాత బస్టాండ్, పర్లోపేట, రామకృష్ణారావుపేట, రేచర్లపేట వంటి 17 ప్రాంతాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. ప్రధాన డ్రైన్లకు అనుసంధానం లేకపోవడంతో వర్షపునీటి ప్రవాహం ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితిని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నారు. ఈ స్థితిలో రూ.72 కోట్లతో 54 కిలోమీటర్ల పరిధిలో డ్రైనేజీలను ఆధునీకరించేందుకు స్మార్ట్‌సిటీ, అమృత్, 14వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా గతంలోనే ప్రతిపాదనలు చేశారు. అయితే అవి ఏ మాత్రం ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. పట్టుమని నాలుగో వంతు పనులు కూడా పూర్తికాకపోవడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకని పరిస్థితి నెలకొంది. భూగర్భ డ్రైనేజీకి ఇబ్బందే.. భూగర్భ డ్రైనేజీ ద్వారా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నా జిల్లా కేంద్రానికి మాత్రం ఆచరణ సాధ్యం కాదని ఇప్పటికే తేల్చేసిన పరిస్థితి నెలకొంది. కాకినాడ నగరం సముద్ర మట్టానికి దిగువన ఉండడంతో వర్షపునీరు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. గతంలో భూగర్భ డ్రైనేజీ కోసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చుకాగలదని అంచనా వేసినా అది ఆచరణ సాధ్యం కాదని తేలడంతో ప్రతిపాదనపై వెనకడుగు వేశారు. వర్షపునీటి ప్రవాహం ముందుకు వెళ్లేలా ఇప్పటికైనా అధికారులు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటే ముంపు సమస్యకు చాలా వరకు పరిష్కారం దొరకగలదంటున్నారు. ‘అమృత్’లో అభివృద్ధికి చర్యలు అమృత్ పథకం ద్వారా స్టార్మ్ వాటర్ డ్రైనేజీలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సుమారు 54 కిలోమీటర్ల పరిధిలో రూ.72 కోట్ల వ్యయంతో ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే కాకినాడ నగరం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వచ్చే ఏడాది మే లోపుగా ఈ పనులు పూర్తయ్యేందుకు కాలపరిమితి ఉంది. – పీవీ సత్యనారాయణరాజు, ఇన్చార్జ్ ఎస్ఈ వర్షపు నీటితో అన్నీ ఇబ్బందులే వర్షం వచ్చిన ప్రతిసారీ ప్రధాన రహదారులు మునిగిపోతున్నాయి. డ్రైనేజీలలోని మురుగునీరు కూడా వర్షపునీటితో కలిసి రోడ్లపైకి వస్తోంది. దీని వల్ల ముంపునకు గురైన రోడ్లపై ప్రయాణం చేయడం చాలా ఇబ్బంది కరంగా ఉంటోంది. మురికినీటితో కూడిన వర్షపునీటి వల్ల ఎలాంటి రోగాలు వస్తాయోనన్న భయం నెలకొంది. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళిక రూపొందించి నగరానికి ముంపునీటి సమస్యను తీర్చాలి. – వి.మనోజ్, నూకాలమ్మగుడి ప్రాంతం, కాకినాడ వర్షం వస్తే ఇక్కట్లే... చిన్నపాటి వర్షానికి కూడా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది. స్మార్ట్ సిటీలో వందల కోట్ల వ్యయంతో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నా ముంపు సమస్య పరిష్కారానికి మాత్రం సరైన చర్యలు తీసుకోలేకపోయారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ సమస్యపై త్వరలోనే ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోంది. – రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ -
యూపీలో భారీ వర్షాలు; కూలిన 133 భవనాలు
లక్నో: గత మూడు రోజులుగా భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సుమారు 14 జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడి కుండపోతగా కురిసిన వర్షాలకు 15 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అదే విధంగా 133 భవనాలు కూలిపోయినట్లు పేర్కొన్నారు. వాన బీభత్సంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించారు. కాగా లక్నోలో శనివారం నుంచి మరో ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, , జార్ఖండ్, నుంచి మధ్య మహారాష్ట్ర, గోవా ప్రాంతాలతో పాటు.. ఈశాన్య రాష్ట్రాలైన అరణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజొరాంలలో అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు అసోంను వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. -
మహోద్యమంగా జలసంరక్షణ
న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణను ఓ మహోద్యమంగా చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలంతా వర్షపునీటిని సంరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పలు నదులు, జలాశయాలు ఎండిపోయి ప్రజలు నీటికి కటకటలాడుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆదివారం నిర్వహించిన తొలి మాసాంతపు మన్‌కీ బాత్(మనసులో మాట) కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. నీటి పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం పాటించడం సరైన పద్ధతి కాదని మోదీ అభిప్రాయపడ్డారు. ఒక్కో ప్రాంతంలో అక్కడి స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ప్రతీ నీటిచుక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నీటి వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు, ఇతర సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని, జలసంరక్షణ పద్ధతులను అందరికీ వివరించాలని కోరారు. ప్రస్తుతం భారత్‌లో కురుస్తున్న వర్షంలో కేవలం 8 శాతం నీటిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామన్నారు. గ్రామసభలను ఏర్పాటుచేసి ప్రజలంతా జల సంరక్షణ విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జలసంరక్షణ చర్యల్ని ప్రజలంతా ‘జన్‌శక్తి4జల్‌శక్తి’ అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా పంచుకోవాలని సూచించారు. 2014 అక్టోబర్ 3 నుంచి 2019, ఫిబ్రవరి 24 వరకు 53 సార్లు ‘మన్‌కీ బాత్’ కార్యక్రమాన్ని నిర్వహించిన మోదీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిపివేశారు. కేదార్‌నాథ్‌ను అందుకే దర్శించుకున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. ‘ఈ ఏడాది ఫిబ్రవరి 24న మన్‌కీబాత్ కార్యక్రమంలో ఓ 3–4 నెలల తర్వాత మళ్లీ కలుసుకుందామని చెప్పాను. ఈ నమ్మకం మోదీది కాదు. ఇది మీరునాపై ఉంచిన నమ్మకం. ఈ నమ్మకానికి మీరే మూలకారణం. నన్ను మళ్లీ గెలిపించి ఇక్కడకు తీసుకొచ్చారు. మరోసారి మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు’ అని మోదీ తెలిపారు. ‘మన్‌కీ బాత్’ ఆగిపోయిన సమయంలో తనకు ప్రజలతో సంభాషించే అవకాశం లేకుండాపోయిందనీ, అసౌకర్యంగా, ఒంటరిగా అనిపించిందని వెల్లడించారు. ‘ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ కేదార్నాథ్, బద్రీనాథ్‌లను దర్శించుకున్నాను. ఎన్నికల మధ్యలో ఎందుకు వెళ్లారని నన్ను చాలామంది అడిగారు. రాజకీయ ప్రచారం కోసమే వెళ్లానని కొందరు అనుకున్నారు. కానీ నా అంతరాత్మను కలుసుకోవడానికి, నన్ను నేను సమీక్షించుకోవడానికే కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లాను. అక్కడ ధ్యానం చేయడం మన్‌కీబాత్ కార్యక్రమం లేనిలోటును పూడ్చింది’ అన్నారు. మోదీ నోట ‘ఊటకుంట’ అడ్డాకుల (దేవరకద్ర): ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మహబూబ్‌నగర్ జిల్లాలోని తిమ్మాయిపల్లితండా శివారులో నిర్మించిన ఊటకుంటను ప్రస్తావించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన ఈ ఊటకుంట సత్ఫలితాలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. వర్షాలు కురిసినప్పుడు నీరు వృథాగా వెళ్లకుండా ఉండేందుకుగాను 4–5 ఏళ్ల క్రితం ఈ కుంటను నిర్మించారు. దీనికి అనుబంధంగా మరో రెండింటిని ఏర్పాటుచేశారు. దీనివల్ల వర్షం కురిసినప్పుడు గుట్టల పైనుంచి వచ్చే వర్షపునీరు కుంటలోనే నిలిచి పరిసరాల్లో ఉండే బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతోంది. పెద్దపెద్ద చెరువుల వల్ల కలిగే ప్రయోజనాలు ఉపాధిహామీలో చిన్న కుంటలతోనూ లభిస్తున్నాయని చెబుతూ మోదీ ఈ ఊటకుంటను ప్రస్తావించారు. ప్రజాస్వామ్య గొప్పతనం తెలియట్లేదు.. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘రోజూ సమయానికి భోజనం చేసే వ్యక్తికి ఆకలి కేకలు ఎలా ఉంటాయో తెలియదు. అలాగే ప్రస్తుతం ప్రజాస్వామ్య హక్కులను హాయిగా అనుభవిస్తున్న ప్రజలకు వాటి విలువ పోగొట్టుకుంటే తప్ప బోధపడదు. ఏదైనా మన దగ్గరున్నప్పుడు దాని విలువను అర్థం చేసుకోలేం. ఎమర్జెన్సీ సమయంలో ప్రతీపౌరుడికి తమకు సంబంధించినదేమో లాక్కున్న భావన కలిగింది. దీంతో 1977లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటేశారు. అత్యంత గొప్పదైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండటం నిజంగా మన అదృష్టమే. కానీ దాన్ని మనం తగినరీతిలో గౌరవించడం లేదు’ అని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఏకంగా 61 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రధాని వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా జనాభాకు రెట్టింపని తెలిపారు. భారత్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్య యూరప్ ఖండం జనాభా కంటే ఎక్కువన్నారు. ఈ ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారనీ, ప్రస్తుతం పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు. ప్రజలంతా గూగుల్ ద్వారా ఎక్కువ పుస్తకాలు చదవాలన్నారు. ఈ సందర్భంగా గూగుల్‌ను ‘గూగుల్ గురు’గా ప్రధాని అభివర్ణించారు. -
అప్పుడే దేశంలో కరవు తాండవం!
సాక్షి, న్యూఢిల్లీ : నేడు భారత్‌లోని 42 శాతం భూభాగంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (డీఈడబ్ల్యూఎస్)’ వెల్లడించింది. మొత్తం దేశ జనాభాలో 40 శాతం జనాభా అంటే, దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ రాష్ట్రాల్లో, ఈ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించకపోవడం శోచనీయం. అయితే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలోని అనేక జిల్లాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించాయి. వర్షాలు పడాలంటే మరో రెండు, మూడు నెలలు పడుతుంది కనుక కరవు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ డెవలపర్, గాంధీనగర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విమల్ మిశ్రా తెలిపారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు, రెండూ వైఫల్యం చెందడం వల్ల ఈ కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని మిశ్రా తెలిపారు. దేశంలో ఏడాదిలో కురిసే వర్షపాతంలో నైరుతి రుతుపవాల వల్ల 80 శాతం, ఈశాన్య రుతు పవనాల వల్ల 20 శాతం వర్షాలు కురుస్తాయి. 2018, జూన్–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కురవాల్సిన వర్షపాతంలో 9.4 శాతం తగ్గినట్లు, అదే ఈశాన్య రుతుపవాల వల్ల అక్టోబర్–డిసెంబర్ మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతంలో 44 శాతం తగ్గినట్లు భారత వాతావరణ పరిశోధన కేంద్రం లెక్కలే తెలియజేస్తున్నాయని మిశ్రా వివరించారు. రుతుపవనాల కన్నా ముందు అంటే, మార్చి–మే నెలల మధ్య కురవాల్సిన వర్షపాతం కూడా ఈ సారి బాగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య కురిసే వర్షపాతంలో కూడా 36 శాతం తగ్గింది. ఫలితంగా దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం 32 శాతం పడిపోయింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోని 31 రిజర్వాయర్లలో నీటి మట్టం 36 శాతం పడిపోయింది. మున్ముందు కరవు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, పర్యవసానంగా గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయని మిశ్రా హెచ్చరించారు. ఎల్‌నైనో పరిస్థితుల కారణంగా 2015 నుంచి (2017 మినహా) వరుసగా దేశంలో వర్షపాతం తగ్గుతూ వస్తోంది. -
గట్టెక్కించిన సీలేరు
అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ వరిసాగు గట్టెక్కింది. శివారుకు సకాలంలో సాగునీరందకున్నా.. గోదావరిలో పంపులు ఏర్పాటు చేసి వృథా జలాలను కాలువల ద్వారా చేలకు మళ్లించకున్నా.. సొంతంగా మోటార్లు పెట్టుకున్న రైతులకు ప్రభుత్వం డీజిల్ ఖర్చులివ్వకున్నా.. మురుగునీటి కాలువలపై సకాలంలో క్రాస్బండ్లు వేయకున్నా.. చంద్రబాబు సర్కార్ పైసా విదల్చకున్నా.. డెల్టాలో రబీ పంట పండింది. 16 టీఎంసీల నీటికొరత ఉంటుందని అధికారులు చెప్పినా.. అంచనాలకు మించి నీరు రావడంతో రబీసాగు నీటి ఎద్దడికి ఎదురొడ్డి నిలిచింది. అదెలా సాధ్యమయ్యిందంటే.. ఎద్దడి సమయంలో గోదావరి డెల్టాలో రబీసాగును ‘సీలేరు’ ఎప్పటిలానే ఒడ్డున పడేసింది. ఈసారి రికార్డు స్థాయిలో ఆదివారం నాటికి ఏకంగా 66.056 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదలడం ద్వారా.. ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 7 లక్షల మంది రైతులకు జీవనాధారమైన రబీ సాగు నిర్విఘ్నంగా పూర్తయ్యింది. నీటి ఎద్దడి ఉందన్నా.. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దిగువన ప్రధాన పంట కాలువలకు ఈ నెల 10 నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విçషయం తెలిసిందే. శివార్లలో సాగు ఆలస్యమైనందున మరో ఐదు రోజులు గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రబీ సాగుకు ఈ ఏడాది ఎద్దడి తప్పని అధికారులు ముందే చెప్పారు. రబీ షెడ్యూలు కాలంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు పోగా, కేవలం సాగుకు 83 టీఎంసీల నీరు అవసరమని, నీటి లభ్యత 67 టీఎంసీలు మాత్రమే ఉంటుందని తేల్చారు. అయినప్పటికీ మొత్తం ఆయకట్టుకు సాగునీరందించాలని జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ పెద్దలు సూచించారు. కానీ, వివిధ పద్ధతుల్లో నీటి సేకరణకు ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా మంజూరు చేయించలేదు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండన్నట్టుగా డెల్టాలో రైతులను, నీటిపారుదల అధికారులను గాలికి వదిలేశారు. దీంతో రైతులు ఉన్న నీటినే పొదుపుగా వాడుకొని రబీని గట్టెక్కించారు. సీలేరు నుంచి రికార్డు స్థాయిలో నీటి సేకరణ అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే గోదావరిలో సహజ జలాలు తక్కువగా వచ్చాయి. గోదావరి సహజ జలాల అంచనా 24 టీఎంసీలు కాగా, ఆదివారం నాటికి 22.754 టీఎంసీల నీరు వచ్చింది. ఇది అధికారుల అంచనాకన్నా సుమారు ఒక్క టీఎంసీ తక్కువ. ఇదే సమయంలో మనకు సీలేరు నుంచి 49 టీఎంసీల వరకూ నీరు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి రబీ కాలంలో సీలేరు నుంచి మనకు వచ్చే నీరు 40 టీఎంసీలే. అత్యవసర పరిస్థితుల్లో బైపాస్ పద్ధతిలో మరో 5 టీఎంసీల వరకూ తెచ్చుకోవచ్చు. ఎందుకైనా మంచిదని సీలేరు నుంచి 49 టీఎంసీలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారి అంచనాలకు మించి ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో ఏకంగా 66.056 టీఎంసీల నీరు సేకరించారు. కాలువలు మూసేనాటికి మరో రెండు టీఎంసీలు కలిపితే 68.056 టీఎంసీలు సీలేరు నుంచి సేకరించినట్టవుతుంది. ఇప్పటికీ సీలేరు నుంచే.. డెల్టా ప్రధాన పంట కాలువలైన తూర్పు డెల్టాకు 1,825, మధ్య డెల్టాకు 1,190, పశ్చిమ డెల్టాకు 3,175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 6,190 క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. దీనిలో సహజ జలాలు 1,032 క్యూసెక్కులు కాగా, సీలేరు నుంచి వస్తున్నది 5,158 టీఎంసీలు కావడం విశేషం. ఇప్పటికీ బైపాస్ పద్ధతిలో నీరు తీసుకువస్తున్నారంటే గోదావరి డెల్టాకు సీలేరు ప్రాధాన్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్ డ్రాప్ నుంచి అత్యధికంగా 4 వేల క్యూసెక్కులు, బైపాస్ పద్ధతిలో మరో 2 వేల క్యూసెక్కుల చొప్పున 6 వేల క్యూసెక్కులు సేకరించేవారు. కానీ ఈసారి ఏకంగా కొన్ని రోజుల పాటు 7,500 వరకూ సీలేరు నుంచి సేకరించాల్సి వచ్చింది. -
వానా వానా చాలప్ప!
-
వానా వానా చాలప్ప!
సాక్షి, హైదరాబాద్ : గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ మహా నగరం తడిసి ముద్దయింది. అధిక వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల రోడ్లపై పడవలతో జనం రవాణా సాగించారు. ఇంతస్థాయిలో వర్షం పడటంపై వాతావరణ శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు ఈ 14 రోజుల్లో నగరంలో 348 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే వేళ ఇంతస్థాయిలో వర్షాలు కురవడం వాతావరణ శాఖ వర్గాలను నివ్వెరపరిచింది. రబీ ప్రారంభమైన ఈనెల ఒకటో తేదీ నుంచి 14వ తేదీ వరకు సాధారణంగా హైదరాబాద్‌లో 51 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే ఏకంగా 228.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఒక్కోరోజు 12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కావడం గమనార్హం. ఇక పాత రంగారెడ్డి జిల్లాలో ఇదే సమయంలో సాధారణంగా 56.5 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, 141.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే ఏకంగా 151 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమయంలో సాధారణంగా 52.7 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 96.5 మి.మీ. వర్షం కురిసింది. ఆ ప్రకారం సాధారణం కంటే 83 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో 13 % లోటు.. రబీ ఆశాజనకం ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య 13 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 49 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 41 శాతం లోటు నమోదై పరిస్థితి తిరగబడింది. ఆగస్టులో 8 శాతం, సెప్టెంబర్‌లో 30 శాతం లోటు వర్షపాతమే నమోదైంది. లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్‌లో రాష్ట్రంలో 184 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 307 మండలా ల్లో సాధారణ, 92 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అయితే రబీ మొదలైన ఈ 14 రోజుల్లో 83 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఖరీఫ్‌లో వరి నాట్లు నిరాశాజనకంగా ఉన్నాయి. 86 శాతానికి మించలేదు. జలాశయాలు నిండక అనేక చోట్ల నాట్లు పడలేదు. ఈసారి రబీ ప్రారంభంలోనే అధిక వర్షాలు కురుస్తుండటం, జలాశయాలు, చెరువులు నిండుతుండటంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. గతేడాది ఖరీఫ్ కంటే రబీలోనే పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు నాటి రబీ గతినే మార్చేశాయి. ఈసారి కూడా రబీ బాగుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 20 తర్వాత వర్షాలు తగ్గుముఖం ఐదారు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. దీంతో వర్షాలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు.. రానురాను తగ్గుముఖం పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాస్తవంగా నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటాయి. ఒక్కోసారి అక్టోబర్ 15 వరకు కొనసాగుతాయి. ఈసారి మాత్రం 20వ తేదీ వరకు ఉండనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా నిష్క్రమించడం అసాధారణ విషయమేమీ కాదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాతావరణంలో పెనుమార్పులకు ఇది సూచిక కాదని స్పష్టం చేశారు. నగరాన్ని వీడని వాన నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం శనివారం కూడా కొనసాగింది. అత్యధికంగా రాజేంద్రనగర్‌లో రాత్రి 9 గంటల వరకు 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్‌లో 3 నుంచి 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గోల్కొండ, పాశమైలారం తదితర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో నీట మునిగిన మల్కాజిగిరి, హబ్సిగూడతోపాటు పలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. బేగంపేట బ్రాహ్మణవాడిలో నాలాలోని నీరు 5 అడుగుల మేర ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు
– పంచాంగ శ్రవణంలో పండిత బుట్టే శ్రీశైలం: ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఆయన పంచాంగం చెప్పారు.పొట్టి, నలుపు ధాన్యాలు ఫలిస్తాయని, నల్లరేగడి, ఎÆరుపు నేలల్లో విశేషంగా పంటలు పండుతాయని తెలిపారు. వేరుశనగ, మొక్కజొన్న, మిరప, పెసలు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలకు (ధనియాలు వగైరా) మంచి గిరాకీ ఉంటుందన్నారు. పాడిపరిశ్రమ చాలా బాగుంటుందని, పాల ఉత్పత్తులు కూడా పెరుగుతాయన్నారు. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. పంచాంగ శ్రవణానంతరం ఈఓ నారాయణ భరత్‌గుప్తకు పండిత బుట్టే శత సంవత్సర పంచాంగం, శేషవస్త్రాలను అందజేశారు. చివరగా దేవస్థానం అర్చకులు, వేదపండితులు, వివిధ విభాగాల అధికారులకు పండిత సత్కారం చేసి పంచాంగాలను పండిత బుట్టే ఇచ్చారు. -
పెదకూరపాడులో 2.42 సెం.మీ వర్షపాతం
గుంటూరు (కొరిటెపాడు) : జిల్లాలో శనివారం ఉదయం వరకు అత్యధికంగా పెదకూరపాడు మండలంలో 2.42 సెంటీ మీటర్లు, అత్యల్పంగా సత్తెనపల్లి మండలంలో 0.10 సెం.మీ వర్షం కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... అచ్చంపేట మండలంలో 2.36 సెం.మీ తాడేపల్లి 2.20 తాడికొండ 2.16 భట్టిప్రోలు 2.12 పెదకాకాని 1.94 అమరావతి 1.90 మంగళగిరి 1.84 కొల్లిపర 1.52 వట్టిచెరుకూరు 1.50 నాదెండ్ల 1.42 రొంపిచర్ల 1.34 ప్రత్తిపాడు 1.24 పిట్టలవానిపాలెం 1.10 తుళ్ళూరు 1.04 ఫిరంగిపురం 0.98 కొల్లూరు 0.94 తెనాలి 0.88 యడ్లపాడు 0.78 క్రోసూరు 0.72 కర్లపాలెం 0.70 చిలకలూరిపేట 0.68 పిడుగురాళ్ళ 0.68 పొన్నూరు 0.64 చుండూరు 0.64 పెదనందిపాడు 0.62 వేమూరు 0.58 నిజాంపట్నం 0.56 బెల్లంకొండ 0.54 మాచర్ల 0.42 గుంటూరు 0.40 బాపట్ల 0.38 రెంటచింతల 0.38 మాచవరం 0.34 అమృతలూరు 0.32 దుగ్గిరాల 0.32 చేబ్రోలు 0.28 చెరుకుపల్లి 0.28 నగరం 0.22 బొల్లాపల్లి 0.20 ముప్పాళ్ల 0.20 దుర్గి 0.16 గురజాల 0.14 రాజుపాలెం 0.14, రేపల్లె 0.14, నరసరావుపేట మండలంలో 0.12 సెం.మీ -
32.2 మి.మీ వర్షపాతం నమోదు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 32.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఎం.బాలకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలో అత్యధికంగా 147.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవగా అత్యల్పంగా పెదపాడు, మొగల్తూరు మండలాల్లో 0.4 మిల్లీమీటర్లు నమోదైంది. మిగిలిన మండలాల్లో కొయ్యలగూడెంలో 119.2, కామవరపుకోటలో 108.2, గోపాలపురంలో 101.4, బుట్టాయిగూడెంలో 100.8, పోలవరంలో 92.2, జీలుగుమిల్లిలో 82.6, కుక్కునూరులో 82.2, తాళ్లపూడిలో 62.2 మి.మీ వర్షపాతం నమోదైంది. చింతలపూడిలో 60.4, కొవ్వూరులో 53.6, టి.నరసాపురంలో 52.4, వేలేరుపాడులో 50.4, ద్వారకాతిరుమలలో 46.4, దేవరపల్లి, తణుకులో 29.6, పెంటపాడులో 29.4, పెరవలిలో 25, నల్లజర్లలో 21.4 మి.మీ వర్షం కురిసింది. పెనుగొండలో 21.2, ఇరగవరంలో 19.2, పోడూరులో 18, ఉండ్రాజవరంలో 17.4, తాడేపల్లిగూడెంలో 16.4, అత్తిలి, ఆచంటలలో 15.4, వీరవాసరంలో 15, నిడమర్రులో 14.8, నిడదవోలులో 12.2, చాగల్లులో 11.4, ఉంగుటూరులో 11.2, యలమంచిలిలో 8.2, గణపవరంలో 8, పాలకోడేరులో 7.4, పెనుమంట్రలో 6.8, దెందులూరులో 6.2, పాలకొల్లులో 5, భీమడోలులో 4.2, భీమవరంలో 3.4, ఏలూరు, ఆకివీడులలో 3, లింగపాలెం, కాళ్లలో 2, పెదవేగిలో 1.8, నరసాపురంలో 1.4, ఉండిలో 0.6 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందని సీపీవో తెలిపారు. -
రెండింతల వాన
* సెప్టెంబర్‌లో ఇప్పటికే సాధారణ వర్షపాతంకంటే రెట్టింపు వర్షం * పిడుగురాళ్లలో 20.42 సెం.మీ నమోదు * ఆందోళనలో రైతులు కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. దాదాపు అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే రెండింతలు నమోదైంది. వారం క్రితం కురిసిన వర్షాల నుంచి తేరుకునేలోపే తిరిగి భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు నీళ్లమయమయ్యాయి. పొలాల్లో కురిసిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం పిడుగురాళ్ల మండలంలో అత్యధికంగా 20.42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా తెనాలి మండలంలో 0.10 సెంటీమీటర్లు కురిసింది. జిల్లాలో 38,797 హెక్టార్లలో పంటలు మునక... భారీ వర్షాలకు జిల్లాలో 36,497 హెక్టార్లలో పంటలు నీట మునిగిపోయాయి. వరి 8,714 హెక్టార్లు, పత్తి 22,788 హెక్టార్లు, కంది 4,204 హెక్టార్లు, మిరప 2,300 హెక్టార్లు, మినుము 477 హెక్టార్లు, పెసర 158 హెక్టార్లు, జూట్ 80 హెక్టార్లు, సోయాబిన్ 46 హెక్టార్లు, మొక్కజొన్న 30 హెక్టార్లు ప్రస్తుతం నీటిలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులను కలెక్టర్ కాంతిలాల్ దండే అప్రమత్తం చేశారు. పిడుగురాళ్లలో 20.42 సెం.మీ వర్షం... జిల్లాలో సగటున 2.87 సెం.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... రెంటచింతల మండలంలో 16.02 సెం.మీ, గురజాల 13.02, నకరికల్లు 11.24, దాచేపల్లి 11.04, మాచర్ల 10.74, వెల్దుర్తి 7.92, సత్తెనపల్లి 7.82, దుర్గి 6.12, పెదకూరపాడు 6.04, ముప్పాళ్ల 5.78, బెల్లంకొండ 4.60, మాచవరం 4.02, ఫిరంగిపురం 4.02, నరసరావుపేట 3.46, బొల్లాపల్లి 3.16, మేడికొండూరు 3.02, కారంపూడి 2.66, ఈపూరు 2.52, రొంపిచర్ల 2.40, నాదెండ్ల 1.86, యడ్లపాడు 1.56, కాకుమాను 1.50, శావల్యాపురం 1.28, పెదనందిపాడు 1.12, పొన్నూరు 0.86, వినుకొండ 0.86, రాజుపాలెం 0.80, ప్రత్తిపాడు 0.74, తాడికొండ 0.74, క్రోసూరు 0.68, కొల్లూరు 0.62, తుళ్లూరు 0.62, చిలకలూరిపేట మండలంలో 0.58 సెం.మీ చొప్పున వర్షం పడింది. -
"ఉత్తర" చూసి గంప ఎత్తారు!
అమడగూరు : ఉత్తర కార్తె వచ్చినా చినుకు జాడ లేక పోవడంతో చీకిరేవుపల్లి గ్రామస్తులు వలస దేవర ఉత్సవం చేపట్టారు. వరుణదేవా కరుణించి మమ్మల్ని కాపాడు తండ్రీ.. అంటూ గురువారం గామస్తులంతా వలస బాట పట్టారు. ముందుగా గ్రామంలోని రామస్వామి ఆలయంలో గ్రామస్తులు పూజలు నిర్వహించారు. ఖరీఫ్ పంటలు ఎండిపోతుండటంతో ఎలా బతకాలని ఇళ్లను, పొలాలను వదిలి గ్రామస్తులంతా సామగ్రిని వెంట బెట్టుకుని అడవులకు బయలుదేరారు. దీంతో వీధులన్నీ బోసిపోయాయి. విషయం తెలుసుకున్న గొల్లలు గ్రామ పొలిమేరలో గ్రామస్తులను అడ్డుకుని..‘అయ్యో.. మీరంతా ఊరొదిలి వెళ్లిపోతే ఇక మాకు దిక్కెవరు.. వచ్చే హస్తిన కార్తి చూసి అందరూ వెళ్దాం’ అని లబోదిబోమంటూ వారిని అడ్డగించారు. ఇక చేసేది లేక గ్రామస్తులంతా తమతో తీసుకెళ్లిన సామాగ్రితో పొలిమేరలోనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడే భోజనాలను ఆరగించి భజనలు చేసుకుంటూ సాయంత్రానికి గ్రామానికి చేరుకున్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు క్రిష్ణారెడ్డి, వెంకటరమణ (లెవెల్), భాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, నరసింహప్ప, అక్కాయమ్మ, లక్ష్మీదేవమ్మ, అమరమ్మ, సావిత్రమ్మ, రామలక్ష్ము, అశ్వర్థమ్మ, అమర మ్మ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గిలో 27.38 సెం.మీ వర్షం
కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా దుర్గి మండలంలో 27.38 సెంటీ మీటర్లు వర్షం, అత్యల్పంగా అమరావతి మండలంలో 0.22 సెం.మీ వర్షపాతం నమోదైంది. సగటున 3.30 సెం.మీ వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... మాచర్ల మండలంలో 17.12 సెం.మీ, రెంటచింతల 14.32, గురజాల 13.06, వెల్ధుర్తి 12.78, పొన్నూరు 9.48, కారంపూడి 8.82, నూజెండ్ల 8.68, పిడుగురాళ్ళ 8.48, దాచేపల్లి 8.24, బాపట్ల 6.18, నకరికల్లు 5.62, చుండూరు 4.32, బొల్లాపల్లి 3.92, వినుకొండ 3.84, ఈపూరు 3.58, శావల్యాపురం 3.30, మాచవరం 3.18, రాజుపాలెం 3.04, రొంపిచర్ల 2.98, అమృతలూరు 2.50, కాకుమాను 2.06, కర్లపాలెం 1.58, పిట్టలవానిపాలెం 1.54, గుంటూరు 1.50, ముప్పాళ్ల 1.32, చెరుకుపల్లి 1.18, భట్టిప్రోలు 1.02, వేమూరు 0.88, చిలకలూరిపేట 0.86, బెల్లంకొండ 0.72, రేపల్లే 0.60, పెదనందిపాడు 0.58, కొల్లూరు 0.46, యడ్లపాడు 0.36, సత్తెనపల్లి 0.32, తెనాలి 0.32, చేబ్రోలు మండలంలో 0.28 సెం.మీ చొప్పున వర్షం పడింది. -
13.3 మి.మీ సగటు వర్షపాతం నమోదు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 13.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు ముఖ్య ప్రణాళికాధికారి ఇన్చార్జి టి.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 638 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా గోపాలపురం మండలంలో 41.4 మిల్లీమీటర్లు నమోదైందన్నారు. అత్యల్పంగా బుట్టాయిగూడెం, యలమంచిలి మండలాల్లో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమవరంలో 28.6, దేవరపల్లి 27.8, ద్వారకాతిరుమల 26.6, తాళ్లపూడి 26.4, నల్లజర్ల 25.6, కాళ్ల 25.2, జీలుగుమిల్లి 21.2, పెనుమంట్ర 21, గణపవరం 18, పెదపాడు, పెనుగొండలలో 17.8, టీ.నరసాపురం 17.6, భీమడోలు 17.2, ఏలూరు 16.8, కొవ్వూరు 16.2, కొయ్యలగూడెం 15.2, చాగల్లు 14.4, పెంటపాడు, వేలేరుపాడు, పాలకోడేరులలో 14.2, పెరవలి 13.2, తాడేపల్లిగూడెం 12.6, పోడూరు 11.6, దెందులూరు, వీరవాసరం, ఆచంట, ఉండిలలో 11.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదవేగి 10.8, చింతలపూడి, ఉంగుటూరులలో 9.4, తణుకు 9.2, నిడదవోలు, కుకునూరు 8.2, ఉండ్రాజవరం 7.8, ఆకివీడు 7.6, మొగల్తూరు 7, నిడమర్రు 6.8, జంగారెడ్డిగూడెం 6.6, అత్తిలి 6.4, పోలవరం, కామవరపుకోటలో 6.2, ఇరగవరం 5.2, పాలకొల్లు 4 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. -
రెంటచింతలలో 13.71 సెం.మీ వర్షపాతం
కొరిటెపాడు (గుంటూరు) : జిల్లాలో బుధవారం ఉదయం వరకు అత్యధికంగా రెంటచింతల మండలంలో 13.71 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అత్యల్పంగా కర్లపాలెం మండలంలో 1.14 సెం.మీ వర్షపాతం నమోదైంది. సగటున 2.21 సెం.మీ వర్షం పడింది. జిల్లాలోని వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... కారంపూడి మండలంలో 12.34 సెం.మీ, దాచేపల్లి 11.02, గురజాల 8.52, క్రోసూరు 7.70, రొంపిచర్ల 7.42, బొల్లాపల్లి 7.30, ఈపూరు 6.92, మాచవరం 5.58, మాచర్ల 4.42, అచ్చంపేట 4.40, రేపల్లె 3.76, వెల్దుర్తి 3.64, దుర్గి 3.34, బెల్లంకొండ 3.24, ముప్పాళ్ల 2.68, పిడుగురాళ్ళ 2.42, నకరికల్లు 2.24, నూజెండ్ల 2.20, వినుకొండ 1.90, తుళ్ళూరు 1.70, రాజుపాలెంలో 1.54 సెం.మీ చొప్పున వర్షం పడింది. -
రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వైపు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి 'సాక్షి'కి తెలిపారు. క్యుములోనింబస్ మేఘాల తీవ్రత తగ్గినందున వడ గాలుల తీవ్రత కూడా తగ్గనున్నట్లు వివరించారు. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయని, రాష్ట్రంలో వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్నారు. దీంతో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని వివరించారు. ఉపరితల ఆవర్తనం కారణంగా కేరళను నైరుతి రుతుపవనాలు ఏడో తేదీన (నాలుగు రోజులు అటుఇటుగా) తాకుతాయని వివరించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి, తెలంగాణలోకి ప్రవేశిస్తాయన్నారు. మరోవైపు గత 24 గంటల్లో గద్వాల్ లో 3, మెదక్, టేకులపల్లిల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరికొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గురువారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డుకాగా, ఆదిలాబాద్‌లో 44 డిగ్రీలు నమోదైంది. -
వర్షాలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
విజయవాడ: రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు పక్కాగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే పలువురు మృతిచెందగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. -
విత్తనమేదీ ?
బాపట్ల: వర్షభావం ఖరీఫ్ రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ పరిస్థితుల్లో వరిసాగుకు వెదపద్ధతి అనుకూలమని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరో వైపు వరి వంగడాల కొరత రైతులను వేధిస్తోంది.వెద పద్ధతికి అనుకూలమైన వంగడాలు లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో బీపీటీలో 2270 రకం భావపురి సన్నాలు, ఎం.టి.యు 1010, ఎన్.ఎల్.ఆర్ 4449 రకం వంగడాలను వెదపద్ధతిలో మంచి లాభాలు తెచ్చిపెడతాయని శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి కూడా సూచించారు. అయితే వీటి లభ్యతపైన ప్రస్తుతం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వరిని ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. ఏటా సుమారు 2.40 లక్షల హెక్టార్లలో సాగవుతోంది.ఎక్కువ మంది రైతులు బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 145, ఎన్‌ఎల్‌ఆర్ 33892 రకాలను సాగు చేస్తుంటారు. ఈ వంగడాలు ఎక్కువగా రైతుల వద్ద లభ్యమవుతుంటాయి. అలాగే విత్తన దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన వంగడాలు ఈ ఏడాది వర్షభావ పరిస్థితుల కారణంగా వెద పద్ధతితోనే సాగు చేయాలని వరి పరిశోధనా కేంద్రం ప్రభుత్వానికి నివేదిక పంపింది.బాపట్ల వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త జె.వి.రమణ ప్రతిపాదనల ప్రకారం ఈ ఏడాది వేయగలిన వరి వంగడాల్లో ఎంటియు 1010, ఎన్‌ఎల్‌ఆర్ 4449 రకం 120 నుంచి 125 రోజుల్లో పంటచేతికొస్తుందని తెలియజేశారు. ఎకరాకు 55 బస్తాల వరకు పండే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితిల్లో సైతం నాట్లు పడటంతోపాటు, అగ్గితెగులు సమస్య నుంచి తప్పించుకునేందుకు ఈ రకమైన సీడ్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. బీపీటీలో 2270 రకం భావపురి సన్నాలను ప్రతిపాదించారు. ఈ వంగడం 160 రోజుల్లో కోతకు వస్తుంది. దోమ పోటును తట్టుకునే శక్తి ఉంటుంది. ప్రతిపాదిత రకాల విత్తన కొరత ప్రభుత్వానికి ఎంటియు 1010, ఎన్‌ఎల్‌ఆర్ 4449, బీటీపీ 2270 రకాల విత్తనాలు ప్రతిపాదించారు. అయితే ఈ విత్తనాలకు ఎలాంటి రాయితీలేకపోగా కనీసం సీడ్ దొరికే పరిస్థితి కనిపిం చటం లేదు. కేవలం బీపీటీ 5204 రకం వంగడం కిలో రూ. 27.50 కాగా, రూ.5 సబ్సిడీ వుంటుంది. అయితే ఈ ఏడాది ప్రతిపాదించిన రకాలకు సబ్సిడీ లేదంటున్నారు. వెద పద్ధతిలో ఉపయోగాలు వర్షాలు కురిసిన వెంటనే సాగు చేసుకోవచ్చు. నాట్లు వేసేటప్పుడు అవసరమయ్యే నీరు ఆదా అవుతుంది. ఒక గంటలో ఒక ఎకరం విత్తవచ్చు.పంట ఏడు నుంచి పది రోజుల ముందుగా కోతకు వస్తుంది. తక్కువ ఖర్చుతో అధిక నికరాదాయం పొందువచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన లోతులో విత్తనాలు నాటుకోవాలి.ప్రారంభ దశలో ఎదురయ్యే కలుపును నిర్మూలించాలి. చౌడుభూములు, ఉప్పు నేలలు అనుకూలం కావు.పొలాన్ని సంప్రదాయ పద్ధతుల్లో దున్నకుండా, విత్తన గొర్రు ఉపయోగిస్తే కనీసం 2-4 సెంటీమీటర్ల వెడల్పు, 4-7 సెంటీమీటర్ల లోతు గాడులు ఏర్పడి అందులో విత్తనాలు సమానలోతు, దూరంలో నాటుకోవచ్చు. -
తరుముతున్న కరువు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ పంటల సాగు పడకేసింది. వేరుశనగ, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు లాంటి ప్రధాన పంటలు విత్తుకునేందుకు ఇక పది రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెలాఖరులోగా పంటలు సాగులోకి వస్తేనే అంతో ఇంతో దిగుబడులు వస్తాయి. కానీ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి లక్షలాది హెక్టార్లు బీళ్లుగా మిగిలిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. పత్తి మినహా మిగతా పంటల సాగు సాధారణ విస్తీర్ణానికి ఆమడదూరంలో ఉంది. కీలకమైన జూన్, జూలై మాసాల్లో వర్షాలు మొహం చాటేయడంతో ఈ దుస్థితి తలెత్తింది. జూన్‌లో 63.9 మి.మీకి గాను 50.5 మి.మీ వర్షం పడింది. అది కూడా మొదటి వారంలోనే 40 మి.మీ పడటంతో రైతులు పొలాలను దుక్కులు చేసుకున్నారు. జూలైలో 67.4 మి.మీకి గాను ప్రస్తుతానికి 32.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అందులోనూ ఈ నెల 6, 7, 8, 10, 11 తేదీల్లో నాలుగైదు మండలాల్లో భారీగానూ, మరికొన్ని మండలాల్లో మోస్తరుగానూ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, 20 కిలోమీటర్లకు పైగా వేగంతో వీస్తున్న గాలులకు మేఘాలు తేలిపోతుండడంతో వర్షం కురవడం లేదు. చాలా మండలాల్లో ఇంతవరకు ఒక్క మంచి పదును కూడా కాకపోవడంతో పంటల సాగు పడకేసింది. జూలై 16 నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 3,01,476 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. అందులోనూ వేరుశనగ 2,32,007 హెక్టార్లలో వేశారు. ఈ ఏడాది జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 9,16,083 హెక్టార్లు. ఇందులో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 6,95,753 హెక్టార్లుగా గుర్తించారు. రైతులు ఎంతో ఆశ పెట్టుకున్న ఆరుద్ర కార్తె జూన్ 20 నుంచి జూలై 5వతేదీతో ముగిసింది. పునర్వసు (పెద్దకుశాలు) కార్తె ఈ నెల 6 నుంచి 20వతేదీతో ముగిసింది. ఈ రెండు కార్తెలు విత్తుకునేందుకు మంచి అదనుగా భావిస్తారు. ఇక జూలై 21న (సోమవారం) పుష్యమి కార్తె (చిన్నకుశాలు) ప్రారంభమై.. ఆగస్టు 5తో ముగుస్తుంది. కొందరు రైతులు ఈ కార్తెలో కూడా విత్తుకునే అవకాశముంది. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ వేయరు. ప్రస్తుతానికి ఒక్క మండలంలో కూడా సాధారణ విస్తీర్ణంలో పంటలు వేసుకోలేదు. 16 మండలాల్లో మాత్రం 50 శాతం మేర సాగయ్యాయి. శెట్టూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పి, అమరాపురం, రొళ్ల, అగళి, చిలమత్తూరు, నల్లమాడ, కొత్తచెరువు, శింగనమల, గుత్తి, పామిడి, పెద్దవడుగూరు, వజ్రకరూరు, ధర్మవరం, బత్తలపల్లి మండలాల్లో కొంత పర్వాలేదనిపిస్తోంది. అనంతపురం, బుక్కరాయసముద్రం, తాడిపత్రి, పెద్దపప్పూరు, పుట్లూరు, సీకే పల్లి, కనగానపల్లి, కంబదూరు, డి.హీరేహాల్, గుమ్మఘట్ట, కణేకల్లు, హిందూపురం, పరిగి, కదిరి, ఓడీ చెరువు, పుట్టపర్తి మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వేరుశనగ విషయానికొస్తే.. శెట్టూరు మండలంలో అత్యధికంగా 16,461 హెక్టార్లలో సాగైంది. ఇక్కడ ఈ నెల 5న రాత్రి ఏకంగా 115.4 మి.మీ వర్షం కురవడంతో ఈ మేరకు సాగులోకి వచ్చింది. ఆ తర్వాత కుందుర్పి మండలంలో 16,250 హెక్టార్లు, గుత్తి 12,885, బ్రహ్మసముద్రం 12,507, బత్తలపల్లి మండలంలో 10,916 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. అమరాపురం, రొళ్ల, నల్లమాడ, కొత్తచెరువు, కూడేరు, వజ్రకరూరు, ధర్మవరం, రాప్తాడు, కళ్యాణదుర్గం మండలాల్లోనూ ఓ మోస్తరు విస్తీర్ణంలో వేరుశనగ వేశారు. మిగిలిన మండలాల్లో సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. -
తెల్లబోయారు
పత్తిని తెల్లబంగారంగా పిలుచుకుంటారు. అనావృష్టి, విద్యుత్ కోతల కారణంగా పంట దెబ్బతింటుండటంతో పత్తి రైతులు తెల్లబోతున్నారు. పెట్టుబడులు కూడా రావేమోనని దిగులు చెందుతున్నారు. వ్యవసాయాధికారులు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కడప అగ్రికల్చర్ : అనావృష్టితో పత్తిరైతుకు కష్టాలు వచ్చిపడ్డాయి. వర్షాభావం పత్తి రైతు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో వేలాది ఎకరాల్లోని పత్తి పంట దెబ్బతింది. జూన్ నెలలో అరకొరగా కురిసిన వర్షాలకు, బోరుబావుల కింద జిల్లా వ్యాప్తంగా తెల్లబంగారాన్ని 5640 హెక్టార్లలో సాగు చేశారు. పంట ప్రారంభంలో ఏపుగా పెరగడంతో మళ్లీ వ ర్షాలు కురిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఎంతో ఆశ పెట్టుకున్నారు. వర్షాలు కురవక ఒక పక్క, తీవ్ర విద్యుత్ కోతలతో మరోపక్క పంటకు నీరు అందక, తెగుళ్లతో ఆకులన్నీ ఎర్రగమారి రాలిపోతున్నాయి. పత్తి దిగుబడి రావాల్సిన సమయంలో మొక్కలు ఎండిపోతుండటంతో రైతు తట్టుకోలేక పోతున్నాడు. అక్కడక్కడ పగిలిన కాయలు కూడా తెల్లని పత్తిని ఇవ్వడంలేదని రైతులు మదనపడిపోతున్నారు. ఈ ఏడాది మంచి పంట వస్తుందని రైతులు నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఎంత లేదన్నా ఎకరానికి అన్ని ఖర్చులు పోను రూ. 40 నుంచి 50 వేలు వస్తుందని ఆశించిన రైతుకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. రాబోయే నెలల్లో వర్షాలు కురిసి పంట దిగుబడులు భారీగా ఉంటాయని రైతులు, వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. అయితే వర్షాభావం తలెత్తడంతోను, బోరుబావుల్లో ఉన్న అరకొర నీరు విద్యుత్ కోతలతో అందకపోవడంతోను, తెగుళ్లు, వాతావరణంలో మార్పులతో రైతన్న విలవిలలాడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు ఎకరం సాగుకు రూ. 25వేల నుంచి 30 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావేమోనని బెంగపెట్టుకున్నారు. పంట దెబ్బతిని తగ్గిన దిగుబడులు..... జిల్లాలో పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వేంపల్లె, వేముల, తొండూరు. సింహాద్రిపురం, వీరపునాయునిపల్లె, రాజుపాళెం, చాపాడు, ఖాజీపేట,దువ్వూరు, ఎర్రగుంట్ల, వల్లూరు, కమలాపురం, బి. మఠం, పోరుమావిళ్ల, కాశినాయన, బి. కోడూరు మండలాల్లో అత్యధికంగాను, ఇతర మండలాల్లో ఓ మోస్తరుగాను మొత్తం కలిపి జిల్లాలో 14100 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఈ పంటలో ఎకరం నుంచి ప్రస్తుతం వచ్చే 3 క్వింటాళ్ల దిగుబడి వంతున తీసుకుంటే 42,300 క్వింటాళ్లు, బాగా పండితే 20 క్వింటాళ్ల వంతున 2,82,000 క్వింటాళ్లు వస్తుందని రైతులు తెలుపుతున్నారు. ఈ 2,82,000 క్వింటాళ్ల మొత్తం దిగుబడిని రైతులు కోల్పోవడడంతో బ్యాంకుల నుంచి, ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి తెచ్చిన అప్పులెలా తీర్చాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతింటున్న పంటకు సూచనలు అందక అవస్థలు.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటసాగులో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నా వ్యవ సాయాధికారులు, శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చర్యలు చేపడితే పంటను కాపాడుకోవచ్చో చెప్పే వారే కరవయ్యారనే బాధను వ్యక్తం చేస్తున్నారు. చేతికందాల్సిన పంట కళ్ల ఎదుటే నాశనమవుతోందని రైతన్నలు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి... మంచి దిగుబడులు వస్తాయని ఆశించి పత్తి పంట సాగు చేస్తే మాయదారి వర్షాభావంతో పంటపోయింది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. రాత్రనక, పగలక కష్టపడుతున్నా ప్రకృతి నష్టపరుస్తూనే ఉంది. పంట బాగా వస్తుందని ఆశించాం. వర్షాలులేక అరకొరగా ఉన్న బోరుబావుల్లోని నీరు కరెంటు కోతలతో పంట మొత్తం పోయింది. -సాంబశివారెడ్డి, కొత్త సంగటిపల్లె, పెండ్లిమర్రి మండలం పంటలను సూచేవారే కరువయ్యారు.. పత్తి పంటకు దెబ్బతింటున్న విషయం వ్యవసాయాధికారులకు తెలిపినా ఏమాత్రం పట్టించుకోలేదు. పంట వైపు వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకిలా మొక్కలు చచ్చిపోతున్నాయో చెబుతామన్నా వినే అధికారులు కరువయ్యారు. ఏ మందు కొట్టాలో, ఏమి పిచికారి చేయాలో అర్థం కావడం లేదు. పొలంలోని మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి. ఒక్కో చెట్టుకు రెండు, మూడు పత్తి ఇడుపులు ఉంటున్నాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. - రామసుబ్బమ్మ, రైతు గోర్లపల్లె, చింతకొమ్మదిన్నె మండలం -
అయ్యో..కృష్ణా!
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వరి సాగుకు పెట్టింది పేరుగా నిలిచిన కృష్ణా డెల్టాకు ఈ ఏడాది గడ్డు కాలం దాపురించింది. 2.40 లక్షల హెక్టార్లకు కేవలం ఐదువేల హెక్టార్లలోమాత్రమే ఇప్పటికి వరి నాట్లు పడడం రానున్న కరవు పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితిని తలచుకుని రైతులు కంటతడి పెడుతున్నారు. దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న భూములను చూసి బోరుమంటున్నారు. బాపట్ల : జిల్లాలో వర్షాభావ పరిస్థితి ఖరీఫ్ వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఏడాది అధిక వర్షాలతో నట్టేట మునిగిన రైతులను ఈ ఏడాది ప్రతికూల వాతావరణం పరిహసిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు జిల్లా రైతులు కూడా ఏమాత్రం వారికి తగ్గకుండా వరి సాగులో పోటీపడుతుంటారు. జిల్లాలో ప్రతి ఏడాది 2.40 లక్షల హెక్టార్లు సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆ మేరకు నాట్లు వేస్తుంటారు. జిల్లాలో 890 మీల్లీమీటర్లు సగటు వర్షపాతం కాగా ప్రతి ఏడాది అదే మోతాదులో వర్షం నమోదవుతుంది. ఈ ఏడాది మొదటి నుంచి వర్షాభావ పరిస్థితి రైతులను కుంగ దీస్తూనే ఉంది. సగటు వర్షపాతం ఇప్పటికి 440 మీల్లీమీటర్లు మాత్రమే నమోదు కావటంతోపాటు కృష్ణాడెల్టాకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారోకూడా స్పష్టత లేదు. గత వారం తాగునీటి చెరువులకు మాత్రమే నీటిని విడుదల చేసిన అధికారులు అవి సక్రమంగా చెరువులకు చేరే లోపే కాలువల మరమ్మతులకు నోచు కోకపోవటంతో కొన్నిచోట్ల నీటి వృథా ఎక్కువగా కనిపించింది. మరికొన్ని చోట్ల రైతులు ఎక్కడ నారుమళ్లకు పెట్టుకుంటారోనని క్రిమినల్ కేసులు పెడుతామని బెదిరింపులకు పూనుకున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇది... జిల్లాలో వరిసాగు సాధారణ విస్తీర్ణం 2.40 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కారణంగా అప్పుడప్పుడుపడిన వర్షం,బోర్లు కింద కలుపుకుని కేవలం ఐదువేల హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. వెదపెట్టే పద్ధతితోనే సేద్యం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ప్రస్తుత తరుణంలో నార్లు పోసి నెలరోజులు పెంచితే అప్పుడు కాలువ నీళ్లు వస్తాయనే నమ్మకం లేక పోవటంతో వెద పద్ధతి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు పది కిలోల విత్తనాలు వెదపెడితే సరిపోవటంతోపాటు దుక్కిదున్నిట్లే వెద పెడుతున్నారు. ఈ విధానం కొంతమంది రైతులకు ఊరట కలిగించింది. ఈ తరహా నాట్లు కూడా ఎక్కువగా తెనాలి డివిజన్‌లోనే పడ్డాయి. ధాన్యంపై తీవ్ర ప్రభావం వర్షాభావ పరిస్థితి ఈ ఏడాది వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో 2.40 లక్షల హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా, హెక్టారుకు 75 బస్తాలు చొప్పున ప్రతి ఖరీఫ్ సీజన్లో 1.80 కోట్ల బస్తాల ధాన్యం పండుతుంది. మరి ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్ సీజన్ కాగా, అక్టోబరు నుంచి రబీ సీజన్ కిందకు వస్తోంది. సాధారణంగా జూన్‌లో తెనాలి డివిజన్లో 72 మీల్లీమీటర్లు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ ఏడాది జూన్‌లో 50 మీల్లీమీటర్లు, జూలైలో 140 మీల్లీమీటర్లు వర్షానికి కేవలం 32 మీల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇప్పుడు కృష్ణానదిలో నీటి పరిస్థితిని చూస్తే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు సక్రమంగా కురవకపోవటం ఇప్పటి నుంచి విస్తారంగా కురిసినప్పటికీ మరో నెల రోజులు పాటు కాలువల ద్వారా నీరు వచ్చే అవకాశం లేకపోవటంతో కృష్ణాడెల్టాలో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈ ఏడాది ఖరీఫ్ పూర్తిగా ప్రతికూలంగా మారటంతో రబీ లేనట్టేనని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. -
హమ్మయ్య వర్షం పడింది!
న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీలో, ముంబైలో ఈ రోజు వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రుతుపవనాల రాక- ఉష్టోగ్రత తగ్గడంతో ఢిల్లీ, ముంబై నగరవాసుల ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. ఎండవేడిమికి అల్లాడుతున్నవారికి వర్షం పడటంతో ఒక్కసారిగా ప్రాణంలేచివచ్చినంత పనైంది. వర్షం పడటంతో ఏర్పడిన చల్లదనాన్ని ముంబైవాసులు ఆస్వాదిస్తున్నారు. యువత రోడ్లపై చిందులు వేస్తోంది. ఈ సాయంత్రం యువతులు బీచ్ వద్ద కేరింతలు కొడుతున్నారు. ప్రేమ జంటలు బీచ్ ఒడ్డున వర్షంలో కూర్చొని ఆనందం అనుభవిస్తున్నారు. -
కోస్తాంధ్రలో చిరు జల్లులు
ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ మీదగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించిందని... ఈ నేపథ్యంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంటుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. దాంతో కోస్తాలో ఒకట్రెండు చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. పగటి ఉష్టోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం చిరు జల్లులు పడిన... సాయంత్రం మాత్రం నగరంలో ఓ మోస్తరుగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. -
ముంచిన వాన
ఆదిలాబాద్ , న్యూస్‌లైన్: ఇంద్రవెల్లి మండలంలో సుమారు 2611 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. జూన్, జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలకు చాలా ఎకరాల్లో వేసిన టమాటా నారు మురిగిపోరుయిది. ప్రస్తుతం పంట చేతికొస్తుండగా ఇటీవల కురిసిన వానలకు కాయలు నల్లబడి 50 శాతం కాయలు నీళ్లపాలయ్యాయి. టమాటా 25 కిలోల క్యారెట్‌కు రూ.700 నుంచి రూ.800 వరకు ధర ఉన్నా దిగుబడి పడిపోవడంతో అన్నదాత విలవిల్లాడుతున్నాడు. చేసేదేమి లేక నల్లబడిన కాయలను పడేస్తున్నారు. అమ్మకానికి తీసుకెళ్లినా వ్యాపారులు నల్లబడిన కాయలు ఏరేసి కొంటున్నారని రైతులు చెబుతున్నారు. ప్రతీ రైతు తోటలో సగం కాయలు ఇలా నల్లబడిపోవడంతో రైతులకు ఈ సారి అప్పులే మిగిలేలా ఉన్నాయి. ఎకరానికి సుమారు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగా అందులో సగం కూడా తిరిగొచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. లాభాలు పంచుతుందనుకున్న టమాటా వర్షాల కారణంగా నిలువునా ముంచి అన్నదాతకు కన్నీళ్లే మిగిల్చింది. అధికారుల నిర్లక్ష్యం.. మండలంలో భారీ ఎత్తున టమాటా తోటలకు నష్టం వాటిల్లినా సర్వే నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదకు కొట్టుకుపోరుున పంటలను మాత్రమే అధికారులు పరిగణలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవలి వర్షాలకు నల్లబడి కాయలు పెద్దమొత్తంలో నీళ్లపాలైనా అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సర్వే ద్వారా నల్లబడి పంట నష్టపోరుున తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లేకుంటే సాగుకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సర్వే నిర్వహిస్తున్నం - బావురే ఉద్దవ్, తహశీల్దార్, ఇంద్రవెల్లి మండలంలో నష్టపోయిన టమాటా పంటపై సర్వే నిర్వహిస్తున్నం. సర్వే పూర్తయ్యూక నష్టం ఎంతో తేలుతుంది. ఆ తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందొద్దు. -
శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 21 సెం.మీ వర్షం
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత 12 గంటలుగా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జిల్లాలో 21 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదు అయింది. రణస్థలంలో 22, లావేరులో 17, పొందూరులో 16, ఎచ్చెర్లలో 13 సెంటీమీటర్ల మేర వర్ష పాతం నమోదు అయింది. అలాగే జిల్లాలోని మూడు మండలాల్లో 51 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితోపాటు ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద చెరువుకు గండిపడింది. దాంతో చెరువులోని నీరు జాతీయ రహదారిపైన ప్రవహిస్తుంది. దాంతో జాతీయ రహదారిపై ట్రాపిక్ భారీగా స్తంభించింది.