న్యూస్‌లైన్, నెట్‌వర్క్ :
జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న కంకులూ వర్షానికి తడిసి గింజలు మురిగిపోయాయి. నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్‌నగర్, నర్వ, గున్కుల్, జక్కాపూర్, మల్లూర్, ముగ్దుం పూర్, గాలీపూర్, మంగ్లూర్, నర్సింగ్‌రావుపల్లి, కోమలంచ, ఒడ్డెపల్లి, గోర్గల్, అచ్చంపేట గ్రామాలతో పాటు పలు గిరిజన తండాలలో వరి పంటలు వర్షానికి నీట మునిగాయి. రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఆయా గ్రామాలలో సుమారు మూడు వందలకు పైగా ఎకరాలలో పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు.
ఊరూరా కన్నీటి కథే
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల, అన్నాసాగర్, తిమ్మారెడ్డి, లింగారెడ్డిపేటలతో పాటు రుద్రా రం, జంగమాయపల్లితో పాటు పలు గ్రామాల్లో వరి పంట ఎక్కువ మొత్తంలో దెబ్బతింది. బుధవారమే ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలకు రెతులు అధిక మొత్తంలో ధాన్యాన్ని తీసుకురాగా తడిసిపోయింది. నాగిరెడ్డిపేట మండలంలోని బంజర, నాగిరెడ్డిపేట, ధర్మారెడ్డి, తాండూర్, మాల్తుమ్మెద, వెంకంపల్లి, లింగంపల్లి కలాన్ తదితర గ్రామాల్లో చేతికొచ్చిన వరిపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమా రు 500 ఎకరాలకు పైగా పంటనష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. మండలంలో బుధవారం రాత్రి 21.2 మి.మీ వర్షపాతం నమోదయినట్లు తహశీల్దార్ నారాయణ తెలిపారు. భీమ్‌గల్ మండలంలో పంటలు దెబ్బ తిన్నా యి. రాత్రిపూట ఏకబిగిన వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు, బడాభీమ్‌గల్, బెజ్జోరా, సికింద్రా పూర్, చేంగల్, గోన్‌గొప్పు ల్, ముచ్కూర్, మెండోరా, పల్లికొండ, బాచన్‌పల్లి, పిప్రి గ్రామాలలో వర్షానికి పంటలు దెబ్బ తిన్నాయి. వరితో పాటు మొక్కజొన్న తడిసిముద్దయ్యింది.
చేతికందే పంట చేజారి
బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రాహీంపేట్, పోచారం, రాంపూర్, దేశాయిపేట్, సోమేశ్వర్, తాడ్కోల్, తిర్మలాపూర్ శివార్లలో వందలాది ఎకరాలలో పంట నేలకొరిగింది. నిజామాబాద్ మండలంలోని పలు గ్రామాలలో వరి, మొక్కజొన్న సోయా పంటలు దెబ్బతిన్నాయి. కోతలు కోసి కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని మంచిప్ప, బాడ్సి, ముదక్‌పల్లి, సిర్‌పూర్, న్యాల్‌కల్, మల్లారం, ముత్తకుంట, ధర్మారం, నర్సింగ్‌పల్లి, అమ్రాబాద్, ఎల్లమ్మకుంట, బైరాపూ ర్, కాల్పోల్, తదితర గ్రామాలలో ఎక్కువగా పంటలు నేల కొరిగాయి. రెంజల్ మండలంలో సుమారు 500 ఎకరాలలో సోయా, వరి పంటలు దెబ్బతిన్నాయి. రైతులు నూర్పిడి చేసిన వరి, సోయ తడిసి ముద్దయ్యాయి.
సిరికొండ మండలంలో కోతకు వచ్చిన వరి పొలాలు సుమారు నాలుగు వేల ఎకరాలలో నేల వాలాయి. మండలం లో బుధవారం 23.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. బోధన్‌తో పాటు నియోజకవర్గంలోని ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి వర్షానికి దెబ్బతిన్నది. కామారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో జోరుగా వర్షం కురిసింది. వరితో పాటు మొక్కజొన్న, సోయాపంటలు వర్షానికి దెబ్బతిన్నాయి.
దోమకొండలో అత్యధిక వర్షం
దోమకొండతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం జిల్లాలోనే అత్యధికంగా 40 మి.మీటర్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంట పూర్తిగా నేలవాలగా, ఆరబెట్టిన మొక్కజొన్న త డిసిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 7,876 ఎకరాలలో వరి పంటను వేశారు. దాదాపు 30 శాతం పంట దెబ్బతిన్నట్లు తెలిసింది. గొట్టిముక్కల గ్రామ శివారులో కొందరు రైతులు తడిసిన ధాన్యాన్ని వర్షానికి భయపడి కేవలం రూ. 1200 క్వింటాలుగా విక్రయించినట్లు తెలిసింది. బీబీపేట, యడారం, అంబారిపేట, ముత్యంపేట, గొట్టిముక్కుల, సంఘమేశ్వర్, ఇస్పానగర్, మల్కాపూర్, తుజాల్‌పూర్ గ్రామాల్లో వందల ఎకరాల్లో వరిపంట వర్షానికి నేలవా లింది. భిక్కనూరులో మార్కెట్‌కు తీసుకువచ్చిన మక్కలు, పంట పొలాల్లోనూ ఆరబెట్టిన కంకులు తడిశాయి. బాన్సువాడ, చింతల్‌నాగారం, తాడ్కో ల్ శివారులో సుమారు 120 ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ మండలంలో మొక్క జొన్న, సోయా పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.
కళ్లాల్లో క‘న్నీళ్లు’
Published Fri, Oct 25 2013 2:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement
Advertisement