sweet corn
-
Dasara Special 2024: అమ్మవారికి ఆరోగ్య నైవేద్యాలు
నవరాత్రులు పూర్తయ్యాయి. ఈ రోజే దసరా పండుగ. అమ్మవారికి ప్రసాదాలు ఏం వండాలి? ఆరోగ్యంగా రుచిగా సులువుగా ఉండాలి. ముందురోజు నానబోసే శనగ గుగ్గిళ్ల బదులు... అప్పటికప్పుడు స్వీట్ కార్న్ సుండలు చేయండి. చిటికెలో పూర్తయ్యే రవ్వ పోంగలి వండండి. తీపి లేకపోతే పండుగ ఫీల్ రాదంటే పాల పాయసం ఉంది. పాలపాయసంకావలసినవి: బియ్యం– కప్పు; వెన్న తీయని పాలు – లీటరు; చక్కెర – ఒకటిన్నర కప్పు; నెయ్యి– టేబుల్‌స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; కుంకుమ పువ్వు – పది రేకలు.తయారీ: బియ్యం కడిగి నీరంతా పోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి ఉంచాలి. ఒక పాత్రలో పాలను మరిగించి పక్కన పెట్టాలి. పెద్ద పాత్ర పెట్టి అందులో నెయ్యి వేడి చేసి అందులో బియ్యం వేసి సన్నమంట మీద వేయించాలి. బియ్యం ఒక మోస్తరుగా వేగిన తరవాత అందులో పాలను పోసి కలిపి ఉడికించాలి. సగం ఉడికిన మంట తగ్గించాలి.బియ్యం మొత్తగా ఉడికిన తరవాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలిపి మరికొంత సేపు ఉడకనివ్వాలి. చక్కెర కరిగి తిరిగి మిశ్రమం చిక్కబడిన తర్వాత దించే ముందు కుంకుమ పువ్వు రేకలు వేయాలి. పాల పాయసాన్ని గరిట జారుడుగా ఉండగానే దించేయాలి, పోంగలి వండినట్లు తేమ ఇంకిపోయే వరకు ఉడికించకూడదు. స్వీట్ కార్న్ సుండలుకావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; నెయ్యి – టేబుల్ స్పూన్; ఆవాలు – టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 8 రెమ్మలు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచినిబట్టి;తయారీ: స్వీట్ కార్న్ గింజలను కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి టేబుల్ స్పూన్ నీటిని చిలకరించి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించేయాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి వడపోసి పక్కన పెట్టాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ, పచ్చికొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. పోపు దినుసులు కొబ్బరికి సమంగా పట్టిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు, ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద రెండు నిమిషాల సేపు ఉంచి, మరోసారి బాగా కలిపి దించేయాలి. గోధుమ రవ్వ పోంగలికావలసినవి: గోధుమరవ్వ – 150 గ్రాములు; పెసరపప్పు – 100 గ్రాములు; నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు లేదా మిరియాల΄÷డి – టీ స్పూన్; అల్లం తురుము – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; జీడిపప్పు– 15; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నీరు – అర లీటరు. తయారీ: మందపాటి బాణలిలో పెసరపప్పును దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి పప్పు మునిగేవరకు నీటిని పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి. అదే పెనంలో గోధుమపిండి వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత అందులో మిగిలిన నీటిని పోయాలి. నీరు మరగడం మొదలైన తర్వాత ఉప్పు వేసి కలిపి అందులో రవ్వను వేయాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఉండడానికి నీటిలో వేస్తున్న సేపు గరిటతో కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికి దగ్గరవుతున్న సమయంలో ముందుగా ఉడికించి, మెదిపి పక్కన పెట్టిన పెసరపప్పు వేసి కలిపితే రవ్వ పోంగలి రెడీ. -
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్‌తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్‌కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్‌కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్‌ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్‌లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో స్వీట్ కార్న్ సాగు
-
మొక్కజొన్న తక్కువ కాల వ్యవధి కలిగిన పంట
-
ఈ జాగ్రత్తలు పాటిస్తే మొక్కజొన్న పంటకు అధిక దిగుబడులు ఖాయం
-
జోరు వర్షంలో..స్వీట్‌కార్న్‌తో వడలు ఇలా ట్రై చేయండి!
చిటపట వర్షంతో వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది. ఈ చలిలో చక్కగా వేడి వేడి పకోడీలు లేదా అప్పుడే కాల్చిన మొక్కజొన్న కంకిలు తింటుంటే సామిరంగా..ప్రాణం భలే హయిగా ఉంటుంది. ప్రస్తుతం ఉరుకులు పరుగులు జీవితం కారణంగా అలాంటి ఆనందాలే మరిచిపోతున్నాం. దీనికి తోడు అందరూ ఉద్యోగాలు, చదువులు పేరుతో పట్టణాల బాటపట్టడంతో..అవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. ఐతే పట్టణాల్లో వాటి ప్లేస్‌లో మార్కెట్లో ఎక్కువగా స్వీట్కార్న్లు వచ్చాయి. కనీసం వీటితో ఈ జోరు వానలో నాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు హాయిగా. ఈ స్వీట్ నాటు మొక్కజొన్నలు స్థానంలో వచ్చిన ఈ స్వీట్ కార్న్లతో అలనాటి ఆ సంతోషాన్ని ఆస్వాదిద్దామా! ఇక ఆలస్యం ఎందుకు వాటితో చేసే స్నాక్ ఐటెం ఏంటో చూసేద్దాం స్వీట్ కార్న్ వడలు తయారీ విధానం కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ పెద్దది-ఒకటి జీలకర్ర- 1 టేబుల్ స్పూన్ ఎండు మిర్చి పొడి-1 టేబుల్ స్పూన్ సెనగపిండి- 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ-1 టేబుల్ స్పూన్ బియ్యపిండి-1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్(సరిపడా) తయారీ విధానం: స్వీట్కార్న్ఉడికించుకుని వలిచి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత పైన చెప్పినవి ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని, రుబ్బిన స్వీట్‌కార్న్ మ్రిమంలో కలుపుకోవాలి. ,రుచికి సరిపడా ఉప్పు వేసి వడలు మాదిరిగా చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి లేదా నాన్‌స్టిక్ పాన్‌లో కొద్ది మోతాదులో ఆయిల్ వేసుకుని డీప్ ఫై చేసుకోవాలి. ఆ తర్వత వాటిని టమాటా, పుదీనా చెట్నీ గానీ, టమాటా కెచప్‌తో గాని తింటుంటే ఆ రుచే వేరబ్బా! (చదవండి: వర్షాకాలంలో వెరైటీగా క్యారెట్ కార్న్ బజ్జీ ట్రై చేయండి) -
Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి తయారీ ఇలా..
ఉల్లిపాయ పకోడి బోర్ కొడితే ఈ వర్షాకాలంలో కార్న్ పాలక్ పకోడి రెసిపీ ట్రై చేయండి. కావలసినవి: ►పాలకూర – కప్పు ►స్వీట్ కార్న్ గింజలు – కప్పు ►శనగపిండి – రెండు కప్పులు ►కారం – మూడు టీస్పూన్లు ►అల్లం తరుగు – రెండు టీస్పూన్లు ►జీలకర్ర పొడి – నాలుగు టీస్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – డీప్‌ఫ్రైకి తగినంత. తయారీ: ►ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి గిన్నెలో వేయాలి. ►పాలకూర వేసిన గిన్నెలో నూనె తప్పించి మిగతా పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి పకోడి పిండిలా కలుపుకోవాలి. ►నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి. ►వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Idiyappam Pulihora Recipe: బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి.. ఇడియప్పం పులిహోర Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! -
Health: వర్షాకాలం కదా అని మొక్కజొన్న లాగించేస్తున్నారా? ఇందులోని లైకోపీన్..
వర్షాకాలంలో వేడి వేడి నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న(కార్న్) పొత్తు తింటే ఆ మజానే వేరు కదా! తీపి రుచులను ఆస్వాదించే వారైతే స్వీట్‌కార్న్ తింటే సరి! కొంతమందికేమో మొక్కజొన్న గింజలు వేయించుకునో.. ఉడకబెట్టుకొనో తినడం ఇష్టం! మరి.. అందరికీ అందుబాటు ధరలో ఉండే మొక్కజొన్నను కేవలం టైమ్‌పాస్ ఫుడ్ అని తేలికగా కొట్టిపారేయకండి! దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందామా? పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక కప్పు పచ్చి మొక్కజొన్న గింజల్లో 125 కాలరీలు ఉంటాయి. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు.. 4 గ్రాముల ప్రొటిన్లు, 9 గ్రాముల షుగర్, 2 గ్రాముల ఫ్యాట్, 75 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. రక్తహీనతకు చెక్! మొక్కజొన్నలో విటమిన్ బీ12 పుష్కలం. అంతేకాదు ఫోలిక్ యాసిడ్, ఐరన్ కూడా అధికం. ఇవన్నీ శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడతాయి. తద్వారా రక్త హీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఇది దోహదపడుతుంది. బరువు పెరగాలనుకుంటున్న వారు... ఉండాల్సిన దాని కన్నా తక్కువ బరువు ఉండి బాధపడుతున్న వారు మొక్కజొన్న తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. తగిన పరిమాణంలో కొంతకాలం పాటు వీటిని తింటే నీరసం తగ్గడంతో పాటు ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. ఇక మొక్కజొన్నలో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలం. ఆహారం జీర్ణమవడంలో ఉపకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. కంటి ఆరోగ్యానికై.. మొక్కజొన్నలో బీటా–కెరోటిన్ ఎక్కువ. వంద గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్–ఏ లోని ఆరు శాతం మనకు సమకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్–ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవి కూడా! విటమిన్-ఏతో పాటు మొక్కజొన్నలో విటమిన్ బీ, సీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ బి–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్ వంటి జీవక్రియలు సక్రమంగా సాగడంలో తోడ్పడతాయి. ఇక స్వీట్ కార్న్... రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నలో ఫెలురిక్ యాసిడ్ అనే శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాదు... అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను కూడా అరికడుతుంది. ఇక గాయమైనపుడు కలిగే ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట, నొప్పి)ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. ఏదేమైనా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మొక్కజొన్న అయినా... మరే ఇతర ఆహార పదార్థాలైనా.. మితంగా తింటేనే మేలు! ఇందులో పిండి పదార్థాలు కాస్త ఎక్కువే కాబట్టి మధుమేహులు దీనికి కాస్త దూరంగా ఉంటేనే బెటర్! ఆరోగ్యకరమైన చర్మం కోసం.. మొక్కజొన్నలో విటమిన్ సీతో పాటు లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే కార్న్ ఆయిల్, కార్న్ స్టార్చ్‌ను పలు సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడతారు. పొటాటో – కార్న్ సూప్ ఇలా తయారు చేసుకోండి! కావలసినవి ►బంగాళ దుంపలు – 6 (తొక్క తీసి ముక్కలు చేయాలి) ►కొత్తిమీర ఆకులు – ఒక కప్పు ►ఉల్లి తరుగు – పావు కప్పు ►మొక్క జొన్న గింజలు – రెండు కప్పులు ►ఉల్లి కాడల తరుగు – పావు కప్పు ►ఉప్పు – తగినంత తయారీ ►ఒకపెద్ద పాత్రలో బంగాళ దుంప ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు, తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టి ఉడికించాలి. ►మొక్కజొన్న గింజలు జత చేసి పదార్థాలన్నీ మెత్తగా అయ్యేవరకు సుమారు పది నిమిషాలు ఉడికించాలి. ►ఉల్లికాడలు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేసి, వడగట్టి అందించాలి. చదవండి: Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే.. -
రుచులూరే వేడివేడి వింటర్ సూప్స్ తయారు చేయండిలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బీట్రూట్ చికెన్ సూప్ కావల్సిన పదార్ధాలు చికెన్ – పావుకేజీ వెల్లుల్లి రెబ్బలు – ఆరు అల్లం – అరంగుళం ముక్క ఉల్లిపాయలు – రెండు బీట్రూట్ – రెండు మిరియాల పొడి – టీ స్పూను బటర్ – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా కొత్తిమీర తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►పాత్రను తీసుకుని.. శుభ్రంగా కడిగిన చికెన్, ఒక ఉల్లిపాయను ముక్కలు తరిగి వేయాలి. మూడు వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, లీటరు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ►ఉడికించిన మిశ్రమం నుంచి చికెన్, స్టాక్‌ను వేరుచేసి పక్కనబెట్టుకోవాలి. చికెన్‌ను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ►స్టవ్ మీద పాన్ వేడెక్కిన తరువాత బటర్ వేయాలి. ►మిగిలిన వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేయాలి. మిగిలిన ఉల్లిపాయను ముక్కలు తరిగి వేసి వేయించాలి. ►ఇవి రెండూ వేగిన తరువాత చికెన్ స్టాక్, బీట్రూట్ ముక్కలు మరికొన్ని నీళ్లు పోసి మరిగించాలి. ►పది నిమిషాలు మరిగాక చికెన్ ముక్కలు వేసి మరో ఇరవై నిమిషాలు మరిగించి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ తరుగుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్‌చేయాలి. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. స్వీట్ కార్న్ వెజ్ సూప్ కావల్సిన పదార్ధాలు పేస్టు కోసం: స్వీట్‌కార్న్ గింజలు – అరకప్పు నీళ్లు – రెండు టేబుల్ స్పూన్లు సూప్: ఆయిల్ – మూడు టీస్పూన్లు వెల్లుల్లి రెబ్బలు – రెండు అల్లం – అంగుళం ముక్క స్ప్రింగ్ ఆనియన్ తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు స్వీట్ కార్న్ గింజలు – పావు కప్పు క్యారెట్ తరుగు – పావు కప్పు బీన్స్ తరుగు – పావు కప్పు నీళ్లు – మూడు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా మిరియాలపొడి – టీ స్పూను వెనిగర్ – టీస్పూను కార్న్‌ఫ్లోర్ – టీస్పూను (పావు కప్పు నీటిలో కలిపి పెట్టుకోవాలి) తయారీ విధానం ►ముందుగా అల్లం, వెల్లుల్లిలను సన్నగా తరగాలి. ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి. ►తరువాత స్ప్రింగ్ ఆనియన్ తరుగు, పావు కప్పు స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్ తరుగును వేసి ఐదునిమిషాలు ఉడకనివ్వాలి. ►ఇప్పుడు పేస్టుకోసం తీసుకున్న స్వీట్‌కార్న్‌ను రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ పేస్టును ఉడుకుతున్న సూప్ మిశ్రమంలో వేసి రెండు నిమిషాలు వేయించాలి. ►ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి 15 నిమిషాలు మరిగించాలి. ►మరిగాక కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి కలుపుకోవాలి. ►సూప్ మిశ్రమం చిక్కబడిన తరువాత మిరియాల పొడి, వెనిగర్, స్ప్రింగ్ ఆనియన్ వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
మీరు వెజిటేరియన్సా? మీ కోసమే ఈ పన్నీర్ 65 రెసిపీ..
పనీర్ 65 కావలసినవి: పనీర్ ముక్కలు – 15, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు – అర టీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు, మైదా – ఒక టీస్పూను, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూను, అల్లం పేస్టు – ఒక టీస్పూను, కారం – సరిపడినంత (స్పైసీగా కావాలనుకుంటే టీ స్పూను వేసుకోవచ్చు), పసుపు – అర టీ స్పూను, గరం మసాలా – టీస్పూను, నూనె – సరిపడినంత తయారీ: స్టవ్ మీద కళాయి పెట్టి... వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కాక పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం పేస్టు వేసి వేపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత కొంచెం నీరు పోయాలి. అవి ఉడుకుతుండగా... మరో బర్నర్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు బాగా వేగిన పనీర్ ముక్కల్ని తీసి వీటిలో వేసి బాగా కలపాలి. అంతే పనీర్ 65 సిద్ధం. స్వీట్ కార్న్ పాయసం కావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పు(మెత్తగా ఉడికించుకోవాలి), చిక్కటి పాలు – 4 కప్పులు, నెయ్యి – పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్, పిస్తా, కిస్ మిస్, జీడిపప్పు, బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్ చొప్పున(నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి), కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ముందుగా ఉడికిన కార్న్‌లో 2 టేబుల్ స్పూన్లు తీసి పక్కనపెట్టి.. మిగిలిన కార్న్‌ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కార్న్ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి, కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో కార్న్ – పాల మిశ్రమాన్ని వేసి చిన్నమంటపై ఉడికించుకోవాలి. అందులో కుంకుమ పువ్వు కలుపుకోవాలి. మిగిలిన పాలు పోసి గరిటెతో తిప్పుతూ.. అడుగంటకుండా చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి. దించే ముందు బాదం, జీడిపప్పు, కిస్ మిస్, పిస్తా ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది స్వీట్ కార్న్ పాయసం. పాలక్ పరోటా కావలసినవి: గోధుమపిండి, మైదాపిండి – 1 కప్పు చొప్పున, పాలకూర – 1 కట్ట, నిమ్మరసం – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – కావాల్సినన్ని, నూనె/నెయ్యి – సరిపడా తయారీ: ముందుగా పాలకూర శుభ్రం చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకుని, అందులో నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని.. అందులో గోధుమపిండి, మైదాపిండి, అల్లం పేస్ట్, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుని చపాతి ముద్దలా చేసుకుని.. ఆ ముద్దకు తడి వస్త్రాన్ని చుట్టి.. అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్ ఉండలులా చేసుకుని.. చపాతీ కర్రతో ఒత్తుకుని.. మరోసారి మడిచి మళ్లీ చపాతీలా ఒత్తి.. పెనంపై నెయ్యి లేదా నూనెతో ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి. సేకరణ: సంహిత నిమ్మన -
మస్త్ మజా.. మక్క వడ
సాక్షి, నిజామాబాద్: ‘అన్నా రోజు హోటళ్ల చాయి తాగుడేనా.. వర్షాకాలం షురూ అయింది అంకాపూర్‌కు పోయి నోరూరించే మక్క వడలు తిందాము నడు..’ అంటూ ఆర్మూర్ ప్రాంతానికి చెందిన యువతతో పాటు జిల్లావాసులు మక్కవడలు తినడానికి అంకాపూర్‌కు దారి పడుతున్నారు. నోరూరిస్తున్న మక్కవడలకు అంకాపూర్ దేశి చికెన్ తోడు కావడంతో భోజన ప్రియులు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చుకొని మరీ మక్కవడలు, దేశీ చికెన్ తినడానికి ఇక్కడికి వస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో మొక్కజొన్న కంకుల (మక్కల) అమ్మకాలు జోరుందుకున్నాయి. ఒకవైపు కొందరు వ్యవసాయ కూలీలు రోడ్లకు ఇరువైపులా షెడ్లు వేసుకొని మక్కెన్లను బొగ్గులపై కాలుస్తూ అమ్మకాలు సాగిస్తుండగా మరొకవైపు అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ హోటళ్లలో మక్క వడలను స్పెషల్‌గా వేసి ఇస్తున్నారు. దీంతో నోరూరించే మక్క వడలను తినడానికి ప్రతీ ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. మక్కలలో పౌష్టికాహారాలు సైతం అధికంగా ఉండటంతో సీజనల్‌గా లభించే మక్కలను తింటే మంచిదని వైద్యులు సైతం పేర్కొంటుండటంతో ఈ మక్కవడల హోటళ్లు మూడు మక్కెన్లు, ఆరు వడలుగా కొనసాగుతున్నాయి. అంకాపూర్ గ్రామానికి చెందిన మంజుల, సిద్దు, శివానంద్, మారుతి అనే హోటళ్ల యజమానులు భోజన ప్రియుల నాడిని పట్టుకొని మక్క వడలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. స్థానికంగా మార్కెట్లో అమ్మకానికి వచ్చిన మక్క పచ్చిబుట్టలను కొనుగోలు చేసి మక్కలను వలిచి అల్లంవెల్లుల్లి పేస్టు, మిరపకాయలు, ధనియాలపొడి, కరివేపాకు, పసుపు, ఉల్లిగడ్డ తదితరాలు వేసి గ్రైండర్లో పేస్ట్‌గా తయారు చేసి నూనెలో గోలించి నోరూరించే మక్కవడలను తయారు చేస్తున్నారు. 20 రూపాయలకు నాలుగు మక్కవడలను చిన్నగా కోసిన ఉల్లిగడ్డలు, నూనెలో గోలించిన మిరపకాయలతో నంజుకొని తినడానికి ఇస్తున్నారు. మరో హోటల్లో ప్రత్యేకంగా చట్నీని సైతం ఇస్తున్నారు. దీంతో అంకాపూర్‌లో మక్కవడలకు ప్రత్యేకంగా డిమాండ్ ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి సైతం వచ్చే వారే కాకుండా 63వ నెంబర్ జాతీయ రహదారిపై నిజామాబాద్ వైపు వెల్లి వచ్చే ప్రయాణీకులు సైతం ఇక్కడ ప్రత్యేకంగా ఆగి మరీ మక్క వడలు తింటూ అంకాపూర్ వడల రుచిని అభినందిస్తున్నారు. మరో వైపు ఇక్కడ మక్క వడలు తిన్న వారు తమ కుటుంబ సభ్యుల కోసం పార్సిల్‌ను సైతం ఖచ్చితంగా తీసుకొని వెల్తారు. హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల వారు ఆర్డర్‌పై ప్రత్యేకంగా మక్క వడలు వేయించుకొని పార్సిల్లను తమతో తీసుకొని వెల్తుంటారు. దేశీ కోడి కూరలో నంజుకుంటూ.. అంకాపూర్ మక్కవడల రుచి తెలిసిన భోజన ప్రియులు ఇక్కడ ప్రత్యేకంగా లభించే దేశీ కోడిని ఆర్డర్ చెప్పుకొని మక్క వడలను దేశీ కోడి కూరలో నంజుకొని తింటున్నారు. పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో సైతం ఈ రుచి అందుబాటులో ఉండకపోవడంతో దేశీకోడి కూరలో మక్క వడలు తినడానికి ఎక్కువ మంది వస్తుండటంతో దేశీ కోడి వండి ఇచ్చే ఆర్డర్ మెస్‌లు, మక్క వడలు వేసే హోటళ్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. సీజన్లో దొరికే ఈ మక్కవడలకు అంకాపూర్‌లో ఎక్కడాలేని డిమాండ్ ఉంది. సీజనల్‌గా మంచి గిరాకీ.. మక్కల సీజన్లోనే మక్క వడలను వేస్తుంటాము కాబట్టి సీజనల్‌గా మా హోటళ్లకు మంచి గిరాకీ ఉంటోంది. పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మక్క వడలు వేస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వారు తాము తినడంతో పాటు తమ ఇంటివాళ్లకోసం కూడా తీసుకెళ్తున్నారు. – సిద్ధు, మక్క గారెలు వేస్తున్న హోటల్ యజమాని, అంకాపూర్ -
మూటగట్టుకున్నారు..పరిహారాన్నీ!
పెదవేగి రూరల్: మద్దతు ధర లేక విలవిల్లాడిన రైతుకు దక్కాల్సిన పరిహారాన్ని అక్రమార్కులు మెక్కేశారు. రూ.కోట్లు పక్కదారి పట్టించారు. అధికారులు వంతపాడడంతో చాలామంది అర్హులకు అన్యాయం జరిగింది. ఒక్కరూపాయి పరిహారం అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన మొక్కజొన్న ధర వ్యత్యాస పథకం అక్రమార్కులకు వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పెదవేగి, టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, ఇతర మండలాల్లో ఈ సాగు ఎక్కువగా జరుగుతోంది. ఆయా మండలాల్లో సాగుద్వారా 30,80,870 క్వింటాళ్లు మొక్కజొన్న ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సాగులో నాలుగోవంతు జిల్లాలోనే జరుగుతోంది. ఇతర పంటల్లో ఎదురవుతున్న ఒడిదుడుకుల నేపథ్యంలో రైతులు ఈ సాగుపై మక్కువ చూపడంతో ఒక్కసారిగా సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడీ బాగా వచ్చింది. 37లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. అసలేం జరిగిందంటే.. గతేడాది రబీ సీజన్లో అంచనాలకు మించి రైతులు మొక్కజొన్న సాగుచేశారు. ఫలితంగా ఉత్పత్తి భారీగా వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ ధర లభించింది. క్వింటాకు ప్రభుత్వం రూ. 1,425గా ప్రకటించినా గతేడాది రైతులకు దక్కింది మాత్రం రూ.1,000 నుంచి రూ.1100 మాత్రమే. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం రైతుల కోరిక మేరకు ధర వ్యత్యాస పథకం ద్వారా క్వింటాకు రూ.200 వంతున సొమ్ము మంజూరు చేసింది. ఈ విధంగా జిల్లాలోని రైతులకు రూ.61.61 కోట్లు మంజూరయ్యాయి. దీనిని అక్రమార్కులు అవకాశంగా మలుచుకున్నారు. పరిహారం పంపిణీలో జోక్యం చేసుకున్నారు. మొక్కజొన్న సాగు చేయని వారూ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అధికారులు వంతపాడటంతో అనర్హుల ఖాతాల్లోకి సొమ్ములు చేరాయి. అర్హులకు అన్యాయం జరిగింది. బయటపడింది ఇలా.. పెదవేగి మండలంలోని కొప్పాక, అంకన్నగూడెం, పెదకడిమి, అమ్మపాలెం పరిధిలో రైతులకు రూ. కోటి 36 లక్షల 49 వేలు మంజూరు కాగా అందులో 50 శాతం అనర్హులే సొమ్ము చేసుకున్నారు. అసలు సాగు చేసిన వారికి పరిహారం రాకపోగా ఇతర పంటలు వేసి పక్క రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ కావడంతో కడుపుమండిన పలువురు రైతులు మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సొమ్ము పక్కదారి పట్టిన పెదకడిమి గ్రామంలో జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవాలు తెలుసుకున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే అక్రమాలు జరిగినట్టు సమాచారం. అనర్హులకు ఇచ్చేశారు గతేడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా ధర లేకపోవడంతో వ్యత్యాస పథకంలో డబ్బులు ఇస్తున్నారంటే అందరితోపాటు కాగితాలను వ్యవసాయశాఖ సిబ్బందికి ఇచ్చాను. ప్రతి రైతుకు రూ.20 వేలు చొప్పున రావాల్సి ఉండగా, నాకు డబ్బు రానివ్వకుండా అనర్హులైన ఆయిల్‌పామ్, జామ పంటలు సాగు చేసిన రైతులకు డబ్బు రావడం దారుణం. – బాల నాగవరప్రసాద్, రైతు, పెదకడిమి అన్యాయంగా దోచేశారు ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.200 చెల్లిస్తామని ప్రకటించింది. గ్రామ నాయకులు, అగ్రికల్చర్ అధికారులు 60–70 పేర్లు అన్యాయంగా తిసేశారు. మొత్తం సొమ్మును గ్రామంలో కొందరు నాయకులు తినేశారు. ఆయిల్‌పామ్, జామ పంట పేరుతో మాకు 5 ఎకరాల పొలం ఉంటే.. మేం దరఖాస్తు చేయకపోయినా.. మా పొలాల సర్వేనంబర్లతో గ్రామానికి చెందిన మండవ ప్రసాద్, చళ్ళగొళ్ల గోపాలస్వామి మాకు తెలియకుండా సొమ్ము తీసుకున్నారు. – పర్వతనేని నాగయ్య, రైతు, పెదకడిమి -
చెరకుకు ప్రత్యామ్నాయం తీపిజొన్న!
♦ చెరకు కన్నా తక్కువ నీటితో, తక్కువ కాలంలోనే పండించవచ్చు ♦ ఇథనాల్, ఆల్కహాల్ తయారీకి ఉపయోగం ♦ ఉప ఉత్పత్తులతో అపార ఆర్థిక ప్రయోజనాలు ♦ చిక్కోలులో ప్రయోగాత్మకంగా 300 ఎకరాల్లో సాగు.. ప్రారంభమైన క్రషింగ్ బహుళ ప్రయోజనాల పంట తీపి జొన్న (స్వీట్ సోర్గమ్). గడ్డు పరిస్థితులకు ఎదురొడ్డి నిలవటం ఈ పంట నైజం. ఇది సాధారణ జొన్న మాదిరిగా ఆహార పంటే కాదు.. జీవ ఇంధనాన్ని కూడా అందిస్తుంది. అంతేకాదు.. దీని ఉప ఉత్పత్తులు ఎన్నెన్నో. దీని సాగును పరిశ్రమలతో అనుసంధానించటం ద్వారా రైతుల బతుకుల్లో కొత్త వెలుగులు నింపవచ్చు. చెరకు సాగుతో విసిగిపోయిన రైతులకు ఇది చక్కని ప్రత్యామ్నాయ పంట. శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి పారిస్ షుగర్ ఫ్యాక్టరీ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రైతులు తీపిజొన్నను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. సోమవారం నుంచి క్రషింగ్, ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ‘సాగుబడి’ స్పెషల్ ఫోకస్. చెరకు రైతులకు ప్రత్యామ్నాయ పంటగా తీపి జొన్న అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి శ్రీకాకుళం జిల్లా రేగిడి, పాలకొండ, వీరఘట్టాం మండలాల్లో 300 ఎకరాల్లో తీపిజొన్న ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నది. సంకిలి చెక్కెర కర్మాగారం యాజమాన్యం రైతులను ప్రోత్సహించి ఈ పంటను సాగు చేయిస్తోంది. తొలిసారిగా తీపిజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభమైంది. చెరకు సాగుతో నష్టాలు రావటం వల్ల రైతులు ఇతర పంటల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని చక్కెర కర్మాగారాలకున్న సామర్థ్యంలో 50 శాతం వరకు మాత్రమే చెరకు లభిస్తోంది. ఈ గడ్డు పరిస్థితుల్లో తీపిజొన్న సాగుతో ఇటు రైతులకు అటు చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యాలకూ లాభం కలుగుతుందని భావిస్తున్నారు. తీపి జొన్న పంట కాలం 110 రోజులు చెరకు ఏడాదికి ఒక పంటే చేతికొస్తుంది. తీపి జొన్న పంట కాలం 110 రోజులు మాత్రమే. అంటే ఏడాదికి మూడు పంటలు పండించవచ్చు. చెరకు 30 టన్నుల దిగుబడి వస్తే చాలనుకునే స్థితిలో రైతులున్నారు. తీపి జొన్న ఎకరాకు 20-25 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా దిగుబడులను మరింత పెంచుకునే అవకాశమూ ఉందని నిపుణులు చెబుతున్నారు. చెరకులో 30 టన్నుల దిగుబడి వస్తే టన్నుకు రూ. 2,500 చొప్పున ఎకరాకు రూ. 75 వేల ఆదాయం వస్తోంది. ఖర్చులకు, వచ్చే ఆదాయానికి సరిపోతోంది. తీపిజొన్న టన్నుకు ప్రారంభ ధర రూ. 1,300 వరకు చెల్లిస్తున్నారు. ఎకరాకు రూ. 20 వేల వరకు ఆదాయం వస్తోంది. రేగిడి మండలంలో ఖండ్యాం, తునివాడ, వెంకమపేట, సంకిలి, బొడ్డువలస, కొమెర తదితర గ్రామాల్లో 300 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. తొలివిడతలో 110 మంది రైతులు ఈ పంటను వేశారు. మరో 250 ఎకరాల్లో ఈ పంటను సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం జీవ ఇంధనాల వాడకాన్ని పెంచాలని భావిస్తోంది. పర్యావరణంపై దుష్ర్పభావం, విదేశీ మారక నిల్వలపై చూపుతున్న ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకు జీవ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇథనాల్‌ను జీవ ఇంధనంగా పెట్రోల్‌తో కలిపి వాడుతున్నారు. 10 శాతం బయో ఇథనాల్ వాడకాన్ని తప్పనిసరి చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. పండ్లను మాగబెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌కు బదులు ఇథనాల్ వాడుతున్నారు. ఈ కారణాల వల్ల భవిష్యత్‌లో తీపిజొన్న సాగుకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. - ఎస్. పి. నాయుడు, సాక్షి, రేగిడి, శ్రీకాకుళం జిల్లా తక్కువ నీటితోనే తీపిజొన్న సాగు తీపిజొన్న పైరు బాగుంది. తక్కువ నీటి తడులతోనే ఈ పంటను సాగు చేయవచ్చు. చెరకుతో పోల్చితే సాగు ఖర్చు తక్కువ. దిగుబడి, ఆదాయం ఎంత వస్తుందో చూడాలి. - దూసి ప్రసాదరావు (91777 52162), రైతు, ఖండ్యాం, రేగిడి మం, శ్రీకాకుళం జిల్లా రెండెకరాల్లో తీపిజొన్న సాగు చేశా.. ఇప్పటి వరకూ చెరకు పంటనే సాగు చేస్తున్నాం. ఏడాదికి ఒక పంట మాత్రమే వస్తుంది. పంట మార్పిడి కోసమని తీపిజొన్నను రెండెకరాల్లో సాగు చేశాను. తక్కువ కాలంలో ఈ పంట చేతికొస్తుంది కాబట్టి మేలే. పంట ఆశాజనకంగా ఉంది. - కింజరాపు సురే ష్‌నాయుడు, రైతు, కె.వెంకటాపురం, రేగిడి మం, శ్రీకాకుళం జిల్లా తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా... నీటి ఎద్దడి, కూలీల కొరత కారణంగా చెరకు సాగు తగ్గుతోంది. కర్మాగారంలో ఇథనాల్ తయారీకి చెరకుకు ప్రత్యామ్నాయంగా తీపి జొన్న ఉపయోగపడుతుంది. తొలిసారిగా సంకిలిలోని ఈఐడీ పారిస్ చక్కెర కర్మాగారంలోనే ఈ పంటను గానుగాడిస్తున్నాం. కోతకోసిన 8 గంటల లోపు దీన్ని పూర్తి చేయాల్సి ఉండటం వల్ల ప్రయోగాత్మక సాగుకు ఫ్యాక్టరీ దగ్గర్లోని గ్రామాలను ఎంపికచేశాం. చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్ తయారీ అనుబంధ పరిశ్రమ. దీని తయారీకి ఇప్పటి వరకు వాడుతున్న చెరకు పంటకు ప్రత్యామ్నాయంగా తీపిజొన్నను ముందుకు తెచ్చే కృషి జరుగుతోంది. - ఎ. నాగిశేషారెడ్డి (76809 62888), జీఎం, ఈఐడీ పారిస్ చక్కెర కర్మాగారం, సంకిలి,శ్రీకాకుళం జిల్లా అన్ని భూముల్లోనూ సాగు చేయొచ్చు.. అన్ని రకాల భూములు తీపిజొన్న సాగుకు అనుకూలమే. చెరకు కన్నా తక్కువ నీటితోనే దీన్ని సాగు చేయవచ్చు. వేసవిలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు. 110 రోజుల్లో పంట చేతికొస్తుంది. దిగుబడులు బావుంటాయి. - ఎం. మధుసూదనరావు (88866 12679) వ్యవసాయాధికారి, రేగిడి, శ్రీకాకుళం జిల్లా -
సమ్మర్ సలాడ్స్
చీపొమెగ్రనేట్ స్వీట్‌కార్న్ సలాడ్ కావలసినవి ► దానిమ్మకాయ - ఒకటి, స్వీట్‌కార్న్ - సగం కండె, అరటిపండు - సగం ► ద్రాక్ష - అరకప్పు, జామపండు - సగం, ఖర్జూరాలు - పది తయారి: స్వీట్‌కార్న్ అంటే తియ్యగా ఉండే మొక్కజొన్న కండె. దీనినే అమెరికన్ కార్న్ అని కూడా అంటారు. ఇది కూరగాయల మార్కెట్లలోనూ, సూపర్ మార్కెట్లలోనూ దొరుకుతుంది. ఇవి లేతగా, గిల్లితే పాలుకారుతుంటాయి. వండాల్సిన అవసరం ఉండదు. పచ్చిగానే తినవచ్చు. ముందుగా మొక్కజొన్న గింజలు ఒలిచి పక్కన ఉంచుకోవాలి. దానిమ్మకాయ గింజలను ఒలిచి అందులో వేసిన తర్వాత అరటి, జామపండ్లను సన్నని ముక్కలుగా కట్ చేసి కలుపుకోవాలి. ఖర్జూరాన్ని గింజలు తీసేసి సన్నని ముక్కలు చేసి ఫ్రూట్మిక్స్లో కలిపితే పొమెగ్రనేట్ - స్వీట్‌కార్న్ సలాడ్ రెడీ. వాటర్మెలన్ సలాడ్ కావలసినవి: ► పుచ్చకాయ ముక్కలు -ఒక కప్పు ► తర్బూజముక్కలు - అర కప్పు ► పుదీన - రెండు రెమ్మలు ► పెరుగు - ఒక టేబుల్ స్పూన్ ► ఉప్పు - చిటికెడు ఇది చాలా సులభంగా చేసుకోదగిన సలాడ్. ఒక బౌల్లో పుచ్చకాయ, తర్బూజ ముక్కలు వేసి అందులో పుదీన ఆకులు, పెరుగు, ఉప్పు కూడా కలపాలి. అంతే! వాటర్మెలన్ సలాడ్ రెడీ. సాధారణంగా పుచ్చకాయ తినేటప్పుడు, సలాడ్ల కోసం ముక్కలు కోసినప్పుడు గింజలను వదిలేస్తుంటారు. నిజానికి గింజలలో అనేక ఔషధగుణాలుంటాయి. కాబట్టి గింజలను తినాలి. అలాగే తర్బూజ గింజలు కూడా తినవచ్చు. వీటిని విడిగా తీసుకోవడం సులభం కాబట్టి ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు. అయితే గింజ నలిగేటట్లు నమలాలి . స్ట్రాబెర్ర గ్రేప్ సలాడ్ కావలసినవి ► స్ట్రాబెర్రీలు - పది (సన్నగా ముక్కలు చేయాలి) ► ద్రాక్ష - ఒక కప్పు, సపోటాముక్కలు - అర కప్పు ► జామముక్కలు - అర కప్పు, నల్లద్రాక్షరసం - ఒక టేబుల్ స్పూన్ ► గార్నిష్ చేయడానికి: క్రీమ్ - మూడు టీ స్పూన్లు, చెర్రీలు - నాలుగు తయారి స్ట్రాబెర్రీ, జామ, సపోట ముక్కలను, ద్రాక్షపండ్లను కలపాలి. సర్వ్ చేసే ముందు ఈ ముక్కలను కప్పులో వేసి ఒక్కొక్క కప్పులో ఒక టీ స్పూన్ ద్రాక్షరసం వేసి పైన క్రీమ్ పెట్టి చెర్రీతో అలంకరించాలి. ముందుగా క్రీమ్ పెట్టి దాని మీద ద్రాక్షరసం వేసినా బాగుంటుంది. పిల్లలు క్రీమ్ ఇష్టపడతారు కాబట్టి కాస్త ఎక్కువ క్రీమ్ వేసి మధ్యలో చెర్రీ పెట్టి దాని చుట్టూ ద్రాక్షరసం రకరకాల బొమ్మల షేప్ వచ్చేటట్లు వేస్తే ఆనందంగా తింటారు. -
వానతో పొత్తుకు సై
ఓ పక్క... వాన చినుకుల చిటపట. మరో పక్క... కుంపటిలో మొక్కజొన్నపొత్తుల చిటాపటా. రెయినీ సీజన్లో... కామన్ సీన్ ఇది. కానీ ఇప్పుడు... మొక్కజొన్న స్థానాన్ని స్వీట్‌కార్న్ కొట్టేస్తోంది! ఆవిరిపై కాసేపు ఉడికిస్తే చాలు... స్వీట్ అండ్ హాట్ స్టఫ్ రెడీ అంటుంది. ఆ స్టఫ్‌తో పకోడీలా, సమోసాలా, కర్రీ టోస్టా, కార్న్ చాటా... ఏం చేసుకుంటామన్నది మన చాయిసే. స్వీట్‌కార్న్ మెంతి పకోరా కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - మూడు కప్పులు (మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి); మెంతి ఆకులు - కప్పు (ఆకులు శుభ్రం చేసి బాగా కడిగి ఉడికించాలి); ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; అల్లం తురుము - టీ స్పూను; కొత్తిమీర తరుగు - పావు కప్పు; సెనగ పిండి - 3 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి తగినంత నూనె పోసి కాగనివ్వాలి ఒక పాత్రలో స్వీట్‌కార్న్ ముద్ద, ఉడికించిన మెంతి ఆకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి సెనగ పిండి, బియ్యప్పిండి , కార్న్‌ఫ్లోర్ జత చేసి మిశ్రమం మరోసారి కలపాలి. (నీళ్లు పోయకూడదు బాణలిలో నూనె కాగిందో లేదో చూసుకుని, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి టొమాటో కెచప్‌తో స్వీట్ కార్న్ మెంతి పకోరాలను వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ చాట్ కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - 2 కప్పులు; ఉల్లి తరుగు - పావు కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; నిమ్మరసం - 2 టీ స్పూన్లు; కారం - పావు టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు - తగినంత; అలంకరణ కోసం... కొత్తిమీర తరుగు - కొద్దిగా; సన్న కారప్పూస - కొద్దిగా. తయారీ: స్వీట్ కార్న్ గింజలను ఆవిరి మీద ఉడికించాలి ఒక పాత్రలో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి నిమ్మరసం. చాట్ మసాలా జత చేసి మరోమారు కలపాలి చిన్న చిన్న బౌల్స్‌లో వేసి పైన కొత్తిమీర తరుగు, సన్న కార ప్పూసలతో అలంకరించి వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ కర్రీ టోస్ట్ కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 10; స్వీట్ కార్న్ - కప్పు; ఉల్లి తరుగు - పావు కప్పు; నిమ్మరసం - టీ స్పూను; జీలకర్ర - పావు టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; గరం మసాలా - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; నూనె - తగినంత తయారీ: ముందుగా స్వీట్ కార్న్ గింజలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి వేయించాలి పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి కొద్దిగా వేయించాలి ఉల్లి తరుగు జత చేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి స్వీట్ కార్న్ ముద్ద, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ఐదు నిమిషాలయ్యాక దించేయాలి నిమ్మరసం, కొత్తిమీర తరుగు జత చేయాలి ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ మీద సమానంగా పరవాలి వేడి చేసిన పెనం మీద వీటిని రెండు వైపులా బటర్ వేసి కాల్చాలి టొమాటో కెచప్‌తో వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ సమోసా కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - కప్పు; మైదా పిండి - కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - గుప్పెడు; చనా మసాలా పొడి - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత తయారీ: బాణలిలో మూడు టీ స్పూన్ల నూనె వేసి దింపేయాలి ఒక పాత్రలో మైదా పిండి, కాచిన నూనె, ఉప్పు వేసి బాగా కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండి మాదిరిగా బాగా కలిపి పక్కన ఉంచాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక స్వీట్ కార్న్ గింజలు వేసి వేయించాలి పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, పుదీనా ఆకుల తరుగు, చనా మసాలా పొడి, ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలిపి తీసి పక్కన ఉంచాలి స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి కలిపి ఉంచుకున్న మైదా పిండి ని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీ మాదిరిగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా కొద్దిగా కాల్చి తీసి దానిని రెండుగా మధ్యకు కట్ చేయాలి. (అర్ధ వ్యాసంగా వస్తుంది) ఒక భాగాన్ని తీసుకుని దానిని కోన్ మాదిరిగా చుట్టి, అందులో తయారుచేసి ఉంచుకున్న కార్న్ మిశ్రమం కొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి ఇలా అన్నీ తయారుచేసుకోవాలి నూనె కాగాక వీటిని ఒకటొకటిగా వేస్తూ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. చట్పటా కార్న్ కావలసినవి: స్వీట్ కార్న్ - కప్పు; వేయించిన పల్లీలు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఉల్లి తరుగు - పావు కప్పు (మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి); టొమాటో ప్యూరీ - టేబుల్ స్పూను; టొమాటో తరుగు - 2 టేబుల్ స్పూన్లు (చిన్న చిన్న ముక్కలుగా తరిగినవి); అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; పంచదార - చిటికెడు; నిమ్మరసం - అర టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు; ఉప్పు - కొద్దిగా; అలంకరణ కోసం... కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు; టొమాటో తరుగు - 2 టీ స్పూన్లు తయారీ: బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లి ముద్ద వేసి దోరగా వేయించాలి అదే బాణలిలో పల్లీ ముక్కలు, టొమాటో ప్యూరీ, టొమాటో ముక్కలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, పంచదార, ఉప్పు, పావు కప్పు నీళ్లు వేసి బాగా కలిపి నాలుగైదు నిమిషాలు సన్న మంట మీద ఉంచి కలుపుతూండాలి నిమ్మరసం జత చేసి మరోమారు కలిపి దింపేయాలి చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్‌లోకి తీసుకుని వేడివేడిగా అందించాలి. సేకరణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై -
మంచి పోషకాల మొక్కజొన్న
పిల్లలకు ఏ చిరుతిండి పెట్టాలా అన్నది అమ్మ ఆలోచన. అన్ని కాలాల్లోనూ విరివిగా దొరికే స్వీట్‌కార్న్‌ను రకరకాల రుచులతో పిల్లల టిఫిన్ బాక్స్‌లలో పెట్టడం లేదా వారికి స్నాక్స్‌గా ఇవ్వడం మంచిది. ఎందుకంటే... స్వీట్‌కార్న్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే మినరల్స్, ఫోలిక్ యాసిడ్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. స్వీట్‌కార్న్‌లో ఉండే విటమిన్ సి పంటిజబ్బులను దరిచేరనివ్వదు. అలాగే జుట్టు మృదువుగా పెరిగేందుకు దోహదపడుతుంది. స్వీట్‌కార్న్‌తో పోల్చితే మొక్కజొన్న మరికాస్త చవకైనది. ఇది మంచి సీజనల్ ఫుడ్. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహకరిస్తుంది. మొక్కజొన్నలో ఉండే మెగ్నీషియం, ఐరన్, కాపర్ , కాల్షియం వంటి ధాతువులు పిల్లల్లో కండరాల పెరుగుదలకు, కండరాలు ఫెళుసుబారకుండా ఉండటానికి దోహదపడతాయి. జుట్టుకుదుళ్లు గట్టిగా ఉండేలా చేస్తాయి. -
లెమన్ కొరియాండర్ సూప్ విత్ స్వీట్ కార్న్
-
కళ్లాల్లో క‘న్నీళ్లు’
న్యూస్‌లైన్, నెట్వర్క్ : జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న కంకులూ వర్షానికి తడిసి గింజలు మురిగిపోయాయి. నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్‌నగర్, నర్వ, గున్కుల్, జక్కాపూర్, మల్లూర్, ముగ్దుం పూర్, గాలీపూర్, మంగ్లూర్, నర్సింగ్‌రావుపల్లి, కోమలంచ, ఒడ్డెపల్లి, గోర్గల్, అచ్చంపేట గ్రామాలతో పాటు పలు గిరిజన తండాలలో వరి పంటలు వర్షానికి నీట మునిగాయి. రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఆయా గ్రామాలలో సుమారు మూడు వందలకు పైగా ఎకరాలలో పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. ఊరూరా కన్నీటి కథే ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల, అన్నాసాగర్, తిమ్మారెడ్డి, లింగారెడ్డిపేటలతో పాటు రుద్రా రం, జంగమాయపల్లితో పాటు పలు గ్రామాల్లో వరి పంట ఎక్కువ మొత్తంలో దెబ్బతింది. బుధవారమే ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలకు రెతులు అధిక మొత్తంలో ధాన్యాన్ని తీసుకురాగా తడిసిపోయింది. నాగిరెడ్డిపేట మండలంలోని బంజర, నాగిరెడ్డిపేట, ధర్మారెడ్డి, తాండూర్, మాల్తుమ్మెద, వెంకంపల్లి, లింగంపల్లి కలాన్ తదితర గ్రామాల్లో చేతికొచ్చిన వరిపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమా రు 500 ఎకరాలకు పైగా పంటనష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. మండలంలో బుధవారం రాత్రి 21.2 మి.మీ వర్షపాతం నమోదయినట్లు తహశీల్దార్ నారాయణ తెలిపారు. భీమ్‌గల్ మండలంలో పంటలు దెబ్బ తిన్నా యి. రాత్రిపూట ఏకబిగిన వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు, బడాభీమ్‌గల్, బెజ్జోరా, సికింద్రా పూర్, చేంగల్, గోన్గొప్పు ల్, ముచ్కూర్, మెండోరా, పల్లికొండ, బాచన్పల్లి, పిప్రి గ్రామాలలో వర్షానికి పంటలు దెబ్బ తిన్నాయి. వరితో పాటు మొక్కజొన్న తడిసిముద్దయ్యింది. చేతికందే పంట చేజారి బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రాహీంపేట్, పోచారం, రాంపూర్, దేశాయిపేట్, సోమేశ్వర్, తాడ్కోల్, తిర్మలాపూర్ శివార్లలో వందలాది ఎకరాలలో పంట నేలకొరిగింది. నిజామాబాద్ మండలంలోని పలు గ్రామాలలో వరి, మొక్కజొన్న సోయా పంటలు దెబ్బతిన్నాయి. కోతలు కోసి కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని మంచిప్ప, బాడ్సి, ముదక్పల్లి, సిర్పూర్, న్యాల్కల్, మల్లారం, ముత్తకుంట, ధర్మారం, నర్సింగ్‌పల్లి, అమ్రాబాద్, ఎల్లమ్మకుంట, బైరాపూ ర్, కాల్పోల్, తదితర గ్రామాలలో ఎక్కువగా పంటలు నేల కొరిగాయి. రెంజల్ మండలంలో సుమారు 500 ఎకరాలలో సోయా, వరి పంటలు దెబ్బతిన్నాయి. రైతులు నూర్పిడి చేసిన వరి, సోయ తడిసి ముద్దయ్యాయి. సిరికొండ మండలంలో కోతకు వచ్చిన వరి పొలాలు సుమారు నాలుగు వేల ఎకరాలలో నేల వాలాయి. మండలం లో బుధవారం 23.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. బోధన్‌తో పాటు నియోజకవర్గంలోని ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి వర్షానికి దెబ్బతిన్నది. కామారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో జోరుగా వర్షం కురిసింది. వరితో పాటు మొక్కజొన్న, సోయాపంటలు వర్షానికి దెబ్బతిన్నాయి. దోమకొండలో అత్యధిక వర్షం దోమకొండతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం జిల్లాలోనే అత్యధికంగా 40 మి.మీటర్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంట పూర్తిగా నేలవాలగా, ఆరబెట్టిన మొక్కజొన్న త డిసిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 7,876 ఎకరాలలో వరి పంటను వేశారు. దాదాపు 30 శాతం పంట దెబ్బతిన్నట్లు తెలిసింది. గొట్టిముక్కల గ్రామ శివారులో కొందరు రైతులు తడిసిన ధాన్యాన్ని వర్షానికి భయపడి కేవలం రూ. 1200 క్వింటాలుగా విక్రయించినట్లు తెలిసింది. బీబీపేట, యడారం, అంబారిపేట, ముత్యంపేట, గొట్టిముక్కుల, సంఘమేశ్వర్, ఇస్పానగర్, మల్కాపూర్, తుజాల్పూర్ గ్రామాల్లో వందల ఎకరాల్లో వరిపంట వర్షానికి నేలవా లింది. భిక్కనూరులో మార్కెట్‌కు తీసుకువచ్చిన మక్కలు, పంట పొలాల్లోనూ ఆరబెట్టిన కంకులు తడిశాయి. బాన్సువాడ, చింతల్‌నాగారం, తాడ్కో ల్ శివారులో సుమారు 120 ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ మండలంలో మొక్క జొన్న, సోయా పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.