చిటపట వర్షంతో వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది. ఈ చలిలో చక్కగా వేడి వేడి పకోడీలు లేదా అప్పుడే కాల్చిన మొక్కజొన్న కంకిలు తింటుంటే సామిరంగా..ప్రాణం భలే హయిగా ఉంటుంది. ప్రస్తుతం ఉరుకులు పరుగులు జీవితం కారణంగా అలాంటి ఆనందాలే మరిచిపోతున్నాం. దీనికి తోడు అందరూ ఉద్యోగాలు, చదువులు పేరుతో పట్టణాల బాటపట్టడంతో..అవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది.
ఐతే పట్టణాల్లో వాటి ప్లేస్‌లో మార్కెట్‌లో ఎక్కువగా స్వీట్‌కార్న్‌లు వచ్చాయి. కనీసం వీటితో ఈ జోరు వానలో నాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు హాయిగా. ఈ స్వీట్ నాటు మొక్కజొన్నలు స్థానంలో వచ్చిన ఈ స్వీట్ కార్న్‌లతో అలనాటి ఆ సంతోషాన్ని ఆస్వాదిద్దామా! ఇక ఆలస్యం ఎందుకు వాటితో చేసే స్నాక్ ఐటెం ఏంటో చూసేద్దాం
స్వీట్ కార్న్ వడలు తయారీ విధానం
కావాల్సిన పదార్థాలు
స్వీట్ కార్న్ పెద్దది-ఒకటి
జీలకర్ర- 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి పొడి-1 టేబుల్ స్పూన్
సెనగపిండి- 3 టేబుల్ స్పూన్
బొంబాయి రవ్వ-1 టేబుల్ స్పూన్
బియ్యపిండి-1 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్(సరిపడా)
తయారీ విధానం: స్వీట్‌కార్న్‌ఉడికించుకుని వలిచి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత పైన చెప్పినవి ఓ మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుని, రుబ్బిన స్వీట్‌కార్న్ మ్రిమంలో కలుపుకోవాలి. ,రుచికి సరిపడా ఉప్పు వేసి వడలు మాదిరిగా చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి లేదా నాన్‌స్టిక్ పాన్‌లో కొద్ది మోతాదులో ఆయిల్ వేసుకుని డీప్ ఫై చేసుకోవాలి. ఆ తర్వత వాటిని టమాటా, పుదీనా చెట్నీ గానీ, టమాటా కెచప్‌తో గాని తింటుంటే ఆ రుచే వేరబ్బా!
(చదవండి: వర్షాకాలంలో వెరైటీగా క్యారెట్ కార్న్ బజ్జీ ట్రై చేయండి)
Comments
Please login to add a commentAdd a comment