recipies
-
'చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?
చికెన్ రెసిపీల్లో అందరికీ నచ్చేది చికెన్ 65. దీనికున్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఎన్నో రకాల రెసిపీలు వాటి తయారీ విధానం లేదా తయారీకి పురికొల్పిన విధానం బట్టి వాటి పేర్లు వస్తాయి. మరికొన్ని రెసిపీలైతే కొందరు సెలబ్రిటీలు లేదా ప్రముఖులు కాంబినేషన్‌గా తిన్న తీరు అనుసరించి వారి పేరు మీదుగా రెపిపీల పేర్లు రావడం జరిగింది. కానీ ఈ చికెన్ 65(Chicken 65)కి ఆ పేరు వచ్చిత తీరు తెలిస్తే విస్తుపోతారు. ఆ..! ఇలానా దానికి ఆ పేరు వచ్చింది అని నోరెళ్లబెడతారు. మరీ ఆ గమ్మత్తైన కథేంటో చదివేయండి మరీ..గతేడాది ప్రముఖ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రైడ్ చికెన్ వంటకాల జాబితా ఇచ్చింది. అందులో మన భారతదేశ వంటకం చికెన్ 65 మూడో స్థానాన్ని దక్కించుకుంది. అంతలా ఫేమస్ అయిన ఈ చికెన్ 65ని ఆ నెంబర్‌తో ఎందుకు పిలుస్తారనేది అతిపెద్ద డౌటు. అందుకు గల రీజన్ కూడా తెలియదు. అయితే చాలామంది 65 చికెన్ ముక్కలతో చేస్తారేమో లేక అన్ని రోజులు లేదా గంటలు ఈ చికెన్‌ని మ్యారినైట్ చేస్తారేమో అంటూ..పలు వాదనలు కూడా వినిపించాయి. కానీ అవేమీ కారణం కాదట. అలా పిలిచేందుకు ఓ తమాషా కథ ఉంది. అదేంటంటే..చాలమంది దీన్ని స్నాక్ రూపంలో తింటారు. కొందరు నాన్స్, చపాతీలు, భోజనంగానూ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి టేస్టీ చికెన్ 65 పేరు రావడానికి కారణం చెన్నైలోని బుహారీ రెస్టారెంట్ అట. అక్కడ మద్రాస్ మాజీ షెరీఫ్ ఎ ఎం బుహారీ కొలంబోలో పాకశాస్త్రంపై ఇష్టంతో దానికి సంబంధించిన హోటల్‌మేనేజ్‌మెంట్ చదువుని పూర్తి చేసుకుని భారత్‌కి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత చెన్నైలో రెస్టారెంట్‌ని ప్రారంభించాడు. నాటి బ్రిటిష్ వాళ్లకు భారతీయ ఆహారంతో కూడిన సరికొత్త భోజనాన్ని అందించింది ఆయనే. బుహరీ హోటల్ ద్వారా అక్కడి స్థానిక ప్రజలకు విభిన్న రుచులను అందించాడు. నాటి రోజుల మెనూలో సుదీర్ఘ వెరైటీల జాబితా ఉన్న హోటల్‌గా ప్రసిద్ధి చెందింది ఈ హోటల్. ఆ నెంబర్‌తోనే ఎందుకంటే..అయితే మనకేది కావాలో ఆర్డర్ చేయడానికి ఒక సైనికుడు భాషా సమస్య కారణంగా ఆ మెనూలోని నెంబర్ ఆధారంగా ఆర్డర్ చేశాడంట. అతడు ఎప్పుడు 65 నెంబర్లో ఉన్న చికెన్ రెసిపీని ఇమ్మని చెప్పేవాడట. పైగా అది క్రంచీగా ఉండే చికెన్ అని చెప్పేవాడట. దీంతో మిగతా కస్టమర్లు కూడా అతడిలా ఆ నెంబర్లో ఉన్నచికెన్ని ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. చెప్పాలంటే ఆ మెనూలో 65వ నెంబర్లో ఉన్న చికెన్ ఆర్డర్లే ఎక్కువగా ఉండేవి. అలా క్రమేపి అది కాస్త చికెన్ 65గా స్థిరపడిపోయింది. ఆ విధంగా ఆ రెసిపీకి చికెన్ 65 అని పేరొచ్చింది. కాలం గడిచేకొద్ది ఈ వంటకానికి ప్రజాదరణ పెరిగిందే కానీ తగ్గలేదు. ఇప్పటికీ ప్రతి రెస్టారెంట్లలో నువ్వానేనా అనే రెసిపీలు ఎన్ని ఉన్నా.. ఈ చికెన్ 65కి ఉన్న క్రేజ్ మరే రెసిపీకి లేదని చెప్పొచ్చు. ఈ వంటకం దొరికే ఫేమస్ రెస్టారెంట్లుచెన్నైలో ఈ వంటకానికి పేరుగాంచిన రెస్టారెంట్లు ఇవే..ఈ రోడ్ అమ్మన్ మెస్: ఇక్కడ చికెన్ 65 తోపాటు ఆంధ్రా చిల్లీ చికెన్ ఫేమస్. అయితే ఈ ఆంధ్రా చిల్లీ చికెన్‌ని పెద్దపెద్ద పచ్చి మిర్చితో వెల్లుల్లి మసాలతో డెకరేట్ చేసి ఉంటుంది. బుహారీ హోటల్: ఇక్కడ చికెన్78, చికెన్ 82, చికెన్ 90 అనే వంటి రకాల డిషెస్ కూడా ఫేమస్దక్షిణ్ రెస్టారెంట్: తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటకాల మెనూ ఉంటుంది. అయితే ఓన్లీ రుచికరమైన చికెన్ 65 మాత్రమే ఉంటుంది. (చదవండి: కాఫీ నాణ్యతను డిసైడ్ చేసేది ఆమె..! ది బెస్ట్ ఏంటో..) -
World Best Egg Dishes: మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..
గుడ్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. వాటితో డెజెర్ట్ల దగ్గర నుంచి వివిధ రకాల వంటకాల వరకు పలు రకాలు చేసుకుని ఆస్వాదిస్తుంటా. అలాంటి గుడ్డు వంటకాలలో ది బెస్ట్‌గా భారతీయ వంటకం నిలిచింది. ప్రతి ఏడాది ది బెస్ట్ డెజర్ట్, బెస్ట్ కర్రీ వంటి వాటికి ర్యాంకులిచ్చి మరీ జాబితాను విడుదల చేసే ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ గుడ్డు వంటకాల జాబితానను కూడా విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే టాప్ వంద గుడ్డు వంటకాల జాబితాను వెల్లడించింది. వాటిలో మన భారతీయ వంటకం మసాలా అమ్మేట్ 22వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మొదటి 50 బెస్ట్ గుడ్డు వంటకాల్లో మసాలా ఆమ్లేట్ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ జాబితాలో జపాన్‌కి చెందిన అజిత్సుకే టమాగో అనే గుడ్డు వంటకం అగ్రస్థానంలో నిలిచింది. ఈ అజితసుకే టమాగో అనేది మిరిన్, సోయా సాస్‌తో నానబెట్టి ఉకించిన గుడలతో చేసే సంప్రదాయ జపనీస్ వంటకం ఇది. ఇక నోరూరించే మన భారతీయ మసాలా అమ్మెట్ తయారీ ఎలాగో చూద్దామా..!దీనిని గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, కారం, పసుపు పొడితో తయారు చేస్తారు. అన్ని పదార్థాలను గుడ్లతో కలిపి, ఆ మిశ్రమాన్ని పాన్‌లో (సాధారణంగా వెన్న లేదా నూనెతో) వండుతారు. ఈ స్పైసీ ఆమ్లెట్‌ను సాంప్రదాయకంగా పావ్ లేదా బ్రెడ్‌తో అల్పాహారంగా వడ్డిస్తారు. తాజాగా వండిన రోటీతో కూడా తినవచ్చు. చాలా మంది దీనిని టమోటా కెచప్ లేదా కొత్తిమీర-పుదీనా చట్నీతో ఆస్వాదిస్తారు. వీధి దుకాణాలలో ఈ వంటకాన్ని ఎక్కువగా విక్రయిస్తుంటారు. కొందరూ టమోటాలను కూడా ఉపయోగిస్తారు. చివరగా ప్రపంచంలోని టాప్ 10 గుడ్డు వంటకాల జాబితా ఏంటంటే..అజిత్సుకే టమాగో (జపాన్) టోర్టాంగ్ టాలాంగ్ (ఫిలిప్పీన్స్) స్టాకా మే అయ్గా (గ్రీస్) స్ట్రాపట్సదా (గ్రీస్) ఇస్పానక్లి యుమూర్త (టర్కీ) టోర్టిల్లా డి బెటాన్జోస్ (స్పెయిన్) యుఎస్ఎ బెనెడిక్ట్ (జపాన్) షక్షౌకా (ట్యునీషియా ప్రాంతాలు) మెనెమెన్ (టర్కీ)(చదవండి: -
ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్టీ వంటకాలను అందించే దేశాలివే..!
ప్రసిద్ధి ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ అల్పాహారం, స్వీట్స్, నాన్‌వెజ్, వెజిటేరియన్ పరంగా ఏది ఉత్తమమమేనదో దేశాల వారిగా ర్యాంకులు ఇచ్చింది. ఇప్పుడు మంచి టేస్ట్‌తో కూడిన వంటకాలను అందించే దేశాల జాబితాను విడుదల చేసింది. ఆయా దేశాల్లో ఉండే విభిన్న వంటకాలు, ఫేమస్ రెస్టారెంట్లు, పానీయాలు, ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చింది. ప్రపంచంలోనే ఉత్తమ వంటకాలను అందించే.. వంద దేశాలో జాబితాలో గ్రీక్, ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ తదితర దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి.ఆ జాబితాలో భారతీయ వంటకాలు 12వ స్థానం దక్కించుకున్నాయి. ఈ ర్యాంకులను అట్లాస్ ఆయా దేశాల్లోని వివిధ వంటకాలు దక్కించుకున్న అత్యధిక స్కౌరు ఆధారంగా ఇచ్చింది. కాగా, టేస్టీ అట్లాస్ మన దేశంలోని బెస్ట్ టేస్టీ వంటకాలుగా..అమృతసరి కుల్చా, బట్టర్ గార్లిక్ నాన్, ముర్గ్ మఖానీ, హైదరాబాదీ బిర్యానీ తదితరాలను తప్పకుండా తిని చూడాల్సిన వంటకాలుగా పేర్కొంది. దీంతోపాటు మంచి ఆహార వైవిధ్యాన్ని అందించే రెస్టారెంట్లుగా దమ్ పుఖ్త్ (న్యూఢిల్లీ), గ్లెనరీస్ (డార్జిలింగ్), రామ్ ఆశ్రయ (ముంబై), శ్రీ థాకర్ భోజనాలయ్ (ముంబై)లుగా తెలిపింది. ఇక టేస్టీ అట్లాస్ ప్రకారం..భారత్‌లో కొన్ని రకాల వంటకాలు, పానీయాలు అత్యధిక స్కౌరుని దక్కించుకోవడంతో అగ్రస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...) -
ఈ సూప్ తయారీకి మూలం బ్రిటిష్ అధికారులట..!
దక్షిణ భారతీయ సూప్‌గా పేరుగాంచిన 'ముల్లిగటావ్నీ సూప్' రెసిపీని తీసుకొచ్చింది బ్రిటిష్ అధికారులట. వాళ్ల కారణంగా మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు ఈ సూప్ తయారీని కనుగొన్నారట. అంతకముందు వరకు ఈ సూప్ తయారీ గురించి ఎవ్వరికి తెలియదట. కాలక్రమేణ అదే అందరూ ఇష్టంగా ఆరగించే ఫేవరెట్ సూప్‌గా మన భారతీయ వంటకాల్లో భాగమయ్యిందని చెబుతున్నారు పాకశాస్త నిపుణులు. భారతదేశంలో బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో ఈ సూప్ ఉద్భవించిందట. అదెలా? బ్రిటిష్ వాళ్లు మనలా మసాలాలు, పప్పు, కూరగాయలు అంతగా తినరు కదా..మరీ వాళ్లెలా ఈ సూప్ తయారీకి కారణమయ్యారంటే..ముల్లిగటావ్నీ సూప్‌ని బ్రిటిష్ వలస రాజ్యల పాలనా కాలంలో ఉద్భవించిందట. చెప్పాలంటే ఈ రెసిపీని సాంస్కృతిక మార్పిడిగా పేర్కొనవచ్చు. తమిళ పదాలు మియాగు(మిరియాలు, టాన్నీర్(నీరు) మీదుగా దీని పేరు వచ్చింది. దీన్ని దక్షిణ భారతీయ పులసుగా చెప్పొచ్చు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం కోసం వచ్చి మనపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరి భారతీయులను నానా బాధలకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇక్కడ ఉండే కొందరు బ్రిటిష్ అధికారులు వారి సంప్రదాయ భోజనం అనుసరించి ముందుగా ఏదో ఒక సూప్‌తో భోజనం ప్రారంభించేవారు. అలాంటి భోజనశైలి భారత్‌లో ఉండదు. దీంతో వాళ్లు తినేందుకు సూప్ కోసం అని మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు కూరగాయాలతో చేసే పులుసునే వాళ్ల కోసం కొద్దిపాటి మాంసం వంటి వాటిని చేర్చి సూప్ మాదిరిగా తయారు చేసి అందించారు. దీని రుచికి ఫిదా అయిన బ్రిటిష్ అధికారులు..వాళ్ల పబ్‌లోనూ, రెస్టారెంట్లలోనూ ఈ వంటకం ఉండేలా ఏర్పాటు చేశారు. అంతలా ఈ సూప్‌ని బ్రిటిష్ వాళ్లు అమితంగా ఇష్టపడేవారట. అయితే ఈ సూప్‌ని తయారు చేసింది ఆంగ్లో ఇండియనే అని చెబుతుంటారు. తయారీ విధానంతేలిక పాటి కూరగాయలు, అన్నం, మిరియాలు, మాంసాలతో తయారు చేస్తారు. చివరగా క్రీమ్ మాదిరిగా అందంగా కనిపించేలా చివర్లో కొబ్బరి పాలు వేసి సర్వ్ చేస్తారు. దీనిలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాలకు వంటి వాసనతో ఘుమఘమలాడుతూ ఉంటుంది. చెప్పాలంటే భారతదేశంలో శాకాహారులు ప్రోటీన్ల కోసం చేసుకునే ఈ కూరగాయ పులుసునే ఇలా కొద్దిపాటి మార్పులతో బ్రిటిష్ వాళ్ల రుచికి అనుగుణంగా ఈ సూప్‌ని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత అదే అందరికీ ఇష్టమైన సూప్‌గా ప్రజాధరణ పొందడం విశేషం.(చదవండి: ఏడు ఖండాలను చుట్టువచ్చిన వందేళ్ల బామ్మ..!) -
తేగలతో వంటకాలు గురించి విన్నారా..?
తాటి పండు నుంచి లభించే ఉత్పత్తుల్లో తేగలు ముఖ్యమైనవి. పలు పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న తేగలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. తేగల పిండి తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యానపరిశోధనా కేంద్రం అధిపతి, ఆహార–సాంకేతిక విజ్ఞాన సీనియర్ శాస్త్రవేత్త డా. పి సి వెంగయ్య (94931 28932) అంటున్నారు. తాటి టెంక నుంచి 21–30 రోజుల్లో మొలక వస్తుంది. ఈ మొలక భూమిలోకి దాదాపు 45–60 సెం.మీ. పోతుంది. మొలక వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలకు ఏర్పడే దానిని తేగ అంటారు. తేగ పెరిగే కొద్ది కొబ్బరిలా గట్టిగా ఉండే పదార్థం కరిగిపోతుంది. ఇది దాదాపు 6–12 నెలలు అంటే తేగ నుంచి మొక్క వచ్చే వరకు ఆహారంగా ఉపయోగపడుతుంది. టెంకలను నీడలో పాతర పెడితే తేగలు ఇంకా బాగా పెరుగుతాయి. విత్తనం నుంచి మొక్క రావటం అనేది 50 శాతం వరకు ఉంటుంది. గుజ్జు తీసిన టెంకలు తొందరగా మొలక వచ్చి బాగా పెరుగుతాయి. పెద్ద టెంకల నుంచి మందం గల తేగలు చిన్న టెంకల నుంచి సన్న తేగలు వస్తాయి. పొడవులో మాత్రం వ్యత్యాసం ఉండదు. తేగల ఉత్పత్తిలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. తేగల పిండి తయారీ ఇలా...తాజా తేగలను శుభ్రపరచి ఒక అరగంట పాటు ఉడికించి అమ్మవచ్చు. వీటిలో పలు ఔషద గుణాలు ఉన్నాయి. తేగలను వివిధ రూపాల్లోకి మార్చి సంవత్సరమంతా వాడవచ్చు. దీనికోసం తేగలను ఎండబెట్టి ముక్కలుగా నిల్వ ఉంచాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు. పచ్చి తేగలను లేదా ఉడికించిన తేగలను రెండుగా విడదీసి ఆరబెట్టవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టటం మరో పద్ధతి. వీటిలో ఏదో ఒక విధానంలో తేగలను పిండిగా మార్చవచ్చు. తేగను పిండి రూపంలోకి మార్చి 250 మైక్రాన్ల జల్లెడ ద్వారా జల్లిస్తారు. పచ్చి పిండిని వాడేటప్పుడు ఒకట్రెండు గంటలు నీటిలో నానపెడితే చేదుపోతుంది. పిండి నుంచి నీటిని తొలగించేందుకు వడపోయాలి. లేదా వేడి చేయాలి. తేగల పిండితో పలు వంటకాల తయారీ పిండిని ఉడికించడం ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలు చేయవచ్చు. ఉడికించిన పిండిలో బెల్లం, కొబ్బరి పొడి కలిపి తినవచ్చు. ఈ పిండిలో కొబ్బరిపొడి కలిపి ఆవిరితో ఉడికిస్తే మంచి రుచికరమైన వంటకం తయారవుతుంది. మినపప్పుతో కలిపి ఇడ్లీ, దోశె తయారు చేయవచ్చు. బ్రెడ్, గోధుమ పిండితో కలిపి నూడిల్స్ తయారు చేయవచ్చు. వరి, గోధుమ పిండితో తయారు చేసే అన్ని వంటకాల్లోను దీన్ని వాడవచ్చు. చదవండి: యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు: విదేశంలో డైవర్స్ కేసు వేస్తే..!తాజా తేగ 46 గ్రా. బరువుంటుంది. ఉడికించి ఆరబెట్టినది 16. గ్రా., పచ్చిది ఆరబెట్టినది 18గ్రా. బరువుంటుంది. సమారు 60 శాతం పిండి పదార్థం ఉంటుంది. తేగల్లో ముఖ్యమైనది పిండి పదార్థం. ఇది తేగ మొదటి భాగంలో ఎక్కువగా ఉంటుది. పోనుపోను తగ్గుతూ ఉంటుంది. తాజా తేగలో సుమారు 55 శాతం తేమ ఉంటుంది. ప్రోటీన్లు 5 శాతం, కొవ్వు పదార్థాలు 0.5 శాతం ఉంటాయి. -
బెస్ట్ బీన్స్ డిషెస్‌లో.. మన భారతీయ వంటకం ఇదే..!
ప్రపంచంలోనే అత్యుత్తమ బీన్స్ రెసీపీల్లో మన భారతీయ వంటకం చోటు దక్కించుకుంది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన 50 అత్యుత్తమ బీన్స్ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకం కూడా నిలిచింది. ఈసారి నవంబర్ 2024 విడుదల చేసిన 50 బెస్ట్ బీన్స్ ఆహార జాబితా ర్యాకింగ్‌లో మన భారతీయ వంటకం రాజ్మా 14వ స్థానంలో నిలవడం విశేషం. గతేడాది ఫుడ్ గైడ్ ఇచ్చిన బెస్ట్ రెసిపీల జాబితాలో రాజ్మా, రాజ్మా చావెల్ కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ బెస్ట్ బీన్స్ వంటకాల్లో తొలిస్థానం మెక్సికోకు చెందిన ప్యూరీ బీన్ సూప్ సోపా తారాస్కా చోటు దక్కించుకుంది. ఆ తర్వాత హైతీకి చెందిన దిరి అక్ప్వా రెండో స్థానం కాగా, ఇక మూడో స్థానంలో బ్రెజిల్‌కు చెందిన ఫీజావో ట్రోపీ నిలిచింది. ఇంతకు ముందు టేస్ట్ అట్లాస్ 50 బెస్ట్ డిప్స్ జాబితా విడుదల చేయగా..అందులో రెండు భారతీయ చట్నీలు చోటుదక్కించుకున్నాయి. పైగా వాటిని ఇంట్లోనే మసాలాలతో తయారు చేసే రుచికరమైన చట్నీలుగా అభివర్ణించింది. కాగా, ఈ రాజ్మా కర్రీ వివిధ సుగంధ ద్రవ్యాలతో చేసిన చిక్కటి గ్రేవీలా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన శాకాహార వంటకాల్లో ఇది ఒకటి. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: స్ట్రిక్ట్ డైట్ పాటించకుండానే బరువు తగ్గొచ్చు..!) -
బీట్రూట్తో వెరైటీగా: ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
బీట్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయెజనాలు లభిస్తాయి. పచ్చిగా తినవచ్చు. లేదా కూర చేసుకొని తినవచ్చు. ఇంకా బీట్రూట్తో జ్యూస్ చేసుకొని తాగవచ్చు. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం. అలాగే మలబద్దకానికి మంచి మందు. వెరైటీగా బీట్రూట్తో వఫెల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!కావలసినవి: ఓట్స్ –100 గ్రాములు; శనగపిండి లేదా ఉప్మా రవ్వ– 25 గ్రాములు; బీట్రూట్– చిన్న దుంప; పచ్చిమిర్చి –2; అల్లం– అంగుళం ముక్క; ఉప్పు పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ఆమ్చూర్ పౌడర్– అర టీ స్పూన్ ; జీలకర్ర పొడి– అర టీ స్పూన్; నెయ్యి– టీ స్పూన్.తయారీ: ఓట్స్‌ను మెత్తగా పొడి అయ్యే వరకు మిక్సీలో గ్రైండ్ చేయాలి. పొడి అయిన తర్వాత అందులో శనగపిండి లేదా రవ్వ వేసి గ్రైండ్ చేయాలి. అందులోనే ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిసే వరకు ఒకసారి తిప్పి ఒక పాత్రలో వేసి పక్కన ఉంచాలి మిక్సీ జార్లో బీట్రూట్, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓట్స్– శనగపిండి మిశ్రమంలో పోసి కలపాలి. మరీ గట్టిగా అనిపిస్తే తగినంత నీటిని చేర్చి ఉండలు లేకుండా కలపాలి వఫెల్స్ చేసే ఇనుప పాత్రకు నెయ్యి రాసి వేడి చేసి అందులో పైన కలుపుకున్న ఓట్స్– బీట్‌రూమ్ మిశ్రమాన్ని పోసి సమంగా సర్ది మూత పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి. మూత తీసి చూసుకుని పిండి చక్కగా కాలిన తర్వాత దించేయాలి. ఈ వఫెల్స్కి పుదీన చట్నీ లేదా సూప్, చీజ్ మంచి కాంబినేషన్. -
కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!
కింగ్ చార్లెస్, కెమిల్లా దంపతులు ఇటీవల బెంగూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే రాజ దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళలోని సౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ సెంటర్‌ని కూడా సందర్శించారు. అక్కడ దాదాపు ముప్పై ఎకరాల్లో ఉండే వెల్నెస్ రిట్రీట్‌లో మూడు రోజులు గడిపారు. అంతేగాదు అక్కడ జరిగే యోగా సెషన్లు, ధ్యానం, ఆయుర్వేద ప్రకృతి వైద్య చికిత్సలన్నింటిలోనూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కింగ్ చార్లెస్ అక్కడి వంటకాలకు ఎంతగానో ఫిదా అయ్యారు. అక్కడ ఆయన రెండు కేరళ వంటకాలను అమిత ఇష్టంగా తిన్నట్లు సమాచారం. అవేంటో చూద్దామా..కింగ్ చార్లెస్ కేరళ సంప్రదాయ కోడి గుడ్డు కూర, ఇడియప్పం ఎంతో ఇష్టంగా తిన్నారు. అవే కూరలు మరుసటి రోజు కూడా వడ్డించమని కోరారట. కింగ్ చార్లెస్ మనుసును దోచుకున్న రెండు రెసీపీల తయారీ విధానం, వాటి చరిత్ర గురించి సవివరంగా చూద్దామా..!.సాంప్రదాయ కేరళ గుడ్డు కూర..ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించే ఈ కూరని కేరళ పాకశాస్త్ర నిపుణులు చాలా ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. కొబ్బరిపాలు, కొబ్బరి నూనె, కొద్దిపాటి మసాల దినుసుల వేసి.. విలక్షణమైన రుచితో అందిస్తారు. ఇడియప్పం..ఇక ఇడియప్పం క్రీస్తూ శకం ఒకటొవ శతాబ్ద కాలం నుంచి గొప్ప చరిత్ర కలిగిన వంటకం. బియ్యం పిండిని న్యూడిల్స్ మాదిరిగా సతాంగై అనే ప్రత్యేక పరికరంలో ప్రెస్ చేసి ఆవిరిపై ఉడికిస్తారు. ఈ వంటకం సరిహద్దులు దాటి శ్రీలంక, మలేషియా, సింగపూర్ వంటకాల్లోకి కూడా ప్రవేశించడం విశేషం. అంతలా ఈ వంటకం ఎందరో ఆహరప్రియుల మనసులను గెలుచుకుంది. కాగా, కింగ్ చార్లెస్ దంపతులు అక్కడ క్యూరేటెడ్ వెల్నెస్ డైట్‌ని అనుసరించారు. గతంలో 2019లో ఇదే వెల్నెస్ రిట్రీట్‌లో కింగ్ చార్లెస్ 71 పుట్టిన రోజు జరుపుకున్నారు. అప్పటి నుంచే రాజ దంపతులు ఇక్కడ వంటకాలపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..) -
Dasara Special 2024: అమ్మవారికి ఆరోగ్య నైవేద్యాలు
నవరాత్రులు పూర్తయ్యాయి. ఈ రోజే దసరా పండుగ. అమ్మవారికి ప్రసాదాలు ఏం వండాలి? ఆరోగ్యంగా రుచిగా సులువుగా ఉండాలి. ముందురోజు నానబోసే శనగ గుగ్గిళ్ల బదులు... అప్పటికప్పుడు స్వీట్ కార్న్ సుండలు చేయండి. చిటికెలో పూర్తయ్యే రవ్వ పోంగలి వండండి. తీపి లేకపోతే పండుగ ఫీల్ రాదంటే పాల పాయసం ఉంది. పాలపాయసంకావలసినవి: బియ్యం– కప్పు; వెన్న తీయని పాలు – లీటరు; చక్కెర – ఒకటిన్నర కప్పు; నెయ్యి– టేబుల్‌స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; కుంకుమ పువ్వు – పది రేకలు.తయారీ: బియ్యం కడిగి నీరంతా పోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి ఉంచాలి. ఒక పాత్రలో పాలను మరిగించి పక్కన పెట్టాలి. పెద్ద పాత్ర పెట్టి అందులో నెయ్యి వేడి చేసి అందులో బియ్యం వేసి సన్నమంట మీద వేయించాలి. బియ్యం ఒక మోస్తరుగా వేగిన తరవాత అందులో పాలను పోసి కలిపి ఉడికించాలి. సగం ఉడికిన మంట తగ్గించాలి.బియ్యం మొత్తగా ఉడికిన తరవాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలిపి మరికొంత సేపు ఉడకనివ్వాలి. చక్కెర కరిగి తిరిగి మిశ్రమం చిక్కబడిన తర్వాత దించే ముందు కుంకుమ పువ్వు రేకలు వేయాలి. పాల పాయసాన్ని గరిట జారుడుగా ఉండగానే దించేయాలి, పోంగలి వండినట్లు తేమ ఇంకిపోయే వరకు ఉడికించకూడదు. స్వీట్ కార్న్ సుండలుకావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; నెయ్యి – టేబుల్ స్పూన్; ఆవాలు – టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 8 రెమ్మలు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచినిబట్టి;తయారీ: స్వీట్ కార్న్ గింజలను కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి టేబుల్ స్పూన్ నీటిని చిలకరించి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించేయాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి వడపోసి పక్కన పెట్టాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ, పచ్చికొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. పోపు దినుసులు కొబ్బరికి సమంగా పట్టిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు, ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద రెండు నిమిషాల సేపు ఉంచి, మరోసారి బాగా కలిపి దించేయాలి. గోధుమ రవ్వ పోంగలికావలసినవి: గోధుమరవ్వ – 150 గ్రాములు; పెసరపప్పు – 100 గ్రాములు; నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు లేదా మిరియాల΄÷డి – టీ స్పూన్; అల్లం తురుము – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; జీడిపప్పు– 15; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నీరు – అర లీటరు. తయారీ: మందపాటి బాణలిలో పెసరపప్పును దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి పప్పు మునిగేవరకు నీటిని పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి. అదే పెనంలో గోధుమపిండి వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత అందులో మిగిలిన నీటిని పోయాలి. నీరు మరగడం మొదలైన తర్వాత ఉప్పు వేసి కలిపి అందులో రవ్వను వేయాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఉండడానికి నీటిలో వేస్తున్న సేపు గరిటతో కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికి దగ్గరవుతున్న సమయంలో ముందుగా ఉడికించి, మెదిపి పక్కన పెట్టిన పెసరపప్పు వేసి కలిపితే రవ్వ పోంగలి రెడీ. -
రతన్ టాటా ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారంటే..!
టాటా సన్స్ మాజీ చైర్మన్, భారతీయ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా (86) బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి వార్త విని వ్యాపార దిగ్గజాలే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. పరోపకారి, మూగజీవాల ప్రేమికుడు కూడా. కేవలం సంపదను సృష్టించడమే కాకుండా ఎన్నో దాతృత్వ సేవలతో అందరి మనుసులను దోచుకున్న మహనీయుడు. నానో కారుతో మధ్య తరగతి కుటుంబాల కారు కలను తీర్చేందుకు ముందుకు వచ్చిన గొప్ప పారిశ్రామిక వేత్త. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మనముందు లేరనే విషయం కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే ఆయన తన సోదరి చేసే సంప్రదాయ వంటకాలను అమితంగా ఇష్టపడేవారు. అయితే రతన్ టాటాను తన వంటకాలతో ఆకట్టుకున్న మరో వ్యక్తి కూడా ఉన్నారు. అయనే ప్రముఖ పార్సీ చెఫ్ పర్వేజ్ పటేల్.పర్వేజ్‌కు టాటా పరిశ్రమలతో దీర్థకాల అనుబంధం ఉంది. అంతలా పర్వేజ్ రతన్‌టాటాకు ఇష్టమైన చెఫ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముంబైలో పుట్టి పెరగిన పర్వేజ్ ప్రస్థానం గ్యారెజీ రెస్టారెంట్ నుంచి మొదలయ్యింది. తొలుత టీ, స్నాక్స్‌తో ప్రారంభమైన అతని పాక నైపుణ్యం త్వరిగతిలోనే విశేష ప్రజాధరణ పొందింది. మొదట్లో అతడి రెస్టారెంట్ మోటార్ సైకిల్ గ్యారెజ్ వాళ్లకు పేరుగాంచింది.కాలక్రమేణ పార్సీ ఆహార ప్రియులకు హాట్‌స్పాట్‌గా మారింది. సాంప్రదాయ పార్సీ వంటకాలపై పర్వేజ్‌కి ఉన్న ప్రావీణ్యం టాటా గ్రూప్‌తో సహా పలువురిని ఆకర్షించింది. అలా ఆయన టాటా స్టీల్ వార్షిక ఫంక్షన్లో వంటలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన వ్యక్తిగత చెఫ్‌గా మారాడు. అంతేగాదు ఒక ఇంటర్వ్యూలో పర్వేజ్ రతన్ టాటాకు హోమ్‌స్టైల్ పార్సీ వంటకాలంటే మహా ఇష్టమని తెలిపాడు. ఆయనకి ఖట్టా-మీఠా మసూర్ దాల్ (వెల్లుల్లితో వండిన తీపి పప్పు వంటకం), మటన్ పులావ్ పప్ప, ఐకానిక్ నట్-రిచ్ బేక్డ్ సీతాఫలం తదితారాలంటే ఫేవరెట్ ఫుడ్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక పర్వేజ్ వివిధ నగరాల్లో పార్సీ వంటకాలను అందించారు. అలాగే ఐటీసీ ఫుడ్ ఫెస్టివల్స్‌లో భాగంగా చాలామందికి పార్శీ సంప్రదాయ ఆహారాన్ని పరిచయం చేశారు. (చదవండి: ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!) -
చట్నీ డే: చట్నీ, పచ్చళ్లు, పొడుల మధ్య వ్యత్యాసం..?
భారతదేశంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ప్రాంతాల వారీగా విభిన్న రుచులతో కూడిన ఆహారం ఆస్వాదిస్తారు. అవన్నీ సంప్రదాయాలకు అనుగుణంగా ఆరోగ్య స్ప్రుహతో ఏర్పరచుకున్న మధురమైన రెసిపీలు. అందులో ప్రముఖంగా ఆకర్షించేవి చట్నీలు, పచ్చళ్లు, పొడులు, ఆవకాయ తదితరాలు. అబ్బా..! అవి తినేందుకు ఎంతలా స్పైసీగా నోరు మండుతున్న వదులబుద్ధి కాదు. ఎన్ని కూరలు ఉన్నా.. పక్కన కొద్దిగా పచ్చడి లేదా ఏదో ఒక చట్నీ, కొంచెం పొడి ఉంటేగానే భోజనం సంపూర్ణంగా ఉండదు. ఇలా ఇన్ని రకాల పదార్థాల కలయికతో తింటే పొట్ట నిండుగా, మనసు హాయిగా ఉంటుంది. అందుకే మన విభిన్న రుచులను గుర్తించేలా ప్రతి ఏడాది సెప్టెంబర్ 24న చట్నీ డే గా ఏర్పాటు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ రోజు విభిన్న చట్నీలతో విందులు ఏర్పాటు చేసుకుని మన పురాతన సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చట్నీ, పొడులు, ఆవకాయ, పచ్చళ్ల మధ్య తేడా ఏంటో సవివరంగా చూద్దాం..!.చట్నీచట్నీ అనే పదం 'చాట్నీ' అనే పదం నుండి ఉద్భవించింది, దీని అర్థం 'నొక్కడం'. ఇది మొఘల్ సామ్రాజ్య చరిత్రలో పాతుకుపోయింది. పాలకుడు షాజహాన్ అనారోగ్యానికి గురైనప్పుడు తొలిసారిగా ఈ చట్నీ అనే వంటకం వచ్చిందని అంటారు. ఆ సమయంలో ఆయన అనారోగ్యం నయం అయ్యేందుకు ఆస్థాన వైద్యులు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చట్నీ తినాల్సిందిగా సూచించారు. అలా వంట వాళ్లు షాజహాన్ కోసం పుదీనాతో చట్నీ చేసి పెట్టారు. అయితే బిట్రీష్ పాలనలో చట్నీ అనేదానికి వేరే అర్థాన్ని సంతరించుకుంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో పండే మామిడిపండ్లు, చింతపండు వంటి వాటిని ఇంగ్లండ్‌కి ప్రిజర్వేటివ్‌గా తరలించే క్రమంలో ఒక విధమైన స్వీట్నెస్ లిక్విడ్ రూపంలో తరలించింది. దాన్నే వాళ్లు చట్నీ అనిపిలిచేవారు. ఇది యూరోపియన్ చట్నీల సంప్రదాయంగా చెప్పొచ్చు. పచ్చడి..ఇది ఉప్పునీటిలో నిల్వ ఉంచేందుకు ఉపయోగించింది కాస్త ఊరగాయ పచ్చడిగా రూపాంతరం చెందింది. మోసొటొటేమియా నాగరికత నుంచి ఈ విధమైన ఆహార సంరక్షణ ఉండేది. 'పికెల్' అనే పదం డచ్ పదం 'పెకెల్' నుంచి వచ్చింది. దీని అర్థం ఉప్పునీరు. భారత్‌లో దోసకాయ, మామిడికాయ వంటి వాటిని ఉప్పువేసి ఇలా నిల్వ ఉంచేవారు. ఆ తర్వాత వాటిని వివిధ మసాల దినుసులతో పచ్చడిగా చేయడం వంటివి చేశారు. ఆవకాయ...ఈ పదం పర్షియన్ పదం నుంచి వచ్చింది. పోర్చుగీస్ వైద్యుడు గార్సియా ఓర్టా రచనలలో ఈ పదం గురించి వినిపిస్తుంది. శరీరానికి వేడి కలిగించే వంటకంగా రూపొందించారు. అయితే దీన్ని నూనె మసాలా దినుసులతో నిల్వ చేస్తారు. ఊరగాయ పద్ధతిలోనే.. కాకపోతే ఇక్కడ అధికంగా నూనెతో భద్రపరచడం జరుగుతుంది. ఇక్కడ నూనె, వివిధ మసాలాతో తయారు చేస్తారు.పొడి..దక్షిణ భారత పాకశాస్త్ర నిపుణుల క్రియేటివిటీనే ఈ పొడిగా చెప్పొచ్చు. దీన్ని కొందరూ చట్నీగా పిలుస్తారు కూడా. ఇది విజయనగర రాజవంశం సాహిత్యం, తమిళ గ్రంథాల్లోనూ ఎక్కువగా ఈ పొడుల ప్రస్తావన వినిపిస్తుంది. 'పొడి' అనే పదానికి తెలుగు, తమిళ, మలయాళంలో అర్థం మెత్తటి పౌడర్ అని అర్థం. ఆంధ్రప్రదేశ్‌లో నువ్వుల పొడి, కారప్పొడి ఫేమస్. వీటిని నెయ్యి లేదా నూనెతో తింటే ఉంటుంది రుచి.. అంటుంటేనే నోటిలో నీళ్లూరిపోతుంటాయి. ఎక్కువగా దోస, ఇడ్లీల, వేడి వేడి అన్నంలోనూ తింటుంటారు. అంతేగాదు పలుచోట్ల కాకరకాయ పొడి, బీరకాయ పొట్టు పొడి, కంది పొడి వంటి వివిధ రకాల పొడులు కూడా చేస్తుంటారు. (చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా! 'తాజ్ మహల్ కిరీటం"..!) -
Tasty Sweet Corn: గింజ గింజలో.. రుచి!
మార్కెట్లో స్వీట్ కార్న్ రాశులుగా పోగయి ఉన్నాయి. బలవర్ధకమే... కానీ రోజూ ఉడికించి తినాలంటే బోర్. కొంచెం వెరైటీగా ప్రయత్నం చేస్తే... పిల్లలు లంచ్‌బాక్స్‌ను ప్రేమిస్తారు... ఈవెనింగ్ స్నాక్ కోసం ఎదురుచూస్తారు.చీజ్ బాల్స్..కావలసినవి:బంగాళదుంప – 150 గ్రా (పెద్దది ఒకటి);మొక్కజొన్న గింజలు – వంద గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేతగా ఉండాలి;చీజ్ – 50 గ్రాములు;మిరియాల పొడి– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;ఆరెగానో పౌడర్ – అర టీ స్పూన్;వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్;మైదా లేదా శనగపిండి – 4 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;నూనె – 3 టేబుల్ స్పూన్లు;తయారీ..– బంగాళదుంపను ఉడికించి తొక్క తీసి చిదిమి పక్కన పెట్టాలి.– మొక్కజొన్న గింజలను ఉడికించి నీటిని వంపేసి పక్క పెట్టాలి. చీజ్‌ను తురమాలి.– ఒక పాత్రలో బంగాళదుంప, మొక్కజొన్న గింజలు, శనగపిండి, చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఆరెగానో వేసి కలపాలి.– రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు, మిరియాలపొడి కలుపుకోవచ్చు.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో పావు టీ స్పూన్ నూనె వేయాలి.– పెనం, నూనె బాగా వేడయ్యే లోపు బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న గోళీలంత బాల్స్ చేసి పక్కన పెట్టాలి.– నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో గోళీని ఒక్కో గుంతలో పెట్టి మూత పెట్టాలి.– మీడియం మంట మీద ఓ నిమిషం పాటు కాలనిచ్చి మూత తీసి ప్రతి బాల్నీ తిరగేయాలి.– తిరగేసిన తర్వాత మూత పెట్టకుండా రెండో వైపు కూడా ఎర్రగా కాలనిచ్చి తీయాలి.– వేడిగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.గమనిక: గుంత పొంగనాల పెనం లేకపోతే మామూలు బాణలిలో నూనె వేడి చేసి చీజ్ బాల్స్‌ని ఎర్రగా ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి.ఫ్రైడ్ రైస్..కావలసినవి:బాసుమతి బియ్యం – 200 గ్రాములు;నూనె – అర టీ స్పూన్;నీరు – 3 కప్పులు;మొక్క జొన్న గింజలు – 300 గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేత గింజలు);ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;ఉల్లికాడల ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు;సెలెరీ లేదా కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు;క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు;మిరియాల పొడి– టీ స్పూన్;సోయాసాస్– టేబుల్ స్పూన్;ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నెయ్యి లేదా నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు.తయారీ..– బియ్యాన్ని కడిగి 20 నిమిషాల సేపు నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో మూడు కప్పుల నీరు పోసి వేడి చేసి మరిగేటప్పుడు అందులో పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ ఆయిల్, కడిగి పెట్టిన బియ్యం వేయాలి.– అన్నం ఉడికిన తర్వాత వార్చి అన్నాన్ని ఒక పళ్లెంలో పోసి పక్కన పెట్టాలి.– అన్నం ఉడికేలోపు మరొక స్టవ్ మీద పాత్ర పెట్టి మొక్కజొన్న గింజలను ఉడికించాలి.– ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు పాత్ర లేదా పెద్ద బాణలి పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనె వేడి చేయాలి.– అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేసి దోరగా వేయించాలి.– తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, సెలెరీ తరుగు వేసి అవి వేగిన తర్వాత ఉడికించిన మొక్కజొన్న గింజలు, సోయాసాస్ వేసి దోరగా వేయించాలి.– అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు అందులో సగం అన్నం వేసి అన్నం మెతుకులు నలగనంత సున్నితంగా ఒక నిమిషం పాటు వేయించాలి.– ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా వేసి అంతా కలిసేటట్లు బాణలిని కదిలించి మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించేయాలి. -
ఆంధ్ర స్పెషల్ 'రాగి దిబ్బ రొట్టు'..ఎన్ని లాభాలో తెలుసా..!
భారతదేశం అనేక వినూత్నమైన అల్పాహార వంటకాలకు నిలయంగా ఉంది. అన్ని పోషకమైన, ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ప్రసిద్ధి. దక్షిణ భారతదేశంల ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని సాధారణంగా మినపప్పుతో తయారు చేస్తారు. అయితే ఆరోగ్యకరంగా మార్చేలా మిల్లెట్‌తో జోడించి శక్తిమంతమైన పోషకాలు కలిగిన దానిగా, ఆరోగ్యప్రదాయినిగా ఉపయోగిస్తున్నారు. ఈ రాగి దిబ్బరొట్టు ఆ ప్రాంతం వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీన్ని 'ఫింగర్ మిల్లెట్'గా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రధానమైన ధాన్యం, అధిక పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాకు పేరుగాంచింది. ఈ ఆరోగ్యకరమైన పదార్థం మిల్లెట్ కాల్షియం, ఐరన్, డైటరీ ఫైబర్‌తో నిండి ఉంది. సమతుల్య ఆహారాన్ని కొనసాగించాలనుకునే వారికి ఇది ప్రీతికరమైన పదార్థంగా ఉంటుంది. ఇక్కడ "దిబ్బరొట్టు అంటే మందపాటి రొట్టు అని అర్ధం. సాంప్రదాయంగా బియ్యం మినప్పులతో తయారు చేస్తారు. ఈ ఆంధ్రా శైలి వంటకానికి రాగి పిండిని జోడించడంతో ప్రత్యేకమైన రుచి తోపాటు పోషకాహార ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. ఈ రాగిదిబ్బ రొట్టుని తయారు చేయడం సులభం అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆకృతిలో సంతృప్తినిచ్చే మృదువైన మెత్తటి వంటకంగా తయారు చేస్తారు. ఈ వంటక కేవలం పాక ఆనందం, రుచినే గాక సమాయనుకూల ఆరోగ్యకర వంకంగా పేరుగాంచింది. దీన్ని అక్కడ ప్రజలు ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం అల్పాహారంగా తీసుకుంటుంటారు. ఈ రాగిదిబ్బ రొట్టుకి కావాల్సిన పదార్థాలు:రాగి పిండి ( మిల్లెట్ పిండి) 1 కప్పుబియ్యం 1/2 కప్పుఉరద్ పప్పు (నలుపు) 1/4 కప్పుజీలకర్ర గింజలు 1/2 టీస్పూన్2 పచ్చిమిర్చి, సన్నగా తరిగినవి1 చిన్న ఉల్లిపాయ, సన్నగా తరిగిన (ఐచ్ఛికం)కొన్ని కరివేపాకు, తరిగినవిరుచికి ఉప్పువంట కోసం నూనెతయారుచేయు విధానం..బియ్యం,పప్పును నీటిలో 4 గంటలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత, నీటిని తీసివేసి, కొద్దిపాటి నీటిని ఉపయోగించి మెత్తటి పిండిలా అయ్యే వరకు రుబ్బాలి. ఒక పెద్ద గిన్నెలో, రుబ్బిన బియ్యం, మినపప్పు పిండిలో రాగి పిండిని కలపండి. మందపాటి, మృదువైన పిండిని రూపొందించడానికి బాగా కలపండి.ఇప్పుడు పిండిలో ఉప్పు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరియు కరివేపాకు వేసి బాగా కలపాలి. గిన్నెపై మూతపెట్టి పరిసర ఉష్ణోగ్రతను బట్టి పిండిని 6-8 గంటలు లేదా రాత్రిపూట పులియనివ్వండి. కిణ్వన ప్రక్రియ పిండికి కొంచెం లూజ్‌నెస్ తెస్తుంది.మీడియం వేడి మీద భారీ అడుగు ఉన్న పాన్ లేదా కడాయిని వేడి చేయండి. ఒక టేబుల్‌స్పూన్ నూనె వేసి, చుట్టూ తిప్పండి. ఆ తర్వాత దానిలో గరిటెల పోసి పిండిని పోసి, మందపాటి గుండ్రని ఆకారంలో వేయండి. 4-5 నిమిషాల దిగువన బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాలనివ్వాలి. రోటీని జాగ్రత్తగా తిప్పి, మరొక వైపు కూడా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి. ఇక్కడ దిబ్బరొట్టి రుచిగా వచ్చేలా అంచుల చుట్టూత కొద్దిగా నూనె జోడించాలి. దీన్ని చట్నీ, సాంబార్‌తో కలిపి తింటే ఆ రుచే వేరేలెవెల్..!(చదవండి: నీరజ్ చోప్రా ఫిట్నెస్ రహస్యం ఇదే..!) -
Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్!
ఓట్స్, పొటాటోలు కలిపి తయారుచేసే చీజ్ బాల్స్ వంటకంతో ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. ఈ వంటకంలో పుష్కలమైన పోషకాలు ఇమిడి ఉంటాయి. ఇక వంటకాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం..కావలసినవి..ఉడికించి చిదిమిన బంగాళాదుంప – 2 కప్పులు;ఓట్స్ – కప్పు;చీజ్ తురుము – కప్పు;ఉల్లిపాయ తరుగు – పావు కప్పు;కొత్తిమీర – పావు కప్పు (తరగాలి);మిరప్పొడి– అర టీ స్పూన్;చాట్ మసాలా– అర టీ స్పూన్;ఉప్పు – రుచికి తగినంత;నూనె – టేబుల్ స్పూన్.తయారీ..– ఓట్స్‌ను బాణలిలో నూనె లేకుండా మీడియం మంట మీద ఒక మోస్తరుగా వేయించి, పొడి చేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో చిదిమిన బంగాళాదుంప, ఓట్స్ పొడి, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, మిరప్పొడి, ఉప్పు వేసి కలపాలి.– మొత్తం చపాతీ పిండిలా ముద్దగా తయారవుతుంది. ఈ ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో బాల్స్ చేసుకోవాలి.– ఒక్కో బాల్ని అరచేతిలో వేసి కొద్దిగా ఫొటోలో కనిపిస్తున్న ఆకారంలో వత్తాలి.– ఆపం పెనం లేదా కొంచెం గుంటగా ఉన్న పెనాన్ని వేడి చేసి కొద్దిగా నూనె రాసి ఒక్కో బాల్ని పెనం మీద అమర్చి మంటను మీడియంలో పెట్టాలి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత మెల్లగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి.– ఈ చీజ్ బాల్స్‌ని వేడిగా ఉన్నప్పుడే కెచప్ లేదా సాస్‌లతో వడ్డించాలి.గమనిక: పిండిలో కలిపిన చీజ్ కరిగి బయటకు వస్తుంది. కాబట్టి నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. పెనం మాడుతున్నట్లనిపిస్తే చీజ్ బాల్స్ కాలుతున్నప్పుడు పై నుంచి కొద్ది చుక్కలు నూనె వేయవచ్చు.పోషకాలు: పై కొలతలతో చేసిన చీజ్ బాల్స్‌లో 150 కేలరీలుంటాయి. కార్బొహైడ్రేట్లు 25 గ్రాములు, ప్రోటీన్లు– 6 గ్రాములు, ఫ్యాట్– 7 గ్రాములు, ఫైబర –3 గ్రాములు, క్యాల్షియం– 100 మిల్లీ గ్రాములు, ఐరన్– 1.5 మిల్లీ గ్రాములు– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్, వెల్నెస్ కోచ్ -
బెల్లం ఇడ్లీని.. ఎప్పుడైనా తిన్నరా! ఆ టేస్టే వేరు..
ఎప్పుడైనా ఈ వంటకాలను తిని చూశారా..!? తిన్నారంటే వాహ్.. అనాల్సిందే..! ఇంకెందుకు ఆలస్యం.. వాటి తయారీ విధానాలను చూద్దాం..బెల్లం ఇడ్లీ..కావలసినవి:ఇడ్లీ బియ్యం – 2 కప్పులు,మెంతులు – పావు టీ స్పూన్,మినప్పప్పు – పావు కప్పు,బెల్లం – ఒకటిన్నర కప్పులుఉప్పు – తగినంత,శనగపప్పు,కొబ్బరి ముక్కలు – 4 టేబుల్ స్పూన్ల చొప్పున,ఏలకుల పొడి – 1 టేబుల్ స్పూన్,నెయ్యి – కొద్దిగాతయారీ..– ముందురోజు రాత్రి ఇడ్లీ బియ్యం, మెంతులు ఒక బౌల్లో, మినప్పప్పు ఒక బౌల్లో నానబెట్టి.. వేరువేరుగా మిక్సీ పట్టి.. ఒక బౌల్లోకి వేసుకోవాలి.– ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక పెద్ద బౌల్లో వేసుకుని.. బాగా కలిపి 8 గంటల పాటు పక్కనపెట్టుకోవాలి.– మరునాడు ఉదయాన్నే ఇడ్లీ పెట్టుకునే గంట ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి.– ఈలోపు బెల్లంలో 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసి.. పాకం పట్టుకుని ఉంచుకోవాలి.– అనంతరం మినప్పప్పు – ఇడ్లీ పిండి మిశ్రమాన్ని మరోసారి బాగా కలిపి.. తగినంత ఉప్పు, ఏలకుల పొడి వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి.– అనంతరం వడకట్టు అడ్డం పెట్టుకుని.. బెల్లం పాకం అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి.– తర్వాత ఇడ్లీ రేకులకు నెయ్యి రాసి, కొంత శనగపప్పు, కొన్ని కొబ్బరి ముక్కలను ప్రతి గుంతలో వేసుకుంటూ.. దానిపైన కొద్ది కొద్దిగా ఇడ్లీ పిండిని వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి.– వేడివేడి ఆ ఇడ్లీలపై నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.రైస్ చికెన్ కట్లెట్స్..కావలసినవి:బోన్‌లెస్ చికెన్ – పావు కేజీ (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక తురుములా చేసుకోవాలి)కొబ్బరి పాలు – అర కప్పు,గుడ్లు – 4,బియ్యం – ముప్పావు కప్పు (పిండిలా చేసుకోవాలి),పండు మిర్చి – 2 (పేస్ట్‌లా చేసుకోవచ్చు),కొత్తిమీర – 2 రెమ్మలు (పేస్ట్‌లా చేసుకోవాలి),పంచదార – 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి)టొమాటో గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు,ఉప్పు – తగినంత,నూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి పాలు, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి.– తర్వాత అందులో బియ్యప్పిండి, ఉడికించిన చికెన్ తురుము వేసుకుని మరోసారి కలుపుకోవాలి.– ఆ మిశ్రమంలో పండు మిర్చి పేస్ట్, టొమాటో గుజ్జు, పంచదార, ఉప్పు, కొత్తిమీర పేస్ట్ వేసుకుని.. బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి.– ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న కట్లెట్స్లా చేసుకుని.. బ్రష్‌తో.. ఇరువైపులా నూనె రాసుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి. లేదా – – నూనెలో దోరగా వేయించుకోవచ్చు. నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని.. నచ్చిన చట్నీతో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయివి. -
మన దేశంలో అత్యంత చెత్త వంటకాలు ఇవే..! అందులో ఉప్మా..!
అంతర్జాతీయ సంస్థ టేస్ట్ అట్లాస్ మన దేశంలో చెత్త వంటకాల జాబితాను విడుదల చేసింది. అలాగే మనదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను విడుదల చేసింది. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారాలు, ఇష్టంలేని ఆహారాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. వాటి గురించి వివరాలు సేకరించి... ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను, ఎక్కువ మంది తినడానికి ఇష్టపడని వంటకాల జాబితాను సిద్ధం చేస్తుంది ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ. టేస్ట్ అట్లాస్ అనేది ఆన్లైన్ ఫుడ్ పోర్టల్. ఇది ప్రపంచంలోని బెస్ట్ వంటకాలు, బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ప్రకటిస్తుంటుంది. అలానే తాజాగా మనదేశంలో ఎక్కువశాతం ప్రజలు ఇష్టపడే వంటకాలు, ఇష్టపడని వంటకాల గురించి టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్ పదిలో ఉన్న చెత్త , ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల వివరాలను వెల్లడించింది. చెత్త వంటకాలు ఇవే…టేస్ట్ అట్లాస్ జాబితా ప్రకారం చెత్త రేటెడ్ ఫుడ్స్ ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వేసవిలో ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడే జల్జీరా… ఈసారి చెత్త వంటకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర భారతదేశంలో ఈ పానీయాన్ని విపరీతంగా తాగుతారు. అలాంటిది మనదేశంలోని చెత్త వంటకాల జాబితాలో మొదటి స్థానంలో నిలవడం షాక్‌కి గురిచేస్తుంది. చెత్త వంటకాల్లో రెండో స్థానంలో శీతాకాలంలో అతిగా తినే గజ్జక్ ఉంది. మూడో స్థానంలో దక్షిణ భారత వంటకం తెంగై సదం, నాలుగో స్థానంలో ఒడిశాకు చెందిన ప్రసిద్ధ పంతా బాత్, ఐదో స్థానంలో ఆలూ వంకాయ కర్రీ, ఆరో స్థానంలో తండాయ్ ఉన్నాయి. దీని తరువాత, కేరళ వంటకం అచ్చప్పం ఏడవ స్థానంలో, ప్రసిద్ధ హైదరాబాదీ మిర్చి కా సలాన్ ఎనిమిదో స్థానంలో, తీపి వంటకం మల్పువా తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక దక్షిణ భారతదేశంలో అల్పాహారంలో అధికంగా తినే ఉప్మా పదో స్థానంలో నిలిచింది. ఉప్మాను అధికంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తింటారు.బెస్ట్ ఫుడ్ ఇవే..మనదేశంలో బెస్ట్ ఫుడ్ జాబితాలో ఏ ఆహారాలు నిలిచాయో టేస్ట్ అట్లాస్ వివరించింది. ఆ ఫుడ్ లిస్ట్‌లో ఉన్న రుచికరమైన మామిడి లస్సీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మసాలా చాయ్ రెండో స్థానంలో, బటర్ గార్లిక్ నాన్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగో స్థానంలో అమృత్ సర్ కుల్చా, ఐదో స్థానంలో బటర్ చికెన్, ఆరో స్థానంలో హైదరాబాదీ బిర్యానీ, ఏడో తేదీన షాహి పనీర్, ఎనిమిదో స్థానంలో అందరికీ ఇష్టమైన చోలే భటురే నిలిచాయి. ఆ తర్వాత తందూరీ చికెన్ తొమ్మిదో స్థానంలో, కోర్మా పదో స్థానంలో నిలిచాయి. సాధారణంగా హైదరాబాదీ బిర్యానీ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ ఈసారి బిర్యానీ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.టేస్టీ అట్లాస్ నిర్వాహకులు తమ పోర్టల్‌లో ఎవరికి ఏ ఆహారం అధికంగా నచ్చుతుందో, ఏ ఆహారం నచ్చదో చెప్పమని అడుగుతారు. మనదేశంలోని ఎవరైనా ఆ పోర్టల్ రెస్పాండ్ కావచ్చు. ఈ సర్వేలో పాల్గొన వచ్చు. ఆ విధంగా ఎక్కువ ఓట్లు పడిన వంటకాల జాబితాను సిద్ధం చేసి విడుదల చేస్తారు.(చదవండి: ఎలాంటి ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటారు? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ది బెస్ట్ మ్యాంగో రెసిపీల్లో మామిడి చట్నీ ఎన్నో స్థానం అంటే..!
పండ్లలో రారాజు మామిడి పండు. దీనితో చాలా చోట్ల పలు రకాల రెసీపీలు, స్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే మామిడి తాండ్ర వంటి వివిధ రకా స్వీట్లను తయారు చేస్తారు. ఇక కొన్ని చోట్ల చట్నీలు, డిజర్ట్లు చేస్తుంటారు. అలాంటి భారతీయ వంటకాలన్నింటికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ కర్రీ, బెస్ట్ డిజార్ట్ వంటి ర్యాకింగ్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈసారి మ్యాంగోతో తయారు చేసే ఉత్తమ వంటకాల జాబితా ఇచ్చింది. వాటిలో రెండు భారతీయ వంటకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అవి రెండు తొలి టాప్ 10 జాబితాలోనే ర్యాంకులు పొందాయి. ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లలో రుచికరమైన వంటకంగా పేరుగాంచిన ఆమ్రాస్ తొలి స్థానం నిలిచింది. ఇది ప్యూరీ విత్ మ్యాంగో జ్యూస్‌తో తయారు చేస్తారు. ఈ జ్యూస్‌ని పొడి అల్లం లేదా ఏలుకులతో జత చేసి కూడా తయారు చేస్తారు. ఈ జాబితాలోనే భారతీయ మామిడి చట్నీ కూడా ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ చట్నీని దాల్చిన చెక్కలు, యాలకులు, బ్రౌన్ షుగర్, వెనిగర్ వంటి వాటితో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చట్నీ తయారీలో కొద్దిపాటి వైవిధ్యాలు కూడా ఉన్నాయి. ఇక ది బెస్ట్ మ్యాంగో రెసీపీల జాబితాలో థాయిలాండ్‌కు చెందిన మ్యాంగో స్టిక్కీ రైస్ రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి టేస్ట్ అట్లాస్ ఇచ్చిన వరల్డ్‌లోనే 50 బెస్ట్ మ్యాంగో రెసీపీలలో భారతీయ మామిడి వంటకాలే తొలి పది స్థానాల్లో నిలవడం విశేషం.(చదవండి: ఆ సమస్యలు ఉంటే.. పెరుగుతో ఈ ఆహారాలు జత చెయ్యొద్దు!) -
చింత చిగురు తోడైతే.. చింత లేని వంట!
సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి... సీజనల్ వెజిటబుల్స్ ఉంటాయి. అలాగే సీజనల్ ఆకులూ ఉంటాయి...చింతచిగురు నోరూరిస్తోంది. ఎప్పుడూ చింతచిగురు పప్పేనా! ఈ సారి ఇలా ట్రై చేద్దాం. ఓ పచ్చడి... ఓ పొడి... ఓ అన్నం... ఓ కూర. వెరైటీగా ఏం వండాలా అనే చింత వద్దు. చింత ఉంది చిరుపుల్లగా... జిహ్వకు హితవుగా.చింతచిగురు కొబ్బరి పచ్చడి..కావలసినవి..చింత చిగురు – 2 కప్పులు (శుభ్రంగా కడగాలి);పచ్చి కొబ్బరి ముక్కలు – కప్పు;పచ్చిమిర్చి – 2;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పోపు కోసం..ఆవాలు – అర టీ స్పూన్;ఇంగువ – చిటికెడు;కరివేపాకు – 2 రెమ్మలు;మినప్పప్పు – అర టీ స్పూన్;ఎండుమిర్చి – 2;నూనె – అర టీ స్పూన్;తయారీ..కొబ్బరిముక్కలు, చింతచిగురు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.చిన్న పాత్రలో నూనె వేసి చిన్న మంట మీద వేడి చేసి అందులో ఆవాలు వేసి అవి వేగిన వెంటనే ఎండుమిర్చి (విరిచి ముక్కలు చేసి వేయాలి), మినప్పప్పు వేసి ఎర్రగా వేగిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.పోపును స్పూన్‌తో కలిపి అందులో మిక్సీలో గ్రైండ్ చేసిన కొబ్బరి పచ్చడి వేసి కలపాలి.ఘుమఘుమలాడే కొబ్బరి పచ్చడి రెడీ.ఇది ఇడ్లీ, దోశెలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.చింత చిగురు పొడి..కావలసినవి..చింత చిగురు – కప్పు;ఎండుమిర్చి – 7 లేదా 8;ఎండు కొబ్బరి – అర చిప్ప;వెల్లుల్లి రేకలు – 4;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;తయారీ..చింత చిగురును మంచినీటితో శుభ్రం చేసి నీడలో ఆరబెట్టాలి.స్టవ్ మీద మందపాటి బాణలి వేడి చేసి సన్నమంట మీద చింత చిగురులో తేమ పోయే వరకు వేయించాలి.వేగిన ఆకును ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బాణలిలో ఎండుమిర్చి, కొబ్బరి వేసి వేయించాలి.అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం పలుకుగా గ్రైండ్ చేయాలి.ఉప్పు, వెల్లుల్లి వేసి మరో రౌండ్ గ్రైండ్ చేస్తే చింత చిగురు పొడి రెడీ.వేడి అన్నంలో చింతచిగురు పొడి, నెయ్యి కలుపుకుంటే రుచి అమోఘం.ఇడ్లీ, దోశెల్లోకి కూడా బాగుంటుంది.ఈ పొడిని గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే పది రోజుల వరకు తాజాగా ఉంటుంది.ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. -
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ దరిచేరవు. పైగా వ్యాధులు తగ్గుముఖం పట్టడమే కాకుండా మళ్లీ తలెత్తవట. ముఖ్యంగా విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, క్షయ, కొవ్వు, అమిత వేడి తగ్గిపోయి శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఉంది. అంతేగాదు స్వర్గంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవ౦తుడు సృష్టించాడని ఆ గ్రంథం చెబుతోంది. అలాంటి మజ్జిగని ఈ వేసవిలో తాగుతుంటే వడదెబ్బ కొట్టదట. పైగా మహాభారత కాలం నుంచే వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు ఈ మజ్జిగతో రకరలా పానీయాలు తయారు చేసుకుని తాగేవారట. అవేంటో చూద్దామా..!'కూర్చిక' పానీయం: ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని ‘కూర్చిక’ అంటారు. ఇందులో పంచదార గానీ, ఉప్పు గానీ కలపకుండానే తాగవచ్చు. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ కూర్చికను తాగినప్పుడల్లా అందులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే వడదెబ్బ కొట్టదు, పైగా పేగులకు బలాన్నిస్తు౦ది. అంతేగాదు జీర్ణకోశ వ్యాధులన్నింటికీ మేలు చేస్తు౦ది. అలాగే వేసవిలో వచ్చే జలుబుని నివారిస్తు౦ది.'రసాల' పానీయం:పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన 'రసాల' అనే పానీయాన్ని భీముడు తయారు చేశాడని భావప్రకాశ వైద్య గ్ర౦థంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట!. ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థ౦ ఇచ్చిన విందులో 'రసాల' కూడా ఉంది. ఎలా చేస్తారంటే..?బాగా కడిగిన ఒక చిన్న కుండ లేదా ముంత తీసుకోండి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రెండుమూడు పొరల మీద వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ) కట్ట౦డి. ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “పంచదార” కలిపి, ఈ మిశ్రమాన్ని చల్లకవ్వంతో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్టండి.పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్రంలోంచి క్రి౦ది ముంతలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా వాడుకోండి. ఈ రసాల పానీయం తయారీకి దీంతో పనిలేదు. ముంతలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని ద్రప్యం అంటారు. ఈ ద్రప్యం నిండా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి. అవి పేగుల్ని స౦రక్షించి జీర్ణాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టింపు కొలతలో తీసుకొని ముంతలోని పెరుగు నీళ్ళతో కలప౦డి. చల్లకవ్వంతో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అందులో ఏలకుల పొడి, లవంగాల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, మిరియాల పొడి కలపండి. ఈ కమ్మని పానీయమే రసాల!.దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.తేటతో కూడా..ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమానంగా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా! శొంఠి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చాలా స్వల్పంగా పచ్చకర్పూరం” వీటన్నింటిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ రసాలలో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మజ్జిగ మీద తేటలో కేవలం ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉంటాయి. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి, చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట. ఇది ”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారికి కూడా ఇవ్వదగిన పానీయం. వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది. వడ దెబ్బ తగలనీయదు. శరీరంలో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణం శక్తినిస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తుంది. పెరుగు మీద తేట, వైద్యపరంగా, చెవులను బలసంపన్నం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చెవిలో హోరు(టినిటస్), చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు (వెర్టిగో)లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పని చేస్తు౦దన్నమాట.తేమనం..తేమనం అనేది శ్రీనాథుడి కాలంలో ప్రసిద్ధి చె౦దిన వంటకమే!. దీన్ని తిపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తయారు చేసుకొంటారు. ఈ మజ్జిగలో పాలు, బెల్లం, తగినంత చేర్చి, ఒక పొంగు వచ్చే వరకూ కాచితే అది “తేమనం” అనే తెలుగు పానీయంగా తయారవుతుంది. ఇది వేసవి పానీయాలలో మేలైన పానీయం. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. చల్లారిన తరువాత త్రాగటం మంచిది. దీన్ని తీపి మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తారు.మజ్జిగమీద తేట:మజ్జిగ మీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొంతుల వరకూ నీళ్ళు కలిపి రెండు గంటలు కదల్చకుండా ఉంచండి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొంటుంది. మజ్జిగ తేటను వంచుకొని మళ్ళీ నీళ్ళు పోయండి. ఇలా ప్రతి రెండు మూడు గంటల కొకసారి మజ్జిగ నీళ్ళు వంచుకొని వేసవి కాలం అంతా మంచి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. ఎండల్లో బయటకు వెళ్ల వలిసి వస్తే చిలికిన మజ్జిగలో నిమ్మకాయి, ఉప్పు వేసుకుని తాగండి. అవసరమయ్యితే ఓ బాటిల్ నిండా వేసుకుని తీసుకువెళ్లండి. లేదా తిరిగి ఇంటికి వచ్చాక మరొక్కసారి తాగండి వడదెబ్బ కొట్టదు.(చదవండి: సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!) -
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఎన్నో రకాల రెసిపీలు గురించి విని ఉంటారు. అత్యంత వ్యవధి తీసుకున్న రెసీపీలు కూడా చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా కఠినమైన రెసిపీ గురించి మాత్రం విని ఉండదరు. అయితే దీనిని వేటితో తయారు చేస్తారో వింటే మాత్రం కంగుతింటారు. ఏదో మాట వరసకు మంచి జీర్ణశక్తి గలవారిని రాళ్లను హరాయించుకోగలరు అంటారు గాని, ఎంతటి జీర్ణశక్తిమంతులకైనా ఈ వంటకాన్ని ఆరగించడం సవాలే! ‘సువోడియు’ అనే ఈ చైనీస్ వంటకంలోని ప్రధాన పదార్థం నది ఒడ్డున దొరికే నున్నని గులకరాళ్లే! గులకరాళ్లను మూకుడులో వేసి, బాగా వేయించి, వాటికి వెల్లుల్లి, మిరపకాయలు సహా రకరకాల మసాలాలు జోడించి తయారు చేస్తారు. కాస్త జారుగా సూప్‌లా ఉండే ఈ వంటకాన్ని కొన్ని శతాబ్దాల కిందట నది మధ్యలో చిక్కుకుపోయిన ఓడ సరంగులు కనిపెట్టారట! ఈ వంటకంలోని సూప్‌లాంటి జారుడు ద్రవాన్ని జుర్రుకుని, ఇందులోని రాళ్లకు పట్టిన మసాలాలను నిదానంగా చప్పరించి, ఆనక ఆ రాళ్లను ఊసేయాలి. నిజానికి ఈ వంటకాన్ని ఆరగించడమే ఒక కళ! ‘సువోడియు’ చైనాలో చాలా చోట్ల వీథుల్లో అమ్ముతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకంగా గుర్తింపు పొందింది. (చదవండి: ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!) -
'పఖాలా'తో వేసవి తాపం పరార్!
ఒడియా ప్రజల సంప్రదాయ వంటకం పఖాలా. ఈ వంటకం కోసం ప్రత్యేక రోజు కూడా ఉంది. ఆ రెసీపీ పేరుతోనే ప్రతి ఏటా మార్చి 20న 'పఖాలా దిబాసా' అనే దినోత్సవాన్న ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఒడియా ప్రజలంతా ఆ వంటకాన్ని వివిధ పద్ధతుల్లో తయారు చేసుకుని ఆస్వాదిస్తారు. అంతేకాదు పూరీ జగన్నాథుడికికి నైవైద్యంగా ఈ వంటకాన్నే పెడతారు కూడా. ఇంతకీ ఏంటా ప్రత్యేకమైన వంటకం? ఎలా తయారు చేస్తారు. ఆ వంటకం పేరు 'పాఖాల భాటా(పఖాలా భాటా)'. దీన్ని 'పఖాలా' లేదా 'పాఖాలా' అని పిలుస్తారు ప్రజలు. ఇది ఒడిశా సంప్రదాయ వంటకం. ఈ వంటాకాన్ని వండిన అన్నంలో కడిగినా లేదా నీటిలో తేలికగా పులియబెట్టి తయారు చేస్తారు. దీన్ని పప్పు తప్పించి వివధ రకాల కూరలతో నొంచుకుని తింటారు. ఇది వేసవిలో తాపాన్ని హరించే ఒరిస్సా సంప్రదాయ వంటకం. అయితే ఒడిస్సాలో ఈ వంటకాన్ని 10వ శతాబ్దం నుంచి పూరీకి చెందిన జగన్నాథుడికి నైవైద్యంగా పెట్టే రెసిపీలో దీన్ని కూడా చేర్చారు. ఈ వంటకాన్ని నేపాల్, మయాన్మార్ ప్రజలు కూడా తినడం విశేషం. నిజానికి ఈ వంటకం ఎలా వచ్చింది అంటే..ఒడిశాలో కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండేది. ఆ టైంలో ఇలా పులియబెట్టిన వంటకం ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుబాటులో ఉన్నవాటితోనే ఇలా బలవర్థకమైన వంటకాన్ని అక్కడి ప్రజలు తయారుచేసుకుని తినేవారు. ఇది వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఎన్నిరకాలు తయారు చేస్తారు.. సజా పఖా (తాజా పఖా): నిమ్మకాయ చుక్కలతో తాజాగా వండిన అన్నం చేసిన తర్వాత తక్షణమే నీటిని జోడించడం ద్వారా తయారుచేస్తారు. ఈ రూపాంతరం కిణ్వ ప్రక్రియ అవసరం లేదు. బాసి పఖా (పులియబెట్టిన పఖాలా): ఒడియాలో బాసి అంటే పాతది అన్నాన్ని పులియబెట్టడం ద్వారా సాధారణంగా రాత్రంతా ఉంచి మరుసటి రోజు తింటారు. ఇది ఒడిశాల్లో ఏళ్లుగా చేసిన సాంప్రదాయ రెసిపి ఇది. దీనికి నిమ్మకాయలు, ఉల్లిపాయాలు, వివిధ కూరగాయాలు జోడించి రకరకాలు తయారు చేయడం ప్రారంభించారు. సాగా భాజా: దీని వేయించిన చేపలు, లేదా కాల్చిన కూరగాయలను వేసి తయారు చేస్తారు. జీరా పఖా: కరివేపాకుతో వేయించిన జీలకర్రను పఖాలో చేర్చి తయారు చేస్తారు దహి పఖా: పెరుగు జోడించి తయారు చేస్తారు. కాలక్రమేణ ఇలా రకరకాల పఖాలాలు వచ్చాయి. ఇది వేసవికాలంలో ఎక్కువగా చేసుకునే వంటకం. వేడిని అధిగమించడంలో సహాయపడే రిఫ్రెష్నిచ్చే వంటకం. శరారానికి చలువ చేస్తుంది. అలాగే దీనిలో జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి తోడ్పడే ప్రోబయోటిక్ సమృద్ధిగా ఉంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకోవడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అంతేకాదండోయ్ ఐదేళ్ల క్రితం ఒడిశా ప్రజలు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకి ఈ సంప్రదాయ రెసిపీతోనే విందు ఏర్పాటు చేశారు. ఈ ఒడిశా దిబాస్ నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆ వీడియోని పంచుకున్నారు. View this post on Instagram A post shared by FOOD IN ODISHA | Odisha food | Odia Cuisine (@foodinodisha) (చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన అడవి పండు! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!) -
దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఒకనొక ఇంటర్వ్యూలో ఈమా దత్షి రెసిపీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. నిజానికి ఈమా దత్షీ రెసిపీ భూటాన్ వంటకం. తన అభిమానులకు ఈ వంటకం గురించి షేర్ చేశారు దీపికా. ఈ రెసిపీ రుచి, తయరీ విధానాల గురించి పంచుకున్నారు. గతేడాది దీపికా ఏప్రిల్ 2023లో భూటాన్ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ ప్రత్యేక భూటాన్ వంటకంపై మనసు పారేసుకున్నానని, ఇప్పుడది తన ఫేవరెట్ డిష్ అని చెప్పుకొచ్చారు ఆమె. ఇంతకీ ఏంటా ఈమా దత్షి రెసిపీ. ఏ కూరగాయాలకు సంబంధించిన వంటకం అంటే.. ఈమా దత్షి అనేధి భూటాన్ జాతీయ వంటకం.దీన్ని పచ్చి ఎర్ర మిరపకాయలు, చీజ్, మిరియాలు, ఉల్లిపాయలు, టొమాటోలతో కలిపి చేసే ఒక విధమైన రెసిపీ. దీన్ని లంచ్ లేదా డిన్నర్ టైంలో కర్రీగా తినదగిన రెసిపీ. దీన్ని ఎవ్వరైనా పదినిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆస్వాదించొచ్చు. ఎలా చేయాలంటే...? టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నల్ల మిరియాలు తదితర పదార్థాలన్నింటిని తీసుకుని వాటిపై కాస్త నూనె పొయ్యండి. పాన్‌లో ఒక కప్పు నీరు పోసి పదార్థాలను బాగా కలపి పెద్దమంటపై ఉంచండి. అలాగే పాన్‌పై మూత పెట్టండి. వేడిని ఎక్కువ పెంచి పది నిమిషాలు ఉడకనివ్వండి. కూరగాయాలు ఉడికన తర్వాత మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది. వెంటనే స్టవ్‌ని మీడియంలో పెట్టి.. కాస్త నెయ్యి, కొద్దిగా చీజ్, కొద్దిగా మసాల వంటివి కూడా వెయ్యండి. అంతే ఈమా దత్షి రెడీ. ఇది అన్నం లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. జొంగ్ఖా భాషలో ఈమా అంటే మిరపకాయ. ఇక దట్షి అంటే చీజ్ అని అర్థం. వాటితో చేసే రెసిపీ కాబట్టి దీన్ని 'ఈమా దత్షి' అని పిలుస్తారు భూటాన్ వాసులు. View this post on Instagram A post shared by Leaping Windows (@leapingwindows) (చదవండి: స్టన్నింగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
అరటి పండ్లు పండిపోతున్నాయని పడేస్తున్నారా?
మనం మార్కెట్ నుంచి అరటి పళ్లు తీసుకుస్తాం. కానీ వాటిని ఉపయోగించే లోపలే పాడేపోతుంటాయి. ఎందుకంటే? అరటిపళ్లు తొందరగా పండి పోతాయి. బాగా పండినవి తినలేం కూడా. వాటిని ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. చూస్తు..చూస్తూ.. పడేయబుద్ధికాక ఓ పక్కా..! మరోవైపు వృధా చేస్తున్నామేమో! అనే ఫీలింగ్‌తో తెగ బాధ పడిపోతుంటా. అందువల్లే చాలామంది అరటిపళ్లను ఇంట్లో జనం ఎక్కువమంది ఉన్నారు, తింటారు అనుకుంటేనే కొంటున్నారు. అలాంటప్పుడు అలా పండిన అరటి పండ్లను పడేయకుండా చక్కగా ఉపయోగించుకునేలా రెసిపీలు చేసుకోవచ్చట. అవేంటో చూద్దామా!. మన వంటకాల్లో పండిన అరటి పళ్లును ఐదు రకాలుగా వాడొచ్చట. అంతేగాదు వాటితో చేసిన రెసిపీలను పిల్లలు పెద్దలు వదలకుండా లాగించేస్తారట కూడా. ఇంతకీ అవేంటంటే. బనానాపూరీలు: ఇది టీ టైం అల్పహారంగా చెప్పొచ్చు. ఇది మంగళూరు వంటకం. మనం ఎప్పటిలా చేసే పూరీలకు విభిన్నంగా మంచి రుచిని అందిస్తాయి ఈ బనానా పూరీలు. గోధుమ పిండిలో వేడి పాలు, పండిన అరటిపండ్లు, సుగంధద్రవ్యాలు కలిపి పూరీల మాదిరిగా చేస్తే వెరైటీ వంటకాన్నీ ఆస్వాదించడమే గాకుండా పండిన అరటిపళ్లను పడేయకుండా చక్కగా ఉపయోగించగలుగుతాం. ఈ వంటకం అన్ని వయసుల వారికి తప్పక నచ్చుతుంది. అరటిపండు రైతా! ఏంటిదీ అరటిపండు రైతా అని భయపడకండి. అదేనండి సలాడ్ మాదిరిగానే ఈ పండిన అరటిపండ్లను చక్కగా పెరుగులో కలిపి, కొద్దిపాటి డ్రైప్రూట్స్ జోడించి చిన్న చిన్న బౌల్లో వేసి అందిస్తే వావ్ అంటూ లాగించేస్తారు. ఇది మార్నిగ్ టైంలో మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీనిలో కాల్షియం, ఫైబర్, పోటాషియం తదితర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పైగా పిల్లలకు మంచి బలం కూడా. బనానా వడలు! ఇది కూడా టీ టైం స్నాక్స్ లాంటివే. అరటికాయ బజ్జీలు విన్నాం కానీ ఇలా అరటిపండ్లతో వడలేంటి అని ఆశ్చర్యపోకండి. పండిన అరటి పండ్లను వడలలో ఉపయోగించడం వల్ల లోపలి తీపి భాగం వడంతటికి స్ప్రెడ్ అయ్యి టేస్టీగా ఉంటుంది. ఇవి క్రంచి క్రంచిగా, టేస్టీగా మంచి ఫీల్‌ని ఇచ్చే స్నేక్స్ అని చెప్పొచ్చు అరటిపండు కొబ్బరి చట్నీ అరటిపండుతో కొబ్బరి చట్నీ ఏంటండీ? అని భయపడకండి. కొబ్బరి అరటితో ఓ క్రీమ్‌లాంటి లిక్విడ్ వస్తుంది. దీనికి కొద్దిగా సుగంధద్రవ్యాలు జోడిస్తే మంచి వాసనతో కూడిన రుచి ఉంటుంది. దీన్ని దోసలు, ఇడ్లీలలో స్వీట్ చట్నీ మాదిరిగా వాడొచ్చు. మన భాషలో చెప్పాలంటే అరటి పండు జామ్ అనుకోండి. ఎలా ఉంటుందా? అని సందేహించొద్దు. ఎందుకంటే? కమ్మటి కొబ్బరితో అరటిపళ్లలోని తీపి కలగలస్తే దాని టేస్టే వేరబ్బా!. ఓసారి ట్రై చెయ్యండి మీకే తెలుస్తుంది. అంతేకాదండోయ్ మెత్తని పండిన అరటిపళ్లతో స్నేక్స్, బ్రేక్‌ఫాస్ట్ వంటివి చేయడం చాలా సులభం. పైగా వివిధర రకాలుగా రెసిపీల రూపంలో చేసిస్తే మన ఇంటిల్లపాదికి సకల పోషకాలను అందించినవారమవుతాం. ఇంకేందుకు ఆలస్యం వృధా చెయ్యకుండా ట్రై చేసి చూస్తారు కదూ!. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
ఈసారి పచ్చి బఠాణీలతో వెరైటీగా ఊతప్పం ట్రై చేయండిలా!
కావలసినవి: పచ్చిబఠాణి – కప్పు సూజీ రవ్వ – కప్పు బియ్యప్పిండి – మూడు టీస్పూన్లు పచ్చిమిర్చి – మూడు అల్లం – అరంగుళం ముక్క కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు జీలకర్ర – టీస్పూను పెరుగు – అరకప్పు వంటసోడా– 1/2 టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా నూనె – ఊతప్పం కాల్చడానికి తగినంత. తయారీ విధానం: మిక్సీజార్‌లో పచ్చిబఠాణి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి తగినంత నీటిని వేస్తూ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని సూజీ రవ్వ, బియ్యప్పిండి, గ్రైండ్ చేసిన బఠాణి పేస్టు, పెరుగు కలిపి నానబెట్టాలి. అరగంట తరువాత రుచికి సరిపడా ఉప్పు, వంటసోడా, కొద్దిగా నీళ్లు పోసుకోని గరిట జారుడుగా కలుపుకోవాలి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె వేసి రెండు గరిటలు పిండి వేసి రొట్టెలా వేసుకోవాలి. దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి. ఓ నిమిషం తర్వాత మూత తీసి ఊతప్పాన్ని తిరగేసి మరో అర స్పూన్ నూనె వేసి రెండోవైపు కూడా కాల్చుకుంటే గ్రీన్‌పీస్ ఊతప్పం రెడీ. చట్నీ, సాంబార్‌తో చాలా బావుంటుంది. (చదవండి: టేస్టీగా పొటాటో స్టఫ్ చపాతీలు చేసుకోండిలా..!) -
నోరూరించి ఉసిరితో మెంతి కుర్మా చేయండి ఇలా!
కావలసినవి: ఉసిరి కాయలు – పది మెంతిఆకు –రెండు కట్టలు పచ్చిమిర్చి – రెండు అల్లం – అంగుళం ముక్క వెల్లుల్లి రెబ్బలు – ఐదు ఉల్లిపాయలు – రెండు టొమాటోలు – రెండు నూనె – రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అర టీస్పూను సోంపు – అర టీస్పూను వాము – టీస్పూను ఇంగువ – చిటికెడు పసుపు – అర టీస్పూను గరం మసాలా – టీస్పూను ధనియాల పొడి – టీస్పూను జీలకర్ర – టీస్పూను కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. ఉడికిన తర్వాత గింజలు తీసేసి, పెద్దసైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిని సన్నగా తరగాలి. మెంతిఆకును కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నూనెవేసి వేడెక్కనివ్వాలి. నూనె కాగిన తరువాత, మీడియం మంట మీద ఉంచి..జీలకర్ర, సోంపు, వాము వేయాలి. ఇవి చిటపటలాడాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గనియ్యాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత టొమాటో ముక్కలు కొద్దిగా నీళ్లుపోసి మూతపెట్టి మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తరువాత మూత తీసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు మగ్గిన తరువాత టొమాటో ముక్కలు చక్కగా మెత్తబడతాయి. ఇప్పుడు మెంతిఆకు తరుగు వేసి కలపాలి. సన్నని మంట మీద కలుపుతూ ఉంటే మెంతిఆకు ఇట్టే మగ్గిపోతుంది మెంతిఆకు మగ్గిన తరువాత గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడులు వేయాలి. వెంటనే ఉసిరికాయ ముక్కలను వేసి మసాలాలు ముక్కలకు పట్టేలా కలపాలి. చివరిగా రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనిస్తే మెంతి ఉసిరి కుర్మా రెడీ. చపాతీ, రోటీ, అన్నం, సలాడ్లోకి ఈ కుర్మా మంచి కాంబినేషన్. (చదవండి: -
వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!
ఫిష్ కేకు తయారీకి కావాల్సినవి: శుభ్రం చేసిన చేప ముక్కలు – మూడు కప్పులు(చర్మం, ముల్లు తొలగించి చిన్న ముక్కలు చేయాలి) బ్రెడ్ ముక్కల పొడి – అరకప్పు నూనె – టేబుల్ స్పూను స్ప్రింగ్ ఆనియన్ తరుగు – కప్పు బంగాళ దుంపలు – రెండు మిరియాల పొడి – రెండు టీస్పూన్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు – అరకప్పు పచ్చిమిర్చి – రెండు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: బంగాళదుంపలను ఉడికించి, తొక్కతీసి చిదుముకోవాలి. చేప ముక్కలను గిన్నెలో వేసి, పచ్చిమిర్చిని తరిగి వేయాలి. స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర తరుగు, చిదుముకున్న బంగాళ దుంపల మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి ముక్కలు పట్టేలా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తరువాత మిశ్రమాన్ని టిక్కీల్లా తయారు చేసుకోవాలి. బ్రెడ్ ముక్కల పొడిలో ఈ టిక్కీలను అద్దాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేకు నూనె రాసి, బ్రెడ్ ముక్కల పొడిలో అద్దిన ఫిష్ కేక్స్‌ను బేకింగ్ ట్రేలో పెట్టి అరగంటపాటు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన ఫిష్ కేక్ రెడీ. (చదవండి: అరటికాయ మంచూరియా టేస్టీగా తయారు చేసుకోండిలా!) -
అరటికాయ మంచూరియా టేస్టీగా తయారు చేసుకోండిలా!
అరటికాయ మంచూరియాకు కావలసినవి: అరటికాయలు – 2 (మెత్తగా ఉడికించి, చల్లారాక తొక్క తీసి, గుజ్జులా చేసుకోవాలి) మైదాపిండి – 4 టేబుల్ స్పూన్లు కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు అల్లం – వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ కారం – 1 టీ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి) పచ్చిమిర్చి – 1 (చిన్నగా తరగాలి) కొత్తిమీర తురుము, కరివేపాకు – కొద్ది కొద్దిగా (అభిరుచిని బట్టి) ఉల్లికాడ ముక్కలు – కొద్దిగా టొమాటో సాస్ – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు చిల్లీసాస్ – 2 టీ స్పూన్లు సోయా సాస్ – 1 టీ స్పూన్ (పెంచుకోవచ్చు) నూనె – సరిపడా ఉప్పు – తగినంత తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటికాయ గుజ్జు, మైదాపిండి, కార్న్ పౌడర్, గోధుమపిండి, అల్లం – వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని.. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో చిల్లీసాస్, టొమాటోసాస్, సోయాసాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు ఉంచాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని.. ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకుని, సర్వ్ చేసుకోవాలి. (చదవండి: స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!) -
నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు!
రొయ్యల పచ్చడికి కావలసినవి: ఎండు రొయ్యలు – కప్పు ఉల్లిపాయ – ఒకటి పచ్చిమిర్చి – ఐదు నూనె – టేబుల్ స్పూను కొత్తిమీర – పావు కప్పు జీలకర్ర – టేబుల్ స్పూను వెల్లుల్లి రెబ్బలు – పది ధనియాల పొడి – టేబుల్ స్పూను కారం – టేబుల్ స్పూను గరంమసాలా పొడి – అరటేబుల్ స్పూను. తయారీ విధానం: రొయ్యల తల, తోక తీసేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన రొయ్యలను ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండాలి∙ ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా తరిగి బాణలిలో వేయాలి∙ పచ్చిమిర్చిని కూడా దోరగా వేయించి తీసేయాలి∙ ఇదే బాణలిలో నూనె వేయాలి. కాగిన నూనెలో పిండిపెట్టుకున్న రొయ్యలను వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి ఇప్పుడు మిక్సీజార్‌లో వేయించిన ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేయించిన రొయ్యలు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే రొయ్యల పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. (చదవండి: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..) -
రొయ్యలతో.. టేస్టీ టేస్టీగా బట్టర్ గార్లిక్ ఫ్రాన్స్ చేయండిలా..!
గ్లారిక్ బటర్ ప్రాన్స్‌కి కావలసినవి: పచ్చిరొయ్యలు – అరకేజీ వెల్లుల్లి రెబ్బలు – ఐదు వెన్న – రెండు టేబుల్ స్పూన్లు నూనె – టేబుల్ స్పూను కారం – టీస్పూను మిరియాల పొడి – అర టీస్పూను నిమ్మరసం – టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు – పావు కప్పు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: రొయ్యలను శుభ్రం చేసి, నాలుగైదు సార్లు కడగాలి. మందపాటి బాణలిలో టేబుల్ స్పూను వెన్న, నూనె వేసి మంటమీద పెట్టాలి. వెన్న కరిగిన వెంటనే కడిగిన రొయ్యలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. ఐదు నిమిషాలు మగ్గిన తరువాత వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేయాలి. రెండు నిమిషాలు తరువాత మిగిలిన వెన్న, కారం నిమ్మరసం వేసి అన్ని కలిసేలా కలపాలి. వెన్న పైకి తేలేంత వరకు వేయించాలి. వెన్న పైకి తేలిన తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి. (చదవండి: ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్ లడ్డూ ట్రై చేయండిలా!) -
ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్ లడ్డూ ట్రై చేయండిలా!
ఓట్స్ లడ్డూకి కావలసినవి: ఓట్స్ – ఒక కప్పు (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి) వేరుశనగలు – అర కప్పు (దోరగా వేయించి కచ్చాపచ్చాగా పొడిలా మిక్సీ పట్టుకోవాలి.. పొట్టు తీసినా తీయకపోయినా పరవాలేదు) బెల్లం తురుము – ఒక కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి) నెయ్యి – సరిపడా డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొన్ని (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి) తయారీ విధానం: ముందుగా చిన్న మంట మీద బెల్లం పాకం పెట్టుకోవాలి. పాకం గమనించుకుని.. దగ్గర పడుతున్న సమయంలో, వేరుశనగల పొడి, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఓట్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: ఎప్పుడైనా పెసలుతో పాలక్ ఇడ్లీ ట్రై చేశారా! ఆరోగ్యాని ఆరోగ్యం..రుచికి రుచి..!) -
వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!
ఎప్పుడు గుడ్డుతో వేసుకునే ఆమ్లెట్ కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించండి. మసాలా వేసి చేసే ఎగ్ ఆమ్లెట్ గురించి తెలిసిందే. అలా కాకుండా అరటిపండుతో అదిరిపోయే రుచితో ఇలా ఆమ్లెట్ వేసుకుని చూడండి. పిల్లలు, పెద్దులు వదిలిపెట్టకుండా తినేస్తారు చూడండి. అయితే దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా!. బనానా ఆమ్లెట్కి కావలసినవి: అరటి పండు – ఒకటి గుడ్లు – రెండు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – టీస్పూను కారం – అరటీస్పూను నూనె – ఆమ్లెట్ వేయించడానికి సరిపడా. తయారీ విధానం: ∙అరటిపండును ముక్కలుగా తరగాలి. మిక్సీజార్‌లో అరటిపండు ముక్కలు, గుడ్ల సొన, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి నురగ వచ్చేంత వరకు గ్రైండ్ చే యాలి. ఇప్పుడు పెనం మీద నూనె వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకోవాలి. సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే బనానా ఆమ్లెట్ రెడీ. (చదవండి: వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్‌కాలా ఎలా చేయాలంటే..) -
వడలు పులుసుపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!
మనం చేసే కొన్ని రెసిపీలు ఎంత బాగా చేసినే ఏదో లోపంతో సరిగా రావు. ఒక్కోసారి బాగా వచ్చిన వంటకం కూడా దెబ్బేస్తుంది. అలాంటప్పుడూ పెద్దలు చెప్పే కొన్ని చిట్కాలు ఫాలో అయితే మన కుటుంబసభ్యులకు ఎలాంటి ఢోకా లేకుండా మంచి రుచికరంగా వండిపెట్టొచ్చు. ఆ వంటింటి చిట్కాలు ఏంటో చూద్దాం!. ఇలా చేయండి.. గోరు వెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారుగంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి. వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. అప్పడాలు, వడియాలు, పల్లీలు, కరివేపాకు వంటివి నూనె ఎక్కువ పీల్చకుండా డీప్‌ఫ్రై చేయాలంటే.. ముందుగా వాటిని ఇనుప జాలీ గరిటలో వేసి గరిటను కాగిన నూనెలో ముంచుతూ పైకి లేపుతూ ఫ్రై చేయాలి. ఇలా చేస్తే నూనె తక్కువగా పీల్చడంతో పాటు క్రిస్పీగా, రుచిగా వస్తాయి. పకోడి, బజ్జీల పిండి కలిపేటప్పుడు పదార్ధాలన్నివేసి కలుపుకున్నాక... చివరల్లో వంటసోడా కలపాలి. ఇలా కలపడం వల్ల బజ్జీలు నూనె తక్కువగా పీల్చడంతోపాటు మంచి రంగులో కనిపిస్తాయి. (చదవండి: పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?) -
ఇవాళే "ఆలూ" డే!.. ఏం చేస్తారో తెలుసా!
బంగాళదుంపలంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు అందరికి బంగాళదుపంతో చేసిన వంటకాలనే ఇష్టపడతారు. ఆ దుంపలతో వెరైటీ రెసీపీలను చేసుకుని మరీ ఆస్వాదిస్తారు చాలామంది. ఏదో ఒక కూరలో ఆ దుంపను యాడ్ చేయకుండా కొందరూ అస్సలు తినరు. అలాంటి బంగాళదుంపల కోసం ఓ రోజుని ఏర్పాటు చేసి మరి సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ రోజంత బంగాళ దుంపలకు సంబంధించిన రెసీపీలు, స్నాక్స్‌తో రకరకాల వంటకాలతో విందులు, దానిలో ఉండే పోషక విలువలు ఆవశ్యకత చాటిచెప్పడం తదితరాలు నిర్వహిస్తారు. ఇంతకీ ఏ రోజు బంగాళదుంపల దినోత్సవం జరుపుకుంటారు. ఎప్పటి నుంచి ఇది మొదలైంది తదితర విషయాలు చూద్దాం!. ఏరోజంటే.. ప్రతి ఏటా ఆగస్టు 19న జాతీయ బంగాళదుంపల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చరిత్ర: దక్షిణ పెరులో బొలీవియాలోని వాయువ్య ప్రాంతాలలో క్రీస్టూ పూర్వం 5 వేల నుంచి 8వేల మధ్య కాలంలో ఈ బంగాళ దుంపలను తొలిసారిగా పండిచారని విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఈ కూరగాయ అనేక దేశాల వరకు విస్తరించిందని అంటున్నారు. ఆ కూరగాయే ఇప్పుడూ అందరూ ఆదరించే ఇష్టపడే వంటకంగా మారింది. దక్షణ అమెరికా నుంచి ఐరోపాకు విస్తరించడమేగాక తదనంతరం వివిధ దేశాల్లోని ప్రాంతాలకు విస్తరించింది. పాన్కేక్ల నుంచి బ్రెడ్ రోల్స్ వరకు బంగాళ దుంపలు చాలా వంటలలో అగ్రస్థానంలో ఉంది. ఇందులో ఉండే పోషకాలు ఒక వ్యక్తికి నెలల తరబడి ఇతర ఆహార పదర్థాలపై ఆధారపడకుండా ఉండేలా శక్తిని ఇస్తుంది. ఎక్కడకి వెళ్లిన ఆహారంలో బంగాళ దుంపతో చేసిన ఏదో ఒక రెసీపి లేకుండా ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో!. అంతలా ప్రజలన మనుసును దోచుకున్నా కూరగాయ బంగాళ దుంప. ఇప్పటికి దీంతో వెరైటీ వెరైటీ రెసీపీ చేస్తునే ఉంటారు పాకశాస్త్ర నిపుణులు. (చదవండి: శనగపిండి మంచిదేనా?..వాటితో చేసే పిండి వంటకాలు తినొచ్చా!) -
శనగపిండి మంచిదేనా?..వాటితో చేసే పిండి వంటకాలు తినొచ్చా!
చెరుపు చేస్తుందా?గోధుమలతో పోలిస్తే శనగపిండిలో క్యాలరీలు తక్కువ... ప్రోటీన్లు ఎక్కువ. అదేవిధంగా శనగపిండిలో ఫోలేట్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియమ్, ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. శనగపిండితో ఆరోగ్య ప్రయోజనాలు... శనగపిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి చాలారకాల అలర్జీలను కలిగించదు. శనగల గ్లైసిమిక్ విలువ తక్కువ. కాబట్టి శనగపిండి వల్ల అంత త్వరగా బరువు పెరగదు. స్థూలకాయం కూడా త్వరగా రాదు. శనగపిండిలో తక్కువ గ్లైసీమిక్ విలువ కారణంగా డయాబెటిస్ రోగులకు ఇదెంతో మంచిది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు గోధుమల కంటే దీనితో చేసిన పరోఠాలూ, రోటీలు తీసుకోవడం మేలు. శనగల్లో నీటిలో కరిగే పీచు ఉండటం వల్ల శనగపిండి వాడేవారి గుండె ఆరోగ్యం దీర్ఘకాలం పాటు బాగుంటుంది. శనగపిండి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. డెర్మటైటిస్ హెర్పిటోఫార్మిస్, కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులు, స్కి›్లరోసిస్, ఆటిజమ్, ఏడీహెచ్‌డీ వంటివాటిని నివారిస్తుంది. ∙శనగపిండిలో గ్రోత్ హార్మోన్స్ ఎక్కువ. అందుకే ఎదిగే పిల్లలకు దీనితో తయారు చేసిన పదార్థాలు పెట్టడం మంచిది. ఇందులోని ఫాస్ఫరస్ వల్ల ఎదిగే పిల్లల ఎముకలు బాగా గట్టి పడతాయి. ∙ఇందులో ఫోలేట్ ఎక్కువగా ఉండటం వల్ల కాబోయే తల్లులు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మహిళలూ దీన్ని వాడటం మేలు. ఇది ఎర్రరక్తకణాలనూ పెంపొందిస్తుంది. ఈ జాగ్రత్త పాటించాలి మరి... శనగపిండి కాస్త కడుపు ఉబ్బరం కలిగిస్తుంది అందుకే మల్టీగ్రెయిన్స్ ఆటాతో కలిపి తీసుకుంటే ఈ పొట్ట ఉబ్బరం వంటివి తగ్గుతాయి. శనగపిండిలో ఉండే ఈ ఒక్క ప్రతికూల అంశం కారణంగా దానితో కలిగే అనేక ప్రయోజనాలను వదులుకోవడం సరికాదు. (చదవండి: యమ్మీ యమ్మీ.. "కుల్ఫీ"ని ఇష్టపడని వారుండరు..ఎలా చేస్తారంటే..!) -
స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ స్వీట్ ఏంటో తెలుసా!
యావత్తు దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. ఈ సెలవురోజును త్రివర్ణ రంగులతో కూడిని తీపి వంటకాలతో మరింత ఆనందంగా వేడుక చేసుకోండి. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఓ ఐకానిక్ వంటకం గూర్చి తెలుసుకుందాం. దీన్ని వారణాసిలోని ఓ ప్రముఖ ఐకానిక్ షాప్ 1939లో తయారు చేసింది. ఆ షాపు వాళ్లు త్రివర్ణ రంగులతో కూడిన బర్ఫీ అనే స్వీట్‌ని దేశభక్తిని రగిల్చేందుకు తయారు చేశారు. అది బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించిందట. దీంతో ఈ స్వీట్ స్వాతంత్య్ర పోరాటంలో ప్రతికగా నిలిచిన ఐకానిక్ వంటకంగా పేరుతెచ్చుకుంది. ఏకంగా వంటకాలతో కూడా బ్రిటీషర్లను గడగలాడించిన ఘనత మన భారతీయులదే. స్వేచ్ఛ కోసం పరితపించిన అలానాటి త్యాగధనులను స్మరించుకుంటూ.. ఈ త్రివర్ణ బర్ఫీ స్వీట్ తయారీ ఎలాగో తెలుసుకుందామా!. తిరంగ్ బర్ఫీ తయారీ విధానం: కావల్సిన పదార్థాలు: పంచదార: వంద గ్రాములు పాలు: రెండు లీటర్లు యాలకుల పొడి - 5 గ్రా నెయ్యి - 50 గ్రా కుంకుమపువ్వు తగ్గింపు (కాషాయం రంగు కోసం) బచ్చలికూర పేస్ట్ (ఆకుపచ్చ రంగు కోసం) తయారీ విధానం: ఒక కడాయి తీసుకుని అందులో పాలు పంచాదార వేసి బాగా మరిగించాలి. సగం వరకు బాయిల్ అయ్యేలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి మిశ్రమం బాగా చిక్కబడుతుందనంగా యాలకుల పొడి వేయండి. ఆ తర్వత దించుకుని ఆ మిశ్రమాన్ని మూడు బాగాలుగా చేసుకుని ఒకదానిలో కుంకుమ పువ్వు రంగను మరొక దానిలో బచ్చలి కూర పేస్ట్‌ను వేయండి. ఇక మిగిలిన మూడో భాగం నెమ్మదిగా పరుచకుని దానిపై ఆ రెండు రంగుల భాగాలను పరుచుకోండి ఆ తర్వాత చక్కటి షేప్‌లో ముక్కలుగా కొయ్యండి. అంతే మదురమైన త్రివర్ణ బర్ఫీ రెడీ. (చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!) -
తోటకూరతో.. హెల్దీగా సమోసా చేసుకోండి ఇలా!
తోటకూర సమోసా కావలసినవి: తోటకూర తురుము – ఒకటిన్నర కప్పులు టొమాటో గుజ్జు – పావు కప్పు (నిప్పులపై కాల్చి, దాన్ని మిక్సీ పట్టుకోవాలి) స్వీట్ కార్న్ – పావు కప్పు (ఉడికించుకోవాలి) తాలింపు సామాన్లు – కొన్ని మైదా పిండి – 2 కప్పులు గోధుమ పిండి – 1 కప్పు. ఉప్పు – సరిపడా, నూనె – తగినంత తయారీ: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, కొద్దిగా ననె, సరిపడా నీళ్లు, ఉప్పు వేసుకుని చపాతీ ముద్దలా చేసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు తాలింపు పెట్టుకుని.. అందులో టొమాటో గుజ్జు, తోటకూర తురుము వేసుకుని చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. మొత్తం దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. అనంతరం చపాతీ పిండిని ఉండల్లా చుట్టుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, చిన్న చిన్న సమోసాల్లా చుట్టుకోవాలి. తర్వాత ప్రతి సమోసాలో.. కొద్దికొద్దిగా తోటకూర మిశ్రమంతో పాటు ఒక టీ స్పూన్ స్వీట్ కార్న్ వేసుకుని.. ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన ననెలో వేయించి తీసి.. సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పిల్లలు ఇష్టపడేలా..చాక్లెట్ పాక్ చేసుకోండి ఇలా..!) -
పిల్లలు ఇష్టపడేలా..చాక్లెట్ పాక్ చేసుకోండి ఇలా..!
చాక్లెట్ పాక్‌కి కావలసినవి: శనగపిండి– ముప్పావు కప్పు కోకో పొడి – పావు కప్పు బెల్లం – కప్పు నీళ్లు – ముప్పావు కప్పు నెయ్యి – ముప్పావు కప్పు పిస్తా పలుకులు – టేబుల్ స్పూను. తయారీ విధానం: శనగపిండి ప్చ వాసన పోయి, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. మందపాటి గిన్నెలో బెల్లం, నీళ్లు వేసి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. శనగపిండి వేగాక కోకో పొడి, నెయ్యి వేసి ఉండలు లేకుండా కలపాలి. పిండి మిశ్రమం వేగాక బెల్లం పాకం పోసి ఉండలు కట్టకుండా తిప్పుతనే ఉండాలి. ఐదారు నిమిషాలు తిప్పాక పిస్తాపలుకులు వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. వెన్న రాసిన ప్లేటులో ఈ వేడివేడి పాకం మిశ్రవన్ని వేయాలి. ఐదు నిమిషాలు ఆరాక నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే చాక్లెట్ పాక్ రెడీ. (చదవండి: ఈ కేక్ చాలా హెల్తీ.. మిల్లెట్స్‌తో చేసుకోండి ఇలా) -
జోరు వర్షంలో..స్వీట్‌కార్న్‌తో వడలు ఇలా ట్రై చేయండి!
చిటపట వర్షంతో వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది. ఈ చలిలో చక్కగా వేడి వేడి పకోడీలు లేదా అప్పుడే కాల్చిన మొక్కజొన్న కంకిలు తింటుంటే సామిరంగా..ప్రాణం భలే హయిగా ఉంటుంది. ప్రస్తుతం ఉరుకులు పరుగులు జీవితం కారణంగా అలాంటి ఆనందాలే మరిచిపోతున్నాం. దీనికి తోడు అందరూ ఉద్యోగాలు, చదువులు పేరుతో పట్టణాల బాటపట్టడంతో..అవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. ఐతే పట్టణాల్లో వాటి ప్లేస్‌లో మార్కెట్లో ఎక్కువగా స్వీట్కార్న్లు వచ్చాయి. కనీసం వీటితో ఈ జోరు వానలో నాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు హాయిగా. ఈ స్వీట్ నాటు మొక్కజొన్నలు స్థానంలో వచ్చిన ఈ స్వీట్ కార్న్లతో అలనాటి ఆ సంతోషాన్ని ఆస్వాదిద్దామా! ఇక ఆలస్యం ఎందుకు వాటితో చేసే స్నాక్ ఐటెం ఏంటో చూసేద్దాం స్వీట్ కార్న్ వడలు తయారీ విధానం కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ పెద్దది-ఒకటి జీలకర్ర- 1 టేబుల్ స్పూన్ ఎండు మిర్చి పొడి-1 టేబుల్ స్పూన్ సెనగపిండి- 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ-1 టేబుల్ స్పూన్ బియ్యపిండి-1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్(సరిపడా) తయారీ విధానం: స్వీట్కార్న్ఉడికించుకుని వలిచి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత పైన చెప్పినవి ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని, రుబ్బిన స్వీట్‌కార్న్ మ్రిమంలో కలుపుకోవాలి. ,రుచికి సరిపడా ఉప్పు వేసి వడలు మాదిరిగా చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి లేదా నాన్‌స్టిక్ పాన్‌లో కొద్ది మోతాదులో ఆయిల్ వేసుకుని డీప్ ఫై చేసుకోవాలి. ఆ తర్వత వాటిని టమాటా, పుదీనా చెట్నీ గానీ, టమాటా కెచప్‌తో గాని తింటుంటే ఆ రుచే వేరబ్బా! (చదవండి: వర్షాకాలంలో వెరైటీగా క్యారెట్ కార్న్ బజ్జీ ట్రై చేయండి) -
మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు
మసాలా మజ్జిగకి కావలసినవి : పెరుగు – ఒకటిన్నర కప్పులు జీలకర్ర పొడి – అరటీస్పూను పుదీనా తరుగు – టేబుల్ స్పూను బ్లాక్ రాక్‌సాల్ట్ – అరటీస్పూను కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను కరివేపాకు తరుగు – అరటీస్పూను మునగాకు పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూను చల్లని నీళ్లు – రెండు గ్లాసులు. తయారీ విధానం: ∙మిక్సీజార్‌లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మునగాకుపొడి, జీలకర్ర పొడి, రాక్‌సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. ∙ఇవన్నీ నలిగిన తరువాత పెరుగు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ∙ఈ మిశ్రమంలో నీళ్లు పోసి కలుపుకుని, దాల్చినచెక్క పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: నోరూరించే మునగ పువ్వుల ఫ్లవర్ ఫ్రై చేసుకోండి ఇలా..!) -
మురిపముగా..మొరింగ్ దోశ చేసుకోండి ఇలా..!
మొరింగా దోశ తయారీకి కావలసినవి : మునగ ఆకులు – రెండు కప్పులు ఇడ్లీ పిండి – రెండు కప్పులు నూనె – మూడు టీస్పూన్లు జీలకర్ర – అరటీస్పూను మిరియాలు – అరటీస్పూను వెల్లుల్లి రెబ్బలు – నాలుగు; ఇంగువ – చిటికెడు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: ∙బాణలిలో రెండు టీస్పూన్లు నూనె వేసి వేడెక్కనివ్వాలి. ∙కాగిన నూనెలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఇంగువ వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ∙ఇవన్నీ వేగాక కడిగి పెట్టుకున్న మునగ ఆకులు వేయాలి. ఆకుల్లోని నీరంతా ఇగిరిపోయాక దించేయాలి. ∙మునగ ఆకుల మిశ్రమం చల్లారాక ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకోవాలి. ∙ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఈ పేస్టుని వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ∙దోశపెనం వేడెక్కిన తరువాత పిండిని దోశలా పోసుకుని, టీస్పూను నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మొరింగాదోశ రెడీ. సాంబార్, కొబ్బరి చట్నీలు దీనికి మంచి కాంబినేషన్. (చదవండి: విదేశీ భోజనంబు.. వింతైన వంటకంబు..) -
నోరూరించే కోకోనట్ ఖీర్ ట్రై చేయండి ఇలా..
కోకోనట్ ఖీర్కి కావలసినవి: చిక్కటి పాలు – 2 కప్పులు (కాచి, చల్లార్చుకోవాలి) కొబ్బరి బొండాం మీగడ – అర కప్పు (ఇందులో కాచి చల్లార్చిన పాలలోంచి పావు కప్పు పాలు కలిపి, మిక్సీ పట్టుకోవాలి) కొబ్బరి కోరు – 1 కప్పు నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు పంచదార – పావు కప్పు ఏలకుల పొడి – పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి) జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, కిస్మిస్ – గార్నిష్‌కి సరిపడా (అభిరుచిని బట్టి, నచ్చినవి మరిన్ని కలుపుకోవచ్చు. అయితే అన్నిటినీ నేతిలో దోరగా వేయించుకోవాలి) తయారీ విధానం: ముందుగా నేతిలో కొబ్బరి కోరు వేసుకుని గరిటెతో దోరగా వేయించుకుని.. అందులో పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన అనంతరం పాలు, కొబ్బరి మీగడ మిశ్రమం వేసుకుని దగ్గరపడేవరకూ తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ వేసుకుని, ఒకసారి కలిపి, చివరిగా ఏలకుల పొడి.. నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడే నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. (చదవండి: ముంజులతో కేక్ చేసుకోండి ఇలా..) -
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 వంటకాలు ఇవే!
-
వెండితెర మీద వంటల రాణి
తర్లా దలాల్ 2013లో మరణించింది. కాని వంట అనేసరికి టీవీ చెఫ్‌గా ఇప్పటికీ ఆమె పేరే గుర్తుకు వస్తుంది. వంటల మీద తర్లా దలాల్ రాసిన 100 పుస్తకాలు దాదాపుకోటి కాపీలు అమ్ముడుపోయాయి. భారతదేశంలో కోటి ఇళ్లల్లో ఆమె రెసిపీలు ఉపయోగించారని అంచనా. వీరుల, ధీరుల బయోపిక్‌లు తయారవుతున్న రోజుల్లో ఒక గొప్ప వంటగత్తె కథ బయోపిక్‌గా రావడం చాలా పెద్ద విషయం. తర్లాగా తెర మీద హ్యూమా ఖురేషి కనిపించనుంది. ఈ సందర్భంగా తర్లా దలాల్ ఘన గతం గురించి కథనం. జీవితంలో ‘రుచి’ కనిపెట్టడం ఒక అదృష్టమే. డబ్బున్నా లేకపోయినా ‘ఆ... ఏదో ఒకటి వండుకుంటే సరిపోదా’ అనుకునేవారికి ఈ కథనం పనికి రాదు. ‘ఏదైనా ఒకటి వండి చూద్దాం’ అనుకునేవారు తర్లా దలాల్‌తో ఇన్‌స్పయిర్ అవుతారు. మన దేశంలో స్త్రీలు కట్టెల పొయ్యిలతో, ఊదుడు గొట్టాలతో ఆ పూట వంటతో సతమతమవుతూ ఉన్న రోజుల్లో అమెరికాలో కొత్త కొత్త వంటలు నేర్చుకుంది తర్లా దలాల్. ఆ తర్వాత ఇండియాకు వచ్చి ఏకంగా వంట పాఠాలే చెప్పింది. అందరూ వంట చేస్తారు. కాని ‘సరిగ్గా’ చేయడం ఎలాగో చెప్పడం ద్వారా ఆమె దేశాన్నే జయించగలిగింది. అందుకే ఆమె కథ ఇప్పుడు సినిమాగా వస్తోంది. చిన్నారి వంట మాస్టర్ తర్లా దలాల్‌కు చిన్నప్పటి నుంచి వంటంటే ఇష్టం. పూణెలో చదువుకునేటప్పుడు 12 ఏళ్ల వయసు నుంచి తల్లికి రోజూ వంటలో సాయం చేసేది. 1956లో ఆమె బిఏ పూర్తి చేసి నళిన్ దలాల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లే ఆమె భవిష్యత్తును నిర్దేశించింది. నళిన్ అమెరికాలో ఎం.ఎస్. చేస్తుండటం వల్ల కాపురం అక్కడే పెట్టాల్సి వచ్చింది. కొత్త దేశం. కావలసినంత సమయం. నళిన్ భోజనప్రియుడు కనుక ఏవైనా కొత్త వంటకాలు ట్రై చేయరాదా అని ఆమెను ఎంకరేజ్ చేశాడు. దాంతో తర్లా రోజుకు రెండు మూడు కొత్త వంటకాలు చేసి భర్తకు పెట్టేది. అతడు పర్ఫెక్షనిస్ట్. అంత సరిగా రాలేదు అని చెప్తే తర్లా మళ్లీ అదే వంటను చేసేది. అనుకున్నది అనుకున్నట్టుగా వండటమే వంట ప్రావీణ్యం అని ఆమె గ్రహించింది. కాని నళిన్ ఆమెను పూర్తిగా మెచ్చుకోవడానికి 9 ఏళ్లు పట్టింది. 9 ఏళ్ల తర్వాత ‘మాస్టర్ ఆఫ్ ఆల్ కూజిన్స్’ అని బిరుదు ఇచ్చాడు. ముంబైలో వంట క్లాసులు ఇండియాకు తిరిగి వచ్చాక 1966లో ముంబైలో వంట క్లాసులు మొదలెట్టింది తర్లా. ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లి కావాలంటే వంట వచ్చి ఉండటం ఒక అవసరంగా భావించేవారు. అందుకని తర్లా క్లాసులకు డిమాండ్ పెరిగింది. ఒక దశలో ‘తర్లా దగ్గర వంట నేర్చుకున్న అమ్మాయికి వెంటనే పెళ్లి జరిగిపోతుంది’ అన్నంత పేరు ఆమెకు వచ్చింది. అదే సమయంలో వంటల పుస్తకాల మీద భర్త దృష్టి మళ్లించాడు. 1974లో ‘ప్లెజెర్స్ వెజిటేరియన్ కుకింగ్’ పేరుతో తర్లా తెచ్చిన పుస్తకం పెద్ద హిట్ అయ్యింది. 1987 నాటికి దేశంలో తర్లా అతి పెద్ద వంటల రచయితగా ఎదిగింది. ఆమె తన పుస్తకాల రాబడి మీద పెద్ద ఆఫీస్ కొనుక్కుంది. ఆ పుస్తకాలు అనేక భాషల్లో ట్రాన్స్‌లేట్ చేసి పబ్లిష్ చేయడానికి సిబ్బందిని పెట్టుకుంది. తర్లా వంటల పుస్తకాలు డచ్, రష్యన్ వంటి విదేశీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. 100 పుస్తకాలు రాసి చరిత్ర సృష్టించింది తర్లా. టీవీ చెఫ్‌గా దేశానికి ఎక్కువగా తెలిసిన పేరు కూడా ఆమెదే. శాకాహారానికి ప్రచారకర్త తర్లా రాసిన పుస్తకాలన్నీ శాకాహారానికి సంబంధించినవే. ఒక రకంగా ఆమె శాకాహారాన్ని ప్రచారం చేసిందని చెప్పాలి. దేశంలో ఎన్నో కుటుంబాలు తర్లా చేసిన శాకాహార వంటకాలను ట్రై చేసి రుచిని పొందాయి. 1988లోనే ఆమె ‘తర్లాదలాల్డాట్కామ్’ వెబ్‌సైట్‌ను తెరిస్తే నెలకు మూడు లక్షల మంది ఆ సైట్‌ను చూడటం రికార్డ్. ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న భారతీయులు ఆ వెబ్సైట్ ద్వారా తర్లా రెసిపీలు చూసి వంటలు చేసుకునేవారు. ఈ మొత్తం కృషికి తర్లాకు 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది. మన దేశీయులకు స్వాదిష్టకరమైన భోజనాన్ని ప్రచారం చేస్తూ 2013లో మరణించింది తర్లా. సినిమా రిలీజప్పుడు మరోసారి తర్లాను తలుచుకుందాం. బాలీవుడ్ సినిమా ఇంటింటికీ తెలిసిన ఈ వంటగత్తెను ఇప్పుడు సినిమాగా ఇంటింటికీ తేనున్నారు బాలీవుడ్లో. హుమా ఖురేషీ తర్లా దలాల్‌గా ‘తర్లా’ అనే సినిమా తర్లా దలాల్ బయోపిక్‌గా మొదలైంది. రోనీ స్క్రూవాలా నిర్మాత. దంగల్, చిచోరే సినిమాలకు రచయితగా పని చేసిన పీయుష్ గుప్తా దర్శకుడు. ‘చిన్నప్పుడు మా ఇంట్లో వంట గదిలో తర్లా దలాల్ పుస్తకం ఉండేది. ఆమె పుస్తకంలో ఉండే మాంగో ఐస్‌క్రీమ్ రెసెపీని చూసి అమ్మ మాకు తయారు చేసి ఇచ్చేది. ఈ సినిమా చేయమని నాకు ఆఫర్ వచ్చినప్పుడు అది గుర్తుకు వచ్చింది. తర్లా పాత్ర చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది నటి హుమా ఖురేషీ. -
Ugadi 2022: పరమాన్నం.. నోరూరించే పూర్ణాలు, భక్ష్యాల తయారీ ఇలా!
శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది.. నేటితో కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. పండుగంటేనే పరమాన్నంతో పాటు భిన్న రుచులను కూడా ఆస్వాదించడం కదా! మరి నోరూరించే ఉగాది రుచుల తయారీ కూడా తెలుసుకుందామా! ఉగాది పచ్చడి : కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు – చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). తయారీ: ∙బెల్లాన్ని తురిమి, అందులో కొద్దిగా నీటిని చిలకరించి పక్కన ఉంచాలి. ∙వేప పువ్వు కాడలు లేకుండా వలిచి పువ్వు రెక్కలను సేకరించి పక్కన ఉంచాలి. ∙మామిడి కాయ మొదలు (సొన కారే భాగం) తీసేయాలి. కాయను నిలువుగా కోసి లోపలి గింజను కూడా తీసేయాలి. ఇప్పుడు మామిడి కాయను తొక్కతోపాటు సన్నగా ముక్కలు తరగాలి లేదా తురిమి బెల్లం నీటిలో వేయాలి. ∙చింతపండు గుజ్జును చిక్కగా రసం తీసి పై మిశ్రమంలో కలపాలి. అందులో పచ్చిమిర్చి తురుము, ఉప్పు, వేప పూత వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా ఉంటుంది. మరింత రుచి కోసం చెరకు ముక్కలు, మిగుల మగ్గిన అరటి పండు గుజ్జు కలుపుకోవచ్చు. ఊరించే ఉగాది రుచులు మామిడికాయ పులిహోర పూర్ణాలు కావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి. ∙మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ∙ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. ∙స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి. ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. పూర్ణాలు కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి. ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ∙నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లుపోసి మూడు విజిల్స్ రానివ్వాలి. ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి. శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి. ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ∙మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ. భక్ష్యాలు కావలసినవి: పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు, బెల్లం తురుము – రెండు కప్పులు, యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు, మైదా – రెండు కప్పులు, గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు, నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు, ఉప్పు – చిటికెడు. తయారీ: ∙ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు. ∙ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి. ∙మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూను నెయ్యి, కప్పు నీళ్లుపోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి. ∙శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ∙మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి. ∙మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి తిప్పి, పదినిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి. ∙ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టే పూరీలా వత్తుకోవాలి. ∙పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. పరమాన్నం కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ: ∙ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ∙ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్‌లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. ∙బెల్లం సిరప్‌లోనే యాలకుల డి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. ∙బెల్లం సిరప్ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పరమాన్నం రెడీ. -
చికెన్ – స్వీట్ పొటాటో కట్లెట్స్ తయారీ విధానం
కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – అర కేజీ (మెత్తగా ఉడికించి.. చల్లారాక తురుములా చిదుముకోవాలి) చిలగడదుంప గుజ్జు (స్వీట్ పొటాటో పేస్ట్), శనగపిండి – పావు కప్పు చొప్పున ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తురుము, కారం, గరం మసాలా – 1 టీ స్పూన్ చొప్పున మిరియాల పొడి – అర టీ స్పూన్ పాలు – 2 టీ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు+3 టేబుల్ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా నీళ్లు – అర కప్పు, ఉప్పు – చిటికెడు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో చికెన్ తురుము, చిలగడదుంప గుజ్జు, శనగపిండి, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తురుము, గరం మసాలా, మిరియాల పొడి, కారం, పావు కప్పు బ్రెడ్ పొడి, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. గారెల పిండిలా కలుపుకోవాలి. అనంతరం ఒక బౌల్లో మిగిలిన బ్రెడ్ పౌడర్, మరో బౌల్లో పాలు, కోడిగుడ్డు వేసుకుని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కట్లెట్స్ ఆకారంలో చేసుకుని.. వాటికి గుడ్డు, పాల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి... నూనెలో దోరగా వేయిచుకోవాలి. -
స్మార్ట్ ప్రెషర్ కుకర్.. బ్లూ టూత్ కనెక్ట్‌తో!
వంటరాకున్నా వండి పెట్టే మెషిన్ ఇంట్లో ఉంటే.. ఆ సౌకర్యమే వేరప్పా అనిపిస్తుంది కదూ! అలాంటిదే ఈ మేకర్ (స్మార్ట్ ప్రెషర్ కుకర్). స్మార్ట్ ఫోన్ లో దానికి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఈ స్మార్ట్ కుకర్కి బ్లూ టూత్ సాయంతో కనెక్ట్ చేసుకోవాలి. 600 వంటలకు పైగా రెసిపీలతో పాటు.. ఎలా చెయ్యాలో దేని తర్వాత ఏం వెయ్యాలో, ఎంత మోతాదులో వెయ్యాలో.. ఇలా అన్నిటినీ వివరించే వీడియోలు అందుబాటులో ఉంటాయి. కొలత కొలిచే కప్పులతో అవసరం లేదు. నాలుగు ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సెన్సార్లు.. పదార్థాలను కచ్చిత పరిమాణంలో కొలుస్తాయి. వండే వంటకాన్ని బట్టి ఎంత వాటర్ అవసరమో కూడా అడిగి తీసుకుంటుంది. దీనికి టైమ్ సెట్ చెయ్యాల్సిన పనిలేదు. టెంపరేచర్ తగ్గించడం, పెంచుకోవడంతో సంబంధం లేదు. దీని మెనులో ప్రతి వారం అదనంగా 5 రెసిపీలు చేరుతూ ఉంటాయి. ప్రెషర్ కుకర్, స్లో కుకర్, స్మార్ట్ కుకర్, స్టీమర్.. ఇలా చాలా రకాలుగా దీన్ని వినియోగించుకోవచ్చు. స్టీమ్ బాస్కెట్, స్టీమ్ ర్యాక్, సిలికాన్ లిడ్ (మూత), ప్రెషర్ లిడ్లతో పాటు రెండు గ్యాస్కట్లూ ఈ కుకర్ తోడుగా లభిస్తాయి. భలే బాగుంది కదూ! ధర 204 డాలర్లు (రూ.15,233) -
రేగు వడియాలు.. ఇలా చేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు!
కావలసినవి: రేగుపండ్లు – యాభై; చింతపండు – నిమ్మకాయంత; రాక్ సాల్ట్ – టేబుల్ స్పూను; బెల్లం – పావు కప్పు; ఎండు మిర్చి – ఆరు; జీలకర్ర – అర టీస్పూను; ఇంగువ – టీస్పూను. తయారీ: ► ముందుగా రేగుపండ్లను తొడిమెలు తీసి శుభ్రంగా కడిగి టవల్‌తో తుడిచి ఆరబెట్టాలి ► ఇప్పుడు రోట్లో ఉప్పు, ఎండు మిర్చి వేసి దంచాలి ► ఇవి సగం నలిగాక జీలకర్ర ఇంగువ, రేగుపండ్లు వేసి దంచాలి ► రేగుపండ్లను కచ్చాపచ్చాగా దంచి, విత్తనాలను తీసివేయాలి. రేగుపండ్ల గుజ్జులో చింతపండు, బెల్లం వేసి దంచాలి. ఈ మిశ్రమాన్ని ఒక కవర్‌పై వడియాలుగా పెట్టుకోవాలి ► వీటిని మంచి ఎండలో ఆరబెట్టాలి. రెండు వైపులా బాగా ఎండిన తరువాత తీసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి నిల్వ చేసుకోవాలి ► నోరు చప్పగా అనిపించినప్పుడు ఈ వడియాలు తింటే పుల్లగా, కారంగా, తియ్యగా తగులుతూ ఎంతో రుచిగా ఉంటాయి. అజీర్తి చేసినప్పుడు, భోజనం సహించనప్పుడు వీటిని చప్పరిస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది. -
నోరూరించే ఫిష్ కట్లెట్ విత్ రైస్, ఆనియన్ చికెన్ రింగ్స్ తయారీ..కొంచెం వెరైటీగా!
చికెన్, చేపలతో ఈ ప్రత్యేక వంటకాలు సరదాగా ట్రై చేయడి.. రుచి కూడా అదిరిపోతుంది. ఆనియన్ చికెన్ రింగ్స్, ఫిష్ కట్లెట్ విత్ రైస్ వెరైటీలతో మీ కుటుంబ సభ్యులకు మరిచిపోలేని ట్రీట్ ఇవ్వండి..! ఆనియన్ చికెన్ రింగ్స్ కావల్సిన పదార్థాలు చికెన్ ఖీమా – పావు కేజీ ఉల్లిపాయలు – రెండు (గుండ్రంగా రింగుల్లా తరగాలి) స్రింగ్ ఆనియన్ కాడలు – రెండు (సన్నగా తరగాలి) వెల్లుల్లి తురుము – టేబుల్ స్పూను కారం – టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా గోధుమ పిండి – కప్పు చీజ్ – అరకప్పు గుడ్లు – మూడు బ్రెడ్ ముక్కలపొడి – ఒకటిన్నర కప్పు ఆయిల్ – డీప్‌ఫ్రై కి సరిపడా తయారీ విధానం ►ముందుగా కడిగిన చికెన్ ఖీమాను ఒక గిన్నెలో తీసుకుని స్ప్రింగ్ ఆనియన్ , వెల్లుల్లి తరుగు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ముంచి పక్కన బెట్టుకోవాలి. ►గుడ్ల సొనను ఒక గిన్నెలో , ప్లేటులో బ్రెడ్ ముక్కల పొడి తీసుకోవాలి. ►ఇప్పుడు ఉల్లిపాయ రింగుల్లో.. కలిపి చికెన్ ఖీమా మిశ్రమాన్ని పెట్టి, మధ్యలో చీజ్ తరుగు పెట్టి గుండ్రంగా వత్తుకోవాలి. ►ఈ ఆనియన్ రింగ్స్‌ను గుడ్డు సొన, బ్రెడ్‌ముక్కల పొడిలో వరుసగా రెండుసార్లు ముంచి, పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ►డీప్‌ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కిన తరువాత..ఆనియన్ రింగ్స్‌ను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించితే ఆనియన్ చికెన్ రింగ్స్ రెడీ. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! ఫిష్ కట్లెట్ విత్ రైస్ కావల్సిన పదార్థాలు బోన్ లెస్ చేపముక్కలు – అరకేజి బియ్యం – ముప్పావు కప్పు గుడ్డు – ఒకటి బ్రెడ్ స్లైసులు – రెండు(నానబెట్టాలి) స్ప్రింగ్ ఆనియన్ కాడలు – నాలుగు కొత్తి మీర తరుగు – అరకప్పు మిరియాల పొడి టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా ఆయిల్ – ఫ్రై కి సరిపడా తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద గిన్నెపెట్టి బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పువేసి నీళ్లను మరిగించాలి. ►నీళ్లు మరిగాక బియ్యం వేసి మెత్తటి అన్నంలా ఉడికించి పక్కనబెట్టుకోవాలి. ►చేపముక్కల్ని ఖీమాలా తరుక్కోవాలి. ఈ ఖీమాలో గుడ్డు సొనను కార్చాలి. తరువాత మిరియాలపొడి, నానబెట్టిన బ్రెడ్, తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి. ►చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని చేప ఖీమా మిశ్రమాన్ని కట్లెట్లా వత్తుకోవాలి. ►బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసి సన్నని మంటమీద, ఒక్కోవైపు పదినిమిషాలు వేయించితే ఫిష్ కట్లెట్ విత్ రైస్ రెడీ. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తో.. -
ఏంటీ....స్నేక్ కేక్ ఆ!
న్యూఢిల్లీ: కేక్‌లంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందరూ రకరకాల కేకులను ఆస్వాదిస్తుంటారు. అంతేందుకు పాకశాస్త్ర నిపుణులు కూడా తమ నైపుణ్యానంతా రంగరించి మరి సరొకొత్త కేకులను సృష్టించడం మనం చూశాం. అదేవిధంగా వారు వివిధ రకాల ప్లేవర్లతో మనకు రకరకాల కేక్‌లను అందిచారు. ఆ ఖరికి వెజ్ కేక్ అంటూ కూడా చాలా వైరైటీలను ఆస్వాదించాం కానీ. (చదవండి: విమానం నడిపిన 84 ఏళ్ల బామ్మ) స్నేక్ కేక్ గురించి ఎప్పుడైన వ్నిన్నారా ? బాబాయో ఏంటి ఇది అని అనుకోకండి. నటాలీ సైడ్‌సెర్ఫ్ అనే ప్రముఖ చెఫ్ రకరకా కేకులు తయారు చేయడంలో పేరుగాంచిని చెఫ్. ఆమె చేసే కేక్‌లన్ని చాలా వైరైటిగానూ రియలస్టిక్‌గా ఉంటాయి అంటారు. బార్బీ బ్మొలాంటివి, సీనరీస్, రకరకాల మొక్కల్లాంటి కేకులను మనం చూసి ఉంటాం. నిజంగా చూస్తే పాము అని అనింపించేలాంటి కేక్ తయారు చేసింది నటాలీ. పైగా దాన్ని చూస్తే ఎప్పుడూ అటాక్ చేద్దామ్మా అన్నంత కోపంగా చూస్తున్న నిజమైన 'పాము' లా ఉందే తప్ప కేక్‌లా లేదు. అంతేకాదు నటాలి వచ్చి ఆ స్నేక్ కేక్‌ని కట్ చేసేంత వరకు కూడా అది చూడంగానే వెన్నలో వణుకు పుట్టించేంత భయంకరమైన పసుపు రంగులో ఉన్న పాములానే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్ష్లల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అమ్మో...... 48 బీర్ గ్లాస్‌లను ఒకేసారి హీరోలా తీసుకెళ్లాడు) View this post on Instagram A post shared by Sideserf Cake Studio (@sideserfcakes) -
బాహుబలి గోల్డ్ మోమోస్.. ధర తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే
ముంబై: మనం రెస్టారెంట్లో వేరైటీ వైరైటీ వంటకాలను సరదాగా ట్రై చేసి చూస్తాం కదా. కానీ ఒక్కోసారి బాగుంటాయి ఒక్కొక్కసారి అబ్బా ఎందుకు ఆర్డర్ చేశామా అని అనిపిస్తుంది. కొన్ని వంటకాలను మనం ట్రై చేయాలన్న కష్టమనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ చూడని వంటకం ఒక కారణం అయితే దాని ధర గురించి కూడా ఆలోచించి మానేస్తాం. అలాంటి కొత్త వంటకం ఒకటి ముంబైలోని మెస్సీ అడ్డా అనే రెస్టారెంట్ పరిచయం చేస్తుంది. (చదవండి: అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్ కాపాడండి) మోమోస్ అనే వంటకాన్ని రకరకాలుగా తయారు చేయడం గురించి వినే ఉంటాం. కానీ మెస్సీ అడ్డా రెస్టారెంట్ మాత్రం అందుకు భిన్నంగా భారీ బాహుబలి గోల్డ్ మోమోలనే సరికొత్త రెసీపీని విక్రయిస్తోంది. పైగా దీనిలో 24 క్యారెట్ల బంగారం కూడా ఉంటుందంట. అంతేకాదు సూమారు 2 కిలోలు బరువు ఉండే ఈ బాహుబలి మోమోస్ ధర రూ.1,299తో అట. అంతే కాదండోయ్ ఒక ఆరెంజ్ మింట్ మోజిటో, రెండు చాక్లెట్ మోమోలు, మూడు చట్నీలు, మాయో డిప్‌తో సర్వ్ చేస్తారు. కానీ గతంలో కూడా దుబాయ్, న్యూఢిల్లీలోనూ బంగారంతో తయారు చేసిన వంటకాలను చూశాం కానీ వాటిన్నంటికంటే భిన్నంగా ఈ ముంబై రెస్టారెంట్ బాహుబలి మోమోస్ అంటూ అత్యంత ఖరీదుతో విక్రయిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఒక్కసారి ట్రై చేయాల్సిందే అని ఒకరు, మరొకరెమో డబ్బు వృధా అంటు రకరకాలు ట్వీట్ చేస్తున్నారు. (చదవండి: వీడియో క్యాసెట్ల స్టోర్) View this post on Instagram A post shared by Disha || Foodblogger/ Chef || (@whatafoodiegirl) -
నోరూరించే ఎగ్ మఫిన్స్, పనీర్ జల్ప్రెజీ తయారీ ఈజీగా ఇలా..
కావల్సిన పదార్థాలు: గుడ్లు – ఆరు, స్ప్రింగ్ ఆనియన్ – ఒకటి, ఉల్లిపాయలు – రెండు, టోపు – ఆరు ముక్కలు, చీజ్ తురుము – అరకప్పు, ఉప్పు – అరటిస్పూను, ఆలివ్ ఆయిల్ – టీ స్పూను. తయారీ విధానం: ►ముందుగా స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ►తరువాత టోపును కూడా క్యూబ్‌లుగా తరగాలి. ►ఒక గిన్నెలో టోపు ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్ తురుము గుడ్లు పగల కొట్టి వేసి కలపాలి. ఉప్పువేసి మరోసారి కలపాలి. ►ఇప్పుడు మఫిన్ ఉడికించే పాత్రకు ఆలివ్ ఆయిల్ రాసి దానిలో ఈ గుడ్ల మిశ్రమాన్ని వేసి ఇరవై నిమిషాలపాటు బేక్ చేస్తే ఎగ్ మఫిన్స్ రెడీ. పనీర్ జల్ప్రెజీ కావల్సిన పదార్థాలు: పనీర్ – పావుకేజీ, క్యాప్సికం – ఒకటి, టొమాటోలు – రెండు, ఉల్లిపాయ – ఒకటి, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, ధనియాలు – టేబుల్ స్పూను, ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – టీ స్పూను, కారం – అర టీస్పూను, పసుపు – అరటీస్పూను, గరం మసాలా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – గార్నీష్కు సరిపడా. తయారీ విధానం: ►ముందుగా పనీర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి వేడినీళ్లలో పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ►క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ►ధనియాలను దోరగా వేయించి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇవి వేగాక క్యాప్సికం, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు సగం వేయాలి. ►ఇవి దోరగా వేగిన తరువాత ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, గరంమసాలా వేసి మీడియం మంటమీద కూరగాయ ముక్కలు రంగు పోకుండా వేయించాలి. ►టొమాటోలు మెత్తబడిన తరువాత పనీర్ ముక్కలు వేసి కలిపి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ►తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పనీర్ జల్ప్రేజీ రెడీ. ఇది నాన్, తందూరీ రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. గార్లిక్ స్మాష్డ్ పొటాటో కావల్సిన పదార్థాలు: బంగాళ దుంపలు – ఆరు, వెన్న – రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా, బరకగా దంచిన ఎండుమిర్చి కారం – టేబుల్ స్పూను, వెల్లుల్లి పొడి – టేబుల్ స్పూను. తయారీ విధానం: ►ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి ఉప్పు కలిపి ఉడకబెట్టి నీళ్లు తీసేసి పక్కనబెట్టుకోవాలి. ►ఉడికించిన బంగాళ దుంప స్మాషర్తో మెత్తగా చిదుముకోవాలి. ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి వేసి కలపాలి. ►ఇప్పుడు ఈ దుంపల మిశ్రమాన్ని సన్నని స్లైసుల్లా చేసి నలభై ఐదు నిమిషాలపాటు బేక్ చేస్తే గార్లిక్ స్మాష్డ్ పొటాటోస్ రెడీ. ఆరెంజ్ క్యాలీఫ్లవర్ కావల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ – పెద్దది ఒకటి బ్యాటర్ కోసం: గోధుమ పిండి – ఒకటింబావు కప్పు, బాదం పాలు – కప్పు, పసుపు – టీ స్పూను, వెల్లుల్లి పొడి – టీస్పూను, ఉప్పు – పావుటీస్పూను. ఆరెంజ్ సాస్: నీళ్లు – ముప్పావు కప్పు, ఆరెంజ్ జ్యూస్ – కప్పు, బ్రౌన్ సుగర్ – ముప్పావు కప్పు, మేపిల్ సిరప్ – ముప్పావు కప్పు, రైస్ వెనిగర్ – రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు, అల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ – టీస్పూను, కార్న్‌స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ►ముందుగా బ్యాటర్కోసం తీసుకున్న పదార్థాలన్నీ కలిపి బ్యాటర్‌ను రెడీ చేసుకోవాలి. ►క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. ఒక్కోముక్కను బ్యాటర్లో ముంచి ముక్కకు పట్టించాలి. ►అన్ని ముక్కలకు బ్యాటర్ పట్టించిన తరువాత ముక్కలను ఇరవై నిమిషాలపాటు బేక్ చేయాలి. ►ఇప్పుడు కార్న్‌స్టార్చ్‌ను నీళ్లల్లో వేసి మందంగా కలుపుకోవాలి. ►స్టవ్ మీద బాణలిపెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత వెల్లుల్లి, అల్లం తురుమును వేసి మూడు నిమిషాలు వేయించాలి.ఇవి వేగాక కార్న్‌స్టార్చ్ మిశ్రమం వేసి కలుపుతూ ఉడికించాలి. తరువాత ఆరెంజ్ సాస్‌కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి ఐదు నిమిషాలపాటు ఉడికిస్తే ఆరెంజ్ సాస్ రెడీ అయినట్లే. ►ఇప్పుడు బేక్ చేసిపెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలను ఆరెంజ్ సాస్‌లో ముంచి మరో పదినిమిషాల పాటు బేక్ చేయాలి. ►ఐదు నిమిషాల తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలను మరోవైపు తిప్పి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు బేక్ చేస్తే ఆరెంజ్ క్యాలీఫ్లవర్ రెడీ. -
వాన చినుకులు కాదు... నూనె చినుకులు
ఆకాశమంతా మబ్బు ముసిరితే నేల తల్లి నాలుక మీద వర్షపు చినుకులు కురుస్తాయి... మరి మన నోటికి రుచి మబ్బులు ముసిరితే... నూనెలో వేయించిన వంటకాలతో నాలుక మీద చినుకులు కురిపించాల్సిందే.. ఈ వంటకాలు ప్రయత్నించి, రుచి చూడండి... వాన చినుకులు కాదు... నూనె చినుకులు రుచిగా ఉన్నాయి అనకుండా ఉండలేం. పొటాటో లాలీపాప్ కావలసినవి: బంగాళ దుంపలు – 2 (ఉడికించి, తొక్క తీసి మెత్తగా చేయాలి); బ్రెడ్ పొడి – ఒకటిన్నర కప్పులు; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చాట్ మసాలా – టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; నిమ్మ చెక్క – ఒకటి; మైదా పిండి – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని తయారీ: ► ఒక పాత్రలో బంగాళ దుంప ముద్ద, బ్రెడ్ పొడి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, చాట్‌మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, నిమ్మ రసం వేసి చపాతీ ముద్దలా బాగా కలపాలి ∙చేతికి కొద్దిగా నూనె పూసుకుంటూ, ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి ► ఒక పాత్రలో మైదాపిండికి కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా కలుపుకోవాలి ∙తయారు చేసి ఉంచుకున్న బాల్స్‌ను మైదా పిండిలో ముంచి, వెంటనే బ్రెడ్ పొడిలో దొర్లించాలి ∙స్టౌ మీద బాణలిలో కాగిన నూనెలో ఈ బాల్స్‌ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఈ బాల్స్‌కి పుల్లలు గుచ్చి లాలీపాప్‌లా చేసి, టొమాటో కెచప్ తో తింటే రుచిగా ఉంటాయి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ కావలసినవి: మైదా పిండి – 8 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – అర కప్పు; సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; రిఫైండ్ ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా; కొత్తిమీర తరుగు – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ తరుగు – అర కప్పు; క్యాబేజ్ తరుగు – అర కప్పు; అల్లం తురుము –టీ స్పూను; మిరియాల పొడి – కొద్దిగా; మైదా పిండి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, నీళ్లు, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా గిలకొడుతూ కలపాలి ► స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ వేడయ్యాక, కొద్దిగా నూనె వేయాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి గరిటెడు వేసి పల్చటి పాన్‌కేక్‌లా అయ్యేలా పాన్‌ను కొద్దిగా అటూ ఇటూ కదపాలి ► అంచులు విడివడే వరకు మీడియం మంట మీద ఉడికించి (రెండో వైపు తిప్పక్కర్లేదు) ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ► ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి (ఒక్కో పొర మీద కొద్దిగా మైదా పిండి చల్లి, ఆ పైన మరో పొర ఉంచాలి లేదంటే అతుక్కుపోతాయి) ► స్టౌ మీద బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తరుగు, ఉల్లి తరుగు, క్యాబేజీ తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కరకరలాడే వరకు వేయించాలి ► ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి జత చేసి, తడిపోయే వరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, చల్లారబెట్టాలి ► ముందుగా తయారుచేసి ఉంచుకున్న మైదా పిండి చపాతీని ఒకటి తీసుకుని, అందులో టేబుల్ స్పూను క్యారట్ తురుము మిశ్రమం ఉంచి జాగ్రత్తగా రోల్ చేయాలి ∙అంచులకు తడి చేసి, మూసేయాలి ► స్టౌ మీద బాణలిలో నూనె పోసి, కాగాక, తయారు చేసుకున్న రోల్స్‌ను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ► టొమాటో కెచప్ లేదా చిల్లీ సాస్‌తో రుచిగా ఉంటాయి. స్టఫ్డ్ పనీర్ ఢోక్లా కావలసినవి: సెనగ పిండి – ఒకటిన్నర కప్పులు; పెరుగు – కప్పు; కొత్తిమీర + పుదీనా చట్నీ – ఒక కప్పు; పనీర్ – 200 గ్రా.; నూనె – 3 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; నీళ్లు – కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; పచ్చిమిర్చి – 2 (మధ్యకు సన్నగా కట్ చేయాలి); నువ్వులు – టీ స్పూను; పంచదార – 2 టీ స్పూన్లు; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు వేసి బాగా కలపాలి ∙పంచదార, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ► కప్పు నీళ్లుపోసి మెత్తగా అయ్యేవరకు కలిపి, పావు గంట సేపు పక్కన ఉంచాలి ► ఒక ప్లేటుకి కొద్దిగా నూనె పూయాలి ∙స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి వేడి చేసి అందులో ఒక స్టాండ్ ఉంచి, రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి ∙సెనగ పిండి మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి, రెండు విడివిడి పాత్రల్లో పోయాలి ► ఒక పాత్రలో ఉన్న పిండిలో ముప్పావు టీ స్పూను ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి, బాగా పొంగినట్టు కాగానే, పిండిని ప్లేట్లో పోసి, సమానంగా పరిచి, పెద్ద పాత్రలోని స్టాండ్ మీద ఉంచి, మూత పెట్టాలి ► ఐదు నిమిషాల తరవాత మూత తీసి, కొత్తిమీర పుదీనా చట్నీ ఒక పొరలాగ వేసి, ఆ పైన ఒక కప్పు పనీర్ తురుము వేయాలి ► రెండవ ప్లేట్లోని మిశ్రమానికి ఈనో ఫ్రూట్ సాల్ట్ జత చేసి, బాగా కలిపి, పనీర్ మీదుగా ఒక పొరలా పోసి, మూత పెట్టి, సుమారు పావు గంట సేపు పెద్ద మంట మీద ఉడికించాలి (పుల్లతో గుచ్చితే ఉడికినదీ లేనిదీ అర్థమవుతుంది) ► స్టౌ మీద బాణలి లో టేబుల్ స్పూను నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ► కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, నువ్వులు వేసి బాగా వేయించిన తరవాత, కప్పు నీళ్లు, టీ స్పూను పంచదార వేసి పంచదార కరిగేవరకు ఉంచాలి ∙ఢోక్లాను ముక్కలుగా కట్ చేయాలి ► సిద్ధంగా ఉన్న పోపును వాటి మీద సమానంగా పోయాలి ∙చివరగా తాజా కొబ్బరి తురుముతో అలంక రించి, అందించాలి. -
చింతకాయలతో పుల్లటి రుచులు..
చిమడకే చిమడకే ఓ చింత కాయ నీవెంత చిమిడినా నీ పులుపు పోదు పులుపు రుచికి రారాజు చింత.. అనారోగ్యానికి విరుగుడు... నోటికి హితవు.. పాత చింతకాయ పచ్చడే కదా అని తీసిపారేస్తే కుదరదు పథ్యానికి పాత చింత కాయే పరమౌషధం.. చింతకాయలతో పుల్లటి రుచులు ప్రయత్నిద్దాం... చింత కాయ దప్పళం కావలసినవి: చింత కాయలు – పావు కేజీ (పండనివి); కూరగాయ ముక్కలు – పావు కప్పు (బెండకాయ, సొరకాయ వంటివి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా తరగాలి); పసుపు – అర టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; మెంతులు + జీలకర్ర – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూ ను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: చింత కాయలను శుభ్రం గా కడిగి, స్టౌ మీద ఒక పాత్ర లో చింత కాయలు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, దింపాలి కొద్దిగా చల్లారాక చేతితో మెత్తగా అయ్యేలా మెదిపి వడపోశాక, తగినన్ని నీళ్లు జత చేసి, ఉల్లి తరుగు, కూర ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచాలి పచ్చి మిర్చి + జీలకర్ర ముద్ద జత చేయాలి కరివేపాకు, కొత్తిమీర జత చేసి బాగా కలియబెట్టాలి అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి దప్పళాన్ని మరిగించాలి చిన్న పాత్రలో బియ్యప్పిండి, కొద్దిగా నీళ్లు పోసి దోసెల పిండి మాదిరిగా ఉండలు లేకుండా కలిపి, ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పులుసులో వేసి మరోమారు కలియబెట్టాలి కొత్తిమీర జత చేయాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాక, కరివేపాకు వేసి మరోమారు వేయించి ఈ పోపు ను మరుగుతున్న చింతకాయ దప్పళంలో వేసి కలియబెట్టాలి బాగా పొంగుతుండగా దింపేయాలి. చింత కాయ పప్పు కావలసినవి: వామన చింతకాయలు – ఒక కప్పు; కంది పప్పు – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 2 (సన్నగా పొడవుగా తరగాలి); ఎండు మిర్చి – 1; ఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – అర టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; నూనె – ఒక టేబుల్ స్పూను; మిరప కారం – తగినంత; ఉప్పు – తగినంత తయారీ: కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి చింత కాయలను శుభ్రంగా కడిగి, ఒక పాత్రలో చింత కాయలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి, మెత్తగా అయ్యేవరకు ఉడికించి, దింపి చల్లారాక, నీళ్లు ఒంపేయాలి చల్లారాక చింతకాయల మీద తొక్కు తీసేసి, తగినన్ని నీళ్లు జత చేసి, మెత్తగా పిసికి, నీళ్లు వడకట్టి పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించాలి పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు వేయించాలి ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికించిన కంది పప్పు, చింతకాయల రసం, ఉప్పు, మిరప కారం వేసి బాగా కలిపి, సుమారు ఐదు నిమిషాలు సేపు ఉడికించి, దింపేయాలి. చింత కాయ–కొబ్బరి పచ్చడి కావలసినవి: చింత కాయలు – 100 గ్రా; కొబ్బరి ముక్కలు – అర కప్పు; పచ్చి మిర్చి – పది పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; వెల్లుల్లి రేకలు – 4; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – తగినంత; కరివేపాకు – ఒక రెమ్మ తయారీ: చింత కాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి చల్లార్చాలి మిక్సీలో పోపు వేసి మెత్తగా చేయాలి చింత కాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ తిప్పాలి కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రేకలు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ తిప్పాలి ఒక గిన్నెలోకి తీసుకుని కరివేపాకుతో అలంకరించాలి. పాత చింత కాయ తొక్కు కావలసినవి: పాత చింతకాయ తొక్కు – 1 కప్పు; బెల్లం – అర కప్పు; ఎండు మిర్చి – 10; పచ్చి మిర్చి – 5 (పెద్దవి); ఇంగువ – తగినంత; నువ్వుల నూనె – పావు కప్పు పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; నూనె – 2 టీ స్పూన్లు; ఇంగువ – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; వెల్లుల్లి రెబ్బలు – 8 తయారీ: స్టౌ మీద పాన్‌లో నూనె వేడయ్యాక, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, ఇంగువ వేసి దోరగా వేయించి చల్లారానివ్వాలి చింతపండు తొక్కును మిక్సీలో వేసి మెత్తగా చేసి, పసుపు, బెల్లం జత చేసి మరోమారు మెత్తగా నూరి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి వేయించి ఉంచిన పోపును జత చేసి బాగా కలపాలి ఈ పచ్చడి ఈ పచ్చడి పథ్యానికి చాలా మంచిది. చింత కాయ నువ్వుల పచ్చడి కావలసినవి: చింతకాయలు – 10; వేయించిన నువ్వులు – 100 గ్రా; పచ్చి మిర్చి – 10; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను ; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను తయారీ: చింత కాయలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా మెదిపి, గుజ్జును వడకట్టాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి చల్లారాక మిక్సీలో వేసి, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి మెత్తగా చేయాలి వేయించిన నువ్వులు జత చేసి మరోమారు మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి చింత కాయ గుజ్జు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. -
వణికించే చలిలో వేడివేడిగా తినాలని..
చలి గజగజలాడిస్తోంది. వణికించే చలిలో వేడివేడిగా తినాలని అంతా అనుకుంటారు. అందుకు వేడిగా కాదు.. స్పైసీగా కూడా కాస్త నోట్లో పడితే ఆ మజాయే వేరు. అందుకోసమే ఈ ప్రయత్నం. అన్నం, చపాతీ, రోటీ, పరాఠా... వంటకం ఏదైతేనేం... ఈ రుచులను జోడిస్తే పసందుగా ఉంటాయి. తియ్యగా, కారంగా, పుల్లగా.. కావలసిన రుచులను ఆస్వాదించొచ్చు. ► సర్సో దా సాగ్ (పంజాబీ వంటకం) కావలసినవి: ఆవ ఆకు – రెండు కప్పులు; తోటకూర – అర కప్పు; పాలకూర – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (చిన్న ముక్కలు చేయాలి); వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూను; నెయ్యి – 4 టీ స్పూన్లు; వెన్న – 1 టీ స్పూన్; మొక్కజొన్న పిండి – ఒక టేబుల్ స్పూన్; రాళ్ళ ఉప్పు – కొద్దిగా; నీళ్ళు – తగినన్ని. తయారీ: ముందుగా ఆకు కూరలను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ’ ఒక ప్యాన్‌లో ఆకు కూరలకు తగినన్ని నీళ్ళు జత చేసి, స్టౌ మీద ఉంచి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించి దింపేయాలి బాగా చల్లారాక పప్పు గుత్తితో బాగా మెదిపి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచుకోవాలి స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి, వేయించాలి పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు జత చేసి, బంగారు రంగులోకి వచ్చేవరకూ వేయించాలి ఆకు కూరల ముద్దను జత చేసి, ఐదు నిముషాల పాటు కలపాలి ఉడుకుతుండగానే రాళ్ళ ఉప్పు, మొక్కజొన్న పిండి జతచేసి, బాగా కలిపి, నాలుగైదు నిముషాలు ఉడికించాలి నెయ్యి జత చేసి, బాగా కలిపి ప్లేటులోకి తీసుకోవాలి వెన్నతో అలంకరించాలి రోటీలు, పూరీలు, పరాఠాలు, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. ► బీట్ రూట్ కబాబ్ కావలసినవి: బీట్ రూట్ తురుము – ఒక కప్పు; టోఫు – అర కప్పు (తురమాలి); వెల్లుల్లి ముద్ద – అర టేబుల్ స్పూను; ఆమ్ చూర్ పొడి – ఒక టేబుల్ స్పూను; వేయించిన దానిమ్మ గింజల పొడి – ఒక టేబుల్ స్పూను; చాట్ మసాలా – చిటికెడు; రాళ్ళ ఉప్పు – తగినంత; జీడిపప్పు పలుకులు – పావు కప్పు; ఓట్స్ పొడి – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి తగినంత. తయారీ: ఒక పాత్రలో బీట్ రూట్ తురుము, టోఫు తురుము, వెల్లుల్లి ముద్ద, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, ఉప్పు, దానిమ్మ గింజల పొడి వేసి, బాగా కలిపి, చేతితో కట్లెట్ మాదిరిగా ఒత్తాలి ఒక్కొక్క దానిలో జీడిపప్పు పలుకులు వేసి, కబాబ్ మాదిరిగా గుండ్రంగా చేయాలి ఓట్స్ పొడిని అద్దాలి ∙స్టౌపై బాణలిలో నూనె కాగాక, కబాబ్స్‌ని అందులో వేయించి, కిచెన్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి గ్రీన్ చట్నీతో వేడిగా అందించాలి ► చిలగడ దుంప రబ్డీ కావలసినవి: పాలు – ఒక కప్పు; ఉడికించిన చిలగడ దుంపల ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – అర టీ స్పూను; గోరు వెచ్చని నీళ్ళు – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; పల్లీ, పిస్తా, జీడిపప్పుల పొడి – ఒక టేబుల్ స్పూన్. తయారీ: స్టౌ మీద గిన్నెలో పాలు పోసి, మరిగించాలి ఉడికించిన చిలగడ దుంప ముద్ద జత చేసి, పాలు చిక్కబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి చిన్న కప్పులో గోరు వెచ్చని నీళ్ళలో కుంకుమ పువ్వు వేసి, కరిగించి, మరుగుతున్న పాలలో వేసి కలియబెట్టాలి ఏలకుల పొడి జతచేయాలి పల్లీ, పిస్తా, జీడిపప్పల పొడి జత చేసి, కలిపి దింపేయాలి చల్లారాక, ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి, తీసి అందించాలి. ► భర్వాన్ గోబీ కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు – ఒక కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ఫిల్లింగ్ కోసం: చీజ్ తురుము – అర కప్పు కిస్మిస్ – 15; దానిమ్మ గింజలు – 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు తరుగు – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; కోవా పొడి – 4 టేబుల్ స్పూన్లు పిండి కోసం:సెనగ పిండి – ఒక కప్పు; వాము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని. తయారీ: స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి, ఉప్పు, పసుపు జత చేసి మరిగించి దింపేయాలి క్యాలీఫ్లవర్ తరుగును అందులో వేసి, మెత్తపడే వరకు ఉంచాలి ఒక పాత్రలో చీజ్ తురుము, కిస్మిస్, దానిమ్మ గింజలు, జీడి పప్పు తరుగు, కొత్తిమీర, అల్లం తురుము, కోవా పొడి వేసి అన్నీ బాగా కలిపి, మెత్తగా అయ్యేవరకు చేతితో బాగా కలపాలి క్యాలీఫ్లవర్ తరుగును ఇందులో వేసి అన్నీ కలిసేలా కలపాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్‌ను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, వేడివేడిగా అందించాలి. ► ముల్లంగి కోఫ్తా కావలసినవి: ముల్లంగి – అర కేజీ, కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను, పల్లీలు – అర టేబుల్ స్పూను, వేయించిన సెనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా – ఒక టేబుల్ స్పూను, ఎండు మిర్చి – 2, పచ్చి మిర్చి – 1, ఉల్లిపాయ – 1, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి తగినంత, గ్రేవి కోసం: ఎండు మిర్చి – 4, వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, పసుపు – అర టీ స్పూను, ఉల్లి తరుగు – ఒక కప్పు, ఉల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను, నూనె – 100 మి.లీ, పెరుగు – అర కప్పు, గరం మసాలా – ఒక టీ స్పూను, ఏలకులు – 4. తయారీ: ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక పాత్రలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, ఉడికించి, దింపేయాలి నీరంతా ఒంపేసి, ముల్లంగి ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో కొబ్బరి తురుము, పల్లీలు, సెనగ పిండి, గరం మసాలా, ఎండు మిర్చి వేసి బాగా కలపాలి పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర జత చేసి మరోమారు కలపాలి ఉప్పు, ముల్లంగి ముద్ద జత చేసి బాగా కలియబెట్టాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. గ్రేవీ తయారీ: మిక్సీలో ఎండు మిర్చి, ఉప్పు, వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు వేసి మెత్తగా చేసి, స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె కాగాక ఈ ముద్దను వేసి వేయించాలి ఉల్లి తరుగు, ఉల్లి ముద్ద జత చేసి మరోమారు వేయించాలి పెరుగు, గరం మసాలా, ఏలకులు, అల్లం తురుము ఒకదాని తరవాత ఒకటి వేస్తూ వేయించాలి అర కప్పు నీళ్లు పోసి, మంట బాగా తగ్గించి, రెండుమూడు నిమిషాలు ఉంచాలి వేయించి ఉంచుకున్న కోఫ్తాలను ఇందులో వేసి, బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి చపాతీలు, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది. ► కోవా బఠానీ టిక్కీ కావలసినవి: నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; ఉడికించిన బఠానీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు. ఫిల్లింగ్ కోసం: కోవా – ఒక కప్పు; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పిస్తా తరుగు – 3 టీ స్పూన్లు; కొత్తిమీర – ఒక టీ స్పూను; ఖర్జూరం తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి తగినంత తయారీ: స్టౌ మీద బాణలిలో నెయ్యి కరిగాక జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం వేసి దోరగా వేయించాలి బఠానీ, పసుపు, ధనియాల పొడి, ఉప్పు జతచేసి, కొద్దిగా వేగిన తరవాత పప్పు గుత్తితో మెత్తగా అయ్యేవరకూ మెదపాలి ఒక పాత్రలో కోవాను చేతితో మెదుపుతూ పొడి చేయాలి పచ్చి మిర్చి, పిస్తా, కొత్తిమీర, ఖర్జూరం తరుగు, జత చేసి బాగా కలపాలి బఠానీ మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని, వెడల్పుగా ఒత్తి, కొద్దిగా కోవా మిశ్రమాన్ని మధ్యలో ఉంచి, టిక్కీ మాదిరిగా ఒత్తాలి స్టౌ మీద బాణలిలో నూనె వేడెక్కాక, టిక్కీలను అందులో వేసి దోరగా వేయించి, పేపర్ టవల్ మీదకి తీసుకోవాలి ∙వేడివేడిగా అందించాలి. స్నాక్ సెంటర్ ► చికెన్ స్విస్ రోల్ కావలసినవి: చికెన్ తురుము – 1 కప్పు (చికెన్‌ని మెత్తగా ఉడికించి.. సన్నని తురుము చేసుకోవాలి), స్వచ్ఛమైన కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు – 2 (మీడియం సైజ్‌వి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 3(చిన్నచిన్న ముక్కలు కట్ చేసుకోవాలి), అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు – 2 రెబ్బలు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు – 1 టేబుల్ స్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, బంగాళదుంప గుజ్జు – అర కప్పు (దుంపలను ఉడకబెట్టి ముద్దలా చేసుకోవాలి), మైదా పిండి – 1 కప్పు, రవ్వ – పావు కప్పు, గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు, పాలు – 5 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైౖ కి సరిపడా. తయారీ: ముందుగా స్టవ్ చిన్న మంట మీద పెట్టుకుని.. పాన్‌లో కొబ్బరి నూనె వేసుకుని వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలను దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. చికెన్ తురుము, కొత్తిమీర తురుము, బంగాళదుంప గుజ్జునూ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, రవ్వ వేసుకుని సరిపడే నీళ్లతో చపాతీ ముద్దలా కలిపి పక్కనపెట్టుకోవాలి. మరో చిన్న బౌల్లో గోధుమపిండి, పాలను పలచగా కలిపి ఉంచుకోవాలి. అవసరం అనుకుంటే అందులో కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మైదాతో చేసిన చపాతీ ముద్దను కాస్త మందంగా చపాతీల్లా చేసుకుని.. అందులో చికెన్ మిశ్రమాన్ని పెట్టి.. రోల్ చేసుకుని ఇరువైపులా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని గోధుమపిండి–పాల మిశ్రమంలో ముంచి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. ► బనానా డోనట్స్ కావలసినవి: అరటిపండ్లు –2, గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు, పంచదార – అర కప్పు, ఉప్పు – చిటికెడు, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, గుడ్లు – 2, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 1 టీ స్పూన్, బటర్ – పావు కప్పు (కరిగించినది). తయారీ: ముందుగా అరటిపండ్లను మెత్తగా గుజ్జులా చేసుకుని.. అందులో పంచదార, ఉప్పు, గుడ్లు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్, కరింగించిన బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. తర్వాత డోనట్స్ మేకర్లో పాన్‌కి బ్రష్‌తో కొద్దిగా నూనె రాసి.. గరిటెతో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని అందులో వేసి.. స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ► క్యారెట్ పుడ్డింగ్ కావలసినవి: క్యారెట్ – 3 (గుండ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలి), చిక్కటి పాలు – 2 కప్పులు (వేడి చేసినవి), ఉప్పు – చిటికెడు, వేరుశనగలు – 2 టేబుల్ స్పూన్లు (వేయించి తొక్క తీసినవి), పంచదార – అర కప్పు, పాల పొడి – అర కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. క్యారెట్ ముక్కలు పాన్ బౌల్లో వేసుకుని.. అందులో వేడి వేడి పాలు పోసుకుని.. చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి గరిటెతో తిప్పుతూ బాగా మెత్తగా ఉడకనివ్వాలి. వేరుశనగలనూ వేసి వాటినీ మెత్తగా ఉడకనివ్వాలి. క్యారెట్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ బౌల్లో వేసుకుని, మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని ముందుగా ఉపయోగించిన బౌల్‌లోనే వేసి పంచదార, పాల పొడి వేసుకుని మరికాసేపు గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గరిటెతో తిప్పుతూ మళ్లీ ఉడకనివ్వాలి. బాగా దగ్గర పడిన తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మరింత దగ్గర పడేదాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి. మొత్తం నెయ్యి వేసి.. చివరిగా ఒకసారి కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకుని.. 5 అంగుళాల లోతుండే బౌల్లోకి తీసుకుని రెండు లేదా మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని బోర్లించి.. బయటకు తీసుకుంటే క్యారెట్ పుడ్డింగ్.. జున్ను ఉంటుంది. దాన్ని నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
బుల్లెట్‌పై వంటలు.. రుచి చూడాల్సిందే!
సాక్షి, నిజామాబాద్: నగరానికి చెందిన వినయ్ హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందాడు. అనంతరం ఉద్యోగం కాకుండా వినూత్న ఆలోచనతో స్వయం ఉపాధి పొందుతున్నాడు. బుల్లెట్ బైక్‌పై పొయ్యిని అమర్చి దానిపై చికెన్‌టిక్కా, లెగ్‌పీస్, బ్రేరీబ్రేరి స్టిప్స్, గ్రీల్ పైనాపిల్, క్రిస్పీకార్న్, చికెన్‌కాసాడీయా వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తున్నాడు. ఈ వంటకాలు రూ.30 నుంచి 90 వరకు లభిస్తాయని వినయ్ తెలిపారు. నగరంలోని ఎల్లమ్మ గుట్టపై తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. బుల్లెట్ బైక్‌ను తన జీవనాధారంగా మార్చుకొని, పసందైన వంటకాలను అందిస్తు ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. (బుల్లితెర ‘గుండన్న’ మనోడే) –సాక్షి ఫొటోగ్రాఫర్–నిజామాబాద్ -
ఆ హైదరాబాద్ వంటకం ఎంతో ఇష్టం
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక కొంతమంది వంట చేయటం నేర్చుకుంటూ అందులో ప్రావిణ్యం సంపాదిస్తున్నారు. మరికొంత మంది రకరకాల వెరైటీ వంటలు ట్రై చేస్తూ కుటుంబ సభ్యులను సంతోషపెడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వృత్తి, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే సినీ సెలబ్రిటీల్లో హీరోయిన్ శృతి హాసన్ ముందు వరసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్ తనకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్ తెలుగు వంటకం ‘మామిడికాయ పప్పు’ను చేశారు. (తారక్‌కు బిగ్‌బాస్ హౌస్మేట్స్ స్పెషల్ విషెస్..) View this post on Instagram The EASIEST mango pappu!! I love this so much I had it for the first time when I visited Hyderabad as a kid and feel in love ❤️ it’s super easy to make hits make sure the raw mango turns translucent so you know it’s done ! Add spice according to your Taste but I keep it mild so I can proper taste the mango :) yummy 😋 A post shared by @ shrutzhaasan on May 19, 2020 at 2:28am PDT అదేవిధంగా తాను స్వయంగా చేసిన ‘మామిడికాయ పప్పు’ వీడియాను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు శృతి హాసన్. ‘చాలా సులభంగా చేసే మామిడికాయ పప్పు నాకు చాలా ఇష్టం. నేను చిన్నతనంలో హైదరాబాద్‌కి మొదటిసారి వచ్చినప్పుడు ఈ మామిడికాయ పప్పును తిన్నాను. ఇక ఈ వంట చేయటం చాలా సులభం. మీ రుచికి తగినట్లు మసాలా వేస్తే చాలా బాగుంటుంది. నేను మాత్రం చాలా తక్కువగా మసాలాను వేస్తాను. ఎందుకంటే సహజమైన మామిడికాయ రుచిని ఆస్వాదించాలి’ అంటూ కామెంట్ జత చేశారు శృతి హాసన్. ఇక తాను లాక్డౌన్ సమయంలో సెల్ఫ్ క్వారంటైన్లో భాగంగా ఇంటికే పరిమితయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. -
తాజాగా తినండి
మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో నుంచి కొద్దిగా ముందుకు వెళితే, జనంతో కిటకిటలాడుతూ ‘తాజా కిచెన్’ కనిపిస్తుంది. ఎంతోమంది విద్యార్థులకు అదొక అక్షయపాత్రలాంటిది. అతి తక్కువ ధరకే మూడు పూటలా కడుపు నింపుతుంది. అక్కడకు బెంజ్, ఆడి కార్లతోపాటు, మున్సిపల్ ఉద్యోగులు కూడా వస్తుంటారు. కడుపు నింపుకుని, సంతృప్తిగా త్రేన్చి వెళ్తుంటారు. అదే ‘తాజా కిచెన్’ ‘మా దగ్గరకు రకరకాల వారు వచ్చి టిఫిన్లు తిని వెళ్తుంటారు. రుచి పరీక్షించడం కోసం కార్లలో వస్తుంటే, కడుపు నింపుకోవటం కోసం సామాన్య ఉద్యోగులు వస్తుంటారు. అందరూ చాలా బాగుందని మెచ్చుకుని వెళ్తుంటారు’ అంటారు బిఎస్సి చదువుకున్న ‘తాజా కిచెన్’ యజమాని విఘ్నేశ్. బెంగళూరులో ‘తాజా తిండి’ (తిండి అంటే కన్నడలో టిఫిన్ అని అర్థం) పేరున సుమారు పది సంవత్సరాల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి ఆలోచన నుంచి ఈ టిఫిన్ సెంటర్ ప్రారంభమైంది. విదేశాలలో పర్యటించిన శ్రీనివాస్ భారతదేశంలో అతి తక్కువ ధరకు పరిశుభ్రమైన ఆహారం అందించాలనుకున్నారు. అలా ప్రారంభమైంది ‘తాజా తిండి’. అదే పద్ధతిలో హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందించడం కోసం ‘తాజా కిచెన్’ను ప్రారంభించారు. ‘వంద మందికి ఎక్కువ ధరలకు టిఫిన్ పెట్టి, ఎక్కువ లాభం సంపాదించటం కంటె, వెయ్యి మందికి తక్కువ ధరకు అందించి అదే లాభాన్ని సంపాదించటం న్యాయం అనిపించింది. ఆరోగ్యకరమైన పదార్థాలను, అతి తక్కువ ధరలకు అందించటమే మా లక్ష్యం’ అంటారు విఘ్నేష్. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణ భారతదేశపు శాకాహార వంటకాలను అందిçస్తూ, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు వీరు. అందమైన అలంకారాలతో కూడిన వాతావరణంలో మనసుకి ఆహ్లాదం కలిగించేలా పచ్చటి వెదురు చెట్ల నీడన ఫలహారాలు అందిస్తున్నారు. ఇక్కడకు వచ్చిన వాళ్లకి మెనూ కార్డు ఇవ్వవలసిన అవసరం ఉండదు. బోర్డు మీద వాటి పేర్లు, ధరలతో పాటు, పక్కనే ఉన్న టీవీలో వాటి తయారీ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. – సంభాషణ: వైజయంతి పురాణపండ వచ్చిన వారిలో కొందరు అల్లం చట్నీ లేదని, సాంబారు లేదనీ గొడవ పడుతుంటారు. బెంగళూరులోని వందేళ్లనాటి ‘బ్రాహ్మిన్స్ కాఫీ బార్’ లో మాత్రమే తయారయ్యే చట్నీలను తయారు చేస్తున్నాం. పాతతరం సంప్రదాయ చట్నీలను మాత్రమే తయారుచేసి, అందిస్తామని అర్థమయ్యేలా చెబుతాం. చట్నీ మారు వడ్డించుకోవాలంటే, కౌంటర్ దాకా వెళ్లి నిరీక్షించాల్సిన పని లేదు. అది కూడా వారికి అందుబాటులో ఉంచుతాం. ఏ పదార్థమూ, వస్తువూ వృధా కాకుండా జాగ్రత్తపడతాం. ఆయా టిఫిన్లకి అనుకూలమైన విధంగా ప్లేట్లు తయారుచేయించాం. ప్లేట్లను ఎప్పటికప్పుడు డిష్ వాషర్లో వేడి నీళ్లతో శుభ్రం చేస్తాం. ప్లాస్టిక్ వాడకానికి పూర్తి వ్యతిరేకం. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశాం. మంచినీళ్ల బాటిల్స్ అమ్మకం పూర్తిగా నిషేధం. అన్నిటినీ స్టిరైల్ చేసి వాడతాం. – అనంత్, మేనేజర్ ఇక్కడ మేం ఈ సెంటర్ ప్రారంభించాలనుకున్నప్పుడు ‘కర్ణాటక ఫుడ్ ఎవరు తింటారు?’ అని నిరుత్సాహపరిచారు. మిగిలిన అంతర్జాతీయ పదార్థాలను తింటున్నప్పుడు ఇది మాత్రం ఎందుకు తినరు అని పట్టుదలగా ప్రారంభించాం. అందరూ ఆదరిస్తున్నారు. వంటవారిని కర్ణాటక నుంచి తీసుకువచ్చాం. వడ్డించిన పదార్థాలు ప్లేటులో నుంచి కిందకు పడిపోకుండా, చేతులు కాలకుండా ఉండాలనే లక్ష్యంతో మందంగా ఉండే ప్లేట్లు తయారుచేయించాం. కృత్రిమ పదార్థాలను అస్సలు ఉపయోగించం. మాది ఓపెన్కిచెన్. లోపలకు వచ్చి ఎవ్వరైనా చూసుకోవచ్చు. టైమింగ్స్ విషయంలో కరెక్ట్‌గా ఉంటాం. లేదంటే కిచెన్ క్లీనింగ్ కుదరదు. పేరుకి తగ్గట్లుగా అన్నీ తాజా వస్తువులే ఉపయోగిస్తాం. హైదరాబాద్‌లో.. టిఫిన్ కోసం నిలబడి, టోకెన్ తీసుకుని, ఆనందంగా తినటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ప్రముఖ సినీ దర్శకులు ఏ.ఎం. రత్నం, క్రిష్, తరుణ్‌భాస్కర్ వంటి వారంతా ‘తాజా కిచెన్’ టిఫిన్లను రుచి చూసి ప్రశంసించారు. – విఘ్నేష్, యజమాని -
మార్గళి ప్రసాదం
మార్గశిర మాసాన్ని మనం ధనుర్మాసం అంటాం. తమిళులు మార్గళి అంటారు. వైష్ణవాలయాల్లో ఉదయపు పూజల్తో ఈ మాసమంతా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువెత్తుతుంది. తిరుప్పావై మార్మోగుతుంది. ప్రసాదాల గుబాళింపు భగవంతునికే కాక భక్తులకూ ప్రీతికరమౌతుంది. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు... వైష్ణవ ఆలయాలకు వెళితే చక్కెర పొంగలి, దద్ధ్యోదనం, పులిహోర, పరమాన్నం ప్రసాదంగా దక్కుతుంది. ధనుర్మాసం ఇంటింటా ప్రసాదాల పంట.ఉదయాన్నే చలిలో ఈ ప్రసాదాలు తయారుచేసి, భగవంతునికి నివేదన చేసి, స్వీకరించండి. పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతాయి. కోయల్ పులిహోర కావలసినవి: బియ్యం – పావు కేజీ; చింతపండు – నిమ్మకాయంత; పసుపు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను. పొడి కోసం: నూనె – ఒక టీ స్పూను; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 6; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; మెంతులు – అర టీ స్పూను; మిరియాలు – ఒక టీ స్పూను, నువ్వులు – 2 టీ స్పూన్లు. పోపు కోసం: నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి అన్నం ఉడికించి, పక్కన ఉంచాలి ►ఒక కప్పు నీటిలో చింత పండు నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, పొడి కోసం తీసుకున్న వస్తువులన్నీ (నువ్వులు మినహా) ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►చివరగా నువ్వులు జత చేసి మరోమారు వేయించి, దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాక, పచ్చి సెనగ పప్పు, పల్లీలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు జత చేసి కొద్దిసేపు వేయించాలి ►చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, ఇంగువ జత చేసి సుమారు ఐదు నిమిషాల సేపు ఉడికించాలి ►చిక్కబడ్డాక బెల్లం పొడి జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి ►పెద్ద పళ్లెంలో అన్నం వేసి చల్లారబెట్టాలి ►వేయించిన పోపు, పొడి మిశ్రమాన్ని అన్నానికి జత చేసి బాగా కలియబెట్టి, కొద్దిగా నువ్వుల నూనె వేసి మరోమారు కలపాలి ►దేవునికి నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి. కోయల్ పొంగల్ కావలసినవి: బియ్యం – ఒక కప్పు; పెసర పప్పు – అర కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు ; జీడిపప్పులు – 15; మిరియాలు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక, పెసర పప్పు వేసి దోరగా వేయించి దింపేయాలి ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేయాలి ∙ కుకర్‌లో పెసరపప్పు, బియ్యం, ఐదు కప్పుల నీళ్లు జత చేసి, మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చాక దింపి, మూత తీశాక, మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదపాలి. ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పులు వేసి వేయించాలి ►మిరియాలు జత చేయాలి ►ఇంగువ, కరివేపాకు, అల్లం తురుము వేసి బాగా వేయించాలి ►ఉడికించిన బియ్యం, పెసరపప్పు మిశ్రమం జత చేసి, తగినంత ఉప్పు వేసి కలిపి దించేయాలి కోయల్ పొంగల్ సిద్ధమైనట్లే. అప్పాలు కావలసినవి: బియ్యప్పిండి – ముప్పావు కప్పు; గోధుమ పిండి – పావు కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; నూనె – పావు కప్పు + డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ఒక పాత్రలో బియ్యప్పిండి, గోధుమ పిండి వేసి కలపాలి ►స్టౌ మీద ఒక పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు కలుపుతూండాలి ►బియ్యప్పిండి గోధుమ పిండి మిశ్రమం జత చేస్తూ కలియబెట్టాలి ►ఉడుకుపడుతుండగా స్టౌ కట్టేయాలి ►పావు కప్పు నూనె జత చేసి గరిటెతో బాగా కలియబెట్టి, చల్లారబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ►పిండిని కొద్దిగా తీసుకుని, ఉండలా చేసి, నూనె పూసిన ప్లాస్టిక్ కవర్ మీద అప్పం మాదిరిగా ఒత్తాలి ►కాగిన నూనెలో వేసి రంగు మారేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ►చల్లారాక దేవునికి నైవేద్యం పెట్టి తినాలి. కోయల్ పాయసం కావలసినవి: బియ్యం – ముప్పావు కప్పు; నెయ్యి – అర కప్పు + ఒక టేబుల్ స్పూను; నీళ్లు – 5 కప్పులు; ముదురు రంగులో ఉండే బెల్లం – రెండున్నర కప్పులు; పటిక బెల్లం – పావు కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; శొంఠి పొడి – పావు టీ స్పూను. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక బియ్యాన్ని అందులో వేసి కొద్దిసేపు వేయించి దింపేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి (ఉడకటానికి సుమారు అరగంట సమయం పడుతుంది) ►స్టౌ మీద మరొక బాణలిలో నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసి కరిగించి, ఉడికించాలి ►అన్నానికి జత చేసి, స్టౌ మీద ఉంచి కొద్దిసేపు ఉడికించాలి ►బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి, శొంఠి పొడి జత చేసి కలియబెట్టాలి ►నెయ్యి జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ►వేయించిన కొబ్బరి ముక్కలు, పటికబెల్లం ముక్కలు జత చేసి కలియబెట్టి, నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి. కోయల్ దద్ధ్యోదనం కావలసినవి: సన్నని ముడి బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నువ్వుల నూనె – తగినంత; పాలు – 4 కప్పులు; పెరుగు – ఒక టేబుల్ స్పూను. పోపు కోసం: జీడిపప్పులు – గుప్పెడు; పచ్చి సెనగ పప్పు+మినప్పప్పు – 2 టీ స్పూన్లు; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూను; మిరియాలు – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నువ్వుల నూనె – తగినంత; అలంకరించడానికి: పచ్చి మామిడి ముక్కలు – కొద్దిగా; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు, ఉప్పు, నూనె జత చేసి ఉడికించి, దింపి, వేడిగా ఉండగానే గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి ►స్టౌ మీద పాలు ఉంచి, మరిగించి, కొద్దిగా చల్లారాక, అన్నంలో పోసి బాగా కలియబెట్టాలి ►కొద్దిగా పెరుగు జత చేసి మూత పెట్టి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాన్లను ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, దింపి, అన్నం మీద వేసి కలియబెట్టాలి ►మామిడి ముక్కలు, కొత్తిమీరతో అలంకరించాలి. -
బొమ్మిడాలు.. బెండకాయ కాంబినేషన్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: కొందరికి నాన్‌వెజ్ తప్ప వెజ్ అస్సలు రుచించదు. ఇంకొందరు ఆకు కూరలంటే ఆమడ దూరం పెడతారు. మరికొందరికి కొన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు అంటే వారికి చిరాకు. అవి తినేందుకు కాదుకదా.. చూడ్డానికి కూడా ఇష్టపడరు. మరి శరీరానికి కావాల్సిన పోషకాలు ఎలా అందుతాయ్. ఎప్పుడూ విభిన్న రుచుల ప్రయోగాలకు కేంద్రమైన మన హైదరాబాదీ రెస్టారెంట్లు ఇలాంటి వారికోసమే వెజ్‌ను.. నాన్‌వెజ్‌ను కలిపి అందిస్తూ సరికొత్త రుచులను పంచుతున్నాయి. వేసుకునే దుస్తులు మల్టీ పర్పస్.. ధరించే నగలు మల్టీ పర్పస్ ఉండగా తినే ఫుడ్ మాత్రం ‘మల్టీ’ అయితే తప్పేంటి అంటున్నారు. భోజన ప్రియులు కూడా ఇప్పుడు వెజ్..నాన్‌వెజ్ కలిపి వండిన వంటకాల టేస్టీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంస్కృతి మన ముత్తాతల కాలం నుంచి ఉన్నప్పటికీ ఏవేవో కారణాలతో రెండింటినీ విడదీసి వంటలు చేశారు. మళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి ‘వంట’పట్టించుకుంటున్నారు. అదీ నగర రెస్టారెంట్ల మధ్య నెలకొన్న పోటీ వల్లనే అని చెప్పక తప్పదు. బొమ్మిడాలు..బెండకాయ అదుర్స్ ‘గ్రీన్ చికెన్’ (చికెన్‌కు కొత్తిమీర, పుదీనా కలిపి చేసేది) పేరుకు తగ్గట్టే ఇది చూడ్డానికి పచ్చగానే ఉన్నా.. ఇందులో వాడే ఆకుకూరలతో అద్భుతమైన రుచి రావడంతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆకు కూరలు, కూరగాయలకు జత కలిసినవి మటన్, చికెన్ మాత్రమే కాదు.. చేపలు, రొయ్యలు, పీతలు వంటివి కూడా ఉన్నాయండోయ్. బొమ్మిడాలు–బెండకాయ కాంబినేషన్‌తో చేసిన పులుసు ఇప్పుడు నగరంలో హైలెట్‌గా నిలుస్తోంది. చాలామంది బెండకాయలో జిగురు ఉంటుందని, దానిని తినేందుకు పిల్లలు కూడా అయిష్టత చూపిస్తుంటారు. అయితే, బెండకాయ మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదపడుతుందని చెప్పి మరీ తల్లిదండ్రులు తినిలా చేస్తారు. అలాంటి జిగురు బెంకాయను బొమ్మిడాలతో కలిపి చేసిన పులుసు యమ టేస్ట్‌గా ఉందంటున్నారు. ఇక మామిడికాయ–చేపల పులుసు.. పేరు చెబితే సరిపోదు.. ఒక్కసారి రుచి చూస్తే చాలు మరిచిపోలేరంటే అతిశయోక్తి కాదు. ఇక గోంగూర–రొయ్యలు టేస్ట్ ఐరన్‌కు కేరాఫ్‌గా చెప్పే వటకం. అటు పీచు.. ఇటు ప్రొటీన్స్ కూరగాయల నుంచి పీచు పదార్థాలు అధికంగా లభ్యమవుతాయి. అయితే, ఇవి పూర్తిస్థాయిలో ప్రోటీన్స్‌ను అందించలేవు. అదే నీచు వంటకాల్లో ప్రోటీన్స్ లభ్యమవుతాయి. మానవ శరీరానికి పీచు, నీచు ద్వారా లభ్యమయ్యే ప్రోటీన్స్, కార్పొహైడ్రేట్స్ రెండూ అవసరమే. ఒకటి అమితంగా తీసుకుని మరొకటి మితంగా తీసుకుంటే కుదరదు. రెండు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందన్నది నిపుణులు చెప్పే మాట. ఈ క్రమంలో కూరగాయలతో నీచు పదార్థాలను మిక్స్ చేసి వండి వార్చేస్తున్నారు. ఒకప్పుడు కొన్ని రకాల కూరగాయలతోనే చికెన్, మటన్, రొయ్యలు వంటి వాటిని కలిపి వండేవారు. ఇప్పుడు దాదాపు అన్ని రకాల ఆకు కూరలతో పాటు చాలా రకాల కూరగాయలను కలిపి కంబైన్డ్ వంటలు చేసేస్తున్నారు. ఎప్పటికప్పుడు నగరవాసి సరికొత్త టేస్టీ కోరుకుంటున్న నేపథ్యంలో రెస్టారెంట్ల నిర్వాహకులు సైతం వారి ముంగిటకు సరికొత్తగా డిషెస్‌ను పరిచయం చేస్తూ వస్తున్నాయి. ఇదే క్రమంలో భోజన ప్రియుల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో శోధించి మరీ ఆయా డిషెస్‌ను వండి వడ్డిస్తున్నారు. చికెన్ మిర్చి నాన్‘వెజ్’తో జత కట్టినవి ఎన్నో.. తమలపాకు–చికెన్ (తమలపాకులను పేస్ట్ లాగా చేసి చికెన్ కలిపి సూప్ లాగా చేస్తారు), చికెన్ మిర్చి బజ్జీ (మిర్చి బజ్జీని సగానికి కోసి అందులో చికెన్ ముక్కలు ఉంచుతారు), తమలపాకు కోడి పకోడీ (తమలపాకులను పేస్ట్ లాగా చేసి చికెన్‌తో కలిపి పకోడీలా వేస్తారు), ఆలూ చికెన్ కుర్మా, మునక్కాయ–కోడికూర, దోసకాయ–చికెన్, గోంగూర–చికెన్ ఆవకాయ–చికెన్, కొత్తిమీర–కోడికూర, కరివేపాకు–కోడికూర సిటీ భోజన ప్రియులు లొట్టలేసుకుని మరీ ఆరగిస్తున్నారు. ఇక మటన్ విషయానికొస్తే దోసకాయ, బీరకాయ, తోటకూర, గోంగూరలకు మటన్‌ను మిక్స్ చేసి వడ్డిస్తున్నారు. రెస్టారెంట్లో రుచి చూసి ఇంట్లో కూడా తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాంబర్ రైస్– మటన్ కాబినేషన్ ఇప్పుడు సాంబార్ రైస్‌కు సైతం నాన్‌వెజ్ జోడించే కల్చర్ పెరిగింది. చికెన్–సాంబార్ రైస్, మటన్–సాంబార్, చేపల వేపుడు–సాంబార్ కాంబినేషన్లు ఇప్పుడు భోజన ప్రియుల జిహ్వాకు పనిచెబుతున్నాయి. అలాగే, రైస్ విషయానికొస్తే గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర మటన్ బిర్యానీ, గోంగూర చికెన్ రైస్ ఇప్పుడు సరికొత్త టేస్ట్‌కు కేరాఫ్‌గా మారాయనే చెప్పాలి. రుచులు కోరుతున్నారు నగరవాసులు ఎప్పటికప్పుడు కొత్త రుచుల కోసం ఎదురుచూస్తుంటారు. అలాగే మేం దాదాపు అన్ని రకాల కూరగాయలకు నాన్‌వెజ్‌ను మిక్స్ చేసి వడ్డిస్తున్నాం. నగరంలో ఎక్కడా చేయని డిషెస్‌ను మేం తయారు చేసి పెడతాం. – చంద్రకాంత్, కోడికూర చిట్టిగారె రెస్టారెంట్ ప్రోటీన్స్ పుష్కలం ఆరోగ్య రీత్యా కూరగాయలు మంచివి అయినప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రోటీన్స్‌ను అందజేయలేవు. ఈ క్రమంలో నాన్‌వెజ్‌తో తీసుకోవడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. గోంగూర–చికెన్, ఎగ్–పాలకూర వంటివి. గోంగూరలో విటమిన్–సి, పాలకూర విటమిన్–ఎ లభ్యమవుతాయి. అలాగే వెజ్–నాన్‌వెజ్ మిక్సింగ్‌గా తీసుకునే క్రమంలో విటమిన్ బీ12 లోపాన్ని అధిగమించవచ్చు. – డాక్టర్ పావని, డైటీషియన్ -
దీపావళికి ఈ కొత్త రుచులు ట్రై చేయండి..
తీపి ఉన్న చోట దీప్తి ఉంటుంది. తియ్యదనం ఉన్న జీవితం మరొకరి జీవితంలో వెలుతురు పంచమంటుంది. చీకటిని తరిమికొట్టడానికి వెలిగించిన దీపంలో మిఠాయి రుచి నింపుకుంటుంది. ఇంటి ముందర దీపాలు, మనసులో అనుబంధాలు వెలిగే పండగ దీపావళి నోరు తీపి చేసుకోండి. నలుగురికీ పంచి బంధాల్ని కూడా తీపి చేసుకోండి. ► డ్రైఫ్రూట్ సున్నుండలు కావలసిన పదార్థాలు: మినప్పప్పు – 1/2 కప్పు; బాదం పప్పులు – 1/4 కప్పు; జీడిపప్పు – 1/4 కప్పు; తరిగిన పిస్తా – 1/4 కప్పు; బెల్లం – 3/4 కప్పు; నెయ్యి – 1/3 కప్పు. తయారీ విధానం: ∙జీడిపప్పు, బాదం పప్పులను విడివిడిగా వేయించుకొని బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ∙మినప్పప్పుని తక్కువ మంట మీద ఎర్రగా పచ్చి వాసన పోయేలా వేయించి చల్లార్చాలి ∙చల్లారిన మినప్పప్పుని కొద్దిగా బరకగా పొడి చేసి అందులోనే బెల్లం కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి ∙పొడి చేసుకున్న జీడిపప్పు, బాదం, మినప్పప్పు మిశ్రమాలను, తరిగిన పిస్తా పప్పులను ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి ∙వేడి నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుకోవాలి ∙మిశ్రమం వెచ్చగా వున్నప్పుడే ఉండలు చేసుకుంటే డ్రైఫ్రూట్ సున్నుండలు రెడీ. ► కోవా–రవ్వ బర్ఫీ కావలసిన పదార్థాలు: పచ్చి కోవా –1/2 కప్పు; బొంబాయి రవ్వ – 1/2 కప్పు; పాలు – 1/2 కప్పు; పంచదార – 1/2 కప్పు; నెయ్యి – 1/4 కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – 1/2 టీస్పూన్. తయారీ విధానం: ∙కుంకుమ పువ్వుని రెండు స్పూన్ల వేడి పాలలో నానబెట్టుకోవాలి ∙నెయ్యి వేడి చేసి అందులో రవ్వ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙అదే మూకుడులో కోవా, పాలు పోసి కోవా కరిగే వరకు కలియబెట్టాలి ∙దీనిలో చక్కెర కూడా వేసి కరిగేవరకు తిప్పాలి ∙ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, నానబెట్టిన కుంకుమ పువ్వు, ఏలకుల పొడి జత చేసి, మిశ్రమం దగ్గర పడేవరకు కలపాలి ∙మిశ్రమం అంచులు విడుస్తున్నప్పుడు పొయ్యి కట్టేసి, నెయ్యి రాసిన పళ్లెంలో పోసుకోవాలి ∙తరిగిన పిస్తా పప్పులను పైన వేసి సిల్వర్ ఫాయిల్‌తో అలంకరించుకోవాలి ∙కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ► కొబ్బరి –మిల్క్ మెయిడ్ హల్వా కావలసిన పదార్థాలు: తురిమిన పచ్చి కొబ్బరి – 1 కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పాలు – 1/4 కప్పు; కండెన్సెడ్ మిల్క్ (మిల్క్ మెయిడ్ ) – 1/2 కప్పు; ఏలకుల పొడి – 1/4 టీస్పూన్; పిస్తా – తగినంత. తయారీ విధానం: ∙బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగాక, తురిమిన కొబ్బరి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ∙ పాలు, మిల్క్ మెయిడ్ వేసి బాగా కలిపి దగ్గర పడేవరకు తిప్పుతూ ఉడికించాలి ∙ కొబ్బరి మిశ్రమం దగ్గర పడ్డాక ఏలకుల పొడి వేసి దింపేయాలి ∙ తగినన్ని పిస్తా పప్పులను పైన చల్లి సర్వ్ చేయాలి. ► వాల్నట్ హల్వా కావలసిన పదార్థాలు: వాల్నట్స్ – 1 కప్పు; పాలు – 1/2 కప్పు; పంచదార – 1/2 కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; కుంకుమ పువ్వు – చిటికెడు; సిల్వర్ ఫాయిల్ – గార్నిషింగ్ కోసం. తయారీ విధానం: వాల్నట్స్ని బరకగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పాలు, పంచదార, కుంకుమ పువ్వు వేసి పంచదార కరిగి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసి, దించి పక్కన పెట్టుకోవాలి ∙ఒక మూకుడులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, పొడి చేసుకున్న వాల్నట్స్ని వేసి, తక్కువ మంట మీద బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వేగాక దీనిలో పాల మిశ్రమం పోసి, రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ∙మరో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కొద్దిసేపు బాగా కలుపుతూ అంచులు విడిచే వరకు ఉడికించుకోవాలి ∙నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి చల్లారనివ్వాలి (హల్వా చల్లారాక ఇంకా గట్టి పడుతుంది) ∙పైన సిల్వర్ ఫాయిల్ అద్ది, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ► బ్రెడ్కాజా కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ – 6; పంచదార – 1/2 కప్పు; నీళ్లు – 1/4 కప్పు ; ఏలకుల పొడి – చిటికెడు; తరిగిన పిస్తా, బాదం – తగినంత; నూనె – వేయించటానికి సరిపడా. తయారీ విధానం: ∙బ్రెడ్ స్లైసెస్ అంచులు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ∙వేయించటానికి సరిపడా నూనె బాణలిలో వేసి, వేడి చేసి, కట్ చేసిన బ్రెడ్ ముక్కలను దోరగా వేయించుకోవాలి ∙ వేయించిన ముక్కలను కిచెన్ పేపర్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పంచదార, నీళ్లు వేసి కలియబెట్టి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙ ఏలకుల పొడి జత చేసి, ఒకసారి కలియబెట్టి, స్టౌ మీద నుంచి దించేయాలి ∙ వేయించిన బ్రెడ్ ముక్కలను పాకంలో వేసి, కొన్ని క్షణాల వరకు పాకంలో ముంచి తీసేయాలి ∙పాకంలో ముంచి తీసిన బ్రెడ్ ముక్కలను పళ్లెంలో పరుచుకొని, అవి తడిగా వున్నప్పుడే, తరిగిన పిస్తా పప్పులను, బాదం పప్పులను పైన చల్లుకోవాలి ∙ పూర్తిగా తడి ఆరిన తరవాత సర్వ్ చేయాలి. ► గర్ మఖానా కావలసిన పదార్థాలు: పూల్ మఖానా – 1 కప్పు; బెల్లం – 1/4 కప్పు; నెయ్యి – 2 టీస్పూన్లు. తయారీ విధానం: ∙మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి మఖానాలను తక్కువ మంట మీద కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙నాన్ స్టిక్ పాన్‌లో ఒక స్పూన్ నెయ్యి, బెల్లం వేసి, బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ∙బెల్లం కరిగాక వేయించి పెట్టుకున్న మఖానా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ∙నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెంలోకి తీసుకొని కొద్దిగా చల్లారాక విడివిడిగా అయ్యేలా చేసుకోవాలి. ► మఖ్ఖన్ పేడా కావలసిన పదార్థాలు: పచ్చి కోవా – 1/2 కప్పు; మైదా పిండి – 1 కప్పు; పంచదార – 2 కప్పులు; డ్రై ఫ్రూట్ ముక్కలు – 4 టేబుల్ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; వంట సోడా – 1/4 టీ స్పూను; ఏలకుల పొడి – 1/2 టీ స్పూన్; నూనె – వేయించటానికి సరిపడా. తయారీ విధానం: ∙ఒక గిన్నెలో కోవా, మైదా పిండి, వంట సోడా, నెయ్యి వేసి, బాగా కలిసేలా కలుపుకోవాలి ∙కొద్దిగా నీళ్లు చల్లి పిండి మృదువుగా కలుపుకోవాలి (పిండిని ఎక్కువగా మర్దనా చేయకూడదు) ∙మూతపెట్టి 15 నిమిషాలు నాననివ్వాలి ∙ఒక గిన్నెలో చక్కెర, రెండు కప్పుల నీళ్లు పోసి కరగనివ్వాలి ∙పంచదార కరిగి కొద్దిగా మరిగాక, ఏలకుల పొడి వేసి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి ∙కలిపి పెట్టుకున్న పిండిని ఉండలు చేసి, ఒక్కొక్క ఉండను కొద్దిగా చేతితో ఒత్తి మధ్యలో డ్రై ఫ్రూట్ ముక్కలను స్టఫ్ చేసి, అంచులను మూసి, చేతితో కొద్దిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ∙ఒత్తి పెట్టుకున్న పిండి ముద్దలను వేడి నూనెలో వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి ∙వేగిన వాటిని వేడి పాకంలో వేసి రెండు గంటలు నానిన తరవాత తినాలి. ► బెల్లం గవ్వలు కావలసిన పదార్థాలు: మైదా పిండి – 1 కప్పు; బెల్లం – 1 కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; వంట సోడా – చిటికెడు. తయారీ విధానం: ∙ఒక గిన్నెలో మైదా పిండి, నెయ్యి, వంట సోడా వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల పీట మీద గవ్వల ఆకారంలో వత్తుకోవాలి ∙ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ∙బాణలిలో నూనె పోసి, వేడి చేసి, అందులో గవ్వలను వేసి, దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో బెల్లం వేసి, మునిగే వరకు నీరు పోసి, స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి ∙బెల్లం పాకం వచ్చాక, పొయ్యి కట్టేసి, వేయించి పెట్టుకున్న గవ్వలను పాకంలో వేసి బాగా కలుపుకోవాలి ∙నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చువాలి ∙చల్లారాక గవ్వలు విడివిడిగా వస్తాయి. -
బ్లాగుల్లో కిచెన్ కబుర్లు
కొత్తగా కాపురం పెట్టిన జంటకు వంట వండుకుని తినటం అంటే పెద్ద పరీక్షే. ఇంట్లో అమ్మో, అమ్మమ్మో చేసి పెట్టే కూరలు, పులుసులు తిని వాటికి పేర్లు పెట్టడమే తప్ప వాటిని శ్రద్ధగా వండి జీవిత భాగస్వామికి వడ్డించే నవతరం ఇల్లాళ్లు బహు అరుదు. కొందరికి కిచెన్‌లోకి అడుగు పెట్టాలంటేనే ఇష్టం ఉండదు. భోజన ప్రియుడైన భర్తకు శ్రీమతి పిండివంటల మాటేలా ఉన్నా రుచికరంగా కూరనైనా రెడీ చేస్తే ఎంత హ్యాపీ. అలాంటి యువతుల కోసం, స్వయంపాకం చేసుకునే బ్రహ్మచారుల కోసం ఇంటర్నెట్లో ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని క్లిక్ చేస్తే సరి ఘుమఘుమలాడే వంటలు రెడీ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి క్షణం అప్డేట్ అవుతూనే ఉంటుంది. దానితో పాటే మనం కూడా అప్డేట్ అవ్వాలి. టెక్నాలజీని అందుకోవడంలో ఎప్పుడూ ముందుండాలి. ఆ విషయంలో వైజాగ్వారు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. వంటలు రాక చేతులు కాల్చుకున్న వారిని చూశాం. తొలి నాళ్లలో వంటల పుస్తకాలు వచ్చాయి. అందులో ఏ ఐటమ్ ఎలా త యారు చేయాలో చూసి కాస్తో కూస్తో వండుకునేవారు. కానీ ఇప్పుడు బుక్స్ , ఈ-బుక్స్‌గా మారిపోయాయి. అంతా ఇంటర్నెట్ మయం. అందుకే ఇప్పుడు వంటల పుస్తకాలను పక్కన పెట్టేసి వంటల బ్లాగ్స్/వెబ్‌సైట్స్ ఫాలో అవుతున్నారు వంట నేర్చుకోవాలనుకునేవారు. బ్లాగులో వంటలు బ్లాగు అంటే ఆన్లైన్ డైరీ లాంటిది. మనం ఏం రాయాలి అనుకుంటే అది రాయచ్చు. కాకపోతే దానికి నెటిజన్లలో కాస్త ఆసక్తి కలిగించేదిగా ఉండాలి. నెట్ యూజ్ చేసేవారిని అట్రాక్ట్ చేయగలిగితే చాలు. అది సక్సెస్ అయినట్లే. మనిషి ఎంత కష్టపడినా సరే తిండి కోసమే... అందుకే రకరకాల వెరైటీ వంటకాలు తయారు చేస్తూ వాటిని ఇంటర్నెట్లో బ్లాగ్/వెబ్సైట్ క్రియేట్ చేసి వాటిలో అపలోడ్ చేస్తున్నారు చాలా మంది. వాటిలో కొన్ని వైజాగ్ నుంచి కూడా ఉన్నాయండి. శైలూస్ఫుడ్.కాం,హేమాస్కిచెన్, ఫేస్బుక్లో బనానాలీఫ్ రెసిపీస్ ఇలాంటి ఫుడ్ వెరైటీలను అందించేవే. ఆల్ వెరైటీ రెసిపీస్ అంటే కేవలం ఒకటి రెండు కాదు. ఇంటర్నేషనల్ వంటకాల నుంచి మన సంప్రదాయ వంటకాల వరకు అన్ని రకాలు వీటిలో అందుబాటులో ఉంటాయి. ఆ వంటకు కావలసిన వస్తువుల దగ్గర నుంచి దానిని ఎలా తయారు చేయాలి? తయారు చేసిన తర్వాత అది ఎలా ఉంటుంది? అనే విషయాలు ఫొటోతో సహా పెడుతున్నారు. దీని వలన ఆ వంటకం మీద ఫస్ట్‌లోనే ఒక ఇంప్రెషన్ వస్తుంది. అప్పుడే అది ట్రై చేయలా లేదా అని డిసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎలాంటి డ్రింక్స్ తాగితే బాడీ కూల్ అవుతుం. ఈ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయాలు కూడా అప్డేట్ చేస్తున్నారు. శైలూస్ ఫుడ్ ఫుడ్ బ్లాగ్స్లో బాగా పాపులర్ అయిన వాటిలో ఠీఠీఠీ.ట్చజీఠటజౌౌఛీ.ఛిౌఝ ఒకటి. అది మన సిటీకి చెందిన శైలజ మెయింటెన్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మ,అమ్మమ్మ చేసే వంటలు చూస్తూ పెరిగిన శైలజ చిన్నప్పుడు వంటలో వాళ్లకి సహాయం చేసేవారు. తర్వాత కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు తయారుచేసే వంటల రెసిపీస్ అన్నీ రాసుకునేవారు. గవర్నెమెంట్ ఉద్యోగం వదిలేసిన తర్వాత కిచెన్‌లో ఎక్కువగా టైం గడిపేవారు. కొత్త కొత్త వంటలు చేసేవారు. సీజన్లో వచ్చే కూరగాయలతో కొత్త ఫ్లేవర్స్‌లో వంటలు చేసేవారు. ఇంట్లో వాళ్లకు బాగా నచ్చేవి. అలా తయారు చేసిన కొత్త వంటకాలను అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ఓపెన్ చేశానంటున్నారు. బనానాలీఫ్ రెసీపీస్ ఫేస్బుక్... ఈ పదం ఒక్కటి చాలు... కొన్ని కోట్ల మంది ఫేవరెట్ బుక్. ఇందులో పబ్లిసిటీ చేయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ప్రొడక్ట్ కానీ,ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు. అలా ఓపెన్ చేసినదే ‘బనానా రెసిపీస్’ పేజ్. దీని గురించి పేజ్ అడ్మిన్ కుసుం లత ఇలా చెప్పారు. ‘నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన వంటలు అందరితో పంచుకోవాలి అని ఈ పేజ్ స్టార్ట్ చేశాను. సౌత్ ఇండియా,నార్త్ ఇండియాలో ఫేమస్ వంటలు నా పేజ్‌లో అపడేట్ చేస్తాను. అది కూడా అన్నీ వెజిటేరియన్. అలాగే ట్రెడిషనల్ ఫుడ్ అంటే ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. అందుకే వాటిని కూడా ప్రమోట్ చేస్తాను. త్వరలో ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఏ వంట ఎలా చేయాలి అని నన్ను అడిగి ట్రై చేస్తుంటారు.