ఒడియా ప్రజల సంప్రదాయ వంటకం పఖాలా. ఈ వంటకం కోసం ప్రత్యేక రోజు కూడా ఉంది. ఆ రెసీపీ పేరుతోనే ప్రతి ఏటా మార్చి 20న 'పఖాలా దిబాసా' అనే దినోత్సవాన్న ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఒడియా ప్రజలంతా ఆ వంటకాన్ని వివిధ పద్ధతుల్లో తయారు చేసుకుని ఆస్వాదిస్తారు. అంతేకాదు పూరీ జగన్నాథుడికికి నైవైద్యంగా ఈ వంటకాన్నే పెడతారు కూడా. ఇంతకీ ఏంటా ప్రత్యేకమైన వంటకం? ఎలా తయారు చేస్తారు.
ఆ వంటకం పేరు 'పాఖాల భాటా(పఖాలా భాటా)'. దీన్ని 'పఖాలా' లేదా 'పాఖాలా' అని పిలుస్తారు ప్రజలు. ఇది ఒడిశా సంప్రదాయ వంటకం. ఈ వంటాకాన్ని వండిన అన్నంలో కడిగినా లేదా నీటిలో తేలికగా పులియబెట్టి తయారు చేస్తారు. దీన్ని పప్పు తప్పించి వివధ రకాల కూరలతో నొంచుకుని తింటారు. ఇది వేసవిలో తాపాన్ని హరించే ఒరిస్సా సంప్రదాయ వంటకం. అయితే ఒడిస్సాలో ఈ వంటకాన్ని 10వ శతాబ్దం నుంచి పూరీకి చెందిన జగన్నాథుడికి నైవైద్యంగా పెట్టే రెసిపీలో దీన్ని కూడా చేర్చారు. ఈ వంటకాన్ని నేపాల్, మయాన్మార్ ప్రజలు కూడా తినడం విశేషం.
నిజానికి ఈ వంటకం ఎలా వచ్చింది అంటే..ఒడిశాలో కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండేది. ఆ టైంలో ఇలా పులియబెట్టిన వంటకం ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుబాటులో ఉన్నవాటితోనే ఇలా బలవర్థకమైన వంటకాన్ని అక్కడి ప్రజలు తయారుచేసుకుని తినేవారు. ఇది వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించేది.
ఎన్నిరకాలు తయారు చేస్తారు..
సజా పఖా (తాజా పఖా): నిమ్మకాయ చుక్కలతో తాజాగా వండిన అన్నం చేసిన తర్వాత తక్షణమే నీటిని జోడించడం ద్వారా తయారుచేస్తారు. ఈ రూపాంతరం కిణ్వ ప్రక్రియ అవసరం లేదు.
బాసి పఖా (పులియబెట్టిన పఖాలా): ఒడియాలో బాసి అంటే పాతది అన్నాన్ని పులియబెట్టడం ద్వారా సాధారణంగా రాత్రంతా ఉంచి మరుసటి రోజు తింటారు. ఇది ఒడిశాల్లో ఏళ్లుగా చేసిన సాంప్రదాయ రెసిపి ఇది. దీనికి నిమ్మకాయలు, ఉల్లిపాయాలు, వివిధ కూరగాయాలు జోడించి రకరకాలు తయారు చేయడం ప్రారంభించారు.
సాగా భాజా: దీని వేయించిన చేపలు, లేదా కాల్చిన కూరగాయలను వేసి తయారు చేస్తారు.
జీరా పఖా: కరివేపాకుతో వేయించిన జీలకర్రను పఖాలో చేర్చి తయారు చేస్తారు
దహి పఖా: పెరుగు జోడించి తయారు చేస్తారు. కాలక్రమేణ ఇలా రకరకాల పఖాలాలు వచ్చాయి.
ఇది వేసవికాలంలో ఎక్కువగా చేసుకునే వంటకం. వేడిని అధిగమించడంలో సహాయపడే రిఫ్రెష్‌నిచ్చే వంటకం. శరారానికి చలువ చేస్తుంది.
అలాగే దీనిలో జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి తోడ్పడే ప్రోబయోటిక్ సమృద్ధిగా ఉంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకోవడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అంతేకాదండోయ్ ఐదేళ్ల క్రితం ఒడిశా ప్రజలు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకి ఈ సంప్రదాయ రెసిపీతోనే విందు ఏర్పాటు చేశారు. ఈ ఒడిశా దిబాస్ నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆ వీడియోని పంచుకున్నారు.
(చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన అడవి పండు! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment