Traditional
-
మాదాపూర్ శిల్పారామంలో లోక్ మంథన్ ఉత్సవాలు (ఫొటోలు)
-
పల్లెటూరి అల్లరి పిల్ల కేతిక.. లుక్కే మార్చేసిందిగా! (ఫొటోలు)
-
బిగ్‌బాస్ బ్యూటీ శోభాశెట్టి ట్రెడిషనల్ లుక్.. అదిరిందిగా! (ఫొటోలు)
-
అనసూయ లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్స్ (ఫొటోలు)
-
Natarajan: సంగీతానికి ఇన్స్ట్రుమెంట్ ఈ కుటుంబం..
భక్తి పాటల భజనకైనా, జానపద గీతాలకైనా, సంగీత కచేరీలకైనా తంబురా, హార్మోనియం, డోలక్, తబలా వంటి వాద్యాలు తప్పనిసరి! పాపులర్ మ్యూజిక్‌లో వీటి జాడ అరుదు ఇంకా చెప్పాలంటే కరవూ! కానీ కర్నూల్లోని నటరాజన్ ఇంట్లో ఇప్పటికీ ఇవి శ్రుతి సరిచేసుకుంటున్నాయి.. శ్రోతలకు మెలోడీ ఫెస్ట్‌ని అందివ్వడానికి!నటరాజన్ సంగీత వాద్యపరికరాలు తయారు చేయడంలో ఘనాపాఠి! ఇది ఆయనకు వారసత్వంగా అబ్బిన, అందిన విద్య, వృత్తి, సంపద కూడా! నటరాజన్ తాత, ముత్తాతల కాలం నుంచీ ఇది కొనసాగుతోంది. ఆ కుటుంబంలోని అందరూ బాగా చదువుకున్నవారే. నటరాజన్ ముత్తాత మురుగేషన్ మొదలియార్.. బ్రిటిష్ కాలంలో హార్మోనియం గురువుగా ఉన్నారు. డ్రామాలకు దుస్తులను సరఫరా చేసే కంపెనీనీ నడిపారు. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరైన రామస్వామి కొడుకే నటరాజన్ తండ్రి.. బాలసుబ్రహ్మణ్యం.పేపర్ మిల్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆ మిల్లు మూతపడటంతో తాతల వృత్తి సంగీత వాద్యపరికరాల తయారీని జీవనోపాధిగా మలచుకున్నారు. దాన్ని తన కొడుకు నటరాజన్‌కూ నేర్పారు. నటరాజన్ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అయినా తండ్రి నేర్పిన విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. హార్మోనియం, వయొలిన్, వీణ, మృదంగం, డోలక్, తబలా, ఫ్లూట్ వంటి వాయిద్యాలను యువతను ఆకర్షించేలా తయారుచేస్తున్నారు. వీరి ఈ పరికరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ డిమాండ్ ఉంది. ఈయన దగ్గర అయిదు వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల దాకా విలువ చేసే హార్మోనియం, వీణ, తబలాలు అందుబాటులో ఉన్నాయి.‘నేటి స్ట్రెస్ఫుల్ లైఫ్‌కి మంచి ఊరట సంప్రదాయ వాద్య సంగీతం. ఇది మనసును ఇట్టే తేలిక చేసి సాంత్వననిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులోకి రావడంతో అలనాటి సంగీత పరికరాలను మర్చిపోతున్నారు. గత అయిదారు సంవత్సరాల నుంచి దేవాలయాల్లో భజన కార్యక్రమాలు ఎక్కువవడంతో మళ్లీ అలనాటి సంగీత పరికరాలకు ఆదరణ పెరిగి.. మాకు మళ్లీ చేతినిండా పని దొరికినట్టయింది’ అని చెబుతున్నారు నటరాజన్. – కె.రామకృష్ణ -
Navya Nair : స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నవ్య నాయర్ (ఫోటోలు)
-
పాత పాత్రలతో వంటకాలకు కొత్త రుచులు!
సంప్రదాయంగా వస్తున్న అనేక రకాల వంట పాత్రలతో వంటకాలకు కొత్త రుచులను అద్దవచ్చునని పాకశాస్త్ర నిపుణులు అంటున్నారు. సంప్రదాయ వంట పాత్రలపై నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ విభిన్న రుచులు, సువాసనల సమ్మేళనమైన తెలంగాణ వంటకాలు సంప్రదాయ వంటపాత్రల్లో వండడం ద్వారా మరింత సువాసనను, రుచులను జోడించవచ్చని వివరించారు.సాధారణంగా రుచికి, వంటకు ఉపయోగించే పాత్రలకి ఉన్న సంబంధాన్ని తక్కువగా పరిగణనలోకి తీసుకుంటారని, అయితే వారసత్వంగా మనకు అందివచ్చిన పాత్రలను మాత్రం ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే రూపొందించారన్నారు. ఈ సందర్భంగా గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ, ‘మట్టి సువాసనలను నింపే మట్టి కుండల నుంచి, ఇనుప పాత్రల వరకు సాంప్రదాయ తెలంగాణ వంట పాత్రలు ప్రతి వంటకానికి తమదైన ప్రత్యేకతను అద్దడం ద్వారా వాటికి ప్రామాణికతను జోడిస్తాయి‘ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సంప్రదాయ వంట పాత్రల విశిష్టతలను వివరించారు.రాతి చిప్ప: ఇదొక రాతితో తయారు చేసిన పాత్ర. దీనిని కల్ చట్టి అని కూడా పిలుస్తారు. తెలంగాణ వంటశాలలలో ఓ రకంగా మల్టీ టాస్కర్ ఇది. సన్నటి మంటపై వండితే రుచి బాగుంటుందనుకునే వంటకాలు అయిన పప్పు, సాంబార్లకు ఇది అనువైనదిగా ఉంటుంది. మరింత రుచిని కల్పిస్తుంది. చేతితో చెక్కిన ఈ పాత్రలను ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.ఉరులి: ఒక గుండ్రని వంట పాత్ర ఇది. వివిధ రకాల వంటకాలకు అనువైనది ఈ ఉరులి. కేరళకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారుల చేతుల మీదుగా ఫుడ్–గ్రేడ్ ఇత్తడితో రూపొందింది. ఈ పాత్ర కడాయి తరహాలో ఉపయోగపడుతుంది. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలతో వండిన బెండకాయ వేపుడు (వేయించిన ఓక్రా)తో సహా తెలంగాణలో పలు వంటకాలకు రుచికరమైన ప్రామాణికతను జోడిస్తుంది.మురుకు అచ్చు: ఇది కరకరలాడే మురుకులు లేదా జంతికలు కోసం తప్పనిసరిగా ఉండవలసిన సర్వ సాధారణ సాధనం.అట్టుకల్: సిల్ బత్తా, కల్ బత్తా వంటి విభిన్న పేర్లతో పిలిచే ఈ గ్రైండింగ్ రాయి మొత్తం మసాలాలు, ధాన్యాలు, పప్పులను సువాసనగల పేస్ట్‌లు పౌడర్లుగా మారుస్తుంది. దీనిలో చట్నీలను రుబ్బడం వల్ల అది ఒక కొత్త ఆకర్షణను అందిస్తుంది. ఇంటి వంటల మధురమైన జ్ఞాపకాలను సమున్నతం చేస్తుంది.మట్టి పాత్రసహజమైన మట్టితో రూపొందించిన ఈ సంప్రదాయ కుండ, కోడి కూర (ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ) చేయడానికి సరైన పాత్ర. మట్టికి మాత్రమే కలిగిన ప్రత్యేక లక్షణాలు తేమను నిలుపుకోవడంలో దీనికి సహాయపడతాయి. ఈ కుండలు అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.ది మ్యాజిక్ ఆఫ్ కాస్ట్ ఐరన్: కాస్ట్ ఐరన్ తో చేసిన వంటసామాను తో కూడా తెలంగాణ వంటకాలు వండుతారు. ఈ దఢమైన కుండలు సన్నగా దోసెలు, నోటిలో కరిగిపోయే హల్వా, గుంట పొంగనాలు వంటి వాటికి బాగా అనుకూలం. -
Lok sabha elections 2024: ఇస్తినమ్మా తాంబూలం.. వస్తినమ్మా ఓటింగ్‌కు!
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బలరామ్‌పూర్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు చేసిన ‘సంప్రదాయ’ కృషి వీటన్నింట్లో ఎంతో ఆసక్తికరం. మూడో దశలో భాగంగా ఈ నెల 7న రాష్ట్రంలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బలరామ్‌పూర్ జిల్లాలోని సర్గూజా లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చింతాకులు, అక్షితలు అందించారు. తప్పకుండా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంప్రదాయాలను ఇలా వినూత్నంగా వాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. ‘చింతాకులు, అక్షితలు అందించడం మా సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లకు, మా సంఘం కార్యక్రమానికి ఇలాగే ఆహా్వనిస్తాం. అదే పద్ధతిలో విధిగా ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం. దీనికి స్పందన కూడా చాలా బాగా వచి్చంది’’ అని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యురాలు విమలా సింగ్ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు జిల్లా నోడల్ అధికారి రైనా జమీల్ పేర్కొన్నారు. ఓటర్లను ఇలా వినూత్నంగా పోలింగ్ బూత్‌లకు తరలాల్సిందిగా కోరిన తీరు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలను కూడా ఆకట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం మే 13న నాలుగు విడతలో మొదలై జూన్ 1న ఏడో విడత దాకా కొనసాగనుంది. అక్కడ కూడా ఇలా ఓటర్లను సంప్రదాయ పద్ధతిలో ఓటేసేందుకు ఆహా్వనించాలని పలు జిల్లాల ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట!– సాక్షి, నేషనల్ డెస్క్ -
'పఖాలా'తో వేసవి తాపం పరార్!
ఒడియా ప్రజల సంప్రదాయ వంటకం పఖాలా. ఈ వంటకం కోసం ప్రత్యేక రోజు కూడా ఉంది. ఆ రెసీపీ పేరుతోనే ప్రతి ఏటా మార్చి 20న 'పఖాలా దిబాసా' అనే దినోత్సవాన్న ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఒడియా ప్రజలంతా ఆ వంటకాన్ని వివిధ పద్ధతుల్లో తయారు చేసుకుని ఆస్వాదిస్తారు. అంతేకాదు పూరీ జగన్నాథుడికికి నైవైద్యంగా ఈ వంటకాన్నే పెడతారు కూడా. ఇంతకీ ఏంటా ప్రత్యేకమైన వంటకం? ఎలా తయారు చేస్తారు. ఆ వంటకం పేరు 'పాఖాల భాటా(పఖాలా భాటా)'. దీన్ని 'పఖాలా' లేదా 'పాఖాలా' అని పిలుస్తారు ప్రజలు. ఇది ఒడిశా సంప్రదాయ వంటకం. ఈ వంటాకాన్ని వండిన అన్నంలో కడిగినా లేదా నీటిలో తేలికగా పులియబెట్టి తయారు చేస్తారు. దీన్ని పప్పు తప్పించి వివధ రకాల కూరలతో నొంచుకుని తింటారు. ఇది వేసవిలో తాపాన్ని హరించే ఒరిస్సా సంప్రదాయ వంటకం. అయితే ఒడిస్సాలో ఈ వంటకాన్ని 10వ శతాబ్దం నుంచి పూరీకి చెందిన జగన్నాథుడికి నైవైద్యంగా పెట్టే రెసిపీలో దీన్ని కూడా చేర్చారు. ఈ వంటకాన్ని నేపాల్, మయాన్మార్ ప్రజలు కూడా తినడం విశేషం. నిజానికి ఈ వంటకం ఎలా వచ్చింది అంటే..ఒడిశాలో కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండేది. ఆ టైంలో ఇలా పులియబెట్టిన వంటకం ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుబాటులో ఉన్నవాటితోనే ఇలా బలవర్థకమైన వంటకాన్ని అక్కడి ప్రజలు తయారుచేసుకుని తినేవారు. ఇది వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఎన్నిరకాలు తయారు చేస్తారు.. సజా పఖా (తాజా పఖా): నిమ్మకాయ చుక్కలతో తాజాగా వండిన అన్నం చేసిన తర్వాత తక్షణమే నీటిని జోడించడం ద్వారా తయారుచేస్తారు. ఈ రూపాంతరం కిణ్వ ప్రక్రియ అవసరం లేదు. బాసి పఖా (పులియబెట్టిన పఖాలా): ఒడియాలో బాసి అంటే పాతది అన్నాన్ని పులియబెట్టడం ద్వారా సాధారణంగా రాత్రంతా ఉంచి మరుసటి రోజు తింటారు. ఇది ఒడిశాల్లో ఏళ్లుగా చేసిన సాంప్రదాయ రెసిపి ఇది. దీనికి నిమ్మకాయలు, ఉల్లిపాయాలు, వివిధ కూరగాయాలు జోడించి రకరకాలు తయారు చేయడం ప్రారంభించారు. సాగా భాజా: దీని వేయించిన చేపలు, లేదా కాల్చిన కూరగాయలను వేసి తయారు చేస్తారు. జీరా పఖా: కరివేపాకుతో వేయించిన జీలకర్రను పఖాలో చేర్చి తయారు చేస్తారు దహి పఖా: పెరుగు జోడించి తయారు చేస్తారు. కాలక్రమేణ ఇలా రకరకాల పఖాలాలు వచ్చాయి. ఇది వేసవికాలంలో ఎక్కువగా చేసుకునే వంటకం. వేడిని అధిగమించడంలో సహాయపడే రిఫ్రెష్నిచ్చే వంటకం. శరారానికి చలువ చేస్తుంది. అలాగే దీనిలో జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి తోడ్పడే ప్రోబయోటిక్ సమృద్ధిగా ఉంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకోవడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అంతేకాదండోయ్ ఐదేళ్ల క్రితం ఒడిశా ప్రజలు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకి ఈ సంప్రదాయ రెసిపీతోనే విందు ఏర్పాటు చేశారు. ఈ ఒడిశా దిబాస్ నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆ వీడియోని పంచుకున్నారు. View this post on Instagram A post shared by FOOD IN ODISHA | Odisha food | Odia Cuisine (@foodinodisha) (చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన అడవి పండు! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!) -
Actress Shriya Traditional Photos: టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ చీర కట్టు.. ఫొటోలు
-
Anu Emmanuel: అందానికి చీర కడితే అను ఇమ్మాన్యుయేల్లా ఉంటుందేమో (ఫోటోలు)
-
ఇవాళే సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’!
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటీ? తదితరాల గురించే ఈ కథనం!. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం చాలా ముఖ్యం అట్లతద్దె ఈ తద్ది ప్రసిద్దమైనది. ఆంధ్ర ఆడపడుచులకు చాల ముఖ్యమైన పండుగ. అట్లతద్ది ముందురోజు భోగి అని పిలుస్తారు. ఆడపిల్లలందరూ చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని తెల్లవారుఝామునే లేచి ఉట్టి కింద కూర్చుని చద్దన్నం తింటారు(ఇప్పుడు ఉట్లు లేవు లెండి) ఆటపాటలతో కాలక్షేపం చేసి ఉయ్యాలలూగుతారు! పగలంతా ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయం అయిన తరువాత చంద్రదర్శనం చేసుకుని 'చంద్రోదయోమా వ్రతం' చేసి అట్లు దానమిచ్చి , ఉమాదేవిని పూజించి భోజనం చేస్తారు. ఈ అట్లతద్దికి గోరింటాకును పెట్టుకోవడం చాల ముఖ్యం! చర్మ వ్యాధులు రాకూడదని.. గోరింట అంటే గోరు+అంటు= గోరింట అని బ్రౌణ్యం చెపుతోంది. సంస్కృతంలో కూడ దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని సరసాలడతారు. గ్రీష్మఋతువులోని ఆషాఢమాసంలోనూ వర్షఋతువులోని భాద్రపద మాసంలోనూ శరదృతువులోని ఆశ్వయుజ మాసంలోనూ మూడు సందర్భాలలో గోరింటాకును పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ది! తెల్లవారుఝాము నుంచీ ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటలలో ఎన్నో ఆరోగ్యరహస్యాలను పొందుపరిచారు. ఇళ్ళల్లో నీళ్ళతావుల్లో తిరిగే ఆడవాళ్ళకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట.... 'కాళ్ళగజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగామొగ్గ మొగ్గా కాదు మోదుగనీరు నీరుకాదు నిమ్మలబావి బావికాదు వావిటికూర కూరకాదు గుమ్మిడిపండు పండుకాదు పాపిడిమీసం' కాళ్ళకు గజ్జి లాంటి చర్మవ్యాధులొస్తే కంకాళమ్మ ఆకును నూరి పసరుతీసి రాస్తే గజ్జి పోతుంది. దానికి లొంగకపోతే వెలగ మొగ్గను నుజ్జుచేసి శరీరంపై పూసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే వావిటికూరను ముద్దగాజేసి పట్టీలు వేసుకోవాలి అప్పుడు ఆ వ్యాధి నిమ్మళించి గుమ్మడి పండులాగ నిగనిగలాడతారని ఈ పాటలో చెప్పారు! అలాగే గోరింటాకు పెట్టుకున్నగోళ్ళు వాటి రంగులు చూసుకుంటూ 'చిప్పచిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు' అని పాడుకుంటారు. 'ఒప్పులకుప్ప ఒయ్యారిభామా సన్నబియ్యం ఛాయాపప్పు మునగాపప్పూ నీమొగుడెవరు గూట్లోరూపాయి నీమొగుడు సిపాయి' అని ఈరోజు ఉదయంనుంచి తయారు చేసిన పదార్ధాల మూలాలను తలచుకుంటూ వీర్యవృద్ధి కలిగిన ఈ పిండివంటలన్నీ రాబోయే మొగుడికోసమేనని మేలమాడుతూ రోటిపాటలు పాడతారు.ఆ రోళ్ళకు ఉయ్యాలలు కట్టి ఊయలలూపుతూ పెళ్ళయిన పడుచులను మొగుడిపేరు గట్టిగా చెప్పేదాకా వదలకుండా ఊపుతారు. పెట్టుకున్న గోరింటాకు ఎలా పండిందో చూసుకుని మురిసిపోతూ ... 'గోపాలకృష్ణమ్మ పెళ్ళయ్యేనాడు గోరింట పూచింది కొమ్మలేకుండా మాఇంట అబ్బాయి పెళ్ళయ్యేనాడు మల్లెలు పూచాయి మొగ్గలేకుండా' ఈ సంప్రదాయ స్త్రీ పాటనే కృష్ణశాస్త్రిగారు తమపాట పల్లవిగా మలచుకున్నారు. తరువాత వారి చరణమే 'మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిట్టిచేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు' అనుకుంటూ చంద్రోదయోమావ్రతం చేసుకుంటారు! ఇవన్నీ నిన్నామొన్నటి వరకు పల్లెపడుచుల అట్లతద్ది ఆటపాటలు. బహుశః ఏ పైలోకాలలోనో తెలుగు ఆడపడుచులకు వాళ్ళ చిన్నతనంలోని పాటలన్నీ వినాలనిపించిందేమో ... ఈ పాటల ఊయలలను తీసుకుపోయి అందనంత ఎత్తులో వాళ్ళదగ్గరే ఉంచేసుకున్నారు. కానీ ఊయలెప్పుడూ ఒకేచోట ఉండదు! అది కిందకు రాక తప్పదు!! మళ్ళీ ఈ అట్లతద్ది ఆటపాటలు మాకందివ్వకా తప్పదు!!! ఈ తరం పడుచులందరికీ ఒకటే వినతి! రండి లేవండి తెల్లవారు ఝామునే చద్దన్నం తిని మన ఆటపాటల ఊయలను మనమే పట్టుకుందాం రండి!! 'అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ సీమ పచ్చిమిరపకాయ్ చిఱ్ఱో చిఱ్ఱో నీ మొగుడు కొడితే మొఱ్ఱో మొఱ్ఱో' అట్లతద్ది అంతరార్థం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఈ పండుగను అవివాహిత స్త్రీలు చేస్తే మంచి మొగుడు వస్తాడని, పెళ్లైన వారు చేస్తే సౌభాగ్యం కలకలం ఉంటుందని శాస్త్ర వచనం. (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
Birthday Special: అదిరే అందం..అదితి హైదరి సొంతం
-
Srinidhi Shetty Latest Photos: ట్రెడిషనల్ & ట్రెండీ లుక్‌లో కవ్వించేస్తోన్న కేజీఎఫ్ బ్యూటీ
-
Shakeela: ఒకప్పుడు గ్లామర్ డాల్.. ఇప్పుడు ట్రెడిషనల్ అవతార్ (ఫోటోలు)
-
Saxophonist: శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి
సుబ్బలక్ష్మి ఇంటి పేరు ఎవరికీ తెలియదు. ప్రపంచమంతా ఆమెను శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి అనే పిలుస్తుంది. మగవారు మాత్రమే వాయించే ఈ వాయిద్యంలో సుబ్బలక్ష్మి స్త్రీగా ఉనికి సాధించింది. పట్టుచీర, వడ్డాణం ధరించి వేదిక మీద సంప్రదాయ ఆహార్యంలో ఈ ఆధునిక వాయిద్యం మీద వెస్ట్రన్, కర్నాటక్‌లో అద్భుత ప్రతిభ చూపుతుంది. డైరీలో ఒకరోజు కూడా ఖాళీ ఎరగని ఈ బెంగళూరు వాద్యకారిణి సక్సెస్ స్టోరీ. 40 ఏళ్ల సుబ్బలక్ష్మి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలంటే సంవత్సరం ముందు బుక్ చేసుకోవాలి. ఆమె డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఇవాళ చెన్నై, రేపు బెంగళూరు, ఎల్లుండి దుబాయ్... ఆమె కచ్చేరీలు సాగిపోతూ ఉంటాయి. భర్త కిరణ్ కుమార్‌కు ఐ.టి. రంగంలో మంచి ఉద్యోగం. కానీ ఈమె కచ్చేరీల బిజీ చూసి ఉద్యోగం మానేసి సాయంగా ఉంటున్నాడు. బెంగళూరులో నివాసం ఉండే సుబ్బలక్ష్మి సొంతింట్లో ఉండేది తక్కువ. కచ్చేరీలకు తిరిగేది ఎక్కువ. కాని ఈ విజయం అంత సులువు కాదు సుమా. ఒక్కతే శిష్యురాలు సుబ్బలక్ష్మి పూర్తిపేరు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. అవును. మహా గాత్ర విద్వాంసులు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని జ్ఞప్తికి తెచ్చే పేరు. ఆ పేరు ప్రభావమో, ఇంట్లో సంగీతం ఉండటమో సుబ్బలక్ష్మికి కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. సుబ్బలక్ష్మి తాత మైసూర్ సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉండేవాడు. సుబ్బలక్ష్మి తండ్రి సాయినాథ్ మంగళూరులో మృదంగ విద్వాంసుడు. అతడు అనేకమంది సంగీతకారులకు కచ్చేరీల్లో వాద్య సహకారం అందించేవాడు. ఐదో ఏట నుంచే గాత్ర సంగీతం నేర్చుకుంటున్న సుబ్బలక్ష్మి ఒకసారి తండ్రితోపాటు కచ్చేరీకి వెళ్లింది. అది శాక్సాఫోన్ విద్వాంసుడు కద్రి గోపాల్‌నాథ్ కచ్చేరి. అందులో గోపాల్‌నాథ్ అద్భుతంగా శాక్సాఫోన్ వాయిస్తుంటే సుబ్బలక్ష్మి మైమరిచిపోయింది. తాను కూడా శాక్సాఫోన్ నేర్చుకోవాలనుకుంది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. ఆ రోజుల్లో ఆడపిల్లలు శాక్సాఫోన్ను అంతగా నేర్చుకునేవారు కాదు. గురువులు నేర్పించేవారు కూడా కాదు. అది పూర్తిగా మగవారి వాయిద్యం. కాని సుబ్బలక్ష్మి పట్టుబట్టింది. మొత్తం 16 మంది శిష్యులు ఆ సమయంలో కద్రి గోపాల్‌నాథ్ దగ్గర ఉంటే వారిలో ఒకే ఒక శిష్యురాలు సుబ్బలక్ష్మి. గర్భం దాల్చాక కూడా సుబ్బలక్ష్మి శాక్సాఫోన్ వాయించడంలో ఒక వరుస ఉంటుంది. ఆమె మొదట కర్నాటక సంగీతం వాయించి ఆ తర్వాత ఫ్యూజన్లోకి వస్తుంది. వెస్ట్రన్‌ను, కర్నాటక్ను మిళితం చేసి కచ్చేరీల్లో ఒక ఊపు తెస్తుంది. అది జనానికి నచ్చుతుంది. ఇది కూడా కొంతమంది శాక్సాఫోన్ విద్వాంసులకు నచ్చదు. ఆమెను విమర్శిస్తుంటారు. ‘నన్ను ఎన్నో విమర్శిస్తారు. కాని నేను భయపడలేదు. కచ్చేరీలు కొనసాగించాను. 7 కిలోల శాక్సాఫోన్ను రెండు గంటల పాటు పట్టుకుని కచ్చేరి చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆడది అలా చేయలేదు అనేవాళ్లకు సమాధానంగా నిలిచాను. నా ఊపిరితిత్తుల బలం నాకు సహకరించింది. పెళ్లయి గర్భం దాల్చాక నా శత్రువులు ఇక ఆమె కచ్చేరీలు చేయదు అనే ప్రచారం మొదలెట్టారు. డెలివరీ అయ్యాక కచ్చేరీలు సాధ్యం కాదని ఆర్గనైజర్స్‌ను భయపెట్టారు. దాంతో షోలు బుక్ చేసిన ఆర్గనైజర్స్ అడ్వాన్సులు వెనక్కు ఇమ్మని అడగడం మొదలెట్టారు. నేను పట్టుదలగా ఆ పుకార్లను తోసి పుచ్చాను. రేపు డెలివరీ అనగా ఇవాళ కూడా కచ్చేరీ చేశాను. నిండు గర్భవతిగా స్టేజ్ మీద శాక్సాఫోన్ వాయించింది నేనే అనుకుంటా. అలాగే డెలివరీ అయిన 15 రోజులకు మళ్లీ స్టేజ్ మీదకు వచ్చాను. ఈ రంగంలో నేనేమిటో నిరూపించుకోవాలనే నా పట్టుదలే నాకు బలాన్ని ఇచ్చింది’ అంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి సోదరి లావణ్య కూడా శాక్సాఫోన్ విద్వాంసురాలిగా రాణిస్తోంది. వీరు విడివిడిగా కచ్చేరీలు చేసినా కలిసి చేసే కచ్చేరీలు కూడా వీనుల విందుగా ఉంటాయి. ఎన్నో వెక్కిరింతలు సాధనలో అబ్బాయిలు సుబ్బలక్ష్మిని అస్సలు సహించలేదు. ‘నేను శాక్సా పట్టుకుని సాధన చేస్తుంటే వాళ్లు నవ్వుతుండేవారు. కుర్చీ కిర్రుకిర్రుమన్నట్టు ఉంది అనేవారు. గురువు గారి భార్య మా అమ్మకు స్నేహితురాలు. వీళ్లు నవ్వుతుంటే ఆమె బయటికొచ్చి చూసి– వాళ్లు నవ్వనీ ఏమైనా అననీ... నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. నీకు వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. ఆమె ప్రోత్సాహం వల్ల ధైర్యం తెచ్చుకున్నాను. నేను శాక్సాఫోన్ నేర్చుకోవడంలో ప్రోత్సాహం కంటే అవమానమే ఎక్కువ. కచ్చేరీల్లో కావాలని నా టైము మధ్యాహ్నం ఇచ్చేవారు. ఆ సమయంలో ఆడియెన్స్ ఉండరు. మహా అయితే పది నిమిషాలు కేటాయించేవారు. మగవారు సాయంత్రం నిండు సభలో వాయించేవారు. వారికి గంట సమయం దొరికేది. నన్ను ప్రత్యేకంగా మహిళా శాక్సాఫోనిస్ట్ అని విడిగా చూసేవారు’ అని తెలిపింది సుబ్బలక్ష్మి. -
గిన్నిస్ భర్ సింగ్
పంజాబ్‌కు చెందిన అమృత్భర్సింగ్ పేరు వినబడగానే అదేదో ఆయన ఇంటి పేరులాగా ‘గిన్నిస్ బుక్’ అనే సౌండ్ ఠకీమని ప్రతి«ధ్వనిస్తుంది. గతంలో ఎన్నో రికార్డ్లను క్రియేట్ చేసిన అమృత్భర్సింగ్ తాజాగా మరో రికార్డ్ సృష్టించాడు. ఒక నిమిషంలో ఫింగర్ టిప్స్‌పై 86 పుషప్‌లు చేసి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. గుర్దాస్పూర్ జిల్లా ఉమర్వాలా గ్రామానికి చెందిన సింగ్ ΄ాశ్చాత్య పద్ధతుల్లో కాకుండా సంప్రదాయ పద్ధతుల్లో ్ర΄ాక్టీస్ చేస్తుంటాడు. మోడ్రన్ జిమ్‌లకు వెళ్లకుండా ఇంటిపరిసరాలలో ఉన్న పశువుల కొట్టాన్ని జిమ్‌గా మార్చుకున్నాడు. ఇటుకలు, ఇసుక బస్తాలు, ΄్లాస్టిక్ క్యాన్లు తన ్ర΄ాక్టీసింగ్ సాధనాలు. సప్లిమెంట్స్‌కు దూరంగా ఉండే సింగ్ నేచురల్ డైట్స్ మాత్రమే తీసుకుంటాడు. ‘గతనెల ఫిబ్రవరి నెలలో సెట్ చేసిన రికార్డ్‌ను నేనే బ్రేక్ చేయాలనుకున్నాను. ్ర΄ాక్టీస్ కోసం ఎన్నోనెలలు చెమటలు చిందించాను. ఫలితం వృథా ΄ోలేదు’ అంటున్నాడు అమృత్భర్ సింగ్. -
రాత్రికి రాత్రే వయసు తగ్గిపోయింది!
రాత్రికి రాత్రే వయసు ఏకంగా ఒకటి నుంచి రెండేళ్లు తగ్గిపోయింది. అదీ ఒకరిద్దరికీ కాదు. ఏకంగా 5 కోట్ల మందికి!. ఇదేం జంబలకిడి పంబ మాయ కాదు. కొత్తగా తీసుకొచ్చిన చట్టం మూలంగా అక్కడి ప్రజల వయసు అలా ఆటోమేటిక్‌గా తగ్గిపోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏమా చట్టం? ఎవరా ప్రజలు?.. ఎందుకు మార్చాల్సి వచ్చింది తెలియాలంటే.. దక్షిణ కొరియా.. జనాభా దాదాపు ఐదున్నర కోట్ల దాకా ఉంటుంది. కానీ, వాళ్లను వయసెంత అని అడిగితే మాత్రం మూడు రకాల సమాధానాలు ఇస్తుంటారు. దాని వల్ల ఆ దేశంలో అన్నింటా గందరగోళమే!. అందుకు కారణం.. మూడు విధాలుగా వాళ్ల వయసును లెక్కించడం. ► సౌత్ కొరియాలో ఇప్పటివరకూ.. సంప్రదాయ పద్దతిలో వయసు లెక్కింపు విధానంతో పాటు కేలండర్ ఏజ్, ఇంటర్నేషనల్ ఏజ్ అనే మూడు రకాల పద్ధతులను వాడుతూ వచ్చారు. కొరియన్ సంప్రదాయం ప్రకారం.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే వయసు లెక్కింపు మొదలవుతుంది. అలాగే.. జనవరి 1వ తేదీ నుంచి(కేలండర్ ఏజ్) ప్రకారం ఒక వయసు(అంటే ఒకవేళ బిడ్డ డిసెంబర్ 31వ తేదీన పుట్టినా కూడా.. ఆ మరుసటి రోజు నుంచి ఆ బిడ్డ వయసును రెండేళ్లుగా గుర్తిస్తారు) ఒక వయసు, ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కు తగ్గట్లుగా అంటే అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి వయసు లెక్కింపు(డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా).. ఇలా మూడు రకాలుగా ఉంటూ వచ్చింది. ► ఉదాహరణకు ఒక వ్యక్తి 2003 జూన్ 30వ తేదీన పుట్టాడనుకోండి.. ఆ వ్యక్తికి 29 జూన్ 2023 నాటికి ఇంటర్నేషనల్ ఏజ్ బర్త్ ప్రకారం 19 ఏళ్లు, అదే కౌంటింగ్ ఏజ్ విధానంలో 20, కొరియన్ ఏజ్ విధానంలో 21 ఏళ్లు ఉండేది. దీనివల్ల చదువు మొదలు ఉద్యోగాల దాకా అన్నింటా చాలా ఏళ్లుగా గందరగోళం ఏర్పడుతూ వస్తోంది. పైగా ఈ తరహా విధానాల వల్ల ప్రభుత్వాలపై ఆర్థికంగా పెను భారం పడుతూ వచ్చింది ఇంతకాలం. ► దీనికి తెర దించేందుకు.. ఇక నుంచి అంతర్జాతీయ విధానాన్ని.. అంటే అన్ని దేశాల్లో ఎలా అనుసరిస్తారో అలా పుట్టిన తేదీ నుంచి(డేట్ ఆఫ్ బర్త్) విధానాన్ని అనుసరిస్తారు. ఇందుకోసం చేసిన చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. సో.. ఇప్పటి నుంచి పుట్టిన తేదీ ప్రకారమే అక్కడి ప్రజలు జీవనం కొనసాగించనున్నారు. ► దక్షిణ కొరియాకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యూన్ సుక్ యోల్ సంస్కరణల వైపుగా అడుగులేయడం మొదలుపెట్టారు. సాంప్రదాయ వయస్సు-గణన పద్ధతులు వల్ల అనవసరమైన సామాజిక, ఆర్థిక వ్యయాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఇక నుంచి కొత్త చట్టం అమలు మూలంగా అన్ని జ్యుడీషియల్, అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో అంతర్జాతీయ వయసు లెక్కింపు విధానాన్నే అను సరిస్తారని, దీనివల్ల సామాజిక గందరగోళాలు, వివాదాలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ► ఈ చట్టాన్ని పోయిన ఏడాది డిసెంబర్ లోనే పార్లమెంట్ ఆమోదించింది. అలాగే పబ్లిక్ ఒపీనియన్లో భాగంగా సర్కారు నిర్ణయానికి ఏకంగా 86.2% దేశ ప్రజలు మద్దతు ప్రకటించారు. మిగతా సర్వేల్లోనూ.. ప్రతీ నలుగురిలో ముగ్గురు డేట్ ఆఫ్ బర్త్ వయసు గణన వైపే మొగ్గు చూపించారు. గతంలో చాలా దేశాలు సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలను పాటించేవి. అందులో తూర్పు ఏషియా దేశాలు ప్రముఖంగా ఉండేవి. అయితే వీటిలో చాలావరకు వాటిని వదిలేసి.. గ్లోబల్ స్టాండర్డ్‌ను పాటిస్తూ వస్తున్నాయి. జపాన్ 1950లో, ఉత్తర కొరియా 1980 దాకా సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలనే పాటిస్తూ ఉండేవి. ఇదీ చదవండి: డైనోసార్లు మనకు కాస్త దగ్గరే! -
జై శ్రీ అన్నా
గతంతో పోల్చితే చిరుధాన్యాల పెద్ద ఉపయోగాల గురించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విస్తృత అవగాహన పెరిగింది. దీనికి సాక్ష్యంగా నిలిచే వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ షేర్ చేశారు. ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక గ్రామంలోకి వెళ్లారు. ఆ గ్రామంలోని ఒక మహిళ మంత్రిగారికి చిరుధాన్యాలతో చేసిన సంప్రదాయ వంటల రుచి చూపించడమే కాదు... జొన్నె రొట్టె నుంచి రాగి లడ్డు వరకు చిరుధాన్యాలు చేసే మంచి గురించి మంచిగా మాట్లాడింది. ప్రధాని ప్రశంస అందుకొంది. ‘ప్రతి పల్లెలో ఇలాంటి దృశ్యం కనిపించాలి’... ‘క్షేత్రస్థాయి నుంచి మొదలైన స్పృహ, చైతన్యం వేగంగా విస్తరిస్తుంది’... ‘కనుల విందు చేసే వీడియో’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. -
వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ నిశ్చితార్థ వేడుక
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఎంగేజ్మేంట్ వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. గుజరాతీ హిందూకుటుంబాలలో తరతరాలుగా అనుసరిస్తున్న గోల్ ధన, చునారి విధి వంటి పురాతన సంప్రదాయాలతో ఈ వేడుకను నిర్వహించారు. గుజరాతీ హిందూ కుటుంబాలు తరతరాలుగా పాటిస్తున్న గోల్ ధన, చునారి విధి కార్యక్రమాలు కుటుంబ దేవాలయంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే వేడుక గోల్ ధన. అంటే ఏంటీ గోల్ ధన అంటే బెల్లం, కొత్తిమీర గింజలు అని అర్ధం. గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే నిశ్చితార్థం లాంటిదే. వధువు కుటుంబం బహుమతులు, స్వీట్లతో వరుడి నివాసానికి తరలి వెళ్లి, అక్కడ బంధు మిత్రుల సమక్షంలో ఆపై జంట ఉంగరాలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకున్న తర్వాత దంపతులు తమ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. సాయంత్రం వేడుకలకు అనంత్ సోదరి ఇషా నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు రాధికను ఆహ్వానించడానికి మర్చంట్ నివాసానికి వెళ్లడంతో వేడుకలు ప్రారంభమైనాయి. ఈ మేరకు రిలయన్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనంత్, రాధికలతోపాటు కుటుంబసభ్యులు శ్రీకృష్ణుని దర్శించుకుని సాంప్రదాయ లగ్న పత్రిక లేదా రాబోయే వివాహానికి ఆహ్వానం పఠనం తర్వాత గణేష్ పూజతో విధులను ప్రారంభించడానికి బృందం అక్కడి నుండి వేడుక వేదికకు తరలివెళ్లింది. గోల్ ధన , చునారి విధి తర్వాత అనంత్ రాధిక కుటుంబీకుల మధ్య ఆశీర్వాదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నేతృత్వంలో నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటూ విశేషంగా నిలిచింది. సోదరి ఇషా రింగ్ వేడుక ప్రారంభమైనట్లు ప్రకటించిన వెంటనే అనంత్ రాధిక ఉంగరాలు మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంత్, రాధిక పెళ్లికబురు గత కొన్నిరోజులుగా ప్రత్యేకంగా నిలుస్తోంది. తాజాగా వివాహబంధంలో కీలకమైన వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు . కాగా బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా కుమారుడు అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డ్‌లలో సభ్యునిగా కూడా వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం RIL ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. శైలా, వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక, న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఎన్కోర్ హెల్త్‌కేర్ బోర్డ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ప్రత్యేక దీపాలు,పుష్పాలంకరణతో వేదిక దేదీప్యమానంగా మంగళవారం రాధిక మర్చంట్ మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sankranti 2023: పండగ రోజు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా చేయండి..
పండగ రోజున సంప్రదాయ దుస్తులతో ప్రత్యేకంగా కనిపిస్తూ సందడి చేస్తారు. అదేవిధంగా మేకప్ కూడా ప్రత్యేకంగా ఉంటే లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రోజంతా మేకప్‌తో ఫ్రెష్ లుక్‌లో కనిపించాలంటే ఎంపిక చేసుకునే సాధనాలలోనూ జాగ్రత్త వహించాలి. బ్లష్ సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు ఎక్కువ మేకప్ వేసుకోవడం కాస్త కష్టమే. అయితే, ట్రెడిషనల్‌గా నేచురల్ లుక్ కావాలంటే బ్లష్ అప్లై చేసుకోవచ్చు. ఫెయిర్‌గా ఉన్నవారు బ్లష్‌తో వారి ముఖారవిందాన్ని మరింతగా మెరిపించుకోవచ్చు. బ్లష్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్ ఫౌండేషన్ తో టచ్ అప్ చేయాలి. హైలైటర్ ధరించిన దుస్తులు ప్రకాశవంతమైన రంగులో ఉంటే, దానితో ప్రత్యేకంగా కనిపించడానికి లైట్ మేకప్ ఉత్తమంగా ఉంటుంది. ఇది న్యూడ్ ఐషాడో, లిప్‌స్టిక్‌తో పాటు చాలా తేలికపాటి బేస్ ఉంటుంది. దీనికోసం లైట్ హైలైటర్‌ని ఉపయోగించవచ్చు. మెరిసే కనుబొమ్మ గ్లిట్టర్ ఐషాడో ఎంపిక పండుగ రోజున ఉత్తమ ఎంపిక. సంప్రదాయ రూ΄ాన్ని అధునాతనంగా మార్చడానికి దీన్ని ప్రయత్నించవచ్చు. జరీ అంచు దుస్తులు ధరిస్తారు కాబట్టి బంగారు లేదా వెండి షిమ్మర్ ఐషాడో వేసుకుంటే ముఖ కాంతి మరింతగా పెరుగుతుంది. మాట్ లుక్ చాలా మంది సినీ తారలు మాట్ లుక్ మేకప్‌ని అనుసరిస్తారు. దీంతో చీర లేదా మరేదైనా సంప్రదాయ వేషధారణలో వారు మరింత అందంగా కనిపిస్తారు. మ్యాట్ లుక్ చర్మాన్ని ప్రకాశవంతంగా, సహజంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఈ మేకప్ వేసుకునే ముందు చర్మ తత్వం గురించి తెలుసుకోవాలి. డార్క్ లిప్ స్టిక్ డార్క్ లిప్‌స్టిక్ మీ మేకప్‌ను మరింత అందంగా మారుస్తుంది. పండగరోజుల్లో సాధారణంగా బ్రైట్‌గా ఉండే దుస్తులను ధరిస్తారు కాబట్టి అప్పుడు ముదురు రంగు లిప్‌స్టిక్ ఎంపిక ధరించిన దుస్తులకు తగిన విధంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మాట్ లిప్‌స్టిక్ షేడ్స్ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. -
తిరునామాలు, పంచెకట్టుతో ప్రధాని మోదీ ఎంట్రీ
-
ఆ పాత్ర మేకప్‌కే 45 నిమిషాలకు పైగా: విజయ్ సేతుపతి
Vijay Sethupathi Turns Traditional Street Performer: నటుడు విజయ్ సేతుపతి తాజాగా వీధి బాగోతం కళాకారుడి అవతారమెత్తారు. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా విజయ్ సేతుపతి రాణిస్తున్నాడు. అయితే వైవిధ్యం ఉంటే ఏ తరహా పాత్ర అయినా పోషించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ మధ్య సూపర్ డీలక్స్ చిత్రంలో హిజ్రాగా నటించి ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా మాస్టర్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా వీధి బాగోతం కళాకారుడి అవతారమెత్తారు. తమిళనాడులో పారంపర్య కళల్లో వీధి బాగోతం కళ (తెరు కూత్తు) ఒకటి. ఈ కళను నేర్చుకోవాలనే ఆసక్తిని నటుడు విజయ్ సేతుపతి వ్యక్తం చేశారు. ఈయన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిశ్చల ఛాయాగ్రాహకుడు ఎల్.రామచంద్రన్ వీధి బాగోతం కళాకారుడిగా తీర్చిదిద్ది నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. వీధి బాగోతం కళాకారుడిగా మారడానికి మేకప్‌కే 45 నిమిషాలకు పైగా పట్టిందన్నారు. చదవండి: (ఐదేళ్ల తర్వాత బిగ్స్క్రీన్పై కనిపించబోతున్నా!) -
పండుగ వేళ.. గృహ కళ!
సాక్షి, హైదరాబాద్: పండుగ వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్ రావాలంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో–ఫ్రెండ్లీగా మారుతుందంటున్నారు. ► సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పల్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు కూడా లభ్యమవుతాయి. ► ప్రముఖ ఎల్రక్టానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. ► రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. ► చేతితో తయారు చేసిన మట్టి దీపాంతలు, లాంతర్లు చాలా కామన్. వీటికి బదులుగా అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్య రశి్మని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి. వీటిని హెవీ డ్యూటీ నైలాన్‌తో తయారు చేస్తారు. ఈ లాంతర్ సెట్లు వివిధ డిజైన్స్, రంగుల్లో దొరుకుతాయి. ► ఈ మధ్య కాలంలో నీళ్లల్లో తేలియాడే కొవ్వొత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. అలంకరణ ప్రాయంగా వీటిని పూల కుండీల్లో, మొక్కలున్న ప్రాంతాల్లో, స్విమ్మింగ్‌పూల్, ఫౌంటేన్ వంటి మీద అమర్చుకోవచ్చు. -
తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు
సాక్షి, తిరుమల: సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పాలక మండలి లేని సమయంలో టీటీడీ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని, అయితే అధికారులతో చర్చించి సంప్రదాయ భోజనాన్ని నేటి నుండి నిలిపి వేస్తున్నామని తెలిపారు. తిరుమలలో ఏ ఆహారమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందువలనే సంప్రదాయ భోజనాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. భక్తులు నమ్మొద్దని ఆయన కోరారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గుడికో గోమాత, గోపూజ, గోవిందునికి గోధారిత నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. నవనీత సేవ లాంటి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి నైవేద్యం, కైంకర్యాలకు కావాల్సిన పదార్ధాలు సాంప్రదాయ బద్ధంగా గోవు నుండి పాలు,నెయ్యి, వెన్నను సేకరించి స్వామి వారికి అందింస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సర్వ దర్శనాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.