
పంజాబ్‌కు చెందిన అమృత్‌భర్‌సింగ్ పేరు వినబడగానే అదేదో ఆయన ఇంటి పేరులాగా ‘గిన్నిస్ బుక్’ అనే సౌండ్ ఠకీమని ప్రతి«ధ్వనిస్తుంది. గతంలో ఎన్నో రికార్డ్‌లను క్రియేట్ చేసిన అమృత్‌భర్‌సింగ్ తాజాగా మరో రికార్డ్ సృష్టించాడు. ఒక నిమిషంలో ఫింగర్ టిప్స్‌పై 86 పుషప్‌లు చేసి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. గుర్‌దాస్‌పూర్ జిల్లా ఉమర్‌వాలా గ్రామానికి చెందిన సింగ్ ΄ాశ్చాత్య పద్ధతుల్లో కాకుండా సంప్రదాయ పద్ధతుల్లో ్ర΄ాక్టీస్ చేస్తుంటాడు.
మోడ్రన్ జిమ్‌లకు వెళ్లకుండా ఇంటిపరిసరాలలో ఉన్న పశువుల కొట్టాన్ని జిమ్‌గా మార్చుకున్నాడు. ఇటుకలు, ఇసుక బస్తాలు, ΄్లాస్టిక్ క్యాన్‌లు తన ్ర΄ాక్టీసింగ్ సాధనాలు. సప్లిమెంట్స్‌కు దూరంగా ఉండే సింగ్ నేచురల్ డైట్స్ మాత్రమే తీసుకుంటాడు. ‘గతనెల ఫిబ్రవరి నెలలో సెట్ చేసిన రికార్డ్‌ను నేనే బ్రేక్ చేయాలనుకున్నాను. ్ర΄ాక్టీస్ కోసం ఎన్నోనెలలు చెమటలు చిందించాను. ఫలితం వృథా ΄ోలేదు’ అంటున్నాడు అమృత్‌భర్ సింగ్.