sound
-
లెక్కల్లో మనం తమిళులకు వదిలేసిన... మన తెలుగు సినిమా
సాధారణంగా తొలి తెలుగు టాకీ అనగానే అందరి నోటా వచ్చే మాట ‘భక్త ప్రహ్లాద’ (1932). కానీ, అంతకన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయని తెలుసా? పది రీళ్ళ పూర్తి నిడివి ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే రిలీజైన సదరు నాలుగు రీళ్ళ సినిమా గురించి విన్నారా? తెరపై తెలుగు వారి ఘన వారసత్వానికి గుర్తుగా నిలిచే ఆ సినిమాను అశ్రద్ధతో మనం మన లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామంటే నమ్ముతారా? తమిళులు మాత్రం అది తమదిగా గొప్పగా చెప్పుకుంటున్నట్టు గమనించారా? సుదీర్ఘ పరిశోధనలో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ (1931)పై అనేక కొత్త సత్యాలు బయటపడ్డాయి.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో... మూగ సినిమాలను వెనక్కి నెడుతూ, మాట్లాడే చిత్రాలు వచ్చింది 1931లో! హిందీ–ఉర్దూల మిశ్రమ భాష హిందుస్తానీలో తయారై, 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలమ్ ఆరా’ తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేశిర్ ఎం. ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ‘ఆలమ్ ఆరా’ రిలీజై, ఘనవిజయం సాధించిన తర్వాత మరో ఏడు నెలలకు వచ్చిన ‘ఫస్ట్ ఇండియన్ తమిళ్ అండ్ తెలుగు టాకీ’ ఈ ‘కాళిదాస్’. అక్కడే... ఆ సెట్స్‌లోనే!‘ఆలమ్ ఆరా’ విజయంతోనే దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని ఇరానీకి ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడు ఆయన తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణాదీయుడు హెచ్.ఎం.రెడ్డి వైపు మొగ్గారు. హెచ్.ఎం.రెడ్డి ‘కాళిదాస్’కి నిర్దేశకుడై, తరువాతి కాలంలో ‘దక్షిణ భారత టాకీ పితామహుడి’గా పేరొందారు. గమ్మత్తేమిటంటే – బొంబాయిలోనే, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌లోనే ఈ ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ ‘కాళిదాస్’నూ’’ చిత్రీకరించారు. రంగస్థల నటి, అప్పటికే దక్షిణాదిన కొన్ని మూకీ చిత్రాల్లో నటించిన టి.పి. రాజలక్ష్మి చిత్ర హీరోయిన్. మూకీల రోజుల నుంచి సినిమాల్లో ఉన్న మన తెలుగు వెలుగు ఎల్వీ ప్రసాద్ ‘ఆలమ్ ఆరా’లో లానే, ఈ ‘కాళిదాస్’లోనూ ఒక చిన్న వేషం వేశారు. మరి, ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన నటుడెవరు? అసలు హీరో తెలుగువాడే!కాళిదాస్ పాత్రధారి ఎవరనే అంశంపై చరిత్రలో నరసింహారావు, హరికథా భాగవతార్ పి. శ్రీనివాసరావు, తమిళ నటుడు పి.జి. వెంకటేశన్... ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి, ఆ పాత్ర ధరించినది పైన పేర్కొన్న వారెవరూ కారు! ఆ నటుడి పేరు– వి.ఆర్. గంగాధర్. ఆ రోజుల్లోనే ‘‘బి.ఏ. చదివిన’’ ఉన్నత విద్యావంతుడు. అప్పట్లో ‘‘ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్.’’ ఆయన, రాజలక్ష్మి జంటగా ‘కాళిదాస్’లో నటించారని తాజాగా బయటపడ్డ నాటి ప్రకటనలతో తేలిపోయింది. ఇంకో విశేషం ఉంది. అదేమిటంటే, ఆ ‘కాళిదాసు’ పాత్ర వేసిన సదరు గంగాధర్/ గంగాధరరావు అచ్చ తెలుగువాడు! అవును... ఇది ఇంతవరకు ఎవరూ పట్టించుకోని అంశం. మన సినీచరిత్రలో నమోదు కాని మరుగునపడిన సత్యం! ‘‘...ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన ఒకరిని కాళిదాసుగా నటింపజేశారు’’ అని సాక్షాత్తూ హీరోయిన్ రాజలక్షే్మ చెప్పారు. (ఆధారం: ‘గుండూసి’ పత్రికకు 1950లలో ఆమె ఇచ్చిన భేటీ).ఎల్వీ ప్రసాద్ సైతం అందులో హీరో తెలుగువాడని తేల్చిచెప్పారు. ‘‘...‘కాళిదాస్’కి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించగా, శ్రీమతి టి.పి. రాజలక్ష్మి, మరో తెలుగు నటుడు పాత్రలు పోషించారు’’ అని తన యాభై అయిదేళ్ళ జీవితానుభవాల ఆత్మకథనంలో పేర్కొన్నారు.అది... ఒకటి కాదు! మూడు చిత్రాలు!!‘కాళిదాస్’ తర్వాత రూపొంది, రిలీజైన ‘భక్త ప్రహ్లాద’ పూర్తి తెలుగు టాకీ. ఆ చిత్ర ప్రదర్శనలో తెలుగు మినహా మరో భాషే వినిపించదు. కానీ, ‘కాళిదాస్’ అలా కాదు! అసలు ఆ చిత్ర ప్రదర్శనే... ఒకటి కాదు... ఒకటికి మూడు చిన్న చిన్న చిత్రాల కదంబ ప్రదర్శన! ఆ మూడింటిలో ప్రధానమైనది– ‘కాళిదాస్’. ఈ రచయిత పరిశోధనలో తాజాగా తేలిందేమంటే... ఆ ఫిల్ము వరకు మొత్తం తెలుగు డైలాగుల్లోనే నడిచింది. ‘కాళిదాస్’తో పాటు కలిపి ఒకటే ‘ప్రోగ్రామ్’గా ప్రదర్శించిన మిగతా రెండు లఘు చిత్రాలు మాత్రం తమిళం. అవి... తమిళ దేశభక్తి గీతాలు, తమిళ కురత్తి పాటలు – డ్యాన్సు ఉన్న చిత్రాలు.కొన్నేళ్ళ క్రితమే అన్వేషణలో అందుబాటులోకి వచ్చిన ‘కాళిదాస్’ పాటల పుస్తకం ఆ ‘ప్రోగ్రామ్’ వివరాలను స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారం ఆ ‘‘ప్రోగ్రామ్’’ వివరాలు ఏమిటంటే... 1). దేశభక్తి నిండిన జాతీయవాద గీతాలు (తమిళంలోవి), కీర్తనలు (తెలుగులోని త్యాగరాయ కీర్తనలు), ప్రణయ గీతాలు (తమిళంలోవి), డ్యాన్స్ చూపిన 3 రీళ్ళ చిత్రం. 2). ‘కాళిదాస్’. ఇందులో కాళిదాస్ హాస్యఘట్టాల్లో ఒకటి, అలాగే అతని జీవితంలోని ప్రేమఘట్టం మరొకటి చూపారు. ఇది 4 రీళ్ళ చిత్రం. (ఇది పూర్తిగా తెలుగు డైలాగులతోనే తీసిన తెలుగు కథాచిత్రం). 3). హీరోయిన్ మిస్. టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై విజయవంతంగా అభినయిస్తూ, అప్పటికే ఎంతో పేరు సంపాదించుకున్న ‘కురత్తి’ డ్యాన్స్. ఇది 2 రీళ్ళ చిత్రం. కురత్తి డ్యాన్స్ అంటే పూసల దండలు, దారాలు విక్రయించేవారు వీథుల్లో చేసే నృత్యాలన్నమాట. మొత్తం ఈ 3 తక్కువ నిడివి చిత్రాల సమాహారమే ‘కాళిదాస్’ అన్నమాట. అన్నీ కలిపితే మొత్తం 9 రీళ్ళు. విడివిడిగా నిడివి తక్కువ గల ఈ మూడు లఘు చిత్రాలనూ కలిపి, ఒకే టాకీ ప్రదర్శనగా రిలీజ్ చేశారు. మూడూ కలిపి ఒకే షోగా వేశారు. అలా ఆ సినిమా ప్రదర్శన అటు తెలుగు డైలాగుల ‘కాళిదాస్’తో పాటు, తెలుగు త్యాగరాయ కీర్తనలు, తమిళ దేశభక్తి గీతాలు, కురత్తి డ్యాన్సుల కదంబ కార్యక్రమంగా జనం ముందుకు వచ్చింది. అన్ని భాషల వారినీ ఆకర్షించేందుకు వీలుగా ‘కాళిదాస్’ను ‘‘తొలి భారతీయ తమిళ, తెలుగు టాకీ చిత్రం’’గా పబ్లిసిటీ చేశారు. అదీ జరిగిన కథ. ‘కాళిదాస్’లో... అన్నీ తెలుగు డైలాగులే! తమిళం, హిందీ లేవు!!అయితే, ఇవాళ తమిళ సినీ చరిత్రకారులు ‘కాళిదాస్’ను వట్టి తమిళ టాకీగానే పేర్కొంటున్నారు. తమ భాష సినిమాగా లెక్కల్లో కలిపేసుకుంటున్నారు. కానీ, ‘కాళిదాస్’లో అసలు తమిళ డైలాగులే లేవు! హీరో తెలుగులో మాట్లాడితే, హీరోయిన్ తమిళంలో బదులు ఇచ్చిందనీ, పూజారి పాత్ర ధరించిన ఎల్వీ ప్రసాద్ లాంటి వారు హిందీలో సంభాషణలు పలికారనే ప్రచారంలోనూ వాస్తవం లేదు. ‘కాళిదాస్’ కథాచిత్రం మొత్తం తెలుగు డైలాగులతోనే తయారైంది. ఆ చిత్ర హీరోయిన్ అప్పట్లోనే చెప్పిన మాటలు, పత్రికల్లోని ఆనాటి సమీక్షలే అందుకు నిలువెత్తు సాక్ష్యం. ఆ ‘కాళిదాస్’ చిత్రంలో ‘‘నేను తమిళ, తెలుగు పాటలు పాడాను. తెలుగులో డైలాగులు చెప్పాను’’ అని ఆ సినిమా రిలీజు వేళలోనే హీరోయిన్ రాజలక్ష్మి పేర్కొనడం గమనార్హం. రాజలక్ష్మి ‘‘జన్మస్థలం (తమిళనాడులోని) తంజావూరు సమీప గ్రామం. తమిళం తప్ప, వేరొక భాషా పరిచయం లేదు.’’ అందుకే, ‘కాళిదాస్’ టాకీలో నటిగా మొత్తం తెలుగు డైలాగులే చెప్పాల్సి వచ్చినప్పుడు, ‘‘తెలుగు మాటలను ద్రావిడ లిపిలో (అంటే తమిళ లిపిలో అన్నమాట) రాసుకొని వల్లించాను’’ అని ఆమె వివరించారు.రాజ్యలక్ష్మి వేరొక సందర్భంలో మాట్లా డుతూ, ‘‘ఒకరోజు (దర్శకుడు) హెచ్.ఎం.రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు. నాకు ఏవేమి వచ్చని ఆయన అడిగారు. కురత్తి పాటలు, నృత్యం తెలుసని చెప్పాను. అంతే... (అవి చేయించి) అది చిత్రీకరించారు. ఆ తర్వాత ‘కాళిదాస్’ అనే చిత్రాన్ని తెలుగులో తీశారు. అందులో రాకుమారిగా నటిస్తూ, ఆయన తెలుగులో చెప్పింది తమిళంలో రాసుకొని, చదువుకొని ఆ సంభాషణలు పలికే అవకాశం నాకు దక్కింది. అలా మొదటి టాకీయే (వివిధ అంశాల, లఘు చిత్రాల) ఒక కదంబ టాకీగా తమిళనాడుకొచ్చింది’’ అని తేటతెల్లం చేశారు. ‘కాళిదాస్’ తెలుగు ఫిల్మ్ అని చెప్పకనే చెప్పారు.మనం వదిలేసుకున్నాం! .. వాళ్ళు కలిపేసుకున్నారు!! ‘కాళిదాస్’లో ఒక్క హీరోయినే కాదు... హీరో సహా అందరూ తెలుగు లోనే మాట్లాడారు. తమిళం ఒక్క ముక్క కూడా లేదు. తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’ సైతం ‘‘...అందులో తమిళ మాటలు లేవు. కనుక్కుంటే, అది తెలుగు భాష అని తెలిసింది. (సినిమా ప్రదర్శన) మొదట్లో, మధ్యలో, చివరలో మాత్రం కొన్ని తమిళ పాటలు వచ్చాయి’’ అని అప్పటి తన సమీక్షలో తేల్చే సింది. (ఆధారం: ‘ఆనంద వికటన్’ 1931 నవంబర్ 16). అంటే, 10 రీళ్ళ పూర్తి నిడివి, పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే తొలిసారిగా తెలుగు మాటలు, పాటలతో వచ్చిన 4 రీళ్ళ లఘు కథాచిత్రం ‘కాళిదాస్’. ఆ ‘కాళిదాస్’లోనే మన తెలుగు మాట, పాట తొలిసారిగా వెండితెరపై వినిపించాయి. తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాయి. తెలుగు భాషకు అంతటి ఘనత కట్టబెట్టింది ‘కాళిదాస్’ అయినా, అది మొత్తం తెలుగు డైలాగులే ఉన్న సినిమాయే అయినా... తెలుగువాళ్ళమైన మనం ఉదాసీనంగా ఆ సినిమాను లెక్కల్లో వదిలేసుకున్నాం. అతి శ్రద్ధ గల తమిళులేమో దాన్ని తమ తమిళ టాకీగా చరిత్రలో కలిపేసుకున్నారు. మరి, కేవలం తెలుగు డైలాగులతోనే తీసినప్పటికీ, ‘కాళిదాస్’ను అప్పట్లో తమిళ – తెలుగు సినిమాగా ఎందుకు చెప్పినట్టు? నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ... తెలుగు, తమిళ, తదితర భాషల సమాహారం. అందరినీ ఆకర్షించాలన్నది సహజంగానే దర్శక, నిర్మాతల భావం. ఈ మూడు లఘు చిత్రాల కదంబ సినీ ప్రదర్శనతోనే... తెలుగు, తమిళ భాషలు రెండూ తెరపై తొలిసారిగా వినిపించాయి. ఆ చిత్రం మొట్టమొదట మద్రాసులో రిలీజవుతున్నప్పుడు ‘‘తమిళ – తెలుగు భాషల్లో తొలి వాక్చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు. అంతేతప్ప, కేవలం తమిళ టాకీ అని చెప్పలేదు. అది గమనించాలి! ఆ రకంగా ‘కాళిదాస్’ ప్రోగ్రామ్‌లో తెర మీద తమిళంతో పాటు తెలుగు కూడా ఒకేసారి వినిపించింది కాబట్టి, తమిళంతో సమానంగా దీటుగా తెలుగూ నిలిచిందని గ్రహించాలి!! పూర్తి నిడివి టాకీల విషయంలో మాత్రం తమిళ ‘హరిశ్చంద్ర’ (రిలీజ్ 1932 ఏప్రిల్ 9) కన్నా ముందే తయారై, రిలీజైన తెలుగు ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6)తో మనమే ముందున్నామని గుర్తించాలి!! దక్షిణాదిలో తొలి సినిమా పాటల పుస్తకంమూడు లఘు చిత్రాల కదంబ ప్రదర్శన ‘కాళిదాస్’లోని తమిళ, తెలుగు పాటలన్నీ హీరోయిన్ రాజలక్షే్మ పాడారు. అప్పట్లో ఈ సినిమా పాటల పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. దక్షిణాదిలో వచ్చిన తొలి సినిమా పాటల పుస్తకమిదే! పాటల పుస్తకంలో ‘కాళిదాస్’ చిత్ర కథా సంగ్రహం వివరాలను తెలుగు, తమిళం, ఇంగ్లీషు మూడు భాషల్లోనూ ప్రచురించడం విశేషం. పాటల పుస్తకం ముఖచిత్రంపై ‘కాళిదాస్’లో రాజలక్ష్మి నృత్యభంగిమ ఫొటో, మద్రాసు కినిమా సెంట్రల్లో సినిమా రిలీజ్ తేదీ తదితర వివరాలు ఇంగ్లీషులో వేశారు. ఇవాళ ఇంటర్నెట్ అంతటా కనిపించే ‘కాళిదాస్’ పోస్టర్ అదే! తెరపై తొలి తెలుగు పాట... త్యాగరాయ కీర్తన! అప్పటికే సుప్రసిద్ధురాలైన టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై పాడుతున్న పాపులర్ త్యాగరాయ కీర్తనలనే ఈ ‘కాళిదాస్’లోనూ ఆమెతో పాడించారు. పాటల పుస్తకంలోని ‘ఎంత రానీ...’ (హరికాంభోజి రాగం, దేశాది తాళం), ‘స్వరరాగ సుధారస...’ (శంకరాభరణ రాగం, ఆది తాళం) రెండు కీర్తనలే కాక ‘రామా నీయెడ ప్రేమ రహితులకు...’ (ఖరహరప్రియ రాగం, ఆది తాళం) అనే మూడో తెలుగు కీర్తన పాడిన సంగతి రాజలక్ష్మి అప్పట్లోనే చెప్పారు. వెండితెరపై వినిపించిన తొలి తెలుగు పాటలు ఇవే! అలా పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932) కన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయన్నది సత్యం.రీలు బాక్సుకు పూజలు, హారతులు‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న మద్రాసులోని ‘కినిమా సెంట్రల్’లో రిలీజైంది. బొంబాయిలో తయారైన ఈ ‘కాళిదాస్’ ఫిల్ము రీళ్ళను తెచ్చినప్పుడు మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి సినిమా హాలు దాకా వాల్‌ట్యాక్స్ రోడ్డులో జనం రీలు బాక్సు వెంట ఊరేగింపుగా నడిచారు. పూలు వెదజల్లారు. కొబ్బరికాయలు కొట్టారు. అగరువత్తులు, కర్పూరం వెలిగించారు. దాన్నిబట్టి, తెరపై స్థానిక భాషను వినిపించే టాకీ పట్ల ప్రజల్లో పెల్లుబికిన ఉత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. సాంకేతికంగా సవాలక్ష లోపాలున్నా బొమ్మ బాక్సాఫీస్ హిట్. ‘కాళిదాస్’ తమిళులు అధికమైన సింగపూర్, మలేసియాలకూ వెళ్ళింది. స్థానిక తమిళుల్ని ఆకర్షించడం కోసం అక్కడ ‘కాళిదాస్’ను తమిళ సినిమాగానే పబ్లిసిటీ చేయడం గమనార్హం. తెలుగు తర్వాతే తమిళం! తొలి పూర్తి తమిళ టాకీ... ‘హరిశ్చంద్ర’! తెలుగు కథాచిత్రానికి... తమిళ పాటలు, కురత్తి డ్యాన్సులు పక్కన చేర్చి రిలీజ్ చేసిన ‘కాళిదాస్’ కదంబమాలిక విజయం దక్షిణాది సినీ చరిత్రలో కీలక పరిణామం. ఆ వెంటనే తెలుగులోనే పూర్తి నిడివి కథాకథన చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ టాకీ నిర్మాణానికి అది పురిగొల్పింది. ‘కాళిదాస్’ తీసిన హెచ్.ఎం. రెడ్డే దానికీ దర్శకుడు. పూర్తిగా తెలుగు మాటలు, పాటల ‘ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న దేశంలోనే తొలిసారిగా రిలీజై, విజయవంతమైంది. ఈ పరిణామాలన్నీ అటుపైన పూర్తి నిడివి తమిళ టాకీ ‘హరిశ్చంద్ర’ (1932) రూపకల్పనకు దారితీశాయి. 1932 ఏప్రిల్ 9న పూర్తిగా తమిళ డైలాగులు, తమిళ పాటలతోనే రిలీజైన ‘హరిశ్చంద్ర’నే ఆ నాటి పత్రికలు ‘‘మొట్టమొదటి తమిళ టాకీ’’ అని పేర్కొన్నాయి (ఆధారం: ‘హిందూ’ డైలీ, 1932 ఏప్రిల్ 8). నిర్మాతలూ ‘హరిశ్చంద్ర’నే ‘‘తొలి పూర్తి నిడివి 100 శాతం తమిళ టాకీ’’ అని ప్రకటనల్లో అభివర్ణించారు. అలా ‘కాళిదాస్’ చిత్ర విజయాన్ని ప్రేరణగా తీసుకొనే... పూర్తి స్థాయి తెలుగు సినిమా, పూర్తి తమిళ సినిమా వచ్చాయి. తెరపై తొలిసారిగా పూర్తిగా తెలుగు డైలాగులతో, మన త్యాగరాయ కీర్తనలతో, తెలుగు హీరో, తెలుగు దర్శకుడితో తయారైన ‘కాళిదాస్’ను ఇప్పటికైనా మన సినిమాగా తెలుగు సినీచరిత్రలో తప్పనిసరిగా గుర్తించాలి. అది అవసరం. మనం చేతులారా వదిలేసుకుంటున్న మన తెలుగు వారి ఘన వారసత్వాన్ని మనమే నిలుపుకోవడం ముఖ్యం.(త్వరలో రానున్న దక్షిణాది సినీ చరిత్ర ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ఆధారంగా)-రెంటాల జయదేవrjayadev@yahoo.com -
Happy Diwali: కాలుష్యరహిత దీపావళి.. ఈ టిప్స్ పాటిద్దాం!
వెలుగుల పండుగ దీపావళి వచ్చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సన్నద్ధ మవు తున్నారు. ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రేమికులు, నిపుణులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దేశంలోని పలు నగరాలలో దీపావళి టపాసులను కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తారా స్థాయికి చేరింది. దీంతో కాలుష్యం నుంచి జనావళిని రక్షించేందుకు టపాసులను నిషేధించారు. అలాగే కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పాక్షిక నిషేధం, ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరి కాలుష్యాన్ని నివారించాలంటే ఏం చేయాలి? కాలుష్యం బారిన పడకుండా టపాసులను కాల్చడం ఎలా? తెలుసుకుందాం.టపాసులు కాల్చని, బాంబుల మోత మోగని దీపావళి ఏం దీపావళి అనుకుంటున్నారా? అవును ఇలా అనిపించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి టపాసులను కాల్చడానికి అలవాటు పడ్డాం. అందులో ఆనందాన్ని అనుభవించాం. గతంలో పర్యావరణ హితమైన టపాసులను ఇంట్లోనే తయారు చేసుకునే వారు. మరిపుడు శబ్దం కంటే వెలుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కాకరపువ్వొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, చిన్ని చిన్న తాటాకు టపాసులను కాల్చే వారు. అదీ కూడా చాలా పరిమితంగా ఉండేది. దీంతో దోమలు, క్రిములు,కీటకాలు నాశనమయ్యేవి. కానీ రాను రాను ఈ పరిస్థితులు మారాయి. రసాయన మిళితమైన, పెద్ద పెద్ద శబ్దాలతో చెవులు చిల్లలు పడేలా బాంబులు వచ్చి చేరాయి. భయంకరమైన, ప్రమాదకరమైన రసాయన పొగ వ్యాపింప చేసే టపాసులు ఆకర్షణీయంగా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అర్థరాత్రి తర్వాత కూడా అపార్ట్మెంట్లలో భారీఎత్తున దీపావళి టపాసులను కాల్చడం అలవాటుగా మారిపోయింది. దీని వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అలాగే పశుపక్ష్యాదులకు ప్రమాదంకరంగా మారింది.మరి ఏం చేయాలి?భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని, కాలుష్యం కాటేయని ప్రకృతిని అందించాలంటే కొన్ని జాగ్రత్తలు, నియంత్రణలు తప్పనిసరి. అందరం విధిగా కొన్ని విధానాలను అనుసరించక తప్పదు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం స్థాయి పెరుగుతుంది అనడానికి దీపావళి తరువాత వచ్చిన కాలుష్యం స్తాయి లెక్కలే నిదర్శనం. పర్యావరణహితమైన గ్రీన్ టపాసులనే వాడాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ పొగ, ఎక్కువ శబ్దం వచ్చేవాటికి దూరంగా ఉండాలివెలుగులు జిమ్మే మతాబులు, చిచ్చు బుడ్లను ఎంచుకోవాలి.అర్థరాత్రి దాకా కాకుండా, కొంత సమయానికే మనల్ని మనం నియంత్రించుకోవాలి. టపాసులను బడ్జెట్‌ను సగానికి సగం కోత పెట్టుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె దీపాలే శ్రేష్టం. అవే మంగళకరం, శుభప్రదం అని గమనించాలి.ఇతర జాగ్రత్తలుటపాసులు కాల్చేటపుడు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దగ్గరుండి కాల్పించాలి. అలాగే సిల్క్,పట్టు దుస్తులను పొద్దున్నుంచి వసుకున్నా, సాయంత్రం వేళ టపాసులనుకాల్చేటపుడు మాత్రం కాటన్ దుస్తులను మాత్రమే వాడాలి.ఇరుకు రోడ్లు, బాల్కనీల్లో కాకుండా, కాస్త విశాలమైన ప్రదేశాల్లో టపాసులు కాల్చుకోవాలి.టపాసులు కాల్చుకోవడం అయిపోయిన తరువాత, చేతులను,కాళ్లు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.ఇంట్లో శిశవులు, చిన్న పిల్లలు ఉంటే శబ్దాలు విని భయపడకుండా చూసుకోవాలి.అసలే శీతాకాలం, పైగా కాలుష్యంతో శ్వాస కోస సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే అందరూ విధిగా మాస్క్‌లను ధరించాలి.అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. సౌకర్యం ఉన్నవారుఇంట్లో గాలి నాణ్యతకోసం ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి.వాయు కాలుష్యం ఇంట్లోని గాలిపై కూడా ప్రభావం చూపుతుంది. దీపావళి సందర్భంగా అధిక స్థాయి కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. పుష్కలంగా నీరు త్రాగాలి.కాలుష్యం ప్రభావం కనపించకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యంలేని శబ్దాలతో భయపెట్టని ఆనంద దీపావళిని జరుపుకుందాం. మన బిడ్డలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. -
చూస్తే.. గోరంత చేపలే! ఇవి శబ్దం చెవులు చిల్లులు పడాల్సిందే!!
ఈ నీటితొట్టెలోని చేపలను చూశారు కదా! ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. వీటి పొడవు దాదాపు గోరంత ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే, ఇవి 10 నుంచి 12 మిల్లీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. పారదర్శకంగా తళతళలాడుతూ చూడచక్కగా ఉంటాయి.అయితే, ఇవి శబ్దం చేస్తే మాత్రం చెవులు చిల్లులు పడాల్సిందే! ఈ చేపలకు శాస్త్రవేత్తలు ‘డేనియోనెల్లా సరీబ్రమ్’ అని పేరుపెట్టారు. వీటి నుంచి వెలువడే శబ్దం 140 డెసిబల్స్ వరకు ఉంటుంది. మామూలుగా మనుషుల చెవులు 70 డెసిబల్స్ వరకు శబ్దాన్ని భరించగలవు. అంతకు రెట్టింపు స్థాయిలో కూత పెట్టగలగడమే ఈ గోరంత చేపల ప్రత్యేకత.వీటి శబ్దం దాదాపుగా జెట్విమాన శబ్దంతో సమానంగా ఉంటుంది. ఈ చేపలను తొలిసారిగా 1980లలో గుర్తించారు. అయితే, ఈ చేపలను పోలిన ‘డేనియోనెల్లా ట్రాన్స్లూసిడా’ అనే మరోరకం చేపలు కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు వీటి లక్షణాలను నిర్దిష్టంగా గుర్తించడంలో కొంత గందరగోళానికి లోనయ్యారు.మూడేళ్ల కిందట ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వీటిపై పరిశోధనలు జరిపి, వీటి కూత శక్తిని తెలుసుకున్నారు. వీటి గొంతు వద్ద ధ్వనికండరాలు, మృదులాస్థి ప్రకంపనల ద్వారానే ఈ చేపలు చెవులు చిల్లులు పడే స్థాయిలో కూత పెట్టగలుగుతున్నాయని గుర్తించారు. వీటి కూత ముందు సింహగర్జన కూడా బలాదూరే! సింహగర్జన శబ్దం 114 డెసిబల్స్ అయితే, ఈ చేపల కూత శబ్దం 140 డెసిబల్స్. ఇంతకు మించిన శబ్దం చేసే జీవి ప్రపంచంలో మరేదీ లేదు. -
వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ ప్రాంతంలో మూడు, నాలుగు వీధి కుక్కలు ఏడాదిన్నర బాలికను బలిగొన్నాయి. చుట్టుపక్కలవారు రక్షించే సమయానికే ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు బాధిత బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలికను దివాన్షిగా గుర్తించారు. మృతురాలు దివాన్షి తుగ్లక్ లేన్‌లోని చమన్ ఘాట్ ప్రాంతంలో తన కుటుంబంతోపాటు ఉంటోంది. బాలిక తండ్రి రాహుల్ దుస్తులను ఇస్త్రీ చేస్తుంటాడు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తుంటాయని రాహుల్ సన్నిహితుడు వివేక్ కుమార్ తెలిపాడు. రాత్రి భోజనం చేశాక రాహుల్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. వారికి తమ కుమార్తె కనిపించలేదు. ఇంటికి కొంత దూరంలో రక్తపుమడుగులో ఆ చిన్నారి కనిపించింది. ఆ సమయంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఘటనాస్థలికి సమీపంలో డీజే ప్లే అవుతున్నదని స్థానికులు తెలిపారు. ఆ సందడిలో చిన్నారి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. చివరికి చుట్టుపక్కలవారు ఎలాగోలా కుక్కల బారి నుంచి ఆ చిన్నారికి విముక్తి కల్పించారు. విషయం తెలుసుకున్న జనం అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇంతలో ఈ ఘటనపై ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి, బాధిత బాలికను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు. -
'శబ్దమే శాపం' ఆమెకు! అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి..
కొన్ని వ్యాధులు ఓ పట్టాన అర్థం కావు. ఎందుకొస్తాయో కూడా తెలియదు. అవి మొత్తం కుటుంబాన్నే అతలాకుతలం చేసేస్తాయి. ఆ వ్యాధులకు చికిత్స లేకపోవడంతో ఇంటిల్లపాది పడే యాతన అంతా ఇంతకాదు. ఇటు బాధితులకి, వారి కుటుంబానికి ఓ ప్రత్యక్ష నరకం లాంటిది ఆ సమస్య అని చెప్పొచ్చు. ఇక్కడొక మహిళ ఎంత దయనీయమైన వ్యాధితో బాధపడుతుందో వింటే కంగుతింటారు. ఇదేం వ్యాధిని రా బాబు! అని నోరెళ్లబెడతారు. ఏం జరిగిందంటే..బ్రిటన్‌కి చెందిన 49 ఏళ్ల కరెన్ కుక్ 'హైపరాక్యుసిస్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా చిన్న శబ్ధాన్ని కూడా భరించలేదు. ఎంతలా అంటే గాలి వీచినా..చెట్ల ఆకుల శబ్దం వరకు ఏ చిన్న శబ్దం విన్నా.. తట్టుకోలేక అల్లాడిపోతుంది. ఈ వ్యాధి కారణంగా భర్త, పిల్లలకు దూరంగా ఒంటరిగా బతుకుతోంది. చెప్పాలంటే తన ఇంట్లోనే ఆమె ఓ ఖైదీలా జైలు శిక్ష అనుభవించేలా చేసింది ఆ వ్యాధి. ఎందుకంటే? భర్త మాట్లాడినా.. ఆఖరికి తన పిల్లలు నవ్వినా తట్టుకోలేదు. కనీసం క్రిస్మస్ పండుగ రోజు కూడా ఆమె వేరే గది కిటికి నుంచి తన కుంటుంబం ఆనందంగా సెలబ్రేట్ చేసుకువడాన్ని చూడాల్సిందే తప్ప వారితో కలిసి ఎంజాయ చేయలేదు. ఆమెకు ఈ వ్యాధి 2022లో అకస్మాత్తుగా వచ్చింది. తర్వాత క్రమక్రమంగా పరిస్థితి దిగజారి తన ఇంట్లోనే తాను వేరుగా ఉండే స్థితికి వచ్చేసింది. ఇంతకీ హైపరాక్యుసిస్ అంటే ఏమిటంటే .. హైపరాక్యుసిస్ అంటే.. హైపరాక్యుసిస్ అనేది ఆ వ్యాధి తీవ్రత బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధి బారినపడ్డ వారికి నిత్యం వినిపించే శబ్దాలే వాళ్లకి బిగ్గరగా వినిపిస్తున్నట్లు ఉంటుంది. ఇది చాలా బాధకరంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తలకు నాణేలు శబ్దం నుంచి.. కుక్క అరవడం, కారు ఇంజిన్ శబ్దం, ఎవరైనా చూయింగ్ గమ్ నమలడం, వాక్యూమ్ క్లీనర్ శబ్దం ఇలా దేన్ని భరించలేరు. ప్రతీ శబ్దం వారిపై ప్రభావం చూపిస్తుంటుంది. తల పగిలిపోయేంత నొప్పి.. ఇక కరెన్ ఈ వ్యాధి కారణంగా ఇయర్ ప్లగ్స్, ఇయర్ డిఫెండర్స్ వంటివి పెట్టుకుంటూ ఉంటుంది. కేవలం సైగలు, రాతలతోనే కుటుంబంతో సంభాషిస్తారామె. ఇది తనకు ఎగజిమ్ముతున్న లావా లాంటి పదార్థాన్ని చెవిలో పోసినట్లు అనిపిస్తుందని వేదనగా చెబుతోంది కరెన్. అంతేగాదు తల పగిలిపోయేలా, తలంతా నొప్పిగా అనిపిస్తుందట. ఒకరకమైన మైగ్రెన్ నొప్పిలా ఉంటుందని అంటోంది. ఒక్కోసారి ఇది భరించలేకు తలను రెండు ముక్కలు చేయాలనిపిస్తుందని ఆవేదనగా చెబుతోంది. ఈ వ్యాధి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యింది. తన ఏడేళ్ల, పదుకొండేళ్ల పిల్లలకు దూరమయ్యానని వేదనగా చెప్పుకొచ్చింది. చివరికి తన భర్తతో కలిసి ఆనందంగా బయటకు వెళ్లలేను, అస్సలు ఏం చేయలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒకరకంగా తన జీవితాన్ని మొత్తం కోల్పోయానని బాధగా చెప్పారామె. ఇక కరెన్ విమాన సిబ్బందిగా పనిచేసేది. దాన్నేమె ఉద్యోగం గాక గుర్తింపుగా భావించేదని కరెన్ భర్త నిక్ అన్నారు. తాము ఎప్పుడూ ఎలాంటి ప్లాన్లు లేకుండా హాయిగా ట్రిప్స్‌కి వెళ్లిపోయి ఎంజాయ్ చేసేవాళ్లం ఇప్పుడూ పరిస్థితి అర్థంకానీ విధంగా భారంగా మారిపోయిందన్నారు. అయితే ఈ వ్యాధికి చికిత్స మాత్రం లేదట. ఇలాంటి సమస్యతో బాధపడే కొందరు రోగులకు వైట్ నాయిస్ వంటి శబ్దాలను వినేలా చేసి ఆ శబ్దాలను భరించే స్థాయిలను అభివృద్ధి చేస్తున్నట్లు యూకే జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. ఇక్కడ వైట్ నాయిస్ అంటే నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే చిన్న శబ్దాలు. అయితే ఈ వినసొంపైన చిన్న శబ్దాలు ప్రకృతికి సంబంధించివైనా ఉండొచ్చు. కానీ కరెన్ విషయంలో ఇది కూడా పనిచేయలేదు. ఆఖరికి పలురకాల థెరఫీలను ప్రయత్నించారు. అవి కూడా పనిచేయలేదు. తన పిల్లల గురించే తాను ఈ వ్యాధి చికిత్స కోసం 18 నెలలుగా అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కరెన్ ఏదో ఒక రోజు తన వ్యాధి నయమయ్యే చికిత్స లభిస్తుందని ఆశగా ఎదురచూస్తుంది. నిజంగా ఇది మాటల్లో చెప్పలేనంత దయనీయమైన స్థితి కదూ.! (చదవండి: రెడ్‌లైట్ థెరఫీతో షుగర్ వ్యాధిని తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
'ఇప్పుడు యూత్ అంతా జియో , ఓయో మీదే నడుస్తోంది'
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం 'సౌండ్ పార్టీ'. ఈ చిత్రాన్ని సంజయ్ శేరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హీరో వీజే సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా పంచ్ డైలాగ్‌లు ఉన్నాయి. ఈ ట్రైలర్లో ప్రస్తుతం యూత్ అంతా జియో , ఓయో మీదే నడుస్తోంది' అనే డైలాగ్ హైలెట్‌గా ఉంది. కాగా.. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ఇంటూరి వాసు, చలాకి చంటి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మోహిత్ రెహమానిక్ సంగీతమందించారు. -
గిన్నిస్ భర్ సింగ్
పంజాబ్‌కు చెందిన అమృత్భర్సింగ్ పేరు వినబడగానే అదేదో ఆయన ఇంటి పేరులాగా ‘గిన్నిస్ బుక్’ అనే సౌండ్ ఠకీమని ప్రతి«ధ్వనిస్తుంది. గతంలో ఎన్నో రికార్డ్లను క్రియేట్ చేసిన అమృత్భర్సింగ్ తాజాగా మరో రికార్డ్ సృష్టించాడు. ఒక నిమిషంలో ఫింగర్ టిప్స్‌పై 86 పుషప్‌లు చేసి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. గుర్దాస్పూర్ జిల్లా ఉమర్వాలా గ్రామానికి చెందిన సింగ్ ΄ాశ్చాత్య పద్ధతుల్లో కాకుండా సంప్రదాయ పద్ధతుల్లో ్ర΄ాక్టీస్ చేస్తుంటాడు. మోడ్రన్ జిమ్‌లకు వెళ్లకుండా ఇంటిపరిసరాలలో ఉన్న పశువుల కొట్టాన్ని జిమ్‌గా మార్చుకున్నాడు. ఇటుకలు, ఇసుక బస్తాలు, ΄్లాస్టిక్ క్యాన్లు తన ్ర΄ాక్టీసింగ్ సాధనాలు. సప్లిమెంట్స్‌కు దూరంగా ఉండే సింగ్ నేచురల్ డైట్స్ మాత్రమే తీసుకుంటాడు. ‘గతనెల ఫిబ్రవరి నెలలో సెట్ చేసిన రికార్డ్‌ను నేనే బ్రేక్ చేయాలనుకున్నాను. ్ర΄ాక్టీస్ కోసం ఎన్నోనెలలు చెమటలు చిందించాను. ఫలితం వృథా ΄ోలేదు’ అంటున్నాడు అమృత్భర్ సింగ్. -
వీజే సన్నీ 'సౌండ్ పార్టీ'.. పోస్టర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత
వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ టైటిల్, పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంటర్టైన్ చేయనుందని టైటిల్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు , చిత్రబృందానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. (ఇది చదవండి:83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ..' ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వస్తోన్న మొదటి సినిమా `సౌండ్ పార్టీ` పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత లాంఛ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన సౌండ్ పార్టీ టైటిల్‌కు రెస్పాన్స్ బాగా వచ్చింది. మా యూనిట్ అంతా ఎంతో శ్రమించి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.'అని అన్నారు. హీరో వీజే సన్ని మాట్లాడుతూ...' ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగొచ్చింది' అన్నారు. దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ' పోస్టర్‌ను కవిత లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని' అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!) -
రోడ్డుపై సావధానంగా వెళ్లండి.. చక్కని సంగీతం వినండి.. వీడియో వైరల్
ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో హంగరీలోని ఒక మ్యూజికల్ రోడ్డు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ రోడ్డుపై తగిన స్పీడుతో వెళుతున్నప్పుడు ఈ సంగీత మాధుర్యం వినిపిస్తుంది. హంగరీ టుడే తెలిపిన వివరాల ప్రకారం ఈ రోడ్డును రోడ్డు నంబర్ 37 అని అంటారు. ఈ రోడ్డు హంగరీలోని ఈశాన్య ప్రాంతంలో ఉంది. ఈ రహదారి స్లోవాకియా సరిహద్దులలోని ఫెస్లోజసోల్కా మీదుగా సటోరల్జౌజెలీ వరకూ సాగుతుంది. ఔట్లెట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోడ్డుపై వాహనం సావధానంగా వెళ్లినప్పుడు ఎరిక్ ఎ స్జొలో అనే జానపద గీతం వినిపిస్తుంది. హంగరీకి చెందిన సోమోగీ కౌంటీలో రెండేళ్ల క్రితం ఈ రోడ్డును నిర్మించారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వార్తల్లో ఉంది. ఈ రోడ్డుకు సంబంధించిన వీడియో తరచూ వైరల్ అవుతోంది. ఈ రోడ్డుకు సంబంధించిన వీడియోకు 15 మిలియన్లకుపైగా వ్యూస్ రాగా, 1.5 లక్షల లైక్స్ దక్కాయి. ఈ రహదారిలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఈ రోడ్డు నిర్మాణంలో ప్రత్యేక అమరిక ఉంది. ఈ రోడ్డుపై వెళ్లే వాహనాల టైర్లకు.. రోడ్డుకు మధ్య రాపిడి జరిగినప్పుడు శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. ఒకవేళ డ్రైవర్ వాహనాన్ని వేగంగా పోనిస్తే వికృతమైన శబ్ధాలు వినిపిస్తాయి. మరికొన్ని దేశాలు కూడా ఇటువంటి ప్రయోగాన్ని చేశాయి. మొదట 1995లో డెన్మార్క్‌లోని గైలింగ్లో రెండు కిలోమీటర్ల మేర ఇటువంటి రోడ్డు నిర్మించారు. రోడ్డుపై ఉబ్బెత్తు ఫుట్‌పాత్ మార్కర్స్ సాయంతో దీనిని నిర్మించారు. ఫ్రాన్స్‌లో 2000లో విలోపింట్ నగరంలో ఇటువంటి రోడ్డు నిర్మించారు. అయితే 2006లో పలువురు డ్రైవర్లు రోడ్డుపై వచ్చే ఈ సౌండ్ తమ ఏక్రాగ్రతను దెబ్బతీస్తున్నదని ఆరోపించారు. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద కష్టం Hungary’s musical road will sing to drivers going the right speed pic.twitter.com/AdI9efp88z — Historic Vids (@historyinmemes) July 24, 2023 -
Hyderabad: గూబ గుయ్‌మంటోంది.. నిద్రపోని మహానగరం
అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్‌రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా. హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మారిన జీవనశైలి అలవాట్లతో... పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు. జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి. అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సోషల్లైఫ్లోనూ ఎంటర్టైన్మెంట్ పేరుతో బర్త్‌డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్‌కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది. ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్‌రెడ్డి -
పేటీఎం రీ‘సౌండ్’! భారీగా పెరిగిన సౌండ్ బాక్స్ సబ్స్క్రైబర్లు
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ పేమెంట్ పరికరాల (సౌండ్ బాక్స్‌లు) ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మే నెల చివరి నాటికి సౌండ్‌బాక్స్ సబ్స్క్రైబర్ల సంఖ్యను ఏకంగా 118 శాతం పెంచుకుంది. సౌండ్‌బాక్స్, పాయింట్-ఆఫ్-సేల్ (పీవోఎస్) మెషీన్ల వంటి పరికరాల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలలో 75 లక్షలకు పెరిగినట్లు ఓ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వన్97 సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే ఏప్రిల్, మే నెలల్లో సబ్స్క్రైబర్ల సంఖ్య 34 లక్షలు ఉండేది. ఈ సంవత్సరం మే నెలలోనే 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరడం గమనార్హం. మార్చి త్రైమాసికంతో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించిన పేటీఎం అంతకుముందు ఆర్థక సంవత్సరంలో 29 లక్షల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండేది. అంటే 134 శాతం వృద్ధిని సాధించింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు కాకుండా అదనపు చెల్లింపు మానిటైజేషన్ ఛానెల్‌ని ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో పేటీఎం ఈ వృద్ధిని సాధించింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే వివిధ చెల్లింపు పద్ధతుల ద్వారా డిజిటల్ చెల్లింపులను అంగీకరించినందుకు వ్యాపారుల నుంచి వసూలు చేసే రేటు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పేటీఎం మర్చంట్ చెల్లింపులు 35 శాతం వృద్ధితో రూ. 2.65 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ. 1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో పేటీఎం అందించిన రుణాలు రూ. 9,618 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇవే నెలల్లో రూ. 3,576 కోట్లు ఉండగా 169 శాతం పెరిగాయి. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
అద్భుతం.. అతని పిలుపుకి కాకులన్నీ ఎలా ఎగరేసుకుంటూ వచ్చాయో!
-
సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు.. ఇండియా మొత్తంలో ఆయన ఒక్కరేనా?
సినిమా అంటే సాధారణంగా అందరి దృష్టి హీరో, హీరోయిన్లపైనే ఉంటుంది. ఆ తర్వాత స్థానం డైరెక్టర్, మ్యూజిక్ ఎవరనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మీకెవరికీ కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో కష్టపడేవారి గురించి మీకు తెలుసా? కనీసం వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి అరుదైన వారి గురించిప్రత్యేక కథనం. మీరెప్పుడైనా సౌండ్ లేకుండా సినిమా చూశారా? బాహుబలి లాంటి సినిమాలో గుర్రపు స్వారీ శబ్దాలు లేకుండా చూడగలరా? మరీ దీనికంతటికీ కారణం ఎవరు? అసలు ఆ శబ్దాలు సృష్టించేది ఎవరో మీకు తెలుసా? ఈ పనిని ఎలా నిర్వర్తిస్తారో తెలుసా? దీని వెనుక చరిత్ర ఏంటీ? అసలు ఈ పనిని ఎవరు చేస్తారు? వారు ఎలా చేస్తారో తెలుసుకుందాం. సినిమాలోని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్లో వచ్చే శబ్దాలు చేసే వారిని ఫోలీ ఆర్టిస్ట్ అంటారు. వీరు సినిమాలోని సందర్భాన్ని బట్టి శబ్దాలు సృష్టించడం వీరి పని. ఎంత పెద్ద సినిమా అయినా వీరు చేసే శబ్దాలు లేకుండా చూడడం చాలా అరుదు. ఈ ఫోలియో ఆర్ట్ అంటే మన రోజు వారి జీవితంలో ఉపయోగించే వస్తువులతో సౌండ్ ఎఫెక్ట్స్ అందించండం. ఈ పనులన్నీ ప్రీ ప్రొడక్షన్ సమయంలో చేస్తారు. కరణ్ అర్జున్ సింగ్ సినీ పరిశ్రమలోని ఫోలీ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించారు కరణ్ అర్జున్ సింగ్. ఆయన చిన్న వయసులోనే ఫేమస్ అయ్యారు. ఆయన పలు రకాల భాషా చిత్రాలకు ఫోలీ పేరుతో సౌండ్ ఆర్ట్‌ను రూపొందిస్తున్నారు. బాహుబలి సినిమాతో సహా పలు ప్రముఖ చిత్రాలకు ఆయన బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు ఇచ్చారు. సినీ పరిశ్రమలో రాణించాలనుకునే వారికి ఆయన ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. అర్జున్ సింగ్ మాట్లాడుతూ..' ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు ఎక్కడ లేరు. కేవలం ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవాల్సిందే. ఫోలీ ఆర్టిస్ట్‌కు సౌండ్ ప్రధానం. ఇప్పటివరకు దీనిపై శిక్షణ ఇచ్చే సంస్థ లేదు. మంచి ఫోలీ ఆర్టిస్ట్ కావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది.' అని అన్నారు. కరణ్ అర్జున్ సింగ్ ఎవరు? కరణ్ అర్జున్ సింగ్ ఒక ప్రముఖ ఫోలీ ఆర్టిస్ట్. 35 సంవత్సరాలకు పైగా బాలీవుడ్ (ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ)తో సహా పలు చిత్రాలకు పని చేస్తున్నారు. ఆయన దాదాపు 3000 కంటే ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. అతను ముంబైలో అత్యంత ప్రతిభావంతులైన ఫోలీ కళాకారులు, సౌండ్ ఇంజనీర్లు, సౌండ్ ఎడిటర్లు, సౌండ్ డిజైనర్లతో జస్ట్ ఫోలీ ఆర్ట్ అనే పేరుతో సౌండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ప్రారంభించారు. -
అంతరిక్షం రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా?
భూమ్మీద ఏ చోటకు వెళ్లినా అక్కడి వాతావరణం ఏదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పరిసరాల్లో ఉండే పరిస్థితులను బట్టి ధ్వనులు వినిపిస్తుంటాయి. మట్టి నుంచి మొక్కలు, జంతువుల దాకా ఎక్కడికక్కడ వాసన, రుచి అనుభూతులు ఉంటాయి. మరి అంతరిక్షంలో ఎలాంటి ధ్వనులు వినిపిస్తాయి? అక్కడి రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా? దీనిపై పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చిన వివరాలు ఇవీ.. గెలాక్సీల మధ్య ధ్వని ప్రయాణం సాధారణంగా వాతావరణం లేనిచోట ధ్వని ప్రయాణించదు అనేది భౌతికశాస్త్ర సూత్రం. విశ్వంలో చాలా భాగం శూన్యమే కాబట్టి ధ్వని ప్రసారం ఉండదనే భావన ఉంది. ఇది కొంతవరకు నిజమే. అయితే వేలకొద్దీ నక్షత్ర సమూహాలు (గెలాక్సీలు) ఉండే గెలాక్సీ క్లస్టర్లు భారీ ఎత్తున గ్యాస్‌తో నిండి ఉంటాయి. వాటిలో ధ్వని ప్రయాణిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతరిక్ష ధ్వనులను విడుదల చేసిన నాసా.. 2003లో పెర్సెయస్ గెలాక్సీ క్లస్టర్ మధ్య ఉన్న ఒక కృష్ణ బిలం (బ్లాక్ హోల్) నుంచి వచ్చిన ధ్వనిని చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ సాయంతో గుర్తించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ఆ ధ్వని ఫ్రీక్వెన్సీని నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కొన్నికోట్ల రెట్లు పెంచారు. మనకు వినపడే స్థాయికి తీసుకొచ్చి విడుదల చేశారు. గ్రహాల ‘పాటలు’ ఇవి నాసా ప్రయోగించిన రోవర్లు, ఉపగ్రహాల సాయంతో పలు గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కల ధ్వనులనూ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. అంగారకుడు, శుక్రుడు, జూపిటర్, శనిగ్రహాలతోపాటు పలు తోకచుక్కల ధ్వనులను నమోదు చేశారు. పర్సవరెన్స్రోవర్ మార్స్పైచేసిన ప్రయోగాలతో.. అక్కడి పలుచని వాతావరణం కారణంగా ధ్వనిఅతి మెల్లగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. విజిల్స్, గంటలు, పక్షుల కూతలు వంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ధ్వనులు దాదాపుగా వినిపించవని తేల్చారు. ఏదో కాలిపోతున్నట్టు వాసనతో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ మరమ్మతులు, ప్రయోగాల కోసం.. బయట శూన్యంలో స్పేస్ వాక్ చేస్తుంటారు. అలా స్పేస్ వాక్ చేసి, తిరిగి ఐఎస్ఎస్లోకి వెళ్లిన తర్వాత.. తమకు ‘ఏదో కాల్చిన మాంసం’.. ‘బాగా వేడి చేసిన ఇనుము నుంచి వెలువడిన లేదా వెల్డింగ్ చేసినప్పుడు వెలువడే పొగ’ వంటి వాసన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఐఎస్ఎస్ బయట అంతరిక్షంలో భారీస్థాయి రేడియేషన్ ఉంటుందని.. దానికి లోనైనప్పుడు స్పేస్ సూట్, ఇతర పరికరాల్లోని పరమాణువులు తీవ్రస్థాయి కంపనాల (హైఎనర్జీ వైబ్రేషన్స్)కు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తిరిగి ఐఎస్‌ఎస్‌లోనికి వచ్చాక ఆ హైఎనర్జీ పార్టికల్స్‌లో కూడిన గాలిని పీల్చడం వల్ల.. వెల్డింగ్ తరహా వాసన వస్తున్నట్టు తేల్చారు. ‘టచ్’లో మార్పు లేదట! అంతరిక్షంలో మన స్పర్శ విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని కెనడా ఆస్ట్రోనాట్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ వెల్లడించారు. అయితే వరుసగా రెండు నెలలపాటు ఐఎస్ఎస్లో గడిపిన వ్యోమగాముల్లో పాదాల అడుగుభాగం గరుకుదనం తగ్గి మెత్తగా అయితే.. పాదాలపైన చర్మం అత్యంత సున్నితంగా మారుతోందని గుర్తించారు. రకరకాల రుచుల్లో నక్షత్రాలు సాధారణంగా వివిధ రసాయనాలను బట్టి పదార్థాలకు రుచి వస్తుంటుంది. అలాగే అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాల రుచినీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మన పాలపుంతలోని సాగిట్టారియస్ బీ2 గా పిలిచే ధూళిమేఘంలో ఈథైల్ ఫార్మేట్ రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దానితో అది గులాబీ జాతికి చెందిన ‘రాస్ప్బెర్రీ’ పండ్ల రుచిని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇక నక్షత్రాలు, ఖగోళ పదార్థాల్లో ఆల్కహాల్, యాసిడ్లు, ఆల్డిహైడ్స్గా పిలిచే రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు అనుగుణంగా వగరు, పులుపు, ఒకరకమైన చేదు వంటి రుచులను తలపించొచ్చని అంచనా వేశారు. కళ్లు ‘ఫ్లాట్’ అవుతాయట! అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపే వ్యోమగాముల్లో ‘స్పేస్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ (సాన్స్)’ సమస్య వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుత్వాకర్షణ లేని వాతావరణం వల్ల కళ్లలోని ఆప్టిక్ డిస్క్‌లో మార్పులు వచ్చి.. కళ్లు గుండ్రని ఆకారాన్ని కోల్పోతూ, దృష్టి సామర్థ్యం తగ్గుతోందని తేల్చారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ ఇదీ చదవండి: భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును! -
ఆస్కార్ బరిలో జేమ్స్ బాండ్.. 4 విభాగాలకు నామినేట్
No Time To Die Movie In Oscar 2022 With 4 Categories: హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు సంబంధించి అత్యంత ఆదరణ పొందిన చిత్రాల్లో ముందుగా ఉండేది జేమ్స్ బాండ్ సినిమాలు. బాండ్.. జేమ్స్ బాండ్.. అనే ఈ ఒక్క డైలాగ్ చాలు బాండ్ అభిమానులను విజిల్స్ వేయించడానికి. ఈ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా కోట్లలో అభిమానులు ఉన్నారు. అంతలా ఈ మూవీ సిరీస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. అందులో బాండ్ చేసే యాక్షన్ సీన్స్, ఉపయోగించే గ్యాడ్జెట్స్ ప్రేక్షకులను, అభిమానులను అబ్బురపరుస్తాయి. అంతేకాదు ఈ ఐకానిక్ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీలో నటించేందుకు ప్రముఖ హాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపుతారు. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో మొత్తం 25 సినిమాలు రాగా ఏడుగురు హీరోలు బాండ్‌గా అలరించారు. అయితే రీసెంట్గా వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టూ డై'లో హీరోగా చేసిన డేనియల్ క్రేగ్‌కి బాండ్‌గా చివరి సినిమా. ప్రపంచవ్యాప్తంగా 30 సెప్టెంబర్ 2021న విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఇందులో నాలుగు విభాగాల్లో 'నో టైమ్ టు డై' చిత్రం నామినేట్ అయింది. ఆస్కార్ బరిలో నిలిచిన 10 కేటగిరీల్లో నాలుగింటికి ఒకే సినిమా ఎంపిక కావడం విశేషం. ఆ నాలుగు విభాగాలు 1. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ 2. మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) 3. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్-చిత్రం టైటిల్ సాంగ్) 4. సౌండ్. అయితే ఈ నాలుగింటిలో 'నో టైమ్ టు డై' సినిమా ఎన్ని ఆస్కార్లు కొల్లగొడుతుందో చూడాలి. సినిమా ప్రత్యేకతలు: తొలిసారిగా ఈ చిత్రం కోసం ఒక అమెరికన్ డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. బీస్ట్ ఆప్ నో నేషన్తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆకర్షించిన కారీ జోజి ఈ సినిమాకు డైరెక్టర్. అలాగే ఈ సినిమా సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ కూడా బాండ్ చిత్రాలకు తొలిసారిగా పనిచేశారు. ఈయన 'ఇన్సెప్షన్', 'ది డార్క్ నైట్', 'గ్లాడియేటర్', 'లయన్ కింగ్' వంటి చిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. బాండ్ చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం టైటిల్ సాంగ్. ఈ సాంగ్‌పై ప్రతీ బాండ్ చిత్రానికి భారీ అంచనాలుంటాయి. వాటికి ఎక్కడా తగ్కకుండా 'నో టైమ్ టు డై' ఒరిజినల్ సాంగ్ అదరగొట్టింది. ఈ పాటను 18 ఏళ్ల యువ సంగీత సంచలనం బిల్లీ ఐలిష్ పాడటం విశేషం. బాండ్ సినిమాకు టైటిల్ సాంగ్ పాడిన అతిపిన్న వయస్కురాలిగా బిల్లీ రికార్డు సృష్టించింది. అలాగే 'స్పెక్టర్' సినిమాకు సామ్ స్మిత్ పాడిన 'రైటింగ్ ఆన్ ది వాల్' సాంగ్‌కి మంచి ఆదరణ లభించింది. హాలీవుడ్ ప్రేమకథా చిత్రం 'లాలా ల్యాండ్'తో ఆస్కార్ గెలుచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'లైనస్ సాండ్‌గ్రెన్' ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 ఇదీ చదవండి: తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు -
ఫేస్బుక్లో సౌండ్ మోత.. ఇక పండుగే!
రెగ్యులర్ ఛాటింగ్ ఫ్లాట్‌ఫామ్‌లలో భావప్రకటన చేసేందుకు సులువైన మార్గాలే ఎమోజీలు. అవసరం ఉన్నా లేకున్నా వాటిని ఒకప్పుడు తెగ ఉపయోగించేవాళ్లు. అయితే జిఫ్ ఫైల్స్, స్టికర్ల రాకతో వీటి వాడకం కొంచెం తగ్గింది. ఈ తరుణంలో ఎమోజీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఫేస్బుక్ ఓ అడుగు ముందుకు వేసింది. యూజర్లకు మరింత వినోదం అందించేందుకు సౌండ్ ఎమోజీలను తీసుకొచ్చింది. ఇందుకోసం ఫేస్బుక్ మెసేంజర్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది. గురువారం రాత్రి నుంచే సౌండ్ ఎమోజీలను పంపే వీలు కల్పించింది. శనివారం(జులై17న) వరల్డ్ ఎమోజీ డే. సో.. అంతకంటే ముందే ‘సౌండ్మోజీ’ పేరుతో ఫీచర్‌ను యూజర్లకు అందిస్తోంది ఫేస్బుక్. ఇంతకు ముందు ఒకటి రెండు ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఎక్కువ ఎమోజీలకు సౌండ్ ఎఫెక్ట్ యాక్సెస్ కల్పించింది మెసేంజర్. మెసేంజర్‌లో ఎమోజీ లైబ్రరీ నుంచి కావాల్సిన ఎమోజీని పంపుకోవచ్చు. అయితే ఆ పక్కనే ఉన్న సౌండ్ బటన్‌ను క్లిక్ చేయాలి. ఒకవేళ బటన్ గనుక కనిపించకుంటే.. యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేం ఫుల్ వాల్యూమ్‌తో ఎమోజీలు పంపిస్తూ పండుగ చేసుకుంటున్నారు కొందరు యూజర్లు. ఇక ఈ విషయాన్ని అధినేత జుకర్‌బర్గ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. -
సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్
ప్రస్తుతం స్మార్ట్ యుగంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. రెండు రోజులో క్రితమే చైనాలో కేవలం ఒకే రోజులో 10 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది. ఇప్పుడు మరోసారి సరికొత్త ఆవిష్కరణకు షియోమీ శ్రీకారం చుట్టింది. గత దశాబ్దం కాలంలో స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ స్క్రీన్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ పవర్, వైర్ లెస్ కనెక్టివిటీ విషయాలలో సాంకేతిక పరిజ్ఞానం చాలా వేగంగా అభివృద్ది చెందింది. అయితే, బ్యాటరీ టెక్నాలజీ మాత్రం టెక్నాలజీ మాత్రం అనుకున్నంత వేగంగా అభివృద్ది చెందలేదు. గత ఏడాది నుంచి ఈ టెక్నాలజీలో పురోగతి కనిపిస్తుంది. మొబైల్ తయారీ కంపెనీలు ఛార్జింగ్ వేగంగా అయ్యేందుకు ఛార్జింగ్ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ ఈ మద్యనే 200వాట్ చార్జర్ ని అభివృద్ది చేసింది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ కోసం దాఖలు చేసినట్లు సమాచారం. గిజ్ చైనా నివేదిక ప్రకారం, షియోమీ రాష్ట్ర సంస్థ చైనా నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ పేటెంట్ టెక్నాలజీ ఒక పరికరాన్ని ధ్వని ద్వారా ఛార్జ్ చేయడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీలో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నట్లు పేటెంట్ ద్వారా తెలుస్తుంది. షియోమీ అభివృద్ది చేస్తున్న కాంటాక్ట్ లెస్ వైర్ లెస్ ఛార్జింగ్ మొదటి రూపం ఇది కాదు. జనవరిలో కంపెనీ తన 'ఎయిర్ ఛార్జ్' టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ ద్వారా గదిలో మనం ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉంచిన ఫోన్ చార్జ్ కానుంది. దీని ఛార్జ్ చేయడానికి బీమ్ ఫార్మింగ్ అనే ఫోకస్టింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అయితే, ఈ కొత్త 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీని కొట్టి పారేస్తున్నారు. చదవండి: బడ్జెట్లో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ -
Ambulance: అక్కడ కుయ్ కుయ్ శబ్ధం బంద్.. ఎందుకంటే..?
ఇంఫాల్: ప్రస్తుతం ఎక్కడ ఉన్నా కుయ్.. కుయ్ అంటూ శబ్ధం చేస్తూ అంబులెన్స్‌లు తెగ తిరుగుతున్నాయి. మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో పెద్ద ఎత్తున ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో అంబులెన్స్‌ల సేవలు పెరిగాయి. రోడ్లపై వాహనాల కంటే వాటి రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రోజంతా కుయ్ కుయ్ అంటూ వెళ్తుండడంతో ఆ శబ్ధం మన చెవులల్లో మార్మోగుతోంది. ఆ శబ్ధం మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. భయాందోళనకర పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే వాటిని శబ్ధం చేయకుండా వెళ్లాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. అంబులెన్స్‌లు చప్పుడు లేకుండా నిశ్శబ్ధంగా రాకపోకలు సాగించాలని మణిపూర్ నిర్ణయం తీసుకుంది. ఆ శబ్ధం వింటే ప్రజలు భయాందోళన చెందుతున్నారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంబులెన్స్‌లు శబ్ధం లేకుండా రాకపోకలు సాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మణిపూర్‌లో కరోనా కొంత తీవ్రంగానే ఉంది. తాజాగా మంగళవారం 624 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. -
వేళ్లు విరిస్తే చిటుకూ చిటుకూ అనడం ప్రమాదమా?
అపోహ: చాలాసేపు పనిచేశాక రిలాక్స్ అవడంలో భాగంగా చాలా మంది వేళ్లను విరుస్తుంటారు. ఇలా వేళ్లను వెనక్కి విరవగానే చిటుకూ... చిటుకూ అని ఓ శబ్దం వినిపించడం మనందరికీ అనుభవమే. అలాగే కొద్దిసేపటి వ్యవధిలోనే మళ్లీ రెండోసారి విరిస్తే ఈసారి అదే చిటపట శబ్దం రాదు. ఇలా... మరికాసేపటి తర్వాత రెండోసారి విరిచినప్పుడు ఎందుకు చిటపటలాడలేదు, ముందెందుకు శబ్దం చేశాయి, దీనివల్ల ఏదైనా ప్రమాదమా... అనే అపోహ కొందరిలో ఉంటుంది. వాస్తవం: చేతి వేళ్ల కీళ్లు పట్టేశాక వాటిని విరిచినప్పుడు చిటుక్కుమని శబ్దం చేయడం వల్ల ఎలాంటి అనర్థమూ వాటిల్లదు. దాంతో ఏదైనా ముప్పు కలుగుతుందన్నది అపోహ మాత్రమే. వేళ్ల కణుపుల దగ్గర (ఆ మాటకొస్తే ప్రతి కీలు దగ్గర) సైనోవియల్ ఫ్లూయిడ్ అనే కందెన లాంటి పదార్థం ఉంటుంది. వేళ్లలో కీళ్లమధ్య ఈ ఫ్లూయిడ్ చేరి, అక్కడున్న వాయువులతో ఓ చిన్న బబుల్లా ఏర్పడుతుంది. మనం వేళ్లను విరిచినప్పుడు, వాయువుతో నిండిన ఆ చిన్నచిన్న బుడగలు చటుక్కున పేలినట్లవుతాయి. వేళ్లు విరిచినప్పుడు మనం వినే శబ్దం ఆ బుడగలు పేలినప్పుడు వచ్చేదే. దీనివల్ల ఎలాంటి అనర్థమూ ఉండదు. ఒకసారి విరిచాక బబుల్స్ పగిలి, అవి మళ్లీ ఏర్పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే మళ్లీ విరిస్తే శబ్దం రాదు. -
మంచి అలారం శబ్దం ఏదంటే...
మెల్బోర్న్ : గణ గణమని గంటకొట్టినట్లు అలారమ్ మోగినా, బీప్....బీప్ మని శబ్దం చేసినా నిద్ర నుంచి మేల్కోవచ్చు. వాటి శబ్దాలకు లేచిన వారు విసుక్కుంటూనో, గొనుక్కుంటూనో అలారమ్ ఆపేసి మళ్లీ పడుకుంటారు. లేదా అలారం మూగబోయేదాకా ముసుగు తన్ని పడుకుంటారు. అదే మనకిష్టమైన శ్రావ్యమైన పాటనో, సంగీతాన్నో అలారంగా పెట్టుకుంటే త్వరగా లేచి పోతాం. చురుగ్గా కూడా ఉంటాం. దీనికి కారణాలు కనుగొనేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ‘రాయల్ మెల్బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పరిశోధకులు 50 మంది పై అధ్యయనం చేసి రహస్యాన్ని ఛేదించారు. ఇష్టంలేని అలారమ్ శబ్దాన్ని విన్నప్పుడు నిద్రలో ఉన్న మనుషుల మెదడు గందరగోళానికి గురవుతుందట. అదే శ్రావ్యమైన పాటను విన్నప్పుడు మెదడు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా మెల్లగా ఆ పాటను వినడం కోసం మనల్ని చేతనావస్థలోకి తీసుకొస్తుందని ఆ అధ్యయనంలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియాన్ డయ్యర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పని ఒత్తిడి కారణంగా ఇష్టంలేని అలారం శబ్దానికి తప్పనిసరై లేచినా ఆ రోజు పని చేస్తున్నంత సేపు చీకాకుగానే ఉంటుందట. అదే ఇష్టమైన శబ్దానికి నిద్ర లేచినట్లయితే పనులను కూడా చురుగ్గా చేసుకుపోతామట. ఇదంతా మెదడు మాయని ఆయన చెప్పారు. ఇష్టమైన పాటలు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకోవడం అందరికి తెలిసిందే. అలాగే మనకిష్టమైన పాటను అలారంగా పెట్టుకుంటే మెల్లగా నిద్రలేస్తాం, చురుగ్గా ఉంటాం. -
బుల్లెట్ బాబులు..పని పట్టిన ట్రాఫిక్ పోలీసులు
-
శబ్దాన్ని చూసేద్దాం పదండి..
మీరెప్పుడైనా శబ్దాన్ని చూశారా..? ప్రశ్న తప్పుగా అడుగుతున్నామని భ్రమపడకండి. ఆ ప్రశ్న నిజమే.. అదేంటి శబ్దాన్ని వింటాం కానీ.. చూడటమేంటి.. ఇదే కదా మీ మనసులో మెదిలే ప్రశ్న? ఈ ఫొటోలో ఉన్నదేంటో తెలుసా.. శబ్ద తరంగాలు. ఎంత అందంగా ఉన్నాయో కదా.. అమెరికాలోని ఫిలడెల్ఫియా పట్టణానికి చెందిన లిండెన్ గ్లెడ్‌హిల్ అనే శాస్త్రవేత్త, ఫొటోగ్రాఫర్, ఫార్మాసూటికల్ బయోకెమిస్ట్కు శబ్దాన్ని చూడటం, వాటితో ఆడుకోవడం అంటే సరదా.. అంతే కాదు శబ్దాన్ని ఫొటో తీసి అందరికీ చూపించడం ఆయనకు అదో తృప్తి. 'అందుకే శబ్ద తరంగాలను వివిధ తరంగ ధైర్ఘ్యాల వద్ద ఫొటోలు తీస్తుంటాడు. శబ్దాలను ఫొటో తీసే పరికరం చాలా సులువుగా ఉంటుందని గ్లెడ్‌హిల్ వివరించాడు. స్పీకర్‌పై పలుచటి పొరపై నీరు ఉంటుందని, ఆ నీటిపై ఎల్ఈడీ కాంతిని ప్రసరిస్తామని చెప్పాడు. ‘నీటి గుండా శబ్దాన్ని పంపడం వల్ల తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలను ఎల్ఈడీ కాంతిని వెదజల్లే ఉపరితలంపైకి పంపుతాం. ఈ సమయంలో శబ్దాన్ని కెమెరా ఫొటోలు తీస్తుంది. తరంగాలు మనం నిర్ణయించే పౌనఃపుణ్యాన్ని బట్టి మారుతుంది. దాన్ని బట్టే ఫొటోలు కూడా మారుతాయి’అని వివరించాడు. -
‘సౌండ్’ చేయొద్దు..ప్లీజ్..
నారాయణఖేడ్: ఎన్నికల సందడి మొదలయ్యిందంటే చాలు గ్రామాల్లో మైకులు హోరెత్తుతుంటాయి. ప్రచార రథాలకు మైకులు బిగించి ప్రచారం చేస్తుంటాయి. మీ ఓటు మాకే వేయండంటూ నాయకులు ఊదర గొడతారు. ప్రచార సాధనాల మోత చెవుల్లో మార్మోగుతుంది. హద్దులు మీరిన శబ్దాలతో తలనొప్పి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా డీజే శబ్దాలతో విపరీత దోరణికి పోవడంతో కొంత సమస్యగా మారుతుంది. చట్టపరంగా ఏ మేరకు ధ్వని వినియోగించుకోవాలో ఎన్నికల సంఘం నిర్ణయించింది. శబ్దం పెరిగిందా కేసులు నమోదు కాల్సిందే.. ఈ సారి ఎన్నికల్లో అతిశబ్దంతో ఊదరగొట్టిన వారిపై కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో అభ్యర్థులు ఆయన తరఫున ప్రచారం చేసేవారు జాగ్రత్త పడాల్సిందే. మరి ఏ ప్రాంతంలో ఎంత శబ్ధం వినియోగించాలో ఎన్ని డెసిబుల్స్ ఉండాలో పర్యావరణ చట్టానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. ∙ నివాస ప్రాంతాల్లో 45– 55 డెసిబుల్స్ మాత్రమే వినియోగించాలి. ∙ ఆస్పత్రులు, విద్యాలయాలు, న్యాయస్థానాల సమీపంలో 40– 45 డెసిబుల్స్ ఉండాలి. ∙ వ్యాపార ప్రాంతాల్లో 55– 65 డెసిబుల్స్ ఉండొచ్చు. ∙ పారిశ్రామిక ప్రాంతాల్లో 70– 75 డెసిబుల్స్ మేరకు సౌండ్ వినియోగించవచ్చు. -
దేవుడు గంట కొట్టాడు
అదొక పల్లెటూరు. ఆ ఊళ్లో ఒక అమాయకుడున్నాడు. అతను ఎప్పుడూ సత్యమే చెబుతాడని, అబద్ధం చెçప్పడని ఊళ్లో వాళ్లకి గట్టి నమ్మకం. అదే వూరిలో పురాతన కాలం నాటి ఒక దేవాలయం ఉంది. కొన్ని తరాల కిందట ఆ గుడిలో దొంగలు పడి దేవుడి విగ్రహాన్ని ఎత్తుకు పోవడంతో ఆ దేవాలయం పూజాపురస్కారాలూ లేక, దాని ఆలనాపాలనా చూసేవారు లేక శిథిలావస్థకు చేరింది. ఆ దేవాలయం మొండి గోడల మీద రావి, తుమ్మ వంటి చెట్లు మొలిచి, లోనికి ప్రవేశించడానికి వీలు కానంతగా పాడిబడిపోయింది. దాంతో ఎవరూ ఆ గుడిలోకి ప్రవేశించడానికి సాహసించేవారు కాదు.ఒకరోజు రాత్రి ఆ గుడిలోనుంచి గంటల శబ్దం, శంఖనాదాలు వినిపించసాగాయి. అదేపనిగా గంటలు మోగుతుండడంతో ఊరిలో వాళ్లు ఉండబట్టలేక లాంతర్లు తీసుకుని గుడి వైపుగా అడుగులు వేశారు. పచ్చ కర్పూరపు పరిమళాలు వెలువడుతుండడంతో అడ్డు వచ్చిన కంపను కొట్టివేస్తూ, ధైర్యంగా లోనికి వెళ్లారందరూ. అ గుడి పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. వాళ్లు ఇంకొంచెం ముందుకు పోయి, లోపల ఏం జరుగుతోందో అని చూశారు. అక్కడ ఆ అమాయకుడు గోడకు ఆనుకుని బిగ్గరగా శంఖం ఊదటం, గంట గొట్టడం, హారతి ఇవ్వడం కనిపించింది. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాము కదా అని జనాలందరూ కలసి నేల పరిశుభ్రం చేయడం మొదలు పెట్టారు. గుడిలో వింత ఏం జరుగుతోందో చూద్దామని వస్తున్న వారందరూ ఎవరికి అడ్డం వచ్చిన చెత్తను, కంపను వారు తొలగించుకుంటూ వస్తున్నారు. కొందరు బూజుకర్రలు తీసుకు వచ్చారు. ఇంకొందరు అదే వూపులో అక్కడ పాడుబడిన దిగుడు బావినుంచి, నీళ్లు తోడి తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో నిండి పోయి ఉన్న చెత్తను తొలగించి, శుభ్రం చేయసాగారు. ఇలా తెల్లవార్లూ జరిగింది. గుడి ఎలాగూ శుభ్రపడింది కాబట్టి, గుడిలో దేవతా విగ్రహం లేకపోవడం అరిష్టం అని చెప్పి పంతులు గారి దగ్గర ముహూర్తం పెట్టించుకుని, మంచిరోజు చూసి గుడిలో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎడతెరపిలేకుండా వస్తున్న విరాళాలు, శ్రమదానాలతో పూజలు, పురస్కారాలతో గుడి పునర్వైభవం సంపాదించుకుంది. ఆలయం, ఆలయ ప్రాంగణమూ శుభ్రంగా లేకపోవడం వల్లే కదా, అందరూ ఆ గుడిని దూరం పెట్టింది. ఆలయం శుభ్రం కావడంతోనే, గుడిలోకి దేవుడొచ్చేశాడు. మనసులోని మాలిన్యాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుంటే గుండె గుడిలోకి కూడా దైవం ప్రవేశిస్తాడు. అయితే అందుకు ఎవరో ఒకరు పూనుకోవాలి. – డి.వి.ఆర్. -
గొంగళిపురుగు
తిమోతి వేసుకున్న లాంగ్ కోటు నేల ఊడుస్తున్నట్టు విచిత్రమైన ధ్వని చేస్తోంది. ఆయన పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, కోపంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆయన ముఖం ఎర్రబడింది. మూతి వంకర్లు తిరుగుతోంది. చేతివేళ్లు అసహనంగా లాంగ్ కోటు గుండీల్ని తిప్పుతున్నాయి. ఆయనను ఆ స్థితిలో చూసిన వాళ్లకు ఆయన కోపంతో రగిలిపోతున్నాడని సులభంగా అర్థమవుతుంది. తన కోపాన్ని తగ్గించుకోవడానికో, లేదా ఏదైనా నిర్దుష్టమైన నిర్ణయం తీసుకోవడానికో తెలియదు.. మధ్య మధ్యలో తనలో తాను గొణుక్కుంటూ జాలి చూపులు పరుస్తున్నాడు. అవి గది తలుపులోంచి ఆకులు రాలి ఉన్న వరండాలోకి సాగుతున్నాయి. అతని ఆలోచనలకు ఒక ఆకారం, ఒక క్రమం ఉన్నట్టు లేవు. అతని కోపానికి మూల కారణం కాస్సిడి! కాస్సిడి, తమ పాఠశాల విద్యార్థి. కాస్సిడి పేరు గుర్తుకురాగానే తిమోతి వళ్లు మండుతోంది. రక్తం తలకెక్కుతోంది. ఎందుకోగాని, ఆయన ఆ బాలుణ్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. వాడు పసివాడే! కాని, వాడి నిశ్శబ్దం తిమోతిని కుదిపేస్తోంది. అంతకంటే ప్రమాదం వాడి మాటలు. వాడు చెప్పేవి ఒకటి రెండు మాటలే కాని, అవే కాల్చిన ఇనుప చువ్వల్లా గుచ్చుకుంటున్నాయి. ఉన్న ఫళాన అతను గుమ్మం దగ్గర ఆగి, వరండాలోకి నిశితంగా చూశాడు. అక్కడ చీకటి దట్టమవుతూ ఉంది. ఏదో శబ్దం వినిపించినట్లయింది. ఆ పసివాడు బహుశా అక్కడే పడుకుని నిద్రపోయాడా? అయినా ఇంకా వాడు అక్కడ ఉండి ఉంటాడా? ఎప్పుడో వెళ్లిపోయి ఉంటాడు. తిమోతికి ఒకలాంటి నవ్వు వచ్చింది. ఏదో చెప్పుకోవడానికి వాడు ఇంకా అక్కడ ఉండి ఉంటాడన్న ఆలోచనే చిత్రంగా ఉంది. తన ఆజ్ఞకు, వాడి విధేయతకు మధ్య రేఖలా ఆ పరిస్థితి ఊగిసలాడుతోంది. ఆ నిశ్శబ్దమే, ఆ నిశ్చలత్వమే ఒక విధమైన విభేదానికి దారితీస్తూ ఉంది. అది అమాయకత్వం కాదు. కాదని అతని చర్యలే తెలియజేస్తున్నాయి. నిశ్శబ్దం అమాయకత్వం లాగా ఒక పెద్ద గోడ అయితే, కాస్సిడి విషయంలో విభేదించడానికి సాధ్యం కాని ఒక బలమైన ఉక్కు గోడ! మరి దానికి పరిష్కారమేమిటీ? ఆలోచించాల్సిన విషయమే. ఆయన పెద్ద పెద్ద అంగలతో అటూ, ఇటూ ఒక ఐదు నిమిషాలు తిరిగాడు. తిరిగి, గుమ్మం ముందు నిలబడి ‘‘కాస్సిడీ!’’ అని పిలిచాడు. ‘‘కాస్సిడీ! ఉన్నావా అక్కడ?’’ అని అడిగాడు. ఆ చీకట్లోంచి ఏ సమాధానమూ రాలేదు. తిమోతి నుండే ఏదో గొణుగుడు వినిపించింది. పిల్లవాడు తన గదికి వెళ్లి నిద్రపోతూ ఉంటాడని ఆయన నిర్ధారించుకున్నాడు. అయినా నిద్రపోకూడదు కదా? గ్రిల్ డోర్ తెరుచుకుని తిమోతి వరండాలోకి వెళ్లాడు. అక్కడ ఎవరూ కనిపించకపోయే సరికి సరాసరి కాస్సిడి గదివైపు వెళ్లాడు. గది తలుపు తెరిచేసరికి కాస్సిడి తన మంచం మీద కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు. తిమోతిని చూశాడు. కాని, ఎందుకో చూపు నిలవలేక వెంటనే వాల్చేసుకున్నాడు. ‘‘హ్మ్.. ఏం కాస్సిడీ? ఎలా ఉంది నీ పరిస్థితి? ఈ లోకం లోకొచ్చావా?’’ అని అన్నప్పుడు తిమోతి ఒంట్లో రక్తం సుళ్లు తిరిగింది. కాస్సిడిలోని నిబ్బరం, నిశ్చలత్వం, నిశ్శబ్దం అన్నీ కలిసి తిమోతిని మళ్లీ చుట్టుముట్టాయి. ‘‘జవాబు చెప్పు. అడుగుతున్నది నిన్నే..’’ అని అరిచాడు. కాని, ఆ మాటలేవీ పిల్లవాడి ముందు పని చేయలేదు. తిమోతి దోషిని తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఓ కుర్చీ లాక్కుని, కాస్సిడికి ఎదురుగా కూర్చున్నాడు. ‘‘మళ్లీ చెబుతున్నాను విను. జరిగిన పొరపాటుకు నువ్వు ఇంతవరకు సంజాయిషీ ఇచ్చుకోలేదు. ఇటు చూడు.. నా వైపు. హ్మ్ – నిన్న నువ్వు ప్రేయర్‌కి హాజరు కాలేదు. నీతో పాటు ఆ వెధవ బైర్నే కూడా తప్పించుకున్నాడు. మీరిద్దరూ కలిసి ఎటు వెళ్లినట్టూ? పర్మిషన్ తీసుకోకుండా అలా వెళ్లడం తప్పు కదా? తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవడం మర్యాద. ఇంత క్రమశిక్షణ గల పాఠశాలలో చదువుతూ, ఇంత మొండిగా ప్రవర్తించడం కేవలం నీకే చెల్లింది. ఇతర పిల్లల్లాగా మీరెందుకు ప్రవర్తించడం లేదూ? ఏదడిగినా నిశ్శబ్దమే! సమాధానమా? భయమా? తలతిక్కా? పొగరా? ఏమిటీ? నీకేమైనా దయ్యం పట్టిందా? దవడలేమైనా బిగుసుకుపోయాయా? కావాలంటే చెప్పు. ఒక దెబ్బతో దయ్యం వదిలిస్తా. చివరిసారిగా అడుగుతున్నాను. చెప్పు – నిన్న ప్రేయర్‌కి రాకుండా ఎక్కడికెళ్లావ్?’’. కాస్సిడి పన్నెండేళ్ల పసివాడు. భయం భయంగా వింటూ తలపైకెత్తి, తిమోతి వైపు చూశాడు. పెదాలు కదిలించాడు. కానీ, మాట ఏదీ బయటకు రాలేదు. తిమోతి చేయి భుజమ్మీద పడటంతో గాబరా పడ్డాడు. అతి కష్టమ్మీద ‘‘సార్! నేను నిన్ననే చెప్పాను కదా?’’ అంటూ గొణిగాడు.తిమోతి కాస్సిడిని మరింత అసహ్యంగా చూశాడు – ‘‘అయితే నీ నిర్ణయం మారదన్నమాట! నీ ఇష్టం వచ్చింది చెబితే నమ్మడానికి నా చెవిలో పువ్వులు పెడితే పట్టించుకోవడానికి నేనిక్కడ లేను’’ అంటూ కుర్రవాడి చొక్కా కాలర్ పట్టుకొని లాగాడు. గొంతు మరింత పెంచి – ‘‘మాట్లాడకుండా ఉండే హక్కు నీకు లేదు. అర్థమయ్యిందా? సరైన కారణం చెప్పి, నిజం ఒప్పుకుని పశ్చాత్తాపం చెందే దాకా నీకిదే శిక్ష. నువ్వు నీ గదిలో బంధీవి. ఒంటరిగా ఉంచితే నీలో ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశపడ్డాను. అబ్బో జగమొండివి! ఛీ.. ఛీ.. నిజం చెప్పు. తప్పు ఒప్పుకునే దాకా నీకిదే శిక్ష!’’ – అంటూ తిమోతి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గదిలోంచి కోపంగా వెళ్లిపోయాడు. కాస్సిడి తనలో తాను నవ్వుకున్నాడు. తలుపు ధబేలున పడింది. ఆటోమేటిక్ లాక్ తిరిగింది. బట్టలు మార్చుకుని కాస్సిడి పరుపు మీద వాలాడు. మరునాడు ఉదయం లేవగానే ప్రశాంతమైన గాలి కాస్సిడిలో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. ఆరోజు వాడికి గదిలోంచి విముక్తి లభిస్తుందని అనిపించింది. రెండు రోజులుగా కదలకుండా తన గదిలో గడిపిన కాస్సిడికి ఈరోజు ఇక బయట తిరగక తప్పదని అనిపించింది. కాస్సిడికి తెలుసు. తను చేసిన తప్పు ఏదీ లేదని. ప్రేయర్ బెల్ వినిపించుకోకుండా పొదల వెంట తిరగడం తప్పే! కాని వెంటనే ఆ విషయం తిమోతి ముందు ఒప్పుకున్నాడు కూడా. కానీ, తిమోతీయే నమ్మలేదు. తను అబద్ధాలు చెబుతున్నాననుకుని, రెండు రోజులు గదిలో ఖైదు చేశాడు. తను పశ్చాత్తాపం చెందాడు. అలాంటి తప్పు మరోసారి చేయనని ప్రమాణం కూడా చేశాడు. అయినా తిమోతి ఒప్పుకోకుండా శిక్ష విధిస్తే తను ఏం చేయగలడు? ఎదిరించి ఏం మాట్లాడగలడు? ఆయనేమో చెప్పేది నమ్మడు. భయంతో నోరు మూసుకుంటే, ‘‘దయ్యం పట్టిందా? వీపు చీరేస్తా’’ అంటాడు. ఇక ఏం చెయ్యాలి? కాస్సిడి చిన్నారి మనసు పరిపరి విధాల పోయింది. జేబులోంచి చిన్న అగ్గిపెట్టె బయటకు తీశాడు. రెండు వైపులా గాలికోసం రంధ్రాలు చేసి పెట్టిన పెట్టె అది. పెట్టె మెల్లిగా తెరిచాడు. అందులో నుండి ఆకుపచ్చని రంగులో మెరుస్తూ, కొద్దికొద్దిగా కదులుతూ ఒక గొంగళి పురుగు బయటికి వచ్చింది. కాస్సిడి చేతి వేలు మీదుగా పాకింది. అందంగా, లయబద్ధంగా పాకడాన్ని వాడు ఆనందించాడు. చెయ్యి కళ్ల దగ్గరికి తీసుకుని, దాన్ని నిశితంగా పరిశీలించాడు. ఆకుపచ్చ రంగులోని ఆ లావణ్యాన్ని, లాలిత్యాన్ని మెచ్చుకుంటున్నట్లుగా ఉత్సాహంగా, ఉత్సుకతతో చూశాడు. ‘ఒకనాటికి ఇది మనోహరమైన సీతాకోక చిలుక అవుతుంది కదా?’ అని అనుకున్నాడు. ‘ఎంత అద్భుతం!’ అని ఆశ్చర్యపోయాడు. మరో చేతివేలితో దాన్ని అతి సున్నితంగా తాకాడు. సూర్యుడు అప్పుడే ఉదయించాడు. కిరణాలు కిటికీలోంచి గదంతా వ్యాపించాయి. గొంగళి పురుగు సూర్య కిరణాలతో స్నానం చేసి, మరింతగా ప్రకాశించింది. ‘‘నిన్నేమని పిలవనూ? క్లేవియర్ అని పిలుస్తా!’’ అంటూ గొంగళి పురుగుతో సంభాషించాడు కాస్సిడి. చిరునవ్వు నవ్వుతూ అగ్గిపెట్టెను చూసుకున్నాడు. గొంగళి పురుగు తనతో పాటు ఆ గదిలో రెండు రోజుల నుండి ఉంటున్నందుకు వాడికి గర్వంగా ఉంది. సంతృప్తిగా ఉంది. దాన్ని చూస్తూ ఉంటే వాడికి తిమోతి గుర్తుకురాలేదు. అసలు చాలా విషయాలు గుర్తుకురాలేదు. ఎందుకో గాని ఆ గొంగళి పురుగు దగ్గరుంచుకున్నప్పటి నుండి వాడికి ఎంతో సంతోషంగా ఉంది. వాడి మీద వాడికి ఎంతో నమ్మకంగా ఉంది. గొంగళి పురుగు వాణ్ని చూడలేదు. వాడితో మాట్లాడలేదు గానీ, మాట్లాడితే గనక, కాస్సిడి దానికి ఎన్నో విషయాలు చెప్పేవాడు. ముఖ్యంగా తిమోతి తనను గదిలో ఎందుకు నిర్భందించాడన్నది పూస గుచ్చినట్టు చెప్పేవాడు. అలా ప్రకృతిలోని ఔన్నత్యాన్ని గుర్తించి, ఆరాధించి గొంగళి పురుగు కదలికల్ని ఆనందిస్తున్న సమయంలో వరండాలో ఎవరివో అడుగు చప్పుడు వినిపించింది. గొంగళి పురుగు కోసం తయారుచేసిన అగ్గిపెట్టె కిందపడిపోయింది. అప్పుడే తిమోతి తలుపు తెరుచుకుని గదిలోకి వచ్చాడు. ‘‘ఏమోయ్ కాస్సిడి! ఎలా ఉంది నీ పరిస్థితి? ఈ లోకంలోకి వచ్చావా?’’ అని అడిగాడు. కాని, కాస్సిడి అతని మాట వినిపించుకున్నట్టే లేదు. గొంగళి పురుగును జాగ్రత్తగా అగ్గిపెట్టెలోకి పంపించే ప్రయత్నంలో ఉన్నాడు. కిటికీలోంచి వచ్చే వెలుగు కిరణాలు పెట్టె మీద పడటం వాడికి నచ్చింది. ‘‘కాస్సిడీ! ఏమిటది చేతిలో?’’ తిమోతి కోపంగా కర్కషంగా అరిచాడు. ‘‘ఏం లేదు. ఊరికే!’’ అంటూ పెట్టెను తన వెనక పెట్టుకుని దాచేసే ప్రయత్నం చేశాడు కాస్సిడి. ‘‘ఇదన్నమాట నువ్వు చేసే నిర్వాకం‘ ఖాళీ సమయాన్ని ఇంత పాప పూరితంగా గడుపుతున్నావన్నమాట!’’ అంటూ హుంకరించాడు తిమోతి. ‘‘పాపమా? పాపమేమీ చేయడం లేదు. చిన్న గొంగళి పురుగు. అ.. అంతే..!’’ అన్నాడు వాడు అమాయకంగా. వాడి నిశ్శబ్దాన్ని భరించలేకపోయిన తిమోతి, వాడి సమాధానాన్ని అసలే భరించలేకపోయాడు. అందులో అతనికి ధిక్కార స్వరం వినిపించింది. స్వచ్ఛమైన నిజాయితీలోంచి వచ్చిన మాటలు అతడికి అహంకార పూరితమైన అబద్ధాలుగా తోచాయి. కోపంతో పిల్లవాడి చెవి మెలితిప్పాడు.‘‘ఇదేనా నువ్వు చేసేది? ఇదేనా పెద్దలతో మాట్లాడే తీరూ? మూర్ఖుడా! ఏదీ అది ఇటివ్వూ’’ మరింత కఠినంగా అరిచాడు తిమోతి. ‘‘ఏమీ లేదు సార్! ఉట్టి గొంగళి పురుగే. కొద్దిరోజుల్లో ఇది అద్భుతమైన సీతాకోక చిలుక అయిపోతుంది. మెత్తగా ఆకుపచ్చగా ఉంది. నేను దానికి తెలిసినట్టే, నా చేతిమీద హాయిగా స్వతంత్రంగా తిరుగుతుంది. ప్లీజ్! నాకు ఇది ఉండనివ్వండి!! ఇదుంటే నాకు ఎందుకో గాని, చాలా సంతోషంగా ఉంటుంది.’’ ‘‘హూ! వేలెడు లేవు, పెద్ద పెద్ద కబుర్లు చెబుతావు’’ అంటూ తిమోతి హుంకరించాడు. కాస్సిడి చేతిలోని అగ్గిపెట్టె లాక్కుని తెరచి బోర్లించాడు. ఆకుపచ్చని గొంగళి పురుగు కిమ్ద నేలమీద పడింది. ఒక్క క్షణం తర్వాత మెల్లగా పాకడం ప్రారంభించింది.‘‘ప్రేయర్ మానేసే హక్కు నీకు లేదు. ప్రేయర్ మానేశావు గనుక, వేరే వాటిని చూసి ఆనందించే హక్కు కూడా నీకు లేదు. వింటున్నావా?’’ అని చెబుతూ అనూహ్యంగా తిమోతి తన బూటుకాలు గొంగళి పురుగు మీద ఉంచాడు. కసి కొద్దీ తొక్కి పెట్టి, పాదం అటూ ఇటూ తిప్పాడు.గొంగళి పురుగు సీతాకోక చిలుక కాకుండానే అర్ధాంతరంగా అసువులు కోల్పోయింది.కాస్సిడి తిమోతి వైపు తలెత్తి ఒక్క చూపు చూశాడు. కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. చెప్పరాని బాధతో తెరలు తెరలుగా భోరున ఏడ్చాడు. ఆంగ్లమూలం : జేమ్స్ హాన్లీ అనువాదం: డాక్టర్ దేవరాజు మహారాజు