ఇంఫాల్: ప్రస్తుతం ఎక్కడ ఉన్నా కుయ్.. కుయ్ అంటూ శబ్ధం చేస్తూ అంబులెన్స్‌లు తెగ తిరుగుతున్నాయి. మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో పెద్ద ఎత్తున ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో అంబులెన్స్‌ల సేవలు పెరిగాయి. రోడ్లపై వాహనాల కంటే వాటి రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రోజంతా కుయ్ కుయ్ అంటూ వెళ్తుండడంతో ఆ శబ్ధం మన చెవులల్లో మార్మోగుతోంది. ఆ శబ్ధం మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. భయాందోళనకర పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే వాటిని శబ్ధం చేయకుండా వెళ్లాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.
అంబులెన్స్‌లు చప్పుడు లేకుండా నిశ్శబ్ధంగా రాకపోకలు సాగించాలని మణిపూర్ నిర్ణయం తీసుకుంది. ఆ శబ్ధం వింటే ప్రజలు భయాందోళన చెందుతున్నారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంబులెన్స్‌లు శబ్ధం లేకుండా రాకపోకలు సాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
మణిపూర్‌లో కరోనా కొంత తీవ్రంగానే ఉంది. తాజాగా మంగళవారం 624 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment