
ఒకరు మృతి, 40 మందికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్ వ్యాప్తంగా శనివారం నుంచి అన్ని రకాల వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. భద్రతా సిబ్బంది, కుకీ వర్గం ప్రజల మధ్య జరిగిన ఘర్షణల్లో నిరసనకారుడొకరు చనిపోగా 40 మంది గాయపడ్డారు. వీరిలో 16 మంది స్థానికులు కాగా, 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ కంగ్‌పోక్పి వద్ద రెండో నంబర్ ఇంఫాల్–దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు.
అడ్డుకునేందుకు యతి్నంచిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో ప్రైవేట్ వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇంఫాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయతి్నంచడంతో పరిస్థితి చేయి దాటింది. దీంతో, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల్లో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, మైతేయి వర్గం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్‌పోక్పికి రాకమునుపే అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్‌పోక్పి వద్ద అడ్డుకుని, ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయతి్నంచారని పోలీసులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించి, నిరసన కారులను చెదరగొట్టాక మైతేయి శాంతి ర్యాలీ నిర్వాహకులున్న బస్సులు ముందుకు సాగాయని చెప్పారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచి్చందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment