conflict
-
టీడీపీ-జనసేన బాహాబాహీ
సాక్షి, అమరావతి/పిఠాపురం: పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం రెండు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన ఎన్డీఏ పార్టీల విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు తలపడ్డారు. టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ, జనసేన ఇన్‌ఛార్జి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ సమక్షంలోనే ఇరుపార్టీల నేతలు ఒకరినొకరు తోసుకుని గందరగోళం సృష్టించడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి ఎవరికి వారు వెళ్లిపోయారు. అలాగే, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి వ్యతిరేకంగా ‘క్విట్ నెల్లిమర్ల’ అంటూ టీడీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇక ఏలూరు జిల్లా పైడిచింతపాడులో పింఛన్ల పంపిణీపై టీడీపీ, జనసేన నేతలు ఘర్షణపడి కొట్టుకున్నారు. చివరికి.. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోగా, జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గందరగోళంగా మారింది. ఇలా రెండు పార్టీల నేతలు తమదే పైచేయి కావాలని వివిధ నియోజకవర్గాల్లో పోటీపడుతూ.. ఘర్షణలకు దిగుతూ రభస సృష్టిస్తున్నారు.పైడిచింతపాడులో దాడికి దిగిన తెలుగు తమ్ముళ్ళు, జనసేన కార్యకర్తలుపిఠాపురంలో కండువాలు, ఫొటోల గోల..పిఠాపురంలో శుక్రవారం కూటమి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయ సమావేశం కూటమి నేతల బాహాబాహీకి వేదికగా మారిపోయింది. వేదికపై వేసిన ఫ్లెక్సీలో టీడీపీ నేత వర్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్లవి పెద్ద ఫొటోలు వేసుకుని జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌ది చిన్నఫొటో వేయడంపై జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. సమావేశంలో కురుమళ్ల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థి మూడు పార్టీల కండువాలు వేసుకున్నారుగానీ వచ్చిన టీడీపీ నేతలు కేవలం వారివారి పార్టీ జెండాలే వేసుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరూ ఇకే మాటపై ఉంటుంటే ఇక్కడ మాత్రం టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తూ జనసేనను తొక్కేయాలని చూస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జనసేన పనిచేస్తోందా?.. మరి పిఠాపురంలో టీడీపీ ఎందుకు జనసేన, పవన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ కురుమళ్ల ప్రశ్నించడంతో గందరగోళం మొదలైంది. దీంతో టీడీపీ నేతలు అరుపులు, కేకలతో వేదికపైకి దూసుకురావడంతో రెండు పార్టీల నేతల కార్యకర్తల మధ్య తోపులాట, తన్నులాట చోటుచేసుకుంది. రెండు పార్టీల నేతలు తమ కార్యకర్తలను అదుపుచేసేందుకు ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వర్మ, రాజశేఖర్, మర్రెడ్డి శ్రీనివాస్ అక్కడ నుంచి నిష్క్రమించారు. పింఛన్ల పంపిణీ కోసం డిష్యూం డిష్యూం.. మరోవైపు.. పింఛన్ల పంపిణీ కోసం గురువారం దెందులూరు నియోజకవర్గం, కొల్లేరు గ్రామం పైడిచింతపాడు టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్లాటకు దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అనంతరం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరి పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వాస్తవానికి.. గ్రామ టీడీపీ నాయకుడు సైదు సత్యనారాయణ వర్గీయులు దీపావళి రోజున వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడగా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, గ్రామ సర్పంచ్ ముంగర తిమోతీ, మోరు సుబ్బారావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు తదితరులు సచివాలయానికి చేరుకున్నారు. తాములేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దలు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జనసేన నాయకుడు ముంగర వెంకటేశ్వరరావు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇందులో గాయపడిన జనసేన కార్యకర్తలు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) కట్టాలని పోలీసులను కోరారు. అదే సమయంలో టీడీపీ వారు సైతం ఆస్పత్రికి చేరుకుని, తమకు గాయాలయ్యాయని, ఎంఎల్సీ కట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు టీడీపీ నాయకులకే వత్తాసు పలికి వారి ఫిర్యాదు మేరకు ఎంఎల్సీ కట్టారు. దీంతో జనసేన నేతలు విజయవాడ వెళ్లి అక్కడ ప్రభుత్వాస్పత్రిలో చేరి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ నేతల చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏలూరు రూరల్ పోలీసులు జనసేన నేతలను అదుపులో తీసుకున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నేతలు ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి.. టీడీపీ నేత, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఆమెకు వ్యతిరేకంగా బంగర్రాజు శుక్రవారం టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి ఆమె నియోజకవర్గాన్ని విడిచి వెళ్లిపోవాలని హడావుడి చేశారు. ఆమె తీరుతో నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత లేకుండాపోయిందని వాపోతున్నారు. నిజానికి.. రెండ్రోజుల క్రితం నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి, బంగర్రాజు మధ్య హాట్‌హాట్‌గా వాగ్వివాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
సరిహద్దు గస్తీపై కీలక పురోగతి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయమై చైనాతో నెలకొన్న నాలుగేళ్ల పై చిలుకు సైనిక వివాదం కొలిక్కి వచి్చంది. ఇరు దేశాల దౌత్య, సైనిక ఉన్నతాధికారులు కొద్ది వారాలుగా జరుపుతున్న చర్చల ఫలితంగా ఈ విషయమై కీలక ఒప్పందం కుదిరింది. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘తాజా ఒప్పందం ఫలితంగా తూర్పు లద్దాఖ్‌లోని దెస్పాంగ్, దెమ్చోక్ తదితర ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనుదిరుగుతుంది. అక్కడ ఇకపై భారత సైన్యం 2020కి ముందు మాదిరిగా గస్తీ కాస్తుంది’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల దిశగా దీన్నో మంచి ముందడుగుగా అభివర్ణించారు. రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా మంగళ, బుధవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని కీలక భేటీ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. ఈ వివాదానికి తెర దించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చర్చలు జరిపారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి 75 శాతం సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనట్టు జైశంకర్ గత నెలలో పేర్కొన్నారు. -
భగ్గుమన్న భారత్, కెనడా బంధం. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ పేరు చేర్చిన కెనడా. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్
-
సెబీ చీఫ్ వ్యవహారంపై స్పందించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: సెబీ చైర్పర్సన్ మాధవీ పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తమను తాము సమర్థించుకుంటున్నారని, కాంగ్రెస్ ఆరోపణలకు విరుద్ధమైన వాస్తవాలను బయటపెడుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.సెబీ చైర్పర్సన్ మాధబి పురి బచ్ దంపతుల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి స్పందించారు. మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ తమను తాము రక్షించుకొంటూనే, తమపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా స్పందిస్తున్నారన్నారు.‘చాలా ఆరోపణలకు సమాధానాలు వస్తున్నాయ్. ఈ నిజాలను వాళ్లు(పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) పరిగణనలోకి తీసుకుంటారనే అనుకుంటున్నాను’ అని ఆమె అన్నారు. ‘మాధబి పురి బచ్ సమాధానాలపట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా?’ అనే మరో ప్రశ్నకు.. ‘నేనిక్కడ ఉన్నది అది తప్పో, ఒప్పో నిర్ధారించేందుకు కాదు’ అని నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.బచ్ దంపతులు అక్రమాలకు పాల్పడ్డారని, లాభాపేక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. అదానీ వ్యవహారంలో బచ్ అవినీతికి దిగారని హిండెన్‌బర్గ్ ఆరోపించినదీ తెలిసిందే.ఇదీ చదవండి: సెబీ పనితీరును సమీక్షిస్తాం: PAC -
ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు.. వీళ్ల వైరం ఏనాటిది!
పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. అయితే.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు! దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం మొదలైంది.పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్‌లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది.హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు.గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.హనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.మరోవైపు.. హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్‌కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానెల్ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్ తేలి్చచెప్పినట్లు వివరించింది. ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్ సైన్యమేనని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ చెప్పారు.హమాస్ మిలటరీ విభాగం ‘ఖస్సం బ్రిగేడ్స్’ అధి నేత మొహమ్మద్ దీఫ్‌ను ఖతం చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ శివారులో ఓ కాంపౌండ్‌పై నిర్వహించిన వైమానిక దాడులో అతడు హతమయ్యాడని వెల్లడించింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్ దీఫ్ మృతిని ఇజ్రాయెల్ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం!గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిపోయింది. దాంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశానికి దూరం అయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్‌ను వ్యతిరేకించడం మొదలు పెట్టాయి. అమెరికాను ‘మహా సాతాను’గా, ఇరాన్ చివరి చక్రవర్తి మొహమ్మద్ రెజా పహ్లావీకి మద్దతు తెలుపుతున్న ఇజ్రాయెల్‌ను ‘చిన్న సాతాను’గా అభివర్ణించింది. నాటి నుంచి టెహ్రాన్-టెల్ అవీవ్ మధ్య శత్రుత్వం క్రమంగా పెరగడంతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఖమేనీ ఆరోపించారు.ఇజ్రాయెల్ పౌరుల పాస్‌పోర్టులను గుర్తించడం మానేసింది. టెహ్రాన్‌లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి, దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ)కు అప్పగించింది. 1990 వరకు కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్ మీద శ్రతుత్వం లేదు. కానీ కాలక్రమంలో ఇరాన్‌ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్లో షియాలు మెజార్టీ కాగా, మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తన పై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ హిజ్బుల్లాను పుట్టించింది.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’ గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఈ షాడో వార్‌కు లెబనాన్, సిరియా యుద్ధవేదికలుగా ఆవిర్భవించాయి. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూపునకు ఇరాన్ అండగా నిలిచింది. మరోవైపు సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు కూడా ఇరాన్ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో 1967 యుద్ధం తర్వాత సిరియాలోని గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. నాటి నుంచి సిరియా, లెబనాన్‌పై దాడులు జరిపేందుకు గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటుంది.1992లో ఇరాన్‌కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి, 29మంది మృతికి కారణమైంది. దానికి కొన్నిరోజుల ముందే హిజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు ఆపాదించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇరాన్ వద్ద అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మకపోవడం గమనార్హం. ఈక్రమంలో 2000 సంవత్సరంలో ఇరాన్ అణు సంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్‌దే బాధ్యత అని టెహ్రాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదెహ్ హత్యకు గురవడానికి కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. మరోవైపు తమ ప్రాంతాల్లో రాకెట్, డ్రోన్ల దాడులకు కారణం ఇరానేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాంతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలిచింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్రసముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది.గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భీకర దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడిని స్వాగతించింది. మరోవైపు హమాస్‌కు మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 1న ఇజ్రాయెల్‌కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో సీనియర్ కమాండర్లు సహా ఏడుగురు అధిదారులు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. -
లెబనాన్‌పై దాడుల నియంత్రణకు అమెరికా దౌత్యం
ఇంతవరకూ పాలస్తానాలోని గాజాకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుధ్దం ఇప్పుడు లెబనాన్‌కూ పాకింది. ఇది తీవ్రరూపం దాల్చకుండా ఉండేందుకు అమెరికా తన ప్రయత్నాలను ప్రారంభించింది.ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌పై జరిగిన రాకెట్ దాడిలో 12 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దీనిని నిరోధించేందుకు యునైటెడ్ స్టేట్స్ రంగంలోకి దిగింది. ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది. ఈ నేపధ్యంలో దీనికి ప్రతీకారంగా లెబనాన్‌లోని బీరుట్ లేదా ఇతర లెబనీస్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు తెగబడకుండా ఉండేందుకు అమెరికా తన దౌత్యపరమైన ప్రయత్నాలను ప్రారంభించిందని రాయిటర్స్ పేర్కొంది.అమెరికాకు చెందిన ఇద్దరు దౌత్య అధికారులు రాయిటర్స్‌తో మాట్లాడుతూ ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతోందని, ఇది బహుశా చాలా రోజుల పాటు కొనసాగవచ్చని అన్నారు. అయితే తాము ఇజ్రాయెల్‌ను పరిమిత ప్రతీకార చర్యలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. లెబనాన్‌లోని బీరుట్‌తో పాటు హిజ్బుల్లా ఆధిపత్యం కలిగిన దక్షిణ శివారు ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలు, జనసాంద్రత కలిగిన ప్రాంతాలపై దాడులకు దిగవద్దని ఇజ్రాయెల్‌ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్, డిప్యూటీ పార్లమెంట్ స్పీకర్ ఎలియాస్ బౌ సాబ్తో సహా లెబనీస్ అధికారులు యుద్ధం విషయంలో సంయమనం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. పౌర నివాసిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్ తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా హెచ్చరించింది.లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను అదుపు చేసేందుకు అమెరికా, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరమైన చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ.. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ప్రమాదాన్ని తగ్గించేందుకు నడుంబిగించారు. -
మణిపూర్: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు
ఇంఫాల్: మణిపూర్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలైన కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణకు దారితీసిన తమ వివాదాస్పద ఉత్తర్వులో సవరణ చేసింది. మైతేయి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)ల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2023 మార్చి 27న జారీ చేసిన ఉత్తర్వులో ఒక పేరాను తొలగించింది. అప్పట్లో కోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ గిరిజనులైన కుకీలు ఆందోళన ప్రారంభించారు. క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది. రాష్ట్రంలో నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 200 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హైకోర్టు ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ గతేడాది అక్టోబర్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఉత్తర్వులో రెండు తెగల మధ్య శత్రుత్వానికి కారణమైన ఒక పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. . గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. -
‘ఓడితే.. చంపేస్తారు’
శాక్రమెంటో(కాలిఫోర్నియా): ప్రపంచ బిలీయనీర్ ఎలాన్ మస్క్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని.. ఒకవేళ పుతిన్ ఓడితే గనుక ఆయన్ని హతమారుస్తారంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ స్పేసెస్ వేదికపై పలువురు ప్రముఖ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో సోమవారం ఎలాన్ మస్క మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గరనే అనుకుంటున్న. ఒకవేళ ఓడితే మాత్రం.. కచ్చితంగా ఆయన్ని హతమార్చే అవకాశం ఉంది. కాబట్టే.. ఆయన ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఆయనపై అంత ఒత్తిడి ఉంది అని మస్క్ చెప్పారు. అయితే మస్క్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ‘‘గతంలోనూ నేను ఇదే చెప్పా. ఆ సమయంలో నన్ను చాలామంది విమర్శించారు. కానీ, వాస్తవాలు వేరు. అవి అంతా తెలుసుకోవాలి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచే అవకాశమే లేదు. గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి మంచిది కాదు. పైగా ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే వాళ్లకే( ఉక్రెయిన్)కే ప్రమాదం. యుద్ధంలో.. అమెరికా ప్రకటించే ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని మస్క్ తేల్చేశారు. అదే సమయంలో రష్యాతో స్పేస్ ఎక్స్ ఒప్పందం రద్దు అంశాన్ని ప్రస్తావించిన మస్క్.. ఈ యుద్ధంలో తన మరో కంపెనీ పోషిస్తున్న పాత్రపైనా వివరణ ఇచ్చారు. ‘‘రష్యాను అణచివేయడానికి మా కంపెనీల కంటే మరేవీ గొప్పగా పనిచేయలేదు. ఉక్రెయిన్‌కు ఇప్పటికే స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ సేవలను అందిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కీవ్ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారింది. రెండువైపులా ప్రాణనష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యమని అన్నారాయన. -
భారత జాతీయతకే తీరని అవమానం..సిగ్గుగా ఉంది: ప్రియాంక గాంధీ ధ్వజం
ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనే ధర్మాలకు ప్రతీక అయిన భారత దేశం దీనికి దూరంగా ఉండటం సిగ్గు చేటు అంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విటర్ ద్వారా ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. అహింస, సత్యం అనే సిద్దాంతాల పునాదుల మీదే మన దేశం ఆవిష్కృతమైంది. ఈ సిద్ధాంతాల కోసమే స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశానికి స్వేచ్ఛని ప్రసాదించారు. మన జాతీయతకు నిదర్శనమైన ఈ సూత్రాలకోసం జీవితమంతా నిలబడిన దేశానికి భిన్నంగా మోదీ సర్కార్ వ్యవహరించిందంటూ ట్వీట్ చేశారు. పాలస్తీనాలో వేలాది మంది పురుషులు మహిళలు, పిల్లలను హత మార్చడాన్ని మౌనంగా చూస్తూ ఉండటం భారత దేశ మూల సూత్రాలకే విరుద్ధమని మండిపడ్డారు. కంటికి కన్ను అనే విధానం మొత్తం ప్రపంచాన్ని అంధత్వంలోని నెట్టేస్తుందన్న గాంధీజీ కోట్‌ను తన ప్రకటనకు ప్రియాంక జోడించారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. గాజా స్ట్రిప్‌కు సహాయం అందించాలని ,పౌరులకు రక్షణ కల్పించాలని కూడా తీర్మానం డిమాండ్ చేసింది. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. “An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza. Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023 -
గాజా మానవతా సంధి తీర్మానానికి ఓటేయని భారత్
ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో.. తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే పలు ప్రతిపాదనలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా.. అందులో భారత్ కూడా ఉంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే దూరంగా ఉన్నాయి. ‘‘పౌరుల రక్షణ, చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ పేరిట జోర్దాన్ ఈ తీర్మానం ప్రతిపాదించింది. బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు మద్దతు తీర్మానానికి ఇచ్చాయి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే.. ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాల్ని భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తన నిర్ణయాన్ని వివరించింది. "ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని, దౌత్యం-చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించగా.. భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌లో పాల్గొంటామని యోజనా ముందుగానే తెలిపారు. కానీ, అది జరగలేదు. జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో హమాస్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్‌లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్ సహా 87 దేశాలు ఓటు వేశాయి. అయితే.. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది హమాస్. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సైన్యంతో ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ చేపట్టింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఫలితంగా.. గాజా ఛిద్రమైపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
గాజాపై భూతల యుద్ధం!
జెరూసలేం/వాషింగ్టన్: చుట్టూ ఎటు చూసినా శిథిలాలు.. వాటి కింద చిక్కుకున్న మృతదేహాలు, కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, రాత్రయితే కరెంటు లేక చిమ్మచీకటి, మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళన. గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. ఆహారం కోసం జనం దుకాణాలు, బేకరీల ముందు బారులు తీరుతున్నారు. చాలావరకు అవి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో తిండిగింజలు, నిత్యావసరాలు ఎప్పుడో నిండుకున్నాయి. గాజా ప్రజలకు ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ఆరో రోజు గురువారం కూడా కొనసాగింది. ఇరుపక్షాల మధ్య పోరు ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగించింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపించారు. ఇరువర్గాల మధ్య యుద్ధంలో మృతుల సంఖ్య 2,600కు చేరింది. గాజాలో 1,350 మందికిపైగా జనం మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తమ దేశంలో 222 మందిసైనికులు సహా 1,300 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు సన్నద్ధం హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇక భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి, ప్రతి ఇల్లూ గాలిస్తూ మిలిటెంట్లను ఏరిపారేయడానికి మిలటరీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ దేశ భద్రతకు సవాలు విసురుతున్న మిలిటెంట్లను సమూలంగా నిర్మూలించడమే ఆశయంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమ పదాతి దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే మిగిలి ఉందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. గ్రౌండ్ ఆపరేషన్ కోసం 3.60 లక్షల మంది రిజర్వ్ సైనికులను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లోని యూదుల కాలనీలను ఖాళీ చేయించింది. యూదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూతల దాడుల వల్ల గాజాలో మరణాలు భారీగా పెరుగుతాయని, సామాన్య ప్రజలు బలైపోతారని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. సిరియా ఎయిర్‌పోర్టులపై ఇజ్రాయెల్ దాడులు సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ సైన్యం గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. రాజధాని డమాస్కస్‌తోపాటు అలెప్పీలోని ఎయిర్‌పోర్టులపై ఈ దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హమాస్‌కు సిరియా అండగా నిలుస్తున్న సంగతి విదితమే. సిరియా భూభాగం నుంచి కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు జరుగుతున్నాయి. సిరియాకు చేరుకోవాల్సిన ఇరాన్ విమానాన్ని ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్‌కు మళ్లించారు. ఈ విమానంలో ఇరాన్ దౌత్యవేత్తలు ఉన్నట్లు సమాచారం. బందీలను విడుదల చేస్తేనే.. 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న గాజాలో 20 లక్షల మందికిగా జనం నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాకు ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను ఇజ్రాయెల్ ఇప్పటికే పూర్తిగా నిలిపివేసింది. కరెంటు లేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరులను విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. బందీలను విడుదల చేసేంత వరకు గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ గురువారం హెచ్చరించారు. బందీలంతా విడుదలై, క్షేమంగా ఇళ్లకు చేరుకున్న తర్వాతే గాజాకు ఆహారం, నీరు, కరెంటు అందుతాయని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిలిటెంట్ల చేతిలో 150 మందికిపైగా బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్‌ను నలిపేస్తాం: నెతన్యాహూ పాలస్తీనా సాయుధ తిరుగుబాటు సంస్థ ‘హమాస్’ను నలిపి పారేస్తామని, పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రతినబూనారు. తమ దేశంపై దాడి చేసి, ప్రజల ప్రాణాలను బలిగొన్న హమాస్‌పై ఆయన నిప్పులు చెరిగారు. హమాస్‌లోని ప్రతి సభ్యుడికి ఇక చావే గతి అని తేలి్చచెప్పారు. నెతన్యాహూ బుధవారం రాత్రి టీవీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌లో శనివారం హమాస్ మిలిటెంట్లు సాగించిన రాక్షసకాండను వివరించారు. అంతకుముందు ఆయనతో ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ సమావేశమయ్యారు. హమాస్‌పై యుద్ధాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలుగా వార్–టైమ్ కేబినెట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఈ కేబినెట్‌కి నెతన్యాహూ నేతృత్వం వహిస్తారు. అండగా ఉంటాం: బ్లింకెన్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తనను తాను కాపాడుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందన్నారు. బ్లింకెన్ శుక్రవారం పాలస్తీనా అధినేత మహమ్మద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో సమావేశం కానున్నారు. పాలస్తీనియన్లకు చట్టబద్ధమైన ఆకాంక్షలు ఉన్నాయని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. -
ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్’ కోసం సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం
Israel-Hamas war: ఇజ్రాయెల్, గాజా మధ్య నెలకొన్న యుద్ధం, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో గరిష్టంగా 30 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీని విక్రయించే ప్రణాళికలను (సోమవారం, అక్టోబర్ 9) ప్రకటించింది. దీంతో ఆ దేశ కరెన్సీ షెకెల్ భారీ నష్టాలనుంచి కోలుకుంది. గాజాలో పాలస్తీనా తీవ్రవాదులతో ఇజ్రాయెల్ పోరు నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. SWAP మెకానిజమ్ ద్వారా లిక్విడిటీని అందించేలా కృషి చేయనుంది. అలాగే మారకపు రేటులో అస్థిరత, మార్కెట్ల సాఫీగా కార్యకలాపాలకు అవసరమైన ద్రవ్యతను నిర్ధారించడానికి రాబోయే కాలంలో మార్కెట్లో జోక్యం చేసుకుంటామని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) కరెన్సీ కష్టాలు ప్రకటనకు ముందు, షెకెల్ 2 శాతానికి పైగా క్షీణించింది. డాలర్ మారకంలో 3.92 వద్ద 7-1/2 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న షెకెల్ 2023లో యునైటెడ్ స్టేట్స్ కరెన్సీకి వ్యతిరేకంగా 10 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ క్షీణతకు ప్రధానంగా ప్రభుత్వ న్యాయపరమైన సమగ్ర ప్రణాళిక కారణంగా చెబుతున్నారు. ఇది విదేశీ పెట్టుబడులను గణనీయంగా పరిమితం చేసిందని రాయిటర్స్ తెలిపింది. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్) వ్యూహాత్మక ఎత్తుగడలు ముఖ్యంగా దేశంలోని టెక్ రంగానికి విదేశీ ప్రవాహాల పెరుగుదల మధ్య.200 బిలియన్ డాలర్లకు మించిన ఫారెక్స్ నిల్వలు పేరుకుపోవడంతో, ఇజ్రాయెల్ 2008 నుండి ఫారెక్స్ కొనుగోళ్ల ద్వారా గణనీయమైన మొత్తాన్ని సంపాదించింది. ఎగుమతిదారులను రక్షించేలా ఈ ప్రణాలికలని బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ గవర్నర్ అమీర్ యారోన్ రాయిటర్స్‌కు తెలియజేసారు. కాగా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడి, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వరుస వైమానిక దాడులు అక్కడి ప్రజులకు అతలాకుతలం చేస్తున్నాయి. 3వ రోజుకి ఈ భీకర పోరులో ఇప్పటికే ఇరువైపులా వేలాది మంది పౌరులు, ఉగ్రవాదులు చనిపోయిన సంగతి తెలిసిందే. -
ఈజిప్టులో ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులు
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య శనివారం ఉదయం నుండి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద జరిగిన దాడిలో మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు -
నాలుగు నెలలు.. కరువు కోరల్లోకి 60 లక్షల మంది!
నాలుగు నెలలుగా యుద్ధ వాతావరణం. ఐదువేల మందికిపైగా మృతి. ప్రాణ భయంతో వలసలు పోయిన లక్షల మంది. కరువుకు కూతవేటు దూరంలో మరో అరవై లక్షల మంది. అంతర్యుద్ధంతో సూడాన్ ఎంతగా నాశనం అయ్యిందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. సూడాన్‌లో పారామిలిటరీ ఫోర్స్, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. ఆర్మీ జనరల్ అబ్దెల్ ఫట్టాహ్ అల్ బుర్హాన్, పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ కమాండర్ మొహమ్మద్ హందన్ దాగ్లో మధ్య విలీన చర్చలు విఫలం కావడంతో.. పరస్సర దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మొదలైన ఈ అంతర్యుద్ధంతో ఐదు వేల మందిదాకా మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. మూర్ఖంగా ముందుకే పోతున్నాయి రెండు వర్గాలు. ఊహించని ప్రాణ నష్టం చిన్నారులు ఈ స్థాయిలో మరణిస్తారని ఊహించలేదు. ఆకలి కేకల్ని నిర్మూలించగలిగే పరిస్థితులు ఉన్నా.. వాళ్లు చనిపోవడం బాధాకరం అని సేవ్ ది చిల్ట్రన్ అనే ఎన్జీవో ఒక ప్రకటన విడుదల చేసింది. మరణాలు మాత్రమే కాదు.. దాదాపు 40 వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, చికిత్స అందకపోతే వాళ్ల ప్రాణాలకు కూడా ముప్పేనని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ గతంలోనే చెప్పింది. అంతర్యుద్ధంతో.. యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. మరోవైపు సూడాన్ నుంచి 44 లక్షల మంది సురక్షిత ప్రాంతాలు.. పొరుగు దేశాలకు తరలి వెళ్లి ఉంటారని యూఎన్వో శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. సూడాన్‌లో కరువు కోరల్లో 60 లక్షల మంది ఉన్నారనే హెచ్చరికలూ జారీ అవుతున్నాయి. పరస్పర దాడుల వల్ల.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారు. మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అయిపోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. అంతర్జాతీయంగా పలు ఛారిటీలు, సంస్థలు సాయం అందించేందుకు ముందుకు వెళ్తున్నా.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల దాడులతో వాటికి విఘాతం ఏర్పడుతోంది. -
భూ తగాదా తీరితేనే నాన్న శవానికి అంత్యక్రియలు, చనిపోయి మూడురోజులైనా
హాలియా: భూమి కోసం ఇద్దరి అన్నదమ్ముల కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు మృతి చెందాడు. అయితే ఆస్తి దక్కే వరకు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేది లేదని మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటన అనుముల మండలంలోని యాచారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరు చెన్నయ్య, బైరు సైదులు సొంత అన్నదమ్ములు. చెన్నయ్యకు ముగ్గురు కుమారులు సంతానం కాగా సైదులుకు ఇద్దరు కుమార్తెలు. యాచారంలో తండ్రి వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో ఇరువురు అన్నదమ్ములు చెరో రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. కాగా తండ్రి మరణాంతరం ఇంటికి పెద్ద కుమారుడైన బైరు చెన్నయ్య పేరున నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి పట్టా అయ్యింది. ఈ భూమి పట్టా విషయంలో కొంత కాలంగా అన్నదమ్ముల మధ్య గొ డవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. చనిపోయి మూడురోజులైనా.. కాగా ఈ నెల 8న ఇరు కుటుంబాల వారు మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో చెన్నయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు కలిసి బైరు సైదులును కొట్టడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే సైదులు మృతిచెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి కుమార్తె పూజిత హాలియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బైరు చెన్నయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. కాగా ఆస్తి విషయంలో తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని గత మూడు రోజులుగా మృతదేహాన్ని నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రిలో ఉంచి సైదులు కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేసే వరకు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేదిలేదని కుటుంబ సభ్యులు భీష్మించుకు కూర్చున్నారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఈ వివాదానికి పరిష్కార మార్గం చూపుతున్నట్లు తెలిసింది. -
బాలల సంరక్షణకు భారత్ చర్యలు భేష్
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయంగా భారత్‌కు మరో శుభపరిణామమిది. చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ (యూఎన్ఎస్జీ) వార్షిక నివేదిక నుంచి భారత్ పేరును తొలగించినట్టుగా యూఎన్ సెకట్రరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్ తీసుకున్న చర్యల్ని గుటెరెస్ స్వాగతించారు. 2010 నుంచి భారత్ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తోంది. కశ్మీర్లో ఉగ్రసంస్థలు బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటివాటితో భారత్ పేరు ఆ నివేదికలో ఉంటూ వస్తోంది. భారత్‌తో పాటు బుర్కినా ఫాసో, కేమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫ్పీన్స్లోనూ చిన్నారులు ఉగ్రముఠాల్లో చేరుతున్నట్టు యూఎన్ నివేదికలు చెబుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్లో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై గుటెరెస్ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో ఛత్తీస్‌గఢ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, జమ్ముకశ్మీర్‌లలో బాలల సంరక్షణ మెరుగైందని ఆ నివేదిక వెల్లడించింది. -
బీజేపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విశ్వరూపం
-
Sudan: ప్చ్.. అంత చేసినా సీన్ మారలేదా?
వారంపాటు కాల్పుల విరమణకు అంగీకరించిన సూడాన్ ఆర్మీ, పారామిలిటరీ బలగం(RSF).. మళ్లీ కయ్యానికి దిగాయి. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన కొద్దినిమిషాల వ్యవధిలోనే పరిస్థితి మళ్లీ తలపడడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. అమెరికా, సౌదీ అరేబియా దౌత్యంతో ఎట్టకేలకు వారంపాటు కాల్పుల విరమణకు సూడాన్‌లో అంతర్యుద్ధానికి దిగిన ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే.. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ విరమణ అమలులోకి రాగా.. కాసేపటికే ఇరు వర్గాలు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. చాలా ప్రాంతాల్లో మళ్లీ కాల్పులకు, వైమానిక దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా రాజధాని ఖార్తోమ్‌లో ఈ దాడులు హోరాహోరీగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇరువర్గాలతో పలుదఫాలుగా చర్చించి ఒప్పంద పత్రాలపై సంతకాల ద్వారా కాల్పుల విమరణకు ఒప్పించాయి అమెరికా, సౌదీ అరేబియాలు. తద్వారా తీవ్ర మారణ హోమం నుంచి వీలైనంత మేర ప్రజల్ని తప్పించాలని భావించాయి. అంతేకాదు.. గతంలో కాల్పుల విమరణ ఉల్లంఘనలా తరహా కాకుండా ఈసారి ఇరువర్గాలు కచ్చితంగా పాటిస్తాయని ఈ సందర్భంగా ఆ దేశాలు భావించాయి. అందుకు తగ్గట్లే ఆర్ఎస్ఎఫ్ నేత మొహమ్మద్ హమ్దాన్ డగాలో.. సౌదీ అరేబియా, అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విటర్ ద్వారా ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. కానీ, పరిస్థితిలో మార్పు మాత్రం రాలేదు. పక్కా ఒప్పందాన్ని సైతం ఉల్లంఘించి ఇరువర్గాలు మళ్లీ తలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్మీ, పారామిలిటరీ బలగం ఆర్ఎస్ఎఫ్ మధ్య ఆధిపత్య పోరులో సూడాన్ సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కాల్పులు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఐదువారాలుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో వందల మంది మరణించగా.. లక్షల మంది చెల్లాచెదురు అయ్యారు. -
సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య ఆఫ్రికా దేశం సూడాన్‌లో.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల నడుమ జరుగుతున్న ఆధిపత్య పోరులో సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. కాల్పుల విరమణతో విరామం ప్రకటించడంతో.. అక్కడి నుంచి విదేశీయుల తరలింపు వేగవంతం అయ్యింది. ఈ క్రమంలో ఆపరేషన్ కావేరి ద్వారా సూడాన్ వయా జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తున్నారు. తొలి బ్యాచ్‌గా.. ఢిల్లీకి చేరుకున్నారు 360 మంది భారతీయులు. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు వర్ధన్ కూడా ఉన్నారు. సూడాన్‌లోని పరిస్థితుల గురించి సాక్షితో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. ‘‘మాది గుంటూరు చీరాల. నేను డిప్లోమా చేశాను. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఆరేళ్ల కిందట సూడాన్ వెళ్లాను. ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. ఇంతలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను తిరిగి రావాల్సి వచ్చింది. సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితులు లేవు. అక్కడి నుంచి బయటపడితే చాలని బయలుదేరాం. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు భీకరంగా పోరాటం చేస్తున్నాయి. ప్రజల వద్ద ఉన్న వాటన్నింటిని దోచుకుంటున్నారు. సూడాన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదని తెలిపారాయన. ‘‘ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ భవన్ అధికారులు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఏపీ భవన్లో ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఇంటికి చేరేవరకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా కోసం చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు’’ అని విష్ణువర్థన్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సూడాన్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఏపీఎన్ఆర్టీఎస్ రంగంలోకి దిగింది. సూడాన్‌లో రాష్ట్రానికి చెందిన 58 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాళ్లలో ఇప్పటికే సగానికి పైగా జెడ్డాకు చేరుకున్నారు. అటు నుంచి ఢిల్లీకిగానీ, ముంబైకిగానీ చేరుకునే వాళ్లను స్వగ్రామాలకు తీసుకొచ్చే బాధ్యతలను, అందుకు అయ్యే ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించనుంది. హెల్ప్‌లైన్ నెంబర్లు.. 0863 2340678 వాట్సాప్ నెంబర్ 85000 27678 ఇదీ చదవండి: మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి నలిగిపోయినట్లు.. -
Sudan Crisis: 72 గంటలపాటు కాల్పుల విరమణ!
ఖార్తోమ్: సూడాన్‌లో సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్.. మూడు రోజుల పాటు కాల్పుల విమరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గత పదిరోజులుగా సూడాన్ ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు నడుమ అక్కడ పోరు జరుగుతోంది. నడుమ 400 మందికి పైగా సాధారణ పౌరులు మరణించగా.. దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. భారీ ఎత్తున్న విదేశీయులు తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే.. 48 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సుడానీస్ సాయుధ దళాలు (SAF) - ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని బ్లింకెన్ వెల్లడించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయని తెలుస్తోంది. సంధి అమలు కావడానికి రెండు గంటల ముందే బ్లింకెన్ ప్రకటన వెలువడడం విశేషం. ఈ మూడు రోజుల్లో పౌరుల తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది. శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ తరుణంలో ఎటు పోవాలో పాలుపోని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అగాధంలోకి సూడాన్.. సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరును.. ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పేద దేశమైన సూడాన్ ఈ పోరుతో అగాధంలోకి కూరుకుపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. అంతేకాదు కాల్పుల విరమణకు ఆయన పిలుపు ఇచ్చారు. ఐరాస తరపున పలు విభాగాలు సూడాన్ పౌరులను సరిహద్దులకు దేశాలకు సురక్షితంగా తరలించే యత్నంలో ఉన్నాయి. మరోవైపు సూడాన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి బ్రిటన్ విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ కావేరీ.. మనోళ్ల కోసమే! -
Sudan Conflict: 400 మందికి పైగా మృతి.. వేల మందికి గాయాలు
న్యూయార్క్: సూడాన్ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(RSF)కు నడుమ అక్కడ భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు ఐరాస మరో విభాగం యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరేట్ హ్యారిస్ మీడియాతో మాట్లాడుతూ.. సూడాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 413 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, అలాగే 3,551 మంది గాయపడ్డారని వెల్లడించారు. అలాగే.. అక్కడి ఆరోగ్య కేంద్రాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఇదే సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ మాట్లాడుతూ.. ఈ పోరులో పిల్లలే ఎక్కువగా బాధితులైనట్లు వెల్లడించారు. తొమ్మిది మంది చిన్నారులు మరణించారు, 50 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారాయన. అలాగే.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారని, చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకపోయాయని తెలిపారు. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారని, మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అవుతున్నాయంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితులతో యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. సూడాన్‌లో 2021 అక్టోబర్ నుంచి ప్రభుత్వం లేకుండానే ఎమర్జెన్సీలో నడుస్తోంది. మిలిటరీ అప్పటి ప్రధాని అబ్దల్లా హందోక్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. గత శనివారం నుంచి సూడాన్ రాజధాని ఖార్తోమ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నడుమ పోరాటం నడుస్తోంది. అధికార దాహం నుంచి పుట్టిందే ఈ అంతర్యుద్ధం -
వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్‌కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్!
చైనా పట్ల అమెరికాకు ఉన్న వక్రీకరణ వైఖరిని మార్చుకోవాలి లేదంటే సంఘర్షణ కాస్త ఘర్షణగా మారుతుందని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ యద్ధం విషయంలో రష్యాతో గల సన్నిహిత సంబంధాలపై తమ వైఖరిని వక్రీకరించొద్దంటూ ఆయన హెచ్చరించారు. ఎప్పటికీ చైనాను అణిచి వేయడం, అదుపు చేయడం వంటి పనుల్లో యూఎస్ నిమగ్నమవ్వుతోందంటూ క్విన్ గ్యాంగ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీజింగ్‌లోని వార్షిక పార్లమెంటు సమావేశం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల యూఎస్ అభిప్రాయాలు, అవగాహనలు వక్రీకరించి ఉన్నాయని అన్నారు. చైనాను యూఎస్ ప్రాథమిక ప్రత్యర్థిగా చేస్తోంది. దీని పర్యవసానం భౌగోళిక రాజకీయ సవాలుగా మారుతుందన్నారు. ఇది చొక్కాలోని మొదటి బటన్ని తప్పుగా పెట్టడం లాంటిదని చెప్పారు. యూఎస్ ఎప్పుడూ ఉద్రిక్తతలు, సంక్షోభాలు తలెత్తకుండా ద్వైపాక్షిక సంబంధాలతో రక్షణ కవచాలను ఏర్పరుచుకుంటుందే తప్ప సంఘర్షణ కోరుకోదని వల్లిస్తుంటుంది అన్నారు క్విన్. కానీ ఆచరణ పరంగా అమెరికా భావం ఏంటంటే చైనాపై అపవాదులు, దాడులు చేసినప్పటికీ తమ దేశం స్పందిచకూడదు లేదా దాడి చేయకుండా కట్టడి చేయాలనుకుంటుందన్నారు. ఇలాంటి వాటికి అమెరికా చెక్‌పెట్టకుండా తప్పుడు మార్గంలో కొనసాగిస్తే పట్టాలు తప్పడమే కాకుండా ఎన్ని రక్షణదారులు ఉన్న వాటిని నిరోధించలేవు అని హెచ్చరించారు. పైగా సంఘర్షణ ఘర్షణగా మారి విపత్కర పరిణామానికి దారితీస్తుందన్న అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాగా వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్‌కిర్బీ.. క్విన్ విమర్శలను తిప్పికొట్టారు. బీజింగ్‌తో ఘర్షణ పడాలని ప్రయత్నించడం లేదని నొక్కి చెప్పారు. తాము చైనాతో వ్యూహాత్మక పోటీని కోరుకుంటున్నామే గానీ వివాదాన్ని కాదని చెప్పారు. చైనాని ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉంచామని చెప్పారు. (చదవండి: ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!) -
ఆయుధాలు పంపినంత కాలం యుద్ధం ఆపే ప్రసక్తే లేదు: పుతిన్
తమ దేశ పార్లమెంట్లో రష్యాను ఉద్దేశించి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. ఈ మేరకు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి ఏడాది కావొస్తున్న సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు పుతిన్. వాస్తవానికి తాము ఈ సమస్యను శాంతియుతం పరిష్కరించడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నించామన్నారు. అంతేగాదు ఈ వివాదం నుంచి బయటపడేలా కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కానీ దీని వెనుక ఒక విభిన్నమైన కుట్ర దాగి ఉందని ఆరోపణలు గుప్పించారు పుతిన్. ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాలే యుద్ధాన్ని ప్రారంభించాయని, దాన్ని ఆపడానికి రష్యా శాయశక్తులా ప్రయత్నం చేస్తోందన్నారు. అంతేగాదు పశ్చిమ దేశాలతో భద్రతా పరంగా దౌత్య మార్గాన్ని అనుసరించి సమస్యను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ విషయంలో ఎటువంటి పారదర్శకత లేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆయా దేశాలు నాటో విస్తరణ కోసమే చూస్తున్నాయనే తప్ప.. శాంతియుత మార్గం కోసం ప్రయత్నం జరగడం లేదని విమర్శించారు. ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు, పశ్చిమ దేశాలు, నాటో దేశాలు సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అలాగే గతేడాది నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సాయం చేస్తున్న దేశం పేరు చెప్పకుండానే అమెరికాను పరోక్షంగా పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు ఎంత ఎక్కువగా ఆయుధాల పంపితే అంత ఎక్కువ కాలం రష్యా దాడి చేస్తుందని హెచ్చరించారు. అంతేగాదు ఉక్రెయిన్‌లో ప్రజలు పాశ్చాత్య యజమానులకు బందీలుగా మారారని, వారికంటూ వ్యక్తిగతం లేదని విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ పాలన వారికి జాతీయ ప్రయోజనాలను అందించడం లేదన్నారు. రష్యాకు వ్యతిరేక చర్యలు చేపట్టేందుకు ఉక్రెయిన్ వివిధ మార్గాలను అన్వేషిస్తుందని, ముఖ్యంగా నాజీలు, ఉగ్రవాదులను సైతం ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్ దళాల్లో నాజీ యూనిట్లు కూడా ఉన్నాయని చెప్పారు. రష్యా ప్రజలను రక్షించాలని, వారి ఇళ్లను రక్షించాలని కోరుకుంటోందన్నారు. కానీ పాశ్చాత్య నాయకులు వివాదాన్ని మరింత ముదిరిలే చేసేందుకు ఆర్థిక, సైనిక సాయాన్ని చేస్తున్నాయంటూ పుతిన్ మండిపడ్డారు. తాము దశలవారిగా లక్ష్యాలను చేధించుకుంటూ ఒక క్రమపద్ధతిలో ఉక్రెయిన్‌పై దాడి చేస్తూ.. ఈ సమస్యను పరిష్కారిస్తామని ధీమాగా చెప్పారు పుతిన్. We were doing everything possible to solve this problem peacefully, negotiating a peaceful way out of this difficult conflict, but behind our backs, a very different scenario was being prepared: Russian President Vladimir Putin pic.twitter.com/ZY8p1nEf84— ANI (@ANI) February 21, 2023 (చదవండి: తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం) -
ఎవరీ ప్రభాకరన్? నెడుమారన్ ప్రకటనతో కలకలం.. నిజంగా బతికే ఉన్నాడా?
వేలుపిళ్లై ప్రభాకరన్. తమిళులకు ఆరాధ్యుడు. శ్రీలంక ప్రభుత్వం దృష్టిలో రక్తపుటేర్లు పారించిన ఉగ్రవాది. భారత్ దృష్టిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని పొట్టన పెట్టుకున్న హంతకుడు. 2009లో శ్రీలంక సైన్యం దాడిలో హతమైనట్టు ప్రపంచమంతా నమ్ముతుండగా, ఆయన బతికే ఉన్నారంటూ తమిళ నేత నెడుమారన్ తాజాగా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది... పెద్దపులిగా పేరుబడ్డ ప్రభాకరన్‌ది ఆద్యంతం ఆసక్తికర ప్రస్థానం. శ్రీలంకలోని తమిళులకు ప్రత్యేక దేశం కావాలన్న ఆశయ సాధనకు మూడు దశాబ్దాలకు పైగా లంక సైన్యంపై సాయుధ పోరాటం సాగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు ఆరాధ్య నాయకుడిగా కీర్తి పొందిన ప్రభాకరన్ 1954 నవంబర్ 26న శ్రీలంకలోని ఉత్తర తీర ప్రాంత పట్టణం వల్వెత్తితురైలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. స్థానిక సింహళీయులు, లంక సైనికుల అరాచకాలను కళ్లారా చూసిన ప్రభాకరన్ తట్టుకోలేకపోయారు. బడి మానేసి విప్లవోద్యమం వైపు అడుగులేశారు. ఎల్టీటీఈ... ‘త్రివిధ’ ఉగ్ర సంస్థ! ప్రభాకరన్ తొలుత తమిళుల ఆందోళన కార్యక్రమాలు, నిరసనల్లో పాల్గొన్నారు. నెమ్మదిగా తమిళ యువకులను చేరదీసి 1972లో ‘తమిళ్ న్యూ టైగర్స్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. 1975లో దాని పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)గా మార్చారు. అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు ఎల్టీటీఈ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. టైగర్స్, సీ టైగర్స్ (నావికాదళం), ఎయిర్ టైగర్స్ (వైమానిక దళం) పేరిట త్రివిధ దళాలున్న ఏకైక ఉగ్రవాద సంస్థగా ఎల్టీటీఈ చరిత్ర సృష్టించింది! అంతేగాక ఎల్టీటీఈలో ఆత్మాహుతి దళాలను, ‘సైనేడ్ మరణాల’ను ప్రవేశపెట్టి ప్రభాకరన్ సంచలనం సృష్టించారు. తమిళులకు ప్రత్యేక దేశం కోసం లంక సైన్యంతో ఎల్టీటీఈ దళాలు ఏళ్ల తరబడి హోరాహోరీ తలపడ్డాయి. ఈ యుద్ధంలో లక్ష మందికి పైగా బలయ్యారు. బాధితుల్లో సింహళ జాతీయులతో పాటు తమిళులు కూడా ఉన్నారు. తమిళులు ముద్దుగా ‘తంబి’ అని పిలుచుకొనే ప్రభాకరన్ ఆయుధాలతో పాటు కొన్నిసార్లు దౌత్య మార్గాన్ని కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. 1985లో భారత చొరవతో, 2002లో నార్వే మధ్యవర్తిగా శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఇంటర్‌పోల్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దర్యాప్తు సంస్థలు ప్రభాకరన్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించాయి. రాజీవ్ హత్య ప్రముఖ నేతలను పాశవికంగా పొట్టన పెట్టుకున్న తీరు ఎల్టీటీఈ రక్తచరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. భారత ప్రధాని రాజీవ్‌గాంధీ శాంతి పరిరక్షణ పేరిట లంకకు భారత సైన్యాన్ని పంపడంతో ప్రభాకరన్ తీవ్రంగా మండిపడ్డారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో మానవ బాంబు దాడితో ఆయనను బలి తీసుకున్నారు. అనంతరం 1993లో శ్రీలంక అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కూడా ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడికి బలయ్యారు. అంతేగాక చంద్రికా కుమారతుంగ, మైత్రిపాల సిరిసేన సహా పలువురు లంక అధ్యక్షులను, ప్రధానులను హతమార్చేందుకు ఎల్టీటీఈ విఫలయత్నం చేసింది. ఇక దాని దాడుల్లో బలైన శ్రీలంక మంత్రులు, రాజకీయ నాయకులు, సైనిక ఉన్నతాధికారుల జాబితాకైతే అంతు లేదు! వెంటాడి, వేటాడి... దశాబ్దాలపాటు నెత్తుటేర్లు పారించిన ఎల్టీటీఈపై మహింద రాజపక్సె హయాంలో లంక సైన్యం ఉక్కుపాదం మోపింది. ముప్పేట దాడితో సంస్థను నిర్వీర్యం చేసింది. మిగిలిన కొద్దిమందీ చెల్లాచెదురయ్యారు. ప్రభాకరన్ కూడా మారుమూల ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది! ఆయన కోసం సైన్యం కనీవినీ ఎరగని రీతిలో వేటకు దిగింది. చివరికి 2009 మే 18న శ్రీలంకలోని ముల్లైతీవులో హోరాహోరీ పోరాటంలో ప్రభాకరన్‌ను మట్టుబెట్టినట్టు ప్రకటించింది. మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. దాడిలో అతని కుమారుడు బాలచంద్రన్ కూడా చనిపోయినట్టు పేర్కొంది. కొడుకు, కూతురు సజీవమే? ప్రభాకరన్ వ్యక్తిగత జీవితం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. 1984 అక్టోబర్ 1న చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లో మదివదనిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె ద్వారక, కుమారులు చార్లెస్ ఆంథోనీ, బాలచంద్రన్ ఉన్నా రు. బాలచంద్రన్ లంక సైనికుల చేతిలో మరణించగా మిగతా వారి ఆచూకీ తెలియదు. వారు లంకలో లేరని, విదేశాల్లో తలదాచుకుంటున్నారని తమిళులు నమ్ముతుంటారు. ప్రభాకరన్ బతికే ఉన్నారు త్వరలోనే జనం ముందుకొస్తారు తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్ సాక్షి, చెన్నై/తంజావూర్: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని తమిళ జాతీయోద్యమ నేత పాళ నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ప్రభాకరన్ గురించి కొందరు పథకం ప్రకారం రేకెత్తించిన అనుమానాలకు నేను తెరదించుతున్నా. భార్యా కూతురితో సహా ప్రభాకరన్ క్షేమంగా ఉన్నారు. ఆయన జనం ముందుకు రావడానికి ఇప్పుడు పూర్తి అనుకూల వాతావరణముంది’’ అని నెడుమారన్ సోమవారం తమిళనాడులో మీడియాకు వెల్లడించారు. ‘‘శ్రీలంకలో ఈళం తమిళుల పునఃప్రవేశంపై ప్రభాకరన్ త్వరలోనే ప్రకటన చేయబోతున్నారు. నేను చెప్పిందంతా వంద శాతం నిజమే’’ అని ఉద్ఘాటించారు. ప్రభాకరన్ ఇప్పుడెక్కడ ఉన్నదీ మాత్రం ఇప్పుడే చెప్పనన్నారు. శ్రీలంకతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభాకరన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎల్టీటీఈ ఏనాడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. ప్రభాకరన్ బతికుంటే అంతకన్నా సంతోషకరమైన వార్త మరొకటి ఉండదని డీఎండీకే అధినేత వైగో, పలు పార్టీల నేతలన్నారు. పెద్ద జోక్: శ్రీలంక కొలంబో: ప్రభాకరన్ బతికే ఉన్నాడనడాన్ని పెద్ద జోక్‌గా శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి నళిన్ హెరాత్ అభివర్ణించారు. ‘‘ప్రభాకరన్ 2009 మే 18న హతమయ్యాడు. ఇది డీఎన్ఏ పరీక్షలోనూ నిర్ధారణ అయింది’’ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరీ టైగర్ ప్రభాకరన్.. హీరోనా? విలనా?
అణచివేత ఏ రూపంలో ఉన్నా.. ఏదోఒకనాటికి అగ్గిని రాజేయడం ఖాయం!. అలా లంక గడ్డపై అక్కడి సింహళీయుల చేతుల్లో దారుణంగా అవమానాలకు గురైన తమిళులకు ఆరాధ్య దైవంగా మారాడు వేలుపిళ్లై ప్రభాకరన్. యావత్ తమిళ సమాజం దృష్టిలో.. ప్రత్యేకించి తమిళ సాహిత్య-సంస్కృతికి గుండెకాయ లాంటి జాఫ్నా(శ్రీలంక) నేల తమిళులకు ఆయన మాత్రం తలైవర్(నాయకుడు). ఇంతకీ ప్రభాకరన్ నేపథ్యం ఏంటి? హీరోగా కొందరు.. విలన్‌గా మరికొందరు ఎందుకు ఆయన్ని ఎందుకు బేరీజు వేసుకుంటారు?. డీఎన్ఏ టెస్ట్‌లోనూ ఆయన మరణించారనే ధృవీకరణ ప్రకటన వెలువడినప్పటికీ.. ఇంకా సజీవంగా ఉన్నాడని, తిరిగి వస్తాడనే ఆశలు ఎందుకు పెట్టుకుంటున్నారు?.. వేలుపిళ్లై ప్రభాకరన్.. ఉత్తర తీర పట్టణం వాల్వెట్టితురైలో 26 నవంబర్ 1954 న జన్మించాడు. నలుగురు పిల్లలలో చిన్నోడు. తండ్రి ప్రభుత్వ అధికారి. సంపన్న కుటుంబం వాళ్లది. కానీ, లంక ప్రభుత్వాలు తమిళులపై చూపించే వివక్ష ఆయన్ని బడి చదువును పక్కన పెట్టించింది. పదిహేనేళ్ల వయసులో.. సత్యసీలన్ ఏర్పాటు చేసిన తమిళ మనవర్ పెరవై అనే గ్రూప్‌లో చేరాడు. ఆపై తమిళులకు స్వయంప్రతిపత్తిని పిలుపుతో ముందుకు సాగాడు. పెరవై నుంచి విడిపోయి.. తమిళ న్యూ టైగర్స్ పేరుతో భాగస్వామ్య కూటమిని ఏర్పాటు చేశాడు. అదే సమయంలో.. తమిళులకు సింహళీయులతో సమానంగా హక్కులను కల్పించాలని, తమిళులు అధికంగా ఉండే చోట్లను స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుగా మార్చాలని ఒక వర్గం వారు కోరగా.. ఇంకో వర్గం ఏకంగా తమిళ ప్రాంతాన్నిటినీ కలిపి తమిళ్ ఈళం అనే ప్రత్యేక దేశాన్ని తమకు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలతో అగ్గి.. హక్కుల్లో అసమానతలు, జాతి వివక్ష, దేశ అంతర్యుద్ధంలో జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలు. శ్రీలంకలో తమిళులు కొందరు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నా, అధిక శాతం వారు బ్రిటిషర్ల పాలనలో వలస కూలీలుగా తీసుకురాబడినవారే. వీరు ఎక్కువగా ఉండేది ఉత్తర, తూర్పు శ్రీలంకలో. శ్రీలంకకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1970 వరకూ అందరికీ సమాన హక్కులు ఉండేవి. కానీ 1970లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం రెండు కొత్త చట్టాలను అమలులోకి తెచ్చింది. అవి రెండూ శ్రీలంక తమిళులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకటి.. యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఆ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకాలిటీలో ఉండేవారికి 40% కేటాయించాలి. శ్రీలంకలో సింహళీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సీట్లన్నీ వారికే వెళ్ళేవి. దీని వల్ల తమిళులకు సీట్లు రావాలంటే సింహళ విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే తప్ప సీట్ దొరికే అవకాశం లేదు. రెండు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా సింహళం వచ్చినవారికి మాత్రమే ఉద్యోగం. అంతే కాకుండా సింహళాన్ని జాతీయ భాషగా ప్రకటించి తమిళానికి కనీసం అధికారిక భాషగా కూడా గుర్తింపు ఇవ్వలేదు.అంతే కాకుండా సామాజికంగా కూడా తమిళులను నిమ్నభావంతో చూడటం కూడా మొదలైంది. ఇవన్నీ శ్రీలంక తమిళుల స్వాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉండటం వల్ల శ్రీలంక ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. హత్యతో మొదలై.. ప్రభాకరన్ ఉడుకు రక్తం.. అప్పటి లంక రాజకీయాలు ఆయన్ని తీవ్ర నిర్ణయాలపై అడుగులు వేయించింది. ఆ సమయంలోనే 1975లో తమిళ ఉద్యమంలో పాల్గొని.. ఆపై జాఫ్నా మేయర్ దురైప్పాను హత్య చేయడం ద్వారా సంచలనానికి తెర తీశాడు ప్రభాకరన్. ఆ దెబ్బకి ప్రభాకరన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. తమిళులు హీరోగా అభివర్ణించసాగారు. ఆపై మే 5, 1976లో తమిళ న్యూ టైగర్స్ టీఎన్టీని.. ఎల్టీటీఈగా మార్చేశాడు. సింపుల్‌గా దీన్నే తమిళ టైగర్స్ అని కూడా పిలుస్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం వర్గానికి నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్. దీనిని 32 దేశాలు తీవ్రవాద సంస్థగా ముద్ర వేశాయి. అనధికారికంగా ఉత్తర, తూర్పు లంకలో తమ సొంత ప్రభుత్వాన్నే నడిపేది. వీరు సొంత పోలీస్ స్టేషన్, కోర్టు, హాస్పిటల్, రేడియో, టీ.వీ చానెల్, దినపత్రిక, ఎయిర్ ఫోర్స్, నేవీ వంటివి కూడా నడిపేవారు. వన్యప్రాణులను పెంచుకునేవాడు ప్రభాకరన్. వీటన్నింటికీ నిధులు కెనడా, సింగపూర్ లో స్థిరపడ్డ తమిళులు, భారతీయ తమిళులు కూడా పంపేవారు. ప్రభాకరన్ తమిళులు నివసించే ప్రాంతాలన్నీ తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. తమకు కావలసిన ఆయుధాలను, డబ్బును విదేశాలనుండి సమకూర్చుకున్నారు. మారణహోమానికి ఆద్యుడా? నరనరాన నిండిన తమిళ జాతీయ వాదం.. విప్లవ స్ఫూర్తిని రాజేసి ఏకంగా లంక సైన్యంతో అంతర్యుద్ధం వైపుగా ఆయన్ని అడుగులు వేయించింది. ఇక శ్రీలంక సైన్యం జరిపిన మెరుపు దాడి.. ఏకంగా దేశంలో హింసకే దారి తీసింది. శాంతి చర్చలు జరిపినప్పటికీ.. అవి విఫలం కావడం, అప్పటికే ఎల్టీటీఈపై ఆగ్రహంతో ఊగిపోతున్న లంక సైన్యం ఎదురు దాడికి దిగడంతో ఘోర కలి జరిగింది. మూడేళ్ల పాటు అలాగే కొనసాగింది.. ఎంతోమంది శ్రీలంక సైనికులు, ఎల్టీటీఈ సైన్యం చనిపోసాగారు, గొడవలు జరిగే చోట లంక ప్రభుత్వం నీరు, భోజన సరఫరాను నిలిపివేసేది. దాని వల్ల ప్రజలు వలసలు పోయేవారు. ఈ వలసల వల్ల చాలా కుటుంబాలు తమ సొంత ఇళ్ళనీ, ఆస్తులనీ కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబంలో చనిపోకుండా మిగిలిన వారు పగతీర్చుకోడానికని ఎల్టీటీఈలో చేరేవారు. వలస వెళ్ళే వాళ్ళను ఎల్టీటీఈ ఆపేసే యత్నం చేసేది. శ్రీలంక సైనికులకు ఎవరు ప్రజలో ఎవరు తమిళ టైగర్స్ గుర్తించలేక ఆ స్థలాల్లో కనబడిన వారినందరినీ చంపేసే వారు. కొన్ని చోట్ల ఎల్టీటీఈ వాళ్ళు ఆత్మాహుతి దాడులు చేసేవారు. అలా.. పరీక్షల్లో తేలినా.. ముల్లైటివులోని వెల్లముల్లివాయికల్లో 2009 మే 18వ తేదీన లంక సైన్యం ఘోరంగా విరుచుకుపడింది. వంద మంది ఎల్టీటీఈ సైన్యం మృతి చెందింది. అందులో ప్రధాన నేతలు కూడా ఉన్నారని, ప్రభాకరన్ కూడా ఉన్నాడని లంక సైన్యం ప్రకటించింది. శ్రీలంక రక్షణ దళాల నుండి తప్పించుకోబోయి హతుడయ్యాడని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆ మరుసటి రోజు స్వర్ణవహిని చానెల్లో డెడ్‌బాడీని చూపించారు. డీఎన్ఏ పరీక్షలో ప్రభాకరన్ మరణం ధృవీకరణ కూడా అయ్యింది!. కానీ, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు ఆయన మరణించలేదని చెబుతుంటారు. ఇంకొందరు ఆయన్ని ఘోరంగా చంపారని, ఉరి తీశారని, సహజంగా మరణించారని.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తారు. కొన్నాళ్లకు ఎల్టీటీఈ కొత్త చీఫ్ సెల్వరస పధ్మనాథన్ ప్రభాకరన్ మరణాన్ని ధృవీకరించాడు. రెండు వారాల తరువాత డీఎన్ఏ పరీక్షలో ప్రభాకరన్, అతని కుమారుడు చార్లెస్ అంటోనీలు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అలా సాయుధ పోరాటం ఆగిపోయింది. శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. దీని వల్ల దాదాపు లక్ష మంది చనిపోయారు వారిలో ఆ దేశ ప్రజలు, భారత సైనికులు, LTTE వర్గం వారు, లంక సైనికులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో లంక ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న మనదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా LTTE ఆత్మాహుతి దాడిలో మరణించారు. ప్రభాకరన్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయిందనేది లంక ఆర్మీ విశ్వాసం. ఆయన తల్లిదండ్రులు తిరువెంకటం, పార్వతిలను సైన్యం అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి చనిపోయే వరకు సైన్యం అదుపులోనే ఉన్నారు. చె గువేరా ఆఫ్ లంక 80వ దశకం ప్రారంభం నాటికి.. పోలీస్ దళాలపై ఎల్టీటీఈ దాడులు పెరిగిపోయాయి. ఆపై సైన్యంపై పెట్రోలింగ్ దాడి.. ఈలం యుద్ధానికి దారి తీసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి చేరిపోయాడు ప్రభాకరన్. శత్రువు చేత సజీవంగా పట్టుబడకుండా గౌరవంగా చనిపోవటానికి నేను ఇష్టపడతాను లాంటి కొన్ని ఆయన మాటలు.. తమిళులను తీవ్రంగా ప్రభావితం చేసేవి. ఆ సమయంలో చే గువేరాతో ప్రభాకరన్‌ను పోల్చింది ఓ ప్రముఖ పత్రిక. ఆపై రాజీవ్ గాంధీ హత్యకు. ఎల్టీటీఐకు సంబంధం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. కానీ, ప్రభాకరన్ మాత్రం అది అంతర్జాతీయ కుట్ర అనేవారు. మరణాంతరం ఆ అభియోగాలకు మన దగ్గరి టాడా కోర్టు ఎత్తేసింది. ఘోరాలే.. ఇదిలా ఉంటే, యుద్ధంలో శ్రీలంక సైనికుల చేతిలో చిక్కిన LTTE వారిని, వాళ్ల కుటుంబ సభ్యులను చాలా ఘోరాతి ఘోరంగా హింసించి చంపిన ఉదంతాలను కొన్ని మీడియా సంస్థలు, ఫొటోగ్రాఫర్లు బయటపట్టారు. వారి బట్టలు ఊడదీసి అవమానించి, కళ్ళకు గంతలు కట్టి సుత్తులతో నెత్తిన కొట్టి, ఆడవారిని మానభంగం చేసి అతిక్రూరంగా కాల్చి చంపేవారు. ఇదంతా ఎవరో తీసిన వీడియో టేపు లీక్ అయిన తర్వాత బయటపడ్డ విషయాలు. దీని మీద ప్రపంచ మానవహక్కుల పరిరక్షణ సమితిలో కేసు నమోదు చేయగా, ఇప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తించటానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారే తప్ప ఏ చర్య తీసుకోలేదు. ప్రభాకరన్ 12 ఏళ్ల కుమారుడు బాలచంద్రన్‌ను శ్రీలంక సైన్యం పట్టుకుని అత్యంత దారుణంగా హింసించి చంపిన తీరుకు అద్దం పట్టే ఫోటోలు బయటకు వచ్చాయి. జయలలిత సైతం ఆ ఘోర కలిని ఖండించారు అప్పట్లో. కానీ, లంక ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. భారత్ ప్రమేయం ఎంతవరకంటే.. లంక తమిళ వేర్పాటువాద ఉగ్ర సంస్థలు వర్సెస్ ప్రభుత్వం మధ్య అంతర్యుద్ధం. ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు, ఇంత జరుగుతుంటే పక్కనే ఉన్న మనదేశం ఊరుకోదుగదా! అప్పట్లో భారత ప్రధానమంత్రైన రాజీవ్ గాంధీ మొదట్లో ఎల్టీటీఈ కి మద్దతుగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే.. 1987లో శ్రీలంక సైనికు దళం ప్రభాకరన్ దళం ఉన్న దాదాపు అన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తెచ్చుకుంది. ఇక లొంగిపోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అంతలో భారత ప్రభుత్వం ఆహారాన్ని, కొన్ని ఆయుధాలను హెలికాప్టర్ల ద్వారా తమిళ టైగర్లకు అందించిందట. ఈ విషయం లంక ప్రభుత్వానికి తెలిసి, భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే తమిళ తీవ్రవాదుల ఆయుధాలన్నీ తమకు అప్పగించాలని, తమిళులకు ప్రత్యేక దేశం ఇవ్వడం తప్ప మిగిలిన షరతులను అంగీకరిస్తామని చెప్పింది. ఆ ఒప్పందం మీద Indian peace keeping force అనే పేరు మీద ఒక సైనిక బలగాన్ని లంకకు పంపింది ఇండియా. అప్పటి వరకు తమకు అనుకూలంగా ఉన్న ఇండియా ఒకే సారి వ్యతిరేకం అవ్వడం ప్రభాకరన్ సైన్యానికి పెద్ద అడ్డంకిగా అయ్యింది. ఈ ఒప్పందం తమిళ ప్రజలకు అనుకూలంగా లేదని, ఒక్కసారి ఆయుధాలను అప్పగిస్తే భారత సైన్యం తిరిగి వెళ్ళాక ఎల్టీటీఈనే కాదు.. తమిళ జాతి మొత్తాన్ని లంక సైన్యం అంతం చేసేస్తుందని భావించి ప్రభాకరన్ ఈ ఒప్పందాన్ని సమ్మతించలేదు. ఇక చేసేదేమీ లేక భారత సైన్యం కూడా ప్రభాకరన్ ను పట్టుకునే పనిలో పడింది. దాంతో భారతీయ సైనికులు కూడా చాలా మంది దాడుల్లో మరణించిసాగారు. భారత్.. ప్రమేయం శ్రీలంక వాసులకి నచ్చలేదు. పొరుగు దేశం వచ్చి తమ దేశ విషయాల్లో తలదూర్చడమేంటని లంక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, అప్పుడు లంక మన సైన్యాన్ని తిరిగి వెళ్ళిపోయింది కోరింది. ఈలోపు భారత్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి సైన్యాన్ని వెనక్కి రప్పించుకుంది. సోర్స్: వివిధ రకాల సైట్లు.. పాత అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. క్రూరుడు.. మూర్ఖుడు.. మొండివాడు ప్రభాకరన్ శ్రీలంక తమిళ ప్రజల దృష్టిలో అమరవీరుడు. కానీ, విమర్శకులు ఆయన్ని అత్యంత క్రూరుడిగా, మూర్ఖుడిగా, అధునాతన తిరుగుబాటులల్లో ఆద్యుడిగా పేర్కొంటారు. రాజకీయ ఉగ్రవాద గ్రూపులను ప్రభావితం చేయటానికి అనేక వ్యూహాలతో ముందుకొచ్చిన ఉగ్రవాది అంటారు. 1976 లో స్థాపించబడిన ఎల్టీటీఈ 1983 లో జాఫ్నా వెలుపల శ్రీలంక సైన్యం పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో మెరుపుదాడికి దిగింది. ఫలితంగా 13 మంది సైనికులు మరణించగా.. ఆపై చెలరేగిన హింసతో పాటు వేలాది మంది తమిళ పౌరులు మరణించారు. ఇది ప్రభాకరన్ ఏకపక్ష నిర్ణయమనేది కొంది వాదన. అయితే.. తన మార్గాన్ని ఆయన ఎప్పుడూ సమర్థించుకునేవాడు. అహింసా మార్గాలు పనికిరానివి వాడుకలో లేవని గమనించిన తరువాత మాత్రమే తాను విప్లవ మార్గాలను ఎంచుకున్నానని ప్రభాకరన్ వాదించాడు. ముఖ్యంగా 1987 లో తమిళ ఈలం విప్లవకారుడు తిలీపాన్ ఆమరణ నిరాహార దీక్ష.. ఫలితం లేకుండా ముగియడం ఆయన్ని ప్రభావితం చేసిందట. లక్ష్యం లేని ఆ మార్గాన్ని పక్కన పెట్టాడని చెప్తాడాయన. అన్నింటికి మించి.. ‘‘చిన్నతనంలో అలెగ్జాండర్, నెపోలియన్ వంటి యుధ్ధ వీరుల గురించి తెలిసింది పుస్తకాల ద్వారానే. భారత జాతీయోద్యమం తోనూ, సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర తిలక్ వంటి నాయకులతోనూ గాఢమైన మానసిక సాన్నిహిత్యాన్ని ఏర్పరచినవీ పుస్తకాలే. నేను విప్లవకారుడిగా మారటానికి పునాది వేసినవి ఆ పుస్తకాలే. భారత జాతీయోద్యమం నా అంతరాంతరాలను కదిలించి విదేశీ దోపిడీ మీదా, పెత్తనం మీదా తీవ్రమైన ఆగ్రహాన్ని రగిలించింది. 1958 లో శ్రీలంకలో చెలరేగిన జాతుల ఘర్షణలు, వాటి ఫలితంగా తమిళులు అనుభవించిన వేదనా నన్ను సాయుధ పోరాటం వైపుకు నడిపాయి. దినపత్రికల్లో వార్తలను చూస్తుంటే ఆగ్రహావేశాలు నా హృదయాన్ని తుపాను వలె చుట్టు ముట్టేవి. తమిళ రచయితలు కాశియన్ (పామినిప్ పావై), శాండిల్యన్ (కాదత్ పురా), కల్కి (పొన్నియన్ సెల్వన్) ల రచనలు చదివాక మన పూర్వీకులు ఎంత స్వతంత్రంతో, స్వయం నిర్ణయాధికారం తో పాలన సాగించారో అర్ధమైంది. మన జాతి ప్రజలు ఈ బానిసత్వం నుంచి విముక్తులై తమ స్వతంత్ర దేశంలో ఆత్మ గౌరవంతో, స్వేఛ్చతో జీవించే రోజులు మళ్ళీ రావాలన్న గాఢమైన కాంక్షను నాలో కలిగించాయి ఈ పుస్తకాలు. “ఫలితాన్ని గురించి ఆలోచించక నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు” అనే భగవద్గీతా ప్రబోధం కూడా నన్ను చాలా ఆకర్షించింది. క్రమశిక్షణ కలిగిన ఉత్తమ జీవితాన్ని గడపాలని, నా జాతి ప్రయోజనాలకు కట్టుబడి పనిచేయాలని బాల్యం లోనే నిశ్చయించుకునేందుకు తోడ్పడినవి నేను చదివిన సందేశాత్మక గ్రంథాలే. సుభాస్ చంద్రబోస్ జీవితం నాకు దారి చూపిన వేగుచుక్క. క్రమశిక్షణా యుతమైన ఆయన జీవితమూ, దేశ స్వాతంత్ర్యం కొరకు ఆయన నిబద్ధత నన్ను తీవ్రంగా ప్రభావితం చేసి, మార్గ నిర్దేశం చేశాయి. నేను చదివిన పుస్తకాలే నన్ను ప్రజా విముక్తి పోరాటం లోకి నడిపించాయని చెబుతాను. జాఫ్నాకు చెందిన తమిళ సాహిత్య పత్రిక “వెలిచ్చమ్” కోసం 1994 లో ప్రభాకరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ.. దానికి కాత్యాయని చేసిన అనువాదం -
యనమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే.. ఇప్పుడెలా? యనమలా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో యనమల సోదరుల మధ్య మొదలైన రాజకీయ వైరం హట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రెండు సార్లు తుని నుండి ఓటమి చెందిన యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు.. వచ్చే ఎన్నికల్లో తనకే మళ్ళీ సీటు ఇప్పించాలని పట్టుబడుతున్నారు. ఐతే వచ్చే ఎన్నికల్లో 30 శాతం సీట్లు యువతరానికే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో యనమల తన కుమార్తె దివ్యకు సీటు కన్ఫాం చేసుకున్నారు. అన్న వ్యవహారం రుచించని యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల తుని నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో యనమల రామకృష్ణుడు ఒక సమావేశం నిర్వహించారు. దీనికి ముందు రోజే కృష్ణుడు తన అనుచర గణానికి కాల్ చేసి...వచ్చే ఎన్నికల్లో కూడా సీటు మళ్ళీ తనకే ఇవ్వాలంటూ తన అన్న ముందు చెప్పాలని ప్రిపేర్ చేశారు. ఐతే ఆ ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారమే లేచింది. నీ సంగతి బాబుకు చెబుతా ఆ మర్నాడు జరిగిన సమావేశంలో అన్న యనమల రామకృష్ణుడికి తమ గళాన్ని యాజ్ టీజ్‌గా వినిపించారు తమ్ముడు కృష్ణుడి అనుచరులు. దీంతో కాస్తంత అసహనానికి గురయిన యనమల.. విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళారు. కాని ఇదంతా యనమల ఆడిస్తున్న మైండ్ గేమ్ అనే వాదనలు టీడీపీ వర్గాల్లో వినిపించాయి. ఎందుకంటే.. ఈసారి తుని సీటు యనమల కుటుంబానికి కాకుండా బయట వ్యక్తులకు ఇవ్వాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగింది. అదే సమయంలో తుని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్‌బాబు కూడా చంద్రబాబును కలిసి వచ్చారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో యనమల ఒక్కసారిగా అవాక్కయ్యారట. ఇప్పటి వరకు టీడీపీలో నెంబర్ టూ స్ధానంలో ఉన్న యనమలకు తన నియోజకవర్గంలో జరిగిన ఈ పరిణామం తెలియకపోవడంతో కంగు తిన్నారని తెలుగు తమ్ముళ్ల ప్రచారం. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! దీంతో యనమల తుని సీటు బయట వ్యక్తులకు పోకుండా ఇలా అన్నదమ్ముల మధ్య వైరం వచ్చినట్లు డ్రామా నడిడించి రక్తి కట్టించారని రాజకీయ మేధావులు అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉంటే అసలు రాజా అశోక్ బాబును చంద్రబాబుతో కలిపించిందే కృష్ణుడు అని మరో ప్రచారం ఉంది. అన్నకు వ్యతిరేకంగా కృష్ణుడు ఈ పని చేశాడని నియోజకవర్గంలో కొందరు కోడై కూస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే అంతే సంగతులు ఈ పరిణామాలన్నీ తుని తెలుగుదేశం పార్టీలో కలకలం రేపగా.. తాజాగా యనమల సోదరుల మధ్య మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ సారి సీటు తనకు ఇవ్వకపోతే తన కుమారుడు శివరామకృష్ణకు ఇవ్వాలని కృష్ణుడు గట్టిగా పట్టుపడుతున్నారట. ప్రస్తుతం శివరామకృష్ణ నియోజకవర్గంలో తెలుగుదేశం యువజన విభాగం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం తుని సీటు యువతకే ఇవ్వాలనుకుంటే తన కుమారుడు పేరే పెట్టాలని అన్న యనమలకు ఖరాఖండీగా చెప్పేశారట కృష్ణుడు. దీంతో అన్న యనమలకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురయిందని అంటున్నారు వారి అనుచరులు. మొత్తం మీద టీడీపీలో తొలితరం నాయకుడైన యనమల రామకృష్ణుడికి తమ్ముడు రూపంలో చిక్కులు ఎదురుకావడంతో తన కుమార్తె రాజకీయ భవిష్యత్‌పై పెట్టుకున్న ఆశలు ఏమవుతాయా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
శాంతి కోసం స్త్రీ శక్తి
ఎప్పుడు, ఏ అడుగులో మందుపాతర పేలుతుందో తెలియని కల్లోల ప్రాంతం అది. అక్కడ శాంతిపరిరక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అనేది కత్తి మీద సాముకు మించిన కఠినవ్యవహారం. సుడాన్, దక్షిణ సుడాన్ సరిహద్దులలోని రణక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు మనదేశ మహిళా శాంతిపరిరక్షకులు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతూ, లార్జెస్ట్ సింగిల్ యూనిట్‌గా కొత్త చరిత్ర సృష్టించారు ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్... సుడాన్, దక్షిణ సుడాన్‌ల సరిహద్దు నగరం అభేయ్. చక్కని వ్యవసాయానికి, సంపన్న చమురు క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘అభేయ్’పై ఆధిపత్యం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం సుడాన్, దక్షిణ సుడాన్‌లు పోటీ పడుతుంటాయి. ఇరుదేశాల మధ్య సాయుధ ఘర్షణల వల్ల ఈ ప్రాంతానికి శాంతి కరువైంది. రక్తపాతమే మిగిలింది. సరిహద్దు ప్రాంతాలలో జాతి, సాంస్కృతిక, భాష వివాదాలు కూడా హింసకు ఆజ్యం పోస్తున్నాయి. సుడాన్, దక్షిణ సుడాన్‌ల సాయుధ ఘర్షణలలో అభి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అక్కడ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో అభిలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యూఎన్ చేపడుతున్న పీస్‌కీపింగ్ మిషన్లలో మన దేశం ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. వాటిలో మహిళల ప్రాతినిధ్యానికి మొదటి నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో యూఎన్ పీస్‌కీపింగ్ మిషన్ కోసం మన దేశం 2007లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను ఏర్పాటు చేసి, అలా ఏర్పాటు చేసిన తొలి దేశంగా గుర్తింపు పొందింది భారత్. మన మహిళా బృందాలు లైబీరియాలో శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ విషయాలలో స్థానికులను చైతన్యం చేశారు. ప్రజలకు రోల్‌మోడల్‌గా నిలిచారు. అక్షరాస్యతకు ప్రాధాన్యత పెరిగేలా చేశారు. గత కొంత కాలంగా ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తోంది. 2007లోనే ‘ఆల్ ఉమెన్’ టీమ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్. ‘ఛాంపియన్ ఆఫ్ జెండర్ మెయిన్‌స్ట్రీమింగ్’గా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చేపడుతున్న శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మన దేశ మహిళలకు మంచి పేరు ఉంది. ధైర్యంగా విధులు నిర్వహించడమే కాదు, స్థానికులత కలిసిపోతున్నారు. వారి కుటుంబాల్లో ఒకరిగా మారుతున్నారు. మహిళల సమస్యలను అర్థం చేసుకొని వారిని చైతన్యం వైపు నడిపిస్తున్నారు. తాజాగా ‘అభేయ్’ ప్రాంతంలో విధులు నిర్వహించే ‘లార్జెస్ట్ సింగిల్ యూనిట్’గా ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్ చరిత్ర సృష్టించారు. ఈ యూనిట్లో వివిధ హోదాలలో ఉన్న 27 మంది మహిళలు పనిచేస్తున్నారు. కాస్త వెనక్కి వెళితే... కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తిదేవి... మొదలైన అధికారులు ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో తమదైన ముద్ర వేసి ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చారు. -
మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి..
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం): అయ్యో.. వద్దు అని అరుస్తున్నా వారి మనసు కరగలేదు. కొట్టొద్దు.. కొట్టొద్దు అంటూ వేడుకున్నా వారు కనికరం చూపలేదు. మానవత్వాన్ని మర్చిపోయి, సాటి మహిళ అని చూడకుండా ఇద్దరు మహిళలు తమ సొంత అన్న భార్యపై కర్కశంగా కర్రలతో దాడి చేశారు. బాధితురాలు ఎంతగా ఏడుస్తున్నా వదలకుండా పాశవికంగా కొట్టారు. రణస్థలం మండలం పిషిణి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిని చుట్టుపక్కల వారు వీడియో తీయడంతో అది వైరల్ అయ్యింది. జేఆర్‌పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పిషిణి గ్రామానికి చెందిన రెడ్డి జానకి, కొత్తకోట్ల సుశీల, రెడ్డి నారాయణరావులు అన్నాచెల్లెళ్లు. నారాయణరావుకు భార్య కమల, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. జానకి అవివాహితురాలు కావడంతో తండ్రితో కలిసి ఉంటోంది. పక్కనే వేరే ఇంటిలో నారాయణ రావు కుటుంబంతో ఉంటున్నారు. సుశీలకు వివాహమై అత్తవారింటికి వెళ్లిపోయింది. ఇటీవల నారాయణరావు తండ్రి రామ్మూర్తి పిషిణి రెవెన్యూ పరిధిలో తన భూమిని రూ.70 లక్షలకు విక్రయించారు. వచ్చిన సొమ్మును కుమారుడికి ఇవ్వకుండా ఆడపడుచులే పంచుకున్నారు. గతంలో కూడా ఆస్తులు అమ్మినప్పుడు ఇలాగే జరిగింది. దీంతో వదిన, ఆడపడుచుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని కమల ఆడపడుచులతో తగాదా పడుతూ ఉంటుంది. గతంలోనూ.. కర్రతో కర్కశంగా దాడికి పాల్పడిన రెడ్డి జానకి వ్యవహారం గతంలోనూ వివాదాస్పదమే. 2020లో ఏకంగా జేఆర్‌పురం ఎస్ఐపైనే ఆమె కేసు పెట్టింది. అప్పుడు ప్రకృతి లే–అవుట్లో అన్నాచెల్లెళ్ల మధ్య భూ వివాదంలో ఎస్ఐ అశోక్‌బాబు తలదూర్చడం, ఆ సెటిల్మెంట్ వ్యవహారం అక్రమ సంబంధం ఆరోపణల వైపు దారి తీయడం స్థానికంగా సంచలనం రేపింది. దీనిపై అప్పటి సీఐ హెచ్.మల్లేశ్వరరావుకు జానకి ఫిర్యాదు చేయడంతో ఆ పంచాయతీ ఎస్పీ వరకు వెళ్లింది. అప్పట్లో ఎస్ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు కూడా. తాజా ఘటన నేపథ్యంలో గత పంచాయతీని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. పోలీసుల అదుపులో నిందితులు కేసు నమోదు.. ఉదయం జరిగిన ఈ ఘటనపై స్థానికులు 112 నంబర్‌కు ఫోన్ చేయడంతో జేఆర్‌పురం ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి 7.15కు వె ళ్లారు. బాధితురాలు క మలను 108లో శ్రీకాకు ళం రిమ్స్‌కు తరలించారు. నిందితులైన జానకి, సుశీలను అదుపులోకి తీసుకుని జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హత్యాయత్నంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ప్లాన్ ప్రకారమే.. గొడవల నేపథ్యంలో వదినపై దాడి చేయడానికి ఆడపడుచులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అత్తవారింటిలో ఉన్న సుశీలను ముందురోజే జానకి ఇంటికి పిలిచింది. నారాయణరావు ఉదయం ఐదున్నరకే ఒక పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లిపోతారు. ఆయన పరిశ్రమకు వెళ్లిపోయాక ఉదయం 6.45 గంటలకు వదిన కమలపై ఇద్దరూ కలిసి కిరాతకంగా దాడి చేశారు. కాళ్లు కట్టేసి మరీ కసి తీరా కొట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియోలోనే జానకి 24 సార్లు కర్రతో కొట్టినట్లు తెలుస్తోంది. వీడియో తీయకముందు ఎంతగా దాడి చేసిందోనంటూ స్థానికులు అనుకుంటున్నారు. -
ఆగని ఇజ్రాయెల్ దాడులు.. వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు మృతి
జెరూసలేం: పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం నబ్లాస్ సిటీపై జరిపిన దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. 40 మంది స్థానికులు గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో మూడ్రోజుల కాల్పుల విరమణ ముగిసిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఏడాది తొలినాళ్లలో వెస్ట్‌బ్యాంక్‌లో వరుస దాడులకు కారకుడైన అల్–అక్సా సాయుధ దళం నేత ఇబ్రహీం అల్–నబుల్సీను ఆయన ఇంట్లోనే హతమార్చామని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నబుల్సీ, మరో ఇద్దరు సాయుధులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత మూడ్రోజుల గాజా దాడులు, ప్రతిదాడుల ఘటనల్లో మొత్తంగా 46 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 311 మంది గాయపడ్డారు. పాలస్తీనాతో ఇజ్రాయెల్ ఉగ్ర సంఘర్షణలో నబుల్సీ మరణం ఒక మేలిమి ముందడుగు అని ఇజ్రాయెల్ ఆపద్ధర్మ ప్రధాని యాయిర్ లాపిద్ వ్యాఖ్యానించారు. 1967 నాటి మధ్యప్రాశ్చ్య యుద్ధానంతరం వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ వశమైంది. ఆనాటి నుంచి దశాబ్దాలుగా పాలస్తీనా, ఇజ్రాయెల్ సంఘర్షణ కొనసాగుతోంది. చదవండి: (భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త) -
ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ?
పెదవాల్తేరు (విశాఖ తూర్పు):విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువ జంట కుటుంబాలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట వాగ్వాదానికి దిగాయి. వీరికి సర్దిచెప్పడానికి పోలీసులు హైరానా పడాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని రేసపువానిపాలెం దరి సిద్ధార్థనగర్‌కి చెందిన తాటిపూడి సీతారామ్ కుమారుడు ప్రశాంత్‌కుమార్ ఓ షోరూమ్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతను, కైలాసపురానికి చెందిన మౌనిక గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రేమించుకున్నారు. గత నెలలో మౌనిక తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 14న వీరిద్దరూ కొత్తవలసలో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు ప్రశాంత్‌కుమార్ ఇంటికి వచ్చారు. వెంటనే అతని తల్లిదండ్రులు వీరిని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి మిస్సింగ్ కేసు విరమింపజేశారు. ప్రస్తుతం మౌనిక గర్భిణికాగా తాను భర్త వద్దకు వెళ్లేదిలేదంటూ చెప్పడం గమనార్హం. మహిళా చేతన పద్మను అరెస్టు చేయాలి మహిళా చేతన ప్రతినిధి పద్మ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశమని ఆహ్వానం పంపడంతో స్టేషన్‌కి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఆ సమయంలో అబ్బాయి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు అక్కడికి చేరుకుని పద్మను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యువకుని తండ్రి సీతారామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రేమించి పెళ్లిచేసుకున్న కుమారుడు, కోడలు చక్కగానే కాపురం చేసుకుంటున్నారని తెలిపారు. తమ కోడలు తల్లిదండ్రులు ఆమె మనసుని మార్చేశారని ఆరోపించారు. నగరంలో ఎన్నో కాపురాలు కూలిపోవడానికి కారణమైన పద్మ అండ చూసుకుని తన కోడలు కాపురానికి రానంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణి అయిన తన కోడలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం పద్మ ఆమెని డిశ్చార్జి చేయించి, స్టేషన్‌కి తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కావడం లేదన్నారు. కాపురం చేసుకుంటున్న తన కుమారుడు, కోడలు విడిపోవడానికి కారణమవుతున్న పద్మను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు కుటుంబాలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించేశారు. ప్రశాంత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మహిళా చేతన పద్మ మాటలు విని తన భార్య మౌనిక కాపురానికి రానంటుందని, పోలీసులు స్పందించి తమ కాపురం నెలబెట్టాలని కోరాడు. -
ప్రేమ.. పెళ్లి.. భర్తకు దూరంగా అద్దె ఇంట్లో.. చివరికి ఇలా..
కోనేరుసెంటర్ (మచిలీపట్నం)/కృష్ణా జిల్లా: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట నపై మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. మచిలీపట్నం ఆర్టీసీకాలనీకి చెందిన ముచ్చు స్వర్ణకుమారి (27) విజయవాడకు చెందిన శివన్నారాయణను 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు. కొంతకాలం క్రితం భార్యాభర్తల మధ్య విభే దాలు తలెత్తాయి. స్వర్ణకుమారి భర్తను వదిలి పుట్టింటికి దగ్గరలోని ఆర్టీసీకాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో జీవిస్తోంది. చదవండి: ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే? ఈ నెల ఆరో తేదీన స్వర్ణకుమారి తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి ముచ్చు వెంకమ్మ కుమార్తెను తమతో పాటే ఉండాలని ఒత్తిడి చేస్తోంది. అందుకు స్వర్ణకుమారి అంగీకరించకపోవడంతో తల్లీకూతుళ్ల మధ్య గురువారం వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెందిన స్వర్ణకుమారి పిల్లలను పుట్టింటిలో ఉంచి తన ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు తిరిగి రాకపోవటంతో అను మానం వచ్చిన కుటుంబసభ్యులు స్వర్ణకుమారి ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసు కుని వేలాడుతూ కనిపించింది. కిందికి దింపి హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. తల్లి వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శుక్రవారం పోస్టుమార్టం జరిగిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగి స్తామని ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎంతపని చేశావ్.. ఎంత భార్యపై కోపం ఉంటే మాత్రం..
విడవలూరు(బుచ్చిరెడ్డిపాళెం) నెల్లూరు జిల్లా: భార్య మీద కోపంతో ఆమె స్కూటీకి భర్త నిప్పు పెట్టిన సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలోని జొన్నవాడ సర్కిల్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. షేక్.అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి సుధా అనే మహిళను గతంలో వివాహం చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బుధవారం భార్య మీద కోపంగా ఉన్న అబ్దుల్‌రజాక్ ఫూటుగా మద్యం సేవించి ఆమె స్కూటీలో బయటకు వెళ్లారు. కొంతసేపటికి స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. చదవండి: భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో రెండో పెళ్లి.. చివరికి ఏం జరిగిందంటే? దీంతో వాహనాన్ని జొన్నవాడ సర్కిల్ వద్ద ఉంచి ఓ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చారు. ఇంతలో భార్య సుధా నుంచి ఫోన్ రావడంతో తాను జొన్నవాడ సర్కిల్ వద్ద ఉన్నట్లు తెలిపారు. వెంటనే భార్య అక్కడికి చేరుకోవడంతో ఆమెను చూసిన అబ్దుల్ రజాక్ మరింత కోపానికి గురై స్కూటీపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. స్థానికుల సాయంతో ఆమె వెంటనే మంటలను ఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరప్రతాప్ తెలిపారు. -
నాలుగు నెలల బాబు కోసం ఇద్దరి తల్లుల వివాదం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్లో నాలుగు నెలల బాబుకోసం ఇద్దరు తల్లుల మధ్య వాగ్వివాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలూరు గ్రామానికి చెందిన ఇందిర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తనకు బాబు పుట్టగానే రూ.40 వేలకు ఆకుల కొండూరుకు చెందిన సునీతకు విక్రయించింది. అయితే ఇందిర గురువారం తన బిడ్డ తనకు కావాలని సునీత తల్లితో కలిసి నివసించే ఆనంద్‌నగర్‌లోని ఇంటికి వెళ్లింది. సునీతతో వాగ్వివాదానికి దిగి ఇంటి ముందు బైఠాయించింది. సమాచారం తెలుసుకున్న 5వ టౌన్ పోలీసులు విచారణ జరిపి బాబును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కాగా పోలీసు స్టేషన్లో ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
మరీ బిత్తిరితనం.. పెళ్లి కొడుకు షేర్వాణీ ధరించడంతో ఏకంగా రాళ్లతో...
భోపాల్: పెళ్లిలో వరుడు షేర్వాణీ ధరించడంపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా మంగ్‌బడా గ్రామం ఇందుకు వేదికైంది. వరుడు షేర్వాణీ వేసుకోగా గిరిజన సంప్రదాయానుసారం ధోతీ, కుర్తా మాత్రమే ధరించాలంటూ అమ్మాయి తరఫువాళ్లు పట్టుబట్టారు. దీనిపై చెలరేగిన వాగ్వాదం ముదిరి అమ్మాయి, అబ్బాయి తరఫువారు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీనిపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. షేర్వాణీపై పెళ్లికూతురి తల్లిదండ్రులు అభ్యంతరపెట్టకున్నా వారి బంధువులే రగడ చేశారంటూ పెళ్లికొడుకు ముక్తాయించాడు. ఆ తర్వాత పెళ్లి నిరాటంకంగా జరిగిపోవడం విశేషం! చదవండి👉 అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ్యండి -
కామారెడ్డి: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, కామారెడ్డి: పీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ రావుపై సస్పెన్షన్ వేటుతో జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకె క్కాయి. ఇరువర్గాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యలు తీసుకున్నామని డీసీసీ అధ్యక్షుడు చెబుతుండగా.. పీసీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని సస్పెండ్ చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడికి ఎక్కడిదంటూ ప్రత్యర్థి వర్గం ప్రశ్నిస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ దశాబ్దాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్నారు. చదవండి: కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్..! : ఆర్ఎస్పీ అయితే ఇటీవలి కాలంలో మదన్మోహన్రావు షబ్బీర్అలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతుండడం ఆయనకు మింగుడు పడడం లే దు. జిల్లా కాంగ్రెస్ పార్టీని కాదని వేరుగా కార్యక్రమాలు చేపట్టడంపై షబ్బీర్‌అలీ వర్గం గుర్రుమంటోంది. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన మదన్మోహన్ కామారెడ్డిలో తన ఇంటి దగ్గర ఓ కార్యాలయాన్ని ప్రారంభించడం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికల్లో షబ్బీర్‌అలీ తనయుడిని ఓడించడం ద్వారా షబ్బీర్‌అలీపై ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇ ప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గం పార్టీ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేపడుతోంది. అయితే మదన్మోహన్రావు వర్గం వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా రెండు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతుండండతో కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఎల్లారెడ్డి నియోజక వర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవలు సైతం జరిగాయి. ఫ్లెక్సీలు చించుకున్నారు. జిల్లా అంతటా వివాదం గతంలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానంనుంచి పోటీ చేసి ఓటమి పాలయిన మదన్‌మోహన్‌రావుకు జిల్లా అంతటా పరిచయాలు పెరిగాయి. దీంతో ఆయన జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో పర్యటిస్తూ తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. దీంతో పారీ్టలో వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్‌అలీదే పైచేయిగా ఉన్నా.. ఇటీవల ఆయనను కాదని మదన్మోహర్రావు జాబ్‌మేళా నిర్వహించారు. దీనికి పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అజారుద్దీన్‌ను రప్పించడం ద్వారా షబ్బీర్అలీకి సవాల్ విసిరారని భావిస్తున్నారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా నేతలు విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి దిగజారింది. బాన్సువాడలోనూ రెండు వర్గాలయ్యాయి. మదన్మోహన్రావు చర్యలను ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు తప్పుపడుతున్నారు. తమ నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడిపై ట్రోలింగ్.. సస్పెన్షన్ వ్యవహారంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డీసీసీ అధ్యక్షుడిని వివరణ కోరడాన్ని మదన్మోహన్రావు వర్గం తనకు అనుకూలంగా తీసుకుంటోంది. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ప్రధాన అనుచరుడైన డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావుపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ చేస్తోంది. పీసీసీ ప్రతినిధిని సస్పెండ్ చేసే హక్కు డీసీసీ అధ్యక్షుడికి ఎక్కడిదంటూ మదన్మోహన్రావు అనుచరులు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అంతేగాక డీసీసీ అధ్యక్షుడి లేఖ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖలను జత చేసి ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అంటూ పేర్కొంటూ కైలాస్ శ్రీనివాస్‌రావ్ ఫొటో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇలా రెండువర్గాల మధ్య రోజురోజుకు ముదురుతున్న వివాదంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. 48 గంటల్లో వివరణ ఇవ్వండి పీసీసీ ఐటీసెల్ చైర్మన్‌గా ఉన్న మదన్మోహన్రావును సస్పెండ్‌చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావ్కు లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో ఆదివారం ఓ లేఖ విడుదలైంది. పీసీసీ నేతలను సస్పెండ్ చేసే అధికారం జిల్లా స్థాయి నేతలకు లేదన్న ఆయన.. ఎలాంటి ఆధారాలతో ఈ చర్యలు తీసుకున్నారో 48 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరారు. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
జెరుసలేంలో ఉద్రిక్తతలు
జెరూసలేం: ఇజ్రాయెల్‌లోని జెరుసలేంలోని అల్ అక్సా మసీదులో పోలీసులు, పాలస్తానీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఈ మసీదులోనే ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ యూదులు, ముస్లింల మధ్య మత ఘర్షణలు జరుగుతుంటాయి. శుక్రవారం మసీదులో ప్రార్థనల కోసం 60 వేల మంది ముస్లింలు వచ్చారు. గుడ్‌ఫ్రైడే కావడంతో అక్కడే ఉన్న చర్చికి యూదులు కూడా వేలాదిగా వచ్చారు. హమాస్‌కు మద్దతుగా రోడ్లెక్కారు. యూదుల పవిత్ర స్థలం ముగ్రాభి గేట్‌పైకి రాళ్లు విసిరారు. పోలీసులపైకీ రాళ్లు రువ్వుతూ రెచ్చగొట్టారు. లాఠీచార్జీలో 150 మందికి పైగా గాయపడ్డారు. -
యుద్ధం త్వరలోనే ముగిసిపోతుంది...అందుకే ఆమె ...
Woman Hopes Conflict Will Be Over Soon: రష్యా పై ఉక్రెయిన్ దాడి చేసి నేటికి 43 రోజులవుతోంది. అక్కడ ఇప్పుడప్పుడే ఈ యుద్ధం ముగిసిపోతుందన్న సంకేతాలు ఏ మాత్రం కనిపించడం లేదు. అదీగాక ఉక్రెయిన్ తలవంచకపోవడంతో రష్యా బలగాలు పౌరులపై దాడులకు తెగబడింది. ఆ క్రమంలో బుచా నగరాన్ని శ్మశానంగా మార్చింది. దారుణమై యుద్ధ నేరాలకు పాల్పడుతోంది రష్యా. ఈ నేపథ్యంలో ఒక మహిళ మాత్రం ఉక్రెయిన్‌లో ఉన్న చీకటిని, నిరాశను తరిమేసి ఒక ఆశా దీపాన్ని వెలిగించేందుకు తపనపడుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా సృష్టించిన విధ్వంసం కారణంగా వేలాది మంది నిరాశ్రయలైతే...మరో లక్షలాది మంది ఉక్రెయిన్‌ని విడిచి వెళ్లారు. ఈ తరుణంలో ఆ మహిళ మాత్రం "యుద్ధం యుద్ధమే" అంటూ రాజధాని కైవ్‌లో మొక్కలు నాటుతూ ఆహ్లాదంగా ఉంచేందకు ప్రయత్నించింది. ఎప్పటికైన యుద్ధం ముగుస్తుందని..యుద్ధం యుద్ధమే కానీ మనం ఎక్కువ పూల మొక్కలు నాటాలి అంటూ కొత్త ఆశాల్ని రేకెత్తించింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ శిధిలా నగరంగా మారితే ఆమె మాత్రం రాజధాని కైవ్‌ని పూలమొక్కలతో అందంగా తీర్చిదిద్దాలనుకుంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లోని సామాన్యుడు సైతం తమ దేశం కోసం తుపాకి చేత బట్టి ప్రపంచ దేశాలను ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఒక వైపు రష్యా నరమేథానికి పాల్పడుతూ...భయంకరంగా విరుచుకుపడుతున్న.. ఆమె ఎప్పటికైన మా దేశాన్ని మేము రక్షించుకుంటాం. ఈ యుద్ధం కచ్చితంగా ముగిసిపోతుందంటూ ఆమె ఆశాభావంతో మొక్కలు నాటుతున్న విధానాన్ని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. ఆశావాదం నిర్వచనం ఒక దేశం పట్ల అభిమానం, గౌరవం అని చెప్పకనే చెప్పింది ఆమె. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బ్రిటన్ చీఫ్ కరస్పాండెంట్ రిచర్డ్ గైస్‌ఫోర్డ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు వారు నిజమైన యోధుల్లా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. “War is war, but flowers still need to be planted” - the view of a Kyiv city gardener, bringing spring colour to the city. She’s hopeful that conflict will be over soon and wants the capital looking beautiful again. #Ukraine pic.twitter.com/126llfiHU0 — Richard Gaisford (@richardgaisford) April 6, 2022 (చదవండి: రష్యా ఉక్రెయిన్ యుద్ధం... చైనాలో మొదలవుతున్న భయాందోళనలు) -
వివాహిత అదృశ్యం.. భర్త ఇంట్లోలేని సమయంలో..
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): మండల కేంద్రంలోని రామకోటి కాలనీకి చెందిన లక్ష్మీనారాయణమ్మ అనే వివాహిత అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదుచేశారు. వివరాలు.. తాడిపత్రి మండలం అక్కన్నపల్లికి చెందిన తలారి నాగలక్ష్మమ్మ బాలసుంకన్న కుమార్తె లక్ష్మీనారాయణమ్మను ఏడాది క్రితం ఆటో నడుపుతూ జీవనం సాగించే పెద్దపప్పూరుకు చెందిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. చదవండి: ‘నేను చనిపోతా.. నన్ను బలవంతంగా పంపుతున్నారు’ ద్విచక్ర వాహనం కొనుగోలు విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. సోమవారం భర్త ఇంట్లోలేని సమయంలో లక్ష్మీనారాయణమ్మ ఇంటినుంచి వెళ్లి పోయింది. తమ కూతురు ఆచూకీ కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బీటీ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శునకాలకు అన్నం పెట్టి.. జైలు పాలయ్యాడు!
సాక్షి, చెన్నై : కుక్కలకు ఆహారం పెట్టే విషయంలో చోటు చేసుకున్న గొడవ కారణంగా ఓ ఇంటి యజమాని హత్యకు గురయ్యాడు. ఇక మానవత్వంతో వ్యవహరించిన పుణ్యానికి ఓ కార్మికుడు జైలు పాలయ్యాడు. వివరాలు.. చెన్నై కొరుక్కు పేట జేజే నగర్‌కు చెందిన సురేష్‌కుమార్(29) కూలి కార్మికుడు. ఇతడికి వీధి శునకాలకు ఆహారం పెట్టడం అంటే, ఎంతో ఇష్టం. రోజూ తన సంపాదనలో కొంత మొత్తాన్ని వీధి శునకాలకు వెచ్చించే వాడు. రోజూ రాత్రి వేళల్లో ఆకలితో ఉండే శునకాల్ని గుర్తించి ఆహారం పెట్టే వాడు. ఆ దిశగా శుక్రవారం రాత్రి ఓ చోట శునకాలు ఉండడంతో అక్కడి ఓ ఇంటి వద్ద ఆహారాన్ని ఉంచాడు. దీంతో అక్కడున్న శునకాలు ఆహారం కోసం పోటీ పడ్డాయి. అదే సమయంలో ఆ ఇంటి యజమాని గోవిందరాజ్(40) అక్కడకు వచ్చి శునకాల్ని తరిమే యత్నం చేశాడు. సురేష్కుమార్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శునకాల్ని తరిమేస్తావా..? అంటూ గోవిందరాజ్‌ను సురేష్ తోసేశాడు. కింద పడ్డ గోవిందరాజ్ తల పగిలి మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గోవిందరాజ్‌ను హతమార్చిన నేరానికి సురేష్‌కుమార్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: (30 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా ఎవర్గ్రీన్ జోడి) -
రాచాపూర్‌లో ఉద్రిక్తత.. మహిళ మృతదేహాన్ని ఇంటిపక్కనే పూడ్చి..
సాక్షి,లక్ష్మణచాంద(అదిలాబాద్): మండలంలోని రాచాపూర్ గ్రామంలో ఓ వర్గానికి (క్రిస్టియన్) చెందిన ఫాదర్ భార్య అనారోగ్యంతో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఆదివారం ఉదయం మండలంలోని రాచాపూర్‌లోని ఆమె నివాసానికి తీసుకొచ్చి ఇంటిపక్కనే పూడ్చారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కులమత బేదాలు లేకుండా గ్రామంలో ఎవరు చనిపోయిన వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఆమె మృతదేహాన్ని ఇంటి పక్కనే పూడ్చడం సరికాదని రోడ్డుపై బైఠాయించారు. మృతదేహాన్ని ఇక్కడ నుంచి తొలగించి వైకుంఠ«ధామానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాల మధ్యన ఘర్షణ.. రాచాపూర్‌లోని మహిళ ఇంటి వద్ద రోడ్డుపై ఓ వర్గానికి చెందిన (క్రిస్టియన్) వారికి రాచాపూర్ గ్రామస్తుల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో విషయం తెలుసుకున్న సోన్ సీఐ రాంనరసింహారెడ్డి, లక్ష్మణచాంద, సోన్, మామడ ఎస్సైలు, సిబ్బందితో వచ్చి సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంటి పక్కనే పూడ్చిన మృతదేహాన్ని తొలగించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని గ్రామస్తులు ఆందోళన తీవ్రతరం చేశారు. డీఎస్పీ ఉపేంద్రరెడ్డి గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు. మృతదేహం తొలగింపుతో... చివరకు సీఐ రాంనరసింహారెడ్డి ఇరువర్గాల వారితో విడివిడిగా మాట్లాడారు. చివరకు సీఐ సూచనల మేరకు మృతదేహాన్ని బయటకు తీసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి తరలించారు. దీంతో ఆందోళన సర్దుమణిగింది. -
Panipuri: పానీపూరి పంచాయితీ.. ఎంతకూ తెగకపోవడంతో చివరకు
అనంతపురం సెంట్రల్: పానీపూరి బాగో లేదన్నందుకు వివాదం చెలరేగి చివరకు పోలీస్ స్టేషన్లోనే యువకుడిపై చేయి చేసుకునే స్థాయికి చేరుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం నగరంలోని పోలీసు కాంప్లెక్స్‌లో రాణి అనే మహిళ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఎంబీబీఎస్ చదువుతున్న రాంనగర్ నివాసి వెంకటకృష్ణారెడ్డి శనివారం సాయంత్రం పానీపూరి తినేందుకు తన తమ్ముడితో కలిసి రాణి నిర్వహిస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లాడు. చదవండి: నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో.. పానీపూరి తిన్న తర్వాత రుచి బాగోలేదని తన అభిప్రాయాన్ని ఆ యువకుడు వ్యక్తం చేశాడు. ఇది నచ్చని నిర్వాహకురాలు వెంటనే అతనితో వాదనకు దిగింది. మాటామాట పెరగడంతో స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో అనంతపురం రెండో పట్టణ ఎస్ఐ అల్లాబకాష్, సిబ్బంది అక్కడకు చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో విచారణ చేస్తున్న సమయంలో వెంకటకృష్ణారెడ్డిపై రాణి చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఘటనపై వెంకటకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆహారకల్తీ నిరోధకశాఖ, నగరపాలకసంస్థ అధికారులు వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు
దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ మార్కో జాన్సెన్ టీమిండియా ఆటగాళ్లతో వైరం కొనసాగిస్తున్నాడు. బుమ్రాతో వైరం పెట్టుకొని జాన్సెన్ ఫలితం అనుభవించాడు. దాని నుంచి బయటపడకముందే తన కవ్వింపు చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మార్కో జాన్సెన్ తన వైరం పంత్‌తో పెట్టుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్ సమయంలో ఓపికతో బ్యాటింగ్ కొనసాగిస్తున్న పంత్‌కు మార్కో జాన్సెన్ షార్ట్ పిచ్ బంతి వేశాడు. పంత్ దానిని ఢిఫెన్స్ ఆడగా.. బంతిని అందుకున్న జాన్సెన్ కోపంతో పంత్‌వైపు విసిరి కవ్వించాడు. అసలే ఉడుకురక్తంతో కనిపించే పంత్‌ను గెలకడం కాస్త ఆసక్తి కలిగించింది. అయితే పంత్ మాత్రం తన శైలికి విరుద్ధంగా బంతికి బ్యాట్‌ను అడ్డుపెట్టి గాయం కాకుండా తనను తాను కాపాడుకున్నాడు. ఈ క్రమంలో వీరిమధ్య ఏదైనా గొడవ జరుగుతుందేమోనని అంతా భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పటికి.. ఒకవేళ ప్రొటీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో మార్కో జాన్సెన్ బ్యాటింగ్‌కు వస్తే.. వికెట్ల వెనకాల పంత్ కీపర్‌గా ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక 212 పరుగుల ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మూడో రోజు ఆఖరి బంతికి ఎల్గర్(30) ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పంత్ క్యాచ్‌కు ఇచ్చి ఎల్గర్ వెనుదిరిగాడు. క్రీజ్‌లో కీగన్ పీటర్సన్(48) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 111 పరుగులు అవసరం కాగా, టీమిండియా 8 వికెట్లు పడగొడితే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. Moment of the series 😎 #rishabhpant #SAvIND pic.twitter.com/jcXRn4s4EQ — Tk (@incbeing) January 13, 2022 -
భర్త అదృశ్యం.. ఇంట్లో రక్తపు మరకలు.. భార్య వివాహేతర సంబంధమే కారణమా..?
పొన్నూరు(గుంటూరు జిల్లా): భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో జయచిత్ర నాగరాజు అదృశ్యమయ్యాడు. భార్యే వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడిని హత్య చేయించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నూరులో ఆదివారం ఈ ఘటన జరిగింది. నాగరాజు మేనల్లుడు జి.ఏడుకొండలు కథనం ప్రకారం.. పట్టణంలోని 2వ వార్డులో నివాసం ఉంటున్న జలచిత్ర నాగరాజు అలియాస్ ఆది, అతని భార్య సోని స్వస్థలం నెల్లూరు జిల్లా బిట్రగుంట. వీరిద్దరూ 8ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల క్రితం నాగరాజు కుటుంబం పొన్నూరు వచ్చింది. నాగరాజు కారు డ్రైవర్. కొంతకాలంగా నాగరాజు, సోనీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చదవండి: ‘భార్యలను మార్చుకునే’ రాకెట్ గుట్టురట్టు! ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచి నాగరాజు కనబడటం లేదు. ఈ నేపథ్యంలో నాగరాజు తొడల్లుడు ఆదివారం సాయంత్రం బంధువులకు ఫోన్ చేసి నాగరాజును అతని భార్య హత్య చేయించిందని చెప్పాడు. దీంతో బంధువులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగరాజు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి నాగరాజు భార్య సోనీని విచారించారు. ఇంటిలో రక్తపు మరకలు ఉండటంతో నాగరాజు బంధువుల అనుమానం బలపడింది. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. జాగిలాలు నాగరాజు ఉంటున్న ఇంటి నుంచి పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాల ఏరియాలోని పొలాల్లోకి వెళ్లి నిలిచిపోయాయి. రాత్రి సమయం కావటంతో అవి ముందుకెళ్లలేకపోయాయి. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడనే నాగరాజును సోనీ హత్య చేయించి కారులో బాపట్ల సమీపాన ఉన్న కాలువ వద్దకు తీసుకెళ్లి అందులో మృతదేహన్ని పడవేసినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. నాగరాజు బంధువుల ఫిర్యాదు మేరకు పొన్నూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాగి కొడుతున్నాడని ఒకరు.. నల్లగా ఉన్నావని మరొకరు
సాక్షి, హైదరాబాద్ : అదనపు కట్నం కోసం ఒకరు.. సరిగా చూడటం లేదని మరొకరు.. సంపాదన లేదని ఇంకొకరు.. తాగి కొడుతున్నాడని, నల్లగా ఉన్నావని మరొకరు.. ఇలా వివిధ కారణాలతో ఘర్షణ పడుతున్నారు. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన యువ జంటలు చిన్నచిన్న వివాదాలతో ఎడబాటు వరకు వెళ్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో 2,246 ఫిర్యాదులు నమోదయ్యాయి. అరెస్ట్, రిమాండ్‌కు తరలించే ముందే పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. విడిపోదామనుకున్న వారు కౌన్సె లింగ్‌తో మనసు మార్చుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది 1,372 జంటలు ఒక్కటికావడం విశేషం. చిన్న విషయంలో సరూర్‌నగర్‌కు చెందిన ఓ యువజంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి కాస్తా పెరిగి పెద్దవై.. చివరికి విడాకుల వరకు వెళ్లింది. ఇద్దరూ సరూర్‌నగర్ మíహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు దంపతులిద్దరినీ కూర్చొబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. శాశ్వతంగా విడిపోదామనుకున్న వారు ఒక్కటైపోయారు. వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు. పిల్లల పెంపకం విషయంలో గొడవ పడ్డారు. పెద్దలు నచ్చజెప్పినా విన్పించుకోలేదు. శాశ్వతంగా విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. భర్త వేధిస్తున్నాడని భార్య.. భార్యే వేధిస్తోందని భర్త ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఒక్కటయ్యారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 1,372 జంటలు ఏకమయ్యాయి. వినకపోతేనే కేసు నమోదు రోజుకు సగటున 40–50 ఫిర్యాదులు వస్తుంటాయి. వచ్చిన వారిలో అంతా యువ దంపతులే. పెళ్లైన రెండు మూడేళ్లకే చిన్నచిన్నవాటికి గొడవపడుతున్నారు. క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు జంటలను కలిపే ప్రయత్నం చేస్తున్నాం. కౌన్సెలింగ్‌తో 70 శాతం మంది కలిసిపోతున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా వినని వారిని మాత్రమే రిమాండ్‌కు పంపిస్తున్నాం. – జి.మంజుల, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్ -
ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
రామగుండం క్రైం(పెద్దపల్లి జిల్లా): ఓ యువతి, యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడం రెండు కుటుంబాల మధ్య వివాదానికి దారితీసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సీఎస్పీ కాలనీకి చెందిన శనిగరం సాయి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీశాంకతో పరిచయం ఏర్పడడంతో ప్రేమగా మారింది. దీంతో వారు ఈనెల ఒకటో తేదీన హైదరాబాద్‌లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి సాయి ఇంటికి చేరుకున్నారు. అయితే మంగళవారం వేకువజామున శ్రీశాంక తల్లి, మేనమామ, ఇతర బంధువులైన తిలక్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్‌తో కలిసి వచ్చి సాయి కుటుంబ సభ్యులను కర్రలు, ఇతర మారణాయుధాలతో బెదిరించి శ్రీశాంకను తీసుకెళ్లారు. దీంతో సాయి కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు శ్రీశాంకను తీసుకువెళ్లిన కారు వివరాలు సేకరిస్తున్నారు. గోదావరిఖని ఏసీపీ ఎస్.గిరిప్రసాద్, వన్‌టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేశ్‌బాబు విచారణ చేపట్టారు. సాయికుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తల్లితోపాటు, మేనమామలు, మరో నలుగురిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, కిడ్నాప్ కేసు సైతం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నివురుగప్పిన నిప్పు: రేవంత్ వర్సెస్ సీనియర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయం రంజుగా మారుతోంది. కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న పార్టీ పరిస్థితి ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది. పార్టీలోని కొందరు సీనియర్లు, రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన మరికొందరితో రేవంత్, ఆయన టీంకు చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ప్రతి విషయాన్ని పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు బయటకు చెప్పాలని, తమతో మాట్లాడిన తర్వాతే కేడర్‌లోకి వెళ్లాలని సీనియర్లు భావిస్తుంటే రేవంత్ దూకుడు మాత్రం ఆ కోణంలో వెళ్లడం లేదు. సీనియర్ల మాటలను పరిగణనలోకి తీసుకుంటానని అంటూనే రేవంత్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ దీంతో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరాయి. రేవంత్ మినహా పార్టీ ఎంపీలు, సీతక్క మినహా ఎమ్మెల్యేలు, ఉన్న ఒక్క ఎమ్మెల్సీతో పాటు పలువురు సీనియర్ నాయకులు.. టీపీసీసీ అధ్యక్షుడి తీరుపై అసంతృప్తితో ఉన్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ అధి ష్టానం కొత్తగా ఏర్పాటు చేసిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) శనివారం భేటీ కానుండటం, అంతకుముందు రోజే ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన వ్యాఖ్యలతో వేడి పుట్టించడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సమష్టిగా అన్నారు.. సమాచారమే లేదు.. ఈ ఏడాది జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు చేపట్టడానికి ముందే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మినహా పార్టీలోని సీనియర్ నేతలందరినీ ఇళ్లకు వెళ్లి కలసి మరీ సయోధ్యకు ఆయన ప్రయ త్నించారు. అంతవరకు బాగానే ఉన్నా, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు, అధ్యక్షుడైన తర్వాత వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. సమష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్దామని చెప్పిన రేవంత్ కనీసం సమా చారం ఇవ్వకుండానే అన్నీ తానే అనే ధోరణిలో పార్టీని తీసుకెళ్తున్నారని వారు వాపోతున్నారు. జగ్గారెడ్డి లాంటి కొందరు బహిరంగంగానే మాట్లాడుతున్నా.. మిగిలిన వారంతా రేవంత్ తీరుపై అసంతృప్తితో ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమ నిర్వహణ సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్లుగా సాగింది. ఇంద్రవెల్లి సభకు ముందు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అలకతో ప్రారంభమైన పంచాయతీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంద్రవెల్లి సభకు సీతక్క అధ్యక్షత వహించడం, రావిర్యాల సభను అంతా రేవంత్ టీం నడిపించడం, మూడుచింతలపల్లి దళిత దీక్షలో కూడా సీనియర్లు తెరపైన కనిపించే పరిస్థితి లేకపోవడం, గజ్వేల్ సభ అంతా రేవంత్ అన్నట్లే సాగడాన్ని ఆయన వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేక పోతోంది. కనీసం పార్టీలో చర్చించకుండానే గజ్వేల్ సభలో 2 నెలల పాటు నిరుద్యోగ సమస్యపై కార్యాచరణ ప్రకటించడం దేనికి సంకేతమని, అన్నీ ఆయనే ప్రకటిస్తే ఇక తాముండి ఎందుకనే భావన రాష్ట్ర కాంగ్రెస్ సీని యర్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన కొందరు ఇతర పార్టీల నేతలు స్థానిక కాంగ్రెస్ నాయకులకు సమాచారం లేకుండా రేవంత్‌ను కలవడం, కనీసం చర్చించకుండానే అధికార ప్రతినిధుల నియామక పేర్లు ప్రకటించడం, గాంధీభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం కూడా ముఖ్య నేతలకు ఇవ్వకపోవడం లాంటివి రేవంత్ ఏకపక్ష ధోరణికి అద్దం పడు తున్నాయనేది సీనియర్ల విమర్శ. దీనిపై టీపీసీసీ ముఖ్యనేత పార్టీ అధిష్టానం నేత కేసీ వేణు గోపాల్‌కు లేఖ రాయడం కూడా తెలి సిందే. రాష్ట్ర నేతలు అధిష్టానాన్ని కలసి రేవంత్ తీరుపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తయితే శుక్రవారం జగ్గారెడ్డి రేవంత్‌ను ఉద్దేశించి నేరుగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. ఆడలేక మద్దెల ఓడు.. కొందరు సీనియర్లు, రేవంత్ నియామకంపై వ్యతిరేకత ఉన్న నేతల వాదన అలా ఉంటే.. రేవంత్ టీంకూడా పార్టీలో చురుగ్గానే వ్యవ హరిస్తోంది. ఆయనకు మొదటి నుంచీ అండగా ఉన్న నేతలు రేవంత్‌కు కవచంగా పనిచేస్తూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సీనియర్ల వ్యవ హారశైలిని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలూ చేస్తున్నారు. సీనియర్లతో మాట్లాడినా, మాట్లాడకపోయినా రేవంత్ నుంచి వచ్చే ప్రతి పిలు పును విజయవంతం చేసే పనిలో వారు నిమ గ్నమైపోయారు. సీనియర్లు.. సీనియర్లు.. అం టూ ఏడేళ్లుగా పార్టీని పాతాళంలోకి తొక్కేశారని, రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త ఊపు వస్తే దాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని వారంటున్నారు. సీనియర్లు కొందరిని ఉసిగొల్పుతున్నారని, అధిష్టానం స్పష్టంగా చెప్పినా వారి వైఖరిలో మార్పురావడం లేదని పేర్కొంటున్నారు. రేవంత్ కూడా సమ యానికి అనుగుణంగా తన కార్యచరణను ముందుగానే ప్రకటించేస్తున్నారు. దండోరా నుంచి నిరుద్యోగ జంగ్ సైరన్ వరకు అన్నీ ఆయన పకడ్బందీగానే వ్యవహరిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. సీనియర్లు తనకు అక్షింతలు వేస్తున్నారని పార్టీ అంతర్గత సమావేశాల్లో చెబుతూనే.. వాటిని నెత్తిపై నుంచి దులిపేసుకుంటాననే రీతిలో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే పార్టీ అధిష్టానం కూడా రేవంత్‌ను సమర్థించే రీతిలోనే వెళ్తోంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్ అన్ని విషయాల్లోనూ టీపీసీసీ అధ్యక్షుడికి అండగా నిలబడుతున్నారు. దీనికి తోడు రేవంత్‌కు సహకరించాల్సిందేనంటూ ముఖ్యనేతలందరికీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా కొందరు, బహి రంగంగా మరికొందరు చేస్తున్న వాదనలు నిల బడతాయా? దూకుడుగా వెళ్తున్న రేవంత్ శిబిరమే నిలబడుతుందా..? ఇరుశిబిరాలు శాం తిమంత్రం పఠిస్తాయా? నేటి పీఏసీ భేటీకి ఎవరెవరు వస్తారు? ఏం జరుగుతుంది.. అనేది అటు గాంధీభవన్వర్గాలను, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని..
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): ఓ ఇంట వివాహానికి తమను పిలవలేదన్న ఉక్రోషంలో ఉన్న మరో కుటుంబ యజమాని ఆ ఇరు కుటుంబాల్లోని పిల్లల ఆటను సాకుగా తీసుకుని గొడవకు దిగి గాయాలయ్యే వరకు తెచ్చుకున్నారు. సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని కొంకాపల్లిలో పనసా వెంకటేశ్వరరావు ఇంటిలో శుక్రవారం వివాహం జరిగింది. ఈ శుభకార్యానికి పొరుగున ఉన్న అల్లాడ బాబులు కుటుంబాన్ని పిలవలేదు. కాగా ఇరు కుటుంబాల చిన్నారులూ పెళ్లింట్లో ఆడుకుంటుంగా ఒకరు అల్లరి చెయ్యకుండా ఆడుకోండని వారించారు. ఈ విషయాన్ని సాకుగా తీసుకుని అల్లాడ బాబు ఘర్షణకు దిగారు. కర్రలతో కొట్టుకున్న ఈ ఘర్షణలో వెంకటేశ్వరరావు, బాబులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చదవండి: వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం -
ప్రాణం తీసిన పేకాట: మద్యంమత్తులో బండరాయితో మోది..
జగిత్యాల క్రైం: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురవగా మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం సమ్మయ్య గత నెల 28వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం తాటిపల్లి పెద్ద చెరువులో సమ్మయ్య మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీయించారు. (చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్) స్థానికుడితోపాటు కోరుట్లకు చెందిన మరో వ్యక్తితో కలిసి సమ్మయ్య పెద్దచెరువు సమీపంలో పేకాడి, మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. పేకాట విషయంలో తలెత్తిన వివాదంతో మిగతా ఇద్దరు బండరాయితో అతని తలపై మోది హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మృతుడి సోదరుడు నాగేశ్వర్రావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు) -
వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో ఘర్షణ
-
సర్ది చెప్పడానికి వెళ్లాడు.. శవమై వచ్చాడు!
కోదాడ: మద్యం దుకాణం వద్ద జరుగుతున్న గొడవను ఆపి సర్దిచెప్పడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైన్స్ సిబ్బంది కర్రలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఏపీ సరిహద్దులోని రామాపురం క్రాస్‌రోడ్‌లో హనుమాన్ వైన్స్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి ఏపీలోని కృష్ణాజిల్లా షేర్ మహ్మద్‌పేటవాసి కావడంతో గ్రామానికి చెందిన పలువురు అక్కడి చేరుకొని మృతదేహంతో ధర్నాకు దిగారు. దీంతో వైన్స్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. షేర్‌మహ్మద్‌పేటకు చెందిన రైతు నాగయ్య మద్యం కోసం రామాపురం వద్ద వైన్స్‌కు వచ్చాడు. అప్పటికే షేర్‌మహ్మద్‌పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులతో వైన్స్ సిబ్బంది గొడవ పడుతున్నారు వారిని వారించడానికి నాగయ్య అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో వైన్స్ సిబ్బంది కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో నాగయ్య తలపైబలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వైన్స్‌ముందు గ్రామస్తుల ధర్నా వైన్స్ సిబ్బంది దాడిలో తమ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న షేర్‌మహ్మద్‌పేట వాసులు, బంధువులు పెద్ద ఎత్తున రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకొని వైన్స్ ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కోదాడ టౌన్ సీఐ నరసింహారావు, రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇదిలా ఉండగా నాగయ్య మృతి చెందగానే వైన్స్‌ను మూసివేసి సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని బంధువుల ఫిర్యాదు అందిన తరువాత పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
Crazy Uncles: వివాదంలో శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’!
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర యాంకర్ శ్రీముఖి నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను నిలిపి వేయలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. సినిమా ట్రైలర్లో మహిళలను కించపరిచేలా డైలాగులు ఉన్నాయని ఆరోపిస్తూ.. వాటిని వెంటనే తొలగించాలంటూ తెలంగాణ మహిళా ఐక్య వేదిక కార్యదర్శి రత్న డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమాలో మహిళలను కించపరిచే విధంగా డైలాగులును పెట్టడం సరికాదన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే విధంగా సినిమాలు తీయడం విచారకరమని అన్నారు. మహిళల పేరుతో హాస్యం సృష్టించడం దారుణమన్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే, మానవ సంబంధాలు చెడగొట్టే, భార్య భర్తల మధ్య సఖ్యత చెడగొట్టే సినిమాలను తీస్తే సహించమన్నారు. సమాజాన్ని నాశనం చేసే సినిమాలను వెంటనే నిలుపుదల చెయ్యాలని, క్రేజీ అంకుల్స్ సినిమాలో అభ్యంతరకర సంభాషణలను తొలగించాలని డిమాండ్ చేశారు. సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడగొట్టకండి అని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖా అన్నారు. ఈనెల 9న సినిమా విడుదలను నిలిపి వేయాలని, లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. అభ్యంతరకర సినిమాలు తీసే వారికి సమాజంలో జీవించే హక్కు లేదన్నారు. కాగా యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ రేపు (ఆగష్టు19) విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే విడుదలకు కేవలం ఒకరోజు ముందు ఇలా మహిళా సంఘాలు అడ్డుకోవడంతో చిత్రం రిలీజ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. -
తాలిబన్ల పైచేయి: ఇక మిగిలింది రెండే ఆప్షన్లు!
సైన్యం నుంచి పోరు, ప్రతిఘటనలు లేకుండానే అఫ్ఘనిస్తాన్.. పూర్తిగా తాలిబన్ సంస్థ వశం అయ్యేలా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు ప్రధాన పట్టణాలన్నీ ఆదివారం ఉదయం నాటికల్లా తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చేశాయి. దీంతో ఏ క్షణమైనా తమ ఆధిపత్యాన్ని తాలిబన్లు ప్రకటించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క కాబూల్ మినహా దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోకి తాలిబన్ దళాలు చొచ్చుకెళ్లాయి. శనివారం మజర్–ఏ–షరీఫ్‌ను చుట్టుముట్టి బైకులు, వాహనాలపై పరేడ్ నిర్వహిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు తాలిబన్లు. మజర్‌ను ఆక్రమించిన కొద్ది గంటలకే.. తూర్పు నగరం జలాలాబాద్‌ను స్వాధీనం చేసుకోవడం విశేషం. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో(రాష్ట్రాలు) 22 తాలిబన్ల అధీనంలోకి రాగా.. ఆదివారం ఉదయం కల్లా మరో నాలుగింటిని స్వాధీనం చేసుకున్నారు. ‘తెల్లారి చూసేసరికి తాలిబన్లు తెల్ల జెండాలను పాతారు. ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కొకుండానే వాళ్లు ఊళ్లోకి ప్రవేశించారు’ అని జలాలాబాద్‌కు చెందిన ఓ స్థానికుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. శనివారం జాతిని ఉద్దేశించి ‘అఫ్గాన్ల ప్రాణాలు తీస్తుంటే ఊరుకోం. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించం’ అంటూ గంభీర ప్రకటనలు చేసిన అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. సైన్యంలో ధైర్యం నింపడంలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నాడు. 48 గంటల్లోగా రాజకీయ మార్గాల్లో పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు అష్రాఫ్ ప్రకటించడం, ఆపై కొన్ని గంటలకే మజర్–ఏ–షరీఫ్, జలాలాబాద్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడం విశేషం. దీంతో తాలిబన్ల ఆక్రమణ దాదాపు పూర్తి అయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక లొంగిపోవడమో లేదంటే హోరాహోరీగా పోరాడడమో అనే ఆప్షన్లు మాత్రమే అఫ్ఘన్ ప్రభుత్వం ముందు మిగిలాయని అంచనా వేస్తున్నారు. ఇది చదవండి: సైన్యం-తాలిబన్ల ఘర్షణ, ఎలా మొదలైందంటే.. అమెరికా బలగాల పని ఇదిలా ఉంటే తాలిబన్ దాడుల నేపథ్యంలో కాబూల్‌లోని రాయబార కార్యాలయ సిబ్బంది, సాధారణ పౌరుల తరలింపు కోసం సైన్యాన్ని రంగంలోకి దించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాలిబన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారాయన. ఈ మేరకు ఇదివరకే భారీగా సైన్యం చేరుకోగా, మరికొంత మంది ఆదివారం రాత్రికల్లా చేరుకునే అకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరంలో ఉన్న చార్ అస్యాబ్ జిల్లా వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్ ప్రావిన్స్ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది ప్రకటించేశాడు కూడా. మరోవైపు ఎటుచూసినా తాలిబన్లను ఎదుర్కొకుండా ఆయుధాలను-వాహనాలను అప్పగించేసి స్వచ్ఛందంగా లొంగిపోతోంది అఫ్గన్ సైన్యం. 1994లో అఫ్గన్ అంతర్యుద్ధంలో బలమైన విభాగంగా ఎదిగిన తాలిబన్లు.. 1996 నుంచి 2001 వరకు మిలిటరీ ఆర్గనైజేషన్‌గా ప్రకటించుకున్న తాలిబన్లు, అఫ్ఘనిస్థాన్‌లో అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. 9/11 దాడుల తర్వాత అమెరికా దళాలు తాలిబన్లను అణిచివేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. అయితే తాజాగా అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న పరిణామాల తర్వాత 75వేల సభ్యులతో తాలిబన్ తిరిగి అఫ్ఘన్ ఆక్రమణకు తిరిగి ప్రయత్నించి.. లక్క్ష్యం నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. విష ప్రచారం యువతులను బలవంతంగా తాలిబన్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారనే కథనాలను తాలిబన్ సంస్థ కొట్టిపడేసింది. ఇదంతా ఆఫ్ఘన్ ప్రభుత్వం చేస్తున్న విషపూరిత ప్రచారంగా పేర్కొంది. తాలిబన్ ప్రతినిధి సుహాలీ షాహీన్ ఈ మేరకు వరుస ట్వీట్లలో ఆ ఆరోపణలను ఖండించారు. నిరాధారమైన కథనాలతో కుట్రను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మరోవైపు అమెరికా, భారత్ సహా ఏ దేశం అయినా సరే అఫ్గన్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సహించలేదని తాలిబన్లు హెచ్చరించారు కూడా. 1/2 Recently the Kabul Adm has launched baseless and vicious propaganda, sometimes claiming, the Islamic Emirate forces people to marry their daughters, or to marry them to the Mujahidin. Sometimes they say that the Mujahidin are killing people, killing prisoners and captives, — Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) August 14, 2021 -
ఫిన్లాండ్తో ‘డేవిస్’ పోరుకు బోపన్న
సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న భారత డేవిస్ కప్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల అఖిల భారత టెన్నిస్ సంఘంతో ఒలింపిక్స్ విషయమై బోపన్న గొడవ పడ్డాడు. ఇది పతాక స్థాయికి చేరడంతో అతన్ని భవిష్యత్తులో జట్టులోకి ఎంపిక చేయరనే వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఫిన్లాండ్ వేదికగా ఫిన్లాండ్తో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో పాల్గొనే భారత జట్టులో బోపన్నను ఎంపిక చేశారు. ఈ పోటీలో డబుల్స్‌లో దివిజ్ శరణ్–బోపన్న జంట ఆడుతుంది. -
ఎన్నికలకు రెండేళ్లు.. అప్పుడే కాంగ్రెస్‌లో సీటు పంచాయితీ
భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీలో కుర్చీలాట సాగుతోంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందే భూపాలపల్లి స్థానం తమదంటే తమదంటూ పోటీ పడుతున్నారు. త్వరలోనే పార్టీలో చేరుతానంటూ ఏఐఎఫ్బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భూపాలపల్లిలో పోటీ చేసేది కొండా దంపతులేనంటూ వారి అనుచరులు చెప్పుకుంటుండగా, ఇక్కడ పాగా కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోదరుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కుర్చీలాటతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. రేవంత్‌రెడ్డి రాకతో మారిన సమీకరణాలు.. 2009 సంవత్సరంలో భూపాలపల్లి నియోజకవర్గంగా ఏర్పడింది. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి గెలుపొందగా 2018లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా మరోమారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్‌కు ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు లేకుండాపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవల టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో కాంగ్రెస్‌లో మళ్లీ జోష్ నెలకొంది. టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఏఐఎఫ్బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావుకు రేవంత్‌రెడ్డి మధ్య మంచి సాన్ని హిత్యం ఉంది. దీంతో రేవంత్ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టాక సత్యనారాయణరావు కూడా అదే పార్టీలో చేరుతాడని ప్రచారం జరిగింది. ఈ ప్రచారా నికి సత్యనారాయణరావు ఇటీవల తెరదింపారు. కొ ద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని కలిసి తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డితో కలిసి మండలాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతానని సహకరించాలని సత్యనారాయణరావు కోరుతున్నారు. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను మంథని ఎ మ్మెల్యే శ్రీధర్‌బాబు ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు శ్రీనుబాబు రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. భూపాలపల్లి బరిలో ఉండటం శ్రీనుబాబుకు కూడా ఇష్టమే అని తెలు స్తోంది. అన్నదమ్ములు రెండు స్థానాల్లో పోటీ చేయ డం సబబు కాదని, శ్రీధర్‌బాబు వద్దని చెప్పినట్లు సమాచారం. మంథని చాలని, భూపాలపల్లిలో పోటీచేసే ఆలోచన లేదని చెపుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ శ్రీనుబాబు కొంత స్థబ్ధుగా ఉండగా, సత్యనారాయణరావు, కొండా వర్గీయులు మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ సమయంలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసమస్యల పరి ష్కారం కోసం పోరాటాలు చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు కుర్చీల కోసం కుమ్ములాడుతుండటంతో భూపాలపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఆది నుంచి మేమున్నాం అంటూ.. భూపాలపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఆది నుంచి కొండా సురేఖ, మురళి దంపతులు అండగా నిలిచారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొండా దంపతుల్లో ఒకరు భూపాలపల్లి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారని కొండా వర్గీయులు ఇటీవల వెల్లడించారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కొండా దంపతులు పార్టీ బాధ్యతలు మోశారని పేర్కొన్నారు. పార్టీలో చేరకముందే ఏఐఎఫ్బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి అయోమయానికి గురి చేస్తున్నారని కొండా వర్గీయులు ప్రకటించారు. -
టీడీపీలో ‘విద్యార్హతల’ చిచ్చు!.. పట్టాభిరాంపై ఫైర్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్లు ఆ పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా కార్యాలయంలో మీడియా ఎదుట కూర్చుని ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ పార్టీని, నాయకులను బజారుకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (కేపీ) విద్యార్హత గురించి తీవ్ర పదజాలంతో పదే పదే ప్రస్తావించడం పార్టీకి తలవంపులు తెచ్చేవిధంగా ఉందని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పట్టాభి తీరు చూస్తుంటే తమ విద్యార్హతలను కూడా ఏదో విధంగా తెరపైకి తెచ్చి అందరి నోళ్లలో నానేలా చేయాలనే దురుద్ధేశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. సెల్ఫ్ గోల్.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విద్యార్హత గురించి అంతగా గుచ్చి గుచ్చి మాట్లాడటమంటే పరోక్షంగా ఎంపీ కేశినేని నానిని ఎద్దేవా చేయడమేనని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు. ఎంపీ విద్యార్హత కూడా పదో తరగతే. తన ఎన్నికల అఫిడవిట్లో పది పాస్ అయినట్లు పేర్కొన్నారు. అంతేకాదు బొండా ఉమామహేశ్వరరావు ఎనిమిదో తరగతి పాస్ అయినట్లు చూపారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకటేశ్వరరావు (వెంకన్న) అయిదు వరకు చదివినట్లు పేర్కొన్నారు. టీడీపీకే చెందిన పెనమలూరు, కైకలూరు మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, జయమంగళ వెంకటరమణలు పదో తరగతి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఎనిమిది వరకు చదివినట్లు వారి ఎన్నికల అఫిడవిట్లలో స్పష్టంగా తెలిపారు. టార్గెట్ కేశినేని! తమ ఎంపీ కేశినేని నాని, నగరంలోని ఇతర సీనియర్ల విద్యార్హతలను పరోక్షంగానైనా తెరపైకి తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఈ విధంగా విమర్శలు చేసినట్లు స్వపక్షీయులు అభిప్రాయపడుతున్నారు. క్వారీ రగడ గురించి మాట్లాడటం, అందులో లోపాలను ఎత్తిచూపడం వరకు అభ్యంతరం లేదంటున్నారు. పట్టాభి తీరువల్లే లోకేశ్ చదువు గురించి తాజాగా చర్చనీయాంశంగా మారిందంటున్నారు. అధికార ప్రతినిధిగా బాధ్యతలను పార్టీ అప్పగిస్తే దాన్ని స్వపక్షీయుల మీదే తన వ్యక్తిగత రాజకీయ విభేదాలకు వాడుకుంటున్నారని, దీనిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎంపీ వర్గీయులతో పాటు సీనియర్ నేతలు ఉన్నట్లు సమాచారం. ‘అతను ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో, ఏయే వ్యవహారాలు ఎలా చక్కబెట్టాడో మాకు తెలియకేమీ కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. లెక్కలన్నీ సరిపోతాయి’ అని కేశినేని ముఖ్య అనుచరుడు ‘సాక్షి’వద్ద అభిప్రాయపడ్డారు. -
జగదీశ్‌రెడ్డి వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్: మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వాదులాట చోటుచేసుకుంది. చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలో జరిగింది. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారికి పోటీగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు సమాచారం ఇచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. 2014కు ముందు సిగ్గులేని పాలన చేశారని, అప్పటి చీకటి ఇంకా ఉంటే బాగుండని భ్రమపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి రాజగోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తాను టీఆర్ఎస్ గురించి మాట్లాడలేదని, మంత్రి కాంగ్రెస్ ప్రస్తావన తేవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, తాను ప్రసంగిస్తున్న సమయంలో తన చేతిలోని మైకు లాక్కోవడం ఏంటని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవన్నీ చిల్లర చేష్టలని, మీడియాలో ప్రచారం కోసం ఆడుతున్న నాటకాలంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఎమ్మెల్యేకు అధికారులు చెప్పారని గుర్తు చేశారు. రాత్రి ఓ మాట, పొద్దున మరో మాట మాట్లాడే అన్నదమ్ముల విషయం అందరికీ తెలుసని పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి అన్నారు. తాము తలుచుకుంటే ఒక్క నిమిషంలో లోపల వేయిస్తామని, ఇకపై మునుగోడులో ప్రతి ఊరిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తానే స్వయంగా హాజరవుతానని, ఎవరు అడ్డువస్తారో చూస్తానని మంత్రి అన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. మంత్రి తీరును నిరసిస్తూ హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై లక్కారం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి రాజగోపాల్‌రెడ్డి రాస్తారోకో చేశారు. -
జనసేన నేతలకు చేదు అనుభవం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ వైఖరి తెలపాలని కార్మికుల డిమాండ్ చేశారు. దీక్షా శిబిరానికి పవన్ కల్యాణ్ రావాలంటూ కార్మికుల డిమాండ్ చేయగా, పవన్‌ను గాజువాకలో ఓడించారు.. ఆయనెందుకొస్తారంటూ జనసేన నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నాయకులు వెళ్లిపోవాలంటూ కార్మికుల నినాదాలు చేశారు. -
ఇరువర్గాల మధ్య కొట్లాట.. ఇద్దరి మృతి మరో..
కొరాపుట్: జిల్లాలోని దశమంతపూర్ సమితిలో ఉన్న దంబాగుడ గ్రామపంచాయతీ, హతిముండా గ్రామంలో రెండు వర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ధనపతి జాని(35), సహదేవ్ జాని(45) ఉండగా, గాయాలపాలైన వారిలో ధనేశ్వర్ జాని, సేనాపతి జాని, దిబా పొరిజ, రొజు జాని, మనోహర్ జాని, అంగరా జాని, చెండియా జాని ఉన్నారు. అయితే క్షతగాత్రుల్లో సేనాపతి జాని, ధనేశ్వర్ జానిల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యసేవల కోసం కొరాపుట్ సహిద్ లక్ష్మణ్ నాయక్ హాస్పిటల్‌కి తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న కొరాపుట్ డీఎస్పీ నిరంజన్ బెహరా గ్రామానికి చేరుకుని, గొడవకు గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పాతకక్షల కారణంగా కొట్టుకున్నట్లు కొంతమంది.. ఆస్తి తగాదాలని మరికొంతమంది.. ఇరువర్గాల్లో ఓ వర్గం వారు చేతబడి చేస్తున్నారన్న కారణంతో ఘర్షణకు దిగినట్లు మరికొంతమంది చెప్పారు. ప్రస్తుతం ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా బలగాలను మోహరింపజేసినట్లు సమాచారం. ఇంతవరకు ఈ దుర్ఘటనకు సంబంధించి, నిందితులుగా పేర్కొంటూ ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని, పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాతే చర్యలు చేపడతామని ఐఐసీ అధికారి బిజయ్‌రాజ్ మజ్జి తెలిపారు. -
రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఘజియాబాద్: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య బుధవారం ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద ఘర్షణ జరిగింది. బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ– మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఊరేగింపుగా వెళ్తూ, రైతుల నిరసన కేంద్రానికి దగ్గరగా వెళ్లిన సమయంలో ఈ ఘర్షణ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కార్యకర్తలు, రైతులు పరస్పరం కర్రలతో కొట్టుకున్నారని, ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారని వెల్లడించారు. ఘాజీపూర్‌లో భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన రైతులు ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ నేత అమిత్ వాల్మీకిని స్వాగతిస్తూ బీజేపీ కార్యకర్తలు ఈ ఊరేగింపు జరిపారు. రైతు ఉద్యమంపై బురదజల్లేందుకు ప్రభుత్వం పన్నిన కుట్ర ఈ దాడి అని రైతు నేతలు ఆరోపించారు. రైతులతో బీజేపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామన్నారు. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ జెండాలు పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు రైతులను అసభ్య పదజాలంతో దూషించారని భారతీయ కిసాన్ యూనియన నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు రైతులను దూషిస్తూ రెచ్చగొట్టారు. రైతులను మోసగాళ్లని, దేశ వ్యతిరేకులని, ఖలిస్తానీలను పేర్కొంటూ నినాదాలు చేశారు. రైతుల నిరసన వేదికపై రాళ్లు విసిరారు’అని సంయుక్త కిసాన్ మోర్చా ఒక ప్రకటనలో వివరించింది. -
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపిక పూర్తయ్యింది. రెండు కుటుంబాల వారసులు ఏకాభిప్రాయానికి వచ్చారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి నియమితులయ్యారు. చదవండి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగింపు విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్ -
యువకుల వివాదం.. గర్భవతి అని చూడకుండా..
సాక్షి, సైదాబాద్: చిన్న విషయంలో చెలరేగిన వాగ్వివాదం యువకుడిపై దాడికి దారి తీసింది. సైదాబాద్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణికాలనీలో నివసించే ప్రశాంత్ అలియాస్ రాజు (24) జీహెచ్ఎంసీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 2న రాత్రి 9గంటలకు రాజుకు అదే ప్రాంతంలో నివసించే అహ్మద్‌తో స్వల్ప విషయమై గొడవ జరిగింది. రాజు అక్కడి నుంచి వెళ్లిన తరువాత అహ్మద్ తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి రాజు ఇంటికి వెళ్లారు. రాజు ఎక్కడున్నాడని అడుగుతూ వారితో వచ్చిన మహిళలు రాజు వదిన గర్భవతి అయిన సలోమిని చితకబాదారు. విషయం తెలుసుకున్న రాజు చంపాపేటలో స్నేహితుడి ఇంటి వద్ద తలదాచుకున్నాడు. మరుసటి రోజు రాజును చంపాపేటలో కలుసుకున్న అహ్మద్ రాజీ చేసుకుందామని సింగరేణికాలనీకి తీసుకువచ్చారు. అక్కడ అతడిపై అహ్మద్ అతని కుటుంబసభ్యులు కర్రలతో చితకబాదారు. ఆ దృశ్యాలను అక్కడి యువకుడు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడిని అతడి వదినను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అనంతరం వారి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బారికేడ్లో ఇరుక్కున్న బాలుడు చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ హిడ్మా -
తల్లిదండ్రులు తరుచూ గొడవ పడుతున్నారని..
సాక్షి, సిద్దిపేట : తల్లిదండ్రులు తరచూ గొడవపడుతున్నారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నాల గ్రామానికి చెందిన మక్కల విజయ్‌కుమార్ (25) తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కొంత కాలంగా హైదరాబాద్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడు. పెద్దమనుషులు సర్దిచెప్పడంతో ఇటీవలె తల్లితో సహా పొన్నాలకు వచ్చాడు. పరిస్థితిలో మార్పు రాకపోగా తల్లిదండ్రుల మధ్య గొడవలు ఇంకా పెరగడంతో మనస్తాపం చెందిన విజయ్‌కుమార్ శనివారం అర్ధరాత్రి తన సోదరుడు ప్రభాకర్‌కు ఫోన్ చేసి చాలా బాధగా ఉందని చెప్పాడు. ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని, ఇంటికి రావాలని నచ్చజెప్పినా వినకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. శనివారం రాత్రి నుంచి విజయ్ కోసం గాలిస్తున్న క్రమంలో ఆదివారం ఉదయం పొన్నాల నుంచి మర్పడగ వెళ్లే దారిలో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. మృతుడి అన్న ప్రభాకర్ ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ ఎస్సై శంకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బురిడీ మాష్టారు.. బండారం బట్టబయలు ‘మా కూతురి మెడపై ఉరివేసిన గుర్తులున్నాయి’ -
టీఆర్ఎస్ నాయకుల డిష్యుం.. డిష్యుం
సాక్షి, ఖమ్మం : ఉసిరికాయలపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జాల సాంబపై అదేపార్టీకి చెందిన వారు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాంబకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఓట్లకు రూ.36వేలు పార్టీ అధిష్టానం ఇచ్చిందని, ఈ మొత్తాన్ని పంపిణీ చేయలేదని అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మరో వర్గ నాయకుడు పచ్చిపాల వెంకట్ వాట్సాప్ గ్రూపులో ఆరోపిస్తూ పోస్టు చేశాడు. దీనికి సాంబ సైతం ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఇష్టానుసారంగా పోస్టులు చేసుకున్నారు. ఈ క్రమంలో జాల సాంబ అదే గ్రామంలో పొడుగు సర్వయ్య అనే వ్యక్తికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో పరామర్శించేందుకు వెళ్లగా, అప్పటికే కోపోద్రిక్తుడైన పచ్చిపాల వెంకట్‌తో పాటు, మరో ముగ్గురు వ్యక్తులు వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి గాయపరిచారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పారిపోయారు. ఏఎస్ఐ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన జాల సాంబాను 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్లు కఠినంగా వ్యవహరించక, పోలీసులు దృష్టి సారించక..చిలికిచిలికి ఘర్షణకు దారితీస్తోందనే విమర్శలొస్తున్నాయి. చదవండి: ఎమ్మెల్సీ ఫలితాలు: ఏం జరుగుతుందో? -
ప్యాంట్ కోసం గొడవ.. మీకెలా కనబడుతున్నాం?
సాక్షి, అనంతపురం : ప్యాంట్ తెచ్చిన తంటా ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. టూటౌన్ ఎస్ఐ రాంప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓబుళదేవనగర్‌కు చెందిన ప్రసాద్ హౌసింగ్‌బోర్డులోని రాహుల్ (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) ఇంటిలో దోబీ పనికి వెళ్లేవాడు. ఇటీవల వేరొకరి ప్యాంట్ బీట్ ఆఫీసర్ ఇంటికి వెళ్లింది. దీంతో ప్రసాద్ వేరొకరికి చెందిన ప్యాంట్ మీ వ్రస్తాల్లో కలిసిందని బీట్ ఆఫీసర్ కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు ఆ ప్యాంట్ తమ వద్ద లేదని, తమ ఓనర్ ఇంటిలో ఏమైనా కలసిందేమో కనుక్కొని చెబుతామని సమాధానమిచ్చారు. చదవండి: ఆర్సీలు, లైసెన్సు పత్రాలు చూపినా ఓకే ఈ విషయమై ఇంటి యజమాని చంద్రశేఖర్ అతని కుటుంబ సభ్యుడు రాజేష్ ‘మీకెలా కనబడుతున్నాం’ అంటూ ప్రసాద్‌పై మండిపడ్డారు. ప్రసాద్ తన సోదరుడు రమణ, తదితరులను తీసుకుని బీట్ ఆఫీసర్ ఇంటిపైకి వెళ్లాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి బీట్ ఆఫీసర్ ఓ కర్రతో రమణపై దాడి చేయగా కంటికి గాయమైంది. దీంతో వారు సోమవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రసాద్, రమణలు తమపై దాడికి వచ్చారంటూ చంద్రశేఖర్, రాజేష్, బీట్ ఆఫీసర్ రాహుల్ కూడా ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలో టూటౌన్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
కేంద్రంతో మమత ఢీ
కోల్‌కతా: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన కేంద్రం, పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాలకు మరోసారి ఆజ్యం పోసింది. నడ్డా కాన్వాయ్‌పై అధికార టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ ధన్కర్ కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నివేదిక అందుకున్న హోం శాఖ..రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ నెల 14వ తేదీన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మొదట్నుంచీ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వం.. ఈ నోటీసులకు స్పందించరాదని నిర్ణయించింది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ శుక్రవారం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఈ మేరకు ఒక లేఖ రాశారు. శాంతిభద్రతలతోపాటు, జెడ్– కేటగిరీకి చెందిన కొందరిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుని చర్చించేందుకు 14వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినందున వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ విధంగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మాత్రమే లోబడి నడుచుకుంటానని పరోక్షంగా కేంద్రానికి తెలిపారు. డైమండ్ హార్బర్లో గురువారం జేపీ నడ్డా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ, ఆయన వాహన డ్రైవ ర్కు గాయాలు కాగా, వారి వాహన అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. నిప్పుతో చెలగాటం వద్దు.. బెంగాల్ గవర్నర్ ధన్కర్ మరోసారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. నిప్పుతో చెలగాటం వద్దంటూ హెచ్చరించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనపై కేంద్రానికి నివేదిక పంపినట్లు వెల్లడించారు. దాడి ఘటనపై సీఎం స్పందించిన తీరు చూస్తే రాజ్యాంగం పట్ల ఆమెకు ఏమాత్రం విశ్వాసం ఉందో తెలుస్తుం దన్నారు. కోల్‌కతాలో గురువారం జరిగిన ర్యాలీలో మ మత..నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనను బీజేపీ ఆడుతున్న నాటకంగా పేర్కొంటూ, నడ్డా పేరు ను పలు మార్లు వ్యంగ్యంగా ఉచ్చరించారు. ఈ విషయమై గవర్నర్ స్పందిస్తూ.. బెంగాలీ సంస్కృతి పట్ల గౌరవం ఉన్న వారెవరూ ఆమె మాదిరిగా మాట్లాడరని దుయ్యబట్టారు. -
టీఆర్ఎస్లో రచ్చ.. తన్నుకున్న కౌన్సిలర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కౌన్సిలర్లు కొట్లాటకు దిగారు. అధికార పార్టీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లా మధ్య శనివారం ప్రోటో కాల్ వివాదం తలెత్తింది. సర్దార్ వల్లభబాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటో కాల్ పాటించాలని వైస్ చైర్మన్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు అసభ్య పదజాలంతో నెట్టేసుకుంటు సంఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న మరికొంత మంది కౌన్సిలర్లు అపేందుకు ప్రయత్నం చేసినా ఎవరూ ఆగలేదు. చదవండి: మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నారు: కిషన్ రెడ్డి అక్కడితో ఆగకుండా నాది టీఆర్ఎస్, నాది టీఆర్ఎస్ అనుకుంటూ సభ్య సమాజం ఇలాంటి వారిని నాయకులుగా ఎన్నుకున్నమా అనే విధంగా ప్రవర్తించారు. అయితే గత కొంత కాలంగా మున్సిపల్లో చైర్మన్ రామ తీర్థపు మాధవి, అతని భర్త రాజుకు వైస్ చైర్మన్ మధు రాజేందర్‌కు విభేదాలు కొనసాగుతున్నాయి .గతంలో ఎమ్యెల్యే దృష్టికి వెళ్లిన వారు పట్టించుకోకపోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయి అనేది పలువురు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు కొట్లాడుకోవడం, అందులోనే ఇద్దరూ అధికార పక్ష నాయకులు వాదులాడుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇక టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తన్నుకోవడంపై అధిష్టానం, స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు, జిల్లా మంత్రి కేటీఆర్ స్పందించలేదు. వాల్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే -
అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం!
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడాది క్రితం వారంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, ఘన విజయం సాధించారు. కానీ ఇప్పుడు మాత్రం అంతర్గత విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో తాజా పరిస్థితి ఇది. అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్‌కు, ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా సాగుతున్న వివాదం చివరకు పోలీస్ స్టేషన్ దాకా చేరింది. హెచ్‌సీఏ సభ్యులు తనను బహిరంగంగా తిట్టారంటూ అజహర్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోశాధికారి సురేందర్ అగర్వాల్, మరో సభ్యుడు మొయిజుద్దీన్‌లపై పోలీసులు సెక్షన్ 504, 506ల కింద కేసులు నమోదు చేశారు. అసోసియేషన్ పనికి సంబంధించి ఒక హెచ్‌సీఏ ఉద్యోగి సురేందర్ అగర్వాల్ వద్దకు వెళ్లగా... ఆయనతో పాటు మరి కొందరు కలిసి సదరు ఉద్యోగితో పాటు అజహర్‌ను కూడా బూతులు తిట్టడంతో వివాదం ముదిరినట్లు తెలిసింది. దాంతో తనను దూషించారంటూ అజహర్ వర్గం పోలీసులను ఆశ్రయించింది. దీనికి సంబంధించి సోమవారం పోలీసులు విచారణ జరిపే క్రమంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా కొంత గొడవ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు అక్కడి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు సురేందర్ అగర్వాల్‌పై ఇంకో కేసు కూడా నమోదైంది. హెచ్‌సీఏ క్లబ్‌లకు రూ. 50 వేలు ఇస్తున్నామంటూ తమకు మాత్రం ఇవ్వలేదని, నిధులను కోశాధికారి సురేందర్ దుర్వినియోగం చేశారంటూ షాలీమార్ క్రికెట్ క్లబ్ యజమాని ఎజాజ్ అలీ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే కారణమా... సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో అజహర్‌కు, ఇతర సభ్యులకు మధ్య విభేదాలు మొదలైనట్లు సమాచారం. హెచ్‌సీఏలో వివాదాల పరిష్కారం కోసం జస్టిస్ దీపక్ వర్మను అజహర్ అంబుడ్స్‌మన్ నియమించారు. ఇది కమిటీలో ఇతర సభ్యులకు నచ్చలేదు. తమతో ఏమాత్రం సంప్రదించలేదని, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు చెబుతున్నారు. అయితే గత ఏడాది కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే ఇందుకు అంగీకారం తెలిపారని, నాటి సమావేశం మినిట్స్‌లో కూడా ఇది ఉందనేది అజహర్ వాదన. రాబోయే ఏజీఎంలో ఆమోద ముద్ర వేసిన తర్వాతే అంబుడ్స్‌మన్ నియామకాన్ని అమల్లోకి తేవాలని అజహర్ వ్యతిరేక బృందం చెబుతోంది. అయితే కరోనా నేపథ్యంలో 200కు పైగా సభ్యులు హాజరయ్యే అవకాశం ఇప్పట్లో లేని నేపథ్యంలో ఏజీఎం సాధ్యం కాదంటున్న అజహర్... ఏడాది కాలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో అసోసియేషన్ ఎలా పని చేస్తుందనేది మరో వర్గం వాదన. ఇటీవల క్లబ్‌ల పూర్తి వివరాలు, యజమానుల వివరాలు తనకు ఇవ్వాలంటూ అజహర్ లేఖ రాయడం కూడా వివాదానికి కారణమైంది. అంబుడ్స్‌మన్ వస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కింద తమకు ఇబ్బందురు ఎదురు కావచ్చనే కారణంతోనే హెచ్‌సీఏలో పలువురు సభ్యులు అజహర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని సమాచారం. చదవండి: ‘టీ20ల్లో ఆ మార్పు చేసి చూడండి.. ’ -
నిషేధ పర్వం
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద మన జవాన్లు 20మందిని చైనా సైనికులు దారుణంగా హతమార్చిన నాటినుంచీ చైనా ఉత్పత్తులనూ, ఆ దేశానికి చెందిన యాప్‌లను నిషేధించాలన్న డిమాండ్ బలంగా వినబడుతోంది. సోమవారం కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌తోసహా 59 యాప్‌లపై నిషేధం విధించి ఆ డిమాండ్‌ను కొంతవరకూ నెరవేర్చింది. కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా చైనా గురించి, ఆ దేశంతో వున్న వైరం గురించి ప్రస్తావన లేదు. వినియోగదారుల డేటాను ఈ యాప్‌లన్నీ మన దేశం వెలుపలవున్న సర్వర్లకు చేరవేస్తూ, వారి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని, దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు, రక్షణకు ముప్పు కలిగిస్తున్నాయని ప్రకటన సారాంశం. ఈ యాప్‌లలో కొన్నింటిని వేరే దేశాలు ఇదివరకే నిషేధించాయి. అమెరికాలో టిక్‌టాక్ పోకడలపై దర్యాప్తు సాగు తోంది. ఇందులో భద్రతకు ముప్పు తెచ్చే అంశాలున్నాయని అక్కడి నిఘా విభాగాల అనుమానం. మన దేశం విధించిన నిషేధంపై ‘తీవ్రంగా ఆందోళన చెందుతున్నామ’ంటూ స్పందించిన చైనా సైతం వాట్సప్, ట్విటర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలను దూరంపెట్టింది. కనుక ఇటువంటి నిషేధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. టిక్‌టాక్ విషయంలో ఎప్పటినుంచో మన దేశంలో అనుమానాలున్నాయి. మొన్న మార్చిలో ఒక ఎంపీ దీన్ని గురించి ప్రశ్నించారు కూడా. అయితే అది వాస్తవం కాదని కేంద్రం జవాబిచ్చింది. నిషేధించిన యాప్‌లలో టిక్‌టాక్‌కు వున్న ప్రజాదరణ అంతా ఇంతా కాదు. మన దేశంలో 20 కోట్లమంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారని అంచనా. ఫైల్ షేరింగ్ యాప్ షేర్ఇట్ కూడా అలాంటిదే. పుస్తకాలను, డాక్యుమెంట్లను సులభంగా పీడీఎఫ్‌గా మార్చి క్షణంలో ఎవరికైనా పంపే కామ్‌స్కానర్ కూడా అందరికీ పరిచితమైనది. ఇక మొబైల్ బ్రౌజర్ యూసీ బ్రౌజర్, గేమింగ్ యాప్ క్లాష్ ఆఫ్ కింగ్స్ వగైరాలు కూడా జాబితాలో వున్నాయి. ఇతర యాప్‌ల మాటెలావున్నా మారుమూల పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సైతం సామాన్యులకు ఇప్పుడు టిక్‌టాక్ ప్రాణప్రదంగా మారింది. దీనికున్న ఆదరణ చూసిన అనేక బ్రాండ్లు, కోచింగ్ సెంటర్లు, ఇతర సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈ మాధ్యమాన్ని ఆశ్రయించాయి. రాజకీయ నాయకులు, ప్రజలను ప్రభావితం చేయాలనుకునే ఇతర వర్గాలవారు టిక్‌టాక్‌ను వేదికగా చేసుకోవడం మొదలుపెట్టారు. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా వుండాలని అప్రమత్తం చేసే వీడియోల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటీనటులు కృతి సనన్, ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ వగైరాలు నటించారు. తెలుగులో కూడా అనేక మంది నటీనటులు టిక్‌టాక్ ద్వారా తమ సందేశాలు అందించారు. ఆటపాటలు, వ్యంగ్య వ్యాఖ్యలు, వంటలు, వెటకారాలు వగైరాలన్నీ టిక్‌టాక్ మాధ్యమంలో సూపర్‌హిట్ అయ్యాయి. వాటి సృష్టి కర్తలకు సినిమా నటులకుండే స్థాయి ఆదరణ ఏర్పడి, వారు డిజిటల్ స్టార్లయ్యారు. చెప్పాలంటే వినోదాన్ని టిక్‌టాక్ ప్రజాస్వామీకరించింది. ఎందుకంటే దానికి ఖరీదైన ఉపకరణాలు, మేకప్‌లు అవసరం లేదు. మెరుగైన ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ వుంటే చాలు. ఆ వేదికపై అవినీతి లేదు... బంధు ప్రీతి లేదు... ఎవరినో ఆశ్రయించే పనిలేదు... ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేదు. వయసుతో పనిలేదు. ఏడెనిమిదేళ్ల వయసు వారినుంచి ఎనభై తొంభైయ్యేళ్ల వృద్ధుల వరకూ టిక్‌టాక్ ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందినవారున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాచీయాదవ్ ఇందుకు ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లోని హర్దా అనే చిన్న జిల్లాకు చెందిన మహేంద్ర డోగ్నేను టిక్ టాక్‌లో అనుసరించేవారు 64 లక్షలమంది వున్నారు. ఇది ఆ యువకుడుంటున్న జిల్లా జనాభాకన్నా అధికం! మారుమూల పల్లెల్లో వున్నవారు సైతం తమ ప్రతిభను ప్రదర్శించి పేరు తెచ్చుకోవడంతో పాటు డబ్బు సంపాదించడం టిక్‌టాక్ వల్ల సాధ్యపడింది. అందులో ఆకర్షణీయమైన విషయాన్ని అందించగలిగేవారు రూ. 500 నుంచి రూ. 5 లక్షల వరకూ సంపాదించగలుగుతున్నారని రెండు నెలలక్రితం ఒక మీడియా సంస్థ వెల్లడించింది. ఫేస్బుక్, వాట్సాప్ మాధ్యమాలను టిక్‌టాక్ చాలా త్వరగానే అధిగమించి ఔరా అనిపించుకుంది. ఇతర మాధ్యమాలు ఇంగ్లిష్‌ను వదల్లేని స్థితిలోవుంటే టిక్‌టాక్ ఏ భాష మాట్లాడేవారికైనా అందుబాటులోకొచ్చింది. అది 150 దేశాల్లో 75 భాషల్లో లభ్య మవుతోంది. మన దేశంలో తెలుగుతో సహా 15 భాషల్లో వేళ్లూనుకుంది. ఈ ప్రజాదరణను టిక్‌టాక్ దండిగా సొమ్ము చేసుకోగలుగుతోంది. అయితే ఈ క్రమంలో అది ఎన్నో వివాదాలను మూట గట్టుకుంటున్న మాట కూడా వాస్తవం. ముఖ్యంగా పసిపిల్లలతో లైంగిక చేష్టలు చేయించే ముఠాలకు, ఇతరులపై నిందలేసేవారికి, విద్వేషాలను పెంచేవారికి ఇది వేదికగా మారుతున్నా వారిని అరికట్టే కట్టుదిట్టమైన నియంత్రణలు సరిగాలేవన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంతోనే నిరుడు మద్రాస్ హైకోర్టు టిక్‌టాక్‌పై కొన్నాళ్లు నిషేధం విధించింది. గత నెలలో మహిళపై యాసిడ్ దాడులను ప్రోత్సహించేదిగా వున్న ఒక వీడియో కలకలం రేపింది. ఫిర్యాదులొచ్చేవరకూ టిక్‌టాక్ దాన్ని పట్టించుకోలేకపోయింది. ఇప్పుడు యాప్‌లు నిషేధించడానికి కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ ను ప్రయోగించింది. ఇందుకు కారణాలు ఏం చెప్పినా డౌన్లోడ్ చేసుకునే యాప్‌ల ద్వారా కోట్లాది మంది వినియోగదారుల సమాచారం సరిహద్దులు దాటిపోతున్న మాట వాస్తవం. ఇది చైనా యాప్ లకు మాత్రమేకాదు... అన్ని రకాల యాప్‌లకూ వర్తిస్తుంది. డౌన్లోడ్ చేసుకోవాలన్న ఆత్రుతలో ఆ యాప్‌లు కోరే సమాచారమేమిటో తెలుసుకోకుండా అనుమతులివ్వడం వల్ల వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ శక్తులకు చేరే ప్రమాదం ఎప్పుడూ వుంటుంది. ఇప్పుడు నిషేధించిన యాప్‌లకు దీటైన దేశీయ యాప్‌లలోనైనా మెరుగైన నియంత్రణలు, జనం మనోభావాలను పట్టించుకునే ఏర్పాట్లు ఉంటాయని ఆశించాలి. -
కొద్ది సేపట్లో భర్త రెండో పెళ్లి..
చెన్నై, వేలూరు: తాళి కట్టే సమయంలో భర్త రెండవ వివాహాన్ని మొదటి భార్య అడ్డుకున్న ఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వేలూరు సమీపంలోని మేట్టు ఇడయాంబట్టి గ్రామంలోని ఎంజీఆర్ నగర్‌కు చెందిన రామచంద్రన్(45) తొర్రపాడిలో టైలర్ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి గత 19 ఏళ్ల క్రితం కమలితో వివాహం జరిగి ఇద్దరు కుమారులున్నారు. మనస్పర్థల కారణంగా దంపతులు ఇద్దరూ ఐదేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరూర్‌కు చెందిన ఒక యువతి తొర్రపాడిలోని బందువుల ఇంటికి వచ్చిన సమయంలో రామచంద్రన్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువతిని రెండవ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. (అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా! ) బుధవారం ఉదయం అడుక్కంబరైలోని అమ్మన్ ఆలయంలో వివాహ ఏర్పాట్లు చేశారు. ఉదయం పూజలు పూర్తి చేసుకొని తాళి కట్టేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న కమలి తన ఇద్దరు కుమారులను తీసుకొని ఆలయానికి వచ్చింది. పెళ్లి దుస్తులతో ఉన్న రామచంద్రన్‌ను కమలి నిలదీసింది. ఆ సమయంలో పెళ్లి కుమార్తె బంధువులు, కమలి మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. విషయం తెలుసుకున్న మహిళా పోలీసులు అమ్మన్ ఆలయం వద్దకు చేరుకొని వివాహాన్ని నిలిపి వేసి రామచంద్రన్, పెళ్లి కుమార్తె, ఆమె బంధువులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో రామచంద్రన్‌కు గుండె నొప్పి రావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఇరు వర్గాల మధ్య జరిగిన సంఘటనల గురించి విచారణ చేస్తున్నారు. -
ప్రాణాలు బలిగొన్న మాంసం వివాదం
ప్రకాశం, పెద్దదోర్నాల: మాంసం వద్ద చెలరేగిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వండిన మాంసాన్ని పంచుకోవటంలో ఇరువురు సోదరుల మధ్య చోటుచేసుకున్న వివాదం చివరకు హత్యకు దారితీసింది. ఈ సంఘటన మండల పరిధిలోని కొర్రప్రోలు గిరిజన గూడెంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో గూడెంలోని దాసరి అంకన్న (20) తనకు సోదరుడి వరుసైన దాసరి గురవయ్య చేతిలో హతమయ్యాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం సీఐ మారుతీకృష్ణ, పెద్దదోర్నాల ఎస్సై అబ్దుల్ రహిమాన్‌లు సంఘటనా స్థిలికి చేరుకుని సంఘటపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అబ్దుల్ రహిమాన్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గూడేనికి చెందిన దాసరి అంకన్న, దాసరి గరవయ్యలు వరుసకు అన్నాదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంటిపేరు కలిగిన కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఆదివారం చనిపోయిన మేకను కుటుంబంలో అందరూ కలిసి వండుకున్నారు. మేక మాంసం వండించుకోవటంలో దాసరి అంకన్నకు, గురవయ్య మధ్య విభేదం తలెత్తింది. ఈ క్రమంలో ప్లేటులో అన్నం, మాంసం కూర వేసుకుని బయట తినేందుకు వెళ్తున్న అంకన్నను గురవయ్య దుర్భాషలాడుతూ ఎవరికి పెట్టేందుకు వెళ్తున్నావంటూ నిలదీశాడు. ఇరువురి మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. దీంతో ఆగ్రహించిన గురవయ్య వెనుకగా వచ్చి అంకన్న మెడపై కత్తితో దాడి చేయటంలో సంఘటనా స్థలిలోనే అతను మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై అబ్దుల్ రహిమాన్ తెలిపారు. నిందితుడు గురవయ్య పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
తిట్టుకున్న ‘తమ్ముళ్లు’
కర్నూలు, డోన్: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం ఏర్పాటుచేసిన టీడీపీ డోన్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నేతల ప్రమేయముందని పోలీసుల విచారణలో వెల్లడికావడంతో శుక్రవారం జరిగిన సమావేశం పట్ల పార్టీ కార్యకర్తలు ఆసక్తి కనబరిచారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే సభావేదిక ఏర్పాటులో లోటుపాట్లపై రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్.. కార్యక్రమ నిర్వాహకులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కోట్రికె ఫణిరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. చేతకాకపోతే కార్యక్రమాల నిర్వహణ నుంచి తప్పుకోవాలని నాగేశ్వరరావ్ అనగా.. చేతకాని వాళ్లే ఎక్కువ మాట్లాడతారని ఫణిరాజ్ దీటుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. ధర్మవరం సుబ్బారెడ్డి వర్సెస్ పెద్ద కేశవయ్య గౌడ్ .. గత ఎన్నికల్లో పార్టీ ఓటమిపై డోన్ మాజీ సర్పంచ్ పెద్ద కేశవయ్య గౌడ్ మాట్లాడుతుండగా.. ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ ధర్మవరం సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎలా పాల్గొంటావని ధర్మవరం సుబ్బారెడ్డి ఆగ్రహంతో కేశవయ్య గౌడ్ వైపు దూసుకువెళ్లి ప్రశ్నించారు. దీనికి కేశవయ్య గౌడ్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ టీడీపీలో ఉండి కూడా నీ మాదిరి ద్వంద్వ ప్రమాణాలు పాటించనని ఎత్తిపొడిచారు. దీంతో ఒక్కసారిగా సమావేశం రసాభాసాగా మారింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కలుగచేసుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. నకిలీ మద్యం వ్యవహారంలో స్పష్టత ఇస్తారని ఆశించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సమావేశం తీవ్ర నిరాశ కలిగించింది. పార్టీ ఓడిన తర్వాత కూడా టీడీపీ అగ్ర నాయకులు ఆత్మ విమర్శ చేసుకోకుండా పరస్పరం నిందించుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం చూసి కార్యకర్తలు నివ్వెరపోయారు. ఇలాంటి వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సమైక్యంగా నిలబడి పార్టీని ఎలా గెలిపించగలరనే సందేహాన్ని టీడీపీ కార్యకర్తలు బాహాటంగావ్యక్తపరుస్తున్నారు. -
భారత్‌కు పెనుముప్పు..
న్యూఢిల్లీ: ఇరాన్ మిలటరీ కమాండర్ ఖాసీ సులేమానిని అమెరికా లక్షిత దాడుల్లో హతమార్చడంతో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా భగ్గు మన్నాయి. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలవుతుందని, అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇరువర్గాల దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్న నేటి పరిస్థితుల్లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు లేవు. ఇరాన్, అమెరికా మధ్య పరిమిత యుద్ధం జరిగినా భారత్ బాగా నష్టపోవాల్సి వస్తోంది. యుద్ధం వల్ల భారత్‌కు ప్రాథమికంగా రెండు ముప్పులు పొంచి ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో వర్క్ పర్మిట్లపై పోయిన వారితో సహా మొత్తం 80 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ముఖ్యంగా అరేబియన్ గల్ఫ్‌లో ఎక్కువ మంది ఉన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే వారి భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. 1990 దశకంలో అమెరికా, ఇరాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు భారత్, ప్రత్యేక విమానాల ద్వారా 1,10,000 మంది భారతీయులను ఢిల్లీకి తీసుకొచ్చింది. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం జరగ్గ పోయినా ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగిన భారతీయుల ఉద్యోగాలకు ఎసరు వస్తుంది. సౌదీ అరేబియా, ఖతార్ మధ్య గత కొన్నేళ్లుగా ప్రాంతీయ సంఘర్షణలు కొనసాగుతుండడం వల్ల వేలాది మంది ప్రవాస భారతీయులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. కేరళ నుంచి వెళ్లిన పాతిక లక్షల మంది భారతీయుల్లో అప్పుడే కొందరు వెనుతిరిగి వస్తున్నారు. ఒకేసారి అందరిని రప్పించడం కష్టమని చెప్పి రావాలనుకుంటున్న వారిని రమ్మని కేరళ చెబుతోంది. ప్రవాస భారతీయులు ఎక్కువ మంది వెను తిరిగి వస్తే ఏటా కేంద్రానికి వచ్చే నాలుగువేల కోట్ల డాలర్ల సొమ్మును భారత్ నష్టపోవాల్సి వస్తోంది. ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు వస్తోన్న విదేశీ మారక ద్రవ్యంలో ఇది యాభై శాతానికన్నా ఎక్కువ. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం ద్వారా భారత్‌కు మరో ముప్పు పొంచి ఉంది. ఇరాన్ మిలటరీ కమాండర్ సులేమానిని హతమార్చారన్న వార్తతోనే అంతర్జాతీయ చమురు ధరలు నాలుగు శాతం పెరిగాయి. ఇరాన్ నుంచి భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకోకపోయినప్పటికీ మనకు గల్ఫ్ దేశాల నుంచి చమురు ‘హోర్ముజ్’ జలసంధి గుండా వస్తోంది. ప్రపంచంలో మూడొంతుల చమురు ఎగుమతి ఈ జలసంధి ద్వారానే జరుగుతోంది. యుద్ధం వచ్చినట్లయితే ఈ జలసంధి మూసుకుపోతుంది. పర్యవసానంగా చమురు ధరలు పెరిగి భారత్‌లో ద్రవ్యోల్బణం మరింత తీవ్రమవుతుందని, ఆహార పదార్థాల ధరలు ఆకాశానంటుతాయని ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ ఆర్థిక పరిస్థితి అదుపు తప్పింది. ద్రవ్యోల్పణం పెరిగింది. జీడీపీ రేటు గణనీయంగా పడిపోయింది. వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో అమెరికా–ఇరాన్ యుద్ధం అనివార్యం అయితే దాన్ని ఆపేంత శక్తి కూడా భారత్‌కు లేదు. సంబంధిత వార్తలు ఇరాన్ వెన్ను విరిగింది! అమెరికా మరోసారి రాకెట్ల దాడి ఇరాన్ గగనతలం మీదుగా విమానాలు వెళ్లనివ్వద్దు -
కల్యాణదుర్గం టీడీపీ నేతల మధ్య విభేదాలు
-
పిలిస్తే రాలేదని..
బంజారాహిల్స్: బస్తీలో తమను కాదని హల్చల్ చేస్తున్నావంటూ పెళ్లి బరాత్‌లో ఓ యువకుడిపై స్థానిక నాయకులు దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2, ఇందిరానగర్‌కు చెందిన వినోద్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను తన బావ పెళ్లి బారాత్‌లో పాల్గొన్నాడు. అదే సమయంలో బస్తీకి చెందిన నాయకుడు లడ్డురాజు యాదవ్ వినోద్‌ను తన వద్దకు రమ్మని పిలిచాడు. అతను రాకపోవడంతో పది నిమిషాల తర్వాత అక్కడికి వెళ్లిన రాజుయాదవ్ తమాషా చేస్తున్నావా..? నేను పిలిస్తే రావా...? ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావ్.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఉద్రిక్తతకు నెలకొంది. అదే రోజు రాత్రి సంతోష్ అనే యువకుడి ఇంటికి వెళ్లిన రాజు యాదవ్, రాజేష్, వడ్డెర శ్రీనివాస్ అతడి తల్లి పుష్పలతను దూషించారు. ఈ విషయం తెలియడంతో అక్కడికి వెళ్లిన వినోద్‌ను మరోసారి బెదిరించారు. తెల్లవారుజామున వినోద్, తన స్నేహితులు శివ, ఆంథోనితో కలిసి స్థానిక గణేశ్మండపం వద్ద టిఫిన్ చేస్తుండగా అక్కడికి వెళ్లిన లడ్డురాజుయాదవ్, అతడి కుమారులు అభిమన్యు, సంతోష్, అనుచరులు రాజేష్, వడ్డెర శ్రీను, శ్రీనివాస్, వికాస్, రాకేష్ కర్రలతో శివ, ఆంథోనిలపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. -
సిగరెట్ కోసం ఘర్షణ
అడ్డగుట్ట: సిగరెట్ కోసం ఓ యువకుడు అర్థరాత్రి కిరాణా దుకాణానికి వెళ్లగా పాత బాకీ తీరిస్తేనే సిగరెట్ ఇస్తానని షాపు యజమాని చెప్పడంతో సదరు యువకుడు అతడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న తుకారాంగేట్‌కు చెందిన మరో యువకుడు తనకు సంబంధం లేకపోయినా జోక్యం చేసుకోవడమేగాక సిగరెట్ కోసం వచ్చిన యువకుడిపై చేయి చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవపడుతున్న వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి స్థానిక ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలోని కిరాణా దుకాణానికి వచ్చిన లాలాగూడకు చెందిన రాహుల్ బోస్లే అనే యువకుడు షాపు యజమాని ప్రకాష్‌ను సిగరెట్ అరువు అడిగాడు. అయితే ఇప్పటికే పాత బాకీ ఉన్నందున సిగరెట్ ఇచ్చేందుకు అతను నిరాకరించడంతో రాహుల్ షాపు యజమానితో గొడవ పడటంతో ఘర్షణకు దారి తీసింది. అదే సమయంలో స్నేహితులతో కలిసి అటుగా వెళుతున్న సాయితేజ గౌడ్ ఈ విషయంలో జోక్యం చేసుకోగా నరేష్ అనే యువకుడు సాయితేజను కొట్టాడు. దీంతో సాయితేజ నరేష్‌తో పాటు రాహుల్‌పై దాడి చేయడమేగాక అడ్డు వచ్చిన అతని తల్లితో కూడా గొడవ పడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తుకారాంగేట్ పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మిగతా వారి విషయమై ఆరా తీయగా సాయితేజ తన స్నేహితుల వివరాలు చెప్పకుండానే స్టేషన్లో నుంచి బయటికి వెళ్లబోతూ కింద పడటంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్టేషన్లో ఎస్ఐ, కానిస్టేబుల్ తనపై దాడి చేశారని సాయితేజ గౌడ్ ఆరోపిస్తుండగా, అతడి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. -
పూజల గొడవ... ఆలయానికి తాళం
శివాజీనగర : నగరంలో ప్రముఖ బసవేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించే విషయంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న గొడవతో గర్భగుడికి తాళాలు పడ్డాయి. విజయపుర వద్ద చిన్నికాలమఠం, నందికోలమఠం కుటుంబాలు ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తూ వస్తున్నాయి. చిన్నికాలమఠం 11 నెలలు, నందికోల మఠం ఒక నెల పూజలు జరిపేందుకు తీర్మానించాయి. అయితే ఇందుకు ఆమోదించని నందికోల మఠం, చిన్నికాల మఠం కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు గొడవపడుతుండేవారు. మళ్లీ ఆదివారం ఉదయం పూజలు జరిపేందుకు రెండు కుటుంబాలు పరస్పరం గొడవపడ్డారు. అంతేకాకుండా గర్భగుడికి రెండు కుటుంబాలవారు ప్రత్యేకమైన తాళాలు బిగించారు. దీంతో దేవుడి దర్శనానికి వచ్చిన వందలాది మంది భక్తులు దేవుడి దర్శనం లేకుండగా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఈ గొడవతో విసుగెత్తిన మఠం కమిటీ, భక్తులు ఆవేశంతో వీరిద్దరిపై గోల్గుంబజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
బార్లో మందుబాబుల వీరంగం
అనంతపురం, తాడిపత్రి అర్బన్: పోలీస్ పట్టణంలోని ఓ బార్లో శనివారం రాత్రి ఇద్దరు మందుబాబులు వీరంగం సృషించారు. ఒకరిపై ఒకరు మద్యం సీసాలతో దాడి చేసుకోవడంతో ఉత్తరాంచల్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. జంబులపాడు సమీపంలోని అర్జాస్ స్టీల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉత్తరాంచల్ రాష్ట్రం కైత్వాడ్ జిల్లాకు చెందిన కరణ్‌చంద్, సురేందర్‌చంద్ (36)లు శనివారం రాత్రి తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్ సమీపంలోని హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ పూటుగా మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో మద్యం సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సురేందర్‌చంద్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీపబంధువు బింబగదుర్ సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి పంపించారు. అయితే అప్పటికే సురేందర్‌చంద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన కరణ్చంద్ను అరెస్ట్ చేశారు. -
ఇంటి కిటికీ పక్కన మూత్ర విసర్జన చేసాడని..
పుత్తూరు: ఒక యువకుడు ఇంటి కిటికీ పక్కన మూత్ర విసర్జన చేయడంతో రేగిన వివాదం ఇరువర్గాల మధ్య దాడులకు దారి తీసింది. దీంతో పుత్తూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ హనుమంతప్ప కథనం మేరకు.. పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న గాంగ్మాన్ వేలాయుధం ఇంటి కిటికీ పక్కన గుర్తు తెలియని యువకుడు గురువారం మధ్యాహ్నం మూత్రవిసర్జన చేశాడు. దీనిపై వేలాయుధం కుటుంబ సభ్యులతోపాటు చుట్టు పక్కల కాపురముంటున్న వారు ఆ యువకుడిని నిలదీశారు. మాటామాటా పెరగడంతో యువకుడికి వేలాయుధం దేహశుద్ధి చేశాడు. కొంత సేపటి తరువాత ఆ యువకుడు పట్టణంలోని దళితవాడకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి వేలాయుధం ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు వేలాయుధంతోపాటు ఆయన భార్యపై భౌతిక దాడికి దిగారు. వేలాయుధంకు స్వల్ప గాయాలు కాగా భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతోంది. వేలాయుధం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఉదయం వేలాయుధంకు మద్దతుగా రైల్వే సిబ్బంది వచ్చారు. మరో వైపు పుత్తూరు దళితవాడకు చెందిన వ్యక్తులు పోలీస్‌స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
మున్సిపల్ అధికారుల తీరుపై నిరసన
గుంటూరు రూరల్: మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వివాదంలో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేయటంతో గ్రామస్తులు ఆందోళన నిర్వహించిన ఘటన మండలంలోని బుడంపాడు గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాగునీరు కలుషితమై ఇబ్బందులు పడుతున్నామని అధికారులను అడిగితే దురుసుగా మాట్లాడటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టులు చేయిస్తారా అంటూ గ్రామస్తులు ప్రధాన రహదారిలో వాహనాలను నిలిపి ఆందోళనకు దిగారు. నెలరోజులుగా మురికినీరు తాగి రోగాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది సరఫరాచేసే ట్యాప్ నీటిని వాటర్ బాటిల్స్‌లో పట్టి నిరసన తెలిపారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవటంతో సౌత్‌జోన్ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, డీఎస్పీ సీతారామయ్య ఘటనా స్థలికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట.. అనంతరం ఆందోళన కారులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మున్సిపల్ సీసీ, ఏఈలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయితే కార్యాలయంపై దాడిచేసి ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించినందుకు, కార్యాలయంలోని ఫర్నీచర్, బయోమెట్రిక్ మెషిన్లను ధ్వంసం చేసిన కేసులో పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మంచి నీటిని సక్రమంగా సరఫరా చేయమని అడిగితే అరెస్టులు ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటలకుపైగా ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ లఠ్కర్ ప్రజలతో మాట్లాడుతూ అధికారులపై దాడి చేయటం సమంజసంకాదన్నారు. అనంతరం స్థానికులు ప్రస్తుతం మురుగు నీరు వస్తున్నందున గ్రామానికి 40 లారీల నీటిని అధికారులు అందజేయాలని కోరగా, అధికారులు ప్రస్తుతం 15 లారీలు వస్తున్నాయని వాటిని పెంచి సరిపడేంతగా పంపుతామని చెప్పారు. అయితే కార్యాలయంపై దాడిచేసిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సౌత్‌జోన్ డీఎస్పీ మూర్తి తెలిపారు. -
చీకుల దుకాణం వద్ద వివాదం..యువకుల హత్య
కాకినాడ రూరల్: మాంసం చీకుల కొట్టు వద్ద వివాదం ఇద్దరు ప్రాణాలను బలిగొంది. కాకినాడ ఏటిమొగ వెళ్లే ప్రధాన రోడ్డులో ఉన్న అశ్విని బార్అండ్ రెస్టారెంట్లో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో వ్యక్తి చావుబతుకుల మధ్య కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఏటిమొగకు చెందిన వనమాడి రాజు(30), పంతాడి దుర్గాప్రసాద్ అలియాస్ తులసి(35)మృతి చెందగా, చెక్కా రాజేష్ తీవ్రగాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏటిమొగకు వెళ్లే దారిలోని మూలారమ్మ(ధనమ్మ) గుడి సమీపంలో ఉన్న అశ్విని బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఉన్న బిర్యానీ షాపులో మాంసం చీకుల కోసం మంగళవారం రాత్రి పంతాడి నూకరాజు వెళ్లి రూ.50 పెట్టి చీకులు కొనుక్కున్నాడు. మరికొన్ని చీకులు పెట్టాలని షాపు యజమానిని అడిగాడు. అతను పెట్టలేదు. దీంతో అనుమతి లేకుండా చేత్తో తీసుకొని తినేశాడు. దీంతో దుకాణం యజమానికి పంతాడి నూకరాజుకి ఘర్షణ జరిగింది. అనంతరం ఎవరికి వారు ఇంటికి వెళ్లిపోయారు. చీకుల వ్యాపారం చేస్తున్న వ్యక్తి వనమాడి రాజుకు బంధువు కావడంతో బుధవారం మధ్యాహ్న సమయంలో పంతాడి నూకరాజును వనమాడి రాజు రాత్రి గొడవ విషయం అడిగాడు. ఆ సమయంలో ఇరువురు మధ్య వివాదం చోటు చేసుకుంది. వనమాడి రాజు తన స్నేహితులైన పంతాడి దుర్గాప్రసాద్, చెక్కా రాజేష్‌తో కలసి వచ్చి మద్యం షాపులో మద్యం సేవిస్తుండగా నూకరాజు పొడవాటి బాకులాంటి కత్తిని తీసుకొచ్చి వనమాడి నూకరాజును విచక్షణారహితంగా పొడవడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. రాజును కత్తితో పొడుస్తున్న సమయంలో నూకరాజును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అప్పటికే విచక్షణ కోల్పోయిన నూకరాజు పంతాడి దుర్గాప్రసాద్, చెక్కా రాజేష్లపైనా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇరువురిని 108 అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో పంతాడి దుర్గాప్రసాద్ మృతి చెందాడు. చెక్కా రాజేష్ చావుబతుకుల మధ్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇరువురు వ్యక్తులను హత్య చేసి, మరో వ్యక్తి తీవ్ర గాయాలకు కారణమైన పంతాడి నూకరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోర్టు పోలీస్‌స్టేషన్ సీఐ రాజశేఖరరావు పర్యవేక్షణలో ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, దుర్గాప్రసాద్‌లు మృతి చెందడంతో ఏటిమొగ ప్రాంతంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజు, దుర్గాప్రసాద్‌ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.